Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · Vibhīṣaṇa's Śaraṇāgati
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
8
విభీషణ
శరణాగతి
నగరమునకు
రామదూతయైన
వానరుడు
వచ్చి
ఇంతటి
పని
చేసెకదా!
ఇక
ప్రభువే
వచ్చిన
యెంత
అనర్థము
పుట్టునో?
ఇంతవాడు
దూత
అయినప్పుడు
ప్రభువెంతటివాడో
కదా?
అని
ఈ
ప్రకారము
రాక్షసులు
యెక్కడ
గుంపు
చేరినా
ఈ
మాటలే
ముచ్చటించుచుండెడివారు.
వారి
మాటలు
చెలికత్తెలు
విని
మండోదరికి
చెప్పిరి.
ఆమె
మనసు
వ్యాకులము
జెందెను.
ఇది
నిజమేనని
తాను
కూడా
తలచి,
యేకాంతముగా
తన
భర్త
ఉల్లాసముగా
నున్న
సమయమును
గమనించి
చేతులు
జోడించుకొని
"నాథా!
సర్వజ్ఞునితో
విరోధమువలదు.
రాముడు
సామాన్యమానవుడు
కాదని
నీవే
అనేక
పర్యాయములు
తెలిపియుంటివి;
శూర్పణఖ
ముక్కు
చెవులు
కోసినప్పుడే
నీ
సైన్యమేమీ
చేయలేకపోయెను.
కేవలము
ఒక
రామలక్ష్మణులనే
లక్షలాది
రాక్షసులు
కదలించలేకపోయిరి.
ఇప్పుడు
మహాబలవంతులైన
వానరవీరులు
తోడుగా
లక్షలాది
మంది
వెంట
వుండ,
మన
రాక్షసులు
యేమి
చేయగలరు?
దూతనే
బంధించలేని
దౌర్భాగ్యము
మన
రాక్షసులది.
దూతయే
యింతటి
కార్యమును
ఒనర్చినప్పుడు
ఇక
లక్షలాది
వానరులు
యెంతైనా
చేయగలరు.
కాన,
నా
ప్రార్థన
మన్నించి
మంత్రి
సహాయముతో,
లేదా,
నీ
సహోదరుడైన
విభీషణుని
సహాయమునిచ్చి
రాముని
భార్యను
పంపివేయుము.
ఆ
జానకి
సామాన్యమయిన
స్త్రీ
కాదు.
మహా
పతివ్రత;
దివ్యశక్తి
స్వరూపిణి.
అట్టి
వారిని
హింసించుట
నీకు
మంచిది
కాదు.
నా
మాట
విని,
సీతను
రాముని
కప్పజెప్పుము.
నీకును,
మన
రాక్షస
జాతికిని
శుభము
కలుగును.
సర్పములు
మాండూకములనువలె
రామబాణములు
రాక్షసులను
మ్రింగివేయును.
నీ
మొండిని
విడచి,
అహంకారమును
త్యజించి,
హఠమును
దూరము
నెట్టి,
సీతను
రామునకు
సమర్పించుము.
అతనితో
శీఘ్రము
సంధిజేసుకొనుము"
అని
ప్రాధేయపడెను.
2
▾
Meaning
Keep
పాదములు
పట్టి
ప్రార్ధించుచున్న
మండోదరిని
మూర్ఖుడయిన
రావణుడు
చూచి,
ఫక్కున
నవ్వి,
"ఓసీ,
అబలా!
స్త్రీలు
సహజముగనే
భయస్వభావులు.
వారి
మాటలవలన
శుభములు
అశుభములగును.
వానరులు
మన
గుమ్మమునకు
వచ్చిన
మన
రాక్షసులు
వారిని
భక్షించకుందురా.
నా
పేరు
విన్నంతమాత్రమున
దేవతలే
గడగడ
వణకుచుండ
నీకెందుకింత
భయము?
లోపలకు
పొమ్ము"
అని
గర్జించి
మూర్తీభవించిన
దురభిమానముతో
సభలో
ప్రవేశించెను.
అతను
వెళ్ళగనే
మండోదరి
ఆహా!
విధికృతము
విపరీతముగా
నుండెను.
నాకేమి
దుర్గతి
వచ్చునో
కదా!
నేనేమి
చేయగలను?
అని
పడకగదికి
వెళ్ళి
అనేక
విధముల
విచారముతో
పరుండెను.
సభలో
ప్రవేశించిన
రావణుడు
మంత్రులను
పిలిచి
"ఓయీ!
మీమీ
అభిమతములు
తెలుపుడు.
రామదూత
వచ్చి
కావించిన
దుర్గతి
మీకు
తెలిసినది
కదా.
ఇక
ముందు
ఏమి
కానున్నదో,
మనము
ఏమి
చేయవలెనో
భయమును
వీడి
అభిప్రాయములను
తెలుపు"డని
కోరగా,
మంత్రులు
ఒకరి
ముఖములు
ఒకరు
చూచుకొంటూ
నవ్వి
వూరకుండిరి.
ఆనాడు
కుంభకర్ణుడు
మేల్గాంచెను.
వాడు
సభకు
వచ్చి,
అరే,
మూడు
లోకములలో
నావంటివారు
లేరు.
నా
యెదట
నిలువబడదగిన
వాడు
కలడా?
