Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · Ayodhyā Without Rāma
Rāma Kathā Rasa Vāhini
›
Part One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
రాముని
సాగనంపి
వచ్చిన
నిషాదపతి
గంగాతీరమున
వృక్షచ్ఛాయలో
రథమును
ఆపి,
గుఱ్ఱములను
చెట్టునకు
కట్టి,
రథములో
వెక్కి
వెక్కి
ఏడ్చుచున్న
సుమంతుని
చూచెను.
సుమంతుని
చూచిన
తక్షణమే
నిషాదపతికూడనూ
తనలో
కుములుచున్న
దుఃఖము
ఆపుకొనలేక,
"రామా!"
అని
గట్టిగ
కేకవేసి
పరుగిడి
వచ్చి
సుమంతుని
కౌగిలించుకొనెను.
నోటిమాటలు
స్తంభింప
ఇరువురూ
రోదనలు
గావించిరి.
మొదలు
నరికిన
చెట్టువలె
ఇరువురూ
ఆ
వృక్షచ్ఛాయలో
నిలువునా
పడి,
సీతారామ
లక్ష్మణులను
తలంచుచూ
కైకను
దూషించుచూ
ఉండిరి.
గుఱ్ఱములు
సయితము
గడ్డితినుట
మాని,
జలముగ్రోలుట
మాని
కంటిధారలు
కార్చుచూ
సుమంతుడూ,
నిషాదపతీ,
"రామా"
అన్నపుడంతయూ
తలలెత్తి
నలువైపులా
చూచి,
రామ
రాకకై
యెంతయో
చింతపడుచుండెడిది.
ఆ
గుఱ్ఱముల
దురవస్థను
చూచి,
సుమంతుడు
మరింత
క్రుంగిపోవుచుండెను.
ఈ
విధముగా
కొన్ని
గంటలు
జరిగెను.
ఇక
విధిలేక
నిషాదపతి
ధైర్యమును
అవలంబించి,
"ఓ
మంత్రీ!
నీవు
మహామేధావివి.
గుణవంతుడవు,
పరమార్థమును
గుర్తెరిగిన
వాడవు.
విధికృతములు
విపరీతములైనపుడు
వానిని
సహింపవలెను
కదా!
లెమ్ము,
అయోధ్యకు
వెళ్ళి
రామవార్తకై
కన్నులు
కాసియున్న
కౌసల్య
సుమిత్రలకు
వార్తనందించు,"
అని
బలవంతముగా
సుమంతుని
లేపి,
రథముపై
కూర్చొనబెట్టెను.
గుఱ్ఱములను
రథములకు
కట్టించెను.
నిషాదపతి
వాక్యములు
పరమ
సత్యమని
తలంచి,
సుమంతుడు
మొండి
ధైర్యముతో
రథమును
కదిలించెను.
2
▾
Meaning
Keep
వియోగ
దుఃఖముచే
అతని
శరీరమునకు
పటుత్వము
తప్పెను.
ఎంత
ప్రయత్నించిననూ
రథమును
నడుపలేకపోయెను.
తూలిపడుచూ
వచ్చెను.
ఎంత
అదిలించిననూ
అశ్వములు
సకిలించి
వెనుకకు
తిరిగి
చూచునే
కానీ
ముందుకు
అడుగైననూ
వేయలేకపోయెను.
ఈవిధముగా
పరితపించుచూ,
"ఛీ,
ఛీ,
రాముడులేని
ఈ
బ్రతుకు
కాల్పునా?
ఎప్పటికైననూ
ఈ
శరీరము
నశించునదే.
ఏదో
రోగములతో
లోకసంబంధమైన
విషయములతో
నశించుటకంటే,
రామవియోగముతో
ఈ
ప్రాణమును
వీడుట
ఎంత
సార్థకము!
అంతకంటే
వేరు
కీర్తి
ఈ
సుమంతున
కెందుకు?
ఆ
ఒక్క
కీర్తిని
దక్కించుకొన్న
చాలదా?
సుమంతా?
నీవంతటి
అదృష్టవంతుడవై
యుండిన
రామునితోనే
ఉండెడివాడవు.
అదృష్టము
లేనపుడు
ఏమీ
చేసియూ
ఏమి
ఫలము"
అని
తనను
తాను
నిందించుకొనుచూ,
"నేను
అయోధ్యకు
ఏ
ముఖము
పెట్టుకొని
పోదును?
అయోధ్యా
పురవాసులు
రాముడెక్కడ?
అని
అడిగిన
ఏమని
చెప్పుదును?
రాముని
విడిచి
ఎట్లు
వచ్చితివని
అడిగిన
అంతకంటే
అవమానము
మరొకటుండునా?
ఈ
నిమిషమున
గుండె
ఎంత
బండ
అయినది?
ఇంకనూ
పగలకున్న
దెందులకు?"
అని
తనను
తాను
అసహ్యించుకొంటూ
చేతులు
నులుపుకుంటూ
"ఇప్పుడే
అయోధ్యలో
ప్రవేశించుట
మంచిదికాదు.
చీకటిపడి
అందరూ
నిద్రించే
సమయమున
ప్రవేశించిన
కొంత
గౌరవముందునేమో"
అని
ఊహించుచూ,
అయోధ్య
ప్రజలు
నిద్రింతురా!
ఇది
కల్ల,
రామచంద్రుని
రాకకై
దారులు
చూచుచుందురు.
ఎప్పుడు
ప్రవేశించిననూ
నాకీ
అవమానము
తప్పదు.
రామానుగ్రహమును
నోచుకోలేని
ఈ
దురదృష్టమునకు
ఈ
విధమైన
పరాభవము
సరియైనదే.
నేను
అనుభవించుట
కూడనూ
మంచిదే".
అని
తనలో
తాను
ప్రశ్న,
జవాబులు
రెండునూ
వేసుకొంటూ,
తీర్చుకొంటూ
దారి
నడుపుచూ
మెల్ల
మెల్లగా
ప్రయాణము
జరిపెను.
ఇంతలో
తమసానదీ
తీరము
వచ్చెను.
నగరమును
సమీపించితిమని
తలంచి,
ప్రొద్దుపోయిన
తరువాత
అందరూ
నిద్రించవచ్చునని,
అపుడు
నగరమున
3
▾
Meaning
Keep
ప్రవేశించవచ్చునని
సుమంతుడు
తలంచి
ఆ
నదీతీరమున
గుఱ్ఱములను
విప్పి
ఒక
చెట్టుక్రింద
కాలము
గడపి
నిదానముగా
తిరిగి
ప్రయాణము
గావించి
నగరమున
ప్రవేశించెను.
రాజవీధులలో
ఇతరులకు
తెలియక
వెళ్ళవలెనని
అతి
నెమ్మదిగా
శబ్దము
రానివ్వక
ఎట్లో
గుఱ్ఱములను
నడుపుతూ
మెల్ల
మెల్లగా
వచ్చుచుండెను.
నగరమున
రాజవీధులలో
ప్రవేశించగనే
గుఱ్ఱములు
పట్టరాని
దుఃఖముతో
సకిలించుచూ
పెద్ద
పెద్ద
శబ్దములు
చేయ
ప్రారంభించెను.
రామవార్తకై
కన్నులు
తెరచుకొని
కాచియుండిన
ప్రజలు
ఈ
దృశ్యమును
చూచి
ఒకరికొకరు
చెప్పుకొని
లేచి
రాజవీధుల
ఇరుప్రక్కలా
గుంపులుగా
చేరిరి.
వారిని
చూడగనే
సుమంతుడు
తల
క్రింద
వంచుకొనెను.
ఈ
వికారమును
చూచి
ప్రజలు
శ్రీరాముడు
తిరిగి
రాలేదని
అర్థము
చేసుకొని
నిలువునా
కూలిరి.
కొందరు
గొల్లున
ఏడ్చిరి.
దారులు
కాచుచున్న
రాణివాసపు
స్త్రీలు
గుఱ్ఱముల
సకిలింపులు
వినగనే
దాసీలను
పంపిరి.
వారు
గుంపులు
గుంపులుగా
వచ్చి
మంత్రిని
ప్రశ్నించిరి.
మంత్రి
మాటలేలేని
మూగవలె
కంటిధారలు
కార్చుచూ
మాటలు
తొట్రుపాటు
పడెను.
చెవులు
వినని
వానివలె
దేనికినీ
జవాబు
ఇవ్వక
స్తంభించెను.
మహారాజెచ్చట
కలదనిమాత్రము
వచ్చినవారలను
ప్రశ్నించుచుండెను.
మంత్రిచేష్టలు
గమనించిన
దాసీలు
రాముడు
రాలేదని
గమనించి,
"సీతాదేవిని
కారడవులలో
దింపివచ్చితిరా?
మంత్రీ!"
అని
గొల్లున
ఏడ్చిరి.
ఒక
దాసి
ధైర్యము
చేసుకొని
మంత్రిని
నేరుగా
కౌసల్య
మందిరమునకు
తీసుకొనిరమ్మనినట్లు
కౌసల్య
ఆజ్ఞగా
తెలిపెను.
మరి
చేయునది
లేక
మంత్రి
కౌసల్య
మందిరమువైపున
నడువజొచ్చెను.
కళాహీనుడగు
చంద్రునివలె
ఆ
మందిరమున
బడియుండిన
రాజును
చూచెను.
నిద్రాహారములు
లేక,
భూషణాది
అలంకారములు
లేక
నేలబడి
యుండెను.
ఇంతలో
మంత్రి
పొరలివచ్చు
దుఃఖమును
ఆపుకొని
వణకుచున్న
పెదవులతో
"జయ,
జయ"
అని
పలికి
నమస్కరించెను.
ఆ
మాటలు
విని
రాజు
దిగనలేచి
కూర్చొని,
"సుమంతా!
నా
4
▾
Meaning
Keep
రాముడేది?"
అని
అడిగెను.
సుమంతుడు
రాజును
కౌగిలించుకొనెను.
నీటిలో
మునుగుచున్నవాడు
తృణమును
బట్టుకొనినట్లు
రాజు
మంత్రిని
బట్టుకొనెను.
ఇరువురూ
మహావిషాదముతో
ఏడ్చుచుండుట
చూచి
కౌసల్య
దుఃఖము
చెప్పతరముకాక
ఊపిరి
పీల్చుటకు
కూడనూ
తగిన
శక్తి
లేనిదై
కదలక
మెదలక
డొక్కలు
కొట్టుచుండ
కౌసల్యను
దాసీలు
అనేక
రకముల
నోదార్చుచూ
వారునూ
దుఃఖించుచూ
సేవలు
చేయుచుండిరి.
ఇంతలో
దశరథుడు
కొంత
ధైర్యము
నవలంబించి
మంత్రిని
కూర్చొనబెట్టుకొని
"సుమంతా!
నా
సీతారాముల
క్షేమముల
తెలుపుము
లక్ష్మణుడెట్లున్నాడు?
ఆ
సుకుమారి
నా
కోడలు
సీత
అలసిపోయి
ఉండును.
ఎక్కడున్నారు
ఇప్పుడు?
వివరములు
తెలుపుము"
అని
అతని
భుజములు
పట్టి
ఊపుచూ
ప్రశ్నించుచున్న
రాజును
చూచుటకు
సిగ్గుపడి
తలవంచుకొని
సుమంతుడు
కన్నీరు
కార్చుచూ
భూమిని
చూచుచుండ,
రాజు,
"ఓ
రామా!
