Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Search for Sītā
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
6
సీతాన్వేషణము
హనుమంతుడు
తూర్పునకు
తన
పరివారమును
తీసుకొనిపోయెను.
సుషేణుడు,
మైందవుడు
తమ
పరివారములతో
వెళ్లిరి.
వీరు
గంధమాదనము,
సుమేరు
పర్వతము,
అర్జున
పర్వతము,
నీలగిరి
పర్వతముల
గుహలను
పరిశోధించిరి.
వెతుకుతూ
వెతుకుతూ
ఉత్తర
సముద్రతీరము
జేరిరి.
ఈ
విధముగ
వానరులు
నిద్రాహారములు
మాని,
రామకార్య
నిమిత్తమై
తమ
ప్రాణములైననూ
అర్పితము
గావింతుమని,
చిన్నవాని
మొదలు
పెద్దనాయకుని
వరకూ,
ఒకే
దీక్షతో
రామ
రామ
రామ
అంటూ
వనములు
కొండలు
గుహలు
నదులు
పల్లములు
లోయలు,
ఒకటేమిటి,
మానవులు
చొరరానటువంటి
ప్రదేశములన్నింటినీ
గాలించుచూ
వచ్చిరి.
మార్గమధ్యములో
అడ్డువచ్చిన
రాక్షసులను
హతమార్చుచూ
ఒక
సరోవరము
చేరిరి.
అక్కడ
స్వయంప్రభ
అను
ఒక
స్త్రీ
తపము
చేయుచుండెను.
వారు
ఆమెకు
దూరమునుండి
నమస్కరించిరి.
ఆమె
కన్నులు
తెరచి
వారలనుచూచి
"ఓ
వానరులారా!
మీరు
అలసినటుల
కనుపించుచున్నారు.
చాలా
బడలి
యుంటిరి"
అని
ఫలముల
నందించి,
కొంత
విశ్రమింపుడని
కోరెను.
ఆమె
ఆజ్ఞ
ప్రకారము
ఫలములు
భుజించిరి.
ఆమె
చెంత
కూర్చొనిరి.
ఆమె
స్వవృత్తాంతము
వారితో
చెప్పనారంభించెను:
"ఓ
వానరులారా!
రాముడు
నివసించు
స్థానమునకు
నే
పోతున్నాను.
నా
పేరు
స్వయంప్రభ.
నేనొక
గంధర్వుని
కూతురును.
హేమ
అను
అప్సరస
నా
సఖి.
నేను
తపము
నాచరించుచుండ
బ్రహ్మ
ప్రత్యక్షమై
నాకు
కావలసిన
వరమును
కోరుకొమ్మనెను.
అంత
నేను
భగవంతుడు
మానవాకారుడై
మానవమాత్రునివలె
సంచరించుట
దర్శించవలెనని
కోరుకొంటిని".
అంత
"నీవీ
స్థానమున
తపమాచరించుము.
ఈ
ప్రదేశమునకు
మహాబలవంతులగు
వానరులు
రాగలరు.
వారి
వలన
మానవాకారము
ధరించిన
రాముని
వృత్తాంతమును
వినగలవు.
తదుపరి
రాముని
దర్శించగలవు"
అని
వరమిచ్చెను.
"ఆహా!
ఆ
వరము
2
▾
Meaning
Keep
యొక్క
ప్రధమ
ద్వితీయ
చిహ్నములు
నేడు
పూర్తి
అయినవి.
మొదటిది
మహా
వీర
వానరులు
నా
చెంతకు
వచ్చుట.
రామనివాసస్థానము,
రామకథా
విధానమును
తెలుపుట
రెండవది.
ఇక
రామదర్శనము
మాత్రమే
కొదువ.
అది
కూడాను
అయినటులనే
తృప్తి
చెందుచున్నాను"
అని
ఆనందభాష్పములు
విడుచుచూ
ఆ
స్త్రీ
తన
సంతోషమునకు
హద్దులులేని
ఆనందమును
భరించుచుండ,
వానరులు
కూడా
అమితానందపడిరి.
అంతలో
ఆ
స్త్రీ
కన్నులు
మూసుకొని
యొకపరి
యోచించి,
"వానరులారా!
ఒక
సముద్రతీరమున
దివ్య
పట్టణములో
సుందరమైన
వనమున
సీత
ఏకాంతముగ
విలపించుచున్నది.
తప్పక
మీరు
చూతురు,
విచారించకుడు"
అని
ఆశీర్వదించెను.
అంత
వానరులు
గంతులు
వేసి
"ఆహా!
మనకు
సుగ్రీవుడిచ్చిన
వ్యవధి
రెండు
దినములలో
గడచిపోవును.
కానీ,
సీతను
చూడలేకపోతిమి"
అని
అంగదాది
వానరులు
విచారించిరి,
కన్నీరు
కార్చిరి.
సముద్ర
తీరమును
చేరి,
దానిని
దాటుటకు
యెవ్వరికీ
చేతకాక,
ఇసుక
తిన్నెలపై
గుంపులు
గుంపులుగా
కూర్చొని
విచారించు
చుండిరి.
అంగదుని
దుఃఖమును
చూచి,
జాంబవంతుడు
పలువిధములుగా
ఉపదేశించెను.
"మన
ప్రయత్నములో
యెట్టి
లోటునూ
లేదు;
శక్తి
లోపము
లేక,
అన్నపానాదులు
సహితము
ఆశించక,
క్షణమైనను
వృథాపరచక,
సీతను
వెతకుచునే
యున్నాము.
మన
ప్రభువు
సుగ్రీవుడు
మన
ప్రయత్నములను
చూడకున్ననూ,
శ్రీరాముడు
చూచుచునే
యున్నాడు.
కనుక,
రాముడెట్టి
శిక్షను
మనకు
అందించడు.
భయపడనక్కరలేదు.
అతని
కార్యము
కనుక,
అతని
నామమును
స్మరించుచూ,
మన
ప్రయత్నము
మనము
చేతము"
అని
కొంత
ఓదార్చు
మాటలు
పలికెను.
