Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · Two Boons
Rāma Kathā Rasa Vāhini
›
Part One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
కుటిల
మనస్కురాలైన
మంధర
అనేక
యుక్తులు
పన్ని,
నిర్మల
నిస్వార్థురాలైన
కైక
మనసును
మాలిన్యపరచి,
మహారాజుపై
కక్షను
సాధించుటకు
తగినరీతిగా
తయారు
చేసెను.
అంతటితో
కైక
మనసు
పూర్తిగా
మారలేదను
అనుమానముతో
మరింత
వినయ
విధేయతలు
ప్రదర్శించుచు
చెంతకు
వెళ్లి
కైక
పాదముల
చెంత
కూర్చుని
కంటిధారలు
విడుచునటుల
నటించుచు,
"అమ్మా!
ఈ
అయోధ్యలో
మనలను
గౌరవించువారెవ్వరు?
నిన్ను
లెక్కచేయువారెవ్వరు?
ఎన్నటికైనను
వారందరు
ఒకటియే.
నీవే
పరాయిదానవు.
కొన్ని
దినములలో
నిన్ను
అయోధ్యనుండి
పంపవచ్చు.
అంత
పనికికూడను
వారు
వెనుదీయరు.
మహారాజు
మహామాటకారి,
మాయలమారి.
నీచెంతకు
వచ్చినపుడు
మాత్రమే
అల్లిబిల్లి
మాటలాడి
అతని
కార్యమును
సాధించుకొని
ఆవలకు
పోవును.
అసలు
నీవు
దేనియందును
ప్రధాన
స్థానము
అందుకొనలేక
పోవుచుండుటలోనున్న
అంతరార్థమును
గుర్తించుకొనలేక
పోవుచున్నావు.
అమ్మా!
నీకు
జ్ఞాపకముండియుండవచ్చును.
అయోధ్యారాజులు
కేవలము
కామరూపులేకాని,
ప్రేమరూపులు
కారన్న
సత్యము
మీ
తండ్రిగారు
కనిపెట్టియే
ఈ
వృద్ధునకు
నిన్నిచ్చి
వివాహము
చేయుటకు
ముందు
అంగీకరించరైరి.
తదుపరి
అనేక
రాయబారములు
నడిపి
కడకు
అనేక
నిబంధనలు
పెట్టి
గర్గఋషి
మాటపై
నిన్నిచ్చి
వివాహము
చేయ
నిర్ణయించిరి.
అందులకంగీకరించి
వారు
నిన్ను
వివాహమాడిరి.
2
▾
Meaning
Keep
ఈనాడు
ఆ
నిబంధనలను
నీట
గలిపి,
నిన్ను
మంట
గలిపి,
నీ
కొమరునికి
ద్రోహము
చేయతలచి
ఈ
నాటక
మాడుచున్నారు.
లేకున్న
భరతుడు
రాజ్యమున
లేని
సమయము
కనిపెట్టి
పరరాజులెవ్వరూ
ఇందులో
భాగము
వహించుటకు
వీలులేకుండునటుల
అప్పటికప్పుడు
ఉట్టిపడినటుల
రేపటికే
పట్టాభిషేకమునకు
ఏర్పాట్లు
గావించుచున్నారన్న
యెంతటి
కుచ్చితపు
బుద్ధియో
తామే
యోచించుడు.
పరరాజులకు
తెలిపిన
వారితోపాటు
తమ
తండ్రిగారుకూడ
ఇందులో
పాల్గొందురు.
అపుడు
నిన్ను
వివాహమాడు
సమయమున
ఇచ్చిన
వాగ్దానమును
తమ
తండ్రిగారు
జ్ఞప్తికి
తేవచ్చును.
అందుచే
ఎవ్వరికీ
తెలియక
కార్యము
పూర్తిగా
ముగించిన
తరువాత
తెలిసినను
ఎవ్వరూ
ఏమీ
చేయలేరను
ఉద్దేశ్యముతో
ఈ
జిత్తులమారి
నక్కయూటలనాడుచున్నారు.
ఈ
సమయము
తప్పిన
నీగతి
కుక్కగతి
కావచ్చును.
కాన
ఆలసించక
చక్కగా
యోచించి
రామ
పట్టాభిషేకము
జరుగకుండుటకు
తగిన
విధానమును
విచారించుట
మంచిది"
అని
రోషమును
నూరిపోయుచున్న
మంధర
వాక్యములకు
మనసిచ్చి,
"మంధరా!
నీ
మాటలు
విన,
ఒకదానికంటె
మరొకటి
పరమ
సత్యముగా
తెలియుచున్నది.
నిజముగా
ఆలసించుటకు
ఇది
తరుణము
కాదు.
ఇంక
ఏమి
చేయవలెనో
దానినికూడ
నీవే
నిర్ణయించిన
అందుకు
తగినటుల
నేను
దానిని
క్రియారూపమునకు
తెత్తును"
అని
కైకేయి
అంగీకారమును
తెలుపగనే,
మంధర
మరింత
పొంగిపోయి
ఇక
పట్టశక్యముకాని
పటుత్వముతో,
"అమ్మా!
ఇందుకు
ఆలోచనలు
వేరక్కరలేదు.
కావలసిన
ఆధారములు
పరమ
సిద్ధముగనే
యున్నవి.
ఆనాడు
దేవాసుర
యుద్ధమున
తమ
సహాయమును
అందుకొని
మహారాజు
అత్యంత
ఆనందముతో
తమను
రెండు
వరములు
కోరుకొమ్మని
తెలిపెను
కదా!
ఆనాడు
నీవు
అతని
వలపులకు
లొంగి
పలుకులను
లక్ష్యపెట్టక,
నీకిప్పుడెట్టి
కోరికలు
లేవనియు,
అవసరము
వచ్చినపుడు
కోరుకొందుననియు
సెలవిచ్చితివి.
అవి
ఈనాడెంతయో
మేలు
చేయగలవు.
కాన,
వాటిని
ఈనాడు
కోరవచ్చును
కదా!"
అని
మంధర
చాల
తెలివి
తేటలుగా
పలుకగనే,
కైక
ఉలిక్కిపడినటుల
తలయెత్తి,
"మంధరా!
నీకెంత
తెలివితేటలే!
రూపమునకు
గూనిదానవైనా,
విచారణలో
3
▾
Meaning
Keep
మహాసుందరమైనదానవు.
రూపమందు
అందము
లోపించినా
తెలివితేటలలో
మహాప్రవీణురాలుగా
కనిపించుచున్నావు.
ఈ
రెండు
వరములు
ఈ
సమయమున
ఎట్లు
కోరవలెనో
దానిని
కూడనూ
సూచించుమ"ని
కైక
తెలుపగనే,
"అమ్మా!
ఒకటి
తమ
కుమారుని
యువరాజుగా
చేయుమనియు,
మరొకటి
రాముని
రాజ్యములో
నుండకుండునట్లు
చేయుమనియు
కోరవచ్చును"
అని
యోచించక
అతి
త్వరగా
చెప్పుట
చూచి
కైక
కొంత
యాలోచనలో
పడి,
"మంధరా!
కుమారునికి
పట్టాభిషేకము
చేయుమని
కోరుటలో
కొంత
న్యాయము
కలదు
కాని
రాముని
రాజ్యమునుంచి
పంపుమని
కోరుటలో
నా
మనసొప్పకున్నది.
అది
నన్నెంతగనో
బాధ
పెట్టుచున్నది"
అని
విచారముగా
కూర్చున్న
కైకను
చూచి
మంధర
మరింత
వెగటుగా,
"అమ్మా!
ఈ
పిరికితనమునకు
ఇది
సమయము
కాదు.
ఆలసించిన
అమృతముకూడ
విషముగా
మారవచ్చును.
ఇందులో
తప్పేమీ
లేదు.
ఈవిధమైన
కాఠిన్యమును
వహించకున్న
మన
కార్యము
నేమాత్రమును
సాధించలేము.
నీ
కొడుకు
రాజు
కావాలనియున్న,
నీవు
రాజమాతవు
కావాలనియున్న
ఈరీతిగా
నీవు
సాధింపుము.
లేదా,
నేనిప్పుడే
విషము
తీసికొని
ప్రాణమును
విడుతును.
బ్రతికి
నీ
బాధలు
చూడలేను"
అని
మహాప్రేమయుండినటుల
ప్రదర్శించి,
భోరున
ఏడ్చెను.
బాల్యమునుండి
కైకను
పెంచి,
ఆడించి,
పాడించి,
పెంచిన
దాది
యగుటచేత,
మంధరన్న
కైకకు
మహా
ఇష్టమగుటచేత,
మారుమాటాడక
మంధరను
సమాధానపరచుచూ,
"మంధరా!
నీవు
బాధపడకుము.
తప్పక
నేను
నీకానందము
నందింతును.
