Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · News of the Coronation
Rāma Kathā Rasa Vāhini
›
Part One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
రాముడు
పరమశాంతుడు.
ఎవరు
ఎంత
పరుషవాక్యములాడినను
మృదుమధురముగా
జవాబు
చెప్పువాడు.
తనకు
పరులు
లెక్క
కెక్కువైన
అపకారములు
సలిపినను
వాటిని
తన
జ్ఞాపకమునకు
తెచ్చుకొనక
ఉపకార
భావమునే
కలిగియుండెడివాడు.
కాలము
చిక్కినప్పుడంతయు
సదాచారమును
గురించి
సత్సంప్రదాయములను
గురించి
వయో
వృద్ధులైన
మునులతో,
బ్రాహ్మణులతో,
పండితులతో
చర్చించువాడు.
వేదాంత
రహస్యములను
అతిసులభముగా
వివరించి
అది
సరియా
కాదా?
అని
సామాన్య
మానవుని
వలె
పండితుల
సలహాను
కోరుచుండెడివాడు.
చేరిన
ఋషులు,
వేదాంత
విజ్ఞాన
నిధులు
అయిన
పండితులు
రామవాక్యములకు
అమితానందపడుచూ
అతని
తెలివితేటలను
అనేకవిధముల
కొనియాడుచుండెడివారు.
ప్రజలను
తానే
ముందు
పలకరించుచూ,
వారి
క్షేమసమాచారములను
విచారించుచుండెడివాడు.
అందువలన
ప్రజలుకూడను
శ్రీరాముని
తమ
ఆప్తునిగా
భావించి,
గౌరవించి,
అమితముగా
ప్రేమించుచుండెడివారు.
తాను
నిరంతరము
దృఢ
నియమములతోయుండి
ఎట్టి
అననుకూలములందైననూ
తన
నియమములను
వీడక
పాటించుచుండెడివాడు.
ఎవరితో
సంభాషించినను
చిరునవ్వుతో
చిందులుత్రొక్కు
పాలబుగ్గలతో
ఆకర్షించుచూ
ఉండెడివాడు.
అతని
మొగమున
కోపము,
విసుగు,
నిరాశ
యేనాడునూ
ఎవ్వరునూ
చూచి
ఎరుగరు.
దయా,
దాక్షిణ్యా,
శరణాగత
రక్షణాది
ధర్మములు
అన్నీ
రామునిలో
మూర్తీభవించినవి.
జూదము,
ఇత్యాది
చెడు
2
▾
Meaning
Keep
గుణములు
అతని
మనస్సులో
ఏనాడూ
చేర
ప్రయత్నించలేదు.
అట్టి
దుర్గుణాలు
రామునకతిదూరముగా
నుండెడివి.
అతిభాషకాని,
చెడుచూపు
గాని
అతనిలో
లేదు.
అయితే
ఎవరైనా
యుక్తిగా
మాట్లాడిన
ఆ
యుక్తికి
పైయుక్తిగా
వారిని
నోరుమూయించెడివాడు.
యుక్తులకు
చోటివ్వక
అక్కడికక్కడే
వాటిని
అణగద్రొక్కువాడు.
అనారోగ్యము
అతడు
ఏనాడు
ఎరుగడు.
ప్రజల
భావమును
కనిపెట్టి
వారలు
కోరక
మునుపే
వలసిన
అనుకూలములు
తండ్రితో
చెప్పి
మంత్రిద్వారా
చేయించుచుండెడివాడు.
దశరథుడుకూడను
వారి
అభీష్టముల
కెట్టి
అడ్డుచెప్పక
మరుక్షణమందే
ఆ
కార్యములు
చేయించెడివాడు.
ప్రతి
చిన్న
విషయమును
అతిజాగ్రత్తగా
తెలిసికొని
అట్టి
ఇక్కట్లు,
సమస్యలు
తిరిగి
మరొకతూరి
రాకుండ,
లేకుండా
చేయుటకు
తగిన
చర్యలను
తీసుకొనుచుండెడివాడు.
రామునియందు
ప్రత్యేక
విశిష్టత
స్పష్టమయ్యెడిది.
అది
ఏమన,
తన
మనోనిశ్చయాన్ని
ఇతరుల
కెవ్వరికీ
తెలియనిచ్చువాడు
కాడు.
అతని
భావములు
ఫల
పర్యంతము
ఎవరికీ
బోధపడెడివి
కావు.
మరొకటి,
అతని
కోపము,
సంతోషము
ఎన్నడూ
వ్యర్థ
మయ్యెడివి
కావు.
ఆలస్యముకాని,
ఏమరుపాటుగాని
ఎరుగడు.
ఇటువంటి
లోకోత్తర
గుణములతో
రాముడు
తేజరిల్లుచుండెను.
అయోధ్యలో
ఇట్టి
కుమారుని
చూచుకొంటూ,
ప్రజలలో
రామచంద్రునకు
గల
పవిత్రకీర్తిని,
ప్రజావిశ్వాసమును,
మంత్రులవలనను,
పురోహితులవలనను,
దశరథుడు
వినుచు
తనలో
తాను
ఆనందించుచుండెడివాడు.
