Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · Protection of the Yajña
Rāma Kathā Rasa Vāhini
›
Part One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ఆ
దినములలో
అయోధ్యకు
తూర్పు
దిశయందున్న
అరణ్యములో
విశ్వామిత్ర
మహర్షి
ఘోర
తపస్సు
చేయుచు,
ఒక
పవిత్ర
యాగమును
ప్రారంభించెను.
ఎన్ని
పర్యాయములు
ప్రయత్నించిననూ
దానికి
అసురులు
అడ్డుతగిలి
విఘ్నములు
కలిగించుచుండిరి,
అపవిత్రము
చేయుచుండిరి.
ఆ
ప్రదేశములో
మాంసపుముక్కలను
తెచ్చి
చల్లుచూ,
విశ్వామిత్రుని
యాగమును
నానారీతుల
ధ్వంసము
చేయుచుండుటచే,
విశ్వామిత్రుడు
చేయునది
లేక
దీర్ఘాలోచన
సలిపి,
సరాసరి
ప్రయాణమై
అయోధ్యా
నగరమును
చేరెను.
మహర్షి
ఆగమనము
తెలిసికొని,
మహారాజు
మంత్రులనంపి,
వారిని
తోడ్కొని
రమ్మని
ఆజ్ఞ
చేసెను.
రాజాజ్ఞ
ప్రకారము
పురసింహద్వారమునకు
వెళ్ళి,
స్వాగత
మొనర్చి,
రాజభవనమునకు
తోడ్కొని
వెళ్ళిరి.
రాజభవనములో
మహర్షిరాకకై
సర్వసిద్ధములతో
కాచిన
మహారాజు
దశరథుడు
బ్రాహ్మణులు
స్వస్తివాచకములు
చెప్పుచుండ,
మునిపాదములు
కడిగి,
శాస్త్రీయవిధిని
రాజసంప్రదాయములను
అనుసరించి,
జలమును
శిరస్సున
ప్రోక్షించుకొని
లోనికి
తీసుకొనిపోయి
ఉన్నతాసనముపై
కూర్చుండబెట్టి,
"ఈనాడెంతయో
సుదినము!
తలవని
తలంపుగ
మహనీయులు
మా
భవనమును
ప్రవేశించి
సేవలుగొనుట
మా
భాగ్యమ"ని
అనేక
విధముల
విశ్వామిత్రుని
రాకను
గురించి
ఆనందించుచుండ
విశ్వామిత్రుడు
రాజునూ,
మంత్రులనూ
కూర్చొనుట
కాజ్ఞాపించెను.
ముని
ఆజ్ఞను
శిరసావహించి
వారివారి
ఆసనములపై
వారు
ఆసీనులైరి.
2
▾
Meaning
Keep
అంత
విశ్వామిత్రుడు
దశరథుని
కుశల
ప్రశ్నలు
గావించి
పాలనా
విధానమున
కెట్టి
ఇక్కట్లునూ
లేక,
ప్రజాక్షేమములకు
ఎట్టి
కొరతయూ
లేక,
రాజ్యము
సుఖశాంతి
భద్రతలతో
సాగుచున్నదా?
అని
రాజ్యస్థితిని,
ప్రజాక్షేమములను
విచారించెను.
అందుకు
దశరథుడు
దైవానుగ్రహముచేతను,
మహర్షుల
ఆశీర్వాదములచేతను
రాజ్యమున
ఎట్టి
అశాంతియును
లేక
ప్రజలు
తమతమ
కర్తవ్యములను
చక్కగా
నిర్వర్తించుచున్నారనియును,
పరిపాలన
కూడను
ప్రజాక్షేమమునే
లక్ష్యమందుంచుకొని
తగిన
రీతిగ
సేవలు
చేయుచున్నదనియూ
విన్నవించెను.
అంత
దశరథుడు
రాజోచిత
ఉపచారములు
గావించి,
తమ
రాకకు
కారణమేమనియును,
మహర్షి
అభీష్టమును
తీర్చుటలో
మహారాజు
సర్వసిద్ధముగా
నున్నాడనియును,
తనవలన
మహర్షికి
కావలసిన
చేయవలసిన
సేవలేవియైననూ
ఉన్న
శిరసావహించి
నెరవేర్చగలనని
భక్తిశ్రద్ధలతో
పలుకుచున్న
పలుకులకు
విశ్వామిత్రుడు
తల
ఊపుచు
చిరునవ్వులతో
జవాబిచ్చినాడు.
విశ్వామిత్రుడు
రాజువైపునకు
దృష్టి
మరల్చి,
"రాజా!
మీరు
మహా
ధర్మపరులనియును,
అతిథి
అభ్యాగతుల
నాదరించు
భక్తి
శ్రద్ధలు
మీలో
మూర్తీభవించినవనియును,
సర్వవిద్యా
పారంగతులనియును,
నేను
ప్రత్యేకముగ
చెప్పనవసరము
లేదు.
లోకక్షేమమే
మీ
గుణములకు
సరియైన
సాక్ష్యము.
పాలకులెట్టివారో
ప్రజా
లోకమట్టి
స్థితినందుకొనును.
లోక
ప్రశాంతి,
అశాంతులు,
పాలకుల
మంచిచెడ్డలను
వ్యక్తపరచును.
నేనెక్కడ
విచారించిననూ,
ప్రజా
ప్రీతిగల
ప్రభువు,
ప్రభు
ప్రీతిగల
ప్రజలు
ఒక్క
అయోధ్యపాలనమందు
మాత్రమే
కలరని
కర్ణానందకరమైన
వార్తలు
వినుచుందును.
కాన
మీ
వాక్యములు
హృదయపుటూటలు!
మీరు
తప్పక
నా
అభీష్టమును
నెరవేర్తురను
విషయమున
నాకెట్టి
సందియమును
లేదు.
మీరాడినమాట
తప్పరు"
అని
పలుకుచున్న
పలుకులు,
దశరథుని
హృదయమును
కదలించెను.
3
▾
Meaning
Keep
"మహనీయులు
లోకోద్ధారకమైన
కార్యములే
ఆచరింతురు.
ఏవి
చేసిననూ,
శాస్త్ర
సమ్మతములే!
కారణము
లేని
కార్యమును,
దైవనిర్ణయము
కాని
కార్యమునూ
వారు
సంకల్పించరు
కదా!
తమ
సేవకై
నేనుకానీ,
నా
పరివారముకానీ,
ఎల్ల
వేళలయందునూ
ఆజ్ఞాబద్ధులమై
యుందుమ"ని
దశరథుడు
మరిమరి
గట్టిగ
ప్రతిజ్ఞ
చేయుటచే,
విశ్వామిత్రుడు
సంతసించి,
"రాజా!
నీవు
పలికినటుల
ఏ
కారణమును
లేక
మహనీయులు
కాలు
కదల్పరు.
నేనొక
కార్యనిమిత్తమై
నీ
చెంతకు
వచ్చితిని.
నా
మాటలను
విని
నీవు
నెరవేర్తువన్న
ఆనందము
నన్ను
మరింత
పురికొల్పుచున్నది,
ప్రోత్సహించుచున్నది.
నీ
మాటను
నీవు
నిలబెట్టుకొందువు
కదా!"
అని
కొంత
సంశయించినటుల
ప్రశ్నించగనే,
దశరథుడు
"స్వామీ!
ఇట్టి
ప్రశ్న
ఇతరులదగ్గర
వేసినను
వేయవచ్చునేమోకానీ,
దశరథుడు
ఆడినమాట
తప్పువాడు
కాదు.
ప్రాణములైననూ
ఇచ్చి
మానమును
కాపాడుకొనును.
రాజునకు
నీతి
నిజాయతీలే
నిజమైన
గౌరవములు,
నిజమైన
పాలనలు.
ఈ
రెండునూ
కోల్పోయినచో,
జ్యోతిలేని
మందిరమువలె
కోతి
ఆటలతో
రాజ్యము
కొరివికి
గురియగును.
కలహముల
పాలగును,
కల్లోలములు
చెలరేగును.
కడకు,
రాజునకే
కీడు
సంభవించును.
అట్టి
స్థితులు
నా
రాజ్యమున
సంభవించుననునది
కలలోకూడను
తలంచను.
నేను
కాదు.
నా
వంశమందే
అట్టి
దుశ్శాసములు
జరుగవనియే,
రావనియే
నా
దృఢము.
సంశయించక
తమరు
తమ
సంకల్పమును
తెలిపి,
ఈ
దాసునితో
సేవలు
చేయించుకొండ"ని
నమస్కరించెను.
అంత
విశ్వామిత్రుడు,
"రాజా!
నీ
మాటలు
వినగోరి
అట్లు
ప్రశ్నించితినేకానీ,
ఇక్ష్వాకు
వంశము
ఈప్సితములు
తీర్చుటలో
సర్వవిధములా
సంసిద్ధమనునది
నాకు
తెలియును.""
"రాజా!
నీ
నుండి
నేను
పొందవలసినది
ఒక్కటి
మాత్రమే.
అది
ధనముకాని,
వాహనములుకాని,
గోవులుకాని,
సువర్ణమునుకాని
లేక
మరేవిధములైన
సైన్యమును,
పరివారమునుకాని
నే
కోరుట
లేదు.
తమ
4
▾
Meaning
Keep
కుమారులైన
రామలక్ష్మణులను
నాకిచ్చిన
చాలును.
ఇదే
నా
వాంఛ,
ఏమందువు?"
అని
ముని
అడుగగనే
దశరథుడు
నిలువునా
కూలిపోయెను.
మనసు
చెదరిపోయెను.
కానీ,
ధైర్యమును
వహించి,
"స్వామీ!
ఆ
బాలురవలన
తమకు
కలుగు
ప్రయోజనమేమి!
ఏ
కార్యమును
ఆ
బాలురచే
చేయించుకొన
తలచితిరో,
అట్టి
కార్యమును
నేనే
చేసి
ధన్యుడనయ్యెదను.
ఆ
కార్యమేమిటో,
తెలిపిన
సంతసింతును"
అని
ప్రార్థించగా,
"రాజా!
ఆ
పిల్లలు
చేయు
ఘనకార్యము
మీ
రెట్టివారునూ
చేయలేరనియే
నా
దృఢము!
నీవుకానీ
నీ
అనేక
లక్షల
సైన్యముకానీ
చేయలేని
సాధించలేని
కార్యమును,
ఆ
ఇరువురు
పిల్లలు
మాత్రమే
చేయగలరు!
అట్టివారు
లోకమున
నెందునూ
పుట్టలేదు,
పుట్టరు.
ఇది
నా
నిశ్చయము.
వినుము.
నేనొక
మహాయాగమును
తలపెట్టి
దానికి
ప్రారంభము
జరిపినంతనే
ఎక్కడ
నుండియో
రాక్షసులు
వచ్చి
దానికి
విఘ్నములు
కల్పించుచూ,
నానా
అశుద్ధములూ
ఏర్పరచుచున్నారు.
కాన
ఆ
రాక్షసుల
బారిని
తప్పించి
నా
యాగమును
రక్షించి,
పూర్తిగావించవలెను.
ఇదియే
నా
వాంఛ.
ఏమందువు?"
అని
గంభీరముగ
ప్రశ్నించగనే
రాజు,
"స్వామీ!
ఈ
కార్యము
ఈ
పసిపిల్లలకు
చేతకాదు.
నేను
సర్వసిద్ధము.
నా
చతురంగ
బలముతో
తమ
ఆశ్రమమును
కాపాడి
యజ్ఞము
నిర్విఘ్నముగా
జరుగునటుల
చూచుకొందును.
దేవాసురులతో
పోరాడిన
పరిచయము
నాకు
బాగుగా
యుండుటచేత,
ఇది
సులభముగా
నెరవేర్తును.
ఇపుడే
తమ
వెంట
వచ్చుటకు
ఏర్పాట్లు
గావింతును.
సెలవొసంగుడ"ని
ప్రార్థించెను.
అంత
విశ్వామిత్రుడు,
"రాజా!
నీవెన్ని
చెప్పిననూ
నా
మనస్సొప్పుట
లేదు.
ఇది
నీ
చేత
కాదు.
సర్వజ్ఞుడను.
సర్వతపశ్శక్తి
సంపన్నుడనైన
నాకే
ఇది
సాధ్యమగుటలేదు.
ఇంక
నీ
కెట్లు
సాధ్యమగును!
ఆ
పిల్లలు
సామాన్యులని
నీవు
తలంచుచున్నావు.
ఇది
పుత్రవాత్సల్యముచే
కలిగిన
పొరపాటు.
