Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · Obedience to the Father's Word
Rāma Kathā Rasa Vāhini
›
Part One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
తెలతెలవారుచున్నది.
నవధ్వనులు
వాయించ
దొడగిరి.
రాజ
వీధులలో
పన్నీరు
జల్లదొడగిరి.
పురమంతయూ
సుగంధములతో
నిండెను.
సువాసనలతో
వాయువు
ఉత్సాహముగా
ఆకాశము
నంటెను.
పుష్యమీ
నక్షత్రము
ప్రవేశించెను.
వసిష్ఠ
మహర్షి,
ఆయన
శిష్య
బృందముతో
సరయూనదిలో
స్నానముచేసి,
అభిషేకద్రవ్యాలతో
రాజ
వీధులలో
మహాజనము
మధ్య,
రాజభటులు
దారిన
నడిపించుచూ
రాగా
రాజప్రాసాదము
లోనికి
ప్రవేశించెను.
అప్పటికే,
అనేకమంది
పురోహితులు,
రాజులు,
ప్రజాప్రతినిధులు
ఆవరణములో
ప్రవేశించి,
వారివారి
స్థానములలో
ఆసీనులైనారు.
వీధులలో
వేదపారాయణము
మిన్నుముట్టుచున్నది.
వసిష్ఠులవారు
సుమంతుని
పిలిచి,
"మంత్రీ!
మీరు
వెంటనే
వెళ్లి
ముహూర్తము
సమీపించుచున్నదనియును,
దానికి
పూర్వము
గావించవలసిన
పనులు
అనేకములు
ఉన్నవనియును,
తక్షణమే
మహారాజు
ఇక్కడకు
వేంచేయవలసి
యున్నదనియును,
మహారాజుగారితో
చెప్పి
రమ్ము.
వసిష్ఠుల
వారు
తమ
రాకకై
నిరీక్షించుచున్నారని
కూడనూ
తెలుపుమ"ని
కబురంపెను.
ఏ
అంతఃపురమునందయిననూ
యథేచ్ఛగా
పోయే
అధికారము
సుమంతునికి
యుండుటచేత
సుమంతుడు
అతి
వేగముగా
నడచి
కైకేయా
అంతఃపురమున
ప్రవేశించెను.
శయ్యాగృహమున
ప్రవేశించగనే
సుమంతునికి
ఏమీ
తోచలేదు.
నేల
పడిన
దశరథుని
చూచి
ఆశ్చర్యపడి,
తాను
భ్రమించుచున్నానా
అనునట్లు
దిగ్భ్రాంతి
చెందెను.
దగ్గరకు
వెళ్లి,
"రాజా!
చంద్రోదయ
సమయమున
2
▾
Meaning
Keep
సముద్రునివలె
సంతోషించవలసిన
మీరు,
ఇప్పుడు
ఏల
ఈరీతిగా
పడియున్నారో
అర్థమగుటలేదు.
మహా
శుభసమయము
ఆసన్నమయినది.
వేదవేదాంగ
పారంగతులు
సంసిద్ధులై
తమ
రాకకై
వేచియున్నారు.
తామిక
లేచి,
మంగళాలంకారములు
చేసికొని
కాంతులతో
తేజరిల్లుచూ,
సభాభవనమునకు
రావలెను.
వసిష్ఠులవారు
మిమ్ము
తోడ్కొని
రమ్మని
ఆజ్ఞాపించిరి"
అని
అనేకవిధముల
దశరథుని
మేల్కొలుపుచున్న
పలుకులు
దశరథుడు
విన్నాడు.
దశరథుడు
దుఃఖము
నాపుకొనలేక
పోయినాడు.
భోరున
ఏడ్చుచూ,
"సుమంతా!
నీ
స్తోత్రపాఠము
నా
హృదయమును
చీల్చివేయుచున్నది"
అని
జాలి
పుట్టునట్లన్నాడు.
ఆ
మాటలను
విన్న
సుమంతుడు
ముందుకు
పోలేకపోయినాడు,
వెనుకకు
నడవలేకపోయినాడు.
చేతులు
జోడించుకొని,
"రాజా!
ఏమి
ఈ
వింత?
ఎంతో
ఆనందపడ
వలసిన
ఈ
సమయమున
మీరింత
విచారించుటకు
కారణమేమి?
నాకేమియూ
అర్థము
కాకున్నది"
అని
సుమంతుడు
విచారముతో
నిలిచియున్న
సమయమున
కైకేయి
వచ్చి,
"ఓ
మంత్రిపుంగవా!
రాజు
ఈ
రాత్రియంతయూ
రాముణ్ణి
గురించి
చింతించి
చింతించి
జాగరణ
చేసిరి.
నీవు
వెంటనే
వెళ్లి
రాముణ్ణి
ఇక్కడికి
తోడ్కొని
వచ్చినచో,
విషయములు
విశదంగా
వెల్లడియగును.
నేను
చెప్పుచున్నా నని
నీవు
వేరుగా
భావింపక
రాముణ్ణి
తక్షణమే
తోడ్కొని
రమ్ము"
అని
తెలిపెను.
ఆమె
ఆజ్ఞనే
రాజాజ్ఞగా
భావించి
సుమంతుడు
అతి
వేగముగా
రామమందిరమునకు
వెళ్లుచుండెను.
మందిరము
చెంత
సింహద్వారముల
కిరుప్రక్కలా
వీధులలో
కట్నములతో,
పన్నీరులతో,
పుష్ప
గుచ్చములతో
బారులుదీరిన
జనసమూహమును
కన్నులపండువుగా
చూచుచు
వెళ్లుచున్నప్పటికిని
సుమంతున
కేదియో
కొరత
పడినట్లుగా
తనలో
తాను
అయోమయస్థితిలో
మునిగినాడు.
కొన్ని
నిమిషములకు
పూర్వమున్న
ఆనందం
అతనిలో
అడుగంటజొచ్చెను.
సుమంతుడు
రథమును
తీసికొని
రామ
భవనమునకు
వెడలుచుండగా,
ప్రజలు
చూచి,
రామచంద్రుని
పట్టాభిషేకమునకు
3
▾
Meaning
Keep
తోడ్కొని
వచ్చుటకై
సుమంతుడు
వెళ్లుచున్నాడని
మరింత
ఆనందముతో
ముఖములు
వికసింపచేసుకొని
రెప్పవాల్చక
వీధులలోనికి
చూచుచుండిరి.
ఇంతలో
సుమంతుడు
రామభవనమున
ప్రవేశించెను.
ఏడు
అంతస్తుల
అంతఃపురములోనికి
ఏ
అడ్డూ
లేక
ప్రవేశించెను.
మహా
నదిగర్భములోనికి
ప్రవేశించే
మొసలివలె,
అతి
వేగంగా
చేరెను.
అక్కడ
రాముని
మిత్రులైన
కొందరు
యువకులు
ఉజ్వల
కుండల
కాంతులతో
ప్రజ్వరిల్లుచూ
రాముని
వెంట
వచ్చుటకై
సంసిద్ధులై
యుండిరి.
మరింత
లోనికి
ప్రవేశించగనే,
రాముడు
అలంకారముతో,
కన్నులు
మిఱుమిట్లు
గొల్పు
కాంతులతో,
చిత్తానక్షత్రములోని
చంద్రునివలె
కనిపించినాడు.
ఆలస్యమునకు
చోటివ్వక,
"రామా!
కైకేయీదేవి,
మీ
తండ్రి
సమక్షమున
తక్షణమే
మిమ్ము
కైకేయి
మందిరమునకు
తీసుకొని
రమ్మని
నన్ను
పంపిరి.
అందు
నిమిత్తమై
నేనిక్కడకు
వచ్చితిన"ని,
సుమంతుడు
తెలిపెను.
ఆ
మాటలు
విన్న
తక్షణమే
రాముడు
సీతను
చూచి,
"సీతా!
నాకు
తెలియును.
ఇది
ఏదో
అంతరాయము
కలుగు
సూచన
తప్ప
మరేమీ
కాదు.
తండ్రిగారి
ప్రీతికై
వారి
ఆజ్ఞను
మీరకూడదనియూ,
వారిని
బాధపెట్టకూడదనియు,
నేను
అన్నింటికీ
సరిసరి
అని
అనవలసివచ్చెను.
కానీ,
నాకు
ఈ
విషయము
తెలియకపోలేదు.
తెలిసిననూ,
నేను
కర్తవ్యమును
నిర్వర్తించవలసి
యుండుటచే,
అట్లు
ఒప్పుకొనవలసి
వచ్చెను"
అని
ఇంకా
ఏమేమో
చెప్పుచుండగా,
సుమంతుని
గుండెలో
బండపడినటు
లయినది.
తాను
చూచి
వచ్చిన
దశరథుని
పరిస్థితిని,
రాముడు
చెప్పు
మాటలను
తాను
జోడించుకొనుటచే,
ఇది
నిజముగా
ఏదో
అంతరాయము
కలిగించునట్టిదిగానే
అతనికి
అర్థమయినది.
ఇంతలో
సీత,
"నాథా!
ఏమిటి
మీ
మాటలు!
ఈ
శుభ
సమయమున
మీరిట్లు
మాటాడరాదు.
ఏది
యెట్లయిననూ
సరే!
మామగారి
మాటను
నిలబెట్టవలెను.
వారి
తృప్తియే
మన
తృప్తి!
వారికై
మనము
ఎట్టి
త్యాగమునైననూ
చేయవలెను.
వారి
ఆజ్ఞను
జవదాటక
త…ననూ
సరే,
4
▾
Meaning
Keep
కాకపోయిననూ
సరే,
రెండింటికీ
మనము
సమాన
ఆనందమునే
పొందవలెను.
కైకేయిదేవికి
మనపై
అమితమైన
ప్రేమ;
ఆ
దేవి
ఏమి
చేసినా,
ఏమి
చెప్పినా
మన
మంచికే.
కైకేయికంటె
అధికముగా
మన
మేలు
కోరువారు
ఈ
లోకమున
లేరు.
అట్టి
తల్లీతండ్రి
తక్షణమే
రమ్మని
కబురంపిన
ఎంతో
ఆనందము"
అని
ఆమెకూడనూ
ద్వారమువరకూ
వచ్చి
అనేకరకముల
రామునికి
నచ్చజెప్పి
పంపెను.
రాముడు,
"సీతా!
నాకు
అంతమాత్రం
తెలియదా!
రాబోవు
గడియలు,
ఇప్పుడు
జరుగు
గడియలు,
గడచిన
గడియలు
అన్నీ
నాకు
సమానమే.
నేనన్నింటికీ
ఆనందముతో
స్వాగతమిత్తును.
తండ్రి
కీర్తిని
గోరి
నేనేమైనను
చేతును.
ఎక్కడికైనను
పోదును.
నీవు
కూడనూ
దీనికి
తోడగుట
నాకెంతయో
ఆనందము"
అని
సీతతో
తెలిపి
సుమంతునితో
బయలుదేరి
వీధిలో
నిలిపిన
రథముపై
కూర్చొనగా
వీధిలోని
ప్రజలు,
"రామచంద్ర
ప్రభువుకు
జై
జై
జై"
అంటూ
జయజయ
ధ్వనులు
గావించిరి.
అంత
సుమంతుడు
ప్రజలకు
నచ్చజెప్పుటకై,
"ఇప్పుడు
పట్టాభిషేకమునకు
కాదు
వెళ్లుట;
మహారాజు
చెంతకు
వెళ్లుచున్నాము.
కనుక
కాలవ్యవధి
లేనందున
రథమును
వేగముగా
తోలవలసివచ్చినది.
తిరిగి
కొన్ని
క్షణములలోనే
రాముడు
రాగలదు.
మీరు
తొందర
పడకుడ"ని
వారలకు
అర్థమగునటుల
మంచి
మాటలతో
తెలిపి
రథమును
అతివేగముగా
కైకేయీ
మందిరమునకు
తీసుకొనిపోయెను.
