Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · Sītā's Svayaṃvara
Rāma Kathā Rasa Vāhini
›
Part One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
అది
ప్రశాంతమైన
వాతావరణము.
మెత్తని
ఇసుక
తిన్నెలపై
విశ్వామిత్రులవారు
రామలక్ష్మణులను
చెంత
కూర్చొనబెట్టుకొని,
మిథిలాపురమున
జనకుడు
చేయు
యాగముయొక్క
విశిష్టతను
తెలుపుచుండెను.
మాటలమధ్య,
జనక
మహారాజు
చెంత,
ఒక
ధనూ
రత్నమున్నదనియును,
అది
చాలా
గొప్పదనియు,
దాని
తేజస్సు
దేదీప్యమానమై
తేజరిల్లుచుండుననియు,
అది
మీరు
చూడవలసినదనియూ,
అట్టి
ధనుస్సు
ప్రపంచమునందెందునూ
లేదనియూ
వర్ణించెను.
ఇంతలో
రాముడు
ఆ
ధనుస్సు
మిథిలాపురాధిపతికి
ఎట్లు
ప్రాప్తించినదని
ప్రశ్నించగనే,
విశ్వామిత్రుడు,
"నాయనా!
వినుము!
పూర్వము
మిథిలాధిపతి
దేవరాతుడు
గొప్ప
యజ్ఞము
చేసెను.
ఆ
యజ్ఞము
సామాన్యుల
కసాధ్యము.
మహాపవిత్రమైనది.
అట్టి
మానవమాత్రులకసాధ్యమైన
యజ్ఞమును
మిథిలాధిపతి
సాధించుటచే,
దేవతలు
మెచ్చి
యజ్ఞఫలముగా
ఆ
ధనుస్సు
రాజునకిచ్చిరి.
అది
శివదేవుని
ధనుస్సు;
దానిని
రాజు
నిత్యము
గంధ
పుష్పాక్షతలతో
పూజించి,
ధూపదీపనైవేద్యాదులతో
ఆరాధన
చేయుచుండును.
దేవ,
దానవ,
అమర,
గంధర్వ,
యక్ష,
రాక్షసులు
ఎవరునూ
దానిని
ఎక్కుపెట్టలేకపోయిరి.
అనేకమంది
రాజ
పుత్రులుకూడనూ
ప్రయత్నించి
విఫలులైరి.
రామా!
మీరు
ఆ
ధనుస్సును
చూడ
తగినవారు.
ఈ
యజ్ఞసమయమున
దాని
ప్రదర్శనము
కూడా
ఉండియుండును.
కనుక,
తప్పక
ఇది
ఒక
మంచి
అవకాశము"
అని
దాని
అద్భుత
శక్తిని
విశ్వామిత్రుడు
వర్ణించుచుండ,
లక్ష్మణుడు
"వెళ్లుదము"
అన్నట్లు
అన్నవైపు
2
▾
Meaning
Keep
చూచెను.
అంత
రాముడు,
"తప్పక
మేము
దానిని
చూడవలెను.
రేపు
మీతో
మేముకూడనూ
వత్తుమ"ని
పట్టరాని
ఆనందముతో
పలికిన
మాటలకు
విశ్వామిత్రుడు
సంతసించెను.
చీకటి
పడుటచే,
అందరూ
లేచి
సిద్ధాశ్రమమునకు
బయలుదేరి
పోయిరి.
అంత
విశ్వామిత్రుడు
ఆశ్రమ
వాసులను
పిలిచి,
తెల్లవారగనే
అందరూ
మిథిలాపురమునకు
వెళ్లుటకు
సిద్ధము
కండని
ఆజ్ఞాపించెను.
అందులో
కొందరు,
"స్వామీ!
ఆశ్రమ
నిత్య
కార్యక్రమములను
నిర్వర్తించువారెవ్వరూ
లేకుండిన
ఎట్లు?"
అని
ప్రార్థించగా,
ఎవరి
కార్యక్రమములను
వారు
నిర్వర్తించుకొనుచుండిన
అదియే
ఆశ్రమ
కర్తవ్య
కర్మ
కాగలదు.
ఆశ్రమ
కార్యక్రమములు
ప్రత్యేకము
లేవు
కదా!
ఆశ్రితులు
చేరుటచే,
ఆశ్రమము
అయినది.
ఆశ్రితుని
కర్తవ్యము
ప్రధానముకాని
ఆశ్రమము
ప్రత్యేకము
కాదు.
ఇంతియేకాక,
నిన్నటినుండి
రాక్షసుల
బాధ
తప్పినది
కనుక
ఆశ్రమమునకెట్టి
ఇబ్బందియూ
లేదు,
రాదు.
సర్వసృష్టికర్తయే
మనందరికి
ఆశ్రమము;
అతనిని
ఆశ్రయించిన
అతనే
అందరినీ
ఆదరించును"
అని
నూతనమైన
పలుకులు
పలుకుచూ,
విశ్వామిత్రుడు
"మీమీ
నిత్యానుష్ఠాన
సామగ్రిని,
ఆశ్రమములోని
అన్ని
పనిముట్లనూ
మీమీ
వెంట
తీసికొనిరండు;
ఇక్కడ
ఏవియూ
ఉంచనక్కర
లేదు"
అని
తెలుపగనే,
కొందరు
శిష్యులు,
"స్వామీ!
ఎంతకాలమునకు
తిరిగి
వత్తుమో
తెలిపిన,
దానికి
తగినంత
మాత్రమే
వెంట
తెచ్చుకొందుము.
అనవసరంగా
ఈ
భారములెందుకు?"
అని
ప్రార్థించిరి.
అందులకు
విశ్వామిత్రుడు,
"కాలము
కాయములకు
అధీనము
కాదు.
కాయమే
కాలము
యొక్క
అధీనమందుండును.
కనుక
ఎప్పుడు
అని
చెప్ప
శక్యముకాదు.
తిరిగి
నేనిక్కడకి
వత్తునో
లేదో?
సందియము!"
అని
తెలుపగనే
ఆశ్రమవాసుల
గుండెలు
ఝల్లుమనినవి.
చేతులలోని
వస్త్రములు,
పనిముట్లు,
క్రిందజారినవి.
అందరూ
స్తంభించిపోయినారు.
మారు
మాటరాలేదు.
చేయు…గుటకు
ధైర్యము
చాలక
ఆజ్ఞ
ప్రకారము
సామానులు,
3
▾
Meaning
Keep
మోయతగినంత
మాత్రము
సమిధలు,
దర్భ
ఇత్యాది
సామగ్రులు
మాత్రమే
కట్టలు
కట్టి
సిద్ధపరచిరి.
విశ్వామిత్రులవారి
మాటలు
ఎవరికిని
అర్థముకాక,
వారిలోవారు
అనేక
యూహలు
పడజొచ్చిరి.
ఆ
రాత్రి
గడచెను.
తెల్లవారినది.
అందరూ
సిద్ధమయి,
ఆశ్రమమునకు
తలుపులు
బిగించుచుండ,
విశ్వామిత్రులవారు
"తలుపులు
బిగించక,
తెరిచి
యుంచుడు.
ఇది
మనది
కాదు.
ఎవ్వరు
వచ్చిననూ
ప్రవేశించవచ్చును.
సర్వవేళలా
సర్వులనూ
స్వాగతించునటులుండవలెను.
నేటితో
మనకును
ఈ
ఆశ్రమమునకూ
సంబంధము
తీరినది"
అని
వెలుపలకు
వచ్చి,
"వనదేవతలారా!
మీరిక
సుఖముగా
వర్ధిల్లుడు.
నా
కార్యసిద్ధి
గావించిన
మీకివే
కృతజ్ఞతాభివందనములు.
రాక్షసుల
బాధకూడనూ
తీరినది.
మీరిక
సుఖముగా
పుత్రపౌత్రాభివృద్ధిగాంచి
శాంతించుడు.
నేను
సిద్ధాశ్రమము
వదలిపెట్టి
పోవుచున్నాను.
ఉత్తరోత్తరా
నేను
గంగానదికి
ఉత్తరాననున్న
హిమాలయ
పర్వత
ప్రాంతమున
వసింప
సంకల్పించితిని"
అని
వనదేవతలకు
తెలిపి,
నమస్కరించి,
రామలక్ష్మణులతోను,
సిద్ధాశ్రమ
వాసులగు
మహామునులతోను
బయలుదేరెను.
ఈ
విషయము
తెలుసుకొని
ఆశ్రమవాసులు
విచారము
వీడి,
మాకు
విశ్వామిత్రులవారెక్కడున్న
అక్కడుండుటే
ప్రధానముకానీ
వనములూ,
ఆశ్రమములూ
ప్రధానము,
ఆధారము
కావని
సంతసించి
హిమాలయ
పర్వత
ప్రాంతము
తమకు
వాసయోగ్యమని
భావించి,
వారుకూడను
వనదేవతలకు,
ఆశ్రమమునకూ
నమస్కరించి
బయలుదేరిరి.
వారందరూ
ఉత్తరాభిముఖముగా
నడుచుచుండ,
వారి
వెనుక
వేలకువేలు
జింకలు,
పక్షులు,
నెమళ్ళు
తోకలెత్తి
అరచుచూ,
పరుగిడి
వచ్చుటను
చూచి
విశ్వామిత్రుడు,
"వనచరములారా!
మా
వెంటపడక
మీరిక్కడే
వసించుడు,
దైవము
కటాక్షించును.
వెళ్ళుడు!"
అని
వాటికికూడనూ
వీడ్కోలు
చెప్పి
పంపివేసెను.
ఆనాడు
ప్రయాణము
సాగించి,
రాత్రికి
శోణాకూలము
చేరుకొనిరి.
ఆ
రాత్రి
అక్కడే
ఉండిపోవలసి
వచ్చెను.
శోణానదములో
స్నానము
చేసి,
4
▾
Meaning
Keep
ఆచమనము
గావించి
నదీతీరమున
అందరూ
విశ్వామిత్రులవారి
చుట్టునూ
కూర్చొనిరి.
అంత
రాముడు,
"స్వామీ!
ఈ
ప్రాంతము
అంతా
శోభాయమానంగా
కనిపించుచున్నది.
ఇది
ఏ
ప్రదేశమైయుండవచ్చునో
తెలుసుకొన
గోరుచున్నాను"
అని
ప్రార్థించగా,
విశ్వామిత్రుడు,
"రామా!
బ్రహ్మమానస
పుత్రుడగు
కుశుడు
అను
తాపసి
పూర్వము
బ్రహ్మలోకమునకు
వచ్చినాడు.
అతడు
దృఢవ్రతుడు;
ధర్మజ్ఞుడు;
శౌర్యసంపన్నుడు.
అతడు
మహాకులీన
అయిన
విదర్భ
రాజ
పుత్రిని
పెండ్లి
ఆడెను.
వారిరువురూ
ధర్మార్థ
కామమోక్ష
చతుర్విధ
పురుషార్థములందు
నీమము
తప్పక
నడచుకొనుచుండిరి.
ఇట్లుండ
వారలకు
కుశాంబుడు,
కుశనాభుడు,
అధూర్తరజకుడు,
వసువు
అను
నలుగురు
పుత్రులు
పుట్టిరి.
వారు
నలుగురు
తండ్రితో
సరిసమానముగా
సద్గుణములు
అలవరచుకొని
అమిత
తేజోవంతులై
పరమ
ధార్మికులై
సత్యసంధులై
క్షత్రియ
ధర్మమును
అవలంబించుచుండిరి.
ఇంతలో
కుశుడు
ఈ
భూమిని
నాల్గు
భాగములుగ
జేసి,
నలుగురు
కొమరులకూ
ఇచ్చి,
"ఓ
పుత్రులారా!
మీమీ
భూభాగమును
మీరు
పరిపాలించుకొనుడు"
అని
తెలుపగనే,
తండ్రి
మాటను
శిరస్సున
ధరించి
వారి
బాధ్యతలను
వారు
వహించి
పరిపాలనా
దీక్షను
వహించిరి.
నలుగురూ
వారివారి
రాజ్యములకు
రాజధానీ
నగరములు
ఉండవలెనని,
కట్టించుటకు
మొదలుపెట్టిరి.
కుశాంబుడు
"కౌశాంబీ"
నగరమును,
కుశనాభుడు
"మహోదయము"
అను
నగరమును,
అధూర్తరజకుడు
"ధర్మారణ్యము"
అను
నగరమును,
వసువు
"గిరివ్రజము"
అనే
నగరమును
కట్టించి
పూర్తిచేసిరి.
రామా!
ఇపుడు
మనమున్న
ప్రదేశము,
వసురాజు
రాజ్యములోనిది.
ఈ
దేశము
చుట్టూ
ఐదు
కొండలున్నవి.
అందువలననే
ఈ
రాజధానికి
గిరివ్రజము
అని
పేరు
వచ్చినది.
మంగళకరమగు
ఈ
శోణానదమే
సుమాగధి
అని
ప్రసిద్ధికెక్కెను.
ఈ
నదినుండియే
ఈ
దేశమును
మగధదేశమని
కూడ
పిలువజొచ్చిరి.
ఈ
మాగధీనది
ఐదు
కొండల
మధ్య
పూల
మాలకుమల్లే
5
▾
Meaning
Keep
శోభాయమానముగా
తూర్పునుండి
పడమటికి
ప్రవహించుచున్నది.
వసురాజు
మహత్వమువలన
ఈ
జలాలు
పారినంతవరకూ
భూమి
సుక్షేమము
అయినది.
ఇక
రెండవ
కుమారుడయిన
కుశనాభుడు
రాజర్షి;
ధర్మాత్ముడు.
అతనికి
అందరూ
ఆడపిల్లలే
కలుగుటచే
వారలకు
అనేక
రకములగు
ధర్మబుద్ధులు
గరపి,
"క్షమే
దానము;
క్షమే
యజ్ఞము;
క్షమే
సత్యము;
క్షమే
యశస్సు;
క్షమే
సమస్త
ధర్మాలకూ
మూలము;
ఈ
జగత్తంతయూ
క్షమమీదనే
ఆధారపడి
ఉన్నది"
అని
వారలకు
ఉగ్గుపాలతో
బోధించి,
వారినందరినీ
కాంపిల్యనగరానికి
రాజు
అయిన
బ్రహ్మదత్తునికిచ్చి
వివాహము
చేసి,
అతనివెంట
పంపగనే,
ఇల్లు
బోసిపోయెను.
అయ్యో!
నిత్యము
కళకళలాడుతూ
పుత్రికలతో
నిత్యోత్సవముగా
నున్న
గృహము
ఈనాడు
నిశ్శబ్దమయి,
కళాహీనమై
ఆనందరహితంగా
కనిపించుచూ
ఉన్నది.
ఆడబిడ్డ
లెందరున్ననూ
ఏనాడయిననూ
తండ్రిగృహమును
వీడిపోక
తప్పదు,
అని
ఒక
పుత్రుడే
ఉండియుండిన
ఈలోటు
జరిగియుండెడిది
కాదుకదా,
అని
తలంచి
పుత్రేష్టి
అయినాడు.
అంతట
తండ్రి
కుశుడు
ఆ
సమయమునకు
ఇంటికి
వచ్చి
కొమరుని
విచారమునకు
కారణమడుగ,
ఉన్నది
విన్నవించెను.
"అంతమాత్రమునకే
ఇంత
బాధపడుటెందులకు!
తప్పక
నీయంతటి
పుత్రుడు
నీకు
ప్రాప్తించునుగాక"
అని
ఆశీర్వదించెను.
తండ్రి
ఆశీర్వాదముల
ప్రభావమన్నట్లు
అతనికి
కొమరుడు
కలిగెను.
అతడే
గాధిరాజు.
అతడు
మహాధర్మాత్ముడు.
కుశవంశములో
పుట్టెను
కనుక
"కౌశికుడ"నియూ
మరొకపేరు.
కొంతకాలము
రాజ్యము
నేలి,
తదుపరి
అక్కలు
పతితో
స్వర్గమును
పొందగా,
ఆ
విచారముతో
వారలకు
ఐహిక
ఆముష్మిక
ఫలాలను
ఇవ్వతలంచి
మహానదీ
రూపమున
హిమవత్పర్వత
ప్రాంతములో
అవతరించి
మహాగణ్యమైన
కౌశికీనదిగా
ప్రవహిస్తూయున్నది.
అది
పుణ్యనది.
స్వర్గమును
చేరిన
పెద్ద
అక్కయగు
సత్యవతియే,
తిరిగి
ఈ
కౌశిక
రూపమున
ప్రవహించుటచేత,
ఆమెపై
గల
గౌరవాతిశయమువల్ల
ఆ
నదీతీరముననే
నివసించుచుండెను.
ఆ
కౌశికుడు
6
▾
Meaning
Keep
యజ్ఞ
నీమమువలన
ఆ
ప్రదేశము
వదలి
సిద్ధాశ్రమము
రావలసివచ్చెను.
రామా!
నీ
పరాక్రమమువలన
నా
యజ్ఞము
సఫలమై
నా
తపస్సు
సిద్ధించినది"
అని
అన్నాడు
విశ్వామిత్రుడు.
అంత
చేరిన
ఋషులు,
ముని
శిష్యులు
"ఆహా
ఎంతటి
ఆశ్చర్యం!
నిజముగా
నేడు
గురువర్యుల
పూర్వీకులను
గురించి
వినుట
మహద్భాగ్యం,
మహదానందము,
కుశవంశము
మహా
పవిత్రమైనది.
బ్రహ్మదేవునితో
సమానమైన
మహాత్ములు,
ధర్మాత్ములకు
నిలయమైన
కుశవంశమున
నేడు
కాయముతో
సంచరించు
సత్పురుషుడగు
విశ్వామిత్రులవారికి
సేవ
చేయు
భాగ్యమబ్బుట
మా
అందరి
పూర్వపుణ్యఫలమని
ఆనందించిరి.
అంత
విశ్వామిత్రుడు,
"రామా!
నీవు
అడిగినందు
వలన
ఈ
దేహసంబంధమైన
విషయములను
చెప్పవలసివచ్చెను;
కానీ
లేకున్న
ఈ
దేహసంబంధమైన
వంశమునుగూర్చి
చెప్పనవసరములేదు.
ఇప్పటికే
రాత్రి
కావచ్చినది,
మనమిక
విశ్రమించుట
మంచిది.
ఆలస్యముగా
నిద్రించిన
రేపటి
ప్రయాణము
కొంత
తామసమగును.
రామా!
చూడుము!
చీకటిని
పారత్రోలుచూ,
తాపమును
చల్లార్చుచూ
చంద్రుడు
చల్లని
కిరణాలతో
చెట్ల
కొమ్మల
మధ్యనుండి
నిన్ను
చూచుచున్నాడు.
ఇక
వెళ్ళి
పవళించుడు"
అని
తాను
కూడ
మెత్తని
గరికపై
తలవాల్చెను.
ఆ
రాత్రి
అందరూ
విశ్వామిత్రులవారి
పూర్వీకులను
స్మరించుచూ
నిద్రించి
తెల్లవారగనే
కాలకృత్యములు
తీర్చుకొని
స్నానసంధ్యాదులు
ముగించుకొని
ప్రయాణమునకు
సిద్ధమయి
విశ్వామిత్రుని
చెంతకు
వచ్చి
నమస్కరించి
బారులుదీరి
నిల్చిరి.
అంత
రాముడు,
"స్వామీ!
ఈ
శోణనది
లోతు
లేదు.
జలము
కూడనూ
నిర్మలముగా
నున్నది.
నదిని
దాటవలెనన్న
పడవ
అవసరము
లేదు.
కాలినడకతో
నదిని
దాటవచ్చున"ని
తెలుపగా
విశ్వామిత్రుడు,
"నాయనా!
ఎటు
వెళ్ళవలెనో
7
▾
Meaning
Keep
దారి
మీకు
తెలియదు.
కనుక,
నేను
ముందు
నడుతును.
తరువాత
మీరు
నన్ననుసరించుడు"
అని
తాను
నడువసాగెను.
అందరూ
వారివారి
మూటలను
చంకలకు
తగిలించుకొని
వెళ్లుచుండ
మిట్టమధ్యాహ్నమయినది.
అంతలో
జాహ్నవీనది
కనిపించినది.
హంసశారికల
కుహూనాదములు
వినిపించినవి.
మనోహరమైన
ఆ
నదిని
చూచి
అందరూ
ఆనందించినారు.
అందరూ
స్నానాదులాచరించి
పితృపిండములు
విడిచి
అగ్నిహోత్రములు
పేర్చి
నదీతీరమున
కుప్పలు
కుప్పలుగా
కాచిన
వెలగపండ్లను,
రేగిపండ్లను
కందమూలములను
భుజించి
అమృతమువంటి
జలమును
గ్రోలి
ఆనందించిరి.
ఇంతలో
విశ్వామిత్రుడు
కూర్చొన్న
వృక్షచ్ఛాయలకు
రామలక్ష్మణులు
వెళ్లి
చెంత
కూర్చొని,
"స్వామీ!
ఈ
గంగానది
మూడు
పాయలుగా
ముల్లోకాలలో
ఎందుకు
ప్రవహించుచున్నది?
నదీనదాలు
అన్నింటికీ
ప్రభువు
అయిన
సముద్రుణ్ణి
ఎట్లు
చేరినది
వివరించినచో,
విని
ఆనందింతుము"
అని
రాముడు
కోరగా
విశ్వామిత్రుడు,
"నాయనా!
సర్వలోకములకూ,
సర్వమృగములకూ,
మూలికలకూ
నిలయము
హిమాలయము.
