Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Prema Vāhinī · For the Sādhaka, Today Is His Own — Whose Is Tomorrow, Who Knows?
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
సాధకునకు
నేడు
తనది
-
రేపు
ఎవరిదో
శివుడెట్లు
సర్వాంతర్యామియో
యముడునూ
అట్లే
సర్వాంతర్యామిగా
నుండును.
యముడు
దేహసహితుడు;
అతడు
జీవుని
బాధించలేడు.
శివుడు
జీవసహితుడు.
అయితే
అతను
దేహము
నెంతకాలమునైనను
నిలుపబోడు.
జీవి
నిజతత్త్వమును
తెలిసికొనవలెనన్న,
దేహమే
మూలాధారము
కనుక
దేహాధికారియైన
యముని
దృష్టికి
యే
నిమిషము
గురియగునో,
ఏ
నిమిషము
మృత్యుపాశము
యొక్క
వలలో
తగులుకొనునో
ఈ
దేహము.
ఇట్టి
క్షుద్రమైన
దేహమును
ధరించిన
జీవుడు
పై
జాగ్రతను
ఎఱింగి,
ఏ
నిమిషముకానీ
శివునితోచేర
ఆతురత
కల్గియుండవలెను.
ఆలసించిన
అర
నిమిషమును
కూడా
వెనుకకు
త్రిప్పలేరు.
నేటిది
రేపు,
నిన్నటిది
నేడు
అని
కొన్ని
కొన్ని
కార్యములు
నిలుపుకొందురు.
అయితే
సాధన
కార్యములు
మాత్రము
అట్టివికావు.
వానికి
నిన్న,
రేపు
అనునవి
లేవు.
ఎప్పటికప్పుడే.
గడచిన
నిమిషము,
నీదికాదు;
రాబోవు
నిమిషము
నీదికాదు.
ఈ
మెలకువ
(జాగ్రత్త)
హృదయము
నందుంచుకొనిన
జీవియే
శివుని
చేరును.
ఈ
జాగ్రత్తను
హృదయమందు
చేర్చక,
కేవలము
దేహమే
ప్రధానమని
ఎంచి,
రేపు,
మాపను
తలంపులతో
లౌకికవాంఛలకు
పునాదులు
వేసికొనుచుండిన,
ఆ
జీవియే
దేహ
సంబంధమైన
జన్మలు
ఎత్తుచూ
యమదర్శనమునే
చేయుచుండును.
సాధకునకు
శివదర్శనము
తన
హక్కు
గాని,
2
▾
Meaning
Keep
యమదర్శనమును
తానేనాటికి
ఆశించరాదు,
ఆలోచించరాదు.
ఈ
దేహ,
జీవ
సంబంధమైనవాడే
మానవుడనబడును.
అట్టితత్వము
నెఱిగిన
మానవుడు
సాధనలో
ఏ
మాత్రమూ
ఆలస్యము
చేయరాదు.
ఇప్పటి
దినములలో
మానవుడు
అనిత్యమైన
లౌకిక
సుఖములను
చూచుకొనుచూ,
అనుభవించుచూ
సంతృప్తి
జెందుచున్నాడు.
మానవునకు
విశ్రాంతియే
లేదు.
రాత్రి
నిద్రతో,
పగలు
తిండి
తీర్థములతో
పెరిగి
పెరిగి,
ముసలితనమున
మృత్యువు
వెంటాడుచుండు
సమయమున
ఎటుపోవుటకు,
ఏమిచేయుటకు
తోచక,
సర్వేంద్రియ
బలములు
సన్నగిల్లి
సాయము
చేయునవేవియును
లేక
మృత్యువుకు
భృత్యుడగుచున్నాడు.
అమూల్యమైన
వజ్రములాంటి
విలువైన
మానవజన్మను,
వెలలేని
జన్మగ,
చెల్లని
కాసుగా
చేసికొనుట
ఎంత
శోచనీయము!