ఇట్లుండ
ఒకనాటి
రాత్రి
పానీయమును
గ్రోలగోరి
నిద్రించు
రాణులకు
నిద్రాభంగముచేయ
మనసొప్పక
కూజాలోని
నీరును
ఒక
చిన్నగిన్నెలో
పోసుకొని
త్రాగు
సమయమున
తన
చేతివ్రేళ్ళు
పట్టతప్పుట,
హస్తము
కొంత
అదురుట
గమనించి
అప్పటినుండియు
నిద్ర
పట్టక
తనలో
తాను
అనేకరకముల
ఆలోచనలలో
మునిగి
కడకు
తనకు
వార్ధక్యము
వచ్చినదనియును,
నరముల
పటుత్వము
తప్పినమీదట
రాజ్యపాలన
చేయ
కూడదనియు,
ఇంద్రియనిగ్రహము
3
▾
Meaning
Keep
లేని
పరిపాలన
ప్రజాక్షేమమునకు
విరుద్ధము
కాగలదనియు,
అట్టి
పరిపాలనచే
రాజ్యము
అస్తవ్యస్తమై
కడకు
పతనమునకు
దారితీయుననియు
నిర్ణయము
చేసికొని,
ఎప్పుడు
తెల్లవారునా,
తనలోని
నిశ్చయమును
మంత్రులకు
ఎపుడు
తెలుపుదునా
అని
దశరథుడు
నిమిషములు
లెక్కించుచుండగా
తెల్లవారెను.
అంత
కాలకృత్యములు
తీర్చుకొని
స్నాన
సంధ్యాదులు
సలిపి
ప్రత్యేకమైన
ఒక
సభను
ఏర్పాటుగావించుమనియు,
పుర
ప్రముఖులను,
పురోహితులను,
మంత్రులను
రప్పించుమనియు
బంట్రోతులకు
ఆజ్ఞ
చేసెను.
మహారాజు
ఆజ్ఞ
శిరసావహించి
అనుకొన్నవారందరు
హాజరైరి.
దశరథుడు
వసిష్ఠులవారికి
నమస్కరించి
రాత్రి
తనలో
కలిగిన
మార్పును,
దానిపై
తనకు
కలిగిన
భావములను
స్పష్టముగా
విన్నవించి
రాజ్యపరిపాలనా
బాధ్యతను
తన
కొమారుడైన
రామచంద్రునకు
అప్పజెప్పనెంచితిననియు,
దీనికి
అడ్డు
చెప్పకూడదనియు,
వినయముతో
ప్రార్థించి,
ఇందుకు
తగిన
ఏర్పాట్లను
గావించ
అనుజ్ఞ
కోరెను.
ప్రధాన
మంత్రియైన
సుమంతుడు
లేచి
సభాసదులకీవార్త
తెలియపరచగనే
పుర
ప్రముఖులు,
మంత్రులు,
పురోహితులు
ఒకరేమి
చేరినవారందరు,
శుభం,
శుభం
అంటూ
కరతాళములు
మిన్నుముట్ట
వాయించిరి.
వసిష్ఠులవారు
లేచి,
"రాజా!
దీనికింత
విచారించ
నక్కరలేదు.
రామచంద్రుడు
దీనికి
తగినవాడు
అయినప్పటికిని,
కొంతకాలము
తీసుకొని,
తగిన
వారందరికి
ఆహ్వానములు
పంపి,
పట్టాభిషేకము
అతివైభవముగా
జరిపించవచ్చును,
రామచంద్రుని
యువరాజు
చేయవచ్చును.
కనుక,
ఒకటి
రెండు
నెలలు
వేచియుండుట
మంచిదని
నా
తలంపు"
అని
తెలుపగనే
దశరథుడు,
"మహాత్మా!
తమకు
తెలియనిది
లేదు.
తమరు
సర్వజ్ఞులు,
అంగపటుత్వము
తప్పిన
రాజు
పరిపాలనకు
అర్హుడు
కాదు.
వార్ధక్యము
ప్రవేశించిన
ప్రభువునకు
పరిపాలనాకాంక్ష
ఉండుట
మహాప్రమాదకరము.
అది
దురాశ
కాగలదు.
ఇన్ని
తెలిసియుండియు
నేను
తిరిగి
అందులో
ప్రవేశించుటచే
నా
కర్తవ్యమును
4
▾
Meaning
Keep
తప్పినవాడనగుదును.
కనుక,
నన్ను
క్షమించి,
ఇక
గడువు
పెట్టక
ఈ
రెండు
మూడు
దినములలోనే
నా
రామచంద్రుని
యువరాజును
చేయ
అనుజ్ఞయొసగుడ"ని
వినయమున
మోకరిల్లెను.
అందులకు
వసిష్ఠులవారు
దశరథుని
లేవనెత్తి
ఆశీర్వదించి,
"రాజా!
రామచంద్రుని
వివాహము
సహితం
అప్పటికప్పుడు
ఉట్టిపడినట్లు
జరిగిపోయెను.
ఆ
వైభవమునుకూడను
ప్రజలందరు
చూచి
అనుభవించలేకపోయిరి.
పట్టాభిషేకము
సహితము
అప్పటికప్పుడు
తలంచి
నిర్ణయించిన
ఇతర
రాజులకే
గాక
తోబుట్టువులైన
భరతశత్రుఘ్నులకుకూడ
కొంత
బాధను
కల్గించవలసివచ్చును.
మొన్నమొన్ననే
సంబంధము
ఏర్పరచుకొన్న
జనకమహారాజుకూడను
రాలేకపోవచ్చును.
కాన
తమరు
యోచించుట
మంచిద"ని
సెలవిచ్చెను.
ప్రధానమంత్రి
లేచి,
"కుల
గురువులు
నన్ను
క్షమింతురుగాక!
చక్రవర్తి
సంకల్పము
సర్వజనులకు
సమ్మతముగనే
యున్నది.
