Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · Friendship with Sugrīva
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
5
సుగ్రీవ
సఖ్యము
రామలక్ష్మణులు
శబరికి
మోక్షము
ననుగ్రహించి
మాతంగ
ఆశ్రమమును
వీడి
శబరి
భక్తి
ప్రపత్తులను
దీర్ఘవిశ్వాసమును
వర్ణించుకొంటూ
సింహముల
జతవలె
అరణ్యమార్గముల
ప్రయాణము
సలిపిరి.
ఆ
విధముగ
ప్రయాణము
సాగించి
ఋష్యమూక
పర్వతమును
సమీపించిరి.
ఆ
పర్వతముపై
మంత్రులతో
కలిసి
సుగ్రీవుడు
నివసించుచుండెను.
మహాబలసంపన్నులైన
సద్వంశసార్వభౌములైన
ఈ
ఇరువురు
అన్నదమ్ములు
అటువైపున
నడచుచున్న
దివ్యభావమును
సుగ్రీవుడు
పర్వతముపైనుండి
చూచెను.
తన
అన్న
అయిన
వాలి
భయముచే
సుగ్రీవుడు
నిరంతరము
ఎవరు
వత్తురో
ఎవరిని
పంపునో
అన్న
దిగులుచే
నిరంతరము
దారులు
కనిపెట్టుకోవటం
జరుగుతూ
వుండెడిది.
వీరి
నడక,
వీరి
తేజస్సును
చూచి
సుగ్రీవుడు
భయపడి,
హనుమంతుని
పిలచి,
"వీరుడా!
ఆ
మహావీరపురుషుల
చూచితివా?
నీవు
ఆలసించక
త్వరితముగా
వెళ్ళి
వారి
వృత్తాంతమును
తెలిసికొని
రమ్ము.
ఒకవేళ
వారు
వాలిచే
పంపబడినవారయి
వుండిన
నీవు
ముఖమును
వంచుకొనుము.
దానిని
బట్టి
నేను
గ్రహింతును.
తత్క్షణమే
పర్వతమును
వీడ
ప్రయత్నింతును"
అని
అనేక
గుర్తులు
తెలిపెను.
హనుమంతుడు
గంతులు
వేయుచు,
పర్వతము
దిశకు
నడచుచున్న
ఆ
మహాతేజోవంతులగు
రామలక్ష్మణుల
యెదుట
నిలిచి
వారికి
నమస్కరించి,
"ఓ
తేజోరాశి
కుమారులారా!
మీరెవరు?
మీ
రూపములు
మహారమణీయముగా
వున్నవి.
సుకుమారులుగా
కనుపించుచున్నారు.
మీరు
మానవమాత్రులుగా
లేరు.
కేవలము
సాక్షాత్
నరనారాయణులు
దిగివచ్చినటులున్నది.
ఈ
భయంకరారణ్యమున
వంటరిగా
తిరుగుటలోని
మీ
భావమును
తెలుపుదురా?"
అని
వినయముగా,
గౌరవముగా
వారిని
ప్రశ్నలు
వేయ
మొదలు
పెట్టెను.
ఇతని
వినయ
విధేయతలను
గ్రహించి
2
▾
Meaning
Keep
రామచంద్రుడు
చిరునవ్వు
నవ్వి,
"మారుతీ!
వీరా!
మేము
అయోధ్యపతియగు
దశరథ
మహారాజునకు
పుత్రులము.
పితృవాక్య
పరిపాలన
నిమిత్తమై
మేము
అరణ్యమున
ప్రవేశించితిమి.
ఇతడు
నా
తమ్ముడు.
ఇతనిని
లక్ష్మణుడనియూ,
నన్ను
శ్రీరాముడనియూ
పిలుతురు.
మాతో
నా
ధర్మపత్ని
కూడను
వచ్చెను.
విధివశాత్తు
మేము
చిత్రకూట
పర్వతముపై
నివసించుచున్న
సమయమున,
మేము
పర్ణశాలలో
లేని
సమయమును
చూచుకొని
యెవడో
రాక్షసుడు
ఆ
ఇల్లాలును
అపహరించెను.
ఇపుడు
ఆమెను
వెతుకుచూ
మేమిటు
తిరుగుచున్నాము"
అని
ఉన్నది
ఉన్నట్లు
రాముడు
తన
రాకకు
కారణమును
తెలిపెను.
రామచంద్రుడు
"ఓ
వీరహనుమా!
మా
పూర్వోత్తరముల
చెప్పితిమి.
నీ
పూర్వోత్తర
విషయము
మేము
వినగోరుచున్నా"మనగా
హనుమంతుడు
వీరి
వృత్తాంతమును
తెలిసికొని,
వీరు
తన
ప్రభువులని
గ్రహించి,
వారి
పాదములపైబడి
నమస్కరించి,
లేచి,
భరించలేని
ఆనందముతో
నేత్రముల
నుండి
భాష్పముల
వీడుచు,
చేతులు
జోడించుకొనగా,
నోటమాట
రాలేకపోయినది.
తుదకు
ధైర్యమును
తెచ్చుకొని,
"ఓ
నాథా!
నేను
ఒక
బుద్ధిహీనుడను,
జ్ఞాన
హీనుడను
అగుటచే
మిమ్ముల
నట్లు
ప్రశ్నించితిని.
నా
అపరాధములను
క్షమించుడు.
ఓ
రాజాధిరాజా!
సాధారణ
మనుజుల
వలె
మీరు
నా
పూర్వోత్తరములను
ప్రశ్నించుట
ధర్మమా?
నేను
మీ
మాయకు
బద్ధుడ
నగుటచేత
మిమ్ములను
గుర్తించలేక
పోతిని.
ఓ
ప్రభూ!
నా
ప్రభువులు
సమర్థులు,
ఎన్నడయినా
సేవకుడు
స్వామికంటే
అధికుడగునా?
నాథా!
సకల
జీవులు
మాయచే
మోహితులగుదురు.
నేనొక
మాట
చెప్పనెంచితిని.
దానికి
నా
నాథుడు
ప్రమాణము.
నేను
నా
నాథుని
భజించటముతప్ప
అన్యమెరుగను.
నాథుని
బలము
చూచుకొనే
సేవకుడు
ప్రవర్తించును.
పోషించుటకు,
శిక్షించుటకు
ప్రభువు
నిలిచియుండ
సేవకునికి
భయమెందుకు?"
అని
తన
నిజస్వరూపమును
ధరించెను.
ఆ
రూపమును
రాముడుచూచి
పరమానందముతో
కౌగలించుకుని,
"హనుమంతా!
నీవు
లక్ష్మణునితోపాటు
ప్రధానప్రియుడవు,
అని
అతనిని
చెంతకు
లాగుకొనెను.
శిరస్సును
వీపును
నిమురుచూ
"ఓ
హనుమంతా!
అన్యగతి
నెరుంగక
నన్ను
సేవించు
సేవకులే
నా
కధిక
ప్రియులు".
అని
రాముడు
తెలిపిన
క్షణమే,
"ఓ
నాథా!
సుగ్రీవుడు
వానరులకు
రాజు.
అతడు
అనేక
కారణాల
చేత
అన్న
అయిన
వాలితో
విరోధము
3
▾
Meaning
Keep
కలిగి,
రాజ్యము
నుండి
తరమబడుటచేత
అతడు
ఈ
పర్వతమునందు
నివసించుచున్నాడు.
అతడు
కూడా
తమ
దాసుడే.
అతడు
మీ
స్నేహమునకు
తగినవాడు.
మీరు
వానరరాజున
కభయమిచ్చి
అతని
దైన్యమును
పోగొట్టుడు.
అతను
సీతాన్వేషణ
నిమిత్తము
కోట్ల
కొలది
వానరులను
నలుదిశలకు
పంపి,
తగిన
విజయమును
సాధించగల
సమర్ధుడు"
అని
సుగ్రీవుని
అనేక
రాజనీతులను
గుణగణములను
వివరించెను.
సుగ్రీవునితో
స్నేహము
చేయు
నిమిత్తమై
శ్రీ
రామలక్ష్మణులను
హనుమంతుడు
తన
భుజములపై
నెక్కించుకొని
క్షణములో
పర్వతముపైకి
యెగసెను.
రామలక్ష్మణులను
దర్శించిన
మాత్రముననే
కృతార్ధుడనయితినని
సుగ్రీవుడు
చాలా
ఆనందించెను.
వీరి
వృత్తాంతము
వారునూ,
వారి
వృత్తాంతమును
వీరును
వివరముగా
అర్థము
చేసుకొనిరి.
ఆదరించుకొనిరి.
అన్యోన్యమయిన
సంబంధమును
కల్పించుకొని,
సుగ్రీవుడు
రామలక్ష్మణుల
పాదాలకు
నమస్కరించి,
సత్కరించెను.
సుగ్రీవుని
పరిస్థితిని,
నీతిని
పురస్కరించుకొని
చక్కగా
అర్థము
చేసుకొని
రాముడు
సుగ్రీవునికి
అభయము
నిచ్చెను.
సుగ్రీవుడు
కూడా,
రామసేవలో
తన
ప్రాణమునైననూ
అర్పితము
గావింతునని
వాగ్దానము
చేసెను.
ఈ
ప్రకారము
వారిరువురూ
అగ్నిసాక్షిగా
స్నేహమును
గట్టుకొనిరి.
అగ్ని
సకల
జీవుల
హృదయములలో
నుండును.
మనోవికారములు
పుట్టినయెడల
వానిని
దహించును.
రామాయణమున
కగ్ని
ప్రధానము.
అగ్నిహోత్రుని
ప్రసాదముతో
రాముడు
పుట్టెను.
అగ్నిసాక్షిగా
సీతను
పెండ్లాడెను.
అగ్నియే
లంకను
దహించెను.
అగ్నియందే
సీతశక్తి
దాచబడెను.
అగ్నియందే
సీతను
వాపసు
తీసుకొనెను.
