Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Prema Vāhinī · Vānaprastha
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్రబోధ-9
వానప్రస్థము
మనుజుడు
గృహస్థుడుగా
ఉండి
సంకట,
సంతోష
సౌఖ్యములను
పొంది
అందులోని
నిజమైన
అర్థములు
గ్రహించి
45
సంవత్సరములు
లేదా
50
సంవత్సరములు
పూర్తిగ
నిండగనే,
సర్వ
సంకట
సంతోష
సౌఖ్యములను
త్యజించి
తాను
నిర్మించిన
గృహమును
వీడి,
ఊరిని
విడిచి,
అరణ్యవాసి
కావలెను.
అట్టి
తరుణమున
తన
ధర్మపత్ని
యుండిన
ఆమెను
సమ్మతిపరచి
తన
కొడుకుల
చెంతనో
తల్లిదండ్రులచెంతనో
విడువవచ్చును.
లేకున్న
వెంట
తీసికొనివెళ్ళి
సతీపతుల
భావనను
విసర్జించి,
బ్రహ్మచర్యమును
ఆచరించుచు
కేవలము
అన్న
చెల్లెలు
భావముల
ప్రవర్తించుచు,
ఆహారాదులయందు
సైతము
మార్పులు
కలిగి,
కందమూలాదులతో,
పండ్లు
పాలతో,
అట్లుకాకున్న
సాత్విక
ఆహారులై,
అగ్నిచే
పూర్తిపక్వము
పొందించక
మూడవవంతు
పక్వపరచి
భుజించవలెను.
బియ్యమును
ఎక్కువ
ఉపయోగించరాదు.
అట్లు
తనకు
తాను
ఏర్పాటుకలిగించుకొనలేని
స్థితిలో,
ఊరియందు
పోయి
భిక్షమెత్తి
ఊరియందే
భుజించక
తన
నివాసమైన
అడవికి
తెచ్చి
ఆరగించవలెను.
తానేరకమైన
ఆహారమును
భుజించునో
అట్టిదే
ఆశ్రయించినవారికి
అందించవలెను.
కాని,
వాని
రుచికి
తగినవాటిని
తయారు
చేయించుట
కాని,
తెచ్చి
యిచ్చుట
కాని
2
▾
Meaning
Keep
జరుపరాదు.
అది
వారు
భుజించిన
సరే.
లేకున్నా
పండ్లు,
పాలతోనే
వారిని
తృప్తిపరుచవలెను.
కాని,
ఇతరులకని
తన
నియమమును
మార్చరాదు.
ఎట్టి
అననుకూలపరిస్థితులు
సంభవించినను,
క్రమశిక్షణ
మాత్రము
విడువరాదు.
మార్చరాదు.
వీటిని
చాలా
ముఖ్యముగా
గమనించవలెను.
వీరు
అర్చన,
దాన
ధర్మాదులు
ఆచరించరాదు.
వారి
చెంతనుండిన
భోజనము,
వేరే
ఇతరవస్తువులు
కాని
ఇతరులకు
ఇచ్చినను
దానముగా
తలంచరాదు.
దేనినైనను
ఇతరుల
చెంతనుండి
దానముగా
సహితము
పుచ్చుకొనరాదు.
సర్వులయందు
సమాన
పవిత్ర
ప్రేమ
కలిగియుండవలెను.
ప్రతి
ఆశ్వయుజమాసమందు
జీర్ణవస్త్రములువదలి
క్రొత్త
వాటిని
గ్రహించవలెను.
వాన
ప్రస్థు
డాచరించవలసిన
వ్రతములలో
చాంద్రాయణవ్రతము
ముఖ్యము.
ఆమాసమునందు
15
దినములు
తాను
తిను
ఆహారమందు
దినమునకొక
ముద్దచొప్పున
తగ్గించవలెను.
రెండవ
పక్షమున,
క్రమక్రమేణ
దినమునకొక
ముద్దచొప్పున
హెచ్చు
చేయుచుండవలెను.