నీవంటి
కొమారుని
విడచిపెట్టిననూ
నా
ప్రాణములు
శరీరమును
విడచిపోలేకున్నవి.
లోకమున
నావంటి
పాపి
మరొకడుండడు.
సుమంతా,
ఇప్పుడెక్కడున్నారు
నా
సీతారామ
లక్ష్మణులు?
తక్షణమే
నన్ను
వారుండు
స్థానమునకు
గొనిపొమ్ము.
ఈ
ఒక్క
ఉపకారము
నాకు
చేసి
పెట్టుము.
సుమంతా!
ఈ
ఒక్కకోరికను
నాకు
నెరవేర్చుము.
వారిని
చూడకున్న
నేనిక
క్షణమైననూ
జీవించ
జాలను"
అని,
"రామా!
ఒక్కతూరి
నిన్ను
చూతును,
కనిపించవా?"
అని
కేకలు
వేయ
ప్రారంభించెను.
నిద్రాహారములు
మాని
మందిరము
వెలుపల
నిలిచియున్న
దాసదాసీలు
రాజు
మాటలను
వింటూ
దుఃఖమున
క్రుంగిపోవుచుండిరి.
రాజు
అవస్థను
చూచి
సుమంతుడు,
"రాజాధిరాజా!
మీరు
మహాజ్ఞానులు,
వీరులు,
దురంధరులు,
దేవతాంశ
సంభూతులు,
సాధుసమాజములను
సదా
సేవించితిరి.
కలిమిలేములు,
సుఖదుఃఖములు,
సంయోగ
వియోగములు
మొదలగునవి
దివారాత్రములవలే
ఒకదాని
తరువాత
నొకటి
కాలక్రమమున
వచ్చుచుండును.
5
▾
Meaning
Keep
సుఖములు
వచ్చినపుడు
సంతోషించుట,
దుఃఖములు
వచ్చినపుడు
విచారించుట
మూర్ఖుల
పద్ధతి
కానీ
పండితులైన
మీబోటివారు
సమముగా
చూచి
నిశ్చింతగా
నుండవలెను
గదా!
మీరు
సర్వమును
ఎరిగినవారు.
ధైర్యముగా
నుండుడని
నేను
బోధించుటకు
అర్హుడను
కాను.
హే
లోకోపకారీ!
నా
ప్రార్థన
విని
మీరు
దుఃఖమును
విడిచి
పెట్టుడు.
మా
ప్రయాణ
వివరములు
వివరింతును
ఆలకింపుడు."
అని
చెప్పగనే
పడియున్న
కౌసల్య
లేచి
దాసీల
సహాయముతో
వారిపై
వాలి
కూర్చొనెను.
"రాజా!
మొదటి
దినము
తమసానదీ
తీరమున
నిలిచితిమి.
అక్కడ,
సీతారామ
లక్ష్మణులు,
నదీ
స్నానములు
గావించి
జలమును
మాత్రమే
త్రాగి
వృక్షచ్చాయలో
విశ్రమించిరి.
రెండవ
దినము
గంగానదీతీరమును
చేరుకొంటిమి.
చీకట్లు
క్రమ్ముచుండెను.
రామాజ్ఞ
ప్రకారము
రథము
నాపితిని.
ముగ్గురూ
గంగాస్నానము
గావించి
ఇసుక
తిన్నెలపై
కొంత
విశ్రమించిరి.
తెల్లవారగనే,
శ్రీరాముడు
మట్టిపాలను
తెమ్మని
లక్ష్మణునకు
ఆజ్ఞచేసెను.
క్షణములో
లక్ష్మణుడు
రామాభీష్టమును
నెరవేర్చెను.
తెచ్చిన
మట్టిపాలతో
స్వయముగా
జటామకుటమును
బంధించెను.
రామ
స్నేహితుడైన
నిషాదపతి
నావను
తీసుకొని
వచ్చెను.
ఆ
పడవలో
మొదట
సీతాదేవిని
కూర్చుండబెట్టి
తదుపరి
రాముడు
కూర్చొనెను.
తదుపరి
రామాజ్ఞనుపొంది
ధనుర్బాణధారియై
లక్ష్మణుడు
పడవలోనికి
వెళ్లెను.
లక్ష్మణుడు
పడవలోనికి
వెళ్ళుటకు
పూర్వము
నా
దగ్గరకు
వచ్చి,
మా
తల్లి
దండ్రులకు
మా
నమస్కారములనందింపుము.
మమ్ములను
ఆశీర్వదింప
మేము
కోరినట్లు
మనవి
చేయుము.
తమను
ధైర్యముగా
నుండు
మనుము.
మామగారికి
నా
వందనములు
అందించి,
మా
తండ్రి
గారు
విచారింపకుండు
నట్లు
వారిని
ఉపదేశింపుదురని
మేము
కోరినట్లు
తెలుపుము.
అని
సందేశము
నంపెను,
అని
సుమంతుడు
తెలిపెను.
ఇంతలో
రాముడు
నన్ను
దగ్గరకు
పిలిచి,
"మంత్రీ!
పురజనులను,
రాజబంధువులను
పిలిచి
నా
విన్నపమును
జెప్పుడు.
నా
తండ్రి
6
▾
Meaning
Keep
గారు
సుఖముగా
జీవించునట్లు
ప్రయత్నించు
వాడే
నా
హితకారి
అని
వారికి
విన్నవింపుము.
భరతుడు
వచ్చిన
తరువాత,
నా
ఆశీర్వాదములు
అందించి
రాజ్యాధివత్యము
వహించి
నీతిని
నిజాయితీని
విడువక
త్రికరణ
శుద్ధిగ
ప్రజలను
పాలింపుమనియు,
జననీ
జనకులను
సేవించి
నేను
లేనికారతను
లేకుండ
తండ్రిని
సేవింపుమనియు
చెప్పుము.
వారు
మా
వియోగ
దుఃఖమును
మరచునట్లుగా
మెలగుమని
నేను
ఆశించినట్లు
మరీ
మరీ
తెలుపుము.
జానకి
చిరునవ్వులు
చిందులు
ద్రొక్కుచూ,
రామలక్ష్మణులతో
ఆనందముగా
కాలమును
గడపుచున్నదనియూ,
తన
హృదయ
పూర్వక
నమస్కారములు
అత్తమామలకూ
బంధువులకూ
అందించమనియూ
సీతకెట్టి
కొరతయూ
లేక
మహా
ఆనందముతో
వనవాసము
చేయుచున్నదనియూ,
అత్తమామలు
మా
కొరకై
వ్యధనొందక
ధైర్యముగా
ఉండి,
మమ్ములను
ఆశీర్వదించుచుందుమనియూ
నేను
పదే
పదే
వారిని
కోరినట్లు
తెలుపుమ"నెను.
ఇంతలో
రాముని
మనోభిప్రాయమును
గమనించి
నావికుడు
మెల్లగా
పడవను
నడుపుట
కారంభించెను.
ఈ
విధముగా
శ్రీరాముడు
ప్రయాణ
మయ్యెను.
"నా
గుండెలు
రాయి
చేసుకొని
వారి
ప్రయాణమును
చూచుచూ
నదీ
తీరమున
నిలిచియుంటిని.
రామాజ్ఞ
నెరవేరు
నిమిత్తమై
నేను
వెనుకకు
వచ్చితిని
కానీ,
లేకున్న
నేను
గంగలో
పడి
ప్రాణమును
కోల్పోయి
ఉండెడివాడను.
రామ
సందేశమును
మీకందించు
నిమిత్తమై
నేను
బ్రతుకవలసివచ్చెను.
రాముడు
లేని
ఈ
అయోధ్య
మహారణ్యముగా
కనిపించుచున్నది."
అని
విచారపడెను.
సుమంతుని
మాటలు
వింటూ
రాముడు
తెలిపిన
మృదుమధుర
వాక్యములను
స్మరించుచూ
రాజు
మూర్చిల్లెను.
బురదనీటిలో
నుండి
ఊపిరితీయలేక
కొట్టుకొను
మీనములవలె
రాజు
ప్రాణములు
కుమారుల
వియోగ
దుఃఖముచే
కొట్టుకొనెను.
మహారాణులు
గొల్లున
ఏడ్చిరి.
ఆ
మహావిపత్తును
వర్ణించి
చెప్పుటకు
శక్యము
కాదు.
వారి
విలాపములు
చూచి
దుఃఖము
సహితము
దుఃఖించక
మానదు.
రాణుల
దుఃఖము,
రాజు
దుఃఖము,
నగరములో
దేవదాసీల
దుఃఖము
నగరమంతయూ
7
▾
Meaning
Keep
కోలాహలముగా
వ్యాపించెను.
నిశిరాత్రివేళ
వనములో
పిడుగుపడినపుడు
పక్షులవలె
నగరవాసులు
వ్యాకుల
చిత్తులైరి.
క్షణ
క్షణమునకు
నీటినుండి
వేరుచేసిన
తామరవలె
మహారాజు
దేహము
వాడిపోవజొచ్చెను.
కంఠమునుండి
మాట
రాక
పోయెను.
గొంతు
ఎండి
పోయెను.
సర్వేంద్రియాలు
మొద్దుబారెను.
మహారాజు
యొక్క
అవస్థ
కౌసల్య
చూచి
సూర్యకుల
సూర్యుడు
అస్తమించుచున్నాడని
గమనించెను.
కౌసల్య
ధైర్యము
చేసుకొని
దగ్గరకు
వచ్చి
పతి
శిరస్సును
తన
తొడపై
పెట్టుకొని
చల్లని
మాటలను
మెల్లగా
వినిపింప
ప్రయత్నించెను.
"నాథా,
త్వరలో
సీతారామలక్ష్మణులు
వచ్చి
మిమ్ములను
దర్శింతురు.
నా
మాట
విని
ధైర్యము
నవలంబింపుడు"
అని
తన
ప్రార్థనను
దీనభావముతో
తెలుపజొచ్చెను.
రాజు
నేత్రములను
విప్పి
కౌసల్యనుచూచి,
"కౌసల్యా!
నా
రాముడేడీ?
నాకు
చూపుము.
లేక
నన్ను
రాముని
దగ్గరకు
గొనిపొమ్ము.
నా
ముద్దుల
కోడలు
ఈ
సమయమున
నాచెంత
లేకపోయెను.
లక్ష్మణుడు
కనిపించడయ్యో!"
అని
తిరిగి
తల
క్రిందికి
వాల్చెను.
కొంతసేపటికి
జాతాంధుడు
తపశ్శాలియగు
శరవణుని
తండ్రి
పెట్టిన
శాపము
రాజునకు
జ్ఞప్తికి
వచ్చెను.
లేచి
ఆ
వృత్తాంతమంతయూ
కౌసల్యకు
చెప్పనారంభించెను.
"కౌసల్యా!
ఒక
సమయమున
వేటనిమిత్తము
నేను
వనమునకు
వెళ్ళియుంటిని.
నావెంట
అనేకమంది
సైనికులు
కూడ
వచ్చియుండిరి.
మృగములు
చిక్కనందున
తిరిగి
నగరమును
ప్రవేశించుట
మంచిది
కాదని
ప్రతిజ్ఞ
పట్టి
ఆ
రాత్రి
వేత్రవనమునకు
బయలు
దేరితిమి.
ఒక
సరోవరము
చెంత
తెలతెలవారుచుండగా
మేము
పొంచియుంటిమి.
ఇంతలో
సరోవరములో
పొదలమధ్య
కదలిక
కనిపించెను.
శబ్దము
వినిపించెను.