సర్వజన
సంతాపహరుడు,
నిండుచంద్రునివలె
సర్వలోక
ప్రియుడు
అయిన
రామచంద్రుని
యువరాజును
చేయుటలో
కాలహరణము
చేయక
తగు
శీఘ్ర
కాలముననే
ఆజ్ఞను
అనుగ్రహించవలెన"ని
ప్రజల
తరపున
తాను
ప్రార్థించుచున్నటుల
కోరెను.
చక్రవర్తి,
ప్రధానమంత్రి
ఈరీతిగా
ప్రార్థించగనే
వసిష్ఠులవారు
చేయునదిలేక
అంగీకరించి
ప్రజాభిరుచినికూడను
తెలిసికొనవలెనని
సలహా
ఇచ్చెను.
దశరథ
మహారాజు
ఆ
కొలువుకూటములో
సమావేశమైన
మంత్రులను,
మహనీయులను,
సదస్యులను,
పండితులను,
పురోహితులను
అందరినీ
ఒకతూరి
లేచి
చూచెను.
మేఘగర్జనమువలె
సభా
భవనమంతా
ప్రతిధ్వనిస్తూ
ఉండగా
అందులో
నొక
పురప్రముఖుడు
లేచి,
"మహారాజా!
మీ
పూర్వీకులైన
రాజేంద్రులందరూ
ప్రజలను
తమ
కన్నబిడ్డలవలె
కాపాడుతూ
రాజ్యపాలన
చేసిరి.
ఇక్ష్వాకుకు
నరేంద్రుని
వలననే
ఈ
కోసల
దేశము
శుభప్రదమైన
రాజ్య
మయినది.
తమ
జ్యేష్ఠపుత్రుడగు
శ్రీరాముడు
సద్గుణ
సంపన్నుడు,
5
▾
Meaning
Keep
పరమధార్మికుడు,
పరాక్రమమున
పురందరుడు.
అంతేకాదు,
ముల్లోకాలు
ఏలగల
సమర్థుడు.
అతనిని
యువరాజును
చేయుట
మా
భాగ్యము.
ఇందులకు
ఏ
సందియమూలేదు"
అని
ఆ
ప్రజాప్రతినిధి
ఆనందవచనముల
నందించగనే,
దశరథుడు
లేచి,
"సభాసదులారా!
నేను
మా
పూర్వీకుల
పంథా
ననుసరించి
ఏమరుపాటు
లేక,
నా
శక్తికొలది
ఇంతవరకు
రాజ్యమును
కాపాడితిని,
ఏలితిని.
లోకహితము
కోరి
ఈ
శ్వేతచ్ఛత్రచ్ఛాయలలోనే
నా
వయసు
అంతా
గడచిపోయినది.
నేనిపుడు
వృద్ధుడను.
ఈ
దేహమున
అంగముల
పటుత్వము
తప్పినదని
నేను
తెలిసికొంటిని.
ఇక
ఈ
శిథిలదేహానికి
కొంత
విశ్రాంతి
ఇవ్వవలెనను
సంకల్పము
నాలో
స్థిరము
చేసికొని
ఈ
నిర్ణయమునకు
వచ్చితిని.
ధర్మసంస్థాపనారూపము
అయిన
రాజ్యభార
నిర్వహణము
సామాన్యమయిన
పనికాదు.
జితేంద్రియు
డైనవాడే
అనేక
సాధనలతో
ధర్మసంస్థాపనారూపమైన
రాజ్యభారము
నిర్వహించగలుగుతాడు.
నేను
ఈ
రాజ్యభారమును
మోసి
మోసి
అలసిపోతిని.
ఈ
నా
యాలోచన
మీకందరికి
నచ్చినట్లయిన,
నేను
ఇట్లు
చేయుట
మీకందరికి
ఉచితమని
తోచిన,
నేను
ఈ
పనికి
పూనుకొందును.
లేకున్న
మీ
యభీష్టమునకు
నేనిపుడు
విరుద్ధము
చేయను.
నన్ను
సంతోషపెట్టు
నిమిత్తమో
లేక
రాజాజ్ఞను
మీరుటెట్లని
కొంత
అభిమానముతోనో
రామ
యువరాజ్యాభిషేకమును
ఒప్పుకొననవసరము
లేదు.
ఇది
మీ
స్వేచ్ఛకప్పజెప్పితిని.
మీకందరికీ
ఇష్టమయిన
లేక
ఇంకొక
పద్ధతి
ఏదైనా
మీకు
తోచిన
నిరాక్షేపముగా
చెప్పవచ్చును.
కాన
మీరందరు
ఆలోచించి
రాత్రికి
మీ
అభిప్రాయమును
తెలుపుడ"ని
దశరథ
మహారాజు
మాటలను
పూర్తిచేసీ
చేయక
మునుపే,
వర్షించే
మేఘములను
చూచి
నెమళ్లు
చెలరేగి
కేకలు
వేసినటుల
సభాసదులందరూ
"తమ
అభీష్టమే
మా
అభీష్టము.
ఇంతకంటె
ఉత్తమ
ఆలోచనలకు
మేము
అర్హులముకాము.
శుభం...
శుభం"
అని
"రామచంద్ర
యువరాజునకు
జై",
"దశరథ
మహారాజునకు
జై"
అంటూ
దిక్కులు
పిక్కటిల్లేటట్లు
కేకలు
వేసిరి.
ఈ
శుభధ్వనులు
వింటూ
దశరథుడు
ఒకవైపున
ఆనందము,
మరొకవైపు
ఒకవిధమైన
అనుమానము
అర్థము
చేసికొనలేని
స్థితిలో
స్తంభించిపోయెను.
