Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Holy Place of Pañcavaṭī
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
క్షేత్రము
పంచవటీ
తీరమున
కొంతకాలము
అధికంగా
నివసించాలని
తలంచి,
సీతారాములు
ఒక
చల్లని
ఛాయయందు
విశ్రమించుచు,
రాముడు
లక్ష్మణుని
పిలిచి,
"తమ్ముడా!
ఈ
ప్రాంతమున
అన్ని
విధముల
అనుకూలమైన
ఒక
చక్కని
ప్రదేశమును
నిర్ణయించి
నీకిష్టమైనరీతి
ఒక
పర్ణశాల
నిర్మించ"మని
ఆజ్ఞ
చేయగా,
ఆ
పదములు
లక్ష్మణునకు
కత్తిపోటులవలె
తోచి
భరించుకొనలేక
పోయెను.
"రామా,
ఇంతటి
కఠినపు
మాటలు
వినుటకు
నేనే
దోషము
చేసితినో
తెలుపుము"
అని
పాదములపైబడి
ప్రార్థించెను.
అందులకు
సీతారాములు
ఆశ్చర్యమున
"లక్ష్మణా!
యెందులకింత
విచారపడుచున్నావో
అర్థమగుటలేదు.
నా
నోట
కఠినపుమాట
నేనాడైననూ
వినియుంటివా?
కఠినపు
మాటలాడుటకు
నాకేమైనా
పిచ్చిపట్టినదా?
ప్రాణసమానముగా
చూచుకొంటూ
నా
ఆశయాలను
శిరసావహించుచున్న
నిన్ను
నేను
కఠినపు
మాటలాడుట
అర్థము
లేనిది.
నేనేమంటిని?
నీ
కిష్టమైన
స్థానమును
ఒకటి
నిర్ణయించి
పర్ణశాల
నిర్మించుమంటిని.
అంతేకదా!"
తిరిగి
లక్ష్మణుడు,
"రామ,
రామ!
నేనీ
మాటలను
వినలేను"
అని
చెవులు
మూసుకోవటము
చూచి,
రాముడు
మరింత
ఆశ్చర్యపడి
చూచుచుండ,
లక్ష్మణుడే
హస్తములు
కట్టుకొని,
"స్వామీ!
నా
సర్వస్వము
సీతారాములే
అని
తలంచితిని.
నా
అనువారు
లేరు,
నా
కిష్టము
రామాజ్ఞయే
అని
దేనినీ
లెక్కచేయక
రామాజ్ఞను
నడుచుకొనునట్టి
దాసుడుగ
నేనుండ
నా
కిష్టము
వేరొక్కటున్నటుల
తాముపలికిన,
నేనెట్లు
వినగలను?
నా
ఇష్టమే
వేరొకటుండిన,
రామసేవకు
అర్హుడనగుదునా?
నేను
రామసేవకు
అనర్హుడనగుదును
కదా?
దానికే
అనర్హుడన
నేనిక
లోకానికే
అనర్హుడను,
వ్యర్థుడను,
నిరర్థక
జీవిని"
అని
వెక్కి
వెక్కి
యేడ్వనారంభించెను.
2
▾
Meaning
Keep
అంత
సీత
విషయమును
చక్కగా
గమనించి
"సోదరా!
నీ
హృదయము
మహా
పవిత్రము.
యేదో
లోక
సామాన్యముగా
మీ
అన్న
అట్టి
మాటలు
ఉపయోగించెను.
కానీ
నీ
హృదయము
మీ
అన్న
యెరుగకపోలేదు.
ఇంత
మాత్రమునకు
నీవింత
దుఃఖించకు,
లెమ్ము,"
అని
వోదార్చెను.
రాముడందులకు
నవ్వుచూ
"తమ్ముడా!
నీ
సూక్ష్మతకు
నాకెంతయో
ఆనందము.
నీ
భావములు
సున్నితములు,
అతి
పవిత్రములు.
ఇక
ఇట్టి
మాటలతో
నిన్ను
బాధించను.
లోకసామాన్యముగా
నేను
ఆడిన
మాటలే
కానీ
వేరు
కాదు.
రమ్ము
పోయి
చూతము"
అని
తమ్ముని
వెంటబెట్టుకొని
కొంత
ప్రదేశము
చూచి
"ఇక్కడ
పర్ణశాల
నిర్మించు"మని
చెప్పిన
తోడనే
"ఆహా!
నేను
ధన్యుడను,
ఇట్టి
ఆజ్ఞను
నెరవేర్చుటయే
నా
కర్తవ్యము
కానీ,
నేనే
నా
యిష్టమని
ఒకదానిని
సృష్టించుకొను
అధికారము
నాకు
లేదు,
నేను
నీవాడను"
అని
అన్నకు
నమస్కరించి
పర్ణశాలకు
కఱ్ఱలు,
ఆకులు
కొట్టుటకు
ప్రారంభించెను.
లక్ష్మణుడు
అంత
సూక్ష్మబుద్ధికలవాడని
సీతారాములు
తెలుసుకొని,
అతని
శ్రద్ధాభక్తులకు
వారిలో
వారు
యెంతో
ఆనందించిరి.
లక్ష్మణునివంటి
తమ్ముడు
వారి
వెంట
వుండుటచే,
అరణ్యవాసము
మహాహాయిగా,
యెట్టి
అననుకూలములూ
లేక
అయోధ్యలోకంటే
సుఖముగా
జీవించుచున్నామని
పదే
పదే
రామునకు
తెలుపుతూ
వచ్చెను.
అతి
సుందరముగా,
మనోహరముగా,
అనుకూలముగా
నిర్మించిన
ఆ
కుటీరమును
సీతారాములు
చూచి
చాలా
ఆనందించిరి.
సీతాదేవి
పరమాశ్చర్యముతో
చూచుచు,
మరిది
యొక్క
శక్తియుక్తులను
కొనియాడెను.
అందులో
చాలా
సుఖముగా
కాలము
గడుపుతూవచ్చిరి.
శ్రీరామచంద్రుడు
పంచవటీ
తీరమున
పర్ణశాల
నిర్మించుకొని
వున్నాడని
తెలుసుకొని
దినము
అనేకమంది
మునులు,
ఋషులు,
వారి
శిష్యకోటితో
చేరి
వచ్చి
దర్శించి,
సంభాషించి
రాములను
వర్ణించుచూ
వెళ్ళెడివారు.
మరికొందరు
శాస్త్ర,
ధర్మ
మర్మములను
తెలుసుకొనగోరి
రామచంద్రుని
అనేకవిధముల
ప్రశ్నల
నడుగుచుండెడివారు.