దివ్య
రథమునెక్కి
రాముడు
పురవీధులగుండా
కైకేయీ
మందిరమునకు
వెళ్లుచున్నాడు.
శూరులు
సింహనాదం
చేసిరి.
వందిమాగధులు
మంగళగానం
ఆరంభించిరి.
వివిధ
వాద్యధ్వనులు
మిన్నుముట్టినవి.
జన
సమూహముల
నుంచి
జయజయ
ధ్వనులు
చెలరేగినవి.
చక్కగా
అలంకరించుకొన్న
ఉత్తమాంగనలు
మేడలనుండి
కిటికీలనుంచి
మంగళ
హారతులు
ఎత్తుతూ,
పూలరేకులను
చల్లుచుండ,
కనుచూపుమేర
దాటిపోయిన
రథమును,
మనో
నేత్రములతో
5
▾
Meaning
Keep
రాముని
విగ్రహమును
హృదయాలలో
చిత్రించుకొని
స్తంభించి
నిలిచిన
జనము
విగ్రహముల
వలె
కట్టుకదలక
ఉండిరి.
కైలాసపర్వత
శిఖరమువలెనున్న
వర్ధమానము
అనే
దశరథ
మహారాజు
దివ్యభవనములోనికి
రథము
ప్రవేశించినది;
ధనుర్ధరులు
కావలి
కాస్తున్న
మూడు
కక్ష్యలలో
రథము
దాటింది.
అక్కడ
రాముడు
దిగినాడు.
మరి
రెండు
కక్ష్యలు
పాదచారుడు
అయి
పోతూ
తన
వెంట
వచ్చుచున్న
మిత్రులను,
లక్ష్మణుని,
అక్కడే
ఆగిపొమ్మని
తెలిపినాడు.
అక్కడ
ఏమి
జరుగనున్నదో,
రాములకు
పూర్వమే
తెలుసును.
తెలిసినప్పటికినీ
తాను
సామాన్య
మానవునివలె
సహజధోరణిలో
ప్రవర్తించుచుండెను.
కడకు
అంతఃపురమున
ప్రవేశించెను.
తండ్రియైన
దశరథుడు
పాన్పుపై
పడియున్నాడు.
తన
జుట్టు
చెదరి,
ముందు
దినము
వేసిన
వస్త్రములలోనే
పిచ్చివానివలె
సక్రమమార్గమును
వీడి
పడియుండుట
రాముడు
చూచి
ఆశ్చర్యపడి
దగ్గరకు
వెళ్లినాడు.
కైకేయి,
పడక
ప్రక్కనే
నిలుచొని
ఉన్నది.
దశరథుడు
కళాహీనుడై
విలపించుచున్నాడు.
తలనెత్తి
రాముని
చూచినాడు.
నోటిలో
మాటలు
రాలేకపోయినవి.
కన్నుల
నీరు
ఏకధారగా
కారదొడగెను.
దశరథుడు
ఏదియో
చెప్ప
ప్రయత్నించుచుండినప్పటికిని
నోటమాట
రాలేదు.
ఇట్టి
భయావహ
రూపమును
రామచంద్రుడు
ఇంతకు
పూర్వమెప్పుడునూ
చూచి
ఎరుగడు.
చాలా
కంగారుగా
తండ్రి
దగ్గరకు
వెళ్లి
తండ్రి
పాదములు
పట్టి,
"తామింత
విలపించుటకు
కారణమేమియో
తెలిపిన
దానికి
తగిన
రీతుల
నేను
అర్పించి
తమకు
ఆనందము
చేకూర్తును.
కాన,
విలపించక
కారణము
తెలుపుడ"ని
ప్రార్థించెను.
అంత
దశరథుడు
"రామా"
అని
ఒక్కమాట
మాత్రమే
పలికి
భోరున
ఏడ్వసాగెను;
మతి
తప్పెను.
రాముడు
ఎంత
ఓదార్చిననూ
క్షణక్షణమునకూ
విచారము
అధికమగుచూ
వచ్చెనే
కానీ
శాంతి
చేకూరలేదు.
6
▾
Meaning
Keep
అంత
రాముడు
ధైర్యముతో,
"నాన్నా!
ఏమిటిది?
మాబోటి
చిన్నవారలకు
తగినంత
ధైర్యము
చెప్పునట్టి
మీరు
ఈరీతిగా
విలపించుట
సరికాదు.
ఈ
సమయమున
అభినందించవలసిన
మీరు
ఘోరముగా
దుఃఖించుట
పాడియా?
దీనికి
పూర్వము
ఎంతో
కోపముతోనూ,
విచారముతోనూ
ఉండినపుడు
నన్ను
చూచిన
తక్షణమునందే
కోపమూ,
విచారమూ
లేక
ఆనందముగా
శాంతముతో
నన్ను
దగ్గర
చేర్చుచుంటిరి
కదా!
ఈనాడు
అట్టిదానికి
విరుద్ధముగా
నన్ను
చూచుకొలదీ
దుఃఖము
అధికమగుచున్నది.
ఈ
విచిత్రమునకు
కారణము
తెలిపి
నన్ను
ఆనందపెట్టరా?
మీ
విచారము
నన్ను
మరింత
విచారములో
ముంచి
వేయుచున్నది.
నావలన
ఏమైనా
తప్పు
జరిగినదా?
లేక
నేనేమైననూ
చేయవలసినదియున్న,
తప్పక
చేతును.
నా
తప్పును
తెలిపిన
సరిదిద్దుకొందును.
విచారించక,
సంశయించక,
అభిమానము
పెట్టుకొనక
తెలిపిన
నేను
శిరసావహింతును.
తండ్రీ!
మీరిట్లు
చింతించుట
మీకునూ,
నాకునూ,
రాజ్యమునకునూ
మంచిదికాదు"
అని
ప్రార్థించుచూ
కైకేయివైపునకు
తిరిగినాడు.
చేతులు
జోడించుకొని,
"అమ్మా!
నేనేమైనను
అపరాధము
చేసితినా?
నాన్నగారికి
ఇంత
దుఃఖమును
కలిగించిన
పాపి
ఎవ్వరో
తెలుపుము.
నన్ను
చూచిన
తక్షణమే
అక్కున
చేర్చి
ఆదరించు
తండ్రి
ఈనాడు
నా
ముఖమైననూ
చూడకుండుటలో
ఏమి
కారణము?
ఒక
పలుకైనా
పలుకరించక
ముఖము
త్రిప్పుకొనుచున్నాడు.
బహుశః
నావలననే
అపరాధము
జరిగియుండిన
నేను
ఎట్టి
శిక్షనైననూ
అనుభవింతును.
నాన్నగారు
ఆనందముగా
ఉండిన,
అంతేచాలును.
అట్లుకాక
శరీరములో
ఏమైననూ
అస్వస్థత
ఏర్పడినదా?
లేక
తమ్ములైన
భరత
శత్రుఘ్నులు
ఏమైనా
కబురంపిరా?
వారందరూ
క్షేమమేకదా?
అమ్మలైన
కౌసల్యా
సుమిత్రలు
క్షేమమేకదా?
నాన్నగారి
దుఃఖమునకు
కారణమేమో
తెలుసుకొనలేని
స్థితిలో
నేను
బాధ
పడుచున్నాను.
వారిని
సంతోషపెట్టుటకు
నేనెట్టి
కార్యమైననూ
చేతును.
నాన్నగారి
ఆజ్ఞలు
ఎట్టివైననూ
శిరసావహింతును.
లోకమున
ఎవరి
జన్మకైన
తండ్రే
కారణము.
అందువలన
ఎవ్వరికైననూ
తండ్రియే
ప్రత్యక్ష
దైవము.
7
▾
Meaning
Keep
నాకు
అతని
ఆనందముకంటే
వేరు
లేదు.
ఏమి
జరిగినదో
దయయుంచి
తెలుపుము.
అమ్మా!
స్వాభిమానమువలన
వారిని
మీరేమైనా
పరుషముగా
అంటిరా?
లేక,
నా
తల్లి
ఏమైనా
తండ్రిగారి
మనస్సుకు
విరుద్ధముగా
నడచి
బాధ
పెట్టెనా?
కౌసల్య
అట్లు
ఏనాడూ
చేయదు.
సుమిత్ర
అంతకంటే
చేయదు.
ఒకవేళ
వారు
చేసిననూ
నాన్న
ఇంత
విలపించరు.
ఇందుకేదియో
ప్రధాన
కారణము
లేకుండా
ఉండదు.
దయచేసి,
నాన్న
చెప్పుటకు
కొంత
వెనుకాడిన,
తామైననూ
తెలిపి
నా
బాధను
తీర్చుడు"
అని
వినయముతో
ప్రార్థించిన
రాముని
చూచి,
కైక,
దయాదాక్షిణ్యములు
వీడి
పతి
మరింత
బాధపడునేమో
అన్న
విచారమునుకూడనూ
చేయక,
ముందు
వెనుక
యోచించక,
ప్రమాదమును
గుర్తించక,
చెప్పతగినదా,
చెప్పతగనిదా
అనే
నిత్యానిత్య
విచారణ
సలుపక,
ప్రేమ
ప్రక్కకునెట్టి,
అభిమానమును
ఆవలబెట్టి,
"రామా!
విను!
పూర్వము
దేవాసుర
యుద్ధములో
మీ
తండ్రిగారు
బాణోపహతుడయి
బాధపడుచున్న
సమయమున
నేను
అతనిని
రెండు
పర్యాయములు
రక్షించగలిగితిని.
అప్పుడు
నా
త్యాగమునకు
మెచ్చి
మీ
తండ్రిగారు
"రెండు
వరములు
కోరుకొమ్ము,
ఇచ్చెదను"
అని
తెలిపిరి.
ఆనాడు
వారు
క్షేమముగా
జీవించుటే
నా
ప్రధాన
లక్ష్యముగా
ఉండుటచేత
నేను,
"ఇప్పుడేమీ
నాకక్కరలేదు,
అవసరమొచ్చినపుడు
కోరుకొందును"ని
తెలుపగా,
అందులకు
మీ
తండ్రిగారు
సరేనని,
"నీకిష్టమొచ్చినపుడు
ఇష్టమొచ్చిన
కోరిక
కోరుకొనవచ్చును,
తప్పక
తీర్తును.
దీనికొక
కాలనియమముకానీ,
విషయ
సంబంధముకానీ
ఉండదు.
ఏ
కాలములోనైనా,
ఏ
విషయమునైనా,
నా
జీవితంలో,
అడిగినపుడు
తీర్తున"ని
మాటయిచ్చెను.
ఇక్ష్వాకువంశమున
ఆడిన
మాట
తప్పరన్న
విషయము
నీకు
తెలియును
కదా!
అట్టి
విశ్వాసముతో
ఇప్పుడు
నేను,
ఆ
రెండు
వరములనూ
కోరుకొంటిని.
ఒకటి,
నా
ప్రేమపుత్రుడైన
భరతునకు
పట్టము
కట్టుమనియూ,
రెండవది
నిన్ను
పదునాలుగు
సంవత్సరములు
దండకారణ్యమునకు
పంపు
మనియూ
కోరితిని.
ఇంతమాత్రమునకే
మీ
తండ్రిగారు
ఇంత
ఆరాటము
చేయుచున్నారు.
8
▾
Meaning
Keep
వేయేటికి?
ఈ
నా
సంకల్పము
నేను
మానుకోను.
మీ
తండ్రిగారు
సత్యవ్రతుడు
అని,
నీవు
సత్యవ్రతుడవు
అని
ఋజువు
చేయదలచుకొన్నట్లయితే,
నీవిప్పుడే
జటాజినాలు
ధరించి
దండకారణ్యమునకు
పోవలెను.
అక్కడ
పధ్నాలుగు
సంవత్సరములు
నివసించవలెను.
నీ
తండ్రికి
నీవన్న
ప్రాణమగుటచే,
నిన్ను
పంపుటకు
ఇష్టము
లేక,
నీవేమనుకొందువో
అని
నీకు
చెప్పుటకు
సిగ్గయి
దుఃఖించుచున్నాడు.
