Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Darśana of Sītā
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
7
సీతా
దర్శనము
త్రిజట
అను
ఒక
రాక్షసస్త్రీ
సీత
చెంతనే
కాపలా
గాయుచుండెను.
ఆమెకు
రామచరణారవిందములందు
అమిత
ప్రీతి,
భక్తి
కలదు.
అంతేకాదు,
ఆమె
విషయజ్ఞానముతోపాటు
దైవజ్ఞానము
కూడనూ
కలది.
ఆమె
రాక్షస
స్త్రీలతో
కలసి,
"ఓ
సఖులారా!
రాత్రి
నాకొక
స్వప్నము
వచ్చెను.
జానకిని
సేవించి,
మొదలు
ఆమె
కటాక్షమును
సాధింపుడు.
కలయొక్క
వివరములు
సావధానముగా
వినుడు.
ఒక
వానరుడు
మన
లంకాపట్టణమునకు
వచ్చి
రాక్షసులను
సంహరించి
పట్టణమును
దహించెను.
రావణుడు
దిగంబరుడై
గార్దభము
నెక్కి
దక్షిణదిశకు
పోవుచుండెను.
వానికి
శిరస్సు
ముండనము
చేయబడెను.
వాని
చేతులు
నఱికబడెను.
లంకారాజ్యము
విభీషణునకు
పట్టము
కట్టిరి.
రామ
నామమును
నగరమంతటా
చాటిరి.
తదుపరి
ఇంతేకాదు,
రాముడు
సీతకు
వర్తమానమును
పంపెను.
రాక్షసులారా!
ఇది
నిజము.
నాకెన్నడునూ
స్వప్నమన్నది
రాదు,
రాలేదు.
ఒకవేళ
వచ్చెనా,
అది
సత్యము
కాక
తప్పదు.
సత్యము
కాని
స్వప్నము
ఈ
త్రిజటకు
రాదు.
అధిక
దినములు
కూడా
జరుగవు.
ఇక
4,5
దినములలో
ఈ
రీతిగా
జరిగితీరును"
అని
స్వప్న
వృత్తాంతమును
చెప్పెను.
రాక్షస
స్త్రీలు
ఈ
విషయమును
విని
సీతాదేవికి
నమస్కరించిరి.
అనంతరము
ఆ
రాక్షస
స్త్రీలు
నలువైపుల
నుండి
వారి
పనులు
వారు
నిర్వర్తించుటకు
వెడలిపోయిరి.
అంత
జానకి
త్రిజటను
చూచి
"త్రిజటా,
శ్రీరాములే
నిన్ను
పంపెను
కాబోలు!
నిజముగా
నీబోటి
స్త్రీ
ఈ
లంకలో
వుండుట
చేతనే
నాబోటి
స్త్రీలు
మాన
సంరక్షణ
గావించుకోగలుగుచున్నారు.
లేకున్న
నాబోటి
వారల
గతి
యేమైయుండెడిదో?
వింటివి
కదా,
మీ
రావణుడు
పలికిన
పలుకులు.
ఒక
నెల
దినములు
గడువు
పెట్టెను.
ఈ
నెల
దినములలో
నా
రాముడే
రాకున్న
నేను
అనగా
నా
దేహము
ముక్కలు
ముక్కలతో
2
▾
Meaning
Keep
యే
కాకుల,
గ్రద్దల
పాలో
కాగలదు.
నేను
రాముని
సతినై
కడకు
నా
దేహము
యిట్టి
దుస్థితికి
గురియైన
నే
భరించలేను.
దానికి
పూర్వమే
యేదైన
ఉపాయము
చెప్పుము,
నేను
దేహము
త్యాగము
గావింతును"
అని
విలపించుచూ
చెప్పుట
హనుమంతుడు
వినలేకపోయినాడు.
త్రిజట
సీతకు
నమస్కరించి,
"తల్లీ,
విచారించకుము.
రాముడు
సామాన్యుడు
కాడు.
అతని
ప్రతాపము,
పరాక్రమము
ఈ
లోకములో
కాదు,
మరేలోకములో
కూడను,
యెవ్వరికినీ
రాదు,
లేదు,
రాబోదు.
నిన్నతడే
కాపాడును.
త్వరలో
అతడు
వచ్చి
నిన్ను
చేకొనును.
అధైర్యపడకు"
మని
ప్రీతి
వచనములు
చెప్పి,
గృహమునకు
వెళ్ళెను.
ఈ
సుసమయమును
ఆధారము
చేసుకొని,
హనుమంతుడు
చెట్టునుండి
అతి
సమీపపు
కొమ్మలపైకి
దుమికి,
సీతకు
ముందు
నిప్పు
కణమువంటి
ముద్దుటుంగరమును
క్రిందకు
విడిచి
రామనామమును
గానము
చేయబూనెను.
సీత,
ముందు
పడిన
ఆ
ముద్దుటుంగరమును
చూచి,
పరమాశ్చర్యపడి,
ఇది
నిజమా
లేక
కలయా?
శ్రీరాముడు
వ్రేలునకు
ధరించిన
ఈ
స్వర్ణఉంగరము
ఈ
లంకలో
కనిపించుటేమిటి?
ఇది
రాక్షసమాయయా
లేక
నా
భ్రమయా
అని
తనలో
తాను
తర్కించుకొని,
యేమైననేమి,
నా
రామచంద్రుని
ఉంగరమని
తెలిసియూ
నేను
స్పృశించకుండిన
యెంతటి
పాపము
అని
తత్క్షణము
ఆ
ఉంగరము
తన
చేతితో
తీసుకొని
కన్నులకద్దుకొని
ఆనందభాష్పములు
రాల్చుచు,
"రామా!
నీ
దర్శనమును
ఈ
ఉంగరము
ద్వారా
ఇచ్చుచున్నావా?"
అని
తలయెత్తి
పైకి
చూచినతోడనే
ఒక
చిన్న
వానరుడు
రామా,
రామా
అని
స్మరించుచుండినటుల
కనుపించెను.
తత్క్షణము
త్రిజట
చెప్పిన
కథ
జ్ఞాపకము
చేసుకొని,
ఆహా!
నాకు
సుదినములు
సమీపించుచున్నట్లున్నవి.
పది
నెలలుగా
రామనామమే
వినని
ఈ
లంకలో
నేడు
రామనామము
స్మరించు
జీవుని
చూడగల్గితిని.
రాముని
ముద్దుటుంగరము
అందుకోగలిగితిని
అని
పొంగిపోయెను.
అంతటితో
తన
ఆనందమును
పట్టుకోలేకపోయెను.
ఏనాడూ
పరులతో
పలుకైనా
పలుకని
సీత,
ఆ
వానరాకారము
చూచి,
'ఓ
వానరా!
నీ
వెవడవు,
ఈ
ఉంగరము
నీకెక్కడిది?'
అని
ప్రశ్నించెను.
లోలోన
రాక్షసుల
మాయలను
అనేకముగా
చూసి,
అనుభవించుటచేత,
వానరుని
అంత
త్వరలో
నమ్మలేకపోయెను.
అనేక
విధముల
వానరుని
ప్రశ్నింప
మొదలు
3
▾
Meaning
Keep
పెట్టెను.
మధ్య
మధ్య
రామచంద్రుని
క్షేమవార్తలను
అడుగుచూ,
కంటిధారలు
కార్చెను.
ఈ
విధముగా
హర్ష
విషాదములచే
దోలాయమానమగుచున్న
సీతను
చూచి
హనుమంతుడు
తనకు,
రామునకు
కలిగిన
సంబంధబాంధవ్యమును
లోన
యిముడ్చుకోలేకపోయినాడు.
రాముని
పుట్టుపూర్వోత్తరములను,
తన
జీవిత
చరిత్రనూ
పూసగ్రుచ్చినటుల
చెప్పెను.
ఆ
చరిత్ర
వింటూ
వుంటే
సాక్షాత్
రామచంద్రుడు
నిజముగా
ఆమె
కంటిముందు
నిలచినట్లుగా
ఆమె
రామునితో
అయోధ్యలో,
అరణ్యములో
వుండినట్లుగా
తన
తనువునే
మరచి
ఆనందించెను.
సీత
లోకస్పృహకు
వచ్చి,
"వో
వానరా!
యిన్ని
చెప్పితివి.
కానీ
నీవు
వానరునిగా
వుండి
యింత
కఠినమైన
లంకలో
ఎట్లు
జొరబడితివి?
