Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśānti Vāhini · Prabodha 3
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
సమరసమునకు
శాంతే
ప్రధానము.
మానవుడు
శాంతమైన
ఆలోచనలను
కలిగియుండవలెను.
అందు
మూలమున
మనస్సు
సమరసమైనదిగ
మారును.
అట్టి
సాధనయందు
మనస్సును
పెట్టవలెను.
ఇది
ప్రథమములో
కష్టమేకాని,
దానిని
సాధించి
అన్ని
బాధలు
జయించవచ్చును.
వృద్ధిపొందు
ఏ
సాధకునికైనను
మనోనిశ్చలత
ముఖ్యముగా
ఉండవలెను.
ఇది
వారి
సద్గుణములలో
ఒకటి.
నిశ్చల
మనస్సు
కలిగిన
మానవునికి
నిజమైన
శక్తి
సౌఖ్యములు
ప్రాప్తించును.
అట్టివాడు
చేయు
పనులన్నింటియందు
జయమునే
పొందును.
ఇట్టివానికొరకు
మొదట
ప్రయత్నము
చేయునపుడు,
ఏబదిసార్లు
నీవు
అపజయము
పొందిననూ
ఏబది
ఒకటవసారైనా
జయమును
తప్పక
పొందుదువు.
కాన
మీరు
చేయు
ప్రథమ
ప్రయత్నముల
అపజయములవల్ల
నిరుత్సాహపడకూడదు.
దీనిని
గురించి
ఒక
చిన్నకథకూడ
కలదు.
బ్రూసు
మహాశయుడు
సాలెపురుగువల్ల
నీతి
నేర్చుకొని,
ఏడుసార్లు
తాను
యుద్ధమందు
అపజయమునుపొంది,
శాంతి
ప్రభావముతో
ఎనిమిదవసారి
గెలిచెను.
దీనికి
ఏది
కారణము?
శాంతియే.
నిరుత్సాహమునకు
కాని,
పిరికితనమునకుకాని,
అధైర్యమునకుకాని
చోటివ్వక,
శాంతము
కాపాడి
కడకు
జయమును
చేజిక్కునట్లు
చేసెను.
సాధకునకు
ఏదైనా
గొప్ప
ఆపత్తు
కలిగిననూ
కలవరపరచుకొనకూడదు.
ఎల్లప్పుడు
మనస్సును
నిర్మలముగా
శాంతముగా
నుంచుకొనవలెను,
ధైర్యముగా
నుండవలెను.
గతించినదానికి
వగవక,
జరుగుదానికి
ప్రయత్నలోపము
చేయక,
సాధన
2
▾
Meaning
Keep
సల్పవలెను.
ఏవి
వచ్చినను
సంతోషముగా
నెదుర్కొనుటకు
సిద్ధముగా
ఉండవలెను;
అప్పుడే
సాధకుడు
నిజ
స్థానమును
గుర్తించగలడు.
లాభ,
సౌఖ్య
సంతోషములకు
ఆనందించి,
నష్ట
కష్టములకు
దుఃఖించిన
అది
జీవకోటి
కన్నింటికి
సహజముగా
నున్న
అలవాటే.
ఇంక
సాధకుని
ప్రత్యేకసారమేమి
యుండును?
ఉన్నవాటిని
సరిగా
చూచుకుంటూ
తొలగింపలేనివాటిని
అనుభవించ
వలసినదే
అను
సూత్రము
మరువరానిదిగా
ఉండవలెను.
ఆపద,
కష్టములు
ఆసన్నమైనపుడు
ముందు
వెనుక
చూడక,
తొందరపడక,
ఇవి
ఎట్లు
వచ్చినవి
అని
శాంతముతో
ఆలోచించుకొనవలెను.
విషమస్థితులు
కలిగినపుడు
"అవి
యెట్లు
నిగ్రహించుకొనవలెను?
ఎట్లు
తప్పించుకొనవలెను?"
అని
సులభ
మార్గములు
ఊహించవలెను.
ఈ
విషయమందుకూడ
శాంతి
సహాయముగా
నుండును.
తలకు
దెబ్బ
తగలబోవు
సమయమున
నీ
తలగుడ్డ
పడిపోవుట
దెబ్బ
తీరిపోవునట్లు
చూడవలెను:
ఇదియే
సూక్ష్మబుద్ధి,
ఇదియే
వివేకము.
వీనినే
బుద్ధికుశలత
అని
అందురు.
