Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśānti Vāhini · Prabodha 6
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
సముద్రము
ఒక్కటే;
దిక్కులనుబట్టి
సాగరమునకు
అనేక
పేర్లు
ప్రకటింతురు.
అదేవిధమున
అనుగ్రహసాగరుడైన
పరమాత్మ
ఒక్కడే;
ఆయా
యుగములనుపట్టి
అనేక
రూపనామములు
కల్పించుకొనుచున్నాడు.
పుణ్యనదులు
సాగరమున
చేరుటకు
అనేక
మార్గములుగా
అనేక
దిక్కులు
ప్రవహించుచూ
(అనగా
ఉత్తర,
దక్షిణ,
తూర్పు,
పడమర,
వాయవ్య,
ఈశాన్య,
ఆగ్నేయ,
నైఋతి,
ఈ
అష్టదిక్కుల
ప్రవహించిననూ)
కట్టకడపట
చేరునది
ఒకే
సాగరము.
కాన
మానవజాతికూడా
అనేక
సాధన
మార్గముల
భగవంతుని
కొల్చినను,
కడకు
కృష్ణపరమాత్మయందే
లీనము
కావలెను.
మానవులు
సమైక్యతను
పాటించిన
గమనించిన
ఆనందము
కలుగును
కాని,
తేడాలలో
ఊహించిన
ఆనందమునకు
దూర
మగుదురు.
ఆనందమునకు
ఎపుడు
దూరమగుదురో
శాంతిని
అనుభవించలేరు.
శాంతిలేక
ఏ
విధమైన
సౌఖ్యసంతోషములు
మానవులు
పొందలేరు.
సమైక్యమైన
సాగరమును
ప్రధానముగా
తలంచిన
దిక్కులు
ఏ
దిక్కులైన
నేమి?
పేర్లు
ఏ
పేర్లయిననేమి?
ఐక్యము
సాగరమే
కదా!
అట్లే
సాధకులు,
భక్తులు
ఏ
ఒక్క
మార్గముననైనను
జ్ఞానమార్గముననైనను,
యోగమార్గముననైనను,
భక్తి
మార్గముననైనను
శాంతి
ధర్మ
సత్య
ప్రేమముల
మార్గమునందైనను,
ఈ
అష్ట
మార్గముల,
అష్ట
దిక్కుల
సాధించి,
భగవదనుగ్రహమను
సాగరమున
చేరిన
రూపనామములు
వ్యత్యాసములైనను,
శక్తిసాగరము
ఒక్కటయి
అనుగ్రహించును.
2
▾
Meaning
Keep
ఐక్యతను
ప్రధానముగా
దృష్టియందుంచుకొనవలెను,
కాని
మార్గములు,
భగవత్
రూపనామముల
భేదములు
బలపరచకూడదు.
అట్టి
భేదభావములే
ఆనందమును
చేరనివ్వక
అడ్డు
తగులుచున్నవి.
అట్టి
ఆటంకములకు
చిక్కుకొనక,
వాటిని
సమదృష్టిభావముతో
తప్పించుకొని
ఆనందసాగరమున
చేరవలెనన్న
శాంతియే
రాజబాట.
అట్టి
శాంతికి,
జాతియందు
ధర్మనియతి
ఉండవలెను.
జాతియందు
ధర్మనియతి
పాటించవలెనన్న
కుటుంబమునందు
సహనత్వం
పెంపొందించవలెను.
కుటుంబమున
సహసము
పెరగవలెనన్న,
తన
నడవడికల
యందు
సాత్వికమైన,
సౌందర్యమైన
(అనగా
అందరిని
ఆనందింపజేయు)
నడవడికలుగా
ఉండవలెను.
చేయు
కార్యములందు,
నడుచు
నడకలయందు,
పలుకు
పలుకులయందు,
ఇతరులకు
బాధింపనివిగాను,
అవమానింపనివిగాను,
ఇతరులకు
నష్టకష్టపెట్టునవిగాకాని
లేకుండా
యోచించి
పాటించి
అందులో
తన
ధర్మమునకుకూడ
వ్యతిరిక్తముగా
నుండక,
తననూ
బాధించక;
సత్యమార్గమునందే
నడచునట్లుచేయు
ప్రవర్తనలే
సౌందర్య
నడవడికలు.