దానిని
గాంచి
ఒక
పెద్ద
జంతువని
తలంచి
శబ్దవేధిని
యెరింగినవాడను
కనుక
నేను
బాణమును
సంధించి
ప్రయోగించితిని.
నా
బాణము
రివ్వునవెళ్ళి
ఆ
కదలుచున్న
ప్రాణికి
తగిలెను.
అంతలో
హో!
అని
కూలిన
శబ్దము
వినిపించగనే
సేనలతో
నేను
అక్కడికి
వెళ్ళి
చూచితిని.
అది
మృగముకాదు.
ఒక
ఋషి
కుమారుడు.
దగ్గరకు
వెళ్ళి
నా
పొరపాటును
క్షమించుమని
ప్రార్థించితిని.
ఆ
ఋషి
కుమారుడు,
8
▾
Meaning
Keep
"ఓ
రాజా!
శోకింపకుము.
నా
ఈ
అభీష్టమును
నెరవేర్చి
నన్ను
చంపిన
పాపపరిహారము
గావించుకొనుము.
నేను
శరవణుడను;
నా
తల్లిదండ్రులు
అంధులు.
వారిని
సేవించుచుంటిని.
వారివలన
నాకు
సకలసుఖములూ
కలిగెను.
దివ్యజ్ఞానముకూడనూ
లభించెను.
వారు
దాహముచేత
కష్టపడు
చున్నారు.
వారికి
జలమును
తీసికొని
వచ్చుటకై
నేనిచ్చటికి
వచ్చితిని.
నన్ను
నీవు
మృగమని
భావించి
కొట్టితివి.
విధిని
ఎవరు
దాటగలరు?
నేనిక
ఈ
జలమును
నా
తల్లిదండ్రులకు
అందించలేను.
కాన
ఈ
జలమును
త్వరగా
తీసుకొని
వెళ్ళి
ఉత్తర
దిశలో
ఒక
పాకలోవున్న
నా
తల్లిదండ్రులకు
అందించుము.
వారు
నీరు
త్రాగిన
తరువాత
నాకు
జరిగిన
ప్రమాదమును
వివరముగా
తెలుపుము.
నీరు
త్రాగకమునుపే
చెప్పకుము,"
అని
పాత్రను
నా
చేతిలో
పెట్టి
ప్రాణములు
వీడెను.
"కౌసల్యా!
ఆ
బాలుడు
తల్లిదండ్రులకై
ఎంత
పరితపించెనో,
ఆ
బాలుడు
తన
ప్రాణములనైన
లెక్కచేయక
నన్ను
దుర్భాషలాడక,
పలికిన
మృదుమధురమైన
పలుకులు
ఇప్పటికి
కూడా
నా
చెవులలో
గింగురుమను
చున్నవి.
ప్రాణములు
వీడుటకు
పూర్వము
మూడు
పర్యాయములు
ఓం
ఓం
ఓం
అని
స్మరించెను.
ఈ
దృశ్యమును
చూచి
ఆ
శరవణుని
అభీష్టమును
నెరవేర్చి
నా
పాపమును
తీర్చుకొందమని
శీఘ్రముగా
ఆ
పాత్రను
తీసుకొని
వెళ్ళి
ఎట్టిమాటలూ
ఉచ్చరించక
జలమును
వారలకు
అందజేసినాను.
ఇంతలో
ఆ
తల్లిదండ్రులు
ఏమేమో
ప్రశ్నలు
వేయుచూ,
"నాయనా!
కొమారా!
ఎందుకింత
ఆలస్యమాయెను?"
అని
చేతులు
తడుముచూ
పట్టుకొనుటకు
ప్రయత్నించిరి.
అయితే
నేను
కొంత
వెనుకకు
వచ్చితిని.
ఇంతలో
ఆ
వృద్ధ
తల్లిదండ్రులు,
"ఓ
కుమారా!
నీవెందులకు
మారుమాటాడకున్నావు?
నీవు
మాటాడినగానీ
మేము
జలమును
గ్రోలము"
అని
భూమిపై
బడిరి.
ఇంతలో
గతించిన
శరవణుని
కళేబరమును
నేను
సేనలతో
వెంట
తెమ్మని
చెప్పియుండుటచేత
మన
సేనలు
ఆ
కళేబరమును
అక్కడికి
తెచ్చియుండిరి.
నేను
ఆ
కళేబరమును
తల్లి
ముందుంచితిని.
ఆమె
ఆ
కళేబరమును
తమ
9
▾
Meaning
Keep
ముందుంచుకొని
చాలా
విలపించెను.
ఆ
కఠిన
దుఃఖమును
నేను
చూడలేకపోతిని.
ఆ
తల్లి
ధైర్యము
చేసుకొని
ఓ
రాజా!
మా
కొమారుడు
లేక
మేమిక
జీవించి
ప్రయోజనము
లేదు.
మేము
వృద్ధులము,
మమ్మెవరు
చూతురు?
అతనితోపాటు
మా
ప్రాణములనూ
తీయుము,
లేదా
కాష్ఠము
సిద్ధము
చేయుము
అని
ఆ
ముని
దంపతులు
కోరిరి.
వారి
ఆజ్ఞానుసారము
క్షణములో
కాష్ఠము
సిద్ధముగావించితిని.
తోడనే
వారు
కుమారుని
కళేబరముతో
దానిమీద
కూర్చుండిరి.
వారు
యోగాగ్నిచే
శరీరములను
దహింపజేసిరి.
వారు
దహింపబడుటకు
పూర్వము
నాతో
ఒక
మాట
చెప్పిరి.
అది
ఇప్పుడు
నాకు
అక్షరాలా
వర్తించుచున్నది.
వారి
పవిత్రశాపము
నేడు
సత్యస్వరూపమును
ధరించుచున్నది.
అని
సొమ్మసిల్లెను.
కౌసల్య
అతనిని
అనేక
రీతులనోదార్చి,
'స్వామీ!
ఆ
మాట
లేవియో
వినిపించి
నన్ను
తృప్తిపరచుము'
అని
ప్రార్థించెను.
కొంత
ఓపిక
పట్టుకొని,
"కౌసల్యా!
ఏమని
చెప్పుదును?
ఆ
వృద్ధమునిదంపతులు,
"ఓ
రాజా!
ఇప్పుడు
మేము
కొమారుని
వియోగముచే
ఎట్లు
మా
ప్రాణములు
విడుచుచున్నామో,
నీవునూ
పుత్రవియోగముచే
అట్లే
ప్రాణములను
విడువగలవు"
అని
చెప్పి
ప్రాణములు
విడచిరి.
అప్పటికి
నాకు
కుమారులులేరు.
అందువలన
ఈ
ఋషిపలుకులు
ఏ
విధముగ
సత్యము
కాగలవు?
అని
ఒకవైపున
విచారించితిని.
మరొక
వైపున
ఋషి
పలుకులే
సత్యమయిన
నాకు
కుమారులు
కలుగగలరు.
వారు
కలిగినకదా
పుత్రవియోగము
నాకు
ప్రాప్తించును.
కాన
నాకెట్టి
ప్రాప్తి
లభించిననూ
పరవాలేదు,
పుత్రులు
కలిగిన
చాలని
కొంత
సంతసించితిని.
ఈ
మర్మమును
ఇంతవరకూ
నేను
నీతో
చెప్పనైతిని.
ఇప్పుడు
ఆ
పవిత్ర
ఋషి
వచనములు
పరమసత్యములని
గ్రహించగలిగితిని.
నాకిక
రామవియోగబాధనే
అంత్యము!
నేనిక
బ్రతుకను;
శరవణుని
కథ
జ్ఞప్తికి
వచ్చెను.
ఇక
నాకెట్టి
ధైర్యమునూ
లేదు;
రాదు"
అని
పూర్వపు
వృత్తాంతములను
స్మరించి
విచారించుచుండెను.
"రామా,
రామా,
రామా"
అని
మూడు
పర్యాయములు
స్మరించి
దశరథుడు
కౌసల్యపై
వ్రాలెను.
కౌసల్య
అతని
మార్పును
చూచి
గొల్లున
10
▾
Meaning
Keep
కేకవేసెను.
ఇంతలో
దాసదాసీలు
గుంపులు
చేరిరి.
ప్రాణములు
విడచిన
దశరథ
మహారాజును
చూచి
నగరము
అంతా
ఒక
పెద్ద
గోలగా
మారెను.
క్షణములో
ఈ
వార్త
పురమంతయూ
తెలిసెను.
అందరూ
రాజ
భవనమును
ప్రవేశించిరి.
వీధులు
క్రిక్కిరిసెను.
రోదనలు
హెచ్చాయెను.
జనులు
కైకేయిని
స్వేచ్చగా
దూషించిరి.
ఆమె
మూలముననే
రాజ్యమునకు
నేత్రములే
కోల్పోతిమని
చింతించిరి.
ఇంతలో
వశిష్ఠ
మహాముని
అక్కడి
కరుదెంచెను.
సమయోచితముగా
అతడు
అనేక
ఉపశాంతి
వచనములు
తెలిపి,
కౌసల్యాసుమిత్రలను
ఓదార్చెను.
అనేక
విధముల
పూర్వుల
చరిత్రలను
ఆదర్శముగా
తెలిపి
జననమరణములు
ప్రతి
ప్రాణి
దేహమునకూ
తప్పునవి
కాదని
వారలకు
నచ్చచెప్పెను.
కళేబరమునకు
అంత్యక్రియ
లాచరింప
పుత్రులెవ్వరునూ
చెంత
లేనందున,
మరొకరు
అట్టి
కార్యమును
నెరవేర్చుటకు
వీలుకానందున,
వశిష్ఠులవారి
ఆజ్ఞానుసారము
మహారాజు
దేహము
తైలద్రోణిలో
నుంచబడెను.
ఒక
దూతను
పిలిపించి,
"ఓయీ!
నీవు
శీఘ్రముగా
వెళ్ళి
రాజు
స్వర్గస్థుడయ్యె"నని
మాత్రము
చెప్పక,
"గురువుగారు
మీ
అన్నదమ్ములిరువురినీ
శీఘ్రముగా
నగరమునకు
విజయము
చేయుడని
చెప్పుము"
అని
ఆజ్ఞాపించెను.
ముని
ఆజ్ఞగైకొని
మంత్రిగారి
సెలవు
తీసుకొని,
దూత
అతివేగముగా
రథమును
నడపెను.
అయోధ్యలో
అనర్థములు
ప్రారంభించినది
మొదలు
భరతునకు
దుస్స్వప్నములు
వచ్చుచుండెను.
రాత్రి
స్వప్నమున
అనేక
దుశ్శకునములు
చూచి
మేల్కొనెను.
ఆ
ముందు
దినము
రాత్రి
భరతుడు
పూర్తి
నిద్రించక
దిగులుచెంది,
ఏదో
అనిష్టములు
కలుగనున్నవని
యోచించుచూ,
కూర్చొని
విచారించుచుండెను.
తెలతెలవారగనే,
స్నానము
చేసి,
అనిష్టముల
పరిహారార్థము
అనేక
విధముల
దానములు
గావించెను.
ప్రార్థనలు
సలిపెను.
అయిననూ,
తనలో
ఏదో
అర్థముగాని
ఆవేదన,
లోలోన
రగులుతునే
ఉండెను.
ఈవిధముగ
పదునాలుగు
దినములు
ప్రతిదినమూ
దుస్స్వప్నములు
విడువక
వచ్చు
చుండుటచే
అతని
ధైర్యము
11
▾
Meaning
Keep
ఇంతలో
అయోధ్యనుండి
వెళ్ళిన
రాజదూత
పదునైదవ
దినమునకు
కేకయరాజ్యమును
చేరెను.