దానికి
ఇరువురు
పుత్రికలు
(అనగా
దానిలో
పుట్టినవి)
ఒకదాని
పేరు
గంగ,
మరొకపుత్రి
పేరు
ఉమ.
పెద్దబిడ్డ
గంగ,
రెండవబిడ్డ
ఉమ.
వీరిరువురూ
జగత్ప్రసిద్ధులు,
సర్వలోక
పూజ్యులు.
దేవహితముకొరకు
గంగను
తమకు
ఇవ్వవలెనని
దేవతలు
కోరిరి.
అంత
హిమవంతుడు
ముల్లోకాల
హితమును
కోరి
పెద్దపుత్రిక
అయిన
గంగను
దేవతలకు
ఇచ్చివేసెను.
ఇక
మిగిలిన
రెండవ
కుమార్తెయగు
ఉమ
మహోగ్ర
తపస్సు
చేయనారంభించెను.
అంత
ఆమె
ఈవిధముగా
తపస్సున
మునిగిన
లోకవాంఛలేక
సర్వసంగపరిత్యాగి
కాగలదని
హిమవంతుడు
చింతించి
ఆమెనెట్లయిననూ
గృహస్థాశ్రమమున
ప్రవేశింపజేయవలెనని
అనేక
ప్రయత్నములు
జరిపి
కడకు
రుద్రుని
ఒప్పించి
అతనికిచ్చి
వివాహము
గావించెను.
అప్పటినుండి
ఆమె
ముల్లోకాలకు
పూజ్యురాలయినది.
త్రిలోక
హితాచరణ
పరులగు
దేవతలు
గంగను
వెంటబెట్టుకొని
దేవ
లోకమునకు
వెళ్లిరి.
8
▾
Meaning
Keep
అక్కడ
ఆమె
దేవలోకములో
దివ్యవాహినియై
ప్రవహించినది.
ఆ
త్రిపథ
గామినియే
ఈ
గంగ."
విశ్వామిత్ర
మహర్షి
రామలక్ష్మణులతో
కొందరు
శిష్యబృందముతో
తమ
పూర్వపు
చరిత్రలను,
స్థల
మాహాత్మ్యములను,
రాజుల
వృత్తాంతములను
రేయింబగలు
తెలుపుతూ
మిథిలాపురికి
పయనము
చేయుచుండెను.
క్రమక్రమేణా
వారందరూ
మిథిలాపుర
సమీపము
చేరిరి.
ఆ
సాయంత్రం
స్నాన
సంధ్యాదులు
ముగించుకొని,
గంగానది
ఇసుక
తిన్నెలపై
ప్రసన్న
హృదయుడై
విశ్వామిత్ర
మహర్షి
ఆసీనుడాయెను.
ఇంతలో
గంగానదిగురించిన
విషయములను
రాముడు
జ్ఞాపకము
చేయగా
విశ్వామిత్రుడు
అందుకొని,
"రామచంద్రా!
ఈ
గంగానది
భూమిపై
దిగుటకు
మీ
పూర్వీకులే
కారణము,
వారి
పుణ్యము.
భూమిపై
బుట్టిన
మానవులు
అందులో
స్నానసంధ్యాదు
లాచరించి
పునీతులగుచున్నారు.
గంగానది
పరమ
పవిత్ర
వాహిని.
జన్మరాహిత్యమొనర్చు
అమృత
జలరూపిణి.
శివుని
జటాజూటమే
ఈమె
నివాస
స్థానము.
అందుచే
ఈమె
మంగళకరిణి.
శుభదాయిని"
అని
అనేకరీతుల
గంగను
కొనియాడుచున్న
విశ్వామిత్రుని
చూచి,
ఆశ్చర్యమున
రామచంద్రుడు,
"స్వామీ!
ఇంతటి
అద్భుత
ప్రవాహమును
మా
పూర్వీకులు
ఏవిధమైన
శక్తియుక్తులతో
ఈ
భూలోకమునకు
గొనివచ్చిరో
విపులముగా
తెలిపిన
విషయమును
తెలిసికొని
ఆనందింతును"
అని
వినయమున
అడుగగా...
విశ్వామిత్రుడు,
"రామా!
వినుము,
పూర్వము
అయోధ్యా
నగరమును
సగరుడను
చక్రవర్తి
పరిపాలించుచుండెను.
అతను
ధార్మికుడు,
మహా
పరాక్రమవంతుడు.
అతని
గుణగణములకు
మెచ్చి
విదర్భదేశపు
రాజు,
కేశిని
అను
తన
ప్రేమ
పుత్రికను
ఇచ్చి
వివాహము
గావించెను.
ఆమెకూడను
ధర్మిష్ఠి,
సత్యసంభాషిణి.
అయితే,
ఎంత
కాలమయినను
వారలకు
సంతానము
కలుగనందున
వంశాభివృద్ధిని
ఆశించి,
కేశిని
అనుమతిని
గూడను
బడసి
సగరుడు
9
▾
Meaning
Keep
అరిష్టనేమి
కూతురయిన
సుమతి
అను
ఒక
సుందర
సుకోమల
కన్యను
రెండవ
వివాహమాడెను.
ఆమె
కూడనూ
సంతానవతి
కానందున
ఇక
లాభము
లేదని
భగవంతుని
కటాక్షమును
బడయగోరి
ఇద్దరు
భార్యలతో
కూడి
సగరుడు
హిమవత్పర్వతములో
భృగుమహర్షి
వసించు
సెలయేటి
గట్టుపై
చేరి
తీవ్రమైన
తపస్సు
చేయ
మొదలిడెను.
అక్కడ
అతడు
చాలా
కాలము
తపస్సు
చేసెను.
ఇట్లుండ
ఒకనాటి
వేకువఝామున
మహా
సత్యసంపన్నుడైన
భృగుమహర్షి
అతనికి
ప్రత్యక్షమై,
"రాజా!
నీ
తపస్సు
చాలింపుము.
నీవు
ఈ
లోకమున
అసమాన
కీర్తిని
సంపాదింతువు.
త్వరలో
పుత్రానందమును
అందుకొందువు"
అనిరి.
అతని
పలుకులు
వినగనే
సగరుడు
కన్నులు
తెరచి
చూచి,
భృగుమహర్షికి
నమస్కరించి,
"స్వామీ!
నా
కిరువురు
భార్యలు
కలరు,
వారల
నమస్కృతుల
నందుకొనుము;
వారలను
స్వయంగా
ఆశీర్వదించుము"
అని
తన
భార్యలను
మహాఋషికి
నమస్కరింప
సైగజేసెను.
అంత
పెద్ద
భార్య
అయిన
కేశిని
భక్తిశ్రద్ధలతో
స్తోత్రము
చేయుచు,
శిరస్సు
వంచి
నమస్కరించగ,
"అమ్మా!
నీకు
వంశవర్ధనుడు
అయ్యే
ఒక్క
కుమారుడు
కావలెనా?
మహా
బలవంతులు,
కీర్తివంతులు
అయ్యే
అనేకమంది
కొమరులు
కావలెనా?"
అని
అడుగగా
ఆ
ఇల్లాలు,
"స్వామీ!
వంశవర్ధనుడు
అయ్యే
ఒక్క
కుమారుడే
చాలున"ని
ప్రార్థించెను.
అందులకు
భృగువు
'తథాస్తు'
అని
ఆశీర్వదించి,
రెండవ
సతియైన
సుమతి
నమస్కరించగా,
ఆమెనూ
అట్టి
ప్రశ్న
వేయగా,
ఆమె
"మహా
బలవంతులు,
కీర్తివంతులు
అయ్యే
అధిక
కొమరులు
కావలెన"ని
కోరెను.
ఆమెకు
అటులనే
అయ్యెదరని
ఆశీర్వదించి,
అంతర్ధానమాయెను.
రామచంద్రా!
భృగుమహర్షి
అమోఘమైన
ఆశీర్వాదముల
నందుకొని
సగరుడు
భార్యలతో
తన
పట్టణమును
చేరుకొనెను.
వరమును
మనసున
చింతించుచూ
కాలం
గడుపుచుండ,
కొన్ని
నెలలకు
ఇరువురు
భార్యలు
గర్భములు
దాల్చిరి.
క్రమముగా
నవమాసములు
జరిగిన
తరువాత
కేశినికి
ఒక
పుత్రుడను,
10
▾
Meaning
Keep
సుమతికి
అనేకమంది
పుత్రులు
పుట్టిరి.
దినములు
గడచినకొలది
ఆ
పిల్లలు
పెరిగి
పెద్దవారగుచూ
తోడిపిల్లలతో
ఆడుతూ,
పాడుతూ,
పెరుగుతూ,
బయట
తిరుగాడజొచ్చిరి.
సగరుని
జ్యేష్ఠ
పుత్రుడగు
అశ్వమంజుడు,
అయోధ్యలోని
చిన్న
పిల్లలను
ఆడుకొనుటకు
సరయూనది
ఇసుక
తిన్నెలపైకి
గొనిపోయి
అక్కడ
వారలను
సరయూ
నదిలో
పడత్రోసి,
ఆ
ఊరి
పిల్లలు
మునిగిపోవుటను
చూచి
తాను
గట్టిగా
నవ్వుచుండెడివాడు.
ఈరీతిగా
ఊరి
పిల్లలను
అందరినీ
క్రమముగా
చంపుచూ
మహాఘోరమైన
పనులు
చేయుచూ
కడకు
పరమ
దుర్మార్గుడను
పేరును
అందుకొనెను.
అంత
యుక్తవయసు
రాగానే
సగరుడు
తమ
పిల్లలందరికి
తగిన
కన్నెలను
తెచ్చి
వివాహము
చేసెను.
అయిననూ
అశ్వమంజుడు
తన
పాపపు
పనులను
మానక
అయోధ్యా
వాసులకు
అనేక
దుఃఖములు
కల్పించుచుండెను.
ఇట్లుండ
అయోధ్యావాసులు
ఒకనాడు
సగరుని
చేరి,
తమ
బాధలను
అతని
జ్యేష్ఠపుత్రుడు
సలుపు
దుర్మార్గపు
వృత్తులు
తెలిపి
గోలగా
ఏడువసాగిరి.
తన
కుమారుడను
ప్రేమను
త్యజించి
నిర్దయుడై
వెంటనే
అశ్వమంజుని
రాజ్యము
విడిచి
కానలకేగమని
సగరుడు
ఆజ్ఞవేసెను.
అప్పటికి
అశ్వమంజునికి
ఒక
కొమారుడు
కలిగెను.
కొమారుని,
భార్యను,
తల్లిదండ్రులను
వీడి
అశ్వమంజుడు
తండ్రి
ఆజ్ఞ
ప్రకారము
అడవులకు
పోయెను.
కొన్ని
సంవత్సరములు
ఇట్లు
గడువగా
అశ్వమంజుని
కుమారుడగు
అంశుమంతుడు
పెరిగి
పెద్దవాడయి
సర్వలోక
సమ్మతుడూ,
సద్గుణసంపన్నుడూ,
మహాపరాక్రమశాలిగా
పేరు
గాంచెను.
ఒకనాడు
సగర
చక్రవర్తి
మంచి
ముహూర్తమును
చూచి,
అశ్వమేధ
యాగం
మొదలుపెట్టెను"
అని
విశ్వామిత్రుడు
యాగమునుగురించి
చెప్పుటకు
మొదలిడుచుండగానే,
రాముడు
అందుకొని,
"స్వామీ!
అశ్వమేధ
యాగము
అయోధ్యయందే
జరిపెనా?
లేక
మరియే
నదీతీరముననైనా
జరిపెనా
సగరుడు?
దానినిగురించి
విపులముగా
తెలుపుమ"ని
11
▾
Meaning
Keep
ప్రార్థించగనే,
విశ్వామిత్రుడు
చిరునవ్వుతో,
"రామా!
యాగమన్న
నీకెంతటి
శ్రద్ధయో
నాకు
విదితమగుచున్నది!
చెప్పెదను
వినుము!
హిమవత్
పర్వతమునకు
ఎదురుగా
ఒక
పర్వతము
కలదు.
దానిని
వింధ్యపర్వతమని
అందురు.
ఆ
హిమవత్పర్వతమూ,
వింధ్య
పర్వతమూ
రెండునూ
పరస్పరము
చూచుకొనుచున్నట్లు
ఉండును.
ఆ
రెండు
కొండల
మధ్య
ప్రదేశమున
యజ్ఞము
చేయుటకు
తగిన
ఏర్పాట్లు
సలిపెను.
ఆ
సుందర
ప్రశాంత
ప్రదేశమున
వేత్తలు
అయిన
ఋత్విక్కులు
చేరి
మంత్రములు
పలుకుచుండ
పర్వతములే
అదిరి
బెదిరి
ఏమగునో
అనునంతటి
ప్రతిధ్వనులతో,
చేరిన
లక్షలాది
ప్రజలు
ఆ
యజ్ఞమున
నిమగ్నులైయుండు
సమయమున,
అశ్వమును
సర్వాలంకారములతో
గొనివచ్చి
పూజలు
గావించి
దానిని
వదిలిరి.
దాని
వెంట
మహారథుడు
ధనుర్ధరుడు
అయిన
అంశుమంతుని
పంపిరి.
అంశుమంతుడు
అశ్వము
వెంట
తిరిగి
దిగ్విజయముగా
గుఱ్ఱముతో
తిరిగివచ్చెను.
యజ్ఞములో
పర్వసమయము
ఆసన్నమగుచుండ
తెల్లవారి
లేచిచూడగా
అశ్వము
కనిపించలేదు.
ఋత్విక్కులు
దిగులుపడి
సగరునకీవార్త
తెలిపిరి.
సగరుడు
అశ్వమును
వెతుకుటకు
నలువైపులా
పంపెను.
ఋత్విక్కులు
అశ్వము
లేకున్న
రాజునకు
అమంగళమని
నుడువుటచేత
సగరుడు
మరింత
విచారగ్రస్తుడై,
తన
రెండవ
భార్య
కొమారులందరినీ
సర్వాయుధ
రథారూఢులై
వెతుకుటకు
పొండని
ఆజ్ఞచేయగ,
వారు
రాక్షసులను
దేవతలను
నరులను
శోధించి,
అడ్డుతగిలినవారలతో
యుద్ధములు
చేసి,
భూమిలో,
లోయలలో
దాచియుందురేమో
అని
అనుమానించి
భూమినికూడా
త్రవ్వుటకు
పూనుకొనిరి.
ఈరీతిగా
శోధించి
ఎచ్చటనూ
అశ్వము
కనిపించనందున
తిరిగి
వచ్చి
తండ్రితో
తెలుపగా
సగరుడు
కోపించి,
"ఇట్టి
అప్రయోజకులగు
కొమరులుండి
ప్రయోజనమేమి!
గుఱ్ఱములేక
వట్టిచేతులతో
వచ్చిన
మీ
ముఖములు
చూడన"ని
గర్జించి
"తిరిగి
వెళ్లి
వెతికి
గుఱ్ఱము
చిక్కువరకునూ
నన్ను
చూచుటకు
వీలుండద"ని
తెలుపగా,
సాగరులు
తండ్రి
మాటలతో
రోషపూరిత
హృదయులై
12
▾
Meaning
Keep
మహా
తీవ్రపరిశోధనలు
సలుపుచూ
వెళ్లిరి.
పర్వతములు,
గుట్టలు,
చెరువులు,
నదులు,
గుహలు,
ఊర్లు
అడవులూ
నేయేటి?
భూమిమీద
అడుగడుగూ
చూచుచూ
వెళ్లిరి.
అట్లు
వెతుకుచూ
వెళ్ళగా
ఒక
ప్రదేశమున
మహామునిగా
ధ్యాననిష్ఠుడైన
ఒక
వ్యక్తిని
చూచిరి.
అతనికి
సమీపముననే
గరికను
మేయుచున్న
యజ్ఞాశ్వమును
చూచిరి.
అశ్వమును
చూచినంతనే
పట్టశక్యముకాని
ఆనందమును,
మునిని
చూచి
భరించలేని
కోపమునూ
రెండునూ
ఒకదానివెనుక
ఒకటి
వారలను
ఉన్మత్తులను
చేసెను.
ఆ
క్రోధముతో
బుద్ధులు
బెండుబారెను.
సాగరులు
పలుగులు
పైకెత్తి,
"ఓ
దుర్బుద్ధీ!
నీవెందులకు
మా
అశ్వమును
దొంగిలించితివి?"
అని
అతనిపైకి
ఉరికిరి.
అంత
కపిలుడు
కన్నులు
తెరచి
చూచెను.
కపిలుడు
వారిని
ప్రశాంత
దృష్టితో
చూచిననూ
సాగరులు
వివేకశూన్యులై
అతనిని
మరింత
తూలనాడుచు,
అతనిని
కొట్ట
పూనుకొనిరి.
అంత
కపిలుడు
ఈ
మూఢులు
మాటలకు
లొంగువారలు
కారు
అని
గమనించి,
తను
వారలతో
వాదమునకు
దిగుట
మంచిది
కాదని
తెలుసుకొని
వారలను
నిమిషములో
బూడిద
గావించెను.
ఎంతకాలమయిననూ
సాగరులు
తిరిగి
రాకుండుటను
చూచి
విచారించి,
యజ్ఞమును
ఆపలేక
ముందుకు
జరపలేక
విచారముతో
నుందుటను
చూచి
మనుమడయిన
అంశుమంతుడు
తాతకు
నమస్కరించి,
"తాతా!
ఆజ్ఞ
ఇచ్చిన
గుఱ్ఱమును,
పినతండ్రులను
వెతికి
తెత్తున"ని
కోరగా,
సగరుడు
ఆశీర్వదించి
పంపెను.
అంశుమంతుడు
రాత్రి
పగలు
వెదకి
అశ్వమున్న
స్థానమును
చేరెను.
అక్కడనే
తమ
పినతండ్రులు
భస్మమై
పడియున్న
గుర్తులుకూడనూ
గమనించెను.
పినతండ్రుల
మరణమునకు
విచారించి
వారలకు
జలతర్పణ
మొసగుటకు
అటూ
ఇటూ
తిరిగెను.
ఎచటనూ
జలము
కనిపించనందున,
విచారముతో
మరికొంత
ద…
అచట
ఒక
మహనీయుడు
ఎదురేగి,
"నాయనా!
విచారించకు,"
13
▾
Meaning
Keep
లోకహితార్థమై
కపిలుడు
మీ
పినతండ్రుల
నిట్లు
శపించెను.
దీనికి
దుఃఖించనక్కరలేదు.
లోకములోని
నీళ్ళతో
తర్పణాలు
వదలుటకంటె,
గంగాదేవిని
ఈ
భూమిమీదికి
తెప్పించు
ప్రయత్నము
చేయుము.
ఆ
పవిత్ర
గంగోదకము
మీ
పినతండ్రుల
భస్మముమీద
ప్రవహించినచో
వారు
ధన్యులు
కాగలరు,
నీవు
మొదట
ఈ
గుఱ్ఱమును
గొనిపొమ్ము.
తాతగారు
సంకల్పించిన
యజ్ఞమును
పూర్తిగావించి
తదుపరి
మీ
పినతండ్రుల
సద్గతికి
తగిన
ప్రయత్నమును
చేపట్టుము"
అని
దీవించగనే,
అంశుమంతుడు
మునికి
నమస్కరించి
అతని
ఆజ్ఞానుసారము
అశ్వమును
తీసికొని
యజ్ఞశాలను
చేరెను.
రాత్రీ
పగలూ
కన్నులు
తెరచి
ఎపుడు
అశ్వము
వచ్చునా
అని
చూచుచున్న
ఋత్విక్కులు
పరమానంద
పడిరి.
అంతలో
సాగరుల
విషయము
తెలుపుట
మంచిదికాదని
పూర్ణాహుతి
జయప్రదముగా
జరిపించి,
స్నానాదులు
సలిపి
తీర్థప్రసాదములు
వినియోగించిన
తరువాత
అంశుమంతుడు
సగరునకు
సాగరుల
వృత్తాంతము
విశదముగా
తెలిపి,
గంగను
భూమికి
తెచ్చు
విషయమును
కూడను
తెలిపెను.
అందుకు
సగరుడు
ఆనందించి,
గంగను
భూలోకమునకు
తెచ్చు
విధానమును
సర్వవిధములా
సలిపెను.
కృతకృత్యుడు
కాలేకపోయెను.
తన
కొమారుల
విచారముతో
వారలను
పునీతులను
చేయలేకపోతిని
కదా
అను
దుఃఖముతో
కృశించి
సగరుడు
దివంగతుడాయెను.
రామా!
సగరుడు
కాలధర్మము
చెందగనే
ప్రజానుమతితో
మంత్రులు
అంశుమంతునికి
పట్టము
కట్టిరి.
ధార్మిక
ఆధ్యాత్మిక
శక్తిసంపన్నుడైన
అంశుమంతుడు
తన
పాలనమునందెట్టి
లోపమునూ
రానీక,
ప్రజలను
కన్నబిడ్డలవలె
చూచుకొనుచుండెను.
ఈరీతిగ
కొన్ని
సంవత్సరములు
రాజ్యముచేసి
వృద్ధాప్యము
ప్రారంభము
కాగానే
తన
కుమారుడైన
దిలీపునకు
రాజ్యభారమప్పజెప్పి
పినతండ్రులను
పునీతులను
గావించు
నుద్దేశముతో
గంగను
14
▾
Meaning
Keep
భూమి
మీదికి
దింపుటకు
తగిన
తపంబొనరించుటకై
హిమాలయమునకు
వెళ్లెను.
