Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśnottara Vāhini · Mantra and Japa
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్ర.
ఇట్టి
స్థితిని
పొందుటకు
ఏదైనను
ఒక
'మంత్ర
జపము'
ప్రధానమై
ఉండునా?
అట్లుండిన
ఏ
మంత్రము
ముఖ్యమో
తెలుపుడు?
ఉ.
ఎట్టి
వారికైనను
'మంత్ర
జపము'
అత్యవసరము.
'మ'కారమన్న
మననమనియు,
'త్ర'కారమన్న
రక్షణ
అనియు
ఎరుగవలెను.
భయంకరమైన
జనన
మరణాది
దుఃఖ
భూయిష్టమైన
సంసార
సాగరము
నుంచి
తరింప
జేయునది
మంత్రము.
అన్నింటికంటెను
ప్రణవము
ప్రధానమై
శ్రేష్ఠమైనది.
మంత్రములన్నిటికిని
ప్రణవము
శిరస్సువంటిది.
ప్ర.
వారి
వారి
సంస్కారములననుసరించి
ఇష్ట
దైవ
రూప
నామములను
జపించిన
తప్పులేదు
కదా?
ఉ.
భగవన్నామమును
స్మరించుట
తప్పని
యెట్టి
మూర్ఖుడైనను
అనునా?
కాని
ప్రణవ
పూర్వక
నామములతో
స్మరించి,
పూజించి,
జపించిన
తత్తదుపాసకులకు
శ్రేయోదాయకము.
సముద్ర
జలమే
మేఘములుగా
మారి,
వర్షములుగా
కురిసి,
నదులుగా
ప్రవహించి,
భూమియందు
సంచరించి,
కడకు
సముద్రమును
ఎట్లు
చేరుచున్నవో
అటులనే,
ప్రణవము
నుండి
యేర్పడిన
ఈ
సమస్త
జగత్తు,
రూపనామములను,
అనేక
ధర్మ
కర్మ
మార్గముల
ప్రయాణము
సల్పి
కడకు
ప్రణవమునందే
లీనమగును.
2
▾
Meaning
Keep
ప్ర.
అధిక
బీజాక్షరములున్న
మంత్రము
ఎక్కువ
ఫలము
నిచ్చునని
కొందరు
పెద్దలు
చెప్పుదురే,
కనుక
అధిక
అక్షరములు
కలిగిన
మంత్రము
శ్రేష్ఠమా?
స్వల్ప
అక్షరములు
కలిగిన
మంత్రము
శ్రేష్ఠమా?
ఉ.
మంత్ర
గీతములకు
బీజాక్షరముల
సంఖ్య
తగ్గిన
కొలది,
ధ్యాన
ధారణలకు
మిక్కిలి
ఉపయుక్తమగునని
మంత్రవేత్తలు
తలంతురేగాని,
అది
నేనొప్పుకొనను.
అభ్యాస
కాలమున
సాధకులు
ప్రణవ
పూర్వక
పంచాక్షర,
అష్టాక్షరాది
మంత్రములను
జపించుట,
ధ్యానించుట
చాల
శ్రేష్ఠము.
కాని,
చిరకాలము
మంత్ర
జపమొనర్చిన
పిదప
చివరకు
వాచ్యార్థమును
కూడ
పరిత్యజించి,
ధ్యేయ
రూపమగు
లక్ష్యార్థమునందే,
ధ్యేయాకారముగనే
మారవలెను.
అందులకే
శ్రుతి
కూడను
"నిశ్శబ్దో
బ్రహ్మ
ఉచ్యతే"
అని
తెల్పినది.
అనగా
నిశ్శబ్ద
శూన్య
స్థితియే
బ్రహ్మయని
చెప్పుచున్నది.
ప్ర.
అంటే
ఏ
రీతిగా
శబ్ద
శూన్యము
కావలెను?
శబ్ద
శూన్య
స్థితియే
బ్రహ్మమని
తెల్పుదురు,
ఎట్లు?
ఉ.
మాయయే
ప్రకృతియనియు,
ఆ
మాయను
వశీకృతమొనర్చుటయే
మాయి
అనగా
ఈశ్వరుడనియు
శ్రుతులు
ఘోషించుచున్నవి.
కాన
ప్రకృతిని
వశింపజేసి
స్వయముగా
ఈశ్వరుడగుటకై
ప్రయత్నించు.
ప్రకృతి
సమూలముగా
నశించనిదే
బ్రహ్మ
ప్రాప్తి
కలుగదు.
పాము
కుబుసమును
విడుచునటుల
ధ్యాత,
మంత్ర
జపముచే
ధ్యేయాకారమును
పొంది,
వాచకమగు
మంత్రములుప్తమై,
స్వయముగా
వాచ్యమగు
మంత్రార్థ
స్వరూపుడుగ
అగుచున్నాడు.
ప్ర.
స్వామీ!
క్షమించుడు.
ఇట్లు
చెప్పుట
వలన
అర్థమగుట
లేదు.
సులభముగా
ఏదైన
ఉపమానములతో
సెలవిందు?
3
▾
Meaning
Keep
ఉ.
గ్రుడ్డును
చూచి
యుందువు
కదా?
