Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Sañjīvinī Mountain
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
10
సంజీవినీ
పర్వతము
వానరులు
నగరమున
ప్రవేశించుచున్నారన్న
వార్త
విని,
మేఘనాధుడు
రౌద్రాకారుడై
ఆయుధములను
ధరించి
బయలుదేరెను.
రాక్షసులు
రణభేరులను
మ్రోగించిరి.
"ఇంద్రజిత్తు"
అతిరథ
శ్రేష్ఠుడు!
వానిం
జూచి
వానరులు
పరుగెత్తిరి.
పరుగెత్తు
వానరులను
మేఘనాధుడు
రౌద్రాకారుడై
వీరాలాపము
లాడుచు,
బాణములను
సంధించి
ఆకర్ణాంతము
లాగి
ప్రయోగించెను.
రెక్కలు
కల
కాలసర్పముల
వలె
ఆ
బాణములు
నలువైపులా
పరుగులెత్తెను.
వానరులు
వాని
ఎదుట
పడుటకు
భయపడిరి;
నిరుత్సాహులైరి.
యుద్ధము
చాలించి
మరలిరి.
కొందరు
ఆ
బాణముల
బారికి
నేలకూలిరి;
మూర్ఛిల్లిరి.
ఈ
వానర
సైన్యముల
వ్యాకులమును
జూచి
హనుమంతుడు
కోపించి
మేఘనాధుని
మీదికి
కాలునివలె
పరుగెత్తెను.
చెంతనున్న
పర్వతము
యెత్తి
వానిపై
విసరెను.
కాలాంతుకునివలె
వచ్చుచున్న
పర్వతమును
మేఘనాధుడు
చూచి
అంతరిక్షమునకు
ఎగిరెను.
వాని
రథమును,
రథాశ్వములను
సారధియు
దానిక్రింద
పడి
నలిగిపోయిరి.
అంత
మేఘనాధుడు
రాక్షసమాయలను
అనేకము
పన్నెను.
ఒక
చిన్న
పాము
గరుత్మంతుని
బెదరించిన
విధమున
వాడు
హనుమంతుని
బెదరించెను.
అంతటితో
మానక,
అంతరిక్షమునుండి
మేఘనాధుడు
నిప్పులను
వర్షించెను.
రక్త
వర్షమును
కురిపించెను.
పట్టపగలు
గాఢాంధకారము
వ్యాపించెను.
ఎవని
హస్తము
వానికి
కనబడలేదు.
ఈ
విధమైన
మాయలచేత
వానరులు
మరింత
వ్యాకులబడిరి;
వానరులు
నేటితో
తమ
జీవితముల
అంత్యమగునని
భావించిరి.
ఈ
రాక్షస
మాయలను
చూచి
శ్రీరాముడు
లోలోన
నవ్వి,
వానరులు
అధైర్యపడుచున్నారని
గుర్తించి,
ఒక
బాణమును
ప్రయోగించెను.
అంత
ఆ
రాక్షసుని
మాయ
మటుమాయమయ్యెను.
సూర్యోదయమువలన
అంధకారము
వీడునట్లు
రాక్షసుని
మాయ
వీడిపోయెను.
వానరులను
శ్రీరాముడు
కటాక్షదృష్టితో
చూచెను.
వానరుల
2
▾
Meaning
Keep
శ్రమ
శాంతించెను.
వారు
ప్రబలులై
యుద్ధమునకు
వెడలిరి.
ఒక్కతూరి
"శ్రీరామచంద్ర
ప్రభువుకు
జై"
అని
జేజేలు
కొట్టుచూ
రణమున
దుమికిరి.
వారిని
నిరోధించుట
శక్యము
కాకపోయెను.
దీనికితోడు
శ్రీరామాజ్ఞ
ప్రకారము
లక్ష్మణుడు
ధనుర్బాణములు
పట్టి
హనుమంతునితో
కూడి
మేఘనాధునితో
యుద్ధము
చేయుటకు
వచ్చెను.
లక్ష్మణుడు
మేఘనాధునెదుర్కొనెనని
రావణుడు
విని,
తన
కుమారునికి
బలమైన
మరికొంత
మంది
రాక్షసులను
సహాయనిమిత్తము
పంపెను.
వానరులకు
వృక్షములు,
శిలలే
ఆయుధములు.
ఉభయ
సైన్యములు
ఉద్దండ
పరాక్రమమున
విజృంభించి
ద్వంద్వ
యుద్ధము
చేయుచుండిరి.
వానరులు
పిడికిళ్ళతో
గుద్ది
నోటితో
రాక్షసులను
కొరికి,
అదిమి
చంప
మొదలు
పెట్టిరి.
తలలు
తెగగొట్టిరి.
భుజములు
వూడబెరికిరి.
వానరులు
చేయు
ధ్వనులు
నవద్వీపములలో
నిండెను.
శిరములు
లేని
రాక్షసుల
మొండెములు
పరువులెత్తుచుండుట
చూచి
వానరులు
నవ్వుతూ
మరొకవైపున
ఆశ్చర్యపడుతూ
కేకలు
వేసిరి.
రణభూమిమీద,
లంకలోని
జనసంచారపు
రహదారుల
మీద
రక్తము
నిండెను,
ప్రవహించెను.
లక్ష్మణుడు,
మేఘనాధుడు
భయంకరముగా
పోరాడిరి.
వారి
పోరాటములో
ఒకరికొకరు
సమానముగా
కనుపించిరి.
ఇంద్రజిత్తు
మాయోపాయములు
పన్ని
లక్ష్మణుని
జయింపతలచెను.
కాని
వాని
ప్రయత్నములు
వ్యర్థములయ్యెను.
లక్ష్మణుడు
ఉగ్రుడై
ఇంద్రజిత్తు
రథమును
కూల్చి
రథసారధిని
చంపెను.
అంత
ఇంద్రజిత్తు
ఇంతటితో
తన
ప్రాణములు
పోవునని
తలంచి
దేదీప్యమానముగా
వెలుగుచున్న
బ్రహ్మదత్తమగు
మహాశక్తిని
తీసి
లక్ష్మణుని
హృదయమునకు
తగులునట్లుగా
గురిచూచి
ప్రయోగించెను.
అది
వచ్చి
లక్ష్మణుని
హృదయమునకు
తగిలెను.
వెంటనే
లక్ష్మణుడు
మూర్ఛిల్లెను.
అంత
వాడు
నిర్భయుడై
నేలపడిన
లక్ష్మణుని
చెంతకు
వచ్చెను.
మేఘనాధునితో
సమానముగా
బలవంతులు
వచ్చి
లక్ష్మణుని
శరీరము
నెత్తుటకు
ప్రయత్నించిరి.
కాని
వారి
ప్రయత్నములు
నిష్ఫలమయ్యెను.
కోట్లకొలది
రాక్షసులు
వచ్చిననూ
అది
సాధ్యము
కానిది.
కారణము
ఆదిశేషుని
ఎత్తుటకు
తగిన
బలవంతులు
కలరా?
కడకు
ఎందరు
వచ్చిననూ
లక్ష్మణుని
దేహమును
కదిలించలేకపోయిరి.
శ్రీరాముని
కటాక్షము
కలవారే
లక్ష్మణుని
కదిలించగలరు.
3
▾
Meaning
Keep
ఇంతలో
సాయంసమయమయ్యెను.
ఉభయ
సైన్యములు
వారి
వారి
కటకములకు
నిష్క్రమించెను.
శ్రీరాముడు
వానర
సైన్యమును
చూచి
లక్ష్మణుడేడీ
అని
ప్రశ్నించెను.
ఇంతలో
హనుమంతుడు
మూర్ఛిల్లిన
లక్ష్మణుని
దేహమును
భుజములపై
వేసుకొని
రామా
రామా
అంటూ
వచ్చెను.
అతని
రాకను
గమనించి
శ్రీరాముడు
కొంత
కంగారుపడినటుల
నటించెను.
హనుమంతుడు
తెచ్చిన
లక్ష్మణుని
దేహమును
తన
తొడపై
పరుండబెట్టుకొని
అనేక
విధముల
ఆ
దేహమును
పరీక్షించుచుండెను.
