Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · Paraśurāma
Rāma Kathā Rasa Vāhini
›
Part One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
దశరథుడు
కొడుకులతో,
కోడండ్లతో,
మహర్షులతో,
చతురంగ
బలాలతో
సాగి
పోవుచుండగా
కంటికి
ఏవో
దుర్నిమిత్తాలు
తోచుచూ
వచ్చెను.
అంత
దశరథుడు
వసిష్ఠులవారితో,
"స్వామీ!
ఏమిటీ
వింత?
ఆకాశమున
పక్షులు
తిరుగుచూ
ఘోరముగా
కూయుచున్నవి.
భూమిపైగల
జంతువులు
మనకు
ప్రదక్షిణముగా
తిరుగుచున్నవి.
జంతువులు
రథములకు
ప్రదక్షిణగా
తిరుగకూడదు
కదా!
దీనికి
కారణమేమైయుండును?
నాకేమో
దిగులు
కలుగుచున్నది"
అని
తెలుపగనే
వసిష్ఠులవారు
కొంత
దివ్యదృష్టిని
వినియోగించి,
"రాజా!
మనకు
రాబోవు
ఒక
భయంకరావస్థ
నిమిత్తమై
ఆకసమున
పక్షులు
అట్లు
భయంకర
శబ్దములు
చేయుచున్నవి.
అయితే,
భూమిపై
మనకు
ప్రదక్షిణ
చేయుచున్న
మృగములను
పట్టిచూచిన
ఆ
వచ్చు
కీడు
నివారణకు
చిహ్నముగా
నున్నది.
కావున
మీరేమాత్రము
విచారించకండి"
అని
ధైర్యమును
తెలుపుచుండగా,
భయంకరమైన
గాలి
వీచెను.
చూచుచుండగనే
పెద్దపెద్ద
వృక్షములు
నేలకూలెను.
పర్వతములు
దొర్లిపోవ
దొడగెను.
భూమే
బ్రద్దలగుచున్నదా,
అన్నట్లు
పిడుగువంటి
శబ్దములు
వినపడదొడగెను.
ఒకరి
రథములు
మరొకరికి
కనిపించక
దుమ్మురేగెను.
గుఱ్ఱములు,
ఏనుగులు
బెదురుకొన
మొదలిడెను.
సైనికులు
మూర్ఛనొందిరి,
కొందరు
స్తంభించిపోయిరి.
దశరథుడూ,
నలుగురు
కొడుకులూ,
వసిష్ఠులవారూ
తప్ప
మిగిలినవారందరూ
విచేతనులు
అయిపోయిరి.
భూమ్యాకాశములొక్కటిగా
చీకటి
క్రమ్ముకొనెను.
ఆ
చీకటిలో
మిణుమిట్లు
2
▾
Meaning
Keep
గొలుపునట్లు
కాంతులు
కంటికి
కనిపించజొచ్చెను.
భయంకరమైన
నేత్రములతో
ఉగ్రుడైనట్టి
ఒక
వ్యక్తి
వారల
కంటి
యెదుట
నిలచెను.
అతని
తలనిండా
దట్టమైన
వెంట్రుకలు,
భుజములమీద
గండ్రగొడ్డలి
వ్రేలాడుచుండెను.
మెరపువలె
మెరయుచున్న
బాణములు,
విల్లూ
భుజమునకు
తగిలియుండెను.
అతడు
త్రిపురాసురుని
సంహారమునకు
వెళ్లుచున్న
ఫాలాక్షుని
పగిది
వారికి
కనిపించెను.
ఇంతలో
వసిష్ఠులవారు
అతను
పరశు
రాముడని
కనిపెట్టి,
అతని
కోపతాపములు
ఇంతకు
పూర్వమే
శాంతించెను
కదా!
శత్రువులందరినీ
హతమార్చి,
శాంతిల్లిన
పరశురామునకు
తిరిగి
ఈనాడు
కోపము
రావటమునకు
కారణమేమని
యోచించెను.
అర్ఘ్యాదులు
తీసికొనిపోయి
అతని
యెదుట
నిలచి,
"ఓ
రామా!
భార్గవ
రామా!"
అని
మనోహరముగా
సంభాషణలు
సలిపి
అర్ఘ్యమును
ఇచ్చెను.
అతను
ఒక
వంక
అర్ఘ్యాదులను
అందుకొంటూ,
చింతనిప్పులవలె
మెరయుచున్న
కన్నులతో
రామునివైపు
చూడ
దొడగెను.
అంత
శ్రీరామచంద్రుడు
చిరునవ్వులతో
అతనిని
చూడగనే
పరశురాముడు
మరింత
మండిపడి,
"ఓ
దాశరథీ!
నీ
పరాక్రమములు
వేనోళ్ళ
వింటిని.
నీవు
శివధనుస్సు
నవలీలగా
త్రుంచిన
విషయమును
కూడను
వింటిని.
అవి
అన్నియూ
విన్నవేకాని
కన్నవి
కావు.
ఈనాడు
నీ
పరాక్రమాన్ని
స్వయముగా
చూడగోరే
ఇందు
వచ్చితిని.
