Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Birth of Śrī Rāma
Rāma Kathā Rasa Vāhini
›
Part One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
కాలము గడచినకొలదీ,
రాజునకు రాణులకు
యువావస్థ దాటదొడగెను.
వృద్ధాప్యము ప్రారంభమాయెను.
కానీ పుత్రప్రాప్తి సూచన లేవియును
కనిపించకుండుటచే,
సర్వసౌఖ్య సదుపాయములతో
అంతఃపురము కళకళలాడుచున్ననూ,
రాజు, రాణుల హృదయము లందు
అశాంతి, విచారము
తాండవ మాడుచుండెను.
ఒకనాటి సాయంకాలము
రాజు, రాణులు నలుగురును
ఒకచోట చేరి
అయోధ్యా భవిష్యత్తు పరిపాలకుడెవ్వడా
అని పరిపరి విధములా,
ఎవరికి తోచినటుల వారు యోచించుచూ
కడకు దేనినీ నిర్ణయించుకొనలేక,
నిరాశా హృదయులై
రేపటి తెల్లవారి
కులగురువైన వసిష్ఠులవారిని రప్పించి,
కర్తవ్యమును విచారించుట మంచిదని
దృఢము చేసుకొని
ఎవరి వసతులకు వారు
భారమైన హృదయములతో బయలుదేరిరి.
మరుదినము తెల్లవారగానే
మంత్రులను, పండితులను రప్పించి,
కులగురువగు వసిష్ఠుల వారిని పిలిపించి,
ఈ సప్తద్వీపయుతమగు వసుంధరను
పాలించు భవిష్యత్తు రాజెవ్వరా
అను అంశముపై చర్చను ప్రారంభించి,
మహారాజు నిరాశా మనస్కుడై
గురువులవారిని అనేక రీతుల ప్రార్థించి,
ఇందుకు తగిన సలహాను, ఆశీర్వాదమును
అందించుమని కోరెను.
అంత వసిష్ఠులవారు
దీర్ఘాలోచన సలిపి,
కన్నులు తెరచి,
"రాజా!
మీరింత విచారించనక్కరలేదు.
అయోధ్యకు పతి వియోగము సంప్రాప్తించదు.
నిరంతరం మంగళమునే అందుకొనును.
ఈ వసుంధర నిత్యకల్యాణము పచ్చని
2
▾
Meaning
Keep
తోరణములతో
కళకళాలాడుతూ
కిలకిల
ధ్వనులతో
ధర్మరక్షణ
సాగించగలడు.
వేరు
రాజ
కొమరుని
ఈ
రాజ్యాధిపతిగా
చేయ
నేనంగీకరించను.
దైవకటాక్షము
అపారము.
మీ
ధర్మవ్రతమే
మిమ్ములను
పుత్రానందమున
ముంచి
తేల్చును.
ఇక
ఆలస్యము
చేయక,
విభాండక
మహాముని
కొడుకగు
ఋష్యశృంగుని
పిలిపించి,
అతనిచేత
తగిన
ఏర్పాట్లు
గావించి,
పవిత్రమగు
పుత్రకామేష్టి
యాగమును
గావింపుడు.
తప్పక
మీ
మనోరథమీదేరును"
అని
నిస్సంశయముతో
పలికిన
పదములను
తెరలోనుండి
వింటూ
ఉన్న
రాణుల
హృదయములు
ఆనందముతో
నిండెను.
నూతన
ఆశా
సుమములు
మొగ్గలు
వేయ
రాణులు
దైవమును
ప్రార్థించి
లోనికి
వెళ్లిరి.
మహారాజు
విభాండక
మహాముని
కొమారుడగు
ఋష్యశృంగుని
పిలిపించుటకు
తగినవారెవ్వరా
అని
విచారించి
తన
బాల్య
స్నేహితుడు
అంగదేశపు
రాజగు
రోమపాదుని
పిలిపించి
అతనితో
తగిన
ఏర్పాట్లు
గావించెను.
సరయూ
నదీతీరమున
యజ్ఞ
మొనర్చుటకు
తగు
అందమైన
వేదికలు
నిర్మించిరి.
అయోధ్య
ఎక్కడ
చూచిననూ
తోరణములతో
కళకళాలాడదొడగెను.
అనుకొన్నట్లు
ఋష్యశృంగమహాముని
శాంతాసమేతుడై
అయోధ్యలో
కాలు
పెట్టెను.
రాజు
వారిని
సింహద్వారమున
పాదములు
కడిగి,
ఆ
జలమును
శిరమున
ప్రోక్షించుకొని
లోనికి
తోడ్కొనిపోయి
ఉన్నతాసనమున
ఆసీనుని
గావించి,
వసిష్ఠులవారికి
నమస్కరించి,
తన
ప్రార్థనగా
యజ్ఞ
విధానమును
ఎట్లు
గావించవలెనో
ఋష్యశృంగుని
అడుగగోరెను.
అంత
మంత్రులు,
పండితులు,
మహారాజు
వారివారి
ఆసనములపై
కూర్చొనుటకు
ఋష్యశృంగులవారు
ఆజ్ఞాపించి
యజ్ఞ
విధానములు
ఒక్కొక్కటి
విపులముగ
తెల్పుచుండ,
ప్రధాన
పండితుడు
దానిని
వ్రాసుకొనుచుండెను.
