Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Child Rāma
Rāma Kathā Rasa Vāhini
›
Part One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
బాలరాముని
చరిత్ర
సరళముగను
శోభాకరముగను
ఉండెడిది.
అనేక
పర్యాయములు
కౌసల్య
తన
నందనుడని
మరచి
బాలునకు
చేతులు
జోడించి
నమస్కరించెడిది.
తదుపరి,
అయ్యో!
చిన్న
బాలుడు.
నా
కొమరుని
దైవముగా
భావించుటలో
తప్పు
లేకపోయినను
నమస్కరించుట
లోకులు
చూచిన
నవ్వరా!
అని
ఎవరైననూ
చూచిరేమో
అను
భ్రాంతితో
తక్షణమే
పైకి
చూచుచు
దైవమును
ప్రార్థించినటుల
నటన
చేసి,
"స్వామీ!
కటాక్షించి
నా
కొమరులను
ఆయురారోగ్యవంతులుగా
చూచుకొమ్మనియు,
నీ
మాయను
మాత్రము
నాపై
రానీయక
చూచుకొమ్మనియు,"
పలికెడిది.
ఇంతలో
కొమరుని
మొఖమును
చూడ
అందునుండి
వెలువడుచున్న
కాంతులు
కన్నులకు
మిరుమిట్లు
గొలిపెడివి;
ఎవరికి
చెప్పిన,
ఎవరేమందురో,
తననే
పిచ్చిదని
ఊహింతురేమో
అని
ఇతరులకు
చెప్పుటకు
లేక,
లోన
భరించుటకు
కాక,
ఒక్కొక్కనాటి
రామలీలలు,
మాహాత్మ్యములు
ఆమెను
ఉన్మత్తురాలుగ
చేయుచుండెను.
ఒకవేళ
తన
సన్నిహిత
సోదరియైన
సుమిత్రతోకానీ,
లేదా
కైకతోకానీ
తెలిపిన,
తన
కుమారుడు
గొప్పవాడని
ప్రదర్శించుటకై
ఇట్టి
కథలు
కల్పించి
మా
కొమారులను
ఏమీ
శక్తిలేనివారలుగా
చేయుచున్నదని
భావింతురేమో
అని
వారలతో
కూడను
చెప్పుటకు
కౌసల్యాదేవి
వెనుకముందాడెడిది.
కడకు
ఎటులనో
ధైర్యము
చేసుకొని
ఒకనాడు
దశరథునకు
జరిగిన
ఆశ్చర్య,
వినోద,
వింతలన్నియూ
తెలుప,
దశరథుడు
విని
సంతసించి,
"దేవీ!
ఇవన్నియు
నీ
వ్యామోహములు.
పుత్రవాత్సల్యముచే,
నిరంతరము
కొమారుని
దైవముతో
పోల్చుకొని
2
▾
Meaning
Keep
చింతించుటచే
ఆవిధముగ
నీ
కంటికి
కనిపించుచుండవచ్చునని
ఆమెను
పూర్తి
నిరాశయందు
ముంచక,
పూర్తి
నిజమని
తెలుపక,
కొంత
తృప్తిపడునటుల
చెప్పి
పంపెను.
దశరథుడు
ఎన్ని
చెప్పిననూ
కండ్లార
చూచిన
తల్లి
కనుక
ఆమెకు
ఏమాత్రమును
తృప్తికాక,
దశరథుని
మాటలను
నమ్మలేక
సమయమును
పురస్కరించుకొని
గురువుతో
తెలిపెను.
గురువు
ఆలోచించి,
"రాణీ!
నీవు
గాంచినవన్నియూ
పరమ
సత్యములు.
ఇవి
భ్రాంతులు
కావు.
కొమరుడు
సామాన్య
మానవమాత్రుడు
కాడు.
దేవతా
అంశము.
ఇది
మీ
జన్మజన్మల
పుణ్యఫలము.
లోకోద్ధారకుడు
కౌసల్యా
నందనుడగుట
అయోధ్యావాసుల
అదృష్టము"
అని
ఆశీర్వదించి
వెళ్ళిపోయెను.
కౌసల్యాదేవి
వసిష్ఠులవారి
మాటలను
గ్రహించి,
విశ్వసించి,
కొంత
తృప్తిపడి
తన
కొమారుని
అతిమానుష
చర్యలను
తనలో
తాను
తిలకించుచు,
ఆనందించుచు
కాలము
గడుపుచుండ,
రామ,
లక్ష్మణ,
భరత,
శత్రుఘ్నులు
దోగాడుట,
కూర్చొనుట
ఇత్యాది
కొన్ని
నూతన
అభివృద్ధులు
గాంచదొడగిరి.
పిల్లలకు
కదలి
ప్రాకగల
శక్తి
వచ్చినదని
ఎక్కడి
కైనను
ప్రాకి,
ఎత్తునుండి
క్రింద
పడుదురేమోనని
అనుమానముతో
పిల్లలను
జాగ్రత్తగా
చూచుకొనుటకు
ప్రత్యేక
ఏర్పాట్లు
గావించిరి.
అనేక
ఆటబొమ్మలను
తెప్పించిరి.
అమ్మలతోపాటు
పిల్లలు,
పిల్లలతోపాటు
అమ్మలు,
వారలతో
దాదులు
కాలమనునది
విచారించక,
కంటి
నిద్రలేక,
కాలమును
ఆనందముతో
గడుపుచుండ,
పిల్లలు
దాదుల,
అమ్మల
వ్రేళ్ళు
పట్టుకొని
లేచి
నిలువగలిగిరి.
గోడలుపట్టి
లేవగలిగిరి.
తప్పటడుగులు
వేయగలిగిరి.
ఈ
వింతలు
అమ్మలకు
మరింత
ఆనందముగా
నుండెను.
తిరిగీ
తిరుగని
చిలుక
పలుకులు
ఆ
చిన్న
పెదవులతో,
బోసి
నోరులతో
పలుకుచుండ
అమ్మలు
కడుపుబ్బ
నవ్వుచుండెడివారు.
అమ్మ,
అప్ప
అని
మాటలు
నేర్చుచుండెడివారు.
నిత్యము
తెల్లవారగనే,
సుగంధ
ద్రవ్యముల
నూరి
తైలమును
కలిపి,
వంటికి
రాచి,
నలుగులు
పెట్టి,
సరయూనది
తీర్థముచే
అభ్యంగ
స్నానములు
చేయించి,
తలలకు
వాసనల
పొగలువేసి,
కాటుక
తీర్చి,
దృష్టి
చుక్క
3
▾
Meaning
Keep
నమర్చి,
నొసటి
తిలకమును
వింతగా
పెట్టి,
అనేక
రకరకములైన
వస్త్రములతో
అలంకరించి,
ఊయలలయందు
ఉంచి,
జోలపాటలు
పాడుచుండ
తల్లులకు
వేరే
వైకుంఠమున్నదన్నది
మరచి
అదే
వారలకు
స్వర్గ
వైకుంఠములకంటే
మిన్నగా
యుండెడిది.
ఇక
ఆభరణములా?
అబ్బో!
దినమున
కొక
రకము.
కాలి
అందెలు,
మొలగజ్జెలు
కంఠ
హారములు,
అవి
గుచ్చుకొనునేమో
అని
క్రింద
ముఖమల్లు
వస్త్రమును
కుట్టి
వంటికి
పెట్టెడివారు.
బాలుర
బాలలీలలు
వర్ణనాతీతముగా
నుండెను.
