Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśānti Vāhini · Prabodha 9
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
వస్తువులను
తెలియజేయుట
ప్రకాశమునకు
స్వభావము.
అట్టి
ప్రకాశస్వభావము
ఒక
ఆత్మకు
కలదు.
సూర్యుడు,
అగ్ని,
ఇతర
వస్తువులను
తెలుపుచున్నవే
కాని
రాత్రులందు
ప్రసరించునట్టి
అంధకారమును
అవి
తెలుపలేకున్నవి.
వాటి
ప్రకాశమునకున్ను
అంధకారమునకున్ను
వైరుధ్య
ముండుటయే
దానికి
కారణము.
అయితే,
ఆత్మ
ప్రకాశమునకు
అట్టి
విరోధము
లేదు.
అది
సర్వ
పదార్థమునకు,
సర్వరూపమునకు
అనుకూలమైనది.
అది
అన్నింటినీ
ప్రకాశింపచేయును.
కనుకనే
ఆత్మస్వరూపము.
"తం
దేవా
జ్యోతిషాం
జ్యోతిః"
ఆ
పరమాత్మను
జ్యోతిస్సులకు
జ్యోతిస్సగు
వాడని
దేవతలు
స్తుతి
చేయుచుందురు.
జ్ఞానత్వమే
దీని
ఆకారము;
దేహము
అటువంటిదికాదు.
ప్రతి
దేహమును
పరస్పరము
ఆకారము
నందు
మారుచుండును
ఆత్మ
అట్లు
కాక
సర్వత్రసమానమై
ప్రకాశించుట
చేతను.
ఆనందస్వరూపుడగుటచేతను,
చైతన్యస్వరూపుడగుటచేతను,
బ్రహ్మమే
అగుచున్నది.
ఇట్టి
నిశ్చయమే
జ్ఞానమని
చెప్పబడును.
చూడు!
ఘటమును
చూచువాడు
తానే
ఘటమని
తలంచడు
కదా?
అదేవిధముగా,
"నా
యొక్క
శరీర"మని
మమకారముతో
తనచేత
చూడబడుచున్న
శరీరమునుమాత్రము
తానని
ఎట్లు
భావించనగును?
అయితే
అట్లు
భావించుచున్నారు;
అదియే
మమకారము,
అజ్ఞానము.
ఆత్మ
స్వరూపమైన
2
▾
Meaning
Keep
జ్ఞానము
నాశరహితము.
దేహసంబంధము
నేర్పరచు
అజ్ఞానము
నాశసహితము!
ఆత్మ
ఆకారశూన్యము.
అందుకనే
తనను
తాపత్రయములు
బాధించుటలేదు.
బాధించవు.
సదైకరూపమయి
ఎల్లప్పుడు
ఏకాకారము
గలవాడు
షడ్భావవికారములు
లేనివాడుగా
ఉంటున్నాడు.
అతిధీభూతమైన
శరీరము
కాకయున్నాడు.
దేహమునకు
అనేకములైన
వాత,
పిత్త,
శ్లేష్మాదులనే
రోగములు
వచ్చుచూ,
కృశించుచూ,
బలపడుచూ
ఉండుట
జరుగుచుండును.
ఆత్మకు
అట్టి
మార్పులుకాని,
అట్టి
అలజడికాని
చేరలేవు.
సంకల్పరహితుడు
ఆత్మ
స్వరూపుడు.
ఇంతియేకాక,
త్రిగుణములకు
అతీతుడు.
దానివలననే
క్రియాశూన్యుడగుచున్నాడు.
"ప్రకృతిః=కర్త్రీ
పురుషవస్తు
పుష్కరపలాశవన్నిర్లేపః"
గుణమయమైన
ప్రకృతియే
సర్వక్రియలను
చేయుచుండును;
ఆత్మస్వరూపము
జలమందలి
తామరమువలె
నిర్లేపమై
యుండగలదు.
