Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Entry into Laṅkā
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
9
లంకా
ప్రవేశము
తాను
సంకల్పించుకొన్న
నూరు
యోజనముల
సేతువు
పూర్తి
అయినదని
సుగ్రీవునిద్వారా
శ్రీరామునికి
తెలిపిరి.
ఆ
వార్త
విని
రామలక్ష్మణులు
సంతసించిరి.
వానరులు
తెచ్చిన
పర్వతములను
యెక్కడవి
అక్కడ
పడవేసి
విశ్రాంతి
తీసుకొనుడని
శ్రీరాముడు
సుగ్రీవునితో
ఆజ్ఞపంపెను.
రామాజ్ఞ
ప్రకారము,
ఇంకా
పర్వతములు,
గుండ్లు
తెచ్చుచున్న
వానరులకు
సుగ్రీవుడు
తెలిపెను.
ఆ
సమయమున
హనుమంతుడు
అతి
దూరమునుండి
ఒక
పర్వతమును
తీసుకొనివచ్చుచుండెను.
అతను
శ్రీరామాజ్ఞను
విని
దానిని
బృందావనము
వద్ద
పారవేసెను.
అయ్యో,
నేను
రామకార్యములో
పాల్గొనకపోతిని
కదా
అని
ఆ
పర్వతము
గొల్లున
యేడ్చెను.
ఈ
వార్త
హనుమంతుడు
శ్రీరాములకు
తెలుపగా
శ్రీరాముడు
నవ్వి,
పాపము,
రామకార్యములో
పాల్గొనుటకు
పర్వతములు
సహితము
ఉవ్విళ్ళూరుచుండెను
కదా!
అని
సంతసించి,
హనుమాన్,
నీవు
శీఘ్రముగా
వెళ్ళి
ఆ
పర్వతమును
విచారించవలదని
తెలుపుము.
ద్వాపరయుగమున
ఆ
పర్వతమును
నేను
యేడు
దినములు
నా
హస్తమునందుంచుకొందు
ననెను.
ఈ
వార్త
విని
పర్వతము
ఆనందమని
పలికెను.
ఆ
పర్వతమే
ద్వాపరమున
గోవర్ధనపర్వతముగా
రూపొందెను.
శ్రీరాముడు
ఐదవ
దినమున
సముద్రతీరమునకు
వచ్చి
సేతువుచూచి
ఆనందించెను.
ఓ
వానర
వీరులారా!
మీ
సేవ
వర్ణనాతీతమైనది.
మీ
భక్తి
ప్రపత్తులు
నన్నెంతయో
ముగ్ధుని
గావించుచున్నవి
అని
పలుకగనే,
విభీషణుడు
వచ్చి
"స్వామీ,
రేపటి
దినము
మనము
లంకను
ప్రవేశించవలసియుండును.
దీనికి
నా
ప్రార్ధన
ఒకటి
మన్నించుడు"
అని
ప్రార్థించగా,
అది
యేదియో
తెలుపుమని
శ్రీరాముడు
కోరెను.
రావణుడు,
శివ
పూజాధురంధరుడు.
అతనికి
శివుడన్న
పరమప్రేమ,
కాన
తమ
హస్తముల
ద్వారా
రావణుడు
మరణించును.
అది
సత్యము.
కానీ,
అతని
2
▾
Meaning
Keep
జ్ఞాపకార్ధముగ
మనము
లంకను
ప్రవేశించుటకు
పూర్వము,
సేతువును
దాటుటకు
పూర్వము,
లంకకు
ప్రయాణము
సలుపక
పూర్వమే
ఒక
శివలింగమును
తమ
హస్తముద్వారా
ప్రతిష్టించిన
ఉత్తరోత్తరా
లంకలో
ప్రవేశించువారు
రాముడు
ప్రతిష్టించిన
లింగేశ్వరుని
స్మరించి
పూజించి
లంకలో
ప్రవేశించు
అదృష్టము
వారల
కందించవచ్చును.
కనుక,
అది
రామలింగేశ్వరులను
పేరుతో
ఖ్యాతిచెందుననియూ,
కాలాంతరములో
మన
సేతువు
కూలిపోయిననూ
దాని
గుర్తుగా
నిరూపించుట
కూడా
తటస్థించుననియూ
కోరగా,
శ్రీరాముడు
సంతసించి
నీ
యిష్ట
ప్రకారమే
గావింతును.
ఉత్తరోత్తరా
నీవే
లంకకు
రాజువు
కాగలవు.
కనుక
నీకు
సంతోషము
కలిగించుటలో
నేనెంతేనియూ,
యేపనికైననూ
సంసిద్ధమని
పలికెను.
సుగ్రీవుడు
వానరులను
పిలచి
ప్రతిష్టకు
తగిన
వసతులు
గావించుడని
కోరెను.
హనుమంతుని
పంపి
శివలింగమును
ముచ్చటయిన
దానిని
తెప్పించెను.
శ్రీరాముడు
సముద్రజలముచే
దానిని
అభిషేకము
గావించి,
ప్రాణప్రతిష్ఠ
చేసెను.
రాముని
హస్తముతో
స్పర్శించగనే
అదే
ప్రాణప్రతిష్ఠ,
అంతకంటే
వేరు
మంత్రములు
లేకున్నను
ఆ
రామవాక్యమే
మంత్రము.
ఈ
రీతిగా
రామనామము
మిన్నుముట్టెను.
వానరులు
జైజై
ధ్వనులతో
మంత్రములు
చెప్పిరి.
రాముడు
లక్ష్మణ
సుగ్రీవాదుల
సహాయముతో
లింగమును
ప్రతిష్ఠించెను.
వానరులు,
రాముని
మదియందు
స్మరించి
సేతువుపై
బారులుదీరి
నడచిరి.
ఆ
వానరుల
పటాలముల
ఒయ్యారము
చెప్పుటకు
శక్యముకాదు.
రాముడు
లక్ష్మణునితో
సేతుపై
నిలచి
ఇరుప్రక్కల
సముద్రమును
చూచెను.
ఆ
కరుణా
సముద్రుని
చూచి,
జలసముద్రుడు
ఆనందముతో
పొంగెను.
జలచరములు
అలలపై
తేలియాడెను.
రామచంద్రుని
దర్శించుటకై
జలములోని
జంతువులన్నియూ
తమతమ
స్వభావములు
వీడి
తదేకదృష్టితో
రాముని
దర్శించెను.
వానరులు
ముందువెళ్ళి
లంకలో
ప్రవేశించుటకు
ముందే
ఒక
శిబిరమును
యేర్పాటు
చేసిరి.
వానరసైన్యము
సముద్రమును
దాటి
లంకను
చుట్టూ
ముట్టడించినారన్న
వార్త
క్షణములో
లంకలోని
వారలందరికీ
తెలిసెను.
తరువాత
రామ
లక్ష్మణ,
విభీషణ,
సుగ్రీవాదులు
మెల్లగా
నడచి
లంక
సింహద్వారమును
చేరిరి.
అంత
రామాజ్ఞను
గైకొని
వానరులు
గంతులు
వేయుచూ
వృక్షములు
పెరికి
ఫలములు
తిని
వాటిని
లంకలోనికి
విసరిరి.
పాషాణములను
తీసి
లంకలోనికి
3
▾
Meaning
Keep
రువ్విరి.
వంటరిగా
పారా
చేయుచున్న
రాక్షసులను
గొంతులుపట్టి
ఆడించుచుండిరి.
ఈ
రీతిగా
వారి
చేష్టలు
మితిమీరెను.
ఈ
వార్త
రావణునికి
తెలిసెను.
పూర్వము
రావణునికి
దశకంఠములున్ననూ
ఒక
కంఠముతో
మాట్లాడెడివాడు.
ఈ
వార్త
వినగానే
దిగులొంది
రాక్షసులను
పిలిపించి
పది
కంఠములతో
గర్జించ
మొదలుపెట్టెను.
దశముఖములతో
మాట్లాడుట
ఒక
అశుభము;
తనకు
తెలియకనే
ఆ
రీతిగా
గర్జించుట
జరిగెను.
పది
ముఖములతో
నుచ్చరించునపుడు
అతనికి
మృత్యువు
సమీపించునని
పూర్వము
శాపము
కలదు.
