Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Prema Vāhinī · The Need for Sanātana Learning
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
సనాతన
విద్యావశ్యకత
లోకమున
మానవులు
ఎన్నియో
విద్యలు
చదివిరి
కదా!
ఎన్నియో
యంత్రములు
సృష్టించిరి
కదా!
ఎంతయో
జ్ఞానాభివృద్ధి
పొందిరి
కదా!
అయినప్పటికినీ,
కుదురవలసిన
మనశ్శాంతి
ఎందుకు
కుదురదయ్యెను.
ఏమిటీ
వింత?
నానాటికినీ
నడియేట(నట్టేట)
కొట్టుకొనిపోయి
శాంతికి
దూరంగా
పోతున్నారే?
ఎందుకు?
ఈ
విద్యలు
మాయ
విద్యలు;
ఈ
యంత్రములు
పొట్టకూటి
యంత్రములు;
జ్ఞానము
మిథ్యా
జ్ఞానము.
ప్రపంచ
రహస్యమును
కనుగొనుటకు
ఇది
కాదు
మార్గం.
ఏ
రహస్యమును
కనుగొనిన
అన్ని
రహస్యములు
తెలియునో,
ఏ
చిక్కు
ఊడిన
అన్ని
చిక్కులు
ఊడునో,
ఏ
విద్య
నేర్చిన
అన్ని
విద్యలునూ
సిద్ధించునో
అది
ఒకటే
ఉన్నది.
చెట్టును
కొట్టదలచిన
వారు
తల్లి
వేరు
తెగవేయవలెను
కాని,
ఆకులు
తీసివేయ
నారంభించిన
ఎంతకాలమని?
పోనీ
అంతయూ
తీసివేసినను
ఏమి
లాభం?
అట్టి
మూలాధారమైనదేదో
వేదఋషులు
కనిపెట్టియే
యున్నారు.
అట్టి
వేద
ఋషులు
మన
వారైననూ
మన
వారని
చెప్పుకొనుటకు
కూడ
ఈనాడు
భారతీయులు
సిగ్గుపడుతున్నారు.
2
▾
Meaning
Keep
పూర్వ
పురుషులు
భగవత్సందర్శనమును
పొంది,
అనుగ్రహ
ప్రభావంతో
తపస్సామర్థ్యముతో
ఆధ్యాత్మిక
విద్యను
కనిపెట్టి
బోధించిరి.
ఇట్టి
విద్యలను
ఇతర
దేశస్థులైన,
ఎంతో
మంది
తత్వవేత్తలు
శోధించి
ఈ
రీతిగా
వ్రాసిరి.
'ఐహికాముష్మిక
సాధన
సంపత్తిలో
హిందూదేశం
ఇతరులకు
మార్గదర్శిగా
ఉన్నది'.
చూచితిరా
పైవిషయము.
దీపము
ఇల్లంతా
వ్యాపించి
ప్రకాశించుచున్నది.
దీప
స్తంభం
క్రిందనే
యుండు
భారతీయులకు
క్రీనీడ
ప్రారబ్ధమేనా?
ముందు
తాతముత్తాతలు
స్నాన
సంధ్యాదులొనర్చుకొని,
పవిత్రంగా
కూర్చుని,
ఉపనిషత్తులు,
వేదాలు
పఠించెడి
వాడుక
కలవారు.
అదియేగాక
వాటిని
వ్రాసిన
యెడల
కూడా
పుణ్యమనియూ,
వాటిని
జ్ఞప్తియందుంచుకొనెడి
వారు.
తమ
తరువాత
వారు
వాటిని
దేవతార్చనపు
పీఠముపైనుంచి
పూజించు
కొందురనియు
వినియేయుందురు.
అట్టి
పవిత్ర
గ్రంథాలను
ఇప్పటి
మనవారు
కొందరు
గమనించక
ఎలుకలు
కొట్టి
బూజుపట్టిన
అట్టి
తుక్కులే
మన
దిక్కని
తలంచక
పారవేయుచున్నారు.
ఈ
తుక్కునే
పాశ్చాత్య
దేశీయులు
పరిశీలించి,
పరిశోధించి
వాటిలోని
అద్వితీయ
తేజఃపుంజములను
బ్రహ్మమణి
రాజములని
గ్రహించి,
కన్నుల
కద్దుకొని
శిరమునందుంచుకొని
తమ
జాతులకు
అమూల్యాలంకారముగా
చేసికొని,
భరత
ఖండం
మాకిచ్చిన
విలువ
నెరుగనిఆస్తి
ఇదని,
సముద్రం
దాటిపోవు
మహాఘోషముతో,
పట్టజాలని
సంతోషంతో
పలుకుచుండగా,
అట్టి
వాటికి
అర్హులైన
భారతీయ
బిడ్డలేమి
చేయుచున్నారు?
చెప్పనా?
