Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Illusory Deer
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
3
మాయామృగము
శూర్పణఖ
పలుకులు
వినగానే,
కామాంధుడైన
రావణుడు,
దౌర్భాగ్యపు
బుద్ధికి
బద్ధుడై,
రామలక్ష్మణాదులపై
ద్వేషమును
వీడి,
సీతాపహరణమునకు
చిత్ర
విచిత్రములైన
పన్నాగములు
యోచించ
మొదలుపెట్టెను.
నిద్రాహారములు
సయితము
మాని
ఒకే
విచారమున
మునిగెను.
ఆ
సభలో
రామలక్ష్మణుల
సౌందర్యగుణగణములను
సోదరియైన
శూర్పణఖ
చెప్పుచుండ,
అత్యంత
ఆనందముతో
వినుచూ,
ఆనందభాష్పములు
రాల్చుచూ,
మైమరచిన
విభీషణుడు,
ఆ
సుందర
దివ్యమంగళ
విగ్రహమును
తన
హృదయమున
ప్రతిష్టించుకొని,
వారిని
ప్రత్యక్షముగా
యేనాడు
చూతునో,
తరింతునో,
వర్ణింతునో
అని
చింతించుచూ,
వారు
సాక్షాత్
దైవస్వరూపులే,
కేవలము
రాక్షస
సంహారార్థమై
అవతరించిన
నరరూపులు
అని
దృఢము
చేసుకొని,
వారికి
తన
సర్వస్వమును
అర్పితమొనరించి,
ఆనాటినుండి
వారినే
స్మరించుచూ
జీవించ
ప్రారంభించెను.
రావణుడు
యోగ
భ్రష్టుడగుటచేత
రాక్షసాకారుడై,
రాక్షస
నాయకుడై
సంచరించుచున్నాడే
కానీ
అతడు
పరమాత్ముని
పరమభక్తుడు.
శ్రీ
మన్నారాయణుని
తత్వము
అతనికి
తెలియనిది
కాదు.
శ్రీరాముడు
సాక్షాత్
నారాయణుడేనని
గుర్తించి,
దేవతలకు
ప్రీతినొసంగ,
లోకమున
రాక్షసత్వమును
హతమార్చ
ఈ
రూపమున
వచ్చెనని
తనకు
తెలియకపోలేదు.
అయినా
అతను
నారాయణుని
పొందు
మార్గము
వేరొకటి
లేకపోవుటచేత,
ఈ
విధమైన
హరమును
పూని,
వారితో
విరోధమును
బలపరచుకొని,
వారి
బాణములతోనే
తాను
చావవలెనని
ఆశించి,
ఈ
తామస
శరీరముతో
అతనిని
భజించి,
భవసాగరమును
దాటవలెనని
తన
స్థిరసంకల్పము.
2
▾
Meaning
Keep
ఇంతలో,
రాక్షసబుద్ధి
ప్రభావముతో
పుట్టి
పెరిగిన
కాయమగుటచేత
దైవ
భావమును
మరచి
దానవతత్వమును
విచారించ
పూనుకొనెను.
క్షణము
దైవత్వము,
క్షణము
దానవత్వము;
ఈ
రీతిగా
అస్థిరభావము
కలవాడగుటచేత
వారెవరో
రాజపుత్రులై
వుందురనియూ,
ఆ
రాజుపుత్రులను
సంహరించి
ఆ
స్త్రీని
గొనితెత్తుననియూ
తన
సోదరికి
వాగ్దానము
చేసెను.
అంతటితో
సభ
చాలించి
రథమును
తెమ్మనమని
భటులకు
ఆజ్ఞాపించి
ఒంటరిగా
ఆ
రథమున
కూర్చొని
సముద్ర
తీరముననున్న
మారీచునికి
తెలిపి
గృహమునకు
వెళ్ళెను.
అక్కడ
జరిగిన
వృత్తాంతమును
మారీచునికి
తెలిపి,
మారీచుని
తన
కార్యములో
భాగము
వహించవలెనని
ఆజ్ఞాపించెను.
అయితే,
మారీచుడు
రామలక్ష్మణుల
శక్తి
సామర్ధ్యములను
ఇదివరకే
అనుభవించితిననియూ,
వారు
సామాన్యులు
కారనియూ,
ఈ
విధమైన
ప్రయత్నమునకు
సాహసించుట
మంచిది
కాదనియూ
అనేక
విధముల
రావణునితో
తెలిపిననూ,
కామాంధుడైన
రాక్షసునకు
కర్తవ్యమును
గుర్తించే
శక్తి
సామర్ధ్యములు
శూన్యమగుటచేత,
మారీచుని
శిక్షించుటకు
ప్రయత్నించగా,
మారీచుడు
తనలో
తాను
ఈ
రాక్షసుని
చేతులలో
చచ్చుటకంటే,
రామహస్తములలోనైనా
ప్రాణములు
వీడుట
మంచిదని
తలంచి
రావణుని
ఇష్టమునకు
ఊకొట్టెను.
దండకారణ్యమునకు
రావణుడు
మారీచుని
వెంటబెట్టుకొని
వెళ్ళెను.
మధ్యలో
తాను
వేసిన
పన్నాగములను
వివరించి
మారీచునికి
తెలిపెను.
తన
రాక్షస
శక్తి
చేత
మారీచుని
ఒక
సుందరమైన
బంగారు
జింక
రూపమును
ధరించుమని
జెప్పి,
సీతారామలక్ష్మణులు
నివసించు
పర్ణశాలముందు
అతి
విచిత్రమైన
ఆటల
నాడుచుండుమని
ఆజ్ఞాపించెను.
మారీచునకు
వేరు
మార్గము
లేక
అంగీకరించెను.
తదుపరి
రాముడు
నిన్నుపట్ట
తరుముకొని
వచ్చుననియూ,
నీవు
దూరప్రాంతములకు
పరుగిడి,
అక్కడ
సీతాలక్ష్మణులు
వినునట్లు,
"హా
సీతా,
హా
లక్ష్మణా"
అని
రామకంఠ
స్వరముతో
రోదించుము;
తదుపరి
జరుగవలసినదంతయూ
నేను
జరిపింతునని
చెప్పి,
దూరమున
రథమును
నిలిపి,
తమ
నాటకమును
ప్రారంభించిరి.
ఇవి
యిట్లుండ
చిత్రకూట
పర్వతమున
పర్ణశాలలో
సీతా
రామ
లక్ష్మణులు,
తాము
యేతెంచిన
కార్యము
ప్రారంభించినదన్నట్లు,
శ్రీరాముడు
కందమూల
ఫలములను
తీసుకొని
వచ్చుటకు
లక్ష్మణుని
వనమునకు
పంపెను.
ఇదే
సమయమని
3
▾
Meaning
Keep
తలంచి
సీతతో
ఈ
విధముగా
రాముడు
సంభాషణ
ప్రారంభించెను:
"సఖీ!
నీకన్నియూ
తెలుసును.