అంతేకానీ
మరే
ప్రళయమూ
సంభవించలేదు.
ఇంత
చిన్న
విషయమునకు
కొండంత
ప్రమాదము
జరిగినటుల
విలపించుట
అర్థము
లేనిదిగా
ఉన్నది.
రామా!
అంతేకాదు.
తండ్రి
చేసిన
వాగ్దానమును
అతను
తీర్చలేకపోయిననూ
తండ్రి
ప్రతిబింబముగా
పుట్టిన
కుమారుడు
దానిని
తీర్చుటకు
పూనుకొనిననే
తండ్రి
తరించగలడు
కానీ,
తానూ
చేయక
కొమారుడూ
అట్టిదానిని
గమనించకుండిన
తండ్రి
అధోగతిపాలు
కావలసివచ్చును.
తండ్రి
ఋణమును
తీర్చుటే
కుమారుని
ప్రథమ
కర్తవ్యమన్నది
నీకు
తెలియనిది
కాదు"
అని
ఆమె
నిర్దాక్షిణ్యముగా
తెలిపెను.
ఆ
మాటలకు
రాముడు
చలించక,
చిరునవ్వుతో,
"ఇంతమాత్రమునకే
నాన్నగారు
ఇంత
విలపించుట
నిజంగా
న్యాయము
కాదు"
అని
ఆనందవదనముతో
అంగీకరించినటుల
తల
ఊపినాడు.
ఈ
మాటలు
వినుచుండిన
దశరథుని
హృదయము
కరకరా
కోసినట్లు
అయినది.
తల్లడిల్లినాడు.
రాముడు
కైకేయి
వైపుకు
తిరిగి,
"తల్లీ!
నీవనుకొన్నటులనే
జరుగును.
మా
నాన్నగారి
శపథమును
నేను
శిరసావహించుచున్నాను.
అయితే,
నాన్నగారు
ఒక్కతూరి
ఎప్పటివలే
దగ్గరచేర్చి
ఆదరించి,
ఆశీర్వదించిన
చాలును.
అట్టిదానికికూడనూ
నేను
నోచుకొనలేదని
తెలిపిన,
అదియును
నేను
ఆనందముతోనే
అందుకొందును.
నా
తండ్రి
ఎప్పుడునూ
నా
మేలు
కోరువారే.
అతను
మహానుభావుడు.
వారు
నాకు
ఒక్క
తండ్రియే
కాదు;
మంచిని
బోధించు…
ఆచార్యులు.
అట్టి
జనకుడు,
ఆచార్యుడు
అయిన
వారిని
9
▾
Meaning
Keep
సంతోషపెట్టుటకంటే
నాకు
వేరు
కర్తవ్య
మేమున్నది?
అదే
నా
ముఖ్య
ధర్మము.
భరతునకు
రాజ్యాభిషేకము
చేయుటలో
నేనెంతనో
ఆనందింతును.
పదునాలుగేండ్లు
వనవాసము
చేయుటలో
మహదానంద
పడుదును.
పదునాలుగేండ్లే
కాదు!
తండ్రి
ఇష్టమయిన
యావత్
జీవితమునే
అరణ్యములయందు
గడుపుటకుకూడా
సంసిద్ధుడను.
కానీ
నాన్నగారు
ఈ
రెండు
విషయములను
నాతో
చెప్పుటకు
ఎందులకు
వెనుకాడుచున్నారు?
అదే
నాకు
బాధగా
ఉన్నది.
తాను
చెప్పిన,
చేయకుందునా?
తన
మాట
కాదందునా?
ఈ
రాముడు
పితృవాక్యపరిపాలకుడేకాని,
పితృద్రోహి
కాదు.
తండ్రినుండి
ఏర్పడిన
ఈ
కాయమును
తండ్రికి
అర్పించుటకంటే
వేరు
కృతజ్ఞత
కలదా?
హృదయపూర్వకమైన
ఆనందముతో
అర్పింతును.
నేను
ఒకరితో
చెప్పించుకొనువాడను
కాను.
భరతునికి
రాజ్యాభిషేకము
చేయవలెనని
నీవైననూ
నాతో
ఒకసారి
తెలుపలేదెందులకు?
నాకునూ
నా
తమ్మునికీ
ఎట్టి
భేదమూ
లేదు.
అట్టి
భేదరహిత
హృదయుని
చెంత
నీవెందుకు
భేదమును
పాటింతువు?
ఇది
మీ
తండ్రి
ఆజ్ఞ
అని
ఎందులకందువు?
నీ
ఆజ్ఞ
మాత్రము
నేను
మీరుదునా?
మీరను.
నీవు
చెప్పినా
తండ్రి
చెప్పినా
నేను
ఆనందముతో
చేతును.
నేడే
అయోధ్యను
వదలి
అరణ్యమున
కేగుదును.
అమ్మా!
భరతుణ్ణి
తాతగారి
ఇంటినుండి
రావించడానికి
నేడే
తగిన
దూతలను
పంపించుట,
అందుకు
తగిన
ఏర్పాట్లు
చేయించుట
మంచిది.
ఆలస్యమెందులకు?
నా
అరణ్యవాసముతోపాటు
భరతుని
పట్టాభిషేకముకూడా
జరిగిన
తండ్రిగారికి
కొంత
శ్రమ
తప్పును.
తమకూ
సంతృప్తి
కలుగును.
ఆ
తరువాత
ఎట్లుండునో
ఎవరు
చెప్ప
గలరు?"
అని
రాముడు
చెప్పినందు
వలన,
కైకేయికి
ఒకవైపున
ఆనందము
ఒకవైపున
కొంత
సంశయము
కలిగి,
భరతుడు
వచ్చిన
ఏమి
మార్పు
కలుగునో,
భరతుడు
వచ్చునంతలోనే,
అనగా
నేడే
రాముని
అరణ్యమునకు
పంపుట
మంచిదని
తలంచి,
"రామా!
నీవు
చెప్పినటుల
భరతుని
అయోధ్యకు
తెచ్చు
ఏర్పాట్లు
ఇప్పుడే
10
▾
Meaning
Keep
గావింప
వచ్చును.
అయితే,
భరతుడు
వచ్చునంతవరకూ
నీవు
అయోధ్యలో
ఉండనవసరము
లేదు.
నీవు
ఎట్లాగూ
వనవాసము
చేయ
నిశ్చయించుకొన్నావు.
కనుక,
కాలయాపన
ఎందుకు?
వెళ్లుటకెంత
ఆలస్యము
చేసిన
తిరిగి
వచ్చుటకు
అంత
ఆలస్యము
కాగలదు.
ఇప్పుడే
సిద్ధమగుట
మంచిది.
ఇదంతా
నీతో
స్వయముగా
చెప్పుటకు
మీ
నాన్నగారు
వెనుకంజ
వేయుచున్నారు.
చెప్పవలెనన్న
భావము
హృదయములో
ఉండియూ,
ప్రేమించిన
కొమరునికి
ఇట్టి
ఆజ్ఞ
ఎట్లుచేతునను
సిగ్గు
అతనిని
కొంత
హింసించుచున్నది.
తన
వాగ్దానము
నీతో
చెప్పుటకు
మనస్కరించక
ఇంత
దుఃఖించుచున్నారు
తప్ప,
అంతకంటే
అతనికి
వేరు
దుఃఖము
లేదు.
నీవెంత
త్వరగా
అయోధ్యను
వదలిన
మీ
నాన్నగారి
దుఃఖము
అంత
త్వరితముగా
తగ్గిపోవును.
నీవు
అయోధ్య
వదలువరకూ
ఆహార
స్నానాదులు
సహితము
చేయరు.
కాన
మీ
నాన్నగారి
దుఃఖము
ఎంత
త్వరితముగా
చల్లారవలెనని
తలంచిన
అంత
త్వరగా
నీవు
అయోధ్య
వీడుట
మంచిది"
అని
నిర్దాక్షిణ్యముగా
పలికిన
కైక
పలుకులు
వినుచున్న
దశరథుడు
పట్టలేని
దుఃఖముతో,
మాటలురాని
స్థితిలో
"ఛీ,
ఛీ
దుర్మార్గురాలా!"
అంటూ,
"రామా!
రామా!"
అని
తిరిగి
మూర్ఛపోయినాడు.
ఒకవైపున
దశరథుని
తల
తొడపై
నుంచుకొని,
తండ్రిని
ఓదార్చుచూ
మరోవైపున
కైకతో,
"అమ్మా!
నేను
అర్థపరుణ్ణికాను,
లోకులను
లోబరచుకొని
రాజ్యము
నేలవలెననను
కాంక్ష
నాకు
లేదు.
ఋషివలె
ఉండ
వలెనని
కోరిక,
కేవలము
ధర్మమును
నిలబెట్టవలెనను
కాంక్ష,
పూజ్యపాదులైన
తండ్రిని
సంతోషపెట్టవలెనను
దీక్ష
తప్ప
అన్యములేదు.
ఈ
మూడింటికి
ఏ
పనియైనా
చేస్తాను.
ప్రాణమైనా
అర్పిస్తాను.
పుత్రుడయినవానికి
పితృసేవ,
పితృవాక్యముకన్నా,
మహత్తరమైన
ధర్మము
మరియొకటి
లేదు.
అమ్మా!
నాన్నగారు
నాతో
వాచా
చెప్పలేకపోయిననూ
వారు
ఆజ్ఞాపించినటుల
నీవు
చెప్పుచున్నావు
కదా!
అంతే
చాలు.
ఇంతియేకాక,
వారి
సమక్షమున
నీవు
చెప్పు
మాటలు,
వారు
వినుచున్నప్పటికినీ,
వారు
ఏమీ
చెప్పలేకపోవుటతో,
ఇవి
వారి
11
▾
Meaning
Keep
మాటలుగనే
అర్థ
మిచ్చుచున్నది.
కాన,
నేను
శిరసావహించి
వెళ్లుచున్నాను.
అమ్మా!
ఈ
నా
చిన్నవాంఛను
నెరవేర్తువని
ఆశింతును.
ఏమన,
భరతుడు
రాజ్యపాలనము
చేస్తూ,
నాన్నగారి
ఆజ్ఞను
శిరసావహించి
వారిని
ఆనందపెట్టునటుల
చూచు
బాధ్యత
నీది.
నాకు
కానీ,
భరతునికికానీ,
వేయేటికి,
యెప్పుడైననూ
తండ్రిని
ఆనందపరచుటకంటే,
తండ్రిని
సంతృప్తిచేయుటకంటే
వేరొండు
వ్రతము
లేదు.
పితృసేవ
పుత్రునకు
సనాతన
ధర్మము"
అని
నమస్కరించగా,
వింటూ
ఉన్న
దశరథుని
గుండెలు
బ్రద్దలయినట్లుగా....
రాముని
ధర్మవచనములు,
శాంతభావమును
విని,
అతనిపైనున్న
ప్రేమ
మరింత
దుఃఖము
నందించి,
రాముడు
ఇక
అయోధ్యలో
నిలువడని
నిశ్చయము
చేసికొని,
దశరథుడు
మానాభిమానములు
వీడి
బావురుమని
నేలకూలినాడు.
ఈ
శబ్దము
అంతఃపురకాంతలందరూ
విని,
వారిలో
వారు
ఆశ్చర్య
దుఃఖములతో
అందరూ
ఏడ్వసాగిరి.
ఇక
ఆలస్యము
చేయుట
మంచిదికాదని
రాముడు
గ్రహించి
తండ్రి
పాదములకు
నమస్కరించి
అంతఃపురమునుండి
బయలుదేరెను.
ద్వారము
దగ్గర
నిలిచి,
పైన
జరుగు
సంభాషణలు
వింటూవున్న
లక్ష్మణుడు
కంటిధారలు
కారుస్తూ
ఒకవైపున
కైకపై
ఉగ్రుడై
తండ్రిపై
క్రోధమును
పూని
ఏమియూ
చెప్పలేని
స్థితిలో
రాముడు
వెలుపలకు
రాగానే
అతనిని
అనుసరించుచూ
చేతులు
కట్టుకొని
కన్నెత్తి
చూడక
తల
క్రిందికి
వంచుకొని
వెళ్లెను.