యెవ్వడో
చిన్న
వానరుడు
లంకలో
ప్రవేశించి
గృహములు
భస్మము
గావించెనట!
ఛీ,
ఛీ,
మీరందరూ
యెట్లు
వానిని
వదలితిరి
అని
పండ్లు
పటపట
కొరుకుచు
ఇంటికి
వెళ్ళెను.
అతికాయుడు
లేచి,
రాజా!
మీ
ఆజ్ఞానుసారము
గావింతుము.
మీ
కటాక్షముండిన
లోకములో
మనుజులను,
వానరులను
నిశ్శేషముగా
సంహరించెదను,
పెక్కు
మాటలేల?
అని
హుంకరించెను.
ఇంతలో
కామరూపుడగు
మేఘనాధుడు
లేచి,
మహాప్రభూ!
నా
ప్రతాపము
లోక
విఖ్యాతము.
దేవతలే
నా
స్వాధీనులు,
వారలకంటే
బలవంతులు
లోకమున
లేరు
కదా?
ఇక
నరవానరుల
మాట
జెప్పనేల?
అని
ప్రగల్భము
లాడెను.
ఈ
విధముగా
కుంభకర్ణుని
పుత్రులైన
పాషండులు,
పొగరుపోతులు,
కుంభనికుంభులు
మిగిలిన
ప్రకంపనుడు
ఇత్యాదివీరులు
గర్జించిరి.
మధ్యలో
మహోదరుడు
లేచి
తొడలు
కొట్టుకొనెను.
పండ్లు
పటపట
కొరికెను.
ఇట్లు
ఆ
సభలో
ఒకరి
3
▾
Meaning
Keep
తరువాత
ఒకరు
వారి
వారి
ప్రతాపములు,
ప్రగల్భములు
పలుకుచూ
లోలోన
భయపడుచూ
వున్ననూ
రావణుని
ప్రసన్నుని
గావించు
నిమిత్తమై
ఈ
రీతిగా
ప్రతాపముతో
పలికిరి.
ఇంతలో
మకరాక్షుడు
లేచి,
సార్వభౌమా!
నేను
బ్రాహ్మణవేషము
ధరించి
రామలక్ష్మణులను
భోజనమునకు
పిలిచి,
వారు
గృహమున
ప్రవేశించగనే,
వారిని
గట్టిగా
పట్టుకొనెదను.
ఈ
ఉపాయము
మీకిష్టమయిన
నేను
ఈ
ప్రయత్నము
చేయుదునని
పలికెను.
ఈ
విధముగా
మంత్రులు
చెప్పిన
వాక్యములు
రావణునకు
హితముగా
నుండెను.
ఇంతలో
విభీషణుడు
సభలో
ప్రవేశించి,
రావణునకు
నమస్కరించి
ఆసనముపై
కూర్చొనెను.
అంత,
రావణుడు
తమ్మునిచూచి,
సోదరా!
ఈ
నరవానర
విషయములో
నీ
అభిప్రాయమేమని
అడిగెను.
అంత
విభీషణుడు,
"కృపాళూ!
నాకు
తోచినరీతి
చెప్పెదను.
తాము
సావధానముగా
వినగోరుచున్నాను.
నన్ను
మన్నింపుము.
ఓ
నాథా!
మీరు
సద్గతిని,
సత్కీర్తిని,
శుభములను,
సుఖమును
గోరినయెడల
పరస్త్రీ
ముఖమును
చూడగూడదు.
పదునాలుగు
భువనములకు
అధిపతియగు
వాని
నొకజీవుడేమి
చేయగలడు?
ఎదిరించి
జీవించునా?
అట్టివారికేమి
శుభములు
కలుగును?
ఎన్ని
గుణములన్ననూ
లోభగుణమున
మనుజుడు
రాణించడు.
రాజా!
కామక్రోధాదులు
అధమ
మార్గమునకు
ద్వారములు.
శ్రీరాముడు
సామాన్యుడు
కాదు.
కాలునకు
కాలుడు,
అనామయుడు,
అజుడు.
అట్టి
వారితో
వైరము
విడచి
వారిని
సేవించుట
మంచిది.
వారి
సతియైన
జానకిని
వారికి
సమర్పించుము.
వారి
కటాక్షమును
సంపాదించుము.
మీ
చరణములకు
నమస్కరించి
మాటిమాటికి
విన్నవింతును"
అని
ఈ
ప్రకారముగా
చెప్పిన
వచనములకు
మాల్యవంతుడను
వృద్ధమంత్రి
సమ్మతించెను.
అతను
లేచి,
ఓ
మహారాజా!
మీ
తమ్ముడు
చెప్పిన
మాటలు
నీతియుక్తములు,
వానిని
మీరు
మన్నించుట
శ్రేయస్సు
అని
తెలిపెను.
వీరి
యిరువురి
మాటలకు
రావణుడు
ఉగ్రుడై
మీరిరువురు
మూర్ఖులు,
మీరెంతగా
పరమశత్రువులను
శ్లాఘించెదరు.
మీరీ
సభలో
వుండతగినవారు
కారు,
అని
వీరిని
సభనుండి
వెడలగొట్టుడు
అని
ఆజ్ఞాపించెను.
అంత
మాల్యవంతుడు
దిగ్గున
గద్దెదిగి
గృహమునకు
నిష్క్రమించెను.