ఇంతలో
సహోదరునకు
తిలోదకములనిచ్చు
నిమిత్తము
ఒక
పెద్ద
వృద్ధపక్షి
అక్కడికి
వచ్చెను.
వానరులు
దాని
చుట్టూ
చేరి,
వీడు
రాక్షసుడా,
యెవడని
విచారించుటకు
ప్రారంభించిరి.
ఆ
పక్షి,
"వానరులారా!
నా
పేరు
సంపాతి.
నేనును
జటాయువును
సోదరులము.
చిన్న
తనములో
మేము
పందెము
వేసుకొని,
సూర్యుని
సమీపించుటకు
మీదికెగసితిమి.
సూర్యుని
వేడిమిని
సహించలేక
నా
తమ్ముడు
తిరిగి
వచ్చెను.
నేను
దురభిమానముచేత
పట్టిన
పట్టును
విడువక
మీది
కెగురుచుంటిని.
ఈ
విధముగా
అనేక
పర్యాయములు
చేయుటచేత
నా
రెక్కలు
కాలి
విరిగిపోయెను.
3
▾
Meaning
Keep
అంతరిక్షమునుండి
దబ్బున
క్రిందపడితిని.
ఆ
దారిని
చంద్రముడను
ముని
వెళ్ళుతూ,
నా
దురవస్థను
చూచి
జాలిపడెను.
అనేక
విధముల
నతడు
నాకు
జ్ఞానోపదేశము
చేసెను.
అతని
ఉపదేశముచే
నాకు
దురభిమానము
నశించెను.
'ఓ
పక్షిరాజా!
నా
మాట
వినుము!
త్రేతాయుగములో
శ్రీమన్నారాయణుడు
నరాకారుడై
అవతరించును.
అతని
భార్యను
రావణుడు
అపహరించును.
అతని
భార్యను
వెతకుటకు
వానరసైన్యము
వచ్చును.
ఆ
దూతలైన
వానరులను
చూచి
నీవు
పవిత్రుడవగుదువు.
అప్పుడు
నీ
రెక్కలు
నీకు
యధారీతిగా
వచ్చును.
అప్పుడు
సీత
వృత్తాంతము
వానరులకు
తెలుపు'మని
ఆదేశించెను.
ఈనాడు
నా
అదృష్టము
పండి,
నా
సోదరుడయిన
జటాయువునకు
తర్పణముచేయ
ఇట
కరుదెంచితి.
మీరు
నాకు
మునీంద్ర
వచనములను
స్మరణకు
తెప్పించితిరి.
స్మరణకేమిటి,
వారి
వచనములు
నెరవేరెను"
అనెను.
అంత
వానరులు,
ఆతురతతో
"సంపాతీ!
నీ
చరిత్రనటుంచుము.
మాకు
గడువు
సమీపించుచున్నది.
కనుక
సీత
జాడను,
ఆమె
చరిత్రమును
తెలుపు"
మని
ప్రార్థింప,
"ఓ
వానరులారా!
వినుడు.
ఒకనాడు
నాకు
అమితమైన
ఆకలివేయుచుండ,
నా
కొమారుడైన
సుపర్ణుని
పిలచి,
'నాయనా!
త్వరగా
వెళ్ళి
యేదైనా
ఆహారమును
తెమ్ము.
నాకు
వృద్ధాప్యము,
పైగా
రెక్కలు
లేవు
కాన,
నేను
తాళజాల’నని
బతిమిలాడగా,
కొమారుడు
అడవికి
వెళ్ళెను.
యెంతకాలము
చూచినను
కొమారుడు
రాకపోయెను.
నా
విచారము
అధికమాయెను.
ఆకలి
మాడ్చివేసెను.
కడకు
కుమారుడు
మృగమాంసమును
తీసుకొని
అలసివచ్చెను.
ఆకలిచేతను,
అజ్ఞానము
చేతను
భరించలేక
ఆలస్యముగా
వచ్చెనే
అను
నిరాశచే
కోపమును
పట్టలేక
కొమారుని
శపించుటకు
పూనుకొంటిని.
అంత
సుపర్ణుడు
నా
రెండు
కాళ్ళను
పట్టుకొని,
'నాన్నా!
నేను
కాలమును
ఒక
క్షణమైననూ
వృథా
పరచలేదు.
నా
విన్నప
మాలకింపుము.
నన్ను
క్షమింపుము'
అని
మాంసమును
పెట్టెను.
"అది
తిని
కొంత
వూరట
కలిగిన
తరువాత
ఆలస్యమునకు
కారణమడిగితిని.
అప్పుడు
'తండ్రీ!
నేను
వనమునకు
వెళ్ళినప్పుడు
యిరువది
భుజములను,
పది
శిరస్సులుగల
పురుషుడొకడు
మార్గమున
బోవుచుండెను.
అతనిచెంత
చక్కని
స్త్రీ
కలదు.
ఆమె
సౌందర్యము
వర్ణనాతీతము,
ఆమె
రోదన
వినలేకపోతిని.
అంత
వాడొక
జంతువని
భావించి
మొదట
వానిని
పట్టితిని.
తదుపరి
లోనవున్న
ఆ
4
▾
Meaning
Keep
సుందర
స్త్రీని
చూచితిని.
రామా,
రామా,
రామా
అనుపదమును
తప్ప
అన్యవచనము
ఆమె
నోటినుండి
రాలేదు.
ఈ
విధమైన
పోరాటముచేత
కాలము
విలంబమయ్యెను"
అని
తెలిపెను.
ఈ
మాటలు
వినగానే,
'అయ్యో!
నాకు
రెక్కలు
లేకపోయె
కదా!
వృద్ధాప్యము
వేరే
ప్రాప్తమయ్యే
కదా!'
అని
నాలో
నేను
దుఃఖించి,
నిజముగా
వాడెవడో
రాక్షసుడు
అని
తలంచి,
'నాయనా!
ఆ
దశకంఠుడు
యే
దిశకు
పోయెను?'
అని
ప్రశ్నించ
దక్షిణ
దిశకు
పోయెనని
చెప్పెను.
'అయ్యో!