నేనొక
పవిత్రమైన
విల్లును
గొనివచ్చితిని.
అది
మా
తండ్రి
అయిన
జమదగ్నిది.
దీనికి
బాణము
నెక్కించి
నీ
బలమును
చూపుము.
లేకున్న
నాతో
పోరాడుటకు
రమ్ము"
అని
మహోద్రేకమగు
మాటలను
ఉపయోగపెట్టెను.
అందులకు
రాముడు
ఏమాత్రము
జంకక,
చిరునవ్వులతో,
"ఓ
భార్గవ
రామా!
నీకు
క్షత్రియుల
మీదనున్న
కోపము
ఎప్పుడో
తీరిపోయినదని
తలంచితిని,
వింటిని.
తిరిగి
ఈ
విపరీతమేమిటి?
ఈ
వికారములేమిటి?"
అని
అనుచుండగనే
దశరథుడు
దీనుడై,
"భార్గవా!
నీవు
బ్రాహ్మణుడవు,
మహా
యశస్వివి,
నా
పుత్రులు
పసిపాపలు.
వారలపై
ఈవిధముగా
నిష్కారణ
3
▾
Meaning
Keep
ద్వేషమును
పూనుట
నీబోటి
ఉత్తమ
వంశీయులకు
ధర్మము
కాదు.
మీ
వంశీయులు
నిరంతర
వేదాధ్యయనము
చేయుచూ,
చాంద్రాయణ
వ్రతములు
సల్పుచుండెడివారు.
"శస్త్రాస్త్రాలు
నేటినుండి
వదలిపెట్టుదును,
నా
మనోభీష్టము
తీరినది"
అని
దేవేంద్రుని
యెదుట
ప్రతిజ్ఞచేసి,
ధర్మపరాయణుడవై,
ప్రశాంత
చిత్తుడవై
ఈ
వసుంధరను
కాశ్యపునకు
దానము
చేసితివి.
మహేంద్ర
పర్వతముపై
తపస్సు
చేయుచున్న
నీవు
ఇప్పుడు
మా
సర్వనాశనమునకు
సంసిద్ధుడ
వగుట
నీ
మాటలకే
విరుద్ధము.
మాట
తప్పుట
మహాపాపము
కదా!
మాట
తప్పిన
పిదప
ఎన్ని
తపస్సులు
చేసినను
ఏమి
ఫలము!
సత్యమునకు
మించిన
దైవము
వేరులేదు
కదా!
ఒక్క
రామునితో
మాత్రమే
యుద్ధము
చేయుదునంటున్నావు.
ఆ
ఒక్క
రామునకు
ఏ
అపాయము
కలిగిననూ
మా
వంశం
నాశనమగును.
మేమందరం
మరుక్షణముననే
ప్రాణములు
వీడుదుము.
ఇన్ని
ప్రాణములు
తీయుట
నీబోటి
బ్రాహ్మణులకు
పరమ
విరుద్ధమేకాక
మహాపాపము"
అని
చెప్పుచుండ,
పరశురాముడు
దశరథుని
మాటలను
లక్ష్యము
చేయక,
వినిపించుకొనక
రామునివైపు
చూచుచూ,
"రామా!
నీవు
విరిచిన
విల్లు
నేనిప్పుడు
తెచ్చిన
విల్లు
రెండునూ
దేవలోకములోనివే.
రెండునూ
మహాపవిత్ర
మైనవే.
వీటిని
రెండింటినీ
విశ్వకర్మ
నిర్మించెను.
ఒకదానిని
త్రిపురాసుర
సంహారమునకు,
మరొకటి,
విష్ణుమూర్తి
చెంత
నుంచుకొనెను.
త్రిపురాసుర
సంహారము
అయిన
తరువాత
శివుడు
ఆ
వింటిని
బాణముతోకూడ
దేవతలచేత
విదేహరాజు
అయిన
దేవరాతునకు
ఇప్పించెను.
ఏ
కార్య
నిమిత్తమై
ఆ
వింటిని
నిర్మించెనో
ఆ
కార్యము
జరిగిపోయినందున
బహుశః
ఆ
వింటిలోని
బలము
క్షీణించియుండ
వచ్చును.
అట్టి
బలహీనమైన
వింటిని
ఎక్కుపెట్టుట
ధీరుని
లక్షణముకాదు.
పవిత్రమై
ఇంకనూ
దీనికి
నియమించిన
కార్యము
పూర్తికాలేదు
కనుక,
ఇది
పూర్ణశక్తివంతమైనదై
యున్నందున
దీనిని
ఎక్కుపెట్టి
చూడుము.
అప్పుడు
నీ
పురుషార్థమును
నీవు
నిరూపించుకొన్నవాడవు
కాగలవు.
అంతేకాని,
శివ
ధనుస్సును
త్రుంచితినంచు
గర్వపడబోకు.
ఇదిగో
దీనిని
త్రుంచి
నీ
పేరు
నిలబెట్టుకొనుము"
అన్నాడు.