కొంత
6
▾
Meaning
Keep
తడవయిన
పిదప
తెప్పరిల్లి
దశరథుడు,
"సభాసదులారా!
మీ
అభీష్టమును
నెరవేర్చుటకంటె
నాకు
ప్రత్యేక
కార్యము
మరొకటుండదు.
తప్పక
మీ
ఇష్టానుసారమే
రాముని
యువరాజును
చేతును.
కాని,
నాలో
ఒకవిధమైన
అనుమానము
నన్ను
బాధించుచుండుటచేత
దానినికూడను
పరిహారము
చేసికొనగోరుచున్నాను.
మీరెట్టి
భీతికిని
తావియ్యక,
ఉన్నదున్నట్లు
తెలిపి
నన్ను
ఆనందింపజేతురని
ఆశించుచున్నాను.
అదియేమన,
నేను
రామపట్టాభిషేక
విషయమును
మీతో
చెప్పీ
చెప్పకమునుపే
మీరందరు
తప్పక
రామచంద్రుని
యువరాజును
చేయుమనియును,
అతని
సమర్థతలు
అపారమైన
వనియును
తెలిపితిరి.
దీనిని
పట్టిచూడ
నా
పరిపాలనలో
మీకు
కొంత
అననుకూలములో
లేక
మీ
అభీష్టమునకు
విరుద్ధమైన
శాసనములో,
అదియుకాక,
ధర్మరహితమైన
చర్యలో
నేను
చేసితినా?
లేకున్న
నా
పరిపాలన
శంకించి
రామ
యువరాజ్యాభిషేకము
చేయగోరుచున్నారా?
అను
సంశయము
నన్ను
కొంత
బాధించుచున్నది.
కాన
నా
తప్పులేమైనను
ఉండిన
నిరాక్షేపముగా
మీరు
చెప్పవచ్చున"ని
ప్రశ్నించెను.
అంత
సభాసదులలో
ప్రముఖుడు
లేచి,
"రాముని
శక్తిసామర్థ్యములు,
గుణగణములు
వర్ణనాతీతములు.
ఇక
మీరు
దేవదేవుని
వంటివారు.
ప్రజల
కోరికలను
అడిగిన
తక్షణముననే
అందించు
శంకరుల
వంటివారు.
రక్షించుటలో
విష్ణుమూర్తివంటివారు.
మిమ్ము,
మీ
పరిపాలనను
శంకించినచో
మేము
మహా
క్రూరులమనియే
చెప్పవచ్చును.
అట్లు
శంకించువారు
పాపులు.
లోకహితము
కోరి
మిమ్ములను
సంతోషపెట్ట
గోరి
మీ
ఆజ్ఞను
శిరసావహించితిమ"ని
తెలిపెను.
అంత
దశరథుడు
పట్టరాని
ఆనందముతో,
"బ్రాహ్మణోత్తములారా!
వింటిరికదా
ప్రజాభిప్రాయము!
ఇక
మీరు
ఆలసింపక,
పట్టాభిషేకమునకు
కావలసిన
ఉపకరణాలు
సమకూర్చుడు.
అందుకు
తగిన
అరుగులు,
హోమగుండములు
ఏర్పరచుడు"
అని
ఆజ్ఞాపించెను.
వసిష్ఠులవారికి
నమస్కరించి,
"స్వామీ!
వచ్చుటకు
వీలయినవారు
మాత్రమే
వత్తురు.
దూరప్రాంతమువారికై
7
▾
Meaning
Keep
నిరీక్షించకుడు.
పట్టాభిషేకము
జరిగిన
తరువాత
వారు
విని
ఆనందింతురు.
కాన
కేకయరాజునకుగాని,
జనకునకుగాని
తెలుపవలెనని
సాకును
పెట్టుకొనక,
కాలమును
పొడిగించక,
అతిశీఘ్రముగా
ఈ
పవిత్రాభిషేకమునకు
అనుజ్ఞయొసగుడు"
అని
హస్తములు
జోడించి
ప్రార్థించగనే,
వసిష్ఠులవారు,
"మహారాజా!
నేను
సర్వసిద్ధముగానే
యున్నాను.
రేపటి
దినమే
అగ్నిహోత్ర
గృహములును,
పూజాద్రవ్యాదులును,
ఓషధులును,
నూరు
కలశములును,
సమగ్రమైన
పులితోలును
ఉంచుటకు
ఆజ్ఞాపించి,
అంతమాత్రమేగాక
చతురంగబలములతో,
సర్వశుభలక్షణయుతమైన
శత్రుంజయమను
ఏనుగుతోను,
సర్వాలంకృతమగు
ఆబోతుతోను,
శ్వేతచ్ఛత్రముతోను,
ధ్వజముతోను
సర్వసిద్ధముగా
నుంచుటకు
ఏర్పాట్లుగావించుమని
చెప్పినాను.
ముహూర్తము
రేపటికే"
అని
నిర్ణయమయినట్లు
వసిష్ఠులవారు
తెలిపినతోడనే,
ప్రజలు
పరమానంద
హృదయులై
గంతులువేసిరి.
రాజవీధులు
శుభ్ర
పరచుట,
రంగులు
వేయించుట,
తోరణములు
కట్టించుట,
పందిళ్ళు
వేయించుట
ఇత్యాది
అవసర
కార్యములు
అతిత్వరగా
ప్రారంభించిరి.
