Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśānti Vāhini · Prabodha 5
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
సాధకుడు
మనస్సును
దాని
ఇష్టమొచ్చినట్లు
పోనీయకూడదు.
నిర్దాక్షిణ్యముగా
దానిని
అడ్డగించవలెను.
సాధ్యమైతే
మనస్సును
నాశనము
చేయుటకే
సిద్ధపడవలెను.
(అనగా
ప్రపంచవాసనలపై
ఇచ్ఛ
లేకుండజేయుట)
అట్లు
చేసినప్పుడే
మానవుడు
తన
నిజ
స్వరూపమును
తెలిసికొనగలడు;
అదియే
ముక్తి.
అప్పుడు
అన్ని
విధములైన
బాధలు,
విచారములు,
భ్రమలు
అంతరించును.
మానవుడు
దుఃఖము,
భయము,
ఆతురతలు
వదలి
పవిత్ర
శాంతిసాధన
అనుసరింపును.
మలిన
వాసనలు
వదలి
మంచి
వాసనలు
మొదట
అలవరచు
కొనుడు.
తదుపరి
క్రమేణా
మంచి
వాసనలనుకూడా
వదిలి,
నిర్విషయమను
నిశ్చయమును
పొందవచ్చును.
ప్రకాశవంతమైన,
ఆనందమైన,
జ్ఞానముతోకూడిన
శాంతమే
మూర్తీభవించిన
పరమాత్మ.
అట్టి
పరమ
పవిత్రమైన
శాంతిని
పొందుటకు
మొదట
కష్టమైన
ప్రయత్నములు
తరుచుగా
చేసి
ఈ
సద్గుణమును
అభ్యసించవలెను.
శాంతి
ఒక
కొండవంటిది.
ఎట్టి
దోష
పరంపరలు
ప్రవహించు
నదులనైనను
అడ్డుచేయును.
ఇట్టి
ప్రశాంతిని
వేరు
వెతుక
నవసరములేదు.
దివ్య
ప్రకాశమగు
అంతఃకరణమందే
పుట్టును.
ఈ
శాంతమే
మోక్షేచ్ఛకు,
నిగూఢ
ధ్యానమునకు,
నిర్వికల్ప
సమాధికి
మూలాధారము.
శాంతముగానున్న
నిజము
అనుభవమునకు
వచ్చును.
2
▾
Meaning
Keep
వాసనలు,
వృత్తులు
నిర్మూలనమొనర్చవలెను.
అహంకారము,
దేహ
ధ్యాసము,
తగ్గినకొలది
ఆత్మానందము
వృద్ధి
అగును.
ప్రజాభిప్రాయమునుబట్టి
నడచుకొనకూడదు.
అట్టి
శాంతాభివృద్ధికి
నీ
సాత్విక
మనస్సుయొక్కయు,
అంతరాత్మయొక్కయు
మృదువైన
శ్రావ్యమైన
సలహా
తీసుకొని
నిజమార్గమున
సంతోషముగాను,
ధైర్యముగాను
నడువవలెను.
సత్సంపత్తి
కలవారితో
సఖ్యము
చేయుము.
ప్రతి
నిమిషము
ఉపయోగకరముగా
గడుపుము.
చేతనైన
పరోపకారము
చేయుము.
రోగుల
సేవ
చేయుము.
అట్టి
సేవలుచేయు
సమయమున
ఆ
సేవాఫలమును
గురించిగానీ,
ఆ
పనిని
గురించిగానీ,
సేవ
చేయించుకొను
వ్యక్తిని
గురించిగానీ
యోచించకూడదు.
మంచిచెడ్డలను
రెంటినీ
యోచించక,
ఇష్టమంత్రమును
మానసికముగా
జపించుట
ఎంతో
పవిత్రము.
ఆకస్మిక
ప్రేరణకు
లోబడి
ఏ
పనియు
చేయకూడదు.
ప్రేరణలు
ఎట్టి
గౌరవముతో
కనిపించినను
వాటివెంట
వెళ్ళకూడదు.
ఈ
విషయమున
మిక్కిలి
జాగరూకత,
శ్రద్ధ
కలిగి
యుండవలెను.
సంతోష
స్వభావము
శాంతికి
పోషణగా
ఉన్నది.