కానీ
కృతకృత్యుడు
కాకుండానే
తలంపును
నెరవేర్చుకొనకనే
కాయము
వీడెను.
దిలీపుడు
తండ్రి
ఆశయమును
తెలుసుకొని
దానిని
నెరవేర్చుటకు
ఉపాయములు
అనేకము
సలుపసాగెను.
అనేక
యజ్ఞయాగాది
సత్కార్యములు
గావించెను.
తండ్రి
ఆశయము
తీర్చలేనివాడినైతినను
విచారముతో
కడకొక
రోగిగా
మారిపోయెను.
శరీర
మనోబలములు
సన్నగిల్లగనే
తన
కొమరుడైన
భగీరథునకు
రాజ్యాభిషేకముచేసి,
తన
ఆశయమును
నెరవేర్చమని
అతనికి
బోధించి
గంగను
భూమికి
గొనివచ్చుటే
తన
ప్రధాన
ఆశయమని
నొక్కి
చెప్పి
కడకు
ప్రాణములు
వీడెను.
భగీరథుడు,
తేజోవంతుడు.
తండ్రి
ఆశను
పూర్తి
చేతునని
వాగ్దానము
చేసెను.
రాజ్యమును
అతి
జాగ్రత్తతో
పరిపాలించుచుండెను.
ఎంత
కాలమైననూ
భగీరథునకు
సంతానము
కలుగనందున
తాను
కూడనూ
విచారమగ్నుడై,
సంతానములేని
కొరత
ఒకవైపుననూ,
గంగను
భూమిపైకి
గొనితెత్తునన్న
తండ్రికిచ్చిన
వాగ్దానము
మరొకవైపుననూ
అతనిని
బాధించుచుండ,
సమయమును
గమనించి,
రాజ్య
పాలనము
మంత్రులకప్పజెప్పి
గోకర్ణక్షేత్రమునకు
వెళ్లి
మందుటెండలో
మాసమున
కొకపూట
మాత్రమే
ఆహారము
తీసుకొని
జితేంద్రియుడై
ఘోర
తపము
ఆచరించెను.
తపమునకు
మెచ్చి
భగవంతుడు
సంతుష్టుడై,
"నాయనా!
భగీరథా!
ఏమి
కావలెనో
కోరుకొమ్మ"ని
సెలవిచ్చెను.
భగీరథుడు
కన్నులు
తెరచి
కోటిసూర్యకాంతుని
దర్శించి
నమస్కరించి,
"స్వామీ!
మా
ముత్తాతలను
పునీతులను
గావించుటకై
గంగను
భూమిపై
ప్రవహింపజేయుము.
ఇక్ష్వాకుల
వంశము
నాతో
కృశించిపోకుండ
వంశాభివృద్ధి
ననుగ్రహింపుము"
అని
పాదములపై
బడెను.
అంత
హరి,
'నాయనా!
మొదటి
కోరిక
మహా
దుర్లభమైనది.
అయిననూ
నెరవేర్తును.
ఇక
నీకు
సుపుత్రుడు
పుట్టి
వంశాభివృద్ధిని
గాంచగలడు
లెమ్ము!'
అని
ఆశీర్వదించి,
"భగీరథా!
గంగ
మహాతీవ్రగామిని,
అది
భూమిపై
పడగనే
భూమి
15
▾
Meaning
Keep
భరించలేదు.
భరించునంతటి
శక్తి
లేకుండుటచే,
నీవు
భూపతివి
కనుక,
కొంత
యోచించవలెను.
గంగ
ఒకేతూరి
భూమిపై
దుమికిన
మహా
ప్రమాదము
సంభవించును
గాన,
హరశిరమున
ప్రవేశించి
అచటినుండి
మెల్లగా
భూమిపై
ప్రవహించిన
భూలోకవాసులకు
సుక్షేమ
మేర్పడున"ని
తెలిపి
వెళ్లెను.
అప్పటినుండి
భగీరథుడు
హరునిగూర్చి
తపంబాచరించి
హరుని
ప్రసన్నుని
గావించుకొనెను.
హరుడు
తన
శిరమునుండి
గంగను
ఏడు
పాయలుగా
ప్రవహింపజేసికొనెను.
(హ్రాదినీ,
నలినీ,
పావనీ
అను
మూడు
పాయలు
తూర్పునకు
ప్రవహించెను.
సుచక్షూ,
సితా,
సింధూ
అను
పేర్లతో
పడమటి
దిక్కునకు
ప్రవహించెను.
ఏడవ
పాయ
భగీరథ
రాజర్షి
వెంట
బయలుదేరెను.)
భగీరథుడు
ఎటువెళ్లిన
గంగ
అటు
వైపునకు
మలుపులు
తిరుగుతూ
కడకు
అతని
ముత్తాతల
భస్మముపై
ప్రవహించి,
లోకములోని
వారలను
కూడ
పునీతులను
జేసి
పావన
గంగోదకముతో
సర్వ
పాపములనూ
పరిహారము
గావింపజేసెను.
భగీరథుడు
గంగను
భూమిపైకి
గొనివచ్చుటచేత
గంగకు
తండ్రి
భగీరథుడని
కూడనూ
పిలువ
జొచ్చిరి.
గంగను
భాగీరథి
అని
కూడనూ
పిలువజొచ్చిరి.
ఆ
జలముతో
భగీరథుడు
సగర
పుత్రులకు
తర్పణములు
విడిచి
అయోధ్యకు
చేరి
తన
తండ్రి
తాత
ముత్తాతల
అభీష్టమును
నెరవేర్చగలిగితి
నను
ఆనందముతో
రాజ్యమును
ఏలుచు,
ప్రజల
మన్ననల
నందుకొనుచూ
కాలమును
గడుపుచూ
కడకు
కాయమును
వీడెను"
అని
విశ్వామిత్రుడు
రామ
వంశీయులనుగురించి
ఘనముగా
తెలుపుచుండగా,
రామలక్ష్మణులు
అతి
శ్రద్ధతో
వినుచుండగా
అర్ధరాత్రి
ఆయెను.
అందరూ
శయనించవచ్చునని
విశ్వామిత్రుడు
ఆజ్ఞ
చేయగా
అందరూ
గురువునకు
నమస్కరించి
ఇసుక
తిన్నెలపై
పరుండిరి.
రామలక్ష్మణులు
గురువాజ్ఞను
మీరలేక
వెళ్లి
పరుండిరే
కానీ,
వారలకు
నిద్ర
పట్టలేదు.
గంగను
గురించిన
అద్భుత
చరిత్రను
స్మరించుచూ
ఉండగనే
తెల్లవారెను.
అందరూ
లేచి
స్నాన
సంధ్యాదులు
గావించి
ప్రయాణమునకు
16
▾
Meaning
Keep
సంసిద్ధులైరి.
పడవ
సిద్ధముగా
నున్నదని
ఋషి
కుమారులు
చెప్పగనే
అందరూ
వెళ్లి
పడవలో
కూర్చొని
పవిత్ర
నదిని
దాటిరి.
ఉత్తర
దిశకు
చేరిరి.
సుందరమైన
ఆ
వన
సౌందర్యమును
తిలకించుచూ
ప్రయాణము
చేయదొడగిరి.
కొంత
దూరమట్లు
నడచుచుండగనే
ఒక
విశాల
పట్టణము,
అతి
సౌందర్య
భవనములతో
వారల
కగుపడెను.
అంత
రాముడు
విశ్వామిత్రుని
జూచి,
"స్వామీ!
ఈ
సుందరమైన
వనమున
అతి
విశాలమైన
పట్టణము
కనిపించుచున్నది
కదా!
అది
ఏ
రాజ్యమైయుండవచ్చును?"
అని
యడుగ,
"రామా!
అది
మనకు
అతిసమీపంలో
నుండినట్లు
కనిపించుచున్నది.
కానీ,
దానిని
చేరుటకు
కాలమధికమగును.
బహుశః
సాయం
సమయము
కావచ్చును.
సమీపమునకు
వెళ్లిన
తరువాత
ఆ
పట్టణపు
పూర్వ
వృత్తాంతము
తెలుపుదును.
మొదలు
దారి
నడువుము"
అని
చిరునవ్వుతో
తెలిపిన
మాటలను
అతి
శ్రద్ధగా
విని
మారుమాటాడక
నడకను
సాగించిరి.
పల్లమునకు
దిగినపుడు
అసలు
గ్రామమేమీ
కనిపించుట
లేదు.
కొంత
మిట్టకు
రాగానే
అతి
సమీపమునకు
వచ్చినట్లు
కనిపించును.
ఈ
రీతిగా
నడచి,
నడచి
విశ్వామిత్రుడు
చెప్పినటుల
సాయం
సమయమునకు
ఇంకనూ
పట్టణములో
ప్రవేశింపలేకపోయిరి.
ఎటులనో
సంధ్యాకాలమునకు
సమీపమునకు
చేరి
స్నాన
సంధ్యాదులు
ఆచరించి
విశాలమైన
ప్రదేశమున
గుమిగూడి
విశ్రాంతి
తీసుకొను
సమయమున
రాముడు
ప్రశ్నించెను.
"స్వామీ!
సమీపమును
చేరితిమి
కదా,
పుర
వృత్తాంతము
వివరింతురా!"
అని
ప్రార్థించగా,
విశ్వామిత్రుడు
"నాయనా!
నేను
కూడ
దానినే
తలంచుచుంటిని,
మనసెరిగినవాడవనుట
నాకు
తెలిసియూ
మాయ
మధ్య
మధ్య
అట్లు
వికార
మార్గమున
పడద్రోయును.
మనసు
స్వాధీనమందుంచుట
అందరికీ
సాధ్యం
కాదు.
నాభోటివానికే
దానిని
వశము
నందుంచుకొనుట
అసాధ్యముగా
ఉన్నది.
ఇక
సామాన్యుల
సంగతి
చెప్ప
నవసరము
లేదు.
పుర
వృత్తాంతము
నీవు
మరచితివేమోనని
తలంచుచుండగనే
తిరిగి
నీవు
దానిని
గురించి
ప్రశ్నించుట
17
▾
Meaning
Keep
సర్వజ్ఞుడ
వనుటకు
వేరు
ప్రమాణ
మెందుకు!
రామా!
పూర్వము
కశ్యపునకు
అదితి,
దితి
అను
ఇరువురు
సతులుండిరి.
వారిలో
దితి
పుత్రులు
మహా
బలవంతులు,
అదితి
పుత్రులు
మహా
ధార్మికులుగా
నుండి
దినదిన
ప్రవర్ధమానులై
పెరుగుచుండిరి.
వారలను
చూచి
తల్లిదండ్రులు
అమితానందము
నొందుచుండిరి.
ఒకనాడు
అదితి
పుత్రులు,
దితి
పుత్రులు
ఇరువురూ
గుంపుగా
చేరి,
వార్ధక్యం,
మృతి,
అనారోగ్యములు
లేకుండా
ఉండవలెనన్న
దానికి
ఉపాయమేమి
అని
తర్కించుకొనిరి.
కడకు
పాలకడలిని
చిలికిన
అందులో
అమృతం
పుట్టుననియూ
ఆ
అమృతమును
త్రాగిన
జరా
మరణములు
లేకుండుననియూ
వారు
నిశ్చయించుకొని
మందర
పర్వతమును
కవ్వముగను,
వాసుకి
అను
సర్పమును
త్రాడుగను
చేసుకొని,
క్షీర
సముద్రమును
చిలుకుటకు
మొదలుపెట్టిరి.
అట్లు
చాలా
కాలము
మథించగా
వాసుకి
మొగమునుండి
విషపు
బిందువులు
కార
మొదలు
పెట్టెను.
అంత
వాసుకి
బాధను
సహించుకొనలేక
మహా
క్రోధముతో
పర్వతమునందలి
రాళ్ళను
కరువ
మొదలిడెను,
దానినుండి
కారు
విషబిందువులు
మంటలుగా
కనిపించెను.
అంత
దితి
పుత్రులు
ఈ
విష
జ్వాలలకు
మండిపోదుమేమో
అను
భయముతో
దైవమును
ప్రార్థించిరి.
అంత
విష్ణువు
ప్రత్యక్షమై
నిలిచెను.
అంత
దితి
పుత్రులు,
స్వామీ!
దీనిని
భరించలేము,
రక్షించుమని
కోరగా,
హరుడుగా
మారి,
నాయనలారా!
దేవతలకు
అగ్రజుడనగుటచే
క్షీరసముద్రమున
మొట్టమొదట
పుట్టినదానిని
అగ్ర
నైవేద్యముగా
భావించి
స్వీకరింతునని
తెలిపి
నిదానము
చేయక
హాలాహలమును
త్రాగెను.
అంత
దితి,
అదితి
పుత్రులు
నిర్భయులై
తిరిగి
మందర
పర్వతమును
చిలుక
మొదలుపెట్టిరి.
కవ్వముగానున్న
మందర
పర్వతము
సముద్రములో
మునిగి
పోవజొచ్చెను.
ఇది
గమనించి
తిరిగి
దైవమును
ప్రార్థించిరి.
అంత
విష్ణుమూర్తి
వారలకు
సాక్షాత్కరించి,
"నాయనలారా!
దిగులొందకుడు"
అని
అభయ
మిచ్చి
తాను
తాబేలు
రూపము
ధరించి
పాలసముద్రమున
చేరి
18
▾
Meaning
Keep
మందరగిరి
క్రింది
భాగమున
తన
వీపును
ఆనించెను.
కశ్యప
పుత్రులు
సంతసించి
విష్ణువును
అనేక
విధముల
స్తుతించిరి.
అంత
పాల
కడలినుండి
దండ
కమండలధారియై
ధన్వంతరి
పుట్టెను.
దితి
అదితి
పుత్రులు
ఆశ్చర్యముగ
చూచుచుండగనే
ఒకవిధమగు
రసముద్భవించెను.
క్రమక్రమముగా
ఆ
రసము
కూడ
గోళాకారము
ధరించి
క్షణములో
పగిలెను.
అందులోనుండి
మహా
వర్చస్వినులు
అనేకమంది
బయలుదేరిరి.
అట్లు
వచ్చినవారిలో
అందరూ
కన్నెపడుచులే,
రసమునుండి
పుట్టుటచేత
వారలు
"అప్సరసలు"
అను
పేరుతో
పిలువబడిరి.
వారు
దితిపుత్రులనూ
అదితి
పుత్రులనూ
పెండ్లాడ
అనేకవిధముల
ప్రార్థించ
ప్రయత్నించిరి.
కాని
వారెవ్వరూ
అంగీకరించనందున
వారు
స్వేచ్ఛా
విహారులైరి.
అంతట
పాల
సముద్రమునుండి
వరుణుని
కూతురగు
వారుణి,
సురను
తీసుకొని
బైటకు
వచ్చెను.
అంత
దితిపుత్రులు
ఆ
సురను
పుచ్చుకొనుట
కంగీకరింపలేదు.
అదితిపుత్రులు
ఆ
సురను
పుచ్చుకొనిరి.
సురను
పుచ్చుకొన్నవారు
సురులు,
సురను
పుచ్చుకోనివారు
అసురులు
అయిరి.
ఆ
పాల
సముద్రమునుండి
చివరికి
అమృతము
ఉద్భవించెను.
ఆ
అమృతమును
అందుకొనుటకై
దితిపుత్రులు,
అదితి
పుత్రులు
పోట్లాడుకొనుటకు
సిద్ధమయిరి.
కడకు
అదితి
పుత్రులు
దితి
పుత్రుల
ననేకమందిని
చంపిరి.
కులక్షయము
అయ్యే
అంతటి
పోరాటముగా
మారెను.
ఆ
యుద్ధమునకు
లోకములే
దద్దరిల్లినవి.
భయాందోళనలు
వ్యాపించెను.
అంత
విష్ణువు
సుందరమైన
స్త్రీ
వేషమును
ధరించి
అందరినీ
మోహమున
ముంచి
అమృతమును
అంతర్ధానము
చేసెను.
దితి
పుత్రులందరూ
హతమైపోయిరి.
ఈ
దుఃఖ
వార్త
తెలియగనే
దితి
మహా
ప్రళయము
సంభవించినటుల
దిగులొంది
ఘోరముగా
ఏడ్వసాగెను.
కశ్యపుడెంత
ఓదార్చిననూ
ఆమె
దుఃఖము
శమింపదాయె.
ఎటులో
కశ్యపుడు
మంచి
19
▾
Meaning
Keep
మాటలతో
బోధన
సలిపి
కొంత
శాంతపరచెను.
దితి
దుఃఖమును
లోలోన
మ్రింగుచూ
పతిని
చేరి,
"నాథా!
ఇది
న్యాయమా!
ఇరువురూ
మీ
పుత్రులే
కదా!
కడకు
నన్ను
పుత్రులు
లేనిదానినిగా
చేసితిరే!
నా
గతి
ఇంతేనా?
ఒక
పుత్రుడైననూ
మిగిలిరాలేదే!
అల్పాయుష్కులగు
అనేక
కొడుకులకంటే
చిరంజీవియైన
ఒక్క
కొడుకుండిన
చాలుగదా!"
అని
ఘోల్లున
ఏడ్వగా
కశ్యపుడు
ఓదార్చి,
"సతీ!
దీర్ఘాయుష్కుడగు
పుత్రుడు
కావలెనని
తపస్సు
చేయుము.
నిష్ప్రయోజనమైన
దుఃఖమును
మరచిపొమ్ము"
అని
ఆదేశించగా,
తక్షణమే
భర్తకు
నమస్కరించి
ఇంద్రుని
జయించునంతటి
పుత్రుడు
ప్రాప్తించవలెనని
తపమునకు
బయలుదేరెను.
అంత
కశ్యపుడు,
"దితీ!
తపసన్న
సామాన్యము
కాదు.
చివరివరకు
శుచిగా
వ్రతనిష్ఠను
వీడక
సలిపిన,
దైవము
తప్పక
ఫలించునటుల
అనుగ్రహించును.
శుచి,
దీక్ష
అత్యవసరము.
వాటిలో
ఎట్టి
లోటూ
రానీయక
చూచుకొమ్ము,
వెళ్లిరమ్ము"
అని
ఆజ్ఞ
ఇచ్చెను.
అంత
దితి
కుశప్లవము
అనే
ప్రదేశమును
చేరి
పతి
తెలిపినటుల
శుచియై
దీక్ష
ప్రారంభించెను.
ఇంతలో
దేవేంద్రుడు
ఆమె
వ్రతనిష్ఠను
పరీక్షింపగోరి
వెంటనే
పరిచారకునివలె
బయలుదేరెను.
దితి
వ్రతము
ఫలించెను.
దైవానుగ్రహముచే
గర్భము
దాల్చెను.
దినములు,
నెలలు
గడిచెను.
మిట్టమధ్యాహ్నమున
కొంత
అలసి,
నిద్రపట్టినటుల
సూచనలు
కలుగగనే
దితి
నిద్రపారవశ్యమున
తలవైపు
కాళ్లు,
కాళ్లతట్టున
తల,
పెట్టుకొని
తల
విరియపోసికొని
నిద్రించెను.
అంత
దేవేంద్రుడు
తపోనిష్ఠకు,
శుచికి
భంగము
కలుగుటను
గమనించి
యోగశక్తితో
ఆమె
గర్భమున
నున్న
పిండమును
ముక్కలుగ
జేసెను.
అంత
పిండములోనుండి
రోదన
వినిపించుచుండ
"మారుదః"
"మారుదః"
అనుచూ
ఇంద్రుడు
ఊరడించుచుండెను.
"మారుదః"
అంటే
ఏడవకు
అని
అర్థము.
దితి
బాధచే
మేల్కాంచి
చూడగా
రక్తము
స్రవించుచుండుటను
చూచి
విలపింపపూనెను.
అపుడు
ఇంద్రుడు
హస్తములు
జోడించి,
"అమ్మా!
క్షమింపుము.
వ్రతనిష్ఠా
భంగము
గావించితివి.
తల
20
▾
Meaning
Keep
విరియపోసికొని,
కాళ్ళతట్టున
తల
పెట్టుకొని
నిదురించితివి.
అందువలన
వ్రతనిష్ఠకు,
శుచిభంగము
జరిగినది.
సందు
దొరికినపుడు
శత్రువు
ఊరకుందునా?
నన్ను
సంహరించువానిని,
నీ
గర్భమున
నేను
మాత్రము
ధర్మవిరుద్ధముగా
సంహరించలేదు.
వ్రతనిష్ఠకు
శుచి
ప్రధానమన్న
విషయము
నీకు
తెలియును.
అది
విరుద్ధముగా
మారుటచే
సమయమును
గమనించి
నా
రక్షణ
నేనుగా
చూచుకొనుటలో
తప్పు
లేకుండుటచే
అట్లు
చేసితిని.
గర్భము
ఏడు
ముక్కలుగా
మారెను.
కనుక
వారు
దేవతలవలె
ఏడుగురు
మరుద్గణాలుగా
నుండునటుల
గావింతున"ని
వరమిచ్చి
వెళ్ళెను.
"రామా!
ఇంద్రుడు
దితి
ఇరువురును
ఈవిధమైన
ఒప్పందము
జరుపుకొన్న
పవిత్ర
స్థలమే
ఈ
స్థలము.
ఇక్కడే
ఇక్ష్వాకుకున్ను
ఆలంబుసాదేవికిన్నీ
ఒక
కుమారుడు
పుట్టెను.
అతడే
విశాలుడు.
