Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · Śabarī
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
4
శబరి
రామలక్ష్మణులు
సీత
జాడను
తెలిసికొనుటకై
పర్ణశాలను
వీడిరి.
సర్వాయుధములు
తీసుకొనిరి.
పర్వతములు,
కొలనులు,
గుహలు
శోధించుతూ
వెళ్ళిరి.
ఎక్కడా
సీతజాడలు
కనపించలేదు.
అట్లే
నడచుచూ
వెళ్ళుచుండ
ఒక
మార్గమధ్యమున
వృక్షశాఖలు
విరిగిపడియుండుటయు,
ఆ
ప్రదేశమున
యేదో
కొంత
పోరాటము
జరిగినట్లును,
కొన్ని
ధనుర్బాణములు
విరిగిపడినట్లును
కనుపించెను.
దానిని
చూచి
రాముడు,
"తమ్ముడా!
ఇచ్చట
యెవరో
యుద్ధము
చేసినటుల
కనిపించుచున్నది"
అని
అటు
ఇటూ
వెతుకగా,
గృధ్రరాజు,
చాలా
బలహీనుడై,
రామా,
రామా
అంటూ
కన్నులు
మూసుకొని
యుండిన
దృశ్యమును
చూచెను.
రామలక్ష్మణులు
సరాసరి
జటాయువును
సమీపించిరి.
దాని
శిరస్సున
రాముడు
హస్తము
నుంచెను.
జటాయువుకు
ఆ
హస్త
స్పర్శహాయి
నందించెను.
కొంత
బలము
వచ్చెను.
కన్నులు
తెరచి
చూచెను.
జగన్మోహన
విగ్రహము
కనుపించెను.
అంత
భరించలేని
ఆనందము,
దుఃఖము
రెండునూ
పొంగి
పొరలెను.
కానీ
కదలలేని
స్థితిలో
పడియుండుటచే
అటూ
ఇటూ
తిరుగలేక
అట్లనే
రాముని
పాదములపై
బడెను.
రాముడు
దానిని
తన
తొడలపై
పరుండబెట్టుకొని
ఓదార్చుచుండ,
అప్పుడు
జటాయువు
"ఓ
నాథా!
దుర్మార్గుడైన
రావణుడు
దౌర్భాగ్యపు
బుద్ధులకు
చిక్కి
నీతి
నిజాయితీని
మంటకలిపి,
తపశ్శక్తికి
తర్పణము
వదలి
తల్లియైన
సీతను
కుక్కవలె
అపహరించి
నక్కవలే
వనమధ్యమున
రథములో
వేసుకొని
పోవుచుండ,
ఆ
జగజ్జనని
జానకి
'రామ,
రామా'
అంటూ
విలపిల్లుచుండ,
ఆ
విలాపము
అరణ్యమునే
కదలించినది.
యెవరిదీ
విలాపమని
నేను
చెంతకు
వెళ్ళిచూడగ,
సీతామాత!
నేనిక
భరించలేకపోతిని.
వృద్ధాప్యమయినను
నీ
నామ
చింతన
చేయుచూ
వానితో
అనేక
2
▾
Meaning
Keep
విధములుగా
పోరాడితిని.
కడకు
వాని
కాయమునంతయూ
రక్తమయము
గావించితిని.
సీతను
రథము
నుండి
తీసి
ఒక
వృక్షచ్ఛాయ
యందుంచి,
వానితో
ఘోరమైన
యుద్ధము
చేసితిని.
కానీ
నా
ప్రయత్నమంతయూ
వృథా
అయెను.
వాడు
చక్రాయుధము
తీసి
నా
రెక్కలను
ముక్కలుగా
కొట్టెను.
నే
చేయునది
లేక
ఈ
రీతిగా
పడి
తమ
రాకకై
విలపించుచున్నాను.
కంటితో
చూచియూ
ఆ
తల్లిని
నేను
రక్షించుకోలేకపోయిన
దౌర్భాగ్యుడను"
అంటూ
కంటిధారలు
కార్చెను.
అంత
రాముడు
కూడను
కొంత
విచారమును
ప్రకటించి
"ఓ
పక్షిరాజా!