ఆత్మస్వరూపము
"అహం"
శబ్దముతో
బోధింపబడుచున్నది;
అద్వితీయమై
ఒప్పుచున్నది.
శరీరము
దృశ్యముగాను,
నాశముగాను
ఉన్నది.
అది
ఆత్మ
ఏనాటికీ
కానేరదు.
దేహము
కర్మయగుచున్నది.
నాయొక్క
దేహమని
ప్రతివాడును
నిర్దేశించుచున్నాడు.
ఇట్టివారలకు
శాంతి
సౌఖ్యములెట్లు
ఏర్పడును?
శాంతిని
అనుభవించవలెనన్న
పై
యథార్థమును
అనుభవమునకు
తీసుకొనిరావలెను.
సకలదృశ్యములకన్న
వేరుగా
ఆత్మను
సాక్షాత్కరించుటయగు
వివేకము
ప్రకృతిబంధమునుండి
విముక్తమై
అవిద్యావిరోధియై
తన్నాశనము
గావించుచున్నది.
కాన,
వివేకఖ్యాతి
అవిద్యానాశనమునకు
హేతువు.
యమనియమాది
అష్టాంగముల
బాగుగా
ననుష్ఠించిన
అవిద్యారూపములచే
కలుగు
మాలిన్యము
నశించుచుండును.
బుద్ధిశుద్ధమై
వికాసవంతమై
ఆత్మను
విషయీకరించుచున్నది.
పామరులు
యథార్థమైన
ఆత్మతత్త్వమును
తెలిసికొనలేక
విషయసుఖములందే
సుఖమున్నదని
భ్రమపడుచున్నారు.
దీనిని
నిజముగా
విచారించిన
అంతా
3
▾
Meaning
Keep
ఆత్మానందమయమే.
వేరుకాదు!
అంతయు
ఆనంద
మయము;
అమృతమయము;
ఇట్లుండగా
పరిపూర్ణ
చంద్రుని
ప్రత్యక్షముగా
గాంచుచు,
దానిచే
అనంతానందామృతమును
బడయుచు
చిత్రమందు
నానారంగులచే
వ్రాయబడిన
కాంతివిహీనమైన
చైతన్య
రహితమైన
చంద్రబింబమునుచూచి
ఆనందించు
వాడెవడైనా
కలడా?
దాని
వైపయినా
చూచునా?
చెలగి
మధువుగ్రోల
చేదు
రుచించునా?
అన్నట్లు,
అట్లే
యథార్థముగా
స్వాత్మజ్ఞానామృతమును
బడసిన
ఆనందమును
అనుభవించు
సాధకుడు
విషయసుఖముల
రుచికోరునా?
చిత్రములోని
చంద్రబింబము
కాంచి
సంతోషించువాడు
చంద్రుడన
నెట్టివాడో,
అతనిచే
ఏమి
కలుగునో
అను
విషయమునుకూడా
తెలియనివాడే
అగును.
అలాగుననే
స్వాత్మ
స్వరూపమును
తెలిసికొనక
ప్రకృతి
వ్యామోహిత
మూఢమానవుడు
త్రిగుణములచే
కల్పితమై
నానావిధములుగా
చిత్రముగా
కనిపించుచున్న
అసత్య
జగత్తునుచూచి
ఆమోదించుచున్నాడు.
యథార్థమును
తెలిసి
విజ్ఞాని
సర్వదృశ్యమును
విడనాడి,
స్వాత్మయందే
విహరించుచు
పరమశాంతిని
పొందుచున్నాడు.
కనుక
దృశ్యమును
ఏనాటికీ
స్థిరమనికాని,
అదే
నిజమనికాని
తలంచరాదు.
అఖండ
బ్రహ్మానందామృతపాయిగాక
మరియెవరును,
దేనిచేతను
ఆనంద
సుఖాంబుధిని
నోలలాడ
వీలులేదు.