పిమ్మట
విభీషణుడు
అన్నకు
నమస్కరించి
చేతులు
జోడించుకుని,
“రాజా!
ప్రతి
మనుజుని
హృదయములో,
సుమతియూ,
కుమతియూ
4
▾
Meaning
Keep
నివసించునని
వేదశాస్త్రములు
చెప్పును,
సుమతి
యుండినపుడు
సకల
సంపదలుండును,
కుమతి
యుండినపుడు
సకల
విపత్తులు
కలుగును.
మీ
హృదయములో
కుమతి
యుండును.
అందుచేత
మంచిమాటలచే
హితవు
గోరిన
వారిని
మీరు
శత్రువులుగా
భావింతురు.
రాక్షస
కులమునకు
కాళరాత్రి
వంటి
సీతమీద
మీకు
దయ
కలదు;
అదియే
మీ
కుబుద్ధి.
నేనొక
వరము
కోరుచున్నాను.
నా
మాట
మన్నించి
శ్రీ
రామునికి
సీతను
సమర్పించుడు.
మీకు
సకల
కల్యాణములు
కలుగును"
అని
ప్రార్థించగా,
రావణుడు
దిగ్గునలేచి,
“ఓరీ
మూర్ఖుడా!
నీకు
మృత్యువు
సమీపించినది.
నా
వలన
నీవింత
కాలము
జీవించియుంటివి.
ఇపుడు
నీకు
శత్రువులు
ఉపకారులా?
వారి
మీద
నీకింత
అభిమానమెందులకో
అర్థము
కాకున్నది.
నా
భుజబలము
చేత
సాధింపబడని
మనుజుడొకడు
లోకమున
కలడా?
నా
అన్నము
తింటూ,
నా
గృహమున
నివసించుచూ,
నా
నీడన
జీవించుచూ
శత్రువులను
భూషింతువా?
కండలను
పెంచిన
కూటికుండకు
చేటు
వచ్చినట్లాయెను.
నీవా
తపశ్శాలుల
వద్దకుపోయి
నీ
నీతులను
వారికి
చెప్పుము"
అని
పాదముల
చెంత
కూర్చున్న
తమ్ముని
శిరస్సును
కాలితో
తన్నెను.
ఎన్ని
తన్నినను
విభీషణుడు
మాటిమాటికి
రావణుని
పాదములు
పట్టి,
"ఓ
రాజా!
రాముడు
సత్యసంకల్పుడు.
నీకువలె
నీ
అనుచరులకు
కూడా
కాలము
సమీపించినది.
నేను
ఇపుడే
వెళ్ళి
శ్రీరాముని
శరణుజొచ్చెద.
నా
దోషము
లేదు”
అని
చెప్పి
విభీషణుడు
వెడలెను.
అతడు
రామా,
రామా
అని
ఉవ్విళ్ళూరుచూ
సముద్రమును
దాటి
ఇవతలి
ఒడ్డునకు
వచ్చెను.
అతని
యాగమనమును
చూచి,
అతడు
రావణుని
దూత
అని
తలచి
వానరులు
సుగ్రీవునితో
చెప్పిరి.
విభీషణుని,
కటకములో
ప్రవేశింపకుండ
నిరోధించిరి.
అతని
వృత్తాంతమును
శ్రీవారికి
విన్నవించిరి.
"ఓ
రామా!
రావణుని
తమ్ముడు
మిమ్ములను
దర్శించుటకు
వచ్చెను"
అని
సుగ్రీవుడు
తెలుపగనే,
రాముడు,
సుగ్రీవా,
నీ
అభిప్రాయమేమి
అని
ప్రశ్నించెను.
అంత
సుగ్రీవుడు
రాక్షసుల
మాయలను
తెలిసికొనుట
కష్టము.
వారు
కామరూపులు,
ఎందులకు
మీ
వద్దకు
వచ్చెనో
తెలియదు.
నాకును,
అంగదునకు
మిత్రభేదము
చేయుటకు
వచ్చినట్లున్నది.
వానిని
తత్క్షణము
బంధించుట
మంచిది
అని
సుగ్రీవుడు
తెలిపెను.
రాముడు,
"ఓ
సఖుడా!
నీ
మాట
5
▾
Meaning
Keep
సత్యము.
శాస్త్రానుసారము
పలికితివి.
అయినను
నా
ప్రతిజ్ఞ
వినుము;
నీ
మాటకు
ప్రతికూలముగా
నుండును.
శరణాగతులను
రక్షించెదనని
నా
ప్రతిజ్ఞ.
శరణాగతులు
మనకు
శత్రువులయినను
వారిని
విడిచిపెట్టుటనుచితము
కోటి
బ్రహ్మహత్యాపాపము
చేసిననూ
నన్ను
శరణుజొచ్చిన
యెడల
నేను
వానిని
విడిచిపెట్టుదును.
ఒక
వేళ
మనకు
మిత్ర
భేదము
చేయుట
కతనిని
మనవద్దకు
రావణుడు
పంపినను,
అంత
మాత్రమున
మనకు
వచ్చిన
భయమేమియూ
లేదు.