నీ
ఉపకారము
నేను
మరువను,
నీ
సత్కర్మయే
నీకు
సద్గతి
కలిగించును.
విచారించకుము"
అని
అతని
రెక్కలలో
చేరిన
మట్టిని
తన
జడలతో
దులిపి
శిరస్సును
నిమురుచుండ
లక్ష్మణుడు
నీరు
తెచ్చెను.
ఆ
నీరు
రాముడు
జటాయువు
నోటిలో
కొంత
కొంత
వదలుచుండ
జటాయువు
నా
భాగ్యమే
భాగ్యమని
ఆనందించి
"రామా,
కన్నతండ్రికి
కూడా
లభించని
ప్రాప్తి
నాకు
లభించెను.
నీ
సువర్ణహస్తములలో
నీరు
గుడుచుచున్న
మహాప్రాప్తి
లభించెను.
నీ
తొడలపై
విశ్రమించి
నీ
హస్తములతో
అమృతము
గ్రోలుచూ,
ఆహా!
ఇప్పుడు
నా
నేత్రములు
నీ
ముఖపద్మములు
చూచుచుండ
నా
ప్రాణములు
పోయిన
అదియూ
నీలోనే
చేరును
కదా!
నేనెంత
ధన్యుడ"నని
అంటూ,
"రామా!
దుర్మార్గుడైన
రావణుడు
దక్షిణ
దిశకు
పోయెను.
బహుశ
లంకనే
చేరియుండును.
కాన
మీరు
సరాసరి
లంకను
చేరి,
ఆ
దుర్మార్గుని
హతమార్చి,
ఆ
తల్లిని
చెంత
చేర్చుకొనుడు"
అని
ఆఖరు
మాటగా
చెప్పి,
ఇంక
మాట్లాడలేక
"రామా"
అని
ఒక్కసారి
కేకవేసి
ప్రాణము
విడిచెను.
రాముడు
జటాయువు
ప్రాణమును
తనలో
చేర్చుకొని,
దానికాయమునకు
తగిన
అంత్యక్రియలు
గావించి
స్నానమాచరించి
తిరిగి
జటాయువు
చెప్పిన
గుర్తులను
మనసున
చిత్రించుకొని
దక్షిణదిశకు
నడిచిరి.
ఈ
విధముగా
దారి
నడుచుచుండ,
అజాముఖి
అను
భయంకర
రూపిణియైన
ఒక
రాక్షసి
దారికి
అడ్డువచ్చి,
"ఆహా!
యెంతటి
సుందరులు
మీరు.
మిమ్ము
అనుభవించు
వారెంతటి
ధన్యాత్ములు.
ఈనాడు
నా
నోము
పండినది.
మనోభీష్టము
నెరవేరినది"
అని
ఆ
రాక్షసి
లక్ష్మణుని
చేయిపట్టుకొనెను.
అంత
లక్ష్మణుడు
ఈ
రాక్షసి
చర్యను
గుర్తించి,
ఇదికూడా
శూర్పణఖవంటి
చిత్తము
కలిగియున్నదని
తలంచి
దాని
అంగములను
ఖండించెను.
3
▾
Meaning
Keep
ఆ
అరణ్యముకూడనూ
రాక్షసులవలే
భయంకరమే.
అనేక
క్రూరమృగములతో,
భయంకర
శబ్దములతో
యెట్టివారినైన
భయభ్రాంతులను
గలిగించునదై
యుండెను.
ఈ
విధమున
రామలక్ష్మణులు
ప్రయాణము
జరుపుచుండ
ఒక
వికారాకారమును
ధరించి
కబంధుడను
రాక్షసుడు
అడ్డుతగిలి,
భూమి
ఆకాశము
దద్దరిల్లునట్లు
నవ్వి
రామలక్ష్మణులపై
పడుటకు
పూనుకొనగా,
రాముడు
ఆ
కబంధుని
సంహరించెను.
వాని
చేతులు
చాలా
పొడవు
కలిగి,
శిరస్సు
లేక
తాను
భుజించు
నోరు
కడుపుపైననే
కలిగి,
అమానుషరూపుడై,
అత్యంత
విచిత్రాకారుడై,
ఆ
అడవిలో
ప్రాణులను
అనేక
విధముల
హింసించుచుండెను.