సారభూత
పరబ్రహ్మానుభవము
చేతనే
మానవుడుగా
తలంచువాడు
సంతృప్తిపడుచున్నాడు.
సంసార
దుఃఖతాప
శాంతిని
పొందుచున్నాడు.
అసత్తగు
వర్తమానకాల
మందును,
కించిత్తుగా
భాసించు
అనాత్మస్వరూపులైన
దృశ్య
పదార్థములచేతను
మనుజుడెన్నటికిని
తృప్తినొందడు,
నొందలేడు.
అనాత్మ
విషయములచే
ఏనాటికీ
ఎప్పటికీ
ప్రయోజనము
సిద్ధించదు;
శాంతిని
పొందలేడు;
దుఃఖము
నివర్తియై
ఆనందప్రాప్తి
గలుగదు.
కావున
విషయములచే
కించిత్
ప్రయోజనము
కాని,
ఆనందప్రాప్తికాని,
శాంతి
అనువాసనకాని
అనుభవించలేడు.
అసత్
పదార్థము
లనగా
కల్పితపదార్థములు;
శుక్తిరజితము,
ఎండమావులు
మొదలైనవి.
ముత్తెపుచిప్పను
వెండియని
భ్రమించినంత
మాత్రమున
వెండి
నగలగునా?
4
▾
Meaning
Keep
ఎండమావులు
జలమని
భ్రమించినంతమాత్రమున
దాహము
తీరునా?
అలాగే
అనాత్మరూప
అవిద్యాజన్య
విషయవస్తువుల
ఆధారముగా
జేసుకొన్న
సుఖమురాదు.
అట్టి
చిత్రపదార్థములతో
ఆకలిగాని,
కాంక్షగాని,
దాహముగాని
తీరదు.
సత్యమయిన
పదార్థములు
పొందినపుడే
దాహముకాని,
ఆకలికాని,
కాంక్షకాని
తీరును.
ఆవిధముగనే
సంసారదుఃఖనివృత్తి
బ్రహ్మప్రాప్తిచేతనే
పొందబడును.
కేవలము
సంకల్పముచేతకాని,
పఠనముచేతకాని,
ప్రచారముచేతగాని
నిజశాంతిని
పొందలేడు.
వాటిని
ఏకొంతమాత్రమైన
అదేరీతిగా
అనుభవించవలెను.
తలంచినంత
మాత్రమున
అమెరికా,
లండను
దృశ్యములు
భావరీతిగా
చిత్రించు
కొనవచ్చునుకాని
వాటిని
ఆ
నిమిషమున
అనుభవించుచున్నాడా?
లేదు.
కల్పితమువలన
ప్రయోజనములేదు.
మనోవాక్కాయములతో
అనుభవించవలెను.
అప్పుడే
యథార్థశాంతిని
పొందగలడు.
కాన
కేవలము
బ్రహ్మనుగాని,
శాంతినిగాని,
సత్యమునుగాని,
సాక్షాత్కారమును
గాని
తలంచినంతమాత్రమున
జాలదు.
అందులోనా
ఆనందమున్నది?
దానిని
అనుభవించుటకు
దీక్షబూని
దానికి
తగిన
కృషి
సల్పవలెను.
అప్పుడు
భగవత్
అనుగ్రహముపొంది,
బ్రహ్మప్రాప్తికి
అర్హుడయి,
నిజానందమును
పొందగలడు.
పై
విషయమునే
వివేక
చూడామణి
కూడా
అనేకవిధముల
బోధించినది.
ఆ
బోధనా
పద్ధతిని
దారితప్పక
సాధనసల్పువాడు
దాని
సారమైన
ఆనందామృతమును
అనుభవించగలడు.
అట్టి
ఆనందమును
అనుభవించుటే
జీవితలక్ష్యము,
ఇంద్రియాది
విషయ
దుఃఖములు
లేనివాడై
సంకల్పరహితుడై
బ్రహ్మానందామృతమును
గ్రోలుచూ,
పరిపూర్ణభావముతో
స్వస్వరూప
సత్తామాత్ర
బ్రహ్మమై
ఆనందించవలెను.
