Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Bestowal of the Sandals
Rāma Kathā Rasa Vāhini
›
Part One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ఆనాటి
రాత్రి
పురజనులకు
మహా
సుదినముగా
ఉండెను.
ఎప్పుడెప్పుడు
సీతారామచంద్రులను
దర్శింతుము
అని
ఉవ్విళ్ళూరుచుండిరి.
చతురంగ
బలములను
సన్నాహము
చేసిరి.
అగ్నిహోత్రములు
చేయుటకు
తగిన
సామగ్రిని
ఏర్పాటు
గావించుకొనిరి.
పండితులు
రథములలో
వాహనములలో
సయితము
వేదపారాయణములు
చేయుచూ
ఉండవలెనని
మంత్రి
ఆజ్ఞాపించెను.
సుముహూర్తమున,
భరత
శత్రుఘ్నుల
వాహనములు
ముందూ,
వాని
వెంటనే
కౌసల్య
పల్లకిని
పెట్టించిరి.
అయితే,
అందరినీ
వారివారికి
నీమించిన
వాహనములలో
ఆసీనులు
కమ్మని
భరతుడు
అజ్ఞాపించెను.
తమ
రథమును
ఖాళీగా
నడుపుచు
భరత
శత్రుఘ్నులు
పాదచారులై
వెళ్ళుచుండిరి.
ఏదో
కొంత
దూరము
అట్లు
నడుతురని
తలంచిరి.
కాని
ఎంతసేపయినప్పటికిని
భరత
శత్రుఘ్నులు
రథమున
కూర్చొనకుండుట
చూచి
తల్లియైన
కౌసల్య
భరతుని
పిలిచి,
"నాయనా!
నీవు
ఈ
రీతిగా
పాదచారివై
వెళ్ళుటచూచి
నా
మనసు
తరుగుకొని
పోవుచున్నది.
కొంత
సేపయిననూ
రథమున
ఆసీనుడవు
కమ్ము"
అని
కోరెను.
అందులకు
"అమ్మా!
నా
పాప
పరిహారమునకు
ఇది
ఒక
మార్గము.
పాదచారులై
సంచరించుచున్న
సీతారామలక్ష్మణులకు
లేని
శ్రమ
నాకేమి?
వారి
దాసుడనై
నేను
రథమునందు
కూర్చొనుట
మహాదోషము.
తమ
ఆజ్ఞను
మీరుచున్నానని
తలంచక
క్షమించి
నన్నిట్లే
నడచుటకు
అనుజ్ఞ
ఇవ్వు"దని
కోరెను.
ఇంతలో
ముందు
రథములో
ఆసీనులైన
గురువుగారగు
వశిష్ఠుడు
అరుంధతియూ
వారి
వాహనమును
ఆపి,
భరతుని
దీక్షను
గమనించి,
తమ
రథమునకు
సారధిగానైనా
2
▾
Meaning
Keep
కూర్చొనమని
కోరిరి.
క్షమించుమని
కోరుచూ
భరతుడు,
"రామ
రథమునకు
మాత్రమే
నేను
దాసుడను,
అంతవరకూ
ఏ
రథమునూ
నేను
ఎక్కను,
ఏ
గుళ్ళములను
చేపట్టను.
ఇది
నా
ప్రతిజ్ఞ"
అని
తెలిపెను.
అతని
రామ
ప్రేమకు
వశిష్ఠుల
వారెంతయో
సంతసించిరి.
మొదటి
దినము
రాత్రికి
తమసానది
తీరమును,
రెండవ
దినము
గోమతీ
తీరమును
చేరిరి.
తమసానది
ఘూర్రునది
యొక్క
ఉపనది.
గోమతి,
గంగానది
ఉపనది.
చీకటిపడిన
తోడనే
రథములను
ఆపి,
స్త్రీలకూ,
పిల్లలకూ,
వృద్ధులకూ
తగిన
వసతులూ,
తిండితీర్థాదులు
సక్రమంగా
గావించమని
మంత్రి
సిపాయిలకు
ఆజ్ఞ
చేసెను.
ఎవరెవరికి
నీమించిన
పనులు
వారు
ఆయా
వేళలకు
గావించుచు
మార్గమధ్యమున
ఎవ్వరికీ
ఎట్టి
ఇక్కట్లు
కలుగకుండా
చూచుకొని
పోవుచుండిరి.
మూడవ
దినము
తెల్లవారి
బయలు
దేరి
ఆనాటి
రాత్రికి
శృంగిబేరపురమునకు
వచ్చిరి.
భరతుని
ఆగమనము;
నిషాదపతి
విని
విషాదము
నొంది,
"ఈ
భరతుడు
వనమునకు
బోవుటకు
కారణమేమి?
వెళ్ళిననూ
ఇంత
సైన్యముతో,
చతురంగబల
సమేతుడై
వెళ్ళుటలోవున్న
అంతరార్థమేమి?"
అని
తనలోతాను
అనేక
విధముల
అనుకూల
ప్రతికూల
భావములను
పెంపొందించుకొనెను.
'చెట్టు
విషమయినపుడు
ఫలముమాత్రము
విషము
కాకుండునా?'
అని
నిర్ణయించుకొని,
తన
జాతివారలను
పిలిచి,
"అన్ని
పడవలను
నీటిలో
ముంచిపెట్టుడు.
పడవమార్గమును
స్తంభింపచేయుడు.
ఏ
చిన్న
పడవను
కూడ
నడపకూడద"ని
శాసించెను.
ఈ
దినము
మనము
చావునకైననూ
తెగించి
అన్నిటికినీ
సంసిద్ధమై,
వచ్చువారలు
అటువైపున
చేరకుండునట్లు
చూడవలెనని
ఆజ్ఞాపించెను.
ఇంతలో
నిషాదపతి
ధనుర్బాణములను
తెప్పించెను.
భరతుడు
మహాసైన్యము
కలవాడయిననూ
రామ
నిమిత్తమై
తన
కించిత్
శక్తిని
ధారపోయ
తలంచెను.
తన
జాతివారినందరినీ
అన్ని
విధములా
యుద్ధమునకు
సిద్ధముగా
ఏర్పరచి,
భరతుడు
మిత్రుడో,
శతృడో,
మధ్యముడో
మొదట
కనుగొనవలెనని,
3
▾
Meaning
Keep
రాజును
దర్శించుటకు
వెళ్ళునపుడు
తీసుకొని
వెళ్ళదగిన
పదార్థములన్నిటినీ
సిద్ధపరచుకొని
ఫలములను,
పుష్పములను,
మీనములను,
పలలములను,
ప్రాచీన
పారీనములను
గంపలు
గంపలు
తెప్పించెను.
కందమూల
ఫలములు
సత్వగుణము;
వానివలన
మిత్రుడని
తెలియును.
ఖరమృగములు,
రజోగుణము;
వానివలన
మధ్యముడని
తెలియును.
మీనములవలన
శత్రువని
తెలియును;
అవి
తమోగుణము.
నిషాదపతి
ఈ
సామగ్రులను
వెంటతీసుకొని
భరతుని
చూచుటకు
వెళ్ళెను.
అపుడు
మంచి
శకునమయ్యెను.
దూరమునుండి,
వశిష్ఠులవారిని
జూచి
తనపేరు
చెప్పుకొని,
గురువునకు
దండప్రణామములు
ఆచరించెను.
అతడు
శ్రీరాముని
సఖుడని
గ్రహించి,
గురువు
అతనిని
దీవించెను;
భరతుని
బిలిచి,
నిషాదపతిని
చూపి,
ఇతడు
శ్రీరాముని
సఖుడని
తెలిపెను.
ఆ
మాటలు
వినిన
వెంటనే
నిషాదపతిని
కౌగలించుకొని
అనేక
విధముల
క్షేమసమాచారములు
విచారించెను.
గుహునితో
మాటలాడు
సందర్భమున
ఒకనాటి
రాత్రంతయూ
రామచంద్రుడు
ఈ
నదీతీరమున
తనతో
కాలము
గడిపెనని
గుహుడు
చెప్పగానే
కన్నులు
కరువుతీరా
విప్పి,
చెవులను
నిక్కబొడుచుకొని,
ఆనాటి
రాత్రి
రామునితో
గడిపిన
పవిత్ర
సమయమును
వర్ణించుమని,
తానెంతో
ఆతురతతో
ప్రశ్నించెను.
నిషాదపతి
రామచంద్రుని
ఎంతయో
కొనియాడి,
సీతా
రామలక్ష్మణుల
విశ్రాంతి
నిమిత్తమై
తాను
ఏర్పరచిన
కుటీరములను
చూపుచూ,
లక్ష్మణునితో
ఆ
రాత్రి
సంభాషించిన
పవిత్ర
సంభాషణలను
భరతునకు
తెలుపుతూఉండ,
భరత
శత్రుఘ్నులు
కంట
తడిపెట్టుకొని,
పొరలివచ్చు
దుఃఖమును
అణచుకొనుచూ
ఉండుట
చూచి,
నిషాదపతి,
భరత
శత్రుఘ్నుల
భక్తి
శ్రద్ధలను
అర్థము
చేసుకొని,
వీరు
నిజముగా
రామసోదరులే
కాని,
రామ
విరోధులు
కారని
తనలో
తాను
సమ్మతించెను.
సీతారాముల
నిమిత్తమై
నిషాదపతి
ఏర్పరచిన
కుటీరములను
దర్శించుచూ,
వాటిని
తగిన
జాగ్రత్తతో
చూచుకొనవలెనని
భరతుడు
కోరెను.
4
▾
Meaning
Keep
తిరిగి
గురువాజ్ఞను
వడసి,
తమ
తల్లులతో
గంగానదీ
స్నానము
లాచరించి,
తిరిగి
నిషాదపతిని
పిలిపించుకొని
ఆనాటి
రాత్రి
రామచంద్రుడు
విశ్రమించిన
స్థలమును
చూపమని
కోరగా,
నిషాదపతి,
పెద్ద
వటవృక్షము
చెంతకు
తీసుకొని
వెళ్ళి
అక్కడ
గాలికి
చెదిరిపోయివున్న
దర్భాసనము
చూపి,
సీతారాములు
ఇక్కడ
విశ్రమించిరని
తెలుపగనే
భరతశత్రుఘ్నులు
ఆ
పవిత్ర
స్థలమునకు
నమస్కరించిరి.
"పట్టుపాన్పులపై
పవ్వళించు
నా
ప్రభువు
ఇంతటి
కఠిననేలపై
ఎట్లు
పవళించెనో?
ఆ
మహాతల్లి
సీతామాత
ఎన్నిశ్రమలు
పడెనో?"
అని
వారికివారు
తలంచి,
మహాబాధతో
అక్కడే
కొంతసేపు
నిలిచి,
తిరిగి
నా
ప్రభువు
సంచరించిన
స్థానములు
చూపించమని
భరతుడు
కోరగా,
శింశుపావృక్షమును
చూపించి,
దాని
క్రింద
ఫలములు
భుజించిరని
నిషాదపతి
తెలుపగా
అక్కడకూడనూ
వారు
నమస్కరించిరి.
ఈ
స్థలములు
దర్శించు
నంతకాలము
భరతశత్రుఘ్నులు
పడిన
బాధ
వర్ణనాతీతము.
రామ
ప్రేమకు
నిదర్శనముగా
వారు
చూపిన
వినయ
భక్తిశ్రద్ధలు
గుహుని
హృదయాన్ని
కరిగించెను.
దశరథమహారాజు
కోడలు,
జనకమహారాజు
ప్రేమ
పుత్రిక
శ్రీరామచంద్రుని
ధర్మపత్ని
అయిన
సాక్షాత్
లక్ష్మీదేవియే
అయిన
ఆ
సీతాదేవి
ఇన్ని
విధములైన
అననుకూలముల
పాలు
కావటము
భరతుడు
భరించలేక
పోయినాడు.
"అట్టి
మహాపవిత్ర
ప్రభుదంపతులను
విడచి,
అయోధ్యావాసులు
ఉండలేకపోవుటచేత,
రాముడు
లేని
అయోధ్య
అరణ్యముగా
ఎండబారుట
చేత,
వారి
తాపములు
చూడలేక,
మేమును
ఆ
అరణ్యమున
నివసించలేక
సపరివారముగా
రాముడున్న
ప్రదేశమే
అయోధ్య
అని
తలంచి
అందరమూ
బయలుదేరి
రామ
సన్నిధికి
వెళ్ళుచున్నామ"ని
భరతుడు
తెలిపినంతనే,
నిషాదపతికి
విషయము
పూర్తిగా
అర్థమాయెను.
లేకున్న
రామదర్శనార్థము
చతురంగబల
సమేతముగా
వెళ్ళుటలో
అర్థము
లేని
విషయం
అని
తలంచి
తాను
పూర్వము
తలచిన
భావములను
వెలువరచి
క్షమించుమని
కోరెను.
భరతుడు
అందులో
తప్పేమియూ
లేదనియు,
తాను
మహా
కిరాతకుడననియూ,
శ్రీరాముల
5
▾
Meaning
Keep
వనవాసమునకు
తానే
కారణమనియు
అట్టి
కారణభూతుడైన
నన్ను
వధించినను
పాపము
లేదనియు
తన్ను
తాను
నిందించు
కొనుచుండ,
నిషాదపతి
క్షమించుమని
ప్రార్థించెను.
భరతుని
ఆగమనమును
విని,
శృంగిబేరపుర
ప్రజలు
గుంపులు
గుంపులుగా
వచ్చి
వారిని
దర్శించి
రామచంద్రుని
సోదరులని
విని
అనేక
విధములు
వారిని
స్తుతించి,
నమస్కరించి,
కైకేయిని
దూషించిరి;
విధికృతమునకు
బ్రహ్మను
దూషించిరి;
కన్నీరు
కార్చిరి;
రామచంద్రుని
అనేక
విధముల
కొనియాడి,
త్వరలో
రామచంద్రుని
వెనుకకు
తోడ్కొని
రమ్మని
స్త్రీ
బాల
వృద్ధులు
ఏక
కంఠముతో
భరత
శత్రుఘ్నులను
కోరిరి.
వారు
రామ
వియోగంచేత
పడుచున్న
బాధలను
గమనించి
భరతుడు
మాటాడలేక
పోయెను;
కంటిధారలు
కార్చెను.
"ప్రార్థించుట
నా
వంతు;
తదుపరి
రామకృప.
నేను
దాసుడనే
కానీ,
రాముని
నిర్బంధ
పెట్టుటకు
నేనెంత
వాడను?
మీరు
కూడా
మీ
మీ
హృదయములలో
రామచంద్రుడు
అయోధ్యకు
తిరిగి
చేరవలెనని
రామునే
ప్రార్థింపుడు.
ఈ
విధమైన
మీ
ప్రార్థనలు
నా
ప్రార్థనలకు
సహాయపడును.
మన
అందరి
ప్రార్థనలచేత
రామహృదయము
కరుగక
మానదు.
ఇదియే
మన
కర్తవ్యము.
లోకోద్ధారకుడైన
రాముడు
లోకుల
అభీష్టమును
కాదనలేదు
కదా!"
అని
ఆ
వచ్చిన
ప్రజలకు
తగిన
రీతుల
సమాధానములు
ఇచ్చెను.
ఇంతలో
చీకటి
పడెను.
ప్రజలను
వారివారి
గృహములకు
వెళ్ళుటకు
నిషాదపతితో
తెలిపి,
ఆ
రాత్రి
నిషాదపతి
తెచ్చిన
ఫలములను
భుజించి
రాత్రంతయూ
రామ
విషయములనే
మాటలాడుతూ
కాలము
గడిపిరి.
తెలతెలవారుచుండగనే
ప్రజలను
మేలుకొలుపమని
మంత్రికి
తెలిపి
తమ్మునితో,
తల్లులతో
పవిత్ర
గంగాస్నానము
నాచరించి,
ముందు
కొనసాగించ
వలసిన
ప్రయాణమునకు
సిద్ధపడిరి.
నిషాదపతి
పడవలను
తగినన్ని
ఏర్పాటు
చేసి
అయోధ్యా
ప్రజలను,
రథములనూ,
గుళ్ళములనూ
అన్నింటినీ
దాటించెను.
అటు
వైపున
చేరిన
తరవాత
అందరూ
వచ్చినదీ
లేనిదీ
ఒకపరి
విచారించి,
6
▾
Meaning
Keep
నిషాదపతి
మార్గమును
చూపించుచుండ
భరతుడు
పరివారముతో
అతనిని
అనుసరించెను.
