Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśānti Vāhini · Prabodha 8
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
మానవుడు
వాసన,
సంకల్పముల
ముద్దగానున్నాడు.
ఈ
రెండింటి
మూలమున
వానియందున్న
దివ్యత్వమును,
శాంతిని
భస్మము
చేసుకొను
చున్నాడు.
ఇందులో
వాసనేకట్టెలు,
సంకల్పమే
అగ్ని.
అట్టి
దావాగ్ని
చల్లార్చవలెనన్న
వాసనలనబడు
కట్టెలు
కడకు
తీసివేసినా,
బలమునశించి
చల్లబడుచున్నది.
అట్టిదే
శాంతి
అనబడుచున్నది.
అట్టి
శాంతి
అను
సాగరమున
లోతుగా
మునిగిచూచిన
అమూల్యమైన
ఆత్మానందమను
ముత్యములు
అవలీలగా
చిక్కుచున్నవి.
ఆ
సదవకాశమును
పొందు
సమయముననే
మానవుడు
దివ్యతేజోవంతమైన
పవిత్రశాంతి
స్వరూపుడు
కాగలుగుచున్నాడు.
అందులకే
మానవుడు
శాంతిమూర్తిత్వమే
అని
వేదములు
కూడను
తెలిపినవి.
కాన
మానవుడు
అశాంతి
అసత్యస్వరూపుడని
తలంచక,
పవిత్రశాంతియే
అతని
స్వరూపమనియు,
ప్రేమయే
అతని
రక్తమనియు,
సంతోషమే
అతని
స్వభావమనియు
తలంచి
అట్టి
అనుభవమును,
అనుష్ఠానమూలమున
సాధించవలెను.
శాంతియేలేకున్న
సత్యమును
గాంచలేరు.
పుష్పములు
వికసించుటకు,
ఫలములు
కనబడుటకు
సూర్యరశ్మి
యెంత
అవసరమో,
మానవుని
హృదయ
పుష్పము
వికసించి
మనోఫలము
రసవంతమైనదిగా
కావలెనన్న
శాంతికిరణముల
రశ్మి
అంత
అవసరము.
అప్పుడే
సత్యమైన
నిత్యమైన,
అచలమైన,
ఆనందమైన
బ్రహ్మమును
పొందగలిగిన
వారగుదురు.
2
▾
Meaning
Keep
పరబ్రహ్మము
అంతులేని
అగాధమైన
సముద్రమువంటివాడు.
అందులోని
కెరటములే
చంచలమైన,
అస్థిరమైన,
అశాశ్వతమైన
శక్తి.
అట్టి
శక్తికి
కూడ
అచంచలమైన
సముద్రమే
మూలాధారము.
కెరటములు
సముద్రములోపుట్టి,
సముద్రముపై
ఎగిరి,
తిరిగి
సముద్రముపైనే
నడచి,
అందులోనే
లీనమగుచున్నవి.
అయితే
శక్తి
అస్థిరమై
చంచలమైయున్నను
బ్రహ్మము
నిత్యమై,
సత్యమై,
అచంచలరూపుడై
యున్నాడు.
కాని
లోకులు
సముద్రమన్న
అలలనే
ప్రధానముగా
గమనింతురు.
కాని,
దాని
స్థిరత్వమును
పాటించరు.
అట్లే
సాధకులు
అశాశ్వతమైన
శక్తి
సామర్థ్యములను
ప్రధానముగా
సూచింతురు
కాని,
నిత్యమై,
అచలమైన
పరబ్రహ్మ
తత్త్వమును
కనుగొన
లేకున్నారు.
సర్వేంద్రియములు,
సర్వవాసనలు,
శక్తివంత
మయినవిగా
పెరిగి
స్థిరమైన
ఆత్మసాగరమున
అలలవలె
ఆడుచూ,
ఎగురుచూ
అందులోనే
లీనమగుచున్నవి.