అగ్నియందు
పరిశుద్ధమయిన
స్వర్ణము
వలె
అగ్నిద్వారా
రాముని
హృదయము
పరిశుద్ధమయినదన్న
సూచన.
జ్ఞానమే
రాముడు,
ధర్మమే
రాముడు.
ఆ
కారణములచే
సుగ్రీవునితో
అగ్నిసాక్షిగా
స్నేహము
చేసుకొనెను.
అప్పుడప్పుడు
లక్ష్మణుడు
రాముని
వృత్తాంతమును
సుగ్రీవునకు
తెలుపుతూ
వుండెడివాడు.
'సీత
మిథిలాధిపతి
కూతురు.
మధింపబడిన
వంశమగుటచే
దానికి
మిథిలవంశమని
సార్ధక
నామము.
కనుక
ఆమె
విశేషమయిన
మథనము
జరిగిన
కానీ
లభించదు'
అని
లక్ష్మణుడు
సుగ్రీవునకు
సీతయొక్క
వృత్తాంతమును
కూడా
విపులముగా
తెలిపెను.
అది
విని
సుగ్రీవుడు
కంటిధారలు
కార్చుచూ,
"ఓ
నాథా!
4
▾
Meaning
Keep
ఒకనాటి
దినము
నేను
మంత్రులతో
కూడి
ఆలోచనలు
జరుపుచుండగా
ఆకాశమార్గమున
పుష్పక
విమానము
వెళ్ళెను.
అందునుండి
రామా,
రామా
అను
పలుకులు
వినిపించెను.
మేము
ఆ
వింత
చూచుచుండ
ఆమె
వస్త్రమున
ఆభరణములు
కట్టి
ఈ
పర్వతముపై
చూచుచున్న
మా
వైపునకు
ఆ
మూటను
విసిరినది.
అది
యేదో
ఆభరణముల
మూటగుటచేత,
భద్రముగా
దాచితిమి.
బహుశః
రావణుడే
ఆమెను
గొనిపోయెను.
ఆ
దుర్మార్గుడు
చేయనిది
ఒక్కటీ
లేదు"
అని
సుగ్రీవుడు
రావణుని
పైపండ్లు
పటపట
కొరికెను.
అప్పుడు
రాముడు
"సుగ్రీవా!
యేదీ
ఆ
ఆభరణముల
మూటను
తెప్పించుము"
అని
ఆజ్ఞాపించెను.
సుగ్రీవుడు
స్వయముగ
లేచి
గుహలో
దాచిన
ఆ
మూటను
తెచ్చి
రాముని
ముందు
పెట్టెను.
ఆ
మూట
కట్టిన
వస్త్రము
వనవాసమునకు
బయలుదేరినప్పుడు
పినతల్లి
ఆమెపై
విసరిన
నార
వస్త్రము.
దానిని
గుర్తించిన
తత్క్షణమే
లక్ష్మణుడు
కంటి
ధారలు
కార్చెను.
అతనిని
చూచి
సుగ్రీవ
హనుమంతాదులు
విచారించిరి.
రాముడు
ఆ
మూటను
విప్పి
చూచి
ఆ
ఆభరణములు
సీతవేనా
అని
లక్ష్మణునకు
చూపెను.
లక్ష్మణుడు
యేనాడూ
సీత
ఆభరణమును
తాను
కన్నెత్తి
చూచినవాడు
కాడు.
కనుక
అన్ని
నగలు
సీతవవునో
కాదో
తనకు
తెలియదని,
ఒక్క
కాలి
అందెలు
మాత్రము
ఏరి
"అన్నా,
ఇవి
తల్లియొక్క
అందెలే.
నాకు
సందియము
లేదు.
నిత్యము
తెల్లవారి,
వారి
పాదములకు
నమస్కరించు
సమయముననూ
వనవాసములో
ముందు
మీరూ,
మీ
వెనక
సీత
నడుచుచున్న
సమయమున
నేను
వెనుక
నడచుచూ
ఆమె
పాదములనే
చూచుచూ
ఆమె
పాదములనే
అనుసరించుచుంటిని
కనుక
వీటిని
బాగా
గుర్తించగలిగితిని"
అని
అన్నాడు.
కొంత
సేపు
సీతను
స్మరించుచూ,
రామలక్ష్మణులు
విచారించునటుల
నటన
చేయుట
చూసి
సుగ్రీవుడు,
హనుమంతుడు
వారిని
వోదార్చిరి.
సుగ్రీవుడు
వారి
విచారమును
చూడలేక,
"నాథా!
విచారించకుడు.
నేటి
నుండియే
తగిన
ఉపాయములు
పన్ని
సీత
జాడలు
తెలిసికొని
క్షణములో
రావణుని
హతమార్చి,
సీతను
తమ
కప్పజెప్పుదును.
ఇది
నా
ప్రతిజ్ఞ"
అని
రామునకు
వాగ్దానము
చేసెను.
సుగ్రీవుడు
చేసిన
వాగ్దానమునకు
రాముడు
సంతసించి,
"ఓ
సఖుడా!
నీవు
5
▾
Meaning
Keep
ఈ
అడవిలో
నివసించుటకు
కారణము
విపులముగా
తెలుపు"మని
కోరగా,
సుగ్రీవుడు
తన
తల్లిదండ్రులెవరో,
తన
నివాసమేదో,
తన
అన్నకూ
తనకూ
విరోధము
కలుగుటకు
కారణమేమో,
అన్నియూ
పూసగ్రుచ్చినటుల
తెలిపెను.
అతని
చరిత్రనంతనూ
విని
రాముడు
ఇంచుమించు
తన
చరిత్రకు
సమీపముగనే
యున్నదని
తలంచి,
భార్య
వియోగమునందును,
రాజ్యభ్రష్టులగుట
యందును
ఇరువురూ
ఒక్కటేననియూ,
అందునా
సుగ్రీవుని
మాటలనుబట్టి
అతను
నీతినిజాయితీలు
గలవాడని
గుర్తించి,
తమ్ముని
భార్యను
అన్న
అపహరించటము
కోతి
జాతికి
విరుద్ధమని
ఇట్టి
ధర్మవిరుద్ధమయిన
మార్గమును
అవలంబించుచున్న
వాలి
శిక్షార్హుడని
గుర్తించెను.
అంత
రాముడు
మీ
జన్మ
వృత్తాంతమును
వినగోరుచున్నానని
తెలిపెను.
సుగ్రీవుడు,
"నాథా!
నా
వంశముయొక్క
పూర్వోత్తరమంతయూ
తమ
పాదముల
చెంత
ఉంచగోరుచున్నాను,
ఆలకింపుడు"
అని
యిట్లు
చెప్పెను
:
"ఒకనాడు
సృష్టికర్త
ఒక
చిన్న
కోతి
రూపమును
సృష్టించెను.
అతను
మహాబలవంతుడు.
కానీ,
చంచలస్వభావుడగుటచేత
తనకు
సమానుడయినప్పటికినీ
చంచలుడగుటచే
అతనికి
'ఋక్షరాజు'
అని
పేరు
పెట్టెను.
ఆ
వానరుడు
బ్రహ్మకు
నమస్కరించి
'స్వామీ!
తమ
ఆజ్ఞయే'
మని
ప్రార్థించెను.
అప్పుడు
బ్రహ్మ
'వానరా
నీవు
అడవిలో
స్వేచ్ఛాసంచారము
గావించుము.
ఫలములు
స్వేచ్ఛగా
భుజింపుము.
నీ
చేతికి
చిక్కిన
రాక్షసులను
సంహరింపు'
మనెను.
అపుడు
ఋక్షరాజు
దక్షిణదిశకు
బయలుదేరి
వెళ్ళెను.
ఒకనాడు
ఆ
వానరుడు
వనములో
సంచరించుచుండి
ఒక
కొలనులో
నీరు
త్రాగుటకై
వెళ్ళెను.
ఆ
కొలనులో
నీటియందు
తన
ప్రతిబింబమును
చూచి,
ఆ
జలములో
ఎవరో
ఒక
శత్రువు
దాగినాడని
భావించి
విచారింప
దొడంగెను.
ఆ
క్రోధమును
భరించలేక
నిరంతరమూ
ఆ
గుండము
చుట్టూ
తిరుగుచూ
వుండెను.
అతడు
చేసెడి
పన్నులనియు
జలములో
ప్రతిఫలించు
చుండెను.
అతడు
వెంటనే
పెద్దగా
గర్జించెను.
అంత
నీటిలోని
ప్రతిబింబము
కూడా
పెద్దగా
గర్జించెను.
ఇక
పట్టలేక
వానరుడు
గుండములోనికి
కుప్పించెను.
ఆ
క్షణమే
తాను
స్త్రీగా
మారిపోయెను.
ఆమె
గట్టునకు
వచ్చి
'దైవమా!
యేమి
ఈ
విచిత్రము'
అని
సూర్యునివైపునకు
తిరిగి
ప్రార్థించుచూ,
ఇంద్రుని
మనసార
స్మరించుచుండ,
ఇంద్రవరప్రసాదముచే
ఒక
కొమారుడును,
సూర్యుని
వరప్రసాదముచే
ఒక
పుత్రుడునూ
కలిగిరి.
ఇంద్రుని
ప్రసాదమైన
బిడ్డకు
6
▾
Meaning
Keep
వాలి
అనియు,
సూర్య
వరప్రసాదమైన
బిడ్డకు
సుగ్రీవుడనియు
వారికి
నామము
లేర్పడెను.
"ఈ
ఇరువురు
పుట్టిన
తత్క్షణమే
స్త్రీ
రూపము
వీడి
ఋక్షరాజయ్యెను.
అతను
ఈ
బిడ్డలను
వెంటబెట్టుకొని
బ్రహ్మను
ప్రార్థించెను.
బ్రహ్మకు
తన
చరిత్ర
నంతయూ
చెప్పుకొనుచూ
స్మరించెను.
అంత,
'ఓయీ!
వాలి
సుగ్రీవులారా!