రాజ్యము
పోయిననూ,
అరణ్యవాసము
ప్రాప్తించిననూ,
చిమ్మచీకట్లు
క్రమ్ముకొన్నా
చంద్రుని
కాంతి
మాసిపోనటుల,
ముఖవికాసము
ఏమాత్రమూ
మాసిపోక,
మానావమానములు
లెక్కచేయక
పరమ
యోగీంద్రునివలె
చిత్తవికారము
ఏమీ
లేకుండా,
నడచి
వచ్చుచున్న
రాముని
చూచిన,
లోపల
ఏమీ
అశాంతి
జరుగలేదన్నట్లు
తోచును.
అయితే
సుమంతుడు
లోన
ఏదో
విరుద్ధమైన
మార్పు
జరిగినదని
అనుమానించెను.
అనుమానించుటేమి,
జరిగినదనే
నిశ్చయము
చేసుకొనెను.
లక్ష్మణుని
చూచిన
సుమంతుని
గుండెలు
ఝుల్లుమనెను.
దానికి
తగినట్లు
రాముడు
వెలుపలకు
వచ్చినతోడనే,
శ్వేతచ్ఛత్రము
పట్టినతోడనే
12
▾
Meaning
Keep
అది
తనకు
అక్కరలేదనియు,
వింజామరలు
వీచకూడదనియూ
వెండి
రథము
తనకింక
అర్హత
కాదనియూ
చెప్పగా
సుమంతుడు
నీరయిపోయెను.
తన
తలంపు
పరమ
సత్యమని
నిర్ణయము
చేసుకొనెను.
అంతేకాక,
స్వజనులతో
కానీ
పురజనులతో
కానీ
మాటాడక,
తనకు
దుఃఖము
లేకపోయిననూ,
వార్త
వినిన
ఇతరులు
దుఃఖ
పడుదురన్న
భావముతో
తన
మాటలలో
సత్యము
తెలుపక
తప్పదనియు,
తెలిపిన
అందరినీ
తన
మాటలే
బాధపెట్టినటుల
కావచ్చుననియూ
తలంచి
రాముడు
మాటలాడుటకే
పూనుకొనకపోవుటలోని
అంతరార్థమని
చెప్పక
చెప్పుచుండెను.
రాముడు
నేరుగా
సీతాంతఃపురమునకు
వెళ్లక,
కౌసల్యాంతఃపురమునకు
కాలినడక
సాగించెను.
ఎంతో
సంతోషముతో
మాటలాడుతూ
ఉన్న
కౌసల్యాదేవి
మందిరమునకు
అన్నదమ్ములైన
రామలక్ష్మణులు
వచ్చుచున్నారన్న
వార్త
కౌసల్యాంతఃపుర
వనితలకు
తెలిసి
వారందరూ
మంగళ
హారతులు
సిద్ధము
చేసుకొని
దారులు
కాచియుండిరి.
అంతఃపుర
ద్వారము
దగ్గర
పరమ
పుణ్యులు,
వృద్ధులు
అయిన
ద్వారపాలకులు
రాముని
రాకను
చూచి
దిగ్గున
లేచి,
"విజయీ
భవ,
విజయీ
భవ"
అంటూ
తలలు
వంచి
నమస్కరించిరి.
రాముడు
ఆ
మందిరములోని
రెండవ
కక్ష్యవరకూ
వెళ్లగనే
బ్రాహ్మణులు
ఆశీర్వదించిరి.
మూడవ
కక్ష్యలోనికి
ప్రవేశించగనే,
ద్వారపాలకులైన
యువతులు
అన్నదమ్ములైన
రామలక్ష్మణులను
చూచి
పట్టలేని
ఆనందముతో
లోనికి
పరుగెత్తుకొనిపోయి
రాముడు
సోదరుడైన
లక్ష్మణునితో
కూడి
వచ్చుచున్నట్లు
కౌసల్యాదేవికి
తెలిపిరి.
అక్కడనుండి
కౌసల్యాదేవి
పూజామందిరమువరకూ
ఇరుప్రక్కలా
జ్యోతులు
పట్టుకొని
హారతులు
ఎత్తుతూ
సుమంగళులు
అలంకారములు
చేసుకొని
అత్యంత
రమణీయమైన
రాముని
రాకకు
ఎదురుచూచుచుండిరి.
రాముని
చూడగనే,
మంగళహారతులు
ఎత్తిరి.
కౌసల్యా
దేవి
రాత్రి
అంతయూ
జాగరణ
చేసి
తెల్లవారుఝామున
పూజలు,
వ్రతములు
మొదలుపెట్టి
వృద్ధబ్రాహ్మణులతో
హోమాదులు
నేయించుచుండెను.
ఆ
తల్లి
పరమానందముతో
తన
కుమారుని
13
▾
Meaning
Keep
అభిషేక
మహోత్సవమును
కన్నులారా
చూడగల్గుతున్నానను
ఆనందముతో
అనేకరకముల
పూజలు,
దానధర్మములు
గావించుచూ,
ఆహారనిద్రలు
మాని
ఆనందాహారమునే
ఆరగించుచూ
పరువు
లెత్తుకొని
రామునకు
ఎదురుగా
వచ్చి,
రాముని
శిరస్సు
ముద్దాడి
చేయి
పట్టుకొని
పూజామందిరమునకు
తీసుకొనిపోయెను.
జరిగిన
విపరీతము
ఆమెకేమాత్రమూ
తెలియదు.
నిరపరాధిని,
అమాయకురాలు
అయిన
కౌసల్య
నిర్మల
ప్రేమతో
తెల్లని
చీరను
కట్టుకొని
వ్రతకంకణములు
కరమునకు
ధరించి
అత్యంత
ఉల్లాసముగా
తిరుగాడుచున్నందున
ఆమె
ముఖము
పరమ
తేజముగా
కనిపించెను.
కౌసల్య
తన
మనమునననున్న
ఆనందమును
దాచుకొనలేక,
"నాయనా!
రామా!
నీ
పూర్వీకులు
అందరూ
రాజర్షులు,
పరమ
ధార్మికులు,
మహాత్ములు.
వారందరివలె
నీవుకూడనూ
దీర్ఘాయుష్మంతుడవు
కావలెను.
వారివలె
కీర్తిమంతుడవు
కావలెను.
నీ
కీర్తి
దిగ్దిగంతాలలోనూ
వ్యాపించవలెను.
నాయనా!
నీ
వంశోచిత
ధర్మాన్ని
ఎప్పుడూ
ఏమరుపాటుననైనను
మరువక
తప్పక
ఆచరించవలెను"
అని
ఆశీర్వదించుచూ
అక్షతలు
శిరస్సున
చల్లి
ప్రక్కనే
బంగారుపీట
వేసి,
"నాయనా,
రాత్రి
అంతయూ
నీవుకూడనూ
దీక్షను
పూనియుండుటచేతను,
ఉపవాస
వ్రతము
చేయుట
చేతను
కొంత
అలసి
ఉందువు.
అందుపై
కూర్చుని
కొంత
ఫలహారము
చేయుట
మంచిది"
అని
కోరి
సిద్ధముగా
పెట్టియుండిన
బంగారు
పళ్లెరమును
అందుకొనెను.
తల్లి
పడుచున్న
ఆనందమును,
ఆమె
ప్రేమనూ
ఒకవైపున
గమనించి,
ఈ
సమయమున
ఆమెకు
జరిగిన
వార్త
ఎటు
తెలుపవలెనని
యోచించుచూ,
సిగ్గుపడి,
తల్లి
సంతృప్తి
కోసము
ఆ
పీటను,
తట్టను
చేతితో
తాకి,
"తల్లీ!
ఇప్పటినుండి
నేను
సువర్ణమును
ముట్టరాదు.
బంగారు
పీటపై
కూర్చొనరాదు.
తమరు
ఆశీర్వదించిన
నేనిక
నమస్కరించి
దండకారణ్యమునకు
పోవలెను.
అనుజ్ఞకై
వచ్చితిన"ని
తెలుపగా,
కౌసల్యకు
అర్థముకాక,
"నాయనా!
కొన్ని
నిమిషములలో
పట్టాభిషేకము
జరుగుచుండ,
దండకారణ్యమను
మాట
14
▾
Meaning
Keep
చెప్పుటలో
నాకేమీ
అర్థమగుటలేదు"
అని
నవ్వులాట
లాడుచున్నాడు
నా
కుమారుడు
అని
భావించి,
"నాయనా!
ఈ
శుభసమయమున
నవ్వులకైననూ
ఇట్టి
అశుభ
పలుకులు
ఆడరాదు.
నా
బంగారు
తండ్రీ!"
అని
క్షీరాన్నమును
తన
వ్రేళ్ళతో
తీసి
రాముని
నోటిలో
పెట్టెను.
ఆ
ప్రేమను,
ఆమె
ఆనందమునూ
చూచు
లక్ష్మణుని
కంటినుండి
తనకు
తెలియకనే
కంటిధారలు
కారదొడగెను.
వాటిని
గమనించిన
కౌసల్య
ఆశ్చర్యముతో
"నాయనా!
లక్ష్మణా!
ఎందులకంత
విచారము?"
అని
దగ్గర
చేర్చుకొనగనే
లక్ష్మణుడు
పట్టలేక
ఘొల్లున
ఏడ్చెను.
కౌసల్యాదేవికి
ఏమియూ
అర్థముకాలేదు.
రాముని
మాటలకూ,
లక్ష్మణుని
విచారమునకూ
అయోమయ
స్థితిలో
మునిగెను.
రాముడు
తల్లి
చేతులు
గట్టిగా
పట్టుకొని,
"అమ్మా!
మీరు
విచారించనని
మాటయిచ్చిన
నేనొక
మాట
చెప్పుదును.
ఇది
నాకునూ
నీకునూ
యావత్
వంశమునకే
సత్కీర్తిని
తెచ్చునట్టిది.
కాన
నీవు
ఏ
యోచనకూ
చోటివ్వక
ప్రీతితో
అంగీకరించవలసి
యుందును.
నాన్నగారి
ఆజ్ఞను
నేను
శిరసావహించుట
నీకునూ
పరమ
సంతోషమేకదా!
నాన్నగారు
తమ్ముడైన
భరతునికి
పట్టాభిషేకము
చేయ
నిశ్చయించిరి.
నన్ను
పదునాల్గు
సంవత్సరములు
దండకారణ్యమునకు
తాపసవేషమున
పంపుటకు
నిశ్చయించిరి.
వారి
ఆజ్ఞ
నేను
శిరసావహించి
తమ
ఆజ్ఞకై
వచ్చితిని"
అని
తెలుపగనే,
"రామా!"
అని
కౌసల్య
నేలకూలెను.
"ఏమి
ఈ
విపరీతము!
నా
కోమల
పుత్రుని
కారడవులకు
పంపుటయా?
అట్టి
అపచారము
నా
రాముడేమి
చేసెను?
ఇది
నిజమా?
లేక
రాత్రి
అంతయూ
మేలుకొని
ఉపవాసము
సలిపియుండుటచేత
నాకు
పిత్తప్రకోపమై
ఈరకమైన
పలుకులు
నానుండియే
వెలువడుచున్నవా?"
అని
తాను
సర్దుకొనుచుండగనే
కైకేయి
మందిరములో
జరిగిన
విషయము
క్షణములో
అంతఃపురమంతయూ
తెలిసిపోయెను.
దాసీలు
రోదనలు
చేయుచూ,
ఎక్కడ
చూచిననూ
కంటిధారలు
కార్చుచూ,
"రామచంద్రా!
