Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśānti Vāhini · Prabodha 7
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
మానవులు
దేనినీ
స్థిరముగా
విశ్వసించకపోవుచున్నారు!
నిజమే!
ఎట్లు
విశ్వసించగలరు?
పుట్టినప్పటినుండి
తన
వాతావరణము,
తన
సాంగత్యము,
తన
విద్య,
తన
అనుభవము
ఒక్కటేమి,
అనేక
విధముల
మార్పుచెందుచు,
ఒక్కదానియందు
స్థిరత్వములేక
పెరుగు
వారలకు
స్థిరవిశ్వాసము
ఎట్లు
కలుగును?
దీనిని
పట్టిచూడ
ఇది
మిథ్యాలోకమని
నిస్సందేహముగా
చెప్పవచ్చును.
ఇదియే
సత్యమైన
ఈ
మార్పులు
కలుగుటకు
వీలులేదు
కదా?
మార్పు
చెందునదంతయు
మిథ్యయే.
సత్యమే
మార్పుచెందనిది.
అట్టి
సత్యమైనది,
నిత్యమైనది,
ఆత్మఒక్కటే.
అదే
భగవద్రూపము.
అదే
సర్వశక్తి.
అట్టి
శక్తి
పొందునట్టి
శక్తి
కాని,
అర్హతకాని
ఒక్క
మానవునికే
ఉన్నది.
అట్టి
మానవజన్మ
మెత్తియు
ఆ
నిజతత్త్వమును
తెలిసికొనలేకుండుట,
అసలు
తెలిసి
కొనుటకైనను
ప్రయత్నించుకుండుట
విచారకరమైన
విషయము.
ఇప్పుడు
తెలిసికొనక
మరెప్పుడు
తెలిసికొందురో?
ఇప్పుడు
ప్రయత్నించక
మరెప్పుడు
ప్రయత్నింతురో
అర్థమగుటలేదు.
అసలు
వారెందుకొరకు
వచ్చిరో
దానినే
విచారించుటలేదు.
సర్వజీవులు,
అనగా
పశు
పక్షి
జంతు
క్రిమికీటకములవలె
తిని,
తిరిగి,
నిద్రించి
సర్వసౌఖ్యములను
అనుభవించుటకా?
మరి
కాకున్న
ఎందుకు?
పోనీ
మానవుడు
వాటితో
సమానమేనా?
వివేక,
వైరాగ్య
విచక్షణలు
మానవునికి
ప్రత్యేక
శక్తులుగా
ఉన్నవి.
అవి
ఉండి
ప్రయోజనమేమి?
పై
మూడు
శక్తులులేని
పశు,
పక్షి
మృగములు,
ఉన్న
మానవులు
ఒక్కటి
ఏనాటికీ
2
▾
Meaning
Keep
కారు.
కావున
పై
మూడు
శక్తులైన
వివేక,
వైరాగ్య,
విచక్షణలు
ఉపయోగించిన
మానవులని,
అవి
విచారించి
ఉపయోగించకున్న
పశువులని
తలంపక
తప్పదు.
పై
మూడింటిని
కేవలము
ప్రకృతి
అనుభవములందేకాక
పరమార్థమందుకూడా
విచారించి
ప్రవర్తించవలెను.
నిజముగా
ప్రాపంచిక
సుఖ
సౌఖ్యములందు,
దుఃఖబాధలందు,
వివేక,
వైరాగ్య,
విచక్షణలను
సూటిగా
విచారించిన,
ఇది
మిధ్యయని,
సత్యముకాదని
నిమిషమాత్రమున
తెలుసుకొనగలరు.
ఎప్పుడు
అట్టి
యథార్థము
తెలిసికొందురో,
మరునిమిషమందే
సత్యమును
తెలుపునట్టి
భగవద్విచారణయందు
భగవచ్చింతనలందు
కాలిడుదురు.
ఇదే
మానవులు
చేయవలసిన
కర్తవ్యము.
అసలు
మానవులనగా
ఎవరు?
వారు
ఎక్కడనుండి
వచ్చినారు?
ఎక్కడికి
వచ్చినారు?
ఎంతకాలముంటారు?
