Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśānti Vāhini · Prabodha 10
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
లోకమున
సమస్త
పదార్థములకంటెను,
మధురమైనదియును,
సమస్త
మంగళ
వస్తువులకంటెను
మంగళకరమైనదియును,
సమస్త
పవిత్ర
పదార్థముల
కంటె
పవిత్రమైనదియును
ఏదైన
యున్నచో
అది
కేవలము
హరినామము
లేక
హరి
మాత్రమే.
ప్రాపంచిక
చిత్తులగు
నసుర
గుణముల
సహవాసమును
త్యజింపుము.
సమస్త
దుష్కార్యములనుండి
దూరముగా
తొలగుడు.
సత్సంగమును
(జ్ఞానుల
సహవాసమును)
కలియుడు.
నారాయణునియందు
శరణమన్వేషింపుడు.
ఆ
పరమ
పవిత్రుడే
శాంతి,
సౌఖ్యము,
జ్ఞానములయొక్క
మూర్తీ
భావము.
అట్టి
శ్రీహరి
అందరియందు
ఆసీనుడై
యున్నాడు.
ఏప్రదేశమున
తన
భక్తులు
భక్తితో
హరినామమును
నిరతమును
గాన
మొనర్తురో
అచట
పరమాత్ముడు
నిరంతరము
వసించుచున్నాడు.
మొదట
మీరు
అట్టి
పరమాత్మునిపై
భక్తి
నభ్యసించవలెను.
అప్పుడే
మీరు
వాస్తవిక
శాశ్వత
సౌఖ్యము,
జ్ఞానముల
నొందగలరు.
క్షణికమైన
ఇంద్రియసంబంధమగు
సుఖములవెంట
బరుగిడుటచే
ఏమి
ప్రయోజనము?
మీ
మీ
హృదయ
గుహలలో
వసించునట్టియు
హితుడు
మీ
తండ్రి,
తల్లి,
గురువును
నైనట్టి
శ్రీహరిని
ఆరాధించుటలో
నెట్టి
కష్టమును
లేదు.
దేనికొరకు
సమస్త
సుఖ
శుభముల
నాశింతువో
అట్టి
ఆ
మురికి
భౌతిక
దేహము
నాశము
గలది.
అది
వట్టి
నక్కలకు,
కుక్కలకు
ఆహారమైనది.
శ్రీహరి
అట్లుకాక
పవిత్రప్రేమతో
సంతోషింపబడును.
మీ
హృదయములు
ఆయనకిండు.
ఆయన
2
▾
Meaning
Keep
దేనినీ
మీ
నుండి
కోరడు.
శ్రీహరి
అమిత
పాండిత్యముచేకాని,
ఆడంబర
వ్రతములచేకాని
పొందబడడు.
మానవుని
జీవితము
సగము
నిద్రతో
వృథా
అగుచున్నది.
మిగిలిన
కొంత
వాంఛలు;
మిగిలిన
ఎక్కువభాగము
ముసలితనము;
బాల్యములో
అజ్ఞానము,
బాధలు,
కష్టములు,
రోగములు
మున్నగువాటిలో
వినియోగింపబడును.
చాలా
కొద్దికాలము
మాత్రము
నీ
వశములో
యుండినపుడు
ఇంద్రియసంబంధ
సౌఖ్యములవెంట
నీవేల
పరుగిడుదువు?
కనీసమీ
అల్పకాలమైనను,
భగవంతుని
స్మరించుటలోను,
ఆ
పరమాత్మునిపాదపద్మములయెడ
భక్తిని
పెంపొందించుటలోను
గడిపి
చెడుగులతో
కూడియున్న
నీ
జనన,
మరణ
సముద్రమును
దాటుము.
కాన,
సర్వవేళల
హరినామమునెడ
హృదయపూర్వక
భక్తి,
ప్రేమల
నభ్యసింపుడు.
