Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Prema Vāhinī · For a Noble Jīva, Noble Guṇa Is the Path to Fulfilment
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ఉత్తమ
జీవికి
ఉత్తమ
గుణమే
సార్థక
మార్గము
గడచిన
యుగములన్నింటి
కంటెను,
ఈ
కలియందు
వివేకమునకెన్నియో
సులభ
మార్గములున్నవి.
వివేకమా?
కావలసింత
వెలుగుతూనే
యున్నది.
విద్యయా?
అభ్యసించుటకు
కావలసినన్ని
కళాశాలలున్నవి.
ధనమా?
కష్టపడియైనా
సంపాదించే
సదుపాయములున్నవి.
ఇన్ని
ఉండియు,
శాంతి
సంతోషములు
లేకుండుటకు,
ఇన్ని
బాధలు
పొందుటకు
కారణమేమి?
మానవ
ప్రవర్తన
లోపమే
కాని
వేరు
కారణము
లేదు.
మానవ
జన్మముత్కృష్టమైనది.
అట్టి
పవిత్ర
జన్మమును
సార్థకము
చేసుకొనుటకు,
పవిత్ర
ప్రవర్తనలు
ప్రధానము.
అట్టి
ప్రవర్తనకు
గుణము
ముఖ్యం.
మనుజుడు
చనిపోయిన
తరువాత
కూడా
వాని
స్వభావము
నిలిచియేయుండును.
కాన,
నడవడి
ప్రతి
మనుజునకూ
నిజబలము.
లోకమున
చాలా
మంది
జ్ఞానమునే
శక్తి
అందురు.
కాదు,
కాదు,
గుణమే
శక్తి.
గుణము
లేక
జ్ఞానము
కుదరదు.
నిర్దుష్టమైన
గుణము
కలిగియుండవలెను.
చూడుడు.
బుద్ధుడు,
క్రీస్తు,
శంకరాచార్యులు,
వివేకానంద
ఇట్టి
గొప్ప
గొప్ప
మహనీయులూ,
ఋషులూ,
మహాభక్తులు
వీరందరూ,
ఇప్పటి
వరకూ
మానవులకు
2
▾
Meaning
Keep
జ్ఞాపకముండుటకు
కారణమేమి?
వారి
స్వభావములు,
గుణములు.
గుణము
ఎదుట
ఏ
ధనమూ,
విద్య,
పదవులూ
పనికిరావు.
గుణము
సువాసన
వెదజల్లే
పుష్పము
వంటిది.
ఆ
పుష్పము
ఎచ్చటనున్ననూ
దాని
వాసనను
మనము
పొందుచున్నాము!
లోకమున
కొందరు
కవులూ,
మరికొందరు
మహాకవులూ,
ఇంకా
ఎందరో
విద్వాంసులు,
విజ్ఞాన
శాస్త్రజ్ఞులూ
కావచ్చు.
కాని
గుణము
లేనిదే
సంఘమున
చోటులేదు.
ఇప్పటి
సంఘములోన
చోటున్న
వారికెల్లరకునూ
గుణమున్నదా?
అని
శంకింపవచ్చును.
అట్టి
గుణములు,
అట్టి
సంఘములూ,
నేను
తెలుపునట్టి
గుణములకన్వయించవు.
అటువంటి
గుణములందు
క్షణక్షణమునకు
మార్పు
వచ్చుచుండును.
నిజమైన
నిర్దుష్ట
గుణము
జీవితాంతము
వరకూ,
యుగయుగముల
వరకూ
అమరమై
ఆత్మతోనుండును.
ఇట్టి
అమర
గుణములే
దయా,
దాక్షిణ్యమూ,
ప్రేమ,
క్షమాపణ,
నిజాయితీ,
ఓర్పు.
ఇవియే
లోకులకు
గొప్ప
యోగ్యతకాని
వేరు
స్వభావములు
ఈ
స్థానమునొందవు.
మనము
చేయు
పనుల
వల్లనే
అలవాట్లు
కలుగును.
అలవాట్ల
వల్లనే
బుద్ధి
స్థిరపడును.
మనము
యోచించెడి
ఊహలూ,
ఉద్దేశ్యములూ,
చేసెడి
పనులూ
చిత్తమందు
బాగుగా
ముద్రించబడును.
వీటివల్లనే
మానవునకు
ప్రపంచ
స్పృహకలుగును.
మానవునకు
ప్రస్తుత
స్థితి
పూర్వజన్మ
పరిణామమే.
ఈ
అలవాట్లే
మానవుని
గుణములను
తయారు
చేయును.
ఎట్టి
స్వభావములనైనను,
ఊహలు,
అభ్యాసముల
వల్ల
మార్చుకొనవచ్చును.
చెడ్డవారు
ఎల్లప్పుడూ
చెడ్డవారుగానే
ఉండరు.