అది
స్మరించి
రావణుడు
కొంత
తనలో
తాను
దిగులుపడెను.
తానెంత
అరికట్టుటకు
ప్రయత్నించిననూ
పది
కంఠములు
పలుకజొచ్చెను.
ఈ
ఆశ్చర్యమును
గమనించిన
రాక్షసులు,
తమ
అంత్యకాలము
ఆసన్నమయిందని
దృఢము
చేసుకొని
తమ
తమ
ఆలుబిడ్డలతో
దుఃఖించి,
నేడో
రేపో
మన
జీవితములు
అంత్యములగుచున్నవని
ఇష్టములను
నెరవేర్చుకొనిరి.
"వినాశకాలే
విపరీతబుద్ధిః"
అన్నట్లు
రావణుడు
తన
శాపవృత్తాంతము
తెలిసియూ
ఈ
శాపము
నన్నేమి
చేయునని
తలంచి
అంతఃపురములోనికి
వెళ్ళెను.
అంతియేకాదు.
అతని
రూపమే
మార్పుజెందెను.
ఈ
విధమైన
భీతి,
భ్రాంతిని
మంత్రులు
చూచి
దిగులొందుదురేమో
అని
రావణుడు
తనలో
తాను
క్రుంగి
పోయెను.
తన
సోదరికి
గావించినటుల
నా
దశముఖములందును
ముక్కు
చెవులు
కోయుదురేమో,
దశకంఠములు
తెగకోయుదురేమో
అని
లోలోన
తలంచెను.
అంతఃపురములో
మండోదరి
రావణుని
రూపురేఖలను
చూచి,
రావణుడు
పూర్తిగా
దిగులొందినటుల
కనుపించుట
గుర్తించెను.
ఈ
సమయమున
హితోపదేశము
చేయుట
మంచిదని
తలంచెను.
తత్క్షణము
రావణుని
చేతులు
పట్టుకొని
మృదుమధురవచనములతో,
"నాథా!
కోపమును
విడచి
నా
మాటలు
సావధానముగా
ఆలకించుడు.
యెవరిని
బుద్ధిచేతను,
భక్తిచేతను
సాధింపగలరో,
అట్టివారిని
విరోధముచే
సాధించుటకు
పూనుకొనుట
మంచిది
కాదు.
అట్టి
పవిత్రులతో
విరోధము
మంచిది
కాదు.
రామునితో
మీరు
పోరాడలేరు.
సూర్యునకు,
మిణుగురు
పురుగునకు
పోలిక
చెల్లునా?
నా
మాట
విని
ఇప్పటికైనను
జానకిని
తీసుకొనిపోయి
రామునకు
4
▾
Meaning
Keep
సమర్పించి
అతనికి
నమస్కరించి
క్షమాభిక్షను
కోరుము.
నా
మాట
విను.
నీ
జాతిని
పాడుచేసుకొనవద్దు.
నీవల్ల
లంకను
నాశనము
గావించుకొనవద్దు.
స్త్రీ
బాలవృద్ధులను
బలిగావించవద్దు.
నీ
భక్తి
ప్రపత్తులకు
ఇది
తగినది
కాదు.
ఈ
క్రూరత్వముచే
నీ
ఆరాధ్య
దైవమైన
ఈశ్వరుడు
కూడా
నీకు
విరోధి
కాగలడు.
మంచి
కార్యములచేత
దైవము
ప్రసన్నుడు
కాగలడు.
ఇట్టి
పాపకార్యములు
దైవమును
మెప్పించవు"
అని
అనేక
విధముల
చెప్పెను.
"ప్రాణనాథా!
శ్రీరామచంద్రుడు
సామాన్యుడు
కాదు,
మధుకైటభులను
సంహరించెను.
హిరణ్యాక్ష,
హిరణ్యకశిపులను
వధించెను.
అతడే
బలిచక్రవర్తిని
బంధించెను.
సహస్రబాహువులు
కల
కార్త
వీర్యార్జునుని
గర్వమును
అపహరించెను.
ఇరువది
భుజములు
కల
మీరెంతవారు?
ఆ
లోకారాధ్యుడు
సకల
మంగళ
స్వరూపుడు,
భూభారమును
హరింప
రాముడై
అవతరించునని
బ్రహ్మ
మీకు
తెలిపినటుల,
ఒకానొక
సమయమున
మీరే
నాతో
తెలిపియుంటిరి
కదా!
ఇన్ని
తెలిసియూ
మీరెందులకు
ఈ
మార్గమును
విడువక,
సత్యమును
గుర్తించక
యున్నారు?
త్వరలో
మీరు
ఆ
త్రిలోక
సుందరిని,
మహాసాధ్వీమతల్లిని,
పతివ్రతా
శిరోమణిని,
జానకిని,
ఆ
ప్రభువునకు
అర్పించి,
కొమరునకు
పట్టము
కట్టి,
రామసన్నిధిలో
మన
జీవితమును
ప్రశాంతముగా
గడుపవచ్చును.
మీ
సోదరుడెంతటి
ధన్యుడో,
రామసన్నిధి
చేరి,
అతని
చల్లని
నీడలో
కాలము
గడుపుచున్నాడు.
ఇప్పటికి
కాలము
మీరలేదు.
తత్క్షణమే
మీరు
పరుగిడిపోయి
లంక
కేతెంచుచున్న
శ్రీరాముని
పాదములపైబడి
క్షమాభిక్షను
వేడుము"
అని
కంటి
ధారలు
కారుచుండ
దీనయై
పాదముల
పట్టి
ప్రార్థించుచున్న
మండోదరిని
చూచి
కంటినీరు
తుడుచుచు,
"ఓ
ప్రియురాలా,
ఇంత
బేలవయ్యదవేల?
యెందుల
కింత
అధైర్యము?
లోకములో
నాకంటే
బలవంతుడు
లేడు.
అష్టదిక్పతులను
నా
భుజములతో
జయించితిని,
కాలుడు
సహితము
నా
సమీపమునకు
రాజాలడు.
నీవు
దిగులొందకుము.
నా
బలపరాక్రమములను
నీవు
సరిగా
గుర్తించక
అబలుడైన
రాముని
వర్ణించుచున్నావు"
అని
భార్యను
ఓదార్చి
హజారమునకు
వచ్చి
సింహాసనాసీనుడైన
రావణుని
చూచి
మండోదరి
విసుగు
చెంది
"ఛీ
యెంతటి
మూర్ఖుడు,
దురభిమానము
వీడని
వారి
గతి
ఈ
రీతిగనే
యుండును.
మంచి
మాటలు
మనసున
5
▾
Meaning
Keep
చేరవు.
విషజ్వరము
వచ్చినవానికి
మధుర
పదార్ధములు
సహితము
విషముగనే
కనుపించును.
విషమనే
అనుపించును.
అటులనే
దురభిమానమను
విషజ్వర
పీడితుడైన
రావణునికి
నా
అమృతవచనములు
రుచించకున్నవి.
నేనేమి
చేతు"నని
తనలో
తాను
రాబోవు
ప్రమాదమును
అనేక
రకముల
తలంచుచూ
ఆ
ఘోరమును
చూచి
మరణించుటకంటె
దానికిపూర్వమే
ప్రాణములు
వీడిన
మంచిదని
తలంచి
రాముని
చింతించుచూ
శయ్యాగృహమున
ప్రవేశించెను.
సింహాసనమును
అధిష్టించిన
రావణుడు
మంత్రులను
బిలిచి
సమర
సన్నాహములకు
తగిన
ఆలోచనలు
జరిపెను.
"
రాక్షసులారా!
వానరులు,
జాంబవతులు,
మనుజులు
మనము
భుజించు
కబళమునకు
సరిపడరు.
మీరు
దిగులొందక,
బదులు
పలుకక,
యుద్ధమునకు
సిద్ధము
కండు"
అని
గర్జించిన
రావణుని
మాటలకు
ప్రహస్తుడు
లేచి
చేతులు
జోడించుకొని,
"రాక్షసులారా!
నీతి
మార్గము
తప్పకుడు.