అట్టి
నడివడికలు
జీవికి
ప్రాప్తించవలెనన్న
హృదయమున
సౌజన్యము
చేర్చవలెను.
అట్టి
సౌఖ్యము
హృదయమున
చేరవలెనన్న
మొదటిది
జన్మాంతర
సుకృతము
(సంస్కారము);
దానితరువాత,
భక్తి
ప్రవర్తనలే
ఆధారము.
భగవద్భక్తి
వలన
వినయ,
పాప
భయ,
విశ్వాసములవల్లనే
హృదయమున
సౌజన్యము
నెలకొలుపవచ్చును.
కాన,
ముముక్షులారా!
మొదట
భగవత్
విశ్వాసమును,
పావభీతిని
కలిగించికొనుడు;
వినయము
ఈ
రెండింటి
మూలమున
బలపడును;
అదే
శాంతి!
సంసారమును
వదలి
దూరముగా
నుండుటే
శాంతి
అని
కొంతమంది,
ఆచరించని
అనుభవములేని
వేదాంతులు
తెలుపుదురు.
అట్టిది
శాంతికాదు;
అదే
పెద్ద
అశాంతి.
చెట్టునుండి
విత్తనము
దూరమైనంత
మాత్రమున
అది
తిరిగి
చెట్టుగాదా?
అట్లు
తిరిగి
ఆ
విత్తనము
చెట్టు
కాకుండా
ఉండవలెనన్న
ఆ
విత్తనము
3
▾
Meaning
Keep
అగ్నిలో
వేయించిన,
అంకురము
నాశనమగును.
అట్లే
మానవుడు
సంసారమను
చెట్టునుండి
దూరమయినంత
మాత్రమున,
శాంతిని
పొందలేడు.
అంతః
కరణములందు
వాసనలను
విచారణాగ్నిచే
మాడ్చినపుడే
నిజజ్ఞాని
కాగలడు,
నిజశాంతిని
అనుభవించగలడు.
అట్లులేక
పైచెప్పినట్లు,
సంసారబాధ్యతలకు
దూరమైనంత
మాత్రమున
శాంతి
కాదు;
రాదు.
కాన,
నిజశాంతిని
పొందగోరువారు
సంసారమును
వదలిపోనక్కరలేదు.
ఉన్నదానియందే
సంతృప్తిపడుచు,
లేనివి
తలకు
తగిలించు
కొనక
సాధ్యమైనంతవరకు
వాసనలను,
రాగద్వేషములను
పెంచుకొనక
వాటిని
నిర్మూలన
చేయుటకు
ప్రయత్నించు.
ఉపకరణములైన
భక్తి,
జ్ఞాన,
సత్య,
ధర్మ,
ప్రేమ,
సహనములను
స్నేహము
చేయవలెను.
స్నేహము
చేయుటేకాక
వాటి
క్రమములను
కార్యరూపమున
నడచుకొనవలెను;
ఆచరించవలెను.
అదియే
మానవుని
నిజకర్తవ్యము,
మానవజన్మ
కారణము.
పై
చెప్పిన
నాలుగు
ఉపకరణములను
ఎవరికి
వారు
నడచుకొన్న
ఒకరికొకరిపై
ద్వేషములేక,
అసూయలురాక,
స్వార్థమును
అడుగంటించి,
పరార్థమును
పైకితీసి
లోకశాంతిని
నెలకొల్పవచ్చును.
అట్లుకాక
ఎవరికివారే
శాంతిని
అనుభవించు
అవకాశము
లేకున్న,
ఇంక
లోకమునకేమి
శాంతి
తేగలరు?
లోకశాంతి
కోరువారు
తమకు
తాము
మొదట
శాంతిని
అనుభవించు
మార్గమును
తెలుసుకొని
ఆ
మార్గముల
ద్వారా
లోకమునకు
శాంతిని
చాటవచ్చు;
చేకూర్చవచ్చు.
ఎక్కడ
చూచినా
"లోకశాంతి"
"లోకశాంతి"
అని
అరచుచున్నారే
కాని
శాంతిని
ఏ
రీతిగా
సంపాదించవలెనని
తెలుపువారు
తక్కువ.
శాంతిని
నిజముగా
ఇట్లుండునని
నిరూపించువారెవ్వరూలేరు.