సంశయించక
5
▾
Meaning
Keep
మాటను
నిలబెట్టుకొనుటకై
వారలను
తక్షణమే
నా
వెంట
పంపుము.
లేదా,
మాటను
నిలబెట్టుకొనలేకపోవుచున్నానని
పలికిన,
నేను
వెళ్ళివత్తును.
రెండింటిలో
ఏదియో
యొకటి
గావింపుము.
కాలహరణము
చేయ
సమయముకాద"ని
తీక్ష్ణ
వచనములతో
పలుకు
మునిని
చూచి,
ఏమి
ప్రమాదము
వాటిల్లునో
అని
దశరథుడు
భయభ్రాంతుడై
మంత్రి
నంపి
వసిష్ఠులవారిని
పిలిపించెను.
వసిష్ఠులవారు
వచ్చి
విశ్వామిత్రుని
చూచి,
పరస్పరము
నవ్వులతో
కృతజ్ఞతలను
తెలుపుచూ
కూర్చొని,
రాజువలన
జరిగిన
కథనంతయును
విపులముగా
వినెను.
బాలుర
సంగతి
వసిష్ఠులవారికి
కూడనూ
తెలియును.
కనుక
ఇందుల
కేమాత్రమూ
విచారమును
వెలిబుచ్చక,
దశరథునికి
నచ్చ
చెప్పుటకు
పూనుకొనెను.
దశరథుడు
కుమారులు
కొన్ని
దినములనుండి
సరియైన
స్థితిలో
లేరనియును,
రాక్షసులతో
యుద్ధము
చేయగలిగినట్టి
శరీర
బలములు
కూడను
కోల్పోయినారనియును,
మొదలే
వారల
స్థితిని
చూచి
విలపించుచున్న
మాకు
గోరుచుట్టుపై
రోకటిపోటువలె
ఈ
ఘోరకార్యమునకు
పంపుటకు
మనసే
మాత్రమును
ఒప్పుకొనుట
లేదని,
తమ
పిల్లలను
రక్షించుకొనుటకు
తమ
ప్రాణములైననూ
ఇత్తునని
విలపించుచున్న
దశరథుని
చూచి,
విశ్వామిత్రుడు,
"రాజా!
మీరు
ఇంత
విలపించుటలో
అర్థములేదు.
ఇంత
మాట
నిలకడలేని
వాగ్దానములు
ముందే
చేయకుండిన
ఎంతయో
బాగుండును.
విచారణ
సలుపక
వాగ్దానములు
గావించి,
విషయమునకు
రాగానే
వాగ్దానములు
సడలించుట
పరిపాలకులకు
మహా
పాపకార్యము.
ఇది
నీబోటి
రాజులకు
సరికాదు.
విచారముతో
చేయు
సహాయము
నా
కక్కరలేదు.
హృదయపూర్వకమైన
సహాయము
ఎంత
చిన్నదయినప్పటికినీ
అది
ప్రాణసమానము.
అసంతృప్తితో
చేయు
సహాయము
ఎంత
గొప్పదయిననూ
అది
అల్పకార్యమే
కాగలదు.
మిమ్ములను
హింసించి,
బాధపెట్టి
నా
కార్యమును
సాధించుకొనవలెనని
ఆశ
నాకు
లేదు.
మీరు
ఆనందముగా
నుండుడు.
నేను
పోయివత్తును"
అని
విశ్వామిత్రులవారు
లేచి
వెళ్ళుటకు
ప్రయత్నింప
రాజు
పాదములుపట్టి
ప్రార్థించి,
6
▾
Meaning
Keep
తమ
ఆవేదనకు
తగిన
సమాధానములు
అందించి
బోధించి,
కార్యమును
నెరవేర్చుకొమ్మని
కోరెను.
అంత,
వసిష్ఠులవారు
దశరథుని
చెంత
చేర్చుకొని,
"రాజా!
పుత్రవాత్సల్యమను
వస్త్రము
హృదయమున
కప్పబడి
యుండుటచే,
నీవిట్టి
ఘనకార్యమునకు
అడ్డపడుచున్నావు.
నీ
కుమారుల
కెట్టి
ఆపదయూ
లేదు,
రాదు.
వారు
చేయలేని
కార్యములు
లోకమున
లేవు.
రాక్షస
సంహారార్థమై
అవతరించిన
మూర్తులు
ఆ
శక్తులు.
కాన
విచారించక
పిల్లలను
పిలిపింపుము,
వారి
భుజబలములు,
బుద్ధిబలములు
కావు
నీవు
చూడవలసినది.
దైవబలము
వారలయందు
తొణుకులు
వేయుచున్నది.
ఆ
బలముకంటే
మించిన
బలము
మరొకటి
లేదు"
అని
అనేక
రీతుల
బోధించి,
రామలక్ష్మణులను
పిలిపించిరి.
విశ్వామిత్ర,
వసిష్ఠులవారు
చేరి
తమను
పిలిపించుచున్నారన్న
వార్త
రామలక్ష్మణులు
వినగనే
క్షణములో
వారల
చెంతవచ్చి
వ్రాలిరి.
మొదట
తండ్రికి
నమస్కరించి
తదుపరి
వసిష్ఠ
విశ్వామిత్రులకు
నమస్కరించి
వినయముతో
నిలచియుండు
పిల్లలను
చూచి
విశ్వామిత్రుడు
చిరునవ్వుతో,
"నాయనలారా!
మీరు
నావెంట
వత్తురా?"
అని
ప్రశ్నించెను.
పిల్లలు
ఉల్లాస
హృదయములతో,
"తమరాజ్ఞాపించిన
సర్వసిద్ధము"
అని
జవాబు
చెప్పిరి.
ఈ
మాటలకు
దశరథుడు
మరింత
క్రుంగిపోయెను.
మోము
వాడిపోయెను.
విచారమున
విలపించుచున్న
తండ్రిని
చూచి
రాముడు
చెంత
చేరి,
"తండ్రీ!
మహర్షులవెంట
పంపుటకు
మీరెందులకింత
విలపించుచున్నారో
అర్థమగుటలేదు.
పరోపకారార్థమై
పుట్టిన
కాయములను
పవిత్రము
చేయుటకంటే
వేరు
పురుషార్థమున్నదా?
అందునా
మహర్షులకు
సేవలు
చేసి
వారి
కార్యములలో
పాల్గొని
వారలను
సంతృప్తి
పరచుటకంటే
పవిత్ర
కార్యము
వేరొకటి
యున్నదా?
మాకు
చేతకాని
పని
అనునదియొకటి
లేదు
కదా!
ఎట్టి
రాక్షసులతో
నైననూ
పోరాడి,
ఋషి
అభీష్టమును
నెరవేర్తుము.
సెలవిచ్చిన
ఈ
నిమిషముననే
వారితో
వెళ్ళుటకు
సర్వసిద్ధము"ని
రాముడు
ధైర్యవచనములతో
తండ్రిని
కొంత
కలతనుండి
తప్పించెను.
7
▾
Meaning
Keep
దశరథుడు
ఎటు
చెప్పుటకూ
వీలుగాని
స్థితిలో
మునిగెను.
రాముని
దగ్గర
చేర్చుకొని,
"నాయనా!
రాక్షసులు
సామాన్యులు
కారు.
అందునా
సుంద,
ఉపసుంద,
మారీచ,
సుబాహువులు
మహాక్రూరులని
వినియుంటిని.
వారు,
క్రూరత్వమునకు
తగిన
భయంకరరూపులు.
మీరేనాడునూ
అట్టి
రూపములు
చూచియుండరు.
వారలను
చూడగనే
ఎంత
భయపడుదురో!
అనేక
మాయలతో
కూడిన
ఆ
రాక్షసులతో
యుద్ధమెట్లు
చేయగలరు?
ఏనాడూ
యుద్ధమను
పదమునే
మీరు
వినలేదు,
చూడలేదు.
అట్టి
నా
కసికందులగు
మీరు
రాక్షసులతో
పోరాడగలరా?
అయ్యో!
దైవమెంత
నిర్దయచూపుచున్నాడు.
నా
కొమారులకు
ప్రప్రథమమునందే
ఇట్టి
కఠిన
పరీక్షయా?"
అని
తనలో
తాను
చింతించుచు
పిల్లలను
చెంతచేర్చుకొని
విచారముతో
కంటిధారలు
కార్చుచుండ,
లక్ష్మణుడు
తండ్రి
బలహీనతను
గమనించి,
"నాన్నా!
మేము
ఆడపిల్లలము
కాము.
యుద్ధము
మాహక్కు,
ధర్మస్థాపన
మా
కర్తవ్యము.
ఋషి
సేవ,
రాజనీతి
మా
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు.
ఇట్టి
ధర్మకార్యముల
కంపుటలో
మీరింత
విచారించుట
ఆశ్చర్యము.
లోకులు
చూచి
నవ్వుదురు.
మీరు
ప్రేమతో
ఆశీర్వదించి
పంపుడు.
నేను
కూడనూ
అన్నతో
వెల్లి
జయలక్ష్మిని
చేకొని
వత్తును"
అని
చెప్పెను.
వాత్సల్యోన్మత్తుడై
విలపించుచున్న
తండ్రిని
చూచి
రాముడు
చెంత
చేరి,
తండ్రిచేతిని
పట్టుకొని,
"తండ్రీ!
మిమ్ము
మీరు
మరచినట్లున్నది.
మీరెవరో?
ఏవంశమున
జన్మించితిరో?
మీ
పూర్వీకుల
ఘనకీర్తుల
నొకపరి
స్మరించుకొన్న
మీరిట్లు
విలపించి
యుండెడివారు
కాదు.
మీరు
ఇక్ష్వాకుల
వంశములో
పుట్టితిరి.
ధర్మము
సాక్షాత్తు
మీ
రూపాన
మూర్తీభవించినట్లుగా
ఇంతవరకు
ప్రవర్తించినారు.
మీరు
సుపుత్రులు,
ధర్మాత్ములు,
ధైర్యసాహసశాలురు
అని
ముల్లోకాలలోను
మారుమ్రోగితిరి.
ఆడినమాట
తప్పుటకంటే
మించినపాపము
మరొకటి
లేదని
మీరెరుగుదురు.
మహర్షి
కిచ్చిన
మాటను
నెరవేర్చుకొనుటలో
మీరిట్లు
విచారించుట
మీ
కీర్తికి
సార్థకము
కానేరదు.
తండ్రి
అపకీర్తి
బిడ్డలు
సహించరు.
మీ
మాటను
మీరు
దక్కించుకొనలేక
పోయిన
యజ్ఞయాగాది
క్రతు
కార్యములే
కాక
వాపీకూపతటాకాది
ధర్మకార్యములు
నిష్ఫలములు.
వేయేటికి?
దశరథుడు
8
▾
Meaning
Keep
మాట
తప్పెనను
మాటలు
వినుట
మీ
పుత్రులమైన
మాకు
తలవంపులు.
ఇది
వంశమునకే
మాయని
మచ్చగా
నిలిచిపోవును.
ఒక
పుత్రవాత్సల్యమునకై
వంశమునకే
తీరని
అపకీర్తి
వాటిల్లును.
విచారణ
లేని
మీ
ప్రేమ
మమ్ములను
శిక్షించునుకాని
రక్షించదు.
నిజముగా
పుత్రవాత్సల్యమే
మీలో
ప్రధానముగా
నుండిన,
పుత్రుల
సత్కీర్తిని
లక్ష్యమందు
ఉంచుకొనవలెను
కదా!
మీకు
మేము
చెప్పనంతటివారము
కాము.
మీకు
సర్వము
తెలుసు.
వాత్సల్యమింతటి
అయోమయమున
కీడ్చుకొని
పోయినది.
కర్తవ్యమును
గుర్తించకుండ
చేయుచున్నది.
మాకెట్టి
భయమును
లేదు.
విజయలక్ష్మి
మమ్ములను
వరించును.
మీరు
భ్రమపడక,
ఆశీర్వదించి
ఋషి
కప్పజెప్పుడు"
అని
శిరస్సు
వంచి
నమస్కరించుచున్న
రాముని,
దశరథుడు
కౌగిలించుకొని
శిరమును
ముద్దాడి,
"నాయనా!
నీవు
చెప్పినవన్నియు
పరమ
సత్యములు,
పవిత్ర
రత్నములు.
నేను
వాటిని
కాదనునట్టి
మూర్ఖుడను
కాను.
చతురంగ
బలసమేతుడనై
వెళ్ళి,
ఋషియాగమును
రక్షించుటలో
నా
సర్వస్వమూ
త్యాగము
చేతును
కానీ,
అస్త్రశస్త్రవిద్యలలో
ఇప్పుడిప్పుడే
తరిబీదగుచున్న
నా
పాలబుగ్గల
పసిపాపలను
ఆ
రాక్షసుల
చేతికందించుటకు
నా
మనస్సు
ఒప్పుకున్నది.