ఈ
మంత్రుల
బుద్ధి
మహాస్వల్పము.
ఓ
రాజా!
ఈ
మంత్రులు
నీ
చిత్తమున
కనుకూలముగా
వచింతురు.
అంత
మాత్రమున
శుభము
కలుగదు.
ఒక్క
వానరుడు
సముద్రమును
దాటి
వచ్చి
యెన్ని
చిత్రవిచిత్రముల
జేసెనో,
ఆనాడు
నీ
మంత్రులు,
నీ
సైన్యము
యేమి
చేయగలిగెను?
ఈ
రాత్రించరులకు
అప్పుడు
క్షుద్బాధ
లేకపోయెనా?
ఆ
వానరుడు
లంకానగరమును
దహించునపుడు,
ఈ
మంత్రులేల
వానిని
భుజించలేకపోయిరి?
"ఓ
రాజా!
నీ
మంత్రులు
చెప్పుమాటలు
నీకు
ప్రస్తుతము
హితముగా
తోచిననూ,
వానివలన
ఉత్తరోత్తరము
నీకు
కీడు
మూడును.
లెస్సగా
విచారించుము.
సునాయాసముగా
సముద్రమును
బంధించి
వానర
సైన్యముతో
దాటి
వెడలివచ్చి
సువేలాచలము
మీద
విడిది
చేసియుండిన
శ్రీరాముని
మనుజమాత్రుడను
నీ
అభిప్రాయమును
వీడి,
నోటికి
వచ్చినట్లు
వాగుట
మాని,
మంత్రుల
ప్రగల్భాలను
చెవిని
చేర్చక,
నేను
పిరికిపందనని
భావించక,
నా
మాటలను
విశ్వసించి
సమయము
మీరక
మునుపే
తత్క్షణము
సీతను
నీవే
స్వయముగా
తీసుకొని
పోయి
శ్రీరామునకు
అర్పించి
శరణుజొచ్చిన,
లంకను
మనము
కాపాడుకొన్నవార
మగుదుము.
మన
జాతిని
మనము
నిలబెట్టుకొన్నవారమగుదుము.
ఇదియే
మన
విజయమని
భావించి
ముందు
ప్రయత్నములు
సలుపుము.
నీకునూ
కీర్తి
ఆచంద్రార్కంగా
నిలుచును.
6
▾
Meaning
Keep
సూర్యచంద్రాదులుండువరకు
నిలుచునట్టి
చెడ్డపేరును
సంపాదించుకొనవద్దు"
అని
ప్రార్థించెను.
ఆ
విధముగా
ప్రహస్తుడు
ఆడిన
మాటలకు
రావణుడు
ఉగ్రుడై
గర్జించి
హుంకరించి,
"ఓరే
మూర్ఖుడా,
ఈ
బుద్ధి
నీకెవరు
చెప్పిరి?
వెదురు
పొదలో
అగ్ని
పుట్టినట్లు
నా
వంశములో
నీవు
పుట్టితివి"
అని
పండ్లు
పటపట
కొరికి
కర్ణకఠోరమైన
వాక్యములు
పలికి
తన
కాలితో
తన్నెను.
తండ్రి
గర్వమును,
దురభిమానమును
అనేక
విధముల
తూలనాడి,
చేతులారా
వంశమును
నాశనము
గావించు
దుర్భుద్ధి
నీకు
వినాశమునకే
పుట్టినదని
ప్రహస్తుడు
గట్టిగా
వాదించి,
చేయునది
లేక
లోలోన
దుఃఖించెను.
మరణ
కాల
మాసన్నమయిన
వారికి
యెంతటి
దివ్యమైన
ఔషధములూ
పనిచేయవు.
అటులనే
హితవాక్యములు
నా
తండ్రికి
అపథ్యమయ్యెను
అని
తల్లి
చెంతకు
వెళ్ళి
రావణుని
మూర్ఖ
గుణమును
చెప్పెను.
ఇరువురూ
చేయునది
లేక
శ్రీరాముని
స్మరించిరి.
వానర
సైన్యములు
సువేలాచలము
మీద
చక్కగా
ఒక
శిబిరమును
నిర్మించి
రామలక్ష్మణులకు
మెత్తని
గడ్డి
ఆసనాలు
అమర్చి,
దానిపై
ఆకులు
పుష్పములతో
చక్కని
పరుపులు
అమర్చిరి.
దానిపై
శ్రీరాములు
మూర్తీభవించి
కూర్చొనెను.
కొంతసేపయిన
తరువాత
సుగ్రీవుని
తొడపై
శిరస్సుంచి
శ్రీరాముడు
విశ్రమించెను.
ఇరువైపులా
ధనుర్భాణములుంచెను.
వానరులు
చేతులు
నలుపుకొంటూ
రావణుని
అంతమొందించుటకొరకు
రామాజ్ఞాకై
కాచుకొని
యుండిరి.
అదృష్టవంతులగు
హనుమంతుడు,
అంగదుడు
పాదములు
వత్తుచుండిరి.
లక్ష్మణుడు
పాదములచెంత
ధనుర్బాణములను
నడుముకు
కట్టుకొని
తదేకదృష్టితో
రామచంద్రుని
చూచుచుండెను.
ఇంతలో
శ్రీ
రాముడు
తూర్పుదిశకుచూచెను.
చంద్రుడు
ఉదయించుచుండెను.
ఓ
సఖులారా!
చూచితిరా
ఆ
చంద్రునియందు
యేదో
మచ్చ
కనుపించుచున్నది.
అని
అడుగగా,
ఒక్కొక్కరు
ఒక్కక్క
రీతిగా
జవాబు
చెప్పిరి.
హనుమంతుడు
నాథా!
అందులో
నాకేమియూ
కనుపించుటలేదు.
అది
శుద్ధమైన
అద్దము,
మీ
ముఖమునకు
చెమటగా
వుండినందున
మీ
ముఖబింబము
నాకు
అందులో
కనుపించుచున్నదని
చెప్పెను.
7
▾
Meaning
Keep
ఆ
రాత్రి
అంతయు
ఈ
విధముగా
వానరులతో
రామచంద్రుడు
ఆనందవచనములతో
గడిపెను.
తెల్లవారగనే
శ్రీరాముడు
సముద్రమున
స్నానసంధ్యాదులు
సలిపి,
మంత్రులను
పిలిచి
యేమి
చేయవలెనో
వారితో
ముచ్చటించెను.
అంత,
అందరూ
యేకోన్ముఖులై
అంగదుని
రావణుని
దగ్గరకు
రాయబారముగా
పంపుట
మంచిదని
నిర్ణయించుకొనిరి.
అంగదుని
పిలిచి,
"నాయనా!
నీవు
గుణవంతుడవు,
బలవంతుడవు.
నీవు
రామకార్య
నిమిత్తము
రావణుని
దగ్గరకు
వెళ్ళిరమ్ము.
రావణునికి
హితమును
గరపుము.
ఉద్రేకముగా
వచనములు
ఉపయోగించవద్దు",
అని
చెప్పవలసిన
సంధి
మాటలు
చెప్పెను.
అంగదుడు,
రామునకు
నమస్కరించి,
చేతులు
జోడించుకొని
"నాథా!
మీరు
కటాక్షింపుడు,
మీ
కార్యము
చేయునట్టి
అదృష్టము
నాకు
కలుగుట
నా
భాగ్యము.
అందులో
ఏమైననూ
సరే,
తమకు
నా
ప్రాణములే
అర్పించుతాను"
అని
పలికిన
అంగదుని
పలుకులకు
శ్రీరాముని
హృదయము
కరిగెను.
తత్క్షణము
రాముడు
అంగదుని
కౌగిలించుకొని
శిరస్సును
నిమురుచు,
ఆశీర్వదించెను.
అంగదుడు
అత్యంతోత్సాహముతో
రాముని
స్మరించుచూ
బయలుదేరి
లంకలో
ప్రవేశించెను.
మహాధైర్యముతో
అంగదుడు
అడ్డుతగిలిన
వారిని
ప్రక్కకు
నెట్టుచూ,
రాజనగరమున
ప్రవేశించెను.
అచట
వుండిన
రావణుని
కుమారుని
చూచెను.
