Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Prema Vāhinī · The Indweller of All Is One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
సర్వాంతర్యామి
ఒక్కడే
పరమాత్ముడు
సర్వాంతర్యామి,
సర్వభూతాంతరాత్మ
అను
వేద,
శాస్త్ర
ఋషుల
వాక్యములు
నాటినుండి
నేటి
వరకు
సమముగనే,
నిస్సందేహముగానే
ఘోషించుచున్నవి.
సేవ్యునకు,
సేవకునకు,
సేవా
నివేదార్థమైన
ప్రకృతి,
ఈ
మూడింటికి
ఎట్టి
సంబంధానుబంధములు
కలవను
ప్రశ్నలు,
వాదనలు
నాటికి
నేటికీ
జరుగుచూనే
ఉన్నవి.
పైచెప్పినట్టి
సర్వాంతర్యామి
అయిన
పరమాత్ముని
వెతుక
నక్కరలేదనియు,
అది
కేవలం
సమీపమందే
యున్నదనియూ,
భాగవత
పద్యమును
పరమ
భక్తుడైన,
స్వానుభవముతో
ప్రహ్లాదుడు
పలికినట్లు,
ప్రతి
ఆస్తికునకు
తెలిసియే
యుండును.
వినియే
యుందురు.
ఇందుగల
డందులేడని
సందేహము
వలదు
చక్రి
సర్వోపగతుం!
డెందెందు
వెదకి
చూచిన,
అందందే
గలడు
దానవాగ్రణి
వింటే!
భగవంతుడు
అట్టివాడు,
ఇట్టివాడు
అని
చెప్పుదురు.
అవి
ఊహా
మాత్ర
సత్యములే
కాని,
పారమార్థిక
సత్యములు
కావు.
అట్టి
కల్పనము
ప్రపంచ
వ్యవహార
జ్ఞానమునకు
మాత్రమే
యోగ్యమగును.
కాని
ప్రత్యక్ష
స్వరూప
జ్ఞానమునకు
తగదు.
2
▾
Meaning
Keep
పూర్ణమును
చూచుట,
చెప్పుట,
సాధ్యము
కానిది.
భక్తులు,
సాధకులు
వారి
వారి
అంతఃకరణ
పరిణామావధినిబట్టి,
కొన్ని
భగవత్
స్థూల
రూపములను
ఆధారములుగా
గొని,
ఆ
స్థూల
రూపము
ఏ
అయోధ్యలోనో,
ఏ
ద్వారకయందో
ఉండెడివాడన్నారు.
అచట
మాత్రమే
పరమాత్ముడున్నాడు
వేరొకచోట
లేడనియు,
అట్టి
స్వరూప
శిలలు,
లేక
చిత్రములు
ఉన్న
స్థలమందు
మాత్రమే
పరమాత్ముడున్నాడు,
వేరే
స్థలములందు
లేడనియు,
అదే
పూర్ణమను
భావముతో,
భక్తితో
పూజింతురు.
ఆ
విధంగా
చేయుట
తప్పుకాదు.
అయితే
వారు
గ్రహించినది
మాత్రమే
సత్యమనియు,
అన్యుల
ధ్యేయాకారములు
నీచమనియు
ఎంతమాత్రము
తలంచరాదు:
తమ
తమ
ధ్యేయాకారములు
తమకెట్లు
ప్రీతియో,
పవిత్రమో
అన్యుల
ధ్యేయాకారములు
కూడను
వారికట్లని
తలంచవలెను.
అప్పుడు
అది
పరిచ్ఛిన్నమగును.
పరిచ్ఛిన్నము
పూర్ణమెట్లగును!
కనుకనే
నిరర్థక
వైషమ్యములకు
చోటివ్వక
అన్ని
ధ్యేయాకారములందు
సమదృష్టి
కలిగి
ఉండవలెను.
అట్లు
ఉండని
వారికి
ఏనాటికి
పూర్ణము
ప్రాప్తించదు.
ఇట్టి
ధ్యేయాకారములన్నియు
పూర్ణము
యొక్క
స్థూల
రూపములే
కాని
వేరు
కాదు.