సింహద్వారమునుండి
తన
రాకను
భరతునకు
తెలుపగా,
భరతుడు
అతి
ఆతురతతో,
సమాచారమును
తెలుసుకొనుటకై
శీఘ్రముగా
లోనికి
ప్రవేశించుమని
తెలిపెను.
వెళ్ళిన
దూత
భరతునకు
నమస్కరించి,
గురువుగారి
ఆజ్ఞప్రకారము
తమరు
అయోధ్యకు
విజయము
చేయుడని
ప్రార్థించెను.
భరతుడు
అనేక
విధముల
యోగక్షేమములు
అడిగెను.
మరేవిషయమములూ
లేవనియు,
కేవలము
గురువుగారి
ఆజ్ఞగా
తాను
కేకయ
నగరమునకు
వచ్చితిననియూ,
గురువుగారు
మిగిలిన
వివరములు
తనకేమియునూ
తెలుపలేదనియూ
దూత
తెలిపెను.
దూతలు
రాజులదగ్గర
అతిగా
మాట్లాడరు.
కనుక,
రాజుకూడ
దూతలను
మీద
మీద
ప్రశ్నించరు;
వివరములు
అతనిని
అడుగరు;
అది
ఆనాటి
రాజుల
అలవాటు
దూతల
విషయాల్లో.
వెంటనే
భరతుడు
లోనికివెళ్ళి
మేనమామ
వద్ద
సెలవుతీసుకొని,
తమ్ముడైన
శత్రుఘ్నునితో
కూడి
ప్రయాణమై
రథమున
ఆసీనుడాయెను.
రథము
అతివేగముగా
నడచెను.
పర్వతములు,
గుట్టలు,
అడవులూ,
శరవేగమున
దాటిరి.
ఎంతవేగముగ
ప్రయాణము
జరుగుచున్నదో
అంతవేగముగా
భరతునిలో
అంత
దుఃఖము
పైకుబికి
వచ్చుచున్నది.
తనకు
అర్థముకాని
ఆవేదన
తనను
క్రుంగదీయుచుండెను.
దేనినీ
ముట్టక,
భుజింపక,
నీరైననూ
త్రావక
అతివేగముగా
అయోధ్యను
చేరవలెనని
ఉఱ్ఱూతలూగుచున్న
అన్నను
చూచి,
శత్రుఘ్నుడు
ఆశ్చర్యపడెను.
ఒకటి
రెండు
పర్యాయములు
దేనినైననూ
పుచ్చుకొమ్మని
కోరినప్పటికినీ
దాని
నేమాత్రమూ
గమనించకుండుటచూచి,
శత్రుఘ్నుడు
కూడా
ఊరకుండెను.
క్షణ
క్షణమునకు
దుశ్శకునములే
ఎదురువచ్చెను.
నగరమును
సమీపించుకొలది
మరింతగా
దుశ్శకునములు
కనబడెను.
ఆ
శుభస్థానమున
కూర్చుని
కాకులూ,
కుక్కలూ
భయంకరముగా
కూయుచుండెను.
ఇంత
కాలము
ఏ
విషయమూ
తలంచక
ధైర్యముగా
ఉండిన
శత్రుఘ్నుని
మనస్సు
కూడా
కొంత
కలత
జెందెను.
12
▾
Meaning
Keep
వారిరువురూ
నగర
సింహద్వారమును
చూడగనే,
బీడకొట్టినట్లు
భయంకరంగా
నుండెను.
ఎన్నడో
కట్టబడిన
పచ్చని
మామిడి
తోరణములు
ఎండి,
చిటపట
శబ్దాలతో
వ్రేలాడుచుండెను.
ఇది
మరింత
అమంగళమునకు
నిదర్శనముగా
దృఢపరచెను.
నిత్యము
పచ్చనితోరణములతో
కళ
కళ
లాడుచుండు
నగరసింహద్వారము,
ఈ
రీతిగా
పాత
తోరణములను
తీయక
పచ్చని
తోరణములను
కట్టక
ఉండుటలోని
అంతరార్థమును
గుర్తించిరి,
సోదరులు.
నగరములో
ప్రవేశించినతోడనే,
అశ్వశాల,
గజశాల
మొదలు
కనిపించును.
వాటిని
చూడగనే
భరతుడు
గుండెలు
బ్రద్దలాయెనా
అన్నట్లు
దిగ్భ్రాంతి
జెందెను.
అశ్వములూ,
గజములూ
కదలక
మెదలక
తలలు
వాల్చుకొని
కంటిధారలు
కార్చుచుండెను.
మావటీలు,
రౌతులు
ఇత్యాది
పనివారలు
విచారసూచనలతో
తలలు
వంచిరి.
ఇంకా
ముందుకు
నడిచిరి.
రాజవీధులలో
అన్ని
గృహములూ
తలుపులు
మూయబడి
యుండెను.
రాజవీధులు
దుమ్ముతో
నిండియుండెను.
పురజనులు
రథమును
చూచి
అశుభముగా
తలలు
క్రిందికి
వంచిరి.
కంటిధారలు
కార్చిరి.
వజ్రాల
బజారులు,
మిగిలిన
అంగళ్ళు
పూర్తిగా
మూయబడి
యుండెను.
వీటికి
కారణమేమో
ఎవరినైనా
అడుగుటకు
కూడా
భరతునకు
నోరాదలేదు.
స్తంభించి
పోయెను.
నేరుగా
రాజభవనమును
చేరెను.
అక్కడ
ద్వారపాలకులు,
జయ
జయ
ధ్వనులను
పలుకక
పతాకములు
వాల్చి,
తలలు
క్రిందికి
వంచిరి.
ఏదో
అశుభము
జరిగినదని
పూర్తిగా
గ్రహించి
లోనికి
వెళ్ళెను.
కైకేయి
తన
కొమారుని
రాకను
గమనించి
ఆనందముతో
కుమారునకు
ఎదురేగెను.
ఆమెతో
వెళ్ళిన
దాసదాసీలు,
దుఃఖముచేత
పీడితులై
యుండిరి.
వారి
ముఖములు
చూచి,
భరతుడు
కూడనూ
విచారముతో
ఏమియూ
పలుకక
మంచు
కప్పిన
వానివలె
నిలిచెను.
ఇంతలో
కైక
"నాయనా!
భరతా!
మీ
మేనమామలు
క్షేమమే
కదా?"
అని
అడుగగా
అందుకు
ఏదో
సమాధానముచెప్పి
భరతుడు,
"నాన్నా!
అన్న
13
▾
Meaning
Keep
పెద్దమ్మలందరూ
క్షేమమేకదా!"
అని
తిరిగి
తల్లిని
అడిగెను.
అందులకు
కైక
ఊరకుండుట
చూచెను.
చుట్టూవున్న
దాసదాసీలు
కంటి
నీరు
పెట్టుచుండుట
చూచెను.
తల్లి
ఏదియో
దాచి
పెట్టుచున్నదని
తాను
గ్రహించి,
"అమ్మా!
నాన్నగారెక్కడ?"
అని
అడుగగనే
దాసీలు
గొల్లున
ఏడ్చిరి.
ఇది
గమనించి
కైక
ఇక
దాచుట
మంచిదికాదని,
తాను
కూడనూ
కంటిధారలు
కార్చుచూ
కపట
దుఃఖమును
ప్రకటించెను.
భరతునకేమి
అర్థముకాక
ఎవరికేమి
ప్రమాదము
సంభవించెనో
ఏమో
అని
వివరములను
తెలుపుమని
దీనుడై
తల్లిని
ప్రార్థించెను.
అంత
కైక,
"నాయనా,
ఏమందును?
మందర
సహాయమున
నేను
అన్ని
కార్యములను
సాధించితినికదా
అని,
ఎంతో
సంతోషముగా
ఉంటిని,
కానీ
ప్రారంభముననే
నా
కార్యములన్నియూ
పటాపంచలాయెను;
దైవము
చిన్నచూపు
చూచెను.
మహారాజు,
మీ
ప్రియమైన
తండ్రి,
స్వర్గస్థులయిరి,
అని
ఏడ్చెను.
ఈ
మాట
వినగనే
సింహనాదమును
వినిన
ఆడ
ఏనుగువలె
భరతుడు
"హో!
తండ్రీ"
అని
నేలకూలెను.
శత్రుఘ్నుడు
మొదలు
కొట్టిన
అరటి
చెట్టువలె
నేల
వ్రాలెను.
వారి
గోల
వర్ణనాతీతము.
భరతుడు
తలను
బాదుకొంటూ,
"తండ్రీ!
ఏమి
మా
దురదృష్టము,
మీ
ప్రాణప్రయాణ
సమయమున
మీ
వద్ద
ఉండలేకపోతిమికదా?
మేమెంత
పాపాత్ములము!
పుట్టిన
నలుగురు
బిడ్డలలో
నలుగురికీ
ఒకే
ప్రాప్తి
లేకపోయెకదా!
అంత్యసమయమున
నీచెంతనుండిన
రామలక్ష్మణులే
ధన్యులు,
అన్నింటికీ
అధములు
ఈ
భరతశత్రుఘ్నులు.
అయ్యో!
మేమెంత
దురదృష్టవంతులము!
అంత్య
సమయమున
మమ్ములనెంత
కలవరించితిరో
కదా?
మాకు
ఏమి
చెప్పనుంటిరో
కదా?
పోనీ
మాకు
చెప్పవలసిన
విషయములు
మా
ప్రాణసమానమైన
రామునితో
చెప్పియుందురు.
అక్కడికైనను
వెళ్ళి
కనుగొని
కొంత
శాంతి
నొందుదుము.
తమ్ముడా!
రాముని
చెంతకు
వెళ్లుదము
రమ్ము.
అమ్మా!
మా
అన్నగారైన
శ్రీరాముడు
ఇప్పుడు
ఎక్కడున్నాడు?"
అని
ప్రశ్నించెను.
"రాముడే
ఉండిన
మీ
నాన్నగారు
మరణించియుందురా!
రాముడు
నగరమున
లేదు
కదా",
అని
కైక
తెలిపెను.
గాయమునకు
విషము
తగిలినట్లు
భరతునకు
మరొక
నూతనచింత
ప్రారంభమాయెను.
"అమ్మా!
మా
ప్రాణ
14
▾
Meaning
Keep
సమానమైన
రాముడు
లేక
ఎక్కడికి
పోయెను?"
అని
ఆతురతతో
అడిగెను.
అందులకు
కైక
వెంటనే
"ఎక్కడికా?
అరణ్యమునకు"
అని
తెలిపెను.
"అరణ్యమునకు
వెళ్ళిన
రాముడు
ఇంతకాలము
నగరమునకు
రాకుండుటకు
కారణమేమి?"
అని
ఆతురతతో
అడిగెను
భరతుడు.
"నాయనా!
ఆ
కథ
చెప్పుటకు
ఇప్పుడు
వ్యవధిలేదు.
ముందు
నీ
తండ్రిగారి
అంత్యక్రియలు
చేయుటకు
తగిన
ప్రయత్నములు
గావింపుము"
అని
కైక
జవాబు
ఇచ్చెను.
ఇది
గమనించి,
తన
తల్లి
ఏదో
దాచిపెట్టుచున్నదని
గమనించి,
"వదినగారైన
సీతాదేవి
ఎక్కడున్నది?