బాలురు
నడువగల
వయస్కులగునప్పటికి,
పురమందలి
ఆయా
వయసు
పిల్లలను
తెప్పించి,
వారలను
వీరలను
కలిపి
ఆటలు
ఆడించడము,
తిండ్లు
పెట్టించటం,
వచ్చిన
పురప్రముఖుల
పిల్లలకు
తగిన
బహుమతులు,
ఆటబొమ్మలు
ఇవ్వడం,
ఆ
పిల్లల
తల్లులకు,
వెంటవచ్చిన
దాదులకు
తగిన
భోజన
సదుపాయములు
చేయడము,
ఈరీతిగా
కౌసల్య,
సుమిత్ర,
కైకేయిలు
తమ
తమ
దేహములనే
మరిచి
పిల్లలను
ప్రాణ
సమానముగా
చూచుకొంటూ
ఆనందించుచుండిరి.
కొంతకాల
మీరీతిగ
బాలలీలలు
తల్లులచెంత
అంతఃపురమున
జరిపి,
మూడు
సంవత్సరములు
నిండగనే
బాలురందరిని
ఆడుకొనుటకై
దాదులతో
ఆటస్థలములకు
పంపుచు,
సకాలమునకు
అంతఃపురమునకు
పిలిపించుచు
తల్లులు
అత్యంత
జాగరూకతతో
చూచుచుండిరి.
ఒకనాడు
దశరథుడు
రాణులతో
సంభాషణలు
జరుపుచు
పిల్లలు
ఈవిధముగ
దాదులతో
కూడియుండిన
విద్యాబుద్ధులు
నేర్వలేరని
యోచించి,
మంచి
ముహూర్తము
నిర్ణయించి,
గురువులవారిని
రప్పించి,
అక్షరాభ్యాసము
గావించెను.
ఆనాటినుండియు
రాజోచిత
వేషములను
విసర్జించి,
పిల్లలు
సామాన్య
గురుకుల
ఆశ్రమ
నియమము
ననుసరించి,
అంగవస్త్రము
పైన
ధరించి,
మొలకొక
తుండును
చుట్టుకొని
గురు
గృహమున
ప్రవేశించిరి.
ఇంటియందున్న
విద్యనేర్చుటకు
వీలుకాదని,
గురు
గృహమునందే,
గురుసేవలు
చేయుచు,
వారు
అందించు
ఆహారమును
మాత్రమే
భుజించుచు,
మూర్తీభవించిన
బ్రహ్మచారి
వేషములతో
విద్యను
నేర్చుచుండిరి.
4
▾
Meaning
Keep
ఎపుడైనా
పిల్లలను
చూడవలెనను
ఆశ
తల్లులకు
కలిగినపుడంతయూ
తల్లులే
గురు
గృహమునకు
వెళ్లి
పిల్లలను
చూచి
వారి
విద్యా
బుద్ధులను
గమనించి
ఆనందించి
వచ్చెడివారు.
గురువు
ఆ
పిల్లల
శ్రద్ధాభక్తులకు,
ధారణాశక్తులకు
అత్యంత
ఆశ్చర్యమును,
ఆనందమును
పొందెడివాడు.
అందునా
రాముని
శ్రద్ధ
మరింత
తీవ్రమై
యుండెడిది.
గురువు
చెప్పిన
పాఠములను
క్షణములో
తిరిగి
వప్పచెప్పెడివాడు.
రాముని
కుశాగ్రబుద్ధికి
అచ్చెరు
వొంది
రాముని
శ్రద్ధకు
అడ్డుచెప్పుట
మంచిదికాదని
భావించి,
లక్ష్మణ,
భరత,
శత్రుఘ్నులను
వేరుగా
కూర్చొనబెట్టి
రాములకు
ప్రత్యేకముగా
వేదశాస్త్రములు
వల్లించ
మొదలుపెట్టెను.
లక్ష్మణ,
భరత,
శత్రుఘ్నులు
కూడను
మహాశ్రద్ధతో
చదువుచుండినను,
నిరంతరం
రామసంయోగమునే
ఆశించుచుండెడివారు.
రాముడు
తమనుండి
నిమిషము
దూరమైనా
పాఠములపైకానీ,
గురువు
ఆజ్ఞలపైగానీ
మనసు
నిలిచెడిది
కాదు.
అందువలన
వారు
ఒకటి
రెండు
తరగతులు
వెనుక
పడుచుండిరి.
ఒక్కొక్కపరి
"మాకీ
విద్యలక్కరలేదు,
రాముడొక్కడు
మాతోనున్న
చాలున"ని
లక్ష్మణుడు
నిర్భయముగా
గురువుతో
చెప్పెడివాడు.
రాముడన్న
లక్ష్మణునకమిత
ప్రాణము.
వారలిరువురి
సంబంధము
నప్పుడప్పుడు
గమనించుచు,
గురువులవారు
తమలో
తాము
ఆనందించుచుండెడివారు.
వారు
నిజముగా,
నరనారాయణులే
అని
అనెడివారు
వసిష్ఠులవారు.
ఈరీతిగా
ఆ
దివ్యబాలురు
గురు
గృహమున
సర్వసౌఖ్యములను
త్యజించి,
గురువాజ్ఞను
అనుసరించి,
వినయ
విధేయతలతో
విద్యలను
అతిస్వల్ప
కాలమునందే
పూర్తిగావించిరి.
ఒకనాటి
సాయం
సమయమున
దశరథుడు
మంత్రితోకూడి
గురు
గృహమునకు
వెళ్లి
వేదమును
వల్లించుచున్న
పుత్ర
రత్నములను
చూచి,
వారి
ముఖారవిందములనుండి
వెలువడు
ముత్యములవంటి
స్పష్ట
పదములను
విని
పట్టలేని
ఆనందమును
పొందెను.
తన
కొమారులు
ఈ
స్వల్ప
కాలములోనే
ఇంత
అభివృద్ధి
గాంచిరని
సంతసించెను.
ఇంతలో
రాముడు
5
▾
Meaning
Keep
లేచివచ్చి
తండ్రికి
నమస్కరించెను.
అతను
చేసినది
చూచి
మిగిలిన
ముగ్గురు
సోదరులు
తండ్రికి
నమస్కరించి
నిలువబడిరి.
గురువుగారు
రాజును
సమీపించి,
రాజును
మంత్రిని
తగిన
ఉన్నతాసనమైన
చర్మాసనములపై
కూర్చొనుమని
కోరెను.
రాజు
కొమారులు
విద్యావిషయమై
ఎంతవరకు
అభివృద్ధిగాంచిరో
ఆ
విషయములను
గురువుతో
ముచ్చటించుట
ప్రారంభించెను.
వారి
సంభాషణలను
వినరాదను
సూచనగా
రాముడు
తన
గ్రంథములను
తీసుకొని
గురువాజ్ఞను
బడసి,
తన
గదికి
వెళ్లెను.
ప్రతి
విషయమునందును
రాములను
అనుసరించు
సోదరులు
కనుక,
అతని
మనసును
గ్రహించి
ముగ్గురు
సోదరులు
వెళ్లిపోయిరి.
వారు
తమ
సంభాషణను
గ్రహించి
అనుసరించిన
రామచర్యను,
వసిష్ఠులవారును,
దశరథుడును
గ్రహించి,
పిల్లల
క్రమశిక్షణకు
ఎంతో
పొంగిపోయిరి.
వసిష్ఠులవారు
ఆనంద
హృదయముతో,
"మహారాజా!
తమ
పుత్రులందరును
సమస్త
విద్యలందును
పారంగతులైరి.
రాములకు
సర్వశాస్త్రములు
కూడనూ
తెలియును.