ఇపుడేమి
చేయమందువో
తెలుపుమ"నగా,
మంధర
రాముని
అరణ్యమునకు
పంపుటలో
నీవేమాత్రమూ
చింతించక
కోరుకొమ్మని
తొందరపెట్టెను.
కైక
రాజనీతులు,
పరిపాలనా
విధానములు,
పసిగట్టినదగుటచేత
అరణ్యమునకు
పంపుటలో
కొంత
కాలమును
కూడను
నిర్ణయించుట
మంచిదని
తలంచి,
ఆనాటి
నీమముల
ననుసరించి
12
సంవత్సరములు
దాటిన
అనుభవము
గలవానికే
హక్కులు
చెల్లునన్న
శాసనమును
4
▾
Meaning
Keep
గుర్తించి
14
సంవత్సరములు
అరణ్యవాసము
కోరిన,
తదుపరి
తన
కుమారునికే
స్థిరాధికారముండునని
భావించి
ఈ
రెండు
కోరికలను
కోరుటకు
సంసిద్ధురాలగుట
గమనించిన
మంధర,
"అమ్మా!
ఇక
ఆలసింపకుము.
నీవు
ఈరీతిగా
యుండి
కోరికలు
కోరినచో
మహారాజు
ఏమాత్రమూ
నీకు
లొంగడు.
నీవు
మహాక్రోధమును
ప్రదర్శించి,
శయ్యాగృహమును
యథారీతిగా
నుంచక,
చెల్లాచెదరు
చేసి
ఆభరణములు
అటూ
ఇటూ
పారవేసి,
తలను
విరియబోసుకొని
జీవితముపై
ఆశను
వదలినటుల
నటించుచు
కోపగృహమున
ప్రవేశించిన
అపుడే
నీ
కోరికలకు
తగిన
ఫలము
చేకూరును,
లెమ్ము,
ముందు
కార్యమునకు
ముందంజ
వేయుము"
అని
నిర్బంధపెట్టుటచేత
మంధర
మాటలకు
లోబడి
యథారీతి
గావించెను.
క్రోధ
గృహమున
ప్రవేశించెను.
మంధర
ఏమియు
తెలియనిదానివలె
తలుపులు
బిగించి
ద్వారము
దగ్గర
ఏడ్పుచుండునటుల
నటించుచు
కూలబడెను.
ఇంతలో
మహారాజు
కొలువునుండి
చేయవలసిన
ఏర్పాట్లు
అన్నియూ
గావించి,
కౌసల్య
మందిరమునకైనను
వెళ్ళక
తన
నిర్ణయమును
మొదట
కైకకు
చెప్పదలచి
అతివేగముగా
కైక
భవనమునకు
బయలుదేరి
వెళ్లెను.
దారిలో
పూర్తిగ
దాసీలు
ఏదో
విచారముగా
నుండినటుల
కనిపించిరి.
వీరలకు
రామపట్టాభిషేకము
తెలియదు
కనుక
ఈవిధముగా
నుండియుందురని
తలంచి
నేరుగా
శయ్యాగృహమునకు
వెళ్లెను.
అక్కడ
మహారాజు
చెదిరిపోయిన
నగలతో,
పారవేయబడిన
బట్టలతో
వికారమైయున్న
దృశ్యమును
గాంచి
ఆశ్చర్యపడి
కైక
కొరకై
అటూ
ఇటూ
తిరిగి
చూచెను.
ఇంతలో
దాసి
వచ్చి,
"మహారాజా!
కైకేయాదేవి
క్రోధ
గృహమున
కలర"ని
తెలుపగనే,
నిరాశా
హృదయుడై
అటు
దిక్కు
నడచిపోయెను.
కటిక
చీకటిలో
రోదన
చేయుచు
నేలపై
పడియుండిన
కైకను
చూచి,
"కైకా!
ఏమిటీ
వికారము?
ఇంత
కోపమునకు
కారణమేమి?
నిన్నిట్టి
స్థితికి
తెప్పించినవారెవ్వరో
తెలుపుము.
క్షణములో
వారిని
హతమార్చి
వత్తును.
నీకు
సంతోషమిత్తును.
నీ
మనోభీష్టమేదియో
తెలుపుము.
5
▾
Meaning
Keep
దానిని
నెరవేర్చుటకు
నేను
సంసిద్ధముగా
నున్నాను.
నీ
ఆనందమే
నా
ఆనందము.
నీకంటె
మించినది
ఈ
లోకమున
మరొక్కటి
నాకు
లేదని
నీకు
తెలియదా?
నన్నెందుకు
పరీక్షింతువు.
లెమ్ము.
నీ
అభీష్టము
చెప్పుము"
అని
అనేక
విధముల
తల
నిమురుచు
నేలపై
బడియుండిన
కైకను
ప్రశ్నించుచున్న
దశరథుని
చూచి
కైక
అతి
ఆవేశముతో
పండ్లు
కొరుకుచు
అతని
చేతిని
తీసి
ప్రక్కకు
విసిరి,
"చాలు
మీ
బూటకపు
మాటలు,
ఇంతకాలము
నమ్మి
నేనీ
స్థితికి
వచ్చితిని.
మీ
మాటలిక
నేను
నమ్మను.
మీరు
కపటనాటకమాడుదురని
నేనెన్నడూ
తలంచనైతిని.
మిమ్ము
నమ్మినందుకిదియా
శిక్ష.
చాలు
చాలు.
మీకిష్టమైనవారి
చెంతకే
పొందు.
మనస్సు
ఒకచోట,
మాటలు
మరొకచోట.
మనసిచ్చిన
వారికే
మాటలివ్వండి.
నేనిక
మీ
మాటలను
నమ్మునట్టి
పరిస్థితిలో
లేను.
అనవసరముగా
నన్ను
మరింత
బాధపెట్టక
వచ్చినదారిని
పొందు.
నేనేమైన
మీకేమి?
దాసినై
మరణించుటకంటె
రాణినై
మరణించుటే
మంచిది.
నేడే
నా
జీవితమునకు
అంత్యదినము"
అని
వెక్కివెక్కి
ఏడ్చుచున్న
కైకేయి
మాటలు
అర్థము
కాక
దశరథుడు
అయోమయ
స్థితిలో
నాశ్చర్యపడెను.
అంతటితో
ఊరుకొనక
మరింత
ప్రేమతో
దగ్గర
కూర్చుని,
"కైకా!
ఏమిటీ
మాటలు?
నాకు
అర్థమగుట
లేదు.
కపటపు
మాటలుకాని,
ఆటలుకాని,
నాలో
ఏనాటికీ
లేవు,
రావు.
మాట,
మనసు
రెండూ
ఒకేచోట
నుండునుకాని,
వేరువేరుగా
యుండుటకు
వీలులేదు.
ఇంతకాలమైనను
నన్ను
నీవు
అర్థము
చేసికొనలేక
పోవుటలోగల
కారణము
నాకు
తెలియకున్నది.
ఇంతకూ
జరిగినదేదియో
తెలుపక,
అర్థములేని
మాటలతో
నన్ను
చిత్రవధ
చేయకు.
నీవీ
విధముగా
నుండుటకు
కారణమేదో
తెలుపుము'
అని
బతిమాలెను.
కాని,
ఫలము
లేకపోయెను.
కైక
మాటిమాటికీ
దశరథుని
మాటలను
ఖండించుచు,
అలక్ష్యపరచుచు,
వెగటుగా
నవ్వుచు,
అతని
మాటలకు
విలువలేక
నటించుచున్న
ఆమె
చేష్టలు
మహారాజునకు
బాధ
కలిగించెను.
చేయునది
లేక
మంధరను
పిలిచెను.
మంధర
అంతకంటె
అధికమైన
శబ్దము
చేయుచు,
"మహారాజా!
అమ్మను
కాపాడుడు"
అని
పాదములపై
బడి
భోరున
ఏడ్చునటుల
నటించెను.
మహారాజు,
6
▾
Meaning
Keep
నిర్మలచిత్తుడగుటచేత,
వారిరువురు
చేయుచున్నది
నటనని
తలంచక,
ఏదియో
ప్రమాదము
జరిగిన
దనియును,
లేకున్న
తన
ప్రియురాలు
ఇంత
మొండిగా
ప్రవర్తించదనియు
తలంచి,
మంధరను
కారణము
తెలుపుమని
మరొక
పర్యాయము
అడుగుటచేత
మంధర,
"రాజా!
నేనేమని
తెలుపగలను?
నాకు
వివరములు
ఏమాత్రమూ
తెలియవు.
అమ్మగారి
క్రోధమునకు
కారణము
ఎవ్వరికీ
తెలుపుటలేదు.
ఉన్నట్లుండి
శయ్యా
గృహమునుండి
అతివేగముగా
క్రోధ
గృహమునకు
వచ్చుచుండుట
చూచి
నే
నిచ్చటికి
వచ్చితిని.
నేనెన్ని
విధముల
బతిమాలినను
ఏమియు
తెలుపుటలేదు.
