Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Journey to the Forest
Rāma Kathā Rasa Vāhini
›
Part One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
"సుమంతా!
నా
రామచంద్రుడు,
ధీరుడు.
వెనుకకు
తిరుగడు.
అతని
సంకల్పమును
ఎవ్వరూ
ఆపలేరు.
అతనిని
ఆపుటకై
చేయు
ప్రయత్నములు
వ్యర్థములై
పోవుటయేకాక,
అతనిని
శ్రమపెట్టిన
వారమగుదుము.
అందులో
రాముడు
సత్యసంధుడు.
ఆలస్యము
చేసిన
దారి
తప్పుదురు.
తక్షణమే
రథమును
తీసుకొని
పొమ్ము.
రాజవీధులలో
నా
కొమరులు
నడచుచూ
వెళ్ళుచుండిన
ప్రజలు
చూచి
భరించలేరు
వెళ్ళుము"
అని
సుమంతుని
తొందర
పెట్టుచూ,
"ఆ
రథములో
కొంత
దారి
బత్తెము,
ఆయుధములూ,
తీసుకొని
పొమ్ము.
మరచితి
సుమంతా!
నీ
వెళ్ళయిననూ
బ్రతిమలాడి,
నే
చెప్పితినని
తెలుపుచూ
సీతను
అయోధ్యకు
తిరిగి
పంపు"
మని
ప్రార్థించుము.
"కొంత
దూరము
నీవు
వనములో
కూడనూ
రథమునందు
కూర్చొన
బెట్టుకొని
ప్రయాణము
చేయించుము.
వనములు
చూచి
జానకి
కొంత
భయపడునటుల
తెలిసిన
వెంటనే,
రామాజ్ఞను
గాని
మిథిలాకిశోరియగు
జానకిని
కూడనూ
ప్రార్థించి,
నా
మాటగా
ఆమెకు
నుడివి
అయోధ్యకు
తిరిగి
రమ్మ"ని
ప్రార్థించుము.
"నీవు
అయోధ్యలో
ఉండుటకు
అంగీకరించకున్న,
మీ
తండ్రియైన
జనకుని
వద్దకు
పంపు
ఏర్పాట్లు
మహారాజు
గావించునని
కూడా
నుడువు"
మని
దశరథుడు
పదే
పదే
చెప్పుచుండెను.
ఇంతలో
మతి
తప్పిపడి,
లేచి,
"సుమంతా!
ఇన్నిమాట
లెందుకు?
నా
సీతా
రామలక్ష్మణులను
మువ్వురినీ
తీసుకొని
వచ్చి
చూపించుము.
అట్టి
ప్రయత్నమునకు
పూనుకొని
నన్నానంద
పెట్టుము"
అని
చాలా
దీనుడై
విలపించుచూ,
"రథమును
త్వరగా
తీసుకొని
పొమ్ము.
రథము
2
▾
Meaning
Keep
వెళ్లలేని
ప్రదేశమువరకూ
వెళ్ళుము.
బహుశః
మూడు
నాలుగు
దినములు
రథములో
ప్రయాణము
సలుపవచ్చు.
ఆ
తరువాత
వారిని
దింపి
వారు కనుచూపుమేరవరకు వెళ్ళనంతవరకూ
ఉండి
నీవు
వారల
క్షేమ
వార్తను
గైకొనిరమ్ము.
వెళ్ళుము"
అని
తొందరపెట్టెను.
దశరథ
మహారాజు
ఆజ్ఞగైకొని
సుమంతుడు
రాజునకు
నమస్కరించి
రథమును
నడిపించుకొని
నగర
వీధులలో
కాలినడకతో
పయనించుచున్న
సీతా
రామలక్ష్మణులను
కలుసుకొని
రాజుగారి
వచనములు
రామునకు
విన్నవించి
వారిని
రథముపై
గూర్చుండ
బెట్టుకొని
రాజవీధులలో
నడిపించెను.
సీతారామలక్ష్మణులు
రథము
నధిష్ఠించి,
ఇరుప్రక్కలా
కంటి
ధారలతో
దుఃఖావేశములతో
రోదనలు
సలుపుచున్న
ప్రజలను,
"శాంతించుడ"ని
పలుకుచూ
నమస్కరించుచూ
ప్రయాణమును
సాగించిరి.
రాజవీధులు
దాటి
అయోధ్యా
నగరమును
వీడి
కొంతదూరము
వెళ్ళిరి.
పురజనులు
వీధుల
వెంట
పరువులెత్తుచూ
రథమునకు
వెనుక
దుమ్ము
గగనమును
గ్రమ్మి
దారి
తెలియనట్లు
నిండిననూ
ఏదో
తలచుకొని
రథమునకు
వెనకాల
వృద్ధులు,
స్త్రీలు,
యువకులు,
బ్రాహ్మణులు,
"రామా!
రామా!
మమ్ములను
నీతో
గానిపొమ్ము"
అని
విలపించుచూ
పరువులు
తీసిరి.
రాజవీధులు
నిర్జనప్రదేశములయ్యెను,
అయోధ్య
నిద్రించుచున్నదా
అన్నటుల
నిశ్శబ్దముతో
చీకటి
గ్రమ్మెను.
కొందరు
ప్రయాణములు
సలుపలేని
స్త్రీ
పురుషులు
దారులలో
స్తంభించి
నిలిచిరి.
వీధులలోని
తలుపులు
బిగించుకొని
లోలోన
కుములుచూ
ఆహారపానీయములు
మాని
యెక్కడి
వారక్కడే
నేలపైబడి
దొర్లిరి.
కొందరు,
"శ్రీరాముడు
మనస్సును
మార్చుకొని
రాత్రి
చీకటయిన
తరువాత
తిరిగి
అయోధ్యకు
వచ్చునేమో"
అని
దారులు
చూసిరి.
ఇంతలో
దశరథుడు
ఒక
రథమును
అధిష్ఠించి,
"రామా!
రామా!
సుమంతా!
సుమంతా!
రథమును
ఆపు!
ఒక్కపరి
నా
ప్రేమమూర్తిని
చూతును"
అని
వీధులలో
అరచుచూ
పరువులు
తీసెను.
రామరథమునకూ,
దశరథుని
3
▾
Meaning
Keep
రథమునకూ
మధ్య
పరువులెత్తి
అలసి,
దారిలో
గూడిన
ప్రజలు
రాముడే
తిరిగి
వచ్చుచున్నాడా
అన్న
ఆశతో
తలెత్తి
చూచిరి.
దారికి
అడ్డుతగిలిరి.
కానీ
దశరథుని
రోదన
విని,
వారును
మరింత
విలపించి
రథమునకు
చోటిచ్చి,
"మహారాజా!
త్వరగా
వెళ్ళి
మా
రామ
చంద్రుని
వెనుకకు
తీసుకొనిరండి.
మా
సంకల్పమును
నెరవేర్చండి"
అని
ప్రార్థించిరి.
ఎటులో
రామరథము
అయోధ్యా
ఇసుక
తిన్నెలపై
వాయువేగముతో
పరువులిడుచున్న
దృశ్యమును
చూచి
దశరథుడు,
"సుమంతా!
సుమంతా!
ఆపుము,
ఆపుము"
అని
అరచుచూ
వెళ్ళెను.
సుమంతుడు
వెనుక
వేగముతోవచ్చుచున్న
రథమును
చూచి
"రామచంద్రా!
తండ్రిగారైన
దశరథుడు
వెంటవచ్చుచున్నాడు.
కొంత
సేపు
నిలిపి
వారి
ఆజ్ఞను
పొందుట
మంచిద"ని
కోరగా,
రామచంద్రుడు
కూడనూ
పరువులెత్తుచూ
వచ్చుచున్న
ప్రజలను
తండ్రి
రథమును
చూచి,
మధ్యమార్గమున
ఆపిన
ప్రజలు
చేరి
మరింత
విలపింతురనియు
మన
రథమును
ఆపిన
అలసి
సొలసి
నేల
కూలిన,
వెనుక
ప్రజలు
గూడనూ
తిరిగి
పరువులెత్తి
వచ్చుటకు
ప్రయత్నింతురనియు
ఇది
ప్రజలకు
లేనిపోని
శ్రమను
కలిగించుటేకాక
తన
వాగ్దానమునకు
కొంత
అంతరాయము
కలుగుననియూ
మార్గమధ్యమున
దశరథుడు
విలపించుట
ప్రజలు
చూచిన
రాజు
గౌరవమునకు
భంగము
కలుగననియూ
అనేక
విధముల
తలంచి,
విచారించి,
సుమంతుని
రథమును
ఆపనక్కరలేదనియూ
మరింత
శరవేగముగా
వెళ్ళుట
మంచిదనియూ
హెచ్చరించెను.
అందులకు
సుమంతుడు
చేతులు
జోడించుకొని,
"రామా!
నేనుగూడ
నాలుగు
దినములు
మాత్రమే
తమతో
ఉండుటకు
చక్రవర్తి
అనుమతి
నిచ్చిరి.
తరువాత
నేను
అయోధ్య
చేరవలెను
కదా?"
అప్పుడు
చక్రవర్తి,
"సుమంతా!
నా
రథమును
చూచియూ
నా
పలుకులు
వినియూ
నీ
వెందులకు
రథము
నాపవైతివి?"
అని
ప్రశ్నించిన,
"నేనేమని
జవాబు
నిత్తును.
పోనీ
నన్ను
కూడానూ
మీతో
అరణ్యములో
ఉంచుకొన్న
నే
నెంతయో
ధన్యుడను,
అటులైన
రథము
నాపక
మీరు
చెప్పినటుల
వేగముగా
పోనిత్తును.
దీనికి
తమ
ఆజ్ఞను
తెలుపుడు"
అని
4
▾
Meaning
Keep
ప్రార్థించిన
సుమంతుని
ప్రార్థనను
శ్రీరాముడు
సరిగా
యోచించి,
"సుమంతా!
రథమును
తీసుకొని
పొమ్మనియు
వారిని
అరణ్యమున
వదలి
రమ్మనియూ
ఆజ్ఞాపించినది
చక్రవర్తి.
ఇపుడు
రథమును
నిలుపుమని
విలపించుచూ
వచ్చునది
దశరథుడు.
నీవు
రాజాజ్ఞను
వినవలెనే
కానీ
దశరథుని
ఆజ్ఞను
విననక్కరలేదు.
నీవు
రాజునకు,
రాజ్యమునకు
మంత్రివికానీ
ఒక్క
వ్యక్తిగతమైన
దశరథునకు
మంత్రివి
కాదు.
వ్యక్తిగతంగా
మా
ఇరువురికి
తండ్రీ
బిడ్డల
వాత్సల్య
సంబంధము.
చక్రవర్తి
రీతిగా
నీకూ
నాకూ
చక్రవర్తే.
కాన
ఇరువురికీ
సమ
సంబంధమైన
చక్రవర్తి
స్థానము
ప్రధానము.
నీవు
నీ
కర్తవ్యమును
నెరవేర్చుము.
నా
మాట
వినలేదేమని
దశరథులు
ప్రశ్నించిన
వినలేదని
తెలుపుము.
తప్పులేదు!
రథమును
ఆపక
వేగముగా
పోనిమ్ము"
ని
తెలిపిన
రాముని
వచనామృతము
సుమంతుడు
ధర్మరసముగా
గ్రోలి
ఆనందించి
రథమును
ముందునకు
నడుపజొచ్చెను.
రథము
ఆగకుండుట
చూచి
దశరథుడు
తన
రథమును
నిలిపి
రోదన
చేయుచూ
వెనుకకు
మరలిపోయెను.
ప్రజలు
మాత్రము
వారి
దీక్షను
విడువక
కాయముల
యొక్క
అలజడులకు
లొంగక,
ప్రాణములు
వీడుటకైననూ
సిద్ధముగా
ఉండిన
కొందరు
ఆయాసముచే
శ్వాసలు
తీయుచూ
అయోధ్యకు
తిరిగి
పోవుటకంటే
రాముని
అనుసరించుచూ
ప్రాణములు
వీడుట
మంచిదని
తలంచి
రథము
పోయిన
మార్గమున
అలసి
సొలసి
ప్రయాణము
సలుపుచూ
వచ్చిరి.
ప్రేమకు
వశులై
తనను
వీడలేక
వెంటవచ్చుచుండిన
ప్రజలను
శ్రీరాముడు
చూచి
చాలా
విచారపడినాడు.
రథమునాపి
కరుణతో
మృదు
మధురమైన
వాక్కులతో
వారిని
పలుకరించి,
అనేక
ధర్మములను
ఉపదేశించి
వారిని
యెటులైనా
అయోధ్యకు
తిరిగిపోవుడని
కోరెను.
రామ
వియోగమును
భరించలేమనియూ,
రాముడులేని
అయోధ్యలో
మేము
క్షణకాలమైననూ
నిలువలేమనియూ,
మా
ప్రాణములను
వీడుటకయిననూ
మేము
సంసిద్ధముగా
ఉన్నామని
పలువురు
తెలిపిరి.
యువకులైన
మరి
కొందరు,
"రామా!
ధర్మదే…
పురము
అరణ్యముకంటే
ఘోరము.
అట్లు
భయంకర
5
▾
Meaning
Keep
వనమున
మేము
ఉండలేము.
నీవు
నివసించు
ఈ
అరణ్యమే
మాకు
ఆనందపురము.
కాన
మా
శ్రమకై
మీరేమాత్రమూ
విచారించక
మీ
దీక్షను
మీరు
కొనసాగించుడు.
మా
దీక్షను
మేము
కొనసాగింతుము.
పితృవాక్య
పరిపాలన
మీకెంత
ప్రధానమని
తలంతురో,
అటులనే
మా
హృదయవాసియైన
ఆత్మారాముని
ఆనతి
మాకంత
ప్రధానము,
ప్రమాణము.
కాన
మేము
నిలువము;
వెనుకకు
మరలము.
మరణమే
మాకు
శరణ్యము"
అని
గొల్లున
యేడ్చుచున్న
ఆ
ప్రజలను
చూచి
వారి
దీక్షావచనములు
విని
రామచంద్రుని
హృదయము
స్రవించెను.