కాని
అవి
శాంతిని
ప్రసాదించుట
లేదు.
వాటి
నన్నింటిని
మరచి
స్థిరమైన
ఆత్మానంద
సాగరమను
పరబ్రహ్మను
చూచిన,
అప్పుడు
శాంతిని
సంపూర్ణముగా
అనుభవించిన
వాడగుచున్నాడు.
జలములో
ఏవైనా
జలజంతువులను
చూచితి
మనుకో!
అప్పుడు
ఆ
చేపలు
ఎంత
ఆనందముగా
సంచరించు
చుండునో
తెలియగలదు.
ఎందులకు
వాటికి
అంత
ఆనందము?
క్రింద,
మీద,
ఇరుప్రక్కలా
అంతేమి
సర్వత్రా
జలము
నిండియుండును.
వాటిని
విడిచి
ఒక
క్షణమైనను
ఒడ్డుకు
రానొల్లవు.
అట్లు
వచ్చిన,
తిరిగి
ఆ
నీటినిచేర
తల్లడిల్లి
ప్రాణములే
వదలును.
చూచితిరా!
అట్లే
మానవుడు
కూడను
సర్వత్రానిండిన
శాంతిలో
మునిగిన,
అందులోని
ఉల్లాసము,
ఆనందము
అన్నివిధములుగా
అనుభవించును.
అట్లు
అనుభవించినవాడు
ఆ
శాంతినుండి
ఒక
నిముషమైనను,
అశాంతిలోనికి
రానొల్లడు.
అట్లు
వచ్చినా
తిరిగి
నీటిని
చేరగోరు
చేప
తపించి
ప్రాణము
వదలినట్లు
తానును
శాంతిని
చేరకోరి
ఆ
చింతనయందే
ప్రాణము
విడుచును.
అట్టి
శాంతిని
అనుభవించినవారు
తిరిగి
అశాంతి
అను
గట్టుకు
రానేల?
3
▾
Meaning
Keep
ప్రాణములు
వదలనేల?
ఎల్లప్పుడు
శాంతిసాగరమందే
సంతోషించవచ్చునుకదా?
పైనవచ్చు
వాసనా
సంకల్పములను
అలలలో
తేలక,
అచలమైన
సాగర
అడుగుభాగమున
చేరిన
గట్టుకురాను
వీలుండెడిదికాదు.
అట్లే
శాంతిసాగర
అడుగుభాగమున
మునుగుటకు
ప్రయత్నించుడు.
ఇదియే
మీ
అత్యంత
అవసరమైన
ఆచరణ.
ఇట్టి
పరిశుద్ధమగు
శాంతిమాత్రమే
మానవుని
మానవునినుండి
వేరుపరచు
అన్ని
యడ్డంకులను
తొలగించును.
పవిత్ర
శాంతమే
సర్వవిధములగు
కారణరహితములగు,
అయిష్టములగు
వైషమ్యతలను,
అసహ్యతను,
మరియు
ద్వేషమును
రూపుమాపును.
శాంతి
ప్రేమలయొక్క
బలమగు
శక్తి,
తనయొక్క
అధికార
ప్రభావము
క్రిందకువచ్చు
ప్రాణులపై
అద్భుతమగు
శక్తిని
అమలుపరచును.
ఈ
పవిత్ర
ప్రేమశాంతులు
భగవంతుని
మానవుని
క్రిందను,
మానవుని
భగవంతుని
క్రిందను
మార్చగలవు.
వీటికి
మించినశక్తి
మరేసాధనకు
లేదు.
ఇదియే
సృష్టియొక్క
జీవతత్త్వము.
ఇదియే
ఆత్మశక్తియొక్క
అత్యున్నతమగు
వ్యక్తీకరణము.
ఇదియే
యావత్ప్రపంచమును
జయింపగల్గు
భక్తుని
చేతిలోని
మంత్రబెత్తము.