తమరికే
తెలుపని
వారు
మాకు
మాత్రము
తెలుపుదురా!
అమ్మగారు
పడుచున్న
బాధను
మేము
చూడలేకపోవుచున్నాము.
అమ్మగారు
ఏమి
కాగలరో
అన్న
భయముచేత
క్షణక్షణము
కాచి,
మీకై
వేచి
యున్నాము.
తమరు
సమాధానపరుపకున్న
అమ్మగారు
ప్రమాదస్థితికి
రాగలరు.
ఇప్పటికే
కాలాతీతమయినది.
మేమిక
వెళ్లివత్తుము.
తమరే
కారణము
అడిగి
తెలిసికొని
అందుకు
తగిన
శాంతిని
చేకూర్చవలెన"ని
సెలవు
తీసికొని
బైటకు
వెళ్లెను.
మహారాజు
మంధర
మాటలు
విన్న
తర్వాత
మరింతగా
కంగారుపడుచు,
"కైకా,
నాదగ్గర
మరుగెందుకు?"
అని
క్రిందపడిన
కైక
తలను
ఎత్తి
తన
తొడపైన
ఉంచుకొని
అనేకవిధముల
కారణమును
తెలుపగోరెను.
కొంత
తడవైన
పిదప
కైక
కొంత
సర్దుకొంటూ,
"రాజా!
ఆనాడు
మీరు
దేవాసుర
యుద్ధమున
నాకొసగిన
రెండు
కోరికల
సంగతి
మరచిపోలేదు
కదా?"
అని
అడిగెను.
అందుకు
మహారాజు,
"కైకా!
ఇంతమాత్రమునకే
నీవింత
బేలవయ్యెదవేల?
నా
ప్రాణమున్నంతవరకు
నీకిచ్చిన
వరములు
మరువను,
మరువలేదు,
కైక
ఎంత
ప్రాణమో,
కైకకిచ్చిన
వాగ్దానమూ
అంత
ప్రాణసమానము.
దేవీ!
నిన్నెవరైనా
కష్టపెట్టిరా?
లేక
ఆరోగ్యము
సరిగా
లేదా?
ఏ
క్రూరులైనా
నీ
అభీష్టమునకు
విరుద్ధముగా
నడచిరా?
చెప్పుము!
నీకొరకై
నాకు
ప్రాణాపాయమయ్యే
పనియైనను
వెరువక,
ఆనందముగా
చేయుదును.
నీవు
7
▾
Meaning
Keep
సంశయించకుము.
ఓ
మంగళాంగీ!
నీవెందులకిట్లు
బాధపడుచున్నావు?
సమస్త
దేశములూ
నా
స్వాధీనమందున్న
విషయము
నీకు
తెలియును
కదా!
ఏ
దేశమునందైనను
సరే,
ఆ
దేశ
పదార్థములేవైనను
కావలయుననన్న
ఇచ్చుయే
యుండిన
తెలుపుము.
క్షణములో
వాటిని
తెచ్చి
నీకందించి
నిన్నానందపరచు
ప్రయత్నము
చేతును.
నీవు
దేనికి
భయపడుతున్నావో
దేనికి
దుఃఖించుచున్నావో
సంకోచపడక
తెలుపుము.
సూర్యుడు
మంచును
విడగొట్టినట్లు
నీ
భయమును,
దుఃఖమును
పారద్రోలుదును"
అని
అంటూ
దశరథుడు
కైకను
బుజ్జగించుచు
బతిమాలుచున్న
సమయమును
పురస్కరించుకొని
కైక
మంధర
చెప్పిన
మాటలను
మనసున
మరువక,
ముందు
తన
భర్తచేత
శపథము
చేయించనిదే
అప్రియము
చెప్పకూడదని
నిశ్చయించుకొని
బూటకపు
ప్రేమను
ప్రదర్శించుచూ,
కంటినీరు
తుడుచుకొనుచూ
కామోద్రేకుడైన
దశరథుని
హస్తము
పట్టుకొని,
"దేవా!
నాకు
ఎట్టి
కోపమునూ
లేదు.
నన్నెవరూ
అవమానించలేదు,
నిందించలేదు.
విదేశ
పదార్థములను
నేనంతకంటె
కోరుటలేదు.
కానీ
నాకొక
చిరకాల
కోరిక
కలదు.
దానిని
మీరు
చెల్లింతునని
ఒట్టు
పెట్టుకొనిన
ఆ
కోరికేమియో
మీకు
తెలుపగలను"
అంటూ
చిరునవ్వును
ప్రదర్శించిన
కైకను
గాంచి,
దశరథుడుకూడను
మందహాసముతో
మరింత
చెంతకు
వచ్చి
తలనిమురుతూ,
"ఓసీ!
వెఱ్ఱి
రాణీ!
ఇంతమాత్రమునకే
కొంప
మునిగినటుల
గోల
చేయవలయునా?
స్త్రీలలో
నీకంటే
ప్రియులును,
పురుషులలో
రామునికంటే
ప్రియులును
ఈ
లోకమున
ఎవ్వరును
లేరు.
మీరు
ఇరువురూ
నాకు
ప్రాణ
సమానులు.
ఇది
నీకు
బాగుగా
తెలియును.
ఒక్క
దినము
నా
రామునీ,
నిన్నూ
చూడకున్న
నేను
నిలువలేను;
బ్రతుకలేను.
కనుక,
అట్టి
రామునిపై
ఒట్టుపెట్టుకొని
తెలుపుదును.
నీ
కోరిక
ఏదియో
తెలుపుము.
తప్పక
చేతును"
అని
రెండు
చేతులు
పట్టుకొని
దశరథుడు
ఒట్టుపెట్టుకొనెను.
వెంటనే
కైక,
అమితానందముతో
లేచి
కూర్చొని
దశరథుడు
అనుకూలుడుగా
మారినట్లు
సంతోషించి
మరింత
ప్రేమను
చూపుచూ,
"రాజా!
రాముని
సాక్షిగా
మీరు
మాట
చెల్లించునటుల
శపథము
చేసితిరి,
ఇది
నిజమేనా!"
8
▾
Meaning
Keep
అని
అడుగుచూ
"రాజా!
మీరు
సత్యసంధులు,
పరమధార్మికులు,
మహా
పరాక్రమవంతులు.
దేవాసుర
యుద్ధము
మీకు
జ్ఞాపకముండకపోదు.
అయినను
నేను
మరొకపరి
తమకు
హెచ్చరింతును.
ఆ
రాత్రి
శంబరాసురుడు
అందరినీ
సంహారము
చేయగా,
మీరు
కడయూపిరితో
బాధ
పడుచుంటిరి.
ఆనాడు
నేనే
మీకు
సహాయము
చేయకున్న,
మెలకువతో
కాపాడకుండిన,
మీరేమయి
ఉండెడివారో
మీకే
తెలుసు.
అట్టి
పవిత్ర
త్యాగమునకు
మెచ్చి,
కైకా!
నా
ప్రాణమునే
కాపాడితివి.
అట్టి
నీకు
నేను
ఏమి
ప్రత్యుపకారముగా
ఇవ్వగలను?
ఏమయినను
సరే,
రెండు
వరములు
కోరుకొనుము,
తప్పక
నేను
నీకిత్తును.
నా
కృతజ్ఞత
చెల్లింతును"
అని
మీరు
నన్ను
కోరితిరి.
అందుకు
నేను,
మీరు
క్షేమంగా
బ్రతికినదే
పదివేలుగా
భావించి,
'నాథా!
నాకేమియూ
అక్కరలేదు.
కావలసిన
సమయమున
కోరుకొందును.
ఆ
రెండు
వరములు
మీచెంతనే
దాచిపెట్టుకొనుడు.
నాకవసరమైనప్పుడు
ఇప్పించుకొందున'ని
అతి
వినయముతో
ప్రార్థించితిని.
అందులకు
తమరుకూడ
ఆనందించి
నా
త్యాగమును
మెచ్చుకొని
నా
జీవితములో
ఎప్పుడు
అడిగిననూ
నిధివంటి
నీ
రెండు
కోరికలనూ,
ఎట్టి
అడ్డూచెప్పక
అందింతునని
సెలవిచ్చితిరి.
ఇవి
మీకు
మదియందుండియే
యుండును
కదా!
తమరు
భూమినేలు
ప్రభువులు.
ఆడి
తప్పనివారు.
కాన,
ఆనాడు
నేను
మీచెంత
దాచిన
రెండు
వరములు
నాకిచ్చి
నన్నానందపరచుమని
ప్రార్థించుచున్నాను.
నేను
నూతన
కోరికలేమాత్రమునూ
కోరుటలేదు.
ఆనాడు
మీరు
నాకిచ్చిన
కోరికలనే,
నావి
నాకివ్వమనియే
కోరుచున్నాను.
దాచిన
ధనమును
వెనుకకు
ఇవ్వనివారు
మహాపాపులగుదురన్న
సంగతి
నేను
వేరు
చెప్పనక్కరలేదు.