ఎవరెవరు
ఏయే
స్థానములందు
కూర్చొనవలెనో
వాటినికూడనూ
స్పష్టముగా
తెలిపి,
రేపటి
తెల్లవారి
ఏడు
గంటలకే
యజ్ఞము
ప్రారంభించవలెనని
నిర్ణయించెను.
3
▾
Meaning
Keep
ఈ
వార్త
పురమున
క్షణములో
ప్రాకెను.
తెల్లవారి
వీధులు
పచ్చని
తోరణములతో,
జన
సమూహములతో
క్రిక్కిరిసిపోయెను.
సరయూతీరము
జనమయమాయెను.
రాణులతో
కూడి
మహారాజు
స్వస్తివాచనములు
మిన్నుముట్ట,
జయజయ
ధ్వనులు
మంగళ
వాద్యములు
శుభసూచనలు
సలుప
ఋష్యశృంగుడు
శాంతా
సమేతుడై
యజ్ఞశాల
చేరిరి.
ఋష్యశృంగుడు
బ్రహ్మగా
ప్రమాణము
స్వీకరించి
ఋత్విక్కులను
వారివారి
అర్హతలననుసరించి
ఆయా
స్థానముల
ఆయా
పారాయణములు
గావింప
నీమించెను.
అగ్నిహోత్రముల
నాహుతులు
ఋష్యశృంగుడు
వ్రేల్చెను.
అతి
నిష్ఠతో
నిండు
భక్తి
శ్రద్ధలతో
గావించుచున్న
ఈ
అగ్నిహోత్రమునుండి
అందరూ
చూచుచుండ
మహా
తేజోవంతుడై
చూపరులకు
మించువలె
కన్నులు
మిరుమిట్లు
గొలుప
ఒక
మహాపురుషుడొక
పాత్రను
హస్తములందుంచుకొని
ప్రత్యక్షమాయెను.
ప్రజలు
ఋత్విక్కులు,
ఆనంద,
ఆశ్చర్య,
భయ,
ఆందోళనలతో
దిగ్భ్రాంతులై
ఎక్కడివారక్కడ
స్తంభించిపోయిరి.
రాజు,
రాణులు
భక్తి
శ్రద్ధలతో
ఆ
మహా
పురుషునివైపు
చూచుచు,
ఆనంద
బాష్పములు
రాల్చుచు
చేతులు
జోడించుకొని
ప్రార్థించుచుండిరి.
ఋష్యశృంగుడు
దృష్టిని
చలించనీక,
నిష్ఠను
వీడక
అగ్నిహోత్రములో
నాహుతులు
వ్రేల్చుచుండెను.
ఇంతలో
ఒక
ప్రళయ
శబ్దమువలె
అంతరిక్షము
నుండి
పలుకులు
వినిపించెను.
ఋష్యశృంగుడు
ఆహుతులను
ఆపి,
విషయమేమిటో
యని
విన
ప్రారంభించగా,
"మహారాజా!
నీవీ
పాత్ర
నందుకొని
ఇందులోని
పాయసమును
యథోచితముగ
ముగ్గురు
రాణులకు
విభజింపుము"
అని
దశరథుని
చేతికి
ఆ
పాయసపు
పాత్రనిచ్చి
అగ్నిహోత్రమునుండి
ఉద్భవించిన
మహా
పురుషుడు
అంతర్ధానమాయెను.
ఈ
మహాద్భుతమును
చూచిన
ప్రజలు,
ఋషులు,
పండితులు,
రాజులు
మహాదానందము
నొంది
పూర్ణాహుతి
గావించి,
పాత్రను
హస్తమందుంచుకొని
ఊరేగింపుతో
రాజభవనమును
చేరిరి.
రాణులు
గురువాజ్ఞ
ననుసరించి
అభ్యంగ
స్నానము
లాచరించి,
అతినిష్ఠతో
పూజాగృహమున
ప్రవేశించిరి.
అచట
వసిష్ఠులవారు
పూజాది
కార్యము
4
▾
Meaning
Keep
పూర్తిచేసి,
అగ్నిదేవుడాసగిన
బంగారు
పాత్రయందలి
పాయసమును
బంగారు
గిన్నెలలో
పోసి
సిద్ధముగా
యుండెను.
ఇంతలో
మహారాజును
పిలిచి,
"రాజా!
ఈ
గిన్నెలను
మీ
పత్నుల
కందించుము.
మొదలు
కౌసల్యకు
తదుపరి
సుమిత్రకు
ఆ
తరువాత
కైకకు
అందించు"
మని
ఆజ్ఞ
చేసెను.
అదేరీతిగా
రాజు
గావించెను.
రాణులు
మువ్వురు
ఆ
గిన్నెలనందుకొనిరి.
వసిష్ఠులవారు
ఈ
పాయసమును
ఇప్పుడే
భుజించ
కూడదనియు,
ఋష్యశృంగులవారు
వచ్చి
ఆశీర్వదింతు
రనియు
హెచ్చరించెను.
అంత
వారు
లోనికి
వెళ్లి
తలలకు
పోగ
వేయుటకు
దాసీలు
సిద్ధముగా
వేచియుండుటచేత
కౌసల్య,
కైక
పాయసపు
గిన్నెలను
పూజాగృహములందు
భద్రపరచి
తలలార్చుకొనుచుండిరి.