ఆ
విశాలుడు
నిర్మించిన
దేశమే
ఈ
విశాల
దేశము.
విశాలునికి
హేమచంద్రుడు
పుట్టెను.
అతడు
మహా
బలవంతుడు.
అతనికి
సుచంద్రుడు
పుట్టెను.
అనగా
విశాలుని
మనుమడు
సుచంద్రుడు.
సుచంద్రుడు
పెరిగి
పెద్దవాడై
వివాహమాడెను.
అతనికి
ధూమ్రాశ్వుడున్నూ,
ధూమ్రాశ్వునికి
సృంజయుడున్నూ,
ఆ
సృంజయునికి
సహదేవుడున్నూ
పుట్టిరి.
సహదేవుడు
శ్రీమంతుడు,
మహాధార్మికుడు,
బలశాలి.
అతని
పరిపాలన
చాలా
కాలము
జరిగెను.
అతనికి
కుశాశ్వుడు
అను
కుమారుడు
కలిగెను.
అతని
కుమారుడే
సోమదత్తుడు.
సోమదత్తునకు
కాకుత్స్థుడు
పుట్టెను.
ఆ
పరాక్రమశాలి
పుత్రుడే
సుమతి.
ఇపుడు
ఈ
విశాల
పట్టణమును
పరిపాలించునతడే
సుమతి.
ఇతడు
మహాగుణశాలి.
దేవతలతో
సమానుడు.
"రామా!
ఈనాడు
ఈ
విశాల
పట్టణమున
సుఖముగా
శయనించి
రేపటి
దినమున
జనక
మహారాజు
పట్టణమునకు
పయనమగుదము"
అని
తెలుపగా
అందరూ
ఆనందించిరి.
ఇంతలో
విశ్వామిత్ర
మహర్షి
తమ
పట్టణ
ప్రాంతమునకు
వచ్చినటుల
దూతలచే
తెలిసికొని
సుమతి,
తమ
పరివారముతో
పురోహితులతో
వెళ్ళి
21
▾
Meaning
Keep
విశ్వామిత్రులవారిని
తమ
పురములో
ప్రవేశించి
రాజభవనమును
పవిత్రము
చేయమని
ప్రార్థించెను.
విశ్వామిత్రుడు
కూడనూ
ఆనందించి
కుశల
ప్రశ్నలు
చేసెను.
ఇరువురూ
కొంత
తడవు
పురక్షేమములు
మాట్లాడిన
తరువాత
రామలక్ష్మణులను
చూచి
సుమతి,
ఈ
సింహపుపిల్లలెవరైయుందురని
విశ్వామిత్రుల
వారిని
ప్రశ్నించెను.
అందులకు
విశ్వామిత్రుడు,
"సుమతీ!
అది
గొప్ప
చరిత్ర.
సమయము
లేదు.
భవనమునకు
వెళ్లిన
తరువాత
వివరింతును"
అని
తెలిపి
తమ
వెంట
వచ్చిన
ఋషి
శిష్యులను,
రామలక్ష్మణులను
విశాల
పట్టణమునకు
బయలుదేరుడని
తెలిపి
తానుకూడను
లేచి,
సుమతితో
కబుర్లు
అడుగుచూ
నడువ
దొడగెను.
పురములో
ప్రవేశించగనే
మంగళవాద్యములు
మ్రోగెను.
బ్రాహ్మణులు
స్వస్తి
వాచకములు
పలికిరి.
విశాలపురి
రాజభవనమున
వారు
ప్రవేశించిరి.
ఆనాడు
సుమతి
గావించిన
విందును
ఆరగించి
అక్కడ
చేరిన
పండితులతోను
బంధుమిత్రులతోను
రామలక్ష్మణులనుగూర్చి,
సిద్ధాశ్రమములో
తాను
గావించిన
యజ్ఞమునుగూర్చి,
దానిని
రక్షించిన
విధానమునుగూర్చి
విశ్వామిత్రుడు
విపులముగా
తెలుపగా
ఆశ్చర్యకరమైన
శక్తి
సామర్థ్యములుగల
బాలల
చరిత్రను
విని,
చేరినవారలు
అమితానందముతో
రామలక్ష్మణులవైపు
జూచుచూ
సాక్షాత్కరించిన
నరనారాయణులా
అన్నటుల
భావించి,
అందరూ
నమస్కరించిరి.
అప్పటికే
ప్రొద్దుకావచ్చుట
చేత
విశ్వామిత్రులకు
నమస్కరించి
రామలక్ష్మణులు
విశ్రాంతి
తీసుకొనుటకై
వారికి
ప్రత్యేకముగా
అమర్చిన
విడిది
గృహమునకు
వెళ్లిరి.
తెల్లవారగనే
స్నాన
సంధ్యాదులు
గావించి,
విశ్వామిత్రులచెంతకు
సకాలమునకు
చేరిరి.
అక్కడ
సుమతికి
కృతజ్ఞతను
తెలిపి,
మిథిలాపురికి
బయలుదేరిరి.
సుమతి
కొంత
దూరము
వారలతో
వచ్చి
వీడ్కోలొసగి
తిరిగి
వెళ్ళిపోయెను.
విశ్వామిత్రుడు
శిష్య
బృందముతో,
రామ
లక్ష్మణులతో
నడచుచూ
మధ్యాహ్నమునకు
ఒక
సుందరమైన
వనమును
చేరెను.
అది
పూర్వము
ఎంతో
అందముగా
ఉండినటుల
కొన్నికొన్ని
శిథిలమైన
పర్ణశాలలు,
యజ్ఞయాగములు
22
▾
Meaning
Keep
చేయునట్టి
అరుగులూ
హోమగుండములూ
రాముని
కంటికి
అగుపడెను.
అంత
రాముడు
చుట్టూ
పరికించి
ఇది
ఏదో
పూర్వము
మహర్షులు
సంచరించిన
పవిత్ర
వనమువలె
నున్నదని
విశ్వామిత్రులతో
హెచ్చరించగనే,
విశ్వామిత్రుడు
చిరునవ్వు
నవ్వి,
"రామా!
ఎంత
చక్కగ
గమనించితివి!
సంతోషము.
ఈ
ప్రదేశమున
ఏ
మహనీయుడు
నివసించి
యుండెనో,
ఆ
మహనీయుడు
ఈ
ప్రదేశమును
ఎందుకు
వీడవలసివచ్చెనో
తెలుపుదును,
వినుము.
ఇది
గౌతమ
మహర్షి
ఆశ్రమము.
దేవతలు
సహితము
ఈ
ఆశ్రమపదాన్ని
ఎంతో
ప్రశంసిస్తూ
ఉండేవారు.
గౌతముడు
తన
భార్య
అయిన
అహల్యతో
అనేక
సంవత్సరములు
ఇందు
నివసించెను.
ఘోరమగు
తపస్సు
నాచరించెను.
అనేక
యజ్ఞయాగాది
క్రతువులు
సలిపెను.
ఈ
ప్రదేశము
నిత్యకల్యాణముతో
కళకళలాడుచుండెను.
గౌతముని
భార్యయగు
అహల్య
మహా
గుణవంతురాలు,
చక్కని
చుక్క
ఆమెను
పోలిన
స్త్రీలు
లోకమున
మరొకరు
లేకపోవుటచే
గౌతముడు
అతి
జాగ్రత్తగా
కాపాడుకొని
కనిపెట్టుకొనియుండెను.
ఒకనాడు
ఆమె
సౌందర్యమును
చూచుటకు
గౌతముడు
ఆశ్రమమున
లేని
సమయమును
కనిపెట్టి,
ఇంద్రుడు
గౌతముని
వేషమును
ధరించి
ప్రవేశించెను.
అపుడు
గుణవంతురాలైన
అహల్య
పతిగా
భావించి
అతనికి
ఉన్నతరీతుల
సేవలు
సలుపుచుండెను.
ఇంతలో
నిజమైన
గౌతముడు
ప్రవేశించగనే
ఇంద్రుడు
కనిపించెను.
గౌతముడు
ఉగ్రుడై
తన
వేషమును
ధరించి
అహల్యతో
సేవలు
చేయించుకొనుచుంటివా
దుర్మతీ!
అని
గర్హించగనే
దేవేంద్రుడు
అంతర్ధానమాయెను.
ఆ
రౌద్రముతో
అహల్యను
చూచి
ఆశ్రమ
నాశనమునకు
పూనుకొంటివని,
"ఛీ,
ఒక
నిమిషమైననూ
నేను
ఇందుండ
తలంచలేదు.
నీ
ముఖము
చూడరాదు.
కూడును
నీరును
లేక
గాలిని
పీల్చుచు
ఇతరుల
కంటబడక
పొదల
చాటున
పడియుండుము.
నే
వెళ్ళుచున్నాన"ని
గౌతముడు
అగ్నివంటి
మాటలు
పలుకగనే,
23
▾
Meaning
Keep
అహల్య
గోదున
ఏడ్చి
తనయందే
విధముగనూ
తప్పు
లేదనియును,
తాను
లోతుగా
విచారించలేక
వేషమును
చూచి
పతిగా
భావించి
సేవలు
సల్పితినేగాని
అన్యభావము
లేదని
కాళ్ళమీదపడి
ప్రార్థించగా
గౌతముడు
శాంతించి
యథార్థమును
గుర్తించి
తానన్న
మాట
తిరిగి
వెనుకకు
తీసుకొనరాని
దగుటచే,
తిరిగి
"అహల్యా!
నాకు
ఆడినమాట
తప్పనను
వ్రతమున్నది.
అది
నీకు
తెలియును.
కాన
నీవిక్కడే
పడియుండుము.
త్వరలో
దశరథ
రాముడు
ఇక్కడికి
రాబోవుచున్నాడు.
నిన్ను
చూచి
కటాక్షించును.
దర్శన
మిచ్చును,
ఆ
దర్శన
స్పర్శన
సంభాషణములతో
నీ
దోషము
పరిహారమగును.
నీ
యథార్థ
రూపము,
తేజస్సు
తిరిగి
ప్రాప్తించ
గలదు.
అపుడు
నేను
తిరిగి
నిన్ను
చేర్చుకొందును"
అని
తెలిపి
గౌతముడు
ఆశ్రమమును
వదలి
హిమవత్పర్వత
ప్రాంతమునకు
వెళ్లిపోయెను.
అతను
వెళ్ళినప్పటినుండియు
అహల్య
రూపరహితయై
గాలిని
పీల్చుతూ
తన
పతిని
చేరగోరి
ఘోరతపముతో
పడియున్నది.
ఆశ్రమము
ఊరీతిగా
పాడుపడిపోయినది"
అని
విశ్వామిత్రుడు
తెలుపగానే
రామచంద్రుడు
అమిత
ఆశ్చర్యమును
ప్రదర్శించి,
"ఏమి?
నా
రాకకై
వేచియున్నటుల
తెలుపుచున్నారే!
పాపము!
ఆమె
ఏ
ప్రదేశమున
తపమాచరించుచున్నదో
తెలిసికొనగోరుచున్నాను"
అని
రాముడు
ముందుకు
నడువగనే,
విశ్వామిత్రుడు,
లక్ష్మణుడు
అతనిని
అనుసరించిరి.
మహారణ్యమున
పొదలను
దాటి
శిథిలమైన
పర్ణశాలలో
ప్రవేశించిరి.
అంతవరకు
దేవదానవుల
కెవ్వరికినీ
చోరనలవి
కాకుండా
తపోనిష్ఠలో
సర్వమును
మరచి
నిద్రాహారములు
లేక
రాయివలె
పడియుండిన
ఆ
అహల్య
పొగమంచులో
చిక్కుకొన్న
చంద్రునివలె
కనిపించెను.
ఆమె
విగ్రహము
ధూమచ్చున్నము
అయిన
అగ్నిహోత్రజ్వాలవలె
మారియుండెను.
రాముడు
మరింత
సమీపమునకు
వెళ్ళుచుండగనే
కాలు
సోకెను.
అంత
అహల్య
తలయెత్తి
రాముల
దివ్యసుందర
విగ్రహము
చూచి,
"ఆహా!
ధన్యురాలనైతిని"
అని
పాదములు
గట్టిగా
పట్టుకొని,
"నా
పాప
పరిహారము
గావింప
వచ్చిన
24
▾
Meaning
Keep
పరమాత్మా!
ఈనాటికి
దయకల్గెనా?"
యని
అనేక
విధముల
ప్రార్థించెను.
తన
రూపము
మేఘములనుండి
తప్పించుకొన్న
చంద్రునివలె
ప్రకాశింప
పైకిలేచెను.
అంత
యోగ
లక్షణ
సంపన్నుడగు
గౌతముడు
క్షణములో
అచ్చట
వ్రాలెను.
ఆ
తపోబల
విశుద్ధాంగిని
చూచెను.
ఇరువురు
చేరి
రామలక్ష్మణులకు
అత్యంతానందముతో
నమస్కరించి,
విశ్వామిత్రుని
గౌతముడు
తగురీతిగ
సన్మానించి
గౌరవించెను.
అంత
విశ్వామిత్ర
శిష్యబృందము
ఈ
ఆశ్చర్యకరమైన
వింతను
జూచి
నేత్రములనుండి
కారుచున్న
ఆనంద
బిందువులతో
రామలక్ష్మణులను
తదేక
దృష్టితో
చూడ
దొడగిరి.
ఇంతలో
విశ్వామిత్రుడు
గౌతమునిదగ్గర
సెలవు
తీసికొని
రామలక్ష్మణులను
వెంటబెట్టుకొని
ఈశాన్య
దిక్కుగా
పయనము
సలిపెను.
సాయం
సమయమునకు
సరిగా
మిథిలాపురము
సమీపించిరి.
అదియే
మిథిలాపురమని
కనిపించు
పెద్దపెద్ద
భవనములతో
కూడిన
విశాల
పట్టణమును
విశ్వామిత్రుడు
చూపగనే
రామలక్ష్మణులు,
ఋషిశిష్యులు
పట్టరాని
ఆనందముతో
గంతులు
వేసిరి.
నడక
మరింత
తీవ్రగతిని
చెందెను.
దేహములే
మరచిరా
అన్నట్లు
పూలచెండులవలె
కదిలిపోయిరి.
మిథిలాపుర
సింహద్వారము
చేరిరి.
ఎటుచూచినను
ఋషులు,
బ్రాహ్మణులు.
వేదపరనములు,
అన్ని
కార్యములును
జరుగుచుండెను.
ఏ
చెట్ల
క్రింద
చూచిననూ
ఎడ్లబండ్లను
నిలిపి
అందుండి
ప్రజలు
గుంపులు
గుంపులుగా
దిగుచూ
స్త్రీలు,
పురుషులు,
వృద్ధులు,
బాలురు,
అన్ని
వర్గములవారూ,
అన్ని
ఆశ్రమములవారూ,
అన్ని
దేశములవారూ
రక
రకములుగా
కనిపించుచూ,
కన్నుల
పండువగా
నుండెను.
జనులు
అటూ
ఇటూ
తిరుగుచు
దారియే
తెలియక
క్రిక్కిరిసి
కిటకిటలాడుచుండిరి.
అట్టి
సమయమున
ఎక్కడ
విడిది
చేయవలెనో
తెలియక
అటు
ఇటు
చూచి
కొంత
జనసమ్మర్దము
లేని
ఒక
చెఱువు
గట్టునకు
చేరిరి.
అక్కడివారందరూ
సామానులు
కట్టిపెట్టి
స్నానసంధ్యాదులు
తీర్చుకొనుచుండిరి.
యజ్ఞసమయమున
ఆహ్వానము
గావించినవారెవరైనా
వత్తురేమో
అని
ఎక్కడ
నుండి
వచ్చినదియు,
25
▾
Meaning
Keep
వారు
ఏ
ఆశ్రమమునకు
చెందినదియు
వారి
నామధేయములను
విచారించి
వార్తలను
రాజున
కందించుచుండిరి.
ఈ
లోపల
ఈ
చుక్కలవంటి
పిల్లలతో
సింహముల
వంటి
దృఢకాయులతో
మహా
తేజోవంతుడైన
విశ్వామిత్రుడు
స్నానముచేసి
సంధ్యాదికార్యములు
సక్రమముగా
ఆచరించి
చెరువు
గట్టుపై
కూర్చొని
మిథిల
వైభవముగూర్చి
చెప్పుచుండ
రామలక్ష్మణులు,
ఋషిపుత్రులు
వినుచుండిరి.
ఇంతలో
రాజ
భటులు
వచ్చి
సవినయముతో,
"స్వామీ!
తామెవ్వరు?
ఎచ్చటి
నుండి
దయచేసితిరి?
మేము
రాజభటులము.
జనక
చక్రవర్తి
ఆజ్ఞానుసారము
మేము
మా
కర్తవ్యముల
నిర్వర్తించుచున్నాము.
తమ
నామధేయము
తెలిపిన
శ్రీవారి
కెరిగింతుము"
అని
ప్రార్థించగనే
విశ్వామిత్రుడు
వెంటనే
తన
నామమును
తెలిపెను.
అంత
రాజభటులు
సరాసరి
రాజభవనమునకు
వెళ్ళి
విశ్వామిత్రులవారి
రాకనుగురించి
తెలుపగనే
జనక
మహారాజు
తగిన
ఏర్పాట్లు
గావించెను.
కొంత
సమయమగుసరికి
ప్రధాన
బ్రాహ్మణులతో
ప్రధాన
పురోహితుడైన
శతానందుని
పంపగా
శతానందుడు
స్వస్తివాచకములు
పలుకుచూ
చెరువుగట్టునకు
వచ్చుటను
జూచి
విశ్వామిత్రుడు
తమను
తోడ్కొనిపోవు
నిమిత్తం
వచ్చుచున్నారని
గమనించి
రామలక్ష్మణులను
సిద్ధము
కందని
తెలిపెను.
అందరూ
సర్వసంసిద్ధులై
యుండ
శతానందుడు
వినయ
విధేయతలతో
అర్ఘ్యము,
పాద్యము,
మధుపర్యము
విశ్వామిత్రులవారికి
సమర్పించి,
"మహారాజుగారి
ఆజ్ఞ
ప్రకారము
మేము
తమకు
స్వాగతమిచ్చుటకై
వచ్చితిమ"ని
తెలిపి
వారి
సామానులకు
ఒక
పల్లకి
అక్కడుంచి
విశ్వామిత్రుని,
రామలక్ష్మణ
ఋషి
కుమారులను
మంగళ
వాద్యములతో
తోడ్కొనిపోయెను.
రాజవీధిలో
ప్రవేశించగనే
అక్కడికి
జనక
మహారాజు
స్వయముగా
తన
మంత్రిపరివారముతో
ఎదురేగి
విశ్వామిత్రులవారికి
నమస్కరించి,
"స్వామీ!
నేను
ధన్యుడనైతిని.
తమ
రాక
మిథిలాపురమున
కెంతయో
శోభ
చేకూర్చెను"
అని
క్షేమ
సమాచారములు
పల్కరించి
తమ
దృష్టిని
పిల్లలైన
రామలక్ష్మణులపై
26
▾
Meaning
Keep
ఏకాగ్రపరచెను.
ఆ
రూపములు
సాక్షాత్
సూర్యతేజఃపుంజమువలె
కనిపించెను.
రాజునకు
కొన్ని
సెకండ్లు
ఏమియూ
తోచక,
ఎక్కడ
నున్నది
తెలియకపోయెను.
ఎటులో
తన
చిత్తమును
అణచుకొని
దిగ్భ్రాంతిగా,
"స్వామీ!
ఈ
పిల్లలెవరు?
సాక్షాత్
అశ్వినీ
దేవతలవలె
కనిపించుచున్నారు.
వీరు
నా
అదృష్టవశముచే
ఇప్పటికిప్పుడే
నన్ననుగ్రహింపగోరి
దేవలోకమునుండి
దిగిన
దేవతావిగ్రహములవలె
నున్నారు.
లేక
సూర్య
చంద్రులే
ఇట్టి
రూపములు
ధరించి
భూలోకమునకు
వచ్చిరా
అన్నట్లున్నారు.
ఇట్టి
సుకుమార
సుందరులు
తమతో
పాదచారులై
ఎట్లు
వచ్చిరి?
లేక
ఎక్కడెక్కడ
దయినను
పరిచయమై
తమను
కూడిరా?"
అని
తనకు
తాను
తెలియక
దేహమునే
మరచి
మాట్లాడుచున్నట్లు,
ఒకదానిపై
మరొక
ప్రశ్నను
వర్షముగ
కురిపించు
జనక
మహారాజును
చూచి
విశ్వామిత్రుడు
చిరునవ్వుతో,
"రాజా!
వీరు
అయోధ్యా
నగర
చక్రవర్తియగు
దశరథుని
పుత్ర
రత్నములు.
వీరి
పేర్లు
రామలక్ష్మణులు.
వీరి
బలపరాక్రమములు
అత్యంత
విచిత్రములు,
అద్భుతములు"
అని
ఇంకనూ
ఏమేమో
తెలుపవలెనని
తలంచి
విడిదికి
చేరిన
తదుపరి
మాటాడవచ్చుననని
అంతటితో
ఆ
సంభాషణకు
స్వస్తి
చెప్పి
రాజుతో
ముందుకు
నడచుచూ
వచ్చెను.
అప్పటికప్పుడు
వారలకై
ఏర్పరచిన
చక్కని
విడిది
గృహమునకు
తోడ్కొని
వెళ్లిరి.
అది
విశాలమైన
తోటలో
సుందరమైన
మందిరంగా
అలంకరింపబడియుండెను.