బ్రాహ్మణులు,
వశిష్ఠులవారు
ఒక
గుంపుగా,
ప్రజలందరూ
ఒక
గుంపుగా
కొంతదూరము
నడిచిరి.
మూడవ
యామమునకు
భరతుడు
పరివారముతో
ప్రయాగకు
వచ్చి
చేరెను.
భరతుడు
ఏనాడునూ
ఇంతదూరము
పాదచారియై
ప్రయాణము
చేయనందున
పాదములు
పొక్కులుకట్టి,
చితికి
మంటలు
పెట్టెను.
అయిననూ,
వాటిని
లెక్కచేయక
తన
బాధల
నన్నింటినీ,
రామబాధగా
భావించెను.
ఈ
విధమైన
బాధలు
రాముడెన్ని
విధములుగా
అనుభవించెనో
అని
రామ
ప్రేమను
తలచుచు,
తన
విషయము
మరచెను.
అందరూ
పవిత్ర
త్రివేణీ
స్నానము
నాచరించిరి.
ప్రయాగ
వాసులైన
వైఖానసులు,
బ్రహ్మచారులు,
గృహస్థులు,
ఉదాసీనులు,
దిగంబరులు,
యోగులు,
ఋషులు
మొదలగు
వారందరూ
భరతునిచూసి
ఆనందించిరి.
ఇతని
వర్చస్సు
శ్రీరామచంద్రుని
పోలియున్నది.
నిజముగా
ఇతనే
శ్రీరామచంద్రుడా
అన్నట్లు
వారి
కండ్లకు
కనిపించెను.
చూచిన
ప్రతివారూ
రెప్పలార్పక
నిలిచి
చూచుచుండిరి.
రాముని
సోదరులైన
భరత
శత్రుఘ్నులు
చతురంగబల
సమేతులై
తల్లులతో,
మంత్రులతో
ప్రయాగ
చేరుకొన్నారన్నవార్త
భరద్వాజ
ఆశ్రమవాసులకు
తెలిసెను.
భరద్వాజ
మహర్షి
తమ
శిష్యులను
పంపి
ఆశ్రమమునకు
ఆహ్వానించెను.
మహాఋషి
ఆజ్ఞానుసారము
భరతుడు
తమ్మునితో
ఆశ్రమమును
ప్రవేశించెను.
మునిరాజునకు
ఇరువురూ
నమస్కరించిరి.
భరద్వాజ
మహర్షి
వారలను
లేవనెత్తి
ఎంతో
వాత్సల్యముతో
వారలను
దగ్గరకు
చేర్చుకొని
చల్లని
పానీయములను
తెప్పించి
ఇప్పించెను.
అయితే
మహాఋషి
తనను
ఏమి
ప్రశ్నించునో?
ఏమి
అడుగునో?
అని
భరతుడు
లోలోన
భయపడుతూ,
సిగ్గుచే
శిరస్సును
వంచుకొని,
విచారముగా
నుందునటుల
కనిపించెను.
మహర్షి
భరతుని
స్థితిని
గమనించి
"భరతా!
భయపడ
7
▾
Meaning
Keep
నక్కరలేదు,
నాకు
సర్వమూ
విదితమే.
విధికృతములు
ఒకరి
అధీనములు
కావుకదా!
నీ
తల్లికోరిన
కోర్కెను
నీవు
తలంచి
విచారించ
పనిలేదు.
ఆమె
దోషము
ఇందులో
ఏ
మాత్రమూలేదు.
దైవ
సంకల్పమే
ఆమె
బుద్ధిని
ఆ
రీతిగా
మార్చినది;
కైకకు
శ్రీరాముడన్న
మహా
ప్రాణము;
అట్టి
తల్లి
ఇంతటి
కఠిన
చర్యకు
పాల్పడెనన్న
దైవకృతమే
కాని
మానవమాత్రుల
ప్రయత్నములు
కావు.
లోకవాడుక
ప్రకారము
కైక
దోషి;
వేదాచార
ప్రకారము
సరస్వతి
దోషి;
వీరిరువురు
పరమాత్మకు
సమ్మతమే.
ప్రభువు
స్వేచ్ఛానుసారము
సర్వమూ
జరిగెను.
భరతా!
నీ
నిర్మలకీర్తిని
గానము
చేయుటవలన
లోకములకు,
వేదములకూ
గొప్పతనమువచ్చును.
ఏ
కొమారునికి
తండ్రి
రాజ్యము
ఇచ్చిన,
వాడే
రాజ్యము
చేయుట
కర్హుడు
అని
లోకసిద్ధాంతము.
అదియే
వేదవాక్యము.
ఆ
సత్యసంధుడు,
మహాత్ముడు,
దశరథమహారాజు
నిన్ను
బిలిచి
నీకు
రాజ్యమిచ్చి
రాజ్యధర్మముల
ననుసరించి
ప్రవర్తింపుమని
చెప్పెను.
శ్రీరాముని
వనగమనము
సకల
అనర్థములకూ
మూలమయ్యెను.
అందులకు
లోకమంతయూ
విచారించెను.
ఇప్పుడు
నీ
తల్లి,
పూర్వము
తాను
చేసిన
పనికి
విచారించెను,
ఈ
విషయములో
నీ
అపరాధ
మేమాత్రమూ
లేదు;
నీవు
రాజ్యమును
ఏలిననూ
ఫరవాలేదు;
నీవు
రాజ్యము
నేలుచున్నావన్న
విషయమును
విన్న
శ్రీరాముడు
కూడా
సంతసించును.
అంతేకాదు,
నీవు
ఇప్పుడు
పూనుచున్న
పని
శ్లాఘనీయము.
నీ
యుద్యమము
సర్వోత్కృష్టము.
శ్రీరాముని
చరణారవిందముల
యందు
అనురాగము
కలిగియుండుటయే
సకల
సన్మంగళములకు
మూలము.
భరతా!
నీ
యంతటి
గుణశాలి,
అదృష్టవంతుడు,
వేరొకడు
లేడనే
చెప్పవచ్చును.
రాముని
ప్రియసోదరుడవనుటలో
సార్థక
నామమును
అందుకొంటివి.
శ్రీరామచంద్రుడు
వనమునకు
వెళ్ళు
మార్గమధ్యమున
మా
ఆశ్రమమును
పవిత్రము
చేసెను.
ఆనాడు
అర్థరాత్రి
వరకూ
రామప్రభువు
నీ
గుణములనే
వర్ణించెను.
వారు
ప్రయాగకు
స్నానము
చేయుటకు
నాతోనే
వచ్చిరి.
స్నానమాచరించు
సమయమున
కూడనూ
నిన్ను
తలంచి,
"అయోధ్యను
8
▾
Meaning
Keep
విడచునపుడు
నా
సోదరులైన
భరత
శత్రుఘ్నులను
చూడనైతిన"ని
ఎంతో
విచారించెను.
రామునకు
మీ
పైనున్న
ప్రేమ
ఇంతయని
చెప్పలేను.
అంతేకాదు.
అతడు
ప్రణతార్తిహరుడు.
అతనికి
లోకమే
కుటుంబము.
మూర్తీభవించిన
శ్రీరాముని
వాత్సల్యమే
నీవని
నా
అభిప్రాయము!
ఏ
విషయమును
నీవు
కళంకమని
తలంచుచుంటివో
ఆ
విషయము
నావంటి
వారికి
ఉపదేశమనే
నా
అభిప్రాయము.
భరతా!
నీవు
చింతించకూడదు.
చింతామణిని
స్వీకరించి
దరిద్రమని
తలంచుట
మంచిది
కాదు.
సీతారామ
లక్ష్మణులను
దర్శించుటయే
సకలసాధనములకు
ఫలము.
ఆ
ఫలము
నాకు
లభించెను.
కన్నులార
వారిని
చూచితిని;
సంభాషించితిని;
స్పర్శించితిని;
ఆతిథ్యము
నందించితిని.
అంతో
ఇంతో
శేషము
కొంత
ఉన్నది.
నీ
దర్శనముతో
పూర్తి
అయినది.
నేను
ధన్యుడను.
ఇట్టి
మునులను
పవిత్ర
మొనర్చుటకే
రామచంద్రుడు
వనవాసము
చేసెను.
ధన్యులము!"
అని
ఈవిధముగ
భరద్వాజ
మహాఋషి
భరతుని
అనేక
విధముల
కొనియాడెను.
భరద్వాజుని
నేత్రములనుండి
ఆనంద
బాష్పములు
ఏకధారగా
నేల
రాలెను.
భరత
శత్రుఘ్నులు
రామప్రేమను
తలంచుచూ
ఎంతటి
అదృష్టవంతులమో
అన్న
భావమును
తమలో
తాము
తలంచి
అట్టి
ప్రేమ
స్వరూపునికి
దూరమైతిమి
కదా
అని
భరించలేని
బాధను
తెలుపలేని
హృదయముతో
విచారించిరి.
భరతుడు
గద్గదస్వరముతో
మహాఋషులవారికి
నమస్కరించి,
"స్వామీ!
మీరు
త్రికాలజ్ఞానులు,
మీ
వాక్యములు
పరమ
సత్యములు.
రామచంద్ర
ప్రభువు
సమర్థుడు,
సర్వజ్ఞుడు.
అయిననూ
తమ
సన్నిధియందు
పరమ
సత్యమునే
పలుక
తలంచితిని.
జనుల
మనోభిప్రాయములు
రామచంద్రప్రభువుకు
తెలియును.
మా
తల్లి
చేసిన
దుర్వ్యాపారమునకు
దుఃఖము
లేదు,
లోకులు
నన్ను
దూషింతురను
భయము
లేదు,
పరలోకము
నాకు
దక్కదేమో
అన్న
విచారము
కూడనూ
లేదు.
మా
తండ్రి
కీర్తిమంతుడు,
మృతజీవుడు.
వారి
కీర్తి
లోకమంతయూ
వ్యాపించెను.
9
▾
Meaning
Keep
ప్రియ
పుత్రులైన
రామలక్ష్మణులు
వారి
గర్భమున
పుట్టిరి.
రామ
వియోగ
దుఃఖమును
భరించలేక
తండ్రి
క్షణభంగురమైన
కాయమును
క్షణములో
వీడిరి.
అందుచేత
వారిని
గురించి
విచారించ
పనిలేదు.
సీతారామలక్ష్మణులు
మునివేషములను
ధరించి
వనములలో
పాదచారులై
క్రుమ్మరుచుండిరి.
కుశపత్రములే
వారి
ఆసనములు.
తరుచ్ఛాయలే
వారి
నివాసము.
ఎండల
కెండి,
వానలకు
తడిసి,
చలిబాధల
కోర్చి
వనములలో
వారు
తిరుగుచుండిరి
కదా!
వారి
కష్టములన్నింటికి
నేనే
కదా
కారణము.
ఈ
దుఃఖమే
దివారాత్రములు
నన్ను
దహించుచున్నది.
కడుపునకు
తిండి,
కంటికి
నిద్ర
చేరకున్నవి.
నా
తల్లియొక్క
ఈ
కుబుద్ధియే
నా
ప్రాణముల
పాలిటి
వ్రదంగి
వంటిదైనది.
ఆమె
నాకు
హిత
మనుకొని
చేసిన
పనియే
నాకు
మహా
అహితము,
అపకారముగా
మారినది.
నా
ఈ
బాధ
ఏమి
చేసిననూ
తీరదు.
దీనికి
మందే
లేదు.
ఏనాడు
రామ
చంద్రుడు
అయోధ్యకు
తిరిగివచ్చునో
ఆనాడే
నా
ఈ
బాధ
తీరును.
ఇంతకంటే
మరొక
మార్గము
నా
బాధను
తీర్చలేదు.
ఈ
మాటకు
మునులందరును
హర్షించిరి.
అనేక
విధముల
వారతని
నుగ్గడించిరి.
"నాయనా!
భరతా!
ఇకపై
ఇట్టి
విచారము
నొందకుము.
శ్రీరామచంద్రుని
చరణకమలములను
సందర్శించినంతనే
నీ
విచారములన్నియు
పటాపంచలైపోవును".
అని
ఈవిధముగ
మునులు
భరతుని
ఓదార్చిరి.
భరద్వాజ
మహాఋషులవారు
తమ
శిష్యుని
పిలిచి,
"భరత
శత్రుఘ్నులకు
కందమూల
ఫలాదులను
తెచ్చిపెట్టమ"ని
ఆజ్ఞాపించెను.
రామసందర్శనాభిలాషులై
అనేక
ఇక్కట్లకు
సహితము
ఓర్చుకొని
రామవియోగబాధతో
కుములుతున్న
అయోధ్యా
ప్రజలకు,
మంత్రులకు,
పరివారమునకు
తగిన
ఆహారములు
ఏర్పాట్లు
చేయునట్లును
శిష్యులకు
ఆనతిచ్చెను.
గురువాజ్ఞను
శిరసావహించి
క్షణములో
పరివారమునకు,
ప్రజలకూ,
అందరికీ
తగిన
రీతిగా
మృష్టాన్నములు
ఏర్పాటు
చేసిరి.
భరతునకు,
శత్రుఘ్నునకూ,
వారి
కుటుంబము
వారలకు,
మంత్రులకు,
10
▾
Meaning
Keep
పండితులకు,
బ్రాహ్మణులకు,
అత్యంత
వైభవముగా
విందులు
ఏర్పాటు
గావించిరి.
మహాముని
తపోమహిమతో
క్షణములో
గావించిన
అద్భుతమైన
ఏర్పాటుకు
భరతుడు
సంతసించెను.
అయితే,
ఈ
వైభవములు
భరత
శత్రుఘ్నులకే
కాక.
అయోధ్యా
వాసులకు
సహితము
తృణప్రాయములవలె
గనిపించెను.
సుగంధ
ద్రవ్యములు,
పూలగుచ్చములు,
ఫలములు,
వివిధ
రకములైన
భోజన
పదార్థములు
చూచుటకు
చాల
వింతగా
ఉండెను.
భరత
శత్రుఘ్నులకై
ఏర్పరచిన
రెండు
ఉన్నత
ఆసనాలను
వర్ణించ
వీలులేకపోయెను.
ముని
ఆజ్ఞను
శిరసావహించి
అయోధ్యావాసులు,
పరివారము,
మంత్రులు,
పండితులు,
బ్రాహ్మణులూ
అందరూ
ఆ
సుందరమైన
మందిరమున
ప్రవేశించిరి.
వశిష్ఠులవారికి,
వారి
ధర్మపత్నికి
ప్రత్యేక
ఉన్నతాసనము
నేర్పరచిరి.
అందులో
వారు
ఆసీనులైరి.
ఇక
రాణులు
వారి
వారి
స్థానములందు
పరదాలలో
మహా
విచారముతో
చేరిరి.
ముని
శిష్యులు,
భరత
శత్రుఘ్నులను
ఆశ్రమ
మర్యాదలతో
వింజామరలు
వీచుచూ
తోడ్కొని
వచ్చిరి.
ఆ
ఆసనముల
చెంతకువచ్చిన
తోడనే,
భరత
శత్రుఘ్నులు
శిరస్సు
వంచుకొని
నమస్కరించి,
ముని
శిష్యుల
హస్తములందున్న
వింజామరలను
తీసుకొని
రెండు
ఉన్నత
సింహాసనములకు
అటు
ఒకరు
ఇటు
ఒకరు
నిలుచుకొని,
వింజామరలతో
ఆ
సింహాసనములకు
సేవలు
సలిపిరి.
చేరిన
అయోధ్యావాసులు,
ఎవ్వరూ
ఆసీనులు
కానట్టి
ఆ
సింహాసనములకు
సేవ
చేయుచున్న
భరత
శత్రుఘ్నులను
చూచి
ఆశ్చర్యపడిరి.
ముని,
వారలను
"సింహాసనములపై
ఆసీనులు
కమ్మ"ని
కోరగా,
భరత
శత్రుఘ్నులు
మునికి
నమస్కరించి,
"స్వామీ!
ఈ
స్థానములు,
సీతారాములవి
కానీ
మావి
కావు.
మాకంతటి
అధికారము
లేదు.
ముని
ఆశ్రమములందు
లక్ష్మీనారాయణ
సమానులైన
సీతారాములు
మాత్రమే
ఇట్టి
ఆసనములందు
కూర్చోను
అధికారులు.
మేము
వారి
సేవకులము.
మాకు
ఈ
విధమైన
సేవను
అందించుటకు
అనుజ్ఞ
ఇమ్మని
కోరిరి.