సుమిత్ర
మేడ
పైభాగమునకు
వెళ్లి
గిన్నె
ఒకచోటున
ఉంచి
వెంట్రుకలు
ఆర్చుకొనుచు
'పట్టపురాణియగు
కౌసల్యకు
పుట్టిన
కొమారునకు
పట్టము
కట్టుట
రాజనీతి.
అట్లు
లేకున్న
వివాహమునకు
పూర్వము
ఇచ్చిన
మాట
ననుసరించి
కైకకు
పుట్టబోవు
కొమారునికి
రాజ్యాధికారమందించుట
మరొక
ధర్మము.
ఈ
రెండింటియందు
కొంత
బాధ్యత
కలదు.
కనుక,
ఇవి
తప్పక
జరుగును.
ఇక
నాకు
కుమారుడు
పుట్టుటచేత
కలుగు
ప్రయోజనమేమిటి?
వీరిరువురికి
వంశోద్ధారము
జరిగిన
అంతియే
చాలును.
ఏ
బాధ్యతలకూ
అర్హుడుకాని
కొమారుడు
నాకు
పుట్టుట
కంటెను
పుట్టకుండుటే
మేల'ని
తలంచుచు,
ఆలోచించుచు,
కడకు
'దైవేచ్ఛ,
కానున్నది
కాక
మానదు.
గురువాజ్ఞ,
రాజాజ్ఞ'
అని
లోనికి
వెళ్ళవలెనని
అనుకొనుచుండగానే,
ఎక్కడనుండి
వచ్చెనో
ఒక
గరుడుడు
వచ్చి
ఆ
బంగరు
గిన్నెను
తన్నుకొనిపోయెను.
జరిగిన
ఈ
అజాగ్రత్తకు
చాలా
విచారించి,
ఇక
చేయునది
లేక
ఈ
విషయము
రాజునకు
తెలిపిన
రాజేమి
బాధపడునో!
ఇది
నా
అశ్రద్ధయొక్క
కారణమని
తలంచి
సరాసరి
అక్క
దగ్గరకు
వెళ్లి
జరిగినది
జరిగినట్లు
కౌసల్యతో
తెలిపెను.
ఇంతలో
కైక
కురులార్చుకొని
బంగరు
గిన్నె
తీసుకొని
కౌసల్య
గృహమునకు
వచ్చెను.
మూవురు
చేరి
విషయము
తెలిసికొని
ఒకే
ప్రేమతో
5
▾
Meaning
Keep
అక్కచెల్లెండ్రవలె
మెలగుచుండుటచేత
రాజుకు
కష్టము
కలుగక,
సుమిత్రను
నిరాశకు
గురికానివ్వకుండుటకై
మరొక
గిన్నెను
తెప్పించి,
కౌసల్య
పాయసమునందు
కొంత
భాగమును,
కైక
పాయసమునందు
కొంత
భాగమును
ఆ
గిన్నెలో
వేసి
సుమిత్ర
కందించిరి.
మువ్వురూ
పూజాగృహమున
పీఠములపై
కూర్చొని
బయట
పండితులు
ఆశీర్వచనములు
మంత్ర
రూపముతో
అందించుచుండ
ఋష్యశృంగముని
ఆశీర్వదించ,
పాయసమును
భుజించి,
తీర్థములు
స్వీకరించి
పూజా
పీఠమునకు
నమస్కరించి
ఋష్యశృంగ
మునికి
నమస్కరించి
వారివారి
నివాసములకు
వెళ్లిరి.
కొంత
కాలము
గడచెను.
మువ్వురు
రాణులా
గర్భమును
ధరించిరను
వార్త
పురమంతయూ
ప్రాకెను.
రాణులయొక్క
దేహములు
కాంతివంతమై
కళకళాలాడదొడగెను.
పదవ
మాసము
వచ్చెను.
దాదులు
(నరసులు)
ఇప్పుడో,
అప్పుడో
అని
ప్రసవ
సమయములకు
సర్వసిద్ధములు
గావించి
రాణులను
అతి
జాగ్రత్తగా
చూచుకొనుచుండిరి.
ఇంతలో
కౌసల్యకు
ప్రసవ
బాధలు
ప్రారంభమయిన
వని
విని
దాదులు
రాణి
మందిరమునకు
వెళ్లుచుండగనే
పట్టపురాణిగారికి
కొమారుడు
కలిగెనను
వార్త
అంతఃపురమంతయూ
ప్రాకెను.
రెండవ
దినము
కైకకును
ఒక
పుత్రుడు
కలిగెను.
మూడవ
దినము
సుమిత్రకు
ప్రసవ
బాధలు
ప్రారంభమయి
ఆమె
ఇరువురు
కొమారులను
కన్నదని
అంతఃపురమేకాక,
పురమంతయూ
ఈ
వార్త
వ్యాపించెను.
అందరూ
ఆనందించిరి.
భూమి
సస్యశ్యామలమయ్యెను.
సర్వ
వాద్యములు
మ్రోగినవి.
మేఘములు
ఆనంద
జల్లులు
పన్నీరు
జల్లులవలె
పరిమళమైన
బిందువులతో
రెండు
నిమిషములు
అంతఃపురముపైన
మాత్రమే
కురిపించెను.
ఈరీతిగా
పుత్రులు
పుట్టిన
తక్షణమే
యెచటచూచిన
శుభములే
కనిపించెను.