తెలిసి
తెలిసి
పులినోటికందించుటకు
ఎట్టి
తండ్రి
అయిననూ
ఇష్టపడడు
కదా?
అనేక
యజ్ఞయాగాది
క్రతువులు
సలిపి,
తపములు
చేసి,
పొందిన
మిమ్ములను
ప్రాణసమముగా
చూచుచున్న
మమ్ముల
నిట్లు
విషాదాగ్నిలో
త్రోయుట
పుత్రులకు
మాత్రము
న్యాయమా?
అయ్యో!
విధి
ఎదురు
తిరిగిన
ఎవరేమి
చేతురు!
మా
పాపఫలము"ని
విలపించెను.
ఇది
చూచి
రాముడు
చిరునవ్వు
నవ్వుచూ
"నాన్నా!
ఏమిటీ
బలహీనత?
తెలిసి
తెలిసి
పులుల
నోటి
కందించుచున్నానని
అంటిరి.
మేము
మేక
పిల్లలము
కామని
మీరు
తెలుసుకొనలేదు.
పురుషసింహమని
తలంచి
పుణ్యకార్య
నిమిత్తమై
మమ్ముల
నాశీర్వదించి
పంపుడు.
కాలయాపన
ప్రభువులకు
కర్తవ్యము
కాదు."
అని
కొంత
సూటిగా
మాటాడుట
వసిష్ఠులవారు
చూచి,
"భేష్,
భేష్,
దశరథా!
9
▾
Meaning
Keep
వింటివా?
సింహగర్జనలు.
ఇంకనూ
ఈ
నక్క
అరుపు
లెందుకు?
లెమ్ము.
అంతఃపురముకు
వార్తనంపి
రాణులను
రప్పించుము.
పుత్రులను
విశ్వామిత్రున
కప్పజెప్పుము"
అని
ఆజ్ఞచేయగనే
చేయునది
లేక
రాణులను
తోడ్కొని
రమ్మని
కబురంపెను.
ఇంతలో
రాణులు
మేలిముసుగులు
వేసుకొని
ప్రవేశించి
మహర్షులకు
నమస్కరించి,
పిల్లలచెంత
నిలుచొని
తమబిడ్డల
తలలను
నిమురుతూ
తలలు
వంచుకొనియుండుటను
చూచి
వసిష్ఠులవారు
"అమ్మలారా!
మన
రామలక్ష్మణులు
విశ్వామిత్ర
యాగ
సంరక్షణకై
వెళ్లుటకు
సర్వసిద్ధులైయున్నారు.
వారలను
ఆశీర్వదించి,
పంపుటకై
మిమ్ముల
నిచటికి
రప్పించితిమి.
ఆశీర్వదించి
పంపుడు"
అని
వసిష్ఠుల
వారు
తెలుపగనే
కౌసల్య
ఉలికిపడునట్టు
తల
యెత్తి
గురువులవారిని
చూచి,
"ఏమీ?
ఈ
పసిగందులు
మహర్షిచేయు
యజ్ఞమును
సంరక్షించుటా!
యజ్ఞమును
మంత్రములే
రక్షించుననుట
వినియుంటిని
కానీ
మనుష్యులు
రక్షించుటేమున్నది?
యజ్ఞ
బాధ్యత
ఋత్విక్కుల
దీక్షపై
ఆధారపడి
యుండును"
అన్న
మాటలు
వసిష్ఠులవారికి
సత్యముగా
తోచిననూ
విషయము
వివరించుట
మంచిదని
తలంచి,
"అమ్మా!
కౌసల్యా!
విశ్వామిత్రులవారి
యాగము
సామాన్యమైన
యాగము
వంటిది
కాదు.
దానికి
అనేక
అంతరాయములు
అడ్డుతగిలి
అశాంతికి
గురిచేయుచున్నవి"
అని
వసిష్ఠులవారింకను
ఏమో
చెప్పబోవుచుండగనే
కౌసల్యాదేవి
అందుకొని,
"గురుదేవా!
మహర్షులు
చేయు
పవిత్రకార్యములకు
అంతరాయములు
కలుగుచున్నవనుటలో
నాకు
ఆశ్చర్యముగనున్నది.
దివ్యసంకల్పములకు
అడ్డు
తగులునట్టి
ఎట్టి
శక్తి
కూడనూ
లేదని
నా
విశ్వాసము.
ఇది
ఏదియో
నిమిత్తమాత్రముగ
చేసుకొని,
భవిష్యత్తులో
మహత్తరమైన
కాంతులు
వెదజల్లుటకై
మహర్షి
ఈ
ఆధారమును
కోరియుండవచ్చు.
లేదా
మహారాజుల
మనస్సును
పరీక్షింపగోరి
ఇట్లు
సంకల్పించి
యుందురేమో
కాని,
సర్వశక్తి
సంపన్నులగు
మహర్షి
చేయు
యాగమునకు
ముక్కుపచ్చలారని
పసిపాపలు
రక్షణకర్తలా?"
అని
రామలక్ష్మణుల
శిరస్సులను
నిమురుచునుండగా,
అన్నియూ
వింటున్న
దశరథుడు
ఒకవిధమైన
ధైర్యమును
10
▾
Meaning
Keep
చేసుకొని,
"కౌసల్య
పలికిన
పలుకులు
పరమ
సత్యములు.
ఇవన్నియూ,
నన్ను
పరీక్షింపగోరి
కల్పించిన
తమ
సంకల్ప
ప్రభావములే
అని
దృఢమగుచున్నది.
తమ
పరీక్షలకు
నేనెంతటి
వాడను?
తమ
అభీష్టమెట్టిదో
అట్లు
నడచుకొందును"
అని
గురువునకు
నమస్కరించి
నిలిచియున్న
దశరథుని
చూచి
వసిష్ఠులవారు,
"మహారాజా!
ధన్యుడవు.
చిరంజీవులు
సామాన్యులు
కారు.
వారి
శక్తి
సామర్థ్యములు
అనంతములు.
తెలిసినవారలకే
తెలియునుకాని,
అన్యులకర్థము
కావు.
తెలిసికొనలేరు.
వారి
సంకల్పమునకు
ఇది
ప్రారంభోత్సవము.
లోక
ఖ్యాతికి
పునాది.
ధర్మరక్షణకు
కంకణము.
అతి
శీఘ్రములోనే
విజయలక్ష్మిని
చేకొని
వత్తురు.
చింతిల్లక
సంతోషహృదయుడవై
విశ్వామిత్రులవారి
కప్పజెప్పుమని,
"నాయనలారా!
ఇటురండి"
అని
రామ
లక్ష్మణులను
చెంతచేర్చుకొని
ఇరువురి
శిరముల
యందు
పవిత్రహస్తములిడి
మంగళప్రదములయిన
మంత్రాలతో
అభిమంత్రించినాడు.
మహదానందంతో
రామలక్ష్మణులు
గురుదేవులకు,
విశ్వామిత్రునకూ,
తల్లిదండ్రులకూ
నమస్కరించి
వారల
దీవెనలను
అందుకొని
వెళ్లుటకు
సిద్ధమైన
వారి
తేజస్సును
గాంచి,
దశరథుడు
పొరలివచ్చు
దుఃఖమును
ఆపుకొని
ఇరువురుపిల్లల
భుజములపై
చేతులు
వేసుకొని
విశ్వామిత్రులవారి
చెంతకు
వచ్చి
నమస్కరించి,
"స్వామీ!
వీరిరువురూ
నేటినుండి
తమ
ప్రేమపుత్రులు.
వారల
యోగ
క్షేమములు
తమకు
చెందినవి.
వీరలకెట్టి
ఇబ్బందియూ
లేకుండుటకై
కొంత
పరివారమునుకూడ
పంపవలెనని
ఆజ్ఞాపించిన
శిరసావహింతును"
అని
పలికిన
దశరథుని
పలుకులకు
విశ్వామిత్రుడు
పక్కున
నవ్వి,
"వెట్టిరాజా!
యాగసంరక్షకులుగా
వెళ్లుచున్న
మహావీరులను
రక్షించువారు
వేరొకరుందురా!
మహర్షులకే
చేతకాని
మహాకార్యమును
సాధించబోవు
సర్వశక్తిమయులకు
సహాయార్థ
మొకటి
ఏర్పాటుచేయ
వలయునా!
నీ
వాత్సల్యమింత
అమాయకుని
చేసినదే
కాని
లేకున్న
నీకు
మాత్రము
తెలియకపోలేదు.
మహా
రాజా!
వీరికెట్టి
ఇక్కట్టునూ
లేక,
రాక,
కార్యము
పూర్తి
అయిన
వెంటనే
నేనే
స్వయముగా
వెంట
తోడ్కొనివచ్చి
నీ
కప్పజెప్పుదును.
చింతిల్లక,
నీ
పరిపాలనా
విధానమున
కెట్టి
ఇబ్బందియూ
లేక
చూచుకొనుము"
11
▾
Meaning
Keep
అని
విశ్వామిత్రుడు
లేచి
నిలిచిన
తక్షణమే
అందరూ
హస్తములు
మోడ్చి
నమస్కరించినారు.
విశ్వామిత్రుడు
ముందు
రామలక్ష్మణులు
ధనుర్ధారులై
వెనుక
నడచుచూ
వెళ్ళుచుండ
రాజ
భవనము
సింహద్వారముల
చెంతకు
రామ
లక్ష్మణులు
వచ్చినంతనే,
దేవదుందుభులు
మోగినవి.
పూలవర్షము
కురిసినది.
వీధి
పొడవున
శంఖాలు
పూరించినారు.
భేరీలు
మ్రోగించినారు.
పురవీధుల
అటు
ఇటు
స్త్రీ
పురుషులు,
బాల
వృద్ధులు,
ఆశ్చర్యనేత్రులై
మహర్షి
వెంట
కాలినడకన
కదులుచున్న
పిల్లలను
మగ
సింగము
వెంట
వెళ్లుచున్న
బాల
సింగములవలె
కాంచినారు.
విషయము
తెలియక
ఒకరితోనొకరు
ఎక్కడకు
వెళ్లుచున్నారని
గుసగుస
లాడిరి.
మహారాజు
ఆజ్ఞ
కనుక
మంత్రులూ,
పుర
జనులూ
పురసింహద్వారమువరకు
మాత్రమే
వెళ్లి
అక్కడ
రామలక్ష్మణులకు
వీడ్కోలు
నొసంగి
వెనుకకు
తిరిగిరి.
అక్కడినుండి
విశ్వామిత్రులవారు
ముందూ,
రాముడూ
వెనుక,
అతని
వెనుక
లక్ష్మణుడు
కాలిబాటలో
నడచి
వెళ్లుచూ,
ఇరుప్రక్కల
అతి
సుందరమైన
వృక్షములను
చూచుచూ,
ప్రకృతి
సహజ
సౌందర్యమును
తిలకించుచూ
కొంత
దూరమువెళ్లిన
తరువాత
నిర్జన
ప్రదేశమును
ప్రవేశించగనే
విశ్వామిత్రులవారి
ఆజ్ఞానుసారము
మణికట్లకూ,
వ్రేళ్ళకూ,
ఉదుముతోలు
కవచమును
తొడుగుకొని
భుజముల
మీదనున్న
ధనుస్సులు
తీసి
హస్తమున
సిద్ధము
చేసుకొని
చుక్కల
బోలు
కాంతులతో
నిర్జనారణ్యమున,
నిశ్శబ్ద
వాతావరణమున,
దట్టమైన
పొదలమధ్య
సింగపు
పిల్లలవలె
చిరునవ్వులు
తొలకుచూ,
నిర్భయులై
విశ్వామిత్రుని
అనుసరించుచూ
సరయూనది
దక్షిణ
తీరము
చేరిరి.
సూర్యాస్తమయము
కానున్నందున
విశ్వామిత్రుడు
రామలక్ష్మణులను
పిలిచి
మృదుమధురమైన
పలుకులతో,
"నాయనలారా!
ఆలస్యం
చేయక
నదిలో
ఆచమింపుడు.
సమస్త
మంత్రములకు
మూలాధారములైన
'బల,
అతిబల'
అను
రెండు
మంత్రములను
ఉపదేశింతును.
ఈ
మంత్రములు
మహా
ప్రభావము
12
▾
Meaning
Keep
కలవైయుండును.
ఇవి
యెట్టి
అలసటనైననూ
క్షణములో
తీర్చి
హాయిని
కలిగించును.