మనము
ఏ
కార్యము
నిమిత్తమై
ఈ
భూలోకమునకు
వచ్చితిమో
మన
ఇరువురకూ
విదితమే.
వచ్చిన
పని
ప్రారంభమయినది.
నీ
గుణశీలములు
మహా
పవిత్రము,
మనమీ
కాయము
ధరించినది
అగ్నిహోత్రాది
కర్మవలన;
అనగా
అగ్నిదేవుడు
తెచ్చిన
పాయసముచే
నా
కాయమును,
యజ్ఞక్రతువునకు
అగ్ని
హోత్రములు
ప్రతిష్ఠించు
ప్రదేశమును
నాగలికట్టి
దున్నుచుండ
నీ
కాయమును
కలిగెను.
అన్నింటికి
అగ్ని
కారణము.
కాయము
నిలుచునది
ఆ
వేడిమి
కాయమునందుండుటచేతనే
కాన,
నీవిక
నీ
దివ్య
విభూతులు
అన్నిటిని
దాచి,
నీవు
సామాన్య
మానవ
స్త్రీవలె
ప్రవర్తించుము.
నేనును,
సామాన్య
మానవమాత్రునిగా
ప్రవర్తించి,
నీకొరకు
విరహ
శోకాదులు
చూపుచూ
ప్రవర్తింతును.
ఈ
వినోదము
చూచు
లోకులు
సామాన్యలక్షణాదులనే
దృష్టి
యందుంచుకొందురు;
అవి
లోకాధార
వృత్తులుగా
స్వీకరింతురు.
మన
మొనర్చు
ప్రతి
చిన్న
కార్యము
సంసారికి
ఆదర్శవంతమైనట్టిదిగా
నుండవలెను.
సతీపతుల
సభ్యతలకు
యెట్టి
అవాంతరములు
వాటిల్లక,
సత్యధర్మములకు
విరుద్ధము
కాక,
శాస్త్ర
సమ్మతమైన
మార్గమును
వీడక,
సామాన్య
మానవమాత్రులకు
ఆదర్శవంతమైన
జీవితమును
అందించుచూ;
రావణ,
రాక్షస
సంహారము
వరకు
మనమీ
నాటకము
ఆడవలసి
వుంటుంది.
అంతవరకు
నీ
దివ్యరూపము
అగ్నిలో
ప్రవేశపెట్టి,
సామాన్య
మాయామానుష
విగ్రహధారివై
సంచరించుము.
కారణము
లేని
కార్యములోక
విరుద్ధము.
నిష్కారణముగా
రాక్షస
సంహారమైనప్పటికినీ,
ధర్మవిరుద్ధము
కాని
కారణమును
చూపి,
కార్యమును
నిరూపించవలెను.
కార్యకారణాదులు
అవినాభావ
సంబంధములు.
నిన్ను
రావణుడు
తీసుకొని
పోయినట్లు
చూపి,
వాని
కామవృత్తులను
లోకానికి
వ్యక్తపరచవలసియుండును.
అంతేకాక,
వాని
భక్తి
ప్రపత్తులు
ఉత్తమమైనవి
కావని
కూడా
ఆస్తిక
లోకానికీ
అందించడము
అత్యవసరము.
చిత్తశుద్ధి
లేని
ఆచార
వ్యవహారములు
అల్పకార్యములనియూ,
కామవృత్తిచే
యెట్టి
భక్తిని
ప్రదర్శించిననూ
అది
వట్టి
చెత్తతో
సమానమనియు,
శక్తి
నిమిత్తమై
తపస్సులు,
యజ్ఞయాగాది
క్రతువులు
ఘోరముగా
ఆచరించిననూ
అవి
క్షుద్రసాధనలనే
సత్యాన్ని
కూడా
లోకానికి
చాటుట
అత్యవసరము.
4
▾
Meaning
Keep
రాక్షస
వృత్తులను
వీడక,
దైవకార్యము
లెన్నిచేసినా
అవి
కాలమును
అపవిత్రము
గావించునవే
కాగలవని
కూడా
రావణుని
ఆదర్శమును
నిరూపించవలెను.
ఈ
అన్నింటికీపైన
వానికి
యిచ్చిన
శాపము
కూడా
మరొక
వైపు
భిన్నము
కాకుండా
చూచుకోవలసి
వుండును.
రావణుని
వినాశ
కాలము
ప్రారంభమైనది.
నేడో
రేపో
ఇక
మన
వియోగ
ప్రారంభము
కూడా.
మనకేనాటికి
వియోగము
లేదు,
రాదు.
కానీ
లోకవ్యవహారమున
అట్లు
నిరూపించవలసి
వచ్చినది.
తత్క్షణమే
వెళ్ళి
నీవు
నీ
దివ్య
రూపమును
అగ్నిలో
ప్రవేశింపజేయుము.
లక్ష్మణుడు
కూడా
ఫలములతో
తిరిగివచ్చు
వేళ
అయినది.
రావణుడు
కూడా
వికారబుద్ధులతో
సర్వసిద్ధముగా
వున్నాడు"
అని
రాముడు
తెలిపినాడు.
అత్యంత
రహస్యమును
మరొకదానిని
రాముడు
వెల్లడిచేసెను:
"నీవు
అగ్నిలో
ప్రవేశించి
రాక్షస
సంహారమున
నీవును
నా
కార్యములో
భాగము
వహించవలసి
వుంటుంది.
నీవు
నిమిత్తమాత్రముగా
సామాన్యరూపములో
రావణుని
ఆధీనములో
వుండినా,
నీ
శక్తి
అగ్నియందుంచుటచేత,
ఆ
అగ్నిరూపమైన
నీవు
లంకను
భస్మము
గావించవలసి
వుండును.
'లంకను
అగ్ని
కాదు
భస్మము
గావించుట
నీవే',
అనగా
'సీతయే
లంకను
కాల్చెను.
రాముడే
రావణుని
చంపెను'
అన్న
సత్యమును
లోకానికి
అర్థమగునట్లు
చేయవలసి
వున్నది.
ఈ
చమత్కారములు
లక్ష్మణునికి
సహితము
తెలియరాదు.
లక్ష్మణుడు
మన
పరికరమే
తప్ప
అన్యశక్తికి
సంబంధించడు.
ఈ
కార్యము
పూర్తి
అయి
అయోధ్యకు
ప్రవేశించే
కాలమున
నిన్ను
అగ్నినుండి
స్వీకరింతును.
అదియూ
లోకానికి
ఒక
విధమైన
పరీక్షాలక్ష్యమున
ఆదర్శమును
నిరూపింతును.
మన
నాటకము
నేటినుండి
ప్రారంభమగు
చున్నదని,
యిరువురూ
ప్లానువేసుకొని
రావణుని
రాకకై
సంసిద్ధముగా
వుండిరి.
ఆనాటి
నుండి
సీతారాములు
గావించు
లౌకిక
వియోగ
తాపత్రయములు,
శోకములు,
వేదనలు
కేవలము
నాటకములే
కాని
సత్యము
కావు.