దశరథ
మహారాజు
ఆనందమునకు
అంతులేదు.
కొమారుడు
ఒక్కడైనను
లేదని
విచారించుచున్న
సమయమున
నలుగురు
పుత్రులు
ఒకేపర్య
6
▾
Meaning
Keep
కలిగిన
వార్త
వర్ణనాతీతమైన
ఆనందము.
రాజు
బ్రాహ్మణులను
పిలిపించి
వారలకు
సువర్ణ,
గో,
భూదానములు
గావించెను.
బీదలకు
తగురీతి
ధనమును
ఇప్పించెను.
వసతులు
కల్పించెను.
వస్త్రములు
పంచెను,
అన్నము
పెట్టించెను.
ఎక్కడ
చూచిననూ
ప్రజలు
జయ,
జయధ్వనులు
గావించుచుండిరి.
శుభచిహ్నములకు
సభ్యులు
నాట్యములు
గావించదొడగిరి.
మాకు
క్రొత్త
ప్రభువులు
అవతరించిరను
ఆనందముతో
ప్రజలు,
వారింటిలో
వారలకు
పిల్లలు
కలిగినదానికంటెను
ఎక్కువగనే
ఆనందించుచుండిరి.
కొందరు
స్త్రీలు
తమ
రాణులకు
కొమరులు
కలిగినది
భగవత్కటాక్షమే
అని
విశ్వసించి
భగవంతునకు
ధన్యవాదములన్నట్లు
పూజలు
గావించిరి.
దశరథుడు
కులగురువగు
వసిష్ఠులవారిని
రప్పించి,
అతని
సలహా
ననుసరించి
ఉద్దండుడైన
సిద్ధాంతిని
పిలిపించి
జాతకములు
వ్రాయించెను.
ఉత్తరాయణ
వసంత
ఋతువు,
చైత్రమాస
శుక్లపక్ష
శుద్ధనవమి,
పునర్వసు
నక్షత్ర,
సోమవార
సింహలగ్న
అభిజిత్కాలమున
లోకమంతయూ
విశ్రమించువేళ
సమశీతోష్ణ
సమయమున
కౌసల్యకు
కొమారుడు
కలిగెను.
రెండవ
దినమున
చైత్రశుద్ధ
దశమి
మంగళవారం,
పుష్యమీ
నక్షత్ర,
గంధయోగ,
తైతులాకరణమున
కైకేయి
కొమారుని
కనెను.
మూడవ
దినమున
అనగ
చైత్రశుద్ధ
ఏకాదశి
బుధవారము
ఆశ్లేష
నక్షత్ర
వృద్ధియోగ
గరకరణమున,
సుమిత్రాదేవి
ఇరువురు
కుమారులను
ప్రసవించెను.
ఈ
వివరములు
సిద్ధాంతికి
తెలిపి,
వారి
జాతక
ఫలమెట్టిదో
విచారించి,
వీరలకు
నామకరణము
చేయుటకై
తగిన
ముహూర్తమునుకూడనూ
స్థిరపరచి
తెలుపుమని
దశరథుడు
కోరగ,
రెండు
నిమిషములు
ఆలోచించి
తమ
యోగదృష్టిచే
భవిష్యత్తును
తిలకించి
కులగురువగు
వసిష్ఠులవారు,
"మహారాజా!
నీ
కొమరులు
సామాన్యులు
కారు.
పుట్టిన
పిల్లలు
నిరుపమానులు.
వారల
కనేక
పేరులు
కలవు.
వారు
నిజముగ
మానవమాత్రులు
కారు.
మానవాకారమును
ధరించిన
దేవతా
అంశములు,
దివ్యమూర్తులు.
ఇది
ప్రజల
భాగ్యమనే
చెప్పవచ్చును.
ఇట్టి
పవిత్ర
పురుషులకు
నామకరణము
గావించుట
నా
భాగ్యమని
భావించుచున్నాను.
తల్లులు
7
▾
Meaning
Keep
వేరయినను
తండ్రి
ఒకడే
అగుటచేతను
కౌసల్యాదేవి
ప్రసవంతోనే
పురుడు
అందరికినీ
ప్రారంభమయినది.
ఈ
మధ్యలో
వచ్చిన
పురుడు
అంత
పాటించనక్కరలేదనియును
ప్రథమ
పుత్రుని
జన్మము
ననుసరించి,
పదవదినము
దాటగనే
అనగా
పదకొండవ
దినమున,
నామకరణమునకు
మంచి
సమయమనియును
ఆనాటికి
తగిన
సన్నాహములు
గావింపు
మనియూ
తెలిపి
రాజు
నమస్కారమును
అందుకొని
వసిష్ఠులవారు
వెళ్ళిపోయిరి.
సిద్ధాంతిగారు
కూడనూ
దానిని
అంగీకరించి
నామకరణమునకు
తగిన
సామగ్రి
పట్టీని
తయారుచేసి
పురోహితుని
చేతికిచ్చి
రాజు
అందించిన
కానుకల
నందుకొని
ఆనందముతో
వెడలిపోయెను.