రాక్షసులచేత
చిక్కక
ఎట్లు
నన్ను
నీవు
చూడగలిగితివి?"
అని
అతని
శక్తిసామర్థ్యములను
పరీక్షించగోరెను.
అంత
హనుమంతుడు,
"తల్లీ!
నాదేమీ
లేదు.
నేను
రామబంటును,
దాసుడను,
అంతా
రాముడే
చేయించుచున్నాడు.
అతను
లేక
క్షణమైనను
కూడ
నిలువలేను,
నేనొక
బొమ్మను.
అతను
ఆడించునటుల
ఆడువాడనే
కాని
నాదేమున్నది?"
అని
రాముని
వేవిధముల
వర్ణించుచూ
భక్తిప్రపత్తులు
శ్రవణానందముగా
వినిపించెను.
కానీ
యింకా
పరులకు
తెలియని
కొన్ని
సన్నివేశములు
రాముడు
హనుమంతునితో
తెలిపియుండెను.
ఒకవేళ
సీత
నిన్ను
నమ్మకపోవచ్చును
కాన
అట్టి
సహజమును
ఆధారము
చేసుకొని
ఈ
అమూల్యమైన
విషయములు
సీతకు
జ్ఞాపకము
చేయుమని
ముందే
రాముడు
తెలిపియుండెను.
ఇప్పుడు
ఆ
సమయమును
ఆధారము
చేసుకొని
హనుమంతుడు,
"తల్లీ,
జానకీ!
కాకాసురుడు
తమను
హింసించగా
తమకు
శ్రీరాముడు
గావించిన
సహాయము,
కాకాసురుని
వధించుటకు
చేసిన
ప్రయత్నములు
జ్ఞాపకము
చేయుమని
చెప్పెను"
అనగానే
సీత
గొల్లున
యేడ్చి,
"హనుమంతా,
నా
రాముడు
ఆనాడు
నన్నన్ని
విధముల
కాపాడి,
నేడు
ఎందులకింత
తామసము
చేయుచున్నాడు?
రాముడు
కరుణాసముద్రుడు
కదా!
నా
విషయమున
అతని
కరుణ
కఠినమాయెనా?
అయ్యో!
ఇది
నా
పొరపాటు,
రామచంద్రుడు
దయామయుడు,
లోకనాటకమున
తాను
చేయవలసిన
రీతిగా
తాను
చూసి
చూపించుచూ
చేయించుచుండవలసి
వచ్చినది.
కానీ
హనుమంతా,
నీవు
సామాన్యుడవై
వుండవు.
సామాన్యులతో
రామచంద్రుడు
ఇంత
గాధమైన
స్నేహము
4
▾
Meaning
Keep
చేయడు.
తన
అంగుళీయకమును
పంపడు.
నీవెంతటి
అదృష్టవంతుడవో,
ఒక్కతూరి
నీ
పూర్ణరూపమును
చూపు"
మని
కోరెను.
హనుమంతుడు
క్రిందికి
దిగి
సీత
ముందు
చేతులు
జోడించుకొని
మహాకారమును
చూపగనే,
సీత
జడిసి,
ఇది
కేవలము
రావణుని
మాయయా
అని
తలంచి
కన్నులు
మూసుకునెను,
వెనుకకు
తిరిగెను.
ఆ
అనుమానమును
గ్రహించి
హనుమంతుడు,
"ఓ
తల్లీ,
నేను
రావణుడను
కాదు,
రాక్షసుడను
కాదు.
పవిత్ర
మంగళ
స్వరూపుడైన
శ్రీరాముని
బంటును.
అతనే
నా
ప్రాణము,
నేను
సత్యము
వచించుచున్నాను.
నీవు
నమ్మువను
ఉద్దేశ్యముతో
శ్రీరాముడు
తన
వ్రేలియందలి
వుంగరమును
నా
హస్తముందుంచి
సీత
నమ్ముటకు
ఆధారముగా
తీసుకొని
పొమ్మని
ఆజ్ఞాపించెను.
నాతోపాటు
సుగ్రీవుడు,
జాంబవంతుడు,
అంగదుడు,
ఇంకా
వేలాది
వానరవీరులు
వచ్చిరి.
నేను
మాత్రమే
రామానుగ్రహముచే
సముద్రమును
దాటగలిగితిని.
మిగిలినవారు
ఆవలి
వొడ్డున
నున్నారు.
తమను
ఈ
కిరాతక
రాక్షసుడు
గొనివచ్చిన
విషయము
శబరి,
జటాయువుల
వలన
వినగలిగితిమి.
సంపాతి
వలన
మూడు
దినములకు
మునుపే
విని
తమను
దర్శించినంతగా
ఆనందము
నందితిమి.
రామలక్ష్మణులు
ఈ
వార్తను
వినుటకై
కాచియున్నారు.
శెలవిచ్చిన
తత్క్షణమే
వెనుకకు
వెళ్ళి
ప్రభువులకు
తమ
క్షేమవార్త
నందింతు"
నని
తెలుపగనే,
"హనుమంతా!
తిరిగి
నీవు
వత్తువోలేదో!
ఇంకా
ఒక
దినముండి
రాముని
సుక్షేమవార్తలు
తెలిపి
నన్నానందపరచుము"
అని
కోరెను
సీత.
ఇంతలో
రాక్షసులు
వారి
వారికి
నియమించిన
పనుల
నిమిత్తమై
గుంపులు
గుంపులుగా
వ్రాలుటచేత,
తిరిగి
హనుమంతుడు
సూక్ష్మరూపమును
ధరించి,
వృక్షముపై
వెళ్ళి
కూర్చొనెను.
సీత
హనుమంతుడు
చెప్పిన
మాటలన్నింటిని
మననము
చేసికొనుచూ
తనలో
తాను
ఆనందించుచూ,
అప్పుడప్పుడు
ఆ
వానరుని
చూచుచూ
వుండెను.
ఆనాడు
అసలు
నీరైనా
త్రాగక,
రాక్షసులు
తెచ్చి
పెట్టిన
ఫలజలములైననూ
ముట్టక
విలపిల్లుచున్న
దృశ్యమును
హనుమంతుడు
చూడలేకపోయినాడు.
కాపలా
గాచుచున్న
క్రూర
రాక్షసులు
సీతను
ధిక్కరించుచున్న
కఠిన
వాక్కులను
భరించలేక
మధ్య
మధ్య
పట్టరాని
కోపముతో
పండ్లు
కొరుకుచుండెను.
విధిలేక
సీత
ఆజ్ఞ
కోసమని
వేచియుండెను.
కొంతసేపయిన
తరువాత
సరమ
అనగా
విభీషణుని
భార్య,
5
▾
Meaning
Keep
తన
కొమార్తె
అయిన
త్రిజటతో
వచ్చి,
సీతకు
నమస్కరించి,
అమ్మగారి
క్షేమవార్తలను
విచారించిరి.
వారు
సీతకు
అనుకూలురగుటచేత,
త్రిజటకు
వచ్చిన
కల
నిజమయినదని,
సీత
వానరుడు
వచ్చిన
వృత్తాంతము
తెలిపెను.
త్రిజట,
సరమ
ఇరువురూ
ఎంతో
ఆశ్చర్యముగా
సీతను
పరిపరివిధముల
విషయములను
సెలవియ్యమని
కోరగా,
చెట్టుపైనున్న
వానరుని
చూపించి
అతడు
తెచ్చిన
ఉంగరమును
కూడా
వారలకు
చూపెను.
వారిరువురు
ఆ
ఉంగరమును
కన్నులకద్దుకొని
ఆనందించిరి.
ఇంతలో
సీతకు
ఏకాంత
సమయము
ఏర్పడగనే,
వానరుడు
దిగివచ్చి,
తల్లీ,
మీరు
విచారింపకుడు
నా
వీపుపై
కూర్చొనిన
నేను
క్షణములో
రామునికి
సన్నిధిని
చేర్తును
అని
అనేక
విధముల
బతిమిలాడెను.
అందులకు
సీత,
"హనుమంతా,
నీ
పలుకులే
నన్నెంతో
ఆనందపరచుచున్నవి.
విరహసముద్రములో
మునిగిపోవుచు
తపించుచున్న
నాకు
నీ
తీయని
ఆదరణ
పలుకులు,
పడవల
వలే
సహాయము
గావించినవి.