భగవత్
చింతన,
సాక్షాత్కారసాధన
చేయక,
కాలమును
వృథాపరచి
తర్వాత
పశ్చాత్తాపపడిన
ప్రయోజనముండదు.
ఇల్లు
కాలుచుండగా
బావిని
త్రవ్వ
ప్రారంభించిన,
త్రవ్వుట
ఎన్నటికి,
నీరు
వచ్చుట
ఏనాటికి?
ఇంక
ఇల్లు
నార్పుట
జరుగు
పనియా?
ఇది
కానిపని.
ముందుగనే
బావి
సిద్ధముగానుండిన
అట్టి
అవాంతర
సమయమున
ఎంతో
సాయపడును.
అంత్యసమయమున
భగవత్
చింతనచేయ
ప్రారంభించిన,
బావిని
త్రవ్వ
మొదలిడినట్లే
యుండును.
కాన,
నేటి
నుండియే
భగవత్
చింతనకు
ఎప్పటికప్పుడు
సిద్ధము
చేయుచుండిన,
ఏ
నిముషమున
అంత్యము
ఆసన్నమగునో
అప్పటికి
ఆదరణగా
నిలుచును.
రేపు
చేయవలసిన
సాధన
నేడే,
నేడు
చేయవలసిన
సాధన
ఇప్పుడే
ప్రారంభించవలెను.
ఏ
క్షణమున
ఏమి
జరుగునది
తెలియదు.
కనుక
చేయవలసిన
సాధన,
చేయుటకు
వెనుదీయరాదు.
ఈ
సాధనకు
దేహ
దార్ఢ్యము
కూడా
ప్రధానము.
ఈ
దేహమునకు
పోషణ
అవసరము.
అతి
పోషణ
కూడా
హానికరమే.
ఎంత
వరకు
అవసరమో
అంత
జాగ్రత్తగా
చూచుకొనవలెను.
భక్తుడు
ముక్తుడగుటకు
యుక్తి
మానవజన్మ
దుర్లభము.
ఇది
మాటిమాటికిని
రాదు.
దేహము
ఒక
సత్రమువంటిది.
మనసు
కాపలావాడు;
జీవియే
యాత్రికుడు,
కనుక
…
3
▾
Meaning
Keep
ఎవరితో
ఎట్టి
సంబంధమునూ
లేదు.
యాత్రికుడు
మోక్షపురికి
ప్రయాణమైనవాడు.
వాని
సునాయాస
ప్రయాణమునకు
సులభమైనది
పరమాత్మ
నామస్మరణయే.
ఆ
నామ
మాధుర్యమును
రుచి
చూచినవారికి
ఎప్పటికీ
ఆయాసముకాని,
అశాంతికాని,
అలసటకాని
ఉండదు.
ఆనందముగా,
ఉత్సాహముగా,
తీవ్రమైన
శ్రద్ధతో
సాధనా
ప్రయాణమును
సాగించును.
అయితే
ఇట్టి
సాధనను
సాధించవలెనన్న
సద్భావము
ప్రధానము.
పాపభయము
లేక,
సద్భావము
పుట్టదు.
భగవంతునిపై
ప్రీతి
సహితము
కలుగదు.
భయమువలన
భక్తి,
భక్తి
వలన
భగవదారాధన
అలవడును.
మూఢత్వము
మానవునకు
ముసలము.
అది
గొర్రె
వంటిది.
ఒకటి
గోతిలో
పడగానే
అన్ని
అదే
గోతిలోనే
పడును.
అది
చాలా
హానికరము.
అట్లుకాక,
ఎవరేమి
చేసినను
కొంతవరకు
యోచించి,
మంచి
చెడ్డలు
గమనించి
అందులో
దుముకుట
మంచిది.
మృత్యువు
ఎట్టి
వారినైననూ
వదలదు.
నేడు
వారిదైన,
రేపు
నీ
వంతని
బెదిరించుచునే
యుండును.
తోటలోని
మొగ్గలు
చూడుడు.
