Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśānti Vāhini · Prabodha 4
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్రపంచమున
ప్రతి
భక్తుడు
సాధనవల్ల
ఆనందానుభవము
అనుభవింపవలెనని
ఆశపడును.
అయితే,
ఆనందానుభవము
సాధన
మూలమున
సంపాదించిన
క్రొత్త
అనుభవముకాదు.
అది
వానియందే
ఎల్లప్పుడు
ఉండును.
కాని,
అహంకారమను
తెర
దానికి
అడ్డముగా
ఉండుటవల్ల
అట్టి
ఆనందమును
అనుభవింపనీయకున్నది.
కాన,
సాధనమూలమున
అడ్డుగా
ఉన్న
అహంకారమను
తెరను
త్రోసివేయ
వలెను.
తదుపరి
ఆనందము
అగుపించును.
అట్టి
ఆనందము
ఇంతకు
మునుపు
లేకపోలేదు.
సాధనవల్ల
క్రొత్తగ
రాలేదు.
ఎప్పుడూ
ఆనందము
ఆనందముగానే
యున్నది.
వచ్చునవి
పోవునవి
అహంకార
మమకారములను
తెరలే,
వీనిని
మరుగు
చేయుచుండును.
ఇట్టి
అహంకార
మమకారములుకూడ
సాధనచే
దాటవచ్చు.
అయితే,
తొందరపడుచు
ఇంకా
ఆనందము
అందుకొనలేకున్నామే
అని
ఆరాటపడకూడదు.
ఇట్టి
సమయమున
శాంతి
గొప్ప
సహాయకారి.
శాంతిని
మనము
ప్రప్రథమములో
అభివృద్ధిచేసుకొన్న,
ఎట్టి
కష్టసాధ్యమైన
పనులనుకూడా
సాధించవచ్చును.
ఇట్టి
శాంతి
సర్వుల
సొత్తు;
సర్వులకు
సమానహక్కు,
మానవులందరు
శాంతిపుత్రులే.
కనుక,
ఒకే
తల్లి
ఎంతమంది
పుత్రులకైనను
తల్లే
అగును
కాని,
తదితర
సంబంధము
ఎట్లు
కాగలదు?
ఇందులో
పెద్ద,
చిన్న
అనునదే
లేదు.
ఎంత
పెద్దవాడయినా,
ఎంత
చిన్నవాడయినా
పుత్రులకు
తల్లే,
ఎవరు
పిలిచినను
'తల్లీ
2
▾
Meaning
Keep
అనే
పిలువవలెను.
అట్టి
శాంతిమాత
పోషణలో
పెరిగినవారు
సర్వ
ఆపత్తులు
తప్పించుకొని,
సర్వసౌఖ్యములు
అనుభవించి
కడకు
మాత
ఒడిలో
నిర్భయముగా,
నిస్సందేహముగా,
నిరాటంకముగా
తలదాచుకొనవచ్చును.
ఇట్టి
భద్రత
నొసంగుమార్గమునకు
పూర్ణభక్తితో
పరమాత్మకు
ఆత్మార్పణచేయుటే
ముఖ్యసాధన.
ఈ
ఆనందము
ఈ
భద్రత
ఒక్క
భక్తి
యందు
తప్ప
మరేమార్గమందు
సాధ్యముకాదు;
పరమాత్మను
కాంచలేరు.
ఇక
జ్ఞానమార్గమా
అందులో
ఏ
మహనీయులో,
కోటికొకరు
తప్ప
అందరికీ
సాధ్యముకాదు.
"నేతి"
"నేతి"
అను
వాక్యము
ననుసరించి
ఎన్ని
చెప్పినను
ప్రత్యక్షముగా
ఇంద్రియ
గోచరమైన
శరీరమును
లేదని
చెప్పుటకు
అగునా?
ఇది
సాధ్యమైనకదా
నేతి
వాక్యము
యథార్థము?
దీనినిపట్టి
చూడ
అట్లు
తెలుపుటకు
సర్వులకు
సాధ్యముకాదు.
ఎప్పుడు
సాధ్యముకాదో
పైవాక్యమును
మనము
యోచించ
వీలుండదు
కాన,
జ్ఞానము
కలిలో
మహాకష్టము.
ఇక
కర్మమార్గమా
-
అదికూడా
అంత
సులభమయినది
కాదు.