ముని
చెప్పినటుల
వాడు
రావణుడే!
ఆ
స్త్రీ
సీతామాతయే!
ఇందులో
యేమాత్రము
సందియము
లేదు.
అపహరించి
కుక్కవలె,
నక్కవలె
దొంగగా
గొనిపోయెను'
అని
పండ్లు
కొరికితిని.
అంతకంటే
నేనేమి
చేయగలను"
అని
జరిగినదానిని
తెలిపెను
సంపాతి.
"మునీశ్వరుని
వచనములనుబట్టి
ఆమెను
వెతకుటకు
వానరులు
వత్తురు
అని
నిమిష
నిమిషము
లెక్కించుంటిని.
ఈ
నాటికి
నా
జన్మ
ధన్యమయ్యెను.
మిమ్ములను
దర్శించగలిగితిని,"
అని
ఆనందముతో
ఉన్మత్తుడాయెను.
"ఓ
వానరులారా!
సముద్రతీరమున
త్రికూటపర్వతముపై
లంకానగరము
కలదు.
ఆ
నగరములో
అశోకవనమను
సుందరమైన
ఉద్యానవనము
యున్నది.
అందులో
సీత
దుఃఖించుచూ
వుండును.
మీ
రాకకై
యెదురుచూచుచున్నది.
కనుక
మీరు
దక్షిణదిశకు
వెళ్ళుడు"
అని
చెప్పెను.
ఆమె
అశోకవనమున
చెట్టుక్రింద
దుఃఖించుచున్నది
మీకెట్లు
తెలిసెనని
అంగదుడు
ప్రశ్నించగా,
"నాయనా!
గృధ్రముల
దృష్టి
400
యోజనముల
దూరము
వరకు
ప్రసరించును.
నాకు
వృద్ధాప్యము
లేకున్న
మీకు
నేనెంతో
సహాయమును
చేసియుండెడివాడను.
వానరులారా,
నూరు
యోజనములు
దాటగల
బలవంతుడు,
బుద్ధిమంతుడు
రామకార్యము
సాధింపగలడు.
మీ
గుంపులో
అట్టివాడుండిన
యెడల
మీ
కార్యము
సిద్ధించును"
అని
అనుచుండ
సంపాతి
రెక్కలు
కొంత
యెగురునట్టి
రీతిగా
కదలిక
చిన్నెలు
కనుపించెను.
సంపాతి
పరమాశ్చర్యముతో
రెక్కలను
కొంత
కదిలింప
గలిగెను,
కొంత
యెగుర
గల్గెను.
ముని
వాక్యములు
సత్యరూపమున
ధరించెను.
"వానర
వీరులారా!
మీరు
రామ
కార్యమున
కెంతయో
ఉత్సాహముగ
నిద్రాహారములు
మాని,
ఏకైక
భక్తి
శ్రద్ధలతో
జీవితమును
ధారపోయుచున్నారు.
అట్టి
మీకు
రాముడే
సర్వశక్తులను
అందించి
తన
కార్యమును
చేయించుకొనును.
అతనిని
మనసారా
తనివితీరా
చింతించడమే
మీరు
చేయవలసిన
ప్రధానకార్యము.
5
▾
Meaning
Keep
తప్పక
సముద్రమును
దాటగలరు.
సీతను
చూడగలరు,
రామునకు
తృప్తి
గావించగలరు.
భగవత్
తృప్తి
మీ
జన్మమును
సార్థకము
గావించును.
దైవమునే
తృప్తి
గావించునట్టి
జన్మమే
జన్మము;
వాని
జీవితమే
లెక్కలోనికి
వచ్చునది.
మిగిలిన
జన్మములు
తిండికి
చేటు,
భూమికి
బరువైనవే
తప్ప
వేరు
ఫలముండదు"
అని
చెప్పుచు
పైకి
యెగిరెను.
చూచుచున్న
వానరులు
అతని
శక్తికి
సంతసించి
ఆశ్చర్యపడిరి.
"మూకం
కరోతి
వాచాలం
పంగుం
లంఘయతే
గిరిం"
అన్నట్లు
రామనామము
యెట్టి
కార్యమునైననూ
చేయించును.
రెక్కలు
లేని
సంపాతి
ఆకాశమున
యెగురుటకు
రామనామమే
కారణమన్నది
సంపాతి
వచనములు
ద్వారా
వానరులు
చూడగలిగిరి.
దీనిని
ఆధారము
చేసుకొని,
వానరులు
వారి
వారి
బలములను
పరీక్షించుకొనిరి.
కడకు
జాంబవంతుడు
వానరులతో
"మిత్రులారా!
నాకు
వృద్ధాప్యము
వచ్చినది.
పూర్వపు
బలము
క్షీణించినది.
యేదో
రామకార్యమను
సంతోషముతో
రామానుగ్రహముతో
ఇంత
మాత్రమైననూ
తిరుగాడగల్గుచున్నాను.
పరమేశ్వర
త్రివిక్రమావతార
సమయమున
నేను
పూర్ణవయసులో
నుంటిని,"
అని
అనుచుండ,
వానరులందరూ
యువరాజైన
అంగదుని
చుట్టూ
గూడి,
ఇట్లు
పలికిరి:
"ఓ
రాజా!
ఉపాయము
నాలోచింపుడు.
మనలో
సముద్రమును
దాటగల
బలవంతుడెవరో
తమరే
నిర్ణయించుడు,
తమ
ఆజ్ఞ
శిరసావహించి
ముందు
ప్రయత్నములు
చేతుము,"
అని
పలికినతోడనే,
అంగదుడు
సమావేశపరచి
యెవరెవరి
శక్తి
యెంతటిదో
తెలుసుకొనగోరెను.
వికటుడు
లేచి,
"రాజా!
నేను
ముప్పది
యోజనములు
దాటగలను"
అని
చెప్పెను.
నీలుడు,
"రాజా!
నేను
నలువది
యోజనములు
దాటుదునే
కాని
తరువాత
ఒక
అంగుళమైన
ముందుకు
పోలేను"
అని
తన
శక్తిని
తాను
నిరూపించెను.