నేను
పరపురుషుని
అంటననన్న
విషయము
నీకు
తెలియదా?
అట్టి
నేను
నీ
వీపుపై
ఏ
విధముగా
కూర్చొనగలనో
యోచింపుము"
అనెను.
సూటిగా
నాటుకొనిపోవు
ఆ
మాటలు
హనుమంతుని
హృదయములో
గ్రుచ్చుకొనిపోయెను.
అతడు
"అమ్మా!
నేను
నీ
కొమరుడను
కదా,
తల్లిని
వీపుపై
కూర్చొన
బెట్టుకొనుటలో
తప్పేమున్నది?
దోషము
లేదు
కదా!"
అని
పరిపరి
విధముల
ప్రార్థించెను.
అందులకు
సీత,
"హనుమంతా!
నీకు,
నాకు
మన
భావములు
మాతాపుత్ర
భావములు
కావచ్చును.
కాని
లోకమేమనునో
యోచింపుము.
లోకమును
కూడా
మనము
చూడవలెను
కదా!
ఆదర్శవంతమైన
జీవితాన్ని
నిరూపించునట్టి
వ్యక్తులుగా
మనము
మెలగవలెను
కానీ
అన్యులచే
వ్రేలు
చూపించుకొను
పని
చేయరాదు.
ఆత్మతృప్తి
లేని
పనులను
నేనంగీకరింపను.
నా
ప్రాణము
పోయినను
సరే,
రాముడే
నన్ను
గొనిపోవలెను.
కానీ
అన్యుల
సాయము
నాకక్కరలేదు.
అంతియేకాక
నన్నింతటి
రీతుల
బాధపెట్టిన
ఈ
కిరాతుని
హతమార్చుటకు
నా
రాముడే
సరి.
అతనే
ఈ
లంకకు
వచ్చి
రావణుని
చంపి
ఈ
సీతను
చేపట్టుట
ఒక
పరాక్రమము.
రావణుడు
దొంగవేషమును
ధరించి
మోసపుచ్చి
నన్ను
తెచ్చెను.
రాముడు
ధర్మస్వరూపుడు,
నీతి
నియమములను
పాటించువాడు.
సత్యవాక్యపరిపాలకుడు.
అట్టి
రాముడు
కూడా
తన
దూతను
పంపి
రావణునకు
6
▾
Meaning
Keep
తెలియకుండా
సీతను
తెప్పించుకొనెనన్న
వార్త
శ్రీరామునకు
కీర్తినివ్వదు.
ఇట్టి
పనికి
పూనుకొనుట
రామద్రోహము
కాగలదు,
కాన
మోసపు
మార్గములను
కానీ,
టక్కరి
చర్యలను
కానీ
మనము
అవలంబించకూడదు.
రామగౌరవము
మన
ప్రాణము.
రామకీర్తి
మన
హృదయమూర్తి.
వాటిని
కాపాడునట్టి
పనులను
చేపట్టుట
మంచిది.
నీ
వాక్కులు
నాకంత
తృప్తిని
చేకూర్చుటలే"దని
హనుమంతుని
వాక్కులను
నిరాకరించిన
సీత
వాక్యములకు
హనుమంతుండెంతయో
సంతసించి,
సీతయొక్క
గుణగణములను
తనలో
తానెంతయో
కీర్తించుకొని,
ఆనందించి,
"తల్లీ,
నన్ను
క్షమింపుము.
తమ
బాధకు
శ్రీరాముని
విరహము
కాదనను.
కండ్లారా
చూచిన
వాడనగుటచేత
ఎంత
త్వరగా
తమను
శ్రీరామునిచెంత
చేర్చ
వీలుండునో
అంత
త్వరితముగా
చేర్చవలెనను
ఆతురతచే
నేనట్లు
ప్రార్థించితిని.
తప్పైన
క్షమింపు"మని
మరీ
మరీ
నమస్కరించెను.
అంత,
సారెసారెకూ
సీత,
రామలక్ష్మణులు
క్షేమమేనా?
మగవారలకేమి?
వారెట్లయిననూ
భరించగలరు.
స్త్రీలను
విడిచివుండగలరు.
ఆడవారిదే
అధమజన్మము.
పతులను
విడచి
పడతులు
జీవించుట
మహాఘోరము
అని
మగవారిని
మధ్య
మధ్య
నిష్ఠూరము
లాడుచుండుట
చూచి,
హనుమంతుడు,
"తల్లీ!
రామలక్ష్మణులు
క్షేమమే
కాని,
మిగిలిన
మగవారలతో
వారిని
పోల్చన్యాయము
కాదు.
క్షణక్షణమూ
సీతను
తలంచుచూ
అన్నపానాదులు
సహితము
స్వీకరించకవున్నారు
తల్లీ!
ఏదో
లక్ష్మణుని
బలవంతముతో
కొంత
పానీయమును
ఫలమును
స్వీకరించుచున్నాడు
కానీ,
రాముడు
బుద్ధిపూర్వకముగా
ఒక
గుటికెడు
నీరుత్రాగిన
సమయాన్ని
కూడను
నే
చూచి
ఎరుగను.
దుఃఖించకు,
వారలను
సంశయించకు
తల్లీ!
లక్ష్మణుడు
అన్నగారి
ప్రాణమునకు
ప్రాణమై
ఒకవైపు
తమ
వియోగమును,
మరొకవైపున
రామదుఃఖమును
భరించలేని
వాడయి
మొండిబండవలే
ధైర్యముతో
రాముని
కంటిరెప్పవలే
చూచుకొంటూ
ధైర్యమును
తెలుపుచూ
కాలమును
గడుపుచున్నాడు.
ఈ
పదినెలలూ
నిద్రనెరుగరు,
తిండినెరుగరు
అని
హనుమంతుడు
విషాదకరమైన
శ్రీరామచంద్రుని
వియోగసమయములను
వివరించుచుండ,
సీత
తెలియని
దానివలె
నటించుచూ
నిజముగా
శ్రీరామచంద్రునకు
నాపై
యింత
ప్రేమయా,
యింత
దయయా!
అని
ఆశ్చర్యపడినట్లు
నటించుచూ,
మధ్యమధ్య
వెగటుగా
మగవారలు
మగవారలనే
వర్ణింతురు.
మెచ్చుకొందురు.
ఆడవారి
బాధలు
వారలకెట్లు
తెలియునని
నిందాస్తుతులను
చేయుచుండెను.
ఒక్కొక్కప్పుడు
7
▾
Meaning
Keep
హనుమంతుడు
చెప్పుచుండిన
విషయములను
నమ్మలేకపోవుచుండెను.
హనుమంతుని
శక్తి
సామర్థ్యములు
చాలా
చూచుచూ,
హనుమంతునితో
శ్రీరామచంద్రుడు
మైత్రిగావించిన
విచిత్ర
ఘట్టమును
హనుమంతుడు
చెప్పగా
విని
సీత
మిగుల
ఆనందపడెను.
సీతకు
హనుమంతుని
వచనములు
దృఢనమ్మకమును
కలిగించెను.
సారెసారెకు
హనుమంతుడు
"తల్లీ!
పుత్రునిమీద
యెందుకింత
బేధము?
కాలమెందుకు
వృథా
వ్యథలతో
గడుపుదురు?
నా
వీపుపై
కూర్చొనిన
క్షణములో
శ్రీరాముని
సన్నిధికి
చేర్తు"నని
చెప్పుచుండ,
యెన్ని
విధముల
నీతులను
తెలిపిననూ
వినని
హనుమంతుని
ఆతురతను
గమనించి,
సీత
సూటిగా
"హనుమంతా!
నీవు
శ్రీరామాజ్ఞను
శిరసావహించువాడవు
కదా?"
అనినది.
అది
విని
హనుమంతుడు,
"తల్లీ
నా
ప్రాణమునైననూ
విడుతును
కానీ
రామాజ్ఞ
మీరను"
అని
ప్రమాణ
పూర్వకముగా
యెదగొట్టుకొనగా,
'అట్లు
అయిన,
శ్రీరాముడు
నన్ను
చూచి
రమ్మని
మాత్రమే
సెలవిచ్చెనా?
బాగుగా
యోచించు'మని
చెప్పగనే,
హనుమంతుని
నోరు
కట్టివేయబడెను.
"తల్లీ,
క్షమించుము.