ఈ
స్థూల
రూపమందే
సూక్ష్మ
సృష్టి
అంతయూ
ఇమిడియున్నది.
అగాధమైన
సముద్రము
యొక్క
సంపూర్ణ
రుచి
దానిలో
ఉన్న
ఒక్కొక్క
బిందువునకు
ఉన్నది.
అనగా
సముద్రము
బిందువని
అర్థము
కాదు.
సముద్రము
బిందువు
వాటి
రూపములకు,
నామములకు
ప్రత్యేక
స్థానములు
ఇచ్చినను
అందులోని
గుణము,
రుచి
ఒక్కటియే!
అదేవిధంగా
సర్వాంతర్యామియైన
పరబ్రహ్మము
వేరువేరని
భావించరాదు.
రెండూ
ఒక్కటియే.
అట్టి
సన్మాత్ర
పదార్థమును
గూర్చి
చెప్పెడి
సమయమున,
చెప్పెడి
వారి
తత్త్వమును
బట్టి,
వినెడివారి
రుచిని
బట్టి
యుండును.
అట్టి
కల్పితమైన
రూప
నామములు,
నిర్గుణ
నిరాకారములయినప్పుడే
ఆ
వస్తువును
బ్రహ్మ
మనియూ,
అదియే
సగుణ
సాకారముతో
కన్పించినప్పుడు,
రాముడనియు,
కృష్ణుడనియూ,
విష్ణువనియూ,
శివుడనియూ
భావింతురు.
భక్తులు
తన్మయావస్థ
పొందునప్పుడు
వారికీ,
భగవంతునకూ
అభేదభావముండుననుట
అన్య
…
కూడా
3
▾
Meaning
Keep
అంగీకరింతురు
కదా!
పరాభక్తియందు
అభేద
భావమును,
దేశాంతర
మతాంతర
యోగులు,
తత్త్వ
శాస్త్రవేత్తలు
సైతం
అంగీకరించక
తప్పదు.
కావున
ఈ
విషయమందు
అద్వైత
మతమునకూ
భక్తి
మతమునకు
భేదము
కానరాదు.
ఏమాత్రమైనా
కొంత
భేదము
కన్పించెనేని
అది
రుచి
విశేషమే
కాని
వస్తుతః
విశేషము
కాదు.
నామరూపాలు
కలిగినప్పుడే
అది
ప్రకృతి,
పరమాత్ముడు,
భక్తుడు
అని
వేరు
వేరు
చేయును.
నామ
రూపములే
లేనప్పుడు
అది
పుంలింగమా,
స్త్రీ
లింగమా,
నపుంసక
లింగమా
అను
సందేహమునకు,
విచారణకు
అవకాశమే
లేదు.
అప్పుడు
ఏదైనా
ఒక్కటే!
ఊహకు
అందనటువంటి
పదార్థమునకు
ఏ
పేరైనా
పెట్టవచ్చు:
ఏ
రూపమైనా
తలంచవచ్చు.
యథార్థమునకు
సన్మాత్ర
పదార్థము
నిర్గుణ
నిరాకారమైనది.
అది
సర్వత్రా
వ్యాపించిన
వస్తువు.
సగుణ
భావమున
సాధన
చేసినప్పుడు
స్థూల
రూపమును,
నిర్గుణ
భావమున
సాధన
చేసినప్పుడు
సర్వాంతర్యామియను
భావము
స్పష్టపడును.
ఈ
విధానమున,
నిజతత్త్వమును
తెలిపి,
భక్తులకు
ఆనందమును
ప్రసాదించుటకే
నిర్గుణ
పరబ్రహ్మము
సగుణ,
సాకార
రూపమున,
లోకమున
స్వరూప
నామములతో
అవతరించి,
స్థూల
కాయముతో,
ఆనందానుభూతికి
అవకాశమిచ్చును.
అట్టి
అనుభవ
మూలమున
సర్వాంతర్యామి,
సర్వ
భూతాంతరాత్మ
అను
యథార్థమును
తెలిసి
కొనగలుగుతున్నారు.