అతడు
సామాన్యుడుకాదు.
నేను
వేదశాస్త్రములు
చెప్పుటకు
మొదలుపెట్టగనే,
తనకు
దీనికి
పూర్వమే
తెలిసినటుల
పన్నములను
అందుకొనెడివాడు.
వేదపురుషులకే
ఇది
సాధ్యముకాని
సామాన్యులకు
చేతకాదు.
పోనీ
వేదము
ఒక
గ్రంథమైననూ
అయివుండిన
ఎపుడైననూ
విరామ
సమయమున
చదివెనేమో
అని
తలంచుటకు
వేదము
గ్రంథము
కాదు.
గురు
శిష్య
పారంపర్యమై
ఒకరు
చెప్పుచుండ
మరొకరు
విని
అనుసరించవలసినదే
కానీ,
చదువునట్టిది
కాదు.
వినికిడితో
నేర్వవలసిన
విద్య
కనుకనే
దీనిని
శ్రుతి
అని
కూడనూ
అందురు.
అట్టి
పవిత్ర
పరమాత్మ
శ్వాస
సమానమైన
వేదమును,
కొన్ని
నెలలలో
పూర్తి
గావించినవారిని
నేను
ఇంతవరకూ
చూడలేదు.
చూచుటేమిటి?
ఏ
చరిత్రయందును
ఇట్టివారుండిరని
వినలేదు,
చదువలేదు.
మీ
కొమారుని
ఇట్టి
అతిమానుష
చర్యలనేకము.
ఎన్నని
నుడువగలను!
6
▾
Meaning
Keep
"మహారాజా!
ఇట్టి
పిల్లలు
నా
శిష్యులగుట
నా
తపఃఫలమే
కాని
వేరుకాదు.
ఇక
వారు
నేర్వగలిగిన
విద్య
లేవియును
లేవు.
రాజధర్మము
ననుసరించి,
ఇక
అస్త్ర,
శస్త్రవిద్యలు
నేర్వవచ్చునేకాని,
నా
చెంతవుండి
తెలిసికొను
విద్యలు
పూర్తి
అయినవి.
ఈనాడు
ముహూర్తము
కూడను
మంచిదిగా
ఉన్నది.
వచ్చిన
తమరు
ఒకేపరి
పుత్రులను
వెంటబెట్టుకొని
వెళ్లుట
మంచిది"
అని
వసిష్ఠులవారు
సెలవియ్యగనే,
తక్షణమే
పుత్రవియోగముతో
బాధనొందుచున్న
దశరథుడు
ఆనందమును
పట్టలేక
నేత్రములనుండి
బిందువులు
జలజల
రాలి
ప్రక్కనేయున్న
సుమంతునితో
తెలిపి,
రాజ
భవనమునకు
వెళ్లి
రాణులకీ
వార్త
తెలిపి,
గురు
దక్షిణగా
పిల్లలు
గురువునకు
చెల్లించవలసిన
కానుకలు
తీసుకొని
రమ్మని
పంపెను.
సుమంతుడు
కూడను
ఆనందముతో
అతి
వేగముగ
రాజ
భవనమునకు
వెళ్లి,
విషయమును
తెలిపి
కానుకలు
తీసుకొని
అనుకొన్నదానికంటెను
శీఘ్రముగా
వచ్చెను.
అంతలో
పిల్లలను
పిలిపించి
తమతమ
సామానులు
సిద్ధము
చేసుకొమ్మని
గురువు
ఆజ్ఞ
చేసెను.
అన్నియు
సిద్ధముగా
చేసి
రథమునకు
పంపిరి.
తండ్రి
ఆజ్ఞను
అనుసరించి
రామలక్ష్మణ
భరతశత్రుఘ్నులు
గురుపూజ
చేసి,
కానుకలందించి,
నమస్కరించి,
గృహమునకు
వెళ్లుటకు
అనుజ్ఞను
కోరిరి.
మహాఋషి
ఆ
పిల్లలను
తన
హస్తములలో
చేర్చుకొని
శిరస్సులను
ముద్దాడి,
ఆశీర్వదించి
వారలను
వీడలేక
కన్నుల
నీరు
తిరుగ
ఎటులనో
పొంగివచ్చు
దుఃఖము
నరికట్టుకొని
సెల
విచ్చెను.
అంత,
పిల్లలు
గురువుగారితో
రథము
వరకూ
వచ్చిరి.
అందరూ
రథములో
ఆసీనులయిరి.
రథము
కదలెను.
పిల్లలు
హస్తములు
జోడించి
గురువునకు
నమస్కరించుచూ
వారుకూడనూ
కంటిధారలు
కార్చిరి.
అదిచూచి
దశరథుడు
గురు
శిష్యుల
సంబంధమును
అర్థము
చేసుకొని
తనలో
తాను
ఆనందించుచు
భవనము
చేరిరి.
గురువు
భారమైన
హృదయముతో
గృహమున
ప్రవేశించెను.
ఎటు
చూచినను
అతనికి
దీపములేని
ఇల్లువలె
అంధకారము
కనిపించెను.
దీనిని
ఈరీతిగా
చూచుచూ
విచారించిన
ఇదొక
మోహముగా
మారగలదని
గ్రహించి,
ఆ
అనుభూతులను
మరచుటకై
ధ్యాననిష్ఠుడాయెను.
అంతలో
బాహ్యభ్రాంతి
వీడి
7
▾
Meaning
Keep
అంతరానందమున
మునిగి
ఆ
బాలురు
నలుగురు
ధర్మ,
అర్థ,
కామ,
మోక్ష
స్వరూపులనియు,
లోకమున
ఈ
నాలుగింటినీ
బోధించి
నిలబెట్టుటకై
అవతరించిన
దైవమూర్తులనియు
గ్రహించి
ఆనందించెను.
రామలక్ష్మణ
భరతశత్రుఘ్నులకు
విద్యాభ్యాసము
పూర్తి
అయినదని
దశరథుడు
తలంచి,
ఇక
రాజవిద్య
నభ్యసింపచేయనెంచి
ప్రవీణులైన
వీరులను
పిలిపించి,
వారలకు
అస్త్రశస్త్ర
విద్యలను
నేర్పించ
ప్రారంభించెను.
సర్వ
విద్యా
సంపన్నులగు
ఆ
బాలురకు
విద్య
నేర్పువారెవ్వరు!
మానవాకారమును
ధరించుటచేత
లోకరీతులవలంబించుచున్నారే
కాని,
జగన్నాటక
సూత్రధారియైన
తనకు
సూత్రములకూర్చి
బోధించువారెవ్వరు!
మాయతో
కప్పిన
మనసులు
మాధవుని
గుర్తించక
ఇట్టి
ప్రకృతి
విద్యలను
ప్రబోధించుటకు
ప్రయత్నించిరి.
లోక
సంరక్షణకై
అవతరించినపుడు
లోకముయొక్క
పోకడలను
అనుసరించవలసియుండును.
మానవాతీతమైన
ప్రవర్తనలు
సలిపిన
ప్రజలు
వాటిని
అనుసరించజాలరు.
ప్రజలకు
ఆచరణయోగ్యమైన
మార్గములందు
బోధనలు
సలుపుచూ
వచ్చిన,
సులభముగా
ధర్మరక్షణ
కాగలదు.
అందువలన
రాముడు
నివురు
కప్పిన
నిప్పువలె,
పాచికప్పిన
నీరువలె,
మేఘములు
చుట్టుకొన్న
చంద్రునివలె,
సామాన్య
బాలునివలె
మెలగుచుండెను.