జాంబవంతుడు
నాథా!
కాలహరణముచేయక
లంకలో
వున్న
సుషేణుడను
వైద్యుని
రప్పించుట
మంచిదని
కోరెను.
ఈ
మాట
వినగానే
హనుమంతుడు
సూక్ష్మరూపమును
ధరించి
లంకలో
ప్రవేశించెను.
నేను
పిలిచిన
సుషేణుడు
వచ్చునో
లేదో
అని
తనలో
తాను
తలంచి,
యేమైననేమి
అని
సుషేణుని
గృహమునే
వూడబెరికి
యెత్తుకొని
వచ్చెను.
సుషేణుడు
రామునికి
నమస్కరించి,
ఔషధము
పేరును
అది
లభించు
పర్వతము
పేరును
చెప్పెను.
దీనిని
తెచ్చుటకు
తగిన
వారెవ్వరు
అని
విచారించుచుండగనే
హనుమంతుడు
శ్రీరాముని
చరణారవిందములకు
నమస్కరించి
అనుజ్ఞ
యొసగమని
కోరెను.
రాముడు
అనుమతి
నిచ్చెను.
ఇంతలో
సుషేణుడు
రామసన్నిధిలో
కలదను
వార్త
ఒక
చారుని
ద్వారా
రావణునకు
తెలిసెను.
రావణుడు
కాలనేమికి
తెలిపెను.
అంత
కాలనేమి
"రావణా!
నీ
కన్నెదుటనే
వాడు
నీ
లంకను
తగులబెట్టెను
కదా!
అట్టి
హనుమంతుని
నిరోధించుటకు
నాకేమి
శక్తి
కలదు?
ఇప్పటికైననూ
మించిపోలేదు.
శ్రీరాముని
జయింతున్న
భ్రాంతిని
నీవు
వదులుము.
శ్రీరాముని
చరణముల
నాశ్రయింపుము.
అందువలన
నీకు
మేలు
కలుగును.
నీ
అహంకారమును,
మదమును
విడిచి
పెట్టుము"
అని
రావణునకు
హితోపదేశము
జేసెను.
రావణుడు
కోపించి
వానిని
ధిక్కరించెను.
నా
ఆజ్ఞ
ప్రకారము
చేతువా
లేక
నిన్ను
హతము
గావించుమందువా
అని
గర్జించగానే,
కాలనేమి
శ్రీరాముని
చేతులలో
చనిపోవుట
మంచిది,
వీని
చేతులలో
చచ్చుటెందులకని
తలంచి
ప్రయాణమయ్యెను.
వాడు
మాయపన్ని
దారిలోనొక
సరోవరమును
కల్పించి,
ఋషి
వేషమున
ధరించి
ధ్యాననిష్ఠుడై
కూర్చొనెను.
హనుమంతుడు
యుద్ధము
నుండి
విడిదికి
వచ్చి
4
▾
Meaning
Keep
విశ్రాంతియైననూ
తీసుకొనక
రామాజ్ఞను
శిరసావహించి
ఔషధము
నిమిత్తమై
పరువులిడినందున
అలసిసొలసి
దాహము
వేసి
దారిలో
ఈ
సుందర
వనమును
ఆశ్రమమును
చూచి
దాహముగ్రోలి
విశ్రమించి
వెళ్ళుదమని
ఆ
ఆశ్రమములో
ప్రవేశించెను;
మునికి
నమస్కరించెను.
ఆ
కపటవేషధారి
శ్రీరాముని
గుణగణములు
గానముచేయ
నారంభించెను.
హనుమంతుడు
ఆశ్చర్యపడి
తానుకూడనూ
రామనామమును
స్మరించెను.
ఇంతలో
కపటవేషధారియైన
కాలనేమి,
వానరా,
రామరావణులకు
యుద్ధము
జరుగుచున్నది.
నిత్యము
నేను
ఇక్కడ
నుండియే
చూచుచున్నాను.
తప్పక
రామునకు
విజయము
కలుగును.
ఇందులకు
సందియము
లేదు
అనెను.
హనుమంతుడు
ఆ
వార్తతో
సంతసించి
తాను
దాహముతో
బాధపడుచుండినట్టు
తెలుపుకొనెను.
స్వర్ణకమండలములో
చల్లని
పానీయము
కలదని
చెప్పి
నీటిని
త్రాగుటకు
హనుమంతునికి
అందించెను.
హనుమంతుడు
స్వామీ
ఈ
కొద్ది
నీరు
నాకేమాత్రమును
దాహమును
తీర్చజాలదు
అని
విన్నవించెను.
కాలనేమి
చెంతనే
యున్న
ఒక
సరోవరమును
చూపి,
అందులో
నీ
శ్రమతీరా
స్నానము
చేసి
జలమును
త్రాగిరమ్మని
చెప్పెను.
ఆ
మాటలకు
హనుమంతుడు
సమ్మతించి
సరోవరములో
చల్లని
నీరు
త్రాగనెంచి
తనపాదములను
సరోవరములో
పెట్టెను.
ఇంతలో
ఒక
మకరమువచ్చి
అతని
పాదములు
పట్టెను.
ఆక్షణమే
హనుమంతుడు
ఆ
మకరమును
ఝళిపించి
చంపెను.
మకరము
శరీరమును
విడిచి
ఒక
దివ్యపురుషునిగా
ఎదుట
నిలచెను.
ఈ
దృశ్యమును
చూచి
హనుమంతుడు
ఆశ్చర్యపడి,
నీవెవడవు
అని
ప్రశ్నించెను.
అంత
ఆ
మహాపురుషుడు
"ఓ
రామదాసా!
మీ
దర్శనస్పర్శలవలన
నా
పాపము
నశించెను.
నా
శాపము
మరలెను.
నేనును
కాలనేమియు
పూర్వజన్మలో
గంధర్వులము.
దేవేంద్రుని
సభలో
గానము
చేయుచుంటిమి.
ఆ
సమయమున
దుర్వాసుడు
అను
మహాముని
సభలోనికి
వచ్చెను.
అతని
రూపురేఖలను
చూచి
నవ్వితిమి.
అందుచేత
నతడు
కోపించి
రాక్షసులై
పుట్టుడని
మమ్ములను
శపించెను.
మేము
విచారించి
అతని
పాదములు
పట్టి
ప్రార్థించగా,
ఓయీ!
మీరిరువురు
రాక్షసులై
లంకానగరములో
జన్మించెదరు.
త్రేతాయుగ
చతుర్థపాదములో
శ్రీరాము
దవతరించును.
అప్పుడు
మీ
లంకలో
గొప్ప
యుద్ధము
జరుగును.
ఆ
యుద్ధములో
శక్తి
తగిలి
లక్ష్మణుడు
మూర్ఛిల్లును.
సంజీవి
పర్వతమును
తీసుకొనివచ్చుటకై
హనుమంతుడు
ఆ
మార్గమున
వెళ్ళును.
అతని
వలన
మీకు
శాప
5
▾
Meaning
Keep
విమోచనమగును
అని
అతడు
కరుణించి
మాతో
చెప్పెను.
ఓ
వీరుడా!
సమీపమునయున్న
సుందరవనములో
నివసించు
ముని
మునికాదు.
మునివేషముతో
నున్న
రాక్షసుడు.
అతడే
కాలనేమి!
నా
మాట
నమ్ముడు"
అని
గంధర్వుడు
బోధించెను.
తదుపరి
హనుమంతుడు
కపట
మునిదగ్గరకు
వచ్చి,
ఓ
గురుస్వామీ!
ప్రథమమున
మీరు
గురుదక్షిణను
స్వీకరింపుడు
అనెను.
నీరు
త్రాగుటకై
వెళ్ళిన
హనుమంతుడు
ఇంత
ఆలస్యము
చేయుటకు
కారణమేమని
విచారించి,
తన
గుట్టును
ఆ
కొలనులో
వున్న
తన
మిత్రుడు
తెలిపెనేమో
అని
సందేహముతో
విచారించుచున్న
ఈ
కపటమునియగు
కాలనేమి
చెంతకు
వచ్చి
నిలిచిన
హనుమంతుని
చూచీచూడనట్లుండెను.