నేడు
తోటమాలి
పువ్వులు
కోయుచుండ,
నేడు
వాటివంతు,
రేపటికి
మనవంతని,
ఆనందముతో
రేపటికై
ముఖములు
విచ్చుటకు
ఎంతో
కూతూహలపడుచుండును.
ఏమైనా
చింతపడునా?
ముఖములేమైనా
వాడిపోవునా?
కళావిహీనమగునా?
కావు.
రేపటికి
తమ
వంతని
తెలియగనే,
ఎంతో
ఉత్సాహముతో
కళకళలాడుతూ
సిద్ధముగా
నుండును.
అట్లే
ఎవరికో
మృత్యువని,
రేపోమాపో
మనకు
వచ్చునేమోయని
విచారము,
యోచన
ఉండనీయక
సిద్ధముగా,
ఉత్సాహముతో
నామమును
స్మరించుకొనుచు,
సాధన
సాగించుకొంటు
ఉండవలెను.
శరీరము
గాజుగొట్టము
వంటిది.
మనస్సు
చంచలమైనది.
చంచలమైన
మానవ
మనస్సును
చూచి
మృత్యువు
నవ్వు
చుండును.
తొమ్మిది
చిల్లుల
కుండలో
జీవమనెడి
పక్షి
ఉన్నది.
ఆ
పక్షి
దేహముతో
నుండుటయు,
కుండను
చేరుటయు,
లేచిపోవుటయు
ఆశ్చర్యముగానే
యుండును.
సురులు,
మునులు,
నరులు
ఏడు
ద్వీపములు,
నవఖండములవారు
కూడా
దేహభారము
వహించు
శిక్షననుభవించుచునే
యున్నారు.
ఇందులో
మిత్రులెవరు,
శత్రువులెవరు?
అహంకారము
నశించెనా
అందరూ
మిత్రులే,
శత్రువులే
లేరు.
ఈ
జాగ్రతను
సర్వులూ
గమనించవలెను.
4
▾
Meaning
Keep
మానవునకు
శ్రవణద్వారము
ద్వారా
దుఃఖము,
ఆనందము
కలుగుచున్నది.
కనుక
బాణములాంటి
కఠినవాక్కులను
ఉపయోగించక,
అతి
మధురమైన,
ఆనందమయమయిన
మృదుభాషను
ఉపయోగించుచు,
ఆ
మార్గమునందే
సత్యమాధుర్యమును
చేర్చవలెను.
మృదుభాష
గదాయని
అందులో
అసత్యమును
చేర్చిన
అది
మరింత
దుఃఖమునకు
దారి
తీయును.
సాధువైనవాడు
అతి
మృదువు,
మధురము,
సత్యము,
ఆనందమయమైన
వాక్కుతో
మెలగవలెను.
ఇట్టివాని
సుగుణములను
ముఖమును
బట్టియే
గ్రహించవచ్చును.
కావున
సాధకుడైనవానికి
మనస్సు
మధుర,
హృదయము
ద్వారక,
దేహము
కాశీ,
పదిద్వారముల
నిలయములో
పరంజ్యోతిని
దర్శనము
చేసుకొనవలెను.
హృదయము
పరిశుభ్రముకానిదే
ఏమి
చేసియును
లాభము
లేదు.
చేపను
చూడుడు!
ఎల్లప్పుడు
నీటిలోనే
నివసించియు
దాని
దుర్వాసననేమైనా
వదిలించుకొన్నదా?
లేదు.
అహంకార
వ్యామోహములతో
చేరిన
హృదయము,
పరిశుభ్రపఱచు
ఎన్ని
సాధనలనున్నను,
మానవుని
వాసన
పోదు.
అట్టి
మానవుని
అహంకార,
మమకార
వాసనలు
పోవలెనన్న
హరిని
భజించవలెను.
వికారరహితుడైన
సాధకుడు
కావలెను.
వికారము,
సాధుత్వము
ఒకే
హృదయమున
నిలువబోవు.