రావణుని
కుమారుడు
"ఓ
వానరా!
నీవెవడవు?"
అని
అడుగగా
"నేను
రాములవారి
దూతను"
అని
అంగదుడు
జవాబు
చెప్పెను.
అంత
రావణుని
కుమారుడు
అంగదుని
కాలితో
తన్న
ప్రయత్నించెను.
అంత
అంగదుడు
వాని
కాలు
పట్టి
గిరగిర
తిప్పి
నేలగొట్టెను!
ఈ
దృశ్యమును
చూచి
రాక్షసులు
భయపడి
ఈ
వానరుడు
మహాబలవంతుడని
తలంచి
యెవ్వరేమియూ
చేయజాలకపోయిరి.
అంతకుపూర్వము
లంకను
దహించిన
వానరుడు
మళ్ళీవచ్చెనని
అనుకొనిరి.
క్షణములో
లంక
అంతటా
కోలాహలము
బయలుదేరెను.
అంగదుడు
యెటువైపు
తిరిగిననూ
అటువైపున
గుంపులు
గుంపులు
రాక్షసులు
నిలుచుకొని
భయభ్రాంతులై
చూచుచుండిరి.
అంగదుడు
ప్రశ్నించక
పూర్వమే
అతనికి
దారి
విడిచి
తప్పుకొనుచుండిరి.
అంగదుడు
నిర్భయముగా
రావణుని
సభలో
8
▾
Meaning
Keep
ప్రవేశించెను.
అతి
త్వరితముగా
ఒక
దూత
వెళ్ళి
అంగదుని
ఆగమనమును
గూర్చి
రావణునికి
విన్నవించెను.
ఆ
దూతను
తన
సమ్ముఖమునకు
తీసుకొని
రమ్మని
రావణుడు
ఆజ్ఞాపించెను.
ఒక
దూత
వచ్చి
అంగదుని
రావణుని
సన్నిధికి
తీసికొని
పోయెను.
వెళ్ళిన
అంగదుడు
రావణుని
చూచి
చైతన్యముగల
ఒక
నల్లని
పర్వతమని
తలచెను!
ఇరువది
భుజములు
వృక్షశాఖలుగా
భావించి
నిర్భయముగా
అతని
చెంతకు
వచ్చెను.
అంగదుని
చూచి
ఆ
సభలోని
రాక్షసులందరూ
లోలోన
దిగులు
పడుచు,
మాటాడలేని
స్థితిలో
వుండిరి.
రావణుడు,
"ఓ
వానరా!
నీవెవడవు?"
అని
ప్రశ్నించగా,
"ఓ
రాజా!
నేను
శ్రీరాముని
దూతను"
అనెను.
తరువాత
రావణుడు,
నీ
ఆగమమునకు
కారణమేమని
అడుగగా,
"ఓ
రావణా,
పూర్వము
నా
తండ్రికి
నీకు
స్నేహముండెడిది.
నీ
మంచిని
గోరి
నీకు
మంచిబుద్ధులు
చెప్పుటకై
రామాజ్ఞను
బడసి
వచ్చితిని"
అని
సావధానముగా
అంగదుడు
పలికెను.
"ఓ
రావణా!
అభిమానము
చేతనో,
మోహము
చేతనో
లేక
రాజ్యమదాంధము
చేతనో
నీవు
ఆ
జగదంబను,
ఆ
లోకమాత
జానకిని
తీసుకొని
వచ్చితివి.
అది
మంచి
పని
కాదు.
యేదో
జరిగినది
జరిగిపోయెను.
నేటికైననూ
నీవు
సత్యమును
గుర్తించి,
నేను
చెప్పినటుల
ప్రవర్తింతువేని
నీ
యపరాధములను
శ్రీరాముడు
క్షమించగలడు.
తత్క్షణము
నీవీ
పనికి
పూనుకొమ్ము.
లేకున్న
నీ
చేతులారా
నీ
వంశమును,
రాజ్యమును
మట్టిపాలు
గావించుకొందువు"
అని
అంగదుడు
తెలుపగా,
"ఓరీ
వానరాధమా!
నీవు
మూర్ఖుడవు,
నేను
దేవశత్రువునని
నీకు
తెలియదు
కాబోలు!
నీ
పేరేమి?
నీ
తండ్రి
పేరేమి?
నీకూ
నాకూ
గల
సంబంధమేమి?
కన్నులు
తెరిచిచూడము"
అని
గర్జించగా,
అంగదుడు
ఫక్కున
నవ్వి,
"ఓ
రాక్షస
రాజా!
నా
పేరు
అంగదుడు,
నా
తండ్రి
పేరు
వాలి;
మీ
యిరువురకు
సఖ్యముండెను."
అనెను.
అంగదుని
వచనము
రావణుడు
విని
నిశ్చేష్టుడయ్యెను,
"సత్యము!
సత్యము!
వాలి
అని
ఒక
వానరుడు
పూర్వకాలమున
వుండెను.
వాని
కుమారుడవా
నీవు!
ఓరి
అంగదా!
నా
వంశమును
ధ్వంసము
చేయుటకే
నీవు
నిప్పుగా
బయలుదేరితివా?"
అని
రావణుడు
వెగటుగా
మాట్లాడెను.
అంత
అంగదుడు
రావణుని
మాటలకు
ఫక్కున
నవ్వి,
"ఓ
రావణా!
నీకు
అంత్యకాలము
సమీపించినది;
త్వరలోనే
వాలి
చెంతకు
పోగలవు.
శ్రీరామునితో
9
▾
Meaning
Keep
విరోధించుటవలన
లభించు
క్షేమమును
గురించి
వాలి
నీకక్కడ
వివరముగా
తెలుపగలడు.
ఇరువది
నేత్రములు,
ఇరువది
చెవులు
వుండియూ,
నీవు
గ్రుడ్డివాడవు!
చెవిటివాడవు!
అజ్ఞానాంధకారములో
నీకు
నువ్వే
గొప్ప
అని
గర్వించుచున్నావు.
యే
కులమును,
నీవు
రక్షించ
తలచితివో
ఆ
కులమును
నేను
నశింపజేయ
తలంచితిని!
పాతకీ!
కిరాతకా!
మదాంధుడా!
రాక్షసా!"
అని
అనేక
విధముల
అంగదుడు
పండ్లు
కొరుకుచు
తూలనాడిన
కఠోరపదములు
విని,
రావణుడు
దిగ్గున
గద్దె
నుండి
లేచి,
"ఓరీ
కులపాతకుడా!
ఓరీ
మర్కటమా!
రాజధర్మములను
గుర్తెఱింగినవాడను
కనుక
నీ
మాటలను
సహించితిని.
జాగ్రత్తగా
మాట్లాడుము"
అని
యొడలు
త్రిప్పెను.
ఆ
వికారమును
చూచి
అంగదుడు,
"ఓరీ
రాక్షసరాజా!
నీ
ధర్మమును,
నీ
శీలమును,
నీ
రాజనీతిని
వినియుంటిని!
నీ
ధర్మము
ఎంతటి
ఘనకార్యము
చేసెనో
యోచించుము.
పరస్త్రీని
దొంగిలించుట,
నీ
అన్న
కుబేరుడు
పంపిన
దూతను
నీ
కన్నులముందు
భక్షించుట,
ఇవన్నియు
రాజనీతులా!
సిగ్గులేక
మాటాడుచూ
లేని
నీతులను
ఉచ్చరించుచున్నావు.
దూతగా
వచ్చిన
వానరుని
తోకకు
నిప్పంటించిన
రాజనీతి
నీది!
ఇది
రాక్షసధర్మము.
నీకు
రాజనీతి
అని
స్మరించుటకుకూడా
హక్కులేదు.
మహాపాపివి"
అని
విచ్చలవిడిగా
జంకులేక
ప్రత్యుత్తరము
ఇచ్చుచుండుటచేత
సభలోని
వారందరూ
భయభ్రాంతులై
యేమి
జరుగునో
అని
దద్దరిల్లిరి.
రావణుడు
"ఓరీ
వానరా!
నాతో
యుద్ధము
చేయదగిన
వీరుడు
ఒక్కడైననూ
మీ
కటకములో
కలడా!
