Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · Ahirāvaṇa
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
11
అహిరావణుడు
అంత
నాలుగు
గడియలు
రాత్రి
గతించెను.
రావణుడు
ఇరువది
చేతులు
జోడించుకొని
శివునికి
నమస్కరించెను.
పాతాళములో
నుండిన
అహిరావణుని
మనసు
భ్రమించెను.
ఎందుచేత
రావణుని
మనసు
వ్యాకులమయ్యెను
అని
వాడు
చింతించి
మనస్సున
అనుమానించి,
లోకమంతయూ
వానికి
వశము,
వానిని
జయించు
వీరుడు
లేడు
అని
చింతించెను.
నిజముగా
వాడు
కామదదేవిని
తప్ప
మరియొకరిని
ఉపాసింపడు.
ఆ
దేవిని
ధ్యానించెను.
రావణుని
జాడను
ధ్యానమున
కనిపెట్టి
రావణుడు
వుండిన
శివదేవాలయము
దగ్గరకు
వచ్చెను.
అహిరావణుడు
తన
పేరు
చెప్పుకొని
రావణునకు
నమస్కరించెను.
అహిరావణుడు
తండ్రిని
చూచి
విచారమునకు
కారణము
లడిగెను.
రావణుడు
శూర్పణఖ
ముక్కు
చెవులు
కోసినది
మొదలు
అప్పటివరకూ
జరిగిన
విషయములు
చెప్పెను.
ఆ
మాటలు
విని
అహిరావణుడు
చింతాక్రాంతుడై,
"ఓ
రావణా!
లోకములో
నీతిమార్గము
సర్వజనాదరణీయము.
ఆ
మార్గమును
విడిచి
అధర్మమార్గమును
అనుసరించుట
వలన
భయము
కలుగును.
పూర్వోత్తరములను
విచారించక
నీవు
వైరమును
ప్రకటించి
యుద్ధమునకు
దిగితివి.
అందువలన
నీ
వంశమును
నీవు
నాశము
చేసుకొంటివి.
మనుజుని
ప్రతాపమును,
ప్రభావమును,
నీకు
తెలియదు.
అందరికంటే
గొప్పవానిని
నీవు
మిక్కిలి
తక్కువవానిగా
భావింతువు.
నేనీ
మాటలను
చెప్పదగదు.
నేను
రామలక్ష్మణులను
హరించి
పాతాళమునకు
గొనిపోదును.
అక్కడ
నా
కామదదేవికి
బలియిత్తును.
రాక్షసవంశమునకు
సంపూర్ణ
యశస్సును
తీసుకొనివత్తును"
అని
రావణునకు
జెప్పి,
నమస్కరించి,
దేవిని
స్మరించి
శ్రీరాముని
...టకమునకు
వచ్చెను.
2
▾
Meaning
Keep
అహిరావణుడు
స్వమాయాబలముచేత
వానర
సైన్యములను
గాఢాంధకారముతో
కప్పెను.
ఎవని
హస్తము
వానికి
కనబడనంత
చీకటి
క్రమ్మియుండెను.
వానర
యోధులు
జాగరూకులై
యుండిరి.
వారి
కటకములో
ప్రవేశించుటకు
కాలుడు
సహితము
వెనుదీయును.
అపుడు
ఒక
యుపాయమును
మహావీరుడు
పన్ని
తోకను
పెంచి
దానితో
గుండ్రముగా
ఒక
మహోన్నతమగు
కోటను
కట్టెను.
కుండలము
కట్టియుండిన
సర్పరాజువలె
అతడు
కుండలాకారముగ
దానిని
నిర్మించెను.
ఆ
కోట
సింహద్వారమువద్ద
మహావీరుడు
కూర్చొనెను.
అహిరావణుడు
ఆ
చిత్రమును
చూచి
మనస్సులో
దిగులుపడెను.
ఒక
ఉపాయమయిననూ
వాని
బుద్ధికి
తోచలేదు.
అప్పుడు
వాడొక
కపటవేషమును
ఆలోచించి
విభీషణుని
వేషమును
ధరించెను.
మెల్లగా
మహావీరుని
దగ్గరకు
వచ్చెను.
మహావీరుడు
స్వభావసిద్ధముగా
మహాప్రతాపుడు.
కపటవేషము
వేసిన
అహిరావణుడు
"ఓ
సఖుడా!
నేను
రాముని
వద్దకు
వెళ్ళవలెను.
నేను
దీనికి
పూర్వము
శ్రీరాముని
ఆజ్ఞను
గైకొని
సంధ్యావందనము
చేయుటకు
వెళ్ళియుంటిని.