వారిరువురకూ
వియోగమే
లేదు,
రాదు.
వియోగముతో
మానవులకు
ఒక
విధమైన
నీతిని
ప్రకటించపూనుకొనిరి.
ఇంతలో
లక్ష్మణుడు
ఫలములతో
ప్రవేశించెను.
అందరూ
ఆ
ఫలములను
ఆరగించి
చల్లని
నీరును
త్రావి
ప్రకృతి
సౌందర్యమును,
రాక్షసుల
ప్రవర్తలను
గురించి
మాట్లాడుతూ,
అరణ్యవాసమెంతో
ఆనందదాయకము
అన్నట్లు
ఆనందముతో
5
▾
Meaning
Keep
ముచ్చటించుచూ
వుండిరి.
సమీపించిన
రావణ
మారీచులు
వారిలో
వారు
యేరీతిగా
ఆశ్రమమును
ప్రవేశించవలెనన్న
విషయమును
చర్చించుచూ
వుండ,
మారీచుడు
దుష్టుడైన
రావణుని
గుణములకు
అసహ్యపడుతూ,
అతనిని
యెదిరించుటకు
శక్తిలేక,
వాని
చేతులలో
చచ్చుటకు
యిష్టములేక
యేమీ
చేయలేని
స్థితిలో
రావణుని
ఇష్టానుసారము
అనుసరించ
నంగీకరించెను.
సీతారాములకు
ఆకర్షవంతమైన
ఒక
సుందరరూపము
ధరించి
మారీచుడు
తనలో
తాను,
'ఆహా!
ఈ
దినమెంత
సుదినమో
కదా?
కొన్ని
నిమిషములలో
అతిలోకసుందరులైన
త్రిమూర్తులను
దర్శించబోవుచున్నాను.
సీత
దృష్టి
నాపై
గాఢముగా
ప్రసరించబోవుచున్నది.
ఆ
తరువాత
రాముడు
ధనుర్బాణధారియై
నన్ను
తరుముచు
నా
వెంట
రాబోవుచున్నాడు,
రాములను
అనుసరించవలసిన
దాసుడను.
రాముడే
నన్ను
అనుసరించుచు
వచ్చుచున్నాడనిన
నేనెంత
ధన్యుడనో!
నేను
చేయునది
మహాపాపమయినా
అది
నా
బుద్ధిపూర్వకముగా
కాదు.
ఇది
ఒక
విధమైన
బల
ప్రయోగము-కనుక
నా
తప్పు
కాదు.
ఏ
తప్పైననూ
రామబాణము,
రామ
హస్తముతో,
నా
కాయమును
సోకును.
అప్పుడు
ఈ
మాయాదేహమును
వీడుదును.
అదే
నా
మహాప్రాప్తి.
ఇది
అందరికీ
సాధ్యమా?
అంతేకాక,
నేను
కాయమును
వీడునప్పుడు
నా
కన్నులు
రాముని
చూచుచుండును.
ఆ
సుందర
విగ్రహమే
నా
ముందు,
ఆ
మంగళ
నామమే
నా
నాలుకయందు
-
ఆహా!
యెంత
ధన్యుడను!
నా
కంటే
పుణ్యాత్ముడు
మరొకడుండడు
కదా!'
అని
తనలోని
మధుర
భావములను
తాను
మంచిరీతిగా
తలంచుచూ
పర్ణశాల
సమీపమునకు
నడువ
ప్రారంభించెను.
సర్వజ్ఞుడైన
రాముడు,
సర్వజ్ఞురాలైన
సీత
వారి
రాకకై
నిరీక్షించుచుండిరి.
ఇంతలో
పర్ణశాల
ముందు
కపటమృగము
అదురుతూ
బెదురుతూ
అటు
ఇటు
పరుగెత్తుతూ,
దృష్టిని
మాత్రము
సీతారాములవైపునకు
మరల్చి,
వారిముందు
నిలిచి
వారినే
చూచుచూ,
మరి
పొదలలో
దూరుచూ,
ఈ
విధముగా
అనేకమైన
ఆటలాడ
దొడగెను.
సీతారామలక్ష్మణులు
చిరునవ్వులతో
ఆ
మృగము
యొక్క
సౌందర్యమును
వర్ణించుచూ
దాని
చర్మము
సువర్ణముగలదై
వుండుటచేత,
ఇది
ఒక
విధమైన
నూతన
జాతికి
చేరియుండునని
తమలో
తాము
వర్ణించుచూ
వుండ,
కొంతసేపటికి
సీత
"నాథా!
ఎంత
సుందర
విగ్రహము!
ఈ
మృగమును
మనము
6
▾
Meaning
Keep
చెంత
పెట్టుకొనిన,
నేనెంతయో
ఆనందముగా
కాలము
గడుపవచ్చు
కదా!
ఒక్కొక్కపరి
మీరిరువురు
అనివార్యకార్యములందు
నిమగ్నులయినపుడు
నేనీ
మృగముతో
ఆడుకుంటూ
కాలమును
గడుపవచ్చు
కదా!
దయచేసి
ఆ
మృగమును
పట్టిత్తురా?
నా
వినోదార్థము
ఈ
చిన్న
సహాయమును
చేయలేరా?"
అని
యెంతో
ప్రీతిని
ప్రదర్శించుట
చూచి
లక్ష్మణుడు
"తల్లీ,
నేను
గొనితెత్తు"నని
లేచెను.
అయితే
రాముడు
లక్ష్మణుని
ఆపి,
వాని
కపట
నాటకము
లక్ష్మణునికి
తెలియదు
కనుక,
ఆ
లేడి
అతనికి
చిక్కదని
తనలో
తాను
తలంచి,
"తమ్ముడా!
దానికి
యెట్టి
గాయములు
తగులక,
యెట్టి
ప్రమాదములకు
అది
గురికాక
పట్టవలసి
ఉండును.
కనుక
నేనే
దానిని
పట్టవలెను.
సీత
అభీష్టములను
నేనే
నెరవేర్చవలెను"
అను
పదములతో
లక్ష్మణుని
తృప్తిపరచి,
అతనిని
అక్కడే
వుండుమని
ఆజ్ఞాపించెను.
అంతేకాదు.
రాబోవు
-
జరుగబోవు
నాటకము
సీతారాములకు
తెలుసును
కనుక
గుట్టుగా
లోనుంచికొని,
"లక్ష్మణా,
ఈ
అడవి
రాక్షసుల
నివాసము.
రెండు
దినములకు
పూర్వమే
జరిగిన
ఖరదూషణాదుల
వధ
తమ
లక్ష్యమందుంచుకొని
తిరిగి
వారి
బంధుమిత్రులు,
మన
పర్ణశాల
పై
దండెత్తవచ్చు.
కాన
నీవు
సర్వసిద్ధముగా
బాణములను
యెక్కుపెట్టి
నలుదిశలా
కాపలా
కాయవలసియుండును.
సీతను
కనిపెట్టుకొని
యుండుము.
ఎట్టి
సమయమునందైనా
సీతను
వంటరిగా
విడిచి
వెళ్ళకుము.
