Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Prema Vāhinī · Sanātana Dharma Is the Mother of All Humankind
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
మానవకోటికి
మాతృదేవి
సనాతన
ధర్మమే
లోకమున
సర్వమతములకు,
సర్వ
సంప్రదాయములకు,
సర్వ
ధర్మములకు
సనాతన
ధర్మమే
తల్లి.
అట్టి
తల్లి
పుట్టినిల్లే
ఈ
భారతదేశం.
ఆహా!
భారతీయు
లెంతటి
భాగ్యశాలురో!
ఈ
భారతదేశమెంత
భవ్యమైనదో
యోచింపుడు.
లోకమంతయు
లోకేశుని
దేహమైనను,
దానికి
నేత్రముల
వంటిది
ఈ
భారతదేశం.
నేత్ర
హీనమైన
దేహం
పరాధీనమే
కదా!
భారతదేశం
వేద,
శాస్త్రాలను
నేత్రములతో
అలంకరింపబడినది.
అందుమూలముననే
భారతీయులు
పొందినంత
సంస్కారమును
మరే
దేశీయులూ
పొందలేరని
చెప్పుటలో
సందియమే
లేదు.
సర్వమత
సమత్వమును,
సహనమును
బోధించిన
సనాతన
ధర్మమే
సర్వుల
ధర్మము.
వివిధ
ప్రదేశాలలో
పుట్టి,
వివిధ
మార్గాలుగా
ప్రవహించి,
కడకు
నదులు
సముద్రమున
ఎట్లు
చేరుచున్నవో,
అటులనే
వివిధ
ప్రదేశములలో
ఉద్భవించి,
వివిధ
ధర్మ
మార్గముల
ప్రవర్తించి,
వివిధారాధనలతో
సర్వేశ్వరుని
సన్నిధి
అను
సాగరమును
చేరుచున్నారు.
నానాదిశలకు
ప్రాకునట్టి
ఈ
భిన్న
మార్గములన్నియు
కలియునట్టి
కేంద్ర
స్థానమే
సనాతన
ధర్మము.
2
▾
Meaning
Keep
సర్వమతముల
వారు
సత్యవాక్పరులుగా
ఉండి,
ఈర్ష్య,
కోప
రహితులై,
ప్రేమ
హృదయులై
ప్రవర్తించి,
సనాతన
ధర్మము
ననుష్ఠించవలెను.
వీటిని
పట్టు
విడవక
సాధించువాడే
భారతీయుడు.
ఆదికాలము
నుండియు
నేటి
వరకు
అగ్రస్థానమును
వహించి,
శాశ్వతముగా
నిలిచి
యుండినది
ఒక్క
హిందూమతం
మాత్రమే.
నాటి
చారిత్రక
యుగాల
నుండియు
నాశన
మెఱుంగని
వారు
ఒక్క
భారతీయులే.
ప్రేమ,
సమంజసము,
కృతజ్ఞతా
సహితమగు
జీవితమును
ఈ
మతమునందు
గరపినటుల
మరే
మతము
గరుపలేదు.
తత్త్వావిష్కరణమున
వేదము
మూలము.
దానినుండి
హిందువులు
వారి
ధర్మమును
పొందియున్నారు.
ఆది
అంత్యములు
లేని
వేద
శాస్త్రాల
సారమును
గ్రోలిన
వారు
ఈ
భారతీయులు.
ఇట్టి
పవిత్ర
భారతదేశము
లోకమునకు
ఆధ్యాత్మిక
గనివంటిది.
ఈ
బ్రహ్మాండమైన
భూగర్భమున
ఒక్కొక్క
ప్రదేశమందు
ఒక్కొక్క
లోహము
కనుపించినట్లే,
ఈ
భారతదేశమందు
సర్వశాస్త్రవేద
ఉపనిషత్
తత్త్వముల
సారమైన
సనాతన
ధర్మము
ఉత్పత్తి
అయినది.
భారతీయుల
భాగ్యమా
అన్నట్లు
వారి
పుట్టినిల్లుగా
ఉన్న
ఈ
సనాతన
ధర్మపు
గనులు
ఎచ్చట
ప్రారంభమవునో
అచ్చటనే
అందు
నిమిత్తమై
నాయకులు,
విచారకులు,
విమర్శకులు,
ప్రచారకులు,
ప్రబోధకులు
ఉద్భవింతురు.
అట్టి
మతమునకు
చెందిన
వారగు
మహాపురుషులు,
నిష్కామ
కర్మయోగులు,
పండితోత్తములు,
ప్రజ్ఞావంతులు,
ఋషులు,
దైవాంశ
సంభూతులు,
యజ్ఞ
పురుషులు
ఈ
భారతదేశమందే
అనేకులు
ఉద్భవించిరి.