అంగుళీమాలుడనే
బందిపోటు
దొంగ
బుద్ధుని
దర్శన
మాత్రమున
మంచివాడుగా
మారలేదా?
రత్నాకరుడనే
దొంగ
వాల్మీకిగా
మారలేదా?
అట్టి
వారి
మానసిక
లక్షణములూ,
ఊహలూ
మారెను
కదా
మానవునకు
తన
చెడు
గుణములు,
చెడు
ప్రవర్తనలూ
మార్చుకొను
శక్తి
వాని
వెంటనే
యుండును.
నిష్కామసేవ,
వైరాగ్యము,
భక్తి,
ప్రార్థన,
విచారణ,
కొత్త
స్వభావములు
నేర్పించును.
ఇట్టి
స్వభావములూ,
వీని
మార్గములు,
సులభముగా
వ్యాఖ్యానించి
3
▾
Meaning
Keep
లోకమునకు
చాటుటకే
ఇట్టి
ఆధ్యాత్మిక
గ్రంథములూ,
కావ్యములూ,
పత్రికలూ
ప్రచురించుట.
పేరు
ప్రతిష్ఠలకు
కాని,
విద్యా
కౌశలమును
చూపుకొనుటకు
కాని,
పాండిత్యమును
ప్రదర్శించుకొనుటకు
కాని
కాదు.
కేవలం
ఒక
గ్రంథ
పఠనము
వల్లనే
వివేకమలవడదు.
దీనికి
తోడుగా
సంఘత్వము
కూడా
నుండవలెను.
అదిలేక
యూరక
ప్రొద్దును
గడుపుకొనుటకు
చదువుచుండిన
ఆ
భావములునూ
ప్రొద్దుతోనే
చేరి
వెళ్ళును!
తరువాత
నీచెంత
నిలుచునదేది?
గ్రంథ
పఠన
ఏకాగ్రత
లోకమున
పుస్తకములు
చాలా
చౌకైనవి.
శాస్త్రములూ,
గీత,
ఉపనిషత్తులూ,
పురాణములూ
ఎక్కడ
చూచినా
సులభంగా
దొరుకుచున్నవి.
గురువులకా
కొరతలేదు.
శిక్షణ
ధారాళముగా,
చౌకగా
లభ్యమగుచున్నది.
అయితే,
జ్ఞానామృత
సేవనము
వలన
కలుగు
త్రేనుపులు
మాత్రం
ఏవైపునా
వినిపించుట
లేదు.
కొండలు
కొండలుగా
పడిన
ఈ
పుస్తకపు
రాసులు
చూడ
చాలా
విచారమగును.
పుస్తకముల
మీద
పైభాగమున
గట్టి
గుడ్డతో
నేయబడిన
బైండును
దాటి
జ్ఞానము
వెలుపలకు
వచ్చుటలేదు.
కామ,
క్రోధ,
ద్వేష,
అహంకారములను
పర్వతముల
ఆవలి
వైపుననే
పరమాత్ముడు
దాగియున్నాడు.
అటులనే
పుస్తకముల
రాసుల
వెనుకనే
జ్ఞాన
భాస్కరుడు
దాగియున్నాడు.
ఇట్టి
గ్రంథములు
దశదిశలా
వ్యాపించి
యుండియు,
మానవుడు
నేటివరకూ
సంస్కారము,
జ్ఞానము
లేని
వానరునివలె
సర్వత్రా
కనిపించుచున్నాడు.
లోకములో
పెక్కు
మందిని
పుస్తకములపై
నుండు
అందమైన
బైండింగ్,
చక్కని
బొమ్మలూ
ఆకర్షించును.
ఇక
జ్ఞానమునకేమి
కొరత!
ఇట్టి
క్షణ
భంగురమైన
తృప్తికి
చోటిచ్చి,
పావనమైన
కాలమును,
పవిత్రమైన
జీవితమును
పాడు
చేసుకొనుట
కన్నా,
చదివినవి,
కన్న
విన్న
సద్గుణములను,
వివేక
మార్గమున
అనుష్ఠించి,
అందలి
ఆనందమును,
సత్యమునూ
గ్రహించిన
ఎంత
ధన్యులు
కావచ్చును.
అయితే
పరమార్థమును
పొందగోరు
వారు
మహాత్ముల
జీవిత
గ్రంథములు,
4
▾
Meaning
Keep
భగవచ్చింతన
అభివృద్ధిచేయు
గ్రంథములు
పఠింపవలయునే
కాని
తక్కినవన్నియూ
చదివి
తిక్కలు
పట్టించుకొనిన
ఇందులో
ఎవరికేమి
ఆనందము?
మనసుకేమి
శాంతి?
ఏమి
చేయుచుండిననూ
మానవునకు
ఏకాగ్రత
ప్రధానం.
అట్టి
ఏకాగ్రతకు
సమదృష్టియే
శుభదృష్టి.