"ఈ
విష్ణువిల్లు
నాకెట్లు
వచ్చినదని
4
▾
Meaning
Keep
సందేహింతువేమో?
దీనిని
విష్ణుమూర్తి
ఋషీక
మహర్షికి
నిక్షేపముగా
ఇచ్చెను.
ఆ
దివ్య
తేజస్వి
దీనిని
ఆయన
కొమారుడైన
జమదగ్నికి
ఇచ్చెను.
ఆ
జమదగ్ని
నా
తండ్రి.
అతను
మహాతపస్సంపన్నుడు,
ప్రతీకారము
ఎరుగని
మహా
పవిత్రుడు.
అస్త్రసన్యాసము
చేసిన
మా
తండ్రిని
కార్తవీర్యార్జునుడు
తామసబుద్ధితో
చంపివేసెను.
అంత
దారుణముగా
ఇంతవరకూ
ఎవ్వరూ
ఎప్పుడూ
చేయలేదు,
చంపలేదు.
అట్టి
అధర్మ
ప్రవర్తనకు,
రాక్షస
కృత్యమునకు
పాల్పడు
రాజును
దయతలచి
విడువరాదనియూ
అతనే
కాక
అట్టి
అధర్మములకు
పాల్పడు
ప్రతి
రాజును
తలనెత్తనీయక
హతమార్చ
వలెనను
ప్రతిజ్ఞపట్టి
ఆనాటినుండియూ
అధర్మ
అన్యాయ
క్రూరత్వములకు
మరిగిన
రాజులను
చీల్చి
చెండాడవలెనని
ఈ
పవిత్ర
విల్లును,
ఈ
ఆయుధమును
పట్టి
బయలుదేరితిని.
అనేకమంది
దుర్మార్గపు
రాజులను
హతమార్చితిని.
ఈ
భూలోకమునే
వశము
చేసుకొంటిని.
అంతటితో
నా
తండ్రిని
చంపిన
కోపము
కొంత
శాంతించి
క్షత్రియులపై
దండెత్తుట
మాని
నేనొక
యజ్ఞమును
ప్రారంభించితిని.
ఆ
యజ్ఞమున
మహాత్ముడూ,
పుణ్యకర్ముడూ
అయిన
కశ్యపుని
పిలిపించి
అతనికి
నేను
సాధించిన
భూభాగాన్ని
దక్షిణగా
ఇచ్చితిని.
అప్పటినుండి
మహేంద్ర
పర్వతముపై
ప్రశాంతమైన
కాలమును
ప్రసన్న
హృదయుడనై
అనుభవించుచున్నాను.
అయితే,
అట్టి
అస్త్రసన్యాసము
గావించిన
నీవు
తిరిగి
ఈ
అస్త్రప్రయోగమునకు
ఎందుకు
కాలిడుచున్నావని
మీ
తండ్రిగారు
ప్రశ్నించిన
ప్రశ్నకు
సమాధానమును
తెలిపెదను,
వినుము.
రామా!
నీవు
శివధనుస్సును
విరుగగొట్టితివన్న
వార్త
విని
నీ
శక్తి
సామర్థ్యములు
గొప్పవిగనే
భావించి
బ్రహ్మసృష్టి
అయిన
ఈ
రెండు
అస్త్రములలో
ఒకటి
శిథిలమై
మరొకటి
యుండుటయును,
అదియునూ
అస్త్రసన్యాసము
గావించిన
నా
దగ్గరుండియూ
ప్రయోజనము
లేదనియునూ
తలంచి
దీనిని
త్రుంచుటయో
లేక
నాతో
యుద్ధముచేసి
నీ
స్వాధీనము
చేసికొనుటయో
జరిగిన
మంచిదని
భావించి
కాలమునకు
వేచియుంటిని.
అది
ఈనాడు
ప్రాప్తించినది.
5
▾
Meaning
Keep
ప్రాప్తించిన
కాలమును
సద్వినియోగము
చేయవలెనుకాని,
దానిని
నిరుపయోగము
చేయరాదు.
యుద్ధమొక
సద్వినియోగమా
అని
తలంతువేమో?
లోకకల్యాణము
నిమిత్తము
దుర్మార్గాన్ని
అణగద్రొక్కి
సత్పదార్థాన్ని
నిలబెట్టుటలో
దీని
అంతరార్థము
కలదు.
కనుక,
బాహ్యయుద్ధము
మాత్రమే
చూచి
హింసగా
భావించరాదు.
దీని
ఉద్దేశమును
లక్ష్యమందుంచుకొన్న
బాహ్యక్రియలు
అర్థము
కాగలవు.
కత్తికి
పదును
కావాలన్న
రాతిపై
వేసి
నూరవలెనుకదా!
నూరుటలో
కత్తికి
శ్రమయని
తలంచముకదా!
దేహమునకు
బలము
రావాలన్న
ఆహారమును
కఠినమైన
దంతముల
మధ్యవేసి
నమలవలసివచ్చును.
అంతమాత్రముచేత
ఆ
పదార్థమును
బాధించుచున్నామని
భావించుట
భావ్యము
కాదు.
