Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · Citrakūṭa
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
భరతుడు
ఈ
రీతిగా
నంది
గ్రామమున
రామచింతనాయత్తుడైయుండ,
చిత్రకూట
పర్వతముపై
నివసించుచున్న
సీతారామలక్ష్మణులు
భరతుని
భక్తిప్రపత్తులను
కొనియాడుతూ
కాలము
గడుపుచుండిరి.
ఇట్లుండ
చీమ
సముద్రపు
లోతును
చూడవలెనని
ఆశించినట్లుగా,
ఒక
మూర్ఖుడు,
జడుడు
అయిన
జయంతుడు
రామచంద్రుని
శక్తిని
కనిపెట్టవలెనని
ప్రయత్నించి,
కాకి
రూపమును
దాల్చి,
రామచంద్రునికి
సమీపమున
కూర్చొని
ప్రకృతి
సౌందర్యమును
తిలకించుచున్న
సీత
పాదమును
సూటిగా
ముక్కుతో
పొడిచి
గాయము
చేసెను.
అంత
సీత
పాదమునుండి
రక్తము
కార
ప్రారంభించెను.
దీనిని
చూచి
రాముడు
ఒక
గరికపోచను
పెరికి
ఆ
కాకిపై
విసరెను.
అపరాధము
లేక
రాముడొకరికి
హింసచేయడు.
సమయము
వచ్చినప్పుడు
రాహువు,
చంద్రునికూడా
మ్రింగును.
కానీ,
రాముడు
నిరపరాధుల
నేనాడునూ
హింసించడు.
ఆ
విసిరిన
గడ్డిపోచ
మహాగ్ని
రూపముతో
జయంతునిపై
బడెను.
అతనిని
వెంటతరుముతూ
పోయెను.
జయంతుడు
భయపడి
నిజరూపమును
ధరించి
"రామా,
కాపాడుము"
అని
పాదములపై
బడి
ప్రార్థించెను.
రాముడు
రక్షించెను.
ఆ
జయంతుడు
ఇంద్రుని
కొడుకు.
తన
కుమారుడు
రామద్రోహి
అని
తెలిసి
తండ్రికూడను
చాల
విచారించెను.
జయంతుడు
రామపాదములపై
బడి
"నేనొక
మూర్ఖుడను,
నన్ను
క్షమింపుము"
అని
ప్రార్థించగా
రాముడు
వాని
దైన్యమును
చూచి
జాలిపడి
వానిని
యేకాక్షునిగా
చేసి
విడిచిపెట్టెను.
అగ్నిరూపమైన
ఆ
గడ్డిని
తను
ఉపసంహరించుకొనెను.
రామచంద్రుడు
అల్పశిక్షతో
తనను
వదలెనను
కృతజ్ఞతను
చూపుచూ
ఆ
జయంతుడు
చాలాకాలము
సీతారామలక్ష్మణులు
నివసించు
చిత్రకూట
పర్వతముపైననే
2
▾
Meaning
Keep
నివసించుచూ
వచ్చెను.
రాముడు
మార్గశీర్ష
శుద్ధ
దశమినాడు
ఆ
జయంతుని
పిలిచి,
దక్షిణదిశకు
ప్రయాణము
కమ్మని
ఆజ్ఞ
చేసెను.
సీతాలక్ష్మణులు
రామాజ్ఞ
శిరసావహించి,
మువ్వురు
చిత్రకూటపర్వతము
విడచి
అత్రి
మహాముని
ఆశ్రమము
చేరిరి.
వీరి
రాకను
శిష్యుల
ద్వారా
తెలుసుకొని
అత్రి
మహాముని
యెదురేగి
వారిని
తన
ఆశ్రమమునకు
తోడ్కొనిపోయెను.
రామాగమనముతో
అత్రి
మహాఋషి
ఆనందమును
భరించలేక
కంటధారలు
కార్చుచూ
తన
జన్మ
పావనమైనదని,
అనేక
విధముల
చేసిన
తపస్సు
నేటికి
ఫలించినదని
ప్రార్థించి,
రాముని
స్తుతించెను.
ఆనాటి
సాయంకాలము
అత్రి
మహాఋషి
తన
శిష్యులను
చేర్చి,
రామునకు
ఉన్నత
ఆసనమును
యేర్పరచెను.
అత్రి
మహాముని
భార్య
అనసూయ
సీతకు
తగిన
యేర్పాట్లు
గావించి
ఆమెకు
తగిన
సేవలు
చేయుచు,
యేనాటి
నోమో
నేటికి
పండినదని
తానునూ
ఆనందించగా
అచట
కూడిన
శిష్యులకు
అత్రిమహాముని
సీతారామలక్ష్మణుల
పవిత్ర
శక్తులను,
అవతారములను
వర్ణించి
ప్రబోధించెను.
అనసూయ
తన
పతిభక్తినీ,
స్త్రీ
ధర్మమును
అనేక
విధముల
సీతకు
తెలుపుతూ
ఆమె
ఆదేశములను
అందించుమని
ప్రార్థించుచూ,
సీతయొక్క
గుణగణములను
వేనోళ్ళ
కొనియాడెను.