నేనంతటి
లోతునకు
యోచించనందుకు
మరొకతూరి
క్షమాపణ
కోరుకొందు"
నని
అప్పటి
నుండి
ఆమాట
నుపయోగించుట
మానివేసెను.
ఇక
తను
కాలమును
వృథాచేయుట
మంచిది
కాదని
హనుమంతుడు
తలంచి
యెంతో
త్వరగా
సీత
సుక్షేమవార్త
రాముని
కందించుట
మంచిదని
సీత
అనుమతిని
కోరెను.
ఆమె
క్షేమముగా
వెళ్ళి
త్వరగా
రాముని
స్వయముగా
వచ్చి
నన్ను
గొనిపొమ్మనుమని
కంటిధారలు
కార్చుచూ
చెప్పిన
పలుకులు
హనుమంతుని
హృదయాన్ని
కరగించెను,
కదలించెను.
అంత
హనుమంతుడు,
'తల్లీ!
అతిశీఘ్రకాలములోనే
వానర
సైన్యముతో
రామచంద్రుడు
లంకను
ముట్టడించి
రాక్షసులను
హతమార్చి
తమను
అయోధ్యకు
చేర్చుకొను'నని
వాగ్దానమొసగెను.
అంత
సీత,
"హనుమా,
వానరులు
సామాన్యులు.
ఈ
బలమైన
రాక్షసులను
సంహరించగలరా?
ఇంత
మాయాశక్తులను
కలిగిన
ఈ
రాక్షసులను
రామలక్ష్మణులు
ఇరువురు
యేమి
చేయగలరు?
ఇది
కలలోని
వార్త.
కడకు
నా
ప్రాణములు
కోల్పోవుటే
యగును.
మిమ్ములను
ఇంతమందిని
ఈ
యుద్ధములో
చంపుటకంటే,
నా
ప్రాణములు
వీడుట
మంచిది
కదా?"
అని
విలపించుచున్న
సీతను
చూచి,
"అమ్మా!
సీతామాతా!
తమరట్లు
భావించవలదు.
మేము
రామదూతలము.
అతని
నామమునే
మా
8
▾
Meaning
Keep
సర్వబలముగా
తలంచినవారము.
రామనామము
తప్ప
అన్యప్రాణములు
మాకు
లేవు.
కాన
ఈ
రాక్షసులనే
కాదు,
ఇంకా
వేయిరెట్లు
రాక్షసులనైననూ
ఒక్క
మా
వానరులే
చంపగలరు,
జయించగలరు.
మేము
సామాన్యరూపములు
ధరించుటచే
తమరు
మా
శక్తి
సామర్థ్యములను
శంకించుచున్నారు,
చూడు"మని
హనుమంతుడు
సువర్ణ
పర్వతముతో
సమానమైన
తన
ఆకారమును
చూపగనే
సీత
ఆశ్చర్యపడి,
"హనుమంతా!
చాలింపుము.
నీ
రూపమును
అదుపులో
వుంచుకొనుము.
రాక్షసులు
చూచిన
తిరిగి
నిన్ను
వెనుకకు
వెళ్ళనివ్వరు"
అని
భయపడనటుల
నటించెను.
అంత
హనుమంతుడు
సీతకు
నమస్కరించి
తన
ఉగ్రరూపమును
శాంతపరచుకొని
సూక్ష్మరూపమును
ధరించి
వెనుకకు
బయలుదేరెను.
సీతయొక్క
పరిస్థితిని
హనుమంతుడు
తన
హృదయములో
శాశ్వతముగా
ముద్రించుకొని
సీతను
వీడలేక
వెనుకకు
తిరిగెను.
వెనుకకు
వచ్చు
సమయమున
ఒక
ఫలవనమున
ప్రవేశించి
కడుపారా
ఫలములు
భుజించి
మిగిలిన
ఫలములను
క్రిందరాల్చుచూ
వచ్చెను.
ఆ
దృశ్యమును
కాపలాకాయు
రాక్షసుడు
చూచి
అతనిని
అదిలించపూనుకొనెను.
హనుమంతుడు
ఆ
కాపలా
రాక్షసుని
ఒక
గ్రుద్దుతో
క్రిందపడవేసెను.
ఆ
కాపలా
రాక్షసి
యెట్లో
ధైర్యము
చేసుకొని
పరుగెత్తి
తనపై
అధికారిగా
వున్నవానికి
తెలుప,
వాడు
తన
అధికారికి
-
ఈ
రీతిగా
కడకు
ఈ
వార్త
రావణుని
చెవిని
పడెను.
అది
వినగానే
రావణునికి
అశుభముగా
తోచెను.
భరించుకోలేకపోయెను.
కోపము
మిన్నుముట్టెను,
కొన్ని
వందల
మంది
రాక్షసులను
వానరునిపైకి
పంపెను.
వారిచేత
కాకపోవుట
చూచి
వానరుని
పట్టుటకై
బాగా
శక్తిసామర్థ్యములు
కలవారలను
చక్కని
తరిబీదు
అయినవారలను
ఆయుధములతో
కొన్ని
వేలమందిని
పంపెను.
అన్ని
వేలమందికూడా
వానరుని
యేమాత్రము
కదిలించలేకపోయినారు.
హనుమంతుడు
ఒక
చిన్న
తుంటకఱ్ఱను
తీసుకొని
రామ,
రామ
అంటూ,
వేసిన
ఆయుధాలను
ఆ
చిన్న
చెట్టు
కఱ్ఱతో
వెనుకకు
కొట్టుచుండుట
చూచి
రాక్షసులు
ఆశ్చర్యపడుటయేకాక,
ఇతనెవ్వరో
దైవదూతగా
వున్నాడనియు,
ఇదియేదో
లంకకు
ప్రమాదకరమునే
తెప్పించుననియు
భయపడి,
లోలోన
కుములుచూ
వచ్చిరి.
రావణునకు
ఈ
సమాచారము
చెప్పుటకు
ధైర్యమును
కోల్పోయిరి.
యెన్నో
విధముల
9
▾
Meaning
Keep
రాక్షసులను
లెక్కకుమించి
పంపిరి.
కాని
ఫలితము
లేకపోయెను.
ఒక్కతూరి
హనుమంతుడు
గర్జించగా
ఆ
శబ్దమునకే
కొన్ని
నూర్ల
రాక్షసులు
మరణించిరి.
భూమి
దద్దరిల్లెను.
భవనముల
ప్రతిధ్వనులు
మిన్ను
ముట్టెను.
చేయునది
లేక
సైన్యమునకు
అధికారియైనవారు
రావణునకు
ఈ
వార్త
తెలిపి
ఇతను
సామాన్యుడు
కాడనియూ,
ఇది
యేదో
భయంకర
పరిస్థితికే
వచ్చునని
గట్టి
చర్య
తీసుకోవలసి
వచ్చుననియూ
ఉన్నదున్నటుల
తెలిపెను.
అంత
రావణుడు
అక్షయకుమారుని
పంపెను.
ఆ
కుమారుని
వెంట
అనేక
వేల
యోధులను
పంపెను.
కానీ
అక్షయకుమారుని,
వేల
యోధులను
క్షణములో
హనుమంతుడు
హతమార్చెను.
ఆ
విచిత్ర
చర్యలను
చూచి
లంకంతయూ
వడికిపోయెను.
యేదియో
యొక
బలవత్తరమైన
దైవశక్తియే
కాని
ఇతడు
సామాన్య
వానరుడు
కాదని
వారు
గుసగుస
లాడిరి.
కడకు
సీతాపహరణపు
పాపఫలమేనని
కొందరు
దృఢపరచుకొని
లోలోన
సీతను
ప్రార్థించిరి.
అక్షయకుమారుని
మరణ
వార్త
విని
రావణుడు
దుఃఖముతో
పొంగివచ్చు
కోపమును
భరించలేకపోయెను.
మేఘనాధుని
పిలచి
అతనికి
కొన్ని
వేల
యోధులను
సహాయముగా
పంపించెను.
మేఘనాధుడు
రథమెక్కి
భూమి
ఆకాశము
దద్దరిల్లునటుల
నడచి
వెళ్ళుచుండ
చూచువారలకే
గుండెలు
ఝుల్లుమనెను.
ఈ
సైన్యమును
చూచి
వానరుడు,
అలక్ష్యముతో
లెక్కచేయనివానివలె
ఒక
కొమ్మపై
కూర్చొని
నిర్లక్ష్యముగా
వారిని
చూచుచూ
వుండెను.