నీ
ప్రభువు
భార్యవియోగము
చేత
నీరసించెను;
అన్నగారి
దుఃఖమును
చూచిచూచి
అతని
తమ్ముడు
కృశించెను.
ఇక,
సుగ్రీవుడు?
పరస్పర
విరోధము
కలిగించుకొని
నది
ఒడ్డున
నిలిచిన
రెండు
పక్షులవలే
కూలుచుంటిరి.
మీరిరువురకు
రాజ్యకాంక్ష
తప్ప
అన్యవాంఛలు
లేవు.
ఇట్టి
మీరు
నాతో
పోరాడగలరా?
నా
తమ్ముడు
పిరికిపంద.
ఇక
జాంబవంతుడు,
వయోవృద్ధుడు;
నలుడు,
నీలుడు
శిల్ప
కళాప్రవీణులు?
వారికి
కత్తిపట్టుటయే
తెలియదు"
అని
పలుకగనే,
అంగదుడు
ఫక్కున
నవ్వి,
"ఓరీ
రావణా!
ఒక
పిల్లకోతి
నీ
లంకకు
నిప్పుపెట్టెనని
చెప్పినను
యే
మూర్ఖుడు
ఆ
మాటను
విని
నమ్మును?
ఆ
పిల్లకోతి
మహావీరుడు
కాదని
నీవనుచున్నావు.
నీతో
యుద్ధము
చేయగల
వీరుడు
మా
కటకములో
లేడని
నీవనుట
నాకు
కోపము
లేదు.
స్నేహముకానీ
వైరముకానీ
సరిసమానులతో
చేయవలెనని
10
▾
Meaning
Keep
ధర్మశాస్త్రము.
సింహము
కప్పను
చంపిన
యెడల
యెవరు
శ్లాఘించెదరు?
శ్రీరాముడు
నిన్ను
సంహరించుటకు
ప్రయత్నించుట
వారి
పరువుకు
తక్కువ;
క్షత్రియ
ధర్మము
మహాకఠినము,
నీవు
పరస్త్రీని
అపహరించితివి,
నీవు
మహాపాపివి.
నిన్ను
కోతులే
చంపవలెను;
మహాపాపియే
కోతులతో
చచ్చును."
అనెను.
అతని
మాటలకు
రావణుడు
నవ్వి,
"ఓరీ
వానరా!
వానరులు
వారి
యజమానుని
చిత్తము
కనుగొని
సిగ్గు
విడిచి
నాట్యము
చేయుచుందురు.
యే
ఆట
ఆడుమని
యజమానుడు
చెప్పిన
వారా
ఆట
ఆడుదురు.
ఓరీ
అంగదా!
స్వామి
చిత్తము
కనిపెట్టి
సంచరించుట
మీ
జాతి
లక్షణము"
అని
వెగటుగా
మాట్లాడెను.
రావణుని
వచనములను
విని
అంగదుడు
"ఓరీ
రావణా!
జంతువులను
గురించి
మాత్రమే
నీవు
తెలుసుకొంటివి
గానీ,
ప్రభువు,
దైవముల
గురించి
నీవు
తెలుసుకొనలేక
పోతివి.
నీ
పరాక్రమమును,
నీ
రాజనీతిని
మాకు
మా
వానరుడిదివరకే
విపులముగా
తెలిపెను.
నీ
కుమారుని
చంపి,
వనములు
చెల్లాచెదురుచేసి,
లంకను
భస్మము
గావించిననూ
నీవతనికి
తగిన
శిక్ష
చేయలేక
విడిచిపెట్టితివి.
నీ
హృదయమంత
సరళమనియే
నేనింత
కఠోరముగా
ప్రసంగించితిని.
నీకు
సిగ్గులేదు.
రోషములేదు.
నీతి
లేదు,
నిజాయితీలేదు.
ఇంక
విభీషణుని
పిరికిపంద
అని
పండ్లు
కొరుకుచున్నావు!
నీ
బ్రతుకు
భూభారము!
నీ
గుణములు
వూరి
కుక్కలకు
కూడా
వుండవు.
నీకంటే
కుక్కలు
మేలని
నీవు
తెలిసికొనలేక
పోవుచున్నావు"
అని
మర్యాద
చూడక
పలుకుచున్న
పలుకులు
విని
రావణుడు,
"ఓరీ
అంగదా!
యెవడు
స్వభుజపరాక్రమముచే
కైలాసపర్వతమును
మీదికెత్తెనో,
యెవడు
పుష్పములకు
బదులు
శిరస్సులతో
శివుని
పూజించెనో,
యెవని
శూరత్వము
శివునికి
తెలియునో,
యెవరి
నామమును
తలచిన
మాత్రాన
గుండెలు
కదులునో,
ఆ
శూరుడే,
ఆ
రణధీరుడే
ఈ
రావణుడు
సుమా!
నీప్రగల్భములను
కట్టిపెట్టుము"
అనెను.
అపుడు
అంగదుడు,
"ఓరీ
దురభిమానీ!
నీవు
అధికము
మాటలాడక
శ్రీరాముని
భజింపుము,
శరణుజొచ్చుము.
లేకున్న
రామబాణముతో
నీ
శిరస్సులు
బంతులవలె
క్రిందపడును;
వానరులు
వాటితో
క్రీడింతురు.
నేను
సుగ్రీవుని
దూతను.
శ్రీవారి
ఆజ్ఞ
లేకపోవుటచేత,
వారి
ప్రతిష్ఠకు
భంగము
కలుగునని
భయపడుచుంటిని.
లేకుండిన
11
▾
Meaning
Keep
అవలీలగా
నిన్ను
క్షణములో
సంహరించి
సముద్రమున
పడవేసియుండెడివాడను"
అని
ఉగ్రుడయ్యెను.
సింహము
వలె
రెండు
చేతులను
భూమిమీద
కొట్టెను.
రావణుడు
గిరగిర
తిరిగిపడి
సవరించుకొనెను.
భూమి
అదురుట
చేత
రావణుని
పది
కిరీటములు
క్రింద
కూలెను.
నాలుగు
కిరీటములను
అంగదుడు
తీసుకొని
శ్రీవారి
వద్దకు
పంపెను.
వాటినిచూచి
వానరులు
విచిత్రముగా
వారి
వారికి
తోచినటుల
వాటిని
వర్ణించుచుండిరి.
అంతలో
రాముడు
చూచి
"వానరులారా!
ఇవి
రావణుని
కిరీటములు,
అంగదుడు
అక్కడి
నుండి
విసురుట
చేత
ఇవి
రాహుకేతువులవలె
గ్రహముల
వలె
యెగిరివచ్చుచున్నవి"
అని
సమాధానపరచెను.
రావణుడు
రాక్షసులకు
ఆజ్ఞాపించెను.
"ఈ
వానరుని
విడువక
పట్టి
బంధించుడు,
భక్షించుడు"
అని
పలుకుచూ
లోనికి
పోబోయెను.
ఆ
దృశ్యమును
చూచి
అంగదుడు,
"ఛీ,
సిగ్గులేక
అదరిపోవుచున్నావు!
ఎందులకు
ఈ
శౌర్యము?
ముక్కు
మూసుకొని
సముద్రమున
మునిగి
ప్రాణములు
వీడవచ్చును.
స్త్రీ
చోరుడా!
మందమతీ!
కామార్తుడా!
యుద్ధములో
నీ
నాలుకను
పెరికి
కాకులకు
అందించగలను,
జాగ్రత్త!"
అని
పండ్లు
పటపట
కొరుకుచుండగా,
రావణుడు
"ఓరీ
రాక్షసులారా!
వీని
పాదములు
పట్టి
నేలపై
పడత్రోయుడు,
శిరస్సును
బ్రద్దలు
చేయుడు"
అని
పలుకగనే
మేఘనాథుడు
దిగ్గునలేచి,
అంగదుని
పాదములు
గట్టిగా
పట్టి
లాగెను.
యెంతమంది
వచ్చి
లాగిననూ
అంగదుని
పాదమును
కదలించలేకపోయిరి.
వారు
సిగ్గుపడి
చేయునదిలేక
కూలబడిరి.