సంధ్యావందన
మయ్యెను.
శ్రీరామ
దర్శనము
నిమిత్తము
వెళ్ళవలెను.
తక్షణమే
వెళ్ళకున్న
స్వామి
ఆజ్ఞను
మీరినవాడనగుదును.
కనుక
నన్ను
త్వరలో
లోపలకు
విడువుము"
అని
కపటపు
మాటలాడెను.
ఆ
మాటలు
సత్యమని
మహావీరుడు
నమ్మి
నిజముగా
విభీషణుడే
అని
తలంచి
వానిని
లోనికి
విడిచెను.
అహిరావణుడు
లోనికి
వెళ్ళెను.
ఆసమయమున
అలసి,
నలుడు,
నీలుడు,
సుగ్రీవుడు
తదితరయోధులు
నిద్రించుచుండిరి.
శ్రీరాముడు
కూడ
పడుకొనియున్న
లక్ష్మణుని
మీద
హస్తము
పెట్టుకొని
నిద్రించుచుండెను.
కపట
విభీషణుని
వేషమును
ధరించి
వచ్చుచున్న
అహిరావణుడు
రాముని
దృష్టికి
రాకపోలేదు.
కానీ
లీలామానుషవిగ్రహుడు,
రాక్షస
సంహారనిమిత్తమై
అవతరించెను.
కనుక,
రావణుని
సంతతినంతయు
హతమార్చవలెను.
అందువలన
ఏమీ
తెలియనివానివలె
సామాన్య
మానవులకు
గోచరమగురీతిగా
ఈ
నాటకములు
ఆడదొడగెను.
ఏయే
కాలమునకు
ఏయే
ప్రదేశముల
ఎవరెవరిని
హతమార్చవలెనో,
ఎవరితో
ఎవరిని
చంపించవలయునో,
అది
అన్యుల
తరముకాదు.
అందువలన
తన
నాటకము
తన
ఊహలలోనే
జరుపవలెను.
3
▾
Meaning
Keep
ఇది
యిట్లుండ,
ప్రవేశించిన
కపటవేషధారియైన
అహిరావణుడు
మోహన
మంత్రము
జపించి,
వానరయోధులను
నిద్రయందు
ముంచి
రామలక్ష్మణులను
పాతాళ
లోకమునకు
బంధించి
తీసుకొనిపోయెను.
కొంతకాలములోనే
వానర
యోధులు
లేచిచూడ
రామలక్ష్మణులు
లేరు.
వారు
పరుండిన
స్థానము
మహాలోతైన
గోయిగా
ఏర్పడియుండెను.
దీనిని
చూచి
వానరయోధులలో,
హాహాకారము
పుట్టెను.
చంద్రుడు
లేని
రాత్రివలె
జలములేని
కమలములవలె
కళాహీనులై
పడిరి.
వానరులు
వెల
వెలబోయిరి.
ఒక్కొక్క
రొక
దిశ
వెతుకుటకు
బయలుదేరిరి.
సముద్రపు
గట్టునకు
వెళ్ళిరి.
కటకము
చుట్టూ
ఎన్నో
విధముల
వెతికిరి.
రామలక్ష్మణుల
జాడయే
కనుపించలేదు.
దుఃఖాక్రాంతులయిరి.
ధైర్యమును
విడనాడి
శోకసంతప్తమానసులై
"రాక్షసులందరూ
నశించిరి.
ఒక్క
రావణుడు
మాత్రమే,
ఆ
దురభిమాని
ఒక్కడే
హతశేషుడు.
అయ్యో,
దౌర్భాగ్యమునకు
గురియైతిమే"
అని
పలువిధముల
వానరులు,
వానరయోధులు
విలపించిరి.
సుగ్రీవుడు
మూర్చిల్లెను.
ఈ
సమాచారము
ఇంతవరకూ
విభీషణునికి
తెలియదు.
విభీషణుడెక్కడ
అని
వెతకుచుండ
అతడు
సంధ్యావార్చుకొని
తడిబట్టలతో
సముద్రముకడనుండి
వచ్చుచుండెను.
అతనిని
చూచి
వానరులు
మహాదుఃఖముతో
రామలక్ష్మణులు
కనుపించలేదన్న
వార్తను
తెలిపి,
రోదన
చేసిరి.
విభీషణుడుకూడ
క్షణము
విచారించి
తరువాత
రాక్షసుల
మాయలు
తనకు
బాగుగా
తెలియును.