సీత
కంటిధారలు
జలజల
రాల్చెను.
లక్ష్మణుడు
ప్రజల
అభిమానమును
గుర్తించి,
ఇట్టి
అభిమానము
కైకకు
లేకపోయెనుకదా
అని
కండ్లెర్ర
చేసుకొని
మాట్లాడలేని
స్థితిలో
తలవంచి
కూర్చొనెను.
రాముడు
ఎటులో
వారికి
నచ్చెప్పి
పంపుట
మంచిదని
తలంచి
మరింత
ప్రేమతో,
దయతో
వారలను
ఓదార్చి,
వారి
అగ్ని
కార్యములకు
ఈ
విధమైన
ప్రయాణము
కొంత
ఇబ్బంది
కలిగించుననియూ,
"మీరు
అయోధ్యకు
వెళ్ళి
యజ్ఞయాగాది
క్రతువులు
చేయుచుండిన
కాలము
అతిత్వరగా
దాటిపోవుననియూ
మీరు
చేయు
క్రతువుల
ఫలముగా
నేను
అరణ్యమున
సుఖజీవనము
చేసి
ఆనందముగా
అయోధ్యకు
వచ్చి
చేరుదుననియూ"
ఎన్నియో
విధముల
తెలిపెను.
అయిననూ
ఆ
యువక
బ్రాహ్మణులు
ఏమాత్రమునూ
వెనుకకు
పోవుటకు
అంగీకరించరైరి.
తమ
తల్లిదండ్రులు
వృద్ధులగుటచే
వారిని
చూచుకొనువారు
కూడా
ఇండ్లయందు
లేరు.
కనుక
ఇట్టి
పట్టును
పట్టి
వృద్ధులను
బాధపెట్టుట
మంచిదికాదని
ధర్మబోధలు,
నీతి
సూక్తులు
వేలకువేలు
తెలిపెను.
అందులకు
బ్రాహ్మణ
యువకులు,
"రామచంద్రా!
మా
తల్లిదండ్రులు
శక్తిహీనులగుటచేత
కొంతదూరము
మాత్రమే
వచ్చి
రామ
వియోగమును
భరించలేక
దారిని
అనుసరించలేక
కుమిలి
పోవుచున్నారు.
మేము
రామచంద్రుని
అనుసరించలేక
పోయినను,
మీరైనా
అనుసరించి
అతని
అనుగ్రహమునకు
పాత్రులు
కందని
మా
తల్లిదండ్రులు
…తిని
ఇచ్చియే
పంపిరి.
కనుక,
తాము
చెంత
లేమను
చింత
6
▾
Meaning
Keep
కంటెను
రామచంద్రుడు
అయోధ్యలో
లేకపోయెనే
అను
చింతయే
వారలను
అమితముగా
బాధించుచున్నది.
కనుక
మేము
రాముని
అనుసరించుట
మా
తల్లిదండ్రులకు
ఆనందమే
కాని
విచారముకాదు.
వారిని
ఆనంద
పెట్టుటకైననూ
మమ్ములను
మీతో
గానిపొమ్మ"ని
బ్రాహ్మణ
యువకులు
పాదముల
పట్టి
ప్రార్థించిరి.
రాముని
హృదయము
కరిగిపోయినది.
మారు
మాట్లాడలేక
పోయినాడు.
ఏమి
చెప్పుటకూ
తోచక
తన
త్యాగమునకు
మించిన
త్యాగమును
అనుసరించుచున్నారని
ఒకవైపున
ఆనందము
మరొకవైపున
సిగ్గునూ
అతనిలో
కలగెను.
ఇంతలో
చీకటి
గ్రమ్మెను.
ఇట్టి
కటిక
చీకటిలో
అయోధ్యకు
వెళ్ళుమనుట
మంచిదికాదని
తలంచి
అలసిపోయిన
వారలకు
కొంత
విశ్రాంతినిచ్చుట
మంచిదని
తలంచి
వారలను
కందమూలాదులను
భుజించి
విశ్రమించుడని
కోరెను.
తమ
రథమును
ఆపి,
తమసానదిలో
స్నానముచేసి
సంధ్యావార్చి
తానునూ
కొంత
విశ్రాంతి
తీసుకొనునటుల
నటించెను.
పగలంతయూ
పరువులెత్తిన
ప్రజలు
రామసన్నిధిలో
విశ్రమించుటచేత
వారల
దేహములు
గాఢమైన
నిద్రలో
మునిగెను.
ఇది
కనిపెట్టి
తెల్లవారిన
తిరిగి
వారు
రాముని
విడువరని
తలంచి
రెండు
ఝాముల
రాత్రి
గతించగనే,
రాముడు
సుమంతుని
లేపి,
"రథము
యొక్క
జాడలు
కనపడకుండా
నిద్రించువారికెట్టి
నిద్రా
భంగము
కానియ్యక
రథమును
నడుపుమ"ని
తెలిపెను.
ఇంతకంటే
వేరు
ఉపాయము
లేదని
తలంచి
సుమంతుడు
కూడా
రథమును
యుక్తిగా
అటూ
ఇటూ
త్రిప్పి
తిరిగి
అయోధ్య
వైపునకు
వెళ్లినటుల
రథపుజాడలు
చూపి
గాఢమైన
అడవిలో
ప్రవేశించెను.
అంత
ప్రాతఃకాలమయ్యెను.
జనులు
నిద్రనుండి
మేల్కొని
లేచి
చూచిరి.
రథము
కానీ,
సీతారామ
లక్ష్మణులు
కానీ
లేకపోవుటచూచి
అమితముగా
దుఃఖించుచు,
ఇంకనూ
నిద్రించు
వారలను
మేల్కొలిపి,
రథము
పోయిన
జాడలను
గుర్తుపట్టుటకు
అనేక
విధములు
ప్రయత్నము
చేయుచూ,
"రామా!
రామా!"
అని
ఎలుగెత్తి
ఏడ్వసాగిరి.
పరుగెత్తిరి.
అందులో
ఒకరు,
"సోదరులారా!
…ము
7
▾
Meaning
Keep
పడుచుండిన
కాయక్లేశము
జూచి
రాముడు
మనలను
విడిచిపెట్టెను",
అని
ఒకరినొకరు
నిందించుకొనుచు
జలములోని
మీనములను
స్తోత్రము
జేసిరి.
ఆ
మీనములు
జలము
లేక
జీవింపవు.
రాముడు
మా
వద్ద
లేకపోయిననూ
మేము
జీవించితిమి.
ఛీ!
ఎందుకు
మన
బ్రతుకు?
మన
ప్రియుడగు
రాముని
వియోగమును
తెచ్చుకొంటిమి
కదా!
మనమే
ఎందుకు
మరణమునూ
తెచ్చుకొనకున్నాము?"
అని
ఒకరికొకరు
చెప్పుకొనుచూ,
"ఆత్మ
శ్రీరాముడే
కనుక,
ఆత్మహత్య
మంచిదికాదు.
ఈ
వియోగమును
మనము
కోరితెచ్చుకున్నదికాదు.
విధి
వ్రాత.
అటులనే
మరణమునూ
మనము
కోరితెచ్చుకొనుట
మంచిదికాదు.
అదియునూ
విధి
ననుసరించే
ప్రాప్తించును.
కాన,
విధినైననూ
ప్రార్థించి,
ఆ
మరణమును
తెప్పించుకొనుట
మంచిద"ని
మరొకరు
బోధించిరి.
ఈ
రీతిగా
ఒకరిలో
ఒకరు
తర్కించుకొంటూ,
ముందుకు
చేయున
దేమని
విచారించుచూ,
రథముయొక్క
జాడలను
కొంత
గుర్తించిరి.
ఆ
జాడలు
అయోధ్యాపురము
దిశకు
వెనుకకు
తిరిగినటుల
కొంతదూరము
కనిపించి,
తరువాత
జాడలు
కనిపించకపోవుట
చేత,
జాడలు
గుర్తించుట
కష్టమగుటచేత,
వియోగముతో
చేయునది
లేక
నగరములో
ప్రవేశించిరి.
రాముడు
తిరిగి
రెండు
మూడు
దినములకైనా
మన
వియోగబాధను
కనిపెట్టి,
అయోధ్యకు
చేరునేమో
అన్న
ఆశ
కొంతమందికి
కొంత
ఉపశాంతి
చేసెను.
ఇండ్లలోని
స్త్రీలు
రామ
పునర్దర్శనాపేక్షులై
వ్రతోపవాసములు
జేయదొడగిరి.
సూర్యుడులేని
సమయమున
చక్రవాక
మిధునమును,
కమలములును
వాడురీతి
వారు
దీనులై
విచారించిరి.
ప్రజల
గోలు
ఈ
రీతిగా
ఉండ
సీతారామలక్ష్మణులు,
మంత్రియైన
సుమంతునితో
గూడి
శృంగిబేరపురమునకు
వచ్చి
చేరిరి.
అపుడు
రాముడు
గంగానదిని
చూచి
రథమును
ఆపమని
సుమంతునకు
చెప్పి
తాను
దిగి
గంగానదికి
నమస్కరించెను.
సీతా
లక్ష్మణ
సుమంతులునూ
రథమును
దిగి
గంగకు
నమస్కరించిరి.
సకల
సన్మంగళమునకును
ఆనందమునకును
గంగానది
మూలమని
రామచంద్రుడు
నుడివెను.
గంగను
గురించిన
చిత్రవిచిత్ర
కథల
8
▾
Meaning
Keep
నెన్నింటినో
రామచంద్రుడు
వారలకు
తెలుపుచూ
వచ్చెను.
తరువాత
అందరూ
గంగలో
దిగి,
స్నానము
చేసిరి.
సీత
దిగుటకు
తగిన
వసతిని
చూడుమని
రాముడు
లక్ష్మణునకు
ఆదేశించెను.
లక్ష్మణుడు
అరణ్యములో
ప్రవహించు
గంగకు
గట్లు
చాలా
మెత్తగా
ఉండును.
గనుక,
సీత
దిగుటకు
కొంత
అనుకూలమైన
స్థానమును
వెతికి
దానికి
తగిన
రాళ్ళు
భద్రపరచి
సీతామాతను
అక్కడ
స్నానము
చేయుమని
కోరెను.
ఆమె
కూడను
జాగ్రత్తగా
గంగలో
దిగి
నమస్కరించి,
స్నానము
చేసెను.
మార్గాయాసముచే
అలసివుండుటచేత,
లక్ష్మణుడు
కొంత
తిరిగి
అడవి
ఫలములు
ఏరుకొని
వచ్చి
సీతా
రాములకు
అందించుటవలన
వారు
వాటిని
భుజించి
విశ్రమించిరి.
ఇంతలో
కొందరు
నావ
నడుపువారు
అక్కడక్కడ
కనిపించిరి.
సీతారామలక్ష్మణులతో
రథమును
చూచిరి.
వారెవరో
రాజపుత్రులవలె
నున్నారని
కనిపెట్టి
విహారార్థమై
వచ్చియున్నటుల
భావించి,
నిషాదాధిపతియగు
గుహునకు
హుటాహుటిగా
ఈ
వార్తనందించిరి.
వార్త
వినగనే
మరొక
మనిషిని
పంపి
వారెవ్వరో
ఏమో
తెలుసుకొని
రమ్మని
తెలిపెను.
గుహుడు
వీరు
పరులెవ్వరో
కాదనియూ
అయోధ్యాపతియైన
దశరథ
మహారాజ
పుత్రులనియూ,
మంత్రి
సుమంతునితో
ఉన్నారనియూ
వివరములు
తెలుసుకొని,
ఉత్కృష్ట
పదార్థము
నొక్కడే
సేవించుట
ఉచితము
కాదని
తలంచి,
రాముని
రాక
వార్తను
సువార్త
బంధువులకు,
స్నేహితులకు
తెలిపి,
ఫలపుష్పములను
కూర్చుకొని
నమ్రుడై
రామదర్శనార్థమై
గుంపులుగా
బయలుదేరి
గంగాతీరమునకు
వచ్చిరి.
వారు
తెచ్చిన
ఫల
పుష్పాదులు
రామ
పాదములచెంత
పెట్టి
గుహుడు
నమస్కరించెను.
గుహుడు
నమస్కరించగనే
వచ్చిన
బంధుమిత్రులు
కూడనూ
నమస్కరించిరి.
వారల
ఆనందమును
చూచి
రామచంద్రుడు
గుహుని
దగ్గర
చేర్చుకొని
కుశల
ప్రశ్నలు
వేసి,
పరిపాలనా
విధమును
గూర్చి
విచారించెను.
అందులకు
గుహుడు,
"నాథా!
రామచంద్రా!
మీ
చరణములను
దర్శించినందున
మేమందరము
అమితానందమును
పడుచున్నాము.
దుర్లభమైన
9
▾
Meaning
Keep
మీ
దర్శనము,
మా
పుణ్యఫలముచే
చిక్కినది,
లేకున్న
ఈ
అరణ్యములో
ఉన్న
మాకు
మీ
పవిత్ర
చరణములు
చిక్కునా?
దీనికి
పూర్వ
మెట్లుండిననూ
ఇక
నేటినుండి
మీ
పాదస్పర్శ
జరిగిన
ఈ
ప్రాంతము
సుభిక్షముతో
నిత్య
కళ్యాణములతో
వర్ధిల్లును.
అందులో
సందియములేదు"
అని
రామదర్శన
ఫలమునే
వర్ణించుచూ
ఆనందబాష్పములు
రాల్చుచూ
ఉండిన
గుహునిచూచి,
లక్ష్మణ,
సీతా,
సుమంతులు,
ఆశ్చర్యపరవశులయిరి.
ఇంతలో
గుహుడు
పాదములపట్టి,
"రామచంద్రా!
అంతయూ
నీదే,
నాకున్న
ధనము,
రాజ్యము,
సంపద
ప్రజలు
అన్నియూ
నీ
సేవాకైంకర్యములే.
నన్ను
నీ
పాదదాసునిగా
భావించి,
నగరమున
ప్రవేశించి
నన్ను
కృతార్ధుని
చేయుము",
అని
అడుగుకొనెను.