అక్కడ
ప్రశాంతత
ఉట్టిపడినదా
అన్నట్లు
అంతటా
నిశ్శబ్దమైనదైయుండెను.
అది
రాజభవనమునకు
అతి
సమీపమున
నుండుటచేత
వారల
నక్కడకు
చేర్చి
జనక
మహారాజు
విశ్వామిత్రులవారికి
సాష్టాంగ
నమస్కారములు
గావించి,
తమరాక
రాజునకెంతయో
బలమును,
ఆనందమును
అందించినదనియును,
ఎన్నియో
జన్మల
పుణ్యఫలమే
మాకట్టి
భాగ్యము
నందించినదనియు
కృతజ్ఞత
తెలిపి,
రాజు
విశ్వామిత్రుల
చెంత
సెలవు
తీసికొని
వెళ్ళుచు,
"స్వామీ!
యజ్ఞము
ఇంకనూ
పండ్రెండు
దినములు
పట్టునని
27
▾
Meaning
Keep
ఋత్విక్కులు
చెప్పుచున్నారు.
కాన
తమరు
ఈ
పండ్రెండు
దినముల
కాలము
మిథిలయందే
యుండి
అనుగ్రహించ
వేడుచున్నాన"ని
ప్రార్థించెను.
విశ్వామిత్ర
మహాఋషి
అందులకెట్టి
అభ్యంతరము
లేదని
అభయమివ్వగనే
రామలక్ష్మణులు
ఒకరినొకరు
చూచుకొని
ఇంత
కాలమా
అన్నట్లు
భావించిరి.
ఆ
రాత్రి
విశ్రాంతిగా
నిద్రించుటకు
తగిన
ఏర్పాట్లు
చేసి
వారలకు
ఫల,
పానీయ,
క్షీరములు
అందించునట్లు
తెలిపి,
"రేపటి
ఉదయమున
తమ
దర్శనము
చేసికొందును.
ప్రయాణపు
బడలికచే
యున్న
తమకు
శ్రమ
కలిగించుట
భావ్యము
కాదు.
చక్కని
విశ్రాంతి
తీసికొనుడ"ని
ప్రార్థించి,
రాజు
పురోహిత
మంత్రులతో
రాజ
భవనమునకు
వెడలిపోయెను.
అతడు
వెళ్ళిన
తోడనే
రామలక్ష్మణులు
జనక
మహారాజుయొక్క
భక్తి
శ్రద్ధలను,
వినయ
విధేయతలను
వర్ణించుచూ
అతని
ముఖతేజస్సును
ఘనముగా
పలుకుచూ,
గురువుల
చెంతచేరి
ఫలముల
భుజించి
విశ్రమించుటకు
అనుజ్ఞ
గొని
తమ
వసతికి
వెడలిరి.
తెలతెలవారగనే
ద్వారము
ముందు
మంగళ
వాద్యములు
మ్రోగెను.
బ్రాహ్మణులు
వేదము
పఠించిరి.
రామలక్ష్మణులు
లేచి,
స్నానము
నాచరించి
సంధ్యావందనము
ముగించుకొని,
విశ్వామిత్రులవారి
చెంతకు
చేరిరి.
అంత
విశ్వామిత్రులవారు
వారలకు
క్షీరము
నందించి,
"నాయనలారా!
జనకుడు
వచ్చు
వేళైనది.
మీరు
ఫలహారము
తీసికొని
సిద్ధంగా
నుండుడ"ని
ఆజ్ఞాపింపగనే
రామలక్ష్మణులు,
ఋషి
కుమారులు
ఫల,
పానీయములను
అందుకొని,
భుజించి,
హస్తములను
శుద్ధిచేసికొని
తిరిగి
వచ్చి
విశ్వామిత్రులవారి
చెంత
కూర్చొనిరి.
ఇంతలో
జనక
మహారాజు
పురోహిత
సమేతుడై
వచ్చుచున్నటుల
తెలిసెను.
శంఖముల
నూది,
నవధ్వనులు
వాయించిరి.
గంధాక్షతలను
హస్తమందుంచుకొని
జనకుడును,
అర్ఘ్య
పాద్యములను
ధరించి
శతానందుడును
పరివారముతో
విడిదిలో
ప్రవేశించిరి.
జనకుడు,
సరాసరి
వచ్చి
విశ్వామిత్రులకు
నమస్కరించి,
వారికి
ఎదురుగా
ఏర్పరచిన
ఉన్నతాసనము
చెంత
నిలబడెను.
విశ్వామిత్రుడు
అతనిని
28
▾
Meaning
Keep
కూర్చుండుమని
ఆజ్ఞాపింపగనే
జనకుడు
ఆసనముపై
కూర్చుండెను.
రామలక్ష్మణులు
విశ్వామిత్రునికి
కుడివైపున
నేలపై
పరువబడిన
రత్న
కంబళముపై
ఆసీనులై
యుండిరి.
ఇంతలో
జనకుడు,
"మహామునీ,
తమకు
నిరంతరము
స్వాగతము.
ఇక
తమ
ఆజ్ఞ
ఏమిటో
తెలిపిన
నేను
సంసిద్ధుడన"ని
హస్తములు
జోడించుకొనెను.
అంత
విశ్వామిత్రుడు
చిరునవ్వు
నవ్వి,
"రాత్రి
వ్యవధి
లేకపోవుటచేత
వివరములు
తెలుపనైతిని.
నీవు
వినగోరుదువేని
ఈ
రామలక్ష్మణుల
విషయమును
చెప్పబూనుదును.
వ్యవధి
లేకున్న
మరొకపరి
తెలుపుదున"నగనే
రాజు
"స్వామీ!
తమ
సంభాషణ
భాగ్యముకన్నను
నాకు
వేరు
ప్రధానకార్యమేమున్నది!
ఇది
సర్వతపస్సుల
సారము,
సర్వయజ్ఞముల
ఫలము,
సమస్త
పుణ్యముల
పుంజము.
తమరు
తెలుపుదురేని
నేనెంతయో
ఆనందింతును.
మహాభాగ్యమని
భావింతును"
అనెను.
తాను
దశరథుని
దర్శించినది
మొదలు
తన
యాగసంరక్షణ
వరకూ
జరిగిన
విషయమును
విపులముగా
తెలిపి
రాక్షసులతో
బోరాడిన
పిల్లల
శక్తి
సామర్థ్యములను
మరింత
అద్భుతముగా
తెలుపుచూ
మధ్యమధ్య
ఆనందమును
భరించలేక
కంటిధారలను
కార్చుచున్న
విశ్వామిత్రులవారిని
ఆశ్చర్యముతో
చూచుచు,
పిల్లలను
చూచుచు,
జనకుడు
మహాసమాధిలో
నున్నటుల
తలంచుచుండెను.
ఆ
పిల్లలను
సాక్షాత్తు
దేవతామూర్తులుగనే
తాను
భావించుచుండెను.
మాటిమాటికి
తన
దృష్టిని
ఎంత
మరల్చినప్పటికినీ
ఆ
దివ్య
మూర్తులనే
చూడగోరుచుండెను.
ఆ
పిల్లల
ముఖ
పద్మములపై
బ్రహ్మ
తేజస్సు
ఉట్టిపడుచుండెను.
ఈ
భావములను
జనకుడు
తనలో
తాననుకొనుచూ
అతి
వినయ,
విధేయతలతో
వారిని
చూడగోరెనే
కానీ
తాను
చక్రవర్తిననియూ,
వారు
వేరొక
మహారాజు
కుమారులనియు
భావించలేదు.
వారు
సాక్షాత్
దేవ
లోకమునుండి
భువికి
దిగిన
దివ్యమూర్తులుగ
లోలోన
తలంచుచుండెను.
దానికి
తగినటుల
విశ్వామిత్రుల
వారు
తెలిపిన
వీర
పరాక్రమ
దృశ్యములతో
జనకుని
విశ్వాసము
మరింత
బలపడెను.
మహాతపశ్శక్తి
29
▾
Meaning
Keep
సంపన్నుడైన
విశ్వామిత్రునిచేత
కానట్టి
యజ్ఞసంరక్షణ
ఈ
పసిపాపలచే
రక్షింపబడినదన్న
వీరు
సామాన్య
మానవమాత్రులు
కారని
తలంచెను.
మిథిలా
పురమునకు
బయలుదేరినది
మొదలు
ఆ
రామలక్ష్మణులచే
విశ్వామిత్రుడు
ఎంత
ఉల్లాసముగా
ప్రయాణము
జరిపినదియును,
అతి
సమీపముననే
యున్న
గౌతమమహర్షి
ఆశ్రమమున
అహల్యను
పునీతురాలుగా
జేసినదియును
అత్యంత
ఆశ్చర్యముతో
విశ్వామిత్రుడు
తెలుపుచుండగనే
శతానందుడు
పరమ
ఆశ్చర్యముతో,
"ఏమీ?
మా
తల్లికి
శాపవిమోచనము
జరిగినదా?
ఈ
మహనీయులు
నా
తల్లిని
పునీతురాలుగా
చేసి
నా
తండ్రితో
చేర్చిరా?
ఆహా!
నిజముగా
వీరు
సాక్షాత్
దైవస్వరూపులే,
సందియము
లేద"ని
ఆనందబాష్పములు
రాల్చుచు
అత్యంత
ఉత్సాహముతో
నోటమాటరాక
స్తంభించిన
శతానందుని
చూచి
విశ్వామిత్రుడు
"నాయనా,
ఇంత
మాత్రమునకే
నీవింత
కంగారుపడెదవేల?
మున్ముందు
జరుగు
అద్భుత
ఆనంద
అతీత
చర్యలను
అతి
శీఘ్రములోనే
అనుభవింతువు,
ఆనందింతువు.
మీ
తల్లిదండ్రులు
కూడ
నేడో
రేపో
మిథిలా
పురమునకు
రాగలరు.
రామ
లక్ష్మణుల
అద్భుత
చర్యలు
వారి
ద్వారా
విందువు,
శాంతించుము"
అని
బోధించెను.
అంతలో
జనక
మహారాజు
"స్వామీ!
ఇట్టి
పవిత్ర
పుత్రులను
గన్న
తల్లిదండ్రులు
ఎంత
అదృష్టవంతులో!
తలవని
తలంపుగా
వారలు
నా
గృహమున
కరుదెంచుట
ఇది
నా
భాగ్యము,
తమ
అనుగ్రహబలము"
అని
రామలక్ష్మణుల
వైపునకు
తిరిగి,
"నాయనలారా!
మీకు
తగినట్లు
వసతులు
కల్పించలేకుండిన
నన్ను
క్షమింపుడు.
కోరిన
తగిన
వసతుల
నేర్పరచుటకు
సంసిద్ధుడను,
లేక
పురమును
జూడగోరిన
తగిన
ఏర్పాట్లు
గావింతును.
క్రొత్తగా
భావించక
మనస్సు
విప్పి
తెలిపిన
సంతసింతును"
అని
ప్రేమతో
పలుకుచుండిన
జనక
మహారాజు
వాక్యములకు
రామచంద్రుడు
ఎంతో
గౌరవభావమును
వెదజల్లుచు,
"మహారాజా!
మేము
పిల్లలము.
మా
సౌకర్యములకెట్టి
అనానుకూలములు
లేవు.
ఆనందముగా
నున్నాము.
తమరు
మాకొరకై
వేరు
ప్రత్యేక
ఏర్పాట్లు
30
▾
Meaning
Keep
చేయనక్కరలేదు.
తమకంతటి
వాత్సల్యమేయుండిన,
మా
వాంఛ
నెరవేర్తురని
అత్యంత
ఆశతో
వేచియున్నాము"
అని
పూర్తిగ
వివరింపక,
విశ్వామిత్రులవైపు
చూచుచు
ఊరకుండెను.
ఇంతలో
విశ్వామిత్రులవారందుకొని,
"జనకా!
నా
యజ్ఞము
పూర్తి
అయిన
వెంటనే,
'వచ్చిన
కార్యము
జరిగినది,
మేమిక
అయోధ్య
వెళ్లుటకు
సెలవింద'ని
రామలక్ష్మణులు
కోరిరి.
ఇంతలో
మీనుండి
యజ్ఞ
సంబంధమైన
ఆహ్వానము
వచ్చుటతో
నేను
ఈ
పిల్లలకు
తెలిపి
మీరు
కూడనూ
మిథిలానగరమునకు
రండని
వారిని
పిలిచితిని.
అంత
రాముడు
"తండ్రి
ఆజ్ఞ
యజ్ఞసంరక్షణ
మాత్రమే
కాన,
మిగిలిన
ప్రదేశములకు
వెళ్లుటకు
తండ్రి
అనుజ్ఞ
పొందలేదు
కదా!"
అనెను.
నేను
వారలకు
అత్యంత
ప్రియమైన
అస్త్రములను
గురించి
తెలుపుతూ
మీ
ఇంట
ఒక
ధనుస్సు
కలదనియును,
దానిని
మీరు
చూడవలసినదనియు,
ఆ
ధనుస్సు
మహత్త్వము
తెలిపితిని.
అందుపై
వీరలు
అత్యంతము
చూడవలెనను
అపేక్షతో
ఇక్కడికి
నావెంట
వచ్చిరి.
కాన
వారు
పురమును
జూచుటగాని,
మరే
ఇతర
వింతలూ,
వినోదములూ
అనుకూలములూ
ఆశించుటకానీ
లేదు.
అస్త్రములన్న
వారలకు
అత్యంత
ప్రీతి"
అని
విశ్వామిత్రుడు
వారలకేమో
తెలుపుచుండగ
వాటిని
జనకుడు
వినక,
"అటులయిన
తక్షణమే
ఆ
దివ్యాస్త్రమును
యజ్ఞశాలకు
తెచ్చు
ఏర్పాట్లు
గావింతును"
అని
శతానందునితో
సంప్రదించి
ముహూర్తమును
చూచి
చెప్పుమనెను.
శతానందుడు
ఆలోచించుచుండగా,
రామచంద్రుడు
"మహారాజా!
ఆ
ధనుస్సు
తమ
ఇంటికెట్లు
వచ్చెను?
ఆ
చరిత్రను
తెలిపిన
విని
ఆనందింతున"ని
కోరగనే,
"నాయనా!
మా
పూర్వీకుడగు
నిమి
చక్రవర్తి
తరువాత
ఆరో
తరములో
దేవరాతుడు
అనే
ఆయన
రాజ్యము
నేలుచుండెను.
అప్పటిలో
దేవతలు
శివధనుస్సును
నిక్షేపముగా
నిచ్చిరి.
అప్పటినుండియూ
అది
మా
గృహమునందే
కలదు.
ఇది
దేవతల
వరప్రసాదము.
సామాన్య
అస్త్రముకాదని
మాత్రము
నే
చెప్పగలను.
కొన్నివేల
బారువుల
బరువు
గలది.
దీనిని
ఇంతవరకూ
ఎత్తి
చూచినవారు
లేరు.
అనేక
31
▾
Meaning
Keep
పర్యాయములు
దీనిని
వంచగల
శూరులెవరా
అని
పరీక్షింపగోరి
ప్రదర్శించి
చూచితిని.
రాజులు,
రాకొమరులు
విఫలురై
వెళ్లిరి.
వంచలేకపోవుటే
కాక
అటూ
ఇటూ
కదలించలేకపోవుటకూడను
జరిగినది.
ఒక
దినము
నేను
యజ్ఞము
చేయ
తలంచి
భూమిని
దున్నుచుండగా
నాగటిచాలులోనుండి
ఒక
పాత్ర
వెలువడెను.
దానిని
తీసిచూడగా
అందులో
ఒక
సుందర
స్త్రీ
శిశువు
కనిపించెను.
ఆ
శిశువు
నాగటిచాలులో
దొరకుటచేత
ఆమెకు
సీత
అని
పేరు
పెట్టుకొని
అల్లారుముద్దుగా
సాకుచుంటిమి.
ఆమె
మహాశక్తివంతురాలు.
ఒకనాడు
ఆమె
తన
పరిచారికలతో
ఆడుకొనుచుండగా
తన
ఆటవస్తువు
ఈ
ధనుస్సుగల
పెట్టెక్రిందకుపోయినది.
దానిని
తీయుటకు
అనేక
పరికరములతో
దాదులు
ప్రయత్నించిరి.
కానీ,
అది
మరింత
లోనికి
వెళ్లెను.
అట్టి
తరుణమున
నా
పెంపుడు
కూతురైన
సీత
చిరునవ్వు
నవ్వి
దాదులను
గేలిచేయుచూ
ఒక
చేతితో
ఆ
పెట్టెను
అవలీలగా
జరిపి
క్రిందుండిన
ఆటవస్తువును
అందుకొనుట
జూచి
దాదులు
ఆశ్చర్యపడి
రాణులద్వారా
నాకు
తెలిపిరి.
ఆనాటినుండియు
నేను
ఆమె
శక్తికి
తగినవాడు
చిక్కినప్పుడే
వానికి
ఆమెనిచ్చి
పెండ్లిచేయవలెనని
నిశ్చయించుకొంటిని.
ఆమె
సౌందర్యమును
చూచి
పెండ్లాడవలెనని
అనేక
వేలమంది
రాకుమారులు
వచ్చి
ధనుస్సును
కదలించలేక
సిగ్గుతో
వెళ్లిపోవుచున్నారు.
ఇట్లు
అల్పపరాక్రమ
సంపన్నులు
అనేకమంది,
ధనుస్సును
కదల్పలేక
అపజయులై
నిరాశతో
వెనుకకు
పోయినవారనేకులు
పోయి
మిథిలా
నగరముపై
ముట్టడి
సలిపిరి.
అట్టి
నిరాశాపరులముట్టడి
ఒక
సంవత్సరము
సాగినది.
అందుచే
నా
సైన్యసామగ్రి
సర్వము
నాశనమయినది.
ఆ
సమయమున
నేను
కొంత
దిగులు
పడవలసివచ్చెను.
వేరుమార్గము
లేక
దేవతానుగ్రహమునకై
తపస్సు
సాగించితిని.
అంత
దేవతలు
సంతుష్టులై
నన్ను
అనుగ్రహించి
చతురంగ
బలాలను
ప్రసాదించిరి.
అనగా
వారలు
నాకు
తోడై
దుర్మార్గులగు
అల్పవీరులను
చెదరగొట్టిరి.
ఇట్లు
అల్పజ్ఞులైన
రాజులు
నన్ననేకవిధముల
హింసించినను,
పవిత్ర
ధనుస్సు
నన్ను
కంటికి
రెప్పవలె
కాపాడినది.
ధనుస్సుయొక్క
మహత్తర
శక్తులు
32
▾
Meaning
Keep
వర్ణింప
నలవి
కానివై
యున్నవి.
రామచంద్రా!
నీ
అభీష్టమును
నేను
కాదనను.
నీవంగీకరింతువేని
రేపు
తెల్లవారగనే
సుముహూర్తమున
ధనుస్సును
యజ్ఞశాలకు
తెచ్చు
ప్రయత్నములు
చేయుటేకాక
దానిని
యెక్కుపెట్టు
వారెవరైననూ
ఉండిన
పూనుకొనవచ్చునని
ప్రకటింతును"
అని
జనక
మహారాజు
అధికార
రీతిగా
ఆడినమాటలకు
రామలక్ష్మణులు
ఒండొరులను
చూచుకొని
విశ్వామిత్రుని
ఆజ్ఞకై
వేచియుండిరి.
అంత
విశ్వామిత్రులవారు
బాలుర
శక్తిసామర్థ్యములను
న్యాయముగా
తెలిసికొన్నవాడగుటచే,
అందులకు
అభ్యంతరము
లేదని
పలికిరి.
అంత
జనక
మహారాజు
దానిని
ఎక్కుపెట్టినవారికి
పూర్వపు
నిబంధన
ననుసరించి
తన
ప్రేమపుత్రికయైన
సీతను
ఇచ్చి
వివాహము
చేతుననికూడనూ
వెల్లడి
చేసెను,
అందుకును
విశ్వామిత్రులవారి
సెలవు
బడసి
రాజ
భవనమునకు
వెళ్లి
ధనుస్సును
యజ్ఞశాలకు
తరలింప
తగిన
ప్రయత్నములు
జరిపెను.
యజ్ఞశాలలో
ధనుస్సును
ఎక్కుపెట్టునట్టి
విషయమునుకూడనూ
వెల్లడి
చేయించి
కొందరు
రాజులకు
వర్తమానము
లంపెను.
మంచి
బలమైన
వారల
ననేకమందిని
పిలిపించి
ఎనిమిది
ఇనుప
చక్రములతోనున్న
భోషాణములు
బయటికి
లాగించుటకు
ప్రయత్నము
జరిపెను.
అయితే
వచ్చినవారలతో
అది
కదలకపోయినది.
అందుచేత
మరింత
ఒడ్డు
పొడుగు
గల
మరికొంతమంది
బలాధ్యులను
పిలిపించి
ఇనుప
త్రాళ్లు
కట్టి
అతి
జాగ్రత్తగా
లాగించెను.
దానిని
స్వస్తివాచకములతో
యజ్ఞశాలకు
కొనివచ్చిరి.
తెల్లవారెను.
నవధ్వనులు
మిన్నుముట్టెను.
శంఖములు
పూరించిరి.
మంగళ
వాద్యములు
వాయించిరి.
జనక
మహారాజు
పూజా
ద్రవ్యములను,
పురోహితులను
వెంటపెట్టుకొని
యజ్ఞశాలకు
వచ్చెను.