కాన
అట్టి
స్వభావమును
సాధకుడు
వృద్ధి
చేసుకొనవలెను.
ప్రేమించగలిగిన
నిరాడంబరమైన
స్వభావమును
వృద్ధిపరచుకొనవలెను.
స్వభావము
యొక్క
రహస్యములను
గ్రహించవలెను.
ఇచ్ఛాశక్తిని
దానిమూలమున
వృద్ధిపరచవలెను.
శక్తిని
ఖర్చు
పెట్టక
కూడబెట్టవలెను.
ప్రపంచమున
చతురతతో
మెలగిన,
నిజముగా
మానవుడు
శాంతస్వరూపుడను
సార్థక
నామమును
స్వరూపముగానే
చూపించవచ్చును.
శాంతిని
భంగపరచుకొనుట,
పనికిమాలిన
సంభాషణలలో
నీ
విలువైన
కాలమును
వృథాపరచుకొనరాదు.
సంభాషణలను
మితముగా
హితముగా
పెట్టుకొనుట
వినయమునకు,
నిరాడంబరమునకు
సూచనగా
నుండును.
అట్టి
వినయ
నిరాడంబరములు
శాంతిని
బలపరచును.
3
▾
Meaning
Keep
ప్రతి
ఒక్కటియు
ఈశ్వరార్పణ
మొనర్చిన
బాధలకుగాని,
దుఃఖమునకు
కాని,
సంతోషమునకుకాని
స్థానముండదు.
అట్లు
ఏదీ
తనకు
సంబంధము
లేనట్లుండిన
శాంతికి
భంగమేలేదు.
అంతా
నాది,
నేను,
నావారు,
నీది,
నీవారు
అను
వ్యత్యాస
భావనలు
మనస్సున
కదిలినపుడే
శాంతికి
అన్నివిధములైన
ఆటంకములు
అడ్డువచ్చును.
అట్టి
ఈశ్వరార్పణ
చేయుటకుకూడ
ఆత్మవిశ్వాసముతో
చేరిన
ప్రేమ
కావలెను.
అదియే
భక్తి.
దానిని
నిత్యము
క్రమము
తప్పక
ఆరాధించుచూ
ఆనందించుచుండవలెను.
దానితోపాటు
సమరసమగు
మనసు
కలిగియుండవలెను.
ఆధ్యాత్మిక
జీవనమనునది
వ్యర్థమైన
సంభాషణకాదు;
ఆత్మయందు
నిజముగా
జీవించుటే.
అది
నిర్మలమైన
ఆనందముయొక్క
ఉత్కృష్టానుభవమే.
అదియే
సంపూర్ణ
జీవనము.
శాంతజీవనమునకు
వాగ్దత్తము
మరువకూడదు.
మర్యాద
కలిగి
నిష్పక్షపాతబుద్ధితో
నుండి
భక్తి
అను
సముద్రమున
మునిగియుండ
వలెను.
హిమవంతునివలె
స్థిరముగా
నుండవలెను.
నీ
హృదయమనే
తోటనుండి
లోభము,
క్రోధము,
అసూయ,
స్వార్థం,
దురాశ,
అహంకారము,
మమకారమను
ముండ్లచెట్లను
తీసివేయవలెను.
అట్టి
మొలకలను
పెరికివేయవలెను.
ఈ
సాధనలు
అన్నియు
శాంతిభద్రత
సాధనలే.
నీవు
సర్వవ్యాపియైన,
అమరత్వమైన
ఆత్మనని
మొదట
నిర్ధారణ
చేసికో,
తదుపరి
ఈ
సాధనలన్నియు
సులభముగా
సాధించ
వచ్చును.
అట్లుకాక
దేహమే
నేను,
జీవినే
నేను,
ఇంద్రియములే
నేనను
భ్రమలో
ఉండి
ఎన్ని
సాధనలు
చేసిననూ
అవి
ఫలించని
పిందెలే,
పండ్లు
ఏనాటికీ
కానేరవు.
శాంతిని
ఎన్ని
జన్మములైనా
నీవు
అనుభవించలేవు.
శాంతిని
నీవు
స్వరూపముగా
నిరూపించ
దలచితివా
నీవే
శాంతస్వరూపుడని
తెలుసుకో.