సింహము
ఎంతటి
మృగరాజైననూ
ముందునకు
మూడడుగులు
వేసి
వెనుకకు
తిరిగి
చూచుచుండును.
ఎందుకట్లు?
క్రూర
జంతువునకు
ఏకాగ్రత
ఎట్లు
కుదురును?
కాకి,
పిల్లి,
సింహముల
కన్నులు
ఎల్లప్పుడూ
నలువైపులా
చూచుచుండును.
వాటి
చూపులు
ఏవేళలందూ
బెదురుచూ
చెదురుచుండును.
హింసావృత్తి
గల
ప్రతి
ప్రాణియొక్క
స్థితి
ఇటులనే
యుండును.
మానవునియందు
సౌమ్యదృష్టి
రావలయును.
ఈ
దృష్టి
అంతయూ
కల్యాణమయమువలె
తోచవలెను.
మనపై
మనకు
విశ్వాసం
ఉన్నట్లు
సర్వసృష్టి
మీద
ఉండవలెను.
ఇందులో
భయమేమున్నది?
ప్రకృతిలో
చెడు
ఏమాత్రమునూ
లేదు.
చెడుగు
ఎక్కడేని
యున్నచో
అది
మన
దృష్టిలోనే.
మన
దృష్టిని
బట్టే
సృష్టియుండును.
మనము
వేసుకొన్న
కంటి
అద్దాల
రంగును
బట్టి
ప్రకృతి
రంగులు
మారును
కదా!
సాధనే
జీవితమునకు
మార్గము
మానవుడెంత
ఉత్తమ
స్థితికి
పోగలడో,
ఈ
నర
దేహమునందెంత
శక్తి
ఇమిడియున్నదో
చూపగల,
తెలుపగల
మహాత్ములు,
నాడునూ,
నేడునూ
కలరు.
మనసు
ఎల్లప్పుడునూ
బయటనే
తిరుగుచుండుట,
ఇతరులను
విమర్శించుట
ఇట్టి
వ్యాపారములయందే
అది
చాలా
వ్యర్థమైపోవుచున్నది.
ఇతరుల
గుణ
దోషములను
చూచుటలోనే
నిమగ్నుడైన,
ఇంక
ఏకాగ్రత
ఎట్లు
కుదురును?
నావంటి
దేహం
కలవారే
వీర
పురుషులు.
నావంటి
దేహము
కలవారే
మహాపురుషులు,
వారే
ఇట్టి
స్థితికి
రాగలిగినప్పుడు
నా
స్థితి
ఇట్లు
ఎందులకుండవలెను?
ఇతరుల
లోపములను
వెదకినచో
నాకేమి
లాభము?
నా
లోపములు
నేనే
వెదకి,
నాకు
నేను
మనసు
స్వాధీనంలో
పెట్టుకొనవలెనను
సంకల్పము
స్థిరము
చేసికొనుట
మొదటి
సాధన.
5
▾
Meaning
Keep
మనము
దినమంతయూ
పనులు
చేయుచునే
యుందుము.
ఇట్లు
దినమంతయూ
పడుపాట్లలో
ఉద్దేశమేమి?
ఈ
అట్టహాసమూ,
ఈ
ఉరుకులూ,
పరుగులూ,
అన్నియూ
మన
చరమ
దశ
మధురంగా
నుండవలెననియే
కదా!
పగటి
యొక్క
తుది
ఘడియ
సాయంకాలమున
వచ్చును.
పగటి
పనులన్నియూ
పవిత్ర
భావములతో
జరిగిన
రాత్రి
ప్రార్థన
మధురంగా
జరుగును.
అట్టి
సంతృప్త
భావము
ఏర్పడగానే
ఏకాగ్రత
పొందుదుము.
మానవుడు
ఎక్కువ
కాలం
జీవింపబోడు.
ఈ
స్వల్పమైన
ఆయుః
ప్రమాణములోనే
దివ్య
సుఖమును
చవి
చూడగల
సామర్థ్యం
వానికున్నది.
ఇద్దరు
వ్యక్తులు
కేవలమొకే
ప్రింటులోనే
తయారైనటులయుందురు.
ఇద్దరి
అవయవములూ
సమానముగానే
యుండును.
ఇట్లుండియూ
ఒకడు
దేవతుల్యుడు
కావచ్చును.
మరొకడు
పశుప్రాయుడు
కావచ్చును.
దీనికి
కారణమేమి?
ఇరువురిది
ఒక
మతమే
కదా!
ఒకే
మానవాకారము
కదా!
పరమేశ్వరుకెందుకు
భేదము?
కాదు,
కాదు
ప్రవర్తనను
బట్టి
ఈ
ఇరువురూ
ఒక
జాతి
వారని
నమ్మలేము.