హనుమంతుడు
వీని
గుట్టును
గుర్తించి
తన
వాలమును
కన్నులు
మూసి
కూర్చొనియున్న
ఆ
కపటిసన్యాసి
మెడకు
చుట్టి
గిరగిర
త్రిప్పి
నేలగొట్టెను.
ఆ
కాలనేమి
రామా,
రామా
అంటూ
ప్రాణములు
వీడెను.
హనుమంతుడు
కపటరాక్షసుని
ప్రక్కకు
నెట్టి
ద్రోణపర్వతమునకు
వెడలెను.
అతడు
సంజీవి
పర్వతమును
చూచెను.
కానీ
ఔషధుల
గుర్తుపట్టలేకపోయెను.
ఆలస్యము
చేయుట
రామాజ్ఞ
దాటినట్లుగునని
తలంచి
ఆ
పర్వతమునే
హస్తమందుంచుకొని
అయోధ్యా
నగరమార్గమున
వచ్చెను.
ఆ
నిశీథ
సమయమున
భరతుడు
రామచింతన
చేయుచూ
యేకాకిగా
విచారించుచుండెను.
అంతలో
హనుమంతుని
నీడ
భరతునిపై
పడెను.
భరతుడు
ఆ
నీడ
ఏమిటి
అని
తలయెత్తి,
పెద్ద
పర్వతమును
హస్తమందుంచుకొని
వేగముగా
యెగిరిపోవు
ఒక
కోతిని
చూచి
ఇది
యేదో
రాక్షసరూపముగా
నున్నదని
తలంచి,
ఈ
రాక్షసుడు
ఇతరులకు
యే
ఉపద్రవమునూ
కలిగించక
మునుపే
వాని
రూపమాపుట
మంచిదని
తలంచి
చెంతనేయున్న
బాణమును
చేతపట్టి
ప్రయోగించెను.
ఆ
కర్ణాంతము
ధనుస్సు
లాగి
అతడు
బాణము
విడిచెను.
ఆ
బాణము
తగిలినంతనే
హనుమంతుడు
హా
రామా!
అని
అరచెను.
ఆ
రామశబ్దమును
విని
భరతుడు
దిగ్గున
లేచెను.
క్రిందపడిన
వానరుని
చెంతకు
వెళ్ళి,
అతని
వృత్తాంతమును
తెలిసికొని,
దుఃఖించి
హనుమంతుని
కౌగిలించుకొని
తన
తప్పును
క్షమించుమని
కోరి
కన్నీరు
కార్చెను.
మనోవాక్కాయముల
నేను
హృదయపూర్వకముగా
శ్రీరాముని
చింతించుటే
సత్యమయిన
ఈ
వానరుని
రక్షించి
యథారీతిగా
శక్తినిచ్చుగాక
అని
ప్రార్థించెను.
6
▾
Meaning
Keep
భరతుడు
ఆ
రీతిగా
విలపించి
శపథము
చేసిన
వెంటనే
హనుమంతుడు
బాధనుండి
లేచి
యథారీతిగా
నిలిచెను.
తదుపరి
భరతుని
పరీక్షించుటకు
హనుమంతుడు
జై
రామచంద్ర
ప్రభువకు
జై,
జై,
జై
రఘురాంజీకి
జై,
అని
పలికెను.
భరతుడు
తన
దుఃఖమును
ఆపుకొనలేక
భోరునయేడ్చి,
ఓ
కపీశ్వరా!
మా
సీతరామలక్ష్మణులు
కుశలమా?
మా
తల్లి
జానకీదేవి
క్షేమమా?
అని
ఆనందబాష్పములు
కార్చుచూ
అడిగెను.
వానరుడు
జరిగిన
యావత్
వృత్తాంతమంతయు
భరతునకు
తెలిపెను.
జరిగిన
విషయములను
చింతించుచూ
లక్ష్మణుని
మూర్ఛవిని
భరతుడు
నేలకూలెను.
తరువాత
లేచి,
హనుమంతా,
నా
పొరపాటును
క్షమించు.
ఈ
సమయములో
నేను
నిన్ను
నిలబెట్టుట
మంచిది
కాదు.
శీఘ్రముగా
సంజీవిని
తీసుకొని
పొమ్మని
ఆజ్ఞాపించెను.
హనుమంతుడు
భరతునకు
నమస్కరించి
పర్వతమును
యెత్తెను.
హనుమంతుడు
కనుపించునంతవరకూ
భరతుడు
కన్నురెప్ప
వాల్చక
చూచి,
రామక్షేమ
సమాచారము
నేటికి
తెలిసెను
కదా
అని
ఒక
వైపున
ఆనందమును,
సీతాలక్ష్మణుల
పరిస్థితులను
స్మరించి
దుఃఖమును
భరించలేక
ఇంటికి
వెళ్ళి
తల్లులకు
ఈ
వార్తను
తెలిపెను.
తల్లి
కౌసల్య
కొంత
చింతించిననూ,
తరువాత
రాముడు
కలడు
కదా
అని
ధైర్యము
వహించెను.
సుమిత్ర
తనలో
తాను
సంతోషించెను.
నా
గర్భమున
పుట్టిన
కుమారుడు,
రామ
కార్య
నిమిత్తమై
తన
దేహమును
వినియోగించెను
కదా,
అంతేచాలును.
నా
జన్మసఫలమయ్యెను.
కానీ,
ఈ
సమయమున
లక్ష్మణుని
మూర్ఛ
రామునినెంత
బాధపెట్టెనో,
తమ్మునికి
వియోగమునకు
శ్రీరాముడెంత
విచారించెనో
అని
తలంచి
శత్రుఘ్నుని
చూచి,
నాయనా!
నీవు
రాముని
సహాయమునకు
పొమ్ము
అని
పలికెను.
శత్రుఘ్నుడు
సహితము
దిగ్గున
లేచి,
అంతకంటే
మహాభాగ్యమా
అని
సంసిద్ధమయ్యెను.
భరతుడు
రామాజ్ఞ
లేక
నిన్ను
పంపుట
మంచిది
కాదు.
నీ
విపుడు
వెళ్ళిన
రాముడు
అసంతృప్తిపడును
కాన,
అతని
ఆజ్ఞను
శిరసావహించుట
మన
కర్తవ్యము
అని
వోదార్చెను.
ఇచట
లంకాపట్టణమున
శ్రీరాముడు
లక్ష్మణుని
కాపాడుచుండెను.
ఇంతలో
అర్ధరాత్రియు
గతించెను.
వానరులందరు
రాముని
బరివేష్టించి
యుండిరి.
రాముడు
మానవమాత్రుడుగా,
ఓ
వానరులారా!
అర్ధరాత్రి
గతించెను.
ఇంతవరకు
హనుమంతుని
7
▾
Meaning
Keep
జాడ
కనబడలేదు.
ఒకవేళ
ద్రోణగిరి
మార్గము
తెలియక
మార్గము
తప్పి
కంగారుపడుచుండెనా?
నా
తమ్ముడు
దీర్ఘమూర్ఛయందున్నవాడు
అని
లక్ష్మణుని
చూచి
అతని
మోమును
ముద్దిడుకొని,
"తమ్ముడా,
యేనాడును
ఇంతకాలము
నన్ను
చూడకవుండినవాడవు
కాదు
కదా,
నిద్ర
అన్నది
లేక
నిరంతరము
నన్ను
కనిపెట్టుకొని
యుండువాడవు.
నిన్నటినుండియు
నన్ను
ఓదార్చువారు
లేక
నీ
పలుకులు
వినక
నేనెట్లు
భరించగలను?"
అని
అనేక
విధముల
పామరునివలె
పలుకజొచ్చెను.
ఇంతేకాక,
"ఓ
తమ్ముడా!
నా
నిమిత్తము
నీవు
తల్లిదండ్రులను,
సతిని
విడిచి
నాతో
వనమునకు
వచ్చితివి,
పదరాని
పాట్లు
పడితివి.
నా
కష్టములను
లేశమైనను
చూడలేకపోతివి.
నీస్వభావము
కోమలము.