దుర్ధరుడు
లేచి,
"రాజా!
నేను
ఏబది
యోజనములు
సునాయాసముగా
దాటుదును"
అని
తెలిపెను.
అంతలో
చేతులు
చాచి,
విఱ్ఱవీగి,
"నేను
అరువది
యోజనములు
దాటుదు"నని
నలుడు
పలికెను.
ఈ
రీతిగ
ముచ్చటించుచుండ,
అంగదుడు,
"ఓ
వానరులారా!
నేను
సముద్రమును
దాట
గలుగుదును
కానీ,
తిరిగి
రాగలనో
లేదో
అని
సందేహము!
వట్టి
దాటుట
మాత్రమే
కాదు,
అచ్చట
రాక్షసులతో
పోరాడవలెను
6
▾
Meaning
Keep
కదా?
ఆ
పోరాటములో
నా
బలము
అణగిపోవును.
రాక
పోకలకు,
పోరాడుటకు
తగినంత
బలము
లేదు"
అని
తాను
నిరుత్సాహపడిన
తత్క్షణమే,
నాయకులైన
వానరులు
లేచి,
"ఓ
రాజా!
మీరు
యువరాజులు!
మీకు
సామర్థ్యము
వుండిననూ,
లేకపోయిననూ,
విచారణీయాంశము
కాదు.
మీరు
స్వయముగా
వెళ్ళుట
ఉచితము
కాదు.
రాజధర్మములకు
విరుద్ధము.
ఆ
పనిని
మీ
సేవకులు
చేయగలరు.
ఇన్ని
కోట్లమంది
తమ
సేవకులుండ
తమను
ప్రవేశపెట్టుట
మాకు
నీతి
కాదు
కనుక
తామీ
కార్యవిషయమున
మరొకరిని
నియమించు"డని
జాంబవంతుడు
మున్నగువారు
ప్రార్థించిరి.
అంత
అంగదుడు
అటు
ఇటూ
చూచి,
"ఓయీ
వాయుపుత్రా,
నీవు
శ్రీరామబంటువూ,
మహాభక్తుడవు.
ప్రథమ
పరిచయమును
గావించుకొన్నవాడవు.
నీ
శక్తి
యుక్తి
భక్తులచేతనే
సుగ్రీవుడైన
రాజునకు
మైత్రి
గావించితివి.
అట్టి
నీవు
రామకార్యములో
మౌనముగా
వుండుటలోని
అంతరార్థమేమిటో
మాకర్థమగుటలేదు,"
అని
అనేక
విధముల
వాయుపుత్రుని
వర్ణించెను.
"నీవు
సాధించలేని
కార్యము
యేదీ
ఒకటి
వుండదు.
బుద్ధిమంతుడవు,
బలవంతుడవు,
గుణవంతుడవు,
హనుమంతుడవు.
నీ
శక్తిని
నీవు
యోచించుకొమ్ము"
అని
అంగదుడు
కొనియాడెను.
అంగదుని
మాటలు
అతనికి
పూర్వపు
శక్తిని
అందించెను.
దిగ్గున
లేచి,
"వానర
సోదరులారా!
మీరు
నా
రాక
కెదురు
చూచుచూ,
ఇచ్చటనే
నిలిచియుండుడు.
మీరు
ఇంతకాలము
వనములు,
అడవులు,
పర్వతములు
తిరిగి
విశ్రాంతి
లేక
అలసియున్నారు.
ఇక్కడనే
కందమూలాదులు
భక్షించుచూ,
విశ్రాంతి
తీసుకొనుడు.
నేను
ఇప్పుడే
సముద్రమును
దాటి
లంకలో
ప్రవేశించి
సీతను
చూచివచ్చెదను.
రామకార్యము
కంటే
నాకు
కావలసినది
మరొక్కటి
లేదు.
అతని
అనుగ్రహమునకు
పాత్రుడనగుటకంటే
జన్మకు
అన్యసార్థకత
యేమున్నది"
అని
అందరికి
నమస్కరించి
అంగదుని
అనుమతిని
పొంది,
"జై
రామా!"
అని
వానరులు
జయజయ
ధ్వనులు
సలుపుచుండ
మనసున
రామచంద్రుని
ఒక
పరి
స్మరించి,
సముద్రమును
దాటుటకు
కుప్పించి
యెగసెను.
హనుమంతుడు
కుప్పించి
లంఘించిన
వేగమున
కోర్వలేక
పర్వతముపై
నున్న
వృక్షములు
విరిగి,
అవి
కూడా
అంతరిక్షమున
కెగసెను.
అతడు
యెగిరిన
వేగమునకు
7
▾
Meaning
Keep
అతడు
నిలిచిన
పర్వతము
కూడ
అడుగునకు
దిగిపోయెను.
అంతపైన
వెళ్ళుతున్న
హనుమంతుని
చూచి
సముద్రము
తనలోతానిట్లు
భావించెను.
'ఈ
హనుమంతుడు
రామదూత,
రామకార్యార్థమై
బయలుదేరెను;
ఆహా!
యితడెంతటి
అదృష్టవంతుడో
కదా?
రామ
కార్యము
జయము
గావించునంతటి
భక్తిశక్తులు
గలిగిన
హనుమంతుడు
రామసేవకులలో
ప్రధానుడను
సార్థక
నామమును
అందుకోగలడని'
ఆనందించెను.
సముద్రమున
దాగిన
మైనాకమను
పర్వతము
వేగముగా
వెళ్ళుచున్న
హనుమంతుని
చూచి
నీటిలో
నుండి
పైకి
లేచి
హనుమంతుని
రామకార్యములో
తాను
కూడా
సేవాభాగ్యమును
అనుభవించవలెనని
భావించి,
"వాయుపుత్రా!
ఇంత
దూరము
ఒకే
వేగమున
వెళ్ళుట
శ్రమ
కావచ్చును.
కాన,
నా
తలపై
కొంత
విశ్రమించుము.
నాకు
మీ
రామసేవలో
కొంత
భాగమును
కలిగించుము"
అని
ప్రార్థించెను.