పాపములయొక్క
పర్వతములకు
పిడుగు
వంటిదియును,
ప్రాపంచకపు
టునికి
యనెడి
రోగమునకు
తప్పనిదైన
నివారణౌషధమును
అగు
శ్రీహరినామము
సర్వవిధముల
శాంతిని
ప్రసాదించును.
భ్రాంతి
అనెడి
మిక్కిలి
స్థూలమగు
రాత్రియొక్క
చీకటిని
చెల్లాచెదరొనర్చునట్టి
సూర్యోదయమువలె
శ్రీహరి
నామము
ధన్యమైనది,
ప్రకాశమైనది.
అట్టి
పవిత్ర
ప్రకాశవంతమైన
నామమును
ఒక
నిమిషము
కూడా
వృథాపుచ్చకుము.
చూడుడు!
ప్రహ్లాదునియొక్క
ఈ
మధుర
వాక్కులు
అసురులు
విననప్పటికి,
ప్రహ్లాదునిచే
ఇయ్యబడిన
స్వర్ణమయ
సలహాలు
వారివారి
హృదయముల
అమితముగా
నాటబడినవి.
కడకు,
ఆ
అసుర
బాలురందరు
గొడ్డండ్లు
వహించి
శ్రీహరి
బానిసలైరి.
తమ
సమస్త
దుష్ట
గుణముల
త్యజించి,
ప్రహ్లాదునియొక్క
ఉపదేశముల
ననుసరించి
సమస్త
బాలురును
విష్ణునామమును
గానమొనర్ప
నారంభించిరి.
ప్రహ్లాదునితోగూడ
ఆనందముగా
నృత్యము
చేయదొడగిరి.
3
▾
Meaning
Keep
ఇట్టి
అసురగుణములను
కూడ
అమృతరసముగా
చేయు
పరమాత్మ
నామమే
సర్వశాంతి,
లోకశాంతి.
అట్టి
నామమును
నిరంతరము
తైలధారవలె
నుచ్చరించుచు,
ఆ
నామరూపముపై
అమితప్రేమను
పెంచుకొని
ఆనందించుటే
భక్తి.
అట్టి
భక్తిని
ఎవడైనను
పొందవచ్చు.
అట్టి
భక్తుడెవడైనను
కావచ్చును.
భక్తియోగము
అందరికి
తెలుపబడినది.
మోక్షాపేక్ష
ఒక్కటి
మాత్రము
భక్తిని
పెంపొందించుటకు;
భక్తి
మార్గమును
పొందుటకు
మానవుని
అర్హతగల
మనుజునిగా
చేయును.
భక్తి,
భగవంతుని
యెడ
నుత్కృష్టమగు
ప్రేమయే.
అట్టి
ప్రేమ
భగవంతునియొక్క
వైభవము,
సౌందర్యము,
విభూతులు
లేక
సహజగుణములైనట్టి
సర్వజ్ఞత్వము,
సర్వసామర్థ్యత్వము,
సర్వస్థిత్యత్వము
మున్నగువాటియొక్క
జ్ఞానమొందిన
అనంతరము
ఉదయించును.
ఇట్టి
ప్రేమ
భగవంతునియందు
కలిగియుండు
నట్టివాడు,
భగవంతునిలో
వసించునట్టివాడు
మోక్షము
నొందును.
భగవంతుని
ఎరుగుట
అనగా,
అతనిని
ప్రేమించుటే.
భక్తిలేని
జ్ఞానము
ద్వేషమునకు
హేతువగను.
అట్టివాని
జ్ఞానము
జ్ఞానముకాదు,
అజ్ఞానమే.
భక్తిచే
క్రమక్రముగ
జ్ఞానము
మందమొనర్పబడును.
ప్రేమ
పెరుగుటే
జ్ఞానముయొక్క
అభివృద్ధికి
సూచన.
భక్తి
లేక
భగవంతుని
యెడ
ప్రేమ
ఉదయించునపుడు
అజ్ఞానము
క్రమక్రమముగ
మాయమగును.
భక్తి
ద్వేషమునకు
వ్యతిరేకము.