అందులకు
రామచంద్రుడు
చిరునవ్వు
నవ్వుచూ,
"గుహుడా!
నీవు
పరమ
భక్తుడవు.
గుణశాలివి.
నీ
హృదయము
అతి
నిర్మలము,
కానీ
నా
తండ్రిగారి
ఆజ్ఞానుసారము
పదునాలుగు
సంవత్సరముల
వరకూ
మునివేషముతో
వనమున
సంచరించవలెను.
పట్టణమున
పాదము
పెట్టకూడదు.
తాపసాహారమునే
సేవించవలెను.
తాపస
జీవితమునే
గడపవలెను.
ఈ
కారణముచేత,
నేను
మీ
కోరిక
నెరవేర్చలేక
పోవుచున్నాను".
అని
రాముడు
చెప్ప
గుహుడు
దుఃఖించెను.
సీతారామలక్ష్మణుల
దివ్యమంగళ
రూపములను
చూచి
శృంగిబేర
పురవాసులు
గుసగుసలాడ
దొడగిరి.
"ఆహా!
వీరి
తల్లిదండ్రులెవరో,
మన్మధరతులనే
మరపించు
ఇట్టి
బిడ్డలను
వనమునకు
పంపుటకు
వారి
మనసెట్లొప్పెనో
కదా?
నోరెట్లాడెనో
కదా?"
అని
ఒకరు
విచారించ,
మరొకరు
"ఓయి
మూర్ఖుడా,
వారు
ఎంతో
మంచిపని
చేసిరి.
వారే
వీరలను
అరణ్యమునకు
పంపకున్న
మనము
వీరలను
కన్నులపండువుగా
దర్శించి
యుందుమా!
ఈనాడు
మన
నేత్రములకు
ఉత్సవము
కలిగెను"
అని
మరొకరు
తమ
ఆనందమును
వెలుపరచెను.
ఇట్లు
అక్కడ
వచ్చిన
ప్రజలు
ఒకరితో
నొకరు
వీరి
సౌందర్య
సుకుమారత్వములను
ముచ్చటించుకొనుచుండ,
నిషాదపతి
అయిన
గుహ…
పట్టణమున
అడుగుపెట్టునట్టి
ప్రాప్తికి
నోచుకొనలేదని
10
▾
Meaning
Keep
చింతించి,
మనోహరమైన
ఒక
శింశుపా
వృక్షమును
జ్ఞప్తికి
తెచ్చుకొని
రాముని
తీసుకొనిపోయి
ఆ
ప్రదేశమును
చూపించెను.
ఆ
స్థలమును
చూచి
రాముడు
సంతోషించెను.
అంత
వచ్చిన
గ్రామప్రజలు
రామచంద్రునకు
నమస్కరించి
చీకటి
పడకమునుపే,
వారి
గ్రామమును
చేరుకొనిరి.
రాముడు
సాయం
సంధ్యాద్యనుష్ఠానములు
నిర్వర్తించెను.
ఈ
లోపల
గుహుడు
దర్భలను
కోసుకువచ్చి
కిసలయములతో
మృదువగు
ఒక
శయ్యను
సిద్ధపరచెను.
గుహుడు
పరివారమును
పంపి
మృదుమధురమగు
కందమూల
ఫలములను
అడవి
ఆకులనిందా
పెట్టుకొని
తెమ్మని
ఆజ్ఞ
చేసెను.
సీతా
రామ
లక్ష్మణులు,
సుమంతుడును
కందమూల
ఫలములను
భుజించి
విశ్రమించిరి.
రాముడు
శయనించునటుల
నటించెను.
సీత
కూడనూ
మెత్తని
ఆ
దర్భశయ్యపై
పరుండెను.
లక్ష్మణుడు
రాముని
పాదములు
వత్తుటకు
చెంతచేరెను.
తాను
మేలుకొన్నటుల
ఉండిన
లక్ష్మణుడు
ఎంతసేపయినా
పాదముల
వత్తుచునే
ఉండునని
రాముడు
తలంచి,
లక్ష్మణునికి
కూడా
విశ్రాంతి
నందించిన
మంచిదని
భావించి,
రాముడు
గాఢముగా
నిద్రించినటుల
నటించిన
తోడనే,
లక్ష్మణుడు
రామునకు
నిద్రాభంగము
కాగలదని
తలంచి
పాదముల
వత్తుట
మాని
మెల్లగా
అక్కడి
నుండి
లేచి
కొంచెము
దూరములో
వీరాసనము
వేసుకొని
నలుప్రక్కలా
చూచుచూ,
క్రూరమృగములో
లేక
రాక్షసులో
వచ్చి
రామనిద్రకు
భంగము
కావింతువేమో
అని
అతి
జాగ్రత్తతో
ఉండెను.
ఈ
దృశ్యమును
చూచిన
నిషాదపతి
రామ
నిద్రకు
భంగము
కలుగ
నివ్వక
చూచుకొమ్మని
తన
విశ్వసనీయులైన
సేవకులకు
ఆజ్ఞచేసి
తాను
స్వయముగా
తూణీరము
పట్టుకొని
లక్ష్మణుని
వద్దకు
వచ్చి
కూర్చుండెను.
రాముని
యందుగల
విశేష
ప్రేమచేత
నిషాదపతి
అయిన
గుహుడు
కంటిధారలు
కార్చుచూ
అత్యంత
భక్తిశ్రద్ధలతో
చేతులు
జోడించుకొని
లక్ష్మణుని
ఈ
రీతిగా
ప్రశ్నించెను:
"లక్ష్మణా!
దశరథమహారాజు
భవనము
స్వయముగా
దేవేంద్రుని
భవనము
కంటే
అధిక
శోభాయమానముగ
నుండును.
11
▾
Meaning
Keep
ఆ
మందిరములో
చిత్రవిచిత్రమగు
సుందరములు
అమర్చియుండురు.
సుగంధ
ద్రవ్యములు,
హంసతూలికా
తల్పములు,
మణిదీపములు
ఆనందము
కలుగజేయుచుండును.
పాలనురుగుతో
సమానమైన
మృదువగు
తెల్లని
దుప్పట్లును,
తలదిండ్లును
ఉండును.
అంత
చక్కని
మందిరములో
శయనించుచుండిన
సీతారాములు
నేడు
దుప్పటి,
తలదిండ్లు,
పట్టెమంచములూ
లేక
దర్భశయ్యపై
అలసటచేత
గాఢముగా
నిద్రించిరని
తలంచుటే
మహా
దుఃఖముగ
నున్నది.
జననీజనకులూ
దాసదాసీలూ
రాములవారిని
అనేక
రకముల
రక్షించుచుండిరి.
అట్టి
సీతా
రాములు
నేడు
అరణ్యమున
కఠిన
నేలపై
పరుండుటచే
నా
హృదయము
బ్రద్దలగుచున్నది.
లోక
ప్రఖ్యాతిగాంచిన
మిథిలాపురి
చక్రవర్తి
కొమార్తె
అయిన
జానకి,
దేవేంద్రుని
మిత్రుడు
దశరథ
మహారాజు
కోడలయిన
సీతాదేవి,
ఈ
రాత్రి
ఈ
విధమైన
దర్భలపై
పవళించుటా?
సీతారాములు
వనవాసమునకు
యోగ్యులా?
కర్మ
ప్రధానమను
లోకసూక్తి
పరమసత్యముగా
సాక్షాత్కరించుచున్నది.
కేకయరాజు
కొమార్తె
కైకేయి
ఇంతటి
చెడుపని
చేయునని
యెవ్వరునూ
నమ్మరు.
మంచి
సుఖమును
అనుభవించవలసిన
ఈ
వయసులో
సీతారాములకు
ఇట్టి
కష్టములు
కలిగించుట
ఎంతటి
పాతకము?
పరమ
విరోధులకు
కూడనూ
ఇట్టికష్టము
రాకూడదు.
కైకేయీదేవి
సూర్యవంశవృక్షమును
గొడ్డలివలె
ఛేదించెను.
ఆమె
స్వార్థము
లోకమునే
దుఃఖమున
ముంచెను.
ఆహా!
నా
పాడుకన్నులు
ఈ
అవస్థను
చూడవలసి
వచ్చెను
కదా!
ఏ
పాపము
చేసితినో?
ఎవరి
సుఖములు
చూచి
నా
నేత్రములు
మందెనో?
ఈనాడు
నా
ప్రాణ
సమానమైన
రామచంద్రుని
కష్టములు
ఈ
కన్నులు
చూడవలసి
వచ్చెను"
అని
పొంగివచ్చు
దుఃఖమును
ఆపుకొనలేక
నోరును
మూసిపెట్టుకొని
తలను
బాదుకొంటూ
విలపించుచున్న
గుహుని
చూచి,
లక్ష్మణుడు
కూడనూ
విచారించెను.
లక్ష్మణుడు
కొంత
ధైర్యమును
వహించి,
"ఓ
నిషాదపతీ!
ఒకరివలన
ఒకరికి
సుఖము
…,
దుఃఖము
కానీ,
అహితముకానీ
కలుగవు;
కలుగుటకు
12
▾
Meaning
Keep
వీలులేదు.
ఎవరు
ఏయే
నిమిత్తమైవత్తురో,
వారి
పూర్వపు
కర్మఫలము,
సంకల్ప
మహత్తర
స్వరూపమూ,
వారికి
ఈ
విధముగా
కనిపించును.
స్వప్నములో
భిక్షుకుడు
రాజగును,
రాజు
భిక్షుకుడగును.
మేల్కాంచిన
తరువాత
ఎవరికినీ
లాభనష్టములు
లేవు.
అటులనే,
లోకమంతయూ
మిథ్యయని
తెలుసుకొనుము.
రామచంద్రునకు
సుఖదుఃఖములు
లేవు,
రావు.
అవి
చూచువారి
పాపపుణ్యఫలములను
పురస్కరించుకొని
అయా
అవస్థలు,
సుఖములు,
ప్రతిబింబములవలె
గోచరించును"
అని
లక్ష్మణుడు
హితబోధ
చేయగా,
గుహుడు
పూర్వము
కైకేయిపై
రేగిన
రోషమును
శాంతపరచుకొని
"వ్యర్థముగా
ఒకరిని
నిందించుట,
పరిహసించుట
మంచిది
కాదు.
రాత్రి
జనులందరూ
నిద్రించుచుందురు.
అనేక
విధములగు
స్వప్నములు
వారికి
వచ్చుచుండును.
ఈ
సంసారలోపమగు
రాత్రివేళ
యోగులు
మాత్రము
మేల్కొని
యుందురు.
వారలకు
ప్రపంచముతో
ప్రయోజనము
లేదు.
సకల
విషయ
భోగముల
నుండి
విముఖుడు
కానంతవరకు
జీవుడు
మేల్కొనెనని
చెప్పుటకు
వీలుపడదు.
జ్ఞానము
కలిగినందున
మోహపాశములు
వీడును.
శ్రీరాముని
చరణములందు
అనురాగము
పుట్టును"
అని
తాను
తలంచెను.
ఈ
విధముగా
రామచంద్రుని
మానవాతీత
విషయములను
సంపూర్ణ
ప్రభావమును
వర్ణించుచూ
ఇరువురూ
అనగా
లక్ష్మణుడు,
గుహుడు
ఆ
రాత్రి
పవిత్రముగా
గడిపిరి.
ఇంతలో
ప్రాతఃకాలమయ్యెను.
ఒకరిని
ఉంచి
మరొకరు
కాల
కృత్యములు
తీర్చుకొని
స్నానసంధ్యాదులు
ఆచరించి
వచ్చిరి.
ఇంతలో
రామచంద్రుడు
కదిలి
కన్నులు
నులుముకొనుచూ
నలుదిక్కులు
తేరపార
చూచి
లేచెను.
సీతాదేవిని
కూడను
మేల్కొలిపి,
ఇరువురూ
గంగానదికి
వెళ్లి
స్నానముల
నాచరించి
తిరిగి
లక్ష్మణుడు,
గుహుడు
ఉన్న
ప్రదేశమునకు
వచ్చి
తమ్మునకు
మట్టిపాలు
తెమ్మని
ఆజ్ఞచేసెను.
అన్నమాటను
శిరసావహించు
లక్ష్మణుడు
మారుమాటాడక,
కొంతదూరము
వెళ్లి
మట్టిపాలను
ఒక
దొప్పలో
తీసుకొని
వచ్చెను.
ఆ
తెచ్చిన
పాలను
తల
వెంట్రుకలక
…గా
అవి
జడలుగా
తయారయ్యెను.
వారి
13
▾
Meaning
Keep
చర్యలను
చూచి
సుమంతుడు
గొల్లున
ఏడ్చెను.
కన్నులు
మూసుకొనెను.
రాముని
రాజ్యతిలకమును
చూడవలసిన
నేత్రము
జటా
మకుటములను
చూడవలసి
వచ్చెను
కదా
అని
విచారించెను.
హృదయము
దహించి
పోయెను.
చేయునది
లేక
చేతులను
జోడించుకొని
సుమంతుడు,
రామునిముందు
నిలచి,
"రామచంద్రా!
నా
అదృష్టము
క్షీణించినది.
నేనిక
అధిక
కాలము
అరణ్యములో
నివసించు
ప్రాప్తికి
నోచుకోలేకపోవుచున్నాను.
మహారాజు
విధించిన
ఆజ్ఞ
పూర్తిచేసితిని.
అరణ్యమున
ఏదైన
ఒక
పవిత్రనదీ
తీరము
వచ్చువరకూ
వెళ్లి,
ఆ
ప్రదేశమున
సీతారామలక్ష్మణులను
విడచి,
నీవు
రథములో
వెనుకకు
రమ్మని
తెలిపిన
వచనములు
తమకు
విన్నవించుచున్నాను.
ముందు
తమ
ఆనతికి
వేచియున్నా"నని
తలంచుకొని
కంటిధారలు
కార్చుచూ
అతి
దీనుడై
నిలిచెను.
సుమంతుని
చూచి,
రాముడు
"సుమంతా!
నీవు
విచారించకుము.