ఒకవేళ
భయపడి
నా
శరణుజొచ్చిన
యెడల
నా
ప్రాణ
సమానముగా
వానిని
రక్షింతును
కాన,
త్వరగా
అతనిని
లోనికి
గొనిరమ్ము"
అని
సుగ్రీవునకు
ఆజ్ఞ
ఇచ్చెను.
హనుమంతుడు
ఒక్క
క్షణమున
వెళ్ళి
విభీషణుని
తోడ్కొని
వచ్చి
రాముని
ముందు
పెట్టెను.
రాముని
ముఖారవిందమును
గాంచగనే
విభీషణునికి
ఆనందభాష్పములు
నేత్రమునుండి
ధారలై
ప్రవహించెను.
అతడు
నిలువలేక
పోయెను.
నాథా!
అని
రాముని
పాదములపైబడి,
రక్షింపుము.
రక్షింపుము.
నేను
తమ
దాసుడను
అని
మొరపెట్టుకొనెను.
"ఓ
దేవరక్షకా!
రాక్షస
వంశములో
పుట్టి,
రాక్షసుల
పరిపాలించు
రావణుని
తమ్ముడగు
నా
పేరు
విభీషణుడు.
నేను
మహాపాపసంభవుడను,
తమోగుణ
ప్రధానుడను.
గుడ్లగూబ
చీకటిని
ఆశించునటుల,
నేను
తమస్సునే
ఆశించువాడను.
మీరు
శరణాగత
రక్షకులు,
మీ
పొత్తుకోరి
వచ్చితిని.
మీరు
తప్ప
నాకు
మరొకరు
రక్షకులు
లేరు
అని
ఈ
ప్రకారము
శ్రీరామునిముందు
నిలిచి
దీనుడై
అతి
వినయముతో
ప్రార్థించు
విభీషణుని
చూచి
రాముడు
ప్రసన్నుడై
అతనిని
దగ్గరకు
చేర్చుకొని
వెన్ను
నిమురుచు,
జాలి
వచనములతో
అనేక
శాంతి
వచనములాడి
“నాయనా
విభీషణా!
విచారించకు.
నా
దర్శనముచేత
నీ
నిశాచరత్వము
నశించెను.
నాకు
లక్ష్మణసుగ్రీవాదు
లెట్టివారో
నీవునూ
అట్టివాడవు"
అని
పలుకగనే
విభీషణునకు
భయము
పోయెను.
అంత
శ్రీరాముడు
ఓ
లంకేశా,
మీ
పరివారమంతయు
కుశలమేనా?
అనేక
కోట్ల
రాక్షసుల
మధ్య
నీవెట్లు
జీవించితివి?
నీభక్తి
ప్రపత్తుల
నెట్లు
నిలబెట్టుకొంటివి?
అని
అనేక
విధముల
ధర్మ
కర్మల
గురించి
ప్రశ్నించెను.
విభీషణుడు,
“ఓ
రఘునాథా!
మీరు
ధనుర్బాణములు
ధరించి
హృదయములో
ప్రవేశించువరకూ
కామాదుల
బాధ
తగిలియుండును.
ఎంతవరకు
శ్రీవారి
స్వరూపజ్ఞానోదయము
కలుగదో
అంతవరకే
కామక్రోధాదులు.
రాగద్వేషాదులగునట్టి
6
▾
Meaning
Keep
గుడ్లగూబలకు
తగిన
ఆజ్ఞానాంధకారము
జీవుల
హృదయముల
నావరించి
యుండును.
ఓ
నాథా!
మీ
చరణముల
దర్శించుటచేతను,
స్పర్శించుటచేతను
నా
జన్మ
సఫలమైనది.
నా
భయశోకములు
నశించెను.
నేనేనాడూ
శుభకర్మల
నాచరించియుండలేదు.
ఐనను
మీరు
నన్ను
కౌగిలించుకొంటిరి.
యేమి
నా
భాగ్యము!"
అని
నయనముల
నుండి
ఆనందబిందువులు
జలజల
కార్చుచుండ
విభీషణుని
చూచి
"
విభీషణా!
నీవు
సకల
గుణసంపన్నుడవు,
లేకున్న
నా
దర్శన
స్పర్శన
సంభాషణలు
కలిగియుండెడివి
కావు”
అని
శ్రీరాముడు
పలుకగనే,
విభీషణుడు
ఆపారమగు
సంతోషమును
బొందెను.
పునః
పునః
అతడు
శ్రీరాముని
పాదములపై
బడుచుండెను.
అంత
శ్రీరాముడు
విభీషణా
నీవు
త్వరితముగా
వెళ్ళి,
సముద్రస్నానము
గావించి
రమ్ము
అని
ఆజ్ఞాపించెను.
విభీషణుడు
స్నానమునకు
వెళ్ళెను.
ఇంతలో
వానరశ్రేష్టుడైన
హనుమంతుని
పిలిచి,
నీవు
వెళ్ళి
కొంత
సముద్ర
జలమును
గొనిరమ్మని
ఆజ్ఞాపించెను.
విభీషణుడు
స్నానమాచరించి
రామ
పాదములపై
వ్రాలెను.
హనుమంతుడు
తెచ్చిన
సముద్ర
జలమును
శ్రీరాముడు
తన
హస్తమున
నిడుకొని,
చెంత
కూర్చొనియున్న
విభీషణుని
శిరస్సుపై
ప్రోక్షించి,
నీకు
లంకా
రాజ్యమున
కభిషేకము
చేసితినని
పలికెను.