బ్రాహ్మణులు,
ప్రజలు
కలకలధ్వనులు
చేయుచు
కిలకిల
నవ్వులు
వెలిబుచ్చుచు
దశరథుని
ఆజ్ఞను
పొంది
సభాభవనమును
వీడిరి.
అంత
దశరథుడు,
కులగురువులైన
వసిష్ఠులవారు,
మంత్రి
లోనికి
వెళ్లిరి.
దశరథ
మహారాజు
కొలువుకూటమునకు
శ్రీరాముని
రప్పించి
పట్టాభిషేకమునకు
సంబంధించిన
సర్వపద్ధతులను
వివరముగా
తెలిపి,
మరునాటి
సూర్యోదయమునకు
సిద్ధముగా
నుండవలసిన
విధానములు
తెలిపి,
అందుకు
తగిన
ఏర్పాట్లు
చేయువారిని
పిలిపించి
రామునకు
అప్పజెప్పెను.
ఈ
వార్త
విన్న
లక్ష్మణుడు
పరమానందముతో
పరుగెత్తుకొని
పోయి
కౌసల్యాదేవికి
తెలిపెను.
ఆమె
పట్టరాని
ఆనందముతో
రాముని
రాకకై
నిరీక్షించుచుండెను.
కాలము
తక్కువయినను
అతిశీఘ్రములోనే
ఈ
వార్త
నగరమంతయు
ప్రాకెను.
చుట్టుప్రక్కల
రాజ్యములకు,
గ్రామములకు,
అతిత్వరగా
వ్యాప్తిచెందెను.
గ్రామగ్రామములనుండి
పరుగిదుచు
వచ్చు
జనసంఖ్య
మితిమీరెను.
8
▾
Meaning
Keep
ఇవన్నియు
వింటున్న
రామచంద్రునకు
ఏమియు
తోచక,
నోటమాటరాక,
ఆనందము
వెలిబుచ్చక,
మౌనము
వహించెను.
రాముని
చూచి
దశరథుడు,
"నాయనా!
పట్టాభిషేకమన్న
ఆనందము
నీలో
ఏమాత్రము
కనిపించకున్నందుకు
కారణమేమి?
నీకు
యువరాజువగుటకు
ఇష్టము
లేదా?
లేక,
రాజ్యభారము
ఈ
నాటినుండియే
నీ
తలపై
పెట్టతలచితిమని
ఒకవిధమైన
భయమా?
నీ
మనోభీష్టము
నెరిగింపుమ"ని
అనేకవిధముల
బుజ్జగించి
ప్రశ్నించిన
తండ్రి
ముఖమును
చూచుచూ
రామచంద్రుడు,
"నాన్నా!
మీరెందుకింత
తొందరపడుచున్నారో
నాకర్థమగుటలేదు.
నా
ప్రియమైన
సోదరులు
భరతశత్రుఘ్నులు
నాతో
లేరు.
తాతగారు
అతిదూరమున
నుండుటచే
వారు
రాలేకపోవచ్చును.
మామగారుకూడ
రాలేకపోవచ్చును.
మిగిలిన
రాజులు,
రారాజులు,
సామంత
రాజులు
ఎవ్వరును
చేరలేకపోవచ్చును.
ఇంతమందికి
నిరాశ
కలిగించి
పట్టాభిషేకమునకు
పూనుకొనుటకు
నా
మనసొప్పకున్నది"
అని
నమస్కరించి
వినయముగా
తెలుపుకొనెను.
అంత
వసిష్ఠులవారు,
"రామా!
ఈ
యూహలు
మేము
కూడను
చేయకపోలేదు.
అన్నివిధముల
ఆలోచించి
ప్రజాభిప్రాయములనుకూడను
సేకరించి
ఈ
నిర్ణయమునకు
వచ్చితిమి.
నీవిక
ఎట్టి
అడ్డునూ
చెప్పక
మహారాజుయొక్క
మనోభీష్టమును
శిరసావహింపుము.
అభిషేకము
రేపే
జరుగవలెను.
ఈనాటినుండియే
నీవు
నీమమును
పాటించవలెను.
రాత్రికి
సీతాసమేతముగా
ఉపవాసము
చెయ్యవలసి
యుందును.
తెల్లవారగనే
అభ్యంగన
స్నానమాచరించి
లేత
పసుపురంగు
వస్త్రములు
ధరించవలెను.
సూర్యోదయమునకే
పుష్యమీ
నక్షత్రమునకు
పట్టాభిషేకము
పూర్తి
కావలెను.
కాన
నీవిక
బదులు
చెప్పక
నీ
వసతికి
వెళ్లిరమ్ము"
అని
ఆజ్ఞ
ఇచ్చిన
వెంటనే
రాముడు
తండ్రికి,
గురువునకు
నమస్కరించి,
మారుమాటాడక,
సుమంతునితో
కలిసి
వసతికి
వెళ్లి
సీతకీ
వార్త
తెలిపి
అక్కడనుండి
తల్లి
కౌసల్య
భవనమునకు
వెళ్లి
తల్లికి
నమస్కరించెను.
తల్లి
పట్టలేని
ఆనందముతో
కుమారుని
ముద్దాడి
9
▾
Meaning
Keep
సర్వాలంకారముతో
సిద్ధము
గావించియుంచిన
అనేక
గోవులను
బ్రాహ్మణులకు
ఇప్పించి,
ఇంకా
ఇంకా
అనేకవిధముల
కొమరునిచేత
దానములు
చేయించెను.
