Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · Sīta, Rāma's Equal Half
Rāma Kathā Rasa Vāhini
›
Part One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
రాముడు
తలయెత్తి
చూడక,
ఎవరితోనూ
మాటాడక,
సీతాంతఃపురమునకు
వెళ్లుచున్నాడు.
కైకేయీ
మందిరమున
ఏమి
జరిగినదో
తెలియని
సీతాదేవి
పట్టాభిషేక
గడియలు
సమీపించుచున్నవే,
ఇంకా
రాముడు
ఎందుకు
రాలేదని
ద్వారములు
చూచుచుండెను.
ఉపవాసవ్రతములు
పూర్తి
చేసి,
గంధ
పుష్పాక్షతాదులు
చేతపట్టుకొని
రాముడు
ఎప్పుడెప్పుడు
వచ్చునా
అని
ఆమె
ఉవ్విళ్ళూరుచున్నది.
ఆమెతోపాటు
అంతఃపురములో
ఉన్న
అందరూ
సంతోషమున
ఓలలాడుచుండిరి.
మంగళాంగనలు
హారతులు
సిద్ధము
చేసుకొనియున్నారు.
ఇంతలో
అపూర్వముగా
అలంకరించియుండిన
ఆ
అంతఃపురములోనికి
రాముడు
తల
వంచుకొని
వచ్చుట
చూచి
దిగ్భ్రాంతి
చెందిరి.
సీతాదేవి
ఎదురేగి
చూచి
ఆమెను
ఆమె
నమ్మలేకపోయినది.
దేహము
గజగజ
వణకినది.
పెదవులు
అదరుచూ,
"ప్రభూ!
ఏమిటిది?
ఇట్లా
ఉన్నారెందులకు?
ఈనాడు
బృహస్పతిదేవతాంకితమయిన
దినమని
చెప్పిరికదా.
శుభకరమైన
దినము
అని
పుష్యమీ
నక్షత్రములో
మీ
యువరాజ్యాభిషేకమని
బ్రాహ్మణోత్తములు
చెప్పిరికదా!
మీ
దివ్యసుందర
విగ్రహమునకు
జలఫేననిభము,
శతశలాకాయుతము
అయిన
శ్వేతచ్ఛత్రము
ఎందుకు
పట్టలేదు?
చంద్రమండలమువలె
తళతళలాడుతూ
హంసలవలె
తోచే
వింజామరలు
మీకు
ఎందుకు
వీచరైరి?
వందిజనులు
స్తోత్రపారాలు
పలుకలేదెందుకు?
నాథా!
వేదపారంగతులైన
బ్రాహ్మణులు
మూర్ధాభిషిక్తులు
అయిన
మీ
శిరమున
తేనె
పెరుగు
పెట్టి
అభిషేకము
చేయలేదెందులకు?
మంత్రులు,
సామంతులు,
శ్రేణిముఖ్యులు
మీ
వెంట
నడచి
2
▾
Meaning
Keep
రాలేదే?
నీలమేఘము
నేలమీద
నడచుచున్నదో,
కాక,
నల్లకొండ
కదలిపోతున్నదో,
అన్నట్లు
కనిపించే
శత్రుంజయము
అను
మదపుటేనుగు
మీముందు
నడచిరాలేదెందుకు?"
అని
సీతాదేవి
ప్రశ్నల
వర్షము
కురిపించుచుండుటచే
రాముడు
ఏమి
చేయుటకూ
తోచక,
అంత
సులభంగా
చెప్పునట్టి
విషయము
కానందున
లోనికి
వెళ్లి
సీతను
దగ్గర
చేర్చుకొని,
"సీతా!
పూజ్యపాదులు
మా
నాన్నగారు
నన్ను
ఇదే
ముహూర్తములో
అరణ్యమునకు
పంపుటకు
నిశ్చయించుకొన్నారు.
కాన
ఇప్పుడే
పితృఆజ్ఞ
పరిపాలన
గావించవలసి
ఉన్నది"
అని
చెప్పెను.
సీతకు
ఈ
మాటలు
నమ్మరానివై
తోచినవి.
కారణము
చెప్పక
విషయమును
మాత్రమే
చెప్పుటచే
సీతాదేవి,
"నాథా!
అరణ్యములకు
పంపునట్టి
అపరాధము
తామేమి
చేసితిరి?
ధర్మాత్ముడైన
దశరథ
మహారాజు
నిష్కారణముగా
అట్టి
ఆజ్ఞను
విధించడు
కదా!
తామును
అట్టి
అపరాధములు
చేయరుకదా!
అట్టి
తరి
మీరు
వనవాసం
చేయుటలోని
అంతరార్థమేమిటి"
అని
ప్రశ్నించగా
రాముడు
చిరునవ్వుతో,
"సీతా!
పూర్వము
ఒకప్పుడు
నా
తల్లియైన
కైకేయిదేవికి
మా
తండ్రి
రెండు
వరముల
నిచ్చిరట.
అవి
ఆయన
ఇంతవరకు
చెల్లించలేదు.
ఈమెయు
కోరలేదు.
నేడు
ఆమె
ఆ
రెండు
వరములు
కోరుటలో
ఒకటి
భరతునకు
పట్టాభిషేకము
చేయవలెననియూ,
రెండవది
నన్ను
జటావల్కలములు
ధరించి
పదునాలుగు
సంవత్సరములు
వనవాసము
చేయవలెననియూ
కోరినది.
మా
తండ్రి
పరమ
ధార్మికుడు,
ఆడినమాట
తప్పనివాడు.
అందువలన
తలవొగ్గినాడు.
కాన
నిన్ను
చూచి
వెళ్లవలెనని
ఇప్పుడిక్కడికి
వచ్చితిని"
అని
అన్నాడు.
"సీతా!
నీవు
మహాపూజ్యమైన
వంశమందు
జన్మించితివి.
నీవు
సమస్త
ధర్మములూ
తెలిసినదానవు.
పరమ
ధర్మవేత్త,
జ్ఞాని
అయిన
జనక
మహారాజు
మీ
తండ్రి.
నీవు
ధర్మచారిణివి.
నేను
ఈనాడే
అడవులకు
వెళ్లవలసియున్నది.
పరంపరాగతమైన
ఈ
రాజ్యాన్ని
దశరథ
మహారాజు
భరతునికి
ఇచ్చివేసెను.
ఇక
ఈ
దేశానికి
భరతుడు
ప్రభువు.
పట్టాభిషేకము
అయిన
వెంటనే
అతడు
నీకు
నమస్కరించుటకై
వచ్చును.
నీవు
నా
తమ్మునెదుట
నన్నుగురించి
శ్లాఘించుట,
3
▾
Meaning
Keep
లేక
నన్ను
ఇట్లు
అరణ్యమునకు
పంపెనను
దుఃఖముతో
అతనిని
తూలనాడుట
జరుగకూడదు.
రాజులు
తమను
ఆరాధించి,
సేవించువారలనే
మెచ్చుకొందురు.
కనుక,
నీవు
నన్ను
వర్ణించుటకానీ
అతనిని
తిరస్కరించుటకానీ
చేయకూడదు.
దేహరీతిగా
నాకు
తమ్ముడు,
నీకు
మరిది.
అయితే
స్థానరీతిగా
నీకూ-నాకూ
ప్రభువే
భరతుడు.
అట్టి
ప్రభువుకు
తగిన
గౌరవమును
నీవు
అందించు.
భరతునకు
అప్రియమయ్యే
విధముగా
మెలగవద్దు.
ఓ
కల్యాణీ!
నీవు
భరతుడినే
కాక
వృద్ధుడైన
దశరథుణ్ణి
గౌరవించి
ఆయన
ఆజ్ఞను
శిరసావహించి
నడుచుకో.
నా
వియోగములో
కుమిలిపోవుచున్న
తల్లి
కౌసల్యకు
తగినరీతిగా
సేవలు
సలిపి
ఆమెను
దుఃఖమునుండి
వేరుచేయుటకు
తగినటుల
చూచుకో.