అందులో
మనసును
స్వాధీనము
చేసుకొనవలెను.
అది
కష్టమైన
పనే.
అట్లు
చేసుకొనవలెనన్నను
తిరిగి
భక్తి
ప్రేమలు
తోడులేక
స్వాధీనము
కాజాలదు.
ఇట్లే
యోగమార్గముకూడను.
అందులో
సహితము
ఇట్టి
ఇక్కట్లు,
ఒడుదుడుకులు
ఉబుకుచుండును.
కాన
అన్నింటికంటె
సులభమైనది,
హితమైనది,
ఆనందమైనది
భక్తి
ఒక్కటియే.
దీనిని
కూడా
ఇట్టిదని
ఎవరును
నిరూపించలేరు.
ఇది
అనేక
విధములు,
అనేక
మార్గములు,
అనేక
అనుభవములతో
కూడియుండుటవలన,
దీనిని
ఇట్టిదని
ఎవరును
తెలుపలేరు.
ఎవరి
అనుభవము
వారికి
ఆనంద
మిచ్చును.
ఇతరుల
అనుభవము
వీరికి
ఉత్సాహము
పుట్టించును.
మార్గము
చూపించును.
వీరి
అనుభవములు
అనేకరకములుగా
మారుచుండును.
కాన
దీనికి
ఇదేసాటి
కాని
మరొకదానితో
పోల్చుకొనుటకుకాని,
దీనికి
హద్దులు
చెప్పుటకు
కాని
అనుభవములో
ఉన్నవారికి
సాధ్యముకాదు.
అట్లు
పోల్చి
హద్దులు
చెప్పుదురా!
అట్టివారు
నిజమైన
అనుభవజ్ఞులుకారనే
నిరూపించవచ్చును.
ఇది
3
▾
Meaning
Keep
నిస్సందేహముగా
చెప్పవచ్చును.
భక్తి
సంకుచితమైన
జీవుని
అపారమైన
పరమాత్మ
ప్రేమను
పట్టియుండును.
అట్టి
భక్తుడు
పొందు
పరమానందము
వర్ణనాతీతము.
దీనినే
ఉపనిషత్తులు
"అఖండైక
రసము"
అని
చెప్పుచున్నవి,
చెప్పినవి.
అట్టి
అపారభక్తియొక్క
అనుభవమును
స్పష్టీకరించి
చెప్పుటకు
మానవమాత్రులకు
సాధ్యముకాదు.
అయితే,
భక్తుని
చూచినప్పుడు
వాని
లక్షణములను
కొన్నింటిని,
ఇంద్రియగోచరమైనవాటిని,
తెలుపవచ్చునేకాని
నిజానందము
అతీతమైనది.
కనుక,
వాటికీ
ఇంద్రియశక్తులకు
సంబంధ
ముండదు.
అట్టి
సంబంధమేలేనివాటి
విషయము
ఏ
రీతిగా
కూడా
ఊహించ
వీలుండదు.
కాన,
భక్తిని
అనుభవములోనే
అనందించవలెను.
అనుభవజ్ఞులయిన
మహనీయుల
వలన
వాటిలో
కొన్నింటిని
తెలిసికొన
వచ్చును.
అట్టివారుకూడా
పవిత్రభక్తిని
కొంత
గోచరమగు
మార్గమందే
తెలిపిరి.
కాని,
అవి
కూడా
సంపూర్ణమైనవి
కావు.
వారివారి
అనుభవము
లనుబట్టి
వారికి
ప్రాపంచికంగా
తెలుపవలసినంత
భాష,
విషయములలోనే
ఇమిడ్చి
తెలిపిరి.
అతీతమైనవాటికి
భాషే
లేదు;
పోల్చుటకు
ఉపక్రియలే
లేవు.
అయినా
కొన్నింటిని
చూడుడు.
స్త్రీలలో
ఉత్తమభక్తురాలైన
మైత్రేయి
భక్తిని
గురించి,
నిలిచిన
నీరుకు
మనస్సును
పోల్చుకొనెను.
అనగా
ఆ
మనస్సు
చలింపక
పరమాత్మపై
ఏకము
కావలెననియు,
అట్టి
సమయమున
మనస్సు
జడమగుననియు,
ఆ
స్థితినే
మనోనాశన
మనియు
నిరూపించెను.