ప్రకాశము,
అంధకారము
ఏనాటికినీ
ఒకేచోట,
ఒక
సమయమున
నివసించబోవు
కదా!
అరిషడ్వర్గములెవరి
హృదయమున
రాజ్యమేలునో
వానికి
అహంకారమే
మంత్రిగా
నుండును.
అట్టి
మంత్రిత్వమును
పొందినవాడు
ఎంత
పండితుడైనను,
ఎంతటి
సాధువైనను,
సన్యాసియైనను
మూర్ఖులతో
సైతము
సమానుడు
కాడు.
'పరిమళము
మోయ
గార్దభము
గజము
అగునే?'
అన్నట్లు
మంచి
గంధపు
చెక్కలను
గాడిదమోసినంత
మాత్రమున
అది
గజమగునా?
దానికి
భారము
తెలియును
కాని
వాసన
తెలియదు.
అదియే
గజమయిన
భారము
నేమాత్రము
గమనించక
అతిమధురమైన
వాసనను
మాత్రమే
స్వీకరించును
కదా!
అటులనే
సాధకుడు
కాని,
సన్యాసికాని,
భక్తుడు
కాని
సద్విషయము
లందును.
సర్వేశునియందును
శాస్త్ర
వేద,
ఉపనిషత్తులందున్న
పవిత్రమైన
నిజభావమును;
5
▾
Meaning
Keep
నిజసారమును
గమనించవలెను.
కాని,
ఇట్లుకాక,
కేవలము
పాండిత్యము
కోసము,
ప్రజల
కొఱకు
తర్కించుచు
పోవుచుండిన
వానికి
ఆ
తర్కమే
తెలియును
కాని,
సత్యము
తెలియదు.
చూచువారలు
శాస్త్ర
వేద
సారాంశుడందురు
కాని,
సారమే
లేనప్పుడు
ఇక
అంశమెక్కడ?
సారమును
వెదకువాడు
భారమును
చూడడు;
లెక్క
చేయడు.
కేవలము
తెలివిని
వినియోగించిన
తేలునదేమియును
ఉండదు.
పరమాత్మచింతనకు
ప్రేమాస్త్ర
మొక్కటియే
పెద్ద
ఆయుధము.
ఆ
ప్రేమాస్త్రమును
భద్రపరచుకొనుటకు
వివేకమను
ఒర
యుండిన
సాధకునకు
ఇక
వేరు
సహాయమే
అనవసరము.
లోకమున
చాలామంది
అతి
తెలివిని
వినియోగించి,
తర్కించి,
అధికులమని
భావింతురు.
కాని,
అది
చాలా
పొరపాటు.
నిజముగా
వివేకాధికులైన
వారికి
తర్కమే
ఉండదు.
మౌనమే
మానమని
భావింతురు.
ఎందుకన,
అధిక
స్థానమును
పొందినవారు
వేద
శాస్త్రోపనిషత్తుల
సారమును
అనుభవించియుందురు.
ఆ
సారము
సహజము
వాని
మర్మము
ఒక్కటియేయని
తెలుపును.
ఎవరెట్లు
తలచిన
పరమాత్ముడట్లు
కనుపించునని
తెల్పును.
ఈ
రెండింటి
యందును
ప్రధానమయినది,
సాధించవలసినది
వికారరహితమైన
ఏక
భావముకాని,
తర్కముకాదు.
లోకమున
ఇన్ని
సాధనలు,
ఇన్ని
జప,
ధ్యాన,
భజనలు
చేయుచున్నదెందులకు?
ఏకాగ్రతను
సాధించుట
కొఱకుగదా!
అట్టి
ఏకాగ్రత
కుదిరిన
తదుపరి
మానవ
ప్రయత్నమే
అనవసరము.
అందులోని
భావమే
వానికి
కనిపించి
నడిపించును.