వీరి
వలననే
ఇట్టి
అనుభవ
సిద్ధమైన
ఆధ్యాత్మిక
సారము
దేశమంతయూ
ప్రవహించినది.
ఈ
రీతిగా
లోకమంతయు
సనాతన
ధర్మము
సారవంతమై
అభివృద్ధి
చెందినది.
ఎన్ని
దేశముల
ప్రవహించినను,
ఆది
స్థానము
భారతదేశమే.
నేడు
లోకమున
చూడుడు.
ఏదో
కొన్ని
కొన్ని
కొత్త
రకమైనటువంటి
మిషన్
కార్లు,
ఇంజనులు,
ఇతర
దేశములలో
కనిపెట్టి
వాటిని
తదితర
దేశాలకు
ఎగుమతి
చేసినను,
వాటి
ఆది
స్థానము
మాత్రము
మరువరానిదిగా
నున్నది.
వాటి
అనుభవముగనే
అట్టి
మిషనులు
అట్టి
కార్లు
తయారు
చేయవచ్చును.
అయితే
ఆధారము
లేక
ఏమియూ
చేయలేరు.
అటులనే
భారతదేశమందు
సనాతన
3
▾
Meaning
Keep
ధర్మము
ఉద్భవించి,
దాని
ప్రభావమును
మహాపురుషుల
మూలమున,
వారు
రచించిన
శాస్త్ర
గ్రంథమూలమున
పరదేశీయులు
పొందిరే
కానీ,
అది
తన
స్థానాధారమును
వీడలేదు.
అది
అసాధ్యము.
అట్టి
పావన
ధర్మములను
పాలతో
పెంచబడిన
పుణ్యపురుషుల
పుట్టినిల్లయిన
ఈ
భారతదేశమున
నేటి
నవీన
పద్ధతులే
మన
ధర్మమని,
సనాతన
ధర్మపు
సారమును
రుచి
చూడక,
దాని
అర్థమును
సహితం
తెలిసికొనక,
వ్యర్థపు
వాదనలతో
దానిని
మరుగుపరచి,
పరదేశీయులకు
ఒప్పజెప్పి
వగచుచుండుట
చూచి
విచారంగా
ఉన్నది.
ఇందుకు
కారణము
సరైన
మార్గదర్శకులు
లేకుండుటే.
ఉండిననూ
ఇప్పటి
నవీన
పద్ధతులకు
ప్రవేశమిచ్చి
వాటి
వాసన
మూలమున
తరిగి
పోవుచున్నారు.
ఇవి
కేవలం
సంత
పకోడీల
వంటివి.
వట్టి
వాసనలను
పట్టి
ఒళ్ళును
పాడు
చేసుకొందురు
కానీ
యథార్థపు
పదార్థమును
పరిశీలించరు.
సనాతన
ధర్మమైన
స్వధర్మమునందు
ఎంతో
పరిశుభ్రమైన
పదార్థముండియు
ఆడంబరముచే
ఆకర్షించు
వాసనలు
లేకపోవుటే
ఇట్టి
అశ్రద్ధకు
కారణం.
సత్యమునకు
అట్టి
ఆడంబరాలు
అనవసరం.
రుచియే
ప్రధానం.
ఇప్పటి
మానవులు
కేవలం
వాసనా
ఇష్టులై
చరించుటే
ఇందుకు
మూలం.
యథార్థమును
వదలి
పర
ధర్మముల
పాటించుట
నేడు
పరిపాటయినది.
ఇది
చాలా
పొరపాటు.
ఆకర్షించు
వాసనలు,
పైపద్ధతులను
చూచి
భ్రమించుట
భారతీయులకు
ధర్మ
విరుద్ధం.
సనాతన
ధర్మములో
లేని
సత్యము,
పరమ
ప్రేమ
మరే
ధర్మమందునూ
లేవు,
రావు.
సనాతన
ధర్మము
సత్యస్వరూపం.
అది
సర్వుల
సొత్తు.
పవిత్రతకు
ఏ
నియమములూ
ఉండవు.
పవిత్రత
ఒక్కటియే,
రెండు
కాదు
కదా!
అట్టి
సనాతన
ధర్మమును
అనుష్ఠించి
జీవన్ముక్తులైన
వారు,
భగవదనుగ్రహమును
పొందిన
వారు,
సత్యస్వరూపమును
తెలిసికొన్న
వారు
సాక్షాత్కారమును
సాధించిన
వారు
భారతీయులే!
ఆ
పవిత్ర
స్థానమును
పొందిన
వారలను,
జాతిమత
లింగభేదములు
లేక
భారతీయులే
పూజించినారు.
అట్టి
సమయమున
పవిత్రత
సర్వ
నిబంధనలను
భస్మము
చేయును.