మిగిలిన
ఇరువురు
తల్లులూ
అనగా
కైకేయి,
సుమిత్రలు
నన్ను
ఒకేరీతిగా
చూచిరి.
కడకు
వారి
ఆజ్ఞలనుకూడా
నీవు
జవదాటవద్దు.
భరత
శత్రుఘ్నులు
నా
ప్రాణసమానులు.
వారలనిరువురిని
నీ
తోబుట్టువులవలె
లేదా
పుత్రులవలె
ఆదరించు.
ఓ
భూమినీ!
నీవు
నేను
లేనను
ఉద్దేశంతో
మిథిలాపురము
వెళ్ళవద్దు.
అయోధ్యయందే
ఉండి
అమ్మ
నాన్నలను
ఓదార్చుచూ
వారలను
తగినరీతుల
సేవించుచూ
వారికి
సంతోషము
నందించుచుందుము."
ఇట్లు
రాముడు
కర్తవ్యములను
బోధించుచుండగా
సీతకు
పట్టరాని
నవ్వ
వచ్చినది.
ఒకవైపున
తనకు
సిగ్గువేసినది.
అంతటితో
తాను
ఊరకుండక,
"రామా!
తాము
దశరథ
మహారాజు
పుత్రులై,
ఇంత
చాటుమాటలు
చెప్పుట
నేనిదివరకెన్నడునూ
వినలేదు.
తల్లి,
తండ్రి,
తోబుట్టువు,
కొడుకు,
కోడలు
మొదలైన
వారందరూ
వారువారు
చేసుకొన్న
పుణ్యపాపములను
బట్టి
శుభాశుభములు
అనుభవింతురు.
భార్య
ఒక్కతే
భర్త
అనుభవించే
శుభాశుభములలో
భాగమును
వహించును,
అనుభవించును.
దశరథ
మహారాజు
మిమ్ములను
అడవికి
పొమ్మన్నాడన్న
నన్నుకూడనూ
పొమ్మన్నటులనే.
ఆడదానిని
తల్లి,
తండ్రి
పోషించగలరు.
కొడుకు
ఆదరించగలడు.
చెలికత్తె
సేవించగలదు.
అంతేకాని
వారు
నాకు
దిక్కుకారు."
4
▾
Meaning
Keep
మీరు
పలికిన
పలుకులు
నాకు
నవ్వు
పుట్టించుచున్నవి.
పెండ్లికాక
పూర్వమే
నాకు
నా
తండ్రి
సర్వధర్మములనూ
బోధించెను.
నేను
అజ్ఞానురాలను
కాను;
లేక
స్వార్థపరురాలను
కాను;
అంతకంటే
మొండితనము
నాకు
లేదు.
సర్వధర్మములూ
తెలిసిన
నాకు
మీరు
ప్రత్యేక
ధర్మములు
చెప్పనక్కరలేదు.
నేనిక్కడున్నకదా
అత్త,
మామ,
మరిది,
ప్రభువులను
ఏరీతిగా
ఆదరించవలె,
సేవించవలె
అని
యోచించవలెను!
నేను
మీతోనే
ఉండునపుడు
ఇతరులను
సేవించవలసిన
పని
నాకేమున్నది?!
మీరు
చెప్పనవసరమేమున్నది?!
నేను
ఆనందముగా
మీతో
బయలుదేరి
వత్తును.
అరణ్యవాసము
చేయవలెనని
నాకు
ఎంతో
కాలమునుండి
ఒక
తీరని
ఆశ
కలదు.
అది
ఈనాడు
నా
పతిదేవునితోనే
ప్రాప్తించుట
నా
అదృష్టము.
మీరు
ఈ
విషయమున
రాకూడదని
శాసించిననూ
నేను
వినను.
నా
మాట
వినలేదని
మీరు
కోపగించకుడు.
త్రాగి
పారబోసిన
నీరువలె
నన్ను
ఇక్కడ
విడచిపోవుట
మీకు
నీతికాదు.
నా
మాట
మీరు
నమ్మండి.
నేను
ఒక్కక్షణమైనా
అయోధ్యలో
ఉండను.
మీవెంట
తీసుకొని
పొండు"
అని
పాదములు
పట్టి
ప్రార్థించెను.
"మీకు
పట్టాభిషేకము
జరుగలేదే
అను
చింత
నాకేమాత్రమును
లేదు.
నాకు
మీరు
ప్రధానముకానీ
రాజ్యాభిషేకము
ప్రధానము
కాదు.
మీరొక్కరున్న
అదే
నా
రాజ్యము,
అదే
నా
భాగ్యము"
అని
బతిమిలాడినది.
అంత
రామచంద్రుడు,
అడవులన్న
సామాన్యము
కాదనియూ
అందులో
క్రూరమృగములు,
రాక్షసులు,
మహాగజదొంగలు
చేరియుందురనియూ,
అంతేకాక
నదులు,
దట్టమైన
పొదలు
దాటవలసివచ్చుననియూ,
నీవు
ఏనాడూ
నడచినదానవు
కావు
కనుక
చాల
శ్రమపడవలసివచ్చును
అని
అనేకరకముల
అడ్డు
చెప్పుజొచ్చెను.
అంత
సీత,
"ప్రభూ!
ఎట్టి
క్రూరమృగములున్ననూ
ఎంతటి
దట్టమైన
అరణ్యమయిననూ
మీరు
వెంట
ఉండగా
అవి
నన్నేమి
చేయును?!
అరణ్యములలో
ప్రయాణము
చేయుట
నాకు
బాగుగా
తెలుసును.
అవి
నాకేమాత్ర…
బాధనందించవు.
నేనే
ముందు
నడచుచూ
మీకు
5
▾
Meaning
Keep
దారియేర్పరచవలెనన్ననూ
మరింత
సంతోషముతో
ముండ్లు,
రాళ్ళు,
కంపలు
ఏరిపారవేసి
మీకు
హాయిని
కలిగింతును.
అట్టి
సేవచేయుటకైననూ
నన్ను
మీవెంట
గొనిపొండు.
ఈ
అయోధ్యా
అంతఃపురమున
నాకిట్టి
సేవ
లభించలేదు.
అన్ని
సేవలు
దాసదాసీలు
చేయుచుండ,
నేనెంతయో
విచారించుచుండెడిదానను.
దాసదాసీలు
లేని
ఆ
అరణ్యమున
నా
ప్రభుసేవ
నేనే
చేయవలసి
ఉండును.
అది
నా
భాగ్యము.
అట్టి
పవిత్ర
అవకాశమును
నాకందించి
ధన్యురాలిని
చేయవలెన"ని
పరిపరి
విధముల
ప్రార్థించు
సీతను
చూచి
రాముడు
జాలి
నొంది,
"సీతా!
నీవు
చెప్పినటుల
అక్కడ
నివసించుటకు
వీలుకాదు.
ఆనాడు
నీవు
బాధపడవలసివచ్చును.
యోచించుకొమ్ము"
అని
రాముడు
అనేకరీతుల
తెలిపెను.
అంత
సీత,
"రామా!
మీ
వ్రతమునకు
నేనెట్టి
భంగమునూ
కలిగించను.
మీ
మాటలను
పట్టి
మీరేదియో
దాచుచున్నటుల
కనిపించుచున్నది.
నా
దగ్గర
గుట్టెందుకు?!
మీతోపాటు
వనమధుగంధ
వాసనలు
ఆఘ్రాణిస్తూ,
కందమూలాదులను
భక్షించి,
నీమముతో
బ్రహ్మచారిణీ
వ్రతమును
పాటింతును.
ఎంతమందినో
కాపాడు
ఇనకులపతికి
నన్ను
కాపాడుట
చేతకానిదా?
నేను
నమ్మను.
నాకది
కావాలి,
ఇది
కావాలని
మిమ్ములను
బాధింపను.
మీకు
ఎట్టి
శ్రమనూ
కలిగించను,
అందించను.
ప్రభూ!
నేను
మీతో
రాక
తప్పదు.
మీ
పాదముల
చెంత
పవళింతును.