ఇంతలో
ఈ
సైన్యము
నలువైపుల
అంబులవర్షము
కురిపించిరి.
వీరిని
చూడగానే
కపిరాజు,
పటపట
పండ్లు
కొరికి
సింహనాదముచేసి,
ఒక
పెద్ద
వృక్షమును
వేళ్ళువరకూ
లాగి,
ఆ
వృక్షమును
ఒక
చేతిలో
పట్టుకొని
నలువైపుల
వచ్చు
అంబుల
వర్షమును
క్షణములో
వెనుకను
కొట్టుచుండ,
ఆ
అంబులు
తిరిగి
రాక్షసులకే
తగిలి
కనురెప్పపాటులో
అందరూ
ప్రాణములు
కోల్పోయిరి.
మేఘనాధుడు
ఒక
గ్రుద్దుతో
క్రిందపడి
రక్తము
క్రక్కెను.
మేఘనాధుడు
చేయునది
లేక
బ్రహ్మాస్త్రమును
చేతియందుంచుకొని,
నరవానరుడు
రావణునకు
మృత్యువని
బ్రహ్మయే
తెలిపెను
గదా
అని
తలంచుచు
ఆ
బ్రహ్మాస్త్రమును
ప్రయోగించెను.
బ్రహ్మాస్త్రమును
ధిక్కరించరాదని
హనుమంతుడు
దానిని
యేమియూ
చేయలేక
గౌరవముగా
నమస్కరించెను.
అంత
ఇంద్రజిత్తు
నాగపాశముతో
హనుమంతుని
బంధించెను.
10
▾
Meaning
Keep
హనుమంతుడు
నాగపాశమునకు
బద్ధుడాయెను.
వానరుడు
కట్టుబడెనని
రాక్షసులు
పరుగెత్తుకొనివచ్చి
రావణునికి
తెలిపిరి.
కట్టుబడిన
ఈ
వానరుని
చూచుటకు
లక్షలాది
రాక్షసులు
బారులుదీరి
చూచుటకు
వీధులు
నిండిరి.
ఆ
వీధులలో
రావణదర్బారునకు
గొనిపోబడుచుండిన
వానరరాజు
నిర్లక్ష్యముగా
యేమాత్రమూ
భయభ్రాంతులు
వెలిబుచ్చక
రావణ
దర్బారునకు
చేరెను.
అక్కడ
రావణుని
శక్తిసామర్థ్యములను
చూచికూడా
యేమాత్రమూ
రాజునకు
తగిన
గౌరవమర్యాదలు
ఇవ్వకవుండుట
చూచి
అధికారులు
ఆశ్చర్యపడిరి.
రావణుడు
వానరుని
చూచి
ఫక్కున
నవ్వి,
తన
మరణమును
చింతించి
లోలోన
విచారించెను.
కానీ
రాక్షసుడగుటచేత
మరణవార్త
తననంత
పీడింపలేదు.
"ఒరే!
వానరా!
నీవెవడవు,
నీవు
ఉపయోగించు
బలము
యెవ్వరిది?
యెందుచేత
ఈ
వనమును
ధ్వంసము
గావించితివి?
సిగ్గును
విడిచి
ముఖమెత్తి
చూచుచున్నావు.
వీటికి
సరియైన
జవాబులు
చెప్పు"మని
మందలించెను.
హనుమంతుడు
నవ్వి,
మిగిలిన
రాక్షసులకు
అర్థముకాని
రీతిగా
పాండిత్య
భాషను
ప్రవేశపెట్టి,
చక్కని
జవాబునిచ్చెను.
నవ
వ్యాకరణపండితుడు
కనుక
రావణుడు
అర్థము
చేసుకొనెను.
వారిరువురూ
మాటలాడుచుండగా
రెండు
పెద్ద
పండితగజములు
వాదించునటుల
తోచెను.
అంత
రావణుడు
హనుమంతునిముందు
చిత్రమంత్ర
మహిమలను
చూపెను.
మాయలను
సృజించెను.
హనుమంతుడు,
'ఓ
రావణా!
నీ
సంగతి
నేనెరుగుదును.
నీవు
సహస్ర
భుజములతో
పోరాడుట
వినియుంటిని.
నీవు
వాలితో
పోరాడిన
సంగతియు
నాకు
విశదము.
నాకు
ఆకలి
అగుట
చేత
ఫలములు
భుజించితిని.
నా
వానర
స్వభావముచే
వృక్షములు
పడత్రోసితిని.
నా
స్థలములో
నేనుంటిని,
ఎవని
శరీరమునందు
వానికి
అభిమానముందును.
నీ
భటులు
పరమదుర్మార్గులు.
నీ
భటులు
నన్ను
హింసించుటచేత
నేను
వారలను
సంహరించితిని.
ఆత్మ
సంరక్షణ
నిమిత్తమై
నేను
కలహించితిని.
నీ
కుమారుని
అస్త్రము
నన్ను
బంధించెను.
అంత
మాత్రమున
నాకు
వంచన
లేదు.
నా
స్వామి
కార్యమును
నేను
సాధింపవలెను.
నీవు
సావధానముగా
వినుము.
నీ
అభిమానమును
విడువుము.
నీవు
యెంత
గొప్ప
వంశమున
జన్మించితివో
విచారింపుము.
బ్రహ్మకు
నీవు
ప్రపౌత్రుడవు,
పులస్త్యునకు
పౌత్రుడవు,
విశ్వావసుమునకు
పుత్రుడవు,
భ్రమను
విడచి
భక్తభయహారుడు,
ఇక్ష్వాకు
11
▾
Meaning
Keep
కులతిలకుడు,
రఘువంశరత్నమును
అగు
శ్రీరాముని
భజింపుము.
శరణజొచ్చుము.
కాలుడు
సహితము
వెఱగుపడును.
అతనితో
వైరము
తగదు.
నా
మాట
విని
జానకిని
నా
ప్రభువునకు
సమర్పించుము.
శ్రీరాముని
చరణారవిందములను
ధ్యానము
చేయుము.
లంకారాజ్యమును
శాశ్వతముగా
పరిపాలింపుము.
పులస్త్యుని
కీర్తిప్రతిష్టలు
ఆచంద్రార్కముగా
నిష్కళంకముగా
వెలిగింపచేయుము.
వారి
కీర్తికి
మచ్చను
కలిగించకుము.
నీ
మదమోహాదులు
విడువుము.
"ఓ
రాక్షసరాజా!
పర్వతములలో
పుట్టిన
నదులు
వర్షాకాలములో
ఉప్పొంగి
పొర్లిపారును.
అంతలోనే
అవి
యెండిపోవును.
అటులనే
నీ
సిరి
సంపదలు
శీఘ్రమున
నశించును.
శ్రీరాముని
ఆధారముగ
చేసుకొనియుండినవారి
సిరిసంపదలు
వృద్ధియగును.
వారికి
నష్టము
కలుగదు.
ఓ
రాజా!
నేను
మనసు
విప్పి
చెప్పుచున్నాను.
శ్రీరామునితో
విరోధించినవానిని
రక్షించువారు
లేరు.
నా
మాట
వినుము."
ఈ
విధముగ
హనుమంతుడు
మంచి
వివేకనీతులను
రావణునకు
బోధించెను.
అంత
రావణుడు,
"ఓ
మూర్ఖుడా!
నీవా
నాకు
ఉపదేశించువాడవు?
ఛీ,
ఛీ
నీకు
మృత్యువాసన్నమయినది.
లేకున్న
నా
యెదట
ఇంత
ధైర్యముగా
ఉపన్యాసము
లిచ్చియుండెడివాడవు
కావు.
ఛీ,
నోరు
మూయుము"
అని
ధిక్కరించెను.
అంత
హనుమంతుడు
"ఓ
రాజా!
నీ
వచనములే
నీకు
వ్యత్యస్తముగా
వర్తించును.
నీ
మతి
భ్రమించెను.
క్రమముగా
నీకు
బోధపడును.
మృత్యువు
ఆసన్నమయినది
నీకో
నాకో
కొన్ని
దినములలోనే
తేలగలదు"
అని
జంకుగొంకులేక
బదులాడెను.
హనుమంతుని
పలుకులకు
రావణుడు
ఉగ్రుడై
తోడను
కొట్టి,
"ఓయీ!