లక్ష్మణుడెక్కడ?"
అని
మీద
మీద
ప్రశ్నించెను.
"వారిరువురు
రామునితో
అరణ్యమునకు
వెళ్ళిరి.
వారు
పదునాలుగు
సంవత్సరములవరకు
నగరమున
ప్రవేశింపరు.
ఇది
మీ
తండ్రిగారి
ఆజ్ఞ"
అని
కైక
కటువుగా
చెప్పిన
తోడనే
ఇందులో
ఏదో
జరిగినదని
భరతుడు
బాగా
అర్థము
చేసుకొని,
మరింత
విచార
గ్రస్తుడయ్యెను.
కుములుచున్న
భరతుని
దగ్గరకు
తీసుకొని
కైకేయి,
"నాయనా!
భరతా!
మీ
తండ్రి
నిమిత్తమై
విచారింపపనిలేదు.
వారనేక
సత్కర్మలు
గావించిరి.
కీర్తి
ప్రతిష్టల
నందుకొనిరి.
సుఖముగా
జీవించిరి.
అంతమున
స్వర్గమును
జెందిరి.
తండ్రివలె
నీవును
కీర్తిని
గడించి
సత్కర్మల
సలిపి,
సుఖముగా
రాజ్యము
నేలుము.
అతని
పేరు
ప్రతిష్టలను
నిలుపుము".
అని
కొడుకును
ఓదార్చ
ప్రయత్నించెను.
ఈ
మాటలు
భరతుని
హృదయానికి
కత్తివలె
నాటుకుపోయెను.
తలపై
సుత్తివలె
మోదెను.
కైక
మాటలకు
శత్రుఘ్నుని
శరీరము
మండెను.
కానీ,
అతడు
తలి
నెదిరించి
మాటలాడలేదు;
భరతుడు
లేచి,
సత్యమును
తెలుసుకొనిన
మంచిదని,
తన
తల్లి
తనకు
సత్యమును
కప్పి
పుచ్చి
ఏమో
నాటకమాడుచున్నదని
తలంచి,
శత్రుఘ్నునితో
కలిసి
దుఃఖించుచూ
కౌసల్య
మందిరమును
ప్రవేశించెను.
కౌసల్య
ధూళిపట్టిన
వస్త్రముతో
క్రిందిపడి,
"నాథా!
నాథా!
రామా!
రామా!"
అని
అరచుచూ
పడియుండ
దాసీలుకూడనూ
దుఃఖముతో,
కన్నులు
వాచి
దేవికి
సేవలు
చేయుచుండిరి.
ఈ
దృశ్యముచూచి
భరతుడు
"తల్లీ!
తల్లీ!
తల్లీ!"
అని
బావురు
మంటూ
ఏడ్చుచూ
తల్లి
పాదములపై
వ్రాలెను.
15
▾
Meaning
Keep
భరత
శత్రుఘ్నులనుచూచి
కౌసల్యా
సుమిత్రలు
మరింత
విలపించిరి,
మూర్ఛిల్లిరి.
ఒకరి
నొకరు
పట్టుకొని
ఏడ్చుచుండ,
ఎట్టి
కఠినమైన
శిలయైననూ
కరిగి
యుండెడిది.
అట్టి
రోదనలతో
అందరూ
నేలకూలిరి.
భరతుడు,
"అమ్మా!
మా
నాన్నను
చూపుము.
నాన్న
మరణమునకు
కారణము
తెలుపుము
నా
ప్రియమైన
సోదరులు
రామ
లక్ష్మణులు,
సీతాసమేతులై
అరణ్యమునకు
ఎందుకు
వెళ్ళిరి?
నాకేమీ
అర్థముగుట
లేదు
నాకు
ఈ
విషయములను
తెలిపి,
నా
దుఃఖమును
చల్లార్చుము,"
అని
కౌసల్య
పాదములపై
పడెను.
విలపించుచున్న
భరతునిచూచి
కౌసల్య
కౌగిలించుకొని,
"నాయనా!
నీరాకతో
నాకు
కొంత
శాంతి
చేకూరినది,
నిన్ను
చూచి,
నా
రామవియోగమును
మరతును.
నీవు
రామునితో
సమానము.
నాకు
భేదము
లేదు."
అని
అంటూ
మధ్య
మధ్య
"హే
రామా!
నేనిక
పదునాలుగేండ్లు
నిన్ను
చూడక
జీవించగలనా?
నీ
తండ్రివలె
నీ
చింతన
లోనే
భస్మము
గావించవా
నన్ను?
అయ్యో!
నేనెంత
దురదృష్టవంతురాలను",
అని
వాపోవుచున్న
కౌసల్య
వచనములచే
భరతునికి
మరింత
బాధ
కలిగెను.
విషయము
తెలియక
అనేక
విధముల
విపరీత
భావములు
సలుపుచున్న
భరతుడు
ధైర్యము
చేసుకుని,
"అమ్మా,
నన్ను
నమ్ముము.
నా
రామచంద్రుడు
అడవికి
వెళ్ళుటకు
నాన్న
ప్రాణములను
వీడుటకు
కారణమేమో
తెలిపి
నన్ను
అయోమయ
స్థితినుండి
కాపాడుము",
అని
ప్రార్థించెను.
అంత
కౌసల్య
సహజ
సరళ
స్వభావము
కలది
కనుక,
వెనుకకు
వచ్చిన
రాముడేనని
భరతుని
భావించి
దగ్గర
చేర్చుకొని
కంటినీరు
తుడిచి,
"నాయనా!
భరతా!
ధైర్యముగా
నుండుము.
గతించినదానికి
వగచి
ప్రయోజనముండదు.
కాలకర్మముల
గతులు
అఘటితములు,
ఒకరిని
దూషించి
ప్రయోజనం
లేదు.
దూషించకూడదు.
ఇంత
దుఃఖమును
అనుభవించి
జీవించమని
నా
విధివ్రాత
నాకు
శాసించినది.
అది
తప్పినదికాదు.
నా
విధిని
నేను
అనుభవింపక
తప్పదు,
మీరు
చిన్నవారు.
ప్రాతః
కాల
సూర్యునివంటిది
మీ
జీవితము.
మీ
తండ్రి
ఆజ్ఞ
ప్రకారము
నా
ముద్దులపట్టి
శ్రీరాముడు
నారవస్త్రధారియై,
జటాజూటములు
ధరించి
అరణ్యమున
సంచరించుచున్నాడు.
అతని
విడచి
క్షణమైననూ
ఉండ
జాలని
జానకి
కూడా
16
▾
Meaning
Keep
అతనితో
వల్కాంబరములను
ధరించి
వెళ్ళెను.
లక్ష్మణుడు
రామవనవాసమును
తప్పించుటకై
అనేక
విధముల
ప్రయత్నములు
సలిపి
విఫలుడై,
రాముడులేని
అయోధ్య
నాకు
అరణ్యసమానమని
వెంటనే
రామునితో
ప్రయాణమై
వెళ్ళెను.
ఇవన్నియూ
నా
కన్నుల
ఎదుట
జరిగెను.
నేనెంత
పాపాత్మురాలను!
ఇన్ని
చూచియూ
నా
ప్రాణములు
పోకున్నవి.
నేనైననూ
వారితో
వెళ్ళనైతిని.
నా
ప్రాణములైననూ
వారితో
పోక
పోయెను.
నా
నిర్భాగ్య
స్థితిని
నేనేమని
చెప్పుకొందును?
నా
హృదయము
నిజముగా
పాషాణము.
ఇట్టి
పాషాణ
హృదయురాలి
గర్భమున
కోమలహృదయుడైన
రాముడు
జన్మించుటచేత
రామునికిన్ని
గతులు.
అయ్యో!
రామా,
ఆ
భీకరారణ్యమున
రాత్రింబగళ్ళు
ఎట్లు
కందమూలాదులు
భుజించి
జీవించుచున్నావో
కదా?"
అని
ఒక్క
కేకవేసి
కౌసల్య
నేల
కూలెను.
ఈ
దుఃఖములను
చూచుచూ,
వచనములు
వింటూ
భరతుడు
అసలు
సంగతేదియో
తెలిసి
కొనలేక,
వివరించి
అందుకొనలేక
అయోమయ
స్థితిలో
కుములుచుండెను.
ఇంతలో
గురువుగారైన
వశిష్ఠులవారు
రమ్మని
కబురంపినట్లు
మంత్రి
సుమంతుడు
వచ్చెను.
సుమంతుడు
భరతశత్రుఘ్నులను
చూచిన
తక్షణమే
భోరున
ఏడ్చి
భరతుని
కౌగిలించుకొనెను.
భరతశత్రుఘ్నులు
కూడా
వారిలోని
దుఃఖమును
ఆపుకొనలేక,
వారునూ
దుఃఖించిరి.
ధైర్యమును
వహించి,
కడకు
సుమంతుడైననూ
విషయమును
తెలుపునేమో
అని,
ఎన్నియో
విధముల
భరతుడు
ప్రయత్నించెను.
సుమంతుడు
విషయము
భరతశత్రుఘ్నులకు
తెలిసే
యుండునని
తలంచి
తానేమీ
ప్రత్యేకించి
వివరములు
తెలుపలేక
పోయెను.
అందరును
కూడి
గురువు
చెంతకు
వచ్చిరి.
గురువు
పాదములపైబడి
విలపించుచున్న
భరత
శత్రుఘ్నులను
లేవదీసి
వశిష్ఠులవారు
అనేక
రీతుల
నీతులను
బోధించి,
వారలను
ఓదార్చెను.
అప్పటికే
కాలాతీతమైనది.
ఇక
కాలహరణము
చేయుట
మంచిది
కాదనియూ
పితృఅంత్యక్రియలు
చేయ
సిద్ధముకమ్మని
భరతునికి
ఉపదేశించెను.
17
▾
Meaning
Keep
భరతుడు
దీర్ఘముగా
ఆలోచించి
"స్వామీ!
ప్రథమ
పుత్రుడైన
రామచంద్రుడు
చేయవలసిన
ఈ
కార్యము
నా
తలపై
పెట్ట
తలంచితిరా!
ఇది
న్యాయమా?
ఇన్ని
దినములే
ఊరబెట్టితిరి.
ఇక
రెండుమూడు
దినములు
ఉండిన
నేను
నేడే
సోదరుడైన
శత్రుఘ్నునితో
అడవికి
వెళ్ళి
నా
రామచంద్రుని
దొడ్కొని
వత్తును.
ఆజ్ఞచేయు"దని
ప్రార్థించెను.
అందుకు
వశిష్ఠులవారు
"నాయనా!
నీవు
అమాయకుడవు.
రామచంద్రుడు
తనకు
నియమించిన
కాలము
గడువక
ముందుగా
వచ్చుటకు
ఇష్టపడడు.
ఏకవాక్య
పరిపాలకుడు.
నీవెన్ని
చెప్పిననూ
రాముడు
పదునాలుగు
వర్షములు
అరణ్యవాసము
చేయక
అయోధ్యను
ప్రవేశించడు.
నీవు
ఆ
ప్రయత్నమునకు
పూనుకొనక,
తండ్రి
అంత్యక్రియలు
ఆచరించి
తదుపరి
నీ
ఇష్టప్రకారము
గావింపుము"
అని
పదేపదే
అనేక
విధముల
బోధించిరి.
చేయునది
లేక,
భరతుడు
సరి
అని,
వేదోక్త
ప్రకారము
తండ్రి
కళేబరమునకు
స్నానము
చేయించి,
తీసుకొని
పోవుటకు
తగిన
ఏర్పాటులు
గావించెను.