అది
నాకు
పరమానందము
చేకూర్చును.
రామా!
మీరు
తప్ప
నేను
అన్యులను
ఎరుగను.
మిమ్ములను
విడచి
నిమిషముండను,
ఉండలేను.
అట్లు
మీరు
పట్టుపట్టి
నన్ను
అయోధ్యలో
వదలి
వెళ్లితిరా,
మీరు
అరణ్యము
చేరక
పూర్వమే
సీత
ప్రాణములతో
ఉండదు.
ఇది
పరమ
సత్యము"
అని
కన్నీళ్ళతో
కలకబారిపోయినది.
అపుడు
రాముడు
ఆమెను
సమాధానపరచుచూ,
"సీతా!
నీవు
మహాకులీనవు,
ధర్మిష్ఠవు.
నీవు
నీ
ధర్మము
నాచరించుచూ
ఇక్కడనే
యుండుట
మంచిది.
నీవు
నీకు
తోచినటుల
చేయకూడదు.
నీకు
ఇష్టమొచ్చినటుల
చేయకూడదు.
నీకు
ఇష్టమొచ్చినటుల
చేయుటకు
స్వాతంత్ర్యము
లేదు.
నేను
6
▾
Meaning
Keep
చెప్పినటులనే
వినవలసి
యుండును.
కాన
నీవిక
ఈ
ఆలోచనను
వదులుము.
నీ
మంచికే
నేను
చెప్పుచున్నాను.
నిన్ను
భరించటము
నాకు
అతి
భారము.
పెద్దపెద్ద
కొండలనుండి
జారిపడే
సెలయేళ్ళూ,
కొండగుహలలో
నివసించు
క్రూర
మృగముల
గర్జనలు
మహాభయంకరంగా
ఉండును.
సింహశార్దూలాది
మృగములు
విచ్చలవిడిగా
సంచరించుచుండును.
నదులు
దాటి
పోవలసి
యుండును.
పెద్దపెద్ద
గుండ్లూ,
బండలనుంచి
దుముకవలసియుండును.
ఇట్టి
ఇబ్బందులన్నియూ
యోచించియే
నీకు
ఇంత
గట్టిగా
చెప్పవలసివచ్చినది.
జటలు
ధరించి
వల్కలాలు
కట్టుకొని
ఋషుల
జీవితమును
గడుపవలసియుండును.
మేము
సంధ్యా
వందనములాచరించువేళ
నీకెట్టి
అపాయములైనా
సంభవించవచ్చు.
మేము
ఎట్టి
ఆపదలందునూ
ఆ
నీమమును
వీడమన్నది
నీకు
బాగుగా
తెలియును.
ఏ
సమయమెట్లుండునో
చెప్పలేము"
అని
రాముడు
అనేకరకముల
మాట్లాడు
భయపెట్టు
మాటలకు
సీత
ఏమాత్రమూ
వెరువక,
"రామా!
పల్లెపడుచులకు,
శాస్త్రహీనులకూ,
అజ్ఞాన
జడ
బుద్ధులకూ
చెప్పినటుల
నాకు
చెప్పనక్కరలేదు.
మీ
శక్తిసామర్థ్యములు
నేను
బాగుగా
ఎరుగుదును.
మీకు
చేతకానిదంటూ
ఈ
లోకమునందే
కాదు,
పదునాలుగు
లోకములందునూ
లేదు.
అట్టి
మీరు
నా
వెంటనున్న,
నాకు
భయ
మెందులకు!
పోనీ!
నేను
ఏ
క్రూరమృగముల
నోటనో
పడితినన్న
తమ
సన్నిధిలో
ఆనందముగా
ప్రాణములు
వీడుటకు
నేను
సంసిద్ధమే.
కానీ,
మీరు
లేని
జీవితాన్ని
నేనంగీకరించను.
నాకు
ఇష్టమొచ్చినటుల
చేయుటకు
అధికారము
లేదని
అంటిరి.
ఇది
మీకు
తెలిసి
చెప్పితిరో,
లేక
నన్ను
మోసపుచ్చుటకు
ఆడిన
మాటలో,
నాకర్థమగుటలేదు.
మీకు
ఏయే
హక్కులున్నవో
అన్ని
హక్కులు
నాకునూ
ఉన్నవి.
నేను
అర్ధాంగిని,
మీ
దేహములో
సగభాగము
నా
హక్కు,
నా
దేహములో
సగభాగము
మీ
హక్కు.
అంతేకాని
మీకు
మీరు
స్వతంత్రులు
కారు.
నాకు
నేను
స్వతంత్రురాలను
కాను.
నా
విషయమున
నాకంతటి
అధికారము
కలదు.
అయితే,
నేను
అధికారమును
పట్టి
వాదించుట
లేదు.
మీ
అండదండలను
కోరి
అడుగుచున్న
మాటలివి"
అని
గట్టిగా
పలికెను.
7
▾
Meaning
Keep
సీత
పలుకులకు
రాముడు
మరింత
గట్టిగా,
"సీతా!
నీవు
హక్కుల
విషయములో
చిక్కులు
పడుచున్నావు.
నేను
అరణ్యమునకు
వెళ్లుటచేత,
వృద్ధులైన
నా
తల్లిదండ్రులు,
నాకొరకై
విలపించుచుందురు.
అట్టి
సమయమున
నీవు
అత్తమామల
మనస్సును
కనిపెట్టి
వారలకు
తగిన
సేవలు
చేయుచూ,
ధైర్యమును
తెలుపుచూ
ఉండుట
నీ
కర్తవ్యము.
సమయమును
పట్టి
మెలగుట
మంచిది.
వారల
చెంతనుండి
వారిని
సేవించు.
అదే
నాకు
ఆనందము"
అని
నిర్ధారణ
చేసినటుల
శాసించెను.
అందుకు
సీత
చిరునవ్వు
నవ్వి,
"రామా!
కన్న
కొడుకే
అమ్మ
నాన్నలను
కఠిన
దుఃఖమున
ముంచి,
తన
పట్టే
భల్లూకపుపట్టుగా
భావించి,
సర్వమునూ
త్యజించి
అడవులకు
వెళ్లుచుండ,
పరాయి
ఇంటినుండి
వచ్చిన
కోడలు
అత్తమామలను
ఓదార్చుటలో
ఎంత
బాధ్యత
ఉండునో
మీరే
యోచించుడు.
కన్నకొడుకును
వీడలేక
కారదవులకు
తానుకూడా
వత్తునని
కన్నులు
కాయలు
కాచునటుల
ఏడ్చినను
ఆమెకు
పతి
సేవయే
ప్రధాన
కర్తవ్యమనియూ,
కన్నకొడుకుపై
ప్రేమతో,
కట్టుకొన్న
భర్తను
వదలివచ్చుట
ఇక్ష్వాకు
వంశమునకే
తీరని
అపకీర్తి
అనియు
మహామహా
ధర్మములు
కౌసల్యకు
బోధించి,
ఇపుడు
నా
చెంతకు
రాగానే,
నాకు
అత్తమామల
సేవయే
కర్తవ్యమని
బోధించుటలో,
ఏది
సత్యమో
మీరే
యోచించుడు.
సతికి
పతి
దైవమన్నది
ఒక్క
కౌసల్యకే
కాదు;
లోకములోని
సమస్త
స్త్రీజాతికే
కలదన్న
సత్యమును
మరచితిరి
కాబోలు!
కౌసల్యకు
చెప్పిన
నీతులు
నాకు
మాత్రం
ఎందుకు
అన్వయింపవో
చెప్పరైతిరి.
మీరెన్ని
చెప్పిననూ,
నేను
పతి
జాడను
వీడను.
మీ
మాటను
మీరుచున్నానన్న
కోపముతో
నన్ను
వధించిననూ
సంతసింతునుకాని,
మిమ్ము
వీడి
ఉండలేను.
రామచంద్రా!
మీరు
వనవాసము
చేతునని
చెప్పినతోడనే,
నా
చిన్ననాటి
విషయము
నాకు
తలపుకు
వచ్చి
ఎంత
ఉప్పాంగితినో
మీకు
తెలియదు.