హనుమంతుడు
మైనాకము
యొక్క
ప్రార్థనను
మన్నించి
దానిని
చేతితో
స్పృశించి,
అతనికి
నమస్కరించి,
"ఓ
మైనాకమా!
రామకార్యార్థమై
నేను
వెళ్ళుచున్నాను;
ఆ
కార్యము
పూర్తి
అగువరకూ
ఆహారనిద్రలు
నాకవసరము
లేదు.
విశ్రాంతి
యుచితము
కాదు"
అని
రామనామమును
స్మరించుచూ
కాలహరణము
చేయనని
నేరుగా
లంకకు
తన
వేగమును
కొనసాగించెను.
మార్గమధ్యమున
సురస
అను
నాగమాత,
సింహిక
అను
రాక్షసి
అనేక
విధముల
ఆటంకములు
పెట్టిననూ,
లెక్కచేయక
వారలను
జయించి
ఒడ్డు
చేరెను.
అక్కడ
సముద్రతీరముననున్న
ఉద్యానవనములు,
వినోదభవనములు,
హనుమంతుని
మైమరపించెను.
హనుమంతుడు
పరమానందము
పొందెను.
ఆ
వనములోని
వివిధ
పక్షుల
గుంపులు
రంగులు
రంగులు
గల
వివిధ
జాతులు
హనుమంతుని
మనసును
భ్రమింపజేసెను.
ఆ
సమీపముననున్న
ఒక
సుందరమైన
పర్వతముపై
అవలీలగా
యెగిరి
కూర్చొనెను.
ఇది
యంతయూ
నా
శక్తి
సామర్థ్యము
లేమాత్రమూ
కాదు.
ఇదంతయూ
శ్రీరామకృపాకటాక్షమేయని
తనలో
తలంచెను.
వింతవింతైన
భవనములు,
ఉద్యానవనములు
స్వర్గమునే
మరిపింపజేసెను.
ఒక
క్షణము
ఇది
వైకుంఠమా,
లంకయా
అన్న
సందేహము
హనుమంతునిలో
ప్రవేశించెను.
ఎటు
చూచిన
బలరూపులైన
రాక్షస
సైన్యము
వీధులలో
8
▾
Meaning
Keep
సంచరించుచుండెను.
కామరూపిణులయిన
రాక్షసస్త్రీలు
స్వేచ్ఛావిహారము
సలుపుచుండిరి.
దేవ,
నాగ,
గంధర్వ,
మనుజకన్యలు
వేలకు
వేలు
రావణుని
ఆధీనములో
పరితపించుచూ,
భయముతో
వణకుచూ
కాలము
గడుపుచుండిరి.
ఈ
విధమైన
సంచలనమును
చూచి,
హనుమంతుడు
తన
నిజమైన
రూపముతో
ప్రవేశించుట
మంచిది
కాదని
లోతలంచి
సూక్ష్మరూపమును
ధరించి
పురములో
ప్రవేశించెను.
లంకానగరమును
కాపాడుచుండిన
రాక్షసి,
అనగా
లంకలో
యెవ్వరినీ
క్రొత్తవారిని
ప్రవేశించక
చూచుకొనుచుండిన
రాక్షసి,
దాని
పేరు
లంకిణి.
అది
వింతైన
రూపమును
దాల్చిన
హనుమంతుని,
చూచి,
"ఓరీ!
ఎవరు
నీవు?
నీవెక్కడనుండి
వచ్చితివి?
లంకలో
ఇట్టి
ఆకారమృగములు
నేనింతవరకూ
చూడలేదు.
ఒకవేళ
వెలుపలనుండి
ప్రవేశించెనా
అనుటకు
చుట్టూ
జలమయమైన
సముద్రము,
నిన్ను
చూడ
నీవు
సామాన్యునివలె
కనుపించుటలేదు.
సముద్రము
నెట్లు
దాటితివి?
నన్ను
ధిక్కరించి
యెటుపోయెదవు?
నిలువు"మని
లంకిణి
గర్జించెను.
హనుమంతుడు
ఆ
లంకిణి
మాటలను
లెక్కచేయక,
వినని
వానివలె
తన
తోకను
ఈడ్చుకుంటూ
ముందుకు
నడచుచుండెను.
లంకిణి
మరింత
గట్టిగా
"ఓయి
మూర్ఖుడా!
నా
మాటలు
వినిపించుటలేదా?"
అని
గర్జించెను.
హనుమంతుడు
యేమీ
లెక్కచేయక
తనలో
తాను
నవ్వుకొనుచూ
ముందుకు
నడువసాగెను.
లంకిణి
ఓర్పును
పోగొట్టుకుని,
"హే
వానరమా!
నా
ఆజ్ఞను
ధిక్కరించి
వెళ్ళువాడు
నాకు
ఆహారము
కావలసివచ్చును.
క్షణములో
నిన్ను
నమిలి
వేయగలను,
జాగ్రత్త!"
అని
ఆ
సూక్ష్మాకారము
ధరించిన
హనుమంతుని
పట్టుకొనుటకై
వెళ్ళెను.
అంత
హనుమంతుడు
మారుమాటాడక
ఒక్కతూరి
తన
పిడికిలితో
ఆ
లంకిణిని
గ్రుద్దెను.
ఆ
గ్రుద్దుతో
లంకిణి
స్పృహతప్పి
నేలమీద
కూలెను.
లంకిణి
ముఖమునుండి
రక్తము
తీవ్రముగా
కార
మొదలిడెను.
కొంతసేపయిన
తరువాత
లంకిణి
స్పృహ
తెప్పించుకుని
తిరిగి
హనుమంతునిపై
పడి
అతనిని
పట్టుటకై
ప్రయత్నించెను.
మరి
రెండవ
గ్రుద్దు
వీపుపై
గ్రుద్దిన
తత్క్షణమే
లంకిణి
కదలలేకపోయెను.
ఆ
వేటుతో
కొంత
జ్ఞానముకూడా
కలిగి,
కదలలేని
స్థితిలో
కూర్చొని,
చేతులు
జోడించుకొని,
"ఓయీ
ఆశ్చర్యరూపుడా!
