Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśnottara Vāhini · The Śāstras and Sannyāsa
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్ర.
ఈ
కర్తవ్యాకర్తవ్యములకు
ఏది
ప్రమాణము?
ఉ.
శాస్త్రమే
ప్రమాణము.
వర్ణములు,
ఆశ్రమములు
దేహ
ధర్మములనియు,
అవి
పరమపద
కారణములు
కావనియు
మనుస్మృతిలో
కూడను
ప్రమాణముగా
ఉన్నవి.
ప్ర.
అట్లయిన
బ్రాహ్మణాది
జాతులకు,
గృహస్థాది
ఆశ్రమములకు
భేదము
లేనపుడు
వర్ణాది
ఆశ్రమ
నిబంధనలు
ఎందుకు
వచ్చినవి?
ఉ.
రాగ
రహితుడైన
తర్వాత,
యే
వర్ణమైనను,
ఏ
ఆశ్రమమైనను
సమానమే!
అంతవరకు
ఈ
నిబంధనలు
తు.చ.
తప్పక
ఆచరించియే
తీరవలెను.
రోగమున్నంత
వరకు
మందు
త్రాగవలయును
కదా!
ఒక్కొక్క
రోగమునకు
ఒక్కొక్క
మందు
ప్రత్యేకించి
ఉండియే
తీరవలెను.
ఒక్కొక్క
రోగమునకు,
ఒక్కొక్క
ఔషధమునకు
ప్రత్యేక
పథ్యము
అవసరము
కదా!
రోగము
నివృత్తి
అయిన
తర్వాత
సర్వులు
ఒకే
వంటను
భుజింపవచ్చును.
అట్లు
లేక
రోగమున్నవాడు,
రోగము
లేనివాడు
ఒకే
తిండిని
తినిన
రోగము
గలవాని
స్థితి
మరింత
ప్రమాదమునకు
వచ్చును.
కాన
వర్ణములు,
ఆశ్రమములు,
భవ
రోగము
కలవారందరికి
మందువంటివి.
అట్టి
మందును
క్రమమున
సేవించక
"రాగములు"
అను
రోగములు
నివారణ
కావు.
ఆ
రోగములు
నివారణ
కాకుండిన
మోక్ష
ప్రాప్తి
చేకూరదు.
వేదాంతార్థము
నెరిగిన
బ్రహ్మవేత్త
ఏ
ఆశ్రమమునందైనను
ముక్తిని
పొందును.
2
▾
Meaning
Keep
ప్ర.
గృహస్థాశ్రమములో
నుండి
మోక్షమును
పొందిన
మహాపురుష
లెవరయినను
ఉన్నారా?
ఉ.
జనకుడు,
అశ్వపతి,
దిలీపుడు
మొదలగు
మహాపురుషులందరు
ఈ
గృహస్థాశ్రమమందుండియే
మోక్షమును
పొందిరి.
ప్ర.
స్వామీ!
బ్రహ్మచర్యమును
పూర్తిచేసి,
గృహస్థాశ్రమమును
ప్రవేశింపవలెను.
తరువాత
దాని
నుండి
వానప్రస్థమును
స్వీకరింపవలెను.
ఆ
వ్రతనిష్ఠలన్నియు
పూర్తిగా
ఆచరించి
సన్యసింపవలెను
అను
శ్రుతి
వాక్యానుసారముగ
సంచరించవలయునా?
అట్లు
కాక
ఏ
క్రమమును
ఆచరించకనే
సన్యసించ
వచ్చునా?
ఉ.
వస్తువులయందు
వైరాగ్యమెప్పుడుదయించునో
అప్పుడే
సన్యసించవచ్చును.
లేనిచో
పతితుడగును.
ఏ
ఆశ్రమములో
ఉన్నవారైనను
పరిపూర్ణముగా
వైరాగ్యము
కలిగినచో
అచ్చోటనుండియే
సన్యసించవచ్చును.
మూడు
ఆశ్రమములు
దాటవలెనని
నిబంధనలేవియును
లేవు.
ఇదియు
శ్రుతి
వాక్యమే!
ఎందుకనగా,
ఆ
పరిశుద్ధాత్ముడు
పూర్వ
జన్మమునందే
బాగుగా
సంస్కరింపబడినవాడు.
అతను
మలిన
సంస్కారముల
నశింపజేసి,
శుద్ధ
సంస్కారములతో
కూడుకున్నవాడై
ఉండును.
ప్ర.
పూర్వ
జన్మమందు
సంస్కరించినట్లు
ఎటుల
తెలిసికొనగలము?
"నాచే
ఈ
ఈ
ఆశ్రమములు
అతిక్రమింపబడినవను"
విషయములో
గుర్తులేవయినను
ఉండునా?
అట్లుండిన
అవి
యెట్టివో
సెలవిండు?
ఉ.
మూడు
ఆశ్రమములందును
ఇచ్ఛ
లేకుండుటయను
కారణము
తెలిసికొని
వాసనా
రాహిత్య
స్థితిని
కూడను
గమనించవలెను.
పూర్వ
జన్మమందు
బ్రహ్మచర్యాది
ఆశ్రమములు
స్వీకరించి,
3
▾
Meaning
Keep
విషయములందు
విరక్తి
చెందిన
వారికి
తిరిగి
వాంఛ
జనించదు.