మీరన్నదమ్ములిరువురూ
దక్షిణదిశకు
పొండు,
మీరు
కిష్కింధానగరములో
నివసింపుడు.
చరాచరజగన్నాథుడు,
అనేక
నాముడయిన
శ్రీరాముడు
రఘువంశమున
దశరథమహారాజుకు
జన్మించి,
తండ్రి
ఆజ్ఞ
ననుసరించి
వనమునకు
వచ్చి
అనేక
అమానుషచర్యలను,
కేవల
మానవుని
వలె
లీలల
సలుపుచూ
తిరుగుచూ,
మీరున్న
కిష్కింధకు
చేరును.
అపుడు
అతనితో
స్నేహమేర్పడి
అతని
దర్శన
స్పర్శన
సంభాషణాదులతో
మీ
జన్మ
సార్థకంబౌను'
అని
చెప్పెను.
"రామచంద్రా!
బ్రహ్మ
అశరీరవాక్కులను
మేము
ఇరువరుము
విని,
సంతసించితిమి.
మేము
జపతపయజ్ఞయాగాది
కర్మల
నేవియూ
చేయలేదు.
వారి
అనుగ్రహ
ప్రభావమే
మా
సర్వశక్తి
సామర్ధ్యములు.
మా
మనస్సులందు
ఆ
శబ్దబ్రహ్మకు
నమస్కరించి
కిష్కింధకు
చేరితిమి.
ఆ
అడవిలోని
రాక్షసులను
సంహరించితిమి.
ఒకనాడు
మయుడను
రాక్షసునకు
మాయావి,
దుందుభి
అను
కుమారులిరువురు
కలిగిరి.
వారు
మహారణవీరులు.
వారిలో
మాయావి
మహాయుద్ధము
చేయుటకు
మమ్ములను
సమీపించెను.
నిశిరాత్రి
సమయమున
మా
నివాస
సమీపమునకు
వచ్చిబొబ్బ
పెట్టెను.
శత్రువు
పొగరుపోతుతనమును
మా
అన్న
అయిన
వాలి
సహించెడివాడు
కాదు.
ఆ
క్షణమే
లేచి
వాలి
వాని
వద్దకు
వచ్చెను.
అపుడు
వాడు
వాలిని
చూచి
పారిపోయెను.
వాలి
తన
బలముతో
వానిని
వెంబడించెను.
అంత
వాడు
పారిపోయి
ఒక
గవిలో
ప్రవేశించెను.
"నేను
కూడాను
అన్న
అయిన
వాలి
వెంట
వెళ్ళితిని.
వాలి
నన్ను
పిలిచి
'తమ్ముడా!
నేను
వానిని
హతమార్చుటకై
యిందులో
ప్రవేశింతును.
వాడు
తిరిగి
వెనుకకు
రాకుండటకై
నీవు
ద్వారము
దగ్గర
కాచియుండుము'
అని
చెప్పెను.
యెంత
కాలమని
నేను
ప్రశ్నింపగ,
పదునైదు
దినములైననూ
సరే,
నీవు
ఉండుము.
ఒకవేళ
7
▾
Meaning
Keep
పదునారవ
దినమునకు
నేను
రాని
పక్షమున
వాడు
నన్ను
సంహరించెనని
తలంచి
వెనుకకు
మరలుము'
అని
చెప్పి
మా
అన్న
గవిలో
ప్రవేశించెను.
అయితే,
నేను
ముప్పది
దినములు
నిలిచియుంటిని.
అంత
ఆ
గుహనుండి
రక్తపు
వాసన
వచ్చెను.
ఆ
వాసన
నా
అన్న
అయిన
వాలి
వాసనని
నేను
కనిపెట్టితిని.
ఇక
వుండి
లాభము
లేదని
నేను
ఆ
రాక్షసి
తిరిగిబైటకు
రాకుండుటకై
ఒక
పెద్ద
గుండును
ఆ
ద్వారమునకు
అడ్డుపెట్టి,
విచారించుచూ
నా
నివాసమునకు
చేరి,
అక్కడనుండి
నేను
నా
సహచరులతో
అన్నయొక్క
వృత్తాంతము
తెలుపుచూ
విచారించుచూ,
వాలి
మహాబలశాలి
మాయావి
రాక్షసిచే
చంపబడిన,
ఆ
మాయావి
నన్ను
లెక్కచేయునా
అని
నా
ప్రాణము
యే
క్షణములో
తీయునో
అని
అదురు
బెదురులతో
కాలము
గడుపుచుంటిని.
పురవాసులు
సహితము
భయభ్రాంతికి
గురియైరి.
అంత
వారందరూ
చేరి
మా
కెవరికైనా
నాయకుడుండవలెను
కదా,
తమ
అన్నగారైన
వాలి
మరణించెను
కనుక
ఆ
స్థానమున
తమరే
నిలిచి
మమ్ము
రక్షించుడని
కోరిరి.
నాకట్టి
నాయకత్వముపై
యిష్టము
లేకపోయెను.
అయిననూ
ప్రజలు
బలవంతపరచి
నన్ను
నాయకునిగా
నియమించిరి.
ఇది
జరిగిన
రెండుమూడు
దినములకే
అన్న
అయిన
వాలి
మాయావిని
సంహరించి
విజయవంతుడై
నగరమున
ప్రవేశించెను.
"నేను
నాయకుడగుటతో
వాలి
భరించలేనంతటి
క్రోధమును
పూని,
నేను
తనను
హతమార్చి
నాయకత్వమును
చేపట్టవలెనను
ఉద్దేశముతో
గుహకు
పెద్ద
గుండును
అడ్డుపెట్టి
వచ్చినటుల
భావించి
ఆనాటినుండి
నాపై
ఒక
విధమైన
వైరమును
బూనెను.
నన్ను
శత్రువుగా
భావించి,
ప్రతి
చిన్న
విషయమునందును
నన్ను
హీనాతిహీనునివలె
అవమానపరచుచూ
వచ్చెను.
నా
సర్వాధికారములు
తీసుకొని,
నన్నొక
పనిమనిషివలె
కూడా
తలంచక
ఆ
భవనమునుండి
వెలుపలకు
పంపెను.
నా
భార్యను
తన
స్వాధీనము
చేసుకొనెను.
"ఈ
విధముగ
జరుగుచుండ
ఒకనాడు,
నన్ను
చంపివేయవలెనని
ప్రతిజ్ఞపూని
నాతో
పోరాడెను.
అతని
బలమునకు
నే
తాళలేక
పోవుటచే
కిష్కింధ
వదలి
రావలసి
వచ్చెను.
కొందరు
నా
అభిమానులు
నా
బాధలు
చూచి
నాకు
కొంత
సహాయము
చేయుచున్న
మంత్రులను,
నా
అనుచరులను
కిష్కింధలో
వుండరాదని
కఠినముగా
శాసించెను.
అందువలన
వారు
కూడా
నాతో
కిష్కింధ
వదలి
వచ్చిరి.
నా
భార్య
8
▾
Meaning
Keep
నాతో
రావాలని
యెన్నియో
ప్రయత్నములు
చేసిననూ,
ఆమెను
హింసించి
తన
భార్యగా
స్వీకరించి
అందు
వుంచుకొనెను"
అని
సుగ్రీవుడు
చెప్పుతూ
కంటి
ధారలు
కార్చుచుండ,
శ్రీ
రాముడు
ఓదార్చి
మరొకతూరి
వాగ్దానము
చేసి
రక్షింతునని
చెప్పెను
"చేయునదిలేక
నేను
ఈ
పర్వతమున
నివసించుచున్నాను.
ముని
శాపముచేత
వాలి
ఈ
పర్వతమునకు
రాలేనందున
మేము
ఇక్కడైననూ
యింతటి
ధైర్యముగా
జీవించగలుగుచున్నాము.
లేకున్న
ఈ
పాటికి
అతని
చేతులలో
చచ్చియుండెడి
వారము"
అని
సుగ్రీవుడు
పలుకగనే,
అతని
వచనములు
రాముడు
విని,
"సఖుడా!
శాపమునకు
కారణమేమి?"
అని
యడగ,
"ఓ
నాథా!
మాయావి
సోదరుడైన
దుందుభి
మహాశూరుడు,
వానితో
సమానముగా
బలవంతుడు
మరొకడు
లేకపోయెను.
వాని
బలమును
వాడు
పరీక్షించుకొనుటకై
పర్వతములతో,
సముద్రములతో
పోరాడెడివాడు.
ఒకనాడు
పర్వతములతో
నాకంటే
బలశాలి
లోకముననే
లేడని
గర్వించుచుండ,
అశరీరవాణి,
'దుందుభీ!
నీవట్లు
విఱ్ఱవీగకుము,
నీకంటే
బలవంతుడొకడు
కలడు.
అతడు
పంపా
సరోవరమున
వాలి
అను
నామముతో
నాయకత్వమును
పూని
స్వేచ్ఛా
విహారమును
సలుపుచున్నాడు'
అని
చెప్పెను.
ఆ
మాట
వినుటతోడనే
వాడు
కిష్కింధను
ప్రవేశించి
మహిషరూపమును
ధరించి
గర్జించుచు
డెక్కలతో
భూమిని
చీల్చుచు,
తొణకు
బెణుకులు
లేక
ఢీమని
వచ్చెను.
వాడు
భూమిని
మర్దించుటచే
వృక్షములు
విరిగి
నేల
కూలుచుండెను.
వాని
సింహనాదము
హృదయములను
కదిలించుచుండెను.
ఈ
విధముగా
ఆర్భాటము
చేయుచుండ,
చంద్రుని
పట్టుటకు
రాహువు
వేంచేసినటుల,
వాలి
ప్రవేశించి
వానిపై
పడెను.
వారి
వికృతరూపములు
చూచువారలకు
రెండు
మదపుటేనుగులవలె
కనిపించెను.
వారు
మల్లయుద్ధము
ప్రారంభించిరి.