కనుకనే
మొదట
మానవునికి
ప్రవర్తనలు
ప్రధానమైనవి.
మానవ
జీవితము
క్షణక్షణమూ
పైకి
సాధారణంగా
కనిపించుచున్నను
నిజమునకు
అట్లు
కాదు.
అందులో
గొప్ప
అర్థమున్నది.
జీవితమంతయూ
ఒక
మహాయజ్ఞకర్మ.
నిద్ర
సమాధి.
భోగానుభవములు
అన్నింటినీ
ఈశ్వరార్పణ
చేసి
పోవు
నిద్ర
సమాధి
కాక
మరేమి?
దేహమే
నేనను
భావం
సర్వత్రా
వ్యాపించియుండుట
వల్ల
మనుష్యుడు
వివేకం
లేక,
దేహ
పుష్టి
కొఱకు
అనేక
సాధనాలు
నిర్మించుకొనును.
ఈ
దేహము
పాతదయి
జీర్ణమయిపోయిననూ
ఏదేనొక
ఉపాయము
చేత
దానిని
నిలబెట్టుటకు
ప్రయత్నించు
చుండును.
కాని
ఎంత
కాలం
ఈ
దేహమను
పైతొడుగును
నిలుపగలడు?
చనిపోవు
వరకే
గదా!
మృత్యువు
యొక్క
వారంటు
వచ్చిన
6
▾
Meaning
Keep
తరువాత
ఒక్క
నిమిషముండుటకు
వీలగునా?
మృత్యువు
ఎదుట
అన్ని
గర్వములు,
అన్ని
హోదాలు
అణగిపోవును.
కాని
అహర్నిశలు
దేహమును
గూర్చి
యోచించక
పరమార్థమును
పొందగోరి
త్రికరణ
శుద్ధిగా
సర్వజీవుల
కొరకు
పాటుపడుటకు
ఈ
కాయమును
కాపాడుకొనవలెనే
కాని,
నీవు
ఈ
దేహమే
కావు,
ఆత్మవు.
'తత్త్వమసి',
ఆ
ఆత్మ
స్వరూపం
నీవు.
ఇది
మిక్కిలి
ఉన్నతం,
పవిత్రము
అయిన
మహావాక్యం.
నాశరహితమైన
ఫలమేదో,
ఆ
లోపల
సారమేదో
అదే
నీవు.
ఈ
దేహము
కంటే
భిన్నం,
నిష్కళంకమూ
అయిన
ఆత్మతత్త్వమే
నీవు.
ఆ
ఆత్మతత్త్వ
నిమిత్తమే
నీకీ
శరీరం
ప్రాప్తించినది.
నీవు(ఆత్మ)
ఎల్లప్పుడూ
స్థిరముగా
నుండువు.
ఈ
శరీరమును
వాహనంగా
చేసుకొని
వచ్చుట,
ఎవరిని
వారు
నాశనము
చేసుకొనుటకా?
కాదు.
ఈ
దేహంపై
అధికారము
వినియోగించి
తద్వారా
లోక
కల్యాణమును
వృద్ధి
పరచుట
కొఱకు.
ఈ
మహత్తత్వము
నిమిత్తం
ఈ
శరీరమును
విసరవలెను.
కర్మాచరణకే
ఈ
దేహం.
ఈ
దేహం
కేవలం
నిమిత్త
మాత్రమైన
సాధనం.
ఈశ్వర
దత్తమైన
ఒక
పనిముట్టు.
దాని
అవసరం
తీరిననాడు
దానితో
అవసరం
లేదు.
అట్టి
నిజతత్వమును
పొందువరకూ
దేహమును
మాత్రం
సర్వవిధాలా
కాపాడుకొనవలెను.
చలికాలంలోవేసిన
దుస్తులు
ఎండ
కాలమున
ధరింతుమా?
అట్టే
ప్రపంచ
వ్యామోహమనే
గాలులు
వీచునంత
వరకూ,
ఆ
గాలులకు
తాళ
లేనంత
వరకూ,
ఈ
మలినమైన,
మందమైన
తోలుతిత్తులు
అవసరం.
వాటి
గాలి
మానవుని
మనసునకు
కాని,
కాయమునకు
కాని,
వాక్కుకు
గాని,
సోకకుండిన
సూక్ష్మ
దేహమును
ధరింతురు.
వర్షముతో
ఆకాశమూ,
భూమి,
ఒక
దానితో
నొకటి
కలిసిపోవును.
చూడు!
ఈ
దృశ్యమెంత
ఆనంద
దాయకం!
ఈ
సృష్టి
మానవునికి
స్వతః
శిక్షణనిచ్చుచున్నది.
సృష్టితో
ఏక
రూపం
కావలెను.
సృష్టి
యొక్క
క్షరత్వము
ఈవిధంగా
క్రొత్త
క్రొత్త
సాధన
సామాగ్రి
నిచ్చుచున్నది.