మిగిలిన
సోదరులు
అన్న
అడుగుజాడల
ననుసరించుచున్నారు.
అస్త్రశస్త్ర
విద్యలను
నేర్పుటకై
నీమించిన
ప్రవీణులకు
తెలియని
శక్తియుక్తులుకూడను
రామలక్ష్మణులు
ప్రయోగించుట
చూచి
గురువులు
తమలో
తాము
ఆశ్చర్య,
భయముల
నొందెడివారు.
అయితే
రామలక్ష్మణ
భరతశత్రుఘ్నులు
ఏనాడును
తమ
అస్త్రములచే
మృగములనుగాని,
పిట్టలనుగాని
కొట్టి
యెరుగరు.
తమ
అస్త్రములు
అత్యవసర
సమయములందు
వినా,
అన్యసమయములందు
ఉపయోగించమని
ప్రమాణముచేసి
పట్టిన
దీక్షకు
ఎట్టి
సమయమునందైననూ
విరుద్ధముగ
నడిచెడివారుకారు.
అనేకపర్యాయములు
గురువులు
విహారార్థమై
అడవులకు
తీసుకొని
వెళ్లి
కొన్నిరకములైన
పిట్టలను,
మృగములను
చూపిన
సమయమున
8
▾
Meaning
Keep
రాముడు
అందుకు
సమ్మతించక,
నిరపరాధులైన
ఈ
జీవులను
కొట్టుటకు
కాదుకదా
ఈ
అస్త్రము;
లోక
సంరక్షణకై,
ప్రజాసేవకై
వినియోగింపవలసిన
పవిత్ర
అస్త్రములను
ఇట్టి
చిల్లర
మార్గమున
వినియోగించి
అపవిత్రము
చేయుటకు
నా
మనస్సొప్పుట
లేదని
గట్టిగా
చెప్పెడివాడు.
గురువులుకూడను
మారుమాటాడక
ఊరకుండెడివారు.
రామచంద్రుడు
ప్రతి
మాటయందును,
పనులయందును
తన
కారుణ్యమును
కనపరిచెడివాడు.
ఒక్కొక్కపరి
లక్ష్మణుడు
కొంత
ఉల్లాసముతో,
సరదాగా
మృగములపై
గురి
పెట్టిననూ
తక్షణము
రాముడు
అడ్డుతగిలి,
"లక్ష్మణా!
వాటివలన
నీకుకానీ,
లేక
లోకమునకుకానీ
కలిగిన
అపకారమేమని
వాటిని
కొట్టపూనుకొంటివి?
నిర్దోషుల
శిక్షించుట
రాజనీతికి
పరమ
విరుద్ధము
కాదా?"
అని
నీతులు
చెప్పెడివాడు.
మధ్యమధ్య
దశరథ
మహారాజు
మంత్రులమధ్య
పిల్లలను
చేర్చి
పరిపాలనా
విధానములు,
రాజ
నీతులు,
ధర్మనీతులు,
దైవనీతులు
చర్చించుచు,
పిల్లలకు
తెలుపుచు
తమ
తాతల
పరిపాలనను,
వారు
పొందిన
ప్రజా
మన్ననలను,
దానవులతో
దేవతలతో
వారలకు
కలిగిన
పోరాటములను,
వారలకుగల
దైవసంబంధమును
అత్యంత
ఉత్సాహముతో
కథలవలె
పిల్లలకు
తెలుపుచు,
ఒకొకపరి
మంత్రులతో
చెప్పించుచూ
బాల్యమునందే
బాలురకు
తగు
క్రమశిక్షణతోపాటు
పరిపాలనా
దక్షతను
కూడను
ప్రబోధించుచుండెను.
కాలము
గడచుకొలది
కాయములు
వృద్ధి
అగుచూ
వచ్చుచుండుట
చూచి
కుశాగ్రబుద్ధికల
ఈ
బాలురు
అతిశీఘ్ర
కాలమునందే
రాజ్య
బాధ్యత
వహించగలరను
తలంపు
మంత్రుల
యందు
దృఢమాయెను.
వారల
పరిపాలనచే,
దేశము
దివ్యలోకముగా
మారగలదని
కూడనూ
ప్రజలు
కలలు
కనెడివారు.
ప్రజలను
చూచిన
రాజకొమారులును,
రాజకొమారులను
చూచిన
ప్రజలును
ఎంతో
ఆప్యాయముగా
పరస్పర
బంధువులవలె
ప్రీతితో
మెలగెడివారు,
పలుకరించెడివారు.
నిరాడంబర,
నిగర్వ,
నిర్మల,
నిస్స్వార్థపరులైన
ఆ
బాలురను
ప్రేమించనివారు,
చూడనివారు
అయోధ్యలో
లేరు.
అయోధ్య
పిల్లల
దేహమువలె,
పిల్లలు
అయోధ్యాపట్టణపు
గుండె
వలె
సంబంధమును
కల్గియుండెను.
9
▾
Meaning
Keep
పిల్లలకు
పది
పదకొండు
సంవత్సరముల
వయసు
కావచ్చెను.
ఒకనాడు
దశరథ
మహారాజు
గుణశాలియైన
మంత్రి
సుమంతుని
పిలిపించి,
"రామలక్ష్మణ
భరత
శత్రుఘ్నులకు
ప్రకృతి
విద్యలైన
అపర
విద్యలతోపాటు
పరావిద్యలు
కూడనూ
నేర్పవలసియుండును.
పరావిద్యలు
తెలియక
అపర
విద్యలెన్నియున్నను
ధర్మమునకు
తగిన
బలము
చేకూరదు.
ఈ
లేతవయస్సుననే
ఉత్తమ
సంస్కారములు
హృదయమున
చేర్పవలెను.
భవిష్యత్తుయొక్క
మంచి
చెడ్డలు
బాల్యావస్థయందు
సంస్కరింపబడిన
అనుభూతులపై
ఆధారపడియుండును.
ఈ
అవస్థయే
భవిష్యత్తను
భవనమునకు
పునాది.
కాన,
పిల్లలకు
రాజ్య
సంచారముతోపాటు
క్షేత్రయాత్రలు
చేయించి,
తీర్థరాజములయొక్క
పవిత్రతలను,
క్షేత్రములయొక్క
విశిష్టతలను
వివరించి,
వాటిని
దర్శింపజేయుట
మంచిదని
తోచుచున్నది.
పిల్లలు
పెరుగుకొలదీ
విషయాసక్తులగుదురు.
దీనికిపూర్వమే
దైవానురక్తులుగ
చేయుట
మానవత్వమునకు
తగిన
కర్తవ్యము.
ఇది
ప్రభువులకు
అతి
ప్రధానము.
కనుక,
గురువుల
వారితో
సంప్రదించి
యాత్రకు
తగిన
ప్రయత్నములు
గావింపుమ"ని
ఆజ్ఞాపించెను.
అంత
సుమంతుడు
కూడను
సంతసించి,
తగిన
ఏర్పాట్లు
గావించి
పిల్లలతో
తానుకూడను
వెళ్లుటకు
సర్వసిద్ధమాయెను.
అంతఃపురములో
ఈ
యాత్రా
వార్త
తెలిసెను.
రాణులు
తమ
కొమారులు
పవిత్ర
యాత్ర
సాగించ
బోవుచున్నారను
ఆనందముతో
ప్రయాణమునకు
తగిన
ఆహార
విహార
సదుపాయములు
అన్నియూ
సిద్ధము
చేయించిరి.
వారలవెంట
దాదులను,
కొంతమంది
పుర
బాలురను
పంప
సిద్ధము
చేసిరి.