విభీషణుడు
రామా,
నాకారాజ్యమెందుకు?
తమ
పాదారవిందములయందు
స్థానము
లభించిన
చాలునని
పలుకగా,
లేదు.
నీవంగీకరించక
తప్పదని
రాముడు
శాసించెను.
తమ
ఆజ్ఞ
శిరసావహింతునని,
విభీషణుడు
చేతులు
జోడించి
లేచి
నిలిచెను.
వానర
వీరులు
తమకు
తాము
ఆశ్చర్యపడుచు
రాముని
శరణాగతవత్సలతను
తలంచుచూ
లోలోన
ఆనందించిరి.
శ్రీ
రాముడు
సేనాధిపతిని
చూచి,
"ఓ
కపీశా!
ఈ
విభీషణుని
మీతో
చేర్చుకొనుడు.
ఇతనిని
వేరుగా
భావించక
మీ
సఖునిగా
భావించుడు.
ఇతడు
నావాడు,”
అని
ప్రియవచనములు
పలికెను.
అందరూ
ప్రయాణమై,
సముద్ర
తీరమునకు
వెళ్ళిరి.
ఆ
సముద్రమును
చూచి
రాముడు
దీనిని
దాటుటెట్లని
ప్రశ్నించగనే,
అనేక
వానరులు
అనేక
విధముల
జవాబు
లిచ్చిరి.
విభీషణుడు
లేచి,
"ఓ
నాథా!
సముద్రుడు
మీ
కుల
గురువు;
సగరపుత్రుల
వలన
అది
పుట్టెను.
మీరు
సంకల్పించిన,
యెట్టి
ప్రయాస
లేకుండా
వానరులు
దానిని
దాటగలరు"
అని
చెప్పెను.
7
▾
Meaning
Keep
ఇంతలో
రావణుడు
పంపిన
దూతలు
విభీషణుని
కంటబడిరి.
అతడు
వారిని
తీసుకొని
రాముని
చెంత
నిలబెట్టెను.
రాముడు
యెట్టి
జవాబును
ఇవ్వకుండుటచే,
వానరులు
వారిని
బంధించి
సుగ్రీవుని
కడకు
తీసుకొనిపోయిరి.
అచట
సుగ్రీవుడు
వారి
అంగములు
ఛేదింపుడు
అని
ఆజ్ఞ
యొసగెను.
వానరులు,
వారిని
అనేక
బాధలు
పెట్టిరి.
బాధలను
భరింపలేక,
వారు
మొరబెట్టుకొనిరి.
"ఓ
వానరులారా!
రామునితోడు,
మాకు
ముక్కు
చెవులు
మాత్రము
కోయక
విడువుడు"
అని
ప్రార్థించిరి.
వారి
మొర
లక్ష్మణుడు
విని,
వారిని
అక్కడికి
గొనిరమ్మని
ఆజ్ఞాపించెను.
వారితో
లక్ష్మణుడు
శాంతవచనములాడి,
దూతలను
హింసించుట
మంచిది
కాదని
తెలిపి,
ఒక
ఉత్తరము
వ్రాసి,
వారి
చేతికిచ్చి,
"ఈ
యుత్తరమును
రావణునికిచ్చివేయుడు.
ఈ
నోటిమాటను
వానితో
చెప్పుడు:
'ఓరీ
కులఘాతకుడా!
నేటికైననూ
నీ
హృదయమును
మార్చుకొని
రాముని
పాదములపై
బడుము;
క్షమించగలడు.
ఊరక
వంశమునే
నాశనము
చేసుకొనకుము.
లేకున్న
నీ
కాలము
సమీపించినది"
అని
కఠినముగా
లక్ష్మణుడు
చెప్పి,
వెనుకకు
వెళ్ళుడని
ఆజ్ఞాపించెను.
ఆ
దూతలు
బ్రతికితిమని
సంతసించి,
"రామచంద్ర
ప్రభువుకు
జై"
అని
రామరూపమును
స్మరించుచూ
లంకకుచేరి
జరిగిన
వృత్తాంతమంతయూ
తెలిపి,
రాముని
సుందర
విగ్రహమును
అనేక
విధముల
వర్ణించి,
లక్ష్మణుడు
అందించిన
జాబును
రావణుని
చేతికిచ్చిరి.
రావణుడు
విభీషణుని
క్షేమసమాచారములు
విచారించి
“కానీ!
వానికి
మృత్యువు
సమీపించినది.
యవధాన్యమునకు
పురుగుపట్టినట్లు
ఆ
నిర్భాగ్యుడు
లంకా
రాజ్యమును
విడచి
నా
శత్రువును
శరణుజొచ్చెను.
ఓరి
శుకా!
ఎట్లు
నీకు
వారి
దర్శనమయ్యెను?
నా
తేజోబలములను
వారికి
విన్నవించితివా?
వారి
తేజోబలములను
వివరముగా
తెలుపుము"
అని
ఆ
దూతను
అడిగెను.
వాడు
చేతులుజోడించుకొని
యిట్లు
విన్నవించెను:
“ఓ
నాథా!
మీరు
కటాక్షించి
శాంతముగా
నా
మాటలను
వినుడు.