ఈ
సృష్టి
నడుము
కట్టుకొని
సేవకై
నిలచిన
సనాతన
సేవకుడు.
సేవ,
సేవకుడు
పరమాత్మ
ఈ
మూడు
మానవునకు
కనుపించుచునే
యున్నవి,
దానిపై
ఈ
ఆటపాటల
ఆడంబరం.
7
▾
Meaning
Keep
'ఈ
పురుషోత్తముడు
క్రొత్త
క్రొత్త
సేవా
సాధనముల
నిచ్చి
నా
వలన
ప్రేమ
పూర్వకమైన
సేవలు
చేయించుకొనుచున్నాడు.
వివిధమైన
సాధనలనిచ్చి
నాచేత
ఆట
ఆడించుచున్నాడు.
రకరకాలైన
ప్రయోజనకర
కార్యాలు
నాచేత
చేయించుచున్నాడు',
అని
ఇట్టి
భావములతో
జీవితయాత్ర
సాగించినచో
ఎంత
ఆనందం
లభించును?
చూడు!
మానవులు
చేయు
ప్రతి
కార్యమూ
భక్తిమయము
కావలెను.
ఉదయం
మొదలు
సాయంత్రం
వరకు
చేయు
ప్రతికర్మయూ
భగవంతుని
పూజగా
తలంచవలెను.
మానవులెంతో
శ్రద్ధతో
పూజ
కొఱకు
తెచ్చిన
పుష్పములు,
వాడక,
నలుగకుండుటకు
ఎంత
శ్రద్ధగా
భద్రపరతురు!
వాసన
చూచిన
ఏ
దోషమో
అని
పళ్ళెరమున
కడు
జాగ్రత్తగా
నుంచుదురు.
ఈ
దృష్టియే
అనుదిన
జీవిత
కార్యములపై
నుండిన
అప్పుడు
లోకమున
మానవుని
వలన
అఖండసేవ
జరుగును.
'నేను'
అనునది
ఏమాత్రం
మిగులదు.
అహంకారమును
వదలుకొని
జీవితమును
హరిపారాయణం
గావించుకొనవలెను.
పరమాత్మ
అతడు,
సేవకుడు
నేను,
ఈ
సృష్టి
సాధనరూపమని
భావన
కలిగిన
నాది,
నేను
అనునది
మటుమాయమగును.
భక్తి,
జ్ఞానము
ఒక్కటే
భక్తి,
జ్ఞానము
వేరువేరని
తలపరాదు.
మానవునికి
బోధపడుటకు
వేరు
వేరు
మాటలతో
చెప్పుకొందురు.
భక్తియే
జ్ఞానముగా
మారును.
సగుణ,
నిర్గుణ
సంబంధమే,
భక్తిజ్ఞాన
సంబంధం.
కర్మయనునది,
భక్తియనునది,
జ్ఞానమనునది
వేరు
వేరనుటకు
నేనొప్పుకోను.
వాటిని
వేరు
వేరు
చేయడం
నాకు
ఇష్టంలేదు.
కర్మ,
భక్తి
జ్ఞాన
సముచ్చయ
వాదమును
కూడా
నేను
అంగీకరింపను.
కర్మయే
భక్తి,
భక్తియే
జ్ఞానము.
మైసూరు
పాకు
ముక్క
మాధుర్యమూ,
దాని
ఆకారం,
దాని
బరువూ,
మూడునూ
వేరు
వేరెట్లగును?
మనం
నోటిలో
వేసుకొన్నవెంటనే
దాని
ఆకారం
తిని
వేసినాము,
దాని
బరువును
జీర్ణించుకొన్నాము.
అందులోని
మాధుర్యమును
రుచి
చూచినాము.
ఆ
మూడూ
పనులు
కలిసి
ఒకసారే
జరిగినవి
కదా!
ఒక
క్షణమున
ఆకారం,
ఒక
క్షణమున
బరువుయు,
మరొక
క్షణమున
8
▾
Meaning
Keep
మాధుర్యమూ
లేదు.
ఆ
విధంగానే
జీవుడూ,
ఆత్మ,
పరమాత్మ
వేరు
వేరు
కాదు.
కానేరదు.
ప్రతి
కార్యం
సేవామయం,
ప్రేమమయం,
జ్ఞానమయం
కావలెను.
జీవితముయొక్క
విభాగాలు
అన్నింటిలోనూ
కర్మ
భక్తి
జ్ఞానములు
నిండియుండవలెను.
ఇట్టి
వానినే
పురుషోత్తమ
యోగమందురు.
ఈ
భావాలు
ఆచరణలోకి
రావలెను.
నోటితో
చెప్పిన
ప్రయోజనం
లేదు.
శుద్ధమైన
భక్తి
జ్ఞానములతో
హృదయం
వికసింపచేసికొని
సాధన
చేయవలెను.