రామలక్ష్మణ
భరత
శత్రుఘ్నులు
పవిత్ర
యాత్ర
సలుపుచున్నామని
పట్టలేని
ఆనందమును
ప్రదర్శించుచు,
తమ
తోటి
బాలురను
కూడనూ
ప్రోత్సహించి,
వారలకు
తగిన
ప్రయాణ
సౌకర్యములను
తండ్రితో
చెప్పి
సిద్ధము
చేయించిరి.
రెండవ
దినము
సుముహూర్తము
సమీపించగనే
తల్లులకు
తండ్రికి
నమస్కరించి,
గురువులవారికి
నమస్కరించి,
తల్లులతో
హారతులు
అందుకొని,
10
▾
Meaning
Keep
దృష్టి
చుక్కలను,
రక్ష
చుక్కలను
పెట్టించుకొని,
రాజ
వేషములు
విప్పి,
సామాన్య
యాత్రికుల
వేషములను
అనగా
పట్టుధోవతులు
కట్టి,
అంగ
వస్త్రములు
కప్పి,
రథములలో
కూర్చొని
జయజయధ్వనులతో
రథములను
కదిలించిరి.
ముందు
వెనుక
రక్షక
భటుల
రథములు
వాయువేగముతో
పరుగెత్తుచుండెను.
దినములు,
వారములు
గడచిపోయెను.
ప్రతి
క్షేత్రమును,
ప్రతి
తీర్థమును
దర్శించి,
పూజించి,
విషయములను
విచారించి,
అత్యంత
ఉత్సాహముతో
భక్తిశ్రద్ధలతో
అన్యవాంఛలకు
చోటివ్వక
నిరంతరం
క్షేత్రముల
విశేష
చరిత్రలను
సుమంతుడు
చెప్పుచుండ,
పిల్లలు
శ్రద్ధాళురై,
ఇంకేమిటి?
ఇంకేమిటి?
అని
క్షేత్ర
విశేషములను
విపులముగా
అడుగుచుండెడివారు.
వారల
శ్రద్ధాభక్తులకు
సుమంతుడు
ఎంతయో
ఆనందించుచూ
మరిన్ని
విశేషములు
తెలుపుచుండెడి
వాడు.
ఈరీతిగా
కన్యాకుమారి
మొదలు
కాశ్మీరువరకు,
ఉత్తర
దక్షిణ
తూర్పు
పడమర
సముద్రముల
తీరముల
వరకునూ
గల
క్షేత్రములను
మూడు
నాలుగు
మాసములు
సంచారము
సలిపి,
మధ్యమధ్య
ఆయా
రాజ్యములందుగల
కొన్ని
ప్రజా
అననుకూలములను,
యాత్రికుల
అననుకూలములను
గుర్తించి,
మంత్రితో
చెప్పి
వాటిని
సరిచేయించుచు,
దైవమందిరములకు
తగిన
ఏర్పాట్లు,
భద్రతలు
కల్పించుచు
అనేకవిధముల
యాత్రికులకు
నీటి
వసతులు,
వృక్షచ్ఛాయలను,
చలివేంద్రములను,
సత్రములను,
ఆరోగ్యకేంద్రములను
నీమించమని
రాముడు
తెలుపగా
రామాభీష్టములకు
అడ్డుచెప్పక
కోరిన
వాటినన్నింటిని
అతిశీఘ్రముగానే
చేయించుచూ
వచ్చుచున్న
సుమంతుని
చూచి,
పిల్లలు
తమలో
తాము
ఆనందించుచూ,
మన
మంత్రివంటి
మంత్రులు
లోకమున
ఉండిన,
లోక
క్షేమమునకు
కొదువ
రాదని
ఒకరితోనొకరు
గుసగుసలాడేవారు.
ఇక
అయోధ్యలో
కొమారులయొక్క
క్షేమవార్తలు
అప్పుడప్పుడు
మాత్రమే
గూఢచారులచే
తెలియజేయ
బడుచుండెను.
దూరశ్రవణ
యంత్రములు
ఆనాడు
లేకపోవుటచే
గూఢచారులే
వార్తలనందించుచుండెడి
వారు.
అందువలన
వార్తలు
చేరుట
ఆలస్యమయ్యెడిది.
ఒకొకపరి
రాణులు
పుత్రవియోగము
భరించలేక,
11
▾
Meaning
Keep
ఎక్కడున్నారో
ఆహారము,
గాలుల
మార్పుచే
ఆరోగ్యములు
ఎట్లున్నవో
అని
తమలో
తాము
అనుమానములకు
గురియై
వసిష్ఠులవారిని
రప్పించి,
పిల్లల
క్షేమవార్తలను
అడిగెడివారు.
అతను
తన
యోగదృష్టితో
పరిశీలించి,
పిల్లలకెట్టి
ఇబ్బందియూ
లేక
ఆనందముగా
యాత్రలు
సాగించుచున్నారు;
అతి
శీఘ్రముగానే
అయోధ్యను
చేరగలరని
తెలిపి,
రాణులకు
ధైర్యానందములందించి
వారల
నాశీర్వదించి
వెళ్లుచుండెడివాడు.
గూఢచారులవలన
రాజకొమారులు
ఇంక
రెండు
దినములలో
అయోధ్య
చేరనున్నారని
విని
యాత్రనుండి
దిగ్విజయము
నందుకొని
దివ్యమూర్తులైన
పుత్రులు
నలుగురు
అయోధ్య
చేరుచున్నారని
వారలకు
మంగళ
స్వాగతములకై
వారు
సింహద్వారమున,
దివ్య
వైభవములతో
ఏర్పాట్లు
గావించిరి.
పురవీధులలో,
స్త్రీలు
ఇరువైపులా
హారతులిచ్చుటకు
తగిన
వసతులు
చేయించిరి.
ధూళిని
యెగురనియ్యకుండుటకై
వీధులను
పన్నీరు
జల్లులచే
చల్లబరచిరి.
అనుకొన్నటులనే
రాజకొమారులు
సింహద్వారము
ప్రవేశించి,
మంగళ
హారతులందుకొని
పురవీధులలో
పుష్పములు
చల్లుచుండ,
మంగళ
వాద్యములు
స్వాగత
పదములు
పాడుచుండ,
బ్రాహ్మణులు
ఆశీర్వాదములు
చెప్పుచుండ,
సుమంత
సమేతులై
పూర్ణతేజస్సుతో
భగవత్
కళలు
మెరయుచు
రాజభవనము
చేరిరి.
వారలకు
అనేకరకముల
దృష్టిని
తీయించి
లోనికి
తీసుకొనిపోయిరి.
కొమరులను
చూచుటకై
కన్నులు
కాయలైయున్న
తల్లులు
వారలకై
అంతఃపురమున
కాచియుండుటచేత
నలుగురు
కొమారులు
పరుగిడిపోయి
తల్లులకు
నమస్కరించి,
వారల
హస్తములలో
చిక్కుకొని
అనుభవించు
ఆనందమునకు
సాటి
వేరులేదు.
ఆరు
నిమిషములు
స్పృహలేని
కాయములై
సాయుజ్యస్థితి
అనుభవించిరి.
తల్లుల
కన్నులనుండి
కారు
ఆనందబాష్పములచే
పట్టరాని
ప్రేమచే
తలలు
తడిసిపోయెను.
కొంతసేపయిన
తరువాత,
వారి
చీర
పయిటలతో
తలలపై
పడిన
తమ
కన్నీటిని
తుడిచి
శిరస్సులను
ముద్దాడి,
పీఠములపై
కూర్చొని,
తమతమ
కొడుకులను
ఒడిలో
ఉంచుకొని
చక్కెర
పొంగలి,
దధ్యోదనములు
12
▾
Meaning
Keep
తెప్పించి
తల్లులు
తమ
హస్తములతో
నోటిలో
పెట్టుచుండ,
అబ్బా!
