Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Prema Vāhinī · The Difference in Guṇa Between Mānava and Dānava
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
మానవ,
దానవ,
గుణభేదములు
మానవుడు
ప్రేమమయుడు,
దయార్ద్ర
హృదయుడు,
సత్యవాక్యసంపన్నుడు.
శాంతము
మానవుని
మనోధర్మము.
అది
మానవునకు
సహజసిద్ధం.
దానిని
వెతుకవలెనన్నను,
సాధించవలెనన్నను
వేరుచోటకు
పోనక్కరలేదు.
వెండి,
బంగారము
భూగర్భమునను,
ముత్యములు,
పగడములు
సముద్రమందును
చిక్కుట
ఎట్లు
సహజమో,
అట్లే
శాంతి
సంతోషములు
కూడా
మనోవృత్తు
లందేమరుగుపడినవి.
అట్లు
మరుగు
పడిన
మహా
పదార్థములను
పొందగోరి
మనోవృత్తులు
అంతర్ముఖమును
పొందిన,
అప్పుడు
తాను
ప్రేమమయుడగును.
అట్టి
ప్రేమను
కల్గి
ప్రవర్తించువాడే
మానవుడు.
ఆ
ప్రేమ
లేనివాడే
దానవుడు.
ఆ
పవిత్ర
ప్రేమ
అప్పటికప్పుడు
మారునదికాదు.
దానికి
మార్పే
లేదు.
అది
ఒక్కటి
తప్ప
రెండు
కాదు.
ప్రేమ
గల్గినవానికి
ద్వేష,
అహంకార,
అన్యాయ,
అక్రమ,
అనాచారములు
అడుగున
పడును.
ప్రేమ
లేనివానికి
పై
అయిదు
గుణములు
పైననే
కనిపించును.
ప్రేమను
అడుగునకు
త్రొక్కి
కేవలము
గుణములకు
ప్రాధాన్యమిచ్చువాడే
దానవుడు.
కేవలము
గుణములను
పాములుగా
తలంచి
అడుగునకు
త్రొక్కి
ప్రేమను
పైకుబికించువారే
మానవులు.
దుర్వర్తన,
దురాచారాదులు
మానవత్వమును
రూపుమాపును.
2
▾
Meaning
Keep
ప్రేమామృత
హృదయులే
మానవత్వమున
కర్హులు.
నిష్కళంక,
నిస్వార్థ,
నిర్మల,
నిరతిశయానందమైనదే
యథార్థమైన
ప్రేమ.
మానవ,
దానవులకు
'మ'
కార,
'ద'
కారములు
మాత్రమే
భేదము.
మృదుత్వ,
మధురత్వ,
అమృతత్వమును
పొందినది,
'మ'
కారము.
దయా,
ధర్మరహితమైన
దహనగుణములో
చేరినవి
'ద'
కారము.
భగవంతుని
చేతి
పసిబిడ్డలై,
సర్వకార్యములను
తల్లి
అయిన
భగవంతుని
చేతులారా
చేయించుకొను
మహా
అదృష్టవంతులే
అనన్యభక్తులు.
ఇందుమూలమున,
దాసులు
కాగోరువారు
పై
గుణములను,
భక్తులు
కాగోరువారు
భగవత్
ప్రేమగుణములను,
అనన్యభక్తులు
కాగోరువారు
సంపూర్ణ
శరణాగతులుగను,
ఆయా
మార్గములకు
ఆయా
నియమములతో
నడచుకొని
అనుష్ఠానము
చేసిన,
తప్పక
అట్టి
దాసులు,
ప్రియులు,
భక్తులు
కాగలరు.
ఊరక
చదివి
నోట
నుచ్చరించుచుండిన
ఉపయోగమే
యుండదు.
ఆచరించినంతనే
ఆనందమబ్బును.
ఇట్టి
ఆనందమునకు
తెగలు,
లింగభేదములు
ఏమాత్రము
లేవు.
అలనాడు
శబరి
చెంతకు
శ్రీరామచంద్రుడు
రాగా,
శబరి
రుచిచూచి
తెచ్చిపెట్టిన
కందమూల
ఫలముల
నానందముగ
రాముడు
ఆరగించుచుండ
శబరి,
'స్వామి,
నేను
స్త్రీని;
అందునను
మందబుద్ధిని,
హీనజాతిదానను.
మిమ్ము
ఏమని
స్తుతించవలెనో,
ఎట్లు
చేయుటకు
నేమియు
తోచలేదు'
అనెను.
అప్పుడు
రాముడా
మాటలకు
నవ్వి
'శబరి,
నాకు
భక్తి
సంబంధమొక్కటే
దీక్ష.
కాని,
జాతి
సంబంధము
నాకు
లేదు.
కుల,
ధనాదు
లెన్నియుండియూ
భక్తిలేని
యెడల,
వర్షము
కురియని
మేఘములు
ఆకసమున
అటు
ఇటు
తిరిగినట్లే.
ఎంత
తిరిగి
ఏమి
ప్రయోజనము?
భక్తిలేనివా
రెట్టి
అధిక
జాతివారైనను
ధన,
బల,
కీర్తివంతులైనను
గాలిమేఘములతో
సంబంధమే.
కాని
గట్టి
నీటి
మేఘములు
కానేరవు.
భక్తులు
నవవిధ
మార్గములలో
నన్ను
చేరుచుందురు.
అందులో
ఏ
మార్గమైననూ
సరియే
అని
తెలిపెను.
అందులకు
శబరి,
స్వామీ,
ఆ
నవవిధమార్గములే
వని
ప్రార్థించ,
'శ్రవణం,
కీర్తనం,
విష్ణోస్మరణం,
పాదసేవనం,
వందనం,
అర్చనం,
దాస్యం,
స్నేహం,
ఆత్మనివేదనం'
ఇవి
నవవిధములు.