నా
పెండ్లి
కాక
పూర్వము
మా
తల్లి
నన్ను
ఒడిలో
కూర్చొనబెట్టుకొని,
నా
సీతకు
ఎట్టి
భర్త
రాగలడు?
నా
తల్లి
మహాసాధ్వీమణి.
నా
తల్లికి
అట్టి
సద్గుణ
సంపన్నుడు
చిక్కునో
8
▾
Meaning
Keep
లేదో?
అని
నా
తల
నిమురుచూ
యోచించుచుండ,
ఒకానొక
తాపసాంగన
అంతఃపురమునకు
వచ్చి
అమ్మను
చూడగోరుచున్నదని
దాసి
వచ్చి
తెలుపగనే,
అమ్మ
నన్ను
ప్రక్కకు
తీసి,
లేచి
వెళ్లెను.
అప్పుడే
నేనుకూడనూ
అమ్మతో
వెళ్లితిని.
తాపసాంగనకు
నా
తల్లి
నమస్కరించి,
నన్నుకూడనూ
నమస్కరించుమని
కోరెను.
అమ్మ
ఆజ్ఞను
శిరసావహించి
నమస్కరించగా,
ఆ
తాపసాంగన
నన్ను
మనసార
చూచి,
"అమ్మా!
మీ
బిడ్డ
పతితో
వనవాసము
చేయును"
అని
చెప్పెను.
అంత
మా
తల్లి,
"పెండ్లియే
కాలేదు.
పతితో
వెళ్లుటెక్కడ?!"
అని
పక్కున
నవ్వగా;
"కాదు,
కాదు,
పెండ్లి
అయిన
తరువాత
పతితో
కొంత
కాలము
వనములందు
నివసించవలసివచ్చును"
అని
గట్టిగా
చెప్పి
వెళ్లెను.
ఆనాటి
మొదలు
నేటివరకు
పతితో
వనములకు
వెళ్లుట
ఎప్పుడు
అని
ఉవ్విళ్ళూరుచున్నాను.
అట్టి
నా
చిరకాలవాంఛ
నెరవేర్చి
నన్నానందపెట్టుడు,
అని
పాదములపైబడి
ప్రార్థించెను.
అప్పుడు
రాముడు
జాలిగా,
ప్రేమతో
సీతను
లేవనెత్తి
"సీతా!
నాలోని
రహస్యమును
నీకు
చెప్పక
మరెవ్వరికి
తెలుపుదును?
వినుము,
నీవు
చిన్నవయస్సుదానవు.
అడవులలో
అనేకమంది
ఋషులు,
మునులు
ఉండుటచేత
నేను
వారలను
సేవించుటకై
వెళ్లవలసియుండును.
అప్పుడు
అక్కడికి
అనేకమంది
రాజపుత్రులు
రాజులు
వేటకై
వచ్చి
ఆశ్రమమును
సందర్శించుటకు
వత్తురు.
అట్లు
వచ్చినప్పుడు
వారల
దృష్టి
నీపై
పడవచ్చు.
తదుపరి
అందునిమిత్తమై
చేయు
ప్రయత్నములు
అనేకముగా
జరుగవచ్చును.
కాన,
నేను
తాపసవేషమున
నుండుటచే
వారలతో
తగవులు
పెట్టుకొనుట
మంచిది
కాదు.
ఈ
కారణముల
ననుసరించియైనను
నీవు
అయోధ్యలో
ఉండుము"
అని
రాముడు
చెప్పుచుండ,
సీత
"రామా!
మీరు
సామాన్య
మానవులవలె
కట్టుకథలను
చెప్పి
నన్ను
వంచించుట
న్యాయము
కాదు.
మీరు
ప్రక్కనుండగా
సర్వేశ్వరుడు
సహితము
నావంక
కన్నెత్తి
చూడలేడు.
అట్లు
చూచెనా,
తాను
అక్కడనే
భస్మమైపోగలడు.
ఈ
మాటపైననూ
నన్ను
మీవెంట
గొనిపోక
తప్పదు.
ఎందుకన,
మీరు
నావెంట
ఉండకుండిన,
నేను
వంటరిగా
అయోధ్యలో
ఉండిన,
అట్టివి
సంభవించునేమో?
9
▾
Meaning
Keep
లేదా,
నేను
ఇతరుల
ఆనందమును
చూచి,
ఓర్వలేక
బాధపడుదునేమో?
కాన,
నన్ను
ఒంటరిగా
వదలక
జంటగా
కొనిపోవుటలో
మన
ఇరువురి
పేరు
ప్రతిష్ఠలూ
జగద్వ్యాప్తి
కాగలవు.
అంతేకాదు.
రామా!
నీవు
రామచంద్రుడవు,
నేను
సీతాజాతను.
అనగా
చంద్రునినుండి
వెలువడిన
చల్లని
శీతల
వెన్నెలను.
చంద్రుడు
అరణ్యమందును
వెన్నెల
అయోధ్య
యందును
ఉండ
వీలుండదు
కదా!
చంద్రునితో
వెన్నెలకూడియే
యుండును
కానీ
వియోగము
సంభవించదు.
ఈ
రెండింటికీ
నిరంతర
సంయోగమే
కానీ,
వియోగము
సంభవించదు.
సంభవించెనా
అది
ఏదో
ప్రళయ
సమయము
అయి
వుండవచ్చును.
లేదా
దుష్టసంహారమునకై
శిష్టపరిపాలనకై
అట్లు
జరుగవచ్చును.
ఈనాడు
అట్టి
వేవియూ
లేవు
కనుక,
మన
ఎడబాటు
వీలుకానిది,
జరుగలేనిది"
అని
దృఢముగా
పలికెను.
అపుడు
రాముడు,
"సీతా!
కటికనేలను
బవ్వళించి,
నారవస్త్రములను
కట్టి,
కందమూల
ఫలములను
భుజించ
వలెను.
అవియైననూ
ప్రతి
దినము
దొరకుట
దుర్లభము.
ఋతుధర్మము
ననుసరించి
అని
దొరకుచుండును.
కోటి
కపట
వేషములు
ధరించి
మునులనే
భక్షించు
రాక్షసులు,
అరణ్యములందు
మెండుగా
నుందురు.
వనవాస
కష్టములు
జెప్పుటకు
శక్యము
కాదు,
నీవు
వనవాసమునకు
తగవు.
నీవు
నాతో
వనవాసమునకు
వచ్చిన
యెడల
లోకులు
నన్ను
అతినీచముగా
దూషింతురు.
మానస
సరోవరంలో
అమృతోపమానమగు
నిర్మల
జలమును
త్రాగి
జీవించు
హంస
లవణ
సముద్రములోని
నీరును
త్రాగి
యెట్లు
జీవింపగలదు?
నూతనంగా
చిగురించిన
తియ్య
మామిడితోటలో
విహరించు
కోకిల,
తుమ్మతోటలో
ఎట్లు
విహరించును?
ఈ
సంగతులు
విచారించి
నీవు
గృహములోనుందుట
పరమోత్తమము"
అనెను.
ఈవిధముగ
మృదుమధురముగ
శ్రీరాముడు
పలికిన
పలుకులను
విని
జానకి
కన్నీరు
గార్చుచూ
నేలను
చూచుచూ
స్తంభించిపోయెను.
ఆమె
కంటిధారలు
ధారలవలె
నేల
పడుచుండగా,
రాముడు
చూడలేకపోయినాడు.
10
▾
Meaning
Keep
ప్రత్యుత్తర
మిచ్చుటకు
ఆమె
కేమియూ
తోచకపోయెను.
శక్తి
నీరసించెను
కడకెట్టులో
భరించుకొని
దుఃఖమును
మ్రింగి,
"ఓ
ప్రాణనాథా!
మీరు
కరుణాసముద్రులు,
సకల
సుఖములకు
నిధులు.
మిమ్ముల
నెడబాసి
యుండినపుడు
స్వర్గమయినను
నాకు
నరకముతో
సమానము.