పౌర్ణమి
అమావాస్యలందు
వట్టి
గంజి
మాత్రము
త్రాగవలెను.
వర్షఋతువులో
వానలయందు
నిలిచి
తపస్సు
చేయవలెను.
హేమంత
ఋతువులో
తడిగుడ్డలతో
తపస్సులు
చేయవలెను.
క్రమాభ్యాసముగా
ఈ
తపస్సులు
చేయుచు,
ఉదయము,
మధ్యాహ్నము
సాయం
సమయములందు
స్నానము
లాచరించ
వలెను.
వివిధ
ఉపనిషద్వాక్యములను
అర్థము,
అనుభవము
సహితముగా
పఠించుచుండవలెను.
అట్టి
వానప్రస్థునికి,
ఏదైన
శరీరసంబంధమయిన
వ్యాధులు
వెంటబడిన,
తాను
భుజించుచున్న
ఆహారములు
మాని
కేవలము
జలము,
వాయువులే
ఆహారముగా
స్వీకరించి,
ఈశాన్య
దిక్కుగా
ప్రయాణము
సాగించి
మరణ
పర్యంతము
పోవలెను.
అట్లుకాక,
శరీరసంబంధమైన
వ్యాధులు
లేక
సౌఖ్యముగా
ఉండిన,
పై
నిబంధనలను
జయించిన
తరువాతనే
అప్రయత్నముగా
తనంతట
తనకే
జ్ఞానోదయము
ఏర్పడును.
ఆ
జ్ఞానమువల్ల
మోక్షప్రాప్తి
కలుగును.
ఇట్టి
నిబంధనలతో
జ్ఞానోదయ
మెట్లువచ్చును?
ఇవి
కేవలము
శరీర
నిబంధనలే
కదా?
తత్త్వావిష్కరణవల్ల
జ్ఞానోదయము
ప్రాప్తించవచ్చును
కాని,
అట్టి
ఆత్మానుభవము
చేకూర్చు
తత్త్వమును
పొందనిది
జ్ఞానమెట్లు
అబ్బును?
అట్టి
3
▾
Meaning
Keep
జ్ఞానము
లేక
మోక్షమెట్లు
ప్రాప్తించును,
అని
చాలమంది
వాదింతురు.
అది
చాల
పొరపాటు.
ఇట్టి
శరీర
నిబంధనతో
వాసనారాహిత్యమేర్పడి
ఏకాగ్రత
కుదురును.
అట్టి
ఏకాగ్రతను
బలపరచి
అభివృద్ధిచేయ
ఉపనిషద్వాక్యములు
తోడ్పడును.
క్రమక్రమేణ
అట్టి
ఉపనిషద్వాక్యానుభవములే
జ్ఞానోదయమును
చేకూర్చును.
అసలు
ఉపనిషద్వాక్యములు
జ్ఞాన
స్వరూపములే
కదా!
అట్టి
స్వరూపముల
చెంతచేరి,
అనుభవరూపమున
ఆచరించుచుండిన
ఇంక
జ్ఞానమును
వెతుకుట
అనవసరము
కదా!
అట్టి
జ్ఞానమును
సులభముగ
హృదయమున
ప్రతిష్ఠించుకొనుటకు
ఏకాగ్రత
ప్రధానము.
దానిని
పై
శరీర
నిబంధనతో,
తపః
ప్రభావముతో
సులభముగా
జయించవచ్చును.
బహిర్ముఖ
నిబంధనలు.
అంతర్ముఖ
నిబంధనలకు
ఎంతయో
తోడ్పడుచున్నవి.
ఈ
రెండింటిని
పట్టిచూడ
అంతర్ముఖ
నిబంధనలకంటెను
బహిర్ముఖ
నిబంధనలను
జయించుట
కష్టము.
చేతిలో
ఉన్న
కారు
స్టీరింగు
ఏ
మార్గమును
పట్టి
త్రిప్పుదురో
చేతికి
సంబంధములేని
చక్రములు
అదే
మార్గముననే
పరుగెత్తును.
స్టీరింగు
ఒకవైపున
త్రిప్పిన
చక్రములు
మరొకవైపు
వెళ్ళవు.