అట్టి
రాక్షసుని
సంహరించి,
వనచరులకు
కొంత
భయభ్రాంతిని
శ్రీ
రాముడు
తగ్గించెను.
ప్రాణములు
వీడుటకు
పూర్వము
ఆ
కబంధుడు,
"ఓ
నాథా!
మీ
దర్శన,
స్పర్శన,
సంభాషణలతో
నా
శాపము,
పాపము
పటాపంచలయినవి.
నేను
ధన్యుడను"
అని
తెలుపుకొంటూ,
"రామా,
నీ
కార్యమెట్టి
అభ్యంతరములూ,
అవాంతరములు
లేక,
దిగ్విజయము
కాగలదు"
అని
నమస్కరించుచూ
ప్రాణములు
వీడెను.
అక్కడి
నుండి
ఉదారచిత్తుడైన
రాముడు
పాదచారియై,
తమ్మునితో
వచ్చుచుండ,
వారి
మధ్యకు
ఒక
వృద్ధస్త్రీ
నడుము
వంగి,
తలపండి,
మసకలు
కప్పిన
కన్నులతో,
కదులుతున్న
చేతులతో
ఒక
పండ్ల
బుట్టనెత్తిన
వుంచుకొని
మెల్లగా
నడుచుచూ
వచ్చుచుండెను.
ఈ
సుందరరూపులను
చూచి
మునీశ్వరులు
వర్ణించుచున్న
ఆ
రామలక్ష్మణులు
వీరేనేమోనని
తలంచి
ఒక
చెట్టునీడన
నిలిచి,
బుట్టను
క్రిందబెట్టి
చేతులు
జోడించుకొని,
రామా,
రామా
అని
స్మరించుచూ
నిలిచెను.
అంత
లక్ష్మణుడు
ఇదియూ
ఒక
మానవాకారము
ధరించిన
రాక్షసేనని
తలంచెను.
కానీ,
రాముడు
లక్ష్మణుని
తలంపు
సరికాదని
తెలిపి,
ఆ
చెట్టు
క్రిందనే
కొంత
విశ్రమించుటకై
ఆగిరి.
దానికి
అతి
సమీపముననే
శబరి
ఆశ్రమము
కూడా
వుండెను.
వారి
కమలముల
వంటి
కన్నులు,
వారి
ఉంగరములవంటి
ముంగురులు,
జడలు
ధరించి,
శ్యామలవర్ణులయిన
ఆ
ఆజానుబాహులను
చూచి,
ఇంక
తాను
భరించుకోలేకపోయినది.
కడుపులో
నుంచుకొనలేకపోయినది.
పరుగెత్తుకెళ్ళి
వారి
పాదాలపైబడి,
"నాథా!
మీరెక్కడనుండి
వచ్చుచున్నారు?
మీ
పేరేమి?"
అని
అడిగెను.
శ్రీరాముడు
చిరునవ్వుతో
"అమ్మా,
మేము
అయోధ్యనుండి
4
▾
Meaning
Keep
వచ్చితిమి.
అరణ్యమున
నివసించుచున్నాము.
నా
పేరు
రాముడందురు.
ఈ
నా
తమ్ముని
లక్ష్మణుడని
పిలుతురు"
అని
చెప్పగనే,
"తండ్రీ!
నా
చిరకాల
వాంఛ
తీరెను.
జన్మ
సార్థకమయ్యెను.
మీ
కొరకై,
రాత్రింబవళ్ళు
కనులు
కాయలు
కాచునట్లు
యెదురు
చూచినాను.
నా
ప్రయత్నము
ఫలించెను.
నా
తపస్సు
సిద్ధించెను.
ఆహా!
నేను
ఎంత
ధన్యురాలను!
ఇది
నా
గురు
కాంక్షయే.
దైవ
ప్రేరణమే"
అని
ఆనందబాష్పములు
రాల్చుచూ
పట్టలేని
ఆనందముతో
బుట్టను
దగ్గరతీసెను.
రాముడు,
"అమ్మా!
మీ
గురువు
గారెవరు?"