కొందరు
తాము
చేయు
తపస్సు
సక్రమముగా
వున్నదా
లేక
అందులో
దోషములేమైనా
వుండిన
తెలుపగోరుచున్నామని
రాముని
3
▾
Meaning
Keep
ప్రార్థించెడివారు.
సర్వధర్మ
ప్రవీణుడు
కనుక,
సర్వశాస్త్రములను
యెరిగినవాడు
కనుక,
రామచంద్రుని
బహువిధముల
వినియోగించుకొంటూ
ఋషులు,
మునులు
పరమానందపడుచుండిరి.
ప్రశ్నలు
అడుగుటకు
నాలుగు
కారణములుండును:
1.
తుచ్ఛము,
2.
కనిష్టము,
3.
మధ్యమము,
4.
ఉత్తమము
అని
నాలుగు
కారణములు,
ఇందులో
:-
1)
వివాదార్థము,
ఒకరిని
ఓడించుటకు
ప్రశ్నవేయుట;
ఇది
తుచ్ఛము.
2)
వాక్చాతుర్యము
జూపించుటకు
ప్రశ్న
వేయుట;
ఇది
కనిష్టము.
3)
బుద్ధి
చాతుర్యము
చూపించుటకు
ప్రశ్నించటము;
ఇది
మధ్యమము.
4)
సందేహములను
నివృత్తి
చేసుకొనుటకు
ప్రశ్నించుట;
ఇది
ఉత్తమము.
అయితే,
అనేకమంది
ఋషులు
4వ
కారణమునకు
చేరియుండిరి.
ఇట్టి
ఋషులను
చూచి
రామలక్ష్మణులు
అమితానందపడుచుండెడివారు.
కొందరు
రామచంద్రుడు
తెలుపు
అతి
సులభమైన,
ఆచరణయోగ్యమై,
శాస్త్రసమ్మతమైన,
ధర్మవిరుద్ధము
కాని
జవాబులకు
మురిసిపోయి,
"ఓ
నాథా!
త్రికాలజ్ఞాన
సంపన్నుడా!
మీ
కంటే
వేరు
ప్రభువు
మాకెవ్వరు?
ఋషి
మానస
సంచారులైన
మీరు
ఆ
తపఃఫలముగా
మాకు
చిక్కితిరి;
మేమెంత
ధన్యులమో!"
అని
ఆనందభాష్పములు
రాల్చుతూ,
విడువలేక
వెనుకకు
పోయెడివారు.
కొందరు
అక్కడక్కడే
వృక్షచ్ఛాయల
క్రింద
పరుండి
కందమూలాదులను
భుజించి
వారి
వారి
ఆశ్రమములు
కూడనూ
వీడి,
మరచి,
అప్పుడప్పుడు
రామచంద్రుడు
వెలుపల
సంచరించుచుండ
చెట్ల
చాటుల
నుండి
దర్శించుకొంటూ
ఆనందముగా
కాలము
గడిపెడివారు.
ఈ
విధముగా
రాముడు
మునుల
చిత్తములను
అపహరించి,
వారిని
ఉన్మత్తులుగా
గావించి
సమస్త
సాధనలు
మాని
రామచింతనే
వారి
నిజతపస్సుగా
వారివారి
భావములను
కలిగించి,
రాత్రి
పగలు
ధర్మబోధనలు
సలుపుచూ,
అప్పుడప్పుడు
లక్ష్మణునితో
"తమ్ముడా,
నా
పని
ఇదియే.
ఇట్టి
పవిత్ర
కార్యనిమిత్తమై
నేను
వచ్చి,
అయోధ్యలో
కూర్చొని
లోకాభిరామాయణములను
పెంచుట
యెట్లు
సాధ్యమగును?
నా
సంకల్పకార్యము,
నా
రాక
లక్ష్యము
ఇవియే.
సాధుసంరక్షణ,
లోక
కంటక
చర్యలను
హతమార్చి,
ధర్మాచరణను
అభివృద్ధి
గావించుట.
అది
ప్రారంభమైనది"
అని
అనేక
విధముల
తన
సంకల్పములను,
తన
అవతార
తత్వమునూ
తెలుపుచుండెడివారు.
4
▾
Meaning
Keep
ఒక్కొక్కపరి
లోక
కల్యాణ
నిమిత్తము
లక్ష్మణుని
ఆధారముగా
అనగా
నిమిత్తమాత్రునిగా
భావించి,
అనేక
నీతులను
తెలిపెడివారు.
"లక్ష్మణా,
దేహమునందభిమానము,
పదార్ధములందాసక్తి,
నీవూ
నేనూ
అను
మమకారము,
ఈషణత్రయములు
మొదలగునవి
మాయా
కల్పితములు.
మాయ
యొక్క
స్వరూపములు
అతి
గోప్యము,
విచిత్రము,
అద్భుతము.
మాయయే
చరాచర
ప్రపంచమును,
జంతుజాలమును
తన
వశము
చేసుకొని
యుండును.
ఇంద్రియములు
పదియు,
వాని
వాని
అధిష్ఠాన
స్థానముల
ననుసరించి,
అధిష్ఠాన
దేవతలచే
భోగముల
ననుభవించును.
ఆయా
విషయ
భోగములన్నియు
మాయాకృతములు.
"ఈ
మాయకు
రెండు
పేర్లు
గలవు.
ఒకటి
విద్యామాయ;
రెండవది
అవిద్యామాయ.
వీటిలో
రెండు
భేదములు
గలవు.
అవిద్య
మహాదుష్టురాలు.
ఆమె
మూలమున
అమిత
దుఃఖములు
కలుగును.
దానికి
వశులైన
జీవులు
సంసారకూపమున
మునిగియుందురు.
విద్యారూపియగు
మాయ
ప్రభుప్రేరణ
వలన
అనేక
బ్రహ్మాండములను
రచించెను.
ఆ
మాయకు
స్వతంత్ర
శక్తిలేదు.
పరమేశ్వరుని
సన్నిధిని
వుండిన
మాత్రమున
ఆ
మాయ
త్రిగుణాత్మకమయిన
ప్రపంచమును
సృష్టించును.
వర్ణాశ్రమ
ధర్మములను
విడిచి
సర్వము
బ్రహ్మస్వరూపమని
తలంచి
భేదబుద్ధిని
విడిచినవాడే
జ్ఞాని
అని
తెలుపును.
"సర్వం
ఖల్విదం
బ్రహ్మనే
హనానాస్తి
కించన"
అని
ప్రమాణము.