అని
నిజముగా
ఎవరికివారు
విచారించిన
యథార్థము
సులభముగా
తేలిపోవును.
ఆ
విచారణే
వివేకము.
అట్టి
విచారణ
జరిగిన
తరువాత
ప్రపంచము
అస్థిరమని
తెలియగనే
వాంఛలు
సమసిపోవును.
అదే
వైరాగ్యము.
ఈ
మిధ్యాలోకమున
నుండుట
ఉత్తమమా?
ఇది
ఎంతకాలము?
ఇది
స్థిరముకాదు;
నిత్యమై
సత్యమైన
సర్వేశ్వర
లోకమే
ప్రధానమని
సత్యలోకమునకు
గౌరవమిచ్చుటే
విచక్షణ.
వివేక
వైరాగ్యములవల్లనే
తానెవరనునది
తెలిసికొన
వీలగును.
ఆ
రెండూలేక
ఈ
యథార్థము
తెలియదు.
అట్టి
వివేక
వైరాగ్యములు
ఒక్క
మానవునికే
పరమాత్ముడు
ప్రసాదించినాడు.
ఇట్టి
యథార్థమును
తెలిసికొనుటకే
తాను
మానవులకు
అట్టి
అనుగ్రహమును
చూపినాడు.
కాన
మానవులు
నిజముగా
ధన్యులు.
కాని,
వచ్చిన
పనియేమో
తెలిసికొనక,
తానెవరో
మొదటే
తెలిసికొనక,
ఎక్కడున్నామనునది
గమనించక,
ఉన్న
వివేక
వైరాగ్యములను
విహారములకు
ఉపయోగించుకుంటూ
వీధులవెంట
వదలినారు.
ఇది
ఎంత
దురదృష్టము!
అన్ని
సదుపాయములు
ప్రసాదించిన
మానవజన్మమందే
మాధవ
సత్యరూపమును
తెలిసికొనకున్న
ఇంక
ఏనాడు
వీరు
తెలిసికొనుట?
3
▾
Meaning
Keep
"ఇట్టి
ఈనాడే
నీ
వీడేరలేకున్న
ఇంతకన్నా
సులువెన్నడురా?"
అన్నట్లు,
తానెవరు?
అనునది
ఒక్కటి
మొదట
తెలిసికొన్న
అన్నీ
సులభముగా
పరిష్కారము
కాగలవు.
తరువాత
ఎక్కడ
ఉన్నాను?
ఎక్కడికి
వెళ్ళుదును?
ఎంతకాలముందును?
అనునవి
తేలిపోవును.
ఈ
నాలుగు
విషయములు
ఒకదానిపై
ఒకటి
ఆధారపడి
యున్నవి.
ఒకటి
తేలినా
మీదమీద
అన్నివిషయములూ
తెలిసిపోవును.
ఇందులో
ఏ
దానిని
కూడను
విడుచుటలేదు.
ఉదాహరణమునకు,
ఒక
జాబు
మరొకరికి
వ్రాస్తివనుకో,
ఆ
జాబులో
అనేక
విషయములున్ననూ,
దానిని
ఒక
కవరులో
పెట్టి
ఊరకే
పోష్టు
చేసిన,
ఆ
జాబు
ఎవరికని
చేరును?
ఎవరికీ
చేరదు.
పోనీ
వ్రాసినవానికైనా
తిరిగి
వచ్చునా?
రాదు.
కడకు
త్రిశంకుస్వర్గమై
పోవును.
ఆ
కవరుపై
చేరువాని
విలాసము,
వ్రాసినవాని
విలాసము
ఉండిన,
కాలముకూడా
నిర్ణయకాలమును
నిరూపించవచ్చునుకదా!
అట్లే
నీ
జీవితగాధగా
తయారయిన
జాబును
ఎక్కడకు
పంపుతున్నావు?
ఎక్కడ
వ్రాస్తున్నావు?
ఎంతకాలమునకు
చేరగలవు?
ఏమీ
యోచించక
కాలము
నిర్ణయమునకు
రాక,
కంగారు
పడుచున్న
యథార్థము
తేలునదెట్లు?