సీతలోకమున
జన్మించిన
ప్రతిప్రాణి,
ప్రతి
జీవి,
ప్రతి
భూతము
స్త్రీ
తత్వము
కలవారనియు,
జగన్నాటక
రంగమునకు
స్త్రీ
పురుషులుగా
కనిపించిననూ
బలతత్వాలలో,
భావరాగాలలో,
కష్టసుఖాలలో
అందరూ
స్త్రీలేననియు,
తన
భర్తయైన
రాముడొక్కడే
పురుషుడనియు,
ఆయన
యందు
ద్వంద్వభావములు
యేనాటికి
లేవు,
రావు
అనియు,
అతడు
అభయ
స్వరూపుడనియు,
ప్రకృతికే
పురుషుడై
ప్రకృతిని
వరించినాడనియు
వివిధ
నామరూపములతో
గోచరించెడి
ఈ
జగత్తు
యేకాత్మస్వరూపమేననియూ
అనసూయకు
రామతత్వమును
చక్కగా
ఉపదేశించెను.
సీతారామలక్ష్మణులు
అత్రిమహాముని
ఆశ్రమమున
ఆనందముగా
కాలమును
గడిపి,
ఆశ్రమవాసులకు
ధర్మమార్గమును
ప్రబోధించి,
మహాఋషి
అనుమతిని
తీసుకొని
వనసంచారమునకు
బయలుదేరిరి.
ఆశ్రమవాసులు
రామచంద్రుని
విడువలేక
కంటిధారలు
కార్చిరి.
విధిలేక
ఆశ్రమమున
వుండవలసివచ్చెనేకాని
లేకున్న
అందరూ
3
▾
Meaning
Keep
రామచంద్రుని
వెంటనే
వుండుటకు
అమితముగా
ప్రయత్నించిరి.
ఈ
రీతిగా
హృదయేశ్వరుడైన
రాముడు
సీతాలక్ష్మణులతో
ఆశ్రమము
వీడి,
అడవిలో
ప్రవేశించెను.
భీకరారణ్యమున
క్రూరమృగముల
గర్జనలు
భయంకరముగా
వినిపించుచుండ,
వివిధ
జాతుల
పక్షులు
విచిత్రములైన,
వినోదకరమైన
ధ్వనుల
చేయుచుండ
అదొక
విధమైన
లోకముగా
నుండెను.
ఇట్లు
ప్రయాణము
సలుపుతూ
సలుపుతూ
ఉండగా
ఒక
సుందరమైన
మందిరముతో
కూడిన
ఆశ్రమమొకటి
కంటబడెను.
దానిని
సమీపించుటకై
నూతనమైన
దారులు
అడ్డముగా
తిరిగి
లక్ష్మణుడు
ఆ
పొదలను
ముండ్లను
చిక్కులు
వదిలించి
సీతారాములకు
కొంత
అనుకూల
పరచుచూ
వెళ్ళెను.
ఆశ్రమమును
సమీపించుకొలది
నలువైపులా
రసాల
సాల
పున్నాగపూల
వృక్షములు
ఉండెను.
ఆ
విధమైన
ప్రకృతి
సౌందర్యమును
తిలకించి
సీత
సర్వస్వమునూ
మరచి,
నేత్రానందములో
లీనమై
రామజాడను
అనుసరించెను.
ఇంతలో
ఆశ్రమమును
చేరిరి.
వీరి
రాకను
గమనించి
ఆశ్రమవాసి
పరుగెత్తుకొని
వెళ్ళి
తమ
గురువునకు
నివేదించెను.
అంత
గురువులవారు
ఆశ్రమ
సింహద్వారమున
నిలిచి
సీతారామలక్ష్మణులకు
ఆనందభాష్పములతో
స్వాగతము
చెప్పెను.
వారిని
యథావిధిగా
సత్కరించి,
లోనికి
గొంపోయి
చల్లని
పానీయమును,
కందమూల
ఫలములను
అందించెను.
సీతారామలక్ష్మణులు
అమితానందముతో
వారి
సేవలను
అందుకొని
ఫలముల
నారగించి
కొంత
విశ్రాంతి
తీసుకొని,
సాయంసమయమున
స్నానసంధ్యాదులు
ఆచరించి,
మునీశ్వరుడు
ఏర్పరచిన
వేదికపై
ఆసీనుడై
ఆశ్రమవాసులతో
అనేక
విధములైన
ధర్మములను
గురించి
ముచ్చటించెను.
తదుపరి
ఆశ్రమవాసులకు
గల
సంశయమును,
శాస్త్రార్థములను
అడుగుటకై
అనుమతినిచ్చెను.
ఋషులు
వారి
వారి
అభీష్టములను
అమితమైన
ఉత్సాహముతో
అడుగదొడగిరి.
అన్నింటికీ
అన్ని
విధములైన
సమాధానములు,
అతి
సులభముగా
గోచరమగునటుల
రామచంద్రుడు
తెలిపెను.