అట్లు
తమరు
వీలుకాదన్న
నాకు
పరాభవము,
ద్రోహము
చేసినట్లగును.
అట్టి
పరాభవమును
భరించుటకంటె
ప్రాణములు
విడుచుట
మంచిది.
సతికిచ్చిన
మాటలనే
పతి
చెల్లించకుండిన
ప్రజల
అభీష్టము
నెట్లు
చెల్లించగలరు?
సతిని
నమ్మించి
మోసము
చేయు
ప్రభువు
ప్రజా
పరిపాలనకు
అర్హుడుకాడు
కదా!
అట్టివారు
ప్రభువు
కాదన్న
మనుధర్మము
తమరెరుగనిదా?"
9
▾
Meaning
Keep
వేయేటికి?
ఈనాడు
నా
కోరికలు
నాకు
చెల్లించకున్న
సూర్యోదయము
లోపలనే
కైక
ప్రాణములతో
ఉండదు"
అని
గోడున
ఏడ్చుచున్న
కైక
నటనలకు
ఖిన్నుడై
వలనుపన్నిన
బోయవాడు
కేక
వేయగనే
జింక
పరుగెత్తుకొని
వచ్చి
వలలో
పడినట్లుగా,
కైక
పన్నిన
వలలో
దశరథుడు
ఏమియు
తెలియక
కామమోహితుడై
పడి
ఆమె
కోరికలకు
లొంగి
ఉన్మత్తుని
వలె,
"ఈ
క్షణమునందే
నీ
రెండు
కోరికలను
ఇత్తున"ని
కైక
హస్తము
తీసి
తన
హస్తముతో
ప్రమాణము
చేసెను.
ఆ
మాట
వినగనే
కైక
ఉత్ఫుల్ల
నేత్రాలతో
దశరథుని
ముఖమును
చూచుచూ,
"రాజా!
మీరెంత
మంచివారో,
ఈనాడు
నాకర్థమయినది.
అడినమాట
తప్పరన్న
సత్యము
నేడు
సాక్షాత్కరించెను"
అని
అనేకవిధముల
వర్ణించ
మొదలుపెట్టెను.
అందులకు
కాముడైన
దశరథుడు
ఉబ్బి,
"కైకా!
ఇంకా
కాలహరణ
మెందుకు?
కోరుకొమ్మ"ని
తొందరపెట్టెను.
కైక
మాటలు
తడబడ,
"రేపటి
దినము
రామునికొరకు
ఏర్పాటు
చేసిన
అభిషేకపు
ఏర్పాటు
వైభవములన్నింటితో
నా
కొమరుడగు
భరతునకు
రాజ్యాభిషేకము
చేయించుట
మొదటి
కోరిక;
ఇక
రాముడు
జటాజినములు
ధరించి,
నార
వస్త్రములతో
దండకారణ్యమున
పదునాలుగేండ్లు
తాపసునిగా
వనవాసముచేసి
రావలెను.
ఇది
నా
రెండవ
కోరిక.
భరతుడు
నిరాటంకముగా
యువరాజు
కావలెను.
రాముడు
ఇప్పుడే
నా
కళ్ళ
ఎదుటనే
ప్రయాణము
కావలెను.
ఈ
రెండు
కోరికలు
చెల్లించి,
తాము
తమ
వంశగౌరవమును
నిలబెట్టుకొనుడు,
లేదా
ఈ
క్షణములో
కైక
మరణమునకైనా
ఒప్పుకొనుడు"
అని
రాక్షసివలె
దిట్టముగా
లేచి
నిలబడెను.
ఈ
దారుణమైన
కఠినపు
మాటలకు
మహారాజు
దద్దరిల్లిపోయెను.
"ఇది
కలయా?
లేక
నిజమా?
ఈ
కోరికలు
కోరునది
కైకయేనా?
లేక
పిశాచమా?
రెండునూ
గాక
నా
చిత్తభ్రమణమా?
నా
మనో
జాడ్యమా?"
అని
అంతు
తెలియనివానివలె,
"కైకా!
నీవు
కైకవా?
లేక
కైక
రూపమును
ధరించిన
మహారాక్షసివా?
మొదట
తెలుపుము"
అంటూ
అవయవములు
పట్టుతప్పినవాని
వలె
నోట
మాటరాక
కదలుటకు
దేహము
స్వాధీనంలో
లేక
పిచ్చి
పట్టినవానివలె
అటూ
ఇటూ
పిచ్చి
10
▾
Meaning
Keep
చూపులు
చూచుచూ,
కన్నులనుంచి
నిప్పుకణములు
రాలుస్తూ,
కైకవైపు
చూచి,
"ఓ
దుష్టచారిణీ!
ఏమి
నీ
యీ
దుర్బుద్ధి!
నా
వంశమునే
నిర్మూలనము
చేయ
సంకల్పించితివా?
నీ
ప్రేమ
పుత్రుడగు
రాముడు
నీకేమి
యపకారము
చేసెను?
తన
తల్లియైన
కౌసల్యకంటె
అధికముగా
నిన్ను
ప్రేమించిన
నా
రాముని
కారడవుల
కంపమనుటలో
నీ
మనసెట్లొప్పెను?
ఇంతకాలము
నిన్ను
రాకొమారివనుకొంటిని.
దారుణ
విషసర్పమును
అజ్ఞానమువలన
ఇంటిలో
ప్రవేశపెట్టుకొంటిని.
నా
ప్రాణాధారుడైన
రాముని
సకల
ప్రాణికోటియు
కొనియాడుచుండగ
నీకెందుకిట్టి
పాపబుద్ధి
పుట్టెను?
అవసరమైతే
రాజ్యాన్నైనా
కడకు
ప్రాణమునైనా
వదలగలను
కాని
రాముని
వదలలేను,
వదలను!
నీకు
నీ
కుమారుడు
రాజు
కావాలన్న
చేసుకో!
నేను,
కౌసల్యా
సుమిత్రాదులతో
నా
రాముని
తీసికొని
అరణ్యమునకు
వెళ్ళుదును.
అంతేకాని
రాముని
మాత్రము
ఒంటరిగా
అరణ్యమునకు
పంపను,
అది
వీలుకాదు.
ఈ
పాపిష్టి
కోరికను
మానుకో.
రామునిపై
కోపము
వద్దు
కైకా!
నిజముగా
నీవీ
కోరికను
కోరుచున్నావా?
లేక
నాకు
భరతునిపై,
నీపై
ప్రేమ
యున్నదో
లేదోయని
పరీక్షించుచున్నావా?
పోనీ,
నీ
కుమారునకు
రాజ్యాభిషేకం
చేయవలెనని
కోరవచ్చునుగాని,
రాముని
అడవులకు
పంపుమని
కోరుటలో
అర్థము
లేదు.
తమాషాకైనను,
పరిహాసమునకైనను
ఇట్టి
కోరిక
కోరరాదు.
మహా
పాపము.
కైకా!
రాముడు
జ్యేష్ఠపుత్రుడు,
మహా
గుణవంతుడు.
అతని
పరిపాలన
దినములు
మహా
వైభవముగా
నుండును.
అట్టి
దినములు
నే
చూడవలెనని
కలలు
కంటున్నానని
నీవే
అనేక
పర్యాయములు
నాతో
తెలిపితివి
కదా!
ఈనాడు
అట్టి
రామచంద్రుని
అరణ్యమునకు
పంపుమని
కోరుటలోగల
అంతరార్థమేమి?
నాతో
పరిహాసమాడుచున్నావా?
పరిహాసమే
అయిన
ఈ
క్రోధ
గృహమున
ప్రవేశించుట
ఏమిటి?
ఈ
కటిక
నేలపై
పరితపించుటయేమిటి?
పరిహాసమునకు
కూడ
నొక
హద్దు
ఉండవలెను
కదా?
మితిమీరిన
పరిహాసము
మతిచెడినదే
కాగలదు.
ఇట్టిది
పరిహాసమునకైనను
భరించలేను.
రాముని
వీడలేను.
11
▾
Meaning
Keep
కైకా!
ఇంతవరకు
నీవు
ఎంత
బుద్ధిమంతురాలుగా
ప్రవర్తించితివి!
ఇప్పుడు
నీకు
విపరీతపుబుద్ధి
పుట్టినది.
వినాశకాలము
ఆసన్నమగుచున్నందుననే
నీకిట్టి
విపరీతపు
బుద్ధులు
పుట్టినవి.
మంచివారికి
కీడు
తలపెట్టుట
మహాపాపము.
సత్పురుషులను
సతాయించుట
రాక్షస
కృత్యము.
అందువలన
మంచివారికి
ఎట్టి
కీడునూ
ఉండదు.
దుర్మార్గుల
దుష్టబుద్ధులు
సన్మార్గుల
కీర్తి
ప్రకాశములు
కాగలవు.