"ఈ
జగత్తు
బ్రహ్మస్వరూపమనియూ,
నానావిధ
పదార్థము
లొకటి
అనియు
తెలుసుకొనువాడే
జ్ఞాని
అనియు,
ఓ
లక్ష్మణా!
రజోగుణము
బ్రహ్మయందును,
సత్వగుణము
విష్ణువునందును,
తమోగుణము
రుద్రుని
యందును
సిద్ధించెను.
ఈ
మూడు
గుణములే
ప్రపంచమునకు
కారణములు.
ఈ
మూడును
తృణప్రాయములని
తెలుసుకొని
వాటిని
విడిచిపెట్టినవాడే
విరాగి
కాగలడు.
అతనే
వైరాగి
అను
పదమునకు
అర్హుడు"
అని
లక్ష్మణునకు
తెలుపుచుండెడివారు.
ఒక్కొక్కపరి
సీతాలక్ష్మణులను
చెంత
చేర్చుకొని
జీవుడు
తనకును,
మాయకును,
పరమాత్మకును
గల
సంబంధమును
యెంతవరకు
తెలుసుకొనలేడో
అంతవరకూ
జీవుడు
జీవుడుగానే
వుండునని
తెలిపెడివారు.
అంతేకాక,
ఆ
జీవుడు
మాయకు
5
▾
Meaning
Keep
లోబడి
వుండెడివాడు.
ఎపుడు
జీవుడు
తనకును,
పరమాత్మకును
భేదము
లేదనియు,
పరమాత్మ
యొక్క
ప్రతిబింబమే
తాననియు
గ్రహించునో
అప్పుడు
జీవుని
మాయ
విడిచిపోవును.
అదియే
ఆత్మజ్ఞానము.
జీవాత్మకును,
మాయకును,
పరమాత్మకునూ
గల
సంబంధమును
తెలిసికొనుట
అత్యవసరము.
స్వధర్మమువలన
విరక్తి
పుట్టును.
యోగము
వలన
జ్ఞానము
కలుగును.
జ్ఞానమే
మోక్షప్రాప్తికి
చివరిమెట్టు.
పరమాత్మునియందు
అత్యంత
ప్రేమకలిగియుండుటే
భక్తి.
అట్టి
భక్తునకే
నేను
ప్రసన్నుడగుదును.
భక్తులకు
నా
ప్రేమను
సుఖమును
అందింతును.
భక్తి
స్వతంత్ర్యము,
పరాధీనము
కాదు.
జ్ఞాన
విజ్ఞానములు
దాని
ఆధీనములు.
నిరుపమానమగు
సుఖమునకు
భక్తి
మూలము.
సత్పురుషుల
కటాక్షమే
ఈ
భక్తి
భావములు
కలుగుటకు
ఆధారము.
ఈ
మార్గముననే
జీవులు
నన్ను
త్వరగా
చేరగలరు"
అని
ప్రబోధించెడివారు.
ఈ
విధమైన
వాక్యములు
సీతాలక్ష్మణులు
ఆనందముగా
శ్రవణము
చేయుచూ,
యెక్కడున్నాము
అను
భావమునే
మరచి
తమలో
తాము
లోదృష్టిని
చేరెడివారు.
ఇట్లు
ఆత్మస్వరూప
లక్షణములను
ప్రబోధించి,
రామచంద్రుడు
కొంత
విశ్రాంతి
తీసుకొను
సమయమున
లక్ష్మణుడు
బైట
కాపలా
కాయుచు
ఊరకుండుటకు
మనసొప్పక,
రామవాక్యములును
స్మరించుచూ,
అటునిటు
తిరుగుచుండ,
ఆ
వృక్ష
ఛాయలో
ఒక
నిమ్మ
మొక్క
కనుపించెను.
దానిని
తీసి
పర్ణశాలకు
సమీపమున
ప్రత్యేక
రక్షణను
కలిగించు
నిమిత్తమై
పాదుతీయుచుండ
ఇంతలో
రావణుని
సోదరియైన
శూర్పణఖ
అను
నీచురాలు,
దుర్మార్గురాలు
పరుగెత్తుకొని
వచ్చెను.
లక్ష్మణుని
చూచిన
తత్క్షణమే,
ఆ
చక్కదనమును
చూచి
అతని
దేహవర్ఛస్సుని
చూచి
మోహించెను.
నోటమాట
రాలేకపోయెను.
తన
వికారపు
స్వరూపమును
మార్చుకొనెను.
సుందరదేహమును
ధరించెను;
కామవృత్తులు
ప్రదర్శించెను.
కానీ
లక్ష్మణుడు
ఆ
రూపమునైనను
గమనించక,
లెక్క
చేయక,
తన
పని
తాను
చేయుచుండెను.
ఇక
భరించలేక
శూర్పణఖ
లక్ష్మణుని
సమీపించి,
"నాథా!
నన్నేల
నిరాశకు
గురిచేయుచున్నావు?
నా
తాపమును
చల్లార్చి,
మీ
చల్లని
దృష్టిని
నాపై
ప్రసరింప
చేయుము"
అని
దీనయై
ప్రార్థించుచుండ,
దానిని
కూడనూ
వినీవిననట్లు
నటించుచూ,
ఆ
రాక్షసి
మొగమునైననూ
చూడక
తనలో
తాను
నవ్వుకొనుచూ,
దాని
ప్రవృత్తులను
గమనించుచుండెను.
6
▾
Meaning
Keep
ఇక
తాళలేక
శూర్పణఖ
అతనిపై
పడుటకు
ప్రయత్నింప,
లక్ష్మణుడు
మొదట
శాంతవచనములతో
"అమ్మా!
నేను
శ్రీరాముని
దాసుడను.
నేను
స్వతంత్రుడను
కాను;
కాన,
యే
చిన్న
కార్యమయిన
రామాజ్ఞలేకనే
చేయను;
చేయపూనను"
అని
సంభాషణ
ప్రారంభించెను.
ఈ
సంభాషణను
విని
సీతారాములు
వెలుపలకు
వచ్చి
చూచుసరికి
మాయామోహితురాలగు
శూర్పణఖ
అని
రాముడు
గమనించి,
తగిన
జాగ్రత్తలో
వుండెను.
ఇంతలో
శూర్పణఖ
లక్ష్మణుని
పిరికిపందవంటివాడు
అని,
అయోగ్యుడని
అనేక
విధముల
రోషమైన
మాటలను
ప్రారంభించి,
కొంత
హాస్యమాడుటకు
పూనుకొనెను.