నిజముగా
వారు
శాంతిని
అనుభవించినవారైన,
లోకపు
అశాంతి
వారి
దృష్టికేరాదు;
శాంతి
అన
ఇంద్రియ
వ్యాపార
విసర్జనే;
ఇట్టిది
చాటిన
వచ్చునది
కాదు;
చేసిననే
అనుభవించవచ్చును.
4
▾
Meaning
Keep
ఇట్టిది
ఎవరికివారే
చేయవలెను.
ఒకరికొకరు
అందించుకొన
వీలులేదు;
దాని
నిజానందమును
అనుభవించి,
దాని
రుచి
ఇట్టిది,
దానిని
ఈ
మార్గమున
ప్రయత్నించవలెనని
తెలుపవచ్చునేకాని,
ఇతరుల
శాంతికి
తాను
త్రోవచూపవచ్చును
కాని,
వేరేమీచేయలేడు.
తాను
తిండితిన్న
రెండవవాని
ఆకలి
తీరునా?
ఎవరు
తిన్నారో
వారి
ఆకలి
మాత్రమే
తీరును.
అట్టిదే
శాంతి
అను
ఆహారముకూడను!
లోకశాంతి
కావలెనన్న
ఇట్టి
అనుభవము
అవసరము.
ఒక్క
ప్రేమ
సహనములున్న
చాలును.
కేవలము
పైనచూపు
ఆడంబరములుకాక
త్రిగుణ
సాక్షిగా
మనో
వాక్కాయములతో
చేర్పవలెను.
అప్పుడే
లోకశాంతిని
అనుభవించవచ్చును.
మరికొందరు
'లోకశాంతికి
ప్రార్థనలు
జరపండి.
అంతియే
చాలున'ని
బోధింతురు.
అది
చాలా
మంచిదేకాని,
అంతమాత్రముననే
శాంతిని
సాధించలేము.
ప్రార్థనలతోపాటు
ప్రవర్తనలు
కూడా
ఐక్యము
కావాలి.
ప్రార్థనలు,
ప్రవర్తనలు
వేరు
వేరు
కాకూడదు.
రెండును
అట్లు
వేరువేరైన
ప్రార్థన
చేసియు
ప్రయోజనము
లేదు.
అది
బూటకమగును.
ఆడు
మాటలు,
చేయు
ఆటలు,
పాడు
పాటలు
మూడూ
ఒక
చోటనే
నడువవలెను.
లోకశాంతికొరకు
ప్రార్థనచేయుచు
ఒకరిని
చూచిన
ఒకరు
ఓర్వలేకుండుట,
పరులను
దూషించుట,
భేదభావములు
చూపించుట
ఈ
రీతిగా
ప్రవర్తించిన
అసలు
శాంతిని
కోరువారలకే
లేని
అశాంతి
చెలరేగును;
శాంతికి
బదులు
కాంతిని
అనుభవించును.
కాంతిని
అనుభవించినా
ఒకవిధమైన
ఆనందమేకాని,
కాంతుని
అనుభవించిన
దుఃఖమే
సంభవించును.
లోకశాంతి
మూలమున
ఆత్మానందము
కూడా
అభివృద్ధి
చేసుకొనవచ్చును.
లోకశాంతిని
కోరువారలకు
తన
నిజశాంతికూడ
ఏర్పడును.
చేతితో
అన్నము
తీసి
నోటిలో
వేసికొని
నోటినుండి
జఠరమునకు
పంపిన
జఠరమునుండి
సర్వాంగములకూ
సారమును
పంపవచ్చును.
అదేవిధముగా
చేతితో
లోకశాంతి
ప్రవర్తనలు
చేయుచు
నోటితో
లోకశాంతి
ప్రార్థనలు
జరుపుచున్న
ఈ
రెండుపనుల
మూలమున
దేవుని
దేహమైన
దేశముయొక్క
సర్వమూలలా
శాంతిసారము
5
▾
Meaning
Keep
వ్యాపించును.
అప్పుడు
అదియే
నిజశాంతి
అని
చెప్పవచ్చును.
నిజశాంతికి
లోకశాంతియే
ఆధారము.
"దేహో
దేవాలయ"
అన్నదాని
నిజార్థమేమో
తెలియకున్నారు.
దేవాలయము
ఏ
నిమిత్తము
ఏర్పడినది?
లోనున్న
దేవుని
నిమిత్తము
బైట
దేవాలయము.
దేవుడులేక
దేవాలయమును
ఎవరూ
కట్టరు.