కాని
ప్రస్తుత
స్థితిలో
చర్చించుట,
కొంత
కష్టముగా
తోచును.
ఈనాటి
దుష్టతలపులవలన
ఇక్ష్వాకు
వంశమునకే
అనర్థము
రాబోవుచున్నది.
ఇంతవరకు
నీవొక్క
అనుచితమైన
పనినికాని,
అప్రియమైన
పనిని
కాని
చేసి
ఎరుగవు.
ఇప్పుడిట్టి
కోరిక
కోరుచున్నావు.
నన్ను
నేనే
నమ్మలేకపోవుచున్నాను.
కైకా!
నిరంతరము
ధర్మభీతి,
దైవప్రీతి
కలిగిన
నీవు
ఈనాడు
ధర్మభీతిని
ఎట్లు
వదలితివి?
దైవప్రీతిని
ఏమి
చేసితివి?
ధార్మికుడైన
రామునికి
పదునాలుగేండ్లు
అరణ్యమునకు
పంపుమనుటలో
నీ
యుద్దేశమేమి?
కుసుమకోమల
శరీరుడైన
రాముడు,
సుందరాకారుడైన
రాముడు
కారడవులలో
ఎండి,
పడరాని
బాధలు
పడుటవలన
నీకు
వచ్చు
లాభమేమి?
మన
రాజభవనములో
వేలాది
సేవకులు
దాసీలు
కలరు.
అందులో
ఒక్కడైనను
రాముడిట్టివాడని
అతనిలో
ఒక్క
తప్పునైనను
చూపగలడా?
పోనీ,
మన
రాజభవనమటుంచి,
మన
నగరమున
రామునియందు
తప్పు
ఒక్కటైనను
చూపెట్టగలవానిని
తేగలవా?
చూప
గలవా?
అనేక
దీనజనులకు
తానే
ధనము
నిచ్చి,
ఆదరించి,
దరిద్రులను
జూచి
వారికి
గృహ
వసతులు
కల్పించి,
అనేకవిధముల
ఆదరించి
ప్రజాప్రేమను
చూరగొన్న
రాముని
నీవు
ద్వేషించుటలో
ఎంత
కిరాతకురాలవో
చెప్పలేకున్నాను.
అనేకవిధముల
ప్రజలను
పీడించి
తమ
స్వార్థమును
లక్ష్యమందు
ఉంచుకొని,
తమ
మంచినే
తాము
చూచుచూ,
ప్రవర్తించే
కిరాతకులు
నేడు
మంచిగా
కనిపించుచున్నారు.
దీనులను,
దరిద్రులను
ఆదరించి,
అనుకూలములు
సలిపి
వారల
యోగ
క్షేమములను
స్వయముగా
విచారించి,
12
▾
Meaning
Keep
ప్రజల
మేలును,
ప్రజాక్షేమమును
కోరి
ప్రవర్తించువారు
చెడ్డవారగుట
యుగదోషమా?
లేక
నా
పాప
ఫలమా?
సమస్తజనులు
రాముని
గుణగణములను
వర్ణించుచూ,
పొలములందు
సహితము
తమ
పనులలో
అలసట
కలిగినపుడు
ఆ
బాధను
భరించు
నిమిత్తమై
రామ
గుణములను
పాటలుగా
పాడుచున్నారన్న
వార్తలు
విని
నేనెంతయో
సంతోషించుచుందును.
అట్టి
దయామయునకు
ఈ
దారుణ
శిక్ష
నిచ్చుటకు
నీకు
మనసెట్లొప్పెను?
నేటి
సాయంకాలం
పురప్రముఖులను,
ఋషులను,
మహనీయులను,
మంత్రులను,
పండితులను,
అనేక
మంది
తెలివితేటలు
కలవారిని
అందరినీ
ప్రోగుచేసి
రామపట్టాభిషేక
విషయమై
హెచ్చరించగా
చేరినవారిలో
నొక్కడైననూ,
అసంతృప్తిని
తెలుపక,
అనేకరకముల
రాముని
కొనియాడిరి.
"అట్టి
జితేంద్రియుడు,
త్యాగమూర్తి,
సత్యవ్రతుడు
అయిన
రాముడు
మా
ప్రభువు
కావటము
మా
పూర్వజన్మ
పుణ్యమ"ని
జేజేలు
తెలిపిరి.
అట్టి
ప్రజామన్ననలనందుకొన్న
నా
ప్రేమరాశిని
నీవు
అరణ్యమునకు
పంపుమని
కోరుదువా?
నీవేమైనను
సరే.
నేను
నా
రాముని
అడవులకు
పంపను.
అంతియేకాదు,
రేపటి
దినము
రామపట్టాభిషేకము
తప్పదు"
అని
మొండి
ధైర్యముతో
తెలుపుచున్న
దశరథుని
చూచి,
కైక,
అమిత
రౌద్రాకారమును
ధరించి,
"రాజా!
నా
రెండు
వరములు
చెల్లింతువని
కొన్ని
నిమిషములకు
పూర్వము
తాము
అనేక
ప్రమాణములు
చేసి,
ఇప్పుడు
నా
వరములు
చెల్లించుటకు
వెనుకంజ
వేయుటలో
ఇక్ష్వాకుల
వంశమునకు
అపకీర్తి
తెచ్చునది
మీరా?
నేనా?
బాగుగా
విచారించుకొనుడు.
ఆడిన
మాటలు
తప్పని
వారే
ఇక్ష్వాకువంశజులన్న
బిరుదునకు
మీరే
కళంకమును
కలిగించుచున్నారు.
ముందు
వెనుక
యోచించక,
తప్పక
నీ
వరములిత్తునని
తెలిపినట్టి
తప్పు
మీదేకాని
నాది
కాదు.
ఆనాడు
ఇచ్చినది,
నేడు
ఇచ్చినది,
మీరే.
మీరిచ్చినవాటినే
మీరు
వమ్ము
చేయుటలో
మీ
ఘనతను
మీరే
యోచించుకొనుడు.
13
▾
Meaning
Keep
అబలను
మోసపుచ్చుట,
ఆడినమాటను
తప్పుట
పరిపాలకులకు
తలవంపులేకాని
గౌరవ
ప్రతిష్టలు
కాజాలవు.
ఆడిన
మాటలను
తప్పి
అంగనలను
వంచించువారు
మహాకిరాతకులేకాని,
ప్రభువులు
కాజాలరు.
ప్రభువులే
ఇట్టి
కిరాతక
చర్యలకు
పూనుకొన్న
ప్రజల
కడగండ్లకు
అంతుండదు.
అట్టి
రాజ్యము
రాక్షస
రాజ్యమునకు
సరి.
ఇంతకాలము
అనేక
విధముల
గౌరవ
మర్యాదలను
సంపాదించుకొన్న
మీబోటివారే
ఆడిన
మాట
తప్పిరన్నచో,
ఆ
అపకీర్తి
మీకేకాని
నాకు
కాదు.
పూర్వపురాజుల
వృత్తాంతములు
జ్ఞాపకము
తెచ్చుకొనుడు.
మీ
ప్రమాణమును
భంగము
గావించుకొనకుండ
చూచుకొనుడు!
రాజా!
బాగా
ఆలోచించండి.
మీరు
చాల
దుర్మార్గమునకు
ఒడిగట్టుచున్నారు.
ధర్మము
తప్పుచున్నారు.
పోనీ,
మీరంత
తెలివితేటలు
గలవారే
అయియుండిన,
నా
కోరికలేవియో
బాగుగా
విచారించి
తదుపరి
వాగ్దానము
చేసియుండవలెను.
మీరు
కామోద్రేకులై,
కన్ను,
మిన్ను
కానక,
ముందు
వెనుక
చూడక,
నా
మాటలకు
కట్టుబడి,
వరములిచ్చి
ఇప్పుడు
వాటిని
చెల్లించుటలో
నాదే
తప్పని
నన్ను
నిందించుటలో
మీరెంత
పొరబడుచున్నారో,
మీరెంత
తెలివితక్కువవారో
యోచించుడు.
ధర్మభీతి,
దైవప్రీతిగల
నేను
ధర్మమును
లెక్క
చేయక,
దారుణమార్గమున
ప్రవేశించినటుల
చెప్పితిరి.
కాని
ధర్మవ్రతుడు,
దైవసమానుడన్న
కీర్తిని
ఆర్జించిన
మీరు
ఆడినమాట
తప్పుటలో
మీరెంత
ధర్మవ్రతులో
మొదట
మీకు
మీరు
యోచించుకొనుడు.
ఎదుటివారి
తప్పులను
మాత్రమే
వెతుకుటలో
నున్న
తెలివితేటలు
అంత
ఉత్తమమైనవికావు.
తమలోని
తప్పులను
కూడ
తాము
వెదికి
వాటిని
అట్టి పెడమార్గము
పట్టనీయక
చూచుకొనుటలో
తెలివితేటలకు
ఘనత
చేకూరగలదు.