ఆనాటినుండియు
దశరథుడు
తమ
బంధు
మిత్రులకు,
రాజులకు,
సామంతరాజులకు,
ఋషులకు,
పండితులకు
నామకరణ
వృత్తాంతమును
వారివారి
స్థానమును
అనుసరించి
పత్రములను
పరివారముతోను,
పండితులతోను,
బ్రాహ్మణులతోను,
మంత్రులతోను
తెలిపి
పంపెను.
పది
దినములు
గడచెను.
అయోధ్యాపట్టణము
అత్యంత
రమణీయముగ
అలంకరింపబడి
గంధర్వులు
గానం
చేయుచున్నారా
అన్నట్లు
ఎచ్చట
చూచినను
అతిరమ్యమైన
గానము
గాలిలో
లీనమయి,
దేశమంతయూ
వ్యాపించియున్నదా
అన్నట్లు
వినిపించెను.
వీధులలో
పరిమళ
ద్రవ్యములు
చల్లదొడగిరి.
అయోధ్య
జనులచే
క్రిక్కిరిసిపోయెను.
పండితులు,
ఋషులు
మాత్రమే
అంతఃపురమున
ప్రవేశించిరి.
మిగిలిన
రాజులు,
ప్రజలకు
తగిన
వసతులు
ఏర్పరచి
రాజ
భవనమునకు
ముందుభాగమున
అందరూ
ఆసీనులగుటకు
తగిన
పందిళ్లు
వేసియుండుటచే
అందులో
చేరి,
నామకరణ
వైభవమును
తిలకించుచుండిరి.
ఇంతలో
దర్బారు
హాలునకు
మంగళవాద్యములతో
బ్రాహ్మణ
స్వస్తివాచకములతో,
సుమంగళులు
శుభ
వచనములు
పలుకుచుండ,
కౌసల్య,
సుమిత్ర,
కైకేయి
తమ
బిడ్డలను
పొత్తిళ్లలో
ఉంచుకొని
ఒకరి
వెనుక
ఒకరు
వరుసగా
వచ్చుచుండ,
ఆ
మువ్వురు
తల్లులు,
బ్రహ్మ,
విష్ణు,
మహేశ్వరులను
8
▾
Meaning
Keep
బాలల
రూపముతో
బాహ్య
లోకమునకు
ఎత్తుకొని
వచ్చు
దేవతా
స్త్రీలవలె
కనిపించిరి.
వారి
ఆనందము,
తేజస్సు
వర్ణనాతీతము.
ప్రజలు
వారలను
చూడగనే
జేజేలు
చెప్పిరి.
స్త్రీలు
మంగళహారతులెత్తిరి.
మువ్వురికి
ఉన్నతాసనములు
తగినట్లుగా
సిద్ధము
చేసియుండిరి.
అందులో
మొదట
కౌసల్య,
తరువాత
సుమిత్ర,
తరువాత
కైక
ఆసీనులైరి.
కౌసల్య
కుడిప్రక్కన
దశరథుడు
ఆసీనుడాయెను.
బ్రాహ్మణులు
మంత్రములు
ప్రారంభించిరి.
ఒకవైపున
హోమములు
మొదలుపెట్టిరి.
బంగారు
పళ్ళెరములలో
బియ్యమును
పోసి
వాటిపై
మెత్తని
వస్త్రములు
పరచి
అందుపై
పిల్లలను
పరుండబెట్టి
వసిష్ఠులవారి
యెదుట
పెట్టిరి.
కౌసల్య
కుమారుడు
వసిష్ఠులవారివైపు
చూచుచు
ఏదో
పాతపరిచయమున్నట్లు
చూపరులకు
ఆశ్చర్యము
కల్గించునటుల
వసిష్ఠులవారిని
చెంతకు
రమ్మని
పిలిచినట్లు
ఆ
బాలుడు
గంతులు
వేయదొడగెను.
అంత
గురువు
ఆ
బాలుని
చర్యలను
చూచి
ఆనందము
పట్టలేక,
ఆనందబాష్పములు
తుడుచుకొంటూ,
అక్షతలు
చేతపట్టి
"రాజా!
కౌసల్యానందవర్ధనుడు
అందరికీ
ఆహ్లాదము
కలిగించును.
అతని
గుణరూపములు
అందరినీ
క్రీడింపజేయును.
యోగులే
ఇతనిని
రమింతురు.
కనుక
నేటినుండీ
ఈ
బాలుడు
"రాముడ"ను
పేర
బరగుచున్నాడు"
అని
కౌసల్యా
నందనునకు
రాముడని
నామకరణము
గావించెను.
అంత
ఋషులు
"భళీ
భళీ,
సరియైన
నామమ"ని
ఆనందించిరి.
తదుపరి
సుమిత్రానందవర్ధనులైన
ఇరువురు
బాలురను
తిలకించి,
పెద్ద
బాలుని
చూచి
శౌర్యవీర్యములను
ప్రదర్శించు
లక్ష్మీసంపన్నుడు
కాగలడనియు,
లక్ష్మీనారాయణుల
సేవనే
తన
శ్వాసగా
భావించి,
ఆచరించును
కనుక
అతనికి
లక్ష్మణుడనియు,
అతని
తమ్ముడు
శత్రువులను
నాశనముచేసి
అన్నల
అడుగుజాడల
ననుసరించి,
శాంతచిత్తుడై
ప్రవర్తించును
కనుక
ఆ
బాలుడు
శత్రుఘ్నుడనియు
పిలువబడును"
అని
ఆశీర్వదించెను.