అట్లు
కట్టినా
దేవాలయమని
అనిపించుకోలేదు.
ఇప్పుడు
దానికెదురుగా
సాధనలు
చేయుచున్నారు.
లోనున్న
దేవుణ్ణి
మరచి
సర్వాలంకారములు,
సర్వసేవలు
దేవాలయమునకే
చేయుచున్నారు.
చేయవలసిన
సేవలూ,
నైవేద్యములూ,
అలంకారములూ
దేవునికికాని
దేవాలయమునకు
కాదు.
అది
దేవునికి
నిలయముకాని
దేవుడుకాదు.
ఆరాధనకొరకు
ఆలయమునుకూడ
భద్రపరచుకొనవలెను.
శుభ్రపరచుకొనవలెను.
దాని
ఆధారమువలన
భగవంతుని
సందర్శించ
వచ్చును.
భగవంతుని
పొందుటకు
ఆధారము
దేవాలయము.
అట్లే,
శరీరము
కేవలము
ఆత్మస్వరూపుడైన
పరమాత్ముని
ఆలయము.
ఆత్మవిశ్వాసము,
ఆత్మానందము,
ఆత్మారాధన,
ఆత్మార్పితము
వీటిని
మరచి
కేవలము
దేవాలయమైన
దేహపోషణలు,
దేహసంతోష
సుఖములు,
దేహ
ఆహారములు,
దేహానందమునే
కోరుచున్నారు,
చేయుచున్నారు.
శరీరమునకు
ఎన్ని
కోరినా
ఎన్ని
చేసినా,
లోనున్న
జీవాత్మ
నిమిత్తమే
ఈ
శరీరమని
దృఢపరచుకొనవలెను.
ఈ
దేహ
దేవాలయముయొక్క
ఆధారముతో
లోనున్న
భగవంతుడైన
ఆత్మను
సందర్శించవలెను.
ఆత్మసందర్శనమును
ప్రధానముగా
తలంచి
దేహ
దేవాలయముయొక్క
మంచిచెడ్డలు
చూచుకొనవలెను
కాని
ప్రధానమైన
లోనున్న
భగవంతుని
మరచి
అస్థిరమైన,
అనిత్యమైన,
పై
కట్టడమైన,
గుడిని
గట్టిగా
పట్టుకొనకూడదు.
అట్టి
కట్టడమును
శిథిలము
చేయకూడదు.
దాని
యోగక్షేమములు
కూడ
అవసరమే.
అయితే
'గుడి
యొక్క
యోగక్షేమములు
భగవంతుని
నిమిత్తము'
-
అని
మాత్రము
దృష్టిలో
ఉంచుకొనవలెను.
అట్లే
6
▾
Meaning
Keep
ఆత్మశాంతి
నిమిత్తము
లోకశాంతికూడా
ప్రధానము.
లోకశాంతి
అనే
కట్టడమే
ఆత్మశాంతి
మందిరమని
దృష్టిలో
పెట్టుకొని
లోకశాంతిని
కోరుతూ
తగిన
ప్రయత్నములు
ప్రవర్తనలూ
చేయవలెను.
లోకమును
లోకేశుని
భవనమువలె
తలంచవలెను.
ఆ
భవనమునందే
లోకేశుడు
సంచరించుచున్నాడు.
గుడి
చక్కగా
ఉన్ననే
భగవంతునికి
ఆరాధనలు
చక్కగ
జరుగును.
భగవంతుడు
ఉండుటవల్లనే
గుడి
కట్టుకొందురు.
ఈ
రెండింటి
క్షేమములు,
అభివృద్ధులు
కోరవలసినదే.
రెండింటియందు
మొదటిది
భగవంతుడు,
రెండవది
భవనము.
ఈ
రీతిగా
తలంచి
రెండింటి
యోగక్షేమములు
గమనించ
వలెను.
లోనున్న
భగవంతుణ్ణి
మరచి
పై
భవనమును
ఎంతబాగా
చూచుకొన్ననూ
అది
శవమేకాని
శివముకాదు.
శివుని
దృష్టియందుంచు
కొనుట,
అదే
సర్వమంగళము.
లోకశాంతే
సర్వజీవుల
శ్వాసముగా
తలంచవలెను.
దానికై
పాటు
పడవలెను.