సర్వ
మెరిగిన
ప్రభువులే
ఇట్టి
విచారణ
సలుపక
తమ
స్వార్థమును
మాత్రమే
తాము
చూచుకొన్న
మాబోటి
అబలల
గతి
చెప్పనక్కరలేదు.
అట్టి
మీరే
చేయుచుండిన
మేము
చేసితిమన్న
అందులో
తప్పేమీ
యుండదు.
14
▾
Meaning
Keep
వరము
లిచ్చినది
సత్యము,
ప్రమాణము
చేసినది
సత్యము,
మాటను
తప్పినది
సత్యము.
ఈ
మూడును
సత్యములా
కాదా!
మీరే
యోచింపుడు.
పుత్రప్రేమతో,
సతీకామముతో,
తబ్బిబ్బై
మాటను
నీటగలిపినది
మీరే
కాని
నేనుకాదు.
పుత్రప్రేమ
తల్లికి
సహజమే.
తన
కుమారుడు
రాజు
కావాలని
కోరుట
తల్లిస్థానమందున్న
ప్రతి
స్త్రీకి
సహజమే.
అట్టి
రాజ్యము
స్థిరముగా
కాపాడుకొనుటలో
అందుకు
తగిన
ముందు
యోచనలు
చూచుకొనుటకూడ
తల్లి
అనువారికి
కర్తవ్యమే.
నేను
సహజ
కర్తవ్యములనే
అనుసరించితిని
కాని
విరుద్ధమును
చేపట్టలేదు.
రామునకు
రాజ్యాభిషేకము
చేసిన,
అతని
తల్లి
కౌసల్య
రాజమాత
కాగలదు.
నా
కుమారుడు
రామాజ్ఞలలో
చేతులు
కట్టుకొని
చెప్పిన
పనులు
చేయుచూ,
పనివానివలె
నమస్కరించుచుండుట
నేను
ఒక్క
దినమైనను
చూడలేను.
చూచి
జీవించలేను.
ఆనాడు
నా
కుమారుని
దుస్థితిని
జూచి
జాలిపడుట
కన్నా
విషము
త్రాగి
ప్రాణమును
వీడుట
మంచిది.
రాజా!
నా
ప్రాణసమానుడైన
భరతునిమీద
ఒట్టు
పెట్టుకొని
చెప్పుతున్నాను.
రాముణ్ణి
అరణ్య
వాసమునకు
పంపించడముకన్నా
మీరేమి
చేసినా
నేను
తృప్తిపడను"
అని
అతి
తీక్షణమైన
మాటలు
కైకేయి
పలికి
నేలమీద
పడుకొని
వెక్కివెక్కి
ఏడ్వసాగెను.
అంత
దశరథుడు
పిచ్చెత్తినవానివలె
తన
తల
బాదుకొంటూ,
"కైకా!
ఈ
అనర్థము
నీకు
మేలగునని
ఎవరైనా
బోధించినారా?
లేక
యేదైనా
పిశాచము
పట్టి
నీవిట్లు
పీడింప
బడుచున్నావా?
రాముణ్ణి
అరణ్యమునకు
పంపుమని
భరతునకు
పట్టము
గట్టుమని
కోరుటలో
ఏమిటి
ఈ
వికారము?
ఎందుకీ
విపరీత
బుద్ధి?
కైకా!
నీ
భర్తనైన
నాకునూ,
నీ
పుత్రుడైన
భరతునకును,
ఈ
రాజ్యానికి
నీవు
మేలుచేయ
తలంచుకొన్నట్లయితే,
ఈ
విపరీతపు
కోరికలు
వీడుము.
బాగుగా
ఆలోచించుకొనుము.
లేకున్న,
నీవు
నేను
నీ
కొమరుడు
నిష్కారణముగా
అపకీర్తి
పాలు
కావలసివచ్చును.
అంతటితో
పోక,
రాజ్యము
నాశనము
కాగలదు.
ఇంకా
అనేక
ప్రమాదములు
సంభవింపవచ్చు.
15
▾
Meaning
Keep
నీచురాలా!
ఈనాడు
నీవు
కోరినట్లు
నేనంగీకరించినను
భరతుడు
రాజ్య
పట్టాభిషేకమునకు
ఒప్పుకొనుననుటలో
నమ్మకమేమి?
భరతుడు
ధార్మికుడు,
మతిమంతుడు.
రాముణ్ణి
అడవులకంపుటకుకానీ,
ఈ
రాజ్యమును
ఏలుటకు
కానీ
భరతుడు
ఒప్పుకోడు.
ఒక్క
భరతుడేకాదు;
మంత్రులు,
పురోహితులు,
మిత్రులు,
జనులు,
ఋషులు,
అందరూ
నీ
అభీష్టమునకు
విరుద్ధులే
అగుదురు.
ఇందరి
అసంతృప్తితో
నీవేమి
ఆనందించగలవు?
చక్కగా
యోచించుకో.
పైవారల
అంగీకారముతో
ఏకాభిప్రాయముంచి,
నేటి
సాయంకాలమున
జనసభామధ్యమున
రామాభిషేకము
గావింతునని
ప్రకటించితిని.
ఈనాడు
నా
మాటకే
నేను
అడ్డుతిరిగిన,
సేనతో
యుద్ధమునకు
ప్రవేశించి
శత్రుసేనలను
చూచి
తిరిగి
వచ్చినట్లగును
కదా!
రామాభిషేకమునకు
సకలమూ
సంసిద్ధమే.
అందరికీ
వార్త
అందించితిని.
ప్రజలు
రేపటి
ఏర్పాట్లు
తగినరీతి
గావించుచున్నారు.
నగరము
అప్పుడే
జనముచే
క్రిక్కిరిసి
కళకళలాడుచున్నది.
ఈ
సమయములో
నేను
రాముణ్ణి
వనవాసమునకు
పంపిన,
రామాభిషేకం,
రాజ్యపరిపాలన,
వనవాసం
కావటం,
ఒక
రాత్రిలో
జరిగిపోయెనా
అని
ప్రజలు
నన్ను
పరిహసించరా?
జనసభామధ్యమున
ప్రకటించిన
పలుకులు
నేనిప్పుడేరీతిగ
సమర్థించుకొందును?
మహారాజు
ఇంత
తెలివితక్కువవాడని
ప్రజలు
ఎంతగా
వెక్కిరింతురు!
ఇన్ని
సంవత్సరములు
ప్రజామన్ననల
నందుకొనిన
దశరథ
మహారాజు
మహాధార్మికుడు,
గుణవంతుడు,
శౌర్యవంతుడు
అను
పేరుగాంచి
కడకు
యింత
తెలివితక్కువగా
ప్రవర్తించెనన్న
అపకీర్తి
నేనెట్లు
భరింతును?"
అని
అనేకవిధముల
తన
గౌరవ
మర్యాదలనుకూడనూ
విప్పి
కైకకు
తెలియునట్లు
తెలుప
యత్నించెను.
కానీ
కైక
మహామారిగా
మారి,
దశరథుని
మాటలను
అణుమాత్ర
మైననూ
లెక్కచేయక
అతని
గౌరవ
ప్రతిష్టల
నాలోచించక,
తన
పట్టును
వీడక
క్షణక్షణమునకు
తన
వాంఛను
పెంచుకొనుచుపోయెను.
మహారాజు
మాటలకు
విరుద్ధముగా
16
▾
Meaning
Keep
పలుకుచు
అతని
వాగ్దానమును
పలుమార్లు
అతనికి
జ్ఞాపకము
చేయుచూ
వచ్చెను.
అంత
దశరథుడు,
"కైకా!
రాముడు
అరణ్య
వాసమునకు
పోయిన
నేను
క్షణమైనను
బ్రతుకను.
కౌసల్య
స్థితి
చెప్పనక్కరలేదు.
ఈ
క్షణమే
ప్రాణము
వీడును.
ఇక
సీత
తల్లడిల్లక
మానదు.
రాముణ్ణి
వీడి
క్షణకాలమైన
తాను
ఉండలేదు.
ఈ
ఘోరమును
ప్రజలు
చూడలేరు.
మహామేధావి,
గుణశీలుడైన
రాముని
అరణ్యమునకు
పంపుచుండ
లక్ష్మణుడు
ఊరకుండునా?
వేయేటికి?
మరుక్షణమే
లక్ష్మణుడు
నీ
ప్రాణమును
తీయును.
ఇది
సత్యము.
కడకు
మన
రాజ్యమిన్ని
అనర్థములకు,
అవస్థలకు
గురి
కావలసి
వచ్చును.
నీకు
తెలిసి
తెలిసి
ఈ ముండబ్రతుకున
కెందులకు
ఇంత
ప్రయత్నము
జరుపుకొనుచున్నావో
అర్థమగుటలేదు.
దురాత్ములారా!
నీ
చక్కదనమును
చూచి
నేను
మోసపోతిని.