అటులనే
దేశమును
దేహమునకు
సాత్వికధర్మమును
బలము
చేకూర్చవలెనన్న
ఈవిధమైన
మర్దన
సలుపవలసివచ్చును.
ఇది
మార్గమధ్యము.
మాటలతో
కాలము
గడుపుటకంటె
క్రియలోకి
దిగుట
అత్యవసరము.
ఇదిగో,
ఈ
వింటిని
విరుతువా
లేక
నాతో
ముష్టియుద్ధము
చేతువా?"
అని
ఆ
వింటిని
అందించుటకు
పూనుకొనెను.
అంత
లక్ష్మణుడు
పరశురాముని
మాటలకు
మండిపడి
ఏమో
మాటలాడుటకు
ప్రయత్నించ,
రాముడు
అతనిని
వారించి
"ఇది
నీకు
సంబంధించినది
కాదు.
నన్ను
అడుగు
ప్రశ్నలకు
నేనే
సమాధానము
చెప్పవలెను.
నీవట్లు
అడ్డు
తిరుగుట
క్రమపద్ధతికి
విరుద్ధముగా
నుండును"
అని
మంచిమాటలతో
లక్ష్మణుని
శాంతపరచెను.
కానీ,
పరశురాముడు
వెగటుగా
నవ్వుచూ
రాముని
అనేకరకముల
పరిహాసము
జేయుచుండ
లక్ష్మణుడు
ఓర్చుకొనలేక
పోయినాడు.
అంత
లక్ష్మణుడు,
"ఓ
భార్గవా!
శివధనుస్సును
విరిచిన
రామునకు
ఇదొక
లెక్కకాదు.
దీనిని
త్రుంచుటకు
రాముడే
పూనుకొననక్కరలేదు.
బ్రాహ్మణాస్త్రము
దర్భతో
సమానము.
దీనిని
నేనే
అవలీలగా
త్రుంచగలను.
ఈ
చిన్నపనికి
శ్రీరాముడక్కరలేదు"
అని
రోషముతో
పలికిన
పలుకులు
పరశురాముని
మరింత
మండింపజేసెను.
6
▾
Meaning
Keep
కాని,
రాముడు
శాంతముతో
చిరునవ్వుతో
లక్ష్మణుని
మందలించి
శాంతపరచెను.
పరశురాము
డెంత
క్రోధమును
ధరించెనో
రాముడంత
శాంతమును
వహించుచూ
వచ్చెను.
కడకు
పరశు
రాముడు
శ్రుతిమించి
పలుకుటకు
పూనుకొనగనే
దశరథుడు
కొంత
అదరెను.
మిగిలిన
పండితులు,
చతురంగబల
సైన్యము
భయపడిరి.
దాస
దాసీలు
తలలు
దాచుకొనిరి.
అయితే,
సీతాదేవి
దానిని
వినోదముగా
చూడదొడగెనేగాని
ఆమె
ఏమాత్రమూ
బెదరలేదు,
అదరలేదు.
"నా
పురుష
సింహము
చెంత
ఈ
గుంటనక్కలెంత!"
అని
ఆమె
మహాధైర్యముతో
ఊర్మిళా
మాండవి
శ్రుతకీర్తులకు
ధైర్యము
చెప్పుచుండెను.
భరతశత్రుఘ్నులు
కూడనూ
రాముడు
లక్ష్మణుని
మందలించుట
చూచి
యూరకుండిరి.
లేకుండిన
వారు
కూడనూ
కోపోద్రేకులయి
రామాజ్ఞకు
వేచియుండిరి.
వసిష్ఠులవారు
త్రికాల
జ్ఞానులు
కనుక
విషయము
తెలిసి
ఇది
భగవత్
లీలానాటకమని
తనలో
తాను
భావించి
ఏమీ
మాటాడక,
వెరువక
చూచుచుండిరి.
రామచంద్రుడు
శాంతవచస్కుడై,
"పరశురామా!
నీవు
బ్రాహ్మణుడవు.
అందునా
క్షత్రియులకు
పూజ్య
పాదులు
అయిన
విశ్వామిత్రులవారికి
బంధువుడవు.
అట్టి
బ్రాహ్మణుని
చంపుట
మంచిది
కాదు.
ఈ
పవిత్ర
అస్త్రమును
నీపై
విడచుట
మంచిదికాదు.
అంతేకాక,
ఈ
బాణము
దేవలోకముదనియును,
ఇది
శత్రువుల
నందరినీ
జయించినదనియును,
ఎవరి
బలదర్పాలను
అయినా
నాశనము
చేసివేయునదనియు
నీవే
చెప్పితివి.
అట్టి
పవిత్ర
బాణమును
నేలపాలు
చేయుట
వ్యర్థము
కాగలదు.
కాన
ఈ
బాణముతో
నీ
పాద
గమనశక్తిని
బంధించవలెనో,
లేక
నీవు
తపోబలముతో
సంపాదించిన
పుణ్యలోక
ప్రాప్తిని
హరించవలెనో
నీవే
తెలుపుమ"నెను.