నాలుగు
యామములు
పోరాడిరి.
తుదకు
వాలి
రాక్షసుని
పొడిచిచంపెను.
ఆ
వేటుతో
వాడు
గిరగిర
తిరిగి
పర్వతమువలె
నేలకూలెను.
"వాని
కళేబరము
నేల
కూలగనే
కొన్ని
వృక్షములు
దానిక్రింద
విరిగిపడెను.
వాని
కళేబరమును
వాలి
రెండు
ప్రక్కలుచేసి
దక్షిణోత్తరములకు
ఒక్కొక్క
దానిని
విసిరెను.
అట్లు
వాని
కళేబర
భాగములను
పారవేయుటచే
ఒక
భాగము
మునీశ్వరుని
ఆశ్రమములో
పోయిపడెను.
ఆశ్రమమంతయూ
వాని
రక్తబిందువులు
చిమ్మెను.
జపతపాదులు
గావించుకొను
ఆశ్రమవాసుల
దేహములయందు
దుందుభి
9
▾
Meaning
Keep
రక్తబిందువులు
పడుటచేత,
మతంగ
మహర్షి
స్నానమాచరించి
వచ్చి
చూచుసరికి,
ఆశ్రమమునందెందు
చూచినా
రక్తబిందువులే
కనపడెను.
ఒక
మహాభయంకరమైన
దేహములోని
అర్ధభాగము
ఆవరణలో
పడియుండుట
మతంగఋషి
సహించుకోలేక
పోయెను.
తన
శిష్యులు
ఆనందములో
మునుగవలసిన
వారు
రక్తములో
మునిగి
మహా
అసహ్యముగా
చాలా
బాధపడుచుండుట
చూచి
మరింత
సహించుకోలేక
పోయెను.
ఈ
విధమైన
పాపకార్యమునకు
పూనుకొన్న
వారెవరో
అని
కొంత
విచారించి,
పట్టలేని
కోపముతో
ముందూ
వెనుక
విచారించక,
ఆలోచించక
'ఇక
ఆ
పాపాత్ముడైన
వాలి
ఈ
పర్వతమును
ప్రవేశించిననూ
ఈ
పర్వతము
వైపు
చూచినను
శిరస్సు
రెండు
ముక్కలయి
పోవుగాక!"
అని
ఆ
మహర్షి
శపించెను.
"ముని
శాపమునకు
భయపడి
వాలి
ఈ
పర్వతము
దిశకే
రాడు.
ఆ
ధైర్యముచే
నేను
ఈ
పర్వతమున
నిర్భయుడనై
భార్యావియోగముతో
బంధువియోగముతో
చింతించుచూ
కాలము
గడుపుచున్నా"నని
సుగ్రీవుడు
తన
వృత్తాంతము
నంతయూ
రామునకు
విన్నవించెను.
అంత
రాముడు
వాలి
చేసిన,
చేయుచున్న
పాపములను
సహించుకోలేకపోయెను.
ధర్మవిరుద్ధమైన
కార్యములు
శ్రీరాముడు
చూడలేకపోయెను,
వినలేకపోయెను.
కేవలము
పశుబలము
ఆధారముగా
తీసుకొని
ధర్మబలమును
దైవబలమునూ
విస్మరించి
ప్రవర్తించే
వాలి
గతిని
చూతునని
సుగ్రీవునికి
ధైర్యము
చెప్పి,
పదునాలుగు
లోకములు
అడ్డువచ్చిననూ
తన
ప్రతిజ్ఞ
నిలబెట్టుతాననియూ,
ఒక్క
బాణముతో
వాలిని
నేల
కూలదోతుననియూ
శపథము
చేసెను.
మిత్రుని
దుఃఖమును,
శత్రువు
అసందర్భ
ప్రలాప
ప్రవృత్తులను
చూచి
సహించుకొనువాని
ముఖము
చూడరాదు.
తాత్కాలిక
అనుకూలములను
నెరవేర్చుకొనుటకు,
అభీష్టములను
తీర్చుకొనుటకు,
పెడమార్గముల
పడత్రోయుటకు,
ప్రయత్నించువానిని
మిత్రునిగా
యెన్నుకొనుట
సరియైనది
కాదు.
పరస్పరానురాగముండవలెను.
హృదయమునగానీ,
మనసున
గానీ,
వాక్కునగానీ,
కడకు
ముఖములో
కానీ
ప్రేమలేనివాడు
కుమిత్రుడని
గ్రహించవలెను.
అట్టివారి
హృదయము
కపటము,
మలినము.
మూర్ఖసేవకుడు,
లోభియగు
రాజు,
అపవిత్రుడు,
అపవిత్రురాలగు
భార్య,
లేక
భర్త,
కపట
మిత్రుడు-
ఈ
నల్వురూ
10
▾
Meaning
Keep
శూలముల
వంటి
వారు.
ఓ
సఖుడా!
సుగ్రీవా!
నీవు
విచారించకుము.
నా
యధాశక్తి
మనోవాక్కాయములతో
నీకు
సహాయము
చేయగలను.
వాలి
యెంతటి
బలశాలియయిన
నేమి?
నా
బలము
నీవెరుగవు,
కనుక,
వాని
బలమునే
నీవు
తలంచుచూ
కొంత
సందేహింతువేమో!
ప్రప్రథమమున
నా
బలమును
కూడా
నీవు
పరీక్షించ
గోరుదువేని,
నీ
మనోబలమును
పొందగోరుదువేని,
నీవు
యేమి
కోరెదవో
కోరుకొమ్ము.
అందులో
నా
బలము
ప్రకటింతును.
నీకు
ధైర్యసాహసముల
నందింతును.
వాలితో
పోరాటమునకు
పూనుకొందును"
అని
రాముడు
సుగ్రీవుని
వీపు
నిమురుచు,
ధైర్యమును
అందించుచూ
పలుకుచున్న
పలుకులు,
సుగ్రీవుని
యెంతో
తృప్తిపరచెను.
అంత
సుగ్రీవుడు
తన
ధైర్యమునిమిత్తము
శ్రీరాముని
శక్తిని
చూడగోరి,
"రామచంద్రా!
ఒకానొక
సమయమున
నేను,
మా
అన్న
పరిహాస
నిమిత్తమై
బలాబలములు
పరీక్షింపగోరి
సప్తతాళముల
నొక్క
బాణముతో
వరుసగా
పడత్రోయుటకు
పూనుకొంటిమి.
చంద్రమండలాకారముగా
నున్న
ఆ
తాళములను
నేను
మూడు
మాత్రమే
కూలద్రోయగలిగితిని.
వాలి
పంచతాళములు
ఒక్క
బాణముతో
కూలద్రోసెను.
అతని
బలము
అంతటిది.
దానికి
మించియుండిననే
ఆ
బలశాలిని
కూలద్రోయ
వీలగు"నని
చెప్పి,
రాముడు
యెన్ని
తాళములను
కూలద్రోయునో
చూడగోరుచున్నానని
ప్రార్థించెను.
సప్త
తాళములు
ఒక్క
వరుసనున్నవాటి
చెంతకు
గొంపోయి,
రామచంద్రుని
వాటిని
కూలద్రోయుమని
కోరగా;
ఈ
తాళములు
వాలి
కూలద్రోసిన
వాటికంటే
ఒక్కొక్కటి
నాలుగైదు
రెట్లు
అధిక
విశాలమైనవి
కనుక,
ఇందులో
రెండింటిని
కూలద్రోసిననూ
వాలి
బలమునకు
మించిన
బలమనే
చెప్పవచ్చునని
వానరులు
వారిలో
వారు
ఊహించిరి.
వాటిని
చూచి
రాముడు
చిరునవ్వుతో,
"సుగ్రీవా,
ఈ
తాళములు
నా
దృష్టిలో
అత్యంత
అల్పములు"
అని
సునాయాసముగా
అంబును
తీసి
ఒక్కవేటుతో
ఆ
సప్త
తాళములను
కూలద్రోసెను.
అది
వెనుకనున్న
పర్వతములలో
చొరబడి
బండలను
కూడ
పగులగొట్టెను.
ఈ
దృశ్యమును
చూచిన
సుగ్రీవుడు
రాముని
పాదములపైబడి
నమస్కరించి
"రామచంద్రా!
నూర్గురు
వాలులు
చేరినను
ఈ
కార్యములు
సాధించలేరు.
ఇంత
శక్తి
సంపన్నుడు
నాకు
మిత్రుడగుటచే
నా
జన్మము
తరించినది.
ఒక
వాలి
దూరమయినా
11
▾
Meaning
Keep
నూర్గురు
వాలులు
నాకు
మిత్రులయినట్లనే
తలంచుచున్నాను.
నా
అపరాధమును
క్షమించుము.
తమను
పరీక్షింపగోరుట
నా
అల్పత్వముయొక్క
లక్షణమే
సిగ్గుగా
వున్నది.
సాక్షాత్
పరమాత్మనే
మిత్రుడుగా
భావించుట,
చేరుట
నా
భాగ్యమే
భాగ్యము.
ఈ
నాటితో
నా
విచారము
తీరెను.
నేను
కిష్కింధను
చేరగలనను
ఆశ
అంకురించెను.
నా
సతీసుతులతో
నేను
సుఖజీవనము
చేయగలనను
ఆశ
నన్నెంతయో
ఆనందపరచినది.
అయితే,
అది
యెన్ని
నిమిషములలో,
యెన్ని
గడియలలో,
యెన్ని
దినములలో,
యెన్ని
వారములలో
అని
మాత్రము
నన్ను
కలవరపరచుచున్నది.
అది
రామేచ్ఛ.
అతని
అనుగ్రహమే
నిమిషమున
సంకల్పించునో!
నాకు
శ్రీరాముడు
తప్ప
అన్యమార్గము
లే"దని
మనసున
దృఢపరచుకొని
రామునికి
నమస్కరించి
"రామా!
నీ
ఇష్టము.