ఎన్ని
పనులు
చేసిననూ
అలసట
కలిగించక
వ్యాధులను
రానివ్వక,
రాక్షసుల
బాధలు
కలుగకుండ
రక్షించును.
ఇంతే
కాదు.
దారిలో
నడచుచున్న
సమయాలలో
ఈ
మంత్రములను
స్మరించుచూ
వెళ్లిన
ఆకలి
దప్పులు
లేక
ఆనందోల్లాసముల
నొసంగి
అతి
బలమును
కలిగించుచూ
వచ్చును.
"రామా!
'బల,
అతిబల'
అను
ఈ
రెండు
మంత్రములు
సర్వమంత్రములకే
కాక
సమస్త
శక్తులకు
తేజోవంతమైనవి"
అని
ఇంకనూ
ఆ
మంత్రముల
మహత్తరమైన
శక్తి
సామర్థ్యములను
విశ్వామిత్రులవారు
వర్ణించుచుండ,
సర్వజ్ఞుడైన
రామచంద్రుడు
దాని
విషయము
ఏమీ
తెలియనివానివలె,
తల
ఊపుచూ
ఆశ్చర్యముగా
వినునట్లు
నటించుచుండ,
లక్ష్మణుడు
ఇరువురినీ
చూచుచూ,
తనలో
తాను
నవ్వుకొనుచుండెను.
ఇచట
లోకోపదేశ
నిమిత్తమై
రాముడు
ఒక
విచిత్రమైన
ప్రబోధ
చేసిరి.
అదియేమన
మాయ
ఎట్టి
వారినైనను
క్షణములో
తలక్రిందు
చేయుననియునూ,
దేహాభిమానమున్నంతవరకు
మాయ
మనుజుని
వీడదనియూ
ఇది
తపస్సులతో,
జ్ఞానముతో,
పేరు
ప్రతిష్ఠలతో,
శక్తి
సామర్థ్యములతో
తొలగునది
కాదనియునూ,
తాను
ఆత్మస్వరూపుడనని
తెలిసికొని,
సమత్వ
బుద్ధితో
జగత్తును
చూచుటతో
ఈ
మాయ
మరుగుపడుననియూ
ఒక
నీతిని
నిరూపించిరి.
కాకున్న,
అతిశక్తివంతమైన
'బల,
అతిబల'
మంత్రములు
తనచెంతనుండియూ,
తాను
తపో
సంపన్నుడైనప్పటికినీ,
యజ్ఞసంరక్షణార్థమై
దానికి
తగిన
శక్తిసామర్థ్యము
కలవాడు
శ్రీరాముడేయని
గమనించియూ,
రాముడు
సామాన్యుడు
కాదు
లోక
రక్షకుడు,
అతడు
చేయలేని
కార్యమంటూ
ఒకటి
జగత్తున
లేదని
దశరథుని
చెంత
వర్ణించి,
పుత్రవాత్సల్యమే
నిన్నింత
అమాయకుని
చేసినదని
బోధించి,
ఇక్కడ
మాయాబంధితుడై,
గుణమోహితుడై
రామలక్ష్మణులను
సామాన్య
పిల్లలవలె
భావించి,
వారలకు
మంత్రోపదేశము
చేయుటకు
పూనుకొనుటలో
మాయయొక్క
ప్రభావమును
నిరూపించుటయే
దీని
అంతరార్థమని
చెప్పక
చెప్పుచున్నది.
అట్టి
13
▾
Meaning
Keep
మాయను
విశ్వామిత్రుని
యందు
ఆ
నిమిషమున
ప్రవేశింప
చేయకున్న
రామ
సంకల్ప
కార్యము
జరుగనేరదు.
మహర్షులలో
ప్రవేశించిన
మాయకూడను
మహత్తర
కారణములను
చేయించును.
విశ్వామిత్ర
మహర్షి
ఆజ్ఞానుసారము,
రామలక్ష్మణులు
సరయూనదిలో
ఆచమించిరి.
విశ్వామిత్రుడు
రాములచెంతకు
వచ్చి
'బల,
అతిబల'
అను
ఆ
రెండు
మంత్రములను
ఉపదేశించెను.
మాయామానుషరూపుడైన
రాముడు
విశ్వామిత్రుడు
చెప్పినటులనే
పలికి,
తల
ఊపుచూ,
శిష్యత్వము
అందుకొన్నటుల
ప్రదర్శించెను.
ఇంతలో
చీకటి
పడుటచేత
రామలక్ష్మణులకు
దగ్గరదగ్గరగా
లేతగడ్డిపై
పరుండుటకు
ఏర్పాటుచేసి,
వారలకు
దగ్గరలోనే
మెత్తని
గడ్డిపై
విశ్వామిత్రుడు
కూర్చొని
అనేక
రకములగు
కథలు
తెలుపుతూ
వచ్చెను.
దారిన
నడిచి
అలసి
వచ్చినారా
అన్నట్లు
రామలక్ష్మణులు
కొంత
నిద్రలో
మునిగినటుల
కనిపించుటచే
విశ్వామిత్రుడు
కథలు
చాలించి,
తనముందు
కార్యక్రమములనుగూర్చి
యోచించుచుండెను.
ఇంతలో
తెల్లవారజొచ్చెను.
పక్షుల
మేలుకొలుపులా
అన్నట్లు
అనేక
రంగులతో
చేరిన
పక్షులు
రామలక్ష్మణులు
నిదురించు
ఆ
పచ్చికపై
అటూ
ఇటూ
ఎగురుతూ
శ్రావ్యమైన
కంఠములతో
శబ్దము
చేయుచుండెను.
అవి
గంధర్వుల
గానముగా
నుండెను.
కానీ
రామలక్ష్మణులు
నిద్రనుండి
మేల్కొనలేదు.
గాఢనిద్రలో
నుండినటుల
విశ్వామిత్రుడు
గమనించి,
రాముల
చెంతకు
వెళ్లి,
"రామా!
తొలిసందె
అయినది,
మేల్కొమ్ము"
అని
పలికిన
పలుకులు
రామకర్ణరంధ్రముల
చేరి,
రాములు
దిగ్గున
లేచెను.
వెంటనే
తమ్ముడైన
లక్ష్మణుని
లేపి
ఇరువురూ
విశ్వామిత్రునకు
నమస్కరించి,
సరయూనదిలో
స్నానముచేసి
ఆచమించి,
అర్ఘ్యమునిచ్చి,
గాయత్రీ
జపముచేసి,
ప్రయాణమునకు
సిద్ధమై,
ఋషి
చెంత
చేతులుకట్టి
నిలిచిరి.
అంత
విశ్వామిత్రుడు,
"నాయనలారా!
ఇక
మన
ఆశ్రమమునకు
ప్రయాణము
సాగించవచ్చును
కదా?"
అని
పలుకగనే
రాముడు
"తమ
ఆజ్ఞకై
14
▾
Meaning
Keep
వేచియున్నామ"
ని
పలికెను.
అంత
విశ్వామిత్రుడు
ముందూ,
రామలక్ష్మణులు
వెనుకా
నడచుచుండిరి.
ఇంతలో
సరయూనది
గంగానదిలో
సంగమించే
స్థలమునకు
చేరిరి.
గంగానదిని
ఆనందముతో
తిలకించి,
నమస్కరించి,
అన్నదమ్ము
లిరువురూ
అటూ
ఇటూ
దృష్టిని
మరల్చిరి.
ఇంతలో
ఆ
ప్రాంతమున
నొక
దివ్యమైన
ఆశ్రమము
కనిపించెను.
అది
అతి
ప్రాచీనమైన
ఆశ్రమముగా
కనిపించెను.
ఇంతలో
లక్ష్మణుడు,
"స్వామీ,
ఈ
పుణ్యాశ్రమమెవ్వరిది?
ఇందు
నివసించు
మహనీయుల
పేరేమి?"
అని
అడుగగా,
మహర్షి
మందహాసము
చేయుచూ,
"నాయనా!
వినుము.
పరమ
శివుడు
పార్వతిని
పెండ్లి
ఆడక
పూర్వము
ప్రమథ
గణాలతో
ఇక్కడికి
వచ్చెను.
దృఢ
నియమములతో
ఇక్కడి
లోకకార్యములు
పరిపాలన
చేయుచుండగా
మన్మథుడు
ఇక్కడికి
వచ్చి
అతని
నీమమునకు
అంతరాయములు
కలిగించగా
శివుడు
తన
త్రినేత్రమును
తెరచి
చూడ,
మన్మథుని
శరీరము
భస్మస్వరూపమున
దగ్ధమాయెను.
ఈవిధముగా
మన్మథుని
సర్వాంగములు
భస్మమైపోయినందున
అప్పటినుండి
వాడు
"అనంగుడు"
అయినాడు.
అందుచేత,
అనగా
మన్మథుడు
తన
అంగాలనన్నింటినీ
కోల్పోవుటచే
ఈ
ప్రాంతమునకు
'అంగదేశమ'ని
పేరు
వచ్చినది.
ఇది
శ్రీమంతమయిన
దేశము.
ఈ
ఆశ్రమ
పదము
శివునిదే.
అతని
శిష్యులు
తరతరములనుండి
ఇక్కడనే
తపస్సు
చేయుచూ
దైవములో
లీనమగుచున్నారు.
పరమ
ధార్మికులు
మాత్రమే
ఇందు
నివసించ
వీలగును.
అన్యుల
కసాధ్యము.
మీరు
ఇష్టపడిన
ఈ
రాత్రి
ఇక్కడ
శయనించి
రేపు
తెల్లవారగనే
గంగా
స్నానముచేసి
మన
ప్రయాణము
సాగించవచ్చును"
అని
విశ్వామిత్రుడు
తెలుపగనే
రామలక్ష్మణులు
పట్టలేని
ఆనందముతో
అంగీకరించిరి.
గంగానదీ
తీరమునకు
వెళ్లి
స్నాన
మాచరించిరి.
ఇంతలో
రామలక్ష్మణులతో
విశ్వామిత్రులవారు
సమీపమున
నున్నారని
తెలిసికొని
ఆశ్రమవాసులు
పరుగిడివచ్చి
విశ్వామిత్రునకు,
రా…లకు
స్వాగతము
చెప్పి
ఆశ్రమమునకు
కొనిపోయిరి.
15
▾
Meaning
Keep
ఆనాటిరాత్రి
పరమ
శివ
ఆశ్రమమున
కందమూల
ఫలాదులారగించి
ఆశ్రమవాసుల
నిత్యానుష్ఠానములు
తిలకించి,
ఆ
స్థాణ్వాశ్రమమున
విశ్వామిత్రులవారు
తెలుపునట్టి
పవిత్ర
దివ్యకథలను
వినుచూ,
ఆనందము
ననుభవించుచూ
కాలమును
అవలీలగా
గడిపిరి.
తెల్లవారగనే
స్నానసంధ్యాదులు
ముగించుకొని,
ఆశ్రమవాసుల
సెలవు
తీసుకొని
విశ్వామిత్రుని
వెంట
రామ లక్ష్మణులు
బయలుదేరిరి.
గంగా నదిని
దాటవలసివచ్చినందున
స్థాణ్వాశ్రమవాసులు
వారికోసమై
అమర్చిన
నావను
తీరమునకు
తెచ్చి
విశ్వామిత్రులవారిని
రామ లక్ష్మణులను
ఆవలి
ఒడ్డునకు
చేర్చి,
విశ్వామిత్రుని
వద్ద
సెలవు
తీసుకొని
వెనుకకు
తిరిగిరి.
ఇందులకు
విశ్వామిత్రుడు
సంతసించి
వారి
భక్తిప్రపత్తులను
కొనియాడి
ఆశీర్వదించి
పంపెను.
ఇంతలో
ఒక
పెద్ద
ప్రళయ
శబ్దము
వినిపించుచుండెను.
జలము
పెద్ద పెద్ద
నురుగు
తెప్పలతో
నిమిష నిమిషమునకు
పొంగుతూ
ఉండెను.
దీనిని
రాముడు
చూచి,
"స్వామీ!
ఈ
శబ్దమేమిటి?
ఈ
ప్రవాహము
ఇప్పటికిప్పుడే
ఇంత
పొంగులతో
ప్రతిధ్వనించుటేమిటి?
తెలుపుమ"ని
కోరగా,
విశ్వామిత్రుడు,
"రామా!
అతి
ప్రశాంతముగా
ప్రవహించు
గంగానదియందు
అతి
ఉరవడిగా
ప్రవహించు
సరయూనది
పడుటచేత
ఈ
ప్రళయ
శబ్దము
ఏర్పడినది.