నీ
పూర్తి
విలాసము
తెలిసికొనవలెను.
నే
నెవరు?
ఆత్మను.
ఎక్కడనుండి
వచ్చినాను?
ఆత్మనుండే.
ఎక్కడ
పోగలను?
ఆత్మకే
చేరగలను.
ఎంతకాలముండగలను?
ఆత్మలో
చేరునంతకాలము
ఉండగలను.
ఇప్పుడున్న
దెక్కడ?
అనిత్యములో.
ఏ
రూపముతో?
అనాత్మతో.
ఏమి
చేస్తున్నావు?
అస్థిరకార్యములు.
కాన
ముందేమి
చేయవలెను?
ఈ
మూడింటిని
విడిచి
నిత్యలోకమును
చేరు
ప్రయత్నము,
స్థిరకార్యములలో
ప్రవేశము,
ఆత్మస్వరూపముతో
ఆనందించుట
-
ఈ
మూడింటినీ
అనుభవింపవలెను.
అదే
జీవియొక్క
ముఖ్యవిచారణ;
ఈ
లోకముయొక్క
ముఖ్యపని.
ఇవి
తప్ప
4
▾
Meaning
Keep
మిగిలినవన్నియు
హుళక్కి
విద్యలు.
తళుక్కున
పోవునవే,
వెనక్కు
తిరిగిచూచిన
తెలియును.
పై
విషయములను
గురించి
ఒక
చిన్న
కథగలదు.
ఒక
రాజుండెడి
వాడు.
అతను
రాజ్యభారము
నేమాత్రమూ
విచారించక
సర్వకార్యములు
తన
మంత్రిపైననే
వేసి
జరిపించెడివాడు.
ఎట్టి
పెద్ద
కార్యమైనను,
చిన్న
కార్యమైనను,
ఏమి?
ఎట్లు?
అను
మాటనే
చర్చించెడివాడుకాదు.
ఇట్లుండ,
తనకెల్లప్పుడు
అంగరక్షకునిగా
ఒక
నమ్మకమైనవానిని
నియమించుకొని
యుండెను.
వాడు
ఏ
చిన్న
కార్యమునైనను
ఇది
ఎందుకు?
ఎట్లు?
ఎవరికి?
మంచిదా?
చెడ్డదా?
అని
విచారించి
పనిచేయువాడు.
అట్టి
విచారణ
బుద్ధితక్కువ
అని
రాజు
తలంచి,
అంగరక్షకుడు
కేవలము
అవివేకి
అనియు
భావించి
ఒక
స్వర్ణరేకున
అవివేక
శిఖామణి
అని
అక్షరములు
చెక్కించి
వాని
నొసట
కట్టించెను.
పాపము
యథార్థమును
తెలిసికొనలేక
చూచిన
వారందరూ
అతను
అవివేక
శిఖామణే
అని
నిశ్చయించి,
వానిమాట
ఎవ్వరూ
వినెడివారుకాదు.
అట్లుండగా
కొంతకాలమునకు
రాజుగారికి
అస్వస్థత
ఏర్పడెను.
రాజు
కనుక
దీనిని
నివారణ
చేయువారెవ్వరా
అని
తన
రాజ్యమంతయు
చాటెను.
అనేకమంది
వైద్యులు
అన్నివిధములైన
చికిత్సలు
చేసిరి.
కాని
లాభములేక
వైద్యము
చేయుకొలది
రోగము
అధికమగుచు
వచ్చెను.
కడకు
అంత్యకాలము
ఆసన్నమాయెను.
రాజు
ఈ
విషయము
కొంతవరకు
గ్రహించి,
చేయవలసిన
ఏర్పాట్లు
అన్నియు
చేయించి,
చెప్పవలసినవారి
కందరికి
చెప్పి,
దుఃఖమున
మునిగి,
ప్రాణము
పోవునేమో
అను
చింతతప్ప,
దైవచింతకాని
మరేమైన
చింతలు
కాని
చేయక,
సదా
తన
మరణచింతనే
చేసుకొను
చుండెడివాడు.
దినదినమునకు
నీరసమై
చెంత
ఉండిన
అవివేక
శిఖామణితో
"ఒరే!