అదే
భక్తిని,
కపిలమహర్షి
ప్రవహించు
నీరుకు
మనస్సును
పోల్చుకొనెను.
అనగా
గోదావరి
గంగానదులవలె
సముద్రమున
చేరువరకు
నిలువక
కదలుచు,
పుట్టినది
మొదలు
పరమాత్మ
ప్రేమ
వారధిలో
చేరుటకు
ప్రయాణముచేసి,
కడకు
సముద్రములో
చేరినట్లు
తన
ప్రేమలో
చేరవలెననియు,
అట్టి
సమయమున
ఆదినుండి
అంత్యమువరకు
ఒకే
సంబంధమనియు,
భక్తునకు
భగవంతునకు
ఎడబాటు
ఉండకూడదనియు,
ఏ
కర్మ
నాచరించుచున్నను,
ఏ
త్రోవన
ప్రయాణము
చేయుచుండినను
తాను
చేరబోవుటలోనే
మనస్సును
ప్రయాణము
సల్పవలెననియు
తెలిపెను.
ఇక
దేవీభాగవతమందు
ఇంచుమించు
4
▾
Meaning
Keep
ఈరీతిగనే,
అనగా
తైలధారవలె
మన
ప్రేమ
పరమాత్మపై
నుండవలెననియు,
ఇక
శంకరులు,
శివానంద
లహరిలో
భక్తి
అను
సూది;
సూదంటురాయి
అయిన
పరమాత్మను
చూచిన
తనచెంత;
తనతోనే
విడువక
ఉండవలెననునట్లుగా,
భక్తుని
సర్వఊహలూ
పరమాత్మ
పాదములకు
చేరునట్లుగా,
అందులో
కలిసియుండునట్లుగా
ఉండవలెనని
తెలిపెను.
ఇట్లే
రామానుజులవారు
భక్తికినీ
ప్రేమతో
చేయు
ధ్యానమునకునూ
ఎట్టి
వ్యత్యాసములు
లేవు;
రెండును
ఒకటేనని
తెలిపిరి.
కాన
ఒక్కొక్కరు
ఒక్కొక్క
విధమున
తెలిపిరి.
అన్నియు
నిజమే.
ఇందులో
ఏదికూడ
అనుభవముకానిది
కాని,
అసత్యమైనదికాని
లేదు.
ఇంతేకాదు,
ఇంకను
అనేకములైన
ఉపమానములున్నవి.
భక్తి
సహస్ర
రూపములతో,
సహస్ర
నామములతో,
సహస్ర
మార్గముల
ప్రయాణముచేసి
సర్వేశ్వర
అనుగ్రహమను
సాగరమును
చేరుచుండును.
కాన,
దీని
గమ్యము
అందులో
లీనము
కావటమే;
అనగా
జీవబ్రహ్మ
ఐక్యమే.
అదియు
అనుభవముతో
చేరిన
ఐక్యము.
ఇట్టి
ఐక్యమునకు
ఈ
కలిలో
ఎంత
ప్రయత్నించినను
సాధ్యము
కాకున్నదని
చాలామంది
నిరుత్సాహపడుతున్నారు.
అయితే
ఇది
ఒక
బలహీనత.
ఐక్యతకు
యుగములు
అడ్డురావు.
ఏ
యుగమైనను
ఆత్మవిశ్వాసము,
శాస్త్రవిశ్వాసము
సంపూర్ణముగా
గలవారికే
ఎప్పుడైనను
ప్రాప్తించును.
ఇట్టి
ఆత్మ,
శాస్త్ర
విశ్వాసములు
లేనివారికే
అందులో
సందేహము.
పై
రెండింటియందు
విశ్వాసముండినట్లు
కొంతమంది
నటింతురు.
కాని,
ఫలితములేదని
నిరుత్సాహపడుదురు.
వారికి
వారే
సాటి.
ఎట్టివారైనను
సరే,
ఐక్యానుసంధానము
కావలెనన్న
ఆత్మ
విశ్వాసము,
శాస్త్రవిశ్వాసము
రెండూ
రెండు
శ్వాసములవలె
సర్వవేళలందు
ఉండవలెను.
ఇట్టివారికి
సాధనసారముకూడా
చేరి
సాయుజ్యమును
చేకూర్చును.
అసలు
విశ్వాసము
లేనివారలకు
ఏదీలేదు.
ఇట్టివారలకు
చెప్పి
ఏమీ
ప్రయోజనములేదు.