ఆ
గ్రంథములేవో
వీరు
జూచుటేలేదు,
వినుటలేదు,
తలచుటలేదు.
కోటికొక్కడైనా
వాటిని
చదివిన
వానిని
మూఢుడని
బూతుతిట్లు
తిడుతున్నారు.
అవి
వట్టి
తప్పుడు
తడకలనుచున్నారు.
వాటిని
రచించిన
గ్రంథకర్త
లెవరని
వాదించుచున్నారు.
అట్టి
పవిత్ర
భాష,
దైవ
భాషయైన
సంస్కృతము
నభ్యసించవలసిన
వారు
అది
కష్టమని
చెడామడా
తిట్టి
ఇతర
దేశీయులకు
అప్పగించుచున్నారే!
ఎంత
విచిత్రం!
పోనిండు.
దేశ
భాషలైనను
సక్రమంగా
అభ్యసించుచున్నారా?
లేదు.
ఇక
మీరభ్యసించునదేమి?
ఇక
మీకు
సుఖమెప్పుడు?
సృష్టిమర్మము
తెలిసికొనుటెప్పుడు?
శాశ్వత
సుఖ
మొక్కటే
కాని
రెండు
లేవు.
దానిపైననే
దృష్టి
3
▾
Meaning
Keep
పెట్టుడు.
ఉపనిషద్విద్యల
నభ్యసించుడు.
మానవుల
రక్షించునది,
శాంతి
చేకూర్చునది
ఋషుల
బోధనలు
తప్ప
వేరొండులేదు.
కష్ట
సుఖాలలో
ఉన్ననూ,
జీవితాధార
విద్యలను
అభ్యసించుచుండిననూ
దృష్టి
మాత్రం
బ్రహ్మపై
నుంచుడు.
సుగుణముల
అభివృద్ధిని
తరిఫీదు
చేయక,
తెలివి
మాత్రం
అభివృద్ధి
చేయు
నేటి
విద్యలు
లోక
కళ్యాణమునకే
హానికరం.
ఇట్టి
సద్గుణములపై
నేటి
బాలురకు
బిగువు
లేకుండుటకు
ప్రస్తుత
విద్యావిధానమున
ఆధ్యాత్మిక
సద్బోధనలు
లేకుండుటే
కారణం.
బాలురు
కాని,
బాలికలు
కాని,
స్త్రీలు
కాని,
పురుషులు
కాని,
పవిత్రమైన,
బలమైన,
అందమైన,
శీలమును
పాడుచేయని
విద్యనే
అలవరచుకొనవలెను.
అట్టి
విద్యయే
విద్యకాని
ఎక్కడెక్కడో
ఉన్న
అన్ని
రకాల
సంగతులను
తీసుకొనివచ్చి
విద్యార్థులు
బుఱ్ఱలలో
చేర్చుకొనుట
గాదు.
మానవులలో
ఉండు
ప్రత్యేక
గుణ
విశేషములకు
పరిపూర్ణ
వికాసం
కలిగించు
పద్ధతియే
ఆధ్యాత్మిక
విద్య.
మానవుడు
బాహ్య
రీతిగా
పరికించునది
సత్యము
కాదు
మానవులు
పైఛాయజూచి
అదియే
వస్తువనుకొనుచున్నారు.
ఒడ్డు,
పొడవు,
వెడల్పుచూచి
వస్తువును
కొనుచున్నారు.
వస్తువు
వికారమును
చూచి
వస్తువని
మోసపోవుచున్నారు.
ఛాయను
జూచి
వస్తువని
భ్రమించు
ఇప్పటి
జ్ఞానము
జ్ఞానమగునా?
తోలుబొమ్మను
జూచి
మనిషియని
తలంచిన
జ్ఞానమగునా?
అన్ని
వస్తువులు
మనం
జూచుచుంటిమని
అనుకొనునదేదో
అది
వస్తువు
కాదు.
అన్నీ
తెలుసుకొంటిమని
అనుకొనుచున్నదేదో
అది
పదార్థము
గాదు.
ఆత్మ
పరబ్రహ్మయని
అద్వైతి
ఎఱుగును.
తానే
బ్రహ్మయని
యాతడెఱుగును.
ఎట్లెఱుగును?
గురుడు
అట్లు
బోధించుటవల్లా?
శృతులట్లు
శాసించుట
వల్లా?
ఈ
ఎఱుకమాత్రం
విజ్ఞానమగునా?
కానేరదు.
తానే
బ్రహ్మము.
ఈ
రెండు
మాటలకే
అర్థం
తెలిసిన
తోడనే
బ్రహ్మైక్య
దశ
సిద్ధించునా?