రాక్షసులారా!
చూచుచున్నారా?
శీఘ్రము
మీరు
వానిని
వధింపుడు"
అని
ఆజ్ఞ
పంపెను.
తత్క్షణమే
రాక్షసులు
రాజాజ్ఞ
ప్రకారము
వానరుని
సంహరించుటకు
సిద్ధమయిరి.
ఆ
సమయమున
మంత్రులతో
కూడి
విభీషణుడు
సభకు
వచ్చెను.
అతడు
రావణునకు
నమస్కరించి,
ఓ
నాథా,
దూతను
వధించుట
రాజధర్మమునకు
విరుద్ధము.
మరొక
విధమున
వానికి
తగిన
శిక్ష
విధింపుడు
అని
పలికిన
పలుకులకు
మిగిలిన
మంత్రులు
ఆమోదించి,
ఇది
పరమసత్యమని
తెలుపగనే,
వారి
మాటలకు
రావణుడు
నవ్వి,
వానిని
అంగవికారము
చేసి
పంపుడని
ఆజ్ఞాపించెను.
అంత
చేరిన
12
▾
Meaning
Keep
రాక్షసశ్రేష్ఠులు
విచారించి,
వానరునకు
వాలమునందభిమానము
మెండు
కనుక
వాని
వాలమునకు
నూనెగుడ్డలు
కట్టి
నిప్పు
తగిలించిన
బాగుండునని
సలహా
యిచ్చిరి.
"ఈ
వానరుడు
వాలము
పోగొట్టుకొని
పోయి
వాని
స్వామిని
తీసుకొని
వచ్చును.
అప్పుడు
వీని
పౌరుషమును,
వీని
ప్రభువు
శూరత్వమును
చూడవచ్చును"
అని
మిగిలిన
మంత్రులు
చెప్పిరి.
అంత
సభలోని
ప్రముఖులు
గునగునలాడిరి.
వీరి
మాటలు,
గుసగుసలువింటూ
చూచుచున్న
హనుమంతుడు
ఫక్కున
నవ్వెను.
రాక్షసులకు
మరింత
కోపము
హెచ్చెను.
తత్క్షణమే
నూనెగుడ్డలు
తెప్పించి
హనుమంతుని
వాలమునకు
బాగుగా
చుట్టుటకు
మొదలుపెట్టిరి.
అంతకంతకు
హనుమంతుని
వాలము
పెరుగజొచ్చెను.
యెన్ని
బండ్ల
నూనెగుడ్డలను
తెచ్చిననూ
అవి
చాలకపోయెను.
ఈ
వింతను
చూచుటకు
పురమునందలి
రాక్షసులు,
స్త్రీ
పురుషులు
గుంపులు
గుంపులుగా
వచ్చిరి.
వాయిద్యములు
మ్రోగించిరి.
కరతాళములు
మ్రోగించిరి.
నగరమంతయూ
వీధివీధులవెంట
హనుమంతుని
త్రిప్పిరి.
కడకు
పురమధ్య
వీధిన
నిలబెట్టి
వాలమునకు
నిప్పంటించిరి.
నిప్పు
తగిలినంతనే
హనుమంతుడు
సూక్ష్మరూపుడయ్యెను.
అతని
బంధనములన్నీ
విడిపోయెను.
వెంటనే
హనుమంతుడు
సువర్ణప్రాకారముల
పైకి
కుప్పించెను.
పురరాక్షసులు
భయపడిరి.
ఆ
సమయమున
హనుమంతుడు
రామ,
రామ
అని
అరచెను.
ఆ
ధ్వనిచే
వాయువు
ప్రచండముగా
వీచెను.
అట్టహాసముతో
హనుమంతుడు
గర్జించి
తలక్రిందుగా
కుప్పించి
యెగుర
మొదలు
పెట్టెను.
నిప్పుమంటలతో
యెగురుచుండిన
అతని
తోక
పొడవయ్యెను.
ఒక
గృహముపైనుండి
మరొక
గృహముపైకి
దాటుచు
ఇంటింటికి
నిప్పంటించెను.
లంకా
పట్టణమందలి
గృహములు
కాలుచు
కుప్పలవలే
కూలి
భస్మమయ్యెను.
రాక్షసులు,
స్త్రీలు,
పిల్లలు,
గృహములను
వీడి
ప్రాణసంరక్షణ
నిమిత్తమై
పరుగులు
దీసిరి.
పశువులు,
గుఱ్ఱములు,
యేనుగులు,
కంచరగాడిదలు
కట్లను
ఊడపెరుకుకొని
వీధులవెంట
భయంకరంగా
పరువులు
తీసెను.
భయంకరమైన
కేకలతో
లంకా
పట్టణమంతయూ
వుఱ్ఱూతలూగెను.
అయ్యో,
అమ్మో,
రక్షింపుడు,
కాపాడుడు
అను
స్త్రీల,
పిల్లల
కేకలు
మిన్నుముట్టెను.
ఆ
మాటలు
మండోదరి
చెవులపడెను.
మండోదరి
ఆడవారి
ఆలాపములు
విని
రాజభవనమునందలి
13
▾
Meaning
Keep
సిపాయిలను
పంపి
స్త్రీ
శిశువులను
కాపాడుమని
ఆజ్ఞాపించెను.
అంతేకాదు,
"అయ్యో,
రావణుని
మూర్ఖపు
బుద్ధే
ఈ
రాక్షసవంశనాశము
గావించ
మొదలుపెట్టెను.
నేను,
మరదియైన
విభీషణుడూ
యెన్నియో
బోధించితిమి,
ప్రార్థించితిమి,
వినడయ్యెను.
వంశక్షయము
కాగలదని
మొరపెట్టితిమి,
'వినాశకాలే
విపరీత
బుద్ధిః'
అన్నట్లు
అతని
చెడుకాలము
ఇన్ని
విధములైన
విపరీత
చర్యలకు
మూలకారణమైనది"
అని
మండోదరి
తన
దాసీలతో
చెప్పుచూ
కంగారుపడదొడగెను.
విలపించెను.
ఎటు
చూచిననూ
నాలుకలు
చాచుతూ
ప్రజ్వరిల్లుచున్న
మంటలు
కనుపించెను.
యెక్కడ
చూచిననూ
హనుమంతుడే
కనుపించెను.
ప్రతి
గృహస్థురాలు
హనుమంతుని
ప్రార్థింప
మొదలుపెట్టినది.
విలపించుచు
బిడ్డను
కాపాడుమని
చేతులు
జోడించి
వేడుకొనిరి.
కుంభకర్ణుని
భార్య,
"ఓ
రామదూతా,
నా
పతి
గాధనిద్రలో
వున్నాడు,
నా
గృహమును
విడిచిపెట్టుము.
నా
పతిని
రక్షించుము"
అని
ప్రార్థించెను.
లంక
అంతయూ
కోలాహలమయ్యెను.
క్షణములో
రావణునకు
తెలిసెను.
రాక్షసులను
శస్త్రాస్త్రములతో,
ఫిరంగులతో
వానరుని
ముట్టడించుడని
ఆజ్ఞాపించెను.
ఒక్కపరి
మండుచున్న
వాలముతో
కొట్టగనే,
వెళ్ళిన
సైన్యము
అందరూ
చెల్లాచెదురైరి.
కొందరు
మంటలలోపడి
ప్రాణములు
వీడిరి.
అనేక
స్త్రీలు
ఓ
మేఘుడా!
నీవు
తత్క్షణమే
వర్షించి
లంకాపురమును
చల్లార్చుమని
ప్రార్థించిరి.
వీరి
దుర్దశ
చూచి
మాల్యవంతుడు
విచారించెను.
ఇది
నిప్పుకాదు,
దైవము
యొక్క
క్రోధాగ్ని,
అథవా
జానకి
నిట్టూర్పులు
అనెను.
కొందరు
ఇది
రావణుని
పాపాగ్ని
-
లంకను
భస్మమొనరించుచున్నదనిరి.
కపీశ్వరుని
శరీరము
మహోన్నతమైనను
లేశమైననూ
శ్రమలేకయే
గృహము
నుండి
గృహమునకు
కుప్పించి
యెగురుచుండెను.
నగరమంతయూ
నిప్పుమంటలు
చిటపటలను
శబ్దములచే
మిన్నుముట్టుచుండెను.
ఈ
వార్త
సీత
చెవిన
పడెను.