ఇప్పటి
పరిస్థితికి
పై
రెండు
విశ్వాసములు
లేకుండా
పోవుటే
కారణము.
ఉన్నవారైనా
శాస్త్ర
ప్రకారము
నడచుకొనుట
లేదు,
దానిని
రక్షించుట
5
▾
Meaning
Keep
లేదు.
శాస్త్రరక్షణ
లేనందున
ప్రపంచమందు
మంచితనము,
సాత్త్వికము
పోయి
దుష్టచర్యలు,
అవినీతి
ప్రబలమగును.
ఇట్టి
వాతావరణమునకు
మార్పు
తేవలెనన్నను,
లోకము
శాంతి
భద్రతలతో
ఉండవలెనని
కోరినను
ప్రతి
ఆస్తికుడును
శాస్త్రమునందలి
విశ్వాసము,
ఆత్మవిశ్వాసము,
వాటి
నియమములను
పాటించవలెను.
అయితే
దేశకాల
పాత్రనుపట్టి
కొన్నింటిని
మార్పు
చేసుకొనవచ్చునే
కాని
యథార్థమును
మార్పు
చేయరాదు.
అట్టి
యథార్థమైన
పదార్థమును
వినియోగ
విధానములో
మార్పు
చేయించవచ్చును.
ఇప్పుడు
ఒక
పిల్లవానికి
జ్వరము
మాత్ర
ఇచ్చిన
ఆ
పిల్లవాడు
ఆ
మాత్రను
తీసికొనుటకు
ఇష్టపడడు.
నాకు
అరటిపండే
కావలెనని
కోరును.
అట్టి
సమయమున
మనమేమి
చేయవలెనో
తెలియునా?
మందును
అరటిపండు
విరుగుడా
కాదా
యని
యోచించి
ఆ
పిల్లవాని
ఇష్టప్రకారమే,
మాత్రను
మార్చక
ఆ
అరటిపండును
ఈ
మాత్రను
చేర్చి
ఇవ్వవచ్చును.
తన
అభీష్టము
నెరవేరెను.
రోగనివారణకు
తగిన
మాత్ర
చేరిపోయెను.
ఇందులో
యథార్థపు
మాత్ర
ఏమాత్రమూ
మార్పులేదు
కదా!
ఈవిధముగనే
ఇప్పటి
నవీన
భ్రాంతులకు
తగినట్లుగా,
పద్ధతులకు
తగినట్లుగా
యథార్థశాస్త్రమును
అర్థముకాని,
అందరికీ
అందుబాటులో
లేని
భాషలలో
అందించక,
సులభముగా
అర్థమై
ఆచరించు
విధానమును
మార్చిన,
యథార్థశాస్త్రము
మారుటకు
వీలుండదు.
అనుభవించుటకు,
అర్థమును
చేసుకొని
ఆనందించుటకు
అనుకూలముగ
ఉండును.
అప్పుడు
శాస్త్ర
విశ్వాసము
స్థిరమగును.
లోకశాంతి
ఏర్పడును.
ఇట్టి
విశ్వాసమును,
లోకశాంతిని
సంపాదించుటకు
ఇప్పుడు
ఆస్తికకోటి
దీక్షాకంకణం
కట్టవలెను.
అది
ఏదన
శాస్త్రము
చెప్పిన
ముఖ్యాంశముల
ననుసరించి
నడచుచు,
తోటివారలకు
దాని
యథార్థ
ఆనందమును
రుచిచూపుచు,
క్రమక్రమేణా
పామరులైన
వారందరికీ
ఇందులోని
విషయమును,
సత్యమును
నిరూపించుటకు
ప్రయత్నించవలెను.
6
▾
Meaning
Keep
గొప్పగొప్ప
మహనీయులగువారే
శాస్త్రము,
ఆత్మ,
వేదము
అని
గంటకొట్టినట్టు
చెప్పుదురు.
అందులోని
ఉపమానములు
ఉపయోగింతురు.
కాని
ఆ
శాస్త్రము,
ఆత్మ,
వేదము
అనునవెట్టివో,
ఈనాటికి
ప్రాధాన్యమియ్యక
మరుగుపరుచుచున్నారు.
ముఖ్యాంగములైన
నేత్రములను
మూసుకొని
సర్వాంగములకు
చైతన్యము
కలిగించిన
ప్రయోజనమేమి?