తల్లిదండ్రులును,
సోదరులును,
సోదరీమణులును,
అత్తమామలును,
సుతులును,
గురువులును,
బంధువులును
వీరందరూ
సకల
గుణసంపన్నులయిననూ
-
సతికి
సుఖము
నిచ్చువాడు
పతియే,
పతితప్ప
అన్యగతి
ఉండదు.
నాథా!
తనువును,
ధనమును,
గృహమును,
పురమును,
రాజ్యమును
ఇవి
పతిదూరమైన
సతికి
దుఃఖమునే
ఇచ్చునుకానీ
ఆనందమును
అందించలేవు.
పతిలేని
భోగములు
రోగమును
బోలినవే.
నా
సర్వ
సుఖములు
మీవద్ద
గలవు.
శరత్కాల
చంద్రబింబమువంటి
మీ
ముఖారవిందమును
చూచుచుండుటయే
నాకు
సర్వసుఖము.
నేను
మీతో
నుండినపుడు
ఖగమృగములే
నా
బంధువులు.
వనమే
పట్టణము;
వల్కలములే
పట్టుపీతాంబరాలు;
పర్ణశాలయే
సురసదనము,
సౌందర్య
భవనము
వనదేవతలే
నా
అత్తమామలు.
మీతో
నుండినపుడు
కుశ
పల్లవములు
మన్మధుని
సెజ్జవలె
మెత్తగానుండి
సుఖము
నిచ్చును.
కందమూల
ఫలములు
అమృతోపమానముగ
నుండును.
పర్వతములు
అయోధ్యలోని
మేడలతో
సమానము.
పర్వతముల
దిగుడు
పైనుండి
క్రింది
మేడకు
దిగునటుల
నేను
అవలీలగ
దిగగలను.
నిత్యం
మీ
పాదారవిందములను
దర్శించి
సంతోషించుచుందును.
అంతియేకాదు,
తమకు
సర్వసేవలూ
నేనే
చేయుటకు
ఇది
మంచి
అవకాశము.
ఇట్టి
సుసమయమును
నేను
దూరము
చేసుకొని
యెట్లుండ
గలను?
ఓ
కృపానిధీ!
నన్ను
తీసుకొని
వెళ్లుటకు
సర్వాంతర్యాములైన
మీకు
నేనింత
వివరించి
చెప్ప
నవసరములేదు.
నా
హృదయమును
ఎరిగిన
మీరు
నన్ను
ఇట్లు
బాధించుట
తగదు.
నాథా!
నేను
దీనురాలను,
నన్ను
విడచి
వెళ్లిన
మీ
నామమునకు
లోపము
వచ్చును.
మీరు
సకల
గుణసంపన్నులు.
నామీద
దయతప్పుట
యుచితమా?
పదునాలుగు
సంవత్సరములు
మిమ్ము
విడచి
జీవించ
గలనా?
పదినిమిషములు
11
▾
Meaning
Keep
కూడను
నే
జీవించజాలను.
కరుణించి
కనికరముతో
అంగీకరించుడు.
నాథా!
నేను
మీ
చెంతనుండిన
నన్నెవరునూ
మ్రింగలేరు.
అసలు
నన్ను
చూడలేరు.
నక్క
కుందేలువంటి
చిన్న
మృగములు
కన్నుతెరచి
సింహమును
చూడగలవా?
నేను
సుకుమారిని
కాదు.
మీరే
సుకుమారులు.
మీరే
వనవాసమునకు
అర్హులు
కారు.
భూమి
నా
తల్లి
అగుటచేత,
భూమిపై
సంచరించుటకు
నాకు
తగిన
అధికారము
కలదు.
నిజముగా
సుఖించుట
మీ
వంతు
శ్రమపడుట
నావంతు.
అట్టి
దానిని
మీరు
విరుద్ధముగా
భావించి,
బాధించుట
న్యాయము
కాదు.
మీరు
చేయలేని
కఠినమైన
పనులైననూ
నేను
అవలీలగా
చేతును.
ఏ
రాజులునూ
ఎత్తలేని
శివధనుస్సును
నేను
అవలీలగా
ఎత్తిన
సంగతి
మీకు
బాగా
తెలిసియూ,
నా
బలమును
సంశయించుట
ఆశ్చర్యము.
మీకెంత
శక్తిసామర్థ్యములు
కలవో,
వాటికి
నా
శక్తి
సామర్థ్యములు
తీసిపోవు.
కాన
కాలహరణపు
మాటలను
ఆడక
నాకనుజ్ఞ
దయచేసి
ముందు
జరగవలసిన
ఏర్పాట్లు
ఆనందముగా
జరుపుడు"
అని
వంగి
నమస్కరించిన
సీతను
చూచి,
రాముడు
ఇక
ఆమెను
నిరోధించుట
మంచిది
కాదని
దృఢనిశ్చయము
చేసుకొని,
"సీతా!
విచారింపకుము.
నీ
ఇష్టప్రకారము,
నా
వెంట
గొనిపోదును.
విచారించుటకు
సమయము
కాదు.
వనమునకు
బోవుటకు
తగిన
ప్రయత్నము
శీఘ్రముగ
చేయుము"
అని
ప్రియవచనములను
పలికెను.
రామచంద్రుని
మృదువచనములను
విని,
అంతు
లేని
ఆనందముతో
గంతులు
వేసి
సీత
"నాథా!
వనవాసమునకు
ప్రయత్నములేమున్నవి?
నా
సర్వ
భరణములు
సమస్త
అనుకూలములు
నిరంతరము
సంసిద్ధమే.
నా
పెన్నిధి,
మీరు
తప్ప
అన్యరూపములను
ఆశించనన్న
సంగతి
మీకు
తెలియును.
ఈ
క్షణముననే
మీవెంట
బయలుదేరుచున్నాను"
అని
రామచంద్రుని
చేయిపట్టుకొని
ముందుకు
నడచుటకు
పూనుకొనెను.
అంత
రామచంద్రుడు
యోచించి,
"సీతా!
పదునాలుగు
సంవత్సరములు
మనము
అయోధ్యలో
ఉండము.
కనుక,
నీ
ప్రీతికి
గురియైన
12
▾
Meaning
Keep
చిలుకలు,
రకరకమైన
పక్షులు,
నీ
వియోగముతో
పంజరమునందే
ప్రాణములు
విడువవచ్చును.
కాన,
వాటిని
బంధనలనుండి
విడిచిపెట్టుము.
మిగిలిన
గోవులను
బ్రాహ్మణులకు
దానము
చేసి,
నిత్యజీవితమునకు
ఉపయోగించుచుండిన
వస్తువాహనాదులు
బీదసాదల
కప్పజెప్పుట
మంచిది.
లేకున్న
పాడయిపోవును.
అట్లు
పాడగుటకంటే,
పరులకు
అందించి
వారికి
అనుకూల
పరచుట
మంచిదికదా!"
అని
సలహా
అందించెను.
తక్షణమే
సీత,
పంజరముల
చెంతకు
వెళ్లి,
ఒక్కొక్క
పక్షినీ
ప్రీతిరీతిగా
పలుకరించి,
"మీరును
మావలె
సహజారణ్యముల
స్వేచ్ఛావిహారము
సల్లుడు"
అని
తన
హస్తములతో
వాటి
బంధములను
విడిపించెను.
ఇక
గోవులను,
తిండి
పదార్థములను,
నానా
విధములైన
ఫలహారములను
క్షణములో
పంచిపెట్టెను.
ఆ
సీతాజనని
వికసించిన
వదనంతో,
మృదుమధుర
వచనములతో
బ్రాహ్మణులను
పలుకరించుచూ,
గోవుల
నందించుచుండ
చూచువారల
హృదయములు
కరిగినవి.
కంటిధారలు
వరదలుగా
ప్రవహించినవి.
ఆమె
త్యాగము,
ఔదార్యము,
వనవాసములకు
పతితో
బయలుదేరుటలో
ఉన్న
ఆనందము,
ఎట్టి
కవియైననూ
వర్ణించజాలకపోయెను.