ఆత్మశుద్ధి
కలిగి,
తిరిగి
ఆ
మూడు
ఆశ్రమములందు
వైరాగ్యము
కలిగినందుచే
మరల
వాటి
యందు
ప్రీతి
జనించదు.
విరక్తి
జనించినపుడు
క్రమము
లేకనే
సన్యసించవచ్చునని
కూడ
శ్రుతి
సమ్మతము.
అయితే
సన్యాసమిచ్చువాడు
సన్యసించు
వ్యక్తి
యొక్క
వాసనారహిత
స్థితిని
బాగుగా
పరీక్షించవలయును.
అట్టి
వృత్తి
రహితమైన
విరక్తునకే
సన్యాసాశ్రమము
నొసంగవలెను.
ఇంతియేకాక,
శిష్యుడు
కూడను
తన
యొక్క
అంతఃకరణ
స్థితిని,
వాసనా
గుణములు
నశించినవా
లేదా
అని
పరీక్షించుకొనవలసియుందును.
లేనిచో
భ్రష్టత్వము
ప్రాప్తించుటయేకాక,
ప్రమాదము
కూడను
సంభవించును.
ప్ర.
సన్యాసములో
అనేక
విధములా?
లేక
ఏక
విధమా?
సెలవిందు?
ఉ.
అది
మూడు
రకములుగా
నున్నవి.
1.
దేహ
సన్యాసము
2.
మనో
సన్యాసము
3.
ఆత్మ
సన్యాసము.
ప్ర.
దేహ
సన్యాసమననేమి?
ఉ.
కాషాయమే
ధరించి,
రూప
నామములు
మార్చుకొని,
సన్యాసివలె
రూపము
కనుపించును
కాని
ఆత్మప్రబోధ
జ్ఞానములేక,
సామాన్య
ప్రజలవలె,
సర్వ
వృత్తులయందు
సంచరించుచు,
సంకల్పములచే
మిళితమై
ఉండును.
ప్ర.
మనో
సన్యాసమననేమి?
ఉ.
సంకల్పములను
పూర్తిగా
వీడి,
చిత్తమును
వశపరచుకొని,
వాసనా
రహితమైన
మనస్సు
కలవాడే,
ఇతనికి
దేహ
సన్యాసము
లేకపోయినప్పటికీ
ముక్తుడే
అగును.
ప్ర.
ఆత్మ
సన్యాసమననేమి?
4
▾
Meaning
Keep
ఉ.
అనాత్మ
సంబంధములన్నిటిని
పూర్తిగా
ఛేదించి,
"అహం
బ్రహ్మాస్మి"
ప్రబోధము
నిరంతరము
దేనిచే
కలుగుచున్నదో
అదియే
'ఆత్మ
సన్యాసము'.
అట్టి
వారికి
సర్వాత్మభావము,
ఆత్మానుభవము,
అఖండ
ఆనందము
సిద్ధించియుండును.
దీనినే
'అమృత
సన్యాసమ'ని
కూడను
అందురు.
సూర్య
తేజః
పుంజ
ప్రసారము
లేకుండినచో
దట్టమైన
చీకటి
ఏ
రీతిగా
పోదో,
అటులనే,
'ఆత్మ
సన్యాసము'
లేక
మాయాంధకారము
తొలగి,
సకలావరణములు
నశించి,
ఆత్మ
నిరుపాధికమై
ప్రకాశింపలేదు.
ప్ర.
దేహ
సన్యాసము,
మానసిక
సన్యాసము,
ఆత్మ
సన్యాసము
ఎట్లు
సిద్ధించును?
అవి
సిద్ధించునటుల
తెలుపు
గుర్తులేవి?
ఉ.
నిత్యానిత్య
వస్తు
వివేకముచే
దేహ
సన్యాసమును,
వాగాదింద్రియముల
యొక్కయు,
చిత్తము
యొక్కయు
వృత్తులు
నిరోధించి
సంయమముతోనుండుటచే
మానసిక
సన్యాసమును,
వేదాంత
తత్త్వ
జ్ఞానముచే
ఆత్మ
సన్యాసమును
సిద్ధించును.
పై
చెప్పిన
సంస్కారములు
బలపడిననే
జీవుడు
క్రమముగా
ముక్తుడు
కాగలడు.
ప్ర.
ఇందులో
ఎవరు
ధన్యాత్ములు?
ఉ.
సర్వదా
బ్రహ్మ
తత్త్వమునందే
విహరించుచు,
పుష్ప
మందలి
మకరందామృతమును
త్రాగుచు
తుమ్మెద
యేరీతిగా
సర్వమును
మరచి
యుండునో
అదే
విధముగా
నిరంతరము
స్వాత్మామృతమును
పానము
చేయుచు
సకల
దృశ్యములను
మరచి
యున్నవాడే
ధన్యుడు.
ప్ర.
అయితే,
సత్యాన్ని,
నిత్య
నిర్మలమును,
శాంతిని
పొందుడని
పెద్దలు
బోధింతురే,
అవి
యేవి?
5
▾
Meaning
Keep
ఉ.
పై
చెప్పిన
దృశ్య
రహితమైన
స్వాత్మామృతపానమే
సత్య,
నిత్య,
నిర్మలమనియు,
శాంతి
అనియు
అందురు.
ఇందులో
ఏదైననూ
ఒక్కటియే;
స్థితులు
సమానములు.
Previous
←
Āśramas — Varṇas
Next
Mantra and Japa
→