ఇవి
యింతియేకాక
అత్యధికమగు
తృప్తినిచ్చును.
అట్లని
ఊరక
తిని
కూర్చొనకూడదు.
భగవంతుడు
నాకు
సాయము
చేస్తాడుకదా
అని
సోమరి
అయి
తిని
నిద్రించకూడదు.
లేచి
పనిచేయవలెను.
తమకు
తాము
సాయము
చేసుకొను
వారికి
మాత్రమే
భగవంతుడు
సాయపడును.
ప్రహ్లాదుని
జీవితమునుండి
భగవంతుని,
కేవలము
భగవంతునిమాత్రమే
ప్రేమించు
పద్ధతి
నేర్చుకొనవలెను.
నీవు
చేయగలిగినంత
పని
యుత్తమముగ
నొనర్చుము.
మరియు
భగవంతునికి
మిగిలినది
వదలుము.
ఇదియే
ఇట్టి
ఉన్నతరూపమగు
సోపానము.
ప్రహ్లాదుని
పాదజాడల
ననుసరింపుడు.
భగవత్కృపవలన
సంతోషమైన
శాంతి
సుఖములను,
పరిపూర్ణతను
మరియు
అమరత్వమును
పొందగలరు.
ఎట్టివారలయినా
కాలము
భారము
కాకుండుటకు
కర్మ
నాచరించ
వలెను.
అది
పురుషార్థము.
అట్లు
కర్మ
నాచరించకుండిన
అజ్ఞానము
పెరిగి
తమోగుణము
4
▾
Meaning
Keep
మొలకెత్తును.
అజ్ఞానమువలన
సంశయములు
అధికమగును.
హృదయమందున్న
జ్ఞానమను
కత్తిచే
అజ్ఞానమును
నరికి
యోగస్థుడగుట
నరునకు
కర్తవ్యము.
ఇట్టి
రహస్యగర్భితములైన
విషయములు
ఒకానొక
సమయమున
అర్జునునకు
చెప్పగా,
అర్జునుడు
సంశయమనస్కుడై
"ఓ
కృష్ణా!
కర్మలను
సన్యసింపుమని
ఒకపరి
సెలవిస్తిరి.
మరల
కర్మ
యోగము
చెప్పుదురు.
ఈరెండింటిలో
ఏది
శ్రేష్ఠము.
దేనిని
అనుసరించిన
మంచిదో
నిర్ణయించి
దానినే
సెలవియ్యండి"
అని
అడిగెను.
అప్పుడు
కృష్ణుడు
ఈ
క్రిందిరీతిగా
తెలిపెను.
"అర్జునా!
సన్యాసము,
కర్మయోగము
రెండును
మోక్షమును
కలిగించునవే!
అయితే,
కర్మలను
సన్యసించుటకన్నను
కర్మలను
ఆచరించుటలోనే
ఆనందమున్నది.
సన్యాసము,
కర్మచేయుట
అనునవి
పరస్పర
విరుద్ధములు
కావు.
ఒకదానినొకటి
ఆశ్రయించియే
యుండును.
కర్మలు
మానుటవలన
జీవి
సంస్కారహీనమై
నశించును.
ఒకదానిని
ఆశించి
మరొకదానిని
ద్వేషింపకుండువాడే
నిత్యసన్యాసి.
కర్మలాచరించుచు
అందులోని
మంచిచెడ్డలను,
జయాపజయములను,
లాభనష్టములను
యోచించక
కేవలము
కర్మలాచరించుచు,
సర్వకర్మలు
భగవత్
సేవా
వినియోగమని
తలంచుదానిని
సన్యాసమందురు.
కేవలము
కర్మలాచరించక
కాషాయములు
దాల్చుట,
బోడి
కొట్టుట
సన్యాసము
కాదు.
కర్మలలోని
సుఖదుఃఖములు
మున్నగు
ద్వంద్వములను
దాటినవాడే
నిజముక్తుడు
కాగలడు.