ఒక్క
అడుగైనా
విచ్చలవిడిగ
ముందు
కదులుటకు
వీలగునా?
కానేరదు.
అట్లే
శాస్త్ర
విశ్వాసమను
నేత్రములు
మూసిపెట్టి
అనుష్ఠించవలెనన్న
ఏమి
అనుష్ఠించగలము?
కాన,
నేటినుండే
మన
పాఠకులైన
ఆధ్యాత్మిక
సాధకులు,
శాస్త్రముయొక్క
మూలార్థమును
గ్రహించుటకు
ప్రయత్నించుడు.
శాస్త్రము
పవిత్రమైన
మార్గదర్శకురాలు.
దానిని
మానవులు
విశ్వసించకుండిన
యథార్థము
తెలియదు.
దానిని
సాధించవలెనన్న
శాంతి
తోడ్పడును.
గొప్ప
గొప్ప
మహనీయులు
ఈ
శాస్త్ర
విషయములను
పామరులకు
బోధపడునట్లు
సులభమార్గమున
బోధించిన,
తప్పక
ఆస్తికత్వము
అభివృద్ధి
అయి
అశాంతి
రూపుమాయును.
లోకమున
సమరసము
అభివృద్ధి
అగును.
శాస్త్ర
రక్షణతోపాటు
లోకరక్షణ
కూడా
ఉండవలెను.
శాస్త్ర
రక్షణకు
సత్యం
వద,
లోకరక్షణకు
ప్రియంవద,
ఈ
రెండును
పోషణచేసి
అనుష్ఠించిన
ఇంతకంటే
మించిన
సాధన
వేరులేదు.
ఇట్టి
మహావాక్యముల
నిరూపించుటకు
శాంతమే
ప్రధానము.
శాస్త్రరక్షణకు
లోకరక్షణకు
ఎట్టి
పట్టుదల,
సమరసము
అవసరమో,
శాంతిని
సాధించుటకుకూడా
అట్టి
పట్టుదల
అవసరము.
శాంతిని
సాధించిన
తదుపరి
సమరసమే
దాని
స్వభావమగును.
అందరూ
అట్టి
భావసంపన్నులై
ఇప్పుడు
శాస్త్రవిరుద్ధమై
నడుచుచున్న
అవినీతి,
అన్యాయ,
అక్రమ,
అనాచారములను
ఎదుర్కొని
ఆస్తికలోకమును
స్థాపించవలెను.
దీనికి
అక్కడక్కడ
ఆస్తిక
కేంద్రములను
ఆశ్రమవాసుల
చెంత
సాధన
సైన్యమును,
తరిఫీదు
చేయవలెను.
దీనికి
ఆశ్రమ
అధికారులే
బాధ్యులు.
వారు
మొదట
ఇట్టి
విశ్వాసములు
నిరూపించిన
కాని
సైన్యము
సక్రమమార్గమున
రాలేదు.
లేకున్న
మరింత
అలజడి
7
▾
Meaning
Keep
బయలుదేరును.
ఇట్టి
అశాంతి,
శాస్త్రములపై
అపనమ్మకము,
ఆత్మ
అవిశ్వాసము
బయలుదేరినది
పెద్దలనువారి
ప్రవర్తన
మూలము
ననే.
ఇంత
అలజడికి,
అశాంతికి
వారే
కారకులు.
కాన,
వాటిని
రూపుమాపవలెనన్ననూ
వారే
కంకణము
కట్టవలెను.
ఎవరిమూలమున
వచ్చినదో
వారి
మూలముననే
శాంతిపడవలెను.
ఇట్టి
శాంతికి
మూలాధారమైన
పవిత్రభక్తిని
ప్రతిమానవుని
హృదయమందు
నాటించి
తగిన
పోషణాక్రమమును
నేర్పించిన,
తప్పక
శాస్త్రవిశ్వాసము
ఏర్పడి,
సమరసము,
మంచితనమను
ఫలములు
ఫలించును.
ఇప్పుడు
భక్తిపూరితమైన
మార్గమే
సర్వోత్కృష్టము.
దీనికి
భాగవతమే
భక్తి
పూరితము.
భక్తిలేక
భగవంతుని
తెలిసికొనలేరు.
ఎట్టి
మహాశక్తికూడా
లోక
సంరక్షణకొరకు
రావలెనన్న
మానవాకారముగనే
రావలెను.