నీ
కృప
ఏ
నిమిషమున
నన్నీ
బాధనుండి
విముక్తుని
గావింతువో"
అని
ప్రార్థించుచూ
కూర్చొనెను.
అంతేకాదు.
నేను
ఇంతవరకూ
వాలి
నా
పరమశత్రువని
తలంచి
భయపడుచుండెడివాడను.
ఈ
నాటితో
వాలి
నాకు
శత్రువు
కాదు,
పరమ
మిత్రుడని,
హితుడని
తలంచుచున్నాను.
అతడే
నేను
ఈ
పర్వతమున
నివసించుటకు
మూలకారణము.
ఈ
కారణముచేతనే
తమ
రాకను
గాంచితిని,
తమతో
మైత్రిని
చేసుకొంటిని.
ఇన్నింటికీ
వాలియే
కారణము
కాన
అతనిని
నేటినుండి
హితునిగా
తలంతు"నని
చెప్పెను.
"ఓ
రామా!
స్వప్నమందు
ఒకనితో
పరమద్వేషమును
పూని
అతనితో
అనేక
విధముల
పోరాడి
లేచిన
తోడనే,
మేల్కొనిన
తోడనే,
అది
మిధ్యయని
తోచిన
రీతిగా
అటులనే
మీ
దర్శనము
కాకపూర్వము,
స్వప్నమువలె
అజ్ఞానవత్
వాలిపై
ద్వేషమును
పూని,
అతని
చర్యలన్నియూ
విరుద్ధమయినవై
నన్ను
అనేక
విధముల
కలతపెట్టెను.
మీ
దర్శనము
లభించటం,
మీతో
సంభాషణలు
సలుపటం
చేత
నేను
నిద్రనుండి
మేల్కొనినట్లు,
అజ్ఞానము
నుండి
మేల్కొని,
పవిత్ర
పాదముల
స్పర్శచేత
జ్ఞానోదయము
నొందితిని.
తమ
సేవాభాగ్యము
నాకు
లభించుటకు
పూర్వము
నా
ద్వేషాసూయలచే
వాలితో
విరోధము
చేసుకొని,
కడకు
క్రుంగి,
కృశించి
సరియైన
సమయము
లభించునా
అని
పరితపించిన
నా
తాపమే
తపముగా
మారి,
నా
క్రోధము
ప్రేమగా
తిరిగెను.
నాథా!
మీరు
కటాక్షించిన,
నాకు
రాజ్యమక్కరలేదు.
ఆలుబిడ్డలు
వారి
వారి
12
▾
Meaning
Keep
ప్రాప్తానుసారము
వారు
బ్రతుకగలరు.
వారి
చింతయూ
నాకు
వద్దు.
నిరంతరము
తమ
సేవ
చేసుకొంటూ
తమ
వెంట
నుండుటకు
అనుజ్ఞ
ఇచ్చిన
చాలు"నని
ప్రార్ధించెను.
అంత
రాముడు
సుగ్రీవుని
శిరస్సు
నిమురుచు
"నాయనా!
నీవు
పలుకు
వచనములు
సత్యములే.
రాజ్యములు,
సుఖదుఃఖములు,
కోపతాపములు,
వస్తువాహనాదులు,
మంచిచెడ్డలు,
స్వప్న
దృశ్యముల,
దైవ
సన్నిధి,
దైవభావములే
శాశ్వత
స్థానములు.
కానీ,
నా
వాగ్దానము,
నా
ప్రతిజ్ఞ
నిష్ప్రయోజనము
కాదుకదా!
ఎటులయిననూ
నీకు
రాజ్యము
వచ్చును,
దానిని
యేలక
తప్పదు.
నేడు
వాలితో
యుద్ధము
చేయక
తప్పదు.
సిద్ధము
గమ్ము"
అని
చెప్పి
ధనుర్బాణములను
ధరించెను.
సుగ్రీవుని
వెంటబెట్టుకొని
రామలక్ష్మణులు
బయలుదేరిరి.
రాముడు
హనుమదాదులను
ఆ
పర్వతముపైనే
వుండుటకు
అనుమతించెను.
దారిలో
సుగ్రీవునకు
చెప్పవలసినవన్నియూ
చెప్పి,
పురము
యొక్క
సింహద్వారము
వద్దకు
వెళ్ళి
కేకవేయుమని
ఆజ్ఞాపించెను.
రామాజ్ఞ
ప్రకారము
సుగ్రీవుడు
కిష్కింధపుర
సింహద్వారము
సమీపించి
భూమి
దద్దరిల్లునట్లు
కేక
వేసెను.
ఆ
కేక
వినిన
తత్క్షణమే
తోకత్రొక్కిన
పామువలె
బుస్సున
లేచి
వాలి
తన
తమ్మునిపై
యుద్ధమునకు
సిద్ధపడెను.
అంతలో
భార్యయగు
తార
వాలి
పాదములు
పట్టుకొని,
పూర్వము
అంగదుడు
చెప్పిన
మాటలను
వాలితో
చెప్పి,
"నాథా!
వారి
స్నేహమును
ఆశించిన
అన్నదమ్ములు
సామాన్యులు
కారు.
వారు
మహాబలులు.
ఇంత
కాలము
అణగివుండి,
సుగ్రీవుడు
ఈనాడు
ఇంత
ధైర్యముగా
యుద్ధమునకు
సిద్ధపడినాడన్న,
వారి
బలములను
బాగుగా
యెరిగి
వారి
సహాయమును
పొందివచ్చెనే
తప్ప,
ముందూ
వెనుక
యోచించక
రాలేదు.
రాజపుత్రులగు
ఆ
రామలక్ష్మణులు
దైవశక్తులతో
కూడినవారు.
వారి
పై
యుద్ధము
చేయుట
మీకు
మంచిది
కాదు"
అని
చాలా
బతిమిలాడెను.
ఆమె
దీనాలాపములు
విని
వాలి
పక్కున
నవ్వెను.
"ఓ
భయస్థురాలా!
శ్రీరాముడు
సమదర్శియని
చెప్పియుంటివి.
అటులయిన
అతడు
మమ్ముల
నిరువురిని
సమముగా
భావించును.
నేను
అతనికేమీ
అపకారము
చేసియుండలేదు
కదా!
అట్లుకాక
రాముడు
నన్ను
సంహరించెనని
తలంచు;
నా
జన్మమే
సఫలమగును,
అంతేకదా?"
ఒకవైపున
వాలివాక్యములు
తారకు
సంతోషమును
కలిగించిననూ
మరొకవైపు
పతి
యెడబాటును
తాను
సహించుకోలేక
అతనిని
మరింత
ప్రాధేయ
పడుతూ,
13
▾
Meaning
Keep
"నాథా!
స్త్రీ
నిషేధించుట
అపశకునము
కదా?"
అని
యెంతో
చెప్పిననూ,
"యుద్ధసమయమున
శకునములు
పనికిరావు.
ప్రాణములు
కోల్పోవుటయో
లేక
శత్రు
ప్రాణములు
తీయుటయో
జరుగవలెను.
అంతేకానీ,
ఈ
విధమైన
వాటిని
లెక్కచేయ"నని
తారను
వెనుకకు
నెట్టి,
మహాక్రోధుడై
యుద్ధమునకు
సింహద్వారమును
సమీపించెను.
సుగ్రీవుని
ఒక్కని
మాత్రమే
చూచి
వాలి
మండిపడి,
కుప్పించి
సుగ్రీవునిపై
బడి
ముష్టియుద్ధము
ప్రారంభించెను.
వాలి
వేయు
పిడిగుద్దులను
సుగ్రీవుడు
భరించలేకపోయెను.
పారిపోవుటకు
సిద్ధమయ్యెను
కాని,
వాలి
తన
బలమును
ప్రవేశపెట్టి
కాళ్లతో,
చేతులతో
బాధించుటచేత
తానిక
ఒక
క్షణమైననూ
నిలువలేక
పారిపోయెను.
అంత
వాలి
తొడతట్టుచూ
వెనుకకు
వెళ్ళెను.
పారిపోవు
సుగ్రీవుని
రామలక్ష్మణులు
అనుసరించిరి.
పర్వతము
చేరిన
తరువాత,
సుగ్రీవుడు
చాలా
నిరాశతో,
బాధతో,
దిగులుతో
రామునకు
నమస్కరించి,
"స్వామీ!
తామెందుకు
ఇంత
నన్ను
పరాభవము
చేసితిరో
అర్థమగుట
లేదు.
తాము
సహాయము
చేతురను
కొండంత
ఆశతో
వెళ్ళితిని.
తమ
అంబులు
యేక్షణము
వాలిపై
పడునో
అని
క్షణక్షణము
ఆ
ధైర్యముతో
పోరాడితిని.
కానీ
ఇక
నే
తాళలేక
పారిపోవలసి
వచ్చెను.
మా
అన్న
మహాబలవంతుడు,
ఆ
గ్రుద్దులను
నేను
భరించలేకపోతిని"
అని
విచారించెను.
అంత
రాముడు,
"సుగ్రీవా!
విచారించకుము.
కారణము
వినుము.
మీరిరువురూ
ఒకే
విధముగా
నుండుట
చేత,
సమానరూపులు,
సమాన
బలులు
అగుటచేత,
నే
నతనిని
చంపలేకపోతిని"
అనెను.
అనగా,వాలికూడా
తన
పాదభక్తుడే,
వాడు
నా
హితుడే!
నీవెట్లో
తానూ
అట్లే
నా
దయను
ఆశించినవాడు.
ఇరువురూ
సమానముగ
కనుపించితిరి,
అని
రాముడు
అన్న
పదములోని
అంతరార్థము
సుగ్రీవుడు
తెలుసుకొనలేక,
"రామా!
యిన్ని
యెరిగిన
నీకు
వాలి
యెవరో,
సుగ్రీవుడెవరో
యుద్ధమున
కనుగొనలేకపోతివా?
ఇది
నేను
నమ్మను.
కారణమేదియో
యుండును.