9
▾
Meaning
Keep
తదుపరి
కైకేయా
ఆనందవర్ధనుడగు
బాలుని
చూచి,
"ఈతడు
అందరి
అంతఃకరణములను
ప్రేమ,
ఆనందములతో
నింపుటే
కాక,
ఆశ్చర్యకరమైన
ధర్మప్రవృత్తి
గలవాడగుననియు,
ప్రజలకు
భరణ
పోషణములను
గావించును
కనుక,
అతనికి
భరతుడనియు
నామకరణము
గావించితినని
వసిష్ఠులవారు
తెలుపగనే
ప్రజలు
పిల్లల
భవిష్యత్తుకూడా
ఇట్టివి
కాగలవని
విశ్వసించి,
ఆనాటినుండి
కౌసల్యానందనుని
రాములనియు,
సుమిత్రా
నందనులను
లక్ష్మణ
శత్రుఘ్నులనియు,
కైకేయి
నందనుని
భరతుడనియు
పిలువదొడగిరి.
వచ్చినవారలకు
భోజనములు
ఏర్పాటుగావించి,
అందరినీ
సంతృప్తిపరచి,
ఎవరికి
తగిన
గౌరవములు
వారలకు
గావించి,
దాన
ధర్మములు
సలిపి,
గోవులు,
భూములు,
సువర్ణములు
పంచిపెట్టి,
వచ్చినవారలందరికి
నచ్చినటుల
చూచి,
చేసి,
పంపించిరి.
ఆనాటినుండి
పిల్లలు
దినదిన
ప్రవర్ధమానులై
అమ్మల
చెంత
పెరుగదొడగిరి.
ఇందు
ఒక
విచిత్రము
జరుగుచుండెను.
ఏమన,
బాల్యమునుండియు
లక్ష్మణుడు
రాముని,
శత్రుఘ్నుడు
భరతుని
అనుసరించుచుండిరి.
అనుసరించుటే
కాదు,
ఒకరి
నొకరు
వీడలేని
స్థితిలో
పెరుగుచుండిరి.
ఎట్లన,
లక్ష్మణుడు
పుట్టిననాటినుండి
ఎప్పుడు
చూచిననూ
ఏడ్చుచుండెడివాడు.
దాదులు
(నరుసులు)
ఎన్నియో
విధముల
మందుపూతలు,
పోతలు
గావించిరి.
కాని,
దేనికినీ
పోరు
మానెడివాడుకాడు.
లోన
ఎట్టి
బాధ
కలదో
అని
అనేక
వైద్యములు
చేసిరి.
ఈ
బాధ
వైద్యముతో
పోయెడిది
కాదని
తలంచి,
ఒకనాడు
సుమిత్ర
గురువుగారికి
నమస్కరించి,
"స్వామీ!
పుట్టినదిమొదలు
లక్ష్మణుడు
ఎందులకో
అతిగా
ఏడ్చుచుండును.
అందులకు
తగిన
వైద్యములెన్నియో
చేయించితిని.
కానీ,
దినదినమునకు
ఏడుపు
అధిక
మగుచున్నదే
కాని,
తగ్గుటలేదు.
పాలు
కూడనూ
సరిగా
త్రాగుట
లేదు.
నిద్ర
అసలే
లేదు.
ఈరీతిగా
ఉండిన
బిడ్డ
అభివృద్ధి
యెట్లుగాంచును?
దీనికి
కారణము
తెలిపి,
ఆశీర్వదించుడు"
అని
విన
10
▾
Meaning
Keep
తెలుప,
వసిష్ఠులవారు
ఆలోచించి,
"రాణీ!
అతని
బాధవేరు,
మీరు
చేయు
వైద్యము
వేరు.
ఆ
ఆరాటము
మానవులు
గుర్తించుటకు
వీలుకానిది.
అతనికి
దేహసంబంధమైన
బాధలేమియును
లేవు.
నేను
చెప్పినటుల
చేయుము.
ఆ
క్షణమునుండియే
బాలుడు
ఏడుపు
మాని
సుఖముగ
ఆడుకొనును.
ఇప్పుడే
బాలుని
తీసుకొనిపోయి
రాముని
ప్రక్కలో
పరుండబెట్టుము.
దీనికిదియే
దివ్య
ఔషధము"
అని
ఆశీర్వదించి
వెళ్లెను.
ఆ
మాటలు
విని
సుమిత్ర,
ఏడుపు
తగ్గినచాలునను
ఆనందముతో,
కుమారుని
తీసికొనిపోయి
కౌసల్యా
నందనుడైన
రాముని
పడకపై
ప్రక్కనే
పరుండబెట్టెను.
ఆ
నిమిషమునుండియే
లక్ష్మణుని
ఏడుపు
మాయమయ్యెను.
నవ్వులు,
ఆటలు
ప్రారంభమాయెను.
చూచువారలకు
గొప్ప
ఆశ్చర్యమును
కలిగించెను.
ఇంతకుపూర్వము
నీటికి
దూరమైన
చేప
ఏవిధముగ
తపించునో,
అటుల
తపించిన
లక్ష్మణుడు
ఇపుడు
నీటిలో
చేరిన
చేప
తోకను
విప్పి
విచ్చలవిడిగా
ఆడినటుల,
రాములచెంత
తన
కాలుచేతులు
కొట్టుచు,
కేకలు
వేయుచు,
రామసన్నిధిని
ఆనందమును
గ్రోలుచు,
ఆడుచు
హోయిగా
నున్నాడు.