కావున
సాధకులు
కాగోరువారు,
ముక్తిని
పొందగోరువారు
తర్కవాదములకు
చోటివ్వక,
తిక్కభావములకు
చిక్కుకొనక,
తన
తప్పును
తాను
కనుగొని
తిరిగి
అట్టి
తప్పును
చేయకుండా,
ఎన్ని
కష్ట
నష్ట
నిష్ఠూరములు
వచ్చి
బాధించినను
వాటిని
తృణప్రాయముగా
తలంచి,
తాను
వెదకుచున్న
గమ్యముపైననే
దృష్టినుంచి,
తన
ఏకాగ్రచిత్తమును
తాను
కాపాడుకొనవలెను.
చిన్న
దానికి,
పెద్దదానికి
అనుమానమునకు
ఆస్పదము
మిచ్చి,
పవిత్రకాలమును
వృథా
చేయక
తనకు
ఉత్సాహమును,
ఆనందమును
ఇచ్చునట్టి
విషయములను
యోచించవలెను.
ఇవి
అంత
ప్రధానము
కాక
6
▾
Meaning
Keep
పోయినను
ఈ
క్రింది
రెండు
విషయములను
మాత్రము
ముఖ్యముగా
గమనించవలెను.
ఒకటి;
నాకన్నియును
తెలియునను
అహంకారము;
రెండవది
ఔనో,
కాదో
అను
అనుమానము
ఈ
రెండూ
సాధకునకు
ముఖ్యశత్రువులు.
ఏవి
ఎట్లుండిన
తనకేమి?
తన
యథార్థము
తనకు
దృఢమా!
కాదా!
అను
నిర్ధారణ
చేసికొనవలెను.
అది
పవిత్రమైన,
అంతయునూ
పవిత్రమే!
అది
సత్యమైన,
అంతయునూ
సత్యమే!
నీవు
నీలిరంగు
అద్దములను
నీ
కన్నులకు
వేసికొనిన
ప్రకృతి
అంతయును
ఎన్నియో
విధములైన
రంగులుగా
నున్నప్పటికినీ,
నీకు
నీవు
వేసికొన్నరంగు
ఒక్కటి
మాత్రమే
కన్పించును
కదా!
లోకమంతయును
భేదముగా
కన్పించిన
అది
నీ
లోపమే.
సర్వము
ఒక
ప్రేమగా
కన్పించిన
అది
నీ
ప్రేమయే.
ఈ
రెండింటికిని
నీలో
ఉన్న
భావమే
కారణము.
తనలో
లోపములుండుటవల్లనే
లోకమునకూడను
లోపములు
కనిపించుచుండును.
తనకు
లోపమనునదే
తెలియని
సమయమున
వెదకినను
చిక్కదు.
ఏవి
లోపములో
వానికి
తెలిసిన
కదా!
అయితే
మానవుని
లోపములు
పరమాత్ముడు
వెదకుచుండునా?
పరమాత్మునియందు
సైతము
లోపములున్నవా?
అనవచ్చు.
పరమాత్ముడు
ఏనాటికిని
సద్భావమును
చూచుచు
పోవును.
కాని
లోపములు,
పాపములు
వెదకడు.
అవి
వారి
వారి
గుణాను-బంధములనుబట్టి
ఉండును.
పరమాత్మ
ధనము,
కులము,
గోత్రము,
కీర్తి,
విద్య,
బలము,
అధికారము,
స్త్రీ,
పురుష,
లింగభేదాదు
లేవియును
చూడడు,
సద్భావమును
మాత్రమే
చూచుచుండును.
అట్టి
భావము
కలవాడు
ఎవడైనను,
ఎట్టివాడైనను
తన
అనుగ్రహమునకు
అర్హుడగును.
కావున
సద్భావమును
అలవర్చుకొనుడు.
ఆనందము,
ప్రేమలతో
మెలగుడు.
ఈ
రెండును
చాలు.
తప్పక
ముక్తులు
కాగలరు.
Previous
←
The Indweller of All Is One
Next
The Difference in Guṇa Between Mānava and Dānava
→