కాన,
అట్టి
ప్రేమ
భగవంతునిపట్ల
అనురాగము
తెలియజేయును.
భక్తియు,
అనురాగమును
సారూప్యమయినవి.
ఏలయన
వాటియందు
ద్వేషరాహిత్యత
ఉండును.
భక్తుని
మనస్సు
భగవంతునియందు
అనురాగము
వహించియుండును.
ప్రాపంచిక
మానవుని
మనస్సు
ప్రాపంచిక
వస్తువులయెడ
అనురాగము
వహించియుండును.
అనురాగ
రూపమునగల
భక్తి
భగవత్సాక్షాత్కార
ప్రాప్తికి
దారిజూపును.
"రస"
శబ్దము
ప్రాపంచిక
వస్తువులయెడ
రుచి,
భగవంతునికొరకు
అభిరుచియని
యర్థమిచ్చును.
కర్మయొక్క
ప్రాబల్య
మంతమొందినప్పుడు
ఫలితము
లేక
కర్మఫలము
కూడా
అనంతమునకు
వచ్చును.
కర్మఫలము
4
▾
Meaning
Keep
వ్యయమొందినప్పుడు
వారు
తిరిగి
మానవలోకమునకు
ప్రవేశింతురు.
కాని,
భక్తియొక్క
ఫలము
సర్వదా
నిలుచును;
మోక్షమునకు
తుదిలేదు.
అది
అసంభవము.
ఇటుల
భక్తియే
మోక్షమునకు
వాస్తవిక
కారణము.
భక్తియే
ముఖ్యసాధన.
ఏలయన
మిగిలిన
సాధనలన్నియు
దానిపై
నాధారపడియున్నవి.
భక్తి,
జ్ఞానములు
జంటయెద్దులవలె
(బండియెద్దులవలె)
ఒకదాని
ననుసరించి
మరొకటి.
ఇందులో
ఏది
లేకపోయినను
బండి
సక్రమముగా
జరుగదు.
జ్ఞానము
భక్తి
పెంపుదలకు,
భక్తి,
జ్ఞానము
పెంపుదలకు
సహకరించును
లేక
అనుకూలపడును.
భక్తికి
జ్ఞానముయొక్క
సహాయము,
జ్ఞానమునకు
భక్తియొక్క
సహాయము
లేకున్న,
గోపకన్యలు
(బృందావనమందలి
గోపికలు)
శ్రీకృష్ణుని
యెడ
అనురాగము,
భక్తిద్వారా
మోక్షము
నొందగలరా?
భక్తికి
జ్ఞానముయొక్క,
జ్ఞానమునకు
భక్తియొక్క,
సహకారము
లేక
నుపకారము
మాత్రమేనని
పై
విషయమున
స్పష్టమగుచున్నది.
ఈ
రెండింటియొక్క
సారమే
శాంతి;
అదే
ప్రశాంతి
అదే
ప్రకాంతి,
అదే
పరంజ్యోతి.
జ్ఞానము
భక్తియొక్క
అంగము.
ఇదే
అనురాగము.
భగవంతునియెడ
అనురాగము
శుభమైనది.
అది
మానవుని
ప్రపంచమునకు
బంధింపదు.
పైగా,
అది
మోక్షమునకు
త్రోవచూపును.
సమస్తసాంగత్యము
విడువబడగలదు.
దుష్టసాంగత్యము
మాత్రమే
విడువవలెను.
సత్సాంగత్యము
అపేక్షనీయమైనది.
భక్తి
ఒకటి
మాత్రమే
అత్యున్నతమైనది.
ఏలయన,
కర్మ
జ్ఞాన
యోగమార్గమును
అవలంబించువారికంటె
దానియొక్క
సహచరులయొక్క
శ్రేష్ఠత్వమునకు
గూర్చిన
ప్రకటన
కలదు.
ఏ
విధముగనన,
యోగి
సన్యాసులకంటె
అధికుడనియు,
జ్ఞానవంతులకంటె
సహితుడనియు,
శ్రేష్ఠుడనియు
తలంతురు.