అని
ప్రశ్నించగనే,
మతంగ
మహాముని
అనియూ,
ఈ
అరణ్యమున,
స్త్రీలకు
ఆశ్రమములందు
స్థానము
నిచ్చుటకు
యెట్టి
మహనీయుడును
అంగీకరించకుండుటచే
వారు
బోధించు
బోధనలను
చెట్టు
చాటునుండీ
వినేదానననియూ,
తెల్లవారకమునుపే,
ఋషులు
స్నానసంధ్యాదుల
నిమిత్తమై
నదికివెళ్ళు
దారులను
ఊడ్చుచూ,
రాళ్ళు,
ముండ్లు
యేరిపారవేయుచూ,
ఈ
విధముగా
పరోక్ష
సేవలు
చేసుకొనుచూ
కందమూలాదులు
తిని
కారడవులలో
కాలము
గడుపుచుండెడి
దానను.
నా
మనస్సెరిగిన
మహనీయుడు
మతంగ
మహానుభావుడు
'అమ్మా!
నీ
కాయము
పక్వస్థితికి
వచ్చినది.
ఈ
విధముగా
శ్రమపడుచుండిన
కొంత
అలసిపోదువు.
నీవు
ఆశ్రమమున
చేరి
విశ్రాంతి
తీసుకొమ్మని
బోధించెను.
వారి
పవిత్ర
ఆజ్ఞను
శిరసావహించి
ఆశ్రమ
సేవలు
చేసుకొంటూ
వుండగా,
ఋషి
కాయమును
వీడగోరి,
ఒక
దినము
నన్ను
దగ్గరకు
పిలిచి,
'శబరీ,
నే
వచ్చిన
కార్యము
పూర్తి
అయినది.
నేనిక
కాయమును
వీడ
తలంచితిని.
నీవు
ఈ
ఆశ్రమమునందే
వుండుము.
కొంత
కాలములో
శ్రీరామచంద్రుడు
ఈ
అడవికి
వచ్చును.
అతనిని
ఆశ్రమమునకు
పిలిచి
అతని
సేవలు
చేసి
వారి
పాదస్పర్శ
ద్వారా
ఆశ్రమమును
పవిత్రము
గావింపుము'
అని
ఆజ్ఞాపించెను.
అట్టి
పవిత్ర
గురుమూర్తులు
లేని
ఆశ్రమమున
నేనేమని
జీవింతును?
నన్నును
మీతో
గొనిపొమ్మని
నేననేక
విధముల
ప్రార్థించిననూ
గురుమూర్తి
యేమాత్రము
తృప్తినొందక,
రామాగమన
నిమిత్తమై
నీవిచ్చటే
వుండక
తప్పదని
ఆజ్ఞాపించి
ప్రాణముల
వీడెను.
ఆనాటి
నుండి
మీ
ఆగమమునకు
అఱ్ఱులు
చాచి,
కన్నులు
విడచి
ఈ
వృద్ధకాయముతో
కాలము
గడుపుచున్నాను.
ఓ
రామా!
ఓ
నాథా!
ఓ
5
▾
Meaning
Keep
ఆర్తత్రాణపరాయణా,
ఓ
ఋషి
మానససంచారీ!
ఈనాటికి
నా
నోము
పండెను.
గురుసంకల్పము
ఫలించెను.
కొన్ని
అడుగుల
దూరమునందే
ఆ
ఆశ్రమము
కలదు.
నాతో
దయచేసి
పావనము
గావింపుడు"
అని
పాదములపై
బడెను.
సహజ
ప్రేమస్వరూపుడగుటచే,
శబరి
భక్తి
ప్రపత్తులకు
ఆనందించి
రాముడు
లక్ష్మణునితో
కూడి
మతంగాశ్రమమునకు
వెళ్ళెను.
ఆహా!
ఆ
శబరి
ఆనందమునకు
హద్దులు,
గట్టులు
తెగెను.
నడువలేని
నారీమణికి
వేయి
యేనుగుల
బలము
వచ్చెను.
చకచక
నడచుచూ
నదికి
వెళ్ళి
చల్లని
నీరు
తీసుకొనివచ్చి,
తాను
రుచిచూచి
తెచ్చిన
ఫలములను
రామలక్ష్మణుల
ముందు
పెట్టి,
వారి
ముఖకమలములను
తనివితీరా
చూచుచూ,
రామ
పాదములను
కడిగి
శిరస్సుపై
ప్రోక్షించుకొని,
నీరు
త్రాగి
"స్వామీ,
నా
కోరిక
తీరినది.