కాన
కర్మలను
వదలుటకంటె
కర్మలాచరించుచు,
ఫలితమును
త్యజించుచు,
కర్మలో
ఆనందము
పొందుము.
అదియే
శ్రేష్ఠ"మని
తెలిపెను.
కాన,
కర్మలో
ఆనందమున్నది.
దాని
ఫలితము
ఆనందమే.
అంతకంటె
కావలసినదే
మున్నది!
ఈ
రెండింటిలో
దేనిని
సరిగా
అవలంబించినను,
రెండవదాని
ఫలమునుకూడ
అనుభవించవచ్చును.
కర్మయోగములేని
సన్యాసము
దుఃఖమే
యిచ్చును.
ఏ
కర్మలాచరించకున్నను
భగవత్
చింతన,
ధ్యానజపములైనా
ఆచరించవలెను
కదా?
అదియే
కర్మ.
అట్టి
కర్మసహితము
ఆచరించకున్నవానికి
సంతోషమే
లేదు.
ఏ
రీతిగానైనను,
5
▾
Meaning
Keep
ఎట్టివారైనను,
కర్మలాచరించే
తీరవలెను.
కర్మ
యోగమును
అవలంబించుచూ
ఫలాఫలముల
యోచించక
మౌనము
నవలంబించినవాడు
కొంతకాలమందే
బ్రహ్మమునందగలడు.
అట్టివానికర్మలు
తనకంటుకొన
కుండును.
కర్మను
శ్వాసమునకు
పోల్చుకొనవలెను.
శ్వాసములేక
జీవితము
ఎట్లు
నిలువజాలదో,
జీవితమునకు
శ్వాసమెట్లు
ముఖ్య
ధర్మమో
సాధకునకు
సత్కర్మలట్లు;
కర్మలందు
ఫలమును
అపేక్షించిననే
అశాంతి:
అందులో
ఫలమును
ఆశించక,
కర్మలందే
ఆనందమందుచుండిన
అదే
ప్రశాంతి.
ఏ
ఫలముకొరకు
శ్వాసమును
తీసుకొంటూ
విడుచుచున్నారు?
అట్లే
కర్మల
నాచరించుచు
ఫలమునుకాని
నిష్ఫలమునుకాని
యోచించకుండుటే
శాంతి.
మానవుని
హృదయమున
అనేకమైన
భావాలు
పరుగులెత్తు
చుండును.
అష్టదిశలా
తన
ఆలోచనలు
వ్యాపించుచుండును.
కొన్ని
పరస్పర
పోషకములైనను,
కొన్ని
వాటికి
విరుద్ధములగుచుండును.
కాని
ఈ
సర్వకర్మలు
ఏదో
ఒక
కార్యక్రమములో
ఉపయోగపెట్టవలెను.
అపుడే
అందులో
శాంతిని
పోషించుకొనవచ్చును.
ఈ
కుశలత
కేవలము
బాహ్యమైన
ఆధారములతోనే
జయమును
పొందలేదు.
ఒక
వ్యక్తి
చిత్తములోని
భావశక్తులు
ఊహాశక్తులు,
అందులోని
స్వరూపములు
వేరొకరు
పూర్తిగా
అవగాహన
చేసుకొనలేరు.
అది
సాధ్యముకాదు.
ఎవరికివారు
తన
ఆత్మను
చక్కగ
విమర్శించుకొని
ఒక
నిర్దిష్టమార్గాన్ని
ఏర్పాటుచేసుకొనే
పద్ధతి
చేపట్టుకొనడం
జీవితవికాసానికి
అత్యంత
ఆవశ్యకము.