ఈ
విధమైన
మాటలతో
అందుచేరిన
11
▾
Meaning
Keep
ప్రజలు,
ఋషులు,
మునిశిష్యులు
పరమానందపడి
భరత
శత్రుఘ్నుల
యొక్క
రామభక్తిని
వర్ణించిరి;
ఆనందబాష్పముల
రాల్చిరి.
వారి
విశ్వాసమునకు
మునులు
కూడనూ
పరమానందపడిరి.
తెచ్చి
పెట్టిన
ఫలహారములు,
పండ్లు,
కంద
మూలాదులను
ఆ
సింహాసనములకే
నైవేద్యముగా
నొసంగి,
అందులో
సీతారాముల
స్వరూపభావములను
చిత్రించుకొని,
వారి
ప్రసాదములుగా
భావించి
ఒక్క
పర్యాయము
ఆ
ఫలహారములలో
అణు
మాత్రము
త్రుంచుకొని
కన్నుల
కద్దుకొని
భుజించిరి.
సీతారాముల
వియోగబాధతో
మేమీ
విందులను
ఆరగింపలేమనియు
మునివర్యులు
క్షమించవలెననియూ
ప్రజలూ,
పరివారము,
భరద్వాజ
ఋషులవారిని
క్షమాపణ
వేడిరి.
ముని
ఎంత
వైభవముగా
విందు
ఏర్పాటు
చేసెనో
అంత
అలక్ష్యముగా
అయోధ్యా
వాసులు
దానిని
తిరస్కరించిరి.
ఆరగింప
మనస్కరింపలేదనియూ,
రామదర్శనమే
మాకు
అమృతపానమనియూ,
ఆ
క్షణమునకై
తహతహ
లాడుచుండిరి.
ముని
చేయునదిలేక
వారి
ఇష్టప్రకారమే
అనుమతించెను.
తెలతెలవారగనే
అందరూ
ప్రయాణమునకు
సిద్ధమైరి.
అందరూ
మునివర్యులకు
నమస్కరించి,
సెలవు
తీసుకొని
ఆశ్రమమును
వీడిరి.
మార్గమును
చూపించు
సేవకులు
ముందు
నడచుచుండ
మిగిలిన
రథములు
పల్లకీలు
వారిని
అనుసరించెను.
ఈ
రీతిగా
నడచుచూ,
మూర్తీభవించిన
అనురాగమే
అనునట్లు
భరతుడు
నిషాదపతి
మెడమీద
హస్తములు
వేసి
నడచుచుండెను.
పాదములకు
రక్షలుకానీ,
పైన
గొడుగుకానీ
లేదు.
పెట్టనివ్వలేదు,
పట్టనివ్వలేదు,
అది
వారి
వ్రతము.
ఒక
మేఘము
తానిసిగ్గపడి
నీడనిచ్చెను.
భూమి
జాలినొంది
మృదుమధురముగా
మారెను.
వాయువు
చల్లని
పిల్లవాయువులుగా
మారి
వీచెను.
ఆ
దినము
సాయంకాలమునకు
యమునా
తీరమును
చేరి
అక్కడ
విశ్రమించిరి.
రాత్రికి
రాత్రి
లెక్కలేనన్ని
పడవలు
యమునానదిలో
కనిపించెను.
తెల
తెల
వారగనే
ఏక
కాలముననే
అందరూ
నదిని
దాటిరి.
స్నానము
లాచరించి
12
▾
Meaning
Keep
అటువైపున
నదికి
నమస్కరించి
ప్రయాణము
సాగించిరి.
అక్కడనుండి
భరత
శత్రుఘ్నులు
సాధువుల
వేషమును
ధరించిరి.
వారి
వెంట
మంత్రులు,
మిత్రులు,
సేవకులు,
సీతారాములను
స్మరించుచూ
నడిచిరి.
మధ్య
మధ్య
అడ్డుతగిలిన
పల్లెవారు.
నదీతీరమునకు
జలనిమిత్తమై
వచ్చిన
స్త్రీలు,
దుత్తలు
క్రింద
పెట్టి
రెప్పవాల్చక
వీరులను
చూచుచూ,
మొన్న
వెళ్లిన
రామలక్ష్మణులే
వీరుగా
ఉన్నట్లున్నది;
ఆనాడు
సీతాసమేతులై
వెళ్లిరి;
ఈనాడు
చతురంగబలసమేతులై
వచ్చుచున్నారు.
సీత
ఎక్కడున్నదో
అని
ఆమె
నిమిత్తమై
అటూ
ఇటూ
చూచుచూ,
వారిలో
వారు
విచారించుచుండిరి.
అయితే,
ఆ
స్త్రీల
పలుకులలో
యథార్థము
లేక
పోలేదు.
ఆనాటి
రామలక్ష్మణులు
రూపవయశ్శీల
లావణ్యములతో
కళకళ
లాడుచుండిరి.
వీరి
ముఖములు
ఖేదముతో
కూడియున్నవి.
అందుచేత
వారే
వీరు
కాకపోవచ్చునని
మరొకరు
జవాబు
చెప్పుకొనుచుండ
పరివారములోని
గూఢచారులు
విని
భరత
శత్రుఘ్నులకు
తెలిపిరి.
ఇంతలో
వారు
విచారించిరి.
ఈ
ఇరువురూ
శ్రీరామచంద్రుని
సోదరులనియూ,
వారు
శ్రీరామచంద్రుని
సందర్శనార్థమై
వెళ్లుచున్నారనియూ
తెలిసికొని
అందులో
ఒక
గడుసు
స్త్రీ
నిర్దాక్షిణ్యముగా
ఈ
రీతిగా
పలికెను;
"సఖీ!
తండ్రి
ఇచ్చిన
రాజ్యమును
ఏలుతూ,
తానే
రాజునైతినన్న
గడుసు
తనముతో,
రాములను
దర్శించుటకు
చతురంగబలసమేతుడై
వెళ్లుటకు
సిగ్గులేదు"
అని
అన్నది.
అంతలో
మరొక
స్త్రీ
"అక్కా!
అట్లనకు.
మన
దశరథమహారాజునకు
అట్టి
కఠిన
బుద్ధులుగల
బిడ్డలు
పుట్టరు.
చతురంగ
బలసమేతముగా
వెళ్లి
రామచంద్రుని
ప్రార్థించి,
అయోధ్యకు
కొనిపోవుటకై
వెళ్లుచుండవచ్చును,"
అని
ఆనగానే
మూడవ
స్త్రీ,
"అవునవును.
ఏ
పుట్టలో
ఏ
పామో,
ఎవరు
చెప్పగలరు?
ఎవరెవరి
భావములు
ఎట్టి
ఉన్నతస్థాయిలో
ఉండునో
నిర్ణయించ
ఎవరి
తరము?
రామచంద్రుడు
సత్యవాక్పరిపాలకుడుకదా!
పదునాలుగు
సంవత్సరములు
పూర్తి
కాకమునుపే
ఎవరువచ్చి
ప్రార్థించినా
తాను
అయోధ్యకు
వెళ్లడనే
నా
ఉద్దేశము",
అని
ఆమె
ఉత్తమ
భావములను
ప్రకటించెను.
ఈ
రీతిగా
పల్లె
పడుచులు
మాట్లాడుకొను
విషయములన్నియూ
గూఢచారులవలన
భరత
శత్రుఘ్నులు
13
▾
Meaning
Keep
వినిరి.
రామతత్త్వమును
ప్రజలెంత
బాగుగా
గ్రహించిరన్న
విషయమును
తలంచి
తమలో
తాము
ఆనందించిరి.
ఈ
విధముగా
మార్గమధ్యములందు
సంభాషించుచు
తమగుణములను
రాముని
గుణములను
భరతశత్రుఘ్నులు
వినుచు
రాముని
స్మరించుచూ
నడచిరి.
వీరికి
ఎదురుగా
కొందరు
బ్రహ్మచారులు,
ఋషులు,
మునులూ
అత్యంతానందభరితులై
రాముని
గుణగణములను
వర్ణించుకొంటూ
వచ్చుచుండిరి.
వారినిచూచి
భరత
శత్రుఘ్నులు
నమస్కరించిరి.
వారి
"రాక
యెక్కడినుండి?"
అని
విచారించిరి.
అందులో
బ్రహ్మచారులు
ఉప్పొంగి
వచ్చు
ఆనందమును
అణుచుకొనలేక,
మేము
సీతారామలక్ష్మణులను
సందర్శించి
వచ్చుచున్నామని
తెలుపగనే
భరత
శత్రుఘ్నులు
ఉట్టిపడు
ఆనందబాష్పములను
రాల్చుచూ,
"మీరెంత
ధన్యాత్ములు.
నా
సీతారామలక్ష్మణులు
ఎట్లున్నారు?
ఎక్కడున్నారు?"
అని
ఆతురతతో
వారిని
నానావిధముల
కుశల
ప్రశ్నలు
వేసి
ఆనందించిరి.
అయితే
ఇంకా
కొంత
దూరమున్నదని
విని
ఆనాటి
రాత్రికి
అక్కడ
నిలిచిరి.
తెల్లవారగనే
చిత్రకూట
పర్వతమునకు
సమీపమునందే
ఉన్నారని
తెలిసికొని
ఎప్పుడెప్పుడు
రామలక్ష్మణ,
సీతా
మాతలను
చూతుమా
అని
ఉవ్విళ్ళూరుచూ
ప్రయాణము
సాగించిరి.
మధ్యాహ్న
సమయమయ్యే
టప్పటికి,
మందాకినీనది
శబ్దము
వినిపించెను.
చిత్రకూట
పర్వతము
కనిపించెను.
ఆ
పర్వతమును
చూచిన
తక్షణమే
అయోధ్యావాసులు,
భరత
శత్రుఘ్నులు
సాష్టాంగ
నమస్కారములు
గావించిరి.
మార్గాయాసముచే
నడువలేనివారు
సహితము
ఏనుగంత
బలమును
పొంది
త్వరత్వరగా
నడువసాగిరి.
వారు
దేహములను
ఏ
మాత్రమూ
లెక్కచేయలేదు.
పల్లకి
మోయువారల
పాదములు
రక్తములు
కారుచున్ననూ,
వారేమాత్రమూ
లెక్కచేయక
రామ
సందర్శన
నిమిత్తము,
జయ
జయ
నాదములు
పలుకుచూ
"రామా!
రామా!"
అని
స్మరించుచూ
తీవ్రముగా
నడువ
సారంభించిరి.
14
▾
Meaning
Keep
ఆనాడు
తెల్లవారక
మునుపే
రాముడు
మేల్కొని,
ఈనాడు
తండ్రిగారు
అమితముగా
తలపునకు
వచ్చుచున్నారని
సీతతో
తెలిపెను.
అంతలో
సీత,
"నాథా!
నాకు
స్వప్నములు
ఏనాడునూ
రావన్న
విషయము
నాకు
తెలుసు.
అయితే
రాత్రి,
చాలా
వింతైన
స్వప్నము
వచ్చెను.
అది
స్వప్నము
కాదనే
చెప్పవచ్చు.
మీ
వియోగ
దుఃఖముచేత
భరతుడు
శత్రుఘ్నుడు
కృశించినటులను,
వారు
క్షణమైననూ
అయోధ్యలో
ఉండుటకు
ఇష్టపడక
మనచెంతకు
వచ్చినటులను,
వారితో
అయోధ్యావాసులే
కాక,
రాణులైన
కౌసల్య,
సుమిత్ర,
కైకేయిలు
కూడా
మనచెంతకు
వచ్చి
నటులను
చూచితిని",
అని
కన్నీరు
కార్చెను.
రాముడు
లక్ష్మణుని
పిలిచి,
"తమ్ముడా!
సీత
స్వప్నవృత్తాంతమును
వింటివి
కదా!
ఇది
శుభసూచన
కాదు.
మిగిలిన
వారందరూ
సీతకు
కనిపించినారు.
తండ్రి
మాత్రమే
నాకు
కనిపించినారు.
వీరందరితో
సంబంధము
లేక
తండ్రి
వేరుగా
ఉండునటుల
కనిపించుట
అశుభముగా
ఉన్నది"
అని,
అశుభమని
తలంచిన
తక్షణమే
మనము
స్నానము
చేయుట
మంచిదని
తలంచి
ముగ్గురూ
స్నానము
చేయుటకై
నదికి
వెళ్లిరి.
ఇంతలో
ఆకాశమున
పక్షులు
గుంపులు
గుంపులుగా
ఎగిరినవి.
ఉత్తర
దిక్కున
ధూళిచే
కప్పబడెను.
అనేక
ఖగమృగములు
అరచుచూ
అటూ
ఇటూ
పరుగెత్తజొచ్చెను.
ఇంతలో
దీనికి
కారణమేమని
విచారించి
లక్ష్మణుడు
ఎత్తైన
వృక్షమును
ఎక్కి
చూచెను.
ఏదో
చతురంగబలసమేతుడై
రాజు
వచ్చుచున్నట్లు
గుర్తించెను.
ఆ
వార్త
రామునకు
తెలిపెను.
ఇది
సీత
స్వప్నదృశ్యమే
అయివుండునని
లక్ష్మణునికి
తెలిపి
త్వరగా
పర్ణశాలకు
వెళ్లుట
మంచిదని
తెలిపెను.
ఇంతలో
భిల్లులూ,
కిరాతులూ,
వనవాసులూ
పరుగెత్తుకొనివచ్చి,
"రామా!
ఎవరో
రాజు
చతురంగబలసమేతుడై
వచ్చుచున్నాడనియూ,
ఆ
రథమునకు
ఒక
పతాకమున్నదనియూ,
ఆ
పతాకము
అవిశిచెట్లు
గుర్తుగా
ఉన్నదని"యూ
తెలిపిరి.
సీతా
రామలక్ష్మణులు
నిస్సంశయముగా
అది
భరతుని
రథమని
తెలిసికొనిరి.
లక్ష్మణునికి
వళ్ళు
మండెను.
రామ
దర్శనార్థమై
మనవాడైనా
చతురంగ
15
▾
Meaning
Keep
బలసమేతుడై
వచ్చునా?
ఆ
దుర్మార్గురాలైన
తల్లిమాటలు
విని
రామునితో
పోరాడి
శాశ్వతంగా
రాముని
అయోధ్యలో
అడుగు
పెట్టనివ్వకుండ
చేయు
నిమిత్తమే
భరతుడు
వచ్చుచుండునని
తనలో
తాను
తలంచి
మండిపోయెను.
కండ్లెఱ్ఱనాయెను.
పలుకులు
కటువుగా
మారెను.
రాముడది
గ్రహించి
"లక్ష్మణా!
శాంతింపుము.
భరతుడు
గుణశాలి,
అతని
ప్రేమను
ఎవ్వరునూ
వర్ణించలేరు.
ఇక్ష్వాకుల
వంశమను
కొలనుకు
భరతుడు
తామరపుష్పమువంటి
శోభను
కలిగించును.
అట్టి
పవిత్రునిమీద
అపవాదులు
వేయుట
న్యాయము
కాదు"
అని
భరతుని
భావములను
వర్ణించుచు
లక్ష్మణుని
శాంతింపజేసెను.
ఇంతలో
భరతుడే
శత్రుఘ్న
సమేతుడై,
పరివారముతో
రామదర్శనార్థ
మేతెంచుచుండినటుల
అడవి
కోయల
ద్వారా
తెలిసెను.
ఆ
సుమంగళ
వర్తమానము
విని
రామచంద్రుడు
సంతోషించెను.
శరత్కాల
సరోరుహములవలె
కమలలోచనములు
జలపూరితములయ్యెను.
రామలక్ష్మణులు
స్నానసంధ్యాదులు
ఆచరించి
పర్ణశాలకు
వచ్చునప్పటికి
భరతశత్రుఘ్నులు
వారిని
చూచి
"రామా,
రామా",
అని
పరితపించుచూ
పరువులిడుచూ
వచ్చి
రాముని
పాదములపైబడి
విలపించిరి.
వారి
వియోగపరితాపమును
గమనించిన
లక్ష్మణుడు,
తను
తలంచిన
భావములు
తప్పని
తెలిసికొని
తనలోతాను
బాధపడెను.
భరతశత్రుఘ్నులతో
పాటు
తాను
కూడనూ
కంటిధారలు
కార్చుచూ
విచారముతో
తల
వంచుకొనెను.