ఇక
నేను
దేని
నిమిత్తమై
బ్రతుకవలెను?
రామదర్శన
నిమిత్తమై
బ్రతికితిని.
రాములను
చూచితిని.
ఇక
ఈ
ప్రాణములను
తమ
పాదములందు
చేర్చుకొనుడు.
తమ
చరిత్ర
మునులచే
అపారముగా
విన్నాను.
నేటికి
కన్నాను,
ధన్యనైనాను"
అని
ప్రార్థించెను.
రాముడు
ఆమె
అందించిన
ఫలములు
అత్యంత
ప్రీతితో
ఆరగించుచూ,
"అమ్మా!
నీ
మనస్సెంత
మధురమో
నీ
ఫలములూ
అంత
మధురముగా
నున్నవి.
నిజముగా
ఇవి
చెట్ల
ఫలములు
కావు.
అడవి
చెట్టు
ఫలములు
ఇంత
మధురముగా
నుండవు.
నీ
జీవిత
వృక్షమునందలి
మనఃఫలములే
యివి"
అని
ఫలముల
రుచి
వర్ణించుచూ
ఆరగించుచుండ
లక్ష్మణునికి
చాలా
ఆనందమాయెను.
కారణము,
సీతా
వియోగము
కలిగిన
దినమునుండి
రాముడు
ప్రీతితో
తనకు
తాను
అందుకొని
ఫలమును
భుజించినది
తాను
చూడలేదు.
లక్ష్మణుడు
యెంతో
బలవంతముతో
రామునకు
వలిచి,
అందించుచుండుటచేత
అదియు
ఒకటో
అర్ధమో
తినుచుండెనే
కానీ
ఆకలి
తీరునట్లు,
లక్ష్మణునికి
తృప్తి
కలిగించునట్లు
తినలేదు.
ఈనాడు
ఈ
శబరి
చెట్టు
క్రిందపడిన
ఫలములను
రుచిచూచి
మట్టి
తుడిచి
పరిశుద్ధముగా
మధురఫలమునే
దాచిపెట్టి
రాముని
నిమిత్తమై
నిత్యము
యెదురుచూచి,
కడకు
రామప్రసాదమనే
భావముతో
తానారగించి
తిరిగి
క్రొత్త
ఫలములను
యేరి
దాచి
వుంచెడిది.
ఆ
అలవాటుతో,
శబరి
ప్రేమరసమును
ఆ
ఫలరసముతో
యేకపరచటముచేత,
అతి
మధుర
రసముగా
ఆ
ఫలములను
రామచంద్రుడు
ప్రీతితో
తృప్తితీర
ఆరగించుచున్నాడని
లక్ష్మణుడు
అమితానందపడెను.
శబరి
భక్తిని
6
▾
Meaning
Keep
మెచ్చుకొనెను.
ఆమె
వృద్ధాప్యములో
వున్న
దైవరసమును
అర్థము
చేసుకొని
ఆనందించెను.
శబరి
చేతులు
జోడించుకొని
"ఓ
నాథా!
నేను
నీచజాతిలో
జన్మించిన
స్త్రీని,
మందమతిని,
మూర్ఖురాలను,
ఏ
విద్యయు
లేని
అజ్ఞానిని.
నేనేమని
వర్ణింతును?
అధమాధములలో
అధమురాలను,
అశక్తురాలను,
మాటల
పొందిక
తెలియదు.
తెలివితేటలు
శూన్యము,
తపశ్శక్తి
లేదు.
కేవలము
దైవప్రీతి
తప్ప
అన్యశక్తులలో
అట్టడుగున
పడిన
నన్ను
ఆదరించి,
ఆనందమందించిన
నీ
కరుణ
అపారము.
నీ
కరుణే
నన్ను
అనుగ్రహించెను
తప్ప
నా
భక్తి
శక్తులు
కావు"
అని
అనేకవిధముల
రామచంద్రుని
ప్రేమ,
దయలను
వర్ణించుచూ
వచ్చెను.