అంతేకానీ
మరేమీ
కాద"ని
ప్రశాంతముగా
తెలుపుచూ,
"రామా!
పూర్వము
బ్రహ్మ
మనసా
సంకల్పించుటచేత
కైలాస పర్వతమున
ఒక
సరస్సు
ఏర్పడెను.
మనసా
ఏర్పడిన
సరస్సగుటచేత
దానికి
మానస సరోవరమని
దేవతలు
నామకరణము
చేసిరి.
ఆ
సరస్సు
నుండి
పొంగి
పొరలిన
ప్రవాహమే
సరయూనది.
ఆ
సరయూనదే
అయోధ్యను
ఆవరించి
ప్రవహించి
ఇక్కడికి
వచ్చి
గంగలో
పడుచున్నది.
ఇది
బ్రహ్మదేవుని
మానస సరోవరమునుండి
ఉద్భవించుట చేత,
ఈ
సరయూనది
పుణ్యనదిగా
సార్థక్య మొందినది"
అని
నదీ విశిష్టతను
వర్ణించుచూ
దక్షిణ తీరము
చేరి
ఆగకుండా
దట్టమయిన
అరణ్యమున
ప్రవేశించిరి.
అది
మహాభయంకరముగా
నుండెను.
దానిని
చూచి
రాముడు,
"స్వామీ!
ఈ
16
▾
Meaning
Keep
అరణ్యమున
మనుష్యులు
ఏనాడునూ
సంచారము
చేసిన
చిన్నెలు
కనిపించుట
లేద"నెను.
ఇంతలో
పులులు,
సింహములు
ఇంకనూ
అనేక
చిల్లర
మృగముల
అరుపులు
భూమి
బ్రద్దలగునట్లు
వినిపించెను.
కొన్ని
మృగములు
ఒకదానితో నొకటి
పోట్లాడుచూ
రౌద్రముతో
పరుగిడు
దృశ్యములు
గాంచిరి.
ఆ
అరణ్యమంతయూ
ఎటు చూచినా
ఇనుమద్ది,
ఏరుమద్ది,
మారేడు,
తుమ్మ,
రేగుపొదలూ
మొదలయినవి
క్రిక్కిరిసి
యుండెను.
దారిలేదు,
నూతన
దారిని
వారికి వారే
కల్పించుకొన
వలసివచ్చెను.
ఇంతలో
లక్ష్మణుడు
"స్వామీ,
ఈ
భీకరారణ్య మెవరిది?
దీని
పేరేమి?"
అని
ప్రశ్నించెను.
విశ్వామిత్రుడు,
"లక్ష్మణా,
పూర్వము
ధనధాన్య
సమృద్ధము
అయిన
మలద, కరూశలు
అను
రెండు
దేశములు
ఇక్కడ
ఉండెడివి.
అవి
సాక్షాత్
దేవతల
దేశములవలె
వర్ధిల్లినవి.
అనలు
దేవతలే
ఆ
రెండు దేశములు
నిర్మించిరనవచ్చును.
పూర్వము
దేవేంద్రుడు
వృత్రాసురుణ్ణి
సంహారము
చేసినపుడు
అతనికి
అశుచి
అయినది.
అంతేకాదు.
ఆయన
ఘోరమయిన
ఆకలితో
బాధపడసాగెను.
అపుడు
అతనిని
దేవతలు, మహర్షులు
ఇక్కడికి
కొనివచ్చి,
గంగలో
స్నానము
చేయించి
కడవలు కడవలు,
గంగాజలమును
మంత్రపూతము
చేసి
అతని
తలపై
కుమ్మరించిరి.
అంతటితో
ఆయనకు
పట్టిన
బ్రహ్మహత్యా పాపము
పోయినది.
అశుచి, ఆకలి
మాయమయినవని
బ్రహ్మదేవుడు
సంతోషించెను.
ఈ ప్రదేశమున
దోషమలము
పోయినది
కనుక
మలదమనియూ,
కారూశము
పోయినది
కనుక
కరూశమనియూ,
రెండు దేశములుగా
ప్రసిద్ధికెక్కెను.
అట్టి
జ్ఞాపకార్థమై
దేవతలు
ఈ రెండు పేర్లతో
రెండూ
ధనధాన్య సదుపాయములతో
వర్ధిల్లునట్లు
సంకల్పించిరి.
ఇంతలో
ఈ దేశముల మధ్య
తాటకి
అను
రాక్షసి
విజృంభించి
సర్వమును
ధ్వంసము
చేయదొడగెను.
అది
యక్షిణి,
కామరూపిణి.
అది
పుట్టుటతోడనే
వేయి యేనుగుల
బలముతో
పుట్టినదని
వదంతి.
ఆమె
తిరిగి
మారీచుడను
కొడుకును
కన్నది.
వాడు
ఇంద్రుడంతటి
పరాక్రమవంతుడు.
తల్లి కొమరులిరువురునూ
చేరి,
17
▾
Meaning
Keep
ప్రజలను
నానావిధముల
బాధపెట్టదొడగిరి.
ఆ
…
అయిన
తాటకి
గల
అరణ్యమే
దీనికి
ఒకటిన్నర
యోజనాల
దూరములో
ఉన్నది.
ఈ
పచ్చని
రాజ్యములైన
మలద, కరూశ రాజ్యములను
నాశనము
చేసినదే
ఆ
తాటకి.
పంటలు
పండుచున్న
భూములు,
పండించు
ప్రజలు
క్షీణించి
పోవుటచే
మహారణ్యములుగా
మారిపోయినవి.
ఈ
తాటకీ మారీచుల
భయముచే
ఈ ప్రదేశము
నిర్జనారణ్యముగా
మారిపోయినది.
అంతేకాక
అది
ఎవ్వరికీ
చిక్కక,
తప్పించుకొని
పోవుచున్నది.
దానిని
నొక్కిపెట్టువాడొక్కడైనను
నేటివరకూ
సిద్ధపడలేదు.
ఇట్టి
భయంకర శక్తిసామర్థ్యములుకల
తాటకిని
హతమార్చువాడు
నీవొక్కడవు
తప్ప
అన్యులు
నాకెవ్వరునూ
ఊహకైనను
తట్టుటలేదు.
ఈ
దుర్మార్గపు
మాతాకుమారులే
నా
యాగాది సత్కర్మలను
అపవిత్రం
చేయుచున్నారు"
అని
ఆ రాక్షసులను,
వారి పరాక్రమ శక్తిని
గురించియూ
పలుకుచూ
దారి
నడచుచుండిరి.
విశ్వామిత్రుడు
పలికిన
పలుకులు
రాముని
హృదయమును
కదిలించెను.
కలిగిన
భావమును
కడుపున
దాచుకొనలేకపోయెను.
వెంటనే
రాముడు
వినయ విధేయతలతో,
"మునిపుంగవా!
యక్షులు
అల్పవీర్యులని
వింటిని.
అందులో
తాటకి
ఆడది!
అబల!
ఆమెకంతటి
బలమెట్లు
వచ్చినది?
ఇంతటి
దేవతలే
నీమించిన
దేశములను
ఎట్లు
నిర్మూలము
చేసినది?
ఇది
చాలా
ఆశ్చర్యముగా
నున్నది.
నమ్ముటకూ
వీలుకానిదిగా
ఉన్నది"
అని
పలికెను.
అంత
విశ్వామిత్రుడు,
"రామా!
నా మాటలు
పరమ సత్యములు,
వివరింతును,
వినుము.
పూర్వము
సుకేతుడను
యక్షుడొకడుండెడివాడు.
వాడు
ఎంతటి పరాక్రమవంతుడో
అంత
సదాచార సంపన్నుడు.
కానీ,
సంతానము
లేకపోవుటచే
అతను
ఘోరమగు
తపస్సు
చేసెను.
అంత
బ్రహ్మ
వాని
తపస్సునకు
మెచ్చి,
ప్రత్యక్షమై,
"మహాబలముతోకూడి
శక్తి సామర్థ్యములలో
ఇతరులు
దీటురానిదైన
ఒక పుత్రిక
కలుగును"
అని
వరము
ననుగ్రహించి
పోయెను.
పుత్రసంతానమునకు
వరమియ్యలేదు.
అంతట
సుకేతుడు
గృహమునకు
చని
18
▾
Meaning
Keep
కాలము గడుపుచుండ,
అతనికి
పుత్రిక
పుట్టెను.
ఆమెయే
'తాటకి'.
ఆ బిడ్డ
పెరిగి
పెద్దదయి
అబల
అయినప్పటికిని
తన
శక్తిసామర్థ్యములు
కోల్పోక
బ్రహ్మానుగ్రహముచే
అనేక యేనుగుల
బలముతో
కన్నుమిన్ను కానక
సంచరించుచున్నది.
ఆమె
మహా రూపవతి.
అందుచేత
తండ్రి
సరియైనవాడు
చిక్కిన
తాటకికి
వివాహము
చేయవలెనని
అనేకవిధముల
వెతకి,
కడకు
సుందుడు
అను
అతనికిచ్చి
వివాహము
చేసెను.
మూడవ సంవత్సరమున
ఆమెకొక
కుమారుడు
కలిగెను.
వాడే
మారీచుడు.
తల్లీ, కొమరులు ఇరువురూ
యెవరూ
యెదిరించలేనంతటి
వారలుగా
తయారయిరి.
ఇంతలో
కొన్ని పాప కార్యములు
చేయుచూ
మహర్షులకు
అనేక బాధలు
కలిగించుచుండుటచేత,
తాటకి
పతియయిన
సుందుడు
అగస్త్య మహర్షి
శాపమునకు
గురి యాయెను.
అతను
మరణించగనే
తన పతిని
చంపెనను
కోపముతో
తాటకి
తన కుమారుని
వెంటబెట్టుకొని,
అగస్త్యుని
మీదికి
చంపుటకై
వెళ్లినది.
పెద్ద పెద్ద అరుపులతో
వికార ఆకారమును
పూని
అగస్త్యుని
మింగుటకై
పరుగెత్తెను.
ఇంతలో
వీరి క్రూరత్వమును
గమనించి,
అగస్త్యుడు
మొదట
మారీచుని
"నీవు
రాక్షసుడవగుదువుగాక"
అని
శపించెను.
అంతటితో
తాటకి
మరింత క్రోధముతో
కనుల నుండి
రక్తము
గ్రక్కునట్లు
పెద్ద పెద్ద కేకలతో
అగస్త్యునిపై
పడబోయెను.
ఆలస్యము
పనికిరాదని
గమనించి
అగస్త్యుడు
ఆ తాటకినికూడను,
"నీ సౌందర్యమును
కోల్పోయి
వికారమైన ఆకారముతో
నరమాంస భక్షణ
చేయుచూ
మహారాక్షసిగా
తిరుగాడుదువు గాక"
అని
శపించెను.
ఈ శాపముల కేమాత్రము
గొంకక,
జంకక
అనేక విధముల
అగస్త్యుని
చంప
ప్రయత్నించి,
విఫలతగాంచి,
అతనినేమీ
చేయలేకపోయి
కోపమును
చల్లార్చుకొనుటకై
అతను
సంచరించుచున్న
ఈ మలద, కరూశ దేశములను
హతమొనరించెను.
ఈరీతిగా
అగస్త్యునిపై గల
కోపమును
తల్లీ కుమారులు
తీర్చుకొనుచున్నారు"
అని
పూర్వ వృత్తాంతమును
విశ్వామిత్రులవారు
రామునకు
తెలుపగనే,
రాముడు
అందుకొని,
"స్వామీ!
సరి,
బ్రహ్మానుగ్రహముతో
పుట్టుటచే
తపశ్శక్తిని
పొందుటచే,
మహర్షుల శాపముచే
ఘోరమయిన
19
▾
Meaning
Keep
రాక్షసాకారము కలుగుటచే,
మహాబలముతో, పరాక్రమములతో
స్వేచ్ఛా విహారము
జరుపుచుండవచ్చును.
ఎంత బలశక్తులుండిననూ
తాను
అబలయే కదా!
స్త్రీ హత్యా పాపము
ఘోరమైనది కదా!
అందువలననే
అగస్త్యుడు కూడనూ
ఆమెను
చంపక
ఇట్టి వికార రూపవు
కమ్మని
శాపమొసగెను.
లేకున్న
పతిని
శపించిన
మహర్షి
సతిని
శపించలేకపోయెనా?
స్త్రీ హత్యకు
పూనుకొనుట
పురుష సింహములకు
తగిన సార్థకము
కానేరదని
వినియుంటిని.
ఇందుకేమి చేయమందురో?