పూర్వము
రావణునకు
బ్రహ్మదేవుడు
వరములనిచ్చి
నిష్క్రమించు
సమయమున
నన్ను
చూచి,
'ఓ
9
▾
Meaning
Keep
లంకిణి!
యెప్పుడు
నీవు
వానరుని
గ్రుద్దువలన
వ్యాకులము
చెందెదవో,
నీ
బలము
నిర్వీర్యమగునో,
నీ
శక్తి
నశించునో,
అప్పుడే
రావణునకు
మరణకాలమాసన్న
మగునని
తెలిసికొనుము.
ఇంతేకాదు,
ఆ
వానరుడు
భగవత్
కార్యనిమిత్తమై,
దైవాజ్ఞను
శిరసావహించి
లంకలో
ప్రవేశించును.
అతని
రాక
లంకలోని
రాక్షసుల
హతమార్చుటకే
అన్న
సత్యమును
గుర్తించు,
ఆనాటి
నుండి
రాక్షసుల
వినాశకాలమాసన్నమయినదని
తలంచు,'
అని
పలికెను.
"కనుక
ఓ
వానరా!
నేను
యెంతయో
పుణ్యాత్మురాలను
నా
దృష్టి
పవిత్రమాయెను.
భగవంతుడు
పంపిన
దూతను
చూడగల్గితిని.
అంతేకాక,
ఆ
దూత
హస్తముచే
నేను,
నా
శరీరము
పావనమాయెను.
ఆహా!
ఆ
గ్రుద్దు
ఎంత
హాయిగా
వున్నది,
యెంత
తీయగ
వున్నది!"
అని
హనుమంతుడు
కొట్టిన
స్థానమును
సారెసారెకూ
నిమిరుకుంటూ
యెంతో
ఆనందించుచుండెను.
లంకిణి
మాటలను
లెక్కచేయక
వర్ణనలకు
పొంగక,
దూషణలకు
క్రుంగక
రామనామమును
స్మరించుచూ
హనుమంతుడు
లంకలో
ప్రవేశించెను.
ఈ
లంకలో
జానకి
వృత్తాంతము
చెప్పు
వారెవరు
అని
హనుమంతుడు
తనలో
తాను
తలంచుచూ,
సీతను
గుర్తించుటెట్లు
అని
సూక్ష్మరూపముతో
వృక్షములపై
వుండి
బజార్లలో
అటు
ఇటూ
తిరుగు
భయంకర
రాక్షసులను
గుర్తించుచూ
వారల
కంటబడక
యెన్నెన్ని
విధములగనో
ప్రవర్తించుచు
ఉండెను.
ఇంతలో
ఒక
హరిమందిరము
వంటి
దానిని
ఒక
దానిని
చూచెను.
దానికి
ముందూ
వెనుకా
తులసి
వనము
వేయబడి
వుండెను.
ముఖద్వారముపై
హరి
నామము
వ్రాయబడి
వుండెను.
ఆ
గృహము
సాక్షాత్
దైవనిలయముగనే
కనుపించెను.
ఏమి
ఈ
వింత?
లంకలో
ఏమిటి?
హరినామము
వ్రాయబడుటేమిటి?
అది
యేదో
పవిత్రమైన
గృహము
వలె
నున్నది
అని
యెవ్వరికీ
తెలియనిరీతిగా
సూక్ష్మరూపమును
ధరించి
ఆ
భవనముపై
కూర్చొని
లోనికి
తొంగిచూచెను.
అప్పుడే
పడకనుంచి
అటు
ఇటు
పొర్లుతూ
ఒక
వ్యక్తి
హరినామమునుస్మరించుచూ
లేచెను.
ఆ
మాటలు
వినగానే
హనుమంతునికి
పరమానందమాయెను.
లంకలో
సయితము
హరినామము
తలంచువారున్నారను
సంతోషము
కలిగి
కొంత
ధైర్యముతో
విచ్చలవిడిగా
10
▾
Meaning
Keep
సంచరించ
మొదలిడెను.
ఇతనెవరో
సత్పురుషునివలె
కనిపించుచున్నాడు.
ఇతనిని
ఆశ్రయించిన
తల్లి
సీత
జాడలు
తెలియగలవని
కూడా
తలంచెను.
అంతేకాక,
నేను
హరిదాసుడను.
ఇతనూ
హరిదాసుడు.
మా
యిరువురికి
స్నేహము
సులభముగా
యేర్పడగలదు
అని
పూర్ణధైర్యముతో
తన
ఆకారమును
మార్చుకొని
ఒక
బ్రాహ్మణుని
వేషముతో
విభీషణుని
యింటిలో
ప్రవేశించెను.
ఆ
బ్రాహ్మణుని
చూచి
విభీషణుడు
ఈ
నూతన
బ్రాహ్మణుడెవడోనని
కొంత
యోచించి,
యెవరైననేమీ
బ్రాహ్మణుడు
కదా!
అని
అతనికి
నమస్కరించెను.
అంత
హనుమంతుడు
సంభాషణ
ప్రారంభించెను.
విభీషణుడు,
ఆ
బ్రాహ్మణుని,
"స్వామీ!
తమరెవ్వరు?
యెక్కడి
నుండి
యేతెంచిరి?
వీధులలోని
రాక్షసులను
యేరీతిగా
తప్పించుకోగలిగితిరి"
అని
అనేక
విధముల
రాక్షసుల
చర్యలను
వర్ణించుచూ,
హనుమంతుని
ధైర్యసాహసములను
వర్ణించుచూ
వచ్చెను.
హనుమంతుడు
"నేనొక
హరిదాసుడను,
నా
పేరు
హనుమంతుడు.
రామచంద్రుడు
పంపగా
వచ్చిన
దాసుడను"
అని
రాముని
గుణగణములు
వర్ణించెను.
ఆ
మాటలు
వింటూ
వుండినంత
సేపు
విభీషణుని
కంటినుండి
ఆనందధారలు
ప్రవహించెను.
నేడెంత
సుదినము.