నేను
వెళ్ళుచున్నాను"
అనెను.
ఇంతలో
అవివేక
శిఖామణి
జంకులేక
"రాజా!
మీరు
బలహీనముగా
ఉన్నారు.
నడువలేరు.
మేనా
తెస్తాను
ఉండండి"
అన్నాడు.
"మేనా
అక్కడకు
వెళ్లదురా"
అన్నాడు
రాజు.
"సరి
రథము
తెస్తాను"
అన్నాడు
శిఖామణి.
"రథముకూడా
5
▾
Meaning
Keep
అక్కడపోవ
సాధ్యము
కా"దన్నాడు
రాజు.
"అట్లయిన
గుఱ్ఱము
తెస్తా"నన్నాడు
తిరిగి
మన
అవివేక
శిఖామణి.
విసుగుతో
"గుఱ్ఱముకూడా
వెళ్ళదురా
శిఖామణీ",
అన్నాడు
రాజు.
ఇంక
వాడు
ఏమి
చెప్పుటకూ
తోచక,
"నా
భుజములపై
కూర్చొనుడు,
నేనే
తీసుకువెళ్ళెదను"
అన్నాడు.
అప్పుడు
రాజు
"ఒరే
నాయనా?
ఎవరికాలమువారికి
ఆసన్నము
కాగానే
వారుమాత్రమే
వెళ్ళవలెను.
కాని
వారిజతలో
మరెవ్వరూ
పోవసాధ్యముకా"దని
అన్నాడు.
"అట్లయిన
మేనా
పోదన్నారు;
రథము
పోదన్నారు;
గుఱ్ఱము
పోదన్నారు;
మరెవ్వరూ
వెంట
రాకూడదంటున్నారు;
ఆ
స్థలమెక్కడో
సెలవిస్తారా?"
అన్నాడు
మన
అవివేక
శిఖామణి.
వెంటనే
రాజు
'ఆ
స్థలము
నాకుకూడను
తెలియద'ని
చెప్పినాడు.
ఆమాట
వినెనో
లేదో
శిఖామణి
తన
నొసటకట్టిన
స్వర్ణాక్షరరేకును
విప్పుతూ,
"రాజా!
ఇన్ని
పోవ
సాధ్యముకాదు
అని
తెలిసినవానికి,
ఎక్కడ
పోవునదీ
తెలియక
వెళ్ళుచున్నానని
అంటున్నారే!
ఈ
అవివేక
శిఖామణి
అనుబిరుదు
మీకే
చెందుతుంది.
తమరే
భరించండి"
అని
నిర్భయముగా
విప్పి
చేతికిచ్చినాడు.
మరునిమిషమందే
రాజు
సిగ్గుపడి,
"అయ్యో!
నే
నెవరు?
ఎక్కడ
నుంచి
వచ్చినాను?
ఎక్కడ
ఉన్నాను?
ఏమి
చేస్తాను?
ఎక్కడకు
వెళ్ళుదును?
అను
విచారణే
చేయక
ఉత్తమ
కాలమును,
తిండి
నిద్రలతో,
భోగాలతో
గడిపి
ఇప్పుడు
విచారించను
కాలములేక,
ప్రాణవాయువులు
లాగుచుండగా,
ఆలుబిడ్డలు
ఏడ్చుచుండగా,
ప్రజలు
యోచించుచుండగా
నేను
విచారణలో
మునుగ
సాధ్యమగునా?
నా
జీవితకాలమున
లేని
చింత
అంత్యకాలమున
ఆసన్నమగునా?
కాదుకాదు.
నిజముగా
అట్టి
విచారణ
చేయక
యథార్థమును
తెలిసికొనక,
వృథాగా
కాలమును
అపవిత్రము
చేసిన
నేనే
అవివేక
"శిఖామణి"
అని
తలంచి
"విచారణే
సత్యము
తెలిసికొన
ముఖ్య
సాధన,"
అని
లోకమునకు
చాటి,
"లోకము
నిత్యమా?
అనిత్యమా?
సత్యమా?
అసత్యమా?