నామామృత
మాధుర్యములు,
జీవిత
కళయు
వేరు
కాదు.
నామము
యొక్క
ఆంతరిక
ఘోషకును,
బాహ్య
జీవిత
కళకును
సామరస్యమున్నది.
క్రియను
ఈశ్వరార్పణ
చేసిన
మీదట
స్వార్థము,
పదార్థము,
పరమార్థమూ
అన్నియూ
ఏక
రూపమైపోవును.
ఇంతవరకు
నీవు,
నేను
వేరు
అనుకొనుచూ
వచ్చిన
భేదబుద్ధిని
తొలగించుకొని
ఏకం
కావలెను.
నీవు,
నేను
కలియుట
వల్లనే
మనం
అగుదుము.
ఇక
మనం,
అతడు
ఏకం
కావలెను.
'నేను'
(జీవుడు)
మొదట
ఈ
సృష్టితోను
ప్రకృతిలో
తదుపరి
పరమాత్మతోను
సామరస్యమును
సాధించవలెను.
'ఓం
తత్సత్'
మంత్రమునందు
ఈ
భావమే
సూచింపబడినది.
నేడున్నది
అదే!
నిన్న
యుండినది
అదే.
రేపుండునదీ
అదియే.
ఎల్లప్పుడూ
అతడున్నాడు.
'నేను'
ఉన్నాను.
'సాధన'
కూడా
ఉన్నది.
సూర్యుని
మనమెప్పుడూ
చూచిననూ
తన
కిరణాల
నుండి
వేరుగా
అతడుండడు.
ఇట్లే
ప్రతి
సాధకుడునూ
ఎట్టి
పరిస్థితులందునూ
సాధనను
విడిచియుండరాదు.
ఈ
విధంగా
నిరంతర
సాధన
చేయుచున్నప్పుడే
అతడు
'ఓం'తో
ఏక
రూపమైనట్లు
చెప్పవచ్చును.
మానవ
కర్తవ్యము
నైతిక
జీవితములో
మానవుడు
తన
కర్తవ్య
కర్మల
ద్వారా
హృదయ
మాలిన్యమును
కడిగివేయుటకు
ప్రయత్నించవలెను.
ఇట్టి
యత్నమును
సల్పుచుండగా
తాను
అలిసిపోవు
సమయం
ఒకటి
వచ్చును.
అప్పుడు
'ఓ
పరమాత్మా!
నా
ప్రయత్నమింతకు
మించిపోకున్నది.
నాకు
శక్తిని,
బలమును
మరికొంత
ప్రసాదించుము'
అని
ప్రార్థించవలెను.
మొదట
పరమాత్ముడు
9
▾
Meaning
Keep
దూరంగానిలిచి
చూచుచుండును.
ప్రశ్నకు
సమాధానం
వ్రాయమని
శిష్యునకు
చెప్పి
గురువు
దూరంగా
వెళ్ళి
నిలుచుండినట్లే
జీవుడు
భోగమయ
జీవితంలో
మునిగియున్నంత
వరకూ,
పరమాత్మ
దూరంగా
నిలబడియుండును.
జీవుని
వల్ల
సత్కర్మలు
జరుగుచుండగా
భగవంతుడు
మెల్లమెల్లగా
చెంతకు
వచ్చును.
జగత్సేవకుడైన
సూర్యనారాయణుడు
సదా
మీ
వాకిటి
ముందు
నిలిచియే
యుండును.
మూసియున్న
తలుపులను
బ్రద్దలు
కొట్టి
సూర్యుడు
లోపల
ప్రవేశించడు.
ఏలయన
అతడు
సేవకుడు.
అతడు
స్వామి
హద్దులను
తన
హద్దులనూ
గుర్తెరిగి
మెలగును.
తలుపు
తట్టనైనా
తట్టడు.
యజమాని
తలుపులు
కొంచెం
తెరవగానే
సూర్యుడు
పూర్ణతేజంతో
లోపలికి
చొరబడి,
అంధకారమును
పారద్రోలును.
పరమాత్ముని
స్థితి
కూడా
ఇట్టిదే.
తన
సాయం
అర్థించినంతనే
చాచిన
చేతులతో
జీవుల
చెంత
కనుపించును.
సత్యాసత్య
వివేకముతో
ప్రవర్తించనంతవరకు
దేహాత్మల
పృథక్కరణము
(వేరు
చేయుట)
శక్యము
కాదు.
ఈ
విశేషమూ,
ఈ
జ్ఞానమూ
మానవ
రోమరోమమునకూ
వ్యాపించ
వలెను.
సద్గుణమే
జ్ఞానము
జ్ఞానమనగా
తెలిసికొనుట
అని
చెప్పుదుము.
కేవలం
బుద్ధితో
తెలిసికొనుట
మాత్రమే
కాదు.