ఈ
మాటలు
వినగనే
పరశురాముడు
మరింత
ఉగ్రుడై
కండ్లెఱ్ఱజేసి,
"రామా!
ఏమంటివి?"
అని
ముందుకు
వచ్చినతోడనే
రాముడు
నవ్వుతూ
అతని
భుజముననున్న
ఆ
విష్ణు
ధనువును
లాగి
తనచేత
పట్టుకొన్నాడు.
ధనువు
రామునికి
7
▾
Meaning
Keep
చేతికి
వచ్చిన
తక్షణమే
పరశురాముడు
నిర్వీర్యుడైపోయెను.
ఆ
ధనువును
ధరించిన
రాముని
చూచుటకు
సాధ్యం
కాకపోయినది.
మహాతేజోవంతుడై
అనేక
కోట్ల
దీపముల
వెలుగు
ఒకచోట
చేరిన
ఎంత
ప్రకాశమో
అంత
ప్రకాశముగా
కనిపించుచున్నాడు,
సాక్షాత్
నారాయణుడు.
తన
ఆయుధము
తనచేతికి
రాగానే
ఆ
ఆయుధముకూడను
మరింత
తేజోవంతముగా
ప్రకాశించెను.
నిజశక్తి
యుట్టిపడెను.
దీనిని
కనిపెట్టి
దేవతలు
ఆకాశమున
సంచరించి,
పూలవర్షమును
కురిపించిరి.
మంగళ
వాద్యములు
వినిపించెను.
ఇంతలో
పరశురాముడు
మందహాసముతో,
"రామా!
చూచితిని
నీ
దివ్యశక్తిని,
అనుభవించితిని
నీ
దివ్యతేజస్సును.
నేను
పూర్వము
ఈ
భూభాగమును
కాశ్యపునకు
దానమిచ్చితిని.
అప్పుడు
నీవిక
ఈ
దేశములో
ఉండకూడదని,
అట్లు
వచ్చినచో
ఒకరాత్రి
అయిననూ
నిద్రచేయకూడదనియు
శాపమిచ్చెను.
ఇప్పుడే
చీకటి
కాబోవుచున్నది.
కాన
నేనిక
ఈ
భూ
భాగమున
నుండరాదు.
వేగముగా
మహేంద్రపర్వతము
ప్రాంతమునకు
వెళ్ళవలెను.
కాబట్టి
నా
పాదగతిని
బంధించవద్దు,
నేను
తపోబలముతో
అప్రతిమాన
లోకాలను
జయించితిని.
ఆ
శక్తిని
నీవిప్పుడే
ఈ
బాణముతో
త్రుంచుము.
నాలోని
సర్వశక్తియు
నీదే.
ఇదిగో
తిరిగి
నీ
శక్తిని
నీకే
అందించుచున్నాను"
అని
రాముని
కౌగిలించుకొనగనే
పరశురామునిలోని
మూడు
కళల
శక్తియు
రామునిలో
లీనమాయెను.
అంత
పరశురాముడు,
"రామా!
లోకమును,
దైవత్వమును,
సులభముగా
అర్థము
చేసికొనలేనందున
ఇట్టి
పరాక్రమ
తపోసంపన్నులు
కూడనూ
తమతమ
యోగశక్తినే
విశ్వసించి
విష్ణుమాయను
మరచి
సంచరించుచుండుట
సర్వసామాన్యము.
అందు
నిమిత్తమై
నీ
నిజశక్తిని
లోకమునందు
చాటతలంచి
నీవే
ఈ
దేహమును,
ఈరీతుల
కొన్ని
శక్తులను
అనుగ్రహించితివి.
తిరిగి
నీ
విష్ణుత్వమును
ఋజువు
చేసితివి.
నీవు
సాక్షాత్
విష్ణుమూర్తివి.
నీవు
అసదృశ
కర్ముడవు.
లోకమే
నీ
నాటకము.
నీవు
లేనిది,
నీవు
కానిది
లేదు.
అంతా
నీదే.
ఇట్టి
మహాపవిత్రమైన
నీ
అస్త్రము
కొంతకాలమయినను
8
▾
Meaning
Keep
నాచెంత
నుండుటచేత
నాకునూ
లోకమున
పూజ్య
భావము
కలిగెను.
అదే
నా
పుణ్యము.
ఇదే
నా
అర్పణము"ని
అంతర్ధానమాయెను.
రాముడు
శాంతవదనుడై
చిరునవ్వుతో
ఆ
వింటిని,
ఆ
అంబును
వరుణదేవున
కిచ్చెను.
అక్కడున్న
వసిష్ఠునకు,
తండ్రి
అయిన
దశరథునకు
నమస్కరించెను.
భయకంపితుడై
ఏ
నిమిషమున
తన
కుమారునకు
ఏమి
ప్రమాదము
జరుగునోయని
దిగులుతో
కృశించియున్న
దశరథుడు,
పట్టలేని
ఆనందముతో
రాముని
అక్కున
చేర్చి
అనేక
రకముల
ముద్దాడి
తల
నిమిరి
నోటమాట
రాలేక,
"నాయనా!