ఇట్టివన్నియు
శాంతిమూలముననే
ఏర్పడును.
శాంతి
లేకున్న
ఇన్ని
అనుభవములు
అనుభవించలేరు;
ఈ
గుణములు
సాధించలేరు.
తొందరపడి,
ఉన్న
వివేకము
కూడ
వృథాగా
పాడుచేసుకొందురు.
అందుమూలముననే,
శాంతివల్ల
సర్వ
సద్గుణములు
అనుభవసిద్ధముగా
నిరూపించవచ్చును.
ఇంతియేకాక,
వివేకమైన
దూరదృష్టికూడ
వృద్ధి
చేసుకొనవచ్చును.
అప్పుడు
ఎట్టి
అడ్డంకులు,
కష్టములు
వచ్చినను
నీవు
వాటిని
సులభముగా
తొలగించుకొనవచ్చును,
ఇందులో
సాధకులు
సూక్ష్మముగా
యోచించవలసిన
విషయమున్నది.
అది
యేదన,
సాధకునకు
కలుగు
అపజయములు,
లోపములు,
తప్పులు
మొదలగువాటి
విషయమై
దీర్ఘముగా
ఆలోచించరాదు;
అట్లు
ఆలోచించిన,
శాంతివల్ల
సాధించిన
ఇచ్ఛాశక్తి
బలహీనమగును.
లోపములను
యథాప్రకారముగా
వదిలివేయవలెను.
ఇచ్ఛాశక్తి
నిర్మలమై
బలమైన
తరువాత,
ఆ
3
▾
Meaning
Keep
లోపములు
జ్ఞాపకమునకే
రానీయకచేయును.
అట్లుకాక,
చేసిన
తప్పునుకాని,
లోపమునుకాని
మరువక
అది
ఎట్లువచ్చినది,
ఎక్కడ
వచ్చినది
అను
యోచన
ప్రారంభమైన,
దానితోపాటు
మరికొన్ని
తప్పులు
చేయుదురు.
అది
తప్పు
అని
తెలిసిన
తరువాత,
దాని
పుట్టు
పూర్వోత్తరముల
యోచించ
పనేమున్నది?
కావలసిన,
అనుభవించవలసిన
మంచివాటిని
యోచించినను
కాలము
ఒక
సత్చింతగా
నుండును.
అవసరము
లేనిది
ఎట్లుపోయిన
మనకేమి?
దాని
చింతనే
వద్దు.
ఇట్టి
కుశలబుద్ధిని
పెంపొందించుకొనుట
సాధకునికి
ఎంతయో
ఉపకారము.
ఒక
ప్రయత్నమున
సాధకునకు
ఓటమి
కలిగిన
"అట్టి
ఓటమి
ఏ
కారణమువల్ల
కలిగినది?"
అని
విమర్శించుకొనవలెను.
తరువాత
రెండవ
విషయమందు
ఆ
కారణమును
జాగ్రత్తగా
చూచుకొనవలెను.
అపజయము
కలిగించిన
కారణమును
జాగరూకతతో
గమనించి
నిన్ను
నీవు
కాపాడుకొనుటకు
ప్రయత్నించవలెను.
తిరిగి
అట్టి
కారణమునకు
చిక్కుకొనక,
లొంగక
ఉండవలెను.
ఇట్టి
విషయమునందు
మాత్రము
సాధకుడు
ఉడుతవలె
చురుకుదనము
కలిగియుండవలెను.
చురుకుతనముతోపాటు
తెలివి,
సమర్థత
కూడా
కలిగి,
తప్పులు
చేయకుండుటకు
ప్రయత్నించవలెను.
ఇదియును
శాంతి
సహాయముననే
ప్రాప్తించును.
ఇబ్బందులు
కలిగినపుడు
వాటిని
తప్పించుకొనుటకు,
అందులో
ఉత్తీర్ణులగుటకు
స్థిరమైన
పట్టుదల,
శాంతము
ఉండవలెను.
ధృతి,
ధైర్యము,
సన్మతి
ఇవి
ఇచ్ఛాశక్తిని
బాగా
వృద్ధిచేయును.
ముఖ
వర్చస్సునందు
ప్రకాశము,
ప్రకాశించు
కనులు,
నిశితమైన
చూపు,
గంభీరమైనవాక్కు,
ఉదారత,
స్థిరమైన
స్వభావము,
నిర్భీకత
-
ఇవి
వ్యక్తి
ఇచ్ఛాశక్తి
వృద్ధి
అగుచున్నదని
తెలియపరచుటకు
కొన్ని
సూచనలుగా
ఉండును.