ఇట్టి
అర్హత
ఒక్క
మానవులకు
మాత్రమే
ఉన్నది.
అంతటి
శక్తి,
సామర్థ్యములు
కలిగిన
మానవుడు
మాయామోహమునకు
బద్ధుడై
యథార్థఅమృతము
మరచి,
అనృతమైన
ప్రకృతికల్పనానందమును
కోరుట
ఎంతటి
దౌర్బల్యము!
చిన్న
పిల్లలు
ఒక్కొక్క
5
▾
Meaning
Keep
సమయమున
గుఱ్ఱములు,
ఏనుగులు
అనికూడా
ఆడుకొందురు.
బొమ్మలు
పెట్టినంత
మాత్రమున
అవి
గజతురగాదులు
కావుకదా?
ఆ
క్రీడనముకూడా
యథార్థము
కాదు.
అలాగుననే
అజ్ఞాన,
అమాయకజీవులు
కల్పిత
మాయా
ప్రపంచముతో
వ్యవహరించుచున్నారు.
అనేకములైన
సుఖదుఃఖములను,
లాభనష్టములను
పొందుచున్నారు.
అంతమాత్రమున
మాయాజగత్తు
యథార్థము
కాదు.
స్వప్నావస్థలోని
సుఖదుఃఖములు,
పాపభీతులు
ఎంతమాత్రము
యథార్థము
లగుచున్నవో
ఇవియూ
అంతనే.
తద్వ్యవహారముకూడా
కల్పితమే.
ఈ
రహస్యమును
తెలిసికొనినవాడు
నిరంతరము
స్వాత్మస్వరూపమందే
రమించుచూ,
నిత్యానందమును
పొందుచున్నాడు.
కాన
సాధకులారా!
ఆత్మస్వరూపులారా!
మీ
నిజస్వరూపమేదియో,
నిజతత్త్వమేదియో
యోచించి,
ఆత్మ
నేనేనను
యథార్థమును
పొంది,
స్వాత్మయందే
క్రీడించుచూ,
స్వాత్మరూపుడవై
అఖండ
నిరతిశయ
పరిపూర్ణ
స్వాత్మానందమును
అనుభవించుచూ,
కాలమును
కాలస్వరూపునిలో
కలియజేయుము.
అదియే
జీవియొక్క
కర్తవ్యకర్మ.
వివేక
చూడామణియందు
తెలిపినట్లు
:
శ్లో
॥
జ్ఞానరక్షాం
సమాదృత్య
జ్ఞానీ
సుదృఢవాన్భవేత్
।
సఏవ
నిరతం
స్వస్మిన్
స్వానంద
మనుభుంజతే
॥
జ్ఞానరక్షాముద్రను
హస్తమందు
ధరించినవాడు
విషయవాసనలను
గ్రహములచే
పట్టుబడక,
విహరింపగలడు.
అతడే
దృఢజ్ఞాని
అని.
జ్ఞానము
కలిగినదికదా
అని
ఇంద్రియములతో
విహరించకూడదు.
ప్రకృతిని
జారనీయకుండా
సర్వదా
స్వరూపానుభూతిని
విడువకుండ
వలెను.
అదియే
పరిపూర్ణజ్ఞాని
లక్షణము.
సదా
స్వస్వరూప
పరబ్రహ్మస్థితిలో
నుండుచు,
పరమశాంతిని
పొంది
మౌనముగా
నుండిన,
పరిపూర్ణ
విజ్ఞాన
స్వరూపము,
స్వయం
ప్రబోధరూపము
కన్నులెదుట
నిలిచి
దృశ్యకల్పితమును
మరుగు
పరుచును.