లేక
నా
పురుషార్థమును
నే
గావింపవలెనను
ఉద్దేశము
తమలో
వుండియుండువచ్చును.
అట్లు
జరుగవలెనని
చెప్పియుండిన,
నేను
ప్రారంభమునందే
తగిన
రీతిగా
యుండియుండెడివాడను.
రాముడు
చూచుకొనును
గదా
అని
యెంతో
అలక్ష్యముగా
వుంటి"నని
వగచెను.
ఈ
విధముగ
నిరాశా
నిస్పృహలకు
గురియైన
సుగ్రీవుని
చెంత
చేర్చి,
అనేక
విధముల
వోదార్చి
14
▾
Meaning
Keep
సుగ్రీవుని
దేహమును
తన
అమృతహస్తములతో
నిమిరెను.
అతనికి
తగిలిన
దెబ్బలు
క్షణములో
మాయమై,
బాధ
యేమాత్రము
లేక
హాయిగా
తోచెను.
సుగ్రీవుడు
పరమాశ్చర్యముతో,
"రామచంద్రా!
సర్వము
నీ
హస్తమందే
యున్నది.
ఈ
సృష్టి
స్థితి
లయములు
మీ
స్వాధీనము.
అట్టి
మీరే
నాకు
చిక్కినప్పుడు
ఈ
రాజ్యాధికార
వాంఛ
నాకక్కరలేదు.
మీ
కృపలో
ఇది
యేపాటిది"
అవి
తీవ్ర
వైరాగ్యము
ప్రదర్శించెను.
కాని
రాముడు
అతని
మాటలను
లెక్కచేయక,
"ఈ
మాటలు
తాత్కాలికపు
ప్రతిబింబములు,
నా
శక్తి
సామర్ధ్యములను
దర్శించు
సమయమున
కలుగు
ఉపశాంతి
వచనములు.
నేను
వాటిని
లక్ష్యమందుంచను.
హృదయశాంతి
వచనములే
నాకు
లక్ష్యము.
అనేకమంది
పరమభక్తులుగా
వుండువారు
దైవము
యొక్క
లీలాశక్తులను
వర్ణించు
సమయాన
సర్వమును
మరచి,
తన
కంటే
వేరు
అధికమగునది
లోకమున
లేదని
తలంతురు.
కొంత
తడవైన,
లేదా
మనోవాంఛలు
విఫలమైన,
దానికి
విరోధమైన
భావములతో
తను
చూచినవన్నియూ
సత్యమా,
కాదా
అను
అనుమానములకు
గురియగుదురు.
ఇది
ఆస్తికలోకమున
కనబడు
పొరలు,
తెరలు.
ఇవి
నేను
తలంచను.
నీవు
తిరిగీ
మీ
అన్నతో
పోరాడుటకు
సంసిద్ధుడవు
కావలసినదే"
అని
బలవంతపెట్టెను.
సుగ్రీవుడు
లోలోన
వగచుచూ
రాముని
వచనములు
గట్టివిగా
వుండుటచే
రాముడు
ఈపరి
తప్పక
వాలిని
వధించునను
ధైర్యముతో
నిరుత్సాహమునకు
చోటివ్వక
ముందు
నడచెను.
అంత
రాముడు
లక్ష్మణునితో
చెప్పి
వనపుష్పములను
తెప్పించి
ఒక
మాలగా
కూర్చి
దానిని
సుగ్రీవుని
మెడకు
వేయించెను.
ఇందులోని
అంతరార్థము,
పూర్వము
తార
దగ్గర
వాలి
రాముడు
సమదర్శియని
చెప్పియుండెను.
పూర్వము
సమదర్శిగ
నుండుటచేతనే
వానిని
కొట్టలేకపోయెను.
ఇప్పుడు
వాలికంటే
సుగ్రీవునిపై
అధిక
ప్రేమ
కలదను
చిహ్నమును
నిరూపించుటకు
హారము
అధికంగా
వేయించెను.
ఇరువురూ
సమమే
కానీ
హార
మధికము.
అదే
ప్రేమమాల,
కంఠమున
ధరించుమని
రాముడు
సుగ్రీవునికి
బోధించెను.
ప్రేమకు
మరణము
లేదు.
కారణము,
ప్రేమ
స్వార్థ
రహితము.
ఈ
విధమైన
ధైర్యసాహసాలు
అందించి
సుగ్రీవునితో
కేకలువేయించి
రామలక్ష్మణులు
చెట్టుచాటున
నుండిరి.
వాలి
భూమి
దద్దరిల్లునట్లు
పరుగిడి
వచ్చుచుండ
సుగ్రీవుడు
అదురుచు,
బెదురుచు,
రాముని
15
▾
Meaning
Keep
చింతించుచు
యుద్ధమునకు
సిద్ధమాయెను.
పురుషార్థమును
సార్థకము
గావించుకొనుటకై
సుగ్రీవుడు
దేహమున
బలమున్నంత
వరకూ
పోరాడెను.
బలము
క్షీణించి,
అలసిపోయే
స్థితికి
వచ్చిన
తత్క్షణమే
రామా
అని
ఒక్కతూరి
కేకవేసెను.
రాముడు
భక్తసంరక్షణదీక్ష
గలవాడగుటచే
బాణమును
ప్రయోగించెను.
వాలి
దురభిమాని
కనుక
వాని
హృదయమును
ఛేదించెను.
ఆ
దెబ్బతో
వాలి
గిరగిర
తిరిగి
నేలబడెను.
అంత
రాముడు
వాలిని
సమీపించి
తన
దివ్యదర్శనము
నందించెను.
పడిన
వాలి
మహాబలశాలి,
ధైర్యశాలి
అగుటచేత,
లేచి
కూర్చొని
చేతులు
జోడించుకొని,
ఆ
శ్యామల
శరీరుని,
ఆ
రాజీవలోచనుని
కండ్లార
చూచుచూ,
ఆనందబాష్పములు
విడుచుచూ
భరించలేక,
"ఓ
రామా!
ఇంతటి
దివ్యమంగళ
విగ్రహుడవై
సాక్షాత్
పరమేశ్వరుడవై
ఇంత
విషమకార్యము
నేల
చేసితివి?
నాతో
చెప్పి
నన్ను
వధించియుండిన
నేనెంత
సంతసించి
యుండెడివాడను?
సుగ్రీవుడు
చేయునట్టి
హితమును
నేను
చేయలేకపోదునా?
కాదు
కాదు,
ఇందులో
యేదియో
కారణము
లేకపోలేదు.
"కారణములేని
కార్యము
భగవంతుడు
చేయడు.
బాహ్యదృష్టితో
చూచినంత
వరకూ
మన
భావములకు
విరుద్ధముగా
కనుపించును,
అంతర్దృష్టితో
చూచినప్పుడే,
అది
సత్యరూపమును
ధరించును.
పరమాత్మయొక్క
చర్యలు
లోకదృష్టితో
చూడకూడదు
అతడు
గుణాతీతుడు,
కనుక
గుణాతీతమైన
దృష్టితోనే
చూడవలసివుండును.
గుణాతీతుని
కార్యములు
గుణదృష్టితో
చూచిన,
విరుద్ధము
కాక
మరేమగును?"
అని
మహామేధావియైన
వాలి
చక్కగా
విచారించి,
రామునితో
"ఓ
నాథా!
నీ
శక్తి
సామర్ధ్యములు
నేనెరుగుదును.
ఒక
బాణముతో
ఒక
వాలినే
కాదు,
విశ్వమునే
హతమార్చగలవు!
విశ్వమునే
సృష్టించగలవు!
కానీ
నన్ను
మీరు
వధించుటలో
నేను
చేసిన
పాపమేమియో
తెలిసికొనగోరుచున్నాను.
నా
అపరాధమెట్టిదో
గుర్తించగోరుచున్నాను.
ధర్మసంస్థాపన
మొనరించుటకై
నీవు
లోకమున
నరాకారమును
ధరించితివి
కదా?
వేటకానివలె
చెట్టుచాటున
దాగి
నన్ను
కొట్టుటలో
వున్న
అంతరార్థమేమో
తెలిపిన
నేను
కృతార్థుడనయ్యెద"నని
ప్రార్ధించెను.
అంత
రాముడు,
వాలిచెంత
కూర్చొని,
"వాలీ!
నా
చర్యలు
స్వార్థరహితమయినవని
నీకు
తెలుసు.
కేవలము
సీతాన్వేషణ
నిమిత్తమై
సుగ్రీవుని
16
▾
Meaning
Keep
స్నేహము
గావించితినను
దురభిప్రాయమును
వీడుము.
నీవే
తెలిపితివి
కదా-ధర్మ
సంస్థాపన
నిమిత్తమై
వచ్చిన
నరాకారుడనని,
నీవు
చేయు
అధర్మ,
అక్రమ,
అన్యాయములను
చూచుచూ
వుండుట
అపకారమందువా,
ఉపకారమందువా?
ధర్మమందువా,
అధర్మమందువా?
తమ్ముని
భార్య,
చెల్లెలు,
కోడలు,
కొమార్తె
సమానులు.
వారలను
పాపదృష్టితో
చూచినవాడు
మహాపాపి.
అట్టి
పాపాత్ముని
సంహరించుటలో
యెట్టి
పాపమూ
లేదు.
నీవు
సత్యమును
గుర్తించక,
సుగ్రీవుడు
నిన్ను
చంపగోరి
గుహకు
గుండును
వేసెనని
తలంచి
అతనిపై
వైరము
పూనుట,
యెంతటి
అన్యాయము?
నీవు
పదిహేను
దినములని
చెప్పిననూ
తాను
ఒకనెల
నీ
కొఱకై
కాచి
ఆజ్ఞ
మీరక,
కడకు
నీ
రక్తపు
వాసనను
గమనించి
అన్నను
రాక్షసుడు
హతమార్చెనని
విచారించుచూ,
విధిలేక
ఆ
రాక్షసునితో
పోరాటము
నీకే
చేతకాని
పక్షమున,
ఇక
నా
చేత
యేమగునని
సుగ్రీవుడు
తలంచి,
ఆ
రాక్షసుడు
వెనుకకు
రాకుండుటకై
ద్వారమునకు
గుండును
నూకి
వచ్చెను;
పుర
ప్రజలు
నిర్బంధముగా
ప్రభువు
కావాలని
పట్టుపట్టి
అతనిని
యెన్నుకొనిరి.