తరువాత
దేవకంఠకుడు
అనేక
విధముల
అంగదుని
పాదమును
కదిలించుటకు
ప్రయత్నించెను.
కానీ,
వాని
యత్నము
కూడా
విఫలమయ్యెను.
అప్పుడు
రావణుడు
స్వయముగా
అంగదుని
పాదము
పట్టి
వానిని
పడత్రోయ
ప్రయత్నించెను.
వీలు
కానందున
అంగదుడు
ఫక్కున
నవ్వి,
"రావణా!
నీవు
పట్టవలసినది
రామ
పాదము;
దానిని
పట్టుము;
నీకు
ముక్తి
కలుగును"
అని
కాలును
వదిలించుకొనగానే,
రావణుడు
ఆ
తీవ్రతకు
నేలపైబడి
మూర్ఛిల్లెను.
కళాకాంతులు
నశించెను.
సిగ్గుచే
రావణుడు
పగటి
చంద్రునివలె
తేజోహీనుడయ్యెను.
ఆ
దృశ్యము
చూచి
అంగదుడు,
నేనిక
వీనితో
అధికంగా
మాట్లాడుట
మంచిది
కాదు.
రాముడు
నన్ను
బుద్ధులు
నేర్పుమని
మాత్రమే
ఆజ్ఞ
యొసగెను.
కానీ
వీడు
12
▾
Meaning
Keep
మంచిమాటలకు
లొంగడు.
మూర్ఖమును
విడువడు.
వీనికి
యుద్ధమే
తగిన
చికిత్స
అని
తలంచి
శ్రీరాముని
చరణసన్నిధికి
వెళ్ళెను.
విషయములు
రామునకు
విన్నవించెను.
సిగ్గుచేతను,
అంగదుని
బలపరాక్రమములకు
వెరచి
భయము
చేతను,
రావణుడు
అంతఃపురమునందు
ప్రవేశించెను.
అపుడు
రావణుని
కళాహీనమైన
మోమును
చూచి,
మండోదరి,
"నాథా!
ఇప్పటికైననూ
నా
మాట
విని
నీ
మూర్ఖమును
వీడుము.
రామునితో
విరోధించుట
రాజ్యమునకే
కీడు.
లక్ష్మణుడు
గీచిన
గీటునే
నీవు
దాటలేకపోతివి.
నీ
శక్తి
సామర్ధ్యములు
వారిచెంత
యెండుటాకుల
వంటివి.
అతని
దూతలనే
సాధించలేని
నీ
అనుచరులు
కోట్ల
కొలది
వానరులను
జయించగలరా?
అంగదుని
పాదమునే
కదలించలేని
మీరు,
అంతమంది
వానరులను
పట్టగలరా?
యిన్ని
అనుభవించియూ,
మీరెందులకింత
మూర్ఖపు
పట్టును,
పట్టుచున్నారో
నాకు
బాధగా
వున్నది.
నీ
కుమారుని
చంపెను.
లంకను
భస్మము
చేసెను.
వనములు
ధ్వంసము
గావించెను.
అనేకమంది
రాక్షసులను
బంతులవలె
యెగురవేసి
చంపెను.
అపుడు
నీ
శక్తిసామర్ధ్యములు
నిద్రించుచుండెనా?
వట్టి
ప్రగల్భములు
వానరులను
యేమీ
చేయజాలవు.
నాథా!
నా
వచనములను
మన్నింపుము
శ్రీరాముని
మనుజమాత్రునిగా
భావించుటలో
చాలా
పొరబడుతున్నావు.
అతడు
జగన్నాథుడు,
మహావీరుడు.
అతని
బలపరాక్రమములు
మారీచుడెరిగెను
కదా!
వాడు
చెప్పిన
విషయములను
మరొకతూరి
స్మరింపుము.
జనకుని
సభలో
అనేక
రాజులు
కూర్చొనియుండ,
నీవునూ
నీ
బలగర్వముచే
ఆ
సభలో
ప్రవేశించియుంటివి.
నీవు
శివ
ధనుస్సును
కదలించలేకపోతివి.
శ్రీరాముడు
అట్టిదానిని
అవలీలగా
త్రుంచి
రెండు
ముక్కలుగా
చేసి
పారవేసెను.
ఇది
నీవు
కంటితో
చూచిన
బలము
కదా?
ఇన్ని
చూచియూ
నీ
మూర్ఖమును
విడవకున్న
నీకు
వినాశకాల
మాసన్నమయినదనే
తోచుచున్నది.
"కాకాసురుడు
అజ్ఞానముచే,
నీవలే
మూర్ఖముచే
గావించిన
అనర్థమునకు
అతనేమి
గతినొందెనో
మీకు
తెలియదా?
నీ
చెల్లెలగు
శూర్పణఖకు
ముక్కు
చెవులు
కోసివేసెను.
అప్పుడు
నీవేమి
చేయగల్గితివి?
సిగ్గులేక
ఇంక
నా'బలము'
నా'శౌర్యము'
అని
గర్జించుచున్నావు.
ఒక్క
బాణముతో
వాలిని
చంపెను!
వాలి
సామాన్యుడా!
13
▾
Meaning
Keep
వానర
సైన్యముతో
వచ్చి
సువేలాచలముపై
విడిది
గావించెను.
రాముడు
మహాధర్మమూర్తి.
లేకున్న,
నీ
క్షేమమును
కోరి
దూతను
పంపునా?
అతను
యెన్ని
విధముల
శాంతి
మార్గమున
నిన్ను
సంధికి
ప్రయత్నించుచున్ననూ
నీవు
నీ
దురభిమానము
వీడక,
రాముని
ధర్మతత్త్వమును
విచారించక,
పరమపవిత్రుని
గుణములను
యోచించక,
నీకు
నీవే
రాజ్యమును
పతనము
గావించుకొనుచున్నావు.
నేడు
మీ
సభలో
ప్రవేశించిన
అంగదుని
మీరు
యేమి
చేయగలిగితిరి?
అతనికంటే
యెంతో
బలశాలులు
ఆ
వానరులలో
వేలకు
లక్షలకు
కలరు!
నా
మాట
విని
మీరు
మీ
రాక్షసభావములు
వీడి,
రాముని
శరణుజొచ్చుడు"
అని
ఈ
విధముగా
పూర్వపు
వృత్తాంతములను
జ్ఞాపకము
చేయుచూ,
పలికిన
పలుకులు
రావణునికి
బాణమువలే
హృదయమున
నాటుకొనెను.
అంత
ప్రాతఃకాలమయ్యెను.
సభలో
ప్రవేశించి
మూర్తీభవించిన
దురభిమానముతో
రావణుడు
సింహాసనము
నధిష్టించెను.
అంగదుడు
చెప్పిన
మాటలూ
మండోదరి
పలికిన
వచనములు
తలలో
గిఱ్ఱున
తిరుగుచుండెను.
భూమి
ఆకాశము
తిరుగునటుల
వానిలో
అనేకాలోచనలు,
భయము
కలిగెను.
కాని
వినాశకాల
మాసన్నమగుచుండుటచే,
తనకు
మంచి
బుద్ధులు
పుట్టవు.
కనుక,
విద్యుజ్జిహ్వుడను
రాక్షసుని
పిలిచి,
"ఓరీ!
నీవు
నీ
మాయాశక్తిచేత
రాముని
శిరస్సును
ధనుర్భాణములను
తీసుకొనిరమ్ము!
వానిని
చూచి
జానకి,
నిజమని
తలంచి
దుఃఖించును"
అని
ఆజ్ఞాపించెను.
ఆ
మాటలు
విని
విద్యుజ్జిహ్వుడు
దిగ్గున
లేచి
వెళ్లెను.
వాడు
మాయాధనుర్బాణములను,
మాయా
రాముని
శిరస్సును
రచించి
రావణుని
కిచ్చెను.
అది
నిజముగా
రాముని
శిరస్సుతోను,
రాముని
ధనుర్బాణములతోను
సమానముగా
నుండుట
గ్రహించి
రావణుడు
సంతోషించి
దిగ్గునలేచి
అశోకవనమునకు
వెళ్ళి,
వానిని
జానకి
యెదుటనుంచి,
"ఓ
సీతా!