ధన్యుడను,
తిరిగి
నిన్ను
సుక్షేమముగా
చూడగల్గితిని.
నీ
పరాక్రమశక్తి
అపారము,
అద్భుతము"
అని
అనేక
రీతుల
కొనియాడెను.
అంత
రాముడు,
"నాన్నా!
ధర్మమునకు
జయము
తథ్యము.
కాని
ప్రారంభమున
కొంత
భయకంపితుల
చేయును.
బలహీనత
వెలిబుచ్చును.
కొంత
అపజయమును
కూడ
సూచించును.
అయితే
వాటికి
లొంగక
క్రుంగక
ధర్మమునే
దృష్టియందుంచుకొనిన
దాని
కేనాటికి
అపజయము
లేదు,
రాదు.
కాని
మానవులు
అంత
సత్యమును
విచారించక,
లోతునకు
వెళ్లక,
పైపైరీతుల
ప్రాకులాడుటచేత
అపజయమునకు
గురియగుదురు.
ఏదో
జరిగినది
జరిగెను.
ఇదంతా
మీ
ఆశీర్వాదబలమ"ని
మరొకతూరి
నమస్కరించి,
"చతురంగబలము
అయోధ్య
పోవుటకు
తమ
ఆజ్ఞకై
కాచుకొనియున్నది.
వారికేదైనా
సెలవిచ్చుట
మంచిద"ని
అనగనే,
దశరథుడు
అమితోత్సాహముతో,
"నాయనా!
ఇంక
ఆలస్యమెందుకు?
సుఖదుఃఖములు
ఒకదాని
వెనుక
మరొకటి
వెంటాడి
శరీరమునకు
నీరసము
కల్గించెను.
నగరమునకు
వెళ్లి
తగినరీతుల
ఆనందము
ననుభవించవచ్చును"
అని
మంత్రిని
పిలిచి
సైన్యమును
అయోధ్యా
నగరమునకు
బయలుదేరునట్లు
ఆజ్ఞ
చేసెను.
అంత
చతురంగ
బలములు
విజయధ్వనులను
మ్రోగించిరి.
దారిన
నడచుటకు
మొదలుపెట్టిరి.
దశరథ
మహారాజు
కొడుకులతో
కోడండ్రతో
గడిచిన
9
▾
Meaning
Keep
అద్భుత
చర్యలను
ముచ్చటించుచూ
ప్రయాణము
సాగించెను.
నగరమునకు
సమీపమునకు
వచ్చుచుండగా
ముందు
కొంత
సేనలను
పంపి
నగరమున
తమ
రాకను
తెలుపుమని
చెప్పెను.
పొందిన
విజయమునకు
అమితానందమును
అనుభవించుచున్న
సేనలు
శరవేగముతో
నగరమునకు
చేరి
రామ
లక్ష్మణ
భరత
శత్రుఘ్నులు
సతీసమేతులై
నగరమున
ప్రవేశించుచున్నారనియూ,
దశరథుడు
అమితానందముతో
ఈ
వార్త
పంపెననియూ
తెలుపగనే,
పురజనులు
గంతులు
వేసి
నగరమును
అనేకరీతుల
అలంకరించుటకు
సిద్ధమయిరి.
వీధులు
అలంకరించిరి.
అరటి
కంబములు
పాతిరి,
నారికేళములు
కట్టిరి.
రాజవీధులలో
పన్నీరు
చల్లిరి.
నగరమంతయూ
అతిసుందరముగా
శృంగారించిరి.
మంగళవాద్యములను
వాయించు
వారిని
అనేక
గుంపులుగా
నియమించిరి.
మందుసామగ్రిని
సిద్ధపరచిరి.
చెప్పటానికి
శక్యము
గాని
ఆనందముతో
పురజనులు
క్షణములు
లెక్కించుచూ,
దారులు
కాచిరి.
స్త్రీలు
కిటికీలలో
మిద్దెలపై
అనేకమంది
బురకాలు
వేసికొని
పరదాలు
కట్టుకొని
క్రిక్కిరిసిపోయిరి.
కోడండ్రతోను,
కొడుకులతోను
దశరథుడు
నగరమున
ప్రవేశించెను.
మంగళవాద్యములు
మారు
మ్రోగెను.
జనులు
"జై,
జై"లు
కొట్టిరి.
స్త్రీలు
మంగళ
హారతులెత్తిరి,
పన్నీరు
చల్లిరి,
పుష్పములు
విసరిరి.
చుక్కలవంటి
కోడండ్ర
మధ్యలో
సూర్యులవంటి
కుమారులు
వీధులలో
వచ్చుచుండ
అనేకమంది
దేహములే
మరిచి
ఆనందించిరి.
ఎంతసేపు
చూచుచున్ననూ
తనివితీరక
వీధులలో
కొంత
దూరము
చూచుచు
వెనుక
వెనుక
నడచుచూ
వచ్చిరి.
వీధులు
దాటి
రాజభవనమును
చేరిరి.