ఇంతలో
తనకేదియో
ఒక
భావము
హృదయమున
మొలకెత్తగనే,
అంతఃపురమునకు
సరాసరి
వెళ్ళి
కౌసల్య,
సుమిత్రల
పాదములకు
నమస్కరించి,
"తల్లులారా!
మీరు
సహగమనమునకు
ప్రయత్నింపకూడద"నియూ,
"అట్లు
ప్రయత్నించు
పక్షమున
తాను
తండ్రి
అంత్యక్రియలను
జరుపనేరన"నియూ,
వారలతో
మాట
ఇప్పించుకొనెను.
వారు
కొమారుని
ప్రేమానురాగములకు
సంతసించి,
"నాయనా!
నీ
యిష్ట
ప్రకారమే
చేయుదు"
మని
మాటయిచ్చిన
తరువాత
నిండు
దుఃఖముతో,
సరయూనదీ
తీరమున
గంధపు
చెక్కలతో
ఏర్పరచిన
కాష్ఠమును
చేరి,
వశిష్ఠులవారు
ఆశించిన
దానికంటే,
వేయిరెట్లు
అధికంగా
వేదోక్తంగా
తండ్రిగారి
అంత్యక్రియలు
భరతుడు
గావించెను.
తండ్రి
పేరుతో
షోడశ
మహాదానములు
చేసెను.
గోదానములు,
భూదానములు,
సువర్ణదానములు,
వస్త్రదానములు,
అన్నదానములు,
గృహదానములు,
అశ్వదానములు,
గజదానములు,
ధనదానములు
ఇత్యాది
దానములు
విరివిగా
గావించెను.
భరతుడు
చేసిన
పితృ
కార్యము
ప్రజలు
వేనోళ్ళ
చెప్పుకొని
ఆనందించిరి.
18
▾
Meaning
Keep
అయితే
ప్రజలలో,
పండితులలో
రాముడు
లేని
కొరత
తీరలేదు.
రామవియోగ
బాధలు
క్షణక్షణమునకు
వారి
హృదయములను
బాధించుచునే
యుండెను.
ఇక
చేయునదిలేక,
రాముడు
ఏకవాక్య
పరిపాలకుడని
వారెరుగుట
చేత,
ఏమి
చేసినా
రామచంద్రుడు
పదునాలుగు
సంవత్సరములు
దాటువరకు
అయోధ్యకు
రాడని
వారు
నిర్ణయము
చేసుకొని,
రాముడు
అయోధ్యకు
వచ్చువరకూ
వారు
రామదర్శన
నిమిత్తము
బ్రతికియుండక
తప్పదని
ఏదో
ఒక
విధముగ
హృదయాలను
రాళ్ళుగా
చేసుకొని,
కాలమును
గడుప
నిశ్చయించుకొనిరి.
ఇంతలో
గురువుగారైన
వశిష్ఠులవారు
రాజులను,
మంత్రులను,
పురప్రముఖులను,
పండితులను,
ఋషులను
రప్పించి
ఒక
సమావేశము
జరిపెను.
అందులో
భరతశత్రుఘ్నులకు,
ధర్మానుసారముగా
రాజనీతులను
పురస్కరించుకొని,
ఉపదేశములు
చేసెను.
ప్రథమమున
కైకేయి
చేసిన
పన్నాగము
మొదలు,
రాముని
వనగమనము
వరకు
గల
కథ
నతడు
వివరించెను.
తరువాత
మహారాజు
యొక్క
సత్యమును,
ధర్మపరిపాలనను
శౌర్య,
వీర్య-పరాక్రమ
బలములను
త్యాగ,
యోగ,
భోగాది
కర్మకలాపములను,
యజ్ఞయాగాది
క్రమ
విశిష్ట
కార్యదీక్షలను
వర్ణించెను.
ఆ
మహారాజు
రామ
పట్టాభిషేకమునకు
గావించిన
ప్రయత్నములు,
వాటికి
అడ్డుతగిలిన
అవాంతరములు,
కడకు
రామ
వియోగముతో
తన
ప్రాణమునే
వీడెననియూ
తెలిపెను.
ఇంతవరకూ,
ఎట్టి
వివరములూ
తెలియని
భరతశత్రుఘ్నులకు
గురువుగారు
తెలిపిన
వివరములు
వినగనే,
ఒక
వైపున
పట్టలేని
కోపము,
మరొక
వైపున
సిగ్గూ,
దుఃఖమూ
కృంగదీసెను.
నేత్రములవెంట
నీరు
వరదలై
కారెను.
వారల
విచారమును
సభాసదులు
చూడలేకపోయిరి.
వశిష్ఠులవారికి
సహితము
తనకు
తెలియకనే
కంటి
ధారలు
వెడలెను.
ఆ
సభ
మహాశోకముతో
నిండెను.
ఎవ్వరునూ
మాటాడ
లేకపోయిరి.
కొన్ని
క్షణములు
సభ
నిశ్శబ్దముతో
స్తంభించెను.
19
▾
Meaning
Keep
వశిష్ఠులవారు
ఏమి
చెప్పుచున్ననూ
భరత
శత్రుఘ్నులు
లక్ష్యము
చేయలేదు.
వారి
మనసు
కైక
చేసిన
పన్నాగములను
తలంచుచూ,
అట్టి
తల్లి
కొమారుడనై
జన్మించుట
ఎన్ని
జన్మల
కర్మమోనని
తలయెత్తుటకు
సహితము
సిగ్గుపడుచూ
ఎప్పుడెప్పుడు
ఆ
సభను
వీడి
పోదుమా
అన్న
బాధతో
తలవంచుకొని
ఉండిరి.
వారి
విచారమును
గమనించి
వశిష్ఠులవారు
దగ్గరకువెళ్ళి
వారిని
తగిన
ఉపశాంతి
పలుకులతో
నోదార్చి
"నాయనా!
విచారించి
ప్రయోజనము
లేదు;
జరిగినది
జరిగేపోయినది.
ముందు
జరుపవలసిన
వాటికి
తగిన
విచారము
సలుపుట
మంచిది.
అన్ని
విధములా
మీ
తండ్రి
అదృష్టవంతుడు.
అతని
నిమిత్తము
విచారించుట
వ్యర్థము.
నా
మాటలను
విని
మీ
తండ్రి
ఆజ్ఞను
శిరసావహింపుము.
మహారాజు
నీకు
రాజ్యాధిపత్యము
నిచ్చెను.
తండ్రి
వచనములను
మన్నించుట
ఉచితము,
ఆడినమాటను
తప్పలేక
మీ
తండ్రి
రాముని
వియోగమునకు
ఒప్పుకొనెను.
అతని
యందలి
ప్రేమానురాగములచే
ప్రాణమునే
వీడెను.
మాటకై
ప్రాణమును
వీడెనను
మాటలో
ఎట్టి
సందియము
లేదు.
ప్రాణముకంటే
మాటనే
ప్రధానమని
భావించుటచేత
కదా,
మాటను
తప్పక
తన
ప్రాణము
నైననూ
వీడుటకు
సిద్ధమాయెను?
తండ్రి
మాటను
నెరవేర్చుటకై
కదా,
శ్రీరాముడు
కూడ
భార్యతో
అడవి
కేగెను.
కాన
ఈ
ఇక్ష్వాకుల
వంశమున
ఆడినమాటను
తప్పక
కాపాడుట
ప్రధాన
నీతి.
అదే
మీ
రాజజాతికి
జ్యోతి.
కనుక
నీవుకూడనూ
తండ్రిమాటను
నిలబెట్టుటకై,
పరిపాలనా
బాధ్యతను
వహించక
తప్పదు.
నీకు
అన్ని
విధములా
మంగళమగు
గాక;
శుభములు
చేకూరు
గాక;
నీపై
గల
వాత్సల్యము
చేతనూ,
దయా
అనుగ్రహములచేతను
నేనిన్నివిధముల
నీకు
బోధింపబూనితిని.
లేకున్న
ఇంతటి
బాధ్యతను
నేను
నీపై
మోపియుండెడివాడను
కాను.
నీవు
నీ
తండ్రి
కీర్తిని
నిలబెట్టగలవు.
పరిపాలనా
శక్తి,
దక్షత
నీలో
కలవు
సంశయించక,
అంగీకరింపుము"
అని
వీపు
నిమురుచూ,
ఆశీర్వదించుచున్న
వశిష్ఠులవారి
వచనములు
విని,
దిగ్గున
ఆసనములనుండి
లేచి
20
▾
Meaning
Keep
వశిష్ఠులవారి
పాదములపైబడి,
భరించలేని
దుఃఖముతో,
అదురుచున్న
పెదవులతో,
కంఠమెత్తి,
"స్వామీ!
నిజముగా
ఈ
వచనములు
నాపైగల
ప్రేమానురాగములకు
సూచనలా?
నేను
నమ్మలేకున్నాను!
నిజముగా,
తమకు
నాపై
అంతటి
ప్రేమానురాగములే
ఉండియుండిన
నాకిట్టి
బాధ్యతను
భారమును
మోపుటకు
అంగీకరించెడివారు
కారు.
ఇది
నాకు
ఒక
శిక్షగా
విధించుచున్నారు.
ఏ
రాజ్యము,
పవిత్ర
పావనపురుషుని
అరణ్యమునకు
పంపెనో;
ఏ
రాజ్యము
ప్రజలను
నిరంతరము
కంటిధారలు
కార్పునట్లు
చేసెనో,
ఏ
రాజ్యము
మహాధర్మాత్ముడైన
రాజును
కోల్పోయెనో,
ఏ
రాజ్యము
ఈ
ఇక్ష్వాకుల
వంశమునకు
కళంకము
తెచ్చి
పెట్టెనో,
ఏ
రాజ్యము
మహాపతివ్రతామ
తల్లులైన
కౌసల్యా,
సుమిత్రాదులకు
వైధవ్యము
నందించెనో,
అట్టి
రాజ్యమును
ఈ
భరతునకు
అప్పజెప్పుబూనుట,
ఇది
నా
పాపఫలము.
క్రూరాత్మురాలైన
కైక
గర్భమున
జన్మించిన
దురదృష్ట
ఫలము.
నాకు
ఈ
శిక్షనిచ్చుట
కంటే
నన్ను
నా
రామచంద్ర
ప్రభువున్న
స్థానమునకు
పంపి
పుణ్యమును
చేకూర్చుడు!
వారల
పాదసేవలు
చేయుచు,
వారు
నడచు
దారులను
ఊడ్చి
తరింతును;
కాన
ఈ
రాజ్యమున
క్షణమైననూ
నే
నిలువజాలను.
అని
వశిష్ఠులవారికి
నమస్కరించి,
వనమునకేగ
ఆజ్ఞ
దయచేయుమ"ని
కోరెను.
అంత
మంత్రులు
లేచి
చేతులను
జోడించుకొని
భరతునితో
"ప్రభూ!
రాజులేని
రాజ్య
మీవిధముగ
జరుపుట
మంచిది
కాదు.
గురువాజ్ఞను
మన్నించి,
మీరు
పరిపాలనా
బాధ్యతను
చేపట్టక
తప్పదు.
శ్రీరాములవారు
వచ్చిన
తరువాత
సమయోచితముగా
తమరు
ఇష్టానుసారముగా
ప్రవర్తించవచ్చును.
మా
ప్రార్థన
అంగీకరింపుడు;
ప్రజలను
పాలింపుడు.