నా
కొరకై
యెండకు
యెండి,
వర్షమునకు
తడిసి,
చలిబాధల
నోర్చి,
వేళకు
ఆహారము
లేక,
చిక్కిన
ఆహారమును
నాకందించి
నీవు
పస్తుపరుండెడివాడవు
కదా!
లక్ష్మణా!
అట్టి
నీ
ప్రేమను
పదురెండుగంటలనుండి
అనుభవించలేకపోతిని
కదా!
తమ్ముడా,
ఒక్కపరి
కన్ను
తెరచి
నన్ను
చూడు"
అని
గద్దము
పట్టి
ప్రాధేయపడునట్లు
పలుకుచుండిన
శ్రీరాముని
చూచి
కంటినీరు
పెట్టని
వానరుడు
కనిపించలేదు.
కొందరు
వానరులు
ఈ
వియోగబాధను
చూడలేక
పర్వతములు
యెక్కి,
వృక్షములు
యెక్కి,
హనుమంతుని
జాడలను
చూడదొడగిరి.
ఇంతలో
హనుమంతుడు
సంజీవినీ
పర్వతమును
పట్టుకొని
ప్రత్యక్షమయ్యెను.
కరుణారసముతో
వీరరసము
వచ్చి
కలిసినట్లు
హనుమంతుడు
వచ్చి
వానరులతో
కలిసెను.
వచ్చిన
హనుమంతుని
చూచి
వానరులు,
ధన్యులము
ధన్యులము,
నీవు
తెల్లవారక
మునుపే
రానియెడల
మేము
సముద్రమున
వడి
ప్రాణములు
వీడియుండెడివారము.
లక్ష్మణవియోగబాధ
భరించలేము.
మా
ప్రాణములు
కాపాడితివి,
నీ
ఋణమును
మేమెట్లు
తీర్చుకొందుమనిరి.
శ్రీరాముడు
సంజీవినీ
పర్వతమును
తీసుకొని
వచ్చిన
హనుమంతుని
చూచి
పరమానందభరితుడయ్యెను.
సుషేణుడు
నాలుగు
విధముల
(విశల్యకరణి,
సంధానకరణి,
సావర్ణ్యకరణి,
సంజీవకరణి)
మూలికలు
లక్ష్మణునికి
తగిలించెను.
తత్క్షణము
దిగ్గనలేచి
లక్ష్మణుడు
కూర్చొనెను.
అతనిని
చూచి
రాముడు
పరమానందముతో
కౌగిలించుకొని,
ముద్దాడి,
తమ్ముడా
తమ్ముడా,
ఇంతకాల
మెందుపోతివి
అని
ఆనందభాష్పములను
విడుచుచూ
బ్రహ్మానందమున
మునిగెను.
8
▾
Meaning
Keep
ఇది
ఇట్లుండ,
ఈ
సంజీవినీ
పర్వత
వాయువు
తగిలినందున
వానరులందరు
లేచి
కూర్చుండిరి.
వానరులందరూ
ఆ
లేచిన
వానరులను
కౌగిలించుకొని
వారునూ
బ్రహ్మానందమందిరి.
హనుమంతుని
వేవిధముల
కొనియాడిరి.
రాముడు
లక్ష్మణుని
ఆశీర్వదించి,
సుషేణునికి
రావణుని
ద్వారా
ఎట్టి
ఆపదా,
కీడు
కలుగకుండా
కాపాడుదునని
శపథము
చేసి,
అతని
గృహముతోపాటు
సంజీవిని
కూడా
సుషేణునికి
ఇచ్చి,
లంకలో
యథాస్థానమున
దింపిరమ్మని
హనుమంతుని
ఆజ్ఞాపించెను.
హనుమంతుడు
ఆనందముతో
గంతులు
వేయుచూ
తమ
ప్రభువు,
తమ
సోదర
వానరులు
బ్రతికినందున
పరమానందముతో
సుషేణుని
కొనియాడి
అతనికి
అనేక
విధముల
కృతజ్ఞత
చెప్పుచూ,
లంకలో
అతనిని
యథాస్థానమున
చేర్చెను.
తెల్లవారెను.
లంకలో
యుద్ధభేరీలు
మ్రోగెను.
వానరులు
అమితోల్లాసముతో
రామకటాక్ష
బలమును
చింతించుచు
అనేక
యేనుగుల
బలమున
గంతులు
వేసిరి.
బలవంతుడగు
ధూమ్రాక్షుడు
ఆనాడు
యుద్ధమునకు
సిద్ధమాయెను.
వచ్చిన
ధూమ్రాక్షుని
మహావీరుడు
ఢీకొని
రెండవదినమున
వధించెను.
పిమ్మట
అకంపనుడు
యుద్ధమునకు
వచ్చెను.
అతడు
మహావీరుడు,
పలువిధములుగ
భయంకరమైన
యుద్ధము
చేసెను.
యెదురుగా
అంగదుడు
పోరాడి
అకంపనుని
చంపెను.
అకంపనుని
మరణవార్త
వినగానే
ప్రహస్తుడు
ఉగ్రుడై
ఘీంకారము
చేయుచు
వచ్చెను.
అతనిని
నలుడు
యెదుర్కొని
ఘోర
యుద్ధముగావించి,
రామునిస్మరించి,
కుప్పించి
యెగసి
సంహరించెను.
ప్రహస్తుడు
నేలకూలగానే
మహోదరుడు
గర్జించుచూ
వచ్చెను.
అతనిని
చంపుటకై
సంసిద్ధముగా
వుండిన
హనుమంతుడు
మహావీరుడై
గర్జించుచూ
పండ్లు
పటపట
కొరుకుచు
మహోదరునిపై
పడి
అతనిని
ముక్కలుముక్కలు
చేసెను.
కుంభకర్ణుని
కుమారులైన
కుంభ
నికుంభులు
అనేకమంది
రాక్షసవీరులతో
యుద్ధమున
అయిదు
దినములు
వానరులతో
పోరాడిరి.
ఆరవ
దినమున
కుంభ
నికుంభులు
వీరస్వర్గము
నందిరి.
ఈ
ఘోరమును
చూచి,
లంకయందలి
రాక్షసులు
భయభ్రాంతులై
తమ
ప్రాణములు
యే
నిమిషమున
కోల్పోదుమో
అని
దిగులుపడి
దాగుకొనుటకు
పారిపోయిరి.
వానరులను
శరణుజొచ్చిరి.
రావణుని
అనేక
విధముల
9
▾
Meaning
Keep
తూలనాడిరి.
మండోదరి
దగ్గరకు
వెళ్ళి
మొరబెట్టుకొనిరి.
మండోదరి
కూడాను
రావణుని
దుర్భుద్ధికి
చింతించి
రాముని
ప్రార్థించెను.
ఇంతలో
మహాయోధుడగు
మకరాక్షుడు
యుద్ధముచేసెను.
అతనిని
లక్ష్మణుడు
యెదుర్కొని
సంహరించెను.
లక్ష్మణునిచే
ఇట్టి
సంఘటన
జరిగిన
తోడనే
వానరులు
జయ
జయ
శబ్దములు
జేసిరి.
మహాయోధులందరూ
నేలకూలిరన్న
వార్త
విని
రావణుడు
విలపించెను.
కుంభకర్ణుని
చెంతకు
పరుగిడి
అనేక
ప్రయత్నములు
చేసి
అతనిని
మేలుకొలిపెను.
అనేకమంది
రాక్షసులు
వెళ్ళి
కుంభకర్ణుని
కర్ణముల
చెంత
భేరీమృదంగములు
వాయించిరి.
కదలని
కుంభకర్ణుని
చూచి
కోపించి
రావణుడు
అనేక
ముష్టియుద్ధమువారలను
రప్పించి
గదలతో
ముష్టితో
తొడలపై
కొట్టించెను.
అంత
కుంభకర్ణుడు
కన్నులు
తెరచి
చూచెను.
రావణుడు
తన
గోల
చెప్పుకొనెను.
కొడుకుల
మరణవార్త
వినిపించెను.
తన
కొడుకులైన
కుంభ
నికుంభుల
మరణవార్త
వినగానే
మూర్తీభవించిన
కాలుని
వలె
కండ్లెఱ్ఱ
చేసి,
"ఓరీ
మూర్ఖుడా!