తలయెత్తి
లంకను
పరీక్షించెను.
పొగతో
ఆకాశము
కప్పబడెను.
మంటలతో
అశోకవనము
కూడా
వేడెక్కెను.
అంత
సీత
అగ్నిని
ప్రార్థించి,
నిజముగా
హనుమంతుడు
శ్రీరాముని
పరమభక్తుడు,
అతనిని
రక్షించుమనెను.
ఆమె
సంకల్పము
చల్లనయినది.
కనుక
తత్క్షణమే
అగ్నిహోత్రుడు
హనుమంతునికి
శీతలుడయ్యెను.
పెద్దల
మాటను
ధిక్కరించినందుకు,
దూత
మాటను
నిరాదరించినందుకు
దాని
ఫలమును
రావణుడు
అనుభవించెను.
ఒక
రెప్పపాటులో
నగరమంతయూ
భస్మమయ్యెను.
నిద్రించుచుండిన
14
▾
Meaning
Keep
కుంభకర్ణుని
గృహము,
పరమభక్తుడైన
విభీషణుని
గృహము
తప్ప
అన్ని
గృహములు
నేలమట్టమాయెను.
హనుమంతుడు
లంకను
పూర్తి
భస్మము
చేసి
ఒక్క
పరుగున
సముద్రమున
మునిగి
తన
వాలమునందలి
మంటలను
చల్లార్చుకొనెను.
ఒక
పిల్లకోతి
రూపమును
ధరించి
సీతవద్దకువచ్చి
ఆమెకు
నమస్కరించెను.
"ఓ
తల్లీ!
మీ
సెలవు
ప్రకారము
మీ
క్షేమసమాచారమును
శ్రీరామునకు
విన్నవింతును.
మిమ్ములను
చూచినట్లు
ఒక
అనవాలు
దయచేసిన
ధన్యుడ
నయ్యెద"నని
ప్రార్థించెను.
సీత
కొంతసేపు
యోచించి,
చింతించి,
చూడామణిని
తీసి
హనుమంతుని
చేతియందుంచెను.
హనుమంతుడు
సంగ్రహించి
కన్నుల
కద్దుకొని
ప్రసన్నుడై
సీతకు
నమస్కరించెను.
సీత
హనుమంతుని
ఆశీర్వదించి,
"రావణుడు
నన్ను
పెట్టుచున్న
హింసలన్నిటిని
నీవు
ప్రత్యక్షముగా
చూచితివి
కనుక
నేను
ప్రత్యేకించి
చెప్పునట్టివేవియును
వేరులేవు.
త్వరలో
నాకు
శ్రీవారి
దర్శనమందించుమని,
పదే
పదే
నేను
ప్రార్థించినటుల
తెలుపుము.
ఒక్కనెల
దాటక
పూర్వమే
లక్ష్మణ
సమేతుడై
లంకను
ముట్టడించుమనుము.
ఓ
మారుతీ,
ఈ
మూడు
దినములు
నిన్ను
చూచి
సర్వమునూ
మరచి
రామ
వార్తను
వింటూ
యెంతో
ఆనందముగా
వుంటిని;
హృదయము
చల్లబడెను.
నీవు
వెళ్ళిన
నేనెటుల
దివారాత్రములు
గడుపగలనో
తోచకున్నది.
జలములేని
మత్స్యము
వలె
శ్రీవారి
దర్శనము
లేనందున
నేను
పరితపించుచున్న
బాధ
నా
రామునకే
తెలియును.
సర్వజ్ఞుడై
నా
రాముడు
క్షణక్షణము
నన్ను
చూచుచునే
యున్నారు.
కానీ
నేను
శ్రీవారి
నేత్రారవిందముల
నేనాడు
చూడగలను"
అని
ఈ
ప్రకారము
పలువిధముల
విలపించుచుండిన
జానకిని
చూచి,
హనుమంతుడు
ఎంతో
ధైర్యవాక్యములాడి,
మరల
మరల
జానకి
చరణములకు
నమస్కరించి
వెనుకకు
తిరిగెను.
అశోకవనము
వీడుటకు
పూర్వము
హనుమంతుడు
సింహనాదము
చేసెను.
ఆ
బొబ్బచేత
రాక్షసులు,
స్త్రీలు,
శిశువులు
దద్దరిల్లిరి.
హనుమంతుడు
కాలము
వృథాగా
గడుపక
క్షణములో
సముద్రతీరము
చేరి
రాముని
స్మరించి
ధ్యానించి
ఒక్కతూరి
ఎగిరెను.
ఆనాడు
కార్తీకశుద్ధ
పౌర్ణిమ.
చల్లగా
చంద్రుడు
హృదయమును
చల్లపరచుచుండ,
రామచంద్రుని
స్మరించుచూ
హనుమంతుడు
సముద్రమును
దాటెను.
వచ్చుచున్న
హనుమంతుని
దూరము
నుండి
చూచి
వానరులు
ప్రసన్నులైరి.
వారి
15
▾
Meaning
Keep
ముఖములు
వికసించెను.
వారి
శరీరములు
కాంతులతో
నిండెను.
శ్రీరాముని
కార్యమును
సాధించితిమని
ఉప్పొంగిరి.
నిరాశతో
మూడు
దినములుగా
ఎండబారిన
వారి
హృదయాలు
చిగురులు
పెట్టెను.
తీరమున
బారులు
తీరి
ఆతురతతో
దగ్గరకు
వచ్చుచున్న
హనుమంతుని
కౌగిలించుకొనుటకు
ఉఱ్ఱూతలూగిరి.
హనుమంతుడు
గట్టునకు
చేరగనే
లంకానగర
వృత్తాంతము,
సీత
యొక్క
క్షేమసమాచారములు
అత్యాతురతతో
విచారించిరి.
హనుమంతుడు
సీత
యోగక్షేమములు,
లంక
యొక్క
పరిస్థితిని
ఉల్లాసముగా
చెప్పుచూ
పంపాపురమునకు
వెడలిరి.
వారు
సుగ్రీవుని
మధువనమునకు
వచ్చి,
దానిలో
ప్రవేశించి
ఫలములను
భక్షించిరి.
జానకిని
చూచిన
తరువాత
ఈ
వనములో
ఫలముల
భక్షింపుడని
పూర్వమే
ఆనతిచ్చిన
సుగ్రీవుని
మాటలను
స్మరించుచూ
కడుపారా
ఆరగించిరి.
వనరక్షకులు
వానరులను
నిరోధించిరి.
కానీ
వానరులు
వారి
మాటలను
లెక్కచేయకుండుటచే
కాపలావారు
పరుగులెత్తి
సుగ్రీవుని
దగ్గరకు
వచ్చి
విన్నవించిరి.
ఆ
వార్తతో,
ఓహో!
రామకార్యమును
సాధించిరను
విషయమును
సుగ్రీవుడు
గ్రహించెను.
జానకిని
చూడక
వారు
ఫలమును
భక్షించరు.
మధువనమున
ప్రవేశించరు.
ఇది
ఆనందోత్సవము
కాన
విచారించకుడని
వారిని
తిరిగి
పంపెను.
ఇంతలో
వానరులు
ప్రవేశించి
రాజు
చరణములకు
నమస్కరించిరి.
అంతసుగ్రీవుడు,
ఓ
వానరులారా!
ఫలము
గొనితెచ్చితిరని
తలంతును
అని
చిరునవ్వు
నవ్వగానే,
వానరులు,
ఓ
నాథా!
మీకృపాకటాక్షములో
కార్యము
సాధించితిమి,
అయితే
మహావీరుడే
దీనిని
సాధించెను.
మా
ప్రాణములనతడే
నిలబెట్టెను.
నేడు
మీ
ముందు
మేము
ప్రాణములతో
నిలచి
మాట్లాడుచున్నామన్న
దానికి
హనుమంతుడే
కారణము
అని
లంక
వార్తలను,
సీత
యోగక్షేమములను
సుగ్రీవునకు
విన్నవించిరి.
ఈ
శుభవార్తను
విని
సుగ్రీవుడు
మనమిక
కాలహరణము
చేయకూడదని
దిగ్గనలేచి,
శ్రీరాముని
వద్దకు
బయలుదేరిరి.
కార్యము
సాధించుకొని
వానరులు
వచ్చుచున్నారని
రాముడు
తెలుసుకొనెను.