ఇది
ఇట్లుండ,
శత్రుఘ్నుడు
ఆనాటినుండి
పాలు
త్రాగలేదు.
విచారముగా
ఆడుటకానీ,
కదలుటకానీ
లేక
చాలా
బలహీనునివలె
కనిపించుచుండ
సుమిత్ర
అదిరిపడి
గురువులవారిని
రప్పించి,
కారణము
తెలుపగోరెను.
వసిష్ఠులవారు
చిరునవ్వులతో,
"అమ్మా!
మీ
పిల్లలు
సామాన్యులు
కారు.
వారి
జన్మలకు
ఇవి
లీలానాటకములు.
శత్రుఘ్నుని
భరతుని
పడకపై
పరుండబెట్టుము.
అతని
నిత్యకర్మలు
సక్రమముగా
జరుగును;
సంతోషముగా
నుండును.
దీనికి
విచారించనక్కరలేద"ని
ఆశీర్వదించి
వెళ్లెను.
సుమిత్ర
అటులనే
చేసెను.
ఆనాటినుండియూ
లక్ష్మణుడు
రామునిచెంత,
శత్రుఘ్నుడు
భరతునిచెంత
పెరుగజొచ్చిరి.
వారల
ఆనందమునకు
అడ్డులేదు;
అభివృద్ధికి
కొరత
లేదు.
దినదినమునకు
సూర్యకాంతివలె
ప్రకాశించుచు
పెరుగదొడగిరి.
11
▾
Meaning
Keep
సుమిత్ర
చేయునదిలేక
పిల్లల
ఆనంద
అభివృద్ధులే
తన
ప్రాణసమముగా
భావించుటచేత,
కౌసల్యదగ్గర
కొంతసేపు,
కైక
దగ్గర
కొంతసేపు
అటూ
ఇటూ
తిరుగుచూ
వారలకు
తగిన
సేవలు
చేయుచూ
పిల్లలకు
దాసివలె
పనిచేయుటయే
కానీ,
తల్లివలె
మెలగుటకు
అవకాశము
లేకపోయెడిది.
"ఇది
నా
గ్రహాచారమ"ని
ఒకనాడు
ఇటులగుటకు
కారణమేమియో
అని
ఏకాంతముగా
గురువులచెంతకు
పోయి
ప్రార్థించగా,
గురువు
ఉన్నదున్నటుల
విన్నవించెను.
"అమ్మా!
లక్ష్మణుడు
రామ
అంశమందలివాడు;
శత్రుఘ్నుడు
భరతుని
అంశమందలివాడు"
అని
మాత్రము
చెప్పుచుండగనే
సుమిత్ర,
"జ్ఞానము
నాకీనాడు
బోధ
పడినది.
ధన్యురాలను"
అని
నమస్కరించి
వెళ్లిపోయెను.
"ఆనాడు
పాయసము
గ్రద్ద
తన్నుకొనిపోగా,
రాజు
కోపించునేమో
అని
కౌసల్యకును,
కైకకును
తెలుప,
వారు
సరళ
సహన
హృదయులై
ఆమె
పాయసమందు
కొంతభాగము,
ఈమె
పాయసమందు
కొంతభాగము
నాకందించిరి.
అవియే
వారి
వారి
అంశములు.
కాకున్న
నాకు
మాత్రమే
ఇరువురు
పుత్రులు
కలుగుటకు
కారణమేమి?
ఇరువురి
అంశములను
భుజించితిని
కనుక
ఈ
బాలురు
ఇట్టి
సంబంధమును
పొందియుందురు.
దైవసంకల్ప
మెంతటి
సూక్ష్మము!
అతని
శక్తిని
కనుగొన
నెవరితరము!
దానిని
మార్చువారెవ్వరు!"
అని
తనలో
తాను
ఆనందించుచు
ఆనాటినుండియు,
"నవమాసములు
మోసి
కన్నది
తానుకానీ
కౌసల్యా,
కైకేయిలే
నా
బిడ్డల
నిజమైన
తల్లులు"
అని
దృఢము
చేసుకొని,
బిడ్డలను
వారలకే
అప్పజెప్పి,
తాను
ఆయావలె
వారలచెంత
పిల్లల
పనులు
చేయుచుండెను.
దాసీలేకాక,
రాజబంధువులు
అనేకమంది
పిల్లలను
చూచుటకై
నిత్యము
వచ్చిపోవుచుండెడివారు.
వారందరూ
చూచి
వెళ్లిన
తోడనే,
కౌసల్య
పిల్లలకు
దిష్టి
తీయించి
పారవేయించెడిది.
కౌసల్యకు
కొమారులయందుండు
అధికమగు
ప్రేమచేత,
దివారాత్రముల
గమనము
తెలిసెడిది
కాదు;
నిమిషము
పిల్లలను
విడిచి
వెళ్ళెడిది
కాదు.
స్నాన
పూజాదులుకూడనూ
లక్ష్య
మంతయూ
పిల్లలయందే
ఉంచుకొని,
అతి
శీఘ్రముగా
పనులు
చూచుకొని
వచ్చెడిది.