అని
విచారణ
చేసి,
నిత్యమైనది
సర్వేశ్వరుడే
అని
దృఢవిశ్వాసముతో
ఉండి,
సర్వేశ్వర
శక్తులను
మాత్రము
విచారణ
చేయక,
అనంతమైన,
అగమ్యమైన,
ఆ
కరుణామయుని
పొందుదురుగాక."
అని
6
▾
Meaning
Keep
తన
రాజ్యప్రజలకు
బోధించి
రాజు
కన్నుమూసెను.
చూడు;
విచారణలేక,
కన్నుగానక,
దైవచింతనే
లేక,
లోకమే
సర్వమని
కాలమును
కాలదన్నిన
రాజు,
ఎంతోబాధపడి
కడకు
విచారణ
చేయక
విచారముతో
ప్రాణములు
వదలెను.
కాన,
ప్రతి
సాధకుడును
విచారణచేయక
విషయమును
అనుభవించరాదు.
నిత్యానిత్య
సత్యములను
యోచించవలెను.
ఏది
సత్యమో,
ఏది
నిత్యమో
దానినే
దృష్టియందుంచుకొని,
ప్రకృతి
అవిద్యలను
అసత్యమని
అనిత్యమని
దృఢము
చేసికొని,
వాటిని
కర్తవ్య
నిత్యకృత్య
ధర్మములుగా
భావించి
పోషణార్థమైన
కర్మలుగా
జరుపవలెను.
అవే
శాశ్వతమని
మాత్రము
తలంచరాదు.
అట్లు
తలంచుటే
అశాంతి.
అట్టి
అశాంతిలో
ఉన్నంతవరకూ
బాధలు
తప్పవు.
బాధలున్నంతవరకు
శాంతి
చేకూరదు.
శాంతిని
కోరువారు
ప్రకృతి
మిధ్యయని
తలంచి,
సత్యమైనవాటిని
వెదుకుచు,
బాధలకు
గురికాక,
అశాంతిని
మరచి,
సర్వదా
సర్వేశ్వర
చింతయందు
శాంతిని
అనుభవించవచ్చును,
కనుక
మమతను
విడనాడి,
కర్తవ్యమును
చేయుచు,
లాభాలాభములకు
హర్షశోకములకు
లొంగక,
పొంగక,
వైరాగ్యమును
వివేకమును
తప్పక,
విచారణలో
జయభేరి
మ్రోయించవలెను.
ఇత్యాది
మహావాక్యములవల్లనే
భగవన్మాహాత్మ్య
జ్ఞానము,
స్వరూపజ్ఞానము
సర్వోత్తమమైనవిగా
ప్రతిపాదింపబడును.
జ్ఞానము,
భక్తి
ఈ
రెండు
సాధనములనుగూర్చి
తారతమ్యము
విచారణ
చేసినచో
భగవానునికి
భక్తియే
అభీష్టతరమని
చెప్పవచ్చును.
భక్తి
మార్గమున
విషయమును
పూర్ణముగా
స్పష్టముగా
గ్రహింపవలసిన
అవశ్యకత
కలదు.
అందుచే
విషయమునే
ప్రమాణముగా,
ప్రమేయముగా,
సాధనముగా,
ఫలముగకూడా
గ్రహింపవలసియున్నది.
ఇందుకు
పవిత్ర
విచారణయే
కాంతిపరచును.
విచారణలేక
విషయము
తెలియదు.
ఇట్టి
విషయవిచారణ
క్రమక్రమేణా
బలపడి
యథార్థమును
చేరును.
ఏదైనా
ఒకానొక
విషయాన్ని
దీర్ఘకాలంవరకు
చక్కగా
చేయుచు,
తాను
చేసే
పనిలోగల
పొరపాట్లు,
తప్పులు
దిద్దుకొంటూ
పోతూ,
తిరిగి
అట్టి
పొరపాట్లు
7
▾
Meaning
Keep
మరొకతూరి
చేరనివ్వక
చూచుకొంటూ
ఉండిన,
కొంతకాలమయ్యేటప్పటికి
తాను
అనుకొన్నదానికంటె
ఎక్కువ
ఔన్నత్యాన్ని
తాను
చేయు
పనియందు,
సాధనయందు
పొందగలడు.