ఆ
తల్లుల
ఆనందము
వర్ణనాతీతము.
మూడు
నెలలు
పుత్ర
వియోగముచే
పొందిన
ప్రేమతాపమును
చల్లార్చుకొనుటకై
కొన్ని
దినములు,
తమతమ
బిడ్డలను
రాత్రింబవళ్ళు
తమచెంతనే
ఉంచుకొని
మధ్యమధ్య
యాత్రావిశేషముల
నడుగుచూ,
పిల్లలు
ఒక్కొక్క
క్షేత్రముయొక్క
విశిష్టతలను
సుమంతునిచే
విన్నవన్నియూ
తల్లులకు
చెప్పుచుండ,
తల్లులుకూడనూ
యాత్రాఫలమును
అనుభవించిన
వారివలె
అత్యంత
శ్రద్ధాసక్తులతో
వినుచుండెడివారు.
పిల్లలు
యాత్ర
గావించి
వచ్చిరను
సంబరముచే
దశరథుడు
ఒకనాడు
దేవతాసమారాధన
గావించి,
కాశీ,
ప్రయాగ
తీర్థములను
వచ్చినవారలందరికి
బ్రాహ్మణులచేత
ఇప్పించెను.
మృష్టాన్నములను
పెట్టించెను.
దక్షిణలు
పంచిపెట్టెను.
ఈవిధముగా
పుత్రులు
పుట్టిననాటినుండియూ
ఏదో
ఒక
పేరున
అయోధ్యలో
వైభవములు
జరుపుచుండిరి.
అయోధ్య
నిత్యోత్సవ
నిలయమై
రాణించుచుండెను.
విందులు,
వినోదములు
పట్టణపువారలనందరిని
ఒక
కుటుంబీకులుగా
మార్చివేసెను.
నెల
నెలకు
వచ్చు
నవమి,
దశమి,
ఏకాదశులయందు
పిల్లల
పుట్టిన
పండుగలు
అత్యంత
వైభవముగా
జరిపెడివారు.
గడచిన
మూడు
మాసములు
పిల్లలు
అయోధ్యలో
భవనమున
లేకపోయినను
పిల్లలకు
చేయు
వింతలు
తప్ప,
మిగిలిన
దాన
ధర్మ
నృత్య
గానాది
కార్యములు
పట్టణములో
జరిపించుచునేయుండిరి.
యాత్రనుండి
తిరిగి
వచ్చిన
రాజ
కొమరులు
ముందువలె
కాక
అత్యంత
ఆశ్చర్యకరమైన
ప్రవర్తనలతో
మెలగుచుండుట
తల్లులు
గమనించిరి.
దినములు
గడచిన
కొలది
అలవాటుచే
ఏర్పడిన
ఈ
పద్ధతులు
మార్చవచ్చునని
తలంచి
దిన
దినము
కనిపెట్టుకొని
యుండిరి.
కానీ,
ఎట్టి
మార్పునూ
కనిపించలేదు.
రాముడు
పూర్వమువలె
ఎక్కువ
వెలుపలకు
వచ్చెడివాడు
కాదు.
సకలమునకు
13
▾
Meaning
Keep
స్నానాదులు
చేసెడి
వాడు
కాదు.
రాజదుస్తులను
మహా
విసుగుగా
చూచెడివాడు.
మృష్టాన్నములు
తినక
బంగారు
పీటపై
కూర్చొనక,
ఏదో
పరధ్యానముగ
నుండునటుల
కనిపించుచుండెను.
అన్న
అట్లుండుటచే
మిగిలిన
తమ్ములు
ముగ్గురును
అన్నతోనే
ఉండెడివారు.
నలుగురూ
ఒకే
గదిలో
చేరి
తలుపులు
వేసుకొనెడివారు.
వేళ
వేళకు
అమ్మలు
తలుపులు
తట్టి
వారలకు
ఆహారములు
పెట్టెడివారు.
తల్లులు
ఎంత
బ్రతిమాలినను,
కారణము
చెప్పెడివారు
కారు.
రాములు
మాత్రము,
"ఇది
నాకు
సహజము.
దీనికి
కారణమేమున్నది!"
అని
మాత్రము
అనెడివాడు.
ఈవిధముగ
పెరిగిపోవుచున్న
వీరి
మార్పులు
మరుగు
పెట్టుట
మంచిది
కాదని
అమ్మలు
తలంచి,
దశరథునితో
తెలిపిరి.
దశరథుడు
పిల్లలను
తన
గదికి
రమ్మని
కబురంపెను.
దీనికి
పూర్వము
కబురంపగనే
పరుగిడి
వచ్చుచున్న
బాలురు
ఈనాడు
ఎంత
కాలమైననూ
రాకుండుటచూచి,
ఆశ్చర్యముతో
ఆలోచనతో
తానే
పిల్లల
చెంతకు
వచ్చుటకు
సిద్ధపడుచుండ
ఇంతలో
సేవకుడు
వచ్చి
చిన్న
ప్రభువులు
దయచేయుచున్నారని
తెలిపెను.
దశరథుడు
పట్టలేని
ఆనందముతో
పిల్లలను
నలుగురిని
పొట్టకు
కరిపించుకొని
వారలను
ఇరుప్రక్కలా
కూర్చొనబెట్టుకొని
ఎన్నియో
వింతలు
విశేషములు
అడుగ
మొదలుపెట్టెను.
పూర్వము
ఒకటికి
పది
చెప్పుచున్న
పిల్లలు
పది
అడిగిన
ఒకటైననూ
చెప్పుటకు
ప్రయత్నించకుండుట
చూచి,
రాముని
తొడపై
కూర్చుండ
పెట్టుకొని,
"నాయనా!
నీకేమి
కావలెను?
ఎందుల
కీవిధముగ
పలుకక
మౌనము
వహించితివి?
నీ
కంటెను
నాకు
వేరు
లోకమున
ఏమున్నది?
నీ
ఇష్టమేదియో
తెలుపుము.
తప్పక
గావింతును.
నీవు
పూర్వమువలె
తమ్ములతో
కలసిమెలసి
సరదాగా
సంచరించకుండుట
తమ్ములకు
కూడనూ
బాధగా
ఉండును.
కారణము
తెలుపుము"
అని
గద్దము
పట్టి
ఎంత
బ్రతిమిలాడినను,
నాకేవాంఛ
లేదనియు,
నేను
ఆనందముగనే
యున్నాననియు
మాత్రము
తెలిపెడివాడు.
కానీ,
మరే
జవాబునూ
చెప్పెడివాడు
కాదు.
ఈ
వింత
చర్యలు
చూచి
దశరథుడు
14
▾
Meaning
Keep
తలంచని
చింత
తలను
చేరెను.
విచారమున
కంటిధారలు
కార్చెను.
కానీ
పిల్లలలో
మార్పు
ఏమాత్రమూ
కనిపించలేదు.
ఏవో
కొన్ని
మంచి
మాటలాడి,
రాజకొమరులు
ఉండవలసిన
విధానమును
బోధించి,
పిల్లలను
వారి
వసతులకు
పంపెను.
సుమంతుని
పిలిపించి
పిల్లలలోని
మార్పును
విశదముగా
తెలిపి,
"యాత్రలో
పిల్లల
ఇష్టములకు
విరుద్ధము
లేమైననూ
జరిగెనా?