అట్లుకాక
అట్టి
అఖండ
పరిపూర్ణ
బ్రహ్మమందు
దృశ్యములను,
6
▾
Meaning
Keep
సంశయములను
కల్పించుట
నిరూపమయిన
గగనమందు
నగరకల్పనవలె
నున్నది.
ఆకాశమే
నిరూపమయియున్నది
అయితే
దానియందు
మేడలు
కట్ట
సాధ్యమా?
ఇవి
అన్నియు
అసత్య
అసంభవములై
యున్నవి.
అలాగున
రూపరహిత
పరబ్రహ్మమందు
దృశ్యకల్పన
అసత్యము.
అంతయు
అద్వితీయానందమయ
పరబ్రహ్మ
స్వరూపముతో
తనయొక్క
చైతన్యమే
వ్యాపించియున్నది.
సర్వదా
సకల
చిత్తవృత్తి
నిరోధముచే
కలిగిన
పరమశాంతిని
పొంది
దృశ్యప్రపంచస్ఫురణను
దూరీకరించి,
కేవల
సత్తామాత్ర
పరబ్రహ్మమై
మౌనముచే
అనగా,
సకలేంద్రియాతీత
స్థితిని
పొందవచ్చును.
అదే
నిజసాక్షాత్కారము.
అదియే
జీవితగమ్యము.
"మౌనం
భజస్వ"
మౌనమనగా
సకలేంద్రియ
వ్యాపారోపకరణమును
పొంది,
కేవల
స్వరూప
స్థితిలో
నిరంతరముండుట
అని.
నిరంతరానందము
శాశ్వతశాంతి.
దేనినుండి
మనస్సుతోగూడ
వాక్కులు
నివర్తింప
బడుచున్నవో,
ఏది
మనోవాచా
అగోచరమైయున్నదో
అట్టి
సకలేంద్రియ
నివృత్తిరూప
పరబ్రహ్మత్వమే
మౌనమనబడును.
ఇది
వాక్కుల
కందకుండుటచే,
అది
ఇట్టిదనికానీ,
దానిస్థితి
ఇట్టిదనికాని
తెలుప
సాధ్యముకాదు.
ఇది
అనుభవమునకే
చేరును,
తెలియును.
మౌనమనగా
సకలాతీత
పరబ్రహ్మ
స్వరూపమని
అర్థము.
అట్టివారు
పరమశాంతితో,
పరమానందముతో
ఉందురు.
అట్టి
సమయమున
బుద్ధి
వృత్తులను
విలయమొనరించి
బుద్ధిని
బ్రహ్మయందు
వసమించిన,
పరబ్రహ్మ
మయముగా
జేయుటనగును.
సకల
దృశ్యమును
దూరీకరించి
యుదాసీనభావముతో
నుండవలెను.
అట్టివాడే
ప్రకృతిని
దాటిన
మహానుభావుడు
కాగలడు.
అతడు
అనాత్మభావనలకు,
సందేహ
విపర్యయ
భ్రాంతులకు
హేతుభూతమగు
బుద్ధియొక్క
యుపశాంతియూ,
విశ్రాంతియూ
పొందుచున్నాడు.
సకల
మూలకారణమైన
బుద్ధి
ప్రకృతి
మాలిన్యరహితమై
కేవల
ప్రజ్ఞామయమై
భాసించుచుండును.
7
▾
Meaning
Keep
ఎంతవరకు
బుద్ధి
విచేష్టితమగుచున్నదో
అంతవరకు,
దృశ్యము
నానారూపమై,
ప్రతీయమాన
మగుచుండును.
అప్పుడే
పరమశాంతి,
తేజోమయము,
అఖండ
పరిపూర్ణానందము
కలుగును.
ఈ
స్థితినే
నిర్వికల్ప
మౌనమందురు
కూడను.
కాని
సాధకులైనవారు,
సకల
దృశ్యములను
దూరీకరింప
సర్వాత్మభావముతో,
పరమశాంతితో,
నిర్వృత్తి
స్థితితో,
ఆనందముతో
స్వస్వరూపమందే
నిల్చునట్లు
సాధింతురుగాక!