ఇందులో
ఏదే
నొక్కటి
ఎవరు
3
▾
Meaning
Keep
పాటించినను
నేను
వారికి
లభింతును.
నీలో
ఈ
నవవిధములు
నిండియున్నవి
కనుక
యోగులకు
సహితము
దుర్లభమైన
నా
దర్శన,
స్పర్శన
సంభాషణ
భాగ్యములు
నీకింత
సునాయాసముగా
లభించినవి.
నీవు
నేటికి
ధన్యురాలవైతివి'
అని
దీవించెను.
చూడుడు!
నేటి
వాక్కులు
నాటి
వాక్కులే
కదా!
భక్తి
రెండు
విధములు
పైన
చెప్పిన
నవమార్గముల
నాచరించువారు
రెండు
తెగలకు
చెందియున్నారు.
మొదటివారిది
కఠిన
సాధన.
రెండవవారిది
నిరపాయమును
సులభమునైన
సాధన.
ఈ
రెండింటినే
భక్తి,
ప్రపత్తి
అని
అందురు.
మర్కటకిశోర
న్యాయముగా
నాచరించు
దానిని
భక్తి
అనియు,
మార్జాలకిశోర
న్యాయమైనదానిని
ప్రపత్తి
అనియు
చెప్పుదురు.
భక్తి
ఎల్లప్పుడు
తైలధారవలె
అవిచ్ఛిన్నముగ
నుండవలెను.
భక్తి
ప్రపత్తు
లొక్కటే
అయియుండియు,
భిన్న
రూపముగ
ప్రవర్ధమానమగుచున్నవి.
ప్రేమలేక
ప్రపంచమున
ఏ
వస్తువును
లభించదు.
ప్రేమ
ఉండిననే
అనురాగ
మేర్పడును.
అనురాగముండిననే
లభించిన
వస్తువును
రక్షించుకొనును.
ఈ
రెండింటియందును
సమమైనది
ఒక్క
ప్రేమయే.
అయినను,
ప్రవర్తనలు
మాత్రము
భిన్నముగ
నుండును.
మర్కటకిశోర
మార్గమున
తల్లి
ఎట్లు
తిరుగుచుండినను,
బిడ్డ
తన
రక్షణభారము
నంతయు
తానే
చూచుకొనుచు,
తన
తల్లి
పొట్టను
కరచుకొని,
పట్టి
లాగినను
రాక
ఉండును.
అట్లే
భక్తుడును,
తనను
భగవంతుడు
చేయు
పరీక్షలందును,
లోకమునందలి
నిందాక్షేపణలు,
సిగ్గు
ఎగ్గులందును
సహనము
ప్రదర్శించి,
విసుగుచెందక,
విరక్తిబొందక
సోమరిగాక,
సర్వకాల
సర్వావస్థలందును
భగవన్నామమును
విడువకుండ
ఉండవలెను.
ఇందులకు
ఉపమానము
భక్తాగ్రగణ్యుడైన
ప్రహ్లాదుడే.
ఇక
ప్రపత్తిమార్గమట్లుగాక
మార్జాలకిశోర
న్యాయమువలె
ఉండును.
'సర్వభార
సమర్పితః'
అని,
తన
భారమునంతయు
భగవంతునిపై
నుంచవలెను.
పిల్లి
పిల్ల,
తన
తల్లి
పిల్లిపై
భారమువేసి
తానరచుచున్నప్పుడు,
తల్లిపిల్లే,
పిల్లిపిల్లను
4
▾
Meaning
Keep
తన
నోట
కరచుకొని,
ఉన్నత
ప్రదేశములకు
మార్చుచు,
ఇరుకైన
స్థలములందు
సహితము
అపాయము
లేక
తీసుకొనిపోవును.
అట్లే
భక్తుడగువాడు,
ప్రకృతి
తన్నెట్లు
ఎదుర్కొనినను,
తన
సర్వభారమును
పరమాత్మునిపై
నుంచి
సంపూర్ణ
శరణాగతుడైనయెడల
తనను
సర్వవిధముల
భగవానుడే
సంరక్షించు
కొనును.
ఇందులకు
లక్ష్మణ
సేవయే
సాక్షి.
భక్తి
నిష్ఠకంటెను
ప్రపత్తినిష్ఠసర్వదా
శ్రేష్ఠము.
అన్ని
విధముల
భగవంతునికి
శరణాగతి
చేయుటే
ప్రపత్తి
లక్షణము.
లక్ష్మణుడు
రామచంద్రుని
సేవకై,
తనకడ్డమగు
ధన,
దార,
మాతృ
దాయాదు
లందరిని
త్యాగమొనర్చి,
చివరకు
ఆహారాదులు
సైతము
త్యజించెను.
ఒకరోజు
కాదు,
ఒక
నెల
కాదు,
ఒక్క
సంవత్సరమూ
కాదు.
పదునాలుగేండ్లు
సర్వసుఖ
సంతోషములు
శ్రీరామచంద్రుడేయనియు,
తన
సర్వస్వము
అతడే
చూచుకొనుననియు,
అతనిని
విడనాడక
వెంటాడుటే
తన
జీవితలక్ష్యమనియు
శరణాగతుడై
ప్రవర్తించెను.
కావున
సర్వభారమును
పరమాత్మపై
నుంచి,
భగవంతుని
మాత్రము
విడువక,
మరువక
వెంటాడుచుండిన
సర్వమూ
తానే
చూసుకొనును.
ఇది
ప్రపత్తి
లక్షణము.
Previous
←
For the Sādhaka, Today Is His Own — Whose Is Tomorrow, Who Knows?
Next
Vānaprastha
→