అంతవరకూ
ఆమె
శ్రీరాముని
చూడలేదు.
దృష్టి
అంతయూ
లక్ష్మణునిపై
లగ్నమైనది.
"ఓ
సుందరుడా!
నన్ను
వివాహమాడుము.
నేను
నీకు
కావలసిన
సుఖమునిత్తును.
ఆదరింతును"
అని
అనేకవిధముల
బ్రతిమిలాడుచున్న
ఆమె
వచనములకు
చోటివ్వక
"ఓ
సుందరీ!
నేను
దాసుడను,
దాసుడైన
నన్ను
నీవు
వివాహమాడిన
నీవు
దాసురాలు
కావలసివచ్చును.
కనుక,
ప్రభువైన
రాముని
వివాహమాడిన
నీకు
నేను
దాసుడనగుదును;
కాన
అతనిని
వివాహమాడుము"
అని
హాస్యవచనములు
లక్ష్మణుడు
ప్రదర్శించెను.
ఇది
నిజమేనని
భావించి
అటు
ఇటు
చూడ,
పర్ణశాల
ముందుభాగమున,
ఒక
సుందరమైన
స్త్రీతో
నవ్వుచున్న
మహాసుందరమైన
విగ్రహమును
చూచెను;
ఇక
అక్కడ
వుండలేకపోయినది.
సరాసరి
అక్కడికి
వచ్చి,
"ఓ
మన్మధుడా!
నన్ను
నీ
దానిగా
చేసుకొమ్ము"
అని
దీనయై
విలపించుచూ
ప్రార్థించెను.
కానీ,
రాముడు
కూడా
ఆ
రాక్షసికి
బుద్ధిచెప్పతలంచి,
కొంత
నిరాశ
కలిగింపనెంచి
తమాషాగా,
హాస్యమాడ
ప్రారంభించెను.
"ఓ
సుందరీ!
నన్ను
వివాహమాడుటకు
వీలుకాదు,
నేను
ఏకపత్నీవ్రతుడను.
నా
తమ్ముడగు
లక్ష్మణునకు
సతి
చెంత
లేదు.
కనుక
అతనిని
వివాహమాడుటలో
నీకు
శాంతి
చేకూరును.
కాన,
అతడు
అన్ని
విధములా
సరియైనవాడు
కనుక
అతనినే
వివాహమాడుము"
అని
తెలుప,
ఆమె
తిరిగి
లక్ష్మణుని
చెంతకు
వచ్చి
"మీ
అన్నగారి
అనుమతి
అయినది
కాన
ఇక
నీవు
కాలహరణము
చేయకూడదు,
అంగీకరింపుము"
అని
వినయవిధేయతలు
ప్రకటించుట
చూచి
లక్ష్మణుడు
మరింత
సిగ్గుపడి,
ఆమెను
మరింత
నిరుత్సాహపరచుటకు
హాస్యమును
7
▾
Meaning
Keep
శ్రుతిమించునట్లు
గావించెను.
రాముడు
లక్ష్మణుని
చెంతకు,
లక్ష్మణుడు
రాముని
చెంతకు
పంపుటలో
శూర్పణఖ
మనసు
విసుగెత్తి,
ఇక
భరించలేక,
కామాంధురాలై,
కన్ను
మిన్ను
కానక,
దుర్బుద్ధికి
గురియాయెను.
"ఈ
స్త్రీ
వుండుటచేతకదా
రాముడు
నన్నొల్లకున్నాడు?
కాన
ఈ
స్త్రీని
చంపి
మ్రింగిన
రాముడు
తప్పక
నన్ను
మోహించు"నని
తలంచి
సీతపై
రుద్రురాలై
దుమికెను.
అది
చూచి
లక్ష్మణుడు
మండిపడి,
రామాజ్ఞకై
అతని
ముఖవర్ణమును
గమనించుచూ
నిలచెను.
అంత
రామచంద్రుడు
మితిమీరిన
రాక్షసి
యెంతటికైనను
సంసిద్ధురాలు
కావచ్చునని
తలంచి,
గోటితో
పోవువాటికి
గొడ్డలి
నెందుకుపయోగించుట
అని
భావించి,
తన
హస్తమును
మీదికి
చాపి
బొటనవ్రేలుతో
మిగిలిన
నాలుగు
వ్రేళ్ళను
లెక్కించెను.
ఈ
సంజ్ఞ
కర్ధమును
గమనించి
సూక్ష్మబుద్ధి
గల
లక్ష్మణుడు
నాలుగు
వ్రేళ్ళు
నాలుగు
వేదములనియు,
వీటికి
శ్రుతి
అనగా
చెవులనియును.
హస్తమును
మీదికి
చాచుట
చేత
మీద
ఆకాశ
సంజ్ఞ
అని
భావించి
ఆకాశము
అనగా
శబ్దమే
బ్రహ్మమనియూ,
అదే
స్వర్గమనియూ,
స్వర్గమునకు
నాకము
అని
మరొక
అర్ధము
కలదనియూ,
నాకమనగా
ముక్కు
అని
భావించి,
వేదములకు
శ్రుతి,
స్వర్గమునకు
నాకము,
శ్రుతులకు
చెవులు,
నాకము
ముక్కు
అని
అర్థముండుటచేత,
తత్క్షణమే
కత్తిని
తీసి
ఆ
దుర్మార్గురాలి
గర్వమణచుట
మంచిదని
తలచి,
ఆమె
ముక్కు
చెవులు
కోసివేసెను.
ఆ
ముక్కు
చెవులు
కోయుటచేత,
అరణ్యము
దద్దరిల్లునట్లు
రోదన
చేసి
శూర్పణఖ
రౌద్రాకారము
ధరించి,
దుఃఖించుచూ,
మోహించి
చెంతకు
వచ్చిన
స్త్రీని
ఈ
రీతిగా
చేయుట
న్యాయమా
అని
పలుకుచూ,
నా
అన్న
అయిన
రావణుని
తీసుకొనివచ్చి
మీకు
తగిన
శాస్తి
గావింతునని
శపథము
చేసి
వేగముగా
వెనకకు
తిరిగెను.
శూర్పణఖ
సరాసరి
ఖరదూషణాదుల
వద్దకు
వెళ్ళి
"సోదరి
కిట్టి
పరాభవము
సంభవిల్లగా
మీరెట్లు
భరించుచున్నారు?
ఓ
తమ్ముడా!
మీ
భుజబలములు
ఎందు
నిమిత్తము?
కాల్చనా!
మీరు
పురుషులు
కారా!"