ఎపుడు
మీ
సోదరుడు
శ్రీ
రామునితో
సఖ్యము
చేసుకొనెనో,
అపుడు
నీ
తమ్మునకు
శ్రీరాముడు
లంకా
రాజ్యమునకు
పట్టము
కట్టెను.
నేను
తమ
దూతనని
తెలిసికొని
వానరులు
నన్ను
బాధించిరి.
నేను
రాముని
మీద
ఒట్టు
బెట్టినందున
నా
ముక్కు
చెవులను
ఛేదించక
విడిచిపెట్టిరి.
వేయి
ముఖములతో
8
▾
Meaning
Keep
నయినను
నేనా
వానరబలముదళమును
వర్ణించలేను;
రంగురంగుల
వానరులును,
జాంబవంతులును
కలరు.
వారిని
చూచినను,
వారిని
తలచినను
భయము
కలుగును.
నీ
కుమారుని
చంపి
పట్టణమును
దహించిన
వానరుడొక్కడు.
ఏపాటి
బలము
వానికి
కలదు!
శ్రీరాముని
ప్రతాపము
వలన
అత్యల్పుడగు
వానరుడు
సహితము
మహాబలవంతుడయ్యెను.
అనేక
నామములు
కల
వానరయోధులు
కలరు.
అనేక
యేనుగుల
బలము
ఒక్కొక్కనికి
కలదు.
ద్వివిద,
మైంద,
నీల,
నల,
అంగద,
వికట,
దధిముఖ,
కేసరి,
కుముద,
గజ,
గవాక్ష,
జాంబవంత
ఈ
మహాబలులు
సేనాధిపతులు.
వారందరూ
సుగ్రీవునితో
సరిసమాన
బలవంతులు.
ఇంకను
వారితో
సరిసమాన
బలవంతులైన
వారు
లక్షలకు
కలరు.
లెక్కకెక్కువైన
వానరులను
లెక్కించ
సాధ్యముకాదు.
వారందరూ
అతి
పరాక్రమ
వంతులు,
తృణమువలె
మూడు
లోకములను
క్షణములో
సాధించగలరు,
జయించగలరు.
"ఓ
రాజా!
వారు
పదునెనిమిది
పద్మముల
వానరులని
వినియుంటిని.
వారికి
వేరు
వేరు
సేనాధిపతులు
కలరు.
ఓ
రాజా!
యుద్ధములో
నిన్ను
జయింపలేనని
అధైర్యపడిన
వానరుడొకడు
వారిలో
కనబడడు.
ఈ
పట్టణములపై
దుముకుటకు
సిద్ధపడి
చేతులు
సలుపుకొనుచున్నారు.
ఇంతవరకు
శ్రీరాముని
ఉత్తరువు
లేదు.
సముద్రుడు
మార్గమిచ్చిననూ
లేకపోయినను
వారు
సముద్రమునకు
పాషాణములతో
వారధి
గట్టి
వారి
కార్యమును
సాధించుటకు
సిద్ధముగా
నున్నారు.
రావణుని
ఒక్క
క్షణములో
నలిపి
భస్మము
గావింతుమని
వానరులు
అనేక
విధముల
పండ్లు
కొరుకుచున్నారు.
వారి
గర్జనలు;
వారి
వీరాలాపములు
వినిన
భయము
కలుగును.
మీ
పేరు
వినగానే
వృక్షములు
వేళ్ళవరకు
భూమి
నుండి
లాగి,
బంతుల
వలే
విసరివేయుచున్నారు.
లంకా
నగరమును
భక్షించుటకు
ఉఱ్ఱూతలూగుచున్నారు.
వానరభల్లూకములే
మహాశూరులు.
అందులకుతోడు
శ్రీరాముడు
యజమానుడు.
కోటి
కాలాంతకులను
ఒక్క
క్షణమున
మ్రింగగలరు.
ఇక,
శ్రీరాముని
తేజోబలమును
బుద్ధిని
శతసహస్రశేషులు
సహితము
వర్ణించి
చెప్పలేరు.
ఒక్క
బాణముతో
సముద్రమునే
శోధించగలడు.
నీ
తమ్ముడు
పూర్వము
చెప్పినటుల
అతడు
పరమకృపాళుడు".
అని
శుకసారణులు
చెప్పిన
వచనములను
రావణుడు
విని,
ఫక్కున
నవ్వి,
"అతడింత
బుద్ధిమంతుడా!
అతని
సైనికులు
వానరులా,
విభీషణుడు
పిరికిపంద.
వాని
మాటలను
9
▾
Meaning
Keep
నమ్మి
మీరు
ఆ
మూర్ఖుని
వర్ణించుచున్నారా?
కోతుల
బలతేజో
సంపన్నతలను
గురించి
ఇంతగా
వర్ణించుటలో
అర్థము
లేదు.
మీ
బకవాదము
చాలింపుడు;
ఇంత
బలవంతులా
ఆ
వానరులు!
ఛీ,
ఛీ!
చాలు!
చాలు!
ఇంతకు
పూర్వమే
నేను
సుగ్రీవుని
బలమును
గురించి
వినియుంటిని.
పిరికి
పందయైన
విభీషణుడు
మంత్రియయియుండ
శ్రీ
విజయవిభూతులు
శ్రీరామునకు
లభించవు”.