ముద్దనోటియందు
పెట్టుకొన్ననే
భోజనం
చేసినట్లు
కాదు.
దానిని
నోటియందుంచుకొని
నమలవలెను.
అది
గొంతు
నుండి
జఠరమునకు
పోయి
శరీరమునందెల్లా
వ్యాపించును.
దేహమును
పుష్టివంతం
చేయును.
అప్పుడే
అది
నిజమైన
భోజనమగును.
అదే
రీతిగా
కేవలం
బుద్ధిగత
జ్ఞానము
వలన
ప్రయోజనం
లేదు.
అది
జీవితమందెల్లనూ
వ్యాపింపవలెను.
ఆ
జ్ఞానము
చేతులూ,
కాళ్ళు,
కన్నులు
మొదలైన
ఇంద్రియాల
ద్వారా
ప్రకటితము
కావలెను.
జ్ఞానేంద్రియములునూ,
కర్మేంద్రియములనూ
సర్వకర్మలనూ
వివేకంతో
అనుష్టించు
స్థితికి
రావలెను.
ఒట్టి
పాండిత్యము
జ్ఞానమనబడదు.
సద్గుణమునే,
నేను
జ్ఞానమందును.
10
▾
Meaning
Keep
మనం
సేవ
చేయుటకు
కొంత
భోగమును
కూడా
అనుభవించ
వలసి
యున్నది.
భోగము
కూడా
యజ్ఞమునందలి
ఒక
భాగమే.
శరీరమను
యంత్రమునకు,
అన్నమను
బొగ్గు
వేయవలెను.
ఈ
ఆహారం
యజ్ఞము
కాకపోయిననూ,
యజ్ఞమును
సిద్ధింపచేయుటకు
ఇది
ముఖ్య
సాధనం.
ఇయ్యది
ఉదర
పోషణము
కాదనీ,
యజ్ఞకర్మయే
అని
తెలిసికొనవలెను.
తోటలోని
ఒక
పుష్పమును
తెచ్చి
దేవుని
తలపై
పెట్టినంత
మాత్రాన,
అది
పూజకాదు.
ఆ
పూవులు
పూయుటకు
తోటలో
చేయు
పరిశ్రమ
కూడా
పూజయే.
శరీరమునకు
కావలసిన
ఆహారము
నిచ్చినప్పుడే
అది
చేయవలసిన
పనులు
చేయగలదు.
సాధన
రూపమైన
కర్మ
కూడా
యజ్ఞమే.
ఈ
యజ్ఞములయందు
మూడు
సంస్థల
కర్మ
ఫలితాలు
సిద్ధించుచున్నవి.
ఆ
సేవా
కార్యములలో
మనం
ఫలాపేక్షను
ఏమాత్రము
రానీయరాదు.
ఏలయన
ఫలమును
మానవులు
మొదటే
పొందియున్నారు.
కాన
ఆ
ఋణము
మానవుని
తలపైనున్నది.
ఆ
ఋణమును
తీర్చుకొనుటే
వాని
కర్తవ్యం.
యజ్ఞము
వలన
సృష్టియందు
(సంస్థలో)
సమత్వము
ప్రాప్తించును.
దానము
వలన
సమాజమునందు
సమత్వ
మేర్పడును.
తపస్సు
వలన
శరీరంలో
సమత్వము
సిద్ధించును.
ఈ
విధంగా
మూడు
సంస్థలయందును
సమత్వమును
నెలకొల్పుటకు
ఈ
కార్యక్రమములు
తోడ్పడును.
సత్యమే
దేవుడు
వీటినన్నింటినీ
సాధించుట
కొఱకు,
తెలిసికొనుటకు,
నైతికత
అనే
బలమైన
పునాది
కావలెను.
సత్యాసత్య
వివేచన
చేయుచూ
ఎల్లప్పుడూ
సత్యమునే
గ్రహించవలెను.
సారాసార
విచారణ
ద్వారా
సారమునే
పొందవలెను.
చిప్పలను
పారవేసి
ముత్యములనే
గ్రహించు
చందమున
జీవితమును
ప్రారంభించవలెను.
తరువాత
స్వప్రయత్నం,
ఈశ్వర
కృప.
వీని
బలంతో
పురోగమించవలెను.
ఈ
సాధనయందు
దేహము
నుండి
ఆత్మను
వేరుచేయు
అభ్యాసము
చేసినచో
అది
మనకు
చాలా
సహకారి
యగును.
11
▾
Meaning
Keep
మనం
ఏ
విచారణ
చేయుటకునూ
మొదట
సత్యాసత్య
విచారణ
చేయుట
సర్వశ్రేయస్సు.
ఆ
విచారణ
ప్రతి
లౌకికమునందుగాని,
వ్యావహారికమునందుగానీ,
ఇక
ఏ
చిన్న
విషయమందైననూ
సరే,
అది
అవసరం.