అప్పటికే
అనేకమంది
రాజులు,
మంత్రులు,
ఋషులు,
పండితులు
మంటపము
చేరియుండిరి.
మహారాజు
యజ్ఞమంటపమును
చేరగనే
అందరూ
లేచి
నిలబడిరి.
ప్రభు
మర్యాదలను
పాటించిరి.
అంత
బ్రాహ్మణులు
వేదపారాయణము
గావించిరి.
మంత్రపుష్పము
మిన్నుముట్టునట్లు
ఏక
33
▾
Meaning
Keep
కంఠముతో
బ్రాహ్మణులు
పలుకుచుండ
ప్రేక్షకులు
మైమరచి
ఆనందమయులై
కనురెప్ప
వాల్చక
చూచుచుండిరి.
జనకుడు
ధనుస్సునకు
ప్రదక్షిణము
చేసి
మంత్రపుష్పములను
అర్పించి,
నమస్కరించి
సభవైపుకు
మళ్లి,
"మహాఋషులకు
నమస్కారములు,
సభాసదులకు
నా
ధన్యవాదములు,
అనేక
సంవత్సరములనుండీ
మా
వంశీయులున్నూ
ఇతర
రాజులున్నూ
దైవయంత్రమైన
ఈ
ధనుస్సును
గౌరవ
భావముతో
పూజించుచుండుట
ఎల్లరకూ
తెలిసిన
విషయమే.
అంతియేకాక,
సురాసురులు
కాని,
యక్ష,
రాక్షస,
గరుడ,
గంధర్వ,
కిన్నర,
మహోరగులు
కానీ
దీనిని
ఎక్కుపెట్టలేక
సిగ్గుతో
తిరిగి
వెళ్లిపోవుట
కూడనూ
అనేకమందికి
తెలిసిన
విషయమే.
కానీ
తిరిగి
ఈనాడు,
అట్టి
ప్రదర్శనమునకు
పూనుకొని
నేనీ
ధనుస్సును
ఈ
యజ్ఞశాలకు
తెప్పించితిని.
ఇందులో
ఎవ్వరైనను
సరియే,
దీనిని
వంచువారుకానీ,
అల్లెత్రాడును
ఎక్కించువారు
కానీ,
దీనిలో
బాణమును
కూర్చువారు
కానీ,
లేక
దీని
భారమును
పరీక్షించువారుకానీ
ఉండిన,
ఈ
శివదేవుని
ధనుస్సు
ఇపుడు
తమయెదుట
నున్నది.
కనుక
నిర్భయముగా
ముందుకు
రావచ్చును"
అని,
నమస్కరించి
సింహాసనముపై
ఆసీనుడాయెను.
అంత
విశ్వామిత్రుడు
రామునివైపు
నవ్వుచూ
చూడగనే,
ఆసీనులైయున్న
రాముడు
రివ్వున
వచ్చి
మూయబడియున్న
ఇనుప
మూతను
ఎడమ
చేతితో
తెరచి
కుడిచేతితో
లోనున్న
వింటిని
అవలీలగా
ఎత్తి
హస్తమునందుంచుకొని
అటు
ఇటు
పరీక్షించి
చూచెను.
ఆ
దృశ్యము
చూచుచున్న
మహాఋషులు,
రాజులు,
వేల
జనులు
ఆశ్చర్యపరవశులై
కరతాళములను
మిన్నుముట్ట
వాయించిరి.
రాముడు
ఆ
వింటికి
ఇట్టే
అల్లెత్రాడు
ఎక్కించినాడు.
సునాయాసముగా
బాణము
కూర్చినాడు.
బాణమును
వదలుటకు
అల్లెత్రాటిని
ఆకర్ణాంతముగా
లాగినాడు.
అంతట
ఆ
ధనుస్సు
ఫెళ్ళున
విరిగిపోయెను.
అది
విరుగగనే
పర్వతములు
పగిలినట్లు
ప్రళయ
శబ్దము
సభాసదులను
భయభ్రాంతులుగా
జేసెను.
కొందరు
మూర్ఛపడిరి.
కొందరు
భీతిచే
అరచిరి.
కొందరు
పరుగులు
తీసిరి.
ఋషులు
దైవమును
34
▾
Meaning
Keep
తలచిరి.
వేయేటికి?
ఆ
సభలో
జనకుడు,
విశ్వామిత్రుడు,
రామలక్ష్మణులు
తప్ప
అందరూ
భయపడిరి.
జనకుడు
లేచి
విశ్వామిత్రునకు
నమస్కరించి,
"స్వామీ!
ఈ
భూలోకమున
రామునకు
మించిన
బలవంతుడు
వేరొకడు
లేడు,
ఇంతటి
శక్తివంతుడు
భూలోకమున
ఉండడు
అని
భావించిన
నాకు
ఇది
పరమానందమును
కలిగించినది.
దీనిని
వంచినవారికి,
నా
ప్రేమపుత్రిక
నిచ్చి
వివాహము
చేతునని
పలికిన
పలుకు
పూర్తిగావింతును.
తమ
ఆజ్ఞ"
అని
కోరగనే,
విశ్వామిత్రుడు
"జనకా!
ఈ
వార్తను
దశరథ
మహారాజునకు
తెలిపి
వారిని
రప్పించి
మంగళకార్యమును
జరుపుట
మంచిదని
నా
ఉద్దేశ్యము.
కాన
దానికి
తగిన
ప్రయత్నములు
చేయుము.
పితృవాక్యమును
ప్రాణసమానముగా
భావించు
రాముడు
తండ్రి
ఆనతి
లేక
వివాహమును
అంగీకరింపడు"
అని
ఆజ్ఞ
ఇచ్చిన
వెంటనే
బ్రాహ్మణుని
పిలిచి,
మంత్రులను
వెంటపోవునట్లు
తగిన
ఏర్పాట్లను
గావించెను.
తెల్లవారగనే
మంత్రులు,
బ్రాహ్మణులు
రథములెక్కి
మూడు
అహోరాత్రములు
ప్రయాణములు
జరిపి
నాలుగవనాడు
ఉదయము
అయోధ్యానగరమును
చేరుకొనిరి.
నిమిషము
ఆలస్యము
చేయక
రాజభవనము
సింహద్వారము
చెంతకు
రథములు
తీసికొని
వెళ్లి
నిలిపిరి.
అంత
ద్వారపాలకులు
వచ్చి
వారలను
విచారింపగా
తమ
రాకను
దశరథ
మహారాజునకు
విన్నవించుమని
మంత్రులు
కోరగనే
వెంటనే
ద్వారపాలకులు
రాజునకు
తెలిపిరి.
వెంటనే
రాజానుమతితో
బ్రాహ్మణులు,
మంత్రులు
రాజ
భవనమున
ప్రవేశించిరి.
వృద్ధుడైనప్పటికీ
దశరథ
మహారాజు
మిథిలాపుర
బ్రాహ్మణులకు,
మంత్రులకు
దేవతుల్యుడుగా
తేజోవంతుడుగా
కనిపించెను.
అంతియేగాక
అతని
ప్రసన్న
వదనమును
చూడగనే
బ్రాహ్మణులకు,
మంత్రులకు
ఎట్టి
జంకూ
లేక
పవిత్ర
హృదయముతో
నమస్కృతులు
చేసి,
"మహారాజా!
మేము
మిథిలాపతి
జనక
మహారాజు
దూతలము.
మా
మహారాజు
స్నేహపూర్వకముగా
తమ
కుశలమును,
రాజ్యక్షేమమును
అడిగి
తెలుసుకొమ్మన్నారు.
మహారాజా!
తమకు
35
▾
Meaning
Keep
అతి
ప్రధానమైన
విషయమును
విన్నవించుటకు
విశ్వామిత్ర
మహర్షి
అనుమతితోను
శతానందోపాధ్యాయులవారి
సమ్మతితోను
మా
మహారాజు
మమ్ముల
నిచ్చటికి
పంపడమైనది"
అని
వినయముతో,
రాజ
గౌరవముతోను
విన్నవించుకొనుచున్న
మంత్రులను
జూచి
దశరథ
మహారాజు
ప్రశాంత
వదనుడై
చిరునవ్వులు
ఉట్టిపడ,
"బ్రాహ్మణోత్తములారా!
మంత్రులారా!
అయోధ్యా
పరిపాలనలో
ఎట్టి
లోటునూ
లేక
అగ్నిహోత్రాది
సత్కర్మలకు
ఎట్టి
అవాంతరములూ
కలుగక,
ప్రజాక్షేమమున
కెట్టి
కొరత
లేక,
ధార్మిక
ఆధ్యాత్మిక
మార్గముల
కెట్టి
ఇబ్బందులూ
కలుగక
సుక్షేమముగా
కాలమును
గడుపుచున్నారు.
మిథిలాపతి,
రాజ్యాధిపతియైన
జనకుల
కుశలములను,
ప్రజాక్షేమములను
అగ్నిహోత్రాది
సత్కర్మాచరణ
దీక్షను
వినగోరుదును.
ఎట్టి
సందియమూ
నొందక
వచ్చిన
కారణములను
తెలుపవచ్చును.
విషయమును
వినగోరుచున్నా
న"ని
మృదుమధుర
వాక్యములతో
అనుమతి
ఇవ్వగనే
మంత్రులు
బ్రాహ్మణులకు
సైగ
చేసిరి.
అంత
ప్రధాన
పురోహితుడు
లేచి,
"మహాప్రభూ!
మా
మహారాజగు
జనక
భూపతి
తమ
కూతురగు
సీతాదేవికి
పరాక్రమమే
ఓలియని
ప్రతిజ్ఞ
చేయడము,
అనేకమంది
రాజకుమారులు
వచ్చి
నిర్వీర్యులై
విఫలురైపోవడము
తమకు
తెలిసిన
విషయమే
అయి
ఉండవచ్చును.
తమ
పుత్రులు
రామలక్ష్మణులు
విశ్వామిత్ర
మహర్షి
వెంట
దైవికముగా
మా
రాజధాని
నగరానికి
మా
మహారాజు
చేస్తున్న
యజ్ఞమును
చూడగోరి
రావడము,
తమ
జ్యేష్ఠకుమారుడు,
మహా
వీరుడు
అగు
రాముడు
సీతాదేవిని
సాధించడము
జరిగినది.
మహారాజా!
ఏమని
చెప్పుదుము!
మహర్షులూ,
రాజర్షులూ,
రారాజులు,
చూస్తూండగా
మహాపరాక్రమవంతుడు
రాముడు,
శివధనుస్సును
పట్టుకొని
లేవనెత్తి
ఎక్కుపెట్టెను.
అంతియేకాక,
అతిబరువైన,
కొన్ని
బారువులు
తూకముగల
ఆ
శివధనుస్సును
ఆ
మహావీరుడు
రెండు
ముక్కలుగా
అవలీలగ
త్రుంచివేసెను.
సీతాదేవికి
పరాక్రమమే
ఓలి
అయినందువలన
రామునకు
36
▾
Meaning
Keep
సీతాదేవిని
ఇచ్చి
పెండ్లి
చేయుటకు
అక్కడ
చేరిన
ఋషులూ,
మహారాజుగారు
నిశ్చయించిరి.
అందుకు
తమ
అనుమతిని
బడయుటకై
తమకు
స్వాగతము
తెలుపుటకై
బంధుమిత్రులతో,
ఉపాధ్యాయులతో,
పురోహితులతో,
మంత్రులతో,
సపరివారముతో
మిథిలాపురికి
ఆహ్వానించుటకై
స్వయముగా
మేమే
వచ్చితిమి.
మీ
దర్శనము
చేశాము.
మా
మహారాజు
తన
కూతురైన
సీతాదేవికి
వివాహము
చేయదలచెను.
ఈ
విషయమును
మనవి
చేయుటకై
మమ్ములను
మా
మహారాజు
తమ
చెంతకు
పంపిరి"
అని
చేతులు
కట్టుకొని
నిలుచున్న
మంత్రులను,
బ్రాహ్మణులను
చూచి
దశరథుడు,
హృదయమున
బాగుగ
ఆలోచించి,
మారుమాటాడక
వసిష్టవామదేవాది
మహాఋషులను
పిలిపించెను.
బ్రాహ్మణోత్తములను
రప్పించెను.
వారందరూ
చేరిన
తదుపరి
మరొకసారి
మిథిలాపుర
బ్రాహ్మణులతో
విషయమును
చెప్పించెను.
పూర్తిగ
వినిన
తరువాత
వారల
అభిప్రాయములను
తెలిసికొన
గోరి,
దశరథుడు
వసిష్టులవారికి
నమస్కరించి,
వారి
అంగీకారమును
తెలుపగోరెను.
అంత
వసిష్ట
వామదేవాదులు,
"శుభం,
శుభం"
అని
అమితోత్సాహంతో,
"ఇందులకింకను
యోచించెద
రెందుకు!
మిథిలాపుర
ప్రయాణమునకు
సర్వసిద్ధము
గావించుడ"ని
జవాబు
చెప్పిరి.
మంత్రులు
గంతులు
వేసిరి.
క్షణంలో
అయోధ్యానగరమంతయూ,
అంతఃపురమంతయూ
రామకల్యాణ
విషయము
వ్యాపించెను.
పుర
జనులు
"జై,
జై"
లు
చెప్పిరి.
పరివారము
ప్రయాణమునకు
సర్వసిద్ధము
గావించిరి.
పట్టు
పీతాంబరములు,
ఆభరణములు,
బహుమతులూ
మితిమీరునట్లు
సిద్ధపరచిరి.
రథములు
నింపిరి.
రాజు
కులగురువులైన
వసిష్ఠుడు,
పండితులు,
బ్రాహ్మణోత్తములు,
మంత్రులు
వారివారి
రథములు
వారు
అలంకరించిరి.
అయోధ్యే
కదలివచ్చుచున్నదా
అన్నట్లు
అందరూ
ప్రయాణమైనవారే.
అందరికీ
అన్నివిధాల
దశరథుడు
ఏర్పాట్లు
చేయించెను.
వాయు
వేగముతో
గుఱ్ఱములుకూడనూ
అమిత
ఉత్సాహముతో
అలసటన్నది
ఎరుగక
పరుగెత్త
జొచ్చెను.
రెండు
రాత్రులు,
రెండు
పగళ్ళూ
ప్రయాణమై
మూడవ
37
▾
Meaning
Keep
రాత్రికి
మిథిలాపుర
సింహద్వారమును
ప్రవేశింపగనే,
జనక
మహారాజు
స్వాగతము
చెప్పెను.
మంత్రులను,
పురోహితులనూ,
మహాఋషులనూ
తగినరీతుల
సత్కరించెను.
ఆ
రాత్రి
వారు
పూర్తిగ
విశ్రాంతి
తీసికొనుటకై
తగిన
ఏర్పాట్లుచేసి
వారికి
తగిన
వసతి
గృహములు
ఏర్పరచిరి.
తెల్లవారగనే,
దశరథ
మహారాజు
ఋత్విజులూ,
బంధువులూ,
మంత్రులూ
మొదలయినవారలను
పిలిపించెను.
ఏ
నిమిషమున
హాజరు
కావలెనో
సర్వులూ
సంసిద్ధులై
యుండవలెనని
హెచ్చరించెను.
ఇంతలో
జనక
మహారాజు,
దశరథ
మహారాజు
విడిది
గృహమునకు
వచ్చి
వెంటబెట్టుకొని
యజ్ఞవాటికకు
గొనిపోయెను.
గురువులకూ,
మంత్రులకూ,
మహారాజునకు,
పరివారమునకు
వారివారి
హోదాలకు
తగినట్లు
ఆ
యజ్ఞ
వాటికపై
ఆసనములను
అమర్చి
యుంచిరి.
అక్కడందరూ
ఆసీనులైయుండ,
జనక
మహారాజు
దశరథ
మహారాజునకు
స్వాగతమును
తెలుపుతూ,
"మహారాజా!
మా
భాగ్యమా
అన్నట్లు
తాము
మహర్షులతో
బ్రాహ్మణోత్తములతో
పరివారంతో
మిథిలాపురము
రావడము
మా
పుణ్యపరిపాకమని
భావించుచున్నాను.
తమ
పుత్రుని
పరాక్రమ
విజయములకు
తాము
మనసారా
సంతోషించితిరన్నది
వేరు
చెప్పనక్కరలేదు.
అమిత
పరాక్రమవంతులు
పుట్టిన
రఘువంశమువారితో
ఇప్పుడు
వియ్యము
అందబోతున్నాను.
ఇపుడు
నా
వంశము
మరింత
పూజనీయము
కాబోవుచున్నది.
ఇది
మా
పూర్వీకుల
పుణ్యఫలమనే
భావింతును.
మహారాజా!
రేపటితో
మేము
సంకల్పించిన
యజ్ఞము
సమాప్తము
అయిపోవుచున్నది.
మహర్షుల
సమ్మతితో
సీతారాముల
వివాహము
చేయదలంచితిని.
తమ
అనుజ్ఞ
బడయగోరుచున్నా"ని
జనకుడు
తెలుపగనే
దశరథ
మహారాజు
పట్టలేని
ఆనందములో
చిరునవ్వులు
ఒలికిపోవ,
"రాజా!
తాము
దాతలు.
దానము
దాత
వశమని
పెద్దలు
తెలుపుదురు.
అందువలన
తాము
ఎప్పుడు
ఏది
ఇస్తామంటే
అప్పుడు
అది
పుచ్చుకొనుటకు
సంసిద్ధులమైయున్నాము"
అన్నారు.
38
▾
Meaning
Keep
దశరథ
మహారాజు
ఇంత
చమత్కారముతో
తియ్యని
మాటలతో
హృదయములు
కరుగునట్లు
మాట్లాడుటచేత
జనకుడు
పట్టలేని
ఆనందముతో
ఉప్పొంగిపోయెను.
అంత
రామలక్ష్మణులు,
విశ్వామిత్రులతో
వచ్చి
తండ్రికి,
వసిష్ఠ
వామదేవాది
మహర్షులకు
నమస్కరించిరి.
దశరథుడు
కన్నులు
కాయలు
కాచినట్లు
ఇరువురు
పుత్రులనూ
దగ్గరకు
తీసుకొని
శిరస్సులను
ముద్దాడి,
భుజములపై
చేతులు
వేసుకొని
వక్షస్థలమునకు
తనివితీర
బిగించుకొని
పడుచున్న
ఆనందమును
చేరిన
బ్రాహ్మణులూ,
మంత్రులూ
చూచి
దశరథునకు
గల
పుత్ర
వాత్సల్యమునకు
తన్మయులయిరి,
ఆశ్చర్యపడిరి.
దశరథ
మహారాజు
పుత్రులతో
ముచ్చటలాడుచూ
అయోధ్య
వదిలినది
లగాయతు
విశ్వామిత్ర
మహర్షి
యాగసంరక్షణ
విశేషములు,
తదుపరి
మిథిలాపురికి
విచ్చేసిన
వివరములూ
రామలక్ష్మణులు
చెప్పుచుండ
వసిష్టవామదేవాది
మహాఋషులతో,
భరత
శత్రుఘ్న
సుమంతాదులతో
కూడి
దశరథుడు
అత్యంత
ఆనందముతో
వినుచూ
ఆ
రాత్రి
గడిపెను.
ఇటు
జనక
మహారాజు
వివాహ
ప్రయత్నములలో
నిమగ్నుడైనాడు.
తెల్లవారినది.
జనక
మహారాజు
తమ
ప్రధాన
పురోహితుడైన
శతానందుణ్ణి
రప్పించి
వివాహ
సంబంధమైన
విషయమును
కొంత
ఆలోచించవలెనని
వినయముతో
ప్రార్థించినాడు.
అంత
శతానందుడు,
"మహారాజా!
నేడే
యజ్ఞము
పూర్తి
అయినది.
రెండు
మూడు
దినములలో
ముహూర్తములు
మంచివిగనే
యున్నవి.
తాము
అనుమతించిన
నేను
వివరింతున"ని
తెలుపగనే,
జనక
మహారాజు
చేతులుకట్టి,
"స్వామీ!
నిన్నటి
రాత్రి
దశరథ
మహారాజు
అనుజ్ఞ
పొందగలిగితిని,
ఇది
నా
భాగ్యము.
అయితే,
నా
అనుంగు
తమ్ముడైన
కుశధ్వజుడు
ఇక్కడ
లేడు.
మన
యజ్ఞమునకు
సంబంధించిన
సామగ్రులు
తగిన
రీతుల
అందించుటలో
అతి
శ్రమపడెను.
అతను
లేక
ఈ
మంగళకార్యమును
చేయుటకు
నా
మనస్సొప్పకున్నది.
ఈ
వేడుకలలో
అతనుకూడనూ
భాగము
వహించవలసియున్నది.
కాన
నా
తమ్ముని
రప్పించుటకు
తగిన
ఏర్పాట్లు
చేసితిని.
39
▾
Meaning
Keep
అతను
వచ్చిన
తదుపరి
లగ్నము
నిర్ణయించుట
మంచిది"
అని
ప్రార్థింపగనే,
శతానందుడు,
'మంచిది,
మంచిది
అమితానందమా'
ని
వెళ్లిపోయెను.
జనకుడు
నాలుగు
వైపులా
దూతలను
పంపి
అతి
శీఘ్రముగా
తన
తమ్ముని
తోడ్కొని
రమ్మనెను.
అతి
వేగముతో
పయనించు
గుఱ్ఱములపై
అనుకొన్న
కాలమునకంటే
అతి
శీఘ్రముగ
సాంకాస్య
పట్టణము
చేరుకొనిరి.