అట్టి
తన
హృదయాన్ని
తాను
తెలిసికొనుస్థితికి
రానంతవరకూ,
అనుభవజ్ఞానుల
చెంతకానీ,
వాటికి
ఆధారభూతులైనవారి
సాంగత్యముకానీ
ఆశ్రయించి
వారి
అనుభవాలను,
మార్గదర్శకత్వాన్ని
జీర్ణము
చేసికొనవలెను.
తనబుద్ధి
ఒక
మార్గాన్ని
నిశ్చితం
చేసుకోలేనంతవరకు
వాని
ఆచార
వ్యవహారములు
గాలిలో
మేడలుకట్టుట,
అందులోనే
ఎగిరి
దుముకు
చుండును.
అంతియేకాదు,
అప్పుడప్పుడు
తన
అవయవములుకూడా
విరుద్ధమైన
మార్గములలో
ఒక
నిర్ణయానికి
రాకుండా
విధిగా
జరుగు
చుండును.
అప్పటికి
అదే
తెలివిగల
కార్యమనిపించుకొంటుంది.
ఇలాంటి
6
▾
Meaning
Keep
విధిలేని
పరిస్థితులలో
కాని,
ఆపద్ధర్మాలలో
కానీ
వ్యక్తి
తన
నిర్ణయాన్ని
అనుకూలమైన
వాతావరణానికి
ఎప్పటికప్పుడే
మార్చుకొంటూ
ఉండవలెను.
అదియే
నిజవివేకము.
అదియే
నిజశాంతి.
ఇట్టి
లక్ష్యాన్ని
సాధించడానికి
యత్నం
జరుగుచున్నప్పటికీ
స్వయంసిద్ధంగా
ఆలోచించే
శక్తి
ప్రతి
మానవునిలోను
పెంపొందాలి.
దీనివిషయంలో
ఎలాంటి
తిరస్కారభావము
ఉండరాదు.
చేర్చరాదు.
స్వానుభవము
ఏర్పడునంతవరకు
సందేహములు
నివారింపబడవు.
సందేహములు
తీరునంతవరకు
జ్ఞానశాంతి
ఉదయించదు.
సర్వకర్మల
పర్యవసానము
జ్ఞానమే
కావలెను.
అది
అయ్యేతీరాలి.
వివేకంతో
పనులు
జరుపుకోవటంలోనే
వ్యక్తి
యొక్క
వికాసము
దాగియున్నది.
చూడు:
ఒక్క
చిన్న
విషయము
యోచించుడు.
భగవత్
అనుగ్రహములతో
సర్వసౌకర్యములు
కలిగియుండిననూ
(తన
ప్రయాణానికి
తగిన
సదుపాయములు,
కార్లుకానీ,
విమానముకానీ,
బండ్లుకానీ
ఏవి
ఉన్నప్పటికీ)
తన
ఆరోగ్యము
కోసమైనా
తాను
కాలినడక
సాగించ
వలసినదే.
అట్లే
ఎట్టివాడైనప్పటికీ,
ఏ
సాధన
చేయుచున్నప్పటికి
తన
మనోబుద్ధులయొక్క
సంశయములు
తీరి,
మానసిక
ఆరోగ్యము
కొరకు
స్వానుభవమును
తన
సాధన
ద్వారా
పొందియే
తీరవలెను.
లేకున్న
అతని
మనోదౌర్బల్యము
చక్కపడదు.
దానికి
అనుభవజ్ఞానుల
దగ్గరచేరి,
ఆధారపురుషుల
సాంగత్యమును
ఆశ్రయించి
వారల
మూలమున
యథార్థమును
తెలుసుకొని
అట్టి
యథార్థ
సాధనకై
పాటుపడి
తానుకూడను
అనుభవించిననే
శాంతి
ఏర్పడును.
ఈ
సృష్టియందంతయు
జ్ఞానము
అజ్ఞానముచే
నావరింపబడి
యుండెను.
ఈ
స్థితి
ఏనాటికి
కూడను
తప్పదు.