సృష్టి,
స్థితి,
లయము
అన్నియునూ
ఆ
సత్యమువలననే
జరుగుచున్నవి.
సత్యమే
తాను.
సత్యమును
కనుగొంటిమన్న
సర్వేశునే
తెలిసికొంటిమి.
ఇట్టి
పవిత్ర
పరమార్థపు
సేవలకు
ఆహార
శుద్ధి
కూడా
అవసరం.
ఆహారమును
పట్టియే
మనసుండును.
ఆహారం
మితంగా
ఉండవలెను.
ఆహారమెంత
అను
విషయం
కన్నా,
ఎట్టిది
తినుచున్నా
మనునది
ముఖ్యం.
భుజించు
ఆహారమునకు
పరిమాణమవసరము.
అసలు
మనం
భుజించుటెందుకు?
ఉత్కృష్టమైన
సేవ
చేయుటకు.
సేవయను
యజ్ఞమును
ఫలప్రదము
చేయుటకు
ఆహారము
ప్రధానం.
ఆహార
పరిశుద్ధి
విషయమై
మానవుడెంతో
శ్రద్ధగా
చూడవలెను.
ఈ
రీతిగా
మానవునికి
తొడుగు
అయిన
దేహమును
చూచుకొంటూ,
గుణముల
నలవరచుకొనుటకు
ప్రయత్నించి
క్రమక్రమేణ
దేహాభిమానమును
వదలి
ఆత్మానంద
మార్గమునకు
సులభంగా
దారి
తీయగలము.
ఇన్ని
చేయవలసిన
కర్తవ్య
కర్మలు
ముందుంచుకొని
సాక్షాత్కారమును
సాధించవలెనన్న
సాధ్యమగునా?
ప్రవర్తనమార్గము
వల్ల
పవిత్రతను
పొంది,
ఆ
పవిత్రత
మూలమున
పరమార్థమును
తెలిసికొన
సాధ్యమగును.
లౌకిక
లోకమున
ఇట్టి
అనుభవములు
లేనిదే
యథార్థము
అర్థము
కాదు.
అర్థమైన
తరువాత
యథార్థమును
పట్టుదమన్న,
పట్టిన
కదా
అర్థమగును.
ఈత
వచ్చిన
తదుపరి
నీటి
చెంతకు
పోవుదునన్న,
నీటిచెంతకు
పోయిన
కదా
ఈత
వచ్చును.
నీటి
చెంతకు
వెళ్ళి
కొన్ని
పరికరముల
సహాయము
వల్లనైనా
అందులోపడిన
కదా
ఈత
వచ్చును.
నీటి
దగ్గరకే
వెళ్ళకున్న
ఈత
ఎట్లు
వచ్చును?
అదేరీతిగా
పరమార్థపు
మార్గము
ఏరీతిగానైనా,
ఏ
ఆధారము
సహాయముననైనా,
మనం
సాధన
మొదలిడిన
కదా
ఆ
పరమాత్ముని
విషయం
బోధపడును.
ఆమార్గమందే
12
▾
Meaning
Keep
ప్రయాణం
సల్పని
వారికి
దాని
సంగతే
తెలియదు.
కనుక
ఇట్టి
పరమార్థమును
గుర్తిడుటకు
గుణములు,
ప్రవర్తనలు
ప్రధానమైనవి.
వాటి
ఆధారముల
వల్ల
రూపములు
ఏర్పరచుకొందుము.
పరమాత్మయే
నిజం.
పరమాత్మయే
ప్రేమ.
మానవులు
ఎల్లప్పుడూ
నిజమైన
రూపమును
మొదట
ధ్యానించి,
తదుపరి
ప్రేమ
స్వరూపమును
గురించి
యోచించిన
తప్పక
ఆ
రూపము
సాక్షాత్కరించును.
భక్తులతో
సత్సంగము
చేయుము.
దాని
మూలమున
వివేకము,
వైరాగ్యము,
ఆధ్యాత్మిక
బలము,
మనశ్శాంతి
కలుగును.
అన్ని
విషయములందును
నీ
శక్తి
కొలది
నిజం
పలుకుటకే
ప్రయత్నింపుము.
ప్రథమంలో
నీ
కార్యములందు
అపజయములు,
కొంత
కష్టనష్టములు
సంభవించును.
కాని
చిట్ట
చివరకు
తప్పక
జయము,
ఆనందము
పొందగలవు.
(సత్యమేవ
జయతి
నానృతం)
అను
నిజతత్వం
జ్ఞాపకమునకు
వచ్చును.
ఇట్టి
ప్రవర్తనలలోనే
పరమాత్ముడున్నాడు,
పరమార్థమున్నది.
Previous
←
The Need for Sanātana Learning
Next
Sanātana Dharma Is the Mother of All Humankind
→