అట్టి
రూపమును
ధరించిననే
సర్వులకు
అనుభవించుటకుకాని,
అనుష్ఠించుటకుకాని,
అందుబాటుకుకాని
అవలీలగా
ఉండును.
అయితే
భక్తిహీనులైనవారు
ఆ
రూపములను
సామాన్య
మానవరూపముగా
ఊహించి,
పరతత్త్వ
మహిమను
ఎరుంగలేక
అవతార
రూపమును
మాత్రము
చూడగల్గి,
మానవమాత్రునిగా
భ్రమింతురు,
చరింతురు.
అందుకనే
గీతయందుకూడా
ఈరీతిగా
తెలిపినది.
"అవజానన్తి
మాం
మూఢా
మానుషీం
తనుమాశ్రితం
పరంభావ
మజానన్తో
మమభూత
మహేశ్వరమ్."
ఇట్టి
అమూల్య
వాక్యములను
మానవులు
భద్రపరచుకొనలేక
పోతున్నారు;
అది
మొదటి
ధర్మవిరుద్ధము;
న్యాయముగా
చూడ
ఆధ్యాత్మిక
రంగమున
మన
భారతదేశము
ప్రపంచమందన్ని
దేశముల
కంటె
ప్రధాన
ఘనతను
వహించినది,
పవిత్రమైనదని
నిరూపించ
వచ్చును.
భారతదేశమున
బయలుదేరిన
వాజ్మయము;
ఇచ్చటి
ప్రజల
జీవిత
పద్ధతులు
మరే
దేశమందును,
ఏ
చరిత్రలందు
కూడను
లేవు.
ఇంతటి
కృషిని,
వాఙ్మయమును
అంకితము
చేసినవారు
మన
భారతదేశమందే
కలరు.
ఇదే
అగ్రస్థానమును
వహించినది
చతుర్వేదములు,
షడంగములు,
షడ్దర్శనములు,
అష్టాదశ
పురాణములు,
ఆచార్య
8
▾
Meaning
Keep
భాష్యములు,
ఇంతియేగాక
జీవితమననేమి?
దేవుడననేమి?
మరణానంతరము
జీవుడేమిగా
మారగలడు?
ఎట్టి
కర్మలవలన
జీవుడు
ఏయే
స్థానములు
పొందగలడు?
పాపపుణ్యములన
వాటి
స్వరూపము
లేవి?
అనియు,
ఇత్యాది
మార్గములను
గురించి
అనుభవించి,
ఆరి
తేరిన
అమర
జీవులు
తెలిపిన
విధానములు
ఈ
భారతదేశమందు
తప్ప
మరే
దేశమందును
లేవు.
మహాత్ములకు,
ఋషులకు
ఇంతటి
అనుకూల
వాతావరణము
కలిగించునట్టి
ప్రదేశము
ప్రపంచమందెచ్చటను
లేదు.
సర్వ
విధములైన
ఆధ్యాత్మిక
అనుభవజ్ఞులు
ఈ
దేశమందే
ఉన్నారు.
అహింస
బోధించు
బౌద్ధమతమువారైనను
వారి
అహింసకు
బౌద్ధమతము
వ్యాపింపజేయుటకు
ఈ
దేశమే
ప్రథమ
స్థానము
వహించెను.
బుద్ధునికి
జన్మమొసగిన
దేశముకూడా
భారత
దేశమే.
ఇట్టి
పవిత్ర
భారతదేశముయొక్క
సనాతన
శాస్త్రసారమైన
అనుభవమును
అనేకమైన
దేశములు
అందుకొనిపోయి
భద్ర
పరచుకొనుచుండగా,
అనుభవము
వారల
చేతికందించి
పిప్పిని
పీల్చనున్న
వారల
గతి
ఏమని
నిరూపించవలెను?
కాన,
లెండి!
ఆధ్యాత్మికసారమును
కోరు
ప్రతి
భారతీయుడు
అనుష్ఠానమునకు
సిద్ధముకండు.
విశ్వాసమును
పెంచండి.
శాంతిని
భద్రపరచండి.
జీవితమును
ఆనందమున
ముంచండి.
ఆత్మారాముని
దర్శించండి.
ఆలస్యము
చేయకండి.
Previous
←
Prabodha 3
Next
Prabodha 5
→