మమ్ము
విడచి
వెళ్లకూడద"ని
కౌసల్యా
మందిరమునకు
వచ్చుచున్న
15
▾
Meaning
Keep
గుంపులను
చూచి,
కౌసల్య
కేమియు
అర్థముకాక
ఆశ్చర్యముతో,
దిగులుతో,
దుఃఖముతో
లేవలేని
స్థితిలో
స్తంభించిన
దేహముతో
ఉన్మత్తురాలై
ఏమీ
మాటాడక,
విషయమేమి
జరిగినదో
తెలుసుకొనగోరి
రాముని
వడిలో
చేర్చుకొని,
తల
నిమురుతూ,
"నాయనా!
ఏమిటి
ఈ
వార్త?
అసలు
ఏమి
జరిగినదో
విశదముగా
నాకు
తెలిపి
నా
బాధను
చల్లార్చుము"
అని
అడుగగనే,
"కైకకు
ఏనాడో
ఇచ్చిన
వరములను
పురస్కరించుకొని,
కైక
ఆ
రెండు
వరములనూ
నేడు
కోరినదట.
అందులో
ఒక
వరము,
తన
కుమారుడైన
భరతునకు
పట్టాభిషేకము,
రెండవది
నన్ను
పదునాలుగు
సంవత్సరములు
దండకారణ్యమునకు
పంపవలెననియూ
అడిగినదట.
ఇదీ
జరిగిన
విషయము"
అని
రాముడు
తెలుపగనే,
"కైక
అట్టి
వరములు
కోరినదా?
నీవన్న
కైకకు
అమితమైన
ప్రేమకదా!
ఆమె
ఏనాటికీ
అట్టి
వరమును
కోరదని
నా
భావము.
పోనీ,
కోరినది!
రాజుగారిని
పరీక్షించుటకై
యుండవచ్చును.
అంతమాత్రమునకే
ఇంత
కంగారా?
ఒకవేళ
ఆమె
కోరినచో
నీ
తండ్రి
నిన్ను
అరణ్యము
పంపను
ఒప్పుకొనునా?
నేను
నమ్మను.
ఒక
క్షణమైననూ
నిన్ను
చూడక
ఉండలేని
నీ
తండ్రి
నిన్ను
పదునాలుగు
సంవత్సరములు
అరణ్యములో
పెట్టునా?
ఏదో
ఇదంతయూ
నన్ను
అయోమయ
స్థితిలో
పడవేయుచున్నది"
అని
ఆమె
జరిగిన
సత్యమును
నమ్మలేకపోవుట
చూచి,
రాముడు
తిరిగి
చేతులు
పట్టుకొని,
"అమ్మా!
నా
మాటను
నమ్ము!
నాన్నగారు
మొదలే
ఆమెకు
మాటనిచ్చి,
తదుపరి
ఆమె
ఇట్టి
వరములు
కోరగనే,
తన
మాటను
తాను
వెనుకకు
తీసుకొనుటకు,
ఆడినమాటను
తప్పుటకు
ఇష్టము
లేక,
నన్ను
వీడుటకూ
అరణ్యమునకు
పంపుటకూ
మనసొప్పక
మహా
బాధపడుచున్నారు.
ఈ
బాధలో
ఆయనను
చూడలేక
పోవుచున్నాను.
ఇప్పుడు
నేనక్కడినుండియే
వచ్చుచున్నాను.
ఆయన
ప్రజ్ఞలో
లేదు.
ఘోరమైన
బాధను
అనుభవించుచున్నాడు.
ఇది
పరమ
సత్యము.
నవ్వులకై
నిన్నింత
బాధపెట్టుటకు
నేను
అంత
మూర్ఖుడను
కాను.
పితృవాక్యమును
నిలబెట్టుటకై
నేను
వెళ్లక
తప్పదు.
తండ్రి
ఆజ్ఞ
తీసుకొనే
వచ్చితిని.
ఇక
నీ
ఆజ్ఞ
కావలెను"
అని
పాదములకు
నమస్కరించెను.
16
▾
Meaning
Keep
అంత
రాముని
చూచి
కౌసల్య,
"రామా!
ఏమి
ఈ
వికార
భావము!
ఎట్టి
కిరాతకులైనను
ఇట్టి
కోరిక
కోరుదురా?
కొన్ని
నిమిషములలో
పట్టాభిషిక్తుడవు
కానున్న
నిన్ను
అడవికి
పంపుట
మానవమాత్రులు
తలంచని
తలపు
కాదా?
బ్రతికినంత
కాలం
నాకు
బాధలేనా?
ఎన్నియో
వ్రతములు
చేసి
కడకు
కొడుకు
లభించెను
కదా
అని
అనుభవించిన
బాధలన్నింటినీ
మరచి
నా
ముద్దుబిడ్డను
చూచి
నేను
ఆనందించుచుంటినే!
ఏ
సుఖమునూ
నేను
ఆశించలేదు.
నా
కొమరుడు
నాచెంతనుండిన
చాలు
నని
కోరితి.
దానికికూడనూ
నోచుకోలేనిదాననైతి
కదా!
కారడవులకు
పంపుటకే
నేను
కొడుకును
కంటినా?
ఏ
తల్లియైనా
కొడుకును
కారడవులకు
పంపుటకు
అంగీకరించునా?
నేనే
పాపము
చేసితిని?
ఏ
జన్మములో
తల్లీబిడ్డలకు
ఎడబాటు
సలిపితినో
కదా!
నీకు
ఉపనయనము
అయినది
మొదలు
నా
కొమరుడు
ఏనాడు
యువరాజు
అవుతాడో
అన్న
భావము
నాలో
క్షణక్షణమూ
ఉత్సాహముతో
ఎదురు
చూచుచుండెను.
అట్టి
నా
కలలు
కల్లలాయెనా?
నా
ఆశలన్నియూ
అడియాస
లయిపోయెనా?
నేను
నీకొరకై
చేసిన
పూజలు,
వ్రతములు,
హోమములు
వ్యర్థములయ్యెనా?
నేనెంత
పాపినైతిని!
నిజముగా
ఈ
వార్త
విని
నా
గుండె
పగులకున్నదెందులకు?
నేనింకా
ఎన్ని
దుఃఖముల
పాలు
కావలెనో
కదా!
నాకు
చావు
లేదు
కాబోలు.
ఇంత
దుఃఖవార్త
వినియూ
నా
గుండె
ఆడుచున్నది.
ఇంతకూ
కాలము
వస్తేనే
చావుకూడనూ
వచ్చును.
నన్ను
చూచి
ఆ
యముడుకూడనూ
వదలి
వెళ్లుచున్నాడు
కాబోలు!
యమలోకమునకు
కూడా
నేను
అర్హురాలను
కాను
కాబోలు"
అని
"హా!
రామా!
ఎంతటి
దుర్గతి
సంభవించెన"ని
క్రిందపడి
పొర్లుచు
గుండెలను
బాదుకొంటూ
విలపించు
కౌసల్యను
రామచంద్రుడు
చూడలేక
పోయెను.
చుట్టూ
చేరిన
దాసీల
రోదనలు
తన
చెవులను
బ్రద్దలు
చేయదొడగెను.
రాముడు
ఎవరితోనూ
పెదవులెత్తి
మాటాడలేదు.
తల్లిని
సమాధానము
చేయుచూ
తలను
సర్దుచూ,
నేలలోని
మట్టి
తల్లివంటికి
తగిలియుండగా
దానిని
శుభ్ర
పరచుచూ,
సముద్రములో
పాతుకొనిపోయిన
గండశిలవలె
అలలకు
17
▾
Meaning
Keep
కదలక
మెదలక
ఉండినటుల
రామచంద్రుడు
శోకమునకుకానీ,
ఆనందమునకుకానీ
అతీతుడై
నిలిచియుండెను.
పట్టాభిషేకమునకు
ఎట్టి
తేజస్సుతో,
ఉత్సాహముతో
సంసిద్ధుడాయెనో
అరణ్య
జీవితమును
గడుపుటకు
కూడా
అట్టి
ఉత్సాహముతో,
తేజస్సుతో
సంసిద్ధుడై
యున్నాడు.
రాముడు
మహాదీక్షాపరుడన్న
మాట
కౌసల్యకుకూడను
తెలుసు.
రాముడు
ఆడిన
మాట
తప్పడనియూ,
తండ్రి
ఆజ్ఞను
జవదాటడనికూడనూ
కౌసల్యకు
తెలుసు.
తానిక
ఎంత
విలపించిననూ
రాముడు
వెనుకకు
తిరుగడనియూ,
అరణ్యమునకు
తప్పక
వెళ్లుననియూ
పూర్తిగా
తెలుసుకొని
రామునికి
అడ్డుచెప్పుటకు
తాను
ఏమాత్రమును
ప్రయత్నము
చేయక
మనస్సును
గట్టి
చేసుకొని,
"నాయనా!
మన
తలరాత
ఇట్లుండ
యొకరినని
ప్రయోజనముండదు.
అన్నియూ
మన
మేలునకే.
దైవనిర్ణయమును
ఎవరునూ
కాదనలేరు.
నాకేనాడునూ
అయోధ్యలో
అంతఃపురంలో
సుఖములేదు.
నేను
అనుభవించనూ
లేదు.
నా
కుమారుడుండు
స్థానమునందే
నా
సుఖమున్నది
కాన,
నేనునూ
నీ
వెంట
వత్తును.
గొనిపొమ్ము"
అని
లేవ
ప్రయత్నించెను.
అంతలో
దాసీలు
ఆమెను
పట్టుకొని
ఆనించుకొని
ఓదార్చుచూ
కూర్చొనబెట్టిరి.
కౌసల్య
మాటలను
వింటూ
ఆమె
బాధను
చూస్తున్న
లక్ష్మణుడు
తన
మనసులోని
భావములను
అణచుకో
లేక,
మహాఉగ్రుడై
చేతులు
కట్టుకొని
కౌసల్యాదేవిని
చూచుచూ,
"ఓ
పూజ్యురాలా!
ఒక
ఆడదాని
మాటకు
లోబడి
రాముడు
రాజ్యమును
వదలుకొని
అడవుల
పాలు
కావటమును
నేనంగీకరింపను,
సహింపను.
తండ్రిగారు
వృద్ధులగుచేత,
మనస్సు
స్థిమితములేక,
పైగా
విషయలోలుడున్నూ
అగుటచేత,
కైకేయీ
ప్రేరణకు
దాసుడై
మన్మధ
పారవశ్యంలోపడి
ముందూ
వెనుక
యోచించక
ఏమైనా
ఆజ్ఞాపించగలడు.
అట్టి
ఆజ్ఞలన్నింటిని
మనము
పాటించరాదు.
నిత్యానిత్య
పరిజ్ఞానము
లేని
స్థితిలోనున్న
రాజు,
రాజు
కాజాలడు.
అట్టివారి
ఆజ్ఞ,
ఆజ్ఞ
కాజాలదు.
కాకున్న,
రాజ్యములో
కూడనూ
ఉండక,
అడవులకు
వెళ్ళగొట్టవలసినంత
మహాపరాధము
రాముడేమి
చేసెను?
18
▾
Meaning
Keep
రామునికి
శత్రువులుకానీ,
అపరాధములుచేసి
శిక్ష
ననుభవించుచున్న
కిరాతకులుకానీ
లేరు.
అట్టివారు
సహితము
రాముని
చూపునందైననూ
దోషారోపణము
చేసి
ఎరుగరే!
ఏ
ఒక్కడునూ
ఏ
ఒక్క
దోషమూ
ఎన్నడునూ
రామునికి
ఆపాదించి
ఎరుగరే!
అటువంటి
నిరపరాధిని,
నిర్మలచిత్తుని,
పవిత్ర
పురుషుని
అడవులకు
వెళ్ళగొట్టుటలో
ఏ
రాజునకూ
అధికారము
లేదు.
రాముడు
ఋజువర్తనుడు,
జితేంద్రియుడు.
ఎట్టి
శత్రువులనయిననూ
ఆదరించును.
అట్టి
సుపుత్రుని
ఎట్టి
తండ్రి
అయిననూ
అడవులకు
వెళ్ళగొట్టునా?