ఈ
మృగము
చిక్కక
ఒకవేళ
కొంతదూరము
పరుగెత్తవలసి
వచ్చును.
ప్రాణముతో
పట్టవలెను.
కనుక
కొంత
శ్రమపడిన
ఆలస్యముగా
దొరకవచ్చును.
కాన
జాగ్రత్తగా
సమయోచితముగ
బుద్ధిబలమును,
దేహబలమును
ఉపయోగించి,
సీతను
కాపాడుచుండుము"
అని
చెప్పి
రాముడు
మాయామృగమును
తరుముచూ
వెళ్ళెను.
రాముడు
ఆ
మృగమును
తరుముచుండ,
ఆ
మృగము
ముందు
చూడక
తన
దృష్టిని
రామునిపై
మరల్చి,
ముందుకు
పరుగిడుట
రామునికెంతో
ఆనందము
కలిగించెను.
అతను
మారీచుడని
రామునకు
తెలుసు.
అతడు
పరమభక్తుడు;
రామతత్వమును,
రామశక్తిని
పూర్వమే
అనుభవించినవాడు.
అందువలన
రాముడు
కూడనూ
మారీచుని
వైపునే
దృష్టి
వుంచుకొని
వినోదరీతిగా
దానిని
తరుముచూ
వెళ్ళుచుండెను.
ఒక
సమయమున
రామునకు
చిక్కినట్లు
సమీపించును;
మరొక
సమయమున
అతి
దూరముగా
పరుగిడును.
ఈ
విధమైన
ఆటలను
చూచి
రాముడు
7
▾
Meaning
Keep
చాలా
ఉల్లాసముగా
దానితో
ఆడుకొంటూ
వుండినటుల
ఆనందము
నందుచుండెను.
అతి
దూరముగా
వెళ్ళగనే
రాముడు
అమోఘాస్త్రమును
ప్రయోగించెను.
అది
తగులగనే
ఆ
మాయామృగము
"హా
లక్ష్మణా!"
అని
గట్టిగా
అరచి
నేలపడెను.
ఆ
ప్రశాంత
వాతావరణమున
ఆ
శబ్దము
సీతాలక్ష్మణుల
చెవిని
బడెను.
ఆ
మాటలను
వినీ
వినకపూర్వమే
సీత,
"లక్ష్మణా!
వింటివా,
మీ
అన్నగారి
కంఠస్వరము?
నిన్ను
పిలుచుచున్నారు.
తక్షణమే
వెళ్ళి
అతనిని
కాపాడుము.
ఈ
రాక్షసులు
మాయాధారులు.
కపట
వేషములు
ధరించి
అనేక
కడగండ్లకు
గురిచేతురు"
అని
ఆతురతను
ప్రకటించుచు
లక్ష్మణుని
పంపుటకు
ప్రయత్నించెను.
కానీ
బుద్ధిశాలి
కనుక
రామాజ్ఞనే
ప్రధానముగా,
ప్రాణసమానముగా
పాటించువాడగుటచేత,
"తల్లీ!
రామచంద్రున
కెట్టి
కష్టములు
రావు.
రాముని
యెట్టి
రాక్షసుడైననూ
యేమీ
చేయజాలడు.
వేలాది
రాక్షసులను
క్షణకాలములో
వధించిన
దృశ్యమును
రెండు
మూడు
దినములకు
పూర్వమే
మీరు
చూచితిరి
కదా,
మీరు
కంగారు
పడక
ధైర్యముగా
వుండండి.
త్వరలోనే
క్షేమముగా
పర్ణశాల
ప్రవేశింతురు"
అని
సీతకు
ధైర్యమును
తెలుపుచూ
లక్ష్మణుడు
కదలక
వుండెను.
ఇంతలో
మరొకతూరి,
'హా
సీతా!
హా
లక్ష్మణా!'
అను
పలుకులు
వినిపించెను.
అప్పుడు
సీత
మరింత
ఉలిక్కిపడినట్లు
కంగారుపడి,
"లక్ష్మణా,
నీ
వెందుకింత
మొండిగా
ప్రవర్తించుచున్నావు?
నీ
భావము
నాకర్థమగుటలేదు.
త్వరగా
వెళ్ళుము.
మీ
అన్నకు
సంభవించిన
చిక్కును
తీర్చుము.
సహాయపడుము.
వెళ్ళుము,
వెళ్ళుము"
అని
అనేక
విధముల
కంగారును
ప్రదర్శించెను.
రామునకు
ఎట్టి
ప్రమాదము
జరుగదని
సీతకు
కూడా
తెలుసును.
కానీ,
ముందు
జరుగబోవు
నాటకమునకు
ఇవన్నియు
పునాదులుగా
తాను
తలంచి,
ఈ
విధమైన
అమాయకురాలివలె
ఆమె
నటించుటకు
పూనుకొనెను.
లక్ష్మణుడు
ఎన్ని
విధములైన
ధైర్యవచనములు
చెప్పిననూ,
సీత
అతని
మాటలను
పెడచెవిని
పెట్టుటను
గమనించి,
"తల్లీ!
రామాజ్ఞ
నాకు
ప్రాణసమానము.
సీతను
కాపాడుకొనుచు,
యెట్టి
సమయమందైననూ
సీతను
వీడిపోవద్దను
రామాజ్ఞను
నీవు
వింటివి
కదా?
కనుక
నేను
ఇక్కడి
నుండి
యేమి
జరిగిననూ
ఒక
అడుగైన
వెనుకకు
పోను"
అని
గట్టిగా
తెలుపుటచేత,
అతనిని
యెట్లయినను
అక్కడనుండి
పంపి
రావణుని
రప్పించి,
ముందు
రాక్షస
సంహారమునకు
తగిన
మార్గమును,
రాముడు
వేసిన
8
▾
Meaning
Keep
ప్లాను
కనుక,
రామసంకల్పమును
నెరవేర్చనెంచి
సీత
కూడ
తన
పట్టును
వీడక,
అనేక
కఠిన
వార్తలను
కూడనూ
ప్రవేశపెట్టెను.
లక్ష్మణుడు
చెవులు
మూసుకొని,
"తల్లీ!
నేను
నీ
బిడ్డను.
తల్లి
యేమన్ననూ
నేను
సహింతును"
అని
ప్రార్థించెను.
కానీ
మరింత
కఠినవాక్యములు
పలుకుచూ
నీవు
వెళ్ళకున్న
నేనే
వెళ్ళుదునని
సీత
సాహసించగా,
విధిలేక,
మాటలు
వినలేక,
సీత
అడవిలో
పయనము
చేయుటకు
అంగీకరించక,
తాను
భారమైన
హృదయముతో
పర్ణశాలను,
వీడి,
రాముని
వెతకుచు
వెళ్ళెను.