మహారాజు
యొక్క
ఆజ్ఞ
పూర్తిచేయుట
నీకు
మాత్రమే
కాదు,
నాకు
కూడనూ
కర్తవ్యము.
నీకు
ఇచ్చిన
ఆజ్ఞ
నీవు
నెరవేర్చినందున
నాకెంతయో
ఆనందము.
ఇక
నాకు
ఇచ్చిన
ఆజ్ఞను
నేను
శిరసావహించి
నేటినుండి
నా
కర్తవ్యమును
నేను
ఆచరింతును.
నీవు
ఇక
అయోధ్యకు
వెళ్ళుటలో
కాలహరణము
చేయకుము.
నీకొరకై
తల్లిదండ్రులు
అమితమైన
ఆతురతతో
కాచుకొని
యుందురు.
మా
ప్రయాణము
యొక్క
వివరములు
వినగోరుచుందురు.
కాన
నీవు
రథమును
వెనుకకు
మరల్చుము"
అని
రామచంద్రుడు
పలికెను.
అంత
సుమంతుడు
"శ్రీ
రామచంద్రా!
అయోధ్యానగరము
అనాథ
కాకుండునట్లు
చూచుకొనుము.
మీరు
లేనప్పుడు
మహారాజు
జీవించుట
కష్టము.
భరతుడు
రాజ్యము
చేయుట
దుస్తరము"
అని
బాలునివలె
ఏడ్చుచూ
పాదములపై
బడిన
సుమంతుని
లేవదీసి,
"సుమంతా,
సత్యము
కంటె
నుత్కృష్టమగు
ధర్మము
మరియొకటి
లేదు.
ఈ
సంగతి
వేద
పురాణేతిహాసములలో
సుప్రసిద్ధము.
అట్టి
సర్వోత్కృష్టమైన
ధర్మము
నాకు
సులభముగా
లభించినది.
దానిని
విడిచిపెట్టిన
యెడల
నాకునూ
నా
వంశమునకునూ
…
లోకములందు
అపకీర్తి
వచ్చును.
కోటిమరణముల
14
▾
Meaning
Keep
కంటే,
అపకీర్తి
సంభావితులను
దహించును.
నీవు
నా
తండ్రిగారి
పాదములమీద
పడి
నమస్కరించి
నా
విన్నపములను
విశదము
చేయుము.
నన్ను
గురించి
సీతా
లక్ష్మణుల
గురించి
వారు
చింతింపకుండునట్లు
మీరు
చూచుకొనుడు"
అని
పలుకుచున్న
శ్రీరామ
సుమంతుల
సంవాదమును
గుహుడును,
అతని
పరివారమును
విని
వ్యాకులపడిరి.
వారలకు
తెలియకనే
వారల
నేత్రముల
నుండి
ధారలుధారలుగా
నీరు
కారదొడగెను.
ఇది
భరించలేక
లక్ష్మణుడు
కొన్ని
కరినవచనముల
బలికెను.
కానీ
అతని
వచనము
లనుచితములని
రాముడు
తెలిసికొని
అతనిని
నివారించెను.
తదుపరి
రాముడు
మంత్రిని
చూచి
"సుమంతా!
లక్ష్మణుడు
బాలుడు.
అతని
వచనములను
మీరు
పాటించక,
మా
తండ్రి
గారితో
విన్నవింపకుడు.
నాపై
గల
ప్రేమ
చేతను,
సీత
పడుచున్న
బాధ
చేతను
అతని
మనస్సు
ఆ
విధముగా
బాధపడి,
సీతారాములను
అడవికి
పంపెగదా
అని
తనలో
ఒక
విధమైన
తప్పు
అభిప్రాయముపడుటచేత
ఈ
వచనములు
వెలువడినవి.
సహజముగా
లక్ష్మణుడు
మహాగుణశాలి.
నీకు
తగినవాడు"
అని
లక్ష్మణుని
గుణగుణములను
వర్ణింప
జొచ్చెను.
తలవంచుకొని
దుఃఖముతో
కుములుచున్న
సుమంతుడు
తలయెత్తి
"స్వామీ!
జానకి
సుకుమారి,
వనవాసకష్టముల
నోర్వలేదు.
ఏ
విధమున
జానకి
నగరమునకు
తిరిగి
వచ్చునో
ఆ
విధమున
ఆమెకు
బోధించుట
ఉచితము.
ఆమె
అయోధ్యకే
ప్రాణము,
రాజ్యలక్ష్మి.
ఒకవేళ
ఆమె
అయోధ్యకు
వచ్చుటకు
అంగీకరించని
యెడల
అయోధ్యావాసులు
జలము
లేని
మీనములవలె
జీవించుట
కష్టము.
ఆమె
స్వేచ్ఛానుసారము
తల్లివద్ద
గానీ,
అత్తవద్దగానీ
సుఖముగా
నివసించి
యుండవచ్చును.
ఇదియే
మహారాజుగారు
కూడనూ
తనకు
తెలుపుమని
పదేపదే
నాతో
చెప్పిపంపిరి.
మీరు
పదునాలుగు
సంవత్సరములు
వనవాసము
చేసి
అయోధ్యకు
చేరు
నాటికి
జానకిని
అయోధ్యకు
తీసుకొని
రావచ్చును"
అని
సుమంతుడు
రామునితో
తెలుపుచుండ,
రామచంద్రుడు
సీతను
చూచి,
'చక్కగా
వినుచున్నావా'
అన్నటుల
హెచ్చరించెను.
15
▾
Meaning
Keep
అంత
రాముడు
"సీతా!
తండ్రిగారి
సందేశమును
వింటివికదా!
నీవు
ఇంటికి
వెళ్ళు.
నిన్ను
చూచి
అయిననూ
నా
తల్లిదండ్రులు,
నా
వియోగబాధను
కొంత
మరతురు.
వారలు
ఈ
వృద్ధాప్యమున
అమితముగా
బాధను
భరింపలేరు.
కాన
నీవు
మంత్రితో
తిరిగి
అయోధ్యకు
వెళ్ళుట
ఎంతైనా
అవసరము"
అని
అనేకవిధముల
బోధించుచున్న
రాముని
చూచి,
"ప్రాణనాథా!
మీరు
సర్వజ్ఞులు,
సర్వధర్మములను
ఎరిగినవారు.
మీకు
నేను
వేరు
చెప్పనవసరములేదు.
నా
విన్నపమొకింత
ఆలకింపుడు.
ఛాయ
పదార్థము
ననుసరించి
యుండును.
కాని
విడచి
ఉండజాలదు
కదా!
సూర్యుని
విడచి
సూర్యకాంతి,
చంద్రుని
విడచి
చంద్రకాంతి
ఎటులుండ
వీలుకాదో
అదేవిధమున
రామచంద్రుని
విడచి
సీతాఛాయ
ఉండజాలదు"
అని
సమాధానము
జెప్పెను.
మంత్రితో,
"సుమంతా!
మీరు
నా
తండ్రి,
మామలతో
సమానులు.
నా
హితకారులు.
ఆర్యపుత్రులగు
నా
భర్త
పదకమలములు
తప్ప
తదితర
సంబంధములతో
నాకు
ప్రయోజనము
లేదు.
కన్న
కొమరునకంటే,
కట్టుకున్న
కోడలు
అత్తమామలకు
అధికము
కాదని
లోకమునకు
విదితమే.
నన్ను
చూచుకొని
కొమరుని
వియోగబాధను
మరతురన్నమాట
అర్థము
లేనిది.
ఇక
నా
తండ్రిగారి
భోగైశ్వర్యములను
పుట్టిననాటినుండియూ
అనుభవించితిని.
నా
భర్త
వినా
అవి
అన్నియూ
తృణప్రాయములని
నే
గ్రహించితిని.
నా
పతిని
విడిచిన
నాకు
వేరు
గతిలేదు.
కాన,
వేరుగా
భావించక
నన్ను
తిరిగి
అయోధ్యకు
గానిపోవు
ప్రయత్నములను
మరచిపొండు.
నా
అత్తమామలకు
నా
హృదయపూర్వక
నమస్కృతులను
నా
విన్నపములను
చెప్పి
నన్ను
గురించి
విచారింపవలదని
బోధింపుడు.
సీత
అత్యంతానందముతో
అనగా
అయోధ్యలో
ఉన్న
ఆనందము
కంటే
మిథిలానగరమున
అనుభవించిన
వైభవములకంటే
ఎన్నియో
వేల
రెట్లు
సంతోషముతో,
సుఖముతో
వనవాసమును
అనుభవించుచున్నదని
తెలుపుడు.
నా
ప్రాణేశ్వరునితో,
వారి
ప్రియ
సోదరుడు
వీరాగ్రగణ్యుడైన
లక్ష్మణునితో
నేను
ఎట్టి
ఇక్కట్లునూ
లేక
భయాందోళనములూ
లేక
ఆనందముగా
వనవాసము
16
▾
Meaning
Keep
చేయుచున్నానని
తెలుపుడు.
మార్గాయాసము
ఏమాత్రమూ
లేక
ఇది
చాలా
అదృష్టజీవితమని
నేను
భావించుచున్నట్లు
తెలుపుము".
ఇట్లు
సీత
చెప్పిన
మాటలను
విని
సుమంతుడు
ఆ
సీతాదేవిని
తలయెత్తి
చూడలేక
పోయినాడు.
చెవులతో
వినలేకపోయినాడు.
నోటితో
జవాబు
చెప్పలేకపోయినాడు.
ఆమె
గుణములను
ఆమె
భావములను
తలంచుచు
ఇట్టి
రాజ్యలక్ష్మిని
దూరము
చేసుకొన్న
ప్రజలు
ఎంత
దురదృష్టవంతులో!
ఏ
జన్మమున
ఏ
పాపము
నాచరించిరో!
చిక్కిన
అవకాశమును
కూడనూ
దక్కించుకొనలేక
పోతిమికదా
అని
తనలో
తాను
చింతించుచు,
"రామా!,
అటులయిన
నాకు
ఒక
అనుజ్ఞ
దయచేయుడు.
నన్ను
మీతో
ఈ
వనమునందు
పదునాలుగు
సంవత్సరములు
ఉంచుకొని
నాచే
సేవలు
చేయించుకొనుటకైననూ
సెలవివ్వవలెను"ని
ప్రార్థించెను.
అందులకు
రాముడు
"సుమంతా,
నీకు
రాజనీతి
బాగుగా
తెలుసు.
నీవు
దశరథ
చక్రవర్తికి
మంత్రివి
కాని
నాకు
కాదు.
నీకు
ఆజ్ఞ
ఇచ్చునది
దశరథుడు
కానీ
నేను
కాదు.
అంతియేకాక
నీవు
ఈ
సమయమున
మహారాజును
విడచి
యుండుట
ధర్మము
కాదు.
నీవు
మహారాజునకు
కుడిభుజమువంటివాడవు.
కాన
నా
ఆనందమును
కోరుదువేని
నీవు
ఆలస్యము
చేయక
అయోధ్యకు
పొమ్ము.
ఆ
రీతిగా
చేసిన
నాకునూ,
నా
తల్లిదండ్రులకునూ
ఎంతయో
శాంతిని
చేకూర్చినవాడవు
కాగలవు"
అని
ఇంకా
ఎన్నియో
విధముల
తెలిపిన
రామవచనములను
మీరలేక,
"అయ్యో!
నావిధి
నన్ను
విడువకున్నదని"
బోరున
ఏడ్చి
మువ్వురిపాదములకు
నమస్కరించి,
పొంగి
పొరలివచ్చు
దుఃఖముతో
వెనుకకు
నడవలేక
నడుచుచున్న
సుమంతుని
చెయ్యిపట్టుకొని
రామచంద్రుడు
రథమువరకూ
తీసికొనివచ్చి,
రథములో
కూర్చొనబెట్టి,
సుమంతునీ
గుర్రములనూ
ప్రేమతో
పలుకరించి,
ఇక
కదలవలసినదిగా
ఆజ్ఞ
చేసెను.
సుమంతుడు
రథమును
నడిపించెను.
గుర్రములు
సహితము
వెనుకకు
తిరిగి
చూచుచు,
ఎంత
ప్రయత్నించిననూ
అవి
ముందుకు
నడవక
పోయినవి.
17
▾
Meaning
Keep
సకిలించుచూ,
సారేసారెకూ
వెనుకకు
లాగుచూ
వచ్చెను.
రాముని
వైపున
చూచుచూ
కంటి
నీరు
తుడుచుకొనుచూ,
తల
బాదుకొనుచూ
వెళ్ళుచున్న
సుమంతుని
నిషాదపతియైన
గుహుడు
చూచుతూ
తన
శిరస్సును
ఒక
చెట్టుకు
ఆనించి
భరించలేని
బాధపడజొచ్చెను.
ఈ
విధముగా
బలవంతముగా
రాముడు
సుమంతుని
పంపి,
భార్యయూ
తమ్మునితో
గూడి
గంగాతీరమునకు
వచ్చెను.
"నోరులేని
జంతువులే
రామవియోగమును
సహించలేక
ఏడ్చుచున్నవి
కదా!
ఇక
రాముని
కన్న
తల్లిదండ్రులు,
ప్రజలు
రామ
వియోగమును
ఎట్లు
భరింతురు,
సహింతురు?
ఆ
కౌసల్యాదేవి
ఎంత
దుఃఖించుచున్నారో
కదా!"
అని
గుహుడు
తనలో
తాను
చింతించుచూ,
అమితమైన
దుఃఖముతో
కుమిలిపోయెను.
ఇంతలో
సీతారామలక్ష్మణులు
గంగాతీరమునకు
నడుచుచుండుట
చూచి
గుహుడు
కూడనూ
వారిని
అనుసరించి
ఇవతలి
ఒడ్డులోవున్న
నావికుని
పడవ
ఇటువైపునకు
తెమ్మని
కేక
వేసెను.
తమ
యజమాని
కేకను
విని,
పడవను
నావికుడు
రామచంద్రుడున్న
స్థానమునకు
నడుపుకొని
వచ్చెను.