అని
రోదన
చేయుచుండ
విషయమేమిటో
ఖరదూషణాదులకు
బోధపడక,
"చెల్లీ!
యేమిటీ
వికారము,
ఎవ్వరు
నిన్నిట్లు
8
▾
Meaning
Keep
వికారపరచిరి?
విషయమును
తెలుపుము,
తదుపరి
మా
బలపరాక్రమములు
చూడగలవు"
అని
వారునూ
అత్యంతాతురతతో
ప్రశ్నింప,
అప్పుడు
అధిక
కాలము
రామలక్ష్మణుల
రూపసౌందర్యములనే
వర్ణించుచూ
వచ్చెను.
అందులకు
సోదరులు
యేమి
జరిగినదో
తెలుపుము,
వర్ణనలతో
కాలము
వృధాపరచుచున్నావని
కోపించిరి.
అంత,
అడవిలో
జరిగిన
వృత్తాంతమంతయూ
ఆమె
సోదరులకు
తెలిపెను.
అంత
ఖరదూషణాదులు,
తమ
సోదరి
ముక్కు
చెవులు
కోసిన
రామలక్ష్మణాదులపై
పదునాలుగు
వేల
రాక్షసవీరులను
వెంటబెట్టుకొని
దండెత్తిరి.
నిజముగా
బయలుదేరిన
వీరులు
స్వప్నమందైననూ
పరాభవము
పొందజాలరు.
వెనుదీయరు.
రెక్కలు
గల
పర్వతములవలె
అందరూభూమి
దద్దరిల్లునట్లు
గుంపులు
గుంపులుగా
పరుగులు
తీసిరి.
నానావిధాయుధములను
ధరించి
ముక్కు
చెవులులేని
విధవ
ముందు
నడువ,
ఆమెను
వీరందరూ
అనుసరించుచూ
వచ్చిరి.
జయమునకు
ప్రప్రథముననే
అపశకునము,
అశుభసూచన.
విధవ
రక్తమును
కార్చుకొనుచూ,
అంగహీనురాలై
ముందునడచుట
అశుభమని
రాక్షసులకు
తెలియదు.
రాక్షసులు
తమ
భౌతిక
బలములను,
రాక్షస
దుష్టశక్తులను
మాత్రమే
లక్ష్యమందుంచుకొందురు.
కానీ,
శుభాశుభములను
వారు
యోచించరు;
ఇది
రాక్షస
లక్షణము.
అందువలననే
వారలకు
అమితబలము,
శక్తులు
వుండియూ,
దైవమునూ,
ధర్మమును
జయించలేకపోయిరి.
ధర్మబలముకంటే
మించిన
దానవబలము,
దైవబలము
కంటే
మించిన
శక్తి
బలము
మరొకటి
లోకమున
లేదు.
కానీ
దైవమును
ధర్మమును
వారు
చింతించక,
కేవలము
వారి
భుజబలమును
వర్ణించుకొంటూ,
పొగడుకొంటూ
రణభేరీలను
మ్రోయించుకొంటూ
గంతులు
వేయుచూ,
పలువిధములైన
వికారపు
కేకలు
వేయుచూ
సింహము
వలే,
యేనుగులవలే
గర్జించుచూ
దారిని
నడువజొచ్చిరి.
చిన్న
పిట్ట
డేగతో
పోరాడుటకు
బయలుదేరినట్లుండెను
వారి
ఉత్సాహము.
దూరము
నుండి
శూర్పణఖ
రాముని
పర్ణశాలను
తన
సోదరులకు
చూపుచూ
సైన్యమునకు
ఉత్సాహము
కలుగునట్లు
"ఆ
ఇరువురు
అన్నదమ్ములనుచంపుడు,
పట్టుడు,
హతమార్చుడు"
అంటూ
కేకలు
వేయించెను.
ఖరదూషణాదులు,
"ఓరీ
దుర్మార్గుడా,
దౌర్భాగ్యుడా!
మా
సోదరిని
పరాభవము
గావించితివా?
ఇక
నీ
9
▾
Meaning
Keep
ప్రాణములు
కాపాడుకొమ్ము"
అని
గర్జించుచూ
పర్ణశాలను
చుట్టుముట్టిరి.
ఆకాశమంతయూ
ధూళిచే
కప్పుకొనెను.
ఈ
దృశ్యమును
శ్రీరాముడు
ముందుగనే
కనిపెట్టి
లక్ష్మణుని
పిలచి
"సీతను
గుహయందుంచుకొని
నీవు
ఆమెను
కాపాడుచుండుము.
నాకు
అణుమాత్రమైననూ
భయములేదు.
లేశమాత్రమైన
నాకు
కీడు
వాటిల్లదు"
అని
తెలిపిన
తోడనే
లక్ష్మణుడు
రామశక్తిని
యెరిగినవాడగుట
చేత,
భయపడక,
సీతను
వెంటబెట్టుకొని
ధనుర్భాణములు
ధరించి
గుహలో
ప్రవేశించెను.
రాముడు
కోదండము
నెక్కుపెట్టి
చిరునవ్వుతో
పర్ణశాల
ముందు
నిలచి
యుండెను.
రెండు
చేతులతో
శ్రీరాముడు
తన
జడలను
సవరించుకొనుచుండ,
ఆ
జడలు
కోటానుకోట్లు
మెరపులవలె
రాక్షసుల
కన్నుల
దృష్టిని
మబ్బు
గావించెను.
రాక్షసులు
ఆ
తేజస్సును
కన్నులు
తెరచి
చూడలేకపోయిరి.
రాములయొక్క
హస్తములు
మహా
విశాలమైన
సర్పముల
వలె
కనుపించెను.
మద
గజములను
చూచి
సింహము
కోరలు
గీకుచుండిన
విధమున,
ఈ
రాక్షసగజములను
చూచి
పురుష
సింహమైన
రాముడు
వారల
రాక్షసత్వమును
హతమార్చుటకు
సంసిద్ధమై
యుండెను.
"ఇతనే
సోదరికి
ముక్కు
చెవులు
కోసిన
దుర్మార్గుడు,
పట్టుకొనుడు
పట్టుకొనుడు"
అని
అరుపులు
మాత్రమే
వినిపించుచూ
వచ్చెనేకానీ
ఒక్కడైనా
దగ్గరకు
రాలేకపోయిరి.
ఎన్ని
ప్రయత్నములు
చేసిననూ
రాముని
సమీపించునట్టి
ధైర్యము
వారిలో
ఒక్కరికైననూ
లేకపోయెను.