లక్ష్మణుడు
పర్ణశాలను
వీడునప్పుడు
సీతను
లోనికి
వెళ్ళుమని,
తాము
వచ్చువరకు
బైటకురాక,
లోనే
తలుపులు
బిగించుకొని
వుండుమని
అనేక
విధముల
భద్రములు
చేసి,
చాలా
ప్రార్థించి
కదలలేక
కదలెను.
వన
దేవతలను
ప్రార్థించెను.
పర్ణశాలకు
ముందు
భాగమున
నాలుగు
గీతలు
గీచి,
మంత్రశక్తిని
అందులో
ఇమిడ్చి,
జానకికి
నమస్కరించి,
ఈ
గీతలు
యెట్టి
పరిస్థితియందైనా
దాటి
వెలుపలకు
రావలదని
దీనుడై
వేడుకొనెను.
లక్ష్మణుడు
మహాగుణవంతుడు.
రెండు
విధములైన
ఆజ్ఞలలో
తాను
దేనినీ
వీడుటకు
మనస్కరించక
లోలోన
పరితపించెను.
రాముని
ఆజ్ఞమీరినందుకు,
సీత
యేకాంతమునకు
భయపడుతూ
వెనుకకు
చూచుచూ
నడవలేక
నడచెను.
ఇదే
సమయమున,
అదేపనిగా
కాచియుండి
మాయరూపధారియై
ఋషి
రూపమును
ధరించి,
సురాసురలు
కూడను
ఎవని
పేరు
చెప్పిన
గడగడ
వణకుదురో
అట్టి
శక్తివంతుడైన
రావణుడు
పదార్థమును
దొంగిలించుటకు
వచ్చిన
కుక్కవలే,
నలువైపులజూచి
ఆశ్రమమున
ప్రవేశించెను.
నేరుగా
తలుపులు
తీయుటకై
సమీపించగా
లక్ష్మణుడు
గీచిన
గీటులు
అతనికి
మంటలవలె
కనుపించెను.
అంత
తాను
గమనించి
గీటు
దాటిన
తన
కార్యమునకు
భంగము
జరుగుటయే
కాక
యెట్టి
ప్రమాదము
వాటిల్లునో
అని
తలంచి
గీచిన
గీటుకు
ఆవల
నిలచి,
"భవతీ
భిక్షాందేహీ"
అని
భిక్ష
మడిగెను.
సీత
గమనించి,
వీడు
రావణుడే
అని
తలంచి
కందమూలాదులను
హస్తమందుంచుకొని
అతిథికి
అందించవలెనని
తలుపులు
తీసి
వెలుపలకు
వచ్చి
9
▾
Meaning
Keep
నిలిచెను.
రావణుడు
అక్కడికి
వెళ్ళుటకు
బయపడి,
"నేను
ఆశ్రమ
ద్వారమును
సమీపించను,
ఇది
నా
దీక్ష"
అని
మాయమాటలాడి,
సీతనే
తన
దగ్గరకు
వచ్చి
భిక్షమందించుమని
కోరెను.
సీత
"అతిథీ!
నా
మరది
గీచిన
గీటు
నే
దాటలేను,
నీవే
లోనికి
రమ్ము"
అనగా
మాయవేషధారి
భయపడి,
"అమ్మా!
నేను
గీటును
దాటి
లోనికి
రాను,
గీటు
కటు
వైపునుండి
యిచ్చిన
భిక్ష
నేను
స్వీకరించను.
ఇది
మాబోటి
తాపసులకు
మంచిది
కాదు.
'ఆకలి
ఆకలి'
అని
తాను
అనేక
ఆడంబరములు
చేయుట
గమనించి
సీత
గీటుదాటి
భిక్షవేయుటకు
పూనుకొనెను.
ఇదంతా
క్షణములో
జరిగెను.
ఆమె
గీటు
దాటెనోలేదో
రావణుడు
ఆమెను
చేపట్టి
లాగి
యెత్తుకొనిపోయి,
రథమునందుంచుకొని,
ఆమె
యెన్ని
విధముల
విలపిల్లుచున్నను
లెక్కజేయక
అతివేగముగా
రథమును
నడిపించెను.
సీత,
"హా
రామా!
లక్ష్మణా!
త్వరగా
వచ్చి
నన్నీ
దురాత్ముని
బారినుండి
తప్పించుడు"
అని
కేకలు
వేసెను.
ఈ
కేకలే
వినుచున్న
పంచవటి
తీరమున
నున్న
ఋషులు,
వనచరులు
చేయునది
లేక
ఈ
మహాపకారమునకు
దుఃఖించిరి
కానీ,
తప్పించలేకపోయిరి.
అరణ్యమంతయూ
దుఃఖమున
వాడినట్లాయెను.
"ఓ
రామా!
ఓ
నాథా!
నన్ను
కరుణింపుము,
రక్షింపుము.
ఈ
దుర్మార్గుని
రూపుమాపుమని
విలపించుచున్న
ఆ
దీనాలాపముతో
చరాచర
జంతుజాలము
సహితము
విలపించెను.
"ఓ
రావణా!
నీ
వినాశమునకు
నీవే
రాజబాట
వేసికొనుచున్నావు.
నీ
రాజ్యము,
నీ
ప్రజలు,
సర్వ
రాక్షస
వంశము
సంపూర్ణముగా
నాశము
గావించుకొనుచున్నావు.
నేడు
నవ్వుతూ
చేయుచున్న
ఈ
దురాచారమునకు
త్వరలోనే
యేడ్చుచు
అనుభవించబోవుచున్నావు.
నీచుడా!
నీబోటి
తపస్సంపన్నునకు
ఇది
మేలుకాదు"
అని
రావణుని
చెడు
తలంపుకు
అనేక
బుద్ధి
వాక్యములను
తెలుపుతూ,
మధ్య
మధ్య
రాముని
పిలుచుచూ
వెళ్ళుచున్న
రథమును
గృధ్రరాజు
(జటాయువు)
గుర్తుపట్టెను.
సీత
విలాపములను
గమనించెను.
ఆమె
శ్రీరాముని
భార్య
అని
తెలిసికొని,
"అయ్యో!
నేను
వార్ధక్యము
ననుభవించుచున్నాను.
ఈనాటి
నా
బలము
ఆ
దుర్మార్గునితో
పోరాడునంత
శక్తివంతముగా
లేదు.
యేమి
చేతు?
చూచుచూ
వూరకుండుట
మంచిదికాదు.
మంచి
కార్యమున,
పరస్త్రీ
అపహరణను
రూపుమాపుటలో
గల
పవిత్రత
మరొకటి
వుండదు
కదా!
కాన
ఈ
పవిత్ర
కార్యములో
నాప్రాణములు
పోయిననూ
సరే,
నా
10
▾
Meaning
Keep
శక్తి
కొలది
సీతకు
సహాయము
చేయుటకు
పూనుకొందును"
అని,
"ఓ
సీతా!
భయపడకుము.
ఈ
దుర్మార్గుని
రూపుమాపి
నిన్ను
విడిపింతును.