బంగారు
కత్తికదా
అని
గొంతు
కోసుకొనుటకు
ప్రయత్నించు
మూఢుడనైతిని.
విష
క్షీరమును
త్రాగినవాడనైతిని.
నన్ను
అనేక
ఇచ్చకాలతో
మోసము
చేసితివి.
కడకు
నా
వంశమునే
మట్టిపాలు
చేయ
సంకల్పించితివి.
భీ!
నేనెంత
మూఢుడను.
అనేక
యాగములు
సల్పి
దైవ
కటాక్షమున
లభించిన
పవిత్ర
పుత్రుని
అమ్ముకొని
స్త్రీ
సుఖమును
కొనుక్కొనే
పాపినా
నేను?
ఇట్టిది
దశరథ
మహారాజు
చేయతగినదా?
ఇట్టిదానికి
నే
ఒడిగట్టిన,
కుక్కలు
కూడనూ
నన్ను
నిందించును
కదా!
ప్రతి
బాలుడుకూడను
నన్ను
చూచి
రాలు
రువ్వకుండునా?
కడకు
ఇట్టి
గతియా
దశరథునకు?
భీ!
ఇది
నా
పురాకృత
దుష్కృతము.
మెడకు
వేసికొన్నది
ఉరిత్రాడని
తెలియక
భద్రపరచినట్లయినది.
ఇంతకాలం
రమించినది
మృత్యు
దేవతనే
విషయము
నాకు
తెలియకపోయెను.
చేతులారా
మృత్యువును
రమించితిని,
వర్ణించితిని.
అది
నా
పాప
ఫలము.
కాకున్న
స్త్రీ
సుఖమునకై
కన్న
కొడుకును
కారడవుల
కంపునట్టి
తండ్రులుందురా?
అయ్యో!
ఏమిటి
ఈ
విచిత్రము!
ఇప్పటికి
కూడను
నేను
నమ్మలేకున్నాను.
17
▾
Meaning
Keep
కైకా!
మార్చుకొమ్ము
నీ
మూఢ
తలంపు.
రాముడు
నా
మాటకు
మారు
మాట్లాడడు.
అసలు
ఈ
విషయమును
వినిన
చాలు,
చెప్పనక్కరలేదు,
అడవికి
వెళ్లుటకు
సంసిద్ధుడు
కాగలడు.
నన్నెందులకు
అడవికి
పంపుచున్నావనికూడనూ
ప్రశ్నించడు.
అట్టి
గుణ
శీలుడు
రాముడు.
రాముడేమిటి?
నా
కుమారు
లెవ్వరును
నా
ఆజ్ఞను
మీరరు.
భరతుడు
నీ
యా
తలంపును
వినిన
సహించడు.
తల్లి
అనికూడను
విచారించక
ఏమైననూ
చేయవచ్చు.
భరతునకు
రాముడన్న
పంచప్రాణములు.
నీ
కోరికకు
విరుద్ధముగా
నైనను
చేయ
సంసిద్ధుడు.
అనగా
భరతుడే
అడవికి
వెళ్లి
రామునకు
పట్టాభిషేకము
చేయవచ్చు.
అట్టి
గుణశాలి
భరతుడు.
వాని
మనసును
కూడను
గమనించలేని
దుర్బుద్ధి
నేమని
చింతింతును!
కైకా!
'వినాశకాలే
విపరీత
బుద్ధిః'
అన్నట్లు
నీ
వినాశమునకే
ఈ
వికారపు
తలంపులు
కలుగుచున్నవి.
ఈ
యిక్ష్వాకుల
వంశమునకే
తీరని
అపకీర్తిని
తేగోరుచున్నావు.
ఇందరిని
తీరని
దుఃఖములో
ముంచి
ప్రాణములు
తీసిన
నీవు
మాత్రము
ఏమి
ఆనందము
ననుభవింతువు?
ఒకవేళ
ఆనందించిననూ
అది
ఆనందమా?
ఛీ!
ఛీ!
పరుల
బాధను
చూచి,
ఆనందించువారు
మహా
పాపులు,
రాక్షసులు.
పరుల
సంతోషమును
కోరువారు
పరుల
ఆనందము
నపేక్షించువారు
పవిత్రులు.
మహారాణివై,
రాజపుత్రివై
ఇంతమాత్రమయిననూ
తెలిసికొనలేకుండిన
రాజ
వంశముకే
అపకీర్తి
కదా!
కైకా!
నేను
కడసారిగా
ఒక్క
మాటను
చెప్ప
తలంచుచున్నాను.
విను,
రాముడు
నా
ప్రాణము.
రాముని
వీడి
నేను
బ్రతుకలేను.
నీకసంతృప్తి
పెట్టలేను.
ఒకవేళ
నీ
తృప్తి
నిమిత్తమై
నేను
రాముణ్ణి
అరణ్యమునకు
వెళ్లమని
నోటితో
తెలుపకున్ననూ
ఈ
విషయమును
విన్న
రాముడు
పితృవాక్యపరిపాలకుడు
గనుక
తండ్రి
మాటను
నెరవేర్చుటకై
తనకు
తానే
అరణ్యమునకు
బయల్దేరిపోవును.
దానికి
అడ్డుండదు.
ఆ
వార్త
విన్న
క్షణమునందే
నేను
ప్రాణమును
విడుతును.
లక్ష్మణుడు,
సీత,
కౌసల్య
రామునితో
అడవులకు
వెళ్లవచ్చును.
కారణమేమన
కౌసల్య
రాముని
విడిచి
బ్రతుకదు.
సీత
రాముని
అనుసరించక
మానదు.
లక్ష్మణుడు
18
▾
Meaning
Keep
రాముని
అడుగుజాడలను
వీడడు.
లక్ష్మణుని
అనుసరించి
ఊర్మిళ
కూడ
వెళ్ళ
వచ్చును.
అట్టి
సమయమున
నేను
ప్రాణములను
వీడిన
ఈ
కాయమునకు
అంత్యక్రియలు
సలుపువారుందరు.
ఈ
వార్త
కేకయరాజునకు
తెలిపి,
భరత
శత్రుఘ్నులను
గొనివచ్చుటకు
కాలము
పట్టును.
అంతవరకూ
దీనికెవ్వరూ
సంస్కారము
చేయరు.
ఒకవేళ
నేనిట్టి
కిరాతకపు
చేష్టకు
ఒడిగట్టితినని,
నన్ను
ప్రజలుకూడ
చూడక,
కాకుల
గద్దల
పాల్గావించ
వచ్చును.
అయితే
నా
ప్రజలు
అట్టి
స్థితికి
పూనుకొనరు.
కనుక
భరతుడు
వచ్చువరకు
ఏదో
ఒక
విధముగ
ఈ
కాయమును
పెట్టియుంచుదురు.
కానీ
రాజ్యపాలనకే
భరతుడు
ఒప్పుకొనుపట్ల
అట్టివాడు
నా
కాయమును
ముట్టుటకుకాని,
దహన
సంస్కారములు
చేయుటకు
గాని
వీలుండదు.
అట్టివాడు
అర్హుడుకూడ
కాదు
గనుక
వానిచేత
ఈ
ప్రేతకర్మను
చేయించనని
వాగ్దానమైననూ
చేయుము"
అని
అడిగెను.
"ఇట్లు
నీవు
వాగ్దానమిచ్చినను
ఇవ్వవచ్చును.
కానీ
ముందుగా
బ్రతికియుండుటలో
నీకేమి
ఆనంద
ముండునో
తెలుపుము.
దుష్టచారిణీ!
కడకు
ఇంత
కిరాతకురాలవైతివా!
రఘువంశమునే
నేల
రాల్చుచున్నావా?
ఇది
నీ
స్వభావమా?
లేక
వైష్ణవ
మాయ
నీలో
ప్రవేశించి
నిన్నిట్లాడించుచున్నదా?
అర్థము
కాకున్నది"
అని
దశరథుడు
బాధపడుచుండగా
మూడుఝాములు
గడచినవి.
వ్యాధిగ్రస్తునివలె
నిట్టూర్పులు
విడుచుచూ
కుమిలిపోవుచున్నాడు
దశరథుడు.
దశరథుడు
కైకను
ఎట్లయినను
మంచి
చేసికొని,
రామపట్టాభిషేకము
పూర్తిగా
నెరవేరునట్లు
చూడవలె
నని
తలంచి,
"ఓ!
దేవీ!
నీవు
మంగళ
స్వరూపిణివి.
నేనింతవరకు
నిన్ను
ప్రాణసమానముగా
చూచితిని.
నీవునూ
నన్ను
హృదయ
సమముగా
కాపాడితివి.
ఈ
మిగిలిన
కాలములో,
ఈవిధమైన
అపోహాలకు
చోటివ్వక,
శేషకాలమును
శాంతముగా
సంతోషముగా
గడుప
ప్రయత్నింతము.
ఓ
సుశ్రోణీ!
నేనిక
ఎంతో
కాలము
బ్రతుకను.