జానకి
జగజ్జనని;
ఆమెను
దొంగిలించినందున
నీకు
శుభములు
కలుగునా?
నీవు
చేసిన
పని
యే
మాత్రమూ
సహించరానిది,
నీ
దుర్బుద్ధిచే
లంకనే
నాశము
చేసుకొనుచున్నావు.
ఇకనైననూ
అభిమానము
వీడి
శ్రీరాముని
శరణుజొచ్చుము.
నీకు
శుభము
కలుగును.
పరువు
మర్యాదలను
విడచి
ధర్మమును
తూలనాడి
పరస్త్రీని
అపహరించుట
రాజధర్మమా?
ఇది
పరమార్థమా?
నీకు
తగిన
ఫలము
వచ్చెను.
రావణా!
శ్రీరాముడు
సామాన్యుడు
కాడు.
మోహముచే
కామాంధురాలైన
శూర్పణఖ
స్వార్థమునకు
దిగి
తన
వన్నాగమును
నెరవేర్చుకొనకపోవుటనే
ఆ
కామాంధురాలు
తగిన
శిక్ష
అనుభవించి,
నిన్నునూ
రెచ్చగొట్టి
ఈ
కిరాతక
చర్యలను
చేయించెను.
ఆడదాని
వాంఛలకు
విశ్వసించి
న్యాయాన్యాయములను
విస్మరించి,
చేతులార
చేటుతెప్పించుకొంటివి.
ఛీ!"
అని
రావణుని
తూలనాడెను.
అంత
రావణుడు
తన
తప్పును
కప్పిపుచ్చుకొని
ఈ
ఆపత్సమయమున
నన్ను
విడుచుట
న్యాయము
కాదు.
నీవు
యెట్లయిన
యుద్ధమునకు
సిద్ధము
కమ్ము.
నా
ప్రాణములు
కాపాడుమని
పరిపరివిధముల
కుంభకర్ణుని
బతిమాలెను.
విధిలేక
10
▾
Meaning
Keep
సోదరాభిమానముతో
కుంభకర్ణుడు
యుద్ధమునకు
సిద్ధమయ్యెను.
కడవలు
కడవలు
కల్లూ,
బుట్టలు
బుట్టలు
మాంసమూ
తెచ్చి
ముందు
పెట్టిరి.
కాలహరణము
చేయక
కుంభకర్ణుడు
ఆ
మాంసమద్యపానములు
ముగించి
రణరంగమునకు
బయలుదేరెను.
అతను
వచ్చుట
చూచి
విభీషణుడు
వాని
యెదుటకు
వెళ్ళి
పాదములకు
నమస్కరించి
తన
పేరు
చెప్పుకొనెను.
అతడు
తమ్ముడైన
విభీషణుని
లేవదీసి
కౌగలించుకొనెను.
అప్పుడు
విభీషణుడు,
సోదరా!
రావణుడు
నన్ను
సభలో
కాళ్ళతో
తన్ని
అవమానము
చేసెను.
నేను
పూర్వోత్తరముల
నాలోచించి
అతని
కెన్నియో
హితోపదేశములు
చేసితిని.
ధూర్తులైన
మంత్రుల
మాటలను
విశ్వసించి
నన్ను
వారల
ముందు
భరించలేని
అవమానపు
మాటలాడెను.
భరించలేక
నేను
శ్రీరాముని
శరణుజొచ్చితిని.
నేను
దీనుడని
తెలుసుకొని,
వారు
సర్వజ్ఞులు
కనుక,
నన్ను
స్వీకరించిరనెను.
"ఓయీ!
తమ్ముడా,
రావణునకు
మృత్యువు
సన్నిహితమైనది.
అందుచేత
వాడెట్లు
హితోపదేశములను
మన్నించును?
నిశ్చయముగా
నీవు
ధన్యుడవు,
రాక్షసకులమునకు
విభూషణము
వంటివాడవు.
ఆ
సుఖసాగరుని,
ఆ
రఘుకుల
రాముని
నీవు
సేవించుటవలన
రాక్షసకులమంతయూ
పవిత్రమయ్యెను.
ఇక
నీవు
శ్రీరాముని
సేవింపుము"
అని
కుంభకర్ణుడు
తమ్ముని
దీవించి,
తమ్ముడా,
నా
పక్షము
శత్రుపక్షమూ
విచారించక,
నేను
యుద్ధము
చేయవలెను.
నాకు
సహితము
కాలము
సమీపించెను.
నా
మతము
రావణునకు
తెలియును.
నీవు
స్వపక్ష
పరపక్షమను
భేదమును
విడచి
శ్రీరాముని
సేవింపుమనెను.
అట్లు
విభీషణుడు
కుంభకర్ణుని
దీవెనలను
తీసుకొని
రాముని
వద్దకు
వచ్చి,
"ఓ
నాథా!
ఆ
పర్వతాకారుడు,
ఆ
రణధీరుడు,
కుంభకర్ణుడు
మీతో
పోరాడుటకు
వచ్చెను"
అని
చెప్పెను.
విభీషణుని
మాటలు
వానరులు
విని
భరించలేక
క్రోధముతో
నిప్పులు
గ్రక్కుచూ
కుంభకర్ణుని
మీదికి
పరుగెత్తిరి.
వృక్షములు,
పెద్ద
పెద్ద
శిలలు
కుంభకర్ణునిపైకి
విసర
మొదలుపెట్టిరి.
కానీ,
వాని
మనస్సు
చలించలేదు.
దేహము
కదలించలేదు.
మదగజమును
కంటిరెప్పతో
కొట్టినట్లు
ఆ
భయంకరాకారుని
ఈ
వానరులు
యే
మాత్రమును
కదిలించలేకపోయిరి.
ఇంతలో
మహావీరుడు
హుంకరించి
కుంభకర్ణుని
నొక్క
గ్రుద్దు
గ్రుద్దెను.
ఆ
గ్రుద్దుతో
వ్యాకులపడి
వాడు
సొమ్మసిల్లెను.
వాడు
తెలివితెచ్చుకొని
లేచి
మహావీరుని
బలముగా
గ్రుద్దెను.
ఆ
గ్రుద్దుతో
మహావీరుడు
11
▾
Meaning
Keep
నేలకూలెను.
నలనీలులు
కలిగించుకొని
కుంభకర్ణునితో
పోరాడిరి.
కానీ
కుంభకర్ణుని
బలమునకు
తాళలేకపోయిరి.
వానరులు
భయపడిరి.
యెదట
నిలువలేకపోయిరి.
సుగ్రీవ,
అంగదాదులు
సహితము
సొమ్మసిల్లి
నేలపడిరి.
కుంభకర్ణుడు
సుగ్రీవుని
చంకలో
ఇరికించుకుని
తీసికొని
పోయెను.
కపిరాజును
పట్టుకొనుటవలన
వానర
సైన్యమును
జయించినట్లు
కుంభకర్ణుడు
తలంచెను.
ఇంతలో
వాయుపుత్రుడు
తెలివి
తెచ్చుకొని
సుగ్రీవుని
వెతుకుటకు
ప్రారంభించెను.
సుగ్రీవుడు
మూర్ఛనుండి
లేచి,
కుంభకర్ణుని
చంకనుండి
తప్పించుకొనుటకు
అనేక
విధముల
ప్రయత్నము
చేయుచున్న
దృశ్యమును
గాంచెను.
ఈలోవల
హనుమంతుడుకూడా
సమీపించెను.
సుగ్రీవుడు
కుంభకర్ణుని
నుండి
వేరై,
అతనితో
యుద్ధము
ప్రారంభించెను.
ఈ
విధముగా
యుద్ధముచేసి
కుంభకర్ణుని
ముక్కు
చెవులను
సుగ్రీవుడు
కొరికివేసెను.
పెద్ద
శరీరము
అగుటచే
శ్వాస
వెళ్ళుటకు
వీలుకాక
కుంభకర్ణుడు
నానా
అవస్థలు
పడెను.
ఇంతలో
"రామజయం"
"రామజయం"
అంటూ
వానరులు
వేలకు
వేలు
చేరి
వృక్షములు,
పర్వతములు
వర్షము
కురిపించిరి.