రామచంద్రుడు
సోదరులైన
భరతశత్రుఘ్నులను
ఓదార్చుచూ
శాంతింపజేయుచుండగానే,
చతురంగబలముతో
తల్లి
కౌసల్య,
సుమిత్ర,
కైకేయిలతో
మంత్రులు,
గురువుగారైన
వశిష్ఠులవారూ,
బ్రాహ్మణులూ,
పండితులు
వచ్చి
రామచంద్రుని
చూచినతోడనే,
ఒకవైపున
దుఃఖమును,
మరొకవైపున
ఆనందమును
భరించలేక
ఆనంద
దుఃఖమిశ్రమమైన
రోదనలు
సలిపిరి.
అరణ్యమంతయూ
దద్దరిల్లునట్లు,
"రామా,
రామా"
అన్న
పలుకులు
మిన్నుముట్టెను.
16
▾
Meaning
Keep
రామచంద్రుడు
అందరినీ
క్షేమసమాచారములు
విచారించి
ఓదార్చి
నెమ్మదిగా
తల్లుల
దగ్గరకు
వెళ్లి
అమంగళముగా
ఉన్న
దృశ్యములను
చూడలేకపోయినాడు.
కారణమును
తెలిసికొని,
తండ్రికొరకు
కొంత
విచారించి,
లక్ష్మణుని
పిలిచి,
విషయములను
తెలిపెను.
లక్ష్మణుడు
విషయమును
విపులముగా
తెలిసికొనిన
మంచిదని
తలంచి,
సుమంతునితో
అయోధ్యా
పరిపాలన
విషయమును,
దశరథుని
వార్తలను
తెలియజేయుమని
కోరెను.
సుమంతుడు
పట్టరాని
దుఃఖముతో
నేలకూలి,
"లక్ష్మణా!
ఇంకెక్కడి
దశరథుడు!
మీ
వియోగబాధతో
భస్మమయ్యెను.
అయోధ్య
అరణ్యముగా
తయారయినది.
ఎందు
చూచినా
విచారమే,
ఎక్కడ
చూచినా
రోదనే.
కేవలము
జనులే
కాక,
పశు,
పక్షి
మృగాదులు
సయితము
మీ
వియోగముతో
ప్రాణములు
విడిచినవి.
మిగిలినవి
మీ
రాకకై
నిరీక్షించుచున్నవి,"
అని
తెలుపుచుండగనే
లక్ష్మణుని
కంటిధారలు
జలజల
రాలెను;
అతడు
స్తంభించిపోయెను.
మారుమాటాడక
రామునిచెంతకు
వచ్చి,
"ఇంత
ఘోరము
సంభవించునని
కలయందైననూ
తలంచనైతిని,
తండ్రిని
అంత్యసమయ
మందైననూ
చూడనైతిని",
అని
బాధపడుచున్న
లక్ష్మణుని
చూచి,
రాముడు
"జరిగిన
దానికి
చింతించనక్కర
లేదు.
కాయములు
నీటి
బుడగలు,
అవి
అనిత్యములు.
నేడు
కాకపోయినా
రేపటికైననూ
వీడకతప్పదు."
అని
నీతివాక్యములను
బోధించి
స్నానమాచరించుటకై
నదికి
వెళ్లిరి.
జానకి
అత్తలను
దర్శించి,
పాదములకు
నమస్కరించి,
గురుపత్ని
పాదములకు
నమస్కరించి,
పురస్త్రీలను
ఆదరించి
సత్కరించినది.
సీతను
చూచి
అత్తలు
గొల్లున
ఏడ్వసాగిరి.
పురస్త్రీలు
కూడను
ఆ
సుకుమార
సుందరి
దుర్దశను
చూచి
భరించలేని
దుఃఖముతో
విలపించిరి.
దశరథ
మహారాజు
స్వర్గస్థుడైన
విషయమును
తెలిసికొని
జానకి
పునః
పునః
అత్తలకు
నమస్కరించుచూ,
"అయ్యో
నేనెంతటి
దురదృష్టవంతురాలను,
మాపైగల
ప్రేమచే
కదా
మా
వియోగమును
భరించలేక
మహారాజు
ప్రాణములు
వీడెను",
అనుచు
వజ్రమువలె
17
▾
Meaning
Keep
హృదయమును
భేదించునట్టి
దుర్వార్తను
వినిన
జానకి
రాణులతో
గూడి
ఏడ్వసాగెను.
ఆనాడందరూ
నిర్జలోపవానమును
మాత్రము
జేసి,
విచారముతో
కాలము
గడపిరి.
రెండవ
దినము
ప్రాతఃకాలమయ్యెను.
అపుడు
గురువుగారి
ఆజ్ఞ
ప్రకారము
రాముడు
భక్తిశ్రద్ధలతో
పితృకార్యమును
శాస్త్రోక్తముగా
గావించెను.
"గంగేచ
యమునే
చైవ,
గోదావరీ,
సరస్వతీ,
నర్మదే,
సింధు,
కావేరి,
జలేస్మిన్
సన్నిధిం
కురు"
అని
చెప్పుటవలన
తీర్థము
పరిశుద్ధ
మగునట్లు
శ్రీరాముడు
స్వయముగ
చేయుటవలన,
పితృకార్యములకు
పవిత్రత
వచ్చెను.
రామలక్ష్మణులు,
భరతశత్రుఘ్నులు
తల్లులతో,
సీతామాతతో,
పురజనులతో,
గురువుగారైన
వశిష్ఠమహర్షితో
రెండుదినములు
కాలము
గడిపిరి.
రెండు
దినములు
గడిచిన
తరువాత
శ్రీరాముడు
గురువుగారి
చెంతకు
వెళ్లి
"స్వామీ!
ఈ
ప్రజలందరూ
కందమూలఫలములు
భుజించి,
జలము
ద్రావి
కడుకష్టములు
పడుచున్నారు.
భరతశత్రుఘ్నులను,
తల్లులను
చూచిన
తరువాత
నిమిషము
ఒక
యుగముగ
కనిపించుచున్నది.
తాము
దయయుంచి
నగరమునకు
వెళ్లుట
మంచిది.
తామందరు
ఇచట
ఉంటిరి.
మహారాజు
స్వర్గస్థుడయ్యెను;
నేను
విస్తరించి
చెప్పుట
భావ్యము
కాదు.
ఉచితమగునట్లు
వ్యవహరింపుడు"
అని
నమస్కరించెను.
అంత
వశిష్ఠులవారు
"రఘునాథా!
ఎందులకు
నీవిట్లు
పలుకుచున్నావు?
రెండు
దినములనుండి
ప్రజలు
నీ
ముఖారవిందమును
చూచి
ఎంత
సంతోషించుచున్నారో
యోచించవైతివి."
అని
పలికెను.
ప్రచండవాయువు
వీచినపుడు
సముద్రముపై
పోవుచుండిన
పడవ
తల్లడిల్లు
విధమున
శ్రీరామవచనములను
విని
జనులు
వ్యాకులులయిరి.
అనుకూలవాయువు
వీచినపుడు
పడవ
నిరుపద్రవముగా
బోవునట్లు
మునీశ్వరుని
మంగళవచనములను
విని
స్వస్థచిత్తులయిరి.
మందాకినీనదిలో
త్రికాలములూ
స్నానము
చేసి,
విరివిగా
లభించు
సాత్వికమైన
వివిధ
ఫలములను
భుజించుచూ,
18
▾
Meaning
Keep
సీతారామలక్ష్మణులను
కన్నులారా
చూచుకుంటూ,
నిత్యమూ
రామ
సంభాషణలతో
అయోధ్యనే
మరచి
హాయిగానున్న
జనులకు
అయోధ్యకు
తిరిగివెళ్లుటకే
మనసొప్పకుండెను.
సీత
అత్తలను
సేవించుచూ,
వారల
నోదార్చుచూ,
తాను
అరణ్యమున
సమస్త
సుఖములతో
ఎట్టి
కొరతయూ
లేక
హాయిగా
జీవితము
గడుపుచున్నానని
అత్తలకు
ఎంతో
ధైర్యమును
తెలుపుచూ
వర్ణించుచున్న
సీతపలుకులు
వారికి
ఆశ్చర్యము
కలిగించెడివి.
ఆనందము
నందించెడివి.
సీత
గుణగణములు
వారికి
అమితమైన
ధైర్యమునందించెడివి.
భరతునకు
రాత్రి
నిద్రకాని,
పగలు
ఆకలికానీ
లేదు.
ప్రజలెంత
రాముని
చూచి
సంతసించుచున్నారో,
భరతశత్రుఘ్నులు
రామునిచూచి
అంత
విచారించుచుండిరి.
భరించలేక,
ఇక
కాలమును
వృథాగా
గడుపుటకు
మనస్కరించక,
గురువుల
పాదములపై
బడి
రామచంద్రుని
సీతాసమేతముగా
అయోధ్యకు
వచ్చునట్లు
చేయవలెనని
ప్రార్థించుచూ,
అనేక
విధముల
బతిమిలాడిరి.
వారి
వియోగ
విలాపము
గమనించి,
గురువులకు
శ్రీరాముని
తత్త్వము
తెలిసినప్పటికి
రాముడు
పితృవాక్యపరిపాలనలో
ఏమాత్రమూ
మార్చుచేయడని
ఆడినమాట
తప్పడని
ఎరిగియూ,
భరతుని
తృప్తికై,
రాముని
చెంతకు
రప్పించుకొని,
"ఓరామా!
భరతుని
విన్నపమును
ఆలకింపుము.
సాధుసమ్మతమును,
లోకసమ్మతమును,
రాజనీతి
కనుగుణ్యముగను
వేద
సమ్మతమగునట్లు
సంచరింపుము"
అని
వశిష్ఠులవారు
ఆజ్ఞాపించిరి.
గురువునకు
భరతుని
మీదనున్న
వాత్సల్యమును
రాముడు
గమనించెను.
మరింత
ఆనందముతో,
భరతుడు
ధర్మధురంధరుడనియు,
మనోవాక్కాయకర్మలచే
అతను
తన
సేవకుడనియూ,
తనకనుకూలముగా
ప్రవర్తించుననియూ,
రామునకు
తెలియును.
గురువాజ్ఞ
ననుసరించి
మృదుమధురమగు
మంగళవాక్యములను
శ్రీరాముడు
పలికెను.
"స్వామీ!
మీరే
సాక్షి,
తండ్రిపదములే
సాక్షి!
లోకములో
నాకు
భరతునివంటి
తమ్ముడు
మరొకడు
లేదు.
గురుని
చరణములయందు
19
▾
Meaning
Keep
అనురాగము
కలవారు
అదృష్టవంతులు.
మీకు
అతనిమీద
ఇంత
దయకలదు
కనుక
అతని
అదృష్టము
నెవరు
చెప్పగలరు?
నాకంటే
భరతుడు
చిన్నవాడు.
అతని
ముఖము
నెదుట
అతనిని
స్తుతించుటకు
సంశయించుచున్నాను.
భరతుడు
చెప్పినటుల
నడచుకొనుట,
యుచితమని
నా
అభిప్రాయము"
అని
నమస్కరించి
కూర్చొనెను.
అపుడు
మునిరాజు
భరతునితో
నిట్లు
పలికెను.
"ఓ
భరతా!
అన్ని
సంశయములను
విడిచి,
ఆ
దయాసోదరుడు
శ్రీరాముడు,
నీ
జ్యేష్ఠభ్రాత,
నీ
మనోభిప్రాయము
నతనితో
జెప్పుము"
అనెను.
భరతుడు
ముని
వచనములను
విని,
రాముని
చిత్తమును
కనిపెట్టి
వారిరువురు
తనయందు
అనుకూలముగా
నుండిరని
తెలిసికొని,
సంతసించెను.
సభలో
అతడు
నిశ్చేష్టుడై
నిలువబడియుండెను.
కమలములవంటి
అతని
నేత్రములనుండి
నీరు
కారుచుండెను.
"చెప్పవలసినవన్నియూ
మునివర్యులే
చెప్పిరి.
నేను
ప్రత్యేకించి
చెప్పున
దేమున్నది?
నా
రాముని
స్వభావము
నాకు
తెలియును.
అపరాధము
చేసినవారిని
సయితము
కోపించడు.
వారికి
నా
మీద
అమితముగా
వాత్సల్యము
కలదు;
దానిని
కాదనను.
అనురాగముచేతను,
సిగ్గుచేతను
నే
నింతవరకు
వారి
యెదుటనిలిచి,
వారితో
నొకమాట
జెప్పియుండలేదు.
అనురాగముచే
వారిని
చూడగోరుచుండిన
నా
నేత్రము
లింతవరకు
వారిని
చూచిననూ
తృప్తిపొందలేదు.
నా
అనురాగమును
చూచి,
బ్రహ్మ
భరించలేక
నా
తల్లిద్వారా
నాకీ
కష్టము
తెచ్చిపెట్టెను.
ఈ
మాట
చెప్పుట
చేత
నాకు
ఘనత
లేదు.
నా
తల్లిపై
నేరమును
మోపుటచే
నా
కేమి
గొప్పగలదు?
ఎవరికి
వారు
నిర్దోషినని
చెప్పుకొనుటవలన
నిర్దోషి
అగునా?
నా
తల్లి
మందమతి
అనియూ,
నేను
సాధువుననియూ,
బుద్ధిమంతుడననియూ
చెప్పుకొనుటకు
నా
హృదయములో
నాకే
సందేహము
పుట్టుచున్నది.
సరోవరములో
నుండిన
నత్తగుల్లలో
ముత్యములు
పుట్టునా?
నా
దుఃఖమునకు
ఇతరులను
దూషించుట
యుచితము
కాదు.
సముద్రమువలె
నా
నిర్భాగ్యమపారము.
ఇదంతయూ
నా
పాపఫలము.
నేను
20
▾
Meaning
Keep
నలువైపుల
మార్గము
వెతకుచుంటిని.
ఒక
మార్గము
తప్ప
మరియొకటి
కానరాదు.
నా
గురువులు
వశిష్ఠులు.
నా
ప్రభువులు
శ్రీ
సీతారాములు.
కావున
పరిణామమున
శుభము
కలుగుననని
నా
నిశ్చయము.
నేను
వేరుకోరను.
కోరలేదు.
ప్రభూ!
రామచంద్రా!
నీ
దాసునియొక్క
ప్రార్థనను
మన్నింపుము!
రామలక్ష్మణ
భరతశత్రుఘ్నులు,
నలుగురు
దశరథ
మహారాజునకు
కామ
పుత్రులే.
తండ్రి
ఆజ్ఞను
శిరసావహించుట
నలుగురికీ
సమానమే.
పుత్రవాత్సల్యము
తండ్రికి
సమానము.
కాన
తండ్రి
ఆజ్ఞను
వీరే
పాలించవలెను,
వారే
పాలించవలెను,
అను
నియతికి
స్థానము
లేదు.
తండ్రి
ఆజ్ఞను
పాలించుటలో
నీవింతవరకూ
బాధ్యతను
వహించితివి.
ఇకపై
సీతాలక్ష్మణ
సమేతుడవై
అయోధ్య
చేరుము.
నీ
భాగమును
నేను,
శత్రుఘ్నుడును
అరణ్యమున
మిగిలిన
కాలమును
గడుపుదుము."
అని
పాదములపై
వ్రాలెను.
భరతుని
ఈ
విజ్ఞానమును
గమనించి,
వశిష్ఠులవారు
ఆనంద
బాష్పములు
రాల్చెను.
శ్రీరాముడు,
ఈ
యుక్తికి
చిక్కక,
"భరతా!
నీ
ఆలోచన
అంత
సముచితమైనది
కాదని
నాకు
తోచుచున్నది.
దీనిని
తప్ప
అన్యమైన
దేదైననూ
కోరు"
మని
సెలవిచ్చెను.
అంత
భరతుడు,
"అన్నా!
అటులయిన
తమ్మునితో
పాటు
నేనుకూడా
లక్ష్మణునివలె
తమ
సేవ
చేసుకుంటూ
ఈ
పవిత్రవనవాసమును
అనుభవించుటకు
అనుజ్ఞ
ఇమ్ము"
నెను.
అందులకుకూడా
రాముడు
నమ్మతించక,
"భరతా!
నాకూ,
నీకూ
తండ్రి
ఆజ్ఞ
శిరోధార్యము.