ఆనాడు
ఆ
ఆశ్రమవాసులకు
స్వర్గము
వేరొకటి
లేదు.
రామసన్నిధియే
నిజమైన
స్వర్గము
కదా
అన్నట్లు
తమ
తమ
అనుభూతులను
ముచ్చటించుకొంటూ
కాలము
గడిపిరి.
తెల్లవారగనే,
స్నాన
సంధ్యాదుల
పూర్తిచేసుకొని,
ఆశ్రమ
వాసులు
ఎంతగా
4
▾
Meaning
Keep
ప్రార్థించిననూ
తన
నియమములకు
అడ్డుతగులకూడదని
రామచంద్రుడు
తలంచి
వనమునకు
ప్రయాణము
సలిపెను.
ఈ
విధముగా
ఒకరాత్రికంటే
అధికముగా
ఏ
ఆశ్రమమునందునూ
నిలువక
భయంకరారణ్యమున
రాముడు
సీతాలక్ష్మణులతో
సంచరించెను.
ఈ
ప్రయాణ
మధ్యమార్గమున
ఒకనాడు
ఒక
భయంకరాకారమున
విరాధుడను
రాక్షసుడు
కర్ణకఠోరముగా
గర్జించుచూ
వీరిపైకి
పరుగెత్తుకొని
వచ్చెను.
ఆ
దౌర్జన్యమును
చూచి
సీత
పురుష
సింహుడైన
రాముని
చెంత
వుంచుకొని
ఈ
గుంటనక్కల
గర్జనలకు
వెరచుటెందులకని
ధైర్యముతో
రాముని
చాటున
నిలబడి
చూచుచుండెను.
అంతలో
లక్ష్మణుడు
వానిపై
బాణములు
సంధించెను.
ఆ
అంబుల
బాధకు
తాళలేక
మరింత
క్రోధతామ్రాక్షుడై
ఆకర్ణాంతముగా
త్రిశూలమును
పట్టుకొని
కాలునివలె
నిలిచి
లక్ష్మణునిపై
ఆ
రాక్షసుడు
యెదురు
తిరిగెను.
ఈ
దృశ్యమును
చూచిన
రాముడు
తన
తమ్ముడైన
లక్ష్మణుడు
అలసిపోవుచున్నాడని
గుర్తించి
అర్ధచంద్రాకార
బాణమును
ప్రయోగించెను.
ఆ
బాణము
రాక్షసుని
త్రిశూలమును
చూరు
చూరు
చేసి,
తదుపరి
వాని
శిరస్సును
ఖండించెను.
ఆ
బాణము
కంఠమునకు
తగిలిన
తత్క్షణమే
వాడు
నేలపైబడెను.
అంత
వాని
దేహమునుండి
ఒక
దివ్యరూపము
వెడలివచ్చెను.
పూర్వము
ఇతడొక
గంధర్వుడు.
కుబేరుని
శాపముచేత
వీనికా
రాక్షసత్వము
ప్రాప్తించెను.
రామబాణముచే
వాని
శాపము
విమోచనమాయెను.
ఆ
వచ్చిన
దివ్యస్వరూపము
శ్రీరాముని
పాదములపై
బడి
అనేక
విధములుగా
స్తుతించి,
రామాజ్ఞ
తీసుకొని
స్వధామమునకు
తిరిగి
వెళ్ళెను.
నేలకూలిన
ఆ
రాక్షస
కళేబరమును
రామచంద్రుడు
భూమిలో
పాతిపెట్టి
అంత్యక్రియలు
గావించెను.
రామచంద్రుని
చర్యలకు
దేవతలుకూడా
ఆనంద
బాష్పములు
విడిచిరా
అన్నట్లు
చల్లని
వర్షబిందువులు
పడెను.
రామచంద్రుడు
అక్కడినుండి
శరభంగమహాముని
ఆశ్రమమును
ప్రవేశించెను.
అక్కడ
దానికి
పూర్వమే
రాముని
గురించి
వృత్తాంతములు,
సంభాషణలు
జరుగుచుండెను.
ఆ
సమయమునకే
సీతాలక్ష్మణ
సమేతుడైన
రామచంద్రుడు
అక్కడ
ప్రవేశించగనే
ఋషులు
సత్యమును
గుర్తించిరి.
5
▾
Meaning
Keep
రాముని
దివ్యమంగళ
విగ్రహమునుచూచి
శరభంగుడు
ఇదినిజమా
లేక
కలయా
లేక
ఒక
విధమైన
సమాధి
స్థితియా
అని
భ్రమించెను.
కొంతసేపటికి
సాక్షాత్
రామచంద్రుడే
అని
గుర్తించి,
అమితానందముతో
మువ్వురినీ
సత్కరించి,
ఆదరించి,
తమ
తపఃఫలము
ఈ
రీతిగా
సాక్షాత్కరించినదని
భావించి,
"రామా!
ఋషి
మానససరోవరములందు
సంచరించే
రాజహంసవు.
ఆహా!