ఆజ్ఞ యొసగుడు"
అని
తనలోని సందియములను
విశ్వామిత్రుని ముందు
పెట్టగా,
విశ్వామిత్రుడు
సంతసించి,
"రామా!
స్త్రీ హత్య
మహాపాతకమని
నాకు మాత్రము
తెలియకపోలేదు.
అయితే గో, బ్రాహ్మణ, సాధు సంరక్షణ
అత్యంత ప్రధానములు.
ధర్మము
పైమూడింటిలో
ఇమిడియున్నది.
ధర్మరక్షణకై
అధర్మమును
నిర్మూలము చేయుటలో
ఎట్టి దోషమును రాదు.
"ధర్మో రక్షతి రక్షితః"
అన్న ఆర్యోక్తి
నీవెరుగవా?
ఇది
స్వార్థమునకు సలుపు హింస
కానేరదు.
లోక రక్షణకై
చేయుటలో
ఎట్టి దోషమూ అంటదనియే నానుడి.
అంతియేకాక,
సృష్టి స్థితి లయములు
దైవ సంకల్పములు.
అవి
మానవమాత్రుల కల్పితములు
కానేరవు.
నీవు
దైవాంశసంభూతుడవు.
నీకట్టి అధికారము కలదు.
అగ్నికెట్టి మాలిన్యమూ అంటనటుల,
దైవమునకు ఎట్టి పాపమూ అంటదు.
రక్షించుటకెంత అధికారమో,
సృష్టించుట కెట్టి సంకల్పమో
శిక్షించుటకూ అట్టి సంకల్ప అధికారము లుందును.
పాపమునకు తగిన శిక్ష
ఏనాటికైననూ తప్పనది కాదు.
ఇంకనూ అనేక పాపములు చేసి
పూర్తిగ హీనమగుటకంటె,
ఈనాడు నీ హస్తములతో మరణించుట
ఆ తాటకి పుణ్యమే
అని చెప్పవచ్చును.
నీవు దానికిని, దేశమునకునూ
ఉపకారము చేసిన వాడవే అగుదువుకానీ,
అపకారముకానీ, పాపముకానీ
చేసినవాడవు కానేరవు.
ఈనాడు నీవు దయతలచి వదలినచో,
లోకమునకు తీరని లోటు
ధర్మమునకు హాని కలుగుటయేకాక,
ఆ తాటకి పాపమును కూడనూ
అధికము గావించినవాడవగుదువు.
వేయేటికి?
దివ్యదృష్టితో నేనెరిగితిని.
నీవు రాక్షస సంహారమునకే అవతరించితివి.
ఇది నీ పని.
నేడు చేయునదికానీ ముమ్ముందు చేయునవిగానీ,
ధర్మరక్షణ, రాక్షసమర్దన
20
▾
Meaning
Keep
ఈ రెండూ
నీ జన్మకు కారణములు.
ఈ సత్యమును
నే తెలిసికొనియే
నీ చెంతకు
పరుగిడి వచ్చితిని.
లేకున్న
నిన్ను ఆశ్రయించవలసిన పని
నాకేమున్నది?
మహాఋషులు, సాధు పుంగవులు
లోకక్షేమ నిమిత్తమై
రాజుల నాశ్రయించుచుందురేకానీ
వారి స్వార్థమునకు కాదు.
సర్వసంగపరిత్యాగులై
కాయములను
కంద మూలాదులతో
కొంతకాలము నింపి
కడకు అట్టి ఆహారమునుకూడనూ
విసర్జించి,
కాయముల నలక్ష్యపరచి
కాంతిలో లీనము కానున్నవారలు
పరుల రక్షణెందులకు
ఆశింతురు!
ఏమి జరిగిన వారికేమి నష్టము!
అయితే జ్ఞానులు,
తమకు తాము తరించుటే కాక
తాము తెలిసికొన్న సత్యమును,
లోకులకు తెలిపి,
ఆచరించి అనుసరింపజేసి
లోకమున జీవులను
తరింపజేయ సంకల్పింతురు.
లోకముతో మాకేమి పనియని
జ్ఞానులు తమ మార్గమునే
తాము చూచుకొన్న జీవులు
భ్రష్టులై
ధర్మమును నశింపజేతురు.
ఇట్టి పవిత్ర లక్ష్యమును
వక్షమున నిడుకొనియే
మహాఋషులు లోకులతో సంబంధమును
కలిగియుందురే కానీ,
వారికెట్టి స్వార్థమునూ ఉండదు.
వారు జలములోని తామరల వంటివారు.
లోకులతో వారు కలసిమెలసి యున్ననూ
లోకవాసనలను వారలలో చేర్చరు.
లోకోద్ధారము మాత్రమే చూతురు.
ధర్మరక్షణ మాత్రమే చేతురు.
దైవమును మాత్రమే ఆశ్రయింతురు"
అని ఉన్న సత్యమును
రామునికి విన్నవించగనే
రాముడు ఏమియూ తెలియనివానివలె,
"స్వామీ!
మహాఋషుల అంతర్భావములు
మహా పవిత్రమైన అర్థములతో
కూడియుందుట
లోకులు గమనింపరు కదా!
వారు తెలిసికొను నిమిత్తమై
తమరిని నేనీ ప్రశ్న వేసితినేకానీ,
వేరు భావము కాదు.
ఏవెటులైననేమి?
నా తండ్రి ఆజ్ఞ ననుసరించి
నేను నడుతును.
విశ్వామిత్రులవారు చెప్పినటుల
నడచుకొమ్మని
నా తండ్రియగు దశరథుడు తెలిపెను.
కనుక పితృవాక్య పరిపాలనమే
నా వ్రతము.
తాము మహాఋషులు.
మహా తపస్సంపన్నులు.
అట్టి మీరే తాటకి వధ న్యాయమని
తెలుపుటచే
నా తప్పేమియునూ లేదు.
అంతియేకాక గో బ్రాహ్మణ హితముకోస…ముకోసము,
ధర్మరక్షణ కోసము,
తామాజ్ఞాపించిన ఏ
21
▾
Meaning
Keep
కార్యమైననూ చేయుటకు నేను సంసిద్ధుడను"
అని,
వింటిని
పిడికిటితో పట్టి
దశదిశలు మారుమోగునట్లు
టంకారము చేసెను.
ఆ శబ్దమునకు
అరణ్యమంతయూ దద్దరిల్లగా
అందులోని మృగములు
బెదరి చెల్లాచెదరుగా పరుగిడజొచ్చెను.
తాటకి దిగ్భ్రమచెంది రోషపూరితయై
ఆ మహాధ్వని వినిపించు దిశకు
పరుగులు తీసినది.
ఒక పెద్ద మదగజమువలె,
ఒక పెద్ద కొండ కదిలి వచ్చునటుల
వచ్చుచున్న తాటకిని
రాముడు చూచి చిరునవ్వుతో
"తమ్ముడా, చూచితివా?
ఆ వికారాకారము!
నిజముగా దీని ఆకారము
సామాన్య మానవులు చూచి బ్రతుక గలరా!
విశ్వామిత్రుడు చెప్పినటుల
దీని ఆకారమే భయంకరముగా నుండ
దీని బలము చెప్పనక్కరలేదు.
ఇంతకూ ఇది ఆడది.
చంపుటకు నా మనసంత ఒప్పుకున్నది.
కాళ్ళూచేతులు తెగద్రెంచిన
దీని శక్తి నశించును"
అని మాటాడుచుండగనే
పొడవైన చేతులు చాచుకొని
రాముని అప్పళమువలె మ్రింగనెంచి
హాహాకారము చేయుచూ
రామునిపై పడినది.
ఈ దృశ్యము చూచుచున్న విశ్వామిత్రుడు
కన్నులు మూసి
'రామలక్ష్మణుల కెట్టి కీడునూ జరుగకుండుగాక'
అని ప్రార్థించెను.
తాటకి రాముని చెంతకు పోలేకపోయినది.
అతనిని సమీపించగనే
తనకేదియో కరెంటు షాకు కొట్టినటుల
బాధకలుగుచున్నది.
ఒకటి రెండు పర్యాయములు
అతనిపైబడి బెదిరిపోయినది.
అందువలన కోపముతో
భూమిని చిమ్మి దుమ్ము ఎగజిమ్మి
ఆ ప్రదేశమంతయూ
అంధకార బంధురము అయ్యేటట్లు జేసివేసినది.
ఈ దుమారములో
రామలక్ష్మణ, విశ్వామిత్రులు
క్షణకాలము ఏమీ తెలియకుండా
సొమ్మసిల్లిరి.
ఇంతలో తాటకి మాయమై
వారిమీద రాళ్ళువాన కురిపించడము
మొదలుపెట్టెను.
ఈ చర్యలు గమనించి రాముడు,
"ఇట్టి దుర్మార్గమైన రాక్షసిని
ప్రాణములతో వదలి పెట్టుట మంచిదికాదు.
ఆడది కదాయని ఎంత జాలి తలచిననూ
దీని చేష్టలు మితిమీరుచున్నవి"
అని తాటకి సూక్ష్మ రూపమున
ఎచ్చటున్నదో తెలిసికొని
అటువైపునకు అంబును వదలెను.
22
▾
Meaning
Keep
అంత తాటకి
తిరిగి వికార రూపమును ధరించి
రామునిపై దుముకుచూ రాగా,
రాముడు దాని రెండు బాహువులూ
తెగత్రెంచెను.
తన భుజములు తెగిపోవుటచేత,
బాధను భరించలేక
రొప్పుచు కేకలు పెట్టుచు
క్రిందపడిపోయెను.
తక్షణమే లక్ష్మణుడు
దాని అంగములు విడివిడిగా
ఖండించెను.
తాటకి కామరూపిణి కనుక
అంతకంతకు చచ్చినటుల నటించుచూ,
తిరిగి అనేక రూపములతో
అటూ ఇటూ కనిపించుచూ,
తిరిగి రాళ్ళవర్షము కురిపించుచూ
ఈరీతిగా తన ప్రతాపమును
ప్రదర్శించెను.
ఇంతలో రామలక్ష్మణులు
ఏమి చేసిననూ
కొంత బాధలకు గురికావలసి వచ్చెను.
అంత విశ్వామిత్రుడు గమనించి
సమయము తప్పిన ప్రమాదము సంభవించవచ్చునని
యోచించి,
"రామా! నీవు ఆలసించకు,
ఆడదని దయతలచుటకు
ఇది సమయము కాదు.
అంగములు తీసిన ప్రయోజనంలేదు.
ప్రాణములున్న,
రాక్షసులు ఎన్ని రూపములైనను దాల్చురు.
కాన ప్రాణమునే తీయవలెను,
సిద్ధపడుము"
అని హెచ్చరించెను.
"సంధ్యాకాలం సమీపించుచున్నది.
దీని మాయలు మరింత పెచ్చు పెరుగును.
సూర్యాస్తమయమైన తరువాత
రాక్షసులతో ఎట్టి వారైననూ
పోరాడ వీలుకాదు.
ఈ లోపునే దీనిని సంహరించ వలెను.
లెమ్ము! సిద్ధము కమ్ము!"
అని విశ్వామిత్రుడు రక్షణ మంత్రములు చెప్పుచూ
హెచ్చరించజొచ్చెను.
అపుడు, రాముడుకూడనూ
సత్యము విచారించి,
శబ్దవేదిత్వ జ్ఞానముతో,
తాటకి ఎక్కడ నున్నదో కనిపెట్టి
సూటిగా నొక తీవ్రమైన బాణమును విడచెను.
ఆ బాణము తాటకిని కట్టిపెట్టి కదలనీయక చేసెను.
అంత, ఆ తాటకి పెద్ద పెద్ద భయంకరమైన శబ్దము చేయుచూ,
నాలుక చాచి రామలక్ష్మణులపై వ్రాల ప్రయత్నించెను.
ఇక నిదానము చేయుట మంచిది కాదని గమనించి
రాముడు దాని ఎదలో నొక చురుకైన బాణమును విడచెను.
అంతటితో తాటకి నేలకూలి ప్రాణము వీడెను.
ఆ తాటకి క్రింద పడి ప్రాణమువీడు సమయమున,
అటూ ఇటూ పొర్లుతున్న బలమునకు
పెద్ద పెద్ద వృక్షములు విరిగి నేలకూలినవి.
భూమిపై యొక బావివలె గుంత ఏర్పడెను.
చుట్టూ కొన్ని నూర్ల గజములు
23
▾
Meaning
Keep
నేలమట్ట మాయెను.
కడపటి శ్వాసను వీడునపుడు
చేసిన ధ్వనితో
మృగములు బెదిరినవి, కొమ్ములు విరిగినవి.