ఇంతలో
తల్లి
ఆనతి
తీసుకొనివచ్చిన
లక్ష్మణుని
కలసి,
సీతారామ
లక్ష్మణులు
రాజమందిరమునకు
వెళ్లుచుండుట
వీధులలోని
ప్రజలు
చూడ
లేకపోయినారు.
ప్రజల
శరీరములు
వాడిన
మొక్కలవలె
వ్రాలదొడగెను.
ప్రజల
మనసులు
దుఃఖముచే
వ్యాకులమయ్యెను.
తేనెను
పోగొట్టుకొనిన
తుమ్మెదలవలె
ప్రజలు
దీనులైరి.
చేతులను
నలుపుకొనుచు,
శిరస్సులను
మోదుకొనుచు
రెక్కలు
లేని
పక్షులవలె
విలపించిరి.
వేలజనులు
రాజహాజరములో
నిలచియుండిరి.
వారల
విచారము
వర్ణింప
శక్యముకానిదై
పోయెను.
ఇంతలో
మంత్రి
లోనికి
వెళ్లి
స్పృహతప్పి
పడియుండిన
రాజును
లేవదీసి
కూర్చుండబెట్టెను.
సీతారామలక్ష్మణులు
తమదర్శననిమిత్తమై
వచ్చుచున్నారని
తెలిపెను.
రామచంద్రుడు
ప్రియ
వచనములు
పలుకుచు
తండ్రిని
సమీపించెను.
13
▾
Meaning
Keep
జానకిని
లక్ష్మణుని
చూచి
దశరథుడు
అమితముగా
దుఃఖించెను.
రామచంద్రుని
కౌగిలించుకొని
పరవశుడై
నేలపడెను.
పొంగి
పొరలు
దుఃఖముచే
మాటలాడని
స్థితిలో
ఎదను
బాదుకొనుచున్న
దశరథుని
అవస్థను
సీతాలక్ష్మణులు
చూడలేకపోయినారు.
లక్ష్మణుడు
చెంతనే
నిల్చొని
రీవిగా
చూచుచున్న
కైకను
క్షణములో
ప్రాణము
తీయునటుల
కండ్లెఱ్ఱచేసి
ఉగ్రుడై
చూచుచూ,
తిరిగి
కోపమును
చల్లార్చుకొనుచు
రామచంద్రుని
శాంతవదనమును
దర్శించుచుండెను.
ఇంతలో
కైక
"రామా!
నీవు
మీ
తండ్రిని
మరింత
దుఃఖమునకు
గురిచేయుచున్నావు.
ఎంత
త్వరగా
నీవు
బయలుదేరి
అరణ్యము
చేరిన,
మీ
తండ్రి
అంత
త్వరలో
శాంతిని
అందుకొనగలడు.
కాన
ఆలస్యము
చేయక
తండ్రికి
నమస్కరించి
బయలుదేరుట
మంచిద"ని
నిర్దాక్షిణ్యముగా
పలికిన
పలుకులు
దశరథుని
గుండెలను
బ్రద్దలు
చేసినట్లయినవి.
ఆ
మాట
వినగనే
"రాక్షసీ!
ఎంత
కఠినవాక్కు
లాడుచున్నావే?"
అని
మూర్ఛనొందెను.
ఆ
సమయమును
చూచుకొని
సీతా
రామలక్ష్మణులు,
తండ్రి
పాదములకు
నమస్కరించి,
"హే
పితాజీ!
మమ్ములను
దీవించి
సెలవు
దయచేయుడు"
అనిరి.
"తమరు
విస్మయమును
పొందుట
మంచిది
కాదు.
ఇది
సంతోషమునకు
సమయము.
అతి
మోహము
అపకీర్తికి
మార్గము".
అని
తండ్రిని
మోహము
విడువమని
పాదములు
గట్టిగా
పట్టి
మోకాళ్ళపై
కూర్చున్న
రాముని,
కన్నులు
తెరచి
చూచి,
దశరథుడు
ప్రయాసతో
లేచి
కూర్చొని
రాముని
చేతులు
పట్టుకొని,
"నా
బంగారు
బిడ్డా!
నా
మాట
వినుము.
నీవు
నియతాత్ముడవు.
ఉచితకార్యములు
చేయుట
నీకు
తగును.
అపరాధము
చేసినవాడొకడై,
దాని
ఫలము
అనుభవించువాడు,
మరొకడని
చెప్పుట
యుచితముకాదు.
విధికృతములు
విచిత్రములు.
వానిని
తెలుసుకొను
వారెవరు?"
అని
రాముని
ప్రయాణమును
తప్పించుటకు,
రాజు
నిష్కపటముగా
అనేక
విధములు
తెలుపుచూ
వచ్చెను.
ధర్మదురంధరుడును,
చతురుడును,
ధీరుడును
అగు
శ్రీరాముని
ముఖలక్షణములను
బట్టి
అతడు
ప్రయాణమునకు
సిద్ధముగా
నున్నాడని
14
▾
Meaning
Keep
దశరథుడు
గ్రహించెను.
జానకిని
దగ్గర
పిలిచి,
ఆమె
శిరస్సును
నిమురుచు,
వనవాసకష్టములు
ఆమెకు
తెలుపుచు,
అత్తమామలవద్దగానీ
లేక
తల్లిదండ్రుల
చెంతకానీ
ఉండుట
మంచిదని
బోధించుచూ,
భరించలేని
బాధతో
దుఃఖించుచూ,
కైకను
చూచి
పండ్లు
కొరుకుచూ,
నానావిధముల
కుములుచున్న
రాజును
చూచి,
సీతాదేవి
పాదములకు
నమస్కరించి,
"మామా!
నా
మనసు
రామసేవనే
ఆశించుచున్నది.
అట్టి
సేవా
భాగ్యము
అరణ్యమున
నాకు
అమితముగా
లభించును.
అట్టి
ఘన
ఫలమును
వీడి
నేనుండలేను.
సతికి,
అత్తమామల
సేవలూ
తల్లిదండ్రుల
సేవలూ
అంత
సంతృప్తిని
అందించవు.
పతిసేవకు
మించిన
ఆనందము,
సుఖము
ఎందునూ
చిక్కదు.
మీరు
అడ్డుచెప్పక
ఆశీర్వదించి
నన్ను
రామచంద్రునితో
పంపుడని
ప్రార్థించిన
సీత
వాంఛను
అర్థము
చేసుకొని,
దశరథుడు
సీత
యొక్క
గుణములను
నానావిధముల
వర్ణించి
కైకకు
తెలిపెను.
ఇంతలో
మంత్రి
భార్యలు,
గురు
పత్నియు,
సీతను
చెంత
బిలిచి,
వనవాస
కష్టములను
గురించి
పలుతెఱంగుల
జానకికి
బోధించిరి.
గురుపత్ని
మరింత
చొరవ
తీసుకొని
"సీతా!
వనమునకు
నిన్ను
బొమ్మని
చెప్పలేదు.
ఈ
విషయములో
నీవు
అతి
దుఃఖములో
మునిగిన
అత్తమామలను
అనుసరించి,
వారి
బాధలను
ఉపశాంతి
చేయుటకై
అత్తమామల
చెంత
ఉండుట
మంచిది.
రామునకు
అర్ధాంగివగుటచే,
రాముడు
ఇవ్వలేని
తృప్తిని
అర్ధభాగమైన
నీవైనను
ఇచ్చి
అత్తమామలను
దుఃఖములనుండి
తప్పించుము.
జ్యేష్ఠపుత్రుడైన
రామచంద్రుని
అర్ధాంగి
వగుటచే,
రాజ్యపాలనమునకు
కూడా
నీకు
అధికారమున్నది.
పితృవాక్యపరిపాలనకై
రాముడు
వనవాసము
చేసిననూ,
నీవు
రాజ్యపాలనచేసి
రామునికి
కీర్తిని,
అత్తమామలకు
సంతృప్తిని
అందించుము.
ఇది
కూడనూ
రామసతియైన
నీకు
పరమలక్ష్యము"
అని
బోధించెను.