నేటికి
నా
జన్మ
ధన్యమయినద"ని
అనేక
విధముల
స్తుతించెను.
"రామా!
నేనెట్టి
సాధనలు
యెరుగను.
కేవలమొక్క
ప్రేమతో
మాత్రమే
నిన్ను
పొందగల్గితిని.
నిన్ను
చూచిన
ఈ
నేత్రములు,
మరొక
దానిని
చూడనొల్లకున్నవి.
నీవు
ఋషి
అభీష్టములను
నెరవేర్తువని
ఆనాడు
మాట
యిచ్చియుంటివి.
నీ
ప్రతిజ్ఞను
నీవు
నిలబెట్టుకొమ్ము.
నేను
ఈ
శరీరమును
విడచిపెట్టునంతవరకూ
నీవు
నా
యెదుట
నిలచియుండుము.
నిన్ను
చూచుచూ
ఈ
కాయమును
చాలింతు"నని,
క్షణములో
చితి
పేర్చి,
అందులో
చిరునవ్వులు
చిందులుద్రొక్క
రెప్పవాల్చక
సీతారామలక్ష్మణులను
చూచుచూ
కాయమును
భస్మమొనరించుకొనెను.
ఈ
ప్రకారము
శరభంగుడు
రామ
ప్రేమరసమును
హృదయపూర్వకముగ
ఆరగించి,
రామచంద్రుని
ప్రత్యక్ష
ఆశీర్వాదములను
అందుకొంటూ
నీలమేఘచ్ఛాయను
తన
హృదయసరోవరమున
చేర్చుకొని,
ఆ
దృశ్యములోనే
లీనమై
పరమపదవిని
చేరెను.
ఆశ్రమవాసులు
గురు
వియోగమునకు
చింతించిననూ,
తరువాత
తమ
గురువునకు
ఇట్టి
పవిత్రస్థితి
చేకూరెనని,
సాక్షాత్
శ్రీ
మన్నారాయణుడే
సాకారరూపుడై
వచ్చి
గురువును
తనలో
చేర్చుకొనెనని
అమితానందముతో
రాముని
స్తుతించుచూ,
తమ
జన్మలు
సార్థకమయినవని
తలంచిరి.
జయ,
జయ
ధ్వనులు
సలుపుచూ
తమ
గురువు
కళేబరపు
భస్మమును
నొసట
ధరించిరి.
ఈ
వార్తను
విని
చెంతనున్న
ఆశ్రమవాసులు
పరుగిడి
వచ్చి
రామచంద్రుని
పాదములపైబడి,
"హే
నాథా,
శరభంగుడెంతటి
ధన్యుడో
కదా!
మిగిలిన
ఋషులు
రాక్షసుల
నోటబడి
ప్రాణములు
విడుచుచుండ,
శరభంగుడు
పరమాత్మ
కంటబడి,
కాయమును
పరమాత్మకే
అంకితము
గావించుకొనెను.
దేవా!
మమ్ములను
రాక్షసుల
బారినుండి
కాపాడి,
మా
సాధనకు,
తపస్సునకూ
యెట్టి
ఇక్కట్లు
రానీయక,
అంత్యమున
మా
తపః
ఫలితముగా
తమ
సాన్నిధ్యమును
అనుగ్రహించుమ"ని
ప్రార్థించిరి.
6
▾
Meaning
Keep
సుతీష్ణుడను
ముని
వచ్చి
రామచంద్రుని
పాదములపై
బడెను.
అతను
అగస్త్య
మహాముని
శిష్యుడు.
రామచంద్రుని
అమితముగా
ప్రేమించినవాడు.
ప్రేమ
చేతనే
పరమాత్మను
బడయవలెనను
సంకల్పము
అతనిలో
తీవ్రముగా
నుండెడిది.
అన్య
రూపములను
అతడు
స్వప్నమందైనను
వూహించేవాడుకాదు.
అతడు
రామ
ముఖ
పద్మమును
రెప్పలార్చక
చూచుచు,
"ఓ
నాథా!
నన్ను
కటాక్షించుటకే
ఇటు
వచ్చితివా?
నన్ను
నీ
ప్రేమలో
చేర్చుకొనవా?
ప్రత్యక్షముగా
సాకారుడవై
కూడనూ,
నన్ను
నిరాకారారాధనలో
వుండుమనుట
నీ
కిష్టమా?
ఎట్టి
యజ్ఞ
యాగాది
క్రతువులా
వాకు
తెలియవు.
నీ
ప్రేమ
స్వరూపమున
పొందగోరు
పరితాపమే
నా
తపస్సుగా
భావించి
ప్రేమించుచున్నాను.
ఇది
చాలదా?
"ఓ
భవ
మోచనా!
శ్రీవారిని
ప్రేమతో
సేవించుటకంటే
అధికమగు
భజన
యొక్కటి
లేదు
కదా?
నీ
గుణగణములను
గానము
చేయుచూ,
చింతించుచూ,
ఆనందముతో
పరవశమగుటకంటే
వేరానందమున్నదా?"