సుమిత్రా
లక్ష్మణ
సమేతముగా
కౌసల్య,
రాముని
తన
సరసన
కూర్చుండబెట్టుకొని
ఒకవైపున
ఆనంద
బాష్పములు
తుడుచుకొనుచు,
"నాయనా!
ఈ
సుసమయమును
ఎప్పుడు
చూతునా
అన్న
నా
చిరకాల
వాంఛ
నేటికి
పూర్తి
అయినది.
నేను
ధన్యురాలను.
నా
బంగారుబిడ్డా!
రేపటినుండి
నీవు
యువరాజువు.
చిరకాలం
జీవించు.
ప్రజాక్షేమమును
దృష్టియందు
ఉంచుకొని
సక్రమపాలన
సాగించి
సత్కీర్తినార్జించి
మన
పూర్వీకుల
ఘనతను
నిలబెట్టుము.
మీ
తండ్రిగారికంటె
గొప్ప
పేరును
పొందుము.
ఆనాడే
నా
జన్మ
ధన్యము
కాగలదు.
నా
వ్రతములు,
ఉపవాసములు
సఫలము
కాగలవు"
అని
తల
నిమురుచు
అనేకవిధముల
ఆశీర్వదించుచూ,
బోధించుచూ
చెప్పిన
మాటలను
రాముడతి
శ్రద్ధగా
వింటూ
తమ్ముడైన
లక్ష్మణుని
చూచి
చిరునవ్వులు
చిందులు త్రొక్కగ,"
తమ్ముడా!
నిన్ను
ఏ
రాజ్యలక్ష్మి
వరించినదో
తెలుపగలవా?"
అని
కొంటె
ప్రశ్న
వేయగనే
లక్ష్మణుడు
పట్టరాని
ఆనందముతో,
"అన్నా!
నాకు
ఏ
రాజ్యలక్ష్మీ
అక్కరలేదు.
నీ
రాజ్యమునందే
నీ
ఆదేశానుసారము
పరిపాలనాబాధ్యత
చేయగలను.
అంతే
చాలును"
అని
అన్నకు
నమస్కరించగనే
రాముడు,
"లక్ష్మణా!
నీవు
నా
రెండవ
ప్రాణము.
కనుక
అర్ధరాజ్యభారము
నీది.
నాతో
పాటు
సర్వాలంకృతుడవు
కమ్ము.
నా
బాధ్యతలు
నా
భోగ
భాగ్యములు
అన్నింటియందును
నీకు
అర్ధభాగమునకు
అధికార
మున్నది.
నేనేమి
అనుభవించినా
అందు
నీకు
అర్ధ
బాధ్యత
కలిగి
యుందును"
అని
మాటలాడుచూ
ఉండగా
సుమిత్ర
కంటిధారలు
విడుచుచూ
ఇరువురినీ
ఆశీర్వదించుచూ,
"రామా!
మీ
ఇరువురి
మధ్యనున్న
ప్రేమ
నన్నెంతగనో
ఆనందపెట్టుచున్నది.
నా
కుమారునకు
నీ
సేవకంటె
వేరు
అధికారము
అక్కరలేదు.
నీ
ప్రేమ,
అభిమానములు
కలకాలము
నా
కొమరునిపై
యుండిన
అంతియే
చాలును"
అని
మాటలు
ముగించెను.
అంత
రాముడు
ఇరువురు
తల్లులకు
నమస్కరించి
లేచెను.
అతనితోపాటు
లక్ష్మణుడుకూడను
లేచి,
అన్నతోపాటు
రామ
వసతికి
వెళ్లెను.
10
▾
Meaning
Keep
ఆ
రాత్రి
గురువుగారు
చెప్పినటుల
ఉపవాస
వ్రతములు
ప్రారంభించిరి.
ఆ
రాత్రి
దర్భాసనములపై
శయనించిరి.
తెలతెలవారుచుండెను.
ఎక్కడ
చూచినను
మంగళవాద్యములు,
బ్రాహ్మణోత్తముల
వేదఘోష
ప్రతిధ్వనించుచుండెను.
రామునకు,
సీతకు
అభ్యంగన
స్నానములు
చేయించుటకై
సరయూనది
పవిత్ర
జలమును
బంగారు
బిందెలతో
తెచ్చి
పరివారము
సంసిద్ధముగా
యుండిరి.
స్వస్తివాచకములు
చెవులకు
ఇంపుగొలుపజొచ్చెను.
ఇవి
ఇట్లు
జరుగుచుండ
ఆనాటి
రాత్రి
కైక
పనికత్తె
అయిన
మంధర
తన
నివాసమునకు
వెళ్ళుచుండ
ఈ
అలంకారములు,
వైభవములు
చూచుచు
కారణము
తెలియక
కొంత
విచారణను
మొదలుపెట్టగనే,
రామచంద్రుని
పట్టాభిషేకమని
తెలియవచ్చెను.
తనతోపాటు
పనికత్తెలుగా
కౌసల్య
సుమిత్రల
దగ్గరుండువారు
తెల్లని
మల్లెపూలవంటి
చీరలు
కట్టి,
అనేక
ఆభరణములు
ధరించి
అటూ
ఇటూ
తిరుగుచుండుట
కూడ
కంటికి
కనిపించెను.
ఇక
తాను
అక్కడ
నిలువలేకపోయినది.
తన
ఒంటిపై
జెఱ్ఱులు
ప్రాకినట్లయినది.
తేళ్లు
కుట్టినటుల
బాధపడినది.
నేరుగా
పరుగెత్తుకొని
వచ్చి
కైకేయి
మందిరమునకు
హుటాహుటిని
పోయినది.