కాని
ఆ
4
▾
Meaning
Keep
స్థానమును
పొందక
మునుపే,
సర్వము
సమానమను
భావము
తలంచ
సాధ్యము
కానిది.
అయితే
అట్టి
పవిత్ర
సనాతన
ధర్మమును
సాధించుటకు
సాహసించవలెను.
ఇది
భారతీయుల
కర్తవ్యం.
చారిత్రక
యుగం
నుంచి
పరిశీలించిన,
హిందువులలో
ఎట్టి
మహాపురుషులు
ఏయే
తెగలందు
జన్మమొందినది
విశదముగా
తెలియును.
అవతారములు,
దైవాంశ
సంభూతులు,
జీవన్ముక్తులు
అయిన
రామ,
కృష్ణ,
బలరామ,
జనక,
పరీక్షిత్తు,
విశ్వామిత్రాది
రాజయోగులు
కూడా
క్షత్రియ
తెగయందు
ఉద్భవించిరి.
బ్రహ్మ
ఋషులు
పండితోత్తములు,
శాస్త్రవేత్తలు,
వేద
ఋషులు
బ్రాహ్మణ
తెగయందు
ఉద్భవించిరి.భారత
భాగవతాది
గ్రంథములందు
శూద్రులధికులు
కలరు.
భక్త
శేఖరులు
నిమ్నజాతియందే
అధికులు
కలరు.
దీనిని
బట్టి
చూడ
పవిత్రతను
పొందుటకు,
పరమాత్మను
చేరుటకు
వారి
వారి
సాధన
ప్రధానం
కాని
తెగలు
కావు.
అయితే
అందుకు
తగిన
అనుగ్రహమునకు
అర్హుడు
కావలెను,
అనుష్ఠానమున
క్రమబద్ధుడు
కావలెను.
ఇంతటి
పవిత్రులైన
భారతీయులు,
పైమహాపురుషుల
జీవిత
తత్త్వములను
గమనించక,
తలంచక,
వారి
ఆజ్ఞ
శిరసావహించక,
కాలకర్మముచే
పట్టుపడి,
'వినాశకాలే
విపరీత
బుద్ధిః'
అన్నట్లు
స్వార్థము
కొఱకు
అనుసరింప
వీలు
కలుగదేమో
అను
సందియమున
పేరు
ప్రఖ్యాతులకు
దాసులై,
అధికారమునకు
ఆశపడి,
హిందూ
మతమునకు
తీరని
లోటు
కలిగించుచున్నారు.
అయితే
సర్వజన
సమాహితులై,
స్వార్థరహితులై,
ప్రజా
క్షేమ
పరాయణులై,
లోక
సేవారతులై,
సర్వమును
ధారపోసిన
వారు
లేకపోలేదు.
అట్టి
మహనీయులు
లోకాధికారులైన,
ఈ
దుర్మార్గ
వ్యక్తులకు,
అనాచార
వ్యక్తులకు,
అధర్మప్రియులకు
స్థానముండదని
వారిని
చేరనీయక
అణగద్రొక్కుతున్నారు.
ఎట్టి
అగాధమైన
సముద్రమైనను,
ఒడ్డున
భూకంపము
రాగానే
జలము
తమంత
తామే
దూరముపోవును.
ఆ
అశాంతి
తగ్గిన
తోడనే
తిరిగి
యథాస్థానము
నాక్రమించును.
అట్లే
ఇట్టి
అన్యాయ,
అక్రమ,
అహంకారపు
ఆడంబర
భూకంపమునకు
చిక్కుకొనక,
సత్పురుషులు,
లోకోద్ధారకులు
దూరముగా
నుండి
వీరి
ప్రతాప
ప్రదర్శనము
చల్లబడగానే
వారు
తిరిగి
లోకమున
5
▾
Meaning
Keep
ప్రవేశింతురు.
ఇట్టి
క్షణ
భంగురమైన
అధికారములు,
అహంకారములు
స్థిరముకావు.
'పెరుగుట,
విరుగుటకు
కొఱకే'
అన్నట్టు
ఇప్పటి
అశాంతి
వాతావరణం
విరుగుటకే
కాని
పెరుగుటకు
కాదు.
లేకున్న,
ఆదినుంచి
ఎంతో
పవిత్రమైన
పద్ధతులతో,
భావనలతో,
సహనంతో,
పేరు
ప్రఖ్యాతులతో,
వేద,
శాస్త్ర,
ఉపనిషత్తులను
ఉగ్గుపాలతో
పెరిగి,
దేశ
భ్రష్టులైన
మానవులను
ఆదరించి,
అట్టి
వారికి
అండనొసగి
సమంజస
ప్రేమలు
పంచి
పెట్టిన
భారతీయులు
నేడు
చూడుడు!