అని
ఆ
మునీశ్వరుడు
అనేక
విధముల
ప్రార్థించుచూ,
యెక్కడ
వున్నాడో
యేమి
చేస్తున్నాడో
యేమి
పలుకుచున్నాడో
తెలియని
స్థితిలో
అటు
ఇటూ
దిక్కుతోచని
రీతి
పిచ్చివానివలె
కంటిధారలు
కారుచుండగ,
సీతారామలక్ష్మణులను
చూచుచూ
వుండ,
శ్రీరాముడు
అతని
నిశ్చల
భక్తిని
కనిపెట్టి
చెంతచేర్చి
అనేక
విధములుగా
ఓదార్చి,
ఆలింగనము
గావించుకొన,
మునీశ్వరుడు
తనను
తాను
మరచి,
రామహస్తములలో
పరమానందముతో
సమాధినిష్ఠుడాయెను.
ముని
ఒక
బొమ్మవలె
కదలక
మెదలక
నిలిచిపోయెను.
కొంతసేపటికి
శ్రీరాముడు
ఆ
మునిని
మేల్కొలుపగా,
ముని
ప్రజ్ఞ
తెచ్చుకొని
రాముని
పాదములపై
పడి,
సాష్టాంగ
నమస్కారము
సలిపి
హస్తములు
జోడించుకొని,
"నాథా!
మోహమనునట్టి
దట్టమగు
అరణ్యమును
దహించుటకు
నీవు
పావకుడవు!
సజ్జనులనునట్టి
పద్మములను
వికసింపజేయుటకు
నీవు
సాక్షాత్
సూర్యుడవు.
రాక్షస
కుంజరములను
సంహరించుటకు
నీవు
మృగరాజువు.
సంసారమనునట్టి
పక్షి
నెగురుగొట్టుటకు
నీవు
డేగవంటి
వాడవు.
ఓ
నాథా!
నీ
నేత్రములు
రాజీవములు.
నీ
దివ్య
మంగళ
విగ్రహమును
చూడ
ఈ
రెండు
నేత్రములు
చాలవు.
జానకి
నయన
చకోరములకు
నీవు
చంద్రుడవు.
ఋషుల
మానస
సరోవరములందు
నివసించు
రాజహంసవు.
సంశయసర్పములను
భక్షించుటకు
7
▾
Meaning
Keep
నీవు
గరుత్మంతుడవు.
కాష్ఠవాదము,
విషాదము,
కర్కశము
నీ
కటాక్షమువలన
భస్మమైపోగలవు"
అని
ఇంకా
అనేక
విధముల
రామచంద్రుని
వర్ణించుచూ,
తనివితీర
రాముని
దర్శించుచూ
కాలము
తెలియక
కాయమును
మరచి
కంటి
రెప్పలు
ఆర్చక
స్తుతించు
మునీశ్వరుని
చూచి
రామచంద్రుడు
లేవనెత్తి,
"సుతీష్ణుడా!
నీవు
సకల
గుణసంపన్నుడవు.
నీకేమి
కావలెనో
కోరుకొమ్ము,
అనుగ్రహింతును"
అని
పలుక,
ముని
"ఓ
దీనబంధూ!
సీతాలక్ష్మణులతో
గూడి
ధనుర్ధరుడవై
నా
హృదయాంతరాళమున
సదా
నివసించుము"
అని
ప్రార్థించెను.
'తథాస్తు'
అని
రాముడు
సీతా
లక్ష్మణ
సమేతుడై
మునిని
వెంటబెట్టుకొని
అగస్త్యుని
ఆశ్రమమునకు
ప్రయాణమయ్యెను.
కొంతదూరము
నడువగనే
ఒక
నది
శబ్దము
వినబడెను.
అంత
ఆ
నదిని
వెతుకుచూ
వెళ్ళగా
ఆ
నదికి
పై
భాగమున
ఎత్తైన
పర్వతమొకటి
కనిపించెను.
ఆ
రెండింటికి
మధ్యను
సుందరమైన
పూలతోటలు,
వాటి
మధ్య
కొలను
మధ్యనున్న
తామర
పుష్పమువలే
అగస్త్యుని
ఆశ్రమమును
చూచిరి.
ఆ
ఆశ్రమ
మెంత
మనోహరముగా
కనుపించెనో
చెప్పవీలు
కాకపోయెను.
కొన్ని
నిమిషములు
దానిని
చూచుచూ
సీతారామలక్ష్మణులు
స్తంభించిపోయిరి.
ఆ
వాతావరణము
వర్ణనాతీతము.
జలచరములు,
భూచరములు
సహజవైరమును
విడిచి
అత్యంత
మైత్రితో
నివసించెను.
సిద్ధులు,
మునీశ్వరులు
ఆ
నదీతీరమున
నిశ్శబ్దముగా
తపస్సు
ఆచరించుచుండిరి.
ఆశ్రమమును
సమీపించగనే,
సుతీష్ణుడు
ముందుగా
ఆశ్రమములోనికి
పరుగెత్తి
గురువు
పాదములపై
పడి
నమస్కరించి
"ఓ
దయాళూ!