అంతర్ముఖ
భావములైన
చక్రములు
బహిర్ముఖ
స్టీరింగుపైనే
ఆధారపడినవి.
ఇది
సహజాధారము.
ఒక్కొక్క
సమయమున
స్టీరింగు
ఒక
వైపు
లాగిన
చక్రములు
మరొకవైపు
ఈడ్చును.
అది
సహజ
ధర్మమును
వదలి
ప్రవర్తించుట.
అంతర్ముఖ
చక్రములలో
సరియైన
సారముగానుండు
గాలి
నిలువలేకుండిన,
అట్లు
ఒకదాని
కొకటి
సంబంధము
లేకపోవును.
ఎట్లుండిననూ,
స్టీరింగుకు
మించిపోలేదు.
చేతిలోవున్న
స్టీరింగుకూ
తన
క్రిందనే
ఉన్న
చక్రములకు
సంబంధమున్నది.
అట్టి
సంబంధమే
లేకున్న
ప్రయాణమే
జరుగదు,
సంబంధము
లేక
ఉండనేరదు.
కాన
బహిర్ముఖవృత్తులలో
ఆరితేరి,
అరికట్టిన
వానికి
అంతర్ముఖ
వృత్తులు
అణగి,
స్వాధీనములో
నిలువగలవు.
బహిర్ముఖ
వృత్తులు
రూపనామములతో
చేరి
అనుభవసిద్ధిని
కలిగించును.
(కనుక,
అట్టి
వాటిని
జయించుటే
కొంత
శ్రమగానీ,
నామమున్న
చాలు
రూపములేకపోయినను,
అనుభవసిద్ధి
కలిగి
ఆనందము
కలిగించును.
కాబట్టి
అంతర్వృత్తులను
జయించుట
అంతశ్రమ
కాదు.)
అంతర్వృత్తులు
అతి
4
▾
Meaning
Keep
సూక్ష్మముగ
వశమగును.
బహిర్ముఖవృత్తులు
వశము
చేసుకొనుటే
కొంతబాధ.
రుచి,
రూపము,
మందమైనవి
బహిర్ముఖ
వృత్తులు;
రూప,
రుచి,
మందము
లేనివి
(సూక్ష్మములైన)
అంతర్ముఖ
వృత్తులు.
మంచినీటికి
రూపముకాని,
రుచికాని,
మందముకాని
ఉండవు.
చెడిన
నీటికే
రుచి,
రూపము,
మందము.
అట్టి
వాటిని
చక్కచేయుటే
శ్రమ
కాని
మంచివాటికి
ఏ
రూపము
కల్పించవలెనన్ననూ
సులభము.
అట్లనే,
ప్రపంచ
వ్యామోహ
వృత్తులచే
చెడిన
మనోవృత్తిని
చక్కదిద్దుటే
శ్రమకాని,
ప్రపంచ
వ్యామోహరహితమైన
మనోవృత్తులకు
సరిదిద్దే
అవసరముండదు.
వ్యామోహరహితమైన
వృత్తులు
స్వచ్ఛములై,
నిర్మలమై
నిశ్చలమైనవిగా
నుండును.
అట్టి
వాటిని
సరిదిద్దుటెందులకు?
కావున,
మానవులు
మొదట
బాహ్యవ్యామోహములను
సాధ్యమైనంతవరకు
అణచుకొని
స్వాధీనమునందుంచుకొన్న,
సులభముగా
అంతర్వృత్తులు
ఆత్మానందమునకు
తగినట్లు
నడచును.
ఇట్టి
బాహ్యవృత్తులను,
వ్యామోహములను
అరికట్టునట్టి
మార్గమే
యోగము,
తపము.
అట్టి
యోగ
తపముల
జయించు
ఉపాయమే
ఈ
వానప్రస్థ
ధర్మము.
ఇందులో
సర్వ
విధములైన
వ్యామోహముల
జయించి
అతీతుడైన,
వ్యామోహరహితునకు
మోక్షమే
గమ్యము.