రాక్షసుల
అరుపులకు
దండకారణ్యములోని
క్రూరమృగములు
అదరి,
బెదరి,
పరువులు
తీయుచు
ప్రాణరక్షణ
నిమిత్తము
చిక్కక
గుహలలో
ప్రవేశింపజూచుచుండెను.
అట్లు
బెదరిన
మృగములు
కొన్ని
సీతాలక్ష్మణులుగల
గుహలో
కూడ
ప్రవేశించెను.
వాటిని
సీతాలక్ష్మణులు
అదిరించక,
తమవలె
వాటికి
కూడ
అందులో
స్థానమిచ్చి
వాటిని
రక్షించుచూ
వచ్చిరి.
ఇక
రాముని
చుట్టుముట్టడించిన
రాక్షసులు,
రాముని
సుందర
విగ్రహమును,
సౌందర్య
ఆనందమును
చూచుచూ
వర్ణించుచూ,
మోహించుచూ,
స్తంభించి
నిలిచిరే
కాని
ఒక్కడైనా
ఆయుధములను
యెక్కుపెట్టుటో
లేక
బల్లెములను
పైకి
తీయుటో
యేమాత్రము
జరుగలేదు.
ఈ
సందర్భమున
శూర్పణఖ,
"సోదరా!
ఇంతటి
చక్కని
సౌందర్య
స్వరూపమును
నేనింతవరకు
యెక్కడనూ
చూడలేదు.
వీరిని
సంహరించక,
నాకప్పచెప్పుడు"
అని
ప్రార్థించెను.
ఆ
మాటలు
విన్న
ఖరదూషణాదులు
కూడను,
10
▾
Meaning
Keep
"సోదరీ!
ఇంత
చక్కని
రూపలావణ్యముగల
వ్యక్తిని
మేము
కూడాను
ఇంతవరకు
చూడలేదు.
అతనిని
సమీపించు
కొలది
మాకును
మోహమే
ఆవరించుచున్నది;
కాని
ద్వేషమో,
క్రోధమో,
యేమాత్రము
కూడనూ
కలుగుటలేదు.
అతనిని
చూచుచూ
వుండిన
యెంతో
హృదయము
ఉప్పొంగి
పోవుచున్నది.
ఆనందమన్న
ఇదియే
కాబోలు!"
అని
వర్ణించుచూ
వచ్చిరి.
ఇంతలో
తానై
తాను
రామునితో
సంప్రతింపులు
జరుపుటకు
ఇష్టపడక,
ఖరుడు
ఒక
దూతతో
అతను
యెవ్వరో,
అతని
పేరేమో,
యెక్కడనుండి
వచ్చి
ఈ
అరణ్యమున
ప్రవేశించెనో,
ఈ
వృత్తాంతములనన్నింటిని
వివరముగా
తెలిసికొనిరమ్ము
అని
చెప్పి
పంపెను.
ఖరుని
ఆజ్ఞ
ప్రకారము
ఆ
దూత
వచ్చి,
ఖరుడు
చెప్పిన
పలుకులను
వివరించెను.
అందులకు
శ్రీరాముడు
చిరునవ్వుతో
"ఓరీ!
నేను
క్షత్రియుడను,
మీ
వంటి
మృగములను
సంహరించుటకు
ఈ
అరణ్యమునకు
వచ్చితిని.
కాలునకు
కూడనూ
నేను
వెరువను,
మీకు
బలమున్నదా
నాపై
యుద్ధమునకు
సిద్ధముకండు,
లేకపోయెనా
మీ
మీ
గృహములకు
మీరు
క్షేమముగా
చేరుడు.
యుద్ధమునకు
విముఖులైన
వారిని
నేను
సంహరింపను"
అని
చెప్పిన
మాటలను
దూత
వెళ్ళి
ఖరదూషణాదులకు
తెలిపెను.
అంత
రాక్షసులైన
శూర్పణఖ
సోదరులు
మండిపడి
పరశువులను,
శూలములను,
త్రిశూలములను,
కృపాణములను,
శస్త్రాస్త్రములను
ధరించిరి.
యుద్ధమునకు
సిద్ధమన్నట్లు,
శబ్దములు
భూనభోంతరాళములు
నిండెను.
రామునిపై
శస్త్రాస్త్రములను
వర్షించిరి.
వాటన్నింటిని
రాముడు
ఒక
బాణముతోనే
ఖండించుచూ
వచ్చెను.
రాముడు
విడచుచున్న
బాణములు
ఒక్కొక్కటి
సర్పమువలె,
మంచువలె
వారలపైకి
వెళ్ళుచుండ,
అమ్మా,
అబ్బా,
అయ్యో
అను
శబ్దములు
చేయుచూ,
వీరాధివీరులు
వెనుకకు
ఉరుకుచూ
వెళ్ళిరి.
వారలను
చూచి,
ఖరుడు,
దూషణుడు,
త్రిశిరుడు
మువ్వురు
అన్నదమ్ములూ,
"రాక్షసులారా!
యుద్ధము
నుండి
మీరు
పారిపోకూడదు.
అట్లు
పారిపోవువారిని
మా
హస్తములతోనే
సంహరింతుము"
అని
భయపెట్టుతూ
వచ్చిరి.
అందుచే
రామ
హస్తముల
చేతనైనా
చచ్చుట
మంచిదని
తలంచి
వెనుకకు
వెళ్ళు
రాక్షసులు,
రామబాణములకు
గురియగుటకు
ఉత్సాహముతో
ముందుకు
వచ్చిరి.
వచ్చిన
సైనికులు
రాముని
మోహించి
అతనినే
చూచుచూ
ఆనందించిరి.
11
▾
Meaning
Keep
ఇంతలో
రాముడు
సమ్మోహనాస్త్రము
ప్రయోగించెను.
దానితో
వారిలో
వారికి
అందరూ
రామునివలె
కనుపించిరి.
అట్లు
కనుపించగానే
ఇదిగో
రాముడు,
అదిగో
రాముడు
అని
వారిలో
వారినే
రాముడుగా
భావించుచూ,
వారిని
వారే
చంపుకొనుచూ
వచ్చిరి.
ఆ
ప్రదేశమంతయూ,
ముక్కలుముక్కలుగా
అంగములు
వేరు
వేరుగా
కనుపించెను.
అరణ్యమంతయూ
రక్తప్రవాహమాయెను.
కాకులు,
గ్రద్దలు
వేలకు
వేలు
చేరెను.
రాక్షసులు
పదునాల్గు
వేలు,
రాముడొక్కడు.