అయోధ్యాపతి
కుమారుడు,
జగదాధారుడు,
సీతాలక్ష్మణ
సమేతుడై
మన
ఆశ్రమమును
ప్రవేశించినాడు;
మీరు
దివారాత్రములు
ఎవరిని
ధ్యానించుచున్నారో,
వారే
ప్రత్యక్షముగా
మీ
చెంతకు
వచ్చుచున్నారు.
ఆహా,
ఎంతటి
సుదినము,
యెంతటి
భాగ్యము!"
అని
మైమరచి
ఉప్పొంగిపోయెను.
అంత
అగస్త్యుడు
దిగ్గనలేచి,
వెతకబోయిన
తీగ
కాలికే
చుట్టుకున్నట్లు
భావించి,
వేగముగా
వెలుపలికి
నడచెను.
ఎదురుగా
వచ్చుచున్న
సీతారామలక్ష్మణులను
చూచి
అగస్త్యుడు
కంటిధారలు
కార్చుచూ,
"నాథా!
నాథా!"
అని
పరుగెత్తుకు
వెళ్ళి
రాముని
గాఢముగా
కౌగలించుకొనెను.
అట్లే
కొన్ని
క్షణములు
వృక్షమునకు
అల్లుకొనిన
లతవలె
నిలిచిపోయినాడు.
భరించలేని
ఆనందమును
అందుకొని
అగస్త్యుడు
8
▾
Meaning
Keep
సీతారామలక్ష్మణులను
ఆశ్రమములోనికి
తీసుకొని
వెళ్ళి
ఉన్నతాసనములపై
కూర్చొనబెట్టి,
ఫలపానీయముల
తెప్పించి
అందించెను.
కుశల
ప్రశ్నలు
వేయుచుండ
అగస్త్యుడు
కన్నులు
మూసుకొని
చిరునవ్వులు
చిందులు
ద్రొక్క
ఆనందబాష్పములు
రాల్చుచు,
"నాథా!
నా
కంటే
అదృష్టవంతుడు
లేడని
భావించుచున్నాను.
సాక్షాత్
నారాయణుడు
నా
చెంతకు
వచ్చుట,
నా
ఆశ్రమమున
నివసించుట,
నిజముగా
ఇది
కలయా,
లేక
సత్యమా
అని
అనిపించుచున్నది"
అని
వేయి
విధముల
తన
సంతోషమును
వెలిబుచ్చెను.
అంత
రామచంద్రుడు,
"మునిరాజా!
మీ
వద్ద
నాకు
దాపరికము
లేదు.
నేను
వనమునకు
వచ్చుటకు
కారణము
మీకు
విశదమే.
అందుచేత
నా
సంగతి
నేను
ప్రత్యేకముగా
ప్రకటించుకోలేదు.
ఏ
ప్రకారము
ఋషులకు,
మునులకు
తపోభంగము
కలిగించు
రాక్షసులను
సంహరింపవలెనో,
దైవదాసులను
రక్షించవలెనో
తమరు
సెలవిచ్చిన
ఆ
రీతిగా
చేతు"నని
పలికెను.
"ఓ
మునీ!
హేమంత
ఋతువులో
కమలములు
నశించు
విధమున,
నేడు
మునిద్వేషులు
నశించుటకు
సమయమాసన్నమైనది,"
అని
రాముడు
తెలుపగనే,
అగస్త్యుడు
చిరునవ్వుతో,
"ఓ
నాథా!
మీకు
సర్వము
విదితము.
ఇట్లేల
నన్ను
ప్రశ్నించుచున్నారో
అర్థముగుటలేదు.
ఇది
నన్ను
అనుగ్రహించుమాటలో
లేక
పరీక్షించు
పలుకులో
కూడ
నిర్ణయించుకోలేకపోవుచున్నాను.
అయితే
ఈ
దర్శనస్పర్శనసంభాషణల
ప్రభావముచే
మీ
భావమును
కొంతవరకూ
తెలుసుకోగలిగితిని.
అదియూ
తమ
కటాక్షమే.
మీ
మాయ
మీ
పాదాక్రాంతురాలై
మీ
భృకుటి
విలాసమును
నిరీక్షించుచుందును.
ఆ
మాయమే
మీ
ప్రభావము
చేత
సమస్త
దేవగణములను
సృజించుచున్నది.
మీ
మాయ
అజేయురాలు.
మీ
మాయ
జీవులనెంత
కష్టపెట్టుచున్నదో
ఆ
సంగతి
లోక
ప్రసిద్ధము.
కటాక్షించి
నా
విన్నపము
నాలకించు.
మీ
మాయ
బొద్దచెట్టువంటిది.
దాని
పండ్లవంటివి
మాయాకల్పితములగు
బ్రహ్మాండ
కటాహములు.
ఈ
బ్రహ్మాండములోని
చరాచర
జంతు
జాలములా
పండ్లలోని
పురుగులు
వంటివారు.