నీకు
ఇచ్చిన
ఆజ్ఞను
నీవును,
నాకు
ఇచ్చిన
ఆజ్ఞను
నేనునూ
నెరవేర్చుట
అన్నిటికంటే
ఉత్తమమైన
పని"
అని
"ఈవిధముగా
కాలహరణము
చేసి
ప్రజలను
దుఃఖముల
పాలు
చేయక
నీకు
అందించిన
అయోధ్యను
నీవు
ధర్మముగ
పాలించుము;
నాకు
అందించిన
అరణ్యపాలన
నేను
నియమబద్ధముగా
ఆచరింతును,"
అని
మారు
మాటాడుటకు
చోటులేకుండ
ఆజ్ఞాపించెను.
భరతుడు
భరించలేని
దుఃఖముతో,
"ఏ
నాతల్లి
శ్రీసీతారామలక్ష్మణులను
శత్రువులని
భావించెనో
అట్టి
తల్లి
కకుమారుడైన నన్ను
భగవంతుడు
విడిచిపెట్టి,
21
▾
Meaning
Keep
మరి
ఎవనిని
సహింపరాని
దుఃఖముల
పాలుపెట్టును?
అన్నా!
శ్రీ
సీతారామ
లక్ష్మణులు
వనవాసముచేయుచున్నారని
వినిననూ,
పాదములకు
రక్షలు
లేకయే
పాదచారులై
వనమునకు
వెళ్లిరను
శూలములవలె
తగులు
సమాచారములు
వినిననూ
నా
ప్రాణములు
నిలిచియుండెను.
వీనికి
నేను
కారకుడను
కానియెడల
నేనితఃపూర్వమే
శరీరమును
విడచియుందును.
నేను
రఘురామునికి
శత్రువని
తలచి,
స్నేహముచే
నిషాదపతి
నాతో
యుద్ధము
చేయుటకు
సిద్ధపడినపుడుకూడా
నా
ప్రాణములు
పోలేదు.
వజ్రముకంటె
నా
హృదయము
కఠినము
కనుక
ప్రక్కలు
కాలేదు.
నేను
వినియుండిన
సంగతులను
ఇపుడు
కన్నులారా
గాంచుచున్నాను.
అయిననూ
నా
జీవితము
కష్టజీవితము
కనుక
ఇంత
దుఃఖమును
సహింప
గలిగెను.
ఏ
నా
తల్లిని
చూచి
సర్పములు,
వృశ్చికములు
వానివాని
విషమును
విడిచిపెట్టునో
అట్టి
తల్లికి
కకుమారుడైన
నన్ను
భగవంతుడేల
విడువడు?"
అని
తనను
తాను
నిందించుకొనుచు,
తన
జీవితమునే
అసహ్యించుకొనుచున్న
భరతుని
మాటలను,
వ్యాకులమును,
దుఃఖమును,
వినయమును,
అనురాగమును,
చాతుర్యమును,
సభికులూ
రాణులూ
విని
తుషారముపై
పడిన
కమలములవలె
శోకసంతప్త
మానసులయిరి.
అనేక
పురాణ
కథలను
ముని
భరతునికి
బోధించి
ఓదార్చెను.
అంత
రామచంద్రుడు,
"తమ్ముడా!
వ్యర్థముగా
నీవు
విచారింపనేల?
కర్మగతులను
అనుభవింపక
తప్పదు.
త్రికాలములలోను,
త్రిలోకములలోనూ
ఉండిన
పుణ్యశ్లోకులందరు
నీ
అధీనులని
నా
అభిప్రాయము.
నీవు
కుటిలుడవని
దూషించువారు
ఇహపరలోకములకు
దూరస్థులు
కాగలరు.
సాధుసమాజములో
కాని,
గురువులవద్ద
కాని
శిక్ష
పొందని
మూర్ఖుడే
మన
తల్లిని
దూషించును.
నీ
నామమును
స్మరించిన
మాత్రమున
సకలదుర్గుణములు
దూరమగును.
నీవీ
లోకానికి
కీర్తియు,
పరలోకమునకు
సుఖమును
అందింతువు.
ఈ
భూమి
నీవలననే
నిలబడుచున్నది.
వైరమూ,
ప్రేమయు
దాచియుంచిననూ
దాగియుండవు.
నీసంగతి
నాకు
బాగుగా
తెలియును.
సత్యవాక్యమును
నిలబెట్టుటకు
రాజు
నన్ను
విడిచిపెట్టెను.
నాయందుగల
ప్రేమచేత
వారు
22
▾
Meaning
Keep
ప్రాణములు
కోల్పోయిరి.
అట్టి
ప్రియమైన
తండ్రి
వచనముల
నుల్లంఘించుట
నీబోటి
నాబోటి
పుత్రులకు
భావ్యము
కాదు.
నీవు
సంశయించక
చెప్పవలసిన
మాటలేవో
చెప్పి,
అడుగవలసిన
విషయములను
అడిగి,
నీవు
నీ
బాధ్యతను
నిర్వర్తించుట
మంచిద"ని
గట్టిగా
తెలిపెను.
మాటాడుటకు
వీలులేక
కడపటి
కోరికగా
ఒకదానిని
కోరుటకు
భరతుడు
నిశ్చయించుకొని,
"రామా!
ఏరాజ్యము
నిన్ను
అడవికి
పంపెనో,
ఏరాజ్యము
నన్ను
అపకీర్తులకు
గురిచేసెనో,
ఆ
రాజ్యము
నీకక్కరలేదన్న,
నాకునూ
అక్కరలేదు.
నేను
నీ
ఆజ్ఞను
నీ
సంకల్పమును,
ఏనాటికినీ
కాదనను,
కాదనలేను.
మీ
చిత్తమునకు
క్షోభ
లేకుండ
నన్ను
కటాక్షించినట్లయిన
నేనెంతయో
ధన్యుడను.
ఇంతకాలము
తమ
సేవజేసి
ధన్యుండయినాడు
కనుక
లక్ష్మణుని
శత్రుఘ్నుని
అయోధ్యకు
పంపి,
నన్ను
తమ
పాదములచెంత
ఉంచుకొనుడు.
అపుడు
ఇరువురికీ
సత్కీర్తి!
లక్ష్మణుడు
పరిపాలనాదక్షుడు
కనుక,
అన్నివిధములా
తండ్రిగారి
ఆత్మకు
తృప్తి
కలుగునటుల
అయోధ్యను
పాలించగలడు.
ఈ
కోరికను
మన్నించి,
కాదనక
నన్ను
కాలదన్నకుడని
ప్రార్థింతును"
అని
పాదములపైబడెను.
"లేక,
మీరు
సీతాసమేతులై
అయోధ్యలో
ఉండుడు;
మేము
మువ్వురన్న
దమ్ములము
వనమునందు
నివసింతుము.
ఏ
ప్రకారము
మీ
చిత్తమునకు
సమాధానమగునో
ఆ
ప్రకారము
వ్యవహరింతుము.
ఇంత
భారమును
నాపై
మోపిన
నేను
జీవించలేను.
తమ
పాదములచెంత
ఉంచుకొని,
ఇంతకు
వేయిరెట్లు
భారమును
నాశిరస్సుపై
మోపిననూ
నేను
ఆనందముగా,
అవలీలగా
భరించగలను.
రాజధర్మముగాని,
న్యాయశాస్త్రముగాని
నేనెరుంగను.
దుఃఖములో
మునిగినవానికి
జ్ఞానము
శూన్యమన్న
విషయము
తమకు
తెలియనిదికాదు.
ప్రత్యుత్తరమిచ్చు
సేవకుని
చూచి
సిగ్గు
కూడా
సిగ్గుపడును!
ఓరామచంద్రా!
నేను
హృదయమును
విప్పి
పలుకుచున్నాను.
లోకమునకు
మంగళమగుగాక!
మీరు
సందేహమును
వీడి,
ప్రసన్నులై
ఎవరికి
ఏ
విధమైన
ఆజ్ఞచేతురో
ఆవిధముగ
మేము
తమ
ఆజ్ఞను
శిరసావహింతుము."
23
▾
Meaning
Keep
భరతుడు
ఆడిన
ఈ
మాటలు
సభికులకు
పరమానందము
కలిగించెను.
హృదయములను
కరిగింపజేసెను.
భరతునకు
రామునియందు
గల
ప్రేమభక్తివిశ్వాసములు
వేనోళ్ళ
కొనియాడిరి.
ప్రజలందరూ
ఒక్కపరి,
"ఓ
రామప్రభూ!
భరతుని
ప్రార్థనను
మన్నింపుడు.
ప్రాచీనమగు
కుశలమంతయు
దశరథ
మహారాజుగారి
మరణముతోనే
గతించెను.
అందుచేత
లోకము
అనాథ
యయ్యెను.
అయోధ్యానగరము
దిక్కులేనిదై
విలపించుచున్నది.
నాథుడు
లేని
పతివ్రతవలె
దుఃఖించుచున్నది"
అనిరి.
ఇంతలో
కుటిలురాలగు
రాణి
కైకేయి,
"నేనేమి
చెప్పగలను?
ఎవరిపై
దోషమును
నిరూపించగలను?"
అని
లోలోన
విచారించి
రాముడు
వంటరిగా
చిక్కిన
తన
పాపమును
మన్నించుమని
కోరుకొనుటకు
ఎన్నోవిధములు
వేచెను.
రామునకు
ముఖము
చూపుటకుకూడా
సిగ్గుపడెను.
తన
కొమారునికంటే
అధికముగా
రాముని
ప్రేమించుచుండిన
కైకకు
ఈవిధమైన
విపరీతవాంఛ
వచ్చుటలో
తన
లోపము
కాదనియూ,
ప్రాణసమముగా
ప్రేమించిన
రాముని
అన్నివిధములైన
బాధలకు
గురిచేసినది
ఏదో
ఒక
శక్తితనలో
చేరి
చేయించినదే
కాని,
తాను
కాదని
దృఢముగా
తెలిసికొని,
తానెంత
ధైర్యమును
తెచ్చుకున్నను,
లోకులు
నా
మాటలను
నమ్మరుకదా!
అని
తనలోతాను
సంశయించుచూ,
ముందుకు
పోలేక,
వెనుకకు
తిరుగలేక
క్రుంగి
కృశించి
పోవుచున్న
కైకమనసును
గమనించి,
రామచంద్రుడు
సమయమును
చూచి
కైకకు
నమస్కరించుటకు
వెళ్లెను.
అదియే
సమయమని
తలంచి,
కైక
రాముని
పాదములు
పట్టి
"నాయనా!
నీవు
నాకు
చిన్నవాడవు.
కుమారుడవు,
అయిననూ
గుణములలో,
జ్ఞానములో
లోకమునకే
అధికారివి!
ప్రభుడవు!
కాన
నీ
పాదములు
పట్టిననూ
దోషము
లేదు.
నా
పాపమును
క్షమించి,
నీవు
అయోధ్య
నేలుము.
నాకు
సంప్రాప్తమైన
ఈ
అపకీర్తిని
నివారింపుము;
లేదా
భరతుని
నీతో
ఉంచుకొని
నీ
పాదసేవాభాగ్యము
నొసంగుము.
నేనిక
జీవించకపోయిననూ
నాకు
మనశ్శాంతి
లభించును.
మహాకిరాతకులు
కూడనూ
కోరని
కోరికను
నేను
కోరితినన్న
నాకే
ఆశ్చర్యముగా
24
▾
Meaning
Keep
నున్నది.
నిజముగా
నేను
కేకయరాజపుత్రినై
కోరితినా?
లేక
ఏదైనా
గ్రహమావహించి
నానుండి
ఆ
పలుకులు
పలికించెనా?
నాకు
తెలియకున్నది"
అని
రెండుచేతులు
పట్టుకొని
కైక
విలపించుచుండుట
రాముని
గుండెలను
నీరు
గావించెను.
అంత
శ్రీరాముడు
"అమ్మా!
ఇందులో
నీదే
మాత్రమూ
తప్పులేదు.
లోకులు
కాకులు.
సత్యమును
గుర్తించక
పలువిధముల
పలుకుదురు.
నీవు
బుద్ధిపూర్వకముగా
కోరిన
కోరికలు
కావు.
నా
సంకల్పమే
ఈరీతి
గావించినది.
నే
నవతరించిన
కార్యమునకు
నే
సంకల్పించిన
పనికి,
మీ
రెంతయో
ఉపకారమొనర్చితిరే
కానీ
అపకారము
కాదు.
ఇందుకు
నేను
మీకు
కృతజ్ఞత
చెప్పవలసినది
పోయి,
మీతో
నేనింతగా
అడిగించుకొనవలసి
వచ్చినందుకు
నేనెంతయో
చింతించుచున్నాను!
మీరు
దుఃఖించిన
నా
కార్యము
అశుభమగును.
కాన
నన్ను
అనుగ్రహించి,
నాపై
వాత్సల్యమును
చూపుచు
ఆశీర్వదింపుము"
అని
రాముడు
కైకేయి
పాదములకు
నమస్కరించెను.
రాముడట్లు
చెప్పుటచేత
కైకేయికి
కొంత
శాంతి
కలిగెను.
వీరిరువురి
సంభాషణలు
చెంతనే
ఉండి
వినుచున్న
కౌసల్య,
సుమిత్రలు
ఇందులో
కైకదేమాత్రమూ
దోషము
లేదనియూ
ఇది
దైవసంకల్పమేననియూ
గ్రహించి
చెల్లెలైన
కైకను
అనేకవిధముల
ఓదార్చిరి.
అయిననూ
కైకపట్టు
విడువక
"రాముడు
మహారాజు.
సీత
మహారాణి
కాకతప్పదు.
నా
కొమారులు
భరతశత్రుఘ్నులు,
లక్ష్మణసమేతులై
సీతారాములకు
సేవలు
చేయుచుండ
ఈ
కన్నులతో
చూచి
ప్రాణము
విడువవలె"
నని
పదేపదే
పలుకుతూ
వచ్చెను.
ఈ
విధముగా,
ఒకరినొకరు
ఓదార్చుకొనుచూ,
విలపించుచూ,
రాముని
అయోధ్యకు
రమ్మని
ప్రార్థించుచూ,
రేయిపగలనక
రామపాదముల
చెంత
అడవిలో
అయోధ్యావాసులు
నాలుగు
దినములు
కాలము
గడపిరి.
కడకు
రాముడు
అయోధ్యావాసులను
అయోధ్యకు
తీసుకొనిపొమ్మని
గురువునకు,
భరతునకు
ఆజ్ఞ
చేసినటుల
ప్రజలు,
స్త్రీ-పురుషులు,
పండితులు
విని,
25
▾
Meaning
Keep
భరించలేని
బాధతో,
"మనము
సీతారాములను
అయోధ్యానగరమునకు
తీసుకొని
వెళ్లిననే
ఉచితముగా
నుండును;
లేక,
సీతారాములతో
కూడి
వనవాసము
చేయుటయే
కోటి
స్వర్గములకంటే
సుఖదాయకము.
ఎట్టివారైనను
సీతారామలక్ష్మణులను
విడచి
నగరమునకు
వెళ్లఇచ్చగించరు.
అట్లు
ఇచ్చగించిరేని
వారియెడల
విధాత
ప్రతికూలుడుగా
నుండెనని
తలంచవలెను.
ఆహా!
మందాకినిలో
స్నానము,
మధురమైన
ఫలముల
ఆహారము,
కన్నులకింపైన
సీతారాముల
సుందర
దర్శనము,
ఇంతకంటే
వేరు
స్వర్గమెందుకు?"
అని
ప్రజలలో
ఒకరికొకరు
చెప్పుకొనుచు,
రాముని
అయోధ్యకే
గొనిపోవలెనని
దృఢము
చేసుకొనిరి.
ఈ
ప్రకారము
ప్రేమపూర్వకమగు
వచనములతో,
వారి
వారి
మనోరథములు
చెప్పుకొని,
"ఈ
అరణ్యములో
శ్రీరామ
సన్నిధిలో
ఇట్టి
శుభము
ఇంతటి
సుఖము
అనుభవించుటకు
మనకు
యోగ్యత
యుండిన,
భాగ్యముండిన,
రామచంద్రుడు
మన
అభీష్టము
నంగీకరించును;
అట్టి
ప్రాప్తియేలేకున్న,
మన
దురదృష్టమే
రామచంద్రుని
మనస్సును
కఠినపరచి,
మనలను
తిరిగి
అయోధ్యకు
వెళ్ళగొట్టును.
రాముడే
అనుగ్రహించకున్న
ఇక
అనుగ్రహించువా
రెవరు?
అతని
చెంతనే
కాలము
గడుపని
జీవితం,
మరెక్కడుండిననేమి?
ఏమైననేమి?