అంతేకాక,
అతడు
కర్మలకంటె
శ్రేష్ఠుడనియు
కూడా
తెలుపుదురు.
అందుకనే
గీతలోకూడ
కృష్ణుడు
అర్జునునికి,
నీవు
శ్రేష్ఠమైన
యోగివి
కమ్మ'ని
సెలవిచ్చెను.
అంతేకాక,
"యోగులందరిమధ్య
ఎవడైతే
పరిపూర్ణ
శ్రద్ధతో,
తన
అంతరాత్మ
నాలో
నైక్యమొందింపబడి
నన్ను
ఉపాసించునో
వాడు
నాచే
5
▾
Meaning
Keep
"అత్యధిక
భక్తికలవాడని
భావింపబడును"
అనెను.
అపుడు
అర్జునుడు
"స్వామీ!
సంతతస్థితి
కలిగి
నిన్ను
అటుల
ఉపాసించునట్టి
భక్తులు,
అవినాశి,
అవ్యక్తము
అని
ఉపాసించువారు.
వీరిలో
ఎవరు
యోగమందు
బాగా
ఆరితేరినవారు?"
అని
అడిగెను.
దానికి
కృష్ణుడు
ఈ
క్రిందిరీతిగా
జవాబు
చెప్పెను
వినుడు:
"ఎవరైతే
తమ
తమ
మనస్సును
నాపై
లగ్నమొనర్చుచు
నన్నే
ఉపాసింతురో;
సంతత
స్థిరతకల్గి
ఉత్కృష్టమగు
శ్రద్ధతో
నొప్పియుందురో
వారు.
కాన
భగవంతునియెడ
భక్తి,
శ్రద్ధ
ఐక్యమగునో
అపుడు
శ్రద్ధరూపమున
నుండు
భక్తి,
శ్రద్ధయొక్క
సహకారముగ
నుండును.
శ్రద్ధకు
ఉపాధిలేనందున
ఫలితము
పర్యవసాన
రాహిత్యమగును.
భగవంతునియెడల
భక్తి
ఎట్టి
క్రియయొక్క
ఫలితము
కానప్పటికిని,
అది
తన
సంపూర్ణమగు
పెంపుదలకు
కొన్ని
సాధనలపై,
ఏమనగా
జ్ఞానముపై
అంతరంగ
సాధనలను,
భక్తిపై
బహిరంగ
సాధనమీదను
ఆధారపడియుండును.
బ్రహ్మము
విషయమై
స్థిరమగు
జ్ఞానమని
బుద్ధి
అను
నర్థమిచ్చును.
శ్రవణము
(ధార్మికశాస్త్రము
వినుట)
మననము,
నిదిధ్యాసమును
భక్తి
పరిపూర్ణమగువరకును,
పరాభక్తి
(ఉన్నతభక్తి)
ప్రాప్తించువరకును
అనవరతము
సాధన
కొనసాగించవలెను.
అట్లుకాక,
భక్తుడు
భగవంతునితో
వర్తక
వ్యవహారము
నొనర్చుటయును,
దుకాణపు
పనిచేయుటయును
మానవలెను.
ఎవడైతే
తన
ఇష్టదైవమునుండి
(ప్రేమ
భక్తిని
తప్పించి,
ఒక
వరమునుకాని,
మరి
దేనినైనను
కోరునో
అతడు
నిజమగు
భక్తుడుకాడు.
భగవంతుని
పాదములయెడ
నవిచ్చిన్న
ప్రవాహపు
ప్రేమయే
ఈశ్వర
ప్రణిధాన
భక్తి.
భగవంతునియెడ
భక్తిచే
సమాధియందలి
జయము
త్వరగకూడ
నుండును.
అప్పుడే
నిజశాంతి
ప్రాప్తించును.
అదే
సర్వశాంతి;
శాంతి,
శాంతి.
Previous
←
Prabodha 9
Next
Prabodha 11
→