వానియందము
పైపై
జూడ
చిత్రముగా
నుండును.
కానీ
వాటి
పొట్ట
విప్పిచూడ
పురుగులు
లెక్కకు
మిక్కుటము.
ఈ
బ్రహ్మాండ
ఫలము
నందాసక్తి
కలవారు
కాలస్వరూపులగు
మిమ్ము
చూచి
భయపడుచుందురు.
రామా!
మీరు
లోకారాధ్యులు.
9
▾
Meaning
Keep
మనుజమాత్రునివలె
మీరు
నన్ను
ప్రశ్నించుట,
ప్రశంసించుట
—
ఇది
యోగ్యముగా
వున్నదా?
నాకేదీ
అక్కరలేదు.
సీతాలక్ష్మణ
సమేతులై
మీరు
నా
హృదయమున
నివసించుడు.
ఒక
వరమును
నా
కనుగ్రహింపుము.
మీ
సగుణరూప
ధ్యానమే
నాకు
అభిమానము.
అదే
నా
మతము,
అభిమతము,
వ్రతము
కాన
కటాక్షింపుము,
కరుణింపుము.
"మీ
దాసులకు
గొప్పతనమిచ్చుట,
మీరు
అమాయకులవలె
యేమీ
తెలియని
పామరునివలె
ప్రక్కకు
తొలగుట
మీ
ఘనలీలలలో
ప్రధానమైన
లీల
కాన,
వేరు
మిమ్ము
ప్రశ్నించక
తమ
అభీష్టమును
అనుసరించుట
నా
కర్తవ్యము.
సారెసారెకు
నన్ను
నీ
మాయలో
దింపి
పరీక్షించకు
తండ్రీ!"
అని
ప్రార్థించెను.
అంత
రామచంద్రుడు,
"మునివర్యా,
ఈ
ప్రాంతములు
మీకు
సహజ
పరిచయము
కనుక
యెక్కడ
నేను
సీతాలక్ష్మణులతో
నివసించుటకు
యోగ్యమో
మీరు
నిర్ణయించుటలో
తప్పేమున్నది?
ఇది
లోకప్రవృత్తి
కదా!"
అని
జవాబివ్వగా
అగస్త్యుడు,
"నాథా!
అడిగితిరి
కనుక
ఆజ్ఞను
జవదాటక
తెలుపనెంతును.
అతి
సమీపమున
పవిత్ర
గోదావరి
ప్రవహించుచున్నది.
ఆ
మహానది
యుగముల
తరబడి
సజీవమై
ప్రవహించుచున్నట్టిది.
దాని
సమీపమున
దండకారణ్యము
కలదు.
ఆ
దండకారణ్యమును
పవిత్రము
చేసిన,
ఋషులకు
సమస్త
సుఖములు
చేకూర్చిన
వారగుదురు.
కారణమేమన,
ఆ
వనము
మునిరాజు
శాపముచే
తపించుచున్న"దనెను.
అంత
రాముడు,
"అగస్త్యా!
ఆ
శాప
వృత్తాంతము
సీత
వినగోరుచున్నది.
విపులముగా
తెలుపుమని
కోరగా,
అగస్త్యుడు,
"ఓ
నటన
సూత్రధారీ!
ఒక
సమయమున
పంచవటీ
తీరమున
దుర్భిక్షము
వచ్చెను.
అప్పుడు
మునులందరు
గౌతమ
ఋషిని
ఆశ్రయించిరి.
అతడు
తపోమహిమతో
విశేషకాలము
ఆశ్రయించిన
మునులను
పోషించెను.
దుర్భిక్షకాలము
తీరగనే
ఋషులందరూ
తమతమ
స్వస్థానములకు
పోతలంచిరి.
అయితే
వేషధారులైన
కొందరు
ఋషులు,
గౌతమ
ముని
శక్తి
సామర్థ్యములను
చూచి
ఓర్వలేక
కొన్ని
కుట్రలు
పన్ని
అతనిని
యేరీతిగానైనా
నిందలపాలు
చేయవలెనని
భావించి
బక్క
గోవును
వెతికి,
కొన్ని
క్షణములలో
ప్రాణము
వీడునట్టి
దానిని
తీసుకొని
వచ్చి,
ఆశ్రమములో
పచ్చగా
ఆకర్షణీయముగా
వున్న
ప్రదేశమున
ప్రవేశింపజేసిరి.
గౌతముడు
బయటకువచ్చి
చూచుసరికి
పచ్చని
(శోభాయమానమైన)
పూలమొక్కలను,
లేవలేక
10
▾
Meaning
Keep
తినలేక,
ప్రాణములు
వీడుటకు
సంసిద్ధముగా
వున్న
ఆ
గోవును
చూచి,
పూలమొక్కలు
పాడుచేయుచున్నదని
తలంచి
దానిని
లేపి
బైటకు
త్రోలుటకై
ప్రయత్నించగా
ఆ
ప్రయత్నములోనే,
అనగా
స్పృశించిన
తత్క్షణమే
ఆ
గోవు
అక్కడే
ప్రాణములు
వీడెను.