పవిత్రమైన
ప్రధానమైన
దేశమాత
శాంతిగా
నుండినపుడే
పరమాత్మ
పట్టుపడును.
ప్రకృతి-పరమాత్మ
సమైక్యమే
మోక్షము.
అట్టి
మోక్షమును
కోరువారు,
పరమాత్మ
ప్రేమానుగ్రహములు
ఎట్లు
కోరుదురో
ప్రకృతియొక్క
శాంతి,
ప్రేమలనుకూడా
అట్లు
కోరవలెను.
రెండింటి
అనుగ్రహమును
పొందినపుడే
దుష్టగ్రహములైన
ఇంద్రియవాసనలు
హృదయమును
బాధించలేవు;
బానిసలుగా
లొంగును.
అదే
మనోనాశము.
చిత్తవృత్తులు
నిరోధించుటే
మనోలయము.
కాన,
ప్రతి
మానవుడు
శాంతిని
ప్రధానముగా
సాధించవలెను.
చాలామంది
ఆత్మగౌరవమే
శాంతి
అనికూడా
వాదింతురు.
ఆత్మగౌరవము
క్షుద్రమైన
శరీరమునకు
అనిత్యమైన
పదవులకు
ఇచ్చునట్టి
అధిక
స్థానమని
తలంచుచున్నారేమో?
అట్టి
వ్యక్తిగౌరవము
వ్యర్థగౌరవముగా
భావింప
వలెను.
ఆత్మ
గౌరవమే
సార్థకగౌరవము.
పరమాత్మను,
సత్యమును
గౌరవించుట
ఆత్మగౌరవము
కాని
క్షుద్రమైన
నశ్వరమైన
దేహపదవులను
గౌరవించుట
ఆత్మగౌరవము
కానేరదు.
సత్యమే
ఆత్మ...
7
▾
Meaning
Keep
పరమాత్మనే
ఆత్మ,
నిర్మల
ప్రేమనే
ఆత్మ,
నిస్వార్థసేవనే
ఆత్మ.
ఇట్టి
సత్యస్వరూపమైన
వాటిని
గౌరవించుటే
ఆత్మ
గౌరవము.
అట్టి
ఆత్మ
గౌరవము
శాంతి
అనబడునేకాని,
వ్యక్తి
సంబంధమైన,
పదవీ
సంబంధమైన
గౌరవములు
ఆత్మగౌరవము
లనరాదు.
అధికార
గౌరవములు
అల్పమైనవి.
కల్పతరువైన
కరుణామయుని,
సత్యస్వరూపుని,
ప్రేమస్వభావుని
స్మరించుటే
ఆత్మగౌరవము.
అట్టి
ఆత్మ
గౌరవమును
సంపాదించుకొనవలెనన్న
లోకగౌరవము,
వ్యక్తి
గౌరవము,
పదవీ
గౌరవము-
ఇట్టివాటిని
తృణప్రాయముగా
తలంచి
దూషణ,
భూషణ
తిరస్కార
నిందా
నిష్ఠూరములను
లెక్కచేయక,
పరిహాసములకు
జంకక
పరమాత్మ
అనుగ్రహమును
పట్టువిడువక,
సత్యమును
సళ్ళువిడువక
సాధనమును
సాధించవలెను.
ఇదియే
నిత్యశాంతి,
సత్యశాంతి.
పరమాత్మకు
మించిన
పదవి
సత్యానికి
మించిన
స్వరూపము,
శాంతికి
మించిన
సౌందర్యము
ఏడేడు
పద్నాల్గు
భువనములందేకాక
అండాండ
పిండాండములందుకూడను
లేదు,
రాలేదు,
ఉండలేదు,
రాబోదు!
ఇది
సత్యము,
సత్యము!
సత్యమును
ఎన్ని
మాయలలో
కూలద్రోయనెంచినను
దాని
ప్రకాశము
దేదీప్యమానమై
వెలుగునుకాని
అంధకారము
కానేరదు.
అంధకారమున
సత్యమును
ఎంత
నిర్బంధించినను
అందులో
అది
నిలువబోదు.
సత్యమునకు
ప్రాణముపోదు,
అసత్యమునకు
జీవమురాదు.
ఈ
దృఢము
ప్రతిఒక్కరూ
స్థిరము
చేసుకొనవలెను.
Previous
←
Prabodha 5
Next
Prabodha 7
→