ఇంతటి బలమైన తాటకి నేలకూలగనే,
విశ్వామిత్రుడు రాముని దగ్గరకు పిలిచి,
తలనిమిరి,
"నాయనా! భయపడితివా?
సర్వలోకరక్షకుడ వగు నీకు
భయమనునది కలదా!
లోకసంరక్షణలో ఇది ప్రధానమైన పునాది.
ఇది భద్రమయిననే
నీ కార్యభారమను భవనము భద్రముగా నిలువగలదు.
అలసిపోతిరి కాబోలు!
సూర్యాస్తమయమైనది.
సంధ్యా వందనము చేసి,
కొంత శ్రమ తీర్చుకొనుట మంచిది.
రండి!"
అని నదీతీరమునకు తీసుకొని పోయి,
"నాయనలారా! ఈ రాత్రికి ఇచ్చటనే విశ్రమించి,
తెల్లవారగనే మనము మన ఆశ్రమమునకు వెళ్లుదము"
అని వారలకు అనేక రకములైన కథలను తెలుపుచూ
వారి శక్తులను వర్ణించుచూ రాత్రి కాలము గడిపెను.
తెల్లవారినది.
ఆచమనము గావించిరి.
ఇంతలో విశ్వామిత్రులవారు చిరునవ్వుతో,
రామలక్ష్మణుల చెంతచేరి మందహాసము చేయుచూ
మృదుమధురమైన మాటలతో,
"రామా! నీ పరాక్రమమునకు సంతుష్టుడనైతిని.
నీ విశ్వరూపము నీవు ఆ తాటకితో పోరాడునపుడు గమనించితిని.
నిజముగా నేనెంతయో ధన్యుడను"
అని ఇంకనూ ఏమేమో చెప్పుచూ
ఆనంద బాష్పములు రాల,
తనచెంతనున్న సర్వ అస్త్రములను
మంత్ర రూపమున రామచంద్రుని హస్తమున నుంచి,
"ఈ అస్త్రములు ధరించు అధికారము నాకు లేదు.
అట్టి అధికారముకాని, అస్త్రములుకాని
నా చెంతనుండియూ నిరర్థకము కదా!
సర్వాస్త్రములు నీ స్వాధీనము చేయుచున్నాన"ని,
మంత్రములతో ప్రోక్షించి అర్పితము చేసెను.
తదుపరి కొంత తదవయిన పిదప
రాములను పిలిచి
దండచక్రమును, ధర్మచక్రమును, కాలచక్రమును,
అత్యుగ్రము అయిన విష్ణుచక్రమును,
ఇంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును,
శివదేవతాకము అయిన శూలాన్ని,
బ్రహ్మశిరాస్త్రాన్ని, ఐక్షికాస్త్రమును,
అన్నిటికంటే ఉత్తమమైన బ్రహ్మాస్త్రమును
రాముల కందించి,
తిరిగి కన్నులు మూసి,
"రామా! ఇక ఇవి మాత్రమే నాకెందులకు తీసుకొమ్మ"ని
మోదకీ, శిఖరీ అనే రెండు బలమైన
24
▾
Meaning
Keep
గదలను అందించెను.
ఆగ్నేయాస్త్రము, క్రౌంచాస్త్రము, నారాయణాస్త్రము, వాయువ్యాస్త్రము
- ఇవి ఆశ్రమము వెళ్ళిన తరువాత చూతము"
అని చెప్పి,
"నాయనా! రామా!
ఈ అస్త్రములన్నియూ ఇచ్ఛాధీన రూపములు,
మహా బలయుతాలు.
ప్రపంచమునగల అన్ని అస్త్రాలకంటెను
ఇవి అతిశయమయినవి"
అని వాటి మంత్రములను
కర్ణరంధ్రముల ద్వారా అందించెను.
ఆ మంత్రదేవతల నందరినీ వశముచేయ
అప్పుడే జపమును చేయుమని ఆజ్ఞాపించెను.
విశ్వామిత్రుని ఆజ్ఞానుసారము
రాముడు జపము ప్రారంభించి
ఆయా మంత్రరూపములను స్వాధీనపరచుకొనెను.
ఆయా మంత్రరూపములు స్వరూపములతో
కంటి యెదుట నిలచి నమస్కరించి,
"రామా! నేడు మొదలు మేము తమ కింకరులము"ని
ప్రమాణము చేసి అంతర్ధానమయిరి.
అంత రాముడు సంతసించి
విశ్వామిత్రులవారికి నమస్కరించి,
"స్వామీ! తమ హృదయము త్యాగమయము.
నిజముగా మీరు మూర్తీభవించిన సాక్షాత్
అపర త్యాగ యోగ దైవాకారులుగా తోచుచున్నది.
కాకున్న ఇంతటి విలువైన శక్తివంతమైన అస్త్రములను
ఇతరుల కందించువారు లోకమున నుందురా!
స్వామీ! ఏవిధముగా అస్త్రములు నాకందించి,
వాటిని వశము చేసితిరో అటులనే
వాటిని ఉపసంహారము గావించుకొను మార్గమునుకూడనూ
తెలిపి నన్నానందపరచుడ"ని కోరగా,
విశ్వామిత్రుడు ఉల్లాస హృదయుడై,
"నాయనా రామా!
సత్యకీర్తి, ధృష్టము, రథనము, దృఢలాభము, సునాభము, దశాక్షము, శతోదరము, పద్మనాభము, కృశనము, వైరాగ్యము, యోగంధనము, విధూతము, కరవిరకము, రుతరము, పితృసౌమనము, జృంభకము
ఇవి అన్నియూ ఇచ్ఛాధీన రూపములు.
వాటికి ఉపసంహార మంత్రములు వినుము"
అని కర్ణరంధ్రముల ద్వారా త్రాపించెను.
తిరిగి ఆ మంత్రములను జపము చేయగా
ఆయా అధికార స్వరూపములు కట్టెదుట నిలచిరి.
వారల నమస్కారము అందుకొని రాముడు
వారిని హెచ్చరించి
"నాకవసరమైనపుడు పిలుతును రండి"
అని ఆజ్ఞాపించి,
"మీరు స్వేచ్ఛగా విహరింపవచ్చున"ని పంపివేసెను.
25
▾
Meaning
Keep
అంత విశ్వామిత్రుడు,
"నాయనలారా! ఇక మన ప్రయాణమును సాగింతము"
అన వారు నడువ మొదలిడిరి.
కొంతదూరము వెళ్ళగనే,
ఒక పర్వత ప్రదేశము చేరగలిగిరి.
ఆ పరిసరములలో ఒక సుందరోద్యానవనము
కనిపించుటే కాక
సుగంధము వారలను స్వాగతించినటుల చుట్టుకొనెను.
భయంకరారణ్యమును దాటి
సుందరమైన ఉద్యానవనములు ప్రవేశించుచున్నాము
అని సంతసించి,
"స్వామీ! ఇది ఏదో పుణ్యాశ్రమమువలె కనిపించుచున్నది.
ఇది ఎవరిదో సెలవిత్తురా?"
అని రాముడు ప్రశ్నించగనే,
విశ్వామిత్రుడు, "నాయనలారా!
మహామహులైన యోగులు, దేవతలు
తమతమ సంకల్పమును సిద్ధింపచేసుకొనుటకై
ఈ ప్రదేశమున నివసించెడివారు.
కాశ్యపుడుకూడనూ ఇక్కడే తపస్సిద్ధిని పొందెను.
అందువలన నిది సిద్ధాశ్రమమని ప్రసిద్ధి గాంచినది.
ఇపుడు నేను భక్తితాత్పర్యములతో
ఈ ఆశ్రమములో నివాసము పెట్టుకొన్నాను.
ఈ ఆశ్రమపదానికే రాక్షసులు వచ్చి
యజ్ఞాన్ని విఘ్నము చేయుచున్నారు.
ఈ చోటుననే వారిని సంహారము చేయవలసియున్నది"
అని చెప్పుచూ సిద్ధాశ్రమమున అడుగిడిరి.
అంత విశ్వామిత్రుడు రాముని భుజములపై చేయివేసి,
"నాయనా! ఈ ఆశ్రమము ఇప్పుడు నాదెట్లయినదో
అటులనే నేటినుండి నీదిగా నిలువ గలదు"
అని ఆనందబాష్పములతో
ఆశ్రమమున ప్రవేశించుచుండగనే
సిద్ధాశ్రమవాసులు, అందరూ పరుగిడివచ్చి
పాదములు కడిగి
రామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యములు ఇచ్చి
ముందు పూలు చల్లుచూ లోనికి గొంపోయి,
కొంత ఫలపానీయముల నిచ్చి
విశ్రాంతి తీసుకొనుటకు ప్రత్యేక వసతులు గలిపించి
రామలక్ష్మణులను కోరగా,
వారు తగినంత విశ్రాంతి తీసుకొని లేచి
పాదములను శుద్ధిచేసుకొని,
విశ్వామిత్రులవారి దగ్గరకు వచ్చి,
చేతులు కట్టినిలచి,
"స్వామీ, రేపటినుండియే తమరు యజ్ఞము ప్రారంభించవచ్చును కదా"
అని ప్రశ్నించగా,
"సర్వ సిద్ధముగానున్న సిద్ధాశ్రమములో
సిద్ధము చేయ వలసినవేమున్నవి!
తప్పక తెల్లవారగనే దీక్ష వహింతున"ని తెలిపి
అందుకు తగినవన్నింటినీ ఆశ్రమవాసులతో చెప్పి
ఏర్పాటు చేయించిరి.
26
▾
Meaning
Keep
తెల్లవారెను.
యాగదీక్షను
వహించి
విశ్వామిత్రుల
వారు
సిద్ధమయిరి.
రామలక్ష్మణులు
స్కంద
విశాఖులవలె
అంబులు
ధరించి
వారి
దీక్షను
వారు
తీవ్రమైన
సంకల్పముతో
పూని
నిలిచిరి.
యజ్ఞదీక్షను
పూనిన
విశ్వామిత్రులవారిని
పలుకరించుట
ఉచితము
కాదని
ప్రక్కల
నున్న
మహాఋషులతో
రామలక్ష్మణులు,
సైగలు
చేయుచూ
రాక్షసులు
ఎపుడు
వత్తురు,
ఏ
దిశనుండి
వత్తురని
వారలను
అడుగుచుండెడివారు.
అక్కడివారు
"చెప్పుటకు
వీలుకాదు.
రాక్షసులకు
కాలభేదమేమాత్రము
నుండదు.
ఏ
నిమిషము
నందైననూ
వచ్చి
వ్రాలవచ్చును.
వారి
రాకను
చెప్ప
నెవరి
తరము!"
అని
ఒక్కొక్కరొకవిధముగ
చెప్పుచుండెడివారు.
అట్టి
మహాఋషుల
పలుకులకు
సంతసించి
ఎప్పటికప్పుడు
సిద్ధముగా
నుండుటెంతేనియూ
అవసరమని
తలంచి
తమ్ముని
హెచ్చరించి
నలుదిశలా
దృష్టిని
ప్రసరింపచేయుచూ,
ఏకాగ్రతతో
ఏ
చిన్న
శబ్దము
వినిపించిననూ
అది
రాక్షస
శబ్దమా
అన్నట్లు
జాగరూకతతో
వేచి
యుండుటను
చూచి
చేరిన
మునులు
ఈ
పిల్లల
ధైర్యసాహసములకు
ఆనందము,
ఆశ్చర్యమునూ
పొందుతూ
ఉండెడివారు.
ఈరీతిగా
ఐదు
అహోరాత్రములు
నిద్రపోక
ఆ
తపోవనమును,
యజ్ఞశాలను
కాపాడుచుండిరి.
ఆరవ
దినము
పగలు
ప్రారంభమయినది.
విశ్వామిత్రులవారు
యజ్ఞము
యథాప్రకారముగా
సమంత్రకముగా
సశాస్త్రీయముగా
సాగించుచున్నారు.
ఋత్విక్కులు
వారి
వారి
పనులలో
వారు
నిమగ్నులయి
దీక్షను
సాగించుచున్నారు.
ఇంతలో
ఆకసము
బ్రద్దలయినటుల
భయంకర
శబ్దమొకటి
వినిపించెను.
దర్భలూ,
పానపాత్రలు,
హోమపాత్రలు,
సమిధలూ,
పూలూ,
కుంకుమ,
అక్షింతలుసహా
ఒక్కతూరి
అంటుకొన్నవి.
భగభగమని
మంటలు
లేచినవి.
వర్షకాలపు
మేఘములవలె
అప్పటికప్పుడు
మేఘములు
ఆకసమున
ఆవరించి
భయంకరమైన
చీకటులు
క్రమ్మినవి.