"ఇందులో
సుగ్రీవుని
తప్పేమున్నదో
యోచించలేకపోతివి.
ప్రేమతో
ఆజ్ఞను
జవదాటక
సత్యమార్గమును
అవలంబించిన
తమ్మునిపై
నిష్కారణముగా,
దురభిమానివై
అతనిని
పగపట్టి
అడవిపాలు
చేస్తివి,
ఇది
తప్పందువా;
లేదా?
పోనీ
అతనిని
పంపునప్పుడు
అతని
భార్యని
అతనితో
పంపి
ఉండవలెను.
కుమార్తె
వంటి
తమ్ముని
భార్యని
నీ
భార్యగా
యెన్నుకొనుట
పాపమందువా,
లేదా?
ఇంతకంటే
పాపము
మరొకటి
కలదా?
అందులో
ప్రభువైన
నీవు,
పరిపాలకుడవైన
నీవు,
ఈ
విధమైన
పాపాలకు
గురియయిన,
ఇతరులను
శిక్షించు
అధికారము
నీకెక్కడిది?
'యథా
రాజా
తథా
ప్రజ'
అన్నట్లు
పాలకులెట్టివారో
ప్రజలట్టివారుగా
వుందురు.
ఈ
పని
పాలకుడవగు
నీకు
మరింత
పాపపు
పనికదా?"
అని
ప్రీతితో
అతని
తప్పులను
అతనికి
అద్దములో
చూపించినట్లు
వ్యక్తపరచెను.
ఈ
ప్రకారము
రాముడు
పలికిన
పలుకులను
చక్కగా
విని
ఆలోచించి,
తన
దోషమును
తాను
గుర్తించి,
"ఓనాథా!
మీ
యెడల
నా
చమత్కారము
వ్యర్థమయ్యెను.
నా
విన్నపము
వినుము.
నేను
పాపాత్ముడను
కాదు.
నేను
పాపాత్ముడనే
అయివుండిన,
అంత్యకాలమున
సాక్షాత్
పరమాత్మ
చేత
దెబ్బతిని,
పరమాత్ముని
చూచుచూ,
అతని
17
▾
Meaning
Keep
దివ్యవాక్యములు
శ్రవణము
చేయుచు,
ప్రాణములు
వీడుట
సంభవించునా?
ఇట్టి
భాగ్యమును
పాపాత్ములకు
పరమాత్మ
అనుగ్రహించునా?"
అని
వాలి
ప్రేమోత్సాహములతో
భక్తి
ప్రపత్తులతో
జ్ఞానివలె
పలికిన
పలుకులు
రామునినెంతో
ప్రసన్నుని
గావించెను.
రాముడు
వాలియొక్క
నిజమైన
వైరాగ్యమును
లోకమునకు
తెలుపగోరి,
"ఓ
వాలీ.
నీ
ప్రాణములు
నిచ్చెదను.
నీకు
జరామరణములు
లేకుండ
చేతును.
కాయమును
నిలబెట్టుకొనుము"
అని
తన
హస్తమును
వాలి
శిరస్సుపై
పెట్టి
ఆశీర్వదించుచుండ
వాలి,
"ఓ
కృపాసముద్రుడా!
నా
విన్నప
మాలకింపుము.
ఆజన్మ
మరణాంతము
అనేక
యత్నములు
చేసినను
ప్రాణప్రయాణ
సమయము
రాకతప్పదు.
అట్టి
సమయమున
మునీశ్వరులకు
సహితము
నీ
నామము
వారి
ముఖమునుండి
వెలువడదు.
అట్టి
నీ
అనుగ్రహముచే,
నా
పుణ్యఫలముచే
మీ
నామము,
మీ
రూపము,
మీ
సంభాషణము,
మీ
స్పర్శ-ఇన్ని
ఈ
అంత్యసమయమున
నాకు
అనాయాచితముగా
లభించినవి.
వీటిని
నేను
దుర్వినియోగము
గావించుకొన్న
ఇక
నేను
యెంత
కాలము
బ్రతికి
యేమి
ప్రయోజనము?
కాన
ఈ
కాయమును
నిలబెట్టుకొనుటలో
యెట్టి
ఘనకార్యమును
సాధించలేను.
"ఓ
నాథా!
వేదములు
సహితము
న-ఇతి,
న-ఇతి,
అని
పలుకుచుండ,
నా
అదృష్టవశమున
ఇది
కాదు,
ఇది
కాదు
అని
తోచి,
కడపటికి
ఇది
ఇది
అను
చివరి
నిష్కర్షస్థానమేదియో
అదే
నా
హస్తమునకు
చిక్క,
నేను
దీనిని
వదులుకుందునా?
కల్పవృక్షమును
వీడి,
కానుగచెట్టును
కోరునట్టి
మూర్ఖుడుండునా?
బ్రహ్మమానస
పుత్రుడని,
మహాబలశాలి,
జ్ఞాని
అని
పేరుగాంచిన
ఈ
వాలి
తుచ్ఛకాయముపై
భ్రాంతిని
పెంచుకొనడు.
అట్లైనచో
అపకీర్తికి
గురి
చేసుకున్నవాడనగుదును.
అంతేటికి
-
ఆత్మతృప్తి
లేక
చేసుకొన్న
అన్యతృప్తులు
-
అల్ప
తృప్తులే
కదా"?
"నాథా!
నా
వాక్యములలో
నీ
దర్శనముతో
భేద
దృష్టి
పోయెను.
అనన్యదృష్టి
ప్రాప్తించెను.
నా
పాప
ఫలములు
నశించెను.
ఈ
కాయమున
చేసిన
పాపములు
ఈ
కాయము
తోడనే
పోనిమ్ము.
మరొక
కాయమును
రానివ్వకుము"
అని
ప్రార్థించుచు,
కొమారుని
పిలిపించి
"వీడు
ఇంతకాలము
ఈ
కాయమునకు
కామపుత్రుడుగా
పెరిగెను.
వీడు
మహాబలవంతుడు.
గుణవంతుడు,
వినయవిధేయతలలో
18
▾
Meaning
Keep
మహాగుణశీలుడు.
ఇట్టివానిని
నేటినుండి
నీ
ప్రేమపుత్రునిగా
చూచుకొమ్ము.
వీనిని
నీ
హస్తములందుంచితిని"
అని
కొమారుని
చేయి
పట్టుకొని
రాముని
చేతికి
అందించెను.
రాముడు
అంగదుని
ప్రక్కనచేరి
అతనిని
ఆదరించి
ఆశీర్వదించి
చెంతకు
చేర్చుకొనెను.
ఆ
దృశ్యమును
చూచుచు
వాలి
ఆనందబాష్పములు
విడుచుచూ
కన్ను
మూసెను.
కంఠము
నుండి
పుష్పము
జారి
క్రిందపడిననూ
గజమునకు
లక్ష్యముండదుకదా?
అటులనే
వాలి
అలక్ష్యముగా
యోచన
చేయక
తన
ప్రాణములు
వీడెను.
పంపా
పురవాసులు
వాలి
మరణవార్త
విని
మహాదుఃఖముతో
విలపించుచూ
గుంపులు
గుంపులు
చేరిరి.
వాలి
భార్య
అయిన
తార
పరివారముతో
వచ్చి
వాలి
కళేబరముపైబడి
స్పృహ
తప్పి
పడెను.
ఆమె
వియోగబాధను
భరించలేక
విలపించుచున్న
విలాపము
రాళ్ళను
సహితము
కరిగించునట్టిదై
యుండెను.
శిరోజములు
వీడిపోయెను.
మధ్య
మధ్య
స్మారకము
వచ్చి
లేచి
ఆ
మోమును
చూచుచూ,
"ఓ
నాథా!
యెన్నియో
విధముల
నేను
హితమును
బోధించిననూ
వినకపోతివి
గదా?
పతికి
యే
సతియైననూ
హితమును
లక్ష్యమందుంచుకొనే
బోధించును
కదా?
పతికంటే
సతికి
హితమైనవారు
మరొకరుండరు
కదా?
యే
మహనీయులైననూ
కొంత
స్వార్థమునైననూ
లక్ష్యమందుంచుకొని
హితము
చేయుదురు.
సతి
అట్లు
కాదు
కదా?
పతి
క్షేమమునే
లక్ష్యమందుంచుకుని
చేయును
కదా?
అయ్యో
నాథా!
ఈ
కొమారుని
నే
నెట్లు
కాపాడుకొందును?
నిన్ను
హతమార్చినవారు
ఈ
కొమారుని
మాత్రము
విడుతురా?
ఇక
మాకు
త్రోవ
చూపువారెవరు?
నాథా!
మమ్ముల
విడనాడి
పరలోకమునకు
పోవుటకు
మనసెటులొప్పెను?
ఇక
నేను
ఎవరికొరకు
జీవించవలెను?"
అని
అంటూ,
"ఓ
రామచంద్రా,
ప్రాణసమానమైన
నా
పతిని
పరలోకమునకు
పంపి,
మమ్ములను
పరుల
పంచలపడి
జీవించుమని
అందువా?
ఇది
నీబోటి
గుణశాలికి,
ధర్మమూర్తికి
తగునా?
నీవు
మా
మేలు
కోరుదువేని,
మా
దుఃఖమును
తీర్చ
తలంతువేని,
నన్ను
నా
కొమారుని
అతనితోపాటు
పంపుము.
బలవంతుని
సంహరించిన
నీ
బాణము
అబలను
చంపకపోలేదు"
అని
రాముని
పాదాలపై
పడెను.
అంత
రాముడు,
"ఓ
తారా!