అంత
సింహద్వారము
దగ్గర
బ్రాహ్మణులు
స్వస్తివాచకములు
పలుకుచుండ,
దాదులనేక
రకములైన
దృష్టులు
తీయుచుండ,
మంగళహారతులు
ఎత్తి
కోడండ్రను
కుడికాలు
లోపల
పెట్టుడని
దాదులు
ప్రార్థించగా,
కోడండ్రు
కుడికాలు
లోపలపెట్టి
నడచిరి.
అంతలో
అంతఃపుర
ప్రథమ
ద్వారముచెంత
వేచియుండిన
కౌసల్య
సుమిత్ర
కైకేయిలు
ఎదురువచ్చి
గంధములు
చల్లి
పూవులు
ముడిచి
కుంకుమలు
పెట్టి
కోడండ్రను
అమితానందముతో
ముద్దాడి
దగ్గర
చేర్చి
శిరస్సులను
ముద్దుపెట్టి
ఆశీర్వదించిరి.
10
▾
Meaning
Keep
అంత
నల్గురు
కుమారులు
కోడండ్రు
జతలు
జతలుగా
ముగ్గురు
తల్లులకు
నమస్కరించిరి.
అప్పుడు
ఆ
తల్లుల
ఆనందము
హద్దులు
తెగి
పట్టరాని
సంతోషముతో
వారల
కంటినుండి
ఆనందబాష్పములు
జలజల
రాలెను.
ఇంతలో
దాదులు
క్షీరాన్నమును
బంగరు
పళ్ళెములలో
పెట్టి
తీసుకొని
రాగా,
తల్లులు
తమ
తమ
కుమారులకు
కోడండ్రకు
నోటిలో
పెట్టి
తినిపించిరి.
పాలను
అందించిరి.
లోనికి
తీసుకొని
పోయి,
పూర్వమే
సిద్ధపరచిన
అభ్యంగన
స్నానములకు
తగిన
రీతుల
ఏర్పాటు
చేసిరి.
ప్రయాణపు
బడలిక
తీరునటుల
కుమారులకు
మగవారును,
కోడండ్రకు
ఆడ
దాదులను
ఒడలుపట్టుటకు
నియమించి
అభ్యంగన
స్నానములు
చేయించిరి.
కొంత
తడవు
విశ్రమించుటకు
ఆజ్ఞ
యొసగిరి.
వారు
నిద్రించుచుండగా
తలలకు
పాగవేయువారు
పాదముల
నొత్తువారు
వింజామరలతో
విసరువారూ
తమతమ
పనులు
అమితోత్సాహముతో
చేయదొడగిరి.
ఆనాడు
వారలకు
ఆహారాదులను
అక్కడే
పంపిరి.
బాగుగా
విశ్రమించిన
తరువాత
ఆనాడు
సాయంత్రమునకు
అయోధ్యానగర
స్త్రీలను
పేరంటమునకు
రప్పించిరి.
చక్కని
వేదికపై
వారలకు
బంగారు
పీఠములు
వేసి
సంసిద్ధముగా
నుండిరి.
తల్లులైన
కౌసల్యా
సుమిత్రా
కైకేయిలు
తమ
తమ
కోడండ్రను,
అతి
విలువైన
వస్త్రములతో,
వజ్రములతో,
వజ్రవైదూర్యములు
పొదిగింపబడిన
ఆభరణములతో
అలంకరింప
ప్రత్యేక
దాదులను
నియమించిరి.
వారును
దగ్గరుండి
చేయించి
కోడండ్రను
చేతులు
పట్టుకొని
వేదికపైకి
తీసుకొనివచ్చి
పీటలపై
కూర్చొనబెట్టిరి.
అంతలో
రామ
లక్ష్మణ
భరత
శత్రుఘ్నులు
రాజు
దుస్తులను
ధరించి
విలువైన
ఆభరణములతో
కిరీటములతో
వచ్చి,
వారి
వారి
భార్యల
కుడిప్రక్కన
ఆసీనులైరి.
ఆ
దృశ్యమును
చూచుచూ
తల్లులూ
పురస్త్రీలూ
ఎంత
వర్ణించిరో,
ఎంత
ఆనందించిరో
వర్ణనాతీతము.
వారు
నల్గురు
అనేక
ధర్మాలుచేయ
మొదలుపెట్టిరి.
గోవులు,
ధనము,
సువర్ణము,
భూములు,
ధాన్యము
ఇత్యాది
వస్తువాహనాదులు
పంచి
పెట్టిరి.
11
▾
Meaning
Keep
బ్రాహ్మణులు
వచ్చి
ఆశీర్వచనములు
చెప్పి
అక్షతలు
వేసినతరువాత
సుమంగళులు
నూటయనిమిది
దీపముల
జ్యోతులతో
హారతులిచ్చిరి.
దృష్టి
తీసిరి.
అంత
కుమారులు
తమ
తమ
భార్యలతో
లేచి
తల్లులకూ,
తండ్రికీ,
గురువునకూ
నమస్కరించి
లోనికి
వెళ్ళిరి.
ఇంతలో
కేకయ
రాజకుమారుడు,
భరతుని
మేనమామ,
దశరథుని
దగ్గర
చేరి,
"నేను
వచ్చి
చాలకాలమయినది.