కుంభకర్ణుడు
ఉగ్రుడై
వానరులపై
దుమికి,
అనేకమంది
వానరులను
పట్టి
భక్షించెను.
మరికొంతమంది
అతని
చేతులలో
నలిగిపోయిరి.
ఈ
విధముగ
వానర
సైన్యము
చెల్లాచెదరు
చేసెను.
ఈ
దృశ్యమును
చూచి
శ్రీరాముడు,
లక్ష్మణుడు
మొదలగువారలతో
"ఇక
సహించజాలము.
నేనే
స్వయముగా
యుద్ధమునకు
దిగక
తప్పదు.
లక్ష్మణా!
ఆ
అక్షయ
తూణీరముల
నిటుతెమ్ము"
అని
పలికెను.
రామాజ్ఞను
శిరసావహించి
లక్ష్మణుడు
అక్షయతూణీరములను
అన్నకు
అందించెను.
కోదండము
ధరించి,
సింహము
వలె
శ్రీరాముడు
యుద్ధభూమికి
నడచుచుండ,
లక్ష్మణ,
సుగ్రీవ,
హనుమంత,
జాంబవంతాది
వానరులు
అతనిని
అనుసరించిరి.
రాముడు
ఱెక్కలు
గల
కాలసర్పములవంటి
బాణములను
ప్రయోగించెను.
ఆ
బాణములు
వాయు
వేగమున
నలువైపులా
ప్రసరించెను.
కోట్లకొలది
రాక్షసవీరులను
యోధులను
సంహరించెను.
శ్రీరాముని
బాణముల
బారికి
తాళలేక
రాక్షసులు
పారిపోయిరి.
అంత
విడచిన
బాణములు
తిరిగి
వచ్చి
రాముని
తరకసంచిలో
ప్రవేశించెను.
శ్రీరాముడు
రాక్షసులను
12
▾
Meaning
Keep
అంతమొందించెనని
తెలుసుకొని
కోపోద్దీప్తుడై
సింహనాదము
జేసి
కుంభకర్ణుడు
తిరిగి
యుద్ధమునకు
వెడలెను.
వానినిజూచి
వానరులు
పరుగులిడిరి.
చేయునది
లేక
రాముడు
బాణము
వానిపై
విసరెను.
అది
వెళ్ళి
కుంభకర్ణుని
భుజములను
ఖండించెను.
రెక్కలులేని
మందరపర్వతమువలె,
భుజముల
లేని
కుంభకర్ణుడు
ప్రకాశించెను.
సింహనాదము
చేయుచు
రామునిమీదికి
పరుగెత్తుకు
వచ్చెను.
రాముడు
ఆకర్ణాంతము
ధనుస్సులాగి
వాని
ముఖము
నిండునటుల
బాణములు
ప్రయోగించెను.
అయినను
కుంభకర్ణుడు
నేలబడక,
నిలిచి
వుండుట
చూచి
రాముడు
మఱొక
బాణమును
విసరెను.
ఆ
బాణముతో
కుంభకర్ణుని
శిరస్సు
తెగి
క్రిందపడెను.
రావణునకు
ఈ
వార్త
తెలియగనే
మణిని
పోగొట్టుకున్న
సర్పమువలె
చాలా
దుఃఖించెను.
భూమి
కంపించెను.
తలలేని
కుంభకర్ణుని
దేహము
పరుగిడుచుండుట
చూచి,
రాముడు
మరొక
బాణము
ప్రయోగించి
మొండెమును
రెండు
ముక్కలు
చేసెను.
అంతవాని
శరీరము
నుండి
వెడలిన
కాంతి
రామునిలో
చేరెను.
జపతపములు
లేకయే
రాక్షసుడు
ముక్తినొందెను.
ఈ
ప్రకారము
జగదేకవీరుడు
రణరంగమున
ప్రకాశించుచుండెను.
రాముని
ముఖారవిందమున
స్వేదబిందువులు
శోభించెను.
కుంభకర్ణుని
రక్తబిందువులు
శరీరముపై
పడి
కమలముపై
నీరు
నిలిచినటుల
కాంతితో
ప్రకాశించెను.
అంత
సాయం
సమయమయ్యెను.
ఉభయ
పక్షములవారునూ
హోరాహోరిగా
పోరాడి
విరమించిరి.
రామానుగ్రహముతో
వానరబలము
అధికమయ్యెను.
తృణముల
వలన
అగ్ని
ప్రజ్వరిల్లు
విధమున
వానరులు
విజృంభించిరి.
అహోరాత్రములు
రాక్షసులు
నశించిరి.
రావణుడు
అనేక
విధముల
విలపించెను.
మాటిమాటికి
తమ్ముని
శరీరమును
హృదయమునకు
హత్తుకొనుచూ
యేడ్వసాగెను.
మేఘనాధుడు
వచ్చి
అనేక
విధముల
తండ్రిని
ఓదార్చెను.
"రేపటి
దినమున
నా
ప్రతాపమును
చూపింతును;
ఒక్క
క్షణములో
వానరసైన్యమును
రూపుమాపుదును.
నేటి
దుఃఖమునకు
మించిన
ఆనందమును
అందింతును"
అని
వ్యర్థమగు
మాటలనెన్నియో
చెప్పజొచ్చెను.
ఇంతలో
తెల్లవారెను.
వానరభల్లూకములు
నగరమును
ముట్టడించెనని
చారుల
ద్వారా
తెలిసెను.
దానిని
గుర్తించి
రాక్షసులలో
వీరులు
శూరులు
అయిన
వారెందరో
13
▾
Meaning
Keep
యుద్ధమునకు
సిద్ధమై
వచ్చిరి.
ఎవరి
బలములు
వారు
వినియోగించ
మొదలుపెట్టిరి.
ఆనాడు
ఇరుపక్షములవారి
యుద్ధము
వర్ణనాతీతము.
మేఘనాధుడు
మాయారథమునారోహించి
అంతరిక్షమున
కెగసెను.
అంతరిక్షము
నుండి
ప్రళయకాలమేఘమువలె
గర్జించెను.
వాని
గర్జన
వినిన
వానరులు
భయమున
త్రుళ్ళిపడిరి.
భూమి
దద్దరిల్లెను.
ఒక
క్షణములో
మాయసీతను
కల్పించి
దానిని
రథముమీద
పెట్టుకొని,
రణరంగమునకు
వచ్చెను.
దానిని
మొదట
వాయుపుత్రుడు
చూచెను.
అంతలో
మేఘనాధుడు
"ఓరీ
హనుమా!
యెవరి
నిమిత్తమై
మీరు
యుద్ధమును
చేయుచుంటిరో
ఆ
జానకిని
చంపుచున్నాను
చూడము!
ఈమె
సంహారముతో
యుద్ధము
సమాప్తికాగలదు"
అని
పలికి
కత్తిని
తీసి
ఆ
మాయ
సీతను
రెండు
ముక్కలు
చేసి
క్రిందికి
విసరెను.
హనుమంతుడు
పట్టలేని
కోపముతో
వానరయోధులను
పిలిచి,
మీ
ప్రాణములపై
ఆశలు
వదలి
యుద్ధము
చేసి
రాక్షసుల
హతమార్చుడు
అని
హెచ్చరించెను.
వానరులు
ఘోరముగా
యుద్ధము
చేసిరి.
వానరుల
బారికి
రాక్షసులు
నిలువలేక
లంకలో
ప్రవేశించిరి.
ఆ
క్షణముననే
హనుమంతుడు
రాముని
చెంతకు
పరుగిడివచ్చి,
మేఘనాధుడు
చేసిన
దుర్వ్యాపారమున
తెలిపెను.
శ్రీరాముడు
ఆ
మాటను
వినగానే
విచారించినట్టుల
నటన
చేసెను.
అది
మాయ
సీతయని
రామునకు
తెలియకపోలేదు.
కానీ
సామాన్య
మానవునివలె
కొంత
లీలగావించెను.
లక్ష్మణుడు
కూడా
విచారపడి,
సీత
లేనప్పుడు
మనకీ
యుద్ధమేల
అని,
అట్టి
లోకమాత
లేని
ఈ
లోకము
నాకెందుకని
దుఃఖించెను.