మనో
ఆందోళన
లేకుండుట,
నిర్మలముగా,
సంతోషముగా
ఉండుట
ఇవి
శాంతివృద్ధికి
సూచనలు.
4
▾
Meaning
Keep
ఇట్టి
శాంతిని,
సద్గుణవృద్ధినికూడా
ఇవ్వమని
భక్తులు
ప్రార్థనామూలమున
అడుగుకొనవచ్చును.
అసలు
సాధకుడు
దేనిని
సాధించవలెనన్నను
ప్రార్థనే
మూలధనము.
ఇక్కడ
కొంతమందికి
ఒక
సందేహము
రావచ్చును.
"ప్రార్థన
యొక్క
ఉపయోగమేమి?
భగవంతుడు
మనము
కోరిన
కోరికలు
అన్నియు
ఇచ్చునా?
మనకు
అవసరమైనవి
ఏవో,
మనకు
యోగ్యమైనవేవో,
మనకెంత
అర్హతో
అంతేకదా!
దానికి
తగినవే
ఇచ్చును;
కాని
ప్రార్థించినంత
మాత్రమున,
సర్వము
ఇచ్చుటకు
భగవంతుడు
ఇష్టపడునా?
ఇట్టి
పరిస్థితులలో
ప్రార్థనలుచేసి
ప్రయోజనమేమి?"
అని
ఈ
పైశంకలు
పలువురికి
కలుగవచ్చును.
ఇందుకు
జవాబుకూడ
కలదు.
భక్తులు
పూర్తిగ
భగవంతునకు
శరీర
మనఃప్రాణములు
సమర్పించినవారలైన
అట్టివారి
యోగక్షేమములు
ఆయనే
చూచుకొనును.
అతను
ఎల్లప్పుడు
వద్దనేయుండును.
అట్టి
సమయమున
ప్రార్థించ
అవసరమే
ఉండదు.
కాని
ఇప్పుడు
మీరు
సకలమూ
ఎల్లప్పుడూ
వారికర్పించి
శరణాగతులుగా
నున్నారా?
లేదు.
భక్తులకు
కష్టకాలమో,
నష్టకాలమో
అభీష్టవిఫలమో
వచ్చినపుడు
భగవంతుని
నిందింతురు.
కొంతమంది
ఆ
సమయములందు
తప్పించమని
ప్రార్థింతురు.
ఇట్లు
రెండింటియందు
కాలుపెట్టక
అన్ని
వేళలయందు
ఇతరులపై
ఏమియు
ఆధారపడక
పూర్తిగా
భగవంతుడే
శరణమని
కోరినయెడల
భగవంతుడు
ఎందుకు
సహాయము
చేయడు?
తోడునీడగా
ఎందుకుండడు?
మానవులు
ఎల్లప్పుడు
ఏకభావముతో
పరమాత్మునిపై
ఆధారపడి
యుండుటలేదు.
కనుకనే,
అన్నియూ
తానే
చేయుననియు
వదలక
మీరునూ
భక్తిశ్రద్ధలతో
ప్రార్థనలు
సల్పవలెను.
అట్టి
దృఢవిశ్వాసము
శాంతితో
వేచియుండిన
సిద్ధించును.
అట్లుకాక
తొందరపడిన
ఫలించునదికాదు.
ఇట్టి
అనుగ్రహమును
అందులోని
యథార్థమును
సాధించవలెనన్నను
శాంతే
ప్రధానము.
5
▾
Meaning
Keep
శాంతితో
ధర్మముతో
ద్రౌపది
యెట్లు
భగవద్రక్షణకు
అర్హురాలు
అయ్యెనో
సాధకులకు
తెలిసిన
విషయమే.
తన
భర్తలు
శూరులు,
వీరులు,
ధర్మపరాయణులు,
రాజాధిరాజులుగా
ఉండియు
అట్టి
ఆపత్సమయమున
ఎవ్వరూ
రక్షించలేరనియు,
ఎందరుండి
ఏమి
ఉపయోగమనియు,
"కృష్ణా!
సర్వస్వము
నీదే"
అని
కృష్ణుని
శరణు
వేడినది.