అప్పటికే
కైకేయి
తన
శయ్యామందిరమునకు
వెళ్లియుండుటచూచి
తలుపు
చెంతకు
వెళ్లి
తీక్షణ
స్వరముతో,
"అమ్మా!
అమ్మా!
తలుపు
తెరువుము,
తలుపు
తెరువుము,
అత్యంత
అవసరమైన
విషయము.
నీ
జీవితమే
నాశన
మగుచున్నది.
భూకంపము
చెలరేగినది"
అని
మాటపై
మాట
వ్యవధిలేక
మాటాడుచున్న
మంధర
స్వరము
విని,
తక్షణమే
కైకేయి
తలుపు
తీసి,
"ఏమిటా
తొందర,
ఏమి
కూలిపోయినది?
ఎందుకింత
విచారముగా
నున్నావ"ని
చిరాకుగా
అడిగెను.
అంత
మంధర,
"కూలిపోయినదా?
నాదేమీ
కూలిపోలేదు,
కాలిపోలేదు.
నీ
జీవితమే
కూలిపోవుచున్నది.
వెఱ్ఱిరాణివై
జీవించవలసివచ్చుచున్నది"
అని
అనేక
రకముల
ఆర్భాటము
చేయుచు
కంటిధారలు
కార్చుచు
విలపించెను.
కైకేయికి
ఏమియు
తోచలేదు.
"మహారాజు,
రామలక్ష్మణ
కౌసల్యా
సుమిత్రాదులు
క్షేమమే
కదా!
వారలు
క్షేమముగా
నుండిన
ఇక
ఏమైననేమి?
11
▾
Meaning
Keep
నాకెట్టి
విచారమూ
లేదు.
వారలకేమైనా
ప్రమాదములు
వాటిల్లినవా?
మంధరా,
త్వరగా
తెలుపుమ"ని
తల
పట్టుకొని
గడ్డము
పట్టి
బతిమాలెను.
అంత
మంధర,
"వారలకెట్టి
కీడును
లేదు.
నీ
కొమరుని
గొంతుకోయ
సంకల్పించినారు"
అని
భోరున
ఏడ్చెను.
అందులకు
కైక,
"మంధరా!
నీవు
పొరబడుచున్నావు.
మహారాజుకాని,
రామలక్ష్మణులుకాని
నా
అక్కలైన
కౌసల్యా
సుమిత్రాదులుకాని
అట్టివారు
కారు.
నా
కుమారుని
తమ
కుమారులకంటె
అధికముగ
ప్రేమింతురు.
ఇది
నీ
బుద్ధిదోషము
తప్ప
సత్యము
కాదు.
ఇంతకూ
విషయమేమిటో
వివరించుమ"ని
అడిగెను.
"విషయమా?
రేపటి
తెల్లవారి
సూర్యోదయ
సమయమునకు
శ్రీరామచంద్రుని
పట్టాభిషేకమట.
పట్టపురాణికి
పట్టపగ్గములు
లేక
అత్యంత
ఆనందముతో
తన
దాసీలకు
పట్టు
పీతాంబరములు,
ఆభరణములు
పంచిపెట్టుచున్నది.
రామునిచేత
గోవులను,
సువర్ణములను,
దానము
చేయించుచున్నది.
ఇన్ని
జరుపుకొంటూ
నిన్నిట్లు
అలక్ష్యముగా
విడిచి
పెట్టుట
నేను
భరించలేను,
సహించలేను.
నీవు
ఇంకా
తెలిసికొనలేకపోవుచున్నావు.
భర్తకు
అయిష్టురాల
వయిపోతివి.
'నాయంతటి
భాగ్యవంతురాలు
లేద'ని
నీవు
విఱ్ఱవీగుచున్నావు.
కానీ,
నిజముగా
నీయంతటి
దురదృష్టవంతురాలు
లేదని
చెప్పవచ్చు.
నీ
భాగ్యము
ఎండాకాలపు
ఏటినీళ్ళవలె
అడుగంటిపోవుచున్నది.
నీవు
పతికి,
సవతులకు
పనికిరానిదానవయిపోతివి.
ఇంక
కొంతకాలములోనే
నిన్ను
ఒక
దాసివలె
వినియోగించుకొందురు.
అట్టి
దుస్థితి
రాకమునుపే
జాగ్రత్తపడుట
మంచిది.
నిద్రనుండి
లేచి,
నిండు
హృదయముతో
విచారించుము.
నీకు
రాబోవు
దుర్గతిని
తప్పించుకొను
ఉపాయమును
ఆలోచించుకొనుము.
రాముడే
యువరాజైన
ఇక
రాజ్యమంతయు
కౌసల్య
హస్తమున
నిలువగలదు.
అందరితోపాటు
నీవును
ఆమె
హస్తగతమై
ఆమె
ఆడించునటుల
ఆడవలసివచ్చును"
అని
మంధర
దొంగ
ఏడ్పులు
ప్రదర్శించి
మహా
ఉపకారివలె
నటించెను.
మంధరను
చూచి
కైక,
"మంధరా!
నీకేమయినా
మతిచెడినదా?
రామచంద్రుడు
యువరాజు
కావటము
రాజ్యమునకే
మంగళకరము.
ఇట్టి
12
▾
Meaning
Keep
ఆనందవార్తను
అందించినందుకు
ఇదిగో,
నా
కంఠహారమును
నీకు
బహూకరింతును,
సంతసింపుము.
రామచంద్రుడు
రాజు
కావడం
తన
తల్లియైన
కౌసల్యకంటెను
నాకే
అమితమైన
ఆనందము.