కృష్ణపరమాత్ముడు
స్థూల
రూపమందే
సర్వచరాచర
ప్రపంచమును
చూపెను.
కనుక
విశ్వమును
సూక్ష్మ
రూపమున
తన
స్థూలమందు
ఇముడ్చుకొనియుండు
మర్మమును
అర్జునుడు
దర్శించిన
తరువాతనే
తెలిసెను.
కాని
దానికి
పూర్వము
కృష్ణుడు
సర్వాంతర్యామి
అని
అర్జునుడు
తెలిసికొనలేదు.
అట్టి
ఆధారమునే
భక్తులు
ఆదర్శముగా
ఉంచుకొనిన
తప్పక
అట్టి
సర్వాంతర్యామి
దృశ్యమును
స్థూల
రూపమునందే
దర్శింపవచ్చును.
ప్రేమ,
ప్రేమించినవాడు,
ప్రేమింపబడువాడు,
మూడు
ఒక్కటే,
ప్రేమ
లేక
ప్రేమించువాడుండడు.
ప్రేమ,
ప్రేమించువాడు
ఉండియూ,
ప్రేమింపబడువారు
లేకున్న
ప్రేమ
వినియోగము
కాదు.
ఈ
మూడింటి
యందు
ప్రేమ
ప్రధాన
వస్తువుగా
తేలుచుండును.
అట్లు
సమానముగా
ప్రధానముగా
ఏది
4
▾
Meaning
Keep
అన్నింటియందు
ఇమిడియున్నదో
అదే
పరమాత్ముడు.
కాన
ప్రకృతి
ఒక
ప్రేమ,
ప్రేమించువాడు
భక్తుడు,
ప్రేమింపబడువాడు
పరమాత్ముడు.
ఈ
మూడింటియందు
భేదము
లేదు.
ఈ
మూడింటియందు
సర్వాంతర్యామిగా
కన్పడుట
ఒక్క
ప్రేమయే
కావున
సర్వము
పరమాత్మ
స్వరూపమే
అనునది
ఎందుకు
గోచరించదు?
తప్పక
గోచరించును.
సర్వము
ప్రేమమయము.
కావున
పరమాత్ముడు
ప్రేమ
స్వరూపుడనుటకు
సందేహములేదు.
సర్వ
సృష్టియందు,
సర్వజీవులందు,
ప్రేమ
పలు
విధాలుగా
ప్రకాశించుచునే
యుండును.
ప్రేమ
ఏనాటికీ
మారునది
కాదు.
కాని
వినియోగ
విధానములను
బట్టి
వివిధ
నామములు,
అనగా
వాత్సల్య
మనియు,
అనురాగమనియు,
భక్తి
అనియు,
ఇష్టమని,
అనేక
పేర్లతో
కన్పించుచుండును.
అయితే
అన్నిటియందు
ప్రేమ
స్వరూపము
మారలేదు,
మారదు.
ఇట్టి
జ్ఞానానుభవాల
ఆధారంతో
పరమాత్ముడు
సర్వ
భూతాంతరాత్మ
అను
యథార్థము
స్పష్టమగును.
ఇట్టి
ఏకత్వమైన
పరజ్ఞానమును
బోధించునట్టిదే
అద్వైతమనియు,
ప్రేమించువాడు,
ప్రేమింపబడునట్టి,
జీవ
బ్రహ్మమను
తత్త్వమును
పాటించునదే
ద్వైతమనియు,
ప్రేమ,
ప్రేమించువాడు,
ప్రేమింపబడునట్టి
ప్రకృతి,
జీవుడు,
బ్రహ్మ
అను
తత్త్వమును
ఆచరించునదే
విశిష్టాద్వైత
మనియు
చెప్పనగును.
అయితే
ఈ
మూడు
ఒక్కటియే.
పుట్టిన
బిడ్డయే
విద్యార్థి
మారును.
విద్యార్థియే
గృహస్థుడుగా
మారును.
ఈ
విధాలుగా
మారేవాడు
మాత్రం
ఒక్కటే!
పాలనుంచి
వెన్న,
మజ్జిగ
బయలుదేరును.