ఎందుకు
విలపింతువు?
వీరపత్ని
అయిన
నీకు
ఈ
విలాపము
కీర్తినందించదు.
శాంతిని
చేకూర్చదు.
శరీరము
లనిత్యములు.
ఇది
19
▾
Meaning
Keep
నికృష్టము.
వాలియే
ఈ
కాయమును
తుచ్ఛముగా
భావించెను.
ఏనాటికైననూ
కాయములు
కూలక
తప్పదు.
రాలక
తప్పదు.
పరమ
లక్ష్యము
నిమిత్తము
కాయము
కాని,
లక్ష్యమును
వీడిన
కాయము,
బొగ్గుతో
సమానము,
పోనీ
ఆత్మ
నిమిత్తమని
దుఃఖించు
చున్నావా?
ఆత్మ
నిత్యమైనది.
దానికెట్టి
పరిణామములు
వుండవు.
యెట్టివారికైనను
ఆత్మతత్వము
తెలియునంతవరకే
కాయముపై,
భ్రాంతి,
దేహభ్రాంతి
అజ్ఞానము
ఆత్మభ్రాంతి
జ్ఞానము.
మట్టిలో
మాణిక్యము
లభించినటుల,
మాంసపు
దేహములో
దేహి
లభించుచున్నాడు.
దేహి
నిమిత్తము
దేహం
కానీ,
దేహము
నిమిత్తము
దేహి
రాడు.
క్షణభంగురమైన,
మలినమైన,
దుర్గంధములతో,
మలమూత్రాదులతో
నిండిన
ఈ
దేహమును
యెట్టివాడైననూ
ఒకానొక
దినము
వీడక
తప్పదు.
ఆ
కాయముతో
సాధించునట్టి
కార్యమే
మానవత్వమునకు
శోభనందించును.
నీ
పతి
మహాఘనకార్యములు
చేసెను.
పరిపాలనలో
తాను
అనుచరులను,
నమ్మినవారలను
ప్రాణసమముగా
చూచుకొనెను.
రాక్షసులను
హతమార్చెను.
దైవభక్తి
మెండు.
యెటు
తిరిగీ
తన
సోదరునకు
అపకారము
చేసెను.
అదొక్క
పాపము
తప్ప
మరే
పాపమును
చేయలేదు.
ఆ
పాపమునకు
తగిన
ఫలముగా
నా
చేతులలో
ప్రాణములు
వీడెను.
కనుక,
ఆ
పాపము
కూడా
పరిహారమయినది.
ఇక
నీవు
చింతించకూడదు"
అని
అనేక
విధముల
తారకు
జ్ఞానోదయమగునట్లు
బోధించెను.
ఇక
ఆలస్యము
మంచిది
కాదు
అని
తారను
వెనుకకు
వెళ్ళమని,
సుగ్రీవునితో
వాలికి
జరుపవలసిన
ఉత్తర
క్రియలను
జరిపించెను.
అంగదుని
ప్రేమగా
చూచుచుండవలెనని
సుగ్రీవునకు
హితము
చెప్పెను.
అన్ని
కార్యములు
జరిపించి,
లక్ష్మణుని
నగరమునకు
పంపి,
సుగ్రీవునికి
అధికారస్థానమును
అందించెను.
అంత
హనుమదాదులు
శ్రీరామాజ్ఞను
శిరసావహించి
నగరమున
ప్రవేశించి
సుగ్రీవునికి
మంత్రులుగా
కార్యక్రమములు
కొనసాగించిరి.
సుగ్రీవుడు
అధికారమును
చేపట్టిన
తత్క్షణమే
వానరుల
నాయకులను
పిలిపించి,
సీతాన్వేషణకు
తగిన
యేర్పాట్లు
గావించుటకు
ఆజ్ఞాపించెను.
తగిన
అనుకూలములు
చేయ
ప్రారంభించుమనెను.
పరిపాలన
బాధ్యత
చేజిక్కెనని
సంతోషము
లేక,
అన్నను
చంపుకొంటినే
అను
బాధ
అతనికి
లోలోన
చాలా
బాధించ
మొదలు
పెట్టెను.
"కోపము
మహా
పాపకార్యములను
సహితము
చేయించును;
ద్వేషమును
పెంచి,
ప్రేమను
చంపును.
ఛీ!
కోపద్వేషములు,
యెంతటి
గతికి
తెప్పించెను?
మా
అన్న
20
▾
Meaning
Keep
రాముని
కొనియాడిన
వచనములు,
నా
గుండెను
చీల్చుచున్నవి.
అన్నలో
ఇంతటి
భక్తి
ప్రపత్తులుండునని
కలనైననూ
తలుపలేదు.
అతని
జ్ఞానము
అపారము.
క్రోధము
అంతటి
జ్ఞానమును
కప్పివైచి
కౄరత్వమును
అభివృద్ధిపరచి
దివ్యత్వమును
చంపుచున్నది.
కామక్రోధములే
జీవితాన్ని
కడగండ్ల
పాల్జేయును"
అని
విచారించుచూ,
పరిపాలనా
విధానమును
లక్ష్మణుని
ద్వారా
తెలుసుకొని,
శ్రీరాముని
సుగ్రీవుడు
నగరమున
ప్రవేశింపుమని
పలు
విధముల
ప్రార్థించిననూ,
రామచంద్రుడు
పితృవాక్యపరిపాలనా
నిమిత్తము
పదునాలుగు
సంవత్సరములు
నగరమున
ప్రవేశించనని
గట్టిగా
తెలిపెను.
సుగ్రీవుడు
నాయకులతో
సమావేశము
జరిపెను.
ఇది
వర్షఋతువనియూ,
వర్షములు
అధికముగా
నుండుననియూ,
వానరులు
చలికి
వానకు
తాళరనియూ,
గ్రీష్మ
ఋతువు
వచ్చిన
వెంటనే
తీవ్రమైన
అన్వేషణ
కొనసాగింతుమని
నాయకులు
తెలిపిన
విషయములను
రామలక్ష్మణులకు
మనవి
చేసుకొనెను.
ఉన్న
సత్యమును
గుర్తించి,
అట్లే
కానిమ్మని
రామలక్ష్మణులు
ఋష్యమూక
పర్వతముపై
నివసించుచుండిరి.
చేయునది
లేక
కుండపోతగా
కురియు
వర్షముల
వత్తిడిచేత
రామలక్ష్మణులకు
సకాలమున
ఫలములు
దుంపలు
సహితము
కరువయ్యెను.
వెలుపలకు
వచ్చుటకే
వీలు
లేకపోయెను.
సూర్యకాంతి
అపురూపము.
ఈ
స్థితిని
చూచుచూ
మధ్య
మధ్య
లక్ష్మణునకు
ఉపదేశము
చేయుచుండెను
రాముడు,
"లక్ష్మణా!
కుపుత్రుడు
పుట్టినందున
కులధర్మము
నశించును.
ప్రచండ
వాయువు
వీచినందున
కుసుమములు
చెదురును.
దుర్జన
సాంగత్యమువలన
జ్ఞానము
నశించును.
సజ్జన
సాంగత్యమువలన
జ్ఞానము
వికసించును.
అటులనే
మేఘములచే
నొకప్పుడు
సూర్యుడు
కప్పబడును.
మరియొకప్పుడు
మేఘములు
వీడినందున
సూర్యుడు
ప్రకాశించును”
అని
చెప్పుచు
జ్ఞానసంబంధమైన
వాక్యములతో
కాలమును
గడిపిరి.
వర్షఋతువు
గడచెను.
వర్షములు
నిలిచెను.
శరదృతువు
ప్రారంభించెను.
పృథ్వియంతయూ
పచ్చని
గడ్డితో
శోభించెను.
వర్షాకాలమునకు
వృద్ధాప్యము
వచ్చినటుల
గడ్డిపువ్వులు
పుట్టెను.
సంతోషముతో
లోభము
క్షీణించినటుల
అగస్త్యోదయమున
జలము
శోషించెను.
కామమోహాదులు
క్షీణించినందున
మనస్సు
నిర్మలమగు
విధమున
నదీసరోవరజలములు
నిర్మలమయ్యెను.
“లక్ష్మణా,
ఒక
పరి
21
▾
Meaning
Keep
సుగ్రీవుని
హెచ్చరించుట
మంచిది"
అని
రాముడు
ఆజ్ఞ
చేసెను.
లక్ష్మణుడు
ఆ
మాట
విని,
నిత్యము
వచ్చిపోవు
హనుమంతునికి
ఈ
విషయము
సుగ్రీవునితో
తెలుపుమని
హెచ్చరించెను.
హనుమంతుడు
రామకార్యములో
చాలా
జాగ్రత్తగా
యుండుటచేత
సుగ్రీవుని
చాలా
తీవ్రముగా
హెచ్చరించెను.
సుగ్రీవుడు
వానర
నాయకులను
పిలిపించి
తగిన
యేర్పాట్లు
గావించెను.
అంగదుడు,
హనుమంతుడు
వానరులతో
వెళ్ళుటకు
అంగీకరించిరి.
అందరికి
సుగ్రీవుడు
తగిన
బలమును,
ధైర్యమును
అందించి,
శ్రీరాముని
కార్యమును
సాధించవలెనని
ఉత్సాహముతో,
వారిని
నలుదిశలా
పంపెను.
వానరుల
బాధ్యతంతయూ
హనుమంతునకే
అప్పచెప్పెను.
అందరూ
ఒకపరి
సుగ్రీవునకు
జై
అనియు,
శ్రీరామచంద్ర
ప్రభువుకూ
జై
అనియు
అనేక
విధముల
ఉత్సాహమును
ప్రకటించుచూ
గంతులు
వేయుచూ
హనుమంతుడు
యేర్పరచిన
రీతిగా
ఒక్కొక్క
గుంపు
ఒక్కొక్క
దిశకు
బయలుదేరెను.
Previous
←
Śabarī
Next
The Search for Sītā
→