గుహుడు
ఆ
నావికుని
పిలిచి
"దశరథ
మహారాజు
కొమరుడైన
శ్రీరామచంద్రుడు
సతీసోదర
సమేతుడై
వనవాసము
చేయుచున్నాడు.
వారు
ఇప్పుడే
గంగానదిని
దాటి
అడవులలో
ప్రవేశింతురు.
కాన
నీవు
పడవను
శుభ్రపరచుమ"ని
ఆజ్ఞచేసెను.
దీనికి
పూర్వమే
రామచంద్రుని
చరిత్ర
ప్రజలద్వారా
విని
యుండుటచేత
నావికుడు,
"సరేకానీ,
ఆనాడు
తన
పాదము
సోకగనే
గుండు
స్త్రీగా
మారెనన్న
కథ
వినియుంటిమి
కదా?
ఆ
రామచంద్రుడేనా
ఇతడు?
లేక
ఇతను
వేరే
రామచంద్రుడా?"
అని
గుహుని,
సేవకుడైన
నావికుడు
ప్రశ్నించెను.
అందుకు
గుహుడు,
"నావికా,
నీకెంత
జ్ఞాపకము!
ఏనాడో
జరిగిన
విషయమును
నీవు
స్ఫురించి
నాకు
కూడనూ
స్ఫురణకు
వచ్చునటుల
చేసితివి".
అని
తక్షణమే
రామచంద్రుని
వైపునకు
తిరిగి,
"రామా!
చూచితివా?
మా
నావికుడు
తమ
మహత్తర
శక్తిని
మదియందు
మరువక
ఈ
సమయమున
దానిని
నాకు
జ్ఞాపకము
చేయుచున్నాడు.
ఆనాడు
గౌతముని
భార్యయగు
అహల్య
శాపమును,
నా
18
▾
Meaning
Keep
రాజ్యములో
ప్రజలు
ఎంత
చింతించుచున్నారో!
తమ
దివ్యశక్తులను
తెలుసుకొను
వారెట్టి
ధన్యులో
కదా!"
అని
తన
నావికుని
భక్తి
శ్రద్ధలను
వర్ధిల్లుచుండగనే,
రామచంద్రుడు
పడవలో
కూర్చొనుటకు
పడవ
చెంతకు
బయలుదేరెను.
ఇంతలో
నావికుడు
దగ్గరవచ్చి,
"రామచంద్రా!
నా
జన్మ
ధన్యమైనది.
ఏనాడో
వినిన
నామమును
ఈనాడు
సాక్షాత్తుగా
దర్శించగలిగితిని.
తమను,
తమ
దేవిని,
సోదరుని
గంగానది
దాటించునట్టి
అదృష్టము
నాకు
లభించుట
అనేక
జన్మల
పుణ్యఫలము.
అయితే
ఒకపరి
తమ
పాదతీర్థము
నా
శిరస్సున
చల్లుకొని,
తదుపరి
పడవను
నడిపింతును.
మొదలు
తమ
పాదములు
నా
చేతియందుంచుడు"
అని
ప్రార్థించెను.
ఈ
నావికుని
మాటలు
వినుచున్న
గుహుడు,
తమ
సేవకునకు
శ్రీరామచంద్రునిపై
ఇంత
భక్తి
శ్రద్ధలున్నవన్న
విషయము
తనకు
ఇంతకు
ముందెన్నడూ
తెలియనందున
ఆశ్చర్యపడి,
"ఆహ!
నావికుని
అదృష్టమెంతటిద"ని
తనలో
తాను
ఆనందించి,
"నావికా!
రామచంద్రుని
పడవలో
కూర్చొనబెట్టి
ఒక
పాత్రలో
పాదములు
కడిగి
తీర్థమును
స్వీకరించ
వచ్చుకదా!
రాముల
వారిని
నిలబెట్టి,
ఈ
రీతిగా
చేయుట
గౌరవము
కాదు"
అని
మందలించెను.
అందులకు
నావికుడు,
"ప్రభూ,
తమరు
శ్రీమంతులు.
నేను
అతి
పేదను.
ఈ
కార్యము
చేతనే
నేను
నా
సంసారమును
పోషించుకొనుచున్నాను,
వచ్చు
ధనము
దినబత్తెమునకే
చాలదు.
ఇక
అధిక
వ్యక్తులు
నా
తలపై
పడిన
వారిని
నేనెట్లు
పోషింతును?
కాన
తమరు
వేరుగా
భావించక
పడవపై
కూర్చొనకపూర్వమే
రామచంద్రుని
పాదములు
కడుగుటకు
ఆజ్ఞ
ఇవ్వండి"
అని
వేడుకున్నాడు.
నావికుడు
చెప్పు
మాటలు
రామునకు
అర్థమయి,
రాముడు
సీతను
చూచి
నవ్వుచూ
"చూచితివా?
ఈ
నావికుని
భయము!"
అని
హెచ్చరించినాడు.
అయితే
గుహునకు
ఏమీ
అర్థముకాక,
"నావికా!
నీ
మాటలు
నాకేమీ
అర్థమగుటలేదు.
వనవాసముచేయ
సంకల్పించిన
రామచంద్రుని
గంగను
దాటించుటకు,
నీ
సంసార
తాపత్రయములకూ
గల
సంబంధమేమి?
ఒక
వేళ
రామచంద్రుని
దగ్గర
19
▾
Meaning
Keep
పడవను
దాటించుటకు
అధిక
పన్ను
చెల్లించుమని
కోరుచున్నావా?
అట్లు
కోరుటలో
నీ
తెలివితక్కువనే
చెప్పవచ్చు,
లేదా
నీ
సంసారమునకు
అవసరమైన
ధనమేమైనా
కావలెనన్న
నేను
చెల్లింతును.
రామచంద్రుని
ఆశించవద్దు,
త్వరగా
సిద్ధము
కమ్ము"
అని
నావికుని
తరుమ
జొచ్చెను.
అందులకు
నావికుడు
"ప్రభూ!
రామచంద్రుని
పాదములో
ఏదో
ఒకవిధమైన
శక్తివున్నదని
వింటిని.
అతని
పాదము
సోకగనే
రాయి
స్త్రీలుగా
మారిన,
నా
పడవలో
అనేక
కళ్ళముక్కలున్నవి.
ఇవన్నీ
స్త్రీలుగా
మారిన,
నా
పడవలో
పుట్టిన
వారితో
నాకే
సంబంధము
కాని
ప్రభువుల
వారికెట్టి
సంబంధమూ
ఉండదు.
కాన
మొదలు
ఆ
పాదములను
కడిగిన,
నాకు
అట్టి
భయము
పోవును.
అంతియేకాక,
రామపాద
తీర్థము
నా
శిరస్సుపై
చల్లుకొనుటచే
నా
పాపము
నశించును.
కాన
మీరు
నా
వాంఛకు
అడ్డుచెప్పక
సెలవింద"ని
గుహుని
కోరెను.
గుహుడు
కొంత
యోచించుచున్నప్పటికినీ
రామచంద్రుడు
చిరునవ్వుతో
నావికుని
పిలిచి,
తన
పాదములు
నావికుని
అరచేతులందు
పెట్టి,
"నాయనా!
నీ
ఇష్ట
ప్రకారము
పాదములను
కడుగుమ"ని
ఆజ్ఞాపించెను.
అంత
నావికుడు
రామచంద్రుని
పాదములను
హస్తములందుకొని
గంగా
జలముతో
బాగుగా
వ్రేళ్ళసందులయందు
కూడనూ
అతిజాగ్రత్తగా
కడిగి
ఆ
పవిత్రజలమును
శిరస్సున
చల్లుకొని
తన
పడవయంతట
ఆ
జలమును
ప్రోక్షించెను.
అంత
నావికుడు
తృప్తితో
పరమానందపడి
రామచంద్రుని
పడవలోనికి
చేయిపట్టుకొని
ఎక్కించుకొనెను.
రామచంద్రుడు
సీతను
తన
హస్తములతో
పడవలోనికి
దాటించుకొని
లక్ష్మణుని
కూడా
తనతో
కూర్చొనబెట్టుకొని
నావికుని
అజ్ఞానమును,
భక్తినీ
ఆనందముతో
ఒకరితో
నొకరు
మాట్లాడుకొనుచూ
ఉండగా
పడవ
కదిలెను.
గుహునితో
అనేక
విషయములను
తెలుపుచూ
కాలమును
గడుపుచున్న
రామలక్ష్మణులు
కాలము
తెలియకనే
గట్టు
చేరిరి.
రామచంద్రుడు
ఆ
నావికునకు
వేతనము
నిచ్చుటకు
తనచెంత
చిల్లిగవ్వయైననూ
లేనందున
చాల
సిగ్గుపడినటుల
నటించెను.
రామ
20
▾
Meaning
Keep
హృదయమును
ఎరిగిన
జానకీ
తన
వ్రేలియందలి
ఉంగరమును
తీసి
రామహస్తముల
యందుంచెను.
రాముడు,
"ఓయీ!
నావికా,
ఇదిగో
నీ
వేతనము,
పుచ్చుకొనుమ"ని
పలికెను.
అంత
నావికుడు
రామచంద్రుని
పాదములపై
బడి
"రామా!
ఈనాడు
నా
జన్మ
సాఫల్యమయినది.
నా
సర్వపాపములూ
పటాపంచలయినవి.
నా
భవరోగము
తీరినది.
అనేక
జన్మలుగా
శ్రమపడుచుండిన
నా
శ్రమకు
నేడు
నా
విధాత
నాకు
ప్రాప్తించి
నా
వంశమునే
తరింపజేసిరి.
నాథా!
మీ
అనుగ్రహ
మొక్కటుండిన
చాలును,
తిరిగి
తమరు
వచ్చునపుడు
నన్ను
మరువక
ఇట్టి
సేవ
నాకు
కటాక్షించిన
ధన్యుడనయ్యెదను"
అని
పాదములపైబడి
ఆనందబాష్పములతో
ప్రార్థించెను.
అంత
రామలక్ష్మణులు
పలువిధముల
ఆ
నావికుని
ఓదార్చి
బోధించి
వేతనమును
పుచ్చుకొమ్మని
నచ్చజెప్పిరి.
అయితే
ఆ
నావికుడు
"స్వామీ!
రామచంద్రా,
నేను
మిమ్ముల
నొక్కరినీ
ఈ
చిన్న
గంగానది
దాటించినందుకే
వేతనము
పుచ్చుకొన్న
తమరు
కోట్లకు
కోట్లకు
నా
తరమువారలను,
నాతోటి
మానవులను
సంసార
ప్రవాహమును
దాటించి
మోహసాగరమును
దాటించుచున్నారే,
ఇందుకు
తమరేమి
వేతనమును
పుచ్చుకొనుచున్నారు?
ఈ
స్వల్ప
కార్యమునకు
నేనెంతో
అదృష్టవంతుడనని
ఆనందించుచుండ
నా
ప్రాప్తిని
దూరము చేయుట
తమకు
భావ్యము కాదు,
రామా!"
అని
దీనుడై
ప్రార్థించెను.
రాముని
హృదయము
కరిగి
అతనిని
తొందరపెట్టుట
మంచిదికాదని
తలంచి
హృదయపూర్వకంగా
ఆశీర్వదించి
అతనిని
దీవించి
పంపెను.
రామలక్ష్మణులు
తమ తమ
విల్లులు
ఒక
వస్త్రముపై
నుంచి
స్నానము
చేసిరి.
తదుపరి
సీత
స్నానము
చేసి
చేతులు
జోడించి
గంగను
అనేక
విధముల
ప్రార్థించి,
"నా
నాధునితో
తిరిగి
పదునాలుగు
సంవత్సరములు
ఆనందముగా
అడవులలో
గడిపి
నిన్ను
దర్శింతును,
తిరిగి
నీ
నిర్మల
ప్రేమజలమును
నా
శిరస్సున
ప్రోక్షించుకొందున"ని
చెప్పెను.
రామచంద్రుడు
గుహుని
పిలిచి,
"నాయనా!
ఇప్పటికే
నీ
కాలమును
నేను
అధికంగా
వినియోగించుకొంటిని.
నీవిక
నీ
గ్రామమునకు
వెళ్ళుమ"ని
ఆజ్ఞ
చేసెను.
21
▾
Meaning
Keep
ఆ
మాటలు
వినిన
క్షణముననే
గుహుని
ముఖము
వాడిపోయెను.
కంటిధారలు
కారెను.
చేతులు
జోడించుకొని,
"రామా!
నా
మాటలు
ఆలకింపుము,
కొంతకాలము
నేను
తమతోవుండి
ఈ
అరణ్యమున
మార్గములు
తెలిపి
తమ
సేవను
చేసుకొందును.
దీనిని
కాదనక
అంగీకరించుము"
అని
ప్రార్థించెను.
రామచంద్రుడు
గుహుని
ప్రేమకు
భక్తికి
ఆనందించి
తన
వెంట
తీసుకొని
వెళ్ళెను.
కొంతదూరము
సీతా రామ లక్ష్మణ గుహులు
నడచి
సాయంకాలమునకు
ఒక
విశాల
వృక్షచ్ఛాయలో
విశ్రాంతి
తీసికొనిరి,
ఆ
వృక్షముక్రింద
సీతా రాములు
కూర్చొనుటకు
యోగ్యమగునట్లు
గుహుడూ లక్ష్మణుడూ
స్థలమును
శుభ్రపరచిరి.
చెంతనే
రామచంద్రునికి
వినియోగమగుటకై
ముఖములు
వికసించుకొని
కాచుకున్నట్లు
కనిపించుచున్న
ఫలములు,
రేగిపండ్లు
గుహుడూ లక్ష్మణుడూ
పెరికితెచ్చి
విశాలమైన
ఆకులలో
ఉంచి
సీతారాముల
కందించిరి.
అంత
రాముడు,
"లక్ష్మణా!
సంధ్యావందనము
చేయక
ఫలములను
ఆరగించవచ్చునా?"
అని
తెలిపి
లక్ష్మణుని
వెంటబెట్టుకొని
తీర్థ రాజమగు
ప్రయాగను
సందర్శించి
స్నానమాచరించిరి.