అన్నింటికీ
మూలాధారము
పాలు
కదా!
అన్నింటిని
ఇముడ్చుకొన్న
పాలే
అద్వైతము.
అందులోని
రెండు
తత్త్వములు
చేరిన
వెన్నయే
ద్వైతము.
అది
దూరమైన
తరువాత
నిలుచునట్టి
మజ్జిగయే
విశిష్టాద్వైతము.
అయితే
పేరు,
రుచియు
మారినా
అందులోని
రంగులు
మాత్రం
ఏనాటికీ
మారవు.
అన్నింటియందు
సమానముగా
నుండు
అతడే
నిర్గుణ
బ్రహ్మము.
భక్తి
పూజ్య
పూజక
భావములే
విత్తనములు.
పూజ్య
పదార్థమందలి
విశేషములు
మొదటి
పూజకుని
చిత్తమును
ఆకర్షించును.
పూజకుడు
పూజ్య
5
▾
Meaning
Keep
పదార్థమందలి
విశేషములను
పొందుటకై
ప్రయత్నించును.
అదియే
సాధన.
సాధన
ప్రథమమున
పూజ్య
పూజకులకు
భేదభావములు
పూర్ణముగా
నుండును.
ఆ
భావములు,
సాధన
చేయగా
చేయగా
సన్నగిల్లి,
సిద్ధావస్థయందు
అభేద
స్థితిని
పొందును.
ఎవరెట్టి
పూజ్య
పదార్థమును
గ్రహించి,
అభీష్టించి
సాధన
చేసిననూ
జీవాత్మయే
పరమాత్మయను
భావమును
దృఢముగా
భావించవలెను.
సాధకుడు
కోరదగినది
ఒక్కటే.
అది
ఈశ్వర
సాక్షాత్కారము.
మరియెట్టి
కోరికకూ
మదియందు
తావులేదు.
అందుకనే
కుంతీదేవి
కృష్ణుని
ఇట్లు
ప్రార్థించినది.
'పునర్జన్మమును
తొలగించు
నీ
దర్శనము
మాకు
కలుగుచో,
హే
జగద్గురు!
మాకెల్లప్పుడూ
కష్టములే
కలుగుగాక'.
పరమ
వస్తువును
అభిలషించి
పొందవలయునన్నచో
భక్తునకిట్టి
మనస్తత్వము
అబ్బవలయును.
అప్పుడు
సుఖ
దుఃఖముల
లెక్క
చేయక,
ఆత్మతృప్తికై
ప్రాకులాడక
తీవ్రంగా,
నిరాటంకంగా,
నిస్సందేహంగా
సాధనచేసి,
సత్య
వస్తువులను
గ్రహించిన
పిమ్మట,
పరిపూర్ణ
తృప్తి
భక్తునకు
కలుగును.
ఈ
వివరమును
పట్టిచూడ
జీవన్ముక్తునకు,
భక్తునకు
భేదము
లేదనియు,
అట్టివారు
అహంకారమునకు,
త్రిగుణ
రూపమైన
ప్రకృతికిని,
వర్ణాశ్రమ
ధర్మములకును
అతీతులై
యుందురనుటయు
స్పష్టపడును.
అట్టి
వారి
హృదయం,
దయాపూరితమును,
లోకోపకారతమును
అయివుండును.
వారి
బ్రహ్మానందమే
వారినట్లు
చేయును.
ఇట్టి
భక్తునకు
కోరికలే
యుండవు.
ఎట్లన,
అహంకార
మమకారములు
నశించినకదా
భక్తుడు!
కావున
అట్టి
వాని
హృదయమున
కోరికలకు
చోటేలేదు.
అతడు
అమృత
స్వరూపుడైన
భక్తుడు.
అమృత
స్వరూపమునకు
ఆనంద
మాధుర్యము
తప్ప
వేరెట్టి
రుచులూ
కానరావు,
నిలువలేవు.
Previous
←
Sanātana Dharma Is the Mother of All Humankind
Next
For the Sādhaka, Today Is His Own — Whose Is Tomorrow, Who Knows?
→