ఎవని
గుణములను
దివారాత్రములు
గానము
చేయుచుంటివో
వాని
శిరస్సును
ధనుర్బాణములను
చూడుము.
వానర
సైన్యములను
నిశ్శేషముగా
సంహరించితిని;
లక్ష్మణుడు
ప్రాణములు
దక్కించుకొని
పారిపోయెను.
నీకు
నమ్మకము
కలుగట
కొరకు
రాముని
శిరస్సును,
ధనుర్బాణములను
తీసుకొని
వచ్చితిని.
వీనిని
చూడుము"
అని
ముందు
పెట్టెను.
14
▾
Meaning
Keep
క్షణము
విచారము
కలిగిననూ
తరువాత,
రాముని
శిరస్సును
త్రుంచువాడు
పదునాలుగు
లోకములలో
కూడా
లేడని
తలంచి,
ఇవి
కేవలము
తన్ను
బెదిరించుటకు
గావించు
మాయా
నాటకములని
తెలుసుకొని
సీత,
వాని
మాటల
నేమాత్రము
లెక్కచేయక,
"ఓరీ
రావణా!
నీకు
వినాశకాలము
సంభవించినది!
సమీపించినది!
కాకున్న
ఈ
రీతిగా
నీకు
దుర్భుద్ధులు
పుట్టియుండవు.
నా
రాముని
సమీపించుటకు
కూడా
నీకు
అధికారము
లేదు!
అట్టి
నీవేమి,
రాముని
వధించుటేమి?
కలలో
కూడనూ
ఇట్టిస్థితి
సంభవించదు.
ఇవి
నీ
మాయా
నాటకములు"
అని
చీవాట్లు
పెట్టుచుండగనే,
నలువైపుల
జయ
జయ
శబ్దములు
వినిపించెను.
"రామ
ప్రభువుకు
జై"
అనుచూ
కేకలు
వేయుచూ
వానరులు
లంకను
నలుమూలలా
ముట్టడించిరి.
ఆ
శబ్దములు
విని
రావణుడు,
రివ్వున
బయలుదేరి,
సభకు
వచ్చెను.
అంతలో
విభీషణుని
భార్య
సరమ
సీతవద్దకు
వెళ్ళి,
"తల్లీ!
రావణుడు
చేయునవన్నియూ
మాయలు;
రాముని
శిరస్సును
ఖండించుటకు
యెవరి
తరము
కాదు.
రాముడు
తను
వానర
సైన్యముతో
ఇప్పుడే
లంకను
ప్రవేశించినాడు.
వానరులు
జయ
జయ
ధ్వనులతో
లంకను
చెల్లాచెదురు
గావించుచున్నారు"
అనెను.
శత్రువుల
సమాచారమును
అంగదుని
ద్వారా
విని
మంత్రులను
బిలిచి
లంకా
నగరమునకు
నాలుగు
ద్వారములు
కలవు.
ఏ
విధముగా
వాటిని
ముట్టడించవలెనో
ఆలోచింపుమని
రాముడు
ఆజ్ఞాపించెను.
రామాజ్ఞను
అనుసరించి
కపిరాజును
భల్లూకరాజును
రాక్షసరాజును
కలిసి
శ్రీరామునికి
నమస్కరించి,
వానర
సైన్యమును
నాలుగు
భాగములుగా
విభజించిరి.
యధాయోగ్యముగ
సేనాపతులను
నియమించి
యుద్ధపతులను
పిలిచిరి.
వారు
సింహనాదములు
చేసి
యుద్ధమునకు
నడచిరి.
శ్రీరాముని
స్మరించుచూ
వానరులు
పర్వతములను
వృక్షములను
శిలలను
పట్టుకొని
వెడలిరి.
రాక్షసుల
నెదిరించిరి.
లంకానగరము
దుర్గమము,
అభేద్యము
అయినను
శ్రీరాముని
అనుగ్రహమున
నిర్భయముగా
లంకలో
ప్రవేశించిరి.
పూర్వద్వారమున
నలుడును,
దక్షిణ
భాగమున
అంగదుడును,
పశ్చిమ
భాగమున
మహావీరుడును,
ఉత్తర
భాగమున
కాపాడుచుండిన
దశకంఠునితో
శ్రీరాముడే
పోరాడెను.
వానరులకు
రణభేరులు
లేవు.
కేవలము
రామనామమే
సర్వభేరులతో
సమానముగా
మిన్నుముట్టెను.
15
▾
Meaning
Keep
లంకానగరములో
అత్యంత
కోలాహలము
పుట్టెను.
ఆ
హాహాకారములు
రావణుడు
విని
దురభిమానమును
విడిచిపెట్టక
ఈనాడు
రాక్షసులకు
గొప్పవిందు
అని
నవ్వుచూ
పొగరుబోతువలె
గర్వించు
చుండెను.
మేరుపర్వత
శిఖరముల
నావరించిన
మేఘములవలె
రాక్షసులు
కోటబురుజుల
నావరించియుండిరి.
రణభేరులను
మ్రోగించిరి.
ఒక
వైపున
'రావణునికి
జై'
అనియు,
మరొక
వైపున
'శ్రీరామ
ప్రభువుకు
జై'
అనియు,
బొబ్బలిడి
యెదుర్కొనిరి.
నగర
ప్రాకారముల
మీదనుండి
రాక్షసులు
శిలలను,
వృక్షములను
విసరుచుండిరి.
అవి
క్రిందపడక
పూర్వమే
వానరులు
వాటిని
చేతులతోపట్టి,
వాటినే
రాక్షసులపై
వెనుకకు
విసరుచూ
వచ్చిరి.
రామానుగ్రహమున
వానర
బలమధికమయ్యెను.
యెక్కడచిక్కిన
రాక్షసులను
అక్కడే
హతమార్చుచూ
వచ్చిరి.
ప్రచండమారుతము
వీచినపుడు
మేఘముల
బృందము
నలువైపుల
చెదిరినట్లు,
వానరుల
ప్రతాపమువలన
రాక్షసుల
సైన్యములు
విరిగి
దిక్కులు
పట్టెను,
లంకానగరములో
హాహా
కారములు
పుట్టెను.
రాక్షసస్త్రీలు,
వృద్ధులు,
పిల్లలు,
రావణుని
అనేక
విధములుగ
దూషింప
మొదలు
పెట్టిరి.
కొందరు
రాక్షసులు
యుద్ధము
మాని
తమ
తమ
కుటుంబములతో
ప్రాణరక్షణ
గావించుకొనుటకు
పరుగులిడిరి.
అట్టి
దృశ్యమును
చూచి
రావణుడు
పండ్లు
కొరికి,
"పిరికపందలారా!
యుద్ధము
నుండి
వెనుచూపి
పరుగిడువారిని
నా
చంద్రాయుధముతో
ఖండింతును!"
అని
పలుక,
అంత
కొందరు
భయమొంది
విధిలేక
యుద్ధమున
పాల్గొనిరి.
వానరవీరులు
వీరావేశముతో
రాక్షస
సైన్యములో
ప్రవేశించి
రామచింతన
చేయుచూ
రావణుని
దుర్గములో
ప్రవేశించిరి.
రావణుని
దుర్గమును
నేలకూల్చిరి.
ఒక
బంగారు
తోరణ
స్తంభమును
వూడబెరికి
మారణహోమము
చేయనారంభించిరి.
ఒక్కొక్క
రాక్షసుని
వారు
మర్దించి
శిరములు
త్రుంచి
పారవేయ
మొదలుపెట్టిరి.
త్రుంచిన
శిరస్సులన్నియూ
రావణుని
యెదుట
వచ్చి
పడుచుండెను.
ఈ
ప్రకారముగా
వానరులు
శత్రు
సైన్యముపై
భుజబలము
చూపించి
సునాయాసముగా
సంహరించి
సైన్యమును
దాటి
శ్రీరాముని
వద్దకు
వచ్చిరి.
అంతలో
16
▾
Meaning
Keep
రాత్రి
ప్రారంభమాయెను.
రాక్షసబలము
అధికమాయెను.
రావణునికి
జై
అనుచూ
సింహనాదము
చేసిరి.