రామునకు
అప్పజెప్పుదును"
అని
అరచుచు
రావణుని
రథమునకు
అడ్డుగా
వెళ్ళి,
తన
వాడియైన
ముక్కుతో
రావణుని
అనేక
విధముల
హింసించి,
రథమును
ధ్వంసము
చేయుటకు
తన
శక్తినంతయూ
వినియోగపరచి
పోరాడ
మొదలు
పెట్టెను.
జటాయువు
అనేక
విధముల
రావణునికి
ఉపదేశము
చేసెను;
"రావణా,
ఇది
నీకు
మంచిది
కాదు.
సీతను
విడిచి
నీవు
నీ
గృహమునకు
చేరుకొమ్ము!
లేకున్న
అగ్నిలో
పడిన
శలభములవలె
నీవును,
నీ
వంశమంతయు
రామక్రోధాగ్నిలోపడి
నశింతురు.
నీ
పొగరుబోతుతనము
నిన్నే
హింసించును.
పరస్త్రీని
అపహరించుట
మహాపాపము.
పాపచిత్తుడే
పరస్త్రీల
వెంట
తిరుగును.
కుక్కనక్కలకంటే
హీనుడే
పరస్త్రీని
కోరును;
ఇంతకంటే
వేరు
చండాలపు
పని
మరొకటున్నదా?
నీ
తల్లిదండ్రులు
చేసుకొన్న
పాపము,
నీవు
కామాంధుడవై
కన్ను
మిన్ను
కానక,
ముందు
రాబోయే
కీడును
యోచించక
పూర్తి
ఉన్మత్తుని
వలె
ప్రవర్తించుచున్నావు.
నీ
బలమును,
ధనమును,
జనమును
చూచుకొని
విఱ్ఱవీగుచున్నావు.
ఇది
అన్నింటిని
భస్మము
గావించును.
నీ
తపశ్శక్తి
కూడా
క్షణములో
అదృశ్యమగును.
నీ
సతులను
పరరాక్షసులు
అపహరించిన
ఆశించిన
నీవు
ఊరకుందువా?
నిజముగా
నా
సతి,
పరసతి
అను
సత్యమును
గుర్తించిన
మానవమాత్రుడు
ఇట్టి
దౌర్భాగ్యమునకు
పూనుకొనడు"
అని
అనేక
విధముల
బోధించుచూ
రథముతోపాటు
తానుకూడా
అతివేగమున
యెగురుచూ
వెంటాడెను.
జటాయువు
పలుకులు,
నీతులు
సీతకు
యెంతో
శాంతిని
అందించెను.
మనసున
సీత
ఆనందించెను.
వృద్ధుడైన
జటాయువు
రధమునాపి,
సీతను
రథము
నుండి
దింపి
ఒక
వృక్షము
క్రింద
కూర్చొనబెట్టి
రావణునితో
పోరాడెను.
పాపము,
వృద్ధాప్యమగుటచేత
కొంత
సేపటికి
అలసిపోయెను.
రావణుని
కిరీటమును,
వాని
శిరోజముల
నూడబెరికెను.
దేహమునంతా
పొడిచి
రక్తపుముద్ద
గావించెను.
రావణుడు
ఎన్ని
బాణములును
ఉపయోగించినను
తన
ముక్కు,
రెక్కలద్వారా
వానిని
ఖండించెను.
రావణుడు
చేయునది
లేక
తన
ప్రాణ
రక్షణ
నిమిత్తము
చంద్రాయుధము
తీసి,
దానిచే
జటాయువు
రెక్కలను
త్రుంచెను.
జటాయువుకు
రెక్కలే
ప్రాణము.
అందువలన
చేయునది
లేక
11
▾
Meaning
Keep
రామా,
రామా
అని
పలుకుచూ
క్రిందకూలెను.
'స్వామి
కార్యమున
నా
ప్రయత్న
లోపములేక
పోరాడితిని
కాని,
ఫలితము
లేకపోయెను.
ఇది
రామసంకల్పమే.
దీనిచే
లోకమునకు
ఏ
ఉపకారము
గావించబోవుచున్నాడో
రాముడు!
లేకున్న
సీతాపహరణమన్నచో
రామసంకల్పము
లేక
జరుగదు.
కాన
నేను
యోచించిన
ప్రయోజనముండదు.
ఈ
వార్తను
రామునకు
అందించునంత
వరకైనా
నా
ప్రాణములు
నిలుపుకొనుటకు
అతనినే
ప్రార్థింతును.
ఇంతకంటే
నేను
చేయునట్టిది
వేరొకటి
లేదని
కన్నులు
మూసుకొని
రాముని
ప్రార్థించెను.
ఇంతలో
రావణుడు
తిరిగి
సీతను
రధముపై
తీసుకొని
బఱ్ఱున
బయలుదేరెను.
కంటితో
చూచుచూ
సీత
విలాపము
వింటూ
ఏమీ
చేయలేనివాడై
జటాయువు
కంటిధారలు
కార్చుచూ
రాముని
ప్రార్థించెను.
'మృత్యువు
సమీపించు
కాలమున,
వినాశకాలము
రాబోవు
సమయమున
విపరీతపు
బుద్ధులు
పుట్టుట
సహజము.
అటులనే
రావణుని
వినాశకాలము
సమీపించినది.
రాక్షసవంశము
నాశనముగాబోవుచున్నది'
అంటూ
రావణుని
రాబోవు
దుస్థితిని
చింతించుచూ,
రామరాకకై
నిరీక్షించుచూ
జటాయువు
కదలలేని
స్థితిలో
పడెను.
ఇక
పంచవటీతీరమున
మాయలేడిని
చంపి,
వెనుకకు
తిరిగివస్తూ,
తనలో
తాను
'జరగవలసినదంతా
జరిగియుండును,
ఇది
నా
సంకల్పమే
అయినా
జనసామాన్యులకు
ఇది
దైవత్వమని
అర్థము
కాకుండుటకై
నేను
సామాన్య
మానవమాత్రునిగా
ఇకపై
ప్రవర్తించవలసియుండును'
అని
తలంచుచూ
వెనకకు
వస్తూ
వుండగా
కొంత
దూరములో
లక్ష్మణుడు
యెదురువచ్చుచున్నట్లు
గ్రహించి
లక్ష్మణునకు
కూడా
నా
మర్మమును
తెలియనివ్వకూడదు,
అని
దృఢము
చేసుకొని,
చింతాక్రాంతుడై
వచ్చుచున్న
లక్ష్మణుని
జూచి,
"తమ్ముడా!
నా
మాటను
నిరాకరించి
సీతను
ఒంటరిగా
విడిచివచ్చుటకు
నీ
మనసెట్టులొప్పెను?
నిత్యము
జరుగుచున్న
రాక్షసకృత్యములను
నీవు
చూచుచూ
ఆశ్రమమున
ఒంటరిగా
సీతను
విడచుట
మంచిదా?
అయ్యో!
సీతగతి
యేమయివుండునో
నాకు
అనుమానముగా
నున్నది.
పర్ణశాలలో
సీత
లేనటుల
నాకు
తోచుచున్నది.
ఇక
యేమి
గతి?"