దేహేంద్రియములు
నేను
కాదని
త్యజించుము,
వాసనలు
దూరమగును.
ఎప్పుడు
వాసనలు
దూరమగునో
శాంతముయొక్క
ప్రకాశము
నీ
కగుపడును.
సత్యమైన
పరమాత్మయందును,
సత్యమునందును,
సద్ధర్మముల
యందును
గల
ప్రేమయే
శాంతము.
ఇట్టి
శాంతియే
సత్యాత్మను
సాక్షాత్కరింపజేయును.
అట్టి
4
▾
Meaning
Keep
దైవ
సాక్షాత్కారము
నొంద
తలంచువారికి
ముఖ్యముగా
శాంతియనువది
యుండవలెను.
అనగా
సత్యపరమాత్మ
యందే
దృష్టి
గలవారై
నా
జీవితమేమైననూ
సత్యాత్మ
దర్శనమొందియే
తీరవలెనను
గట్టి
పట్టుదలగలవారై,
కామక్రోధాది
ప్రకృతి
వికారములకు
సుఖ
దుఃఖ
స్తుతి
నిందానింద్యములను
తలంచక
యుండవలెను.
ఇట్టి
ఓర్పు
ఒక్కటే
దైవసాక్షాత్కార
జ్ఞానము
నొందించును.
మానవ
జన్మమెత్తుట
దేవుని
భజించి,
తద్వారా
పరమాత్మను
తెలిసికొనుటకు
అని
నిశ్చయించుకొనవలెను.
"నేను
ఏ
ఆట,
ఏ
మాట,
ఏ
పాట,
ఏమి
చేసిననూ
భగవంతుని
తెలిసికొనుటకే.
ఏమి
చూసినా,
ఏమి
తినినా,
ఏమనినా,
ఏమి
చేసినా,
అంతా
దేవుని
తెలుసుకొను
నిమిత్తమే"
అను
దృఢమును
మొదట
పెంపొందించుకొనవలెను.
భగవన్నామ
రూపములు
పెద్ద
బెల్లపు
పర్వతములవంటివి.
ఆ
కొండను
సమీపించి
సర్వదా
నమ్మి
ఏవైపున
నీవు
భుజించిననూ
ఆనందమను
తీపినే
అనుభవింతువు.
ఈరీతిగా
ఎల్లప్పుడూ
ఆ
మధురమును
అనుభవించువారే
ఉత్తమ
భక్తులు.
దైవనామస్మరణ
యను
కొండలో
కొంతకాలము
అనుభవించి,
సమీపముననుండి,
కొంతకాలము
విషయసుఖము
లనుభవింతురు.
వీరిని
మధ్యమ
భక్తులని
అందురు.
దైవస్మరణయను
కొండలో
నాల్గవ
భాగమునే
అనుభవించి,
ముప్పాతిక
భాగమంతా
విషయసుఖముల
ననుభవింతురు.
వీరిని
అధములని
అందురు.
కష్టములు
వచ్చినపుడు
నామస్మరణయను
బెల్లపుకొండను
ఆశ్రయించి,
ఆ
కష్టము
తీరగనే
కొండకు
దూరమగుదురు.
ఇట్టివారిని
అధమాధములందురు.
పరమ
భక్తులైన
మీరు,
పై
నాలుగింటిలో
ప్రధమమైన
ఉత్తమ
మార్గమును
విడువక
పట్టిన,
జీవితమున
పూర్తి
ఆనందమును,
తీపిని
ఆరగించుచుందురు.
అట్టి
పట్టు
పట్టుటకు
శాంతే
మీ
నిజమిత్రము.
ఆ
మిత్రుని
మీరు
సాయముకోరిన
అతని
మూలమున
పవిత్ర
జీవులు
కాగలరు.
సార్థక
మొందగలరు.
5
▾
Meaning
Keep
అయితే,
ఇందులో
ఒక
విషయము
జాగ్రత్తగా
గమనించవలెను.
శరీరమునందు
జ్వరము
లేదా,
మనస్సు
పరచింతల
యందున్నప్పుడు
మనము
ఏమి
భుజించినను
రుచింపదు,
రుచి
తెలియదు.