అంత
కుట్రలు
పన్నిన
వేషధారి
ఋషులు
గౌతమునికి
గోహత్యాపాపమును
అంటగట్టిరి,
పుట్టించిరి.
అతనిని
దూషించిరి.
అంత
గౌతముడు
గోవు
ప్రాణములు
వీడుట
యోచించి,
అది
సకాల
వర్జితమా
లేక
తనచే
ప్రాణములు
వీడటమా
అని
కొంత
ధ్యాననిష్ఠుడై
సత్యమును
గమనించెను.
"
ఇది
ఋషులు
పన్నిన
నాటకమని
తెలుసుకొని,
ఆ
వనమున
ఇట్టి
కపట
ఋషులు
నివసించకూడదని
తలంచి
'ఈ
వనము
భ్రష్టమగుగాక!
ఈ
వనమున
రాక్షసులు
మాత్రమే
నివసింతురు
గాక!'
అని
శపించెను.
"దండకుడను
రాజు
గురుపుత్రికను
బలాత్కారముగా
చెరబట్టెను.
కనుక,
ఆమె
భృగుమహాముని
బిడ్డ
అగుటచే
ఆమె
తండ్రికి
విన్నవించగా
తండ్రియైన
భృగుమహర్షి
కోపించి,
అతని
రాజ్యముపై,
ధూళివర్షమును
కురిపించెను.
అందువలన
మట్టిమయమై
ఈ
రాజ్యము
వనముగా
మారెను.
దండకుని
రాజ్యము
వనముగా
మారుట
చేత,
దండకారణ్యమని
పేరు
పడె"నని
తెలిపెను.
"ఓ
రఘువంశ
తిలకా!
తాము
ఆ
వనమున
నివసించిన,
అందులోని
రాక్షసులు
నశింతురు.
ఆ
ప్రదేశము
శాప
విముక్తిని
పొందును.
ఋషులకు
సత్సంకల్పములు
పెరుగును.
అనేక
విధముల
లోకోపకారము
కలుగును.
ఋషుల
శాపములు
తీరుటచేత,
శపింపబడిన
ఋషులకుకూడా
ఆనందము
కలుగును"
అని
అగస్త్యుడు
కోరగా
"సరి,
చాలా
మంచి"దని
అగస్త్యుని
వద్ద
సెలవు
తీసికొని
సీతాలక్ష్మణులతో
దండకారణ్యమునకు
రామచంద్రుడు
బయలుదేరెను.
అగస్త్యుడు
రామచంద్రునకు
నమస్కరించి,
యెంతో
కాలమునుండి
తన
చెంత
నుంచుకొనిన
కొన్ని
అస్త్రములు
తానుపయోగించుటకు
వీలుకానందున
వాటిని
రామచంద్రునకు
అందించి,
"నా
సర్వబలము
తామే.
ఈ
అస్త్ర
బలములు
నన్ను
రక్షించవు.
రామానుగ్రహబలమే
నిజమైన
బలము,
నిజమైన
రక్ష"
అని
తలంచి
వాటిని
గైకొనుమని
ప్రార్థించెను.
11
▾
Meaning
Keep
అగస్త్యుని
ప్రార్థనను
మన్నించి
రాముడు
ఆ
అస్త్రములను
అందుకొని
ఆశ్రమము
వీడెను.
సీతారామలక్ష్మణులు
దండకారణ్యము
ప్రవేశించిన
తరువాత
అంతవరకూ
యెండబారిన
వృక్షములు
చిగుళ్ళుపెట్ట
మొదలిడెను.
మొద్దుబారిన
లతలు
పుష్పగుచ్ఛములు
వేసెను.
అరణ్యము
పచ్చగా,
రంగు
రంగులుగా,
ప్రకృతి
సౌందర్యమును
చేసుకొనెను.
అందులో
నివాసయోగ్యమయిన
ప్రదేశమును
వెతుకుతూ
పంచవటీ
తీరమునకు
చేరిరి.
అక్కడ
వృద్ధుడైన
జటాయువును
చూచిరి.
అతను
పూర్వము
దశరథుని
మిత్రుడు,
గృధ్రరాజు.
అందువలన
అతనికి
దశరథుని
మరణ
వార్తను
శ్రీరాముడు
తెలిపి.
అతనిని
శాంతపరచి,
తన
పరిచయమును
తనకు
తాను
చేసుకొనెను.
గోదావరీ
తీరమున
ఒక
పర్ణశాలను
నిర్మించుటకు
నిర్ణయించిరి.
జటాయువు
మైత్రి
దినదినమునకు
అధికమగుటచేత
అక్కడి
వాతావరణము,
ప్రదేశముల
యొక్క
స్థితిగతులు
చక్కగా
తెలుసుకొని,
ఆ
రాత్రి
అక్కడే
ఒక
వృక్షము
క్రింద
కాలము
గడిపిరి.
Previous
←
The Bestowal of the Sandals
Next
The Holy Place of Pañcavaṭī
→