వెనుకకు
వచ్చి
గుహునకునూ
తీర్థ రాజమైన
ప్రయాగయొక్క
మహత్తరమైన
ప్రభావమును
లక్ష్మణునకునూ
తెలుప
దొడగెను.
"ప్రయాగయొక్క
వైభవము,
మహత్వము
యెంత
వర్ణించినను
వీలుకావని,
అది
సమస్త
పాపములను
నాశనమొనరించున"ని
తెలిపెను.
అంత
సీతను
దోడ్కొని
లక్ష్మణ గుహులతో
కలిసి
భరద్వాజ ఆశ్రమమును
ప్రవేశించిరి.
ఎంతో
కాలముగా
రామ దర్శనమునకై
వేచి
యుండినటుల
భరద్వాజ మహాఋషి,
ఆశ్రమ ద్వారమునకు
ఎదురుగా
రావటము
చూచి
రామచంద్రుడు
ఆ
మునికి
నమస్కరించెను.
భరద్వాజుడు
ఎంతో
ఆప్యాయముగా
రాములను
కౌగిలించుకొని
అతనిని
ప్రేమతో
తన
ఆశ్రమములో
ప్రవేశించమని
కోరెను.
రామచంద్రుడు
అందులకు
ఆనందించి
ఆశ్రమము
లోపలవెళ్ళి
వారి వారి
హోదాలకు
తగినటుల,
పూర్వమే
సిద్ధపరిచిన
ఆసనములపై
కూర్చొనబెట్టుకొని
భరద్వాజుడు
కుశల ప్రశ్నలను
అడిగి,
తన
మనోభీష్టము
ఈనాటికి
ఈడేరినదని
22
▾
Meaning
Keep
ఋషి
ఆనందించెను.
తమ
శిష్యులతో
కంద మూలాదులను
తెప్పించి
సీతా రామలక్ష్మణ గుహులకు
ఇవ్వమని
తెలిపెను.
ఈ
విధముగా
ఋషి,
శ్రీరాముల
సేవలు
చేయుచూ
ఆ
రాత్రి
అక్కడ
గడిపెను.
తెల్లవారి
రామచంద్రుడు
ప్రయాగ స్నానమునకు
వెళ్ళుతూ
ఋషిని
కూడనూ
రమ్మని
కోరగా,
భరద్వాజమహర్షి,
"స్వామీ!
రామచంద్రా!
ఏ
దివ్యదర్శనముకై
నేనీ
ప్రయాగ ఒడ్డున
నివసించి,
తపస్సు
చేసితినో,
ఏ
పవిత్ర స్పర్శకై
నేను
యజ్ఞయాగాది క్రతువుల
నాచరించితినో,
ఏ
సంభాషణల నిమిత్తమై
జపధ్యానములు
చేసితినో,
ఆ
దర్శన సంభాషణ స్పర్శలు
నేడు
ఫలించెను.
ఇక
నాకు
స్నాన పానాదులు
అవసరము లేదు.
రోగము
తీరిన
తదుపరి
ఔషధము
సేవించు
మూర్ఖుడను కాదు,
నా
భవరోగము
తీరెను.
భగవంతుని
గాంచితిన"ని
తనలోని
నిజభావమును
ఆనంద బాష్పములతో
రామచంద్రునకు
తెలుపుకొనుట
చూచి,
విని,
గుహుడు
పరమాశ్చర్యమునొంది,
"అహో!
నేనెంత
అదృష్టవంతుడ"నని
తనలో తాను
ఆనందపడెను.
రామచంద్రుడు
తన
దైవత్వమును
మరుగు పరచుకొనుచూ,
తాను
సామాన్య మానవ మాత్రుడుగా
భావించునటుల
నటించదొడగెను.
భరద్వాజ మహర్షి
ఎన్ని
విధముల
రామతత్వమును
వర్ణించిననూ
ఆ
రాముడు
ఎవరో
వేరే
రాముడన్నట్లు
తాను
వినుచూ,
"ఓ మునివరా!
మీచే
నాదరింపబడిన
వారందరూ
గొప్పవారే.
అట్టివారందరూ
సకలగుణ సంపన్నులు
కదా"
అని
జవాబు
చెప్పుచున్న
రామవాక్యములకూ
ముని
వాక్యములకూ
ఆశ్రమములో
చేరిన
బ్రహ్మచారులు,
సిద్ధపురుషులూ,
యోగులూ,
మునులూ
వినుచూ
ఆనందించుచూ,
ఆశ్చర్యమును
ప్రకటించుచూ
ఉండిరి.
ప్రయాగస్నానము
నాచరించి,
ముని అనుమతిని
తీసికొని
సీతా రామలక్ష్మణులు
గుహునితో
కూడి
వనమునకు
ప్రయాణమయిరి.
భరద్వాజుడు
తన
ఆశ్రమము
వీడి,
ప్రయాగవరకూ
వచ్చి,
రామచంద్రుని
కౌగిలించుకొని
వీడ్కోలు
చెప్పెను.
అపుడు
రాముడు
ముని ఆనతిని
కోరి,
"స్వామీ!
మేము
ఏ
23
▾
Meaning
Keep
మార్గమున
పోయిన
మంచిదో"
చెప్పుడనెను.
ముని
అందులకు
నవ్వి
"రామచంద్రా!
నీకు
తెలియని
మార్గములు
ఈ
లోకమున
లేవుకదా?
మాయామానుష వేషధారివయి,
ఇన్ని
నాటకము
లాడుచున్నావు!
సరి,
అడిగితివి
కనుక
చెప్పుట
నా
కర్తవ్యము"
అని
ఋషి శిష్యులను
పిలిచి,
నలువురిని
రామునికి
దారి
చూపుటకై
పంపెను.
ఆ
నలువురూ
ఈ రూపేణ
రామచంద్రునితో
ప్రయాణము చేయుట
ప్రాప్తించినదని,
లోలోన
ఆనందించిరి.
ఇది
మా
పూర్వజన్మపుణ్యమని
తలంచిరి.
వారు
ముందు
దారిని
చూపుతూ,
నడచుచూ
వెళ్ళుచుండ,
సీతా రామ లక్ష్మణులు
గుహునితో
వెనుక
నడువదొడగిరి.
ఈ రీతిగా
ఋషి శిష్యులు
నలువురూ,
యమునాతీరమువరకు
వచ్చి
రామచంద్రుని
ఆజ్ఞ
తీసుకొని
వెనుకకు
వెళ్ళలేక
వెళ్ళవలసి
వచ్చెను
కదా
అని
విచారముతో
వెనుకకు
తిరిగిరి.
సీతారామలక్ష్మణులు
ఆ
ఋషి శిష్యుల
సహాయమునకు
ఆనందించి
వారిని
మనసారా
దీవించి
పంపిరి.
యమునలో
స్నానము చేయుటకు
సంసిద్ధమయిరి.
ఇంతలో
యమునాతీరమున
నివసించు
గ్రామప్రజలు
ఆ
సుందర విగ్రహములను
చూచి
వీరెవరా
అని
ఆశ్చర్యపడుచూ
వీరు
ఎక్కడినుండి
వచ్చిరో,
వీరి
నామ
ధేయము
లేమో,
అని
అడుగుటకు
సంకోచించుచూ,
వారిలో వారు
గుసగుసలాడుచూ
ఉండిరి.
సీతా రామ లక్ష్మణులు
ఎవ్వరినీ
చూడక,
వారి
కార్యములు
వారు
ముగించుకొని,
గట్టునకు
వచ్చి,
గుహుని
పిలిచి,
"నాయనా!
నీవు
వచ్చి
చాలా
సమయమైనది.
ఇంకా
అధిక కాలము
మాతో
గడుపుట
మంచిదికాదు.
నీ
కర్తవ్యములను
నీవు
నిర్వర్తించుటకొనుట
మంచిది.
నీవిక
గృహమునకు
వెళ్ళుమ"ని
రాముడు
సెలవిచ్చెను.
ఆ
మాటలకు
గుహుడు
మారుమాటాడలేక
పోయినాడు.
"చిక్కిన
చింతామణిని
జారవిడుచుకొనువారుందురా?
నేనెంత
దురదృష్టవంతుడనో?"
అని
చింతించి,
రామాజ్ఞను
కాదనలేక
సీతారామ లక్ష్మణులకు
నమస్కరించి
వారి
పాద ధూళిని
శిరస్సుపై
చల్లుకొని
గుహుడు
వీడలేక
వీడెను.
24
▾
Meaning
Keep
గుహుడు
వెళ్ళిన
కొంతసేపటికి
సీతారామలక్ష్మణులు
ప్రయాణమును
ప్రారంభించిరి.
ఇంతలో
నాగలోకమును,
దేవలోకమును
మించినట్లుగా
ఒక
పెద్ద
పట్టణము
వారి
కంటికి
కనిపించెను.
అది
ఏమని
చింతించుచూ
పట్టణమును
సమీపించిరి.
సమీపించుకొలది
ఆ
పట్టణముయొక్క
అందమూ,
దాని
చుట్టూవున్న
అతి సౌందర్యమైన
వనములూ
వారినెంతో
ఆనందమున
ముంచెను.
దగ్గరకు
వెళ్ళగనే,
అది
అమరావతీ పట్టణమని
తెలిసి
మరింత
ఆనందించిరి!
నిజముగా
ఇందులో
నివసించువారు
సురలేకాని
మానవులు
కాదని
అనిపించెను.
పట్టణమును
కన్నుల విందువుగా
చూచుచూ
ఒక
వృక్షఛాయలో
కూర్చొన్న
సీతారామలక్ష్మణులను
ఆ
పట్టణవాసులు,
అతి విచిత్రముగా
చూచుచూ,
"వీరెవరో?
దేవలోకమునుండి
దిగివచ్చిరా?"
అన్నట్లు
ఆశ్చర్యపడుచూ
తక్షణమే
పట్టణములో
ప్రవేశించి
ఇట్టివారి
రాక
మన
గ్రామమునకెంతో
శోభ"
అని
తెలిపిరి.
విన్నవారందరూ
గుంపులు గుంపులుగా
వచ్చి
చూచి,
పాలందించువారు.
ఫలములందించువారు,
రెప్పవాల్చక
చూచువారు,
అనేక విధముల
సీతా రామ లక్ష్మణులను
దర్శించుచూ
నిలుచొనిరి.
వచ్చిన
వారెవ్వరూ
వెనుకకు
పోవలేకపోయిరి,
పోవుటకే
మనసొప్పక
నిలిచిరి.
అందులో
ఒకరు
ధైర్యము
చేసి
ముందునకు
వచ్చి
సీతారామ లక్ష్మణులను
చూచి,
"అయ్యలారా!
మీ
చక్కని
శరీరములు
జూడ
రాజపుత్రుల
లక్షణములు
కనిపించుచున్నవి.
అయితే,
మీరు
ఈ
సుకుమారితో
కూడి
పాదచారులై
ఈ
దుర్గమమైన
మార్గమున
వచ్చుచున్నారు.
పర్వతములూ,
నదులూ
దాటి
కఠిన
ప్రయాణము
సలుపుచుండుటలో
మీరు
సామాన్య మానవులవలె
అనుమానపడవలసి
వచ్చుచున్నది.
సింహములు,
పులులూ,
మదగజములూ
సంచరించు
ఈ
కారడవులలో
ఈ
సుందర సుకుమారితో
ప్రయాణము
ఎట్లు
చేయుచున్నారో
అర్థమగుటలేదు.
మీకు
బంధుమిత్రులెవరూ
లేరా!
లేక
కన్నవారూ,
పెంచిన
వారైననూ
లేకపోయిరా?
నిజముగా
వారే
యుండి
యుండిన
25
▾
Meaning
Keep
మిమ్ములను
వీడియుందురా?
మిమ్ముల
నిట్లు
పంపియుందురా?"
అని
అనేక విధముల
రామచంద్రుని
ప్రశ్నించిరి.
ఒక
వనిత
ముందునకు
వచ్చి,
"ఓ రాజకుమారా!
నేనొక
విన్నవము
చేయుచున్నాను.
స్త్రీ స్వభావము
కనుక
అడుగుటకు
భయపడుచున్నాను.
నా
అవినయమును
మన్నింపుము.
మేము
గ్రామస్థులము.
మాకు
మీ
మాటల నేర్పు
తెలియదు.
మీ
దేహములు
చూడ
కాంతులతో
నిండి
మరకతమును
బంగారమును
తమ తమ
కాంతుల
నెరవు
తెచ్చుకొన్నట్లు
కనబడుచున్నది.
ఒకరి
శరీరము
శ్యామలము,
మరొకరి
శరీరము
గౌరవర్ణము,
మీ
చక్కదనమునకు
కోటి
మన్మథులు
సైతము
సిగ్గుపడగలరు.
ఇక
ఈ
సుముఖి
మీకేమి
కావలెనో
తెలియదు.
ఆమె
సౌందర్యము
సాక్షాత్
రతీదేవి
ఉట్టిపడినటుల
కనిపించుచున్నది.
ఆమె
గుణగణములు
వినయవిధేయతలు
పట్టిచూడ
మాకెంతయో
సిగ్గుగా
వున్నది.
కాన
మీరు
ఎవరో,
ఎందు నిమిత్తమై
ఇటు
వచ్చితిరో,
తెలిపి
మా
అనుమానమును
తీర్చుడు,"
అని
ప్రార్థించెను.
ఈ విధముగా
స్త్రీ, పురుషులు
అతి విచిత్రముగా
వారలను
చూచుచూ
వారలను
వేయు
ప్రశ్నలను
వింటూ
రామలక్ష్మణులు
తమలో తాము
నవ్వుకుంటూ
ఉండిరి.
స్త్రీల వైపు
తిరిగి
జానకీదేవి,
"ఓ చెలియలారా!
సహజ స్వభావుడును
పచ్చని
శరీరము
గలవాడే
లక్ష్మణుడు.
అతడు
నా
మరది,
చిన్నవాడు,
ఇక
నీలమేఘచ్ఛాయతో
లోకమునే
మోహింపజేయుచున్న
కమలలోచనుడు,
నిడుద
భుజములు
గలవాడు,"
అని
రామునివైపున
తిరిగి
"అతను
నా
ప్రాణనాధుడు"
అని
తెలిపి
తల
క్రిందికి
దించుకొనెను.