కాని
ప్రహ్లాదుడు
అట్లు
ఆపద
సమయమున
శరణు
వేడలేదు.
పుట్టుకతోనే
సర్వమూ
పరమాత్మార్పిత
మనియు
పరమాత్మ
ఎల్లప్పుడు
తనవెంటనే,
తాను
పరమాత్మ
వెంటనే
ఉన్నానని
తలంచుటవల్ల
ఏ
ఆపద
సమయమందుకాని
"హరీ,
రక్షింపుమ"ని
ప్రార్థించలేదు.
శిక్షణే
అతనికి
తెలియనపుడు
రక్షణ
తానెట్లు
కోరును?
ఇట్లు
సంపూర్ణ
ప్రేమోన్మత్తులైనవారలకు,
సంపూర్ణ
శరణుజొచ్చిన
వారలకు
ప్రార్థన
అవసరముండదు.
కాని
ఆ
స్థానమునకు
వచ్చునంతవరకు
సాధకులకు
శాంతిపూర్వకమైన
ప్రార్థన
అవసరము.
అట్టి
శాంతి
ప్రార్థనే
సమరసమును
సాధించును.
ఇట్లు
శాంతి
అనేక
విషయములందు
అండగా
నుండును.
పరమాత్ముని
కీర్తనలతో,
జపములతో,
ధ్యానములతో,
భజనలతో
ప్రార్థించవచ్చును.
అన్నిటి
యందు
పరమాత్మనామమే
ప్రధానముగా
నుండును.
అందుకనే
కృష్ణుడుకూడ
గీతలో
జపయజ్ఞము
అనిరి.
ఈ
జపములు
కేవలము
మానసికమేకాక
పైకికూడ
ఉచ్చరించుట
మరింత
మంచిది.
అట్టి
రెండూ
చేరిన
జపమునే
భజన
అందురు.
అట్టి
భజనలవల్ల
జనసమూహమునకు
ఆవేశము
కలుగును.
సంకీర్తనకూడా
శ్రావ్యమైన
ధ్వనులతో
భక్తులు
భజనలు
సల్పిన,
భగవంతునియందు
ఒకవిధమైన
ప్రేమ
ఉత్పత్తి
అగుచున్నది.
అపుడు
తన
అనుగ్రహముకూడా
భక్తులపై
ప్రసరించును.
అంతవరకు
వేచియుండవలెను.
తొందరపడిన
అనుగ్రహము
సహితము
చిక్కదు,
రాదు.
దానికికూడ
శాంతిని
పూనవలెను.
ఓపికే
అట్టి
ఫలసిద్ధికి
కూడ
ప్రధానగుణము.
సాధకుడు
ఈ
బోధను
దినవారీ
క్రమశిక్షణలో,
స్వస్తి
శాంతిమంత్రములతో
చేర్చుకొనవలెను.
6
▾
Meaning
Keep
"అసతోమా
సద్గమయ;
తమసోమా
జ్యోతిర్గమయ;
మృత్యోర్మా
అమృతంగమయ
।
"
ఇదియే
శాంతిమంత్రము.
దీని
భావము
అనేకులు
అనేక
విధములుగా
పెద్దగానూ,
సూక్ష్మముగానూ
చెప్పుదురు.
కాని
"ఓ
భగవంతుడా!
నేను
ప్రపంచమందలి
వస్తువుల
విషయమై
సౌఖ్యమనుభవించు
కాలమందు,
నన్ను
అసత్తగు
వస్తువునందు
మరుపు
పుట్టించి
శాశ్వతమైన
ఆనందమునకు
దారిచూపుము".
ఇది
మొదటి
ప్రార్థనకు;
ఇక
రెండవదానికి
"పరమాత్మా!
ప్రపంచమందలి
వస్తువు
నన్ను
ఆకర్షణ
చేసినపుడు
ఆత్మ
వస్తువని
ఎంచబడు
దానియందుగల
ఆత్మస్వరూపమును
గుర్తించు
శక్తి
లేకుండుటచే
నన్ను
ఆవరించిన
చీకటిని
తొలగింపుము."
ఇంక
మూడవది,
"ఆ
వస్తువునందుగల
ప్రకాశమానమైన
ఆత్మస్వరూపముయొక్క
ప్రకాశము
చూడనిమ్ము,
నేను
కోరుచున్న
అశాశ్వతమైన
సుఖము
నీయొక్క
కటాక్షమువల్ల
అమృతము,
లేక
పరమానందము
అగుగాక;"
అని
ఈ
ప్రార్థనలయొక్క
నిజ
అర్థము.