అని
విచారము
వెలిబుచ్చు
రాముని
పాదములపైబడి
లక్ష్మణుడు,
"అన్నా!
నా
మనసు
నీకు
తెలుసు.
యెట్టి
సమయమునందైనాసరే,
నా
ప్రాణములనైనా
నవ్వుతూ
మీ
పాదములకు
12
▾
Meaning
Keep
అర్పితము
గావింతును
గానీ,
ఆజ్ఞ
మీరుదునా?
మీరను.
అయితే
సమయమట్టిది.
ఇది
నా
విధి.
విధాత
యొక్క
విరుద్ధబలము
చేత,
మాయామృగము
అరచిన
అరుపులు,
హా
సీతా!
హా
లక్ష్మణా!
అన్న
పదములు
పర్ణశాలకు
వినిపించెను.
వినినంతనే
తల్లి
సీతాదేవి
భయపడి,
తత్క్షణమే,
మీ
సోదరునకు
ప్రమాదము
వాటిల్లినది.
వెంటనే
వెళ్ళుమని
నన్ను
అనేక
విధములుగా
తొందరచేసెను.
"ఈ
రాక్షసమాయులు
నాకు
తెలుసును
కనుక
నమస్కరించి
యెన్నియో
విధముల
ప్రార్థించితిని,
వేడుకొంటిని.
రామునికెట్టి
ప్రమాదము
జరుగదు.
ఇది
కేవలము
రాక్షసమాయలని
తెలుపుకొంటిని.
మరీ
రెండవ
పర్యాయము
హా
సీతా!
హా
లక్ష్మణా!
అన్న
పదములు,
మీ
కంఠస్వరమువలె.
దానితో
సీత
తన
తత్వమునే
తాను
మరచి
వావివరుసలే
లెక్కచేయక,
అనరాని,
వినరాని
మాటలను
ఉపయోగించుటచేత
నేను
భరించలేక,
చెప్పవలసినవన్నియూ
చెప్పి,
చేయవలసిన
భద్రములన్నియూ
చేసి
పర్ణశాల
విడిచి
రావలసి
వచ్చెనని,
జరిగినవన్నియూ
విన్నవించి,
శిక్షకైనా
కక్షకైనా
నేను
సంసిద్ధమేనని
నమస్కరించెను.
అంత
రాముడు,
"లక్ష్మణా!
యేమైననూ
సరే.
నీవు
ఒంటిరిగా
వదలి
వచ్చియుండకూడదు.
ముమ్మాటికీ
సీత
పర్ణశాల
యందు
వుండదనే
నా
ఉద్దేశ్యము,
వనమునకు
వచ్చి
సీతను
రాక్షసుల
కప్పజెప్పుటలో
మన
పురుషార్థమేమున్నది?
రాముడు
భార్యను
కాపాడుకొనలేకపోయెనను
వాక్యము
నీవు
భరింతువా?
సహింతువా?
అయ్యో!
సీతా
వియోగమును
నేనేరీతిగా
భరింతును"
అని
అనేక
విధముల
అమాయకునివలె
ప్రకటించుచూ
అతివేగమున
పర్ణశాలకు
వచ్చి
చేరిరి.
అందులో
రాముడు
తెలిపినటుల
జానకి
కనుపించలేదు.
ఇక
రాముడు
తాళలేని
వానివలె
వ్యాకులత
పడెను.
లక్ష్మణుడు
నిలువునా
కూలిపోయెను.
ఈ
అపరాధము,
ఈ
విధమైన
దురవస్థ
తన
వలననే
జరిగినదనీ,
తన
ప్రాణములు
వుండుటకు
కూడా
ఇష్టపడలేదు.
కానీ,
సీతా
లేదు;
తానూ
ప్రాణత్యాగము
చేసుకొన్న
ఈ
సమయమున
రాముని
అనేక
చిక్కులపాలు
చేసినట్లగుననియూ
రామునకు
అపకారము
గావించు
వాడనగుదుననియూ,
ఈ
కారడవులలో
రాముడు
యేకాకియై
తిరుగుననియూ,
అతనికి
ఫలపానీయములైనా
ఇచ్చుటకు
సహాయ
మెవ్వరూ
వుండరనియూ
తలంచి
జీవచ్ఛవముగా
నిలిచి
రాముని
వ్యాకులతను
13
▾
Meaning
Keep
చూడలేకపోయెను.
నోటమాట
రాకపోయెను.
సీతా
వియోగముతో
తన
ప్రాణమును
కోల్పోయినట్లు
తలంచెను.
కొంత
ఆలోచించి
ఇదంతా
రామసంకల్పమే
తప్ప
అన్యము
కాదనియూ,
రాముడు
సామాన్య
మానవమాత్రుడు
కాదనియూ,
ఇది
లోకకళ్యాణనిమిత్తమై
యేర్పడిన,
కల్పించిన
నాటకమనియూ
లక్ష్మణుడు
తెలిసికొనెను.
పరుల
దుఃఖముల
నపహరించు
పవిత్రుడు,
లేశమైనా
దుఃఖము
నెరుగని
లోకపాలకుడు
భార్యా
వియోగమునకు
సాధారణముగా
మానవమాత్రులు
విలపించునటుల
విలపించుచున్నాడనిన,
ఇది
నాటకమని
లక్ష్మణుడు
క్షణములో
గ్రహించెను.
సీతయొక్క
నిస్వార్థము,
నిష్కళంకము,
నిరుపమానమగు
శీలము
లక్ష్మణునకు
తెలుసు.
అట్టి
సద్గుణ,
సచ్ఛీలవతికి
యిట్టి
విపత్తు
కలిగినదంటే
ఇది
కూడ
రామకార్యములోని
ఒక
భాగము
అని
తెలుసుకొన్నాడు.
రామాజ్ఞలేక
యే
చిన్న
కార్యమును
కూడా
యెవ్వరూ
చేయవీలుకాదు.
అయితే,
లోకమున
మానవమాత్రుడుగా
అవతరించి,
మానవులకు
నీతి,
నిజాయితీ,
త్యాగ,
శీల,
ధర్మ
ప్రపత్తులను
నిలబెట్టుటకై
తాను
ఆచరించి,
ఆదర్శమును
అందించు
ప్రయత్నమునకై
సీతారాములు
ఈ
విధమైన
నాటక
మాడుచున్నారని
దృఢము
చేసుకొని,
ఆ
నాటకములో
తానూ
ఒక
పాత్రధారుడు
కనుక,
తన
కందించిన
పాత్రను
తాను
కూడా
సక్రమముగా
నటించవలెనని
నిర్ణయించుకొని,
ధైర్యమున
రాముని
చెంతచేరి,
పాదములు
ముట్టి,
"అన్నా,
ఓ
నాథా!
నీవు
జగన్నాటక
సూత్రధారివి.
నీకు
తెలియనివి.
చేతకానివి
యేవియునూ
లేవు.
అంతా
నీ
సంకల్పమునందే
యిమిడియున్నది.