అంత
మరొక
యువతి
"అమ్మా!
మీ
పేరు
చెప్పరైతిరికదా?"
అని
ప్రశ్నించ,
"తన
పేరు
జానకి"
అని
చెప్పగనే,
అక్కడచేరిన
వారందరూ
ఒకరి
మొఖమును
ఒకరు
చూచుకొని,
"అమ్మా!
పార్వతీ పరమేశ్వరులవలె
మీ
దాంపత్యము
అనుకూలముగా
భూమిని
శేషుడు
ధరించుచున్నంత వరకూ
ఆచంద్రార్కము
సౌభాగ్యవతిగ
నుందువుగాక!"
అని
ఏక కంఠముతో
ఆశీర్వదించిరి.
రాముడు,
26
▾
Meaning
Keep
చేరిన
మగవారితో
కుశల ప్రశ్నలు
సలిపి
తమరాక
వనవిహారమనియూ
ఈ
ప్రయాణము
మా
కత్యంత
ఆనందముగనూ,
సుఖముగనూ
ఉన్నదనియు
మా
కెట్టి
శ్రమలు
కూడనూ
లేవనియూ
తెలిపి
వారలతో
సెలవు
తీసుకొని
తిరిగి
వనమునకు
ప్రయాణము
ప్రారంభించెను.
ఇక
చేయునది లేక,
చేరిన
స్త్రీ పురుషులు
గృహాభిముఖులయిరి.
సీతారామలక్ష్మణులు
ఆ
గ్రామస్థులగు
స్త్రీ పురుషులు
వేసిన
ప్రశ్నలను
గురించి
మాట్లాడుతూ
వారిలో వారు
ఆ
ప్రియులయొక్క
ప్రేమానురాగములను
వర్ణించుచూ
దారిన
నడచుచుండిరి.
ఇంతలో
సీత
మార్గాయాసముచే,
బడలియుండుట
రాముడు
చూచి,
ఒక
చల్లని
వటవృక్షము
క్రింద
విశ్రమించెను.
ఆ
వృక్షమునకు
సమీపమున
చల్లని
ప్రవాహము
కలదు.
తదుపరి
లక్ష్మణుడు
వెళ్ళి
కొన్ని
ఫలములను
ఏరుకొని
రాగా
వాటిని
మువ్వురు
భుజించి
క్రిందనే
విశ్రమించిరి.
ప్రాతఃకాలమున
లేచి
స్నానసంధ్యాదులు
పూర్తిగావించి
ప్రయాణమును
సాగించిరి.
దట్టమైన
అరణ్యము,
భయంకర
పర్వతములు
సెలయేళ్ళ
భయంకర
శబ్దముతోవున్న
ఆ
అరణ్యగర్భమును
చేరిరి.
అక్కడ
కొంతదూరములో
నొక
సుందరమైన
పూలమొక్కలతో
ఒక
ఆశ్రమము
కనిపించెను.
దాని
దగ్గరకు
అతివేగముగా
నడిచిరి.
అది
వాల్మీకి ఆశ్రమము.
ఒక వైపున
ఎత్తయిన
పర్వతము.
మరొక వైపున
లోతైన
ప్రవాహము.
ఈ రెండింటికీ
మధ్య
సుందరమైన
ఆశ్రమము.
అతి శోభాయమానముగా
ఉండెను.
మనోహరమగు
ఆ
ఆశ్రమమును
చూచి
సీత
ఎంతయో
ప్రశాంతముగా
తన
హృదయము
చల్లబడినటుల
భావించెను.
వారు
ఆశ్రమ తోటలో
చేరిరన్న
వార్త
శిష్యులద్వారా
విని
వాల్మీకి
లోనుండి
బైటకు
వచ్చెను.
వచ్చిన
ఋషిని
సీతా రామ లక్ష్మణులు
చూచి
నమస్కరించిరి.
ఋషికూడా,
పాత పరిచయము
కలవారివలె,
చెంతకువెళ్ళి
రాముని
కౌగిలించుకొని,
లోనికి
మువ్వురినీ
ఆహ్వానించెను.
ప్రాణ ప్రియుడగు
రాముని,
లక్ష్మణుని,
సీతను
సుఖాసనములపై
కూర్చుండబెట్టి
కందమూల
ఫలములను
దెప్పించి
వారి
27
▾
Meaning
Keep
మువ్వుర
ఎదుట
బెట్టించెను.
సీతారామ లక్ష్మణులు
వాల్మీకి ముని
కోరిక
ననుసరించి
వాటిని
భుజించి
సంతోషించిరి.
వారు
ఎదుట
కూర్చొని
భుజించుచుండ
వాల్మీకి మహర్షి
కన్నుల
కరువుతీరా,
రామచంద్రుని
చూచుచూ
తనలో తాను
అంతులేని
ఆనందము
పొందెను.
చిరకాలవాంఛ
నెరవేరెనని
ముని
లోలోన
పరమానందభరితుడయ్యెను.
రామచంద్రుడు,
అతి వినయమున
మునీశ్వరునితో
ఇట్లు
విన్నవించెను.
"మునీంద్రా!
మీరు
త్రికాలజ్ఞానులు.
నేను
ఏ
కారణముచే
ఈ
అరణ్యమును
ప్రవేశించితినో
మీకు
కరతలామలకమే.
అయిననూ
నా
కర్తవ్యమును
నేను
నెరవేర్చుకొనుట
నా
ధర్మ"మని
రాణి కైకేయి
తనను
వనమునకు
పంపిన
విషయమును,
తండ్రి యొక్క
వాగ్దానమును,
భరతుని
రాజ్యాభిషేకమును
మొదలయిన
విషయములను
వరుసగా
విన్నవించెను.
ముని
చిరునవ్వులతో
తన
ఆనందమును
వెలిబుచ్చి,
"రామా!
వారి
కోరికలు
ఏ రీతిగా
నెరవేరెనో,
అటులనే
నేడు
నా
కోరిక
కూడా
ఫలించెను.
మా
తపస్సు
నేటికి
పండెను.
కైకకు
మా
కృతజ్ఞతా పూర్వకమైన
ఆనందమును
అందింతుము."
అని
మాటలను
ముగించి,
కన్నులు
మూసుకొని
తనలోతాను
పొంగిపొరలు
ఆనందమును
అణగద్రొక్కుకొని,
ఆనందబాష్పములను
నేత్రములనుండి
రాల్చెను.
శ్రీరాముడు.
"స్వామీ!
ఏ
స్థలమున
మమ్ము
నివసింపుమని
తాము
ఆజ్ఞచేసిన
ఆ
స్థలమున
మేము
నివసించెదము.
ఎవ్వరికీ
బాధ
కలుగక,
ఋషులకు
ఎట్టి
ఇబ్బందిని
చేకూర్చక,
నష్టకష్టములు
వాటిల్లకుండ,
ఈ
సంగతులను
తాము
విచారించి
మాకు
యోగ్యమైన
స్థానమును
తెలుపుడు.
అక్కడ
ఒక
పర్ణశాలను
ఏర్పరచుకొని
కొంతకాలము
గడుపుదుము"
అని
నిర్మలాంతఃకరణముతో
పలికిన
ప్రియవచనములను
ముని
విని,
రామునితో
నిట్లు
చెప్పెను.
"ఓ రామా!
నేను
ధన్యుడను.
నీవు
రఘుకులమునకు
సేతువు
వంటివాడవు.
నీవు
ఎందులకిట్లు
పలుకుచున్నావు?
నీవు
వేద మార్గములను
పాలించువాడవు,
రక్షించువాడవు.
28
▾
Meaning
Keep
జానకి
నీ
మాయ.
నీ
ఇచ్ఛానుసారము
ఆమె
జగత్తుల
సృష్టి స్థితి సంహారముల
జేయుచుండును.
చరాచరముల
కాధారభూతుడు,
సహస్ర శిరస్సులుగల
ఆదిశేషుడే
లక్ష్మణుడు.
ధర్మసంస్థాపనకై
దేవతల
మనోభీష్టమును
సాధించుటకు
మీరు
ఈ
రూపమును
ధరించితిరి.
రాక్షసహృదయాలను
త్వరలో
హతమార్చుదురు.
సాధుత్వమును
పోషింతురు.
ఓ రామా!
ఈ
లోక వ్యాపారములకు
నీవు
సాక్షీభూతుడవు.
జగత్తు
దృశ్యము,
నీవు
సాక్షివి.
దేవతలు
సహితము
నీ
తత్త్వమును
గుర్తించలేరు.
ఇక
సామాన్యులు
నిన్ను
తెలిసికొనగలరా?
ఎవరికి
నీ
వరప్రసాదమైన
జ్ఞానము
లభించునో,
వారే
నిన్ను
తెలిసికొనగలరు.
నిన్ను
తెలిసికొనినవారే
నీ
సామీప్యమును
బొందుదురు.
నీకు
వికారములు
లేవు
దేవసజ్జనహితార్థము
నీవు
మనుజ రూపమును
ధరించి
సాధారణ రాజువలె
మాటలు
చెప్పి.
చర్యల
జేయుచున్నావు.
నీ
చర్యలు
చూచి
మూర్ఖులు
మోసపోవుచున్నారు.
నీవు
చెప్పిన
ప్రకారము
సంచరించెదవు.
నీ
మాటలకును
క్రియలకును
భేదము
లేదు.
నీ
వాడించు
ప్రకారము
మేము
ఆడువారమే
కాని
నిన్ను
ఈ రీతిగా
చేయుమని,
ఈ
స్థానమందుండుమని
శాసించువారెవ్వరు?
రామా!
మాటలతో
మునులను
సహితము
మాయలో
త్రోయచూచుచున్నావా?
ఏమి
నీ
లీల?
ఏమి
నీ
నటన?
నీవు
కపటనాటక సూత్రధారివి.
నివాస యోగ్యమగు
స్థలమును
చూపుమని,
తెలుపుమని
నన్ను
నీవు
కోరుటలో
ఉన్న
అర్థమేమో
బోధపడుటలేదు.
నేను
ఏ
స్థలమును
చూపించగలను?
నీవులేని
స్థలము
ఒక్కటి
కలదా?
దీనికి
జవాబు
తెలుపుము.
అట్టి
స్థలముండిన,
తప్పక
నే
చూపుదును"
అని
రాముని
చూచుచూ,
ఆనందముతో
స్తంభించిపోయెను.
ఇట్లు
పలికిన
మునీశ్వరుని
ప్రియ వచనములను
రాముడు
విని
లోలోన
నవ్వుకొనెను.
పునః
మహాముని
మందహాసముతో
మృదుమధుర వాక్యముల
జెప్పనారంభించెను.
"ఓ రామా!
నీ
నిజమైన
నివాసస్థానము
భక్తుల
హృదయము.
ఇక
నరాకారమునకు
ఉత్తమ స్థానము
జెప్పెదను
వినుము.
అచ్చట
నీవు
29
▾
Meaning
Keep
సీతాలక్ష్మణులతో
కూడి
నివసింపవచ్చును.
నీ
దివ్యచరిత్రము
అనునట్టి
మహానదులు
ప్రవేశించుటకు
ఎవని
చెవులు
సముద్రము
వంటివో,
ఎవని
చెవులు
నిరంతరము
నీ
కథలతో
నిండియుండునో,
ఎవని
జిహ్వ
నీ
నామముతో
కదులుచూ
కంఠమునుండి
నీ
మృదుమధుర శబ్దమును
చవి చూచుచుండునో,
ఎవని
నేత్రములు
చాతకములవలె
నీలమేఘము వంటి
నీ
స్వరూపమును
చూచుట కభిలషించి
అట్టి
రూపమును
చూడ
నలుదిక్కులా
వెతుకుచుండునో,
అన్వేషణ
జరుపుచుండునో
అట్టివానిలో
మీరు
మువ్వురూ
సదా
నివసించ వచ్చును.
రామా!
ఇంకనూ
వివరించి
చెప్పగోరుదువేని,
ఎవడు
అవగుణములను
విడచి,
సుగుణములను
గ్రహించునో,
ఎవడు
నీతి నిజాయితీల మార్గమున
సంచరించునో,
ఎవడు
లోకమర్యాద
నొందునో,
ఎవడు
త్రికరణ శుద్ధిగా
సర్వమూ
నీ
సృష్టిగా
భావించి,
లోకమే
నీ
ఆకారముగా
విశ్వసించి
ఆచరించునో
అట్టివాని
హృదయము
నీ
నివాసము.
అయితే,
సమయానుసారము
నేడు
నీవు
మానవాకారమున,
మాతా పితల
ఆజ్ఞను
నెరవేర్ప
సంకల్పించితివి.
కనుక,
నీవు
ఆ
దృష్టితోనే
నన్ను
అడిగితివి
కనుక,
నేనునూ
సామాన్యస్థితిలో
తెలుపుచున్నాను.
చిత్రకూటపర్వతముమీద
నివసించవచ్చును.
అన్ని విధములా
అచ్చట
అనుకూలము.
అంతియే కాదు,
ఆ
పుణ్యస్థలము
మనోహరము.
అచ్చట
సింగములు
గజములు
సహితము
నిర్వైరముగ
విహరించును.
వేదములలో
చెప్పిన
మందాకినీనది
అచ్చట
ప్రవహించుచున్నది.
అత్రి మొదలగు
మహామునులు
అచ్చట
నివసించుచుందురు.
నీవు
వెళ్ళి
వారి
ఆశ్రమములను
కూడనూ
పావన మొనర్పుము.
ఆ
పవిత్ర పర్వతమునకు
పుణ్యపావననదీమతల్లికి,
సార్థకనామమును
అందించుము.
అని
తెలుపగనే,
వాల్మీకి మహాముని
ప్రియవచనములను
స్వీకరించి,
ముని
అనుమతిని
బడసి
శ్రీరాముడు
సీతాలక్ష్మణులతో
కలసి
ప్రయాణమై
పోయెను.