దీపము
వెలుగుచున్నంతసేపు
క్రీనీడకు
తావున్నట్లు
మోహమను
భ్రాంతి
వెలుగుచున్నంత
కాలము
అజ్ఞానము
తప్పనిది.
ఆత్మచుట్టునూగల
అజ్ఞానమును
జ్ఞానముచే
ఎవరు
నశింపచేసికొందురో
వారికి
సూర్యోదయమువలె
శాంతి
ప్రకాశించును.
పై
కారణ
కార్యములకునూ
కొంత
సదవకాశమును
కల్పించవలెను.
పరిసర
విషయములనుబట్టి
మనస్సు
మంచినిగాని,
చెడ్డనుకాని
పొందుచుండును.
అందుచే
'మానవునకు
కావలసిన
7
▾
Meaning
Keep
వాతావరణమును
వీలైనంతవరకు
సృష్టించుకొనవలెను.
నేటి
సంస్కర్తలు
మానవుల
గుణములను
మార్పుచేయుటకు
ప్రయత్నించుటలేదు.
కేవలము
ఆర్థికముగాను,
బాహ్యముగాను
అందరూ
సమానముగా
ఉండుటకు
ప్రయత్నించుచున్నారు.
పై
రెండింటియందు
సమానస్థితిని
తీసుకొనిరావలెనన్న
గుణసమానత
ఏర్పడినప్పుడే
అది
సాధ్యమగును.
లేకున్న
వీలే
లేదు.
గుణములు
కొంతవరకైనా
సమతను
పొందనిచో
బలవంతముగా
ఆర్థికముగ
సమానముగా
విభజించినను
శాశ్వతముగా
అట్లే
ఆ
ఆర్థిక
సమాన
వ్యవస్థ
నిలువదు.
కాన
స్థిరముగా
సర్వులు
సమాన
శాంతి
సంతోషములు
అనుభవించవలెనన్న
యథార్థమైన
ఆత్మజ్ఞానమును
తెలిపిన
గుణములు
మార్పుకు
రాగలవు.
గుణమార్పుల
వల్లనే
శాంతి
ఏర్పడును;
కనుక
గుణపరిణామమునకై
కృషి
సల్పుచూ,
దానికి
తోడుగా
ఆర్థిక
బాహ్యమునుకూడా
ఇచ్ఛాపూర్వకముగా
విభజించ
వచ్చును.
ఇప్పుడు
మానవులకు
శాంతి
సంతోషములు
తెలిసికొను
విధానమును
మొదట
నేర్పవలెను.
కేవలము
బాహ్య
దృశ్యకల్పితములపై
తర్కించుచు
యోచించుచు
ప్రవర్తించుచుండిన
ప్రయోజనములేదు.
ఆత్మస్వరూప
లక్షణములను
తెలిసికొనవలెను,
మొదట
తాను
అనునది
ఎవరో
గుర్తించిన
ఈ
సమస్యలు
నిమిషములో
తేలిపోవును.
సర్వవస్తువులు
ప్రకాశించుటకు
ఆత్మయే
కారణమనియు,
ఆత్మ
అన్న
ఏమి
అనునదియు
అనుభవమునకు
తేవలెను.
దేహభ్రమను
మరుగుపరచవలెను.
అది
వట్టి
జడమే.
దృశ్యముగాను
కారణములుగాను
కల్గినది,
అనేకత్వమును
కల్గినది
ఆత్మ
కానేరదు.
ఏకత్వమే
ఆత్మస్వరూపము.
దానిని
మొదట
ప్రతిసాధకుడు
ప్రతిమానవుడు
తెలిసికొనునపుడే
సమానభావము,
సమానశాంతి
సంతోషప్రాప్తి
పొందగలడు.
కాన,
దృశ్యకల్పితములైన
వాటిని
విడిచి
తత్త్వమును
యోచించుడు.
యథార్థము
విశదమగును.
Previous
←
Prabodha 7
Next
Prabodha 9
→