ఈ
వార్త
విని
విభీషణుడు
వచ్చి
శ్రీరామునకు
నమస్కరించి,
"ఓ
నాథా!
తమకు
తెలియనిది
కాదు,
ఇది
అంతయూ
అసత్యము.
అతి
జాగరూకతతో
జానకి
కాపాడబడుచుండెను.
ఆమెను
రావణుడు
తప్ప
మరొకడు
తేరిచూడలేదు.
మిమ్మలను
మోహింపజేయుటకు
మేఘనాధుడు
మాయ
సీతను
కల్పించి,
దానిని
సంహరించెను.
మా
రాక్షసులలో
ఇట్టివి
సర్వసామాన్యము.
ఈ
విషయము
నాకు
బాగుగా
తెలియును"
అని
రామలక్ష్మణులకు
చెప్పెను.
రాముడు,
లక్ష్మణుడు
సంతసించి,
రాక్షసుల
మర్మమును
గుట్టుపెట్టుకొనక
తెలిపిన
విభీషణుని
మెచ్చుకొనిరి.
ఈ
సత్యమును
14
▾
Meaning
Keep
తెలుసుకొని
హనుమంతుడు
ప్రచ్చన్న
రూపమును
ధరించి
లంకలో
ప్రవేశించి
జానకిని
చూచి
వచ్చెను.
జానకి
క్షేమసమాచారమును
హనుమంతుడు
వానరులకు
తెలిపెను.
అంత
వానరులు
సంతసించి,
యుద్ధమునకు
నడచిరి.
మేఘనాధుడు
తిరిగి
ఎచ్చి
యుద్ధము
చేయనారంభించెను.
ఈ
సమయమున
బాణములు,
పరిఘలు,
కృపాణములు,
పరశులు,
ప్రచండపాషాణములు
మొదలగువాటిని
వాడు
వర్షించెను.
పట్టు,
కొట్టు
అను
భయంకర
శబ్దములు
వానరుల
చెవులపడుచుండెను.
కాని
యెవరు
యెవరిని
కొట్టుచుండిరో
వారికి
తెలియదు.
వానరులు
బీభత్సులైరి.
ఎటువైపు
వెళ్ళుటకు
వారికి
తోచలేదు.
మహాబలవంతులగు
నలుడునూ,
నీలుడునూ,
అంగదుడునూ,
హనుమంతుడునూ
సహితము
దిగులుపడిరి.
మేఘనాధుడు
లక్ష్మణ,
సుగ్రీవ,
విభీషణులపై
బాణములను
ప్రయోగించెను.
వారల
శరీరములు
చిల్లులు
పడెను.
వాటికి
లేశమైననూ
భయపడక
వారు
ఎదురు
తిరిగి
యుద్ధము
చేసిరి.
అంతవాడు
శ్రీరామునితో
యుద్ధము
చేయ
నారంభించెను.
సర్పముల
వంటి
బాణములు
మేఘనాధుడు
ప్రయోగించెను.
లీలా
మానుష
సూత్రధారి,
ఖరదూషణాంతకుడు
అగు
రాముడు
ఆ
సర్పాస్త్రమునకు
కట్టుబడెను.
యుద్ధమునకు
గౌరవము
వచ్చుటకు
శ్రీరాముడు
నాగాస్త్రముచే
బంధింపబడెను.
ఇది
శ్రీరాముని
సుగుణచరిత్రము.
మనోవాక్కాయములచేత
అతని
చరిత్రమును
తర్కించుటకు
శక్యము
కాదు.
శ్రీరాముడు
బంధింపబడుటచేత
వానరులు
చికాకుపడిరి.
భయభ్రాంతులకు
గురియైరి.
దీనిని
మేఘనాధుడు
చూచి
దుర్వచనములు
బలకుచూ
ప్రత్యక్షమయ్యెను.
ఆ
సమయమున
జాంబవంతుడు
వానిని
జూచి
"ఓరీ
దుష్టుడా!
నిలువుము"
అని
గర్జించెను.
అతని
మాటకు
మేఘనాధుడు
మండిపడి,
"ఓ
నీచుడా!
నీవు
వృద్ధుడవు.
నిన్ను
విడచితిని,
ఛీ!
నీ
మాటలు
నాకేమి
లక్ష్యము?"
అని
జాంబవంతునితిట్టి,
ఆయనపై
ఒక
త్రిశూలమును
ప్రయోగించెను.
ఆ
వచ్చుచున్న
త్రిశూలమును
జాంబవంతుడు
యెగిరి
పట్టుకొని,
దానిని
తిరిగి
మేఘనాధుని
మీదనే
బలముతో
సరెను.
అది
సూటిగా
మేఘనాధుని
హృదయమున
గుచ్చుకొనెను.
దానితో
మేఘనాధుడు
గిరగిర
తిరిగి
నేలకూలెను.
జాంబవంతుడు
మేఘనాధుని
పాదము
పట్టుకొని
గిరగిర
త్రిప్పి
నేలకొట్టెను.
"ఓరీ?
నేను
వృద్ధుడనా?
ఇప్పుడు
నీకు
నా
బలము
బాగుగా
తెలియును"
అని
త్రిప్పి
త్రిప్పి
కొట్టెను.
15
▾
Meaning
Keep
కాని
వానికి
మరణము
రాలేదు.
దానిని
జాంబవంతుడు
చూచి,
బాగా
త్రిప్పి
లంకలోనికి
విసిరెను.
పడిన
మేఘనాధుడు
తెలివి
తెచ్చుకొని
తన
ప్రతిజ్ఞను
పూర్తి
చేయలేదు
కదా
అని
తండ్రి
ముఖము
చూచుటకు
సిగ్గుపడెను.
ఆ
స్థలము
విడిచి,
లంకలో
నొక
యుపవనమున
"నికుంభిలా"
అను
ఒక
స్థలమున
ప్రవేశించెను.
అక్కడ
రాక్షసులనేక
తపములు
చేసి
వరములు
బొందిరి.
వాడు
అక్కడికి
వెళ్ళెను.
విభీషణుని
నలుగురు
మంత్రులు
అచట
గుప్త
వేషముతో
తిరుగుచుండిరి.
ఈ
వృత్తాంతమును
తీసికొని
వచ్చి
విభీషణునికి
తెలిపిరి.
విభీషణుడు
శ్రీరాముని
చెంతకు
వచ్చి
"ఓ
నాథా!
ఇప్పుడొక
సమాచారము
వింటిని.
మేఘనాధుడు
దుర్మార్గుడు,
మాయావి,
దేవకంటకుడు.
ఇప్పుడు
వాడొక
పాపయజ్ఞము
చేయుచుండెను.
వాని
యజ్ఞమే
సంపూర్తియైన
యెడల
వానిని
జయించుట
కష్టమనెను.
శ్రీరాముడు
విభీషణుని
మాటలను
విని
సంతోషించి
అంగద
హనుమంతులను
పిలిపించి
"ఓయీ
తమ్ములారా!
మీరందరూ
లక్ష్మణునితో
కూడివెళ్ళి
యజ్ఞమును
భంగము
చేయుడు.
ఓ
లక్ష్మణా!
నీవు
వానితో
యుద్ధము
చేసి
వానిని
జయింపవలెను.
దేవతలందరూ
దుఃఖించుచుండిరి"
అని
ఆజ్ఞాపించగనే,
విభీషణుడు,
సుగ్రీవుడు,
జాంబవంతుడు
యీ
మువ్వురు
కూడను
అనేక
మంది
సైన్యమును
కూర్చుకొని
లక్ష్మణునికి
సహాయముగా
వెళ్ళిరి.
లక్ష్మణుడు
ధనుర్బాణములను
ధరించి
అక్షయ
తూణీరమును
కట్టుకొని
శ్రీరామునకు
నమస్కరించి
రాముని
స్మరించుచు
వెడలెను.
అంగదుడు,
నలుడు,
నీలుడు,
మైందుడు
మొదలగు
యోధులు
హనుమంతుని
వెంట
నడిచిరి.