అతి శీఘ్రకాలములోనే
మందాకినీ నదిని
దర్శించి,
అందులో
మువ్వురూ
స్నానాదులాచరించి
వృక్షచ్ఛాయల
విశ్రమించి
తదుపరి
ఫలములను
భుజించి,
ఆ
30
▾
Meaning
Keep
మనోహరమైన
వనమున
నలుమూలలా
సంచరించి
ఒక
స్థానమున,
"ఓ లక్ష్మణా,
ఈ
మనోహరమైన
వనమున,
ఏది
మంచిది,
ఏది
చెడ్డది
అని
నిర్ణయించలేకపోవుచున్నాను.
ఈ
వనమున
మనము
కొంతకాలము
నివసించవచ్చును
కనుక,
నీవే
ఆ
స్థలమును
నిర్ణయించి
ఒక
పర్ణశాలను
నిర్మింపు"మని
రాముడు
లక్ష్మణునకు
ఆజ్ఞ
ఇచ్చెను.
తక్షణమే
లక్ష్మణుడు
భరించలేని
బాధతో
రాముల
పాదములపై
వ్రాలి,
"అన్నా!
నేనేమి
అపరాధము
చేసితిని?
ఇది
నా
పాపఫలమా!
లేక
పరీక్షించజూచుచున్నావా?
లేక
పరిహాసము
లాడుచున్నావా?"
అని
చాలా
విచారముతో
తలక్రిందికి
వంచుకొని
బాధ
పడుచుండెను.
రాముడు
ఆశ్చర్యమున,
లక్ష్మణుని
దగ్గరకు
తీసుకొని
"తమ్ముడా!
ఏమి
జరిగినది?
ఎందులకంత
విచారించుచున్నావు?
నాకేమీ
అర్థమగుట లేదు.
కారణము
తెలిపి
నన్నానందపరచుము"
అని
అడిగిన
"అన్నా!
నేను
సర్వవిధములా
తమకు
అర్పితమైనవాడను.
నాకు
ఇష్టాయిష్టములన్నవి
వేరుగా
లేవు.
నీ
యిష్టమే
నా
యిష్టము
కదా!
అట్టి
నా
హృదయమును
తెలిసికూడను
నన్ను
నా
యిష్టము
వచ్చిన
స్థలములో
పర్ణశాలను
నిర్మించమని
కోరుటలో
నా
హృదయము
బ్రద్దలయినది.
తాము
ఎక్కడ
ఆజ్ఞ
ఇచ్చిన
అక్కడ
వేయుదును.
దయచేసి
మరొక సారి
అట్టి
పదములను
ప్రయోగించక
నన్ను
అనుగ్రహింపుము.
నేను
తమ
సేవకుడను.
సేవ
నిమిత్తమే
నేను
తమను
అనుసరించుచున్నాను.
తమ
ఇష్టానుసారము
నన్ను
వినియోగించుకొనుము,
ఆజ్ఞాపించి
కార్యముల
జరిపించుకొమ్ము"
అని
లక్ష్మణుడు
దీనుడై
ప్రార్థించెను.
అంత
రాముడు
లక్ష్మణుని
అనేక విధముల
సమాధానపరిచి,
"లక్ష్మణా!
ఇంత
చిన్న
విషయమునకే
నీవింత
విచారించనక్కరలేదు.
నేను
సామాన్యస్థితిలో
అట్లు
నిన్నాజ్ఞాపించితిని.
నీ
హృదయము
నేనెరుగనిది కాదు.
రమ్ము
నావెంట,
నేనే
నిర్ణయింతును"
అని
లక్ష్మణుని
వెంటపెట్టుకొని,
సీతాసమేతుడై
దారి
నడచెను.
అట్లు
నడచుచుండ
ఒక
ప్రదేశమున
మందాకినీ నది
ఉత్తరతీరమును
జూచెను.
31
▾
Meaning
Keep
అది
ధనురాకారముగా
నలువైపుల
తిరిగియుండెను.
ఆ
నదియే
ధనువుయొక్క
నారి;
శమము, దమము, దానము
మొదలగునవియే
బాణములు;
పాపములే
వానికి
లక్ష్యము;
చిత్రకూటపర్వతమే
నిశ్చలముగా
నిలచియున్న
మహావీరుడు.
అతను
వెనుదీయుడు
అని
చెప్పి
లక్ష్మణుని
ఆ
స్థానమున
పర్ణశాలను
వేయుమని
ఆజ్ఞాపించెను.
లక్ష్మణుడు
రాముని
సీతను
ఒక
వృక్షచ్ఛాయన
విశ్రమింప
ప్రార్థించి
క్షణములో
పర్ణశాలకు
తగిన
కట్టెలు, ఆకులు, తీగెలు, చెట్టునార
ప్రోగుచేసెను.
మువ్వురికీ
తగినట్లు,
ఒక
చిన్న
పర్ణశాలను
నిర్మింప
గుంతలు
తవ్వెను,
కర్రలు
పాతెను.
సీతారాములు
చక్కగా
విశ్రమించి
లేచి
చూడగా
సుందరమైన
ఒక
పర్ణశాల
సర్వాంగసుందరముగా
కనిపించెను.
లక్ష్మణుడు
ఇంత
శీఘ్రకాలములో
సుందరమైన
నివాసము
నిర్మించుట
చూచి,
ఆశ్చర్యపడి
తాను
కూడా
కొంత
సహాయము
చేయక పోతిని
కదా
అని
లేచి,
పర్ణశాల పైభాగములో
ఆకులు
పేర్చుచున్న
లక్ష్మణునికి
త్రాళ్ళు
అందించుట
ఇత్యాది
సహాయకార్యములో
పాల్గొనెను.
ఇదిచూచి
సీతమ్మ తల్లికూడా
ఆకులు,
ఇత్యాది
చిన్న చిన్న కొమ్మలు
వేరు చేసి,
రామునిచేతికి
అందించెను.
సూర్యాస్తమయము
కాకమునుపే
పర్ణశాల
పూర్తి ఆయెను.
రాముడు
సారెసారెకూ
ఆ
పర్ణశాలను
చూచుచూ
లక్ష్మణుని
అనేక విధముల
మెచ్చుకొనుచూ
సీతకు
తన
తమ్ముని
భక్తిశ్రద్ధలను
నానావిధముల
వర్ణించెను.
సీతాదేవియు,
తాను
ఎన్నడుకూడనూ
ఇంతటి
సుందరమైన
నివాసమును
చూడలేదనియూ
ఇట్టి
భవనములో
వాసము చేయవలెనని
ఎన్నియో
దినములనుండి
కోరుచుంటిననియూ
ఈనాటికి
తన
మనోవాంఛ
తీరినదని
రామునితో
తెలుపుతూ,
మరదియొక్క
శ్రద్ధాభక్తులను
అనేక విధముల
పొగడెను.
అంతలో
లక్ష్మణుడు
క్రిందికి
దిగి,
నాలుగువైపుల
చక్కగా
పరిశీలించి
అన్నతో
సెలవుతీసుకొని
మందాకిని నదీ
స్నానమాచరించ
వెళ్ళెను.
కొంతసేపటికి
సీతా రాములుకూడా
మందాకినికి
వెళ్ళి
స్నానాదులు
ఆచరించి
పర్ణశాల
చేరుకొని
తెల్లవారి
లక్ష్మణుడు
తెచ్చిన
ఫలముల
నారగించి
ఆ
పర్ణశాలలో
సుఖముగా
32
▾
Meaning
Keep
నిద్రించిరి.
రెండవ
దినము
నుండి,
శ్రీరాముడు
సీతాలక్ష్మణసమేతుడై
వచ్చి
చిత్రకూటముపై
నివసించుచున్నాడన్న
విషయము
మునీశ్వరులకు
తెలిపెను.
అప్పటినుండి
గుంపులు
గుంపులుగా
ఋషులూ,
మునులూ,
వారి
శిష్యులూ,
వచ్చి
వెళ్ళుచుండిరి;
వారందరితో
రాముడు,
క్షేమసమాచారములతో
పాటు
వారి
అనానుకూలములను
కూడను
వినుచూ,
తన
సేవ
అవసరమైన
ఎట్టి
సమయమందైన,
తమ్మునితోపాటు
తాను
సిద్ధముగా
నుందువని
ఋషులకు
హామీ
ఇచ్చెను.
వచ్చినవారు
ఎట్టి
సహాయమునూ
కోరక
"రామా,
తమ
దర్శనమే
మా
సర్వ
ఇబ్బందులనూ
దూరము
గావించును.
మాకెట్టి
ఇబ్బందియూ
లేదు.
తమ
అనుగ్రహ
మొక్కటుండిన
చాలు"నని
ఆ
సుందర
మంగళ
విగ్రహములను
చూచుచూ
స్తంభించిపోవుచుండిరి.
రాముడు
వచ్చిన
ఈ
ఋషులను
యథావిధిగ
ఆదరించి
సత్కరించెను.
రామదర్శనము,
మునులకు
చల్లటి
పానీయమును
గ్రోలినటులయ్యెను.
వారు
తమ
హృదయములోని
తాపమును
చల్లార్చుకొనుచుండిరి.
శ్రీరామునకు
ప్రేమయే
ప్రధానము.
రాముడు
వనవాసులందరిని
సంతోషపెట్టెను.
మృదుమధురముగా
వారలతో
ప్రసంగించి
వారి
మనస్సులకు
ఆప్యాయమును
గలుగజేసెను.
వచ్చిన
మునులకు,
కిరాతకులకు
తగినరీతుల
నీతుల
బోధించి
పంపుచుండెను.
వచ్చి
వెళ్ళుచున్న
వారందరూ
రాముని
గుణగణములను
చెప్పుకొంటూ,
వర్ణించుకొంటూ
తమ
తమ
నివాస
స్థానములు
చేరుచుండిరి.
సీతారామ
లక్ష్మణులు
వచ్చి
వనములో
నివసించినది
మొదలు
వనము
సకల
మంగళదాయకమయ్యెను.
కన్నుల
కింపుగను
మనస్సుకు
సొంపుగనూ
భయాందోళనలు
దూరమై
ఆనంద
భావములు
మునుల
హృదయముల
అంకురించెను.
కిరాతకులు
సయితము
నీతిమంతులై
మానవజాతికి
వన్నె
దెచ్చిరి.
చిత్రకూటపర్వతమునకు
ఇంతటి
అదృష్టము
పట్టినందుకు
వింధ్యపర్వతము
విచారించెను.
ఒక
వింధ్యపర్వతమేమి,
మిగిలిన
పర్వతములు,
అందుగల
వృక్షములు,
లతలు,
సెలయేరులు
సయితము
తమ
కంత
ప్రాప్తిలేదని
విచారించియే
యుండును.
33
▾
Meaning
Keep
క్షణక్షణము
సీతారామ
చరణారవిందములను
చూచుచూ
వారికి
తనమీద
గల
వాత్సల్యముచేత
లక్ష్మణుడు
మరచి
సచ్చిదానందములో
మునిగి
తేలుచుండెను.
స్వప్నమందైననూ
తన
తల్లియైన
సుమిత్రాదేవియు,
భార్యయైన
ఊర్మిళయు,
మిగిలిన
బంధుమిత్రాదులును
ఎవ్వరునూ
కనిపించ
లేదు.
వారలను
లక్ష్మణుడు
స్మరించలేదు.
అటులనే
సీతాదేవియూ
తనవారలను
కానీ,
తల్లిదండ్రులనుకానీ,
మిథిలాపురమునుకానీ
అయోధ్యా
నగరమునుకానీ,
ఏ
క్షణమునందునూ
స్మరించలేదు.
నిరంతరము
రామచంద్రుని
ముఖారవిందమును,
కన్నులపండువుగా
గాంచుచూ
వచ్చి
పోవుచుండు
మునులను
మునిపత్నులనూ
చూచుచూ
కాలము
గడచిపోవునది
కూడా
గమనింపక,
రాత్రి
పగలను
తారతమ్యమును
గుర్తించక,
చంద్రుని
చూచిన
చకోరములవలె,
రామచంద్రుని
చూచుచూ
సీతాచకోరము
అంతులేని
ఆనందమున
నుండెను.
తన
మరదియైన
లక్ష్మణుడు
నిర్మించిన
ఆ
పర్ణశాల
అయోధ్యలోని
అంతఃపురమునూ,
మిథిలాపురములోని
రాణివాసభవనమునూ
మరిపించెను.
అదే
ఆమెకు
దివ్యభవనమువలె
తలపించి
ఆనందించుచుండెను.
మధ్య
మధ్య,
రాముడు
చెప్పుచుండిన
పురాణ
కథలను
తపస్సిద్ధుల
మహత్తర,
చిత్రమైన
విషయములను
సీతా
లక్ష్మణులు
అత్యంత
ఉత్సాహముతో
వినుచుండెడివారు.
మధ్య
మధ్య
తన
తల్లిదండ్రులను
జ్ఞాపకము
చేయుచూ
వారు
తనను
గురించి
ఎంత
విచారించుచున్నారో
అని
పలుకునపుడు
మాత్రము
సీతకు
అత్తమామలు
జ్ఞాపకమువచ్చి,
కౌసల్యను
స్మరించి
కంటినీరు
కార్చెడిది.
అంతలో
రామప్రభువును
స్మరించి
ధైర్యము
నవలంబించి
పురుషసింహముతోవున్న
నేను
ఈ
వనమున
దుఃఖించుటకానీ,
విచారించుటకానీ
న్యాయము
కాదనియూ
ఇదంతా
రామలీలయనియూ
తలంచి
సర్వమునూ
మరచుటకు
ప్రయత్నించెడిది
సీత.
ఈ
విధముగా
రామలక్ష్మణులు
సీతను
కాపాడుచూ
ఎట్టి
భయంకర
శబ్దములు
ఆమెను
చలింపచేయనీయక
కాచుచుండిరి.
వీరిట్లు
చిత్రకూట
పర్వతమున
చింతలు
వీడి
సంతసముగ
కాలము
గడుపుచుండిరి.
Previous
←
Sīta, Rāma's Equal Half
Next
Ayodhyā Without Rāma
→