లేక,
ఇంకనూ
యాత్రలు
చేయుటలో
వారి
ఉత్సాహమునకు
భంగము
కలిగించి
తిరిగి
వచ్చితిరా?
ఏమి
జరిగినదో
వివరములు
తెలుపుమ"ని
దశరథుడు
అడుగ
ప్రశ్నలకు
సుమంతుడు
ఆశ్చర్యమును,
భయమును
చెందుచూ,
"ప్రభూ!
యాత్రలో
పిల్లలకు
ఎట్టి
ఇక్కట్లు
కానీ,
వారల
ఆశయములకు
విరుద్ధములు
కానీ
జరుగలేదు.
పిల్లల
ఇష్టముల
ననుసరించి
దానధర్మములు
కానీ,
యాత్రికులకు
తగిన
వసతులు
కానీ
వారు
కోరినటుల
మరుక్షణమునందే
గావించుచుండెడివాడను.
అట్టి
క్రియలలో
ఎట్టి
అసంతృప్తియూ
వారలకు
కలిగినటుల
వారు
తెలుపలేదు.
నేను
కూడనూ
తలంచలేదు"
అని
పరిపరి
విధముల
విచారముతో
తెలుపుకొను
సుమంతుని
చూచి
దశరథుడు,
"సుమంతా!
నీవు
మహాగుణశాలివి.
నీవెపుడును
రాజకార్యములందు
అశ్రద్ధకాని,
పొరపాటుకానీ
పడవనునది
నాకు
బాగుగా
తెలియును.
కానీ
ఎందులకో
యాత్రనుండి
వచ్చిన
తరువాత
పిల్లలు
చెప్పలేనంతటి
మార్పుతో
ఉన్నారు.
ఆహార
విహారములు
అసలే
మానిరి.
ఎన్నివిధముల
బతిమిలాడిననూ
కారణము
తెలుపక,
రాముడు
సరిగా
మాటాడక,
వైరాగ్యమును
పూనియుండుటచూడ
ఆశ్చర్యముగ
నున్నది!
రాణులు
కూడనూ
ముందునకు
ఏమి
జరుగునో
అను
భయముతో
లోలోన
క్రుంగి
పోవుచున్నారు!"
అని
దశరథుడు
తెలుపగనే,
"తమరు
సెలవిచ్చిన,
నేనొకపరి
పిల్లలతో
కలిసి
విషయము
తెలుసుకొందున"ని
సుమంతుడు
కోరగనే
దశరథుడు,
"తప్పక
వెళ్ళుము!
కారణము
తెలిసికొనిన,
దానికి
తగిన
కార్యములు
సులభముగా
గావించవచ్చును"
అని
ఆలస్యము
చేయక
వెళ్ళుమనెను.
15
▾
Meaning
Keep
సుమంతుడు
ఆతురతతో,
ఆవేదనతో
పిల్లల
వసతికి
వెళ్ళి
చూడగ,
తలుపులు
మూయబడి
యుండెను.
ముందు
మాత్రము
పరిచారకుడు
నిలుచుకొని
యుండెను.
మంత్రి
తలుపు
తట్టగనే,
లక్ష్మణుడు
తలుపు
తీసెను.
సుమంతుడు
లోనికి
వెళ్ళి
తలుపు
వేసుకొని
పిల్లలతో
అనేకరీతుల
సంభాషణలు
జరిపెను.
ఏమి
చేసిననూ
కారణము
అంతుచిక్కలేదు.
కడకు
పిల్లలు
యాత్రలో
తనతో
నెరపిన
చనువునకును,
ఉల్లాసమునకును
ఇపుడు
గదిలో
తనతో
సలుపు
సంభాషణలకూ
చెప్పరానంతటి
మార్పును
గమనించి,
కంటిధారలుకార్చి,
రాముని
ఎంతో
బ్రతిమిలాడెను.
రాముడు
చిరునవ్వులు
నవ్వుచూ,
"సుమంతా!
సహజమునకు
కారణములేమున్నవి!
నాకెట్టి
కొరతయునూ
లేదు,
ఎట్టి
కోరికలునూ
లేవు.
నీవు
విచారించకు"
అని
సమాధానము
మాత్రము
చెప్పెను.
చేయునదిలేక,
సుమంతుడు
దశరథుని
చెంతకువచ్చి,
రేపటిదినము
గురువులవారిని
పిలిపించి
ఆలోచనలు
జరుపుట
మంచిద"ని
మాత్రము
తెలిపి,
సెలవు
తీసికొని
తన
కార్యములపై
తాను
వెళ్ళెను.
దశరథుడు
లోకమునే
మరచి
విచారమున
మునిగి,
పరిపరి
విధముల
ఆలోచనలు
సలిపెను.
కడకు
ఇది
వయసు
మారునట్టి
సమయము
కనుక
మదిలోని
మార్పును
చెప్పుకొనుటకు
తెలియక,
పిల్లలు
ఈరీతిగా
ఉన్మత్తంలో
పడియుందురు
కాబోలు.
బాల్యావస్థ
మారి
యౌవనావస్థ
ప్రవేశించు
సమయము,
బహుశః
ఇదే
కారణమైయుండునని
స్థిరం
చేసికొని
తాననుకొన్నటుల
రాణులకుకూడను
తెలిపి,
కొంత
శాంతిని
పొందెను.
తెల్లవారెను.
వసిష్ఠులవారు
వత్తురను
వార్తతో
రాజు,
రాణులు
సర్వ
సిద్ధమయి,
పూజామందిరమున
వేచియుండిరి.
ఇంతలో
గురువుగారు
రానేవచ్చిరి.
అందరూ
గురువునకు
నమస్కరించి,
పిల్లలలోని
మార్పుకు
కారణములడుగ
మొదలిడిరి.
కంటిధారలు
కార్చిరి.
రాజు
రాణుల
విచారములు
గమనించి,
గురువులు
యోగదృష్టిని
మరల్చి
విషయమేమని
పరిశీలించెను.
16
▾
Meaning
Keep
సత్యమును
గుర్తించెను.
మరు
క్షణమునందే
వసిష్ఠులవారు
రాజు
రాణులవైపు
చూచుచూ,
"పిల్లలలో
ఎట్టి
దోషమును
లేదు.
వారు
సామాన్యులు
కారు.
వారలకు
లోకవాంఛలు
ఏమాత్రమును
లేవు.
శుద్ధ
మనస్సులైయున్నవారు.
మీరు
విచారించకుడు.
పిల్లలను
పిలిపించుడు.
ఇక
మీరు
మీ
మీ
వసతులకు
వెళ్ళుడు"
అని
ఆజ్ఞాపించెను.
ఆ
మాటలతో
రాజు
రాణులు
సంతసించి,
పిల్లలకై
కబురంపిరి.
రాణులు
వారివారి
వసతులకు
వెళ్ళిరి.
గురువు
పిలుచుచున్నారన్న
వార్త
విన్న
లక్ష్మణ
భరత
శత్రుఘ్నులు
సర్వసిద్ధమయిరి.
కానీ
రాముడు
ఎట్టి
ఆతురతయూ
లేక
తన
ధోరణిలో
తానుండుట
గమనించి
లక్ష్మణుడు
అన్న
పాదము
పట్టి
ప్రార్థించి,
త్వరగా
వెళ్ళుట
మంచిది.
లేకున్న
గురువాజ్ఞ
మితిమీరితి
మన్న
విషయము
తల్లిదండ్రులను
అమితముగా
బాధించును
అని,
అనేక
రకముల
బ్రతిమిలాడి,
అన్నతో
లక్ష్మణ
భరత
శత్రుఘ్నులు
బయలుదేరి
పూజా
మందిరమును
చేరిరి.