తాను
సాధించవలెనను
విషయములో
జయమును
పొందవలెననెడి
తీవ్రమైన
ఆసక్తితోకూడిన
ఆకాంక్ష
ఉన్న
వ్యక్తికి
ఆ
విషయములో
ప్రావీణ్యత
సంపాదించుట
సులభమౌతుంది.
సాధించ
వలెనన్న
దృఢసంకల్పము
ఉన్నవ్యక్తి
దాని
మార్గములు
నేర్చుకో
గలుగుతాడు.
ఎప్పుడైతే
ఇట్టి
సంకల్పము
తీవ్రమయినదిగా
ఉండదో,
దానికి
తగిన
మార్గములందు
కూడ
తన
శ్రద్ధ
బలహీనమై,
తెలిసికొనలేని
వాడగుచున్నాడు.
దీనికి
ఇచ్ఛ
ప్రధానము.
ఇచ్ఛ
అనగా,
తాను
ఉన్నత
స్థానమును
పొందవలెననెడి
సామాన్యమైన
కోరిక.
ఇంక
ఇచ్ఛాశక్తి
అనగా,
తనకు
గల
ఆ
ఉత్తమ
కోరికను
నెరవేర్చుకొనుటకై
చేసెడి
సాహసమైన
ప్రయత్నము.
ఇప్పుడు
ఈ
రెండింటియందు
నిజ
శాంతిని
పొందవలెనన్న
ఇచ్ఛాశక్తి
ముఖ్యావసరము.
చూడు!
ఒకడున్నాడని
తలంచుకో!
అతనికి
ఇప్పటికంటె
ఎక్కువ
బలము
కావలెనను
ఇచ్ఛ
కలదు.
అతడు
ఇప్పటికంటె
బలశాలి
అగుటకు
ఏయే
విధానములు,
ఏయే
పదార్థములు,
ఏయే
క్రమములు
అవలంబించవలెనో
తెలిసికొని,
అటుపిమ్మట
వాటిని
పాటించుచుండు
నపుడు
అతనికి
మొదటిలోనున్న
ఇచ్ఛ,
ఇచ్ఛాశక్తిగా
మారగలదు.
దీనికే
దృఢసంకల్పమనికూడా
అందురు.
ఇందులో
ఒకటి
ప్రధానముగా
గ్రహించవలెను.
చాలామంది
యే
ఇచ్ఛలు
లేకుండుట
మంచిదని
అందురు.
కాని,
అది
సాధ్యముకాదు.
ఇచ్ఛవుండి
ఆ
ఇచ్ఛలోఉన్న
యథార్థమును,
నిత్యత్వమును
తెలిసికొని,
ఏ
ఇచ్ఛయూ
లేకుండా
చేసికొనుటలో
మంచిగలదు.
ఏ
ఇచ్ఛయూలేని
వ్యక్తికంటె
ఏదో
ఒక
ఇచ్ఛయున్న
వ్యక్తి
శ్రేష్ఠము.
ఇట్టి
ఇచ్ఛ
ఉన్న
వ్యక్తికంటె,
ఇచ్ఛాశక్తి
ఉన్న
వ్యక్తి
మరింత
శ్రేష్ఠము.
ఇట్టి
ఇచ్ఛాశక్తిలో
మంచి
ఉన్న
తనకేకాక
లోకమునకు
కూడా
మంచి
చేకూరును.
అట్టి
ఇచ్ఛాశక్తిలో
చెడ్డదే
వున్న,
తనకు
లోకమునకు
(తోడివారలకు)
చెడ్డ
ఒన
కూడును.
కాన,
మంచి
విషయములను
ఇచ్ఛాశక్తితో
ప్రయత్నించిన
అది
8
▾
Meaning
Keep
భగవత్శాంతితో
చేర్పవచ్చును.
తానే
శాంతస్వరూపుడు
కాగలడు.
అట్లు
కాకున్న
లోకవాంఛలలో
ఇచ్ఛాశక్తిని
ప్రయత్నించిన,
తానేకాక
లోకమే
అశాంతితో
అలమటించును.
Previous
←
Prabodha 6
Next
Prabodha 8
→