ప్రతి
రాక్షసుడు
రామ,
రామ,
రామ
అనుచూ
క్రిందపడెను.
ఈ
ప్రకారము
ఖరదూషణాది
చతుర్దశ
సహస్ర
రాక్షసులను
క్షణమాత్రములో
రాముడు
సంహరించెను.
ఈ
ఘోర
దృశ్యమును
కండ్లారా
చూచిన
ఋషులు,
మునులూ
రామశక్తిని
గుర్తించి
తప్పక
రావణుని
కూడ
క్షణములో
హతమార్చునని
తమలో
తాము
ఆనందించిరి.
రాక్షస
సంహారము
గావించి
లోకానికి
కళ్యాణము
చేకూర్చుపరమేశ్వరుడే
శ్రీ
రాముడని
దృఢనిశ్చయులయిరి.
ఈ
ఘోరసంగ్రామము
శాంతిపడిన
తోడనే
సీతాలక్ష్మణులు
వచ్చి
శ్రీరామునకు
నమస్కారము
చేసిరి.
తమ్ముడైన
లక్ష్మణుని
కౌగలించుకొని
తమ్మునకు
ఈ
రెండు
ఘడియలలో
రాక్షసులతో
పోరాడిన
వివరములు
చిరునవ్వు
చిందులు
ద్రొక్క
వినిపించెను.
సీత
పరమానందముతో
రాముని
దేహమున
కెందైనా
గాయము
తగిలినదా
అన్నట్లు
అతని
ప్రతి
అంగమునూ
గుర్తించుచూ
వచ్చెను.
రెండవ
దినము
అనేక
మంది
తాపసులు
ఈ
మంగళవార్తను
విని
పంచవటీ
తీరమునకు
శిష్యబృందములతో
గుంపులు
గుంపులుగా
వచ్చి
రామచంద్రుని
కొనియాడిరి.
కానీ,
అందులో
కొందరు
దివ్యదృష్టి
గల
మహనీయులు
రామచంద్రునితో
"ఓ
నాథా!
ముందు
ముందు
కొంత
జాగ్రత్త
వహించవలసి
యుండును.
రాక్షసులు
నీతి,
నిజాయితీలకు
అతివిరుద్ధులు.
తమ
పాపభావములను
తాము
యోచించరు.
పరుల
కపకారము
చేయుటే
వారి
నిత్యవ్రతము.
తమ
స్వార్థమును
తాము
సాధించుకొనుటే
పరమోద్దేశము.
వారికి
రావణుడను
మరొక
మహాశక్తివంతుడైన
అన్న
కలడు.
అతను
లక్షల
సైన్యమును
కలిగియుండును.
ఈ
జిత్తులమారి
సోదరి
శూర్పణఖ
వెళ్ళి
వానికి
తెలుపక
యుండదు.
వాడు
రాక
మానడు"
అని
వారి
వారికి
తోచిన
భవిష్యత్తు
యొక్క
భద్రతలను
వహించు
విషయములను
రామలక్ష్మణులకు
తెలిపిరి.
12
▾
Meaning
Keep
రాముడు
చిరునవ్వుతో,
"అవును,
అవును,
ఇది
నాకు
తెలియనిది
కాదు.
నే
వచ్చినదే
అందు
నిమిత్తము.
ఆ
శుభసమయమునకై
కాచియున్నా"
ననునట్లుగా
తలవూపుచూ,
యేమీ
తెలియనివానివలె
నటించుచూ,
తమ్మునితో
"లక్ష్మణా!
వింటివి
కదా?"
అని
రాబోవు
అభ్యంతరాలకు
తాను
సంసిద్ధముగా
వుండినట్లును
మీరే
మాత్రము
విచారించనక్కరలేదనియు
వాగ్దానమునిచ్చి,
ఆనంద
వచనములు
బోధించి,
ఉత్సాహవంతులను
గావించి
వారి
వారి
స్థానముకు
పంపెను.
ఇది
యట్లుండ
రాముడు,
మునులు
తలంచినట్లుగనే,
శూర్పణఖ
విలపించుచు
హుటాహుటి
రావణుని
సమీపించెను.
ఆమె
రోదనను
లంకలో
రాక్షసులందరూ
పరమాశ్చర్యముతో
విని,
లంక
కేమి
ప్రమాదము
వాటిల్లినదో
అన్నట్లు
వీధులలో
గుంపులు
గుంపులు
కూడి
చేరిరి.
రావణుని
దర్బారు
హాలులో
ప్రవేశించి,
పరమ
రోషమును
కలిగించు
మాటలను
వ్యవధిలేకుండ
పలుకుట
నారంభించెను.
రూపమా
వికారము,
దేహమా
రక్తమయము,
మాటలు
మహాక్రోధముతో
కూడియుండుట
చూచి
రావణుడు,
ఈమెకు
ఎవరో
యేదో
కీడు
చేసిరని
గమనించి,
"సోదరీ,
విషయమేమిటో
వివరింపుము"
అని
గర్జించెను.
అంత
శూర్పణఖ,
"అన్నా!
నీవు
నిజముగా
రాక్షసుడవే
అయిన,
నీ
తపశ్శక్తియే
భద్రమయినదైన,
నీవు
నిజముగా
వీరుడవే
అయిన
నీ
ధైర్య,
పరాక్రమ,
వీర్యములను
ప్రదర్శించు
సమయము
ఆసన్నమయినది.
నీవు
నీకు
ముందు
రాబోవు
ప్రమాదములను
గుర్తించక
మద్యపానమున
మత్తుడవై
సర్వమును
మరచి
నిద్రించుచున్నావు.
పంచవటీ
తీరమున
యేమి
జరుగుచున్నదో,
యెవరు
అక్కడికి
వచ్చి
చేరిరో,
వారు
యే
విధమైన
దీక్షను
సాధించుటకు
పుట్టిరో
కొంతైనా
విచారించకున్నావు.
రాక్షస
సంహారకులగు
రాజకుమారులు
దండకారణ్యమున
ప్రవేశించినారు.
లక్షల
సైన్యమును
సయితము
క్షణములో
నేలకూల్చుచున్నారు.
సోదరులైన
ఖరదూషణాదులను
కండలు
కండలు
గావించిరి.
వేల
సైన్యమును
కన్ను
మూసి
తెరుచునంతలో
అదృశ్యము
చేసిరి.
వారి
పరాక్రమము
వర్ణనాతీతము.
వారిరూపములా
-
అబ్బా...!"
అని
కన్నులు
మూసుకొని
కొన్ని
క్షణములు
మాటలాడక
నిలిచెను.