12
▾
Meaning
Keep
ఒకనాడు
రామలక్ష్మణులకు
స్నానము
చేయించి,
పొగలువేసి,
బంగారు
తొట్లలో
పరుండబెట్టి,
తానే
స్వయముగా
పాటపాడి,
ఊయెలనూపి,
పిల్లలు
నిద్రించగనే
దాసీలకు
పిల్లలను
చూచుకొమ్మని
తెలిపి
లోనికి
వెళ్లి,
పాయసము
కాచి
పూజగదికి
తీసుకొనిపోయి,
నైవేద్యము
గావించెను.
మరికొంతసేపటికి,
నైవేద్య
ప్రసాదం
తమ
పిల్లలకు
కొంత
పెట్టవచ్చునని
బంగరుగిన్నె
తీసుకొని
పూజగదిని
ప్రవేశించగనే
నైవేద్యముంచిన
పాత్రను
ముందు
పెట్టుకొని
జుఱ్ఱుకొనుచున్న
రాములను
చూచెను.
ఆమె
కన్నులను
ఆమెయే
నమ్మలేకపోయినది.
ఇది
నిజమా!
లేక
భ్రమయా!
తొట్లయందు
నిద్రించు
నా
బాలుడు
ఇచటికెట్లు
వచ్చెను?
ఎవరు
తెచ్చిరి?
అని
పరుగిడిపోయి
తొట్లలో
చూడ
గాఢనిద్రలో
ఉన్న
రాములను
చూచి,
ఇది
నా
భ్రాంతి
అని
తనలో
తాను
సర్దుకొని
పాయసము
గిన్నెలో
వేసుకొనుటకై
పాత్రను
చూడ,
పాత్రలో
పాయసము
గరిటెడైనను
లేకపోవుటచేత,
కొమారుని
చూచినది
భ్రాంతి
కావచ్చునుకానీ,
పాయసము
లేకపోవుట
భ్రాంతి
యెట్లగును!
అని
ఒకవైపున
ఆశ్చర్యము,
మరొకవైపు
సంశయము
ఆమెను
ఉక్కిరి
బిక్కిరి
చేసెను.
ఎటులనో
ఆ
గిన్నెలో
కొంత
ప్రసాద
ముంచుకొని
తొట్లచెంతచేరి
బాలుర
నిద్రించు
మోముల
చూచుచుండెను.
రాముడు
చప్పరించుచూ,
కన్నులు
మూసుకొని
లొట్టలు
వేయుచుండ
కౌసల్య
ఆశ్చర్యముతో
చిరునవ్వులతో
మోమును
తిలకించుచుండ,
రాముని
మొగమున
ఒక
నిమిషము
బ్రహ్మాండమే
తిరిగినటుల
కనిపించెను.
కౌసల్య
దేహమునే
మరచి,
కన్నులు
విప్పి
రెప్పలు
ఆర్చక
పిచ్చిగా
చూచుచుండుట
దాసీలు
గమనించి,
"అమ్మా!
అమ్మా!"
అని
అరచిరి.
వారల
అరుపులు
కౌసల్యకు
వినిపించలేదు.
ఒక
దాసి
అమ్మ
పాదములు
పట్టి
"అమ్మా!
దేవీ!"
అని
అనేక
విధముల
మేల్కొలిపెను.
కౌసల్య
ఉలిక్కిపడినటుల,
దేహమును
గగుర్పాటు
పడినట్టు
కదలించి
దాసీలవైపు
చూచి,
ఆశ్చర్యముతో
మంచముపై
కూర్చొని,
"దాసీ!
మీరు
బాలుని
చూచితిరా?"
అని
ప్రశ్నించెను.
"అవును
తల్లీ
మేమిక్కడనే
యున్నాము.
బాలుని
చూచుచునే
యున్నాము"
అని
జవాబుచెప్ప,
"ఎట్లు
13
▾
Meaning
Keep
చూచితిరి?
బాలునిలో
ఏమైనా
మార్పు
కనిపించెనా?"
అని
కౌసల్య
ఆతురతతో
ప్రశ్నింప,
"మాకెట్టి
మార్పునూ
కనిపించలేదు
తల్లీ,
బాలుడు
గాఢనిద్రలో
ఉన్నాడు
కదా!"
అని
జవాబు
చెప్పిరి.
కౌసల్య
తాను
చూచినదంతయూ
భ్రమయా?
లేక
నిజమా?
నిజమైనచో
వారలందరికీ
ఎందుకు
కనిపించలేదని
తనలో
తాను
అనేకవిధముల
ఆలోచనలు
జరిపి,
కడకు
పిల్లలు
యజ్ఞప్రసాదముచే
కలుగుటచే
దైవచిన్నెలు
ఈరీతిగా
కనిపించియుండవచ్చునని
తనకు
తానే
జవాబు
చెప్పుకొని,
తిరిగి
పుత్రవాత్సల్యములో
మునిగి,
వారలకు
తగిన
పరిచర్యలు
చేయుచూ,
శుక్లపక్షములోని
చంద్రునివలె
దినదిన
ప్రవర్ధమానమగుచుండిన
పుత్రులను
చూచుచు,
ముద్దాడుచూ,
తల
నిమురుచూ,
బట్టలు
సర్దుచూ
ఆనందించుచుండెడిది.
Previous
←
The Lineage of Raghu
Next
The Child Rāma
→