నాదెంత
భాగ్యము,
తెల్లవారగనే
ఇట్టి
శుభవార్త
వినగలిగితిని
అని
తనలో
తాను
వుప్పొంగిపోవుచుండెను.
ఈ
దృశ్యమును
చూచి
హనుమంతుడు
రామానుగ్రహమేనని
తలంచి
ఈ
భయంకరమైన
లంకలో
ఇట్టి
నిర్భయుడైన
హరిదాసుడు
కూడా
ఒకడున్నాడు
కదా
అని
తలంచి,
"అయ్యా!
మీరీ
లంకలో
ఎట్లు
జీవించుచున్నారు?
బ్రతుక
గలిగినారు?"
అని
ఆ
విభీషణుని
ప్రశ్నించగా,
విభీషణుడు,
"అంతా
దైవకృప.
ఎంత
కాలము
జీవించాలని
తాను
సంకల్పించునో
అంతకాలము
జీవించక
తప్పదు.
ప్రకృతికి
ప్రభువైన
దేవుని
నామమును
ఎవ్వరూ
ధిక్కరించలేరు,
మార్చలేరు.
దంతముల
మధ్య
నాలుక
జీవించుటలేదా?
ఇది
ఎవరి
సంకల్పము?
కాన
నా
బ్రతుకునకై
మీరు
ఆశ్చర్యపడనక్కర
లేదు.
మీరేపని
బూని
ఇచ్చటకు
వస్తిరో
విన్నవించుడని"
చేతులు
జోడించి
ప్రార్థించెను.
ఇట్టి
సజ్జన
సాంగత్యము
ఏదో
ఒక
ఘనకార్యసిద్ధి
చేకూర్చును
అని
అనేక
విధముల
చక్కని
మాటలాడుచున్న
విభీషణుని
చూచి
హనుమంతుడు
తనలో
తాను
పొంగిపోవుచూ
క్షణక్షణమునకూ,
రామా
రామా
అని
పలుకజొచ్చెను.
ఇట్టి
మిత్రుని
11
▾
Meaning
Keep
చెంత
నేనిక
ఎట్టి
గుట్టును
పెట్టుకొనుట
మంచిది
కాదని
తలంచి,
మనస్సు
విప్పి
మాట్లాడుట
మంచిదని
ఎంచి,
"అయ్యా,
మీ
పేరేమి?
ఈ
లంకలో
మీరేమి
చేయుచున్నారని"
వినయముతో
ప్రశ్నించిన
హనుమంతుని
వాక్యములకు,
విభీషణుడు
"అయ్యా!
నేనొక
దౌర్భాగ్యుడను,
రావణుని
సోదరుడను,
నా
పేరు
విభీషణుడు,
స్వేచ్ఛగా
హరినామము
చేయలేని
దుస్థితిలో
వున్నా"నని
చెప్పగనే,
హనుమంతుడు
తన
కోర్కె
తీరినదని
తలంచి,
ఒక్క
గంతువేసి,
నేను
రామదూతను,
సీతాన్వేషణ
నిమిత్తమై
లంకలో
ప్రవేశించితినని
చెప్పెను.
విభీషణుడు
హనుమంతునకొక
నమస్కారము
చేసి,
"అయ్యా,
నా
రాముడెక్కడ?
అతనిని
నే
దర్శించవీలగునా!
నా
ప్రభువు
కార్యనిమిత్తమై
వచ్చితివా?
అయ్యో
నీవెంత
ధన్యుడవు,
పుణ్యుడవు.
అతనిని
చూచునట్టి
ఉత్తమగుణములు
నాలో
లేకపోయే
కదా!
నా
వంశము
రాక్షసవంశము,
ఎట్టి
సాధనలు
చేయలేదు,
తపస్సు
చేయునంతటి
స్వతంత్రుడను
కాను.
ఏ
అధికారము
లేని
నన్ను
రాముడు
చూచునా?
అతని
అనుగ్రహము
నేను
అందుకొనగలనా?"
అని
రామదర్శనార్థమై
విలపించుచున్న
విభీషణుని
పరితాపము
హనుమంతుని
హృదయాన్ని
ద్రవింపజేసెను.
అందులకు
హనుమంతుడు
విభీషణుని
ఓదార్చి,
"విభీషణా!
రామచంద్రుడు
నీ
హృదయమును
మాత్రమే
చూచును
కాని,
నీ
వంశకులమత
సాధనాది
అంగములను
చూడడు,
భావప్రియుడు
శ్రీ
రాముడు,
నీ
భావశుద్ధికి
తప్పక
అనుగ్రహించును,
దర్శనమిచ్చును,
విచారింపకుము.
ఈ
విషయమున
నాకు
నేనే
సాటి.
నేనా
కోతి
జాతికి
చెందిన
వాడను,
చంచలత్వమునకు
పుట్టినయిల్లు
పెట్టిన
పేరు.
వేదశాస్త్రాలు
నాకేమాత్రము
తెలియవు.
తపస్సు
యెట్టిదో
నేనెరుగను.
జపధ్యానాలు
నే
చేయలేదు.
నన్నెట్లు
అనుగ్రహించెను?
నాలోని
భావమును,
ప్రేమను
మాత్రమే
చూచి
నన్ను
చెంత
చేర్చెను.
అటులనే
నీ
భావమును,
ప్రేమను
మాత్రమే
చూచి
అనుగ్రహించును.
ధైర్యముగా
నుండు"
మని
హనుమంతుడు
అనేక
రకముల
ఓదార్చెను.
అనంతర
మతడు
సీతను
గురించి
హనుమంతునికి
సవివరముగా
తెలిపెను.
హనుమంతుడు
విభీషణుని
అనుమతి
తీసుకొని,
సీతను
చూచునంతవరకు
నాకెట్టి
ఆహారపానీయములు
వలదని
ముందుకు
పోవచూచెను.
విభీషణుడు
శాంతముతో
12
▾
Meaning
Keep
హనుమంతుని
కొంత
శాంతపరచి,
అవసరపడుట
మంచిది
కాదని
లంకలోని
మర్మములన్నియూ
విడివిడిగా
హనుమంతునికి
తెలపి,
వెళ్ళుటకు
అనుమతి
నిచ్చెను.