13
▾
Meaning
Keep
ఈ
విషయములు
వింటున్న
రావణుడు
రౌద్రుడై
పండ్లు
పటపట
కొరికి,
తొడలను
కొట్టి,
"యేమీ,
ఆ
దుర్మార్గులు
ఖరదూషణాదులను
ఖండించిరా?
నా
పేరునైననూ
తలంచరైరి
కాబోలు.
నా
ప్రతాపమును
యెన్నడు
వినియుండరు
కాబోలు!"
అని
అనేక
విధముల
తన
ప్రభావమునే
వర్ణించుకొనుచూ
వచ్చుట
చూచి
శూర్పణఖ,
"ఓరి
దౌర్భాగ్యుడా!
నెత్తిపై
శత్రువు
వచ్చి
నృత్యము
చేయచుండ
నీ
ప్రతాపమును
నీ
పౌరుషమును
నీవు
వర్ణించుకొనుచూ
పిరికిపందవై
ప్రగల్భములాడుట
రాజ
లక్షణము
కాదు.
సాంగత్యమువలన
సన్యాసులు,
కుమంత్రుల
వలన
రాజులును,
మానము
వలన
జ్ఞానమును,
మద్యము
వలన
సిగ్గునూ
నశించునను
విషయము
నీకు
తెలియదు
కాబోలు.
ఓరి
సోదరా!
అగ్ని,
రోగము,
శత్రువు,
పాము,
పాపము-
ఇవి
చిన్నవని
నిరసింపకుము.
ఇవే
ప్రబలినయెడల
యెంతటి
ప్రమాదమునకైనా
వెనుతీయవు.
కాన
త్వరపడుము"
అని
మహారోషమును
నూరిపోసెను.
కుంభకర్ణుడు
"సోదరీ!
నీ
శ్రోత్రములను,
నాసికను
త్రుంచినవారెవరు?"
అని
మందహాసమున
ప్రశ్నించ,
ఈ
దుశ్చర్యము
ఆ
రాజకుమారులే
గావించిరి
అని
విలపించెను.
అంత
రావణుడు
ఆమెను
కొంత
సమాధానపరచి
"సోదరీ!
ముక్కు
వున్నది
ఒక
స్థానము,
చెవులున్నది
మరొక
స్థానము,
రెండునూ
ఒకపరి
త్రుంచ
వీలుకాదు
కదా?
ఒక్కొక్కటి
ఒక్కొక్కపరి
త్రుంచుచుండ
నీవు
నిద్రించుచుంటివా?
ఇది
పరమాశ్చర్యముగా
నున్నదే"
అని
సభాసదులకు
తెలిపెను.
శూర్పణఖ
కన్నులు
తెరచి,
"అన్నా,
వారి
మృదుమధురమైన
హస్తములు
నా
దేహమునకు
సోకిన
తక్షణమే
నా
దేహమునే,
అసలు
దేశమునే
మరచితిని.
సమీపించిన
ఆ
సుందర
మోహన
ముఖమును
కన్నులతో
చూచుచుండ,
యేమి
త్రుంచిరో,
యేమి
చేసిరో
నాకు
తెలియదు.
వారల
దర్శనమే
అంత
తన్మయత్వము
గావించెను.
వారి
స్పర్శ
మైమరపించెను.
వారితోటి
సంభాషణ
ఇక
చెప్పతరముకాదు.
వారిలో
యెట్టి
సమయమందైననూ
చిరునవ్వు
తప్ప
అన్యభావములు
గోచరించవు.
పురుషులు
కూడనూ
వారిని
చూచి
మోహించక
వుండరు.
వారు
సాక్షాత్
మన్మథులే!
అట్టి
సౌందర్యవంతులను
నేనింతవరకూ
చూచి
యెరుగను.
మన
రాక్షసశక్తులు
క్షుద్రములు.
మన
రూపములు
మహావికారములు,
అసహ్యములు.
నీవు
ఒకతూరి
14
▾
Meaning
Keep
వారిని
చూచితివా,
నీకే
తెలియును.
గతించిన
ఖరదూషణాది
సోదరులు
సహితము,
వారితో
యుద్ధము
చేయుటకు
అంగీకరించకపోయిరి.
'సోదరీ,
యిట్టి
దివ్యమంగళ
విగ్రహములతో
యే
విధముగా
విరోధము
పెట్టుకొనుటకు
మా
మనస్సంగీకరించకున్నది'
అని
పదే
పదే
తెలిపినారు"
అని
ఈ
విధముగా
రామలక్ష్మణుల
రూపలావణ్యములను
వర్ణించుచూ
శూర్పణఖ
ఆ
సభాసదులను
ఆనందపరచెను.
శూర్పణఖ
చెప్పుచున్న
మాటలు
రావణుని
కూడా
భ్రమింపజేసెను.
ఆ
మాటలు
వినుటకెంతయో
హాయిగా
నుండెను.
లోలోన
రావణుడు
కూడా
ఆ
సుందర
విగ్రహములను
దర్శించవలెనను
కుతూహలముతో
ఉవ్విళ్ళూరుచుండెను.
తనలో
చెలరేగిన
క్రోధాగ్ని
చల్లబడుతూ
వచ్చెను.
శాంతముగా
వారిని
సమీపించి
విషయమేమో
తెలుసుకొనుట
మంచిదని
తనలో
తలంచెను.
ఇంతలో
వున్నట్లుండి
రావణుడు
"సోదరీ!
వారిరువురు
రాజకుమారులు
మాత్రమే
పంచవటియందు
నివసించుచున్నారా?
లేక
ఇంకా
వారి
పరివారమేమైనా
కలదా?"
అని
ప్రశ్నించెను.
అందులకు
శూర్పణఖ
"అన్నా!
పరివారమూ,
బంధుబలగము
యెవ్వరూలేరు.
వారిలో
పెద్దవాడనబడు
శ్రీరామునికి,
అతిలోక
సౌందర్యవతియైన
ఒక
స్త్రీ
వున్నది.
ఆమె
వారిని
మించిన
సౌందర్యరాశి,
సాక్షాత్
రతియే.
ఆమెతో
వారిరువురూ
పంచవటియందు
విచ్చలవిడిగా,
నిర్భయముగా
సంచారము
చేయుచున్నారు.
నిజముగ
అట్టి
స్త్రీని
నీవెన్నడూ
యే
లోకముననూ
చూచి
వుండవని
తలంతు"నని
ఆశ్చర్యముగా
తెలిపెను.
Previous
←
Citrakūṭa
Next
The Illusory Deer
→