అందులో
మహాధార్మికుడు,
పవిత్రవీరుడు,
సర్వధర్మ
ప్రవర్తనుడు
అయిన
రాజు
ఇట్లు
ఆజ్ఞాపిస్తాడా?
దీనిని
పట్టిచూడ
దశరథునకు
మతిభ్రమణమయియుండ
వచ్చును.
లేదా
మన్మధ
పరవశుడయియుండవచ్చు.
ఈ
రెండు
స్థితులలో
ఉన్నవారి
ఆజ్ఞ
ఆచరణ
యోగ్యము
కాజాలదు.
పిచ్చివానివలె,
ఏమియూ
తెలియని
పిల్లవానివలె
ప్రవర్తించుచున్న
రాజు
మాటలను
మన్నించనవసరములేదు.
రాజనీతిని
మరచి,
లోకరీతిని
విడిచి,
పుత్రవాత్సల్యమునకు
స్వస్తిచెప్పి,
ఉన్మత్తుడై
చిత్తమును
స్వేచ్ఛగా
వదలి,
సంచరించే
దశరథుని
ఆజ్ఞను,
ఆజ్ఞగా
పాటించుటకు
నే
నంగీకరింపను"
అని
అంటూ
రామునివైపు
తిరిగి
చేతులు
కట్టుకొని,
"రామా!
నన్ను
మన్నింపుము.
ఈ
విషయము
ఇతరులకు
తెలిసేలోపలనే
నీవు
రాజ్యాన్ని
స్వాధీనము
చేసుకొనుము.
నేను
ధనుర్ధరుణ్ణి
అయి
నీ
వెంట
ఉందును.
నా
ధనుస్సు
పూజించుటకై
లేదు,
అయోధ్యానగరమున
నిన్ను
ఎదిరించేవారిని
దండించుటకే
ఈ
ధనుస్సు
ఉన్నది.
అట్లు
ఎదిరించు
వారు
అయోధ్యలోనేకాదు,
ఎందెందునూ
లేరు.
అట్లు
కాక
నిన్ను
ఎదిరించటమే
జరిగినా,
నా
ఈ
తీక్షణ
బాణములకు
ఈ
మహానగరము
నిర్మానుష్యమై
పోగలదు.
వేయేటికి?
భరతుడు,
అతని
హితమును
కోరే
ఇంకా
ఎవరైననుకానీ
నా
మీదికి
వచ్చునట్లయిన
వారలనందరినీ
నాశనము
చేతును.
కైకేయా
ప్రోత్సాహమువలన
దశరథ
మహారాజే
శత్రుత్వము
వహించి
మనపై
వచ్చెనా,
ఆయనను
కూడనూ
లెక్కచేయను.
ఆయనని
బంధించి
చెరసాలయందు
ఉంచుదును"
…కా
ఏమేమో
చెప్పబోవుచున్న
లక్ష్మణుని
చూచి
రాముడు,
19
▾
Meaning
Keep
"లక్ష్మణా!
మాటలు
మితిమీరుచున్నవి.
నా
ఇష్టమును
ఎవరునూ
కాదన
లేరు.
నా
సంకల్పమును
ఎవ్వరూ
మార్చలేరు.
నేను
అడవికి
వెళ్ళక
తప్పదు.
నాపై
గల
ప్రేమతో
నీవు
నా
యెడబాటును
భరించలేక
ఇట్లు
మాట్లాడుతున్నావు.
శాంతము
సర్వమునకూ
రక్ష!
నీవు
శాంతము
వహించు.
తండ్రినికానీ,
సోదరుడైన
భరతునికానీ
ద్వేషించకు.
వారు
పవిత్రులు,
నిర్మలచిత్తులు.
కైక
కూడనూ
పరమ
పవిత్రురాలు,
పూజ్యురాలు.
ఆమె
కోరిన
కోరికయందుకూడ
ఎట్టి
దోషమునూ
లేదు.
తన
కొడుకైన
భరతునికంటెనూ
నన్ను
అధికముగా
ప్రేమించెను,
చెంతచేర్చెను,
ఆదరించెను,
ఆడించెను,
ఆనందించెను.
అట్టి
దేవి
ఈనాడు
ఇట్టి
లోక
విరుద్ధమైన
కోరికను
కోరినదన్న
ఇందులో
ఏదో
ఒక
అంతరార్థము
లేకపోలేదు.
ఇది
దైవనిర్ణయమే
కానీ
పురుషకారము
ఏమాత్రమునూ
లేదు.
శాంతమును
వహించి
ముందు
జరుగుదానిని
విచారించుమ"ని
బోధించెను.
అంత
లక్ష్మణుడు
రామునకు
నమస్కరించి
"రామా!
నీకు
రావలసిన
రాజ్యమును
ఏ
హేతువువలన
కైకేయీదేవి
తన
కుమారునకు
కట్టపెట్టతలచెను?
ఏ
ధర్మమును
ఏ
బలమును
చూచుకొని
అట్లు
చేసెను?
జ్యేష్ఠపుత్రునికి
లేని
అధికారము
ఏ
పుత్రునకున్నది?
మీరు
పితృప్రేమచే
ఇట్టి
మూర్ఖపు
ఆజ్ఞలను
సహితము
శిరసావహించుచున్నారు.
కాని
మీరెన్ని
చెప్పిననూ
నేను
సమ్మతింపను"
అని
కౌసల్యావైపునకు
తిరిగి,
"ఓ
దేవీ!
నేను
నిజముగా
రామానురక్తుణ్ణి,
సత్య
ప్రమాణము
చేసి
చెప్పుదును.
రామునివిడచి
నేనొక
నిమిషముకూడనూ
నిలువను.
రామునికి
ఒకవేళ
రాజ్యకాంక్ష
లేక
అడవులయందే
నివసించుట
ప్రీతిగా
తోచిన,
నేనుకూడా
అతనితో
వెళ్లుదును.
అతని
అడుగుజాడల
ననుసరింతును.
అతనికి
నీడవలె
తోడుందును.
అతడు
ఆజ్ఞయే
చేసిన,
మండుటగ్నిలో
నైననూ
ఆనందముతో
దుముకుదును.
రామాజ్ఞ
తప్ప
అన్యుల
ఆజ్ఞ
నేను
చెవియందైననూ
వేయను.
అమ్మా!
మీ
దుఃఖమును
నే
చూడలేను.
మీకు
కుమారుడైన
రామచంద్రుడు
నాకు
ప్రాణముతో
సమానము.
అట్టి
ప్రాణమును
వీడి
ఉండుటకు
ఎట్టివాడునూ
అంగీకరించడుకదా!"
అని
లక్ష్మణుడు
చెప్పుచున్న
పలుకులు
కౌసల్యకు
కొంత
శాంతిని
చేకూర్చినవి.
లక్ష్మణుని
తల
20
▾
Meaning
Keep
నిమురుచూ,
"కుమారా!
నీ
ప్రేమ
నన్ను
ఎంతనో
సంతోషపెట్టుచున్నది.
నాకు
నీ
వచనములు
మహాబలము
నందించుచున్నవి.
నీబోటి
సోదరుడు
లోకమున
అరుదు.
ఇట్టి
పుత్ర
రత్నములను
కన్నతల్లులు
మహాపవిత్రులని
లోకులు
తలంతురుకానీ,
మేమెంత
పాపము
చేసితిమో?
ఈ
బాధ
మాకు
తప్ప
అన్యులకు
అర్థము
కాదు.
రాముడు
తన
పట్టును
వీడడు.
అతనికి
వెళ్ళక
తప్పదు.
కాన
నన్నుకూడా
మీతో
గొనిపొండు"
అని
విలపించినది.
లక్ష్మణుణ్ణి
చూస్తూ
రామచంద్రుడు,
"తమ్ముడా!
నీకు
నామీద
ఎంత
అనురాగమున్నదో
నేనెరుగుదును.
నీ
పరాక్రమము,
బలము,
ప్రభావముకూడనూ
నాకు
తెలియనిదికాదు.
సత్యస్వరూపములు
తెలుసుకొనలేక
తల్లియైన
కౌసల్య
మహాదుఃఖము
ననుభవించుచున్నది.
అంతియేకాక
కన్నకడుపగుటచేత
ఇట్టి
బాధ
సహజమే.
కానీ
సకల
పురుషార్థములకూ
ధర్మమే
మూలము.
ధర్మము
సత్యముమీదనే
నిలిచియున్నది.
సత్యములేక
ధర్మము
నిలువజాలదు.
సత్యధర్మములు
రెండునూ
అవినాభావ
సంబంధము
కలవి.
పితృవాక్య
పరిపాలనచే
నాకు
ఇప్పుడు
సత్యధర్మములు
రెండునూ
సమకూరుతున్నవి.
తల్లికికానీ
తండ్రికికానీ
పెద్దలయిన
గురువులకుకానీ
మాట
ఇచ్చిన
తరువాత
ధార్మికు
దైనవాడు
ఎవడునూ
తప్పడు.
తప్పకూడదు.
అందువలన
పితృఆజ్ఞను
నేను
అతిక్రమించను.
నన్ను
ఆజ్ఞాపించినది
కైకేయి
కాదు,
పిత్రాజ్ఞను
ఆమె
నాకు
అందించినది.
అట్లు
అందించుట
అతని
సన్నిధియందే
కనుక
దానిని
శిరసావహించవలసినదే.
అట్లు
పితృ
ఆజ్ఞయే
కాకుండిన
కైకేయీదేవి
పితృ
ఆజ్ఞగా
నాకు
తెలుపుచుండినపుడు
తండ్రి,
ఇది
నా
ఆజ్ఞకాదని
చెప్పియుండవచ్చునుకదా!
అట్లు
చెప్పక,
ఊరక
విలపించుచుండెను.
కనుక,
ఆయన
అంగీకరించినట్లే.
కాన
నేను
నా
సంకల్పమును
మార్చుకొనను,
మార్చుకొనుటకు
వీలులేదు.
నీవు
ఊరక
భయంకరమైన
క్షత్రియ
ధర్మముమీదికి
నీ
బుద్ధిని
పోనీయవద్దు.
క్రౌర్యము
వీడి
నా
పద్ధతిని
అవలంబింపుము"
అని
చెంతకు
వెళ్లి
విచారముతో
క్రుంగిపోవుచున్న
అతని
వీపును
నిమిరి
పరమ
శాంతముతో,
ప్రేమవచనములతో
ఓదార్చుటకు
పూనుకొనెను.
21
▾
Meaning
Keep
తరువాత
తల్లియైన
కౌసల్యవైపున
చూచుచూ,
"అమ్మా!
నా
తలంపునకు
అడ్డుతగిలి
నా
వ్రతమును
భంగపరచవద్దు.
నేను
ఏది
ఎట్లు
జరిగినను
అరణ్యమునకు
పోకతప్పదు.
నీవు
ప్రేమతో
అనుమతించి
పంపుము,
ఆశీర్వదించుము"
అని
మోకాళ్ళపై
వంగి
నమస్కరించుచున్న
రాముని
చూచి
తల్లి
కుమిలిపోవుచూ,
దుఃఖమును
మ్రింగుచూ,
రాముని
వీపున
చేతులుంచి
బోరున
ఏడ్చుచుండుట
రాముడు
భరించలేక,
తల్లి
పాదములు
పట్టి,
"అమ్మా!
నా
మాట
పరమ
సత్యము!
వనవాసమునందు
నాకెట్టి
ఇక్కట్లును
సంభవించవు.
అత్యంత
ఆనందముగా,
సుఖముగా
ఈ
పదునాలుగు
సంవత్సరములూ
గడిపి
తిరిగి
నేను
తమ
సన్నిధికి
వచ్చి
వ్రాలగలను.
తమ
అభీష్టమును
నెరవేర్చ
గలను.
అమ్మా!
దశరథుని
ఆజ్ఞను
నేనేకాదు,
నీవు,
లక్ష్మణ
సుమిత్ర
భరత
శత్రుఘ్నులు
సహితము
నెరవేర్చవలెను,
శిరసావహించ
వలెను.