వానరులు
తిరిగి
యుద్ధమున
ప్రవేశించిరి.
వానర
రాక్షస
సైన్యంబులు
తాకెను.
రాక్షస
సైన్యము
విరుగబడెను.
అకంపుడును
అతికాయుడును
రాక్షసమాయ
బన్నిరి.
వారి
మాయవలన
క్షణములో
గాఢాంధకారము
నలువైపులా
వ్యాపించెను.
రక్తము,
ధూళి,
శిలల
వర్షము
పడెను.
ఈ
గాఢాంధకారముచే
వానరులకు
ఒకరికొకరు
కనుపించక,
యెవరు
రాక్షసులో,
యెవరు
వానరులో
అన్నది
తెలియకపోయెను.
ఆ
కారణముచే
వానరులు
కొంతదిగులొందిరి.
ఆ
విధమైన
స్థితిని
చూచి
రామారామా
అని
వానరులు
మొరబెట్టిరి.
ఆ
వార్త
విని
రాముడు,
అంగద
హనుమంతుల
పిలిచి,
రాక్షసులు
చేసిన
మాయను
తెలిపెను.
వారు
కోపించిరి.
అప్పుడు
రాముడు
దయదలచి
ఆగ్నేయాస్త్రమును
ప్రయోగించెను.
ఆ
అస్త్రముతో
రాక్షసుల
మాయ
వీడిపోయెను.
రణరంగమంతయూ
తెలివిదాల్చెను.
మాయచీకట్లు
మాయమయ్యెను.
దశదిశలు
ప్రకాశించుటవలన
వానర
భల్లూకములు
పూర్వపు
శ్రమను
మరచి
ఉత్సాహముతో
యుద్ధమును
ఆరంభించిరి.
అంగద
హనుమంతులు
గర్జించి
యుద్ధము
చేయుచున్న
స్థలమును
రాక్షసులు
విడిచి
పరుగులెత్తిరి;
పరువులిడుచున్న
రాక్షసులనుబట్టి
కాళ్ళుపట్టి
సముద్రపు
దిశకు
విసరుచూ
వచ్చిరి.
కళేబరములను
సముద్రములో
తోసిరి.
ఈ
విధముగా
శత్రుసైన్యములను
వానరులు
విరుగగొట్టి
సింహనాదము
చేసిరి.
ఇంతలో
చీకట్లు
నలువైపుల
వ్యాపించెను.
రాక్షసులు
లంకలో
ప్రవేశించిరి.
వానరసైన్యము
తిరిగి
శ్రీరాముని
వద్దకు
వచ్చెను.
శ్రీరాముని
కటాక్షదృష్టి
ప్రసరించిన
మాత్రముననే
వానరుల
శ్రమ
అంతయూ
శాంతించెను.
ఇది
యిట్లుండ
లంకలో
రావణుడు
మంత్రులను
పిలిచి
వారితో
యిట్లు
చెప్పెను:
"మంత్రులారా!
ఈ
దినమున
అనేక
రాక్షసులు
హతులయిరి.
సహస్ర
సైన్యమును
వానరులు
సంహరించిరి.
ఇకపై
మనము
చేయవలసిన
ఉపాయమును
ఆలోచించుడు"
అని
రావణుడు
ఆజ్ఞాపించగనే
రావణుని
మాతామహుడు,
రావణుని
తండ్రికి
సహితము
మంత్రి
అయిన
మాల్యవంతుడను
రాక్షస
వృద్ధ
మంత్రి
లేచి,
17
▾
Meaning
Keep
రావణునకు
అనేక
నీతిమార్గముల
నుపదేశించెను.
"ఓ
రావణా!
నామాట
శాంతముగా
ఆలకింపుము.
నన్ను
క్షమింపుము.
జానకిని
తీసికొని
వచ్చినది
మొదలు
దుశ్శకునములు
కనబడుచున్నవి.
వాటిని
వేరువేరుగా
చెప్పశక్యము
కాదు.
మహాపురుషుడైన
శ్రీరాముని
ప్రతాపమును
వేదములు
కూడ
వర్ణించజాలవు.
అట్టి
విరాట్పురుషు
నెదిరించుటవలన
శ్రేయస్సు
కలుగదు.
తమరు
శాంతముగా
ఆలోచించుట
మంచిది.
ఆ
మహాపురుషుడే
హిరణ్యకశిపుని,
హిరణ్యాక్షుని
సంహరించెను.
కాలస్వరూపుడై
దుష్టులను
సంహరించును.
అతను
సకల
గుణధాముడు.
అతనితో
నీకు
వైరము
వలదు.
రాజా!
లంకను
కాపాడుము.
సీతను
శ్రీరామునకు
అప్పజెప్పుము.
కాలహరణము
చేయుట
మంచిది
కాదు"
అని
నమస్కరించెను.
మాల్యవంతుడు
పలికిన
పలుకులు
బాణములవలె
రావణుని
హృదయమును
తగిలెను.
అతడు
ఉగ్రుడై
"ఓరీ!
నీవు
కాలుని
ముఖములో
ప్రవేశింపదలచినట్లు
తోచును.
నీవు
వృద్ధుడవు
గనుక
క్షమించితిని.
లేకుండిన
ముక్కలు
గావించి
యుండెడివాడను,
జాగ్రత్త
నా
యెదట
నుండి
లేచిపొమ్ము!"
అని
బుసలు
కొట్టెను.
రావణుని
అహంకారమునకు
అజ్ఞానమునకు
మాల్యవంతుడు
లోలోన
నవ్వుకొని
ఈ
దుర్మార్గుని
అంత్యగడియలు
ఆసన్నమగుచున్నవి.
అందుచేతనే
మంచిమాటలు
హృదయమునకు
చేర్చుకొనక
విపరీతబుద్ధులకు,
వికారచేష్టలకు
గురియగుచున్నాడు.
అని
చింతించెను.
అప్పుడు
మేఘనాథుడు
లేచి,
"తండ్రీ!
మీరు
విచారించకుడు.
రేపు
ప్రాతఃకాలమున
నా
రణకౌతుకమును
చూడగలరు.
నేను
చెప్పుచున్నదానికంటె
అధికంగా
పని
చేసి
చూపించెదను"
అని
రావణునితో
చెప్పెను.
మేఘనాథుని
వచనములు
రావణుని
కొంత
శాంత
పరచెను.
సంతోషపరచెను.
రావణునకు
ధైర్యోత్సాహములు
పుట్టెను.
కుమారుని
దగ్గరకు
చేర్చుకొని
అతని
శిరస్సుని
ముద్దాడి,
కుమారుని
ధైర్యసాహసాలను
కొనియాడెను.
అర్థరాత్రి
కావచ్చెను.
అంత
సభను
చాలించి
యెవరి
బసకు
వారు
వెళ్ళిరి.
కానీ,
కంటికి
నిదురలేదు.
కడుపునకు
తిండి
చేరదు.
యే
నిమిషము
యేమి
ప్రమాదము
వాటిల్లునో
అను
ఆందోళన
అందరియందు
వ్యాపించెను.
దిగులుతో
కుములుచుండగనే
అరుణోదయమయ్యెను.
18
▾
Meaning
Keep
వానర
భల్లూకములు
నగరమును
నలువైపులా
ముట్టడించెను.
లంకలో
కోలాహలము
చెలరేగెను.
వానరుల
కేకలు
భూమి
దద్దరిల్లజేసెను.
గర్జనలు
మిన్నుముట్టెను.
రాక్షసవీరులు
కూడను
విధిలేక
శస్త్రాస్త్రములను
ధరించి
యెదురు
తిరిగిరి.
నగర
ప్రాకారములనుండి
వారు
పర్వతములను
విసరుచుండిరి.
రాక్షసులు
కోట్లకొలది
చేరి
శస్త్రాస్త్రములను
ప్రయోగించిరి.
ప్రళయకాల
మేఘములవలె
రాక్షసులు
కూడ
గర్జించిరి.
వానరులు
విసరిన
పర్వతముల
తాకిడికి
రాక్షసుల
శరీరములు
జర్జరీభూతమయ్యెను.
Previous
←
Vibhīṣaṇa's Śaraṇāgati
Next
The Sañjīvinī Mountain
→