నికుంభిలా
స్థలమునకు
వారు
వెళ్ళునప్పటికి
మేఘనాధుడు
మహిష
మాంసమును,
రుధిరమును
హోమము
చేయుచుండెను.
ఇంతలో
వీరు
యజ్ఞమును
ధ్వంసము
చేయనారంభించిరి.
అయిననూ
వాడు
దీక్షను
విడువక
యుండెను.
అప్పుడు
వారు
వ్యాజస్తుతి
చేయనారంభించిరి.
అప్పటికిని
వాడు
లేవక
యుండెను.
ఇదే
సమయమని
వారు
మేఘనాధుని
జుట్టుపట్టుకొని
వానిని
పాదములతో
తన్నిరి.
అప్పుడు
వాడు
దిగ్గున
లేచి
త్రిశూలము
పట్టుకొని
వారి
మీదికి
వెళ్ళెను.
అంగదుడు,
హనుమంతుడును
వాని
నెదుర్కొనిరి.
వారిని
వాడు
త్రిశూలముతో
కొట్టెను.
ఆ
దెబ్బతో
వారు
నేలకూలిరి.
లక్ష్మణుడు
ఆ
త్రిశూలమును
రెండు
ముక్కలుగా
దునిమెను.
16
▾
Meaning
Keep
వాయుపుత్రుడునూ,
అంగదుడునూ
తెలివి
తెచ్చుకొని
వానిని
కొట్టిరి.
ఆ
దెబ్బలకు
వాడేమాత్రమూ
లొంగలేదు.
వాటిని
లక్ష్యము
చేయలేదు.
లక్ష్మణుడు
మృత్యుతుల్యమగు
బాణమును
వానిపై
ప్రయోగించెను.
పిడుగువంటి
లక్ష్మణుని
బాణములను
చూచి
వాడు
అంతర్ధానమయ్యెను.
అనేక
మాయావేషములను
వేసి
దొంగయుద్ధము
చేయుచుండెను.
లక్ష్మణుడు
సహించక
అమోఘములగు
బాణములను
సంధించి,
శ్రీరాముని
ప్రతాపమును
స్మరించి
విడచెను.
ఆ
బాణములు
వాని
హృదయమును
ఛేదించి
వానిప్రాణములు
తీసెను.
వాడు
రామా,
లక్ష్మణా
అనుచు
ప్రాణములు
వీడెను.
అంత్య
సమయమున
రామలక్ష్మణులను
స్మరించుటచే
అంగదుడు,
హనుమంతుడు,
విభీషణుడు
మేఘనాధుని
కొనియాడిరి.
నిరాయాసముగా
వాని
కళేబరమును
మహావీరుడు
ఎత్తిపట్టుకొని
లంకాద్వారమువద్ద
పెట్టి
వచ్చెను.
లక్ష్మణుడు
శ్రీరాముని
చెంతకు
వచ్చి
నమస్కరించెను.
శ్రీరాముడు
ప్రసన్నుడై
తమ్ముని
చూచి
మేఘనాధుని
మరణ
వార్త
విని
తమ్ముని
ముద్దాడెను.
విభీషణ,
హనుమంత,
నల,
నీల,
అంగదులను
చెంత
చేర్చుకొని
రాముడు
వారల
కౌగిలించుకొని
వారల
దేహమును
స్పృశించెను.
వారి
బాధలు
మటుమాయమై
గాయములు
ఎండిపోయెను.
శ్రీరాముని
ప్రసన్నతను
చూచి
వానరులు
సంతోషించిరి.
శ్రీరాముని
కటాక్షదృష్టి
వానరులపై
పడెను.
వారల
శ్రమ
అంతయూ
క్షణములో
నివారణమయ్యెను.
మేఘనాధుని
మరణవార్త
మేఘనాధుని
భార్య
అయిన
సులోచనకు
దాసీల
ద్వారా
తెలిసెను.
రావణుడు
దుఃఖములో
మునిగి
క్రోధముతో
పండ్లుకొరికి,
"అంతకాలము
ఈ
చిన్న
కార్యమును
మేఘనాధుడూ,
కుంభకర్ణుడూ
సాధించగలరని
తలంచితిని.
వారి
పురుషార్థమును
నేను
కన్నులారా
చూచితిని.
వానరుల
చేత
మేఘనాధుడు
సంహరింపబడుట
నాకు
సిగ్గగుచున్నది.
వానరులచేత
చంపబడువారు
యేపాటి
వీరులు?
ఓ
కులవధూ!
నీవు
శోకమును
విడిచిపెట్టుము.
నేను
వారివంటి
వీరుడనని
తలంచకుము.
ఒక
నాలుగు
గడియల
కాలములో
నీవు
శాంతించగలవు.
నా
బలపరాక్రమములను
ఘోరసంగ్రామములో
చూడగలవు.
నీ
భర్తను
చంపిన
శత్రువుల
శిరస్సులను
త్రుంచి
తీసుకొని
వచ్చెదను.
ఇందులకు
సందేహము
లేదు"
అని
సులోచన
చెంతకు
పోయి
ప్రగల్భముల
నాడెను.
కోపముచే
మండి
పడిపోయెను.
17
▾
Meaning
Keep
సౌశీల్యవతియైన
ఆ
సులోచన,
"హే
దశాననా!
ఇంకనూ
శత్రువులను
జయింపగలనను
ఆశ
కలదా?
మీరు
మహా
మోహాంధకారమున
బడియుంటిరి.
మామగారితో
ప్రతిభాషలాడుట
పాపమని
తలంచి,
వాదించుట
నిరర్థకమని
గ్రహించి
నాలో
నేను
మింగియుంటిని.
మీ
రోషమే
ఈ
లోకములోని
రాక్షసుల
నాశనమునకు
మూలకారణము.
మీరు
శ్రీరాముని
జయించలేరు.
ఇది
సత్యము,
సత్యము"
అని
దిగ్గున
లేచి
యేడ్చుకొనుచూ
మండోదరి
వద్దకు
వెళ్ళెను.
అత్త
చరణములు
పట్టి
నా
యీ
దుర్గతికి
నీ
పతియే
కారణమనియూ
నీకునూ
నేడో
రేపో
ఇట్టి
దుర్గతి
రాక
తప్పదనియూ
కఠినవాక్కులాడదొడగెను.
మండోదరి
కూడ
రావణుని
దుర్బుద్ధికి
విచారించి,
సులోచన
చెప్పిన
వాక్యములు
పరమసత్యములని
విలపించెను.
మండోదరి,
సులోచనలు
శ్రీరాముని
గుణ
గణములు
వర్ణించి
సీతయొక్క
సౌశీల్యమును
కొనియాడి,
కడకు
శ్రీరామదర్శనమైననూ
మనకు
కలిగిన
జన్మసార్థకమగుననని
తమలో
తాము
చింతించిరి.
రావణుడు
కోడలయిన
సులోచన
దుఃఖమును
చూడలేకపోయెను.
ఆమె
మాటలు
శూలములవలె
హృదయమున
నాటుకొనిపోయెను.
విపరీతముగా
దుఃఖించి
అంతటి
కుమారుని
కోల్పోతినికదా
అని
నేలకూలి
తలను
కొట్టుకొనుచూ
విలపిల్లెను.
ఇక
తాళలేక
శివాలయమునకు
వచ్చి
ప్రార్థించెను.
అంత
మంత్రులు
వచ్చి
"ఓరాజా!
యెందులకు
వ్యర్థముగ
విచారించెదరు.
ఆకాశముమీది
మేఘములవలె
ధనము,
పుత్రులు,
పతులు,
సతులు
మొదలగునవన్నియూ
నశ్వరములు.
మేఘములోని
మెరుపువలె
జీవనము
క్షణభంగురము.
ఈ
సంగతి
తెలిసికూడ
మీరింత
మోహమున
మునుగుట
మంచిది
కాదు.
ముందుస్థితిని
విచారింపుడు.
శత్రువులను
నశింపజేయుటకు
తగిన
యుపాయమును
జూడుడు"
అని
యెన్నియో
విధముల
ఓదార్చిరి.
Previous
←
The Entry into Laṅkā
Next
Ahirāvaṇa
→