రామచంద్రుడుకూడను
తన
తల్లికంటె
నన్నే
అమితముగా
ప్రేమించును,
గౌరవించును.
అట్టి
మహాగుణశాలిపై
నీవిట్టి
అపవాదులు
కల్పించుట
నేను
వినజాలను.
నీకు
మతి
చెడినట్లున్నది"
అని
మందలించెను.
మంధర
మరింత
ఆర్భాటము
చేయుచు,
"రాణీ!
నాకు
కాదు;
మతి
చెడుట
నీకే.
రాబోవు
ఆపత్తులను
యోచించక
గుడ్డినమ్మకముతో
ప్రవర్తించుచున్నావు.
నేను
నీ
క్షేమ
గౌరవములను
కోరియే
ఇంత
బాధ
పడవలసివచ్చెను.
వారందరు
వట్టి
నాటకము
లాడుచున్నారు.
నీవన్న
యేమాత్రమూ
గౌరవము
లేదు.
మహారాజునకు
పట్టపురాణిపై
తప్ప
అన్యరాణులపై
అంత
ప్రేమ
లేదు.
సమయస్ఫూర్తిగా
నిన్ను
తృప్తిపరచుటకై
ఇచ్చకపు
మాటలాడుచున్నారేకాని
నిజముగా
నీపై
ప్రేమలేదు.
నిజముగా
నీవన్న
వారలకు
గౌరవప్రేమలేయుండిన
రామపట్టాభిషేక
విషయమును
నీకేమాత్రమైనా
ఎన్నడైనా
తెలిపిరా?
ఎన్ని
నెలల
నుండియో
ఈ
పథకము
వేసికొనియుండుటచేతనే
ఈనాడది
ఈ
రూపమునకు
రాగలిగినది.
లేకున్న
పట్టాభిషేకము
అప్పటికప్పుడుట్టిపడునది
కాదు
కదా!
ఇదంతా
కౌసల్యాదేవి
పన్నిన
పన్నాగము"
అనెను.
అంత
కైక,
"ఛీ!
మంధరా!
అక్కగారికి
అట్టి
తలంపేనాడునూ
రాదు,
లేదు.
నేను
నమ్మను.
మహారాజుగారు
అంతకంటే
మంచివారు.
వారిలో
ఇట్టి
కుచ్చితపు
బుద్ధులు
మచ్చుకైనను
కనిపించవు.
ఏదో
కారణములు
లేక
అప్పటికప్పుడు
ఈ
కార్యమును
నిర్ణయము
చేసియుందరు.
రామ
కల్యాణ
మెన్ని
నెలల
ప్రయత్నము!
అది
అప్పటికప్పుడే
నిర్ణయమైనటులనే
రామ
పట్టాభిషేకముకూడ
నిర్ణయమైయుండును.
దీనికి
కారణము
మహారాజుగారే
తెలుపుదురు.
నీవు
విషయమును
తెలిసికొనక
వికార
భావములతో
పవిత్ర
హృదయములను
శంకించుచున్నావు.
కొన్ని
నిమిషములలో
విషయము
తెలియగలదు"
అని
మంధరను
మందలించెను.
13
▾
Meaning
Keep
మంధర
తన
పన్నాగము
పూర్తిగా
విఫలమగునేమో
అని
భయపడి
శ్రుతిమించు
స్థితికి
దిగి,
"తల్లీ!
నీవు
లోతుగా
యోచించు.
నేను
బైటనుండి
అనేక
విషయములు
విన్నాను.
అసలు
ఈ
పట్టాభిషేకము
కొన్ని
నెలలకు
పూర్వమే
నిర్ణయించుకొన్నారు.
అందుకనే
భరత
శత్రుఘ్నులను
బైటకు
పంపినారు.
వారుండిన
కొన్ని
ఇబ్బందులు
కలుగునేమో
యని
భయము.
దానికనేక
ఆధారములుకూడను
లేకపోలేదు.
కాకున్న
భరత
శత్రుఘ్నులు
లేని
సమయమున
ఈ
పట్టాభిషేకమేమిటి?
ఇంతమాత్రమైనా
నీవు
యోచించుకొనలేకపోతివా?
పూర్వము
నిన్ను
వివాహమాడు
సమయమున
నీకు
జన్మించిన
పుత్రునికే
పట్టాభిషేకమును
చేతునన్న
దశరథుని
వాగ్దానమును
నీవు
మరచినను,
నేను
మరువను.
భరతుడు
ఇప్పుడు
ఇక్కడున్నచో
దాని
విషయము
కొంత
విచారణలోకి
వచ్చునేమోయన్న
భయముతో
భరతుని
తాతగారి
దగ్గరకు
పంపటమైనది.
పట్టాభిషేకము
జరిగిన
తరువాత
ఎవ్వరూ
ఏమీ
చేయలేరు
కదా!
ఈ
యుక్తితో
ఇంత
గుట్టుగా
పెట్టి
నీకు
సహితము
తెలుపక
చేయుటలోనున్న
అంతరార్థమేమియో
నీవు
యోచించుకొనలేకపోవుచున్నావు.
తెల్లనివన్నియు
పాలే
అన్న
స్థితిలోనున్నావు.
ఇంత
అవివేకురాల
వగుచున్నావు.
'రాముడు,
రాముడు'
అని
రమించుచున్నావు.
పోనీ
అంత
ప్రీతిగానున్న
రాముడైనను
నీకు
తెలిపెనా?"
యనెను.
Previous
←
Paraśurāma
Next
Two Boons
→