నీకు
తెలియక
ఇన్ని
జరుగుటకు
వీలుకాదు;
నేను
నమ్మను.
ఇదంతా
యేదో
లోకకల్యాణ
నిమిత్తము,
రాక్షస
నాశమొనరించుటకై
తామే
ఈ
నాటక
మాడుచున్నారని
నా
మనసు
నిస్సంశయముగా
నన్ను
ప్రేరేపించుచున్నది.
ఇది
పరమ
సత్యమయి
వుండును.
నిజము
తెలిపి
నన్ను
శాంతచిత్తుని
గావింపు"మని
ప్రార్థించ,
రాముడు
చిరునవ్వు
నవ్వి
-
"లక్ష్మణా,
నీవు
నా
అంగమగుటచేత
నీ
దగ్గర
దాపరికమేమున్నది?
నీ
సంకల్పము
సత్యము.
ధర్మసంరక్షణార్థమై
అవతరించిన
నేను
ధర్మమును
ఆచరించి
అందించుటలో
అన్ని
విధములైన
లీలలు
గావించవలసియుండును.
ఏడ్చునట్టి
చంటిబిడ్డను
ఆడించి,
పాడించి,
లాలించి,
ఆట
వస్తువులను
అందించి,
కట్టుకధలు
14
▾
Meaning
Keep
చెప్పి,
పాలను
త్రాగించి
యేడ్పును
మాన్పించుటకు
తల్లి
అనేక
యుక్తులు
పన్నుట
లోక
సామాన్యము.
ఇందులో
పరమలక్ష్యము
పాలను
త్రాగించి
యేడ్పును
మాన్పించుటే,
అంతేకదా?
అయితే
ఈ
ఆటలు,
పాటలు,
ఆటబొమ్మలు,
కట్టుకథలు
పాలను
త్రాపించి
యేడ్పును
మాన్పించుటకు
సహాయకారులగుచున్నవి
కదా?
ఆకలి
తీర్చి
యేడుపును
మాన్పించుటలో
పై
కృత్యములు
కూడ
ఒక
ఆధారములే
కదా?
అవన్నియూ
చేరే
ఆకలిని
తీర్చినవి.
దుఃఖమును
దూరము
చేసినవి.
అటులనే
ధర్మసంస్థాపన,
అధర్మ
నాశనము
గావించుటకై
లోకమాతయైన
నేను
ఇన్ని
విధములైన
నాటకము
లాడవలసియుండును.
ఇవన్నియూ
దుఃఖనివృత్తికి,
ఆనందప్రాప్తికి
ఉపాంగములే;
వృథాకావు.
లోక
సామాన్యులు
ఆదర్శమును
మాత్రమే
ఆధారముగా
చేసుకొని
అనుసరింతురు.
కనుక
అధికారియైన
నేను,
నాయకుడైన
నేను
ఆచరించిననే,
లోకులు
దానిని
అనుసరింతురు.
నాయకుడు
ఆచరించక
లోకులను
ఆచరించుమనుటలో,
నాయకత్వమునకు
అర్హుడు
కాలేడు.
అట్టి
అనర్హులైన
నాయకులు
ఎప్పుడు
తయారగునో
అప్పుడే
ధర్మనాశనము,
అన్యాయ
అభివృద్ధి
ప్రారంభించును.
కావున
అధికారియైనవాడు,
నాయకుడైనవాడు,
తాను
చెప్పునట్టి
వాక్యములు,
ఆశించునట్టి
ఉత్తమస్థితిని,
తను
ఆచరించి
అందించవలసియుండును.
ఇదే
మానవ
నీతి,
ఇదే
దైవప్రీతి.
సీతకు
కూడను
ఈ
నీతి
చక్కగా
తెలియును.
నిమిత్తమాత్రముగా
ఈ
కాయములు
వియోగ,
సంయోగ,
సుఖ,
దుఃఖ,
విలాప,
ప్రలాపములు
ప్రకటించునే
కానీ
ఇవి
సత్యమైనవి
కావు.
నా
అవతార
తత్వమునకు
ఇవి
కొన్ని
నిబంధనలు,
నిరూపములు.
కాన
నా
తత్వమును
నీకు
తెలుపుచున్నాను.
నీవు
కూడనూ
నీ
స్థానమున
కాలకర్మకారణములను
దేశ
కాల
పాత్రను
అనుసరించవలసి
వచ్చును.
"దైవ
రహస్యము
అన్యులకు
అర్థము
కాదు.
కనుక,
నీవు
నావలె
కొంత
నాటకమాడి,
మనము
వచ్చిన
కార్యమును
పూర్తి
చేసుకొందా"మని
తమ్మునకు
దైవత్వమును
పూర్తిగా
తెలిపి,
సామాన్య
మానవులవలె
సీతాన్వేషణను
ప్రారంభించిరి.
ఈ
అన్వేషణలో
రామలక్ష్మణులు
మహావిచిత్రముగా,
అద్భుతముగా,
ఆశ్చర్యముగ
నటన
చేయుదురు.
ఇంతేకాదు,
సీతామాత
కూడా
మహాపవిత్రతను
ప్రకటించుచు,
ప్రదర్శించుచు,
ధైర్యసాహసములతో,
సత్యమునకు
భయముండదన్నట్లుగా,
ఘోర
15
▾
Meaning
Keep
రాక్షసులు
అదిరించి
బెదిరించినను
లొంగక,
కృంగక,
తన
దీక్షను
వీడక,
ఏక
లక్ష్యమును
సాధించు
దీక్షను
చాలా
అద్భుతముగా
ప్రకటించును.
వీరు
గావించు
ఈ
నాటకము
ప్రతి
గృహస్థునకు,
ప్రతి
ఇల్లాలుకు
ధర్మాధర్మమును
అందించును.
తండ్రి,
తల్లి,
భార్య,
భర్త,
సోదర
మిత్రవాగ్దానమును,
శీలమునెట్టు
కాపాడుకొని
సార్థకము
గావించుకొనవలెనో
చక్కగా
నిరూపింతురు.
వేయేటికి,
రామాయణమే
జీవిత
సర్వసమస్యలను
దూరము
గావించును.
మానవత్వమును
సార్ధకముగా
చేసుకొనునట్లు
నిరూపించును.
రామాయణమున
లేని
నీతులు
మరొకదానియందు
లేవు.
నిత్యజీవితమున
మానవుడు
యే
యే
సందర్భమున
యెట్లు
మానవత్వమును
కాపాడుకొనవలెనో,
పరిపాలన
గావించుకొనవలెనో,
ప్రజలకు
బోధించవలెనో,
శాసనములు
గావించవలెనో
అన్నియూ
ఒక్క
రామాయణమునందు
ఇమిడియున్నవి.
ఒక్క
రామాయణమును
పూర్తిగా
అర్థము
చేసుకొనిన
లోకకళ్యాణమున
కెట్టి
అవాంతరములు
అడ్డుతగలవు.
Previous
←
The Holy Place of Pañcavaṭī
Next
Śabarī
→