ఆ
మాయ
మబ్బులు
అమిత
వేగముతో
పరువులెత్తుకొని
యాగశాల
దిశకు
వచ్చుచున్నవి.
ఆ
మేఘములనుండి
భయంకరమైన
రక్తవర్షము
కురియ
27
▾
Meaning
Keep
మొదలుపెట్టెను.
ఆ
రక్త
ప్రవాహము
వేదికపై
పడబోవు
సమయమునకు
సరిగా
మంటలు
మరింత
అధికమగుచూ
వచ్చెను.
రామలక్ష్మణులు
అతి
జాగ్రత్తగా
ఆ
రాక్షసుల
ఆకారములు
ఎక్కడున్నవా
అని
వెతుకదొడగిరి.
రాముడు
దివ్యదృష్టితో
తిలకించి
మారీచ,
సుబాహులున్న
దిశకు
మానసాస్త్రమును
వదలెను.
అది
మారీచుని
గుండెలకు
తగిలెను.
వెంటనే
ఆగ్నేయాస్త్రము
వదలగనే
అది
పోయి
సుబాహుని
గుండెలపై
గుచ్చుకొనెను.
అంతటితో
వదలక
ఆ
కాయములు
ఆ
అరణ్యమున
కూలిన,
యజ్ఞము
అశుభమగునని
తలంచగా
ఆ
అస్త్రములు
రెండూ
మారీచ,
సుబాహుల
దేహములను
నూరు
యోజనముల
దూరము
కొట్టివేసి
సముద్రమున
పడవేయించెను.
వారు
విలవిల
తిరుగుచూ
అనేక
చేష్టలు
చేయుచూ
సముద్రమున
పడిరి,
కాని
చావలేదు.
అంత
మారీచ,
సుబాహుల
అనుచరులు,
అనేకమంది
అటూఇటూ
పరుగెత్తసాగిరి.
రాక్షసుల
నెట్టివారలైనను
విడుచుట
మంచిది
కాదు.
నేటి
అబలత్వమే
రేపటి
బలముగా
మారును.
వీరలనుకూడను
విడుచుట
మంచిది
కాదు
అని
లక్ష్మణునికి
తెలిపి,
వారందరినీ
సంహరింపజేసెను.
ఈ
దృశ్యమును
కనులారా
చూచుచున్న
మహర్షులు,
మహదాశ్చర్య
చిత్తులై
వీరు
సాక్షాత్
పరమ
శివుని
రుద్రభద్రాకారులే
అని
విశ్వసించి,
తమలో
తాము
వారలకు
నమస్కరించిరి.
అరణ్యం
నిమిషములో
ప్రశాంతమైన
వాతావరణంతో
కళకళలాడదొడగినది.
విశ్వామిత్ర
మహర్షి
చెక్కు
చెదరక
కట్టుకదలక
వేదిక
వీడక
తన
దీక్షలో
తాను
నిమగ్నుడై
పూర్తి
చేసెను.
పూర్ణాహుతి
అత్యంత
వైభవముగా
మంగళకరముగా
సమాప్తి
ఆయెను.
అంత
విశ్వామిత్రుడు
చిరునవ్వులతో
రామలక్ష్మణుల
దగ్గరకువచ్చి,
"యశస్వులారా!
నా
కార్యము
దిగ్విజయము
గావించితిరి.
ఈ
సిద్ధాశ్రమ
నామమును
సార్థకము
చేసితిరి.
ఇంతియేకాదు,
మీవలన
నేను
కృతార్థుడ
నయితిని"
అని
పలికి
ఆనంద
బాష్పములు
రాల్చుచూ
వారి
శిరస్సులను
ముద్దిడుకొని,
ఇరువురి
భుజములపై
చేతులు
వేసుకొని,
ఆశ్రమములోనికి
28
▾
Meaning
Keep
తీసుకొని
వెళ్లి,
వారలకు
యజ్ఞప్రసాదమును
అందించి,
"ఇక
చక్కని
విశ్రాంతి
తీసుకొండ"ని
కోరగా,
వచ్చిన
కార్యము
నెరవేరిన
ఆనందమే
వారికి
పెద్ద
విశ్రాంతి,
ప్రశాంతి
కలిగించినది.
అయిననూ
మహాఋషుల
ఆజ్ఞను
మీరుట
మంచిది
కాదని
రామలక్ష్మణులు
నిశ్చింతగా
నిద్రించిరి.
వారి
నిద్రకెట్టి
భంగము
కలిగించకుండుటకై
అక్కడ
కాపలావారిని
పెట్టి
వారై
వారు
మేల్కొను
వరకు
ఎవ్వరూ
నిద్రాభంగము
గావింపరాదని
ఆజ్ఞయొసగి
విశ్వామిత్రుడు
మరొక
పర్ణశాలకు
వెళ్లెను.
అక్కడ
ఋత్విక్కులతో,
పండితులతో,
మునులతోకూడి
యజ్ఞ
విజయమునుగురించి,
రామలక్ష్మణుల
దైవశక్తులను
గురించి
ముచ్చటించుచూ,
వర్ణించుచూ
ఆనందపడుచుండిరి.
ఇంతలో
రామలక్ష్మణులు
మేల్కాంచి,
కరచరణములు
శుద్ధము
చేసుకొని
బైటికి
వచ్చి
ద్వారముదగ్గర
కాపలా
కాయుచున్న
ఋషిశిష్యులను
అడుగగా
విశ్వామిత్రులవారు
మీ
నిద్రకు
భంగము
కలుగకూడదని
ఆజ్ఞ
ఇచ్చి
చెంతనేయున్న
పర్ణశాలలో
మునులతో
సంభాషించుచున్నారని
తెలుపగనే,
రామలక్ష్మణులు
అచటికి
వెళ్లి
విశ్వామిత్రులవారికి
నమస్కరించి
చేతులు
కట్టి
నిలుచుకొని,
"మహాఋషీ!
ఈ
కింకరులు
చేయవలసిన
పనేమైననూ
ఇంకనూ
మిగిలియుండిన
తెలిపిన
సంసిద్ధులమ"నగనే,
అందులో
ఒకరు
లేచి
నిలుచుకొని,
"రామా!
రాక్షస
సంహారముతో
సర్వకార్యములూ
సఫలీకృత
మయినవి.
ఇంక
మిగిలినవేమున్నవి!
విశ్వామిత్రులవారి
చిరకాల
వాంఛ
ఈడేరినది.
ఇంతకంటే
మాకు
కావలసిన
పని
వేరొండు
లేదు.
మీరిరువురూ
సాక్షాత్
శివశక్తులాకారము
కొన్నటుల
గోచరించుచున్నారు.
మీరు
సామాన్యులు
కారు.
మిమ్ములను
చూచునట్టి
మహద్భాగ్యము
కలిగినందుకు
మేమందర
మమిత
ధన్యులమయితిమి"
అని
అందరూ
నమస్కరించుచుండగా
ఇంతలో
ఒక
ఋషికుమారుడు
ఒక
తాళపత్రపు
కట్టను
చేతపట్టుకొని
వచ్చి,
విశ్వామిత్రులవారి
కందించెను.
విశ్వామిత్రులు
దానిని
విప్పిచూచి,
దానిని
మరొక
వృద్ధ
ముని
చేతికందించి,
బిగ్గరగా
చదివి
చెప్పమనెను.
అందులో
జనకుడు
పరమ
ధర్మిష్టమయిన
మహాయాగము
చేయుచున్నట్లును,
తాము
శిష్య
బృందములతో
ఆ
29
▾
Meaning
Keep
యాగమునకు
తప్పక
విచ్చేయవలె
ననియూ
ప్రార్థించినటుల
చదువగనే,
అందరూ
"శుభము,
శుభము"
అని
ఆశీర్వదించిరి.
అంతలో
విశ్వామిత్రుడు
"నాయనా!
ఇపుడు
అరణ్యమున
స్వేచ్ఛా
సంచారము
చేయవచ్చును
కనుక,
ఆశ్రమవాసుల
నందరిని
తోడ్కొని
రేపే
నేను
మిథిలాపురికి
వెళ్ల
సంకల్పించితిని"
అని
తెలుపగనే,
రాముడు,
"స్వామీ!
మహదానందము.
తమరాజ్ఞ
ఇచ్చిన
మావలన
కావలసిన
పనులేమియూ
ఇక
లేనందున
మేముకూడనూ
రేపు
తెల్లవారగనే
అయోధ్యకు
వెళ్ళివత్తుమ"ని
సెలవు
గోరెను.
అంత
విశ్వామిత్రుడు,
"రామా!
దశరథునకిచ్చిన
మాటను
నేను
దక్కించుకొనవలెను
కదా!
నేనే
వెంట
తోడ్కొని
వత్తుననని
వాగ్దానము
చేసితిని
కనుక
నేను
లేక
మీరు
వెళ్ళ
వీలుకాదు.
మిథిలాపురములో
యజ్ఞము
జరుగుచున్నది.
కనుక
నేను
అయోధ్యకు
వచ్చి
మిథిలాపురము
వెళ్లుటకు
కాలము
చాలా
తక్కువగుటచే
మీరుకూడనూ
నావెంట
మిథిలకు
వచ్చిన
అక్కడ
యాగము
చూచుకొని
అటునుండి
అయోధ్యకు
వెళ్ళవచ్చును"
అని
ఒడుదుడుకులు
లేక
తెలిపిన
విశ్వామిత్రుని
మాటలకు
రాముడు
ముందువెనుక
విచారించక,
"స్వామీ!
పితృవాక్పరిపాలన
నా
ప్రధాన
దీక్ష
అయినందున
తమకొక
విన్నపము
చేయవలసి
వచ్చినద"నెను.
అంత
విశ్వామిత్రుడు
"అది
ఏమో
తెలుపుమ"ని
అడుగగనే,
రాముడు
ఈరీతిగా
తెలుప
మొదలుపెట్టెను.
"మా
తండ్రి,
విశ్వామిత్ర
యాగమును
సంరక్షించి
ఋషి
పుంగవునకు
ఆనందము
కలిగించి
దిగ్విజయులై
రండి
అని
ఆజ్ఞాపించిరేకానీ,
మిగిలిన
యజ్ఞములకు
వెళ్ళమని
తెలుపలేదు.
మిథిలాపురము
వెళ్ళుటకు
ప్రత్యేకించి
తండ్రిగారి
అనుమతి
బడయవలయును
కదా!"
అని
తెలుపగనే,
"రామా!
దశరథుడు
అంతమాత్రమే
ఆజ్ఞ
ఇవ్వలేదు.
'మీరు
వెళ్ళి
ఋషిపుంగవులు
చెప్పినటుల
నడుచుకొని
వారి
ఆజ్ఞను
జవదాటక
మెలగుడ'నియూ,
తిరిగి
'స్వామీ!
మీరే
మా
పిల్లల
బాధ్యతలు
సర్వమూ
చూచుకొని
30
▾
Meaning
Keep
మీరే
స్వయముగా
తోడ్కొని
రండ'ని
నాకుకూడనూ
తెలుపుట
మీరు
వినలేదా?
కాన
నే
చెప్పినటుల
విని
నా
వెంట
మిథిలకు
వచ్చి
అక్కడినుండి
అందరం
మా
శిష్యబృందముతోపాటు
అయోధ్యకు
పోదము"
అని
విశ్వామిత్రుడు
తెలుపగనే
రాముడు
ఇందులోని
సత్యమును
కూడా
గమనించి
"తమ
ఇష్టమెట్లో
అట్లు
నడచుకొందుమ"ని
తల
ఊపుటచేత,
"తెల్లవారగనే
ప్రయాణమునకు
సిద్ధముకండ"ని
విశ్వామిత్రుడు
ఆశ్రమవాసులకు
ఆజ్ఞ
యొసగి
రామలక్ష్మణులను
తోడ్కొని
నదీ
తీరమునకు
వెళ్లి
ఆనందోల్లాసముతో
ఆ
అరణ్యపు
విశిష్టతలను,
తాము
దీనికి
పూర్వము
యజ్ఞములను
చేయ
ప్రయత్నించ
రాక్షసులవలన
కలిగిన
ఆటంకములను,
తాము
అందుకు
చేసిన
ప్రయత్నముల
విఫలతలను
వివరించుచూ
రాక్షసుల
బాధ
నేటినుండి
ఆశ్రమవాసులకే
కాక,
చుట్టుపక్కల
ప్రజలకును
తొలగి
చక్కని
ఆనందము
కలిగినదని
వివరించెను.
Previous
←
The Child Rāma
Next
Sītā's Svayaṃvara
→