రాజ్యమును
చేపట్టుడు"
అని
చెప్పుకొనిరి.
"ఒకపరి
మాతృదేవియైన
కౌసల్యను
దర్శించి
వత్తున"ని
భరతుడు
కోరగనే,
వశిష్ఠులవారు
అందులకు
సమ్మతించెను.
సమావేశమునుండి
భరతశత్రుఘ్నులు
సరాసరి
కౌసల్య
భవనమునకు
వెళ్ళి
పాదములపైబడి,
"అమ్మా!
దుర్మార్గురాలైన
కైక
గర్భమున
జన్మించి,
ఇన్ని
విధముల
అవాంతరములకు
కారకుడైన
ఈ
21
▾
Meaning
Keep
భరతుని
క్షమింపుము.
రాజ్యదుర్గతికి
ఈ
పాడు
భరతుడే
కారణము.
నన్ను
వనమునకు
పంపుటకు
ఆశీర్వదింపుము
అనుజ్ఞ
ఇమ్ము.
నా
ప్రభువులేని
అయోధ్యలో
క్షణకాలమైన
నేను
తలెత్తి
తిరుగుటకు
వీలుకాదు.
ఈ
రాజ్యాధికారము
జ్యేష్ఠపుత్రుడైన
శ్రీరాములదే
కానీ,
ఈ
అల్పునకెట్టి
అధికారమూ
లేదు.
నాకీ
భారము
వద్దు"
అని
దుఃఖించుచుండ
కౌసల్య
ధైర్యమవలంబించి,
"భరతా!
కాలగతులు
గ్రహించి,
విషాదమును
విడిచిపెట్టుము.
ప్రస్తుతము
స్థిమితముగా
నుండుటకు
సమయము
కాదు.
శ్రీరాముడు
అడవిలో
నుండెను.
మీ
తండ్రి
స్వర్గమును
చేరెను.
నీ
తల్లులు,
బంధువులు,
మిత్రులు,
జనులు
పరమ
దుఃఖమున
మునిగిరి.
వారందరికీ
ఇపుడు
నీవే
ఆధారము.
కాలకర్మములు
ప్రతికూలముగా
నుండెనని
తెలుసుకొని
నీవు
ధైర్యము
తెచ్చుకొనుము.
తండ్రి
ఆజ్ఞను
నెరవేర్చుము.
గురువాజ్ఞను
శిరసావహించుము.
ప్రజా
ప్రార్థనలను
మన్నింపుము.
మంత్రుల
ప్రియవచనములను
అనుసరింపుము"
అని
చేతులు
పట్టి
చెప్పు
వచనములు
అతని
హృదయమునకు
కొంత
చల్లని
గంధమువలె
మృదువుగా
నాటెను;
మధురముగా
నుండెను.
తన
తల్లి
చేసిన
కృత్రిమ
వ్యాపారమును
తలంచక,
తనను
సంశయించక,
కౌసల్య
ఇట్టి
ప్రియవచనములు
చెప్పుట
అతనికెంతయో
తృప్తిగానుండెను.
కౌసల్య
విశాల
హృదయమునకు,
వాత్సల్య
భావమునకు
ఎంతయో
సంతసించెను.
ప్రియకుమారుడైన
రాముడు
అడవికి
వెళ్ళిననూ
సవతికొమారుడైన
తనపై
పుత్రవాత్సల్యమింత
గాఢమై
యుండునని
భరతుడు
కలనైన
తలంచలేదు.
తన
తల్లియైన
కైకకు
కౌసల్యకు
గల
వ్యత్యాసము
పోల్చ
వీలులేక
పోయెను.
విశాల
హృదయుల
భావములు
పూర్ణత్వమును
ధరించునన్న
సత్యమును
భరతుడు
గుర్తించెను.
చేతులు
జోడించుకొని,
"తల్లీ!
మీ
ప్రేమ
వచనములు
నా
హృదయమునకు
చల్లని
పన్నీరుజల్లులుగా
హోయినిచ్చుచున్నవి.
నేను
రాముడనని
తలంచిరి
కాబోలు!
తల్లీ!
ఆ
పవిత్ర
రాముడను
కాదు,
నేను
కైకేయా
కుమారుడను!
కుటిల
22
▾
Meaning
Keep
స్వభావుడను!
సిగ్గు
లజ్జలేని
తుచ్ఛుడను!
రామ
శత్రుడను!
నావంటి
అధముని
రామునిగా
భావించి
సంభాషించుచున్నారు
కాబోలు,
మీ
చిత్తము
రామునియందే
లగ్నమగుటచేత
అందరినీ
రామునిగా
తలంచు
చుందురు.
నేను
సత్యమును
చెప్పుచున్నాను.
నా
మాటలు
మన్నింపుడు
తల్లీ!
రామచంద్రుడే
ప్రభువు.
ధర్మశీలుడే
రాజ్యాధికారి,
నాబోటి
కుటిలచిత్తుడు
రాజ్యమునేలిన
భూమి
పాతాళమునకు
క్రుంగును.
స్వార్థపరులు,
సంకుచితచిత్తులు,
దురాశాపరులు,
ఆడంబరజీవులు,
అహంకార
వ్యక్తులు,
అసూయాస్వభావులు
రాజ్యాధికారులు
కారు.
అట్టివారల
పరిపాలన
ప్రజలకు
హాని
కలిగించును.
ధర్మమును
నాశనము
చేయును,
దేశమునకే
కీడు
వాటిల్లును.
సదాచార,
సచ్ఛీల,
త్యాగ,
సత్యవాక్య
పరిపాలకులే
రాజ్యాధికారులు.
అట్టి
ప్రభువు
ఒక్క
రామచంద్రుడు
తప్ప
అన్యులు
నాకగుపించుటలేదు.
కాన,
నేను
ఇప్పుడే
వెళ్ళి,
రామచంద్రుని
పాదములు
పట్టి
ప్రార్థించి
అయోధ్యకు
తోడ్కొని
వత్తును.
అనుజ్ఞ
దయచేయుము.
ఆలసింపక
ఆశీర్వదింపుము"
అని
పాదములపైబడెను.
భరతుని
మాటలు
కౌసల్య
హృదయమున
కెంతయో
శాంతి
నందించెను.
"నాయనా!
నా
రామభావములు
అన్నియూ
నీలో
ఉట్టి
పడుచున్నవి.
నిన్ను
చూచియైననూ
రామ
వియోగమును
భరింతును.
నీవునూ
అడవికి
వెళ్ళిన
ఇక
మా
గతి
ఏమి?
నీవు
తప్పదని
అందువా?
నన్నుకూడా
నీతో
అడవికి
తోడ్కొనిపోమ్ము.
నే
నెవరి
నిమిత్తము
అయోధ్యలో
జీవించవలెను?
పతిని
కోల్పోయి,
సుతునకు
దూరమై
జీవించుటకంటే
వారి
వియోగ
బాధలో
నా
ప్రాణములు
లీనమొనర్చుట
మంచిది
కదా?
గురువాజ్ఞను
పొందిరమ్ము.
మనము
అరణ్యమున
ప్రవేశించి
సీతా
రామలక్ష్మణులతో
కొంతకాలమైననూ
గడపి
నా
జన్మమును
ముగించుకొందును."
అని
పలికిన
పలుకులు
భరతునకు
కొంత
శాంతినందించెను.
అంత
కౌసల్య
సుమిత్రలకు
నమస్కరించి,
కైక
గృహమునకు
బయలుదేరెను.
భరతశత్రుఘ్నులు
వెనుకా
ముందూ
నడచుచూ,
కైక
మందర
మాటలను
నమ్మి
ఇంత
ఘాతుకచర్యలకు
పాల్పడెనని
చింతించుచూ,
తమలో
తాము
23
▾
Meaning
Keep
ఉప్పొంగి
వచ్చు
క్రోధమును
అణగ
ద్రొక్కుకొంటూ,
కైక
భవనద్వారమును
ప్రవేశించిరి.
ప్రవేశించగనే
మంధర
మంచిగా
అలంకారము
చేసుకొని
ద్వారములో
వారల
రాకకై
కాచుకొనియుండుట
చూచి
శత్రుఘ్నుడు
భరించలేక,
మంధర
కురులను
పట్టి
క్రిందకు
ఈడ్చి
కొట్టెను.
మంధర
"అయ్యో!
అయ్యో!"
అని
కేకలు
పెట్టగనే,
కైక
పరుగెత్తుకొని
వచ్చి
శత్రుఘ్నుని
మందలించెను.
అవకాశమును
అనువుగా
చేసుకొని
భరతుడు
మండిపడి,
"ఛీ!
పాపాత్మురాలా!
ఈ
దుర్మార్గురాలి
మాటలు
విశ్వసించి
మహాపాతకమునకు
పాల్పడితివి.
ఈ
దుర్బుద్ధులు
నీ
మనసులో
పుట్టినపుడే
నీ
హృదయమేల
రెండు
ముక్కలు
గాలేదు?
ఇట్టి
కోరికలు
అడుగుటకు
నీ
నాలుక
ఎట్లు
ఆడినది?
అది
భస్మము
కాకపోయెనా?
ఏ
మొఖము
పెట్టుకొని
ఈ
రాజభవనమున
నివసించుచున్నావు?
సిగ్గులేదా?
ఇట్టి
దుర్మార్గురాలైన
నీ
మాటలపై
రాజునకెట్లు
నమ్మకము
పుట్టెను?
కామాంధుడై
కొడుకును
అమ్మి,
భార్యను
కొనుటకు
పూనుకొనుటకు
నీవు
పన్నిన
పన్నాగములు
మహాసంకుచితమైనవిగా
తోచు
చున్నవి.
రాజు
యొక్క
పవిత్ర
హృదయాన్ని
పాడుచేసి,
రాజ్యమునకు
నిప్పుపెట్టి,
వంశమును
నాశనము
గావించి
రఘువంశమును
నిర్మూలమొనర్ప
చేరిన
కుటిలాత్మురాలవు.
నిన్ను
తల్లి
అని
పిలుచుట
కూడనూ
మహాపాపము.
పరుల
చెడ్డను
కోరిన
నీ
బిడ్డలు
బాగుపడుదురని
ఎట్టు
తలంచితివి?
నీ
బిడ్డలవంటివారు
కారా
పరుల
బిడ్డలు?
పరుల
బిడ్డల
కీడును
కోరు
స్త్రీలు
తమ
బిడ్డల
దుర్గతినే
ఆశించినవారు
కాగలరను
పరమసత్యమును
నీవేల
తెలుసుకొనలేకపోతివి?
రాజ
వంశమున
జన్మించి
రాక్షసగుణములను
కలిగియుండుట
ఏజన్మల
కర్మఫలమో?
ఇదంతయూ
నా
దురదృష్టము
అందునా
నిర్మల
నిస్వార్థపరుడైన
నా
రామచంద్ర
ప్రభువును,
మహా
సాధ్వీమణియైన
సీతామతల్లిని
అరణ్యమునకు
పంపుట
ఎంత
ఘోరము,
ఎంత
కఠినము!
ఛీ,
ఇట్టి
దుర్మార్గురాలవైన
నీతో
సంభాషించుట
కూడా
నా
పాప
ఫలము.
24
▾
Meaning
Keep
నేను
కూడనూ
ఏ
జన్మలో
ఏ
పాపము
చేసితినో!
లేకున్న
నీబోటి
కుటిలాత్మురాలి
గర్భమున
జన్మించి
యుందునా?
పాపులకు
పాపులే
చేరుదురుకానీ
పుణ్యులు
చేరరు
కదా?