బ్రతికీ
చచ్చినవారలతో
సమము",
అని
ఒక
పెద్ద
వృద్ధబ్రాహ్మణుడు
పలికిన
ఈ
పలుకులకు
అందరూ
"నిజమే.
నిజమే!
ఈ
మాటలు
పరమ
సత్యములు"
అని
బలపరచిరి.
కులగురువైన
వశిష్ఠుడు
పంపిన
దశరథుని
మరణవార్త
జనకునికి
అందిన
క్షణమే,
మహారాణిసమేతుడై
అయోధ్యకు
వచ్చెను.
అక్కడ
విషయములన్నియూ
విశదమాయెను.
ఇంతలో
భరతుడు
వచ్చి,
రాణులు,
గురువు,
ప్రజల
సమేతుడై,
చిత్రకూట
పర్వతమునకు
రామసందర్శనము
గావించుటకై
వచ్చుచుండగా,
వారితో
జనకుడు
తన
రాణితో
చిత్రకూటమునకు
వచ్చెను.
సమయమును
చూ…
సీతారాములతో
మాట్లాడ
వేచియుండిరి.
సీతాదేవి
తల్లి
చెలికత్తెను
26
▾
Meaning
Keep
పిలిచి
కౌసల్యాది
మహారాణుల
సమయమును
చూచి
రమ్మని
పంపెను.
అంత
చెలికత్తె
కౌసల్యాది
రాణులను
చూచుటకు
వెళ్లెను.
జ్యేష్ఠ
శుద్ధ
ఏకాదశినాడు
మహారాణులు
కలుసుకొనిరి.
కౌసల్యాదేవి
జనకమహారాజు
భార్య
అయిన
సునయనను
సన్మానించి,
ఆదరించి
సమయోచితముగ
ఆసనముపై
కూర్చుండబెట్టెను.
ఆ
మహారాణులను
సునయన
చూచుట
మొదటిసారి
కనుక,
అనగా
సీతాకల్యాణ
సమయమున
రాణులెవ్వరునూ
మిథిలాపురమునకు
వెళ్ళలేదు;
మిథిలాపురరాణి
అయోధ్యకు
రాలేదు.
అందుచే
వారిరువురూ
ఒకరినొకరు
గుర్తించుటకు
వీలు
లేకపోయెను.
అయోధ్యానగర
రాణులైన
కౌసల్య
సుమిత్ర,
కైకేయిల
సరసోక్తులను;
సౌశీల్యమును,
స్నేహమును
చూచి
కఠినమగు
వజ్రము
సహితము
నీరగును.
వారి
శరీరములు
పులకరించి
శిథిలమయ్యెను.
వారు
కన్నీరు
కార్చుచూ
నేలను
చూచుచూ
దుఃఖించుచుండ,
సీతారాముల
గుణగణములను
వారు
వర్ణించుచూ
పొంగివచ్చు
దుఃఖమును
ఆపుకొనలేక
భోరున
ఏడ్వసాగిరి.
అంత
సునయన,
ఏమి
చెప్పుటకూ
తోచక
"అమ్మా!
విచారించి
ప్రయోజనమేమి?
విధాత
బుద్ధి
వక్రముగా
వెళ్ళెను.
పాలనురుగును
భేదించుటకు
వజ్రమును
ఉపయోగించెను.
అమృతమును
వినియున్నాము
కాని
చూచి
యుండలేదు;
గరళమునే
చూచుచున్నాము,
కాకులు,
కొంగలు,
గ్రద్దలు,
గుడ్లగూబలను
మాత్రమే
చూచుచున్నాము
కాని,
మానససరోవరములో
రాజహంసలు
కలవని
వినుచున్నాము.
దేవీ!
విధికృతములు
విపరీతములు,
విచిత్రములు,
విధికృతములు
బాలుని
చర్యలవలె
ఉన్నవి",
అని
సునయన
ఓదార్పు
మాటలతో
తానుకూడనూ
దుఃఖించ
దొడగెను.
అంత
కౌసల్య,
"అమ్మా!
సునయనా!
ఇది
యొకరి
దోషముకాదు.
సుఖదుఃఖములు,
లాభనష్టములు,
కర్మాధీనములు
('అవశ్యమేవ
భోక్తవ్యం
కృతం
కర్మ
శుభాశుభం')
కఠిన
కర్మగతులు
భగవంతునకు
తెలియును.
శుభాశుభ
కర్మలకు
తగిన
ఫలము
నతడిచ్చును.
ఈశ్వరాజ్ఞ
శిరస్సున
అధిష్ఠించి
యుండును.
27
▾
Meaning
Keep
దేవీ!
మోహమునకు
వశ్యులమై
వ్యర్థముగా
విచారింతుమేకాని
మన
పూర్వజన్మ
పుణ్యపాపములు
ఎందుకు
దయతలచును?
అనాదికాలమునుండీ
ఈ
ప్రకారము
జరుగుచున్న
సృష్టిక్రమము
మన
కొరకై
మారునా?
పిచ్చి."
అని
నిట్టూర్పులు
విడచెను?
అపుడు
సునయన
"అమ్మా!
మీ
రెంతయో
పుణ్యాత్ములు.
లోకమున
దశరథునికి
మించిన
పుణ్యాత్ముడు
మరొకరు
కనిపించరు.
అట్టి
దశరథుని
అర్ధాంగులై,
ధర్మమూర్తి,
విశాలహృదయుడు,
సుగుణశీలుడు
అయిన
శ్రీరాములకు
తల్లులై,
లోకఖ్యాతిని
అందుకొంటిరి.
మీ
మాటలు
పరమ
సత్యములు.
ఎట్టి
వారికైనా
కష్టసుఖములు
కావడికుండలు.
కష్టమే
లేకున్న
సుఖముయొక్క
సుఖము
తెలియదుకదా.
"న
సుఖాల్లభ్యతే
సుఖం"
సుఖము
నుండే
సుఖము
రాదు.
లేదు
కదా"
అని
బదులు
చెప్పెను.
"సీతారామలక్ష్మణులు
వనవాసము
చేసినయెడల
నంతమున
శుభములు
కలుగును.
కానీ
రాముని
వియోగము
భరించలేము.
భరతుడు
జీవించలేదు.
సీతారామలక్ష్మణులకంటే,
భరతుని
చూచి
నాకు
మరింత
దుఃఖము
అధికమగుచున్నది.
భయమగుచున్నది."
అని
కౌసల్య
గద్గదస్వరముతో
పలికెను.
ఆ
మాటలు
విని
సుమిత్రా
కైకేయిలు
"నిజము!
నిజము!"
అని
వారునూ
దుఃఖించిరి.
అంత
సుమిత్ర
"అక్కా!
మీ
ఆశీర్వాదముతో
మన
కొడుకు
కోడలును,
గంగవలే
నిర్మలులు.
ఇదివరకు
రాముడు
తోడని
చెప్పియుండలేదు,
ఇపుడు
రాముడు
తోడని
సత్స్వభావముతో
చెప్పుచున్నాను.
భరతుని
గుణశీలమును,
వినయమును,
ఉదారబుద్ధియు,
భ్రాతృవాత్సల్యమును,
భక్తి
శ్రద్ధలను,
ధైర్య
స్థైర్యములను
సంపూర్ణముగా
వర్ణించి
చెప్పుటకు
సరస్వతి
సహితము
సంశయించును.
నత్తగుల్లలు
సముద్రమును
తరచనగునా?
సదా
భరతుడు
కులదీపకుడని
తెలిసికొనుట
అందరికీ
సాధ్యము
కాదు.
పరీక్షవలన
రత్నములను,
పారదమణి
వలన
బంగారమును,
సమయము
వచ్చినపుడు
మనుజుని
పరీక్షింపవలెను.
ఈ
సమయముననే
ఇట్లు
పలుకుట
మంచిది
కాదు.
28
▾
Meaning
Keep
శోకముచేతను,
పుత్రవాత్సల్యముచేతను
నా
బుద్ధి
తక్కువయ్యెను"
అని
కన్నీరు
తుడుచుకొనుచుండ,
సునయన,
"అయోధ్యారాణులు,
ఒకరికంటే
మరొకరు
మహాపవిత్ర
హృదయలనియూ,
నిజముగా
వర్ణించి
మెచ్చుకొనుట
లోకవిరుద్ధము.
బాధారహితలయిన
ఈ
రాణులు
లోకమునకు
ఆదర్శ
గృహిణీమణులు.
ఆహా!
ఎంత
విశాల
భావములు.
ఎంత
నిస్వార్థమైన
పలుకులు!"
అని
తనలో
తాను
ఆశ్చర్యపడుతూ
ఆనందించుచుండెను.
కౌసల్య
ధైర్యము
తెచ్చుకొని,
"మిథిలాదేశపు
మహారాణీ!
జ్ఞాన
సముద్రుడైన
జనక
చక్రవర్తి
భార్యవు
నీవు.
నీకు
ఎవరు
ఉపదేశించ
సాహసింతురు?
మా
పలుకులు
అజ్ఞానపు
పలుకులు.
అయిననూ,
మా
మాటలు
క్షమించి
సమయమును
జూచి
చక్రవర్తితో
ఈ
నా
మాటను
జెప్పుము.
ఏమన,
లక్ష్మణుడు
ఇంత
కాలము
రామునితో
నివసించెను.
కనుక,
కొంతకాలము
భరతుని
రామునితో
నివసించునట్లును,
లక్ష్మణుని
అయోధ్యలో
పనులు
చూచుకొనునట్లును,
లక్ష్మణునకు
శత్రుఘ్నుడు
తోడుగా
ఉండునట్లునూ
నా
ప్రార్థనగా
చక్రవర్తి
రామునకు
నచ్చజెప్పమనుము.
ఈ
మాటలను
సమ్మతించిన
యెడల
మిగిలినవి
అన్నియూ
వాటికవే
సరిపోవును.
భరతుని
విషయములోనే
నాకు
చాలా
భయముగా
ఉన్నది.
భరతుని
ప్రేమ
గంభీరమైనది.
రాముని
విడచి
జీవించనొల్లడు.
చక్రవర్తి
స్వర్గస్థులయిరి.
రాముడు
వనవాసము
వీడడు.
భరతుడు
రామవియోగమును
భరించు
కొనలేక
గతించినచో
దేశమే
జీవచ్చవము
కాగలదు.
మున్ముందు
ఏమి
ప్రమాదము
రానున్నదో
నాకు
చాలా
అందోళనముగా
ఉన్నది".
అని
సునయన
చేతులు
పట్టుకొని
జనక
మహారాజును
తగిన
రీతిగా
నచ్చజెప్పి
ఈపని
ఎట్లయిననూ
నెరవేరునట్లు
చేసి
మమ్ముల
నానంద
పెట్టుమ"ని
ప్రార్థించినటుల
చెప్పెను.
కౌసల్యయొక్క
స్నేహధర్మమునకు
సంతసించి,
సునయన
"దేవీ!
వినయములు,
సుగుణములు
నీ
కుచితములు.
అగ్ని
ధూమమును
ధరింపదా?
పర్వతములు
తమ
శిరస్సుపై
తృణములను
ధరింపవా?
మనోవాక్కర్మములచే
29
▾
Meaning
Keep
చక్రవర్తి
మీ
సేవకుడు,
మీకు
సదా
సహకారులు.
దీపపు
సహాయమున
సూర్యునకు
శోభకలుగునా?
దేవకార్యమును
సాధించుటకు
రాముడు
వనమునకు
వచ్చెను.
అతడు
తిరిగివచ్చి
అయోధ్య
రాజ్యమును
నిశ్చలముగా
పరిపాలించును.
రాముని
బాహుబలముచే
నర,
దేవ,
నాగులు
సుఖించి,
వారి
వారి
నిజస్థానముల
పొందగలరు.
ఇవన్నియును
మున్నే
యాజ్ఞవల్క్య
ఋషి
చెప్పియుండెను.
ఋషివాక్యములు
ఏనాటికీ
అసత్యములు
కావు"
అని
విన్నవించి,
కౌసల్య
పాదములకు
నమస్కరించి
సెలవు
గైకొని
సీతను
చూచుటకు
పర్ణశాల
దిశకు
వెళ్లి
తగిన
ఏర్పాట్లు
గావించుకొని
వెళ్లెను.
తల్లి
లోనికి
వెళ్లి
కూతురు,
సీతను
చూడగానే
దుఃఖమును
ఆపుకోలేక
కౌగిలించుకొని
భోరున
ఏడ్వసాగెను.
సీత
తల్లిని
అనేకవిధముల
ఓదార్చి,
ధైర్యవచనములు
బోధించి
తల్లి
పాదములకు
నమస్కరించి
నిలుచుండెను.
జానకి
ధరించిన
తపస్విని
వేషమును
చూచి
సాక్షాత్
పార్వతీదేవిగా
కనిపించిన
సీతతో,
"అమ్మా!
నీవు
నా
సీతవా?
లేక
సాక్షాత్
శంకరుని
ధర్మపత్నివా?"
అని
ప్రశ్నించి
ఆశ్చర్యముతో
ఆమెను
ఎగాదిగా
చూచి
పరమానంద
పరవశముతో,
ఇట్లు
ప్రారంభించెను.
"ఓ
సీతా!
నీ
మూలమున
తల్లిదండ్రుల
వంశము
అత్తమామల
వంశము
రెండునూ
పవిత్రమయ్యెను.
నీ
కీర్తి
లోకవ్యాప్తి
కాగలదు.
తల్లీ!
నీ
కీర్తి
అను
నదికి
పై
రెండు
వంశములును
రెండు
గట్లు.
గంగానదికి
భూలోకమున
మూడు
పుణ్యతీర్థములు
మాత్రమే
కలవు.
హరిద్వారము,
ప్రయాగ,
సాగరసంగమము.
అయితే
నీ
కీర్తి
బ్రహ్మాండ
ప్రవాహమై
సర్వుల
హృదయ
క్షేత్రములందూ
తీర్థరూపమున
సార్థకమును
గావింతువు
గాక!"
అని
ఈ
విధముగా
వాత్సల్యముచే
పలికిన
తల్లి
సత్య
వాక్కులను
సీత
విని
సిగ్గుపడినటుల
నటించుచు
"తల్లీ!
ఎంతటి
మాట,
ఎక్కడి
సంబంధము?
పవిత్రగంగకూ,
నాకూ
పోలిక
ఏమిటి?"
అని
భక్తిశ్రద్ధలతో
గంగకు
నమస్కరించునటుల
ప్రదర్శించి
నిలిచెను.
తల్లి
కౌగిలించుకొని
శిరమును
"సీతా!
నీ
గుణములు
లోక
గృహిణీ
మణులకు
ఆదర్శములు"
అని
30
▾
Meaning
Keep
చెప్పుచుండ,
సీత,
"అమ్మా!
నేను
కాలమును
అధికంగా
మీతో
గడుపుటచేత
రామచంద్రుని
సేవా
కార్యములకు
కొంతతడవు
కావచ్చును.
కాన,
నేనిక
సెలవు
తీసుకొనుటకు
అనుజ్ఞ
ఇమ్ము"నెను.
తల్లి
జానకి
మనస్సును
కనిపెట్టి,
సీత
మనోభీష్టమునకు
అడ్డుతగులుట
మంచిదికాదని
తలంచి,
అనేక
పర్యాయములు
సీతను
ముద్దాడి,
"అమ్మా!
నీ
ఇష్ట
ప్రకారము
శ్రీరామసేవకై
వెళ్లుమ"ని
సెలవిచ్చెను.
సీత
తల్లికి
నమస్కరించి
రామసన్నిధికి
వెళ్లెను.
సునయన
తన
కుమార్తెయొక్క
పతిభక్తిని
ఆమె
గుణములను
తనలో
తాను
స్మరించుచూ
ఆనందించుచూ
సీతనే
చూచుచూ
ఆమె
లోనికి
వెళ్లువరకూ
అక్కడే
నిలిచి
యుండెను.
సునయన
చెలికత్తె
"అమ్మా!
సీతమ్మగారు
లోనికి
వెళ్లిరి.
మనమిక
మన
స్థానమునకు
వెళ్లుట
మంచిదని"
హెచ్చరించగనే,
సునయన
కంటిధారలు
తుడుచుకొనుచూ,
విధిలేక
అక్కడినుండి
వెనుకకు
తిరిగి
తన
విడిది
స్థానమునకు
చేరినది.