ఈ
మాటలు
వింటున్న
రాముడు
శబరి
శిరస్సును
నిమురుచూ,
"అమ్మా!
నాకు
భక్తి
ఒక్కటే
ప్రధానము
కానీ
అన్యవిద్యలు,
తెలివితేటలు,
జన్మ,
వంశాలు
నేను
లెక్కచేయను.
సమస్త
తపశ్శక్తులకంటే
ప్రేమపూర్వకమైన
భక్తియే
నాకు
మధురము,
నేను
దానిని
మాత్రమే
ఆశింతును.
బలములేని
మేఘమువలే,
రుచిలేని
ఫలమువలే,
పాలివ్వని
గోవువలే
భక్తిలేని
మనుజుడు
యెంతటి
వాడైననూ
నాకు,
భగవత్
ప్రీతికి,
అతిదూరమైనవాడే.
ఓ
శబరీ!
నవవిధ
భక్తి
మార్గములయందు
యే
ఒక
విధమైన
మార్గము
నవలంబించినను
చాలు.
అయితే,
నీవు
నవవిధమార్గములను
అవలంబించితివి.
ఇక
నీ
కంటే
అధికులు
నాకు
యెవ్వరునూ
కనుపించలేదు.
"హృదయస్థానం
నుండి
వచ్చిన,
ప్రవహించుచున్న,
నీ
నిర్మల,
నిశ్చల,
నిస్వార్థ
ప్రేమ
ప్రవాహమే
నన్ను
అన్ని
విధములా
తృప్తి
పరచెను.
స్వప్నమందైననూ
నీవు
పరులను
దూషించలేదు.
ఇట్టి
స్వచ్ఛ
చిత్తముకంటే
మించిన
చిత్తము
వేరొకటి
లేదు.
మంచికి
పొంగి,
చెడ్డకు
క్రుంగి
కృశించే
చంచల
స్వభావము
నీకు
అతి
దూరము.
నీవు
అన్ని
విధముల
ధన్యురాలవు"
అని
రాముడు
ఉపదేశించిన
వచనములను
శబరి
వింటూ
"రామా,
దైవ
మనస్సునకు
ప్రీతి
గావించుట
కంటే
భక్తునకు
మరొక
మార్గము
లేదు
కదా?
యెవరు
ప్రీతిపడిననూ
పడకపోయిననూ
నీ
ప్రీతిని
బడయుటకంటే
నాకు
వేరు
స్వర్గమెందునూ
లేదు.
7
▾
Meaning
Keep
నాథా!
నీ
మనస్సునకు
తృప్తి
గావించుటకంటే
నాకు
కావలసినది
వేరొకటి
లేదు.
ఈనాటికి
నా
తండ్రి,
నా
పరమాత్మ,
నా
ప్రాణనాథుడు,
జగన్నాథుడు,
లోకనాథుడు,
విశ్వనాథుడు
నాకు
ప్రసన్నుడయ్యె
కదా!
ఓ
జానకీవల్లభా!"
అని
వర్ణించగనే
జానకిని
జ్ఞప్తికి
తెప్పించెను.
అంత
రామలక్ష్మణులు,
"శబరీ!
ఇంతసేపూ
యే
విచారమునూ
లేక
ఆనందములో
మునిగిన
మమ్ము
తిరిగి
విచారమునకు
గొనిపోతివా?"
అని
రాముడు
పలుకగనే,
శబరి
దిగ్గున
తలయెత్తి,
"నాథా!
యేమంటివి?
నా
అపరాధము
క్షమింపు"డని
పాదాలపై
బడెను.
అంత
రాముడు.
"శబరీ!
జానకి
సమాచారము
నీకేమైన
తెలియునా?
ఆమెను
గురించి
నీవేమైననూ
వినియుంటివా?"
అని
అడుగగనే,
"రామా!
జానకిని
యెరుగనా?
రామతత్వమెరిగిన
ప్రతి
స్త్రీ
జానకి
తత్వమెరుగక
వుండదు.
ఆ
మహాసాధ్వీమణి,
వనితారత్నము,
స్త్రీ
జాతి
జ్యోతి.
ఆ
తల్లి
ఎంతటి
అదృష్టవంతురాలో,
ఆమె
రాముని
నీడయే
కదా.