శరత్కాలములోని
చంద్రకిరణములు
చక్రవాకమునువలె
మృదుమధురమగు
వారి
చల్లని
హితోపదేశములు
జానకిని
వ్యాకుల
పెట్టెను.
ఆమె
సంకోచించి
ప్రతివచనము
చెప్పక
ఊరకుండెను.
15
▾
Meaning
Keep
ఇంతలో
కైకేయి,
నారవస్త్రములను,
తులసి
పూసలను
పట్టుకొని
వచ్చి
వానిని
రాముని
యెదుట
బెట్టి
"రామా!
రాజునకు
నీవు
ప్రాణము
వంటివాడవు.
నీయందు
గల
వాత్సల్యముచే,
వారు
నిన్ను
విడువలేక,
అపకీర్తిని
తెచ్చుకొనుచున్నారు.
నిన్ను
వనమునకు
వెళ్ళమని
ఎప్పటికినీ
చెప్పడు.
అతని
అంగీకారమునకై
నీవు
కాచిన,
ప్రయోజనముండదు.
నీవు
అపకీర్తిని
కోరి
రాజ్యము
ఏలుదువా?
నారచీరలు
కట్టి
వనమునకు
వెళ్ళి
ఇక్ష్వాకు
వంశమునకు
శాశ్వత
కీర్తిని
తెత్తువా?
ఈ
రెండింటిలో
ఏదో
ఒక
దానిని
గావింపుము,"
అని
చెప్పెను.
కైకేయి
చెప్పిన
మాటలకు
శ్రీరామచంద్రుడు
సంతసించెను.
కానీ,
ఆ
పలుకులు
రాజు
హృదయమునకు
ములుకులవలె
నాటెను.
"ఆహా!
ఎంత
నిర్భాగ్యుడను.
ఇట్టి
కఠినమైన
మాటలను
వినియూ
నా
ప్రాణములు
నన్ను
విడిచి
పోకున్నవి"
అని
తిరిగి
దుఃఖముతో
తెలివి
తప్పి
నేలకూలెను.
ప్రతిసారీ
ఈవిధముగా
దుఃఖించుచూ
మూర్ఛిల్లుచున్న
తండ్రిని
చూడలేకపోయినాడు,
రామచంద్రుడు.
కైకేయి
మాటలను
నడచుకొని
ఎంత
త్వరగా
అరణ్యమునకు
బయలుదేరిన
అంత
మంచిదని
తలంచి,
పినతల్లి
తెచ్చిన
నారవస్త్రములను
రెండింటిని
తీసి
ఒకటి
తాను
చుట్టుకొనెను.
మరొకటిని
సీతకు
అందించుటకు
ప్రయత్నించెను.
కానీ,
వాటిని
ఎట్లు
ధరించవలెనో
ఆమెకు
తెలియక
సిగ్గుచే,
అటు
ఇటు
చూచుచు
ఆ
చిన్నతుండుగా
ఉన్న
నారచీరను
చేతియందుంచుకొని
నిలుచుండెను.
ఇంతలో
నారవస్త్రమును
ధరించిన
శ్రీరాముడు
సీతచెంతకు
వచ్చి
అతి
మెల్లగా
మాటలాడదొడగెను.
ఆమెకూడనూ
సిగ్గుతో,
"నాథా!
ఈ
నారచీరలను
ముని
పత్నులెట్లు
ధరింతురో
నేనెరుగను.
కాన
నే
నెట్లు
ధరించుట?
అంతియేకాక
ఇది
సామాన్యమైన
చీరవలె
లేక
అతి
చిన్నదిగా
ఉండుటచేత
నేను
సహజరీతిగా
ధరించలేకున్నాను."
అని
కొంత
మెల్లగా
విచారంగా
పలికెను.
సీత
పలుకులకు
రాముడు
ధైర్యముతో
చెంతచేరి
తానే
స్వయముగా
ఆ
నారచీరను
సీతకు
ఈవిధముగా
కట్టవ…ని
ఆమెకు
కట్టి
16
▾
Meaning
Keep
చూపుచుండుట
అక్కడ
చేరిన
గురుపత్ని,
మిగిలిన
అంతఃపుర
స్త్రీలు
చూచి
కంటిధారలు
కార్చిరి.
ఇంతలో
గురువైన
వశిష్ఠులవారువచ్చి,
ఈ
దృశ్యమును
చూచి
నిలిచెను.
కైకను
చీవాట్లు
పెట్టెను.
నార
చీరలు
సీత
కట్టనవసరము
లేదనియును,
కైక
కోరిన
కోరికలలో
భరతునకు
పట్టాభిషేకము,
రామచంద్రునకు
వనవాసము
ఈ
రెండే
ఆమె
నిబంధనలనియూ,
సీత
సమస్త
సౌకర్యములతో
రాజఠీవితో
అరణ్యవాసము
చేయవచ్చుననియూ
తెలుపుటచే,
పైన
చుట్టిన
నారచీరను
శ్రీరాముడు
తీసివేసెను.
అంత
సీత
గురువునకు
నమస్కరించి
"స్వామీ!
నేను
నారచీరలు
కట్టుటలో
కైక
వాంఛకు
ఎట్టి
సంబంధము
లేకపోయిననూ
నాథుని
అనుసరించుటలో
నా
కర్తవ్యమును
నిర్వర్తించవచ్చును
కదా?
నారచీరలను
ధరించిన
పతితో,
సర్వాభరణ
సౌందర్యముతో,
రాజ
గౌరవమునకు
తగిన
విలువైన
వస్త్రములను
ధరించి
వనవాసము
చేయుటలో
నాకు
గౌరవము
లేదు
కదా?
పతిని
అనుసరించు
సతికి
ఇట్టిది
పరమ
విరుద్ధము
గాన,
నా
గౌరవప్రతిష్ఠల
కైననూ
నేను
ఈ
నారచీరలు
కట్టుకొనుటకు
తమరు
అనుజ్ఞ
ఇవ్వవలె"నని
ప్రార్థించెను.
సీత
పలికిన
ఈ
ధర్మనీతులు
వశిష్ఠులవారి
హృదయాన్ని
కూడను
కరిగించినవి.
వశిష్ఠులవారు
మహావిచారముతో,
"సీతా!
సుగుణశీలవైన
నీకు
ఇట్టి
తలపులు
సహజమే.
అయితే
రాజనీతిని
పట్టి
కొన్ని
హద్దులు
కూడా
మితిమీరరాదు.
మీ
అత్తగారైన
కైక
కుటిలబుద్ధికి
తగినటుల
మనము
కూడను
కొన్ని
బుద్ధులను
ఆమెకు
తెలుపవలసి
ఉండును.
నిజముగా
నేడు
నీ
పతియైన
రామునకు
పట్టాభిషేకము
చేయవలసినది.
అది
కారణాంతరముచేతను
కొన్ని
పూర్వపు
వాగ్దానముల
వలననూ
అట్లు
జరుగకపోయినప్పటికిని
భరతునకు
పట్టాభిషేకము
చేయుట
రాజనీతికి
విరుద్ధము.
జ్యేష్ఠపుత్రునకు
తప్ప
అన్యులకు
అధికారము
లేదు.
అట్లు
జ్యేష్ఠపుత్రుడు
మనఃపూర్వకముగా
పట్టాభిషేకమును
త్యజించిన
అతని
అర్ధాంగియైన
నీకు
ఆ
రాజ్యాధికారముండును
కానీ,
మూడవవానికి
ఏమాత్రము
వీలుండదు".
అని
ధర్మవచనములు
పలుకుచున్న
17
▾
Meaning
Keep
వశిష్ఠులవారి
పలుకులకు
కైక
కొంత
దిగులొందినటుల
కనిపించెను.
అయితే,
సీత
అట్టి
అధికారమును
ఆశించదన్న
విషయము
కైకేయికి
తెలియకపోలేదు.
వశిష్ఠులవారు
ఏది
చెప్పిననూ
సీత
వాటిని
తన
హృదయమునకు
చేర్చుక
నారచీరనే
ధరించుటకు
ప్రయత్నించుచుండెను.