ఈ
ప్రకారము
రావణుడు
పలికిన
పలుకులకు
సారణుడు
లోలోన
అతని
విపరీతబుద్ధికి
చింతించి,
చేతులు
జోడించుకొని
నిలిచెను.
అంత
రావణుడు
సారణుడు
అందించిన
ఉత్తరమును
వెగటుగా
నవ్వుచూ
చించి
చూచెను.
తరువాత
దానిని
మంత్రి
చేతికి
అందించి,
"ఓరీ!
మూర్ఖుడా!
పెక్కు
మాటల
వలన
ప్రయోజనము
లేదు!
తీతువపక్షి
తన
పిల్లలను
రక్షించుటకు
పాదములను
మీదికెత్తి
ఆకాశము
పడకుండా
కాపాడును.
ఈ
తపశ్శాలురు.
ఈ
అర్భకులు
మాటలతో
బెదిరించుచుండిరి.
మాటలతో
నన్ను
జయించగలరా?”
అని
గర్జించుచున్న
రావణుని
చూచి,
శుకుడు
“ఓ
నాథా!
ఇదియంతయూ
సత్యము.
ఆ
ఉత్తరములో
వ్రాయబడిన
సంగతులను
లెస్సగా
విచారించి
నీ
అభిమానమును
విడచిపెట్టుము.
నా
మాటను
మన్నింపుము.
శ్రీరామునితో
వైరము
జాలింపుము.
అతని
స్వభావ
మతికోమలము,
అతడు
త్రిలోకాధిపతి!
నీవు
అతనిని
సమీపించినయెడల
అతడు
నిన్ను
రక్షించును.
నీ
అపరాధములను
మన్నించును.
జానకిని
అతనికి
సమర్పించుము.
నా
విన్నపములను
మన్నింపుము"
అని
అనేక
విధములుగా
బతిమిలాడెను.
రావణుడు
విని
కండ్లెఱ్ఱ
చేసి
"నన్ను
అపరాధిగా
యెంచితివా?
మూర్ఖుడా!
నన్ను
వెళ్ళి
ఆ
అర్భకుని
శరణుజొచ్చుమని
పలికితివా?
ఎంతటి
ధైర్యము!"
అని
గర్జించి
తన
కాళ్ళతో
అతనిని
తన్నెను.
అంత
ఆ
శుకుడు
లంకను
త్యజించి
రాముని
చరణముల
వద్దకు
వెళ్ళెను.
వానరులు
తిరిగి
ఈ
దూతను
బంధించి
ఉద్రేకమును
అణచుకొని
రామాజ్ఞకొరకై
వేచిరి.
సుగ్రీవుడు
ఈ
వచ్చిన
శుకుని
రాముని
సన్నిధికి
గొంపోయెను.
శుకుడు
రాముని
పాదములపైబడి
తన
వృత్తాంతమంతయు
చెప్పుకొని
విభీషణునివలే
తానునూ
శరణుజొచ్చుచున్నాననియు
తనను
కాపాడవలెననియు
పరిపరి
విధముల
ప్రార్థించెను.
శ్రీరాముడు
కరుణాస్వభావుడు
కనుక
తత్క్షణమే
వానర
వీరులను
రప్పించి,
శుకుని
10
▾
Meaning
Keep
కూడా
మీలో
ఒక
సోదరునిగా
భావించుడని
ఆజ్ఞాపించి
శుకుని
మన్నించెను.
శుకుడు
ధన్యుడనైతినని
శ్రీరాముని
అనేక
విధముల
వర్ణించెను.
శ్రీ
రామలక్ష్మణులకు
నమస్కరించి
ధన్యుడాయెను.
శ్రీరాముడు
లక్ష్మణుని
పిలచి
"ధనుర్బాణములు
తీసికొనిరమ్ము.
అగ్ని
బాణములచే
సముద్రుని
శోషింపజేయుదును.
మూర్ఖులకు
వినయము,
కుటిల
స్వభావులకు
ప్రీతియు,
స్వాభావిక
కృపణులకు
నీతి
బోధనలును,
మమకారము
కలవారలకు
జ్ఞానమును,
లోభులకు
వైరాగ్యమును,
కోపస్వభావులకు
శాంతమును,
కామాతురులకు
హరికథలును
వూసర
క్షేత్రమున
బీజములు
చల్లిన
విధమున
వ్యర్థములు”
అని
ఈ
ప్రకారము
పలికి
ధనుస్సు
నెక్కుపెట్టి
బాణమును
సంధించెను.
శ్రీ
రాముని
పరాక్రమమును
చూచి
లక్ష్మణుడు
భయపడెను.
రాముడు
బాణములను
సంధించునప్పటికి
సముద్రునకు
గుండెలో
వేడి
పుట్టెను.
మీనమకరములు
మొదలగునవి
వ్యాకులపడెను.
సముద్రుడు
భయపడెనా
అన్నట్లు
జలము
శోషించెను.
సముద్రుడు
రామచరణములకు
నమస్కరించుచున్నాడా
అన్నట్లు
అలలు
ఒకదానిపై
నొకటి
శ్రీరాముడు
కూర్చున్న
స్థానమునకు
వచ్చి
పాదముల
స్పృశించెను.
అంత
యొక
అశరీరవాణితో,
“నాథా!
మీ
కటకములో
నలనీలులని
ఇరువురు
సేనాపతులు
కలరు.