ఈ
ఒక్క
మార్గమునే
మోక్షమనునది
లభించునని
కాదు.
ఏ
మార్గమునందైనను
అనుగ్రహమును
సాధించిన
అదియే
గమ్యము.
అయితే
ఈ
వాన
ప్రస్థమునకున్న
నియమ
నిష్ఠలతో
చేరు
ముక్తి
ఈ
మార్గముగా
పొందవచ్చును.
వ్యామోహరహితుడు
కావచ్చును;
ఏకాగ్రత
పొందవచ్చును.
ముక్తి
నాలుగు
విధములుగా
ఉండును
నిశ్చల
చిత్తముతో,
నిర్మల
భావముతో,
అన్యచింతలకు
చోటివ్వక
భజించిన
అదియే
భావసమాధి
అగును.
అట్టి
సమాధి
ఫలితముగా
భగవంతుడు,
ఏ
రూపమున
అతనిని
ఆరాధింతురో
ఆ
రూపమున,
భక్తుల
అంతర్దృష్టికి
గోచరించును.
భగవద్దర్శనము
కేవల
భావమాత్రమే
కాదు.
5
▾
Meaning
Keep
ముఖాముఖిగా
నుండును.
భగవంతుడు
స్థానవ్యత్యాసములు
లేక
ఏక
ప్రపంచమందే
నివసించుటగును.
దీనినే
సాలోక్యముక్తి
అందురు.
ఈ
సాలోక్యముక్తి
యందుకొన్న
భక్తుడు
భగవంతునితో
నిరంతరము
ఉండుటయే
కాక,
తాను
చూచుచున్న
వన్నియు
భగవత్
విలాసములే
అని
గ్రహించును.
ఈ
భావమును
సామీప్య
ముక్తి
అందురు.
భగవంతునితో
నిరంతరముండుట,
భగవద్
విభూతి
విలాసములను
చూచుట,
తన్మయుడై
యుండుట,
ఇవి
మూడునూ
భక్తుని
చివరకు
భగవద్వృత్తికి
కొని
వచ్చును.
ఈ
స్థితిని
సారూప్యముక్తి
యందురు.
భక్తి
శాస్త్రముయొక్క
చివరిఫలము
ఇదియే.
ఈ
స్థితియందు
భేదభావము
కొంత
ఉండును.
అందువలన
ఇది
ఉత్తమగతిగా
అద్వైత
సిద్ధాంతము
ఒప్పుకొనదు.
భగవత్సారూప్యమన్నంతనే
భగవంతునివలె
భక్తునకు
కూడా
సృష్టిస్థితి
లయ
శక్తులు
ఉండునని
భావించరాదు.
భేదభావములు
సమూలముగా
నశించి
ఐక్యమొందుటొక్కటే
ఉత్తమగతి.
దీనికే
సాయుజ్యమందురు.
దీనిని
వారి
వారి
సాధననుబట్టి
భగవంతుడు
అనుగ్రహించునే
కాని
ప్రయత్న
ఫలముగా
పొందలేరు.
భగవంతుని
తన
యిష్టప్రకారము
సేవించుచు,
ఆ
రూపానందమును
అనుభవించుచుండుటే
భక్తుని
కోరిక
కాని,
ఐక్యమును,
అట్టి
భక్తుడు
కోరడు.
భక్తుడు
కోరకున్నను
భగవంతుడు
వానికి
సాలోక్యాదిత్రయమే
కాక
సాయుజ్యంబును
కూడా
అనుగ్రహించును.
భక్తి
మార్గఫలమున
బ్రహ్మజ్ఞానసిద్ధి
కూడ
కలుగును.
అట్టి
దానిని
సయితము
భక్తుడు
కోరకున్ననూ
భగవంతుడే
అనుగ్రహించును.
ఇట్టి
సాయుజ్యముక్తినే
ఏకాంతముక్తి
అని
యందురు.
Previous
←
The Difference in Guṇa Between Mānava and Dānava
Next
For Man, Good Saṅkalpa Is the Path to God's Presence
→