ఆ
అవస్థను
చూడలేక
గురుపత్ని
నివారించుటకు
చేతకాక
పోవుటచే,
తప్పినది
కాదని,
తానే
పూర్వము
కట్టిన
చీరపై
మునిపత్నులు
కట్టుకొను
రీతిగా
చుట్టి
కట్టెను.
ఇంతలో
లక్ష్మణుడు
కూడా
సీతా
రాములను
అనుసరించి
నారచీరను
కట్టెను.
ఆలస్యమునకు
సమయము
కాదని
రాముడు
దృఢము
చేసుకొని
మువ్వురు
మూర్ఛిల్లిన
తండ్రి
పాదములకు
నమస్కరించి
చెంతనున్న
కైకకు
నమస్కరించి,
గురువైన
వశిష్ఠులవారికీ
వారి
పత్నికీ
నమస్కరించి,
వనమునకు
బయలుదేరిరి.
మునివేషములతో
వీధిలో
నడచి
వెళ్ళుచున్న
సీతారామలక్ష్మణులను
చూచి
ప్రజలు
ఘొల్లున
ఏడ్వసాగిరి.
మూర్ఛిల్లిరి.
తలలు
బాదుకొనిరి.
రామచంద్రుడు,
అంతఃపురము
దాటి
రాజవీధి
సింహద్వారములో
నిలిచి,
వశిష్ఠులవారికి
నమస్కరించి
ప్రజలకు
నీతివచనములు
తెలిపి
వారు
దుఃఖించుట
మంచిదికాదనియూ
త్వరలో
పదునాలుగు
సంవత్సరములు
గడుపుకొని
తిరిగి
అయోధ్యకు
చేరుదుమనియూ
ఇది
మీకునూ
నాకునూ
లోకమునకే
కల్యాణకరమైన
ఆజ్ఞ
అనియూ
మృదుమధుర
వాక్యములాడి,
యాచకులకు
దాన
ధర్మములను
బ్రాహ్మణులకు
తగిన
వసతులకు
యజ్ఞయాగాది
క్రతువులకు
తగిన
భూదాన,
గోదాన,
సువర్ణ
దానములను
చేయించుమని
గురువును
ప్రార్థించి
చేతులు
జోడించి,
"గురూ!
ప్రజలకూ
నా
తల్లిదండ్రులకూ
మీరే
తల్లిదండ్రులు,
ప్రజలను
ఆదరించి
పోషించి
కన్నబిడ్డలవలె
కాపాడునట్లు
రాజునకు
బోధించి,
శాసించుచుండవలె"నని
పదేపదే
ప్రార్థించు
రామచంద్రుని
వచనములు
వింటూ
ఉన్న
ప్రజల
హృదయములు
బద్దలయినవి.
ఇట్టి
మహారాజు
పరిపాలనను
నోచుకోలేని
మా
ప్రాణము
లెందుకని
కొందరు
గుండెలను
బాదుకొన్నారు.
కొందరు
తలలు
కొట్టుకొన్నారు.
కొందరు
క్రిందపడి
…ంచినారు.
18
▾
Meaning
Keep
ఇంతలో
రామచంద్రుడు
చేతులు
జోడించి
ప్రజల
వైపునకు
తిరిగి
"ప్రాణప్రియులైన
ప్రజలారా!
మన
ప్రభువైన
దశరథుడు
నన్ను
వనపరిపాలన
నిమిత్తమై
పంపెను.
ద్వేషమునకు
హృదయమున
చోటివ్వక
రాజ
క్షేమమును
కోరుచూ
రాజాజ్ఞను
శిరసావహించి
ఆనందముతో
కాలమును
గడువవలెను.
నాపై
గల
ప్రేమతో
మీరు
రాజును
ద్వేషించరాదు.
రాజునకు
కీడు
కోరరాదు.
నేను
వనమునకు
వెళ్ళిన
తరువాత
కూడనూ
రాజు
గారికి
సౌఖ్యము
కలుగునట్లు
ప్రవర్తించువారే
నాకు
ప్రియులు.
అట్టి
వారే
నా
మిత్రులు.
ఈ
వాక్యములను
నెరవేర్చి
నన్ను
ఆనందపెట్టు"దని
కోరెను.
"ఓ
జనులారా!
నా
వియోగముచే
నా
తల్లియైన
కౌసల్య
దుఃఖించుచుండును.
ఇది
ప్రతి
మాతృమూర్తికీ
సహజమే.
మీరు
చతురులు
కనుక
ఆమె
దుఃఖము
పోవునట్లు
తీరునట్లు
తగిన
ప్రయత్నములు
చేయుడు"
అని
ఈ
ప్రకారము
శ్రీరాముడు
కోరి
సుమంతుని
పిలిచి,
అతనితో,
"ఓ
సుమంతా!
నీవిక
తండ్రి
చెంతకు
వెళ్ళి
అతనికి
అనేక
విధములు
బోధించి
శాంత
పరుచుము"
అని
కోరెను.
చేయునది
లేక
కంటిధారలు
కారుస్తూ
సుమంతుడు,
మాటలాడలేక
పోయినాడు.
మహా
దుఃఖమును
భరించలేక
ఘొల్లున
అరచినాడు.
ప్రక్కనే
నిలిచిన
తోడి
మంత్రులూ
బంట్రోతులూ
సుమంతుని
అనేక
విధముల
ఓదార్చి
వారునూ
దుఃఖించి,
రాజాజ్ఞ
శిరసావహించి
లోనికి
వెళ్ళిరి.
నగరమంతయూ,
శోకార్ణవములలో
మునిగి
యుండెను.
ఇంతలో
దశరథుడు
మూర్ఛనుండి
లేచి,
తెలివి
తెచ్చుకొని
"రామా!
రామా!"
అంటూ
అరచుచూ
లేవబోయి
తిరిగి
క్రింద
బడుచూ
ఈరీతిగా
గది
అంతయూ
తిరుగుచుండెను.
ఆ
సమయమునకు
సుమంతుడు
రాజ
గదిలో
ప్రవేశించి
రాజును
ఓదార్చుటకు
ప్రయత్నించెను.
తనలోనే
పర్వతముల
వంటి
దుఃఖరాసులు
ఉప్పొంగుచుండ
ఇక
దశరథుని
ఏరీతిగా
ఓదార్చగలడు?
అయినా
రామాజ్ఞను
తలంచుచూ,
ఉప్పొంగి
వచ్చు
దుఃఖమును
మ్రింగుచూ,
కంటిధారలు
కార్చుచూ,
పలుకలేని
స్థితిలో
రాజు
చెంత
కూర్చొనియున్న
సుమంతుని
కన్నులు
19
▾
Meaning
Keep
తెరచి
చూచి,
దశరథుడు
ఒక్క
కేక
వేసి
"రామా!"
అని
తిరిగి
సుమంతునిపై
వ్రాలినాడు.
కొంత
సమయము
ఆ
రీతిగా
పడి
తిరిగి
లేచి,
"ఓ
సుమంతా!
రాముడు
వనమునకు
వెళ్ళెను.
కానీ
నా
ప్రాణములు
మాత్రము
నా
శరీరమును
విడిచి
పెట్టలేదు.
నా
శరీరము
నాశ్రయించి
యుండినందున
ప్రాణములకేమి
సుఖము
కలుగును?"
అని
పలికి
ధైర్యమును
తెచ్చుకొని
"ఓయీ!
నీవు
రథమును
తీసుకొని
రాముని
వెంట
వెళ్ళుము.
నా
ఇరువురు
కుమారులూ,
అతి
సుకుమారులు.
కోడలు
ఎండ
కన్నెరుగనిది.
తామర
రేకుల
వంటి
ఆమె
పాదములు
ఎంత
బొబ్బలెత్తునో?
తక్షణమే
రథమును
గొనిపొమ్ము"
అని
ఆదేశించెను.
Previous
←
Obedience to the Father's Word
Next
The Journey to the Forest
→