కుశధ్వజ
మహారాజునకు
మిథిలాపుర
వృత్తాంతమంతయూ
వివరముగా
తెలియజెప్పిరి.
అంత
కుశధ్వజుడు
పట్టరాని
ఆనందముతో
సపరివారముగా
కానుకలను
కావలసినన్ని
రథముపై
నుంచుకొని
రాత్రికిరాత్రి
బయలుదేరి
మిథిలాపురము
చేరుకొనిరి.
నిమిషములు
లెక్కించుచున్న
జనకుడు
తన
తమ్ముని
చూడగనే
అతనిని
కౌగిలించుకొని
ఆనందించెను.
కుశధ్వజుడు
అన్నగారికి
నమస్కరించి,
తదుపరి
శతానందునికి
నమస్కరించి,
ఉన్నతాసనములపై
మువ్వురూ
కూర్చొనినారు.
అన్నదమ్ములు
ఇరువురూ
అన్నివిధములా
ఆలోచనలు
జరిపిరి.
ఒక
నిర్ణయమునకు
వచ్చినతోడనే,
శ్రేష్ఠుడైన
సుధామనుని
పిలిపించి,
"మంత్రీ!
నీవు
వెంటనే
వెళ్లి
దశరథ
మహారాజులవారి
మంత్రివర్గమును,
పురోహితులతో,
గురువులతో,
ఇంకనూ
వారలకు
ప్రధానులయిన
వారలను
సగౌరవముగా
ప్రార్థించి
ఇక్కడికి
తోడ్కొని
రమ్ము"
అని
ఆజ్ఞ
చేసెను.
సుధామనుడు
తగినవారలను
చేర్చుకొని
రథమును
తీసుకొని
దశరథ
మహారాజుగారి
విడిదికి
చేరి
జనక
మహారాజుగారి
అభిప్రాయమును
దశరథ
మహారాజునకు
విన్నవించి
వినయవిధేయతలతో
వారిని
ఆహ్వానించిరి.
సిద్ధముగనే
యున్న
దశరథ
మహారాజు
గురువులతో,
మంత్రులతో,
పురోహితులతో
బయలుదేరి
జనక
మహారాజు
దర్బారు
హోలుకు
చేరిరి.
ఒకరికొకరు
తగురీతుల
వందనములు
సల్పి
ఉన్నతాసనముపై
కూర్చుండగనే,
దశరథ
మహారాజు
లేచి,
"జనకా!
వసిష్ఠమహర్షి
మా
ఇక్ష్వాకు
వంశీయుల
ఇలవేల్పు,
మా
పరమ
గురువు.
సమస్త
విషయములకూ
ఆయనే
మా
40
▾
Meaning
Keep
వక్త.
ఆ
మహానుభావుడు
మా
వంశక్రమాన్ని
గురించి
చెప్పగలడు"
అని
పలికి
తాను
కూర్చొనెను.
వసిష్ఠులవారు
లేచి,
"రాజర్షీ!
సభాసదులారా!
బ్రహ్మ
అవ్యక్త
ప్రభువు,
నిత్యుడు,
నిర్మలుడు.
అట్టి
బ్రహ్మదేవుడు
మనసా
సంకల్పించి
ఈ
భూలోకములో
మరీచి
అనే
స్వరూపమును
జన్మింపజేసెను.
ఆ
మరీచికి
కాశ్యపుడు
పుత్రుడుగా
కలిగెను.
కాశ్యపునకు
సూర్యుడు,
సూర్యుని
కుమారుడే
మనువు.
ఈ
మనువునకు
వైవస్వత
మనువు
పుట్టెను.
అతనే
ప్రజాపాలన
మొనర్చి
ప్రజాపతి
అను
సార్థక
నామమును
అందుకొనెను.
అతని
పరిపాలనా
సమయమున,
అతనికి
ఇక్ష్వాకుడు
పుట్టెను.
అయోధ్యను
పాలించినవారిలో
మొదటివాడితడు.
అందువలననే
అయోధ్యా
రాజులకు
ఇక్ష్వాకువంశమువారను
పేరు
శాశ్వతముగా
నిలిచిపోయెను.
ఆ
ఇక్ష్వాకునకు
కుక్షియున్నూ,
కుక్షికి
వికుక్షియున్నూ,
వికుక్షికి
అమిత
తేజోవంతుడున్నూ
శౌర్య
పరాక్రమవంతుడున్నూ
అయిన
బానుడు
జన్మించెను.
అతనికి
అనరణ్యుడున్నూ,
అతనికి
పృథువున్నూ,
పృథువునకు
త్రిశంకుడున్నూ,
త్రిశంకునకు
దుంధుమారుడున్నూ,
దుంధుమారునకు
యువనాశ్వుడున్నూ,
యువనాశ్వునికి
మాంధాతయున్నూ,
మాంధాతకు
సునంధియున్నూ,
సునంధికి
ధృవసంధి,
ప్రసేనజిత్
అనే
ఇరువురు
పుత్రులున్నూ
పుట్టిరి.
ధృవసంధికి
మహాయశస్వి
అయిన
భరతుడు
పుట్టెను.
అతనికి
అసితుడు
పుట్టెను.
అతడు
పరిపాలన
చేయుచున్న
సమయమున
హైహయులూ,
తాలజంఘులూ,
శశిబిందులూ
దండయాత్ర
సలిపి
అసితుని
ఓడించిరి.
అంత
అసితుడు
ఇరువురు
భార్యలతో
హిమవత్పర్వతమును
చేరి
అక్కడ
భృగుప్రస్రవణము
అనే
ప్రదేశమున
నివాసము
చేసెను.
అతను
కొంత
కాలమునకు
కాలధర్మము
నొందెను.
అతను
కాయమును
వీడునప్పటికి
అతని
ఇరువురు
భార్యలూ
నవమాసములతో
నుండిరి.
వారు
ఆ
అరణ్యమున
ఒంటరి
జీవితములు
గడుపలేక
చెంతనేయున్న
భృగుమహర్షి
వంశీయులైన
చ్యవన
మహర్షి
ఆశ్రమమును
చేరిరి.
అతనికి
నమస్కరించి
వారి
బాధలను
విన్నవించుకొనిరి.
41
▾
Meaning
Keep
అంత
చ్యవనుడు
వారలపై
దయతలచి,
"అమ్మలారా!
భయపడకుడు.
ఇది
మీ
గృహము.
త్వరలోనే
మీ
గర్భమున
అతి
తేజోవంతుడు,
బలవంతుడు,
శ్రీమంతుడు
అయిన
శిశువు
కలుగగలడ"ని
ఆశీర్వదించెను.
అంత
కొంత
కాలమునకు
పెద్ద
భార్యకు
కొమారుడు
కలిగెను.
అతనే
సగరుడు,
అయోధ్యా
రాజ్యమునకు
చక్రవర్తి
అయ్యెను.
అతనికి
అశ్వమంజుడు
కలిగెను.
అశ్వమంజునకు
అంశుమంతుడు,
అంశుమంతునకు
దిలీపుడున్నూ,
దిలీపునకు
భగీరథుడున్నూ,
భగీరథునకు
కకుత్స్థుడున్నూ,
అతనికి
రఘువున్నూ,
రఘువునకు
ప్రవృద్ధుడున్నూ
పుట్టిరి.
అతనికి
సుదర్శనుడున్నూ,
సుదర్శనునకు
అగ్నివర్ణుడు,
అగ్నివర్ణునకు
శీఘ్రమగుడున్నూ,
శీఘ్రమగునకు
మరుదున్నూ,
మరునికి
ప్రశుశ్రుకుడున్నూ,
ప్రశుశ్రుకునికి
నహుషుడున్నూ,
అతనికి
నాభాగుడున్నూ,
నాభాగడికి
అజుడున్నూ
పుట్టిరి.
ఆ
అజమహారాజు
ప్రథమ
పుత్రుడే
దశరథ
మహారాజు.
ఇతని
పుత్రరత్నములే
శ్రీరామ
లక్ష్మణ
భరత
శత్రుఘ్నులు.
శివధనుస్సును
ఎత్తివిరిచిన
శ్రీరాముడు
ఈతని
జ్యేష్ఠపుత్రుడు.
రాజర్షీ!
వారిది
పరమ
శుద్ధ
వంశము.
ఈ
వంశమున
పుట్టినవారందరూ
తేజోవంతులు,
మహాధార్మికులు,
ఆధ్యాత్మిక
చిత్తులు,
వీరాగ్రేసరులు.
రామలక్ష్మణ
భరతశత్రుఘ్నులు
ఈ
వంశమునకు
కులదీపకులు.
ఇంతేకాక,
రాములతోపాటు
ఏతెంచి
బింబ
ప్రతిబింబముగా
మెలగిన
రామలక్ష్మణుల
కిరువురికీ
ఒకే
సమయంలో
మంగళ
కార్యము
జరిగిన
బాగుండునని
మా
ఉద్దేశ్యము.
తమకు
గల
ఇరువురు
బిడ్డలైన
సీత,
ఊర్మిళ
ఈ
రామలక్ష్మణులకు
తగినవారలు.
ఇందులకు
సంశయించక
ఈ
శుభకార్యమునకు
తగిన
నిర్ణయమును
గావించుడు"
అని
వసిష్ఠులవారు
అందరినీ
ఆశీర్వదించి
ఆసనముపై
కూర్చొనెను.
వసిష్ఠులవారు
ఇక్ష్వాకు
వంశ
కర్తలను
గురించి
చెప్పిన
తరువాత
జనకుడు
లేచి,
"ఓ
బ్రహ్మర్షీ!
కులీనుడు
కన్యాదానము
చేయ
తలపెట్టినప్పుడు
తన
వంశమును
గురించి
చెప్పుకొనవలసియున్నది
కదా!
మా
వంశమును
గురించి
నేనే
స్వయంగా
తెలుపతలంచితి.
ఇది
నాకు
పరమానందము.
మా
వంశమును
42
▾
Meaning
Keep
ఇతరులచేత
వర్ణింప
జేయుట
నాకంత
తృప్తికాదు.
ఆ
వంశమును
ఆ
వంశమునకు
సంబంధించిన
ఈ
దేహముతోనే
వర్ణించిన
నా
జన్మ
సార్థకము
కాగలదు.
ఇది
నా
వంశీయులకు
తెలుప
వలసిన
కృతజ్ఞతగా
భావించుచున్నాను.
అనుజ్ఞ
దయ
చేయుడు"
అని
ప్రార్థించెను.
వసిష్ఠులవారు
అనుజ్ఞ
ఇచ్చుటతోడనే,
"బ్రహ్మర్షీ!
గురువర్యులారా!
దశరథమహారాజా!
పూర్వము
నిమి
అను
చక్రవర్తి
పరమ
ధార్మికుడై
మహాబలవంతుడని
ప్రసిద్ధిగాంచెను.
అతనికి
మిథి
అను
పుత్రుడు
పుట్టెను.
ఆ
మిథియే
ఈ
మిథిలానగరమును
నిర్మించెను.
అతనే
ఈ
రాజ్యమునకు
ప్రథమ
మహారాజు.
అతని
పరిపాలన
ప్రజాహితమునందుకొనెను.
అతనికి
ఉదావనుడు
పుట్టెను.
ఉదావనునకు
నందివర్ధనుడు,
నందివర్ధనునకు
సుకేతుడు,
సుకేతునకు
దేవరాతుడు
పుట్టిరి.
దేవరాతుడు
మహాబలవంతుడనీ,
ధార్మికుడనీ,
రాజర్షి
అని
ప్రసిద్ధికెక్కెను.
ఆ
దేవరాతునకు
బృహద్రథుడు,
బృహద్రథునకు
మహావీరుడు
పుట్టిరి.
మహావీరుడు
నిజముగా
మహావీరుడే.
అతనికి
సుధృతి,
సుధృతికి
ధైర్యవంతుడు
అయిన
దృష్టకేతుడు,
దృష్టకేతునకు
హర్యశ్వుడూ,
అతనికి
మరువు,
మరువునకు
ప్రతీంధకుడు,
ప్రతీంధకునికి
కీర్తిరథుడు,
కీర్తిరథునకు
దేవమీధుడు,
అతనికి
విబుధుడు,
విబుధునికి
మహీధ్రకుడు,
మహీధ్రకునికి
కీర్తిరాతుడు,
అతనికి
మహారోముడూ,
మహారోమునికి
స్వర్ణరోముడూ,
స్వర్ణరోమునకు
హస్వరోముడూ
పుట్టిరి.
హస్వరోముడు
మహామేధావి,
మహాత్ముడు,
ధార్మికుడు.
అతనే
మా
తండ్రి.
అతని
జ్యేష్ఠపుత్రుడనని
చెప్పుకొనుటకు
నేనెంతయో
సంతసిల్లుచున్నాను.
నేనే
ఈ
మిథిలారాజ్యమును
పరిపాలించుచున్నా
నన్నది
నా
పూర్వీకుల
ధార్మిక
ఫలవిశేషమే
అని
చెప్పకతప్పదు.
ఇట్లుండ
నా
తమ్ముడైన
కుశధ్వజుడు
దేవసమానుడు.
అతనిని
నేను
సోదరభావమునకు
మించిన
భావముతో
స్నేహితునివలె
స్వాతంత్ర్యము
నిచ్చి
పెంచి
పెద్దవాణ్ణి
చేసితిని.
కొంతకాలము
జరిగిన
తరువాత,
సాంకాస్య
పట్టణమును
ఏలుచున్న
సుధన్వుడను
రాజు
మిథిలాపుర…
ముట్టడించెను.
నా
ఇంటిలోనున్న
శివధనుస్సును
తన
43
▾
Meaning
Keep
కివ్వమని
రాయబారము
పంపెను.
అందుకు
నేను
నిరాకరించితిని.
ఆ
కారణముచేత
మా
కిరువురికీ
ఘోరయుద్ధము
జరిగెను.
తత్కారణముగా
నేను
సుధన్వుణ్ణి
హతమార్చితిని.
అపుడు
సాంకాస్య
పట్టణము
నా
వశమగుటచేసి
ఆ
రాజ్యమునకు
నా
తమ్ముడైన
కుశధ్వజుణ్ణి
రాజుగా
చేసితిని.
ఆ
పట్టణము
ఇక్షుమతీ
నదీతీరమున
శోభాయమానముగానున్నది.
అది
దూరమునకు
పుష్పక
విమానమువలె
కనిపించును.
నా
తమ్ముడు
ధార్మికుడు.
అతనిప్పుడు
సాంకాస్య
పట్టణమును
పాలించుచున్నాడు.
అతని
నిప్పుడు
ఈ
వేడుకలలో
పాల్గొను
నిమిత్తము
రప్పించితిని.
బ్రహ్మర్షీ!
తాము
నా
ఇరువురు
కుమార్తెలను
రామ
లక్ష్మణులకిచ్చి
వివాహము
చేయమని
ఆజ్ఞాపించితిరి.
చాలా
సంతోషము.
సీత
దేవకన్యక
కనుక
అది
వీర్యశుల్క,
దానిని
రామచంద్రునికిచ్చి
వివాహము
చేయుటకు
నిర్ణయమయినది.
నా
రెండవ
బిడ్డ
ఊర్మిళను
లక్ష్మణునికిచ్చి
వివాహము
చేయుటకు
తమ
ఆజ్ఞను
శిరసావహించితిని.
కానీ
మరొక
విషయమును
మనవి
చేయనెంచితిని.
అదేమన,
"దశరథ
మహారాజా!
ఈనాడు
మఘానక్షత్రము.
రామలక్ష్మణులకు
వివాహము
జరుపుటకు
తమరు
నాందికి
సిద్ధము
కావలెను.
తమకు
నల్లురు
పుత్రరత్నములు.
ఒకే
అనుగ్రహముచే
కల్గినవారగుటచేత
మిగిలిన
ఇరువురు
అవివాహితులై
యుండుట
వారలకు
కొంత
అసంతృప్తి
కలిగించినటులగును.
కాన,
ఎల్లుండి
ఉత్తరఫల్గుణీ
నక్షత్రములో
మిగిలిన
భరత
శత్రుఘ్నులకు
నా
తమ్ముడైన
కుశధ్వజుని
కుమార్తెలయిన
మాందవి,
శ్రుతకీర్తులను
ఇచ్చి
వివాహము
జరుపవచ్చును.
అనుజ్ఞ
దయచేయుడ"ని
జనకుడు
కోరగనే
సభాజనులు,
"శుభం,
శుభం"
అని
కరతాళములు
మిన్నుముట్ట
గొట్టిరి.
జనక
మహారాజు
అందించిన
సలహాను
పురస్కరించుకొని
భరత
శత్రుఘ్నుల
వివాహముల
గూర్చి
వసిష్ఠ
వామదేవ
విశ్వామిత్రాదులు
కొంత
దీర్ఘముగా
ఆలోచించి,
దశరథుని
యొప్పించి
జనక
మహారాజుతో
ఈవిధముగా
తెలిపిరి:
44
▾
Meaning
Keep
"రాజా!
ఇక్ష్వాకు
విదేహ
వంశాలు
రెండునూ,
ఎవరునూ
ఊహించలేనంతటి
పవిత్రమైనవి.
ఈ
రెండు
వంశముల
గొప్పతనాన్ని
ఎవరూ
ఇంత
అంత
అని
వర్ణించలేరు.
ఈ
రెండు
వంశములకు
సరిసమానమైన
వంశములు
ఈ
జగత్తున
ఎందునూ
లేవనియే
మా
భావము.
ఈ
రెండు
వంశములవారికిన్నీ
వివాహ
రూపమయిన
ధర్మసంబంధము
ఏర్పడుచున్నది.
ఇది
ఎంతయో
సమంజసముగానూ,
వైభవముగానూ,
ఘనముగానూ,
పవిత్రముగానూ
ఉన్నది.
ఇంతియేకాక
వధూవరులు
సరిసమానమయిన
రూపలావణ్యులు.
ఓ
జనకరాజా!
మీ
తమ్ముడు
కుశధ్వజుడు,
ధర్మజ్ఞుడు.
ఆయన
కూడనూ
దశరథ
మహారాజుతో
సంబంధము
చేయుట
ఉచితము,
పరమానందము.
అతని
బిడ్డలైన
మాందవి,
శ్రుతకీర్తులను
మేము
భరత
శత్రుఘ్నులకు
చేసుకొనుటకు
సంసిద్ధులము.
ఈ
రెండు
వంశములూ
వియ్యమునంది
చుట్టరికముతో
కట్టుబడిపోవలెననియే
మా
కోరిక"
అని
వసిష్ఠ
విశ్వామిత్రులు
చెప్పిన
సమాధానమునకు
జనక
మహారాజు,
కుశధ్వజుడు
అమితానందముతో
మహాఋషులకు
నమస్కరించి,
"మా
పుణ్యముకొలది
మా
ఇరువురి
అన్నదమ్ములకు
ఇక్ష్వాకులతో
సంబంధము
చేయవలెనని
మహర్షులకు
సంకల్పము
కలుగుట
సామాన్య
విషయము
కాదు.
జన్మాంతర
పుణ్యవిశేషము
తోడుకాకున్న
మహర్షులకు
సంకల్పములు
కలుగవు.
తమ
ఆజ్ఞలను
మేమిరువురం
శిరసావహింతుము"
అని
కృతజ్ఞతాపూర్వకముగా
తెలుపగనే,
వసిష్ఠులవారు
లేచి,
"తిరిగి
ఎల్లండి,
ఎల్లండి
అను
వాయిదాలు
వేయక
రేపే
మంచి
ముహూర్తము
కనుక
నలుగురు
అన్నదమ్ములకు
ఒకేపరి
వివాహము
చేయుట
చాలా
మంచిద"ని
సలహా
ఇచ్చెను.
అంత
జనకుడు,
"మేము
ధన్యులము,
దశరథ
మహారాజు
ఏనాటినుండిగ…ు
శిష్యుడై
ఆజ్ఞలు
పాటించుచున్నాడు.
మేము
45
▾
Meaning
Keep
అన్నదమ్ములము
ఇరువురమూ
ఈనాటినుండియూ
తమ
ఆజ్ఞకు
బద్ధులగువారము.
కాన
మా
మువ్వురి
బాధ్యతలను
తామే
వహించి
ఏమి
చేయవలెనన్న
అవి
చేయుటకు
సంసిద్ధులము.
చేయించే
భారము
తమదే"
అని
చేతులు
కట్టుకొని
నిలబడెను.
దశరథుడు
లేచి,
"మిథిలాపతీ!
మీ
అన్నదమ్ముల
సద్గుణములను
వర్ణించలేను.
ఇంతమంది
మహర్షులను
రాజపుంగవులను,
ఇంతమంది
మహారాజులను,
ప్రజాకోటిని
మీరు
కాబట్టి
సత్కరించగలిగినారు.
నేను
ఇపుడే
విడిదికి
వెళ్లి
నాందీ
సమావర్తన
కర్మలను
యథావిధిగా
పూర్తి
చేయింతును.
సెలవింద"ని
కోరగనే
జనకుడు,
కుశధ్వజుడు
వారికి
వీడ్కోలు
చెప్పి
తమ
తమ
కార్యక్రమములకు
లోనికి
వెళ్లిరి.
దశరథ
మహారాజు
నాందీకార్యాదులు
శాస్త్రవిహితముగా
యొనర్చెను.
తెల్లవారి
నలుగురు
కుమారులచేతనూ
సమావర్తనకర్మ
చేయించెను.