ఇదియే
ఉదాసీనభావము.
పరిపూర్ణ
జ్ఞానము
కలిగిన
తరువాత
కర్తవ్యమిదియే.
మరేమియూ
ఉండదు.
ఉండునదేది?
అంతా
తానుగానే
కాగలడు.
పరమ
పవిత్రజీవులు
తత్త్వజ్ఞులు
అయిన
శ్రీ
శుక
సనకసనందాదులును
ఈ
పరమ
మౌనముతోనే
విహరించిరి.
శాశ్వతపదవి
నొందినవారు
విచారింపదగినది
లేనందుచే,
ఆత్మ
నిర్వికార
మగుటచే
నిరామయస్థితియందే
ఉందురు.
ఇదియే
పవిత్ర
మౌనము.
ఇట్టి
మహతత్త్వమును
సాధించవలెనన్న
పరమశాంతే
ప్రధాన
ఆధారము.
ఇట్టి
వివేకమును
పొందినవారు
ఏ
వ్యక్తికాని,
ఏ
సంఘముకాని,
ఎవరేమి
చెప్పినను,
పరిశుద్ధమైన
తమ
విశ్వాసమును
విసర్జించి
బ్రతుకలేరు;
విసర్జించరు.
సృష్టియందు
మానవునకున్న
ప్రత్యేక
స్థానమే
వివేకము.
ఇట్టి
వివేకమార్గమున
కర్మ
నాచరించవలెను.
కాని,
వీటికి
ఇరువురు
విరోధులు
అడ్డగించుటకు
ప్రయత్నింతురు.
ఆ
విరోధులే
అజ్ఞులగు
సోమరులును,
సాంఖ్యాచార్యులును.
అయితే
మొదటివారు
కర్మేంద్రియములతో
విషయములను
గ్రహింపకుండినను
మనస్సు
నుండి
త్యజింపజాలకున్నారు.
కాన,
అట్టివారి
కర్మత్యాగ
ప్రయత్నము
మిథ్య.
ఇక
రెండవవాడైన
సాంఖ్యాచార్యుల
ప్రధానయుక్తి,
కర్మము
పుణ్యజనకమైనట్లు
పాపదాయకముకూడా
త్యజింపనగును.
ఈ
యుక్తినే
గీతయందు
కృష్ణుడు
కర్మమునందలి
దోషాంశమును
త్యజించి
గుణాంశమునే
స్వీకరింపవలసినదిగా
నుడివి
ఖండించినారు.
సాంఖ్యాచార్యుల
ద్వితీయయుక్తి,
కర్మను
ఆచరించినయెడల
ఇష్ట
అయిష్ట
మిశ్రమఫలములలో
నొక్కటి
యనివార్యమగును.
స్వర్గమునో,
నరకమునో,
లేక
మనుష్య
లోకమునో
పొందవలసియుండును.
ఇవి
ముక్తికారణములు
కావు;
బంధకారణములు.
8
▾
Meaning
Keep
కాన
కర్మను
ఫలాసక్తితో
ఆచరించుటవలననే
బంధము.
ఫలాసక్తి
లేనియెడల
కర్మము
మోక్షప్రదమగును.
అట్లుకాక
ముక్తపురుషుడే
అయినప్పటికినీ;
తనకెట్టి
ప్రయోజనము
లేకుండినను,
లోకసంగ్రహార్థము
కర్మను
ఆచరించును.
వారే
కర్మను
ఆచరింపకుండినయెడల
వారినిచూచి
అజ్ఞులు
చెడిపోవుదురు.
కనుక
ముముక్షువులైనను
కానిమ్ము,
ముక్త
పురుషుడే
కానిమ్ము,
కర్మను
త్యజించకూడదు.
అదియే
శాంతి
భద్రత.
Previous
←
Prabodha 8
Next
Prabodha 10
→