ఇంతలో
సూర్యాస్తమయము
కావటం
చేత
రామలక్ష్మణ
భరతశత్రుఘ్నులు
స్నానసంధ్యాది
కర్మనిష్ఠలను
ఆచరించుటకై
నది
కేగుచున్నారని
పండితులు,
విప్రులు,
రాజులు,
మంత్రులు
అందరూ
వారలతో
నదీతీరమునకు
వెళ్లి
స్నానసంధ్యాదులు
ఆచరించి
కందమూలాది
ఫలములను
భుజించి
వారి
వారి
విడిది
వృక్షముల
క్రింద
నిశ్చితంగా
నిద్రించిరి.
తెల్లవారి
నిత్యకార్యక్రమములు
ముగించుకొని
అందరూ
పర్ణశాల
చుట్టూ
చేరిరి.
శ్రీరామచంద్రుడు
వారలందరినీ
చూచి
చిరునవ్వుతో
వారల
యోగక్షేమములు
విచారించుచు
రాగా,
భరతుడు
రామునకు
నమస్కరించి,
"స్వామీ!
నా
మనస్సున
నొక
అభీష్టము
మొలకెత్తినది.
భయము
చేతను
సంకోచము
చేతను,
దానిని
చెప్పుకొనలేక
పోవుచున్నా"ననెను.
శ్రీరాముడు
అతని
తల
నిమురుచు
"నా
చెంత
సంకోచమెందుకు?
తప్పక
తెలుపుమ"నగా
భరతుడు
"అన్నా!
ఈ
చిత్రకూటపర్వతమున
గల
ఋషి
ఆశ్రమములను
పవిత్ర
తీరములను,
వనమును,
వన
మృగములను,
సరోవరములను,
సెలయేళ్లను
జలధారలను
సందర్శించ
కుతూహలపడుచున్నా…
అందందు
తమ
పాద
31
▾
Meaning
Keep
చిహ్నములను
దర్శించి
రావలెనను
కుతూహలము
అయోధ్యా
వాసులలో
"సహితము
రేకెత్తినది"
అని
ప్రార్థించెను.
అంత
రాముడు
"తమ్ముడా,
నీ
అభిరుచి
చాలా
ఉత్తమమైనదే
కాని
నీవు
అత్రిమహాముని
అనుజ్ఞగైకొని
నిర్భయముగ
వనములో
సంచరించవచ్చును."
అని
చెప్పెను.
రాముని
వచనములను
భరతుడు
విని
సంతసించి
ముని
చరణములకు
నమస్కరించి,
రామునకు
నమస్కరించి,
శత్రుఘ్నునితోపాటు
మంత్రులతోపాటు
వన
సంచారము,
ఆశ్రమ
సందర్శనము
గావించెను.
అట్లు
సందర్శించుచు
రాగా
పర్వతసమీపమున
నొక
కూపము
కనిపించెను.
సకలపుణ్యతీర్థముల
పవిత్ర
జలములు
దానిలో
గలవు.
ఆ
జలము
నిర్మలము.
అక్కడికి
వెళ్లెను.
అక్కడ
అత్రిమహాఋషి
శిష్యుడు
భరతునకు
ఆ
పవిత్ర
జలమును
గురించి
వివరించెను.
అంత
భరతుడు
ఆ
పవిత్ర
జలమును
శిరస్సునందు
ప్రోక్షించుకొని,
నమస్కరించి
అందులో
పడిన
చెత్తనూ
మట్టినీ
తీసి
ఆ
స్థానమును
తన
స్వహస్తములతో
పరిశుభ్రపరచెను.
అదే
నేడు
"భరతకూపము"
అను
పేరుతో
నిలిచి
లోక
ఖ్యాతి
నందుకొనుచున్నది.
ఆరవ
దినం
ప్రాతఃకాలము
స్నానసంధ్యాదుల
ననుష్ఠించి,
శత్రుఘ్నునితో,
పరివారముతో,
భరతుడు
సమావేశమై
రాముని
ముఖలక్షణములను
గమనించుచు,
దిగ్గన
లేచి
నిలువబడి,
ధైర్యము
నవలంబించి
దండ
ప్రణామమును
చేసి
చేతులను
జోడించుకొని
ఇట్లు
విన్నవించెను.
"హే!
ఇక్ష్వాకు
కులతిలకా!
అన్ని
విధముల
మీరు
నా
కోరికలు
నెరవేర్చితిరి.
నా
నిమిత్తమై
మీరు
సకల
దుఃఖములు
పడుచుంటిరి.
సకలకష్టములు
పడుచున్నారు.
ఓ
నాథా!
మీ
ఆజ్ఞను
దయచేయుడు.
పదునాలుగు
సంవత్సరములవరకు
మీ
ఆగమనమును
నిరీక్షించుచూ
నేను
నగరములో
మీ
సేవ
చేయువాడను.
అవధి
దాటిన
తర్వాత
మీ
చరణారవిందములను
దర్శించుటకు
మార్గము
చూపుము.
ఈ
పదునాలుగు
సంవత్సరములవరకు
నాకేవిధమయిన
ధైర్యము
నిలిచి
యుండునో
బోధింపుడు.
రామా!
మీ
పురజనులు,
మీ
కుటుంబము,
ప్రజలు,
అత్యంత
సరసులు
పరమ
పవిత్రులు.
బ్రాహ్మణులు,
పండితులు,
మీయందు
బద్ధానురాగులై
32
▾
Meaning
Keep
యుందురు.
ఈ
సంసార
దుఃఖములను,
తాపములను
మీ
నిమిత్తమై
భరించువాడ.
మీ
పరోక్షమున
పరమపదమైనను
నాకు
వ్యర్థము.
మీ
సేవకుల
మనోభిప్రాయములు,
వారి
భావములు,
వారి
కోరికలు
మీకు
విశదము.
ఉభయలోకములలోను
మీరే
నన్ను
నిర్వహించగలరు.
ఇదియే
నాకుగల
మనోధైర్యము.
అందుచేత
నాకీ
దుఃఖమంతయూ
తృణప్రాయముగా
కనబడును.
ఇంతవరకూ
నా
దుఃఖమును
పట్టలేక
నాతలకు
తగునట్లు
ప్రసంగించితిని.
నా
లోపములను
క్షమించి
వెనుదీయక
తగినట్లు
నన్ను
శిక్షింపుము"
అని
భరతుడు
చెప్పిన
విన్నపములను
సభికులు
విని
హర్షించి,
ఆమోదించి
అతనిని
కొనియాడిరి.
నీరములనుండి
క్షీరమును
విభజించు
హంస
వలె
అతడు
సత్యము
నసత్యమునుండి
విభజించి
చెప్పెను.
నిర్మలాంతఃకరణముతో
భరతుడు
చెప్పినమాటలు
దీనబంధువు
రాముడు
విని
దేశకాలసమయాను
సారముగ
అతనితో
ఇట్లు
చెప్పెను.
"తమ్ముడా,
భరతా!
గృహములో
ఉన్న
నీ
యొక్కయు,
వనములోయున్న
మా
యొక్కయు,
సకలజనయోగక్షేమమును
చూచుకొనువారు
ఎవరో
వారు
చూచుకొనుచుందురు.
లోకరీతిగా
గురువులైన
వశిష్ఠులవారును,
జనక
చక్రవర్తులును
నీకు
తోడుగా
ఉందురు.
స్వప్నమందైననూ
నీకును,
నాకునూ
కష్టములన్నవి
కనిపించుటకు
వీలులేదు,
కనిపించవు
కూడను.
మన
తండ్రిగారి
ఆజ్ఞను
పరిపాలించుటయే
పరమపురుషార్థము,
సర్వ
శ్రేయోదాయకము,
శాశ్వతకీర్తి
ప్రదాయకము,
వేదసమ్మతము.
ఎవరు
గురువాజ్ఞను,
తండ్రి
ఆజ్ఞను,
తల్లి
ఆజ్ఞను
మన్నించి
సన్మార్గమున
సంచరించెదరో
వారి
పాదములు
తప్పు
మార్గమున
పడవు.
ఈ
సత్యమును
గుర్తించి,
దుఃఖమును
దూరము
త్రోసి
ఆనందముతో,
నీతినిజాయితీలతోడ,
పదునాలుగు
సంవత్సరములు,
రాజ్యమును
నడుపుము.
రాజు
ముఖమువలె
నుండవలెను;
భోజనపానములు
ముఖము
చేయును.
సకలాంగముల
నది
యథావిధిగ
పుష్టి
చేయును.
అటులనే
రాజులద్వారా
రాజ్యాంగములకు
పుష్టివచ్చును.
సకలమనోరథములు
మనసులో
33
▾
Meaning
Keep
నిమిడియున్నటుల,
సకల
రాజధర్మములును
రాజనీతులును
రాజులలో
దాగియుందును."
ఈ
ప్రకారమనేక
విధముల
రాముడు
తమ్మునకు
బోధించెను.
కానీ,
మనసు
నిలుచుటకు
ఆధారము
లేకపోవుటచేత,
భరతుని
మనస్సునకు
శాంతి
లేకపోయెను.
శ్రీరామునియందు
గల
ప్రేమకు
వశ్యులై
మంత్రులును,
గురువులును,
తల్లులును,
పండిత
పామరులును
భరతునివలె
ఏకాభిప్రాయులై
సంశయించి
ఊరకుండిరి.
అపుడు
రామప్రభువు
కటాక్షించి
తన
పాదుకలను
తీసి
భరతున
కిచ్చెను.
సాదరముగ
భరతుడు
పవిత్ర
పాదుకలను
తన
హస్తములతో
తీసుకొని
శిరస్సుపై
ధరించెను.
రెండు
నేత్రములనుండి
గంగాయమునలవలే
ఆనందజలము
ప్రవాహముగా
కారదొడగెను.
భరతుని
నోటమాట
రాలేకపోయెను.
"ఇవి
కరుణాసముద్రుడు
ధరించిన
పాదుకలు
కావు.
సకలజనుల
ప్రాణములు
రక్షించు
రక్షలు,
భరతుని
స్నేహరత్నమును
కాపాడునట్టి
సంపుటము,
రఘుకులమును
రక్షించు
రెండు
కవాటములు.
ఇవి
సుకర్మలు
చేయునట్టి
రెండు
హస్తములు.
ఇవే
లోకనేత్రములు.
ఈ
రెండు
పాదుకలు
మనవెంట
వచ్చు
సీతారాముల
చిహ్నములు"
అని
వర్ణించుచూ
గంతులు
వేయుచున్న
భరతుని
ఆనందమున
ఎవ్వరును
వర్ణింపలేకపోయిరి.
అందరూ
ఒకసారి
రామపాదుకలకు
నమస్కరించి,
రాముని
అనుగ్రహమును
కొనియాడిరి.
రామునకు
నమస్కరించి
ప్రయాణమునకు
సెలవివ్వుమని
ప్రార్థించిరి.
రాముడు
భరతుని
తృప్తికి
మెచ్చి,
ఒకసారి
ప్రేమతో
భరతుని
గట్టిగ
కౌగిలించుకొని
తల
నిమిరి
"విజయీభవ!"
అని
ఆశీర్వదించెను.
శత్రుఘ్నుడు
నమస్కరించెను.
అతనిని
రాముడు
కౌగిలించుకొని
అతనికి
చెప్పవలసిన
ధర్మసూత్రములను
తెలిపి,
"భరతుని
రాముడుగా
భావించి
తోడుగా
నుండి
రాజ్యకల్యాణమునకు
తగినరీతి
గావించుమ"ని
తెలిపెను.
భరతశత్రుఘ్నులు
లక్ష్మణుని
కౌగిలించుకొని
"నీభాగ్యమే
భాగ్యము,
నీయంతటి
అదృష్టవంతుడేలోకముననూ
ఉండడ"ని
లక్ష్మణుని
కొనియాడి
అతనినుండి
సెలవు
తీసుకొనిరి.
లక్ష్మణుడు
భరతశత్రుఘ్నులను
చెంతచేర్చి
"రామచంద్రుని
34
▾
Meaning
Keep
పాదుకలు
సకలమంగళములకు
మూలములు.
కాన,
అట్టిభాగ్యమును
అందుకున్న
మీకంటే
ధన్యులు
మరొకరుండరని,
అట్టిభాగ్యమును
భద్రముగా
కాపాడుకొనుటే,
మీకర్తవ్యమ"ని
హెచ్చరించెను.
తదుపరి
భరతశత్రుఘ్నులు
సీతాదేవి
దగ్గరకువెళ్లి
ఆమె
పాదములపై
పడి
దుఃఖమును
భరించలేక
భోరున
ఏడ్చిరి.
ఆమె
వారలను
అనేక
విధముల
ఓదార్చి
"రామరక్షకంటే
వేరొకటున్నదా
లోకమున
నాయనలారా!
మీరు
ధన్యులు.
ఈ
పదునాలుగు
సంవత్సరములు
పదునాలుగు
నిమిషములవలె
అతి
శీఘ్రముగా
జరిగిపోయి,
రామాగమనముతో
రాజ్యము
కళకళ,
కిలకిలలాడును.
ఓపికతో
రామాజ్ఞను
జవదాటక
మీ
అభీష్టములను
ఫలసిద్ధి
గావించుకొని
ఆనందింతురు
గాక!"
అని
దీవించెను.
భరత
శత్రుఘ్నులు
నేరుగా
జనక
మహారాజు
దగ్గరకు
వచ్చి
నమస్కరించి,
"ఓరాజా!
మాపైగల
దయా
ప్రేమానుగ్రహములచేత,
తాము
మా
తండ్రి
మరణవార్తయు,
రామచంద్రుని
వనవాసవార్తయు,
విని
అయోధ్యకు
వచ్చి
మా
పరిస్థితులను
స్వయముగా
గుర్తించి,
మమ్ము
అనేక
విధముల
ఓదార్చి,
ధైర్యమునకు
తగిన
సలహాల
నందించి,
మా
అభీష్టమును
పురస్కరించుకొని
తిరిగి,
మీరు
ఇన్ని
శ్రమలకోర్చి
మాతో
అరణ్యమునకు
కూడనూ
దయచేసి,
రామునకు
విన్నవించవలసిన
విషయములలో
మా
కెంతయో
తోడ్పడి,
కడకు
మా
దుఃఖపరిహారమునకు
తగిన
సలహాలనందించి
రామానుగ్రహమును
పొందినట్టి
వ్యక్తులుగా
మమ్ముగావించితిరి.
మీకనేక
ధన్యవాదముల
నర్పించుచున్నాము.
ఇంతకంటే
మేమేమి
చేయగలము?
తమ
ఆశీర్వాదబలమే
మాకీనాటికింత
తృప్తి
చేకూర్చెన"నిరి.
భరతశత్రుఘ్నుల
కృతజ్ఞతా
పూర్వకమైన
వందనముల
నందుకొన్న
జనకుడు
ఆ
పిల్లలయొక్క
ప్రేమ
వాక్యములను
హృదయ
పూర్వకముగా
అందుకొని,
వారల
గుణములను
తనలోతాను
ఎంతయో
మెచ్చుకొని,
వారల
చెంత
చేర్చుకొని,
శిరస్సులను
ముద్దాడి
"నాయనలారా!
రామచంద్రుని
అజ్ఞానుసారము
మీరు
మెలగి
అతని
అనుగ్రహపా…
35
▾
Meaning
Keep
లగుదురుగాక!
నేనిక్కడనుండియే
మిథిలకు
వెళ్లుచున్నా"ని,
తన
పరివారము
తరఫున
తానే
భరతశత్రుఘ్నులచెంత
సెలవు
పుచ్చుకొని,
తన
పరివారముతో
మిథిలకు
ప్రయాణమయ్యెను.
ఇక
మంత్రులు,
సామంతులు,
ప్రజలు,
బ్రాహ్మణులు,
ఋషులు,
ఒకరితరువాత
ఒకరు
సీతా
రామలక్ష్మణుల
దగ్గరి
సెలవుతీసుకొని
భారమైన
హృదయంతో
విడువలేక
అయోధ్యకు
తిరిగి
వెళ్లుటకు
అన్ని
విధముల
సిద్ధమయిరి.
సీతారాములు
తల్లులైన
కౌసల్య,
సుమిత్ర,
కైకేయిల
దగ్గరకు
వెళ్లి
వారలకు
నమస్కరించి,
"తమ
విషయమై
"మీరేమాత్రమునూ
విచారించక,
మీ
మీ
కర్తవ్యములను
మీరు
సక్రమముగా
నిర్వర్తించుచూ,
తండ్రియైన
దశరథుని
అభీష్టముల
ననుసరించి
ధన్యులగుదుర"ని
ప్రార్థించిరి.