అనేక
జన్మలుగా
ఎడతెరిపి
లేకుండా
వేద
విహితములగు
సర్వ
కార్యములొనర్చి
చిత్తశుద్ధి,
విరాగములొంది
అందువలన
భక్తి
అంకురమును
గాంచి,
దానిని
పెంచి,
క్రమక్రమంగా
బలపరచి,
4
▾
Meaning
Keep
పుష్పింపచేసి,
తుదకు
ఫలింపచేసి,
ఆపండు
మంచి
పరిపక్వ
దశ
నొందునప్పుడు
దానినుండి
వెలువడు
అనుభవ
మహా
పరిమళం
సాధించి,
దానితో
చిరకాలం
కలిసి
మెలసి
అనుభవమును
వ్యాపింపచేసిన,
సర్వ
వస్తువులందున్న,
సర్వదిక్కులు
వ్యాపించియున్న,
అగమ్యగోచరమైన
జగద్వ్యాపియైన
ఆ
పరమ
శక్తితో
నైక్యం
గావచ్చునేగాని,
ప్రపంచమననేమో
తెలియక,
తానెవరో
అసలే
తెలియక,
బ్రహ్మమనగా
మొదలే
తెలియక
'అహం
బ్రహ్మాస్మి'
శబ్దమునకు
వర్ణక్రమము
తెలిసినంత
మాత్రమున
నరుడు
ప్రజ్ఞానావస్థ
నొందగలడా?
శబ్దార్థ
జ్ఞానము
ప్రధానం
కాదు.
ఆ
ఎఱుకయే
ఎఱుక
కాదు.
అనుభవ
జ్ఞానముండవలెను.
మట్టి
నుండి
ఘటస్వరూపమును
వేరుచేయ
నెవరికీ
తరముగాదు.
ఘటము
యొక్క
స్వరూపం
కల్పితం.
ఘట
కారణమగు
మృత్తిక
మాత్రమే
సత్యం.
అవిద్యచే
కల్పింపబడిన
నామమాత్రం
గల
కుంభము
స్వరూపంలో
ఎట్లుండును?
కారణము
కంటే
భిన్నంగా
కార్యం
ఉండజాలదు.
ఈ
సర్వ
ప్రపంచం
నానా
రూపాలుగా
ప్రతీతమగుచున్నదే
కానీ
జ్ఞానమందు
ఆయా
రూపాలు
స్ఫురింపక
అధిష్ఠాన
బ్రహ్మం
మాత్రమే
గోచరమగును.
ఆత్మకంటే
ఇతర
వస్తువు
గోచరింపకుండుటే
అద్వైతం.
దృశ్య
ప్రపంచమే
సత్యమగునేని,
సుషుప్తి
కాలమందు
సహితం
ఆ
ప్రపంచం
తెలియవలెను
గదా!
అదెంతమాత్రం
తెలియుటలేదు.
కనుక,
స్వప్న
కల్పిత
ప్రపంచమువలెనే,
దృశ్య
కల్పిత
ప్రపంచం
సహితం
మిథ్యయే.
ఎట్లన,
భ్రాంతి
వలన
త్రాటియందారోపించిన
సర్పము
యొక్క
స్థితి,
అధిష్ఠానమగు
త్రాటికంటే
వేరుగా
కనబడుట
లేదు.
త్రాడే
సర్పముగా
దోచినది.
కాని,
త్రాడు
సర్పము
కాదుగదా!
అటులనే
సర్వాధిష్ఠానమగు
బ్రహ్మము
సత్యము
కాని,
ప్రాతిభాసిక
ప్రపంచము
అసత్యము.
ఆకాశమునకు,
ఘటమునకు
సంబంధం
లేదు.
ఆకాశం
నిర్మలం,
ఘటము
మలినము.
కాని
ఆ
ఘటమునందు
గల
మద్యము
యొక్క
దుర్గంధము
గగనము
నంటదు.
అట్లే
ఉపాధియగు
దేహమునకును
పరిశుద్ధాత్మకును
5
▾
Meaning
Keep
సంబంధమేమియును
లేదు.
లింగదేహ
కృతమగు
కర్తృత్వము
వీడగనే
ఆత్మ
ఆయా
పుణ్య
పాపముల
ఫలముల
చెందదు.
జ్ఞానముదయింపగా
సంచితాగామి
కర్మలు
రెండును
నశించునట్లు
ప్రారబ్ధం
మాత్రం
ఎందులకు
నశింపదు?
సంకల్పముకంటే
మించినది
లేదు
కదా!
భగవత్సంకల్పమునే
సాధించుకొనగల
శక్తి
సామర్ధ్యాలు
భక్తులకు
ఉండగా
ప్రారబ్ధమును
మాత్రం
ఎందుకు
జయించలేరు?
తప్పక
జయించవచ్చు.
భగవదనుగ్రహమును
సాధించుటకై
భక్తులు
క్రమ
సాధన
తత్పరులై
కడు
జాగ్రత్తతో
మెలగవలెను.
Previous
←
Ahaṅkāra Is the Cause of Unrest
Next
For a Noble Jīva, Noble Guṇa Is the Path to Fulfilment
→