ఆ
గ్రుడ్డుపై
పక్షి
పొదిగిన
కొంత
కాలమునకు
పరిపక్వమొందినదై
ఆవరణమైన
గ్రుడ్డు
భగ్నము
కాగా,
తన
నిజ
స్వరూపమును
పొందునట్లు
సాధకుడు
మంత్ర
జపముచేత,
శుద్ధాంతఃకరణుడై
మంత్రార్థమును
నిరంతరము
మననము
చేయుచు,
పరిపక్వ
స్థితికి
రాగా
మూల
అజ్ఞానమగు
ఆవరణము
భగ్నమై,
ధ్యేయైక
స్వరూపుడుగానే
మారుచున్నాడు.
ప్ర.
సర్వము
ప్రణవము
నందే
వచ్చి,
ప్రణవమందే
చేరుచున్నది.
సర్వము
ప్రణవమయమే
అని
సెలవిచ్చుచున్నారు
కదా!
అట్లయిన
అట్టి
సర్వవ్యాప్తి
అయిన
ప్రణవమును
ఒకరు
స్మరింపవచ్చును,
మరొకరు
స్మరించకూడదని
పెద్దలు
చెప్పుదురే,
ఇది
సత్యమా,
లేక
స్వార్థమా?
ఉ.
పంచ
భూతముల
సమ్మిళితమే
ప్రకృతి
కదా!
పంచ
భూతములందు
ప్రణవమే
ప్రాణమై
ఉండగా,
ఇక
ప్రకృతి
ప్రణవమయమెట్లు
కాకుండును?
సెలయేళ్ళ
యొక్క
ధ్వని
ప్రణవమే,
సముద్ర
ఘోష
ప్రణవమే!
వేయేల?
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
మాత్రము
ప్రణవ
శబ్దము
కాదా,
చూడు.
అర్థ
భావనా
పూర్వకము
కానప్పటికిని,
ఒక
పల్లకి
మోయువారు
కాని,
బరువులెత్తువారు
గాని,
గుడ్డలుతుకు
చాకలి
సహితము,
తమ
తమ
శ్రమలను
శాంతపరచుకొనుటకై
ఓంకారమును
స్మరించుచున్నారు.
అట్టి
అర్థ
భావనా
పూర్వకముగా
ప్రణవము
జపించుచు,
భవ
భారమంతయు
శీఘ్రముగా
తొలగించుకొనవచ్చును.
సృష్టికి
కారణభూతమగు,
బ్రహ్మ
స్వరూపమగు
మానవుని
శ్వాస
స్వభావమగు
ప్రణవమే!
అట్టి
ప్రణవమును
ఒకరు
చెప్పవచ్చు,
ఒకరు
చెప్పకూడదు
అనుటలో
అర్థము
లేదు.
శ్వాసము
లేని
వారు
ప్రణవము
నుచ్చరించ
లేరు
కాని,
మిగిలిన
వారందరు
ప్రణవమును
ప్రాణముగా
భావించుటే
కర్తవ్యము.
మరణాసన్న
సమయమున
మానవుడు
పరమాత్ముని
4
▾
Meaning
Keep
యెట్లు
ధ్యానించవలెనని
అర్జునుడు
అడుగగా,
కృష్ణ
పరమాత్మ
ఏమి
చెప్పెనో
తెలియదా?
ప్రణవ
స్వరూపమగు
నన్ను
అనగా
మదభిన్నమగు
ఓంకారమును
స్మరించుచు
ఎవరు
శరీర
త్యాగము
చేయుదురో
అట్టి
ఉత్తమ
భక్తుడు
పరమగతిని
పొందును.
కాన
ప్రణవము
నుచ్చరించుటకు
సర్వులకు
అధికారము
కలదు.
ప్ర.
ప్రణవోపాసన
వలన
లక్ష్యమెట్లు
కుదురును?
ధ్యాత
ధ్యేయాకారముగా
నెట్లు
మారును?
అర్థమగు
ఉపమానములతో
ఆ
మహామంత్రమును
బోధింపుడు?
ఉ.
నాయనా!
ప్రణవమే
ధనుస్సు.
ప్రత్యగాత్మయే
శరీరము.
పరబ్రహ్మనే
లక్ష్యము.
కాన
సాధన
చేయువారు
ధనుర్విద్యాభ్యాసివలె
అప్రమత్తుడై
లక్ష్యభేదమును
చేయవలెను.
ఏకాగ్ర
చిత్తముతో
లక్ష్య
భూతమగు
పరమాత్మను
ధ్యానించవలెను.
అప్పుడు
ధ్యాత
ధ్యేయాకారముగా
మారును.
కైవల్యోపనిషత్తునందును,
ముండకోపనిషత్తునందును,
ఇంకను
శ్రుతుల
యందును
ప్రణవమును
గురించి
బహువిధముల
స్తుతింపబడినది.
కాన
ఈ
ముక్తి
దాయకమగు
పవిత్ర
మహా
మంత్రమును
అనుదినము
అందరూ
స్మరింపవచ్చును,
ధ్యానింపవచ్చును,
ఉపాసింప
వచ్చును.
ఇందుకు
సందియము
లేదు.
Previous
←
The Śāstras and Sannyāsa
Next
Tapas
→