నాన్నగారు
నాకొరకై
కాచుకొని
యుందురు.
ఈ
మంగళసమయమున
నాన్నగారుండిన
ఎంతో
ఆనందపడెడివారు.
భరతుని
పెండ్లి
నాన్నగారికి
తెలియదు.
తాను
లేక
తన
మనుమని
పెండ్లి
జరిగినదన్న
తానెంతో
నిరాశ
పడవచ్చును.
కాన
అట్టి
నిరాశకు
అవకాశము
లేకుండుటకై
ఆజ్ఞయొసగి
భరతుని
నా
వెంట
పంపిన
అక్కడ
తిరిగి
వైభవమును
జరిపిన
నాన్నగారు
తృప్తిపడగలరని
ప్రార్థించగనే,
దశరథుడు
భార్యలతో
సంప్రదించి
కడకు
భరతుని
పిలిపించి,
"నాయనా!
మీ
మేనమామ
యుధాజిత్
నిన్ను
తీసుకొని
వెళ్లుటకై
వచ్చినాడు.
మిథిలాపురమున
పంపుమని
కోరగా
నేను
అంగీకరింపనైతిని.
కాని,
మీ
తాతగారు
నీ
కొరకై
పరితపించుచున్నట్లు
తెలిసినది.
అందువలన
అతని
వెంట
వెళ్లుటకు
సిద్ధము
కమ్ము"
అని
ఆజ్ఞాపించెను.
భరతుడు,
"నాన్నా!
శత్రుఘ్నుడు
కూడా
నా
వెంట
వచ్చిన
బాగుండున"ని
తెలుపగా
అతనికిని
ఆజ్ఞ
ఇచ్చెను.
ఇరువురూ,
భార్యలతో
కూడ
గిరివ్రజపురమునకు
ప్రయాణమైపోయిరి.
నాన్నగారిపై
గల
అభిమానముచే
భరతుడు
మారు
మాటాడక,
తన
భార్యతో
బయలుదేరుటకు
తగిన
ఏర్పాటులను
గావించెను.
భరతుడు
మహా
బుద్ధిమంతుడు.
అంతియేకాదు,
జితేంద్రియుడు.
భరత
శత్రుఘ్ను
లిరువురు
తమతమ
ధర్మపత్నులతో
కూడి
ఆనందముగా
ప్రయాణమును
జరిపి
గిరివ్రజ
పురమునకు
చేరిరి.
అక్కడ
తమ
ముద్దుల
మనుమని
చూచు
నిమిత్తమై
కాచుకొని
యుండిన
తాతగారు
భరత
శత్రుఘ్నులను
చూచి
అక్కున
చేర్చి
ముద్దాడి
పట్టరాని
12
▾
Meaning
Keep
ఆనందముతో
ప్రక్కన
కూర్చుండబెట్టుకొని
అయోధ్యా
క్షేమములు
అనేక
రకముల
విచారించి,
ప్రయాణ
బడలికచే
అలసిపోతిరని
వారలను
తగు
రీతిగ
విశ్రమించుడని
తమతమ
వసతులకు
పంపి,
నాటినుండియు
కన్నబిడ్డలకంటే
కడుప్రీతిగ
ఆదరించుచూ,
అతి
జాగ్రత్తగా
చూచుకొనుచుండెను.
తాతగారు
ఎన్నివిధముల
వారి
ఆనంద,
అనుకూలముల
నిమిత్తమై
తగిన
సదుపాయములు
కలిగించిననూ,
భరత
శత్రుఘ్నులు
ఏదో
విధముగ
అసంతృప్తిగా
ఉండినటుల
కనిపించుచుండెడివారు.
కారణము,
వృద్ధుడైన
తండ్రిని,
ప్రాణసమానమైన
రాముని
విడిచి
ఉండలేకపోయినారు.
నిరంతరము
దశరథుని,
రామునిగురించిన
మాటలే
ముచ్చటించుకొనుచుండెడి
వారు.
మధ్యమధ్య
నాన్నగారెట్లున్నారో
అన్న
విచారము
తెలియకుండా
వారిని
బాధించెడిది.
వీరి
భావములిట్లుండ,
అయోధ్యలో
దశరథుడు
కూడనూ
భరత
శత్రుఘ్నులను
తలవని
నిమిషము
లేదు.
వారిని
విడచియుండలేకపోయినాడు.
మధ్యమధ్య
వారిని
ఎందుకు
పంపితిని,
పంపకుండిన
బాగుండెడిది,
అని
చింతించెడివాడు.
దశరథుడు
నలుగురు
కుమారులను
నాలుగు
హస్తములుగా
భావించువాడు.
ఒకనాడు
భరత
శత్రుఘ్నులను
గురించి
విచారించుచున్న
దశరథుని,
రామచంద్రుడు
చూచి,
అనేక
విధముల
మధురభాషణలు
సలిపి
సంతోషపరచినాడు.
Previous
←
Sītā's Svayaṃvara
Next
News of the Coronation
→