"మేము
ఎట్టి
బాధలకూ
గురికాక
ఆనందముగా
పదునాలుగు
సంవత్సరములు
పదునాలుగు
క్షణములవలె
గడపి,
తిరిగి
అయోధ్య
చేరుకొందుమ"నియూ,
"తండ్రిగారి
ఆజ్ఞను
నెరవేర్చుటే
పుత్రుని
పరమలక్ష్యమని"యూ
"ఆ
నిమిత్తమై
మేము
ఈ
పవిత్రవనమున
ఆనందముగా
కాలము
గడుపుదుమని"యూ,
తల్లులకు
ధైర్యము
చెప్పిరి.
కైకకు
నమస్కరించి,
"తాము
అరణ్యమున
నివసించుటకు
ఆమె
ఏ
మాత్రమూ
కారణము
కాదనియూ,
ఆమె
నిరంతరమూ
పూజనీయురాలే
కాని
కీడొనర్చినది
కాదనియూ,
ఆమె
మేలును
మరువ
లేమనియూ,
మా
నిమిత్తమై
మీరేమాత్రమూ
విచారించక
భరతునికి
తోడుగా
ధైర్యము
తెలుపుతూ
అతనిని
చక్కగ
కాపాడుకొనుచుండవలెన"నియూ,
"ఏదో
ఉడుకురక్తముతో,
తండ్రి
మరణమును,
నా
వియోగమును
భరించలేక
తల్లియైన
మిమ్ములను
అనేక
విధముల
తూలనాడినాడ"నియూ,
అది
భరతుని
తప్పుగా
భావించక,
అతనిని
క్షమించవలసినద"నియూ
సీతారాములు
కైకను
వేడుకొనిరి.
ఇట్టి
పవిత్రవచనములనుచున్న
రాముని
ముఖమును
కైక
సిగ్గుతో
…డలేకపోయినది.
"ఇంతటి
విశాలభావమును,
పవిత్రహృదయమును
గల
36
▾
Meaning
Keep
బంగారువంటి
నా
రాముని
నేనింతగా
బాధపెడితిని
కదా!
ఈ
భయంకర
అరణ్యమున
జీవితము
గడుపుటకు
నేనే
కారణము
కదా,
ఛీ,
నేనెంత
కిరాతకపు
పని
గావించితిని.
నిజముగా
నేను
చేసితినా
లేక
రామసంకల్పమే
నన్నీరీతుల
ఆడించెనా?
ఏ
దెట్లయిననేమి?
నేను
మహాపాపిని"
అని
తనలోతాను
నిందించుకొని
సీతను
దగ్గరకు
చేర్చి
"ఆనాడు
చేసిన
నా
తప్పును
క్షమించు"
మని
కోరి,
తన
రెండు
హస్తములు
గట్టిగాపట్టి
"ఇంతటి
పవిత్రనారీమణికి
పడరానిపాట్లు
కల్పించిన
నన్ను
మీరు
క్షమించుట
న్యాయము
కాదు"
అని
కైక
ఎంతో
విలపించెను.
తన
తప్పును
తాను
హృదయపూర్వకముగా
తెలిసికొని
బాధపడెను.
ఈవిధముగా
అందరూ
వారివారి
స్థానముల
ననుసరించి
సీతారామ
లక్ష్మణుల
చెంత
సెలవు
తీసుకొని
ఎవరి
రథములందు
వారు
ఆసీనులైరి.
సీతారామలక్ష్మణులు
ప్రతి
రథము
దగ్గరకూ
వెళ్లి,
అందరినీ
మరొకతూరి
పలుకరించి,
ధైర్యము
చెప్పి,
ఒక్కొక్క
రథమునే
కదిలించుచూ
వచ్చిరి.
గురువగు
వశిష్ఠులవారి
పాదములకు
సీతారామలక్ష్మణులు
నమస్కరించి
"తమకు,
తమ
ధర్మపత్నికి
మా
వలన
చాలా
శ్రమ
కలిగెను.
ఈ
అడవిలో
తమ
సేవలు
చేయవలసినంతగా
చేయలేకపోయినందుకు
క్షమించుమని,
వారిక
నిలచుటకు
సెలవు
దయచేయుమని"
ప్రార్థించిరి.
ఋషి,
జ్ఞాని,
బ్రహ్మఋషి
అయిన
వశిష్ఠులవారికి
కూడా
వారి
భక్తిశ్రద్ధలను,
ధర్మమార్గమును
వర్ణించుటకు
సాధ్యము
కాలేకపోయెను.
వారిని
విడచి
ముందుకు
పోలేకపోయినారు.
మువ్వురూ
ఒకచోట
నిల్చొని
హస్తములు
జోడించి
కదలిపోవు
రథములవారికి
నమస్కరించుచున్న
దృశ్యము
ఎట్టి
కఠినమైన
బండలనైనా
కరిగించగలవన్నట్లు
తోచినది
అరుంధతీ
వశిష్ఠులకు.
తదుపరి
నిషాదపతిని
అతని
పరివారమును
చూచి
శ్రీరాముడు
అతనిని
సోదరునికన్నను
మిన్నగా
కౌగిలించుకొని
అతని
వియోగ
దుఃఖమును
అనేక
విధముల
ఓదార్చుచూ
బోధను
గావించెను.
గుహుడు
చేయునదిలేక
37
▾
Meaning
Keep
రామపాదములకు
నమస్కరించి
గుండెలను
బండలుగా
చేసుకొని
వెనుకకు
తిరుగుచూ
పయనము
గావించెను.
వారందరు
వెళ్లనంతవరకు
సీతారామలక్ష్మణులు
ఒక
వృక్షచ్ఛాయ
యందు
నిల్చొని
ఉండిరి.
ఇంతలో
జనకమహారాజు
తన
పరివారముతో
బయలుదేరిరి.
రామలక్ష్మణులు
అత్తమామలకు
నమస్కరించినతోడనే,
సీత
తల్లిదండ్రులకు
నమస్కరించెను.
ఆమెను
కౌగిలించుకొని
శిరస్సును
ముద్దాడి,
"అమ్మా!
నీ
సాహసము,
నీ
పతిభక్తి
మాకు
కీర్తి
తెప్పించినవి.
నీవలననే
మా
వంశము
పావనమైనది.
ఇట్టి
పుత్రికను
కన్నందుకు
మేమేజన్మమున
ఏ
నోము
నోచితిమో
దాని
ఫలమే
ఈనాడిట్టి
కీర్తిని
అందుకోగలుగుచున్నా"మని
అనేక
విధముల
వర్ణించి,
"నీకెట్టి
కొరతయూ
ఉండదు.
రామచంద్రుడు
నీకు
ప్రాణము.
అతని
ఛాయలయందుండు
నీకేకొరతయు
ఉండదని
మాకు
తెలుసు.
అయినను
ఉపాధి
భేదముచే
ఇట్టి
సమస్యలు
అప్పుడప్పుడు
కలుగుట
దైవలీల,"
అని
అనేక
విధముల
వేదాంతమును
బోధించి,
వారునూ,
వారి
పరివారమును
బయలుదేరిరి.
ఈ
వచ్చిన
రెండు
రాజ్యముల
పరివారములు
పూర్తిగా
బయలుదేరి
కొంత
దూరము
పోవువరకూ
సీతారామలక్ష్మణులు
ఆ
వృక్షచ్ఛాయయందే
నిలుచుండి
అక్కడనుండి
పర్ణశాలకు
వచ్చి
చేరి
భరతశత్రుఘ్నుల
భక్తిశ్రద్ధలను
వారి
ప్రేమ
ఆదర్శములను
గురించి,
ప్రజలయొక్క
అభిమానములను
గురించి
అనేకవిధములుగా
రాముడు
చెప్పుచుండ,
సీతారామలక్ష్మణు
లతి
శ్రద్ధతో
ఆలకించుచూ
వారి
ఎడబాటునకు
కొంత
యోచించుచూ
మధ్యమధ్య
తమ
తండ్రియైన
దశరథుని
మరణవార్తను
హెచ్చరించుచూ,
కొంత
కృతజ్ఞతా
రూపమైన
ప్రేమను
అర్పించుచూ
కంటనీరు
పెట్టుచుండిన
సీతా,
లక్ష్మణులను
చూచి,
రాముడు
చిరునవ్వుతో
వారలకు
జీవితరహస్యములను
బోధించుచూ
ఈరీతిగా
ఆనాడు
కాలమును
గడిపిరి.
38
▾
Meaning
Keep
మునులు,
బ్రాహ్మణులు,
ఋషులు,
భరతశత్రుఘ్నులు,
కౌసల్య,
సుమిత్ర,
కైకేయి,
రాణులు,
మంత్రులు,
ప్రజలు,
రాముని
వియోగమును
సహించలేక
చింతాక్రాంతులై
గడచిన
అయిదు
దినములలో
రామలక్ష్మణ
సీతాది
త్రిమూర్తులు
చూపిన
ఆదర్శమును,
వారి
ప్రేమ,
కరుణ,
దయారసమును,
వారి
వాగమృతమును
తలచుకొంటూ,
ఆహారనిద్రలన్నది
మరచి
రాత్రి
పగలని
తలంచక
మార్గమునందెందునూ
నిలువక
ప్రయాణము
సాగించుచూ,
రెండవదినమున
గంగానదిని
దాటిరి.
అక్కడ
నిషాదపతి,
ఆ
పరివారమునకు
తగిన
భోజనాదులు
ఏర్పాటు
చేసెను.
కానీ
రామలక్ష్మణ
సీతా
వియోగమున
దుఃఖించుచున్న
వారగుటచే
ఎవ్వరునూ
ఏమీ
ఆరగించలేదు.
ఏదో
గుహుని
తృప్తి
నిమిత్తమై
అందరూ
ముట్టి
పారవేయుచూ
వచ్చిరి.
కడకు
గుఱ్ఱములు
సహితము
మేత
మేయలేదు.
నీరు
త్రావలేదు.
ఈ
దృశ్యమును
గమనించిన
వశిష్ఠులవారు,
"శ్రీరాముడు
సర్వభూతాంతరాత్మ,
తానే
సర్వభూతములందు
ప్రజ్ఞాన
స్వరూపుడై
చైతన్యము
నందించుచున్నాడ"ని
అందరికీ
బోధించుచూ
వచ్చెను.
తిరిగి
వారెక్కడనూ
విశ్రాంతి
తీసుకొనుటకు
అంగీకరించక
సరాసరి
అయోధ్యకు
చేరవలెనని
భరతుడు
సంకల్పించుటచేత,
రామచంద్రుని
పవిత్ర
పాదుకలను
ప్రజలకు
చూపి
ధన్యులను
గావించవలెనను
ఇచ్ఛచేత
ప్రయాణమును
కొనసాగించిరి.
మూడవదినము
సరయూనదిని,
గోమతిని
దాటి
నాలుగవదినము
అయోధ్యానగరమును
సమీపించిరి.
ఎప్పుడు
భరతశత్రుఘ్నులు,
రామలక్ష్మణ
సహితముగ
అయోధ్యను
ప్రవేశింతురా!
అని
కన్నులు
కాయలుగాచినట్లు
కాచుకొన్న
ముసలి
బ్రాహ్మణులు,
స్త్రీలు,
పిల్లలు,
వారి
రథముల
శబ్దములు
వినగనే
వీధులలో
ప్రవేశించి
"రామచంద్ర
ప్రభు
వెక్కడ?
ఎక్కడ?"
అని
ఆతురతతో
అన్ని
రథములనూ
చూచుతూ
వచ్చిరి.
కానీ
కొంత
చీకటి
పడటముచేత,
తెల్లవారి
చూడవచ్చునను
ఆశతో
కొండంత
ప్రేమతో
కాచుకొనియుండిరి.
తెల్లవారి
లేచినతోడనే
సీతా
రామలక్ష్మణులు
రాలేదనియు
శ్రీరామ
పాదుకలు
మాత్రమే
అయోధ్యకు
చేరినవనియూ
విని
కొంత
ఆశ,
కొంత
నిరాశలకు
గురి
అయిరి.
39
▾
Meaning
Keep
భరతుడు
గురువుగారిని,
మంత్రులను
రప్పించి
రాజ్యసూత్రముల
నప్పగించి
తగినరీతిగ
వారికి
నచ్చచెప్పి,
శత్రుఘ్నుని
పిలిచి
తల్లుల
సంరక్షణార్థం,
నీవు
తగిన
చర్యలు
తీసుకొనవలెనని
బోధించెను.
బ్రాహ్మణులను,
పండితులను
పిలిపించి
చేతులు
జోడించుకొని
నమస్కరించి
"మీ
ఆజ్ఞప్రకారము
నేను
నడచుకొందును.
గొప్పవయినను,
చిన్నవయినను
మీరు
సంశయించక
మీ
కోరికలను
తెలుపుడు.
వాటిని
నేను
నెరవేర్తును"
అని
తెలిపెను.
ప్రజలను
పిలిపించి,
దేశీయులను
సమావేశపరచి
వారికి
తగినట్లు
తెలిపి,
రాముని
సంభాషణల
సారాంశమును
ప్రజలకు
వినిపించి
"ఈ
పదునాలుగు
సంవత్సరములు
రామపాదుకలే
మన
అందరి
రక్షగా
భావించి,
పాదుకలే
పరిపాలన
చేయుచున్నవన్న
లక్ష్యమును
అందరి
హృదయములందు
తలంచి
మనము
రామ
చింతనతో
జీవించవలెను.
తదుపరి
శ్రీరాముడు
మనకు
ప్రభువుగా
నిలిచి
ప్రత్యక్షపరిపాలన
కొనసాగించును.
ఆ
ప్రియదినమునకై
మనము
కాచుకొనుటే
మన
కర్తవ్య"మని
తెలిపెను.
గురువు,
పండితులు,
ఋషులు,
పురోహితులు,
మంత్రులు,
పురప్రముఖులు,
ప్రజలు
అందరి
ఆనందమును
పురస్కరించుకొని
అందరి
అభిప్రాయములను
అందుకొని
రామపాదుకలను
సింహాసనమున
ప్రతిష్ఠించుటకు
తగిన
ముహూర్తమును
నిర్ణయించుకొని
ఆ
ఉత్సవమునకు
తగిన
ఏర్పాట్లు
మహావైభవముగా
గావించెను.
ఆ
వైభవము
పూర్తిచేసుకొని
తల్లులైన
కౌసల్యకు,
సుమిత్రకు,
కైకకు
నమస్కరించి,
పాదుకలను
శిరస్సున
దాల్చి,
తన
సర్వబాధ్యతలు
పాదుకలే
పరిపాలించుననని
నమస్కరించి,
గురువు
అనుమతిని
పొంది
నందిగ్రామమునకు
వచ్చెను.
ఆ
ధర్మదురంధరుడు,
ఆ
ధైర్యశాలి
ఆ
గ్రామములో
ఒక
చిన్న
పర్ణశాలను
నిర్మించుకొని
రామలక్ష్మణులు
ధరించినట్లుగా
జడలను
ధరించి
మునుల
వల్కలములను
ధరించి
భూమిలో
ఒక
చీకటి
బిలమును
త్రవ్వుకొని
ఆహారపానీయములందును,
వస్త్రధారణయందును,
మునులవలె
కఠిన
…మును
పూనెను.
దేవేంద్రుడుకూడ
కొనియాడెడి
అయోధ్యా
నగర
40
▾
Meaning
Keep
భోగములను,
కుబేరుడు
కూడ
కొనియాడెడి
భాగ్యములను,
తృణ
ప్రాయమని
తలంచి
భరతుడు
వైరాగ్యముతో
ఆ
పల్లెయందు
ఆ
పర్ణశాలలో
ప్రకాశించి
పరులకు
కనిపించక,
రామచంద్రుడు
అయోధ్యకు
చేరువరకు
తానెవ్వరినీ
చూడనని
ప్రతిజ్ఞ
పూని
రామచంద్రుని
రాకకై
తాను
రామచింతన
చేయుచు
కాలము
గడుపజొచ్చెను.
అతని
దేహము
అనుదినము
దుర్బలమయ్యెను.
అతని
తేజస్సు,
బలము
అధికమయ్యెను.
ముఖవర్చస్సు
దేదీప్యమానమయ్యెను.
రామభక్తి
దినదిన
ప్రవర్ధమాన
మయ్యెను.
మనస్సు
పరిశుద్ధమైన
పాలుగా
మారెను.
తారాగణములు
హృదయాంతరాళమున
ప్రకాశించెను.
Previous
←
Ayodhyā Without Rāma
Next
Citrakūṭa
→