అనేక
వేల
గోవులను
బంగారు
కొమ్ము
కుప్పీలతో
అలంకరించి,
పాలు
పిండుకొనువారలకు
మంచిపాత్రలను
సిద్ధ
పరిచి
కుమారులచేత
ఆ
పాత్రలను,
గోవులనూ
బ్రాహ్మణులకు
దానము
చేయించెను.
ఆ
సుందర
దర్శనము
కన్నులపండువగా
నుండెను.
మిథిలాపుర
జనులకు
నలుగురు
దిక్పాలకుల
మధ్య
ప్రసన్న
తేజోవంతముగా
విలసిల్లు
బ్రహ్మదేవునివలె
దశరథుడు
కనిపించెను.
ఇట్లు
గోదానము
జరుగుచుండగనే
కేకయ
రాజపుత్రుడయిన
యుధాజిత్
వేంచేసెను.
అతడు
కైక
సోదరుడు,
భరతుని
మేనమామ.
ఈ
వైభవములు
చూచి,
కుశల
ప్రశ్నలు
అడిగిన
తరువాత,
'మా
నాన్నగారు
మనుమని
చూడవలెనని
చాలా
కూతూహలపడుచున్నారు.
అందుకొరకై
నేనే
అయోధ్యకు
వచ్చితిని.
అక్కడ
రామకల్యాణ
వార్త
విని
ఇచ్చటికి
హుటాహుటిన
పరుగెత్తి
వచ్చితిని.
రామకల్యాణ
వార్త
నాన్నగారికి
తెలియదు.
రామకల్యాణం
చూచినట్లుగా,
తమరిని
దర్శించినట్లునూ,
మా
నాన్నగారి
కోరిక
తెలుపునట్లునూ
అన్నియూ
జరుగునని
తలంచి
నేను
మాత్రమే
కల్యాణమునకు
రాగల్గితిన"నెను.
అందులకు
దశరథ
మహారాజు
ఎంతయో
సంతసించెను.
46
▾
Meaning
Keep
ఆ
రాత్రి
దశరథ
మహారాజు
కొడుకులతోను,
బంధు
మిత్రాదులతోనూ
అనేకరకముల
ఆనంద
విషయములను
ముచ్చటించెను.
విడిదిలో
ఎవ్వరును
నిద్రించలేదు.
ఎప్పుడెప్పుడు
తెల్లవారునా,
మా
చిన్న
ప్రభువుల
కల్యాణము
మేమెపుడు
చూతుమా
అని
అమితోల్లాసముతో
ఎవరికి
వారు
తమ
ఇండ్లలో
పెండ్లిండ్లు
జరుగుచుండినటుల
భావించి
బ్రహ్మానందము
పొందుచుండిరి.
మరునాడు
ప్రభాత
కాలమున
సమస్త
కర్మలూ
ముగించుకొని
మహాఋషుల
వెంట
జనక
మహారాజు
యజ్ఞశాలకు
బయలుదేరెను.
రామలక్ష్మణ
భరతశత్రుఘ్నులు
మంగళ
స్నానములు
చేసి,
పీతాంబరములు
ధరించి,
తలపాగాలు
కట్టి,
తురాయిలు
వజ్రవైడూర్యములు
పొదిగింపబడిన
అనేక
ఆభరణములను
ధరించి,
దివినుండి
దిగివచ్చిన
దేవసుందరులవలె
తేజోవంతులై
ప్రకాశించుచూ
విజయము
అను
ముహూర్తములో
అనేక
మంగళవాద్యముల
ధ్వనులు
మిన్నుముట్టుచుండ
యజ్ఞశాలకు
నడచినారు.
వారివెంట
మంత్రులూ,
సామంతులూ,
పరివారమూ
పెండ్లికి
కావలసిన
సామగ్రితో,
ఆభరణములతో,
పీతాంబరములతో,
ధనరాసులతో
బయలుదేరిరి.
వారు
వీధివెంట
మంటపమునకు
వచ్చుచుండ,
మిథిలాపురజనులు
వీధులు
నిండి
రెప్పవాల్చక
వారలవైపు
చూచుచూ,
"ఆహా!
ఎంత
సుందరులు
వీరు!
నిజముగా
సామాన్య
మానవ
మాత్రులు
కారు,
దేవలోకమునుండి
అరుదెంచినారా!"
అన్నంత
ఆశ్చర్యమును
పొందిరి.
ఒకరితో
ఒకరు
గుసగుసలుపోయిరి.
"ఇంతటి
చక్కని
రాకొమారులను
మేమెపుడు
చూడలేద"ని
స్త్రీలు
అమితానందము
నొందిరి.
మిద్దెలు
కిటికీలు
వీధులూ
క్రిక్కిరిసిపోయెను.
ఇట్టి
సుందర
విగ్రహులు
మంటపమును
చేరిరి.
అంత
జనక
మహారాజు
మందహాసముతో
తన
తమ్ముడైన
కుశధ్వజునితో
వారి
పుత్రికా
రత్నములను
మంగళ
స్నానములు
చేయించుకొని,
పెండ్లి
కుమార్తెలుగా
తయారుచేసి,
మేలిముసుగులు
ధరింప
జేసి
వారి
వెనుక…
చుండ,
వారల
వెనుక
వేలాది
దాసీలు
పెండ్లికి
సంబంధించిన
ఫల
47
▾
Meaning
Keep
పుష్పాదులు,
పసుపుకుంకుమలు,
అక్షతలతో,
ఆభరణాలతో,
పీతాంబరాలతో
కదలివచ్చుచుండ
మిథిలాపురము
పూర్తి
కదలివచ్చినట్లుండెను.
నలుగురు
వధువులు
నాలుగు
దీపములవలె
వెలుగుచుండిరి.
ఒకవైపున
రామలక్ష్మణ
భరతశత్రుఘ్నులును,
మరొకవైపున
సీత,
ఊర్మిళ,
మాందవి,
శ్రుతకీర్తులును
పీఠభూములపై
ఆసీనులయిరి.
ఇరువురికి
మధ్య
మంచి
మల్లు
వస్త్రము
అడ్డుపట్టిరి.
అయోధ్యవాసులందరూ
దశరథ
మహారాజువైపునా,
మిథిలానగర
ప్రజలు
జనకునివైపునా
ఆసీనులైరి.
పెండ్లి
పందిరిని
అనేక
విలువైన
ఆభరణాదులతో
అలంకరించిరి.
అది
చూచుటకే
మిరుమిట్లు
గొల్పుచుండెను.
వచ్చినవారల
దృష్టి
పెండ్లి
పందిరిమీదనే
యుండెను.
అంత
ఆకర్షణీయముగా
శృంగారించిరి.
వేలాది
బంధుమిత్రులు
చేరిరి.
నిజముగా
ఆనాడు
మిథిలాపురికే
కల్యాణమన్నట్లు
తోచెను.
ఇంతలో
దశరథుడు
లేచి,
"ఇంక
ఆలస్యమెందుకు?"
అని
వసిష్ఠులవారితో
మనవి
చేయగా
జనకమహారాజు
చేతులు
జోడించుకొని
వసిష్ఠులవారిని
ప్రార్థించి,
"ఈ
కార్యము
తామే
చేయించవలెన"ని
యర్థించెను.
అంత
వసిష్ఠులవారు
విశ్వామిత్రుని,
శతానందుని
తన
వెంటపెట్టుకొని
పండితుల
వేదమంత్రములు
మిన్నుముట్టుచుండ
అగ్నివేదిని
ఏర్పరచిరి.
గంధ
పుష్పాలతో
నున్న
సువర్ణపాళికలను,
మొక్కలున్న
అడుగులేని
పాత్రలను,
మొలకలు
ఎత్తిన
మూకుళ్ళను,
ధూపాలను,
హోమము
చేసే
స్రుక్కువాలను,
అర్ఘ్యజల
పాత్రలను,
పేలాలున్న
పాత్రలను
వేదికచుట్టూ
చక్కగా
అమర్పింపజేసినారు.
వేదిక
మధ్యభాగమున
అగ్నిహోత్రము
నుంచినారు.
హెచ్చుతగ్గులు
లేకుండా
సరిసమానముగానున్న
దర్భలను
యథాశాస్త్రముగా
సమంత్రకముగా
పరచినారు.
వధూవరుల
అభ్యుదయముకోసము
వైదిక
మంత్రాలతో
హోమము
చేయసాగినారు.
ఒకదానిపై
ఒకటి
చేయించవలసిన
వేదవిహిత
కర్మలు
సక్రమముగా
చేయించి
కంకణముల
కట్టించినారు.
48
▾
Meaning
Keep
కన్యాదానమునకై
తగిన
ఏర్పాట్లు
చేసి
జనక
మహారాజుగారిని
వసిష్ఠులవారు
ఆహ్వానించగా
జనకుడు
సర్వాభరణధారుడై
హోమవేదికకు
వచ్చెను.
అంత
వసిష్ఠులవారి
ఆజ్ఞానుసారము
సీత
చేతులు
రాముల
దోసిట
ఉంచి
నారికేళము
హస్తమునందుంచి
క్షీరమును
విడుచుచూ
జనక
మహారాజు
నేత్రముల
నుండి
ఆనందబాష్పములు
కార్చుచూ,
"రామా!
ఇదిగో
సీత.
నా
కూతురు.
ఇక
నీకు
సహధర్మచారిణి.
సమ్మతించవలెను.
నీకు
శుభము.
నీ
చేతితో
ఈమె
చేయి
పట్టుకో.
ఈమె
మహాగుణవంతురాలు.
ఇకపై
నీవెంట
నీ
నీడవలెనే
తిరుగుతుంది"
అంటూ
రాముని
చేతిలో
సమంత్రకముగా
నీరు
వదలినారు.
జనకుడు
మంత్రోదకాలతో
సీతను
రామునికి
అప్పజెప్పెను.
తిరిగి
లక్ష్మణుని
చెంతకు
వచ్చి,
"ఓ
లక్ష్మణా!
నీకు
ఈ
ఊర్మిళను
ఇచ్చుచున్నాను.
అంగీకరింపుము"
అని
మంత్రోదకాలతో
ఊర్మిళను
లక్ష్మణునకు
అప్పజెప్పెను.
భరతుని
దగ్గరకు
వచ్చి,
అక్కడకూడనూ
మంత్రోదకాలతో
మాందవిని
భరతునకు
అప్పజెప్పెను.
తిరిగి
శత్రుఘ్నుని
దగ్గరచేరి
మంత్రోదకాలతో
శ్రుతకీర్తిని
అప్పజెప్పెను.
తదుపరి
చేయవలసిన
పద్ధతులు
పండితులు
చేసిరి.
ఆ
మంటప
మధ్యస్థానమున
జనకుడు
మెరయుచూ
నిల్చి,
"ఓ
సౌమ్యులారా!
మా
కూతుళ్ళు
మీకు
ఇల్లాండ్రు
అవుతున్నారు.
ముహూర్తానికి
ఆలస్యము
లేదు"
అని
అనుచుండగనే
వసిష్ఠులవారి
అనుమతితో
ఆ
నల్గురు
అన్నదమ్ములూ
ఆ
నల్గురు
అక్కచెల్లెండ్ర
చేతులూ
పట్టుకొని
అగ్నిహోత్రునికి
ప్రదక్షిణము
చేసి
తదుపరి
జనక
మహారాజునకు,
మహర్షులకు
ప్రదక్షిణ
చేసి
నమస్కరించిరి.
వారు
నమస్కరించుచుండగా
పుష్పవర్షము
కురిసెను.
మంగళ
వాద్యములు
మ్రోగెను.
సభాసదులు
అక్షతలు
జల్లిరి.
మిన్నుముట్టునట్లు
శుభం
శుభం
అను
శబ్దము
కర్ణానందముగా
మ్రోగెను.
దేవదుందుభులు
మ్రోగెను.
అప్సరసలు
పాడిరి.
దాసీలు
గౌరీ
కల్యాణమే
అను
మంగళ
గీతమును
వివిధ
స్వరములతో
ఇంపుగా
పాడదొడగిరి.
49
▾
Meaning
Keep
నలుగురు
కొమరులు
తమతమ
సతులతోకూడి
సభాసదులకు
వందనమొనర్చిరి.
సభాసదులు
"మంగళం,
మంగళమా"ని
పలికిరి.
తేజోవంతులైన
ఆ
నలుగురు
తమ
తమ
సతుల
హస్తములను
పట్టుకొని,
విడిదికి
బయలుదేరుముందు
పరదాలోనున్న
తమ
తల్లులకు
నమస్కరించుటకై
లోనికి
వెళ్లి
వారల
ఆశీర్వాదములు
అందుకొని
విడిది
చేరిరి.
నాటినుండి
మూడుదినములు
నిత్యమూ
ఏదో
ఒక
వైభవము
జరుపుతూ
అయోధ్యనుండి
వచ్చిన
వారలకు
మిథిలాపురవాసులకు
రాత్రి,
పగలను
భేదము
తెలియక
పోవునట్లు
చేసిరి.
పెండ్లి
జరిగిన
మరుదినము
విశ్వామిత్రులవారు
దశరథుని
దగ్గరకు
వెళ్లి
తాము
సంకల్పించిన
కార్యము
అమితానందముగా
పూర్తి
అయినదని
తెలిపి,
రామలక్ష్మణ
భరత
శత్రుఘ్నులను
దగ్గరకు
చేర్చి
శిరస్సులను
ముద్దాడి,
ఆశీర్వదించి,
తానిక
హిమాలయమునకు
వెళ్లుదు
నని
తెలుపగా,
రామలక్ష్మణ
భరత
శత్రుఘ్నులు
నమస్కరించిరి.
విశ్వామిత్రుడు
జనక
మహారాజు
చెంతకు
వెళ్లి
తమ
కార్యము
దిగ్విజయముగా
జరిగినదని
తెలిపి,
జనకుని,
సీత,
ఊర్మిళ,
మాండవి,
శ్రుతకీర్తులను
ఆశీర్వదించి,
తానిక
హిమాలయమునకు
వెళ్లుచున్నానని
తెలుపగా,
దశరథ
జనకాదులు
విశ్వామిత్రులవారిని
వీడలేక
వీడలేక
వందనములు
సలిపి,
అతనిని
వీడ్కొలిపిరి.
మూడవ
దినము
దశరథుని
ఇష్టప్రకారము,
తాము
అయోధ్యకు
పోవలెనను
సంకల్పమును
జనకునకు
తెలుపగా
జనకుడు
అడ్డుచెప్పక
వారల
ప్రయాణమునకు
తగిన
ఏర్పాట్లు
చేసి
తమ
కూతుళ్ళ
వెంట
వెళ్ళ
దాస,
దాసీలను,
వారల
సామగ్రులను,
అనేక
రథములలో
ఏర్పరచెను.
ఏనుగులు,
రథములు,
గుఱ్ఱములు,
గోవులు
అనేకముగా
తమ
బిడ్డలకు
బహుమతులుగా
ఇచ్చెను.
అల్లుండ్రకు
మహామహా
విలువైన
ఆభరణములనూ,
రథాలను
ఇచ్చెను.
దాసీలకు
పది
సంవత్సరములకు
సరిపడు
వస్త్రములు,
ఆభరణములు,
అనేక
రకములైన
నిత్యానుకూలములకు
వినియోగించు
సామగ్రులను
ఇచ్చెను.
50
▾
Meaning
Keep
మూడవ
దినము
తెల్లవారుసరికి
రథములు
సిద్ధమాయెను.
మిథిలా
పురమున
అంతఃపురమేకాక,
పురస్త్రీలందరును
కంటినీరు
కార్చిరి.
సీతను,
ఊర్మిళను
వీడలేక
కొంతమంది
వృద్ధదాసీలు,
దాదులు
కన్నీరు
మున్నీరుగా
ఏడ్చిరి.
సీత,
ఊర్మిళ,
మాండవి,
శ్రుతకీర్తుల
తల్లులు
అల్లుండ్ర
చేతులు
పట్టుకొని
తమ
బిడ్డలను
అతి
జాగ్రత్తగా
చూచుకొమ్మని,
"ఎట్టి
కష్టములు
ఎరుగరు"
అని
పరిపరి
విధముల
తెలిపి,
కన్నులు
వాయునట్లుగా
ఏడ్చి
రథముల
దగ్గరకు
బురకాలతో
వచ్చి
వారిని
రథములపై
ఎక్కించిరి.
మూడు
దినముల
పూర్వము
ఎంత
వైభవమో
ఆనాడు
అంత
విచారము.
రథములు
ఒకదాని
తరువాత
ఒకటి
కదలెను.
సీతను
వీడలేక
ఒకవైపున
దుఃఖము
పొరలి
వచ్చుచున్ననూ,
తాను
నిగ్రహించుకొనుటకు
అనేక
ప్రయత్నములు
జరుపుచూ,
వారిని
సాగనంపుటకు
జనకుడు
దశరథమహారాజుతో
కొంతదూరము
వెళ్లెను.
ఇట్లు
వెళ్లుచున్నంతసేపూ
జనకుడు
తన
కుమార్తెయొక్క
గుణగణములనే
వర్ణించుచూ,
కంటినీరు
కార్చుచూ,
బాగుగా
చూచుకొమ్మని,
వారి
క్షేమ
సమాచారములు
మీదమీద
తెలుపుమని
అనేక
పర్యాయములు
తెలుపుతూ
వెళ్లుచుండెను.
అందుకు
దశరథుడు
కూడను,
అనేక
శాంతవచనములు
తెలుపుతూ,
"జనకా!
మా
ఇంటిలో
ఆడబిడ్డలు
లేని
కారణంగా
వారే
మా
బిడ్డలుగా
భావింతుము.
బిడ్డలయిననూ,
కోడండ్లయిననూ
వారే
మాకు.
వారి
క్షేమానందములకు
ఎట్టి
కొరతయూ
నుండదు.
మీరు
విచారించక
వెనుకకు
వెళ్లుడ"ని
అనేకవిధముల
చెప్పి,
రథములాపిరి.
అంత
జనకుడు
తన
బిడ్డ,
అల్లుడునున్న
వేరొక
రథము
దగ్గరకు
వెళ్లి,
సీతను
అనేకరకముల
నోదార్చి
ధైర్య
వచనములు
తెలిపి,
ధర్మ
సూక్తులు
గుర్తుచేసి,
అత్తమామల
దగ్గర,
భర్త
బావమరదుల
దగ్గర,
నౌకర్ల
దగ్గర,
ఎట్లు
మెలగవలెనో
మరొకపరి
జ్ఞాపకముచేసి
వారల
నమస్కారములు
అందుకొని,
తను
వారల
శిరస్సులను
ముద్దాడి
ఆశీర్వదించి
వెనుకకు
తిరుగలేక
బోరున
ఏడ్చి
రథమున
కూర్చొనెను.
51
▾
Meaning
Keep
వారి
రథములు
అటూ,
జనకుని
రథము
ఇటూ
శరవేగముతో
బయలుదేరెను.
జనకుడు
మిథిలకు
చేరుకొనెను.
అక్కడ
నగరమే
చిన్నబోయియుండెను.
అంతఃపురమునకు
చేరగనే
నిర్జన
ప్రదేశముగా
కళాహీనమై,
ప్రశాంతమై
యుండుటను
చూచి,
తాను
ఉండలేకపోయినాడు.
శతానందుని,
మంత్రులనూ
పిలిపించి,
ఏదో
ప్రొద్దుపోవు
మాటలను,
ఆ
పొంగివచ్చు
పుత్రికా
వియోగమును
శాంతపరచు
కొనుటకై
అనేక
విచారములు
జరిపెను.
మధ్యమధ్య
ఎక్కడో
యోచించుచూ,
ఏవో
జవాబులు
చెప్పుచుండుట
చూచి
మంత్రి,
"రాజా!
సీతా
వియోగమున
తమరికి
తీరని
విచారముగా
ఉండినట్లు
తోచుచున్నది.
ప్రతి
తండ్రికి
ఇది
తప్పునది
కాదు.
దానము
చేసిన
తరువాత,
మనము
క్రమక్రమేణా
ఆ
సంబంధమును
కొంతకొంత
నిగ్రహించుకొనవలసి
వస్తుంది.
ఈ
విషయము
తమకు
తెలియనిదికాదు.
అందున
సీతాదేవి
అందరివలె
సామాన్యమైన
బాలిక
కాదు.
ఆమె
దేవతాపుత్రిక.
ఆమె
ఎడబాటు
మరింత
అధిక
విచారమును
కలిగించును.
మహారాజా!
మన
బిడ్డలేకాక
అల్లుండ్రుకూడనూ
సామాన్యమైన
పిల్లలు
కారు.
వారుకూడనూ
సాక్షాత్
దేవలోకము
నుండి
దిగివచ్చినటుల
కనిపించుచున్నారని
మన
నగరమునందు
ఆబాలవృద్ధులు
అనుకొనుట
నేనే
స్వయముగా
వింటిని.
ఇట్టి
ఈడూ
జోడూ,
వంశము,
సంప్రదాయములు
కల
సంబంధములు
దొరుకుట,
కుదురుట
మహా
ఆశ్చర్యము.
అందరికీ
ఇట్లు
జరుగదు.
మన
బిడ్డలు
ఎట్టి
కొరతయూ
లేక
సుఖింతురు.
శుభముగా
అభివృద్ధి
గాంతురు"
అని
గడచిన
పెండ్లి
వైభవాలనే
తెలుపుతూ
జనకునకు
కొంత
శాంత
వచనములతో
కాలమును
గడుపునటుల
చేయదొడగెను.
Previous
←
Protection of the Yajña
Next
Paraśurāma
→