ఇదియే
సనాతన
ధర్మము.
తల్లీ!
మరొక
మనవిని
మన్నించవలెను.
నాకొరకై
ఏర్పరచిన,
సమకూర్చిన
సంభారములను
నీవు
సంతోషముగా
సమాన
ప్రేమతో
భరతుని
రాజ్యాభిషేకమునకు
ఇచ్చివేయవలెనని
ప్రార్థింతును.
నాకు
అరణ్యరాజ్యమును
అప్పజెప్పెను,
నాన్నగారు.
అయోధ్య
రాజ్యమును
భరతునకు
అందించెను.
ఎవరెవరి
బాధ్యతను
వారు
నిర్వర్తించుటయే
పరమధర్మము.
కర్తవ్యమును
నిర్వర్తించక,
కఠినమని
తలంచుట
పుత్రునకు
సరికాదు.
తల్లియైన
నీవు
రాముడన్నను,
భరతుడన్నను
భేదము
లేక
ఇరువురి
బాధ్యతలను
సక్రమముగ
కొనసాగించుడని
కోరి
ఆశీర్వదించుటే
నీ
విధి"
అనెను.
కౌసల్య
రాముని
మాటలను
ఆలకించుచూ,
భరించలేని
దుఃఖంతో
నేలకూలి,
"కుమారా!
శరీర
సంబంధమునందును,
పెంచి
పెద్ద
చేయుటయందును
నీకు
నీ
తండ్రి
ఎంత
పూజ్యుడో
నేనునూ
అంత
పూజ్యురాలనే
కదా!
అంతియేకాక
పతికి
సతి
అర్ధాంగి.
అనగా,
పతిలోని
ఎడమ
భాగము
సతి,
సతిలోని
కుడి
భాగము
పతి.
ఈవిధముగా
ఒకరిలో
ఒకరి
అర్ధభాగము
సతి
పతులయి
ఉండ
నేను
దశరథునిలోని
అర్ధభాగము
అగుటచేతనే
నన్ను
అర్ధాంగి
22
▾
Meaning
Keep
అని
పిలుచుట
నీకు
తెలియదా!
ఈనాడు
నీ
తండ్రి
నీకు
ఆజ్ఞ
ఇచ్చెనని
చెప్పుటలో
అది
అర్ధ
ఆజ్ఞయేకానీ
పూర్తి
ఆజ్ఞ
కాదుకదా!
మిగిలిన
పూర్తి
ఆజ్ఞ
కావలెనన్న
నేనుకూడనూ
సమ్మతించినపుడే
నీవు
పరిపూర్ణ
ఆజ్ఞను
పాటించినవాడవగుదువేకానీ
లేకున్న
అట్టిది
ఆజ్ఞ
క్రింద
సమకట్టుట
సరికాదనునదికూడనూ
విచారించవలెను.
సర్వధర్మములు
తెలిసిన
నీవు
ఈ
ధర్మమునుకూడ
యోచించవలెను
కదా!
తల్లి
ఆజ్ఞ
లేక
ఎట్టి
ధర్మమూ
పరిపూర్ణ
రూపమును
ధరించదు,
కానేరదు.
పితృఆజ్ఞకంటే
మాతృఆజ్ఞ
అతి
ప్రధానం.
కని,
పెంచి,
పెద్ద
చేయునది
తల్లిగాని
తండ్రి
కాదు.
నవమాసాలు
తల్లియే
భరించకున్న
పుత్రుడే
లేడు
కదా!
అట్టి
తల్లిని
శోకాగ్నిలో
వేసి
తండ్రి
ఆజ్ఞ,
తండ్రి
ఆజ్ఞ
అని
నీవు
తండ్రికే
ప్రాధాన్యము
నందించుట
నేను
ఏనాటికీ
అంగీకరించను.
ఇది
నీకు
తగినది
కాదు.
తల్లికి
కొడుకును
మించిన
ధనము
వేరులేదు.
అందునా
నా
బోటి
తల్లికి,
కొడుకే
సర్వము.
కొడుకును
కడగండ్ల
పాలుచేసి
పితృఆజ్ఞ
అని
దానిని
అంగీకరించిన,
నాకు
పరలోక
ప్రాప్తి
లభించియు
ఫలమేమి?
నేను
నరకము
ననుభవించిననూ
సరే
నా
కొమరుడు
నాచెంతనుండిన,
లేక
నేను
కొమరుని
చెంతనుండిన
అంతేచాలు;
అదే
నాకు
సర్వము.
రామా!
ఇక్కడుండి
మాత్రము
నేను
చేయునదేమున్నది?
నా
జీవితములో
ఏనాడును
నేను
సంతోష
మనుభవించనోచుకొనలేదు.
పుట్టినది
మొదలు
తల్లిదండ్రుల
ఆజ్ఞలను
అనుసరించి,
కడకు
ఎట్టి
పతి
లభించునో,
ఎట్లుండునో
అను
విచారముతో
కుములుచుండ,
పెండ్లి
ఆయెను;
కొన్ని
సంవత్సరములు
పుత్రులు
లేరని
విచారముతో
కాలము
గడిపితిని;
ఆనాటి
మొదలు
నేటివరకు
ఆ
బాధలు
తప్పలేదు.
ఏ
జన్మ
నోముఫలమో,
నిన్ను
కొడుకుగా
వడసితిని.
ఇంతలో
నీ
వియోగము
ఈరీతిగా
సంభవించుచున్నది.
ఏనాడు
సుఖము?
జీవితమే
ఒక
దుఃఖసాగరమయి
అందులో
పడి
గట్టు
చిక్కక,
ఈదలేక
మునకలు
వేయుచున్న
నాకు
రామాధారమొక
పట్టుకొమ్మగా
ఉండెను.
నేను
దానినికూడను
వీడిన
నా
గతి
ఏమగునో
బాగా
విచారించుకో,
నాయనా!
నేను
లేకపోవుటచేత
మీ
తండ్రి
23
▾
Meaning
Keep
కేకొరతయూ
ఉండదు.
అతని
ఆనందము
కైకతో
చేరినదేకానీ,
మరెవ్వరూ
అవసరముండరు.
కాన,
ఇక్కడ
ఉండి
ఈరీతిగా
రాత్రింబగలు
కుమిలి
తుదకు
ప్రాణములు
విడుచుటకంటే,
నా
ముద్దుకొమరుని
మోమును
చూచుచూ,
అరణ్యములలో
అన్నపానాదులు
లేకపోయిననూ
హాయిని
అనుభవింతును"
అని
పరిపరివిధముల
విలపించుచున్న
కౌసల్య
వాక్యములు
రామచంద్రునకు
సరియైనవిగా
తోచినవి.
మరొకప్రక్క
తండ్రి
ఆజ్ఞను
శిరసావహించక
తప్పదన్న
శపథము
వత్తిడి
పెట్టుచుండెను.
ఇంతలో
లక్ష్మణుడు,
"అన్నా!
తల్లివాక్యములు
పరమ
సత్యములు.
తండ్రికంటే
తల్లి
ప్రధానం.
అందువలననే
శాస్త్రము,
'మాతృదేవో
భవ
-
పితృదేవోభవ'
అని
మాతృస్థానమునకు
ప్రాధాన్యత
ఇచ్చినది.
నీవు
అంత
పట్టుపట్టి
మాతృదేవిని
బాధపెట్టుట
మంచిది
కాదు"
అని
తెలుపగనే,
రాముడు
"లక్ష్మణా!
పుత్రవాత్సల్యంతో
పరితపించు
తల్లి
మాటలనే
నీవు
పాటించుచున్నావు
కాని
రాజ్యమునకు,
యావత్
ప్రపంచమునకు,
ప్రజలకు
సంబంధించిన
పితృవాక్యమును
నీవు
విచారము
చేయకుండుటలో
ఉన్న
అంతరార్థ
మేమీ
బోధపడుటలేదు.
ఒక్క
ధర్మమువలననే
అర్థ
కామ
మోక్షములను
మూడు
పురుషార్థములు
సమకూరును.
ఇందులో
సందేహమక్కరలేదు.
ధర్మానుష్ఠానమువలన
భార్య
అనుకూలవతి
అయి
ధర్మానికి
అభిమతమయి,
కామానికి
సుపుత్ర
అయి,
అర్థాన్ని
సమకూరుస్తుంది.
అదేవిధముగా
ధర్మమూ,
అర్థమూ,
కామమూ
మూడూ
ఏ
పనివలన
సమకూరవో
ఆ
పని
చేయకూడదు.
కేవలము
అర్థపరుడైనవానిని
లోకము
ద్వేషిస్తుంది.
కేవలము
కామపరత్వము
అప్రశస్తము.
అందువలన,
ధర్మము
సమకూరే
పని
చేయవలెను.
లక్ష్మణా!
అంతేకాదు!
దశరథ
మహారాజు
మనకు
తండ్రీ,
గురువు,
రాజు.
ఆయన
కోపమువల్లకానీ,
కామమువల్లకానీ,
ప్రేమవల్లకానీ
ఏమి
ఆజ్ఞాపించినా
మనము
చేసే
తీరవలెను.
పాపకర్ముడయిన
కొడుకు
తండ్రి
చెప్పినది
చేయకపోవచ్చు.
నేను
అట్లు…
నాన్నగారు
ఏమి
చెప్పినా,
నేను
24
▾
Meaning
Keep
శిరసావహింతును.
ఇందులో
నీకు
కొంత
సందేహము
కలుగవచ్చును.
తండ్రి
మూర్ఖుడై,
కామాంధుడై,
నిత్యానిత్య
పరిజ్ఞానము
లేక
తన
స్వార్థమునే
లక్ష్యమందుంచుకొని,
పరుల
మాటలను
నమ్మి
కన్నకొమరుని
కష్టపెట్టుటలో
అనుసరించు
అధర్మమునుకూడనూ
కొమరుడు
విశ్వసించవలసినదేనా?
అని
నీవనవచ్చు.
తప్పక
విశ్వసించవలసినదే.
మూర్ఖుడయిననూ,
అజ్ఞాని
అయిననూ
అతనికి
నీవు
కుమారుడవే.
దీనిని
విశ్వసించినపుడు
మిగిలినవన్నియూ
దానికి
తగ్గ
స్థాయులేకాని
అధిక
స్థాయివి
కావు.
తండ్రి
అని
విశ్వసించిన,
కుమారునకు
తండ్రి
చెప్పు
విషయములు
కొంత
అస్తవ్యస్తమయినవిగా
ఉండిన
వాటిని
విపులముగా
వివరించి
తండ్రికి
నచ్చజెప్ప
వచ్చునేకాని
తాను
చెప్పునవి
అవివేకమైనవిగా
భావించి,
తిరస్కరించరాదు.
అందునా
దశరథ
మహారాజు
మహామేధావి,
శూరుడు,
ధార్మికుడు.
మాటను
నిలబెట్టుకొనుటకై
అంత
పరితపించుచున్నాడే
కానీ
కైకకు
లొంగికాని,
కామాతురతవలనకాని
కాదు.
తాను
ఆనాడు
ఇచ్చిన
మాట
సత్యము.
అంతేకాక
నిన్నుకూడను,
"నీ
అభీష్టమేదైననూ
సరే,
నా
ప్రాణాపాయమును
కలిగించునదైననూ
సరే,
నేను
నెరవేర్తున"ని
కైకకు
వాగ్దానము
చేసెను.
కాన,
దానిని
ఓర్చుకొనుటకు
మార్గములేక,
నన్ను
అడవులకు
పంపుటకు
ఇష్టములేక,
పరితపించుచున్న
తండ్రిని
కామాంధుడని
నేనంగీకరింపను.
లక్ష్మణా!
దశరథ
మహారాజు
తన
పూర్వీకులకంటే
ధర్మాత్ముడు;
ముల్లోకములలోనూ
అతని
పేరుప్రతిష్ఠలు
మ్రోగినవి.
ప్రసిద్ధికెక్కినవి.