రామా!
మతంగమహర్షి
తెలిపిన
సీతాతత్వమును
మీకు
విన్నవింతును,
మీకు
తెలియనిది
కాదు.
అడిగితిరి
గనుక
విన్నవింతును.
"రాముడు
రాక్షససంహార
నిమిత్తమై
యేదో
ఒక
నెపమును
కల్పించుకొని
మంథరా
కైకలందు
మాయను
ప్రవేశింపజేసి,
సీతాలక్ష్మణులతో
అయోధ్యను
వదలి
అరణ్యములో
ప్రవేశించెననియు,
కొంతకాలము
దండకారణ్యమందలి
ఋషులను
అనుగ్రహించి,
వారి
తపస్సాధనలకు
అడ్డు
తగులు
రాక్షసులను
హతమార్చి,
ఋషి
ఆశ్రమములను
కాపాడుచూ
వుండి,
రాక్షసుడైన
రావణునితో
కొంత
సంబంధము
యేర్పరచుకొనుటకై
కొన్ని
కృత్రిమ
నాటకము
లాడుననియు
ఆ
నాటకములో
రావణుడు
సీతాపహరణము
గావించునటుల
రాముడే
సంకల్పము
చేయుననియూ
రావణుడు
అపహరించిన
సీత
నిజమైన
సీత
కాదనియు,
అయితే
లోకదృష్టికి
ఆమెయే
సీతగా
రూపొందుననియూ,
ఈ
నెపముతో
రాముడు
సీతాన్వేషణ
సలుపుచూ
మన
ఆశ్రమము
ప్రవేశించుననియూ
అప్పుడు
నీకు
మహాభాగ్యము
చేకూరుననియూ
తెలిపెను.
అంతియేకాక,
మన
ఆశ్రమమును
వీడి,
మన
ఆశ్రమమునకు
సమీపముననున్న
ఋష్యమూక
పర్వతముపై
అన్నతో
ద్వేషము
చేసుకొని
అరణ్యవాసము
గావించుచున్న
8
▾
Meaning
Keep
సుగ్రీవునితో
స్నేహముగావించుకొని
అతని
ద్వారా
సీతాన్వేషణ,
సలిపి,
రావణసంహారము
జరుపుననియూ
తెలిపెను.
లీలానాటక
సూత్రధారివైన
నీ
చర్యలను
వారానాడే
తెలిపిరి.
నీ
నటన
లోకనటన,
నీ
సంకల్పము
లోకకల్యాణము.
అంతా
నీ
సంకల్పమే
తప్ప
వేరు
కాదు.
నీ
సంకల్పము
లేక
యే
చిన్న
కార్యము
కూడా
జరుగదు.
నాథా!
యేమీ
తెలియనివానివలే
నటించుచూ,
సీత
నిమిత్తమై
విచారించునటుల
నటన
చేయుట
పామరులు,
నాస్తికులు
సామాన్య
దృష్టితో
చూతురేమోకానీ,
దైవత్వమును
తెలుసుకొన్నవారు,
ఆత్మవిశ్వాసముగల
సాధకులు,
భక్తులు
నీ
నటనలను
నమ్మరు.
సర్వమునకూ
నీవే
కర్తవు.
నీ
సంకల్పమునకు
విరుద్ధముగా
నడుచుటకు
యెట్టి
వారికీ
చేతకాదు.
మంచియైననూ
చెడు
అయినను
వారిలోని
భావములు
కూడ
ఆయా
సమయములకు
తగినరీతిగా
నీవే
సంకల్పింతువు
కానీ,
వారు
ఏ
మాత్రమూ
కర్తలు
కారు.
అజ్ఞానులు
కొందరు
మేము
మా
పనులకు
కర్తలమని
భావింతురు,
అదే
అజ్ఞానము.
"రామా,
నా
అతిభాషణను
క్షమించి
నన్ను
అనుగ్రహింపుము"
అని
పాదములపై
బడెను.
అంతలో
యోగాగ్ని
ఆమె
దేహమును
భస్మము
గావింప,
ప్రాణము
రాముని
పాదములో
చేరెను.
Previous
←
The Illusory Deer
Next
Friendship with Sugrīva
→