ఒక
పెద్ద
గుండుపై
కూర్చుండి
రామలక్ష్మణులు
దూరమునుండి
వచ్చుచున్న
వానరులను
చూచుచుండిరి.
వానరులు
పరువులెత్తుచూ
ఉల్లాసముతో
వచ్చి
రామచంద్రుని
పాదములపై
బడిరి.
శ్రీరాముడు
మొదట
వారల
యోగక్షేమముల
విచారించెను.
జాంబవంతుడు
లేచి,
ఓ
నాథా!
మీ
కృప
కలిగినవాడే
ధన్యుడు.
అతడే
జయుడు.
అతడే
16
▾
Meaning
Keep
సకల
గుణసంపన్నుడు,
వాని
కీర్తి
మూడులోకములలో
వ్యాపించును
అని
హనుమంతుని
అనేక
విధముల
వర్ణించెను.
అంత
హనుమంతుడు
శ్రీరామునకు
నమస్కరించి
లంక
వృత్తాంతమంతయూ
వివరించి
చెప్పి
సీతయొక్క
యోగక్షేమములు
ఆనందభాష్పములతో
ముచ్చటించి,
అతిభద్రముతో
దాచి
తెచ్చిన
చూడామణిని
రాముని
హస్తమునందుంచెను.
రాముడు
హనుమంతుని
కౌగిలించుకొని,
"ఓయీ
వాయుపుత్రా!
జానకియొక్క
యోగక్షేమములు
మరింత
వివరించి
చెప్పు"మని
ఆజ్ఞాపించెను.
అంత
హనుమంతుడు,
"ఓ
ప్రాణనాథా!
త్రికూటపర్వతముపైనున్న
లంకానగరమును,
దాని
శోభను
వర్ణించ
వీలుకాదు.
నాథా!
సీతాదేవి
అస్థిపంజరమై
మీ
దర్శననిమిత్తమై
క్షణములు
లెక్కించుచున్నది.
క్షణక్షణము
మీ
నామము
తప్ప
అన్యచింతన
లేదు.
కడుపుకు
తిండి
కానీ
కంటికి
నిద్రకానీ
ఎరుగదు.
మీకు
అనేక
పర్యాయములు
నమస్కారములు
తెలిపెను.
లక్ష్మణుని
ఎంతో
తలంచెను.
కంటిధారలు
కార్చెను.
ఆమె
అవస్థ
నా
హృదయమును
దహింపజేసెను.
ప్రతిదినము
తెల్లవారి,
సాయంకాల
సమయమున
రావణుడు
వచ్చి
ఆమెను
అనుచున్న
శూలపు
పోటువంటి
మాటలు
నేను
చెవులారా
వింటిని.
తల్లి
యేమాత్రమూ
లెక్క
చేయక
తమ
చింతయందే
కృంగిపోవుచున్నది"
అని,
రావణుడు
ఆడిన
మాటలను
వివరించెను.
తత్క్షణమే
వెళ్ళి
సీతను
రక్షించమని
హనుమంతుడు
పాదములపై
బడి
ప్రార్థించెను.
ఈ
మాటలు
వింటున్న
లక్ష్మణుడు
ఒక
ప్రక్క
ఉగ్రుడై
మరొక
ప్రక్క
కంటిధారలు
కార్చుచూ,
"అన్నా,
ఆలస్యము
చేయక
వదినెను
రక్షింపుడని"
ప్రార్థించెను.
కాని
రాముడు
చిరునవ్వుతో,
"లక్ష్మణా,
తొందరపడకుము.
అన్నింటికీ
కాలము
ప్రధానము.
దుఃఖములకు
క్రుంగక
సుఖమునకు
పొంగక
వుండుస్థితిని
కలిగియుండవలె"
నని
అనేక
విధముల
లక్ష్మణుని
శాంతవచనములతో
ఓదార్చెను.
అంత
హనుమంతుని
దగ్గరకు
పిలిచి,
ఓ
వానరా!
రమ్ము,
నా
చెంత
కూర్చొనుము
అని
చేతులుపట్టి
కపీశ్వరుని
తన
పాదముల
చెంత
కూర్చొనబెట్టుకుని,
హనుమాన్!
రావణుని
ప్రభుత్వమెట్లున్నది,
నీవు
లంకను
ఎట్లు
దహించితివి?
అని
అడుగగా,
ఆ
మహావీరుడు,
"ఓ
నాథా!
మీరు
సర్వజ్ఞులు,
మా
వానరుల
బలమేపాటిది?
మేము
కేవలము
శాకాహారులము,
చెట్టుకొమ్మలను
మాత్రమే
దాటగలము.
సముద్రమును
లంఘించుటయు,
రాక్షసులను
సంహరించుటయు,
నగరమును
దహించుటయు
17
▾
Meaning
Keep
ఈ
మొదలగు
కార్యములు
మీ
ప్రతాపమువలనే
జరిగెను.
మీ
నామమహిమ
వలననే
చేయగలిగితిని.
నా
ప్రయోజకత్వము
శూన్యము.
మీ
ముద్రిక
నా
వెంట
ఒక
రక్షగా
వుండి
నన్ను
రక్షించినదే
తప్ప
నా
బలము
కాదు.
స్వామీ
మీ
ముద్రికను
చూచి
ఆ
తల్లి
ఎంత
ఆనందించెనో,
ఇది
కలయో
లేక
నిజముగా
నా
రాముడు
పంపెనా?
అని
సంశయించెను,
శాంతించెను.
ఆమె
శోకాగ్నియే
లంకను
దహించినది
కానీ
ఈ
వానరుడు
కాదు.
వీనిని
ఒక
నిమిత్తమాత్రంగా
తమరు
పంపి,
నాచే
ఇంతటి
ఘనకార్యము
చేయించితిరి.
ఇది
భక్తవత్సలుని
పరమానుగ్రహమే
తప్ప
అన్యము
కాదు.
రామా!
మీ
కటాక్షముండిన
దుస్సాధ్యములుండవు"
అని
నిగర్విగా
పలికిన
హనుమంతుని
పలుకులకు
రామచంద్రుడు
ఆనందించి,
సోదరా!
విలంబనము
చేయక
సమరసన్నాహము
చేయుమని
లక్ష్మణునికి
ఆజ్ఞాపించెను.
అంత
జాంబవంతుడు,
సుగ్రీవుడు
మొదలయిన
వానరుల
సన్నాహములు
చూచి
దేవతలే
సంతసించిరి.
వానరయోధులు
శ్రీవారి
చరణకమలములకు
నమస్కరించి
సింహనాదములు
చేసిరి.
శ్రీరాముడు
వారిని
కటాక్షదృష్టితో
చూచి
ఆదరించి
ఆశీర్వదించెను.
పర్వతములకు
రెక్కలు
వచ్చినట్లు
వానరులు
బలవంతులై
విజృంభించి
ప్రయాణము
సాగించిరి.
వారలు
ప్రస్థావించగనే
అనేక
శుభశకునములు
కనబడెను.
వారు
బయలుదేరగనే,
అశోకవనమందున్న
జానకి
మనసున
ఒక
విధమైన
శుభ
భావము
రేకెత్తెను.
శుభశకునములు
కంటబడెను.
రావణునకు
అశుభములు
ఎదురయ్యెను.
జాంబవంతాదులు
పర్వతములను,
వృక్షములను
తమ
ఆయుధములుగా
ధరించి
స్వేచ్ఛానుసారముగా
గంతులు
వేయుచూ
భూమి
దద్దరిల్లునట్లు
కేకలు
వేయుచు
వెడలిరి.
మధ్య
మధ్య
రామచంద్ర
ప్రభువుకు
జై
అని
నాదములు
చేసిరి.
ఇక
లంకలో
ప్రతి
రాక్షసుడు
ముందు
ఏమి
కానున్నదో
అని
ఎవరికి
వారు
లోలోన
దిగులుపడి,
జరిగిన
ప్రమాదము
తలంచుచూ,
ముందింకెట్టి
ప్రమాదము
వాటిల్లునో
అని
క్రుంగి
కుములుచుండిరి.
రాక్షసుల
వంశమునకు
వినాశము
ఆసన్నమయినదని
ధృఢము
చేసుకొనిరి.
కానీ,
రావణునికి
భయపడి
రాక్షసులు
గుసగుసలు
జరిపిరి.
Previous
←
The Search for Sītā
Next
Vibhīṣaṇa's Śaraṇāgati
→