సూర్యవంశము
హంస
వంటిది.
నీవు
నిజముగా
నీ
తల్లి
వంటి
దానవే.
నీ
తల్లి
తన
మనోభీష్టమును
పురస్కరించుకొని
తన
భర్తను
చంపుకొనెను.
నీవునూ
నీ
దురాశను
నెరవేర్చుకొను
నిమిత్తము
నీ
పతిని
జంపుకొంటివి.
వంశాచారమునకు
విరుద్ధముగా
చిన్నవాడు
పెద్దవానిని
విడచి
రాజ్యము
చేయునా?
ఈ
భావము
నీకు
ఈనాడు
కలిగినది
కాదు.
ఇట్టి
పాడుతలంపు
మొదటనుండియు
నీలో
బీజరూపముగ
నుండియే
యుందును.
లేకున్న
ఈనాడు
ఇంత
వృక్షముగా
మారుటకు
వీలులేదు
ఇట్టి
బుద్ధే
నీకుండియుండిన
నేను
పుట్టిన
తక్షణమే
నన్ను
చంపియుండిన
ఇంతటి
దురవస్థల
పాలయ్యేది
కాదు,
ఈ
రాజ్యము.
వగచి
ప్రయోజనమేమి?
చెట్టును
నరికి
కొమ్మలకు
నీరు
పోసి
పెంచే
బుద్ధి.
మీనములు
జీవించవలెనని
కోరుతూ
సరస్సులోని
జలమును
తోడివేయుచున్న
నీ
తెలివితేటలకు
నవ్వవలెనో
ఏడ్వవలెనో
అర్థముగుట
లేదు.
నీతో
సంభాషించి
కాలమును
అపవిత్రము
చేయుటకంటే,
నేనిప్పుడే
రామునిచెంతకు
వెళ్ళి
అతనిని
అయోధ్యకు
రమ్మని
ప్రార్థించి
తెత్తును.
అతను
అంగీకరించకున్న
నేనునూ
ఆ
ప్రభు
సన్నిధిలోనే
లక్ష్మణుని
వలె
సేవలు
చేయుచూ
అక్కడే
నివసింతును.
నీ
ముఖము
చూడను"
అని
తమ్మునితో
వెనుకకు
తిరిగెను.
తన
తప్పును,
తలంచుచూ,
తన
పన్నాగములు
కడకీరీతిగా
మారెకదా
అని
చెడ్డ
తలంపులు
ఎట్టివారలకైనా
తాత్కాలికపు
తృప్తిని
అందించును.
కానీ
జీవితములో
అవే
మన
పతనమునకు
రాజబాటగా
మారునని
తలంచి
ఇక
వేరు
మార్గము
లేక,
మాటలు
రాక,
కైక
స్తంభించి
పోయెను.
కైకకు
మంధరపై
విసుగుపుట్టెను.
భరతుడన్న
మాటలలో
అంతరార్థమును
సత్యమును
గుర్తించెను.
రాముని
పవిత్రమైన
తలంపులకు
ఎంతో
సంతసించెను.
తన
పాపబుద్ధికి
తాను
సిగ్గుపడెను.
25
▾
Meaning
Keep
కైకేయా
మందిరమునుండి
భరతశత్రుఘ్నులు,
సరాసరి
మంత్రులు,
గురువు,
పురప్రముఖులు
ఉండిన
సమావేశ
స్థానము
చేరిరి.
వారల
రాకకై
ఎదురు
చూచుచుండిన
మంత్రులు
ఏమి
నిర్ణయము
గావింతురో
అని
వినగోరుచు,
వారి
ప్రత్యుత్తరమును
వినుటకై
నిశ్శబ్దముగా
ఏకాగ్రచిత్తులై
ఉవ్విళ్ళూరుచునట్టు
కాచియుండిరి.
ఇంతలో
భరతుడు
గురువుగారి
పాదములకు
నమస్కరించి,
"గురుదేవా!
నేను
పరమ
సత్యమును
తెలుపుచున్నాను.
నిష్కపటముగా
వివరించగోరితిని.
నన్ను,
నా
మాటలను
విశ్వసింతురని
ఆశించుచున్నాను.
కారణముకంటె
కార్యమే
కఠినము.
పాషాణములో
పుట్టిన
లోహము
పాషాణముకంటే
కఠినమన్నది
మీకు
తెలుసు.
కఠినురాలైన
కైక
గర్భములో
పుట్టిన
నేను
మరింత
కఠినుడను.
కాకున్న
రామ
వియోగముచే
నా
ప్రాణములు
నా
శరీరమును
వీడిపోకున్నవి.
కైక
సీతా
రామ
లక్ష్మణులను
అడవికి
పంపి,
పతిని
స్వర్గమునకు
ప్రయాణము
చేయించి,
ప్రజలను
అశాంతిలో
ముంచి,
కొడుకును
అపకీర్తి
పాలుచేయగా,
రాజ్యమునకు
మాయని
మచ్చగా
నన్ను
రాజ్యము
నేలుమని
మీరు
శాసించుటలో
నాకేమాత్రమూ
సంతృప్తిలేదు.
నేను
అర్హుడను
కాదు.
రామచంద్రుడు
వనమున
సంచరించుచుండ,
నేను
రాజ్యాధికారిగా
సింహాసనముపై
కూర్చొనిన
లోకులు
నవ్వరా?
నా
పరిపాలన
ప్రజలకు
హానినే
కలిగించును.
నీతినిజాయితీలు
తప్పి
అక్రమంగా,
ధర్మవిరుద్ధంగా
రాజ్యాధిపత్యమును
వహించు
వారిని
చూచి
ప్రజలెవ్వరూ
గౌరవించరు.
కారణమేమన,
వారిని
నేను
దండించుటకు
అధికారముండదు.
నాలో
కావలసిన
దోషములు
గుట్టలుగా
పెట్టుకొని
పరుల
దోషములను
చక్కదిద్దుటకు
నేనే
మొగము
పెట్టుకొని
చెప్పగలను?
కాని
నాలోని
దోషములు
నేను
అధికారబలముచేత
కప్పిపుచ్చుకొన్ననూ
సమయము
వచ్చినప్పుడు
ప్రజలు
వ్రేలును
చూపించకపోరు.
నా
తల్లియొక్క
పాడుతలంపులు
నాకు
తలవంపులుగా
మారెను.
సీతారాములను
చూడక
నేనిక
క్షణమైననూ
నిలువజాలను.
నా
ఈ
దారుణమగు
దుఃఖమును
మీకు
విన్నవించుచున్నాను.
నా
దుఃఖము
రామదర్శనముతో
చల్లారును
తప్ప
అన్యబోధనలు
నన్ను
ఓదార్చలేవు.
26
▾
Meaning
Keep
నేను
కౌసల్యా
సుమిత్రల
ఆజ్ఞలను
పొందితిని.
రేపటి
తెల్లవారి
నేను
తమ్మునితో
కూడి
నా
ప్రభువును
దర్శించుటకు
వెళ్ళ
నిశ్చయించుకొంటిని.
నా
పాపము
లెన్నియున్ననూ
రామప్రభువు
చూపుతో
భస్మమయిపోవును.
తాను
పలుకరించకపోయిననూ
సరే
నేను
తనను
దర్శించుచూ
చెట్ల
చాటునైననూ
ఉండి
కాలమును
హాయిగా
గడుపుదును.
ఓ
మహాజనులారా!
మీరందరు
నా
శ్రేయస్సు
కోరి
నన్ను
దీవింపుడు.
మంత్రులారా!
నన్ను
రామునివద్దకు
వెళ్ళుటకు
అనుజ్ఞ
దయచేయుడు.
నేను
రామప్రభు
దాసుడను.
మనందరికీ
అతడే
ప్రభువు"
అనెను.
ఈ
పలుకులకు
పుర
ప్రముఖులు,
మంత్రులు,
సామంతులు
అందరూ
మారు
మాటాడలేక
పోయిరి.
భరతుని
బాధను
బాగుగా
అర్థము
చేసుకొనిరి.
భరతుడు
నిర్మలచిత్తుడనియూ,
తల్లి
పన్నిన
పన్నాగములకు
తాను
కట్టుబడలేదనియూ
తలంచి,
భరతుని
వచనములలోని
పవిత్రతను
గుర్తించిరి.
పురప్రముఖులలో
ప్రధానుడు
లేచి,
"ప్రభూ,
మీతోపాటు
మేమునూ
బయలుదేరి
వత్తుము.
రామ
వియోగమును
మేము
కూడనూ
భరించలేకున్నాము.
ఒకపరి
ఆ
ప్రభువును
దర్శించిన
తదుపరి
మా
ప్రాణములేమయిననూ
ఫరవాలేదు"
అని
సెలవును
గోరిరి.
ప్రజలందరూ
ఈ
కోరికను
మన్నించి
మమ్ముకూడనూ
తమవెంట
తోడ్కొని
పొమ్మని
కోరిరి.
ఈ
వార్త
కొన్ని
నిమిషములలో
పురమంతయూ,
నగరమంతయూ
ప్రాకెను.
ప్రతి
ఇంటిలోను
స్త్రీ,
పురుష
బాల
వృద్ధులందరూ
'మేము
కూడా
వత్తుము'
అని
ప్రయాణములైరి.
ఎవరు
ఎవరిని
వద్దని
నివారించగలరు?
రామ
దర్శనమునకు
వద్దని
చెప్పు
మూర్ఖులు
ఆనాడు
అయోధ్యలో
ఒక్కరునూ
లేకపోయిరి.
వారందరితో
పాటు
తల్లులైన
కౌసల్యా
సుమిత్రాదులు
కూడా,
దాసీలతో
బయలుదేరిరి.
ఇంతలో
కైక,
తన
పొరపాటునకు
పాపమునకు
పశ్చాత్తాప
పడుచూ
కౌసల్యకు
తన
కోరికను
తెలియపరచెను.
'తనను
కూడా
వనమునకు
తోడ్కొని
పో'గోరెను.
రాణులతో
'తన
తప్పును
క్షమించుమని
కోరి
తనను
అరణ్యము
చేరుటకు
తగిన
ప్రయత్నములు
27
▾
Meaning
Keep
కావింపుమ'ని
ఆశించెను.
నిర్మలచిత్తురాలైన
కౌసల్య,
తనలో
ఎట్టి
మాలిన్యము
కూడనూ
తలంచక,
చేర్చుక,
తప్పక
తనతో
రమ్మని
కబురంపెను.
సాయంత్రమునకు,
నగరములో
అందరూ
బయలుదేరుచున్నట్లు
భరతునకు
వర్తమానమందెను.
అయితే,
నగర
సంరక్షణకు,
కొంతమందైనా
ఉండక
తప్పదని
మంత్రికి
తెలిపి,
కొందరిని
నిలిచిపోవునట్లు
ఏర్పాట్లు
చేసెను.
రాత్రికే
కొన్ని
వాహనములు
ఒక్కొక్క
గృహముచెంత
సిద్ధమాయెను.
ఇంచుమించు
అన్ని
రకములైన
వాహనములు
సిద్ధము
చేసిరి.
వారలందరికి
ఆహారపానీయములు
ఏర్పాట్లు
గావించిరి.
చక్రవాక
మిథునము
వలె
నగరములోని
స్త్రీ
పురుషులు
ప్రాతఃకాలమునకు
ఎదురు
చూచుచుండిరి.
Previous
←
The Journey to the Forest
Next
The Bestowal of the Sandals
→