భారత
సోదరులనే
తూలనాడుతు,
ఒకరిపై
ఒకరు
అధికారులు
కాగోరి,
ఒకరి
క్షేమమును
ఒకరు
ఓర్వలేక
అసూయపరులై,
పదవీ
ప్రతిష్ఠలకు
పాల్పడి,
అహంకారపరులై
తమ
(భారత)
సోదరులనే
వంచించుచూ,
అభివృద్ధి
కోరువారిని
అణగద్రొక్కుచూ,
తమ
స్వార్థమును
పొందగోరి,
(హిందువులలో
ఎన్నడూ)
కనీవినీ
ఎరుగని
దుర్గుణములను
అభివృద్ధి
పరచుకొని,
అనాచార
మాచరించుచూ
పాపభీతి,
దైవప్రీతి,
వినయ,
భయ
విశ్వాసములు
లేక
ఇంతటి
అశాంతికి
గురియయి,
శాంతికి
దూరమగుట
భారతీయులకు
తలవంపుకదా!
హిందూ
సోదరులారా!
భారత
పుత్రులారా!
సనాతన
సంప్రదాయపరులారా!
పురాణ
కాలపు
పురుష
లక్షణము
లెందుబోయెను?
సత్య,
సహన,
నీతి,
నియమములు
ఎందు
దాచితిరి?
లెండి!
తిరిగి
సత్య,
ధర్మ,
శాంతి
నిలయములైన
రామరాజ్యమును
స్థాపించండి.
భారత
సోదరులను
ప్రేమించండి.
సనాతన
ధర్మములను
అనుష్ఠించండి.
ఇప్పుడు
దహించుచున్న
అజ్ఞాన,
అశాంతి,
అక్రమ
అసూయలను
అగ్ని
జ్వాలలను
ప్రేమ,
సహన,
సత్యములను
నీటితో
ఆర్పుడు.
పవిత్ర
పురుషుల
పాలనను,
ఉత్తమ
పురుషుల
లక్షణములను,
దైవరాజ్యములను,
జ్ఞాపకమునకు
తెచ్చుకొనుడు.
తమ
తమ
తప్పులను
తాము
గ్రహింపుడు.
పరుల
తప్పులను
వెతుకుటలో
వచ్చే
సుఖమేమియు
లేదని
దృఢము
చేసుకొనుడు.
ఇట్టివి
వృథా
కాలహరణము,
కలహ
కారణము
అగును.
అట్టి
గుణములు
వదలుడు.
ఈ
తరుణము
తప్పిన
చేయునది
మరేమి?
ఆలసింపకుడు.
నిరుత్సాహమునకు
చోటివ్వక,
గడచిన
అవినీతులకు
స్వస్తి
చెప్పి,
పశ్చాత్తాపపరులై
6
▾
Meaning
Keep
దైవ
ప్రార్థనలు,
సత్కార్యములు,
సోదర
ప్రేమలు
ప్రవేశ
పెట్టుడు.
సనాతనపు
రామరాజ్యమును
స్థాపింపుడు.
ఇట్టి
రాజ్యమును
నిర్మింపగోరి
ఈ
సనాతన
సారధి
బయలుదేరి
తన
సైన్య
సహాయంతో
చేదోడు
వాదోడుగా
నిలువగలడు.
భారతీయులందరును
ఒక
తల్లి
బిడ్డలే!
ఆ
తల్లియే
సనాతన
ధర్మము:
ఆ
మాతృ
ఋణమును
భారత
పుత్రులు
తీర్చవలెను.
తల్లిని
మరచిన
పుత్రుడు
పుత్రుడు
కాడు.
తల్లిని
చెడ్డ
అన్న
తాను
మంచి
కానేరడు.
ఆ
తల్లి
పాల
పోషణే
నేటి
ప్రాణము.
ఈ
ప్రాణ
దాతయైన
సర్వుల
తండ్రి
ఒక్క
పరమాత్ముడే.
అందరూ
ఒక్క
తల్లిదండ్రుల
బిడ్డలు.
అట్టి
సోదరులలో
తమను
తాము
నిందించుకొనక,
తమ
వారలకే
తాము
చెడ్డ
కోరక,
మీ
వస్తువు
పైన
మీకెంత
ఇష్టమో,
అట్లే
ఇతర
సోదరులకు
వారి
వస్తువు
పై
వారికంత
ఇష్టమని
భావింపుడు.
ఒకరి
ఇష్టమును
ఒకరు
దూషించక,
పరిహసించక
ప్రేమించవలెను.
ఇవి
భారతీయుల
ప్రేమయుత
సత్య
లక్షణములు.
Previous
←
For a Noble Jīva, Noble Guṇa Is the Path to Fulfilment
Next
The Indweller of All Is One
→