గురువునకు
నమస్కరించి
వినయముతో,
ఎదురుగా
నిలుచుకొనియున్న
పిల్లలను
చూచి,
వసిష్ఠులవారు
వాత్సల్య
వచనములతో
దగ్గరకు
వచ్చి
కూర్చుండమని
సెలవిచ్చెను.
అందరూ
దగ్గరకు
వచ్చి
కూర్చొన,
రాములను
మరింత
దగ్గరకు
రమ్మనమని,
శిరస్సున
హస్తముంచి
తలనిమురుచు
వీపు
తట్టుచు,
"రామా!
ఎందులకు
నీవిట్లు
నిశ్చేష్టుడవై
మౌనమును
వహించితివి?
నీ
చర్యలను
అర్థము
చేసుకొనలేక,
అమ్మలు
నాన్న
అనేకవిధముల
బాధపడుచున్నారు.
వారల
ఆనందమునుకూడను
కొంత
యోచించ
వలెను
కదా!
'మాతృదేవో
భవ!
పితృదేవో
భవ!'
అను
మహావాక్యముల
అర్థమునుకూడను
ఆచరణలో
నిరూపించవలెను
కదా!"
అని
కొన్ని
నీతుల
బోధింప
మొదలుపెట్టిన
వసిష్ఠులవారి
ముఖమును
చూచి,
రాముడు
చిరునవ్వుతో,
"స్వామీ!
తల్లి
యెవరు?
కొడుకెవరు?
అసలు
దేహమన
నేమి?
జీవుడన్ననేమి?
ఈ
ప్రకృతి
సత్యమా?
పరమాత్మ
సత్యమా?
ప్రకృతి
యొక్క
ప్రతిబింబమే
ఈ
కాయము
కదా!
కాయము
నందలి
పంచభూతములే
17
▾
Meaning
Keep
లోకమంతటనూ
ఉన్నవి
కదా!
పంచభూత
సమ్మిళితమే
ఈ
ప్రకృతి.
భూతములు
మార్పు
చెందునవికదా!
అట్టివాటిని
సత్యమని
తలంచి,
భ్రమించి,
వరించి,
సత్యనిత్యమైన
ఆత్మను
స్మరించకుండుటచే
జీవులకు
వచ్చు
ఫలమేమి?"
అని
అనేకరీతుల
తత్త్వజ్ఞాన
ప్రశ్నలు
వేయ
మొదలుపెట్టిన
రాముని
చూడగనే,
అతని
ముఖమునుండి
కాంతి
కిరణములు
దేదీప్యమానముగా
ప్రకాశించుచుండుట
గురువుగారు
గుర్తించిరి.
దైవత్వము
బైటపడుటకై
కలుగు
చిహ్నములే
ఈ
వన్నెలు
అని
గమనించి,
రాముడు
అడిగిన
ప్రశ్నకు
అతనినే
జవాబు
చెప్పుమని
వసిష్ఠులవారు
తెలుపగనే,
రాముడు
చెప్పు
జవాబులు
సాక్షాత్
దైవవాణులేకానీ,
వేరుకాదని
పూర్తిగా
విశ్వసించి
వసిష్ఠులవారు
మదిలో
నమస్కరించి,
"నాయనా!
తిరిగి
సాయం
సమయమున
నేను
నిన్ను
చూతున"ని
అందరి
శిరస్సులను
ముద్దాడి
ఆశీర్వదించి,
దశరథునితో
కలువక
నేరుగా
ఆశ్రమమునకు
వెళ్ళిపోయెను.
తదుపరి
దశరథుడు
పిల్లలను
చూడగా,
వారలలో
బ్రహ్మతేజస్సు
మూర్తీభవించినట్లు
ప్రకాశించుచుండెను.
విషయము
తెలిసికొనుటకు
సాయంత్రం
వసిష్ఠుల
రాకకై
కాచియుండిరి.
గురువులు
పూజాగృహమును
ప్రవేశింపగనే
తల్లులు,
పిల్లలు,
దశరథ
సమేతులై
వచ్చి
గురువునకు
నమస్కరించి
అందరూ
వారివారి
ఆసనములపై
చేతులు
జోడించుకొని
కూర్చొనిరి.
అంత
ఉన్నట్లుండి,
"జీవుడన్న,
దేవుడన్న,
ప్రకృతి
అన్న,
ఈ
మూడింటికీ
గల
సంబంధమేమి?
ఈ
మూడునూ
ఒకటియేనా?
లేక
వేరు
వేరా?
ఇవి
మూడు
రూపముల
ధరించుటకు
కారణమేమి?
జీవేశ్వర
ప్రకృతిలోని
ఏకత్వము
ఏది?
ఏకత్వమును
వదలి
భిన్నత్వమును
నిత్యసత్యముగ
తలంచిన
ఫలించు
సఫలమేమి?"
అని
రాముడు
వేయుచున్న
ప్రశ్నలను
తల్లిదండ్రులు
విని
ఆశ్చర్యముతో
రాముని
చూచిరి.
జ్ఞానమే
దివినుండి
భువికి
దిగివచ్చిన
మూర్తులవలె
తేజస్సుతో
స్పష్టమైన
వజ్రములవంటి
పదములతో
ప్రవహించుచున్న
ఆ
ప్రశ్నోత్తరవాహినిలో
లీనమైరి.
కుమారుదను
భావమే
18
▾
Meaning
Keep
వారలకు
కొంతకాలము
మరుగాయెను.
ఈరీతిగా
అచ్చుపు
జ్ఞానమునే,
అద్వైతమునే
పలుకుచూ,
రాత్రి
జాములు
మారిననూ
వాదన
మానలేదు.
కడకు
గురువుగారు
రామచంద్రుని
పలుకులు
లోకమునకు
శాంతి
నొసగు
అమృతపు
చినుకులని
ఆనందించి
దశరథ
సమేతులైన
రాణులను
ఆశీర్వదించి
వసతికి
వెళ్ళిరి.
ఈరీతిగ,
రామునికి
వసిష్ఠులవారికి
జరిగిన
సంభాషణయే
నేడు
లోకమున
'యోగవాసిష్ఠమను'
పేర
సార్థకమగుచున్నది.
దీనినే
'రామగీత'
అని
కూడనూ
పిలుతురు.
ఇటుల
వేదాంతమున
మునిగి
సర్వమునూ
త్యజించి
తనలో
తాను
వదరుచు
చేతులు
త్రిప్పుచూ,
ఉన్మత్తునివలె
అపుడపుడు
నవ్వుచూ
ఉన్న
చర్యలను
చూచి
దశరథుడు,
అతనితో
మిగిలిన
పిల్లలు
కూడనూ
ఏమగుదురో
అని
వారలను
వేరు
పెట్టచూచిన,
వారలు
అంగీకరించక
నిరంతరం
రామునితోనే
కూడి
యుండిరి.
రాజు
రాణులు
దినదినమునకు
విచారంతో
క్రుంగి
తాము
తలంచినవన్నియూ
స్వప్నదృశ్యము
లగునేమో
అని,
మంచి
మార్పు
ఎపుడు
వచ్చునో
అని
నిమిషములు
లెక్కించుచు
కాలము
గడుపుచుండిరి.
రాములుకూడనూ
ఆహారం
సరిగా
తీసుకొనకుండుటచే
దేహము
కొంత
బలహీనమైనటుల
కనిపించెను.
Previous
←
The Birth of Śrī Rāma
Next
Protection of the Yajña
→