అతను
జీవించియుండగా
అతని
పట్టపురాణి
అయిన
కౌసల్యాదేవి
పతిని
విడిచి
కొడుకుతో
అడవికి
వెళ్లినదన్న
వార్త
లోకమునకు
అపమార్గమును
చూపించినట్లగును."
"బ్రతుకు
కొంతకాలము;
ఈ
అల్పకాలమునకు
శాశ్వతకీర్తిని
కోల్పోవుట
నాకుకానీ,
నీకుకానీ
మంచిది
కాదు
తల్లీ!"
అని
తల్లివైపుకు
తిరిగి
దీనముగా
ప్రార్థించుచున్న
రామవాక్యములు
కౌసల్యకు
కొంత
విచారమును
కలిగించినవి.
ఆమె
స్తంభించిపోయినది.
రాముడు
ఇక
నిలువడని
గమనించినది.
తనను
25
▾
Meaning
Keep
నిలువుటకై
చేసిన
ప్రయత్నములు
అన్నియూ
విఫలమయినవి.
కడకు
సమ్మతించక
తప్పదని
తలంచినది.
తాను
విలపించుకొలది,
రాముని
బాధ
పెట్టినటులే
కాగలదని
భావించినది
కౌసల్య.
లక్ష్మణుడు
కండ్లెఱ్ఱ
చేసుకొని
వళ్ళుమరచి
పెదవులు
వణకుచు
నోటమాటాడక
కనురెప్పలు
వాల్చక
భూమిని
చూచుచూ
వదలుచున్న
కంటిధారలను
రామచంద్రుడు
చూచినాడు.
అట్టి
స్థితిలో
నున్న
లక్ష్మణుని
వదలి
వెళ్ళుట
మంచిది
కాదని
యోచించినాడు.
అంతేకాక,
తాను
వెళ్ళిన
తరువాత
లక్ష్మణుడు
విచారముతో
ఏమైననూ
చేసుకోగలడు,
ఏమైననూ
చేయగలడు.
అట్టి
చర్యలు
తనవలననే
జరిగినవి
కాగలవు.
కాన
లక్ష్మణుని
శాంతపరచుట
మంచిదని
తలంచి
రాముడు
లక్ష్మణునితో,
"తమ్ముడా!
కోపము
సర్వ
పాపములకు
ధూపము.
దానిని
నిగ్రహించుకో.
రామచంద్రునకు
ఇంత
అవమానము
జరిగెనే
అని
నీవు
దుఃఖపడవద్దు.
సత్యధర్మములకు
మానాభిమానములుండవు.
ధైర్యము
వహించు.
తండ్రిని
సేవించి
ధన్యుడవు
గమ్ము"
అని
ఆశీర్వదించెను.
అంత
లక్ష్మణుడు,
"అన్నా!
నా
ప్రాణసమానుడైన
రాముడు
అరణ్యమునకు
వెళ్ళుచుండ
జడమైన
ఈ
కాయముతో
ఎవరిని
సేవించగలడు
ఈ
లక్ష్మణుడు?
లక్ష్మణునకు
రామసేవ
తప్ప
అన్యసేవలు
అక్కరలేదు.
నీ
ధర్మములు
నీకెటులో
నా
ధర్మములు
నాకట్టివే.
కాన
నేను
తమ
వెంట
వత్తును.
నాకు
ఎవరి
ఆజ్ఞయూ
అక్కరలేదు.
నేను
కైకేయి
కోరిన
వరములలో
చేరలేదు.
ఒకవేళ
చేరిననూ
నేను
ఆమె
ఆజ్ఞకానీ
లేక
ఆమె
అనుచరుల
ఆజ్ఞకానీ
ఆలకించను;
నన్ను
ఆజ్ఞాపించుటకు
ఒక్క
రామునకు
తప్ప
ఎవ్వరికీ
అధికారము
లేదు.
కాన
ఇదుగో,
ఇప్పుడే
నేనుకూడా
జటావల్కలములు
ధరించి
సిద్ధమగుదును"
అని
పట్టాభిషేకమునకై
చేసుకొన్న
అలంకారములను,
ఆభరణములను
తీసి
క్రిందపారవేసి
కుండలములు,
చంద్రహారములూ
నలుదిశలా
పారవేసెను.
అన్నతో
వెళ్ళుటకు
సిద్ధమాయెను.
26
▾
Meaning
Keep
లక్ష్మణుని
త్యాగమును
చూచుచున్న
రామునికి
హృదయము
కరిగినది.
దగ్గరకు
వచ్చి
వీపు
నిమురుతూ,
"తమ్ముడా!
ఇట్టి
తమ్ముడు
నాకుండుట
నా
ఆనందమునకు
అంతులేదు;
ఇది
నా
భాగ్యము.
నీవు
నాతో
వచ్చుటచే
తల్లియైన
కౌసల్యకూడనూ
కొంత
శాంతించగలదు.
నేను
ఈ
పదునాలుగు
సంవత్సరములు
అరణ్యములందు
ఏరీతిగా
జీవితమును
గడుపుదునో,
కడకు
పదునాలుగు
సంవత్సరములు
పూర్తి
గడుపుకొని
అయోధ్యకు
రాగలనో
లేదో
అన్న
భయము,
అనుమానము
తల్లిని
కలతపెట్టుచున్నది.
కాన
నీవు
తల్లికి
తగినరీతిగా
ధైర్యము
చెప్పుము.
మనము
ఈరీతిగా
కాలాయాపన
చేసిన
తండ్రి
మరింత
బాధపడును.
"ఇంకనూ
బయలుదేరలేదు.
కడకు
రాముడు
అరణ్యమునకు
వెళ్ళునో
వెళ్ళడో"
అను
అనుమానము
కైకలో
చెలరేగ
వచ్చును.
కాన,
నేను
సీతతో
ఈ
వార్త
తెలిపి
కైకేయి
మందిరమునకు
వెళ్ళి
తండ్రికి
నమస్కరించి
వచ్చులోపల,
నీవు
మీ
తల్లియైన
సుమిత్ర
అనుమతి
బడసి
రమ్ము"
అని
కౌసల్యకు
ప్రదక్షిణ
చేసి
నమస్కరించుచుండ
అంతఃపురములోని
దాసీలు,
మిగిలినవారు
ఒక్కసారి
ప్రళయము
వచ్చినటుల
ఘొల్లున
ఏడ్చిరి.
"తల్లీ!
ఆశీర్వదించుమ"ని
శిరస్సు
వంచి
నిలుచున్న
కొమరుని
అక్కున
చేర్చి
శిరస్సును
ముద్దాడి,
"నాయనా!
రామా,
నీవు
పరమ
ధార్మికుడవు.
పరాక్రమవంతుడవు.
నీకు
అరణ్యములయందు
ఎట్టి
భయమూ
ఉండదు.
వనవాసము
చేయ
నిశ్చయించుకొంటివి.
నిన్ను
నివారించుట
నాచేత
కాని
పని
అయినది.
నీకు
శుభము.
నీవు
పితృవాక్య
పరిపాలనము
చేసి
పితృఋణము
తీర్చి
చరితార్థుడవై
తిరిగి
వస్తే
అంతే
చాలును.
నేను
ఆనాడే
సంతోషింతును.
రామా!
దైవబలము
సామాన్యము
కాదు.
దైవనిర్ణయమును
ఎట్టివారూ
మార్చలేరు.
ఏ
ధర్మమునకై
నీవు
అడవికి
వెళ్ళుచున్నావో
ఆ
ధర్మమే
నిన్ను
రక్షించును.
రామా!
పదునాలుగు
సంవత్సరములు
గడచిన
తరువాత
జటావ…రివై
నీవు
ఇప్పుడే
కనిపించిన
ఎంత
బాగుండెడిది.
అయ్యో!
నా
27
▾
Meaning
Keep
పిచ్చి.
పదునాలుగు
సంవత్సరములన్న
సామాన్యమా?!
నాయనా!
ఏమని
ఆశీర్వదింతును?
పదునాలుగు
సంవత్సరములు
పదునాలుగు
దినములుగా
కాదు,
కాదు,
పదునాలుగు
నిమిషములుగా
గడిపిరమ్ము.
రాజ్యాభిషిక్తుడవు
కమ్ము.
ఓ
రఘువంశోద్ధారకా!
ఇనకులతిలకా!
మా
ముద్దు
బిడ్డా!
ఏ
ధర్మరక్షణకై
నీవు
అడవులకు
వెళ్లుచున్నావో
ఆ
ధర్మదేవతయే
నీ
చుట్టూ
ఉండి
రక్షించును.
అంతకంటే
రక్షకులు
మరొకరు
లేరు.
నీ
కొరకై
నేను
ఈ
పదునాలుగు
సంవత్సరములు
హోమములు
చేయుచుందును.
నీ
పితృసేవ,
మాతృసేవ,
గుణసేవలే
ఆయురారోగ్యము
లందించును.
నీ
సత్యవ్రతమే
పరమ
ధైర్యము
నందించును.
పర్వతములు,
నదులు,
పొదలు,
పుట్టలు,
పిట్టలు
నీ
అండన
చేరి
ఆదరించి
ఆనందము
నందించును.
సూర్యచంద్రాదులు,
నక్షత్రాది
ఉపగ్రహములు
సహితం
నిన్ను
ఏ
ఇక్కట్లకూ
గురికాకుండా
కాపాడుదురు.
క్రూరకృత్యాలకు
వడిగట్టే
రాక్షసులు
సహితం
నీ
చల్లని
ప్రేమకు
వశమై
నీకు
దాసోహం
కాగలరు"
అని
ఆశీర్వదించుచూ,
పొరలివచ్చే
దుఃఖమును
దిగమ్రింగుతూ
సంతోషము
నభినయిస్తూ
రాముని
తలను
వంచి
ఆఘ్రూణించింది.
అతనిని
గట్టిగా
కౌగిలించుకొని
చెక్కున
ముద్దు
పెట్టుకొన్నది.
అదురుచున్న
పెదవులతో,
"రామా,
క్షేమముగా
తిరిగి
రమ్ము,
ఆనందముగా
పొమ్ము"
అని
పలికింది.
రాముడుకూడనూ
తల్లి
ప్రేమను
బాగా
అర్థము
చేసుకొన్నవాడు
కనుక
ఆమెను
బాధపెట్టుటకుకూడ
తాను
ఒప్పుకొనక,
తప్పినది
కానందున
పదేపదే
తల్లి
పాదములకు
నమస్కరించుచు,
"అమ్మా!
నీవు
దుఃఖించక,
నిద్రాహారములను
మానక,
ఆరోగ్యమును
పాడుచేసుకొనక,
నిరంతరము
చల్లని
హృదయముతో
నన్ను
తలంచుచుండుము.
నీ
తలంపు
ఎట్టిదిగా
ఉండునో
నా
క్షేమము
అట్టిదిగా
ఉండును.
కాన
నా
క్షేమము
సుక్షేమంగా
సుఖవంతంగా
ఉండాలన్న
నీవు
దుఃఖించక
ఆశీర్వదించుచుండుము"
అని
ప్రార్థించి
విడువలేక,
విడువలేక
తల్లియైన
కౌసల్యను
వదలి
జనావృతమయిన
రాజవీధిలో
రాముడు
పాదచారుడై
28
▾
Meaning
Keep
నడువసాగినాడు.
ఆ
గుణవంతుని
చూచి
జన
సమూహము
కంపించిపోయినది.
గాలివార్తగా
వచ్చిన
రామ
అరణ్యవాసము
నిజమైనదో
కాదో
అన్న
ఆందోళనలో
ఉన్న
పురజనులు
రాముడు
పాదచారుడై
రావటముతో
క్రుంగిపోయినారు.
పట్టాభిషేకమని
పొందిన
పొంగులన్నియూ
క్రుంగి
ప్రవహించినాయి.
జీవచ్చవములవలె
వారి
ముఖములు
వాడినవి.
Previous
←
Two Boons
Next
Sīta, Rāma's Equal Half
→