నిజభక్తునకు
తన
ఊహలు
ఎల్లప్పుడు
భగవంతునిపైనే
ఉండును.
తన
సౌఖ్యము,
తన
కష్టముల
విషయమై
తెలిసికొనుటకు
భక్తునకు
సావకాశమే
ఉండదు.
భగవత్
సాక్షాత్కారము
తప్ప
ఇంకొక
విషయము
స్ఫురించదు;
అందుకు
అవకాశముకూడా
ఉండదు.
ఆచరణ
అనగా
స్వభావము.
ఇది
తెలిసికొనుట
కష్టము.
ఒక
చిన్నపిల్లవాడు
తనతల్లి
కనబడక
"అమ్మా!
అమ్మా!"
అని
ఏడ్చుచు
ఆమెకోసము
వెతుకును.
ఆమె
కనిపించి
వానిని
యెత్తుకొని
తన
యొడిలో
కూర్చుండబెట్టుకొనును.
అప్పుడు
ఆ
పిల్లవాడు
ఏడ్పుమాని
నిర్విచారముగ
నుండును.
కాని,
పిల్లవాడు
ఎట్టి
సంతోషములో
ఉన్నాడో
పూర్వము
తానున్నస్థితికి,
ఇప్పుడు
అమ్మ
ఒడిలో
కూర్చున్నస్థితికి,
తారతమ్యము
ఆ
పిల్లవాడు
కనుగొనగలడా?
కనుగొనలేదు.
వానికి
ఆ
ఊహలే
అవసరముండదు.
అట్లే
భగవంతునిసేవ
ఎల్లప్పుడూ
వెతుకుతూ
ఉన్నవానికి
ఇట్టి
మహద్భాగ్యము
చిక్కినపుడు,
ఆ
చింతనయందే
మునిగినపుడు,
ఆ
సన్నిధియందే
ఉన్నపుడు
వేరు...
7
▾
Meaning
Keep
చింతలు,
కష్టములు
వాడెందుకు
యోచించును?
ఇవి
యన్నియూ
దొరక
నంతవరకే.
దొరికిన
తరువాత
అనుభవించుటకు
చూచునేకాని
పూర్వపు
ఊహలను
వాడు
యోచించడు.
కాన
భక్తులు,
సాధకులు
గడచిన
మీమీ
బాధలను,
కష్టములను
ఊహించి
యోచించుటకు
చోటివ్వక
చిక్కిన,
ప్రాప్తించిన
పరమాత్మ
చింతనకు
ఆరాటపడి
అందులోనే
మునిగి
ఆ
నిజానందమును
అనుభవించుడు.
భక్తి
భక్తియొక్క
ఫలమే.
కార్యకారణములు
భక్తియే.
ఇందులో
ద్వైతములేదు.
భక్తియే
బ్రహ్మ
సాక్షాత్కారము.
జ్ఞాన
మార్గమందైనను
అజ్ఞానమను
ఆవరణ
తొలగింపబడినప్పుడు
ఆత్మసాక్షాత్కారము
ప్రాప్తించును.
భక్తి
మార్గమున
అనన్యభక్తి
భగవంతుడు
గాక
మిగత
విషయములందు
పరమానందమును
మనము
అనుభవించక
పోవుటవల్ల
కలుగును.
ఈ
మార్గమందు
కలిగెడి
అడ్డంకులు,
పరమానందమును
అనుభవించుటకు
వీలులేని
అడ్డంకులు.
ఆ
ఆటంకానికి
కారణము
జీవుడు
తనకు
ప్రసాదింపబడు
చిచ్ఛక్తి
పొందుటకు
శక్తిలేక
యుండుట.
ఇందుకు
కారణము
జీవునియందు
ఆవరించిన
అహంకార
మమకారములు.
తాను
అనుభవించువాడనియు,
అనుభవించబడు
వస్తువు
తనదనియు
ఇట్టి
అహం
జీవునకుండును.
ఇట్టి
అహమున్నంతవరకూ
పూర్తి
తృప్తి
ఉండదు.
ఇంకనూ
ఎక్కువ
సంతోషము
కలుగజేయు
వస్తువు
అనుభవించవలెననే
కోరిక
కలిగియుండును.
Previous
←
Prabodha 2
Next
Prabodha 4
→