హనుమంతుడు
సీత
వున్నదన్న
వార్తవిని,
ఎక్కడ
వున్నది
అను
విషయమును
మరచి
అనేక
గృహములు
శోధించెను.
అంతఃపురములో
అనేక
విధముల
భోగభాగ్యాలతో
ఉన్మత్తులై
పడినవారలను
చూచెను.
సీత
యిట్టి
భోగభాగ్యముల
నొల్లదన్న
సత్యాన్ని
గుర్తించి,
రాముడు
చెప్పిన
అన్ని
విధముల
గుణగణములను
దృష్టి
యందుంచుకొని
ఒక్కొక్క
స్త్రీని
చూచుచూ
వెళ్ళెను.
ఎక్కడా
సీత
జాడ
కనుపించలేదు.
నిరాశ,
నిస్పృహలతో
తిరిగి
పర్వతముపై
కూర్చుని
ఎన్ని
విధములగనో
యోచించి,
సీతను
చూడక
నేను
రామునెట్లు
జూతును.
అట్లు
వెనుకకు
వెళ్ళుటకంటే
ఈ
సముద్రమునందే
పడి
నా
ప్రాణములను
కోల్పోదును.
నా
జీవితము
వృథా,
అని
తనపై
తాను
విసుగుపడుచూ
వుండగా
దూరమున
ఏదో
ఒక
సుందరమైన
వనము
కనుపించెను.
క్రిందికి
దిగి
చూడగ
ఎత్తైన
భవనముల
మధ్య
ఆ
వనమెక్కడో
ఏమో
తెలియకపోయెను.
చేయునది
లేక
తిరిగి
విభీషణుని
ఇంటికి
వెళ్ళెను.
అక్కడ
విభీషణుడు
రామనామము
చేయుచూ
కాలము
గడుపుచుండెను.
ఇతని
రాకను
చూచి
విభీషణుడు
ఆప్యాయముతో
చెంతకువచ్చి,
"హనుమంతా!
సీతను
చూచితివా?"
అని
ప్రశ్నించెను.
హనుమంతుడు
నిరాశతో
తన
ఆతురతను
వెలిబుచ్చెను.
అంత
విభీషణుడు,
"హనుమంతా!
అశోకవనమను
ఒక
సుందరమైన
ఉద్యానవనము
కలదు.
అందులో
అనేక
మంది
బలమైన
రాక్షసుల
మధ్య
సీత
రామచింతనతో
కాలము
గడుపుచున్నది.
నా
సతీపుత్రికలిరువురూ
ఆ
దేవి
సేవచేసుకొంటూ
వున్నా"రని
దానికి
తగిన
మార్గములు
విడిగా
తెలిపెను.
అంత
మారుతి
ఒక్క
క్షణమైననూ
అక్కడ
గడుపక
అశోకవనము
చేరెను.
మార్గమధ్యములో
ఈ
రూపాన్ని
చూసిన
వారందరు
విచిత్రముగా
కేకలు
వేయదొడగిరి.
దానిని
చూచి
హనుమంతుడు
తన
కార్యమునకు
భంగము
కలుగునేమో
అని
తలంచి
అతి
సూక్ష్మరూపమును
ధరించి
చెట్లకొమ్మల
ఆకుల
మాటున
దాగుకొంటూ
అశోకవనము
చేరెను.
ఒక
వృక్షము
క్రింద
నిద్రాహారములు
లేక
క్రుంగి,
కృశించి,
శల్యావస్థయందుండిన
ఒక
స్త్రీని
చూచెను.
ఆమె
చుట్టు
బలమైన
రాక్షసులు
13
▾
Meaning
Keep
భయపెడుతూ
వప్పించుటకు
అనేక
మాటలు
చెప్పుచుండిరి.
ఇంతలో
పెద్ద
భేరీలు
వాయించుచూ
ఒక
దర్బారు
వచ్చెను.
వారి
వెనుక
సర్వాలంకార
భూషితుడై
ఒకడు
రాజువలె
వచ్చెను.
అనేక
సుగంధద్రవ్యములతో
ఆభరణములతో
వస్త్రములతో
దాసదాసీలు
నూర్లకు
వచ్చిరి.
ఈ
దృశ్యమంతయూ
చెట్టుపై
ఆకుల
మధ్యనుండి
చూచుచూ
హనుమంతుడు
గమనించెను.
రావణుడు
వచ్చి
తనను
ప్రేమించుమని
అనేక
విధముల
బతిమిలాడటము,
భయపెట్టటము,
చెంతనున్న
వారలకు
హెచ్చరించటము
చూచెను.
అందులకు
ఆ
కృశించిన
స్త్రీ
తలయెత్తి
అయిననూ
చూడక,
మూర్ఖుడా,
ఛండాలుడా!
నా
పైన
రామచంద్రునకు
తప్ప
అన్యులెవరికీ
అధికారము
లేదనియూ
నా
దేహము
అతని
చింతలోనే
భస్మము
గావింతును
గానీ
మరొక
రీతిగా
దారి
తప్పనన్నది
బాగా
గుర్తించుమని
కఠినసూక్తులాడుచున్నది
విని,
హనుమంతుడు
ఈమెయే
సీత
అని
దృఢము
చేసుకొని
మనసు
సమాధానపరచుకొనెను.
కొంతసేపయిన
తరువాత
రావణుడు
నిరాశతో,
ఉద్రేకముతో
భయపెట్టి,
ఒక
నెల
గడువునిచ్చి
వెళ్ళెను.
అతనితోపాటు
అతని
పరివారము
కూడా
వెళ్ళెను.
వారందరూ
వెళ్ళిన
తరువాత,
సీత
తల
పైకెత్తి
రామా,
రామా,
ఇంకనూ
దయ
రాలేదా?
నన్నెందులకిట్లు
చిక్కులపాలు
చేయుచున్నావని
యేడ్వమొదలు
పెట్టెను.
Previous
←
Friendship with Sugrīva
Next
The Darśana of Sītā
→