ఇంతకాలము
సత్యవ్రతుడనని
పేరుపొంది
సర్వమానవుల
మన్ననలనందుకొని
బహిరంగ
19
▾
Meaning
Keep
సభలో,
రేపటి
దినమున
శ్రీరామచంద్రునికి
పట్టాభిషేకమును
గావింతునని
శపథము
చేసితిని.
రేపటిదినమున,
ఈ
మంగళ
కార్యము
జరుపకున్న
లోకులు
నన్నెంత
నిందింతురో!
నన్నెంత
అవమాన
పరతురో!
నీవే
యోచింపుము.
దేవాసుర
యుద్ధమున,
నన్ను
కాపాడి,
ఈనాడు
నన్ను
పరాభవము
చేయుట,
నీకేమాత్రము
న్యాయము
కాదు.
పోనీ
ఈ
రాజ్యమంతయూ
నీకు
వరదానముగా
నిత్తును.
నీవే
రామునకు
పట్టాభిషేకము
గావించుము.
ఇందుకు
భరతుడు
కూడనూ
అమితానందపడగలడు.
అంతేకాదు;
గురువులు,
ఋషులు,
మంత్రులు,
ప్రజలు
ఒకరేమి,
లోకమే
నిన్ను
మెచ్చుకొనును.
నీ
యశస్సు
లోకములో
శాశ్వతముగా
ఉండిపోగలదు.
అట్లుకాక,
ఈనాడు
నీవు
రామాభిషేకమునకే
అడ్డు
తగిలిన
లోకులంతా
నిన్ను
నిందింతురు.
నీచపరతురు.
నీ
కుమారుని
సహితము
తూలనాడుదురు.
నీవలన
రాజ్యమునకే
కాక
వంశమునకే
అపకీర్తి
వచ్చును.
నీవు
ప్రతి
చిల్లరవానిచేతను
ఛీ!
ఛీ!
అనిపించుకొనవలసి
వచ్చును.
బాగుగా
యోచించుకొనుము!
శాశ్వత
కీర్తిని
గోరి
ఈ
పట్టాభిషేకమునకు
అడ్డుతగలక,
రేపటి
దినము
నీ
చేతులారా
రామచంద్రునికి
అభిషేకము
గావింపుము"
అని
ఆమెను
ఆనందపెట్టుటకై
అనేక
రకముల
మృదుమధురమైన
మాటలాడుచున్న
దశరథుని
చూచి,
కైక,
"రాజా!
మీ
మాటలు
అతి
విచిత్రముగా
నున్నవి.
చెప్పిన
మాటలను
తప్పించుకొను
నిమిత్తమై
మీరు
వేయు
పన్నాగములు
నన్నేమాత్రమును
మార్చజాలవు.
ఏమి
కావలయునో
కోరుకొమ్ము,
ఇత్తుననని,
మీరే
వాగ్దానము
చేసి,
చెప్పినటుల
చేయక
నేడు
ఈవిధమైన
బాధలను
ప్రదర్శించుట
మీకు
పాడికాదు.
మీ
గౌరవ
మర్యాదలను
మీరే
వమ్ముచేసుకొనుచున్నారు.
ఇందుకు
నేనేమాత్రము
బాధ్యురాలను
కాను.
సత్యమే
పరమ
ధర్మమని
ధర్మవేత్తలు
చెప్పు
మాటలను
జ్ఞప్తికి
తెచ్చుకొనుడు.
నేనుకూడనూ
ధర్మాన్ని
అనుసరించే,
మీరు
వాగ్దానము
చేసిన
వరములను
చెల్లించుమని
కోరుకొంటిని.
అందులకు
మీరునూ,
సరే
అని
ఒప్పుకొంటిరి.
ఇప్పుడు
నేనేమిటో
అన్యాయమునకు
ఒడికట్టినటుల,
మహాపాపమునకు
20
▾
Meaning
Keep
పూనుకొనినటుల,
తమకు
తీరని
అపకీర్తి
తెచ్చిపెట్టినట్లు
పలుకుచున్నారు.
ఇది
ఏమాత్రమూ
న్యాయముకాదు.
ఇందులో
నాది
ఏమాత్రమూ
దోషము
లేదు.
ముందు
వెనుక
యోచించక,
మీరు
మాటనిచ్చి,
క్రియా
రూపమునకు
దిగినపుడు
తబ్బిబ్బుగుట
తమలోని
దోషమే!
వాగ్దానమును
చెల్లించలేనివారు
వాగ్దానము
చేయుట
మహాపాపము.
చెప్పిన
మాటలను
చెల్లించితిరా,
ఎట్టి
పాపమైనను
సత్య
వాక్యాచరణముతో
నశించగలదు.
మీకు
తెలియదా?
పూర్వము
శిబి
అను
చక్రవర్తి
ఒక
పావురమును
కాపాడుదుననని
మాట
ఇచ్చుటచే
మాటను
నిలబెట్టుకొను
నిమిత్తము
తన
దేహములోని
మాంసమును
కోసి
డేగకు
ఇచ్చెను.
అదేవిధముగా
అలర్క
మహారాజు
మాటను
నిలబెట్టుకొనుటకై
ఒకానొక
బ్రాహ్మణునకు
తన
రెండు
కన్నులను
తీసియిచ్చెను.
సమస్త
సంపదల
కధిపతి
అయిన
సముద్రుడు,
సత్యవ్రతమువలననే,
తన
పొలిమేరను
దాటి
రాలేకపోవుచున్నాడు.
రాజా!
వేయేటికి?
అన్నింటికి
సత్యమే
పరమ
ప్రమాణము,
ప్రధానము.
సత్యమే
శబ్దము;
సత్యమే
బ్రహ్మము;
అదే
ధర్మము,
సత్యమొక్కటే
అక్షయముగా
నుండునది.
అట్టి
లక్ష్య
పదమును
వీడి
క్షయమగు
వాటికై
మీరు
ప్రయత్నించుట,
మీబోటి
రారాజులకు
తగనిది.
మీరిచ్చిన
మాటను
నెరవేర్చుకొని
శాశ్వత
కీర్తిని,
నిలబెట్టుకొనుడు;
అంతేకానీ,
పుత్ర
వాత్సల్యమునకు,
స్త్రీ
వ్యామోహమునకు
లొంగి
రాజనీతిని,
ప్రభుకీర్తిని
ఉల్లంఘించి
ఇక్ష్వాకు
వంశమునకు
తీరని
అపకీర్తిని
తెచ్చి
పెట్టకండి;
వేరుగా
యోచించక
తక్షణమే
రాముణ్ణి
పిలిపించి
అరణ్యమునకు
సిద్ధముకమ్మని
చెప్పి
భరతుని
రప్పించుటకు
తగిన
ఏర్పాట్లు
గావించుమని
మంత్రితో
తెలుపుట
మంచిది.
తెల్లవారవచ్చుచున్నది.
ఈ
రెండునూ
తెల్లవారులోపున
జరిగియే
తీరవలయును.
మీరెన్ని
చెప్పిననూ,
నేను
తృప్తిపడను.
అట్లుగాక
మీరు
మొండిపట్టుతో
రామపట్టాభిషేకము
గావింతురా,
నిందు
సభలో
నేను
ప్రాణములు
వీడుదును.
ఇది
సత్యము"
అని
అతి
తీవ్రముగా
మాటాడునట్టి
కైకను
చూచి
దశరథుడు
21
▾
Meaning
Keep
మహా
రౌద్రుడై,
కోపమును
మ్రింగలేక
వెలుపల
పెట్టలేక,
వామనమూర్తికి
మాట
యిచ్చి
తప్పించుకొనని
బలిచక్రవర్తివలె
ధర్మశాప
బద్ధుడయిపోయినాడు.
కన్నులు
మబ్బులు
క్రమ్మినవి.
తల
బరువెక్కినది.
నేల
వ్రాలినాడు.
కడకెట్టులో
ధైర్యమును
తెచ్చుకొని,
"పాపీ!
నేడు
రామాభిషేకము
నిల్పిన
నేను
ప్రాణములు
వీడుట
తథ్యము.
తరువాత
ముండవై
ఈ
రాజ్యమును
నీ
ఇష్టము
వచ్చినటుల
ఏలుకొమ్ము"
అని
ఉద్రేక
పూరితముగా
పలికి,
"హా
రామా!
నా
చేతులారా
నిన్ను
అరణ్యమునకు
పంపవలసివచ్చెనా?
నేను
పంపను.
నా
ప్రాణములనయిననూ
వీడుదును.
కానీ
నిన్ను
విడిచి
యుండలేను.
ఓ
రాక్షసీ!
నా
సుకుమార
సుందరుని
కారడవులకంప
నీ
మనసు
ఎట్లొప్పెను?
ఎంత
కిరాతకురాలివైతివి
చండీ!"
అంటూ
మూర్ఛపోయెను.
Previous
←
News of the Coronation
Next
Obedience to the Father's Word
→