అట్లే,
భగవన్నామమును
స్మరించునపుడో
ధ్యానించినపుడో
హృదయము
తమోగుణముతోనో
మనస్సు
చంచలముగనో
ఉన్న
భగవంతుని
మధురము
వారికి
తెలియదు;
దానిపై
రుచికూడా
పుట్టదు.
నాలుకపై
బెల్లమున్నంతవరకు
జివ్హా
మధురముగానే
యుండును.
అదేవిధముగనే
హృదయమున
దైవభక్తి,
శాంతము,
ప్రేమ
మొదలైన
సద్గుణము
లున్నంతవరకు
హృదయము
ఆనందమయముగానే
యుండును.
అట్లుకాక,
కామ
క్రోధ
ద్వేషములను
చేదువస్తువులు
హృదయమున
పుట్టిన
భయము,
అశాంతి,
నిరుత్సాహము
హృదయమునుండి
పైకుబికి
వచ్చును.
మీరు
చూచియే
యుందురు.
చేపలను
పట్టవలెనన్న
కొంగ
నెమ్మదిగా
నడిచినచో
లేక
ఒకచోట
కదలక
మెదలక
ఉండినచో
చేపలను
పట్టగలదుగాని,
గలగల
నడుచుచూ
దుముకుచూ
పోయిన
చేపలు
పట్టుబడునా?
అట్లే
మానవుని
హృదయములో
కామ,
క్రోధ,
లోభ,
అహంకార,
అసూయాది
గుణములలో
చలనమున్నంత
వరకూ
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమాది
సద్గుణములను
మత్స్యరూపములను
భగవంతుడు
వారలకు
లభించడు.
కాన
భగవన్నామమును
ఎల్లప్పుడు
మరువక
చేయుటయను
నొక్క
సాధనయుండిన,
ఆ
సాధనలో
శాంతిని
సాధించిన,
సర్వానందములకు
మించిన
ఆనందము
చిక్కును.
అంతియేకాక
కామక్రోధాది
ప్రకృతి
దుర్గుణములను
కూడా
సులభముగా
జయించవచ్చును.
పరమాత్మయే
మానవుని
గమ్యస్థానమని
గ్రహించి,
పరమాత్మయందే
దృష్టినుంచి,
మనస్సును
నిగ్రహించుటయే
సమస్త
శాస్త్రములయొక్క
సారము.
ఈ
ఒక్కటి
మీరు
చేతురా,
సర్వశాస్త్రములూ
మీరు
సాధించినవారగుదురు.
చూడుడు!
కౌరవులు
పుణ్యకర్మఫలమగు
భోగము
లనుభవించుచు
పాపకార్యములు
చేసిరి;
పాండవులు
పాపకర్మఫలమగు
కష్టము
లనుభవించుచు
పుణ్యకార్యములు
చేసిరి.
ఈ
రెండే
వివేకము
లేనివారికి,
వివేకము
ఉన్నవారికి...
6
▾
Meaning
Keep
భేదము.
కష్టము
లనుభవించు
సమయమున
పాపకర్మఫలమని
తలంచి
భగవంతునిపై
విసుగు,
కోపము
రానీయక,
ఆ
కష్టములనే
తలంచక
పుణ్యకార్యములు,
పరోపకారములు
చేయుచు,
భగవంతుని
నామము
తలంచుచుండిన
అదియే
వివేకగుణమునకు
గుర్తు.
అట్టివారు
పాండవులను
పోలినవారగుదురు.
ఇట్టి
పవిత్ర
భావమును
బలపరచుటకు
శాంతిని
మించిన
సహాయకారి
వేరులేదు.
పుణ్యఫలమని
శుభములను
అనుభవించుచు
పాపకార్యములు
తలపెట్టరాదు.
అట్టి
పుణ్యఫలమును
అనుభవించు
సమయమున
మరింత
పుణ్యకార్యములే
చేయుచుండిన
అట్టివారి
జన్మయు
భగవత్సాన్నిధ్యమున
చేరగలదు.
ఇది
ఉత్తమగుణ
లక్షణము.
ఇట్టి
గుణములలో
శాంతిని
సాధించి
మోక్షము
పొందుటే
జీవిత
రహస్యము,
ధర్మము.