చిన్నతనములో
వారికి
మునిశాపము
దగిలెను.
ఆ
శాపమిప్పుడు
ఆశీర్వచనములయ్యెను.
పూర్వపు
వృత్తాంతము
ఆలకించుడు”
అని
సముద్రుడే
ఈ
క్రింది
రీతిగా
తెలిపెను:
“నదీ
తీరమున
ఋషుల
ఆశ్రమము
కలదు.
చిన్న
తనములో
వీరా
ఋషులు
తపస్సు
చేయుచుండినపుడు
వారి
సాలగ్రామములు
అపహరించి
వాటిని
నీటిలో
విసరివేయుచుండిరి,
‘మీరు
నీటిలో
వేయుచుండిన
వస్తువులన్నియూ
నీటిపై
తేలి
కదలకయుండుగాక!
నీరు
ప్రవహించినను
వస్తువులు
మాత్రము
నీటిపై
తేలియాడును
గాక!'
అని
శపించిరి.
కాన
వారు
నీటిలో
వేసిన
ప్రతీ
రాయియూ
తేలియాడును.
అందులో
మీ
నామము
తేలియాడునట్టిది
కనుక
దానిపై
మీ
నామము
వ్రాసివేయించుడు.
పర్వతములు
కూడా
నాపై
తేలియాడును.
నేను
కూడా
సహాయము
11
▾
Meaning
Keep
చేతును.
సత్యాన్వేషణలో
ప్రకృతి
సహాయపడగలదు"
అని
చెప్పగా,
శ్రీరాముడు
సంధించిన
బాణము
వెనుకకు
తీసుకొనుటకు
వీలుకానందున
ఒక
వనము
వైపున
ప్రయోగించెను.
ఆ
బాణ
ప్రభావము
వలన
ఆ
ప్రదేశము
జల
శూన్యమయ్యెను.
ఆ
ప్రదేశము
ప్రకృతి
సంపదలతో
నిండెను.
మంత్రులను
పిలిచి,
విలంబనము
చేయక
సేతువు
నిర్మించుడని
ఆజ్ఞాపించెను.
హనుమంతుడు
రామా,
తమ
నామమే
జీవులకు
భద్రమైన
సేతువు.
దానికిమించినది
మరేమున్నది
అని
పలికెను.
జాంబవంతుడు,
ఓ
నాథా!
మీప్రతాపమను
నట్టి
బడబాగ్నిచే
ఈ
సముద్రము
శుష్కించును,
యుద్ధమున
మాచే
సంహరింపబడిన
రాక్షసుల
భార్యల
దుఃఖముచే
తిరిగి
ఈ
సముద్రము
నింపబడును.
కనుక
వారి
జలము
ఉప్పగా
నుండును
అని
చేతులు
జోడించి
చెప్పెను.
శ్రీ
రాముడు
ఈ
మహా
వీరుల
వచనములు
విని
చిరునవ్వు
నవ్వెను.
జాంబవంతుడు
నీలుని,
నలుని
బిలిచి
అశరీరవాణిగా
సముద్రుడు
చెప్పిన
మాటలను
వారికి
మరొకతూరి
జ్ఞప్తికి
తెప్పించెను.
శ్రీరాముని
ధ్యానించుచు
పర్వతములు,
గుండ్లు,
బండలు
తెచ్చి
సముద్రమున
పడవేయుడు
అని
ఆజ్ఞాపించెను.
వానరులు
ఆ
మాట
వినగానే
గంతులు
వేయుచూ
కొండలు
చెండ్లవలే
యెత్తి,
రామా,
రామా
అంటూ
బారులు
దీరి
సాగరమున
వేయదొడగిరి;
మధ్య
మధ్య
పెద్ద
పెద్ద
వృక్షములు
వేరుల
వరకు
పెకలించి
సముద్రమున
దొర్లించిరి.
ఆనాడంతయూ
విశ్రాంతి
లేక,
ఆహారము
సహితము
తీసుకొనక,
వానర
వీరులు
తెచ్చిన
పర్వతములను,
గుండ్లను
నలుడు,
నీలుడు,
తమ
హస్తములతో
అందుకొని
దానిని
నిర్మించుచూ
వచ్చిరి.
ఆనాడు
పూర్తి
పదునాలుగు
యోజనములు
సేతువు
నిర్మించిరి.
రాత్రి
బాగ
విశ్రాంతి
తీసుకొని,
తెల్లవారి
బ్రహ్మముహూర్తముననే
లేచి,
శ్రీరామ
ప్రభువునకు
జై
అని
గర్జించి
నలుమూలలా
పరుగిడి,
పర్వతములను
తెచ్చి
తీరమున
బడవైచిరి.
ఆనాడు
ఇరువది
యోజనములు,
మూడవ
దినము
ఇరువది
యొక్క
యోజనములను,
మొత్తము
నూరు
యోజనములు
ఐయిదు
దినములలో
నలుడు,
నీలుడు
అత్యంతోత్సాహముతో
విశ్రాంతి
అన్నది
ఆశించక
రామకార్యము
ప్రధానమను
లక్ష్యముతో
రాముని
స్మరించుచూ
దర్శించుచూ
పూర్తిగావించిరి.
❀
Previous
←
The Darśana of Sītā
Next
The Entry into Laṅkā
→