చూచినవి,
విన్నవి,
చదివినవి,
నేర్చినవి,
చేసినవి,
చేయించినవి
అన్నియు
మరచి
చిత్తశుద్ధుడై
యుండుటే
సమాధి
అనియు,
మోక్షమనియు
అందురు.
భరించరాని
దేహబాధను
అనుభవించువానికి
ప్రపంచమందలి
వినోదములు
ఎట్లు
రుచింపవో,
అట్లే
నిజమైన
ముముక్షువులకును,
భక్తులకును
ప్రపంచ
విషయభోగములు,
రాగములు,
క్రోధములు,
ద్వేషములు
రుచింపవు.
ఇట్టి
భోగ,
రాగములను
సహితము
మొదట
అణచుకొనవలెను.
సర్వబాధలకు
మూలకారణమే
ఇవి.
రాగము
మోహమువలన
కలుగుచున్నది.
రాగము
రజోగుణమున
నివసించునది.
వైరాగ్యము
సత్త్వగుణ
భవనమున
నివసించునది.
రాగము
ఒక
అసురసంపత్తి.
రాగము
అజ్ఞానము,
స్వార్థము,
మోహమువలననే
జనించుచుండును.
రాగము
మృత్యువును
కూర్చును.
వైరాగ్యమే
జ్ఞానము.
ఇది
ముక్తిని
చేకూర్చును.
ఇట్టి
వైరాగ్యము
నలవరచుకొనుట
నిజముగా
నొక
తపస్సు,
వ్రతము.
అంతటితోకాక
పునఃపునరభ్యాస
మొనర్చవలసి
యుండును.
అట్టి
అభ్యాసమువలన
అపుడే
నడక
నేర్చుకొను
బిడ్డవలె
పతనముల
నొందవచ్చును.
కాని,
నీవపుడు
తిరిగి
ఆనందముతో
చిరునవ్వులతో
లేచి
పునఃప్రయత్న
మొనర్చవలెను.
దీనికి
శాంతి
అత్యవసరము.
అపజయములు
అడ్డురాళ్ళుకావు.
అవి
విజయ
సోపానములే!
7
▾
Meaning
Keep
అంతరాత్మకు
కట్టుబడియుండవలెను.
అంతరాత్మలోనే
విశ్రమించవలెను.
నిరంతర
మాత్మధ్యానము
కలిగియుండవలెను.
అప్పుడన్ని
బంధములు
వాటంతటవే
నశించును.
భగవంతునెడ
లేక
ఆత్మయెడ
బద్ధానురాగము
ప్రాపంచిక
బంధములన్నింటిని
నశింపజేయగల
శక్తివంతమగు
విరుగుడు.
రాగరహితుడగువాడు
నిజముగా
అందరిని
ప్రేమించును.
అట్టి
ప్రేమ
శుద్ధ
ప్రేమయేకాక
దివ్యప్రేమ
యనబడును.
ఆ
ప్రేమే
శాంతియొక్క
స్వరూపము.
అట్టి
రాగరహితుడవై
కర్మలొనర్చుచు
అవశ్యముగా
పరమాత్మను
చేరవచ్చును;
నిస్సంశయము.
వైరాగ్యమన్న
ఉన్న
ఇండ్లు,
భూములు,
రాజ్యములు,
రథములు
వదలుటకాదు.
అన్నిటియందు
దైవికమైన
భావమును
సృష్టించుకొన్న
ఆ
వస్తువుయొక్క
రూపనామములు
వదలుదురు.
ఇదే
నిజవైరాగ్యము.
ప్రపంచవస్తు
వాహనముల
రూపనామములు
ఉన్నంత
వరకు
రాగమే.
అన్నిటియందు
దైవభావన,
దైవరూపము,
దైవ
నామమును
నిరూపించుట,
అనుభవించుట,
ఆనందించుట
ఇదే
వైరాగ్యమను
మహావాక్యమునకు
నిజఅర్థము.
కాని,
అన్నింటినీ
వదలి
మనస్సున
వస్తుభావనే,
వస్తుచింతనే,
వస్తు
అనుభవమునే
చేర్చుకొన్న,
అది
వైరాగ్యము
కానేరదు.
ఇట్టి
పవిత్ర
వైరాగ్యమునకునూ
శాంతి
అవసరము.
Previous
←
Prabodha 4
Next
Prabodha 6
→