కనుక,
"విచారించకుడు,
రండి.
కటకమునకు
వెళ్ళుద"మని
వారిని
ఓదార్చి
కటకమునకు
వచ్చెను.
మహావీరుని
అడుగగా,
మీరే
ఇంతకు
పూర్వము
వచ్చి
నా
అనుజ్ఞ
వడసి
లోనికి
వెళ్ళితిరి
కదా
అని
నిర్ఘాంత
వచనము
లాడెను.
అది
గమనించి
విభీషణుడు,
"ఓ
వానరులారా!
విచారించకుడు.
ఈ
మాయలు,
రావణుని
కుమారుడైన
అహిరావణునకు
బాగుగా
తెలియును.
వాడు
పాతాళమున
నివసించుచున్నాడు.
ఈ
భూమి
యొక్క
లోయను
చూడ
తప్పక
వాడే
శ్రీరామలక్ష్మణులను
పాతాళమునకు
గొనిపోయి
యుండును.
ఇందు
సందియము
లేదు"
అని
దృఢముగా
పలికెను.
నా
వేషమును
వాడుతప్ప
మరియొకడు
ధరింపలేదు.
వాడు
మహామాయావి.
ఆలస్యము
చేయక
మనలో
యెవరైనా
బలవంతుడు
పయనమై
వెళ్ళుట
మంచిదని
కోరెను.
అటుఇటు
చూచి
విభీషణుడు,
"ఓ
హనుమంతుడా!
నీ
బలపరాక్రమములు
4
▾
Meaning
Keep
లోకవిదితములు,
నీవు
శీఘ్రముగా
పోయి
ఆ
కృపా
సాగరుల
నిరువురినీ
తీసుకొని
రమ్ము"
అని
పాతాళమునకు
పోవు
మార్గములన్నియు
వివరించెను.
సుగ్రీవుడు,
అంగదుడు,
జాంబవంతుడు,
హనుమంతుని
అనేక
విధముల
అడుగుకొనిరి.
హనుమంతుడు
"మహారాజా,
శెలవు"
అని
సుగ్రీవునితో
ఆజ్ఞ
తీసుకొని
వానర
యోధులకూ,
వానరులకూ
మరేమాత్రము
భయపడకుడనియు,
ఎవ్వరైననూ
సరే,
రాక్షసులతో
పోరాడుడు,
క్షణ
కాలములో
రామానుగ్రహముండిన
శ్రీరామలక్ష్మణులతో
మీ
ముందు
నిలుతును
అని
జైరామా
జైరామా
అని
గర్జించి
వెడలెను.
అతను
వెదలి
వెదలి
అలసి
ఒక
చెట్టుక్రింద
కూర్చొనెను.
ఆ
వృక్షము
మీద
నివసించెడి
రెండు
పక్షులు
ఒకదానితో
ఒకటి
సంభాషించుచుండెను.
పక్షిభాష
ఎరిగినవాడగుటచే
హనుమంతుడు
ఆ
వాక్యములను
శ్రద్ధగా
వినదొడగెను.
అందులో
మగపక్షి,
"ఓ
ప్రియురాలా!
అహిరావణుడు
శ్రీరామలక్ష్మణులను
నిన్నటి
దినము
తీసుకొని
వచ్చెను.
వాడు
నేడే
తన
దేవియైన
కామదకు
వారిని
బలియిచ్చుటకు
అన్నియూ
సిద్ధము
చేసుకొనుచున్నాడు.
బలియిచ్చిన
తరువాత
ఆ
కళేబరములను
పారవేయును.
పవిత్రమైన
ఆ
దేహములను
మనము
తినవచ్చును.
ఈనాడు
మనకు
పండుగ
దినము"
అని
చెప్పుచుండెను.
ఆంజనేయుడు
విని
దిగ్గనలేచి
శ్రీరాముని
స్మరించుచూ,
తోకత్రొక్కిన
పామువలె
రౌద్రుడయి,
నా
రామప్రభువులు
ఇప్పటికేమయివుందురో
ఆలస్యము
చేయరాదని
రివ్వున
ఎగిరి
పాతాళమున
దిగెను.
అహిరావణుని
నగరమును
ప్రవేశించెను.
కాని
ద్వారము
వద్ద
మకరధ్వజుడను
వానరుడు
నిలిచియుండెను.
వాడు
ఈ
మహావీరుని
ఎదిరించెను.
కడకు
వాని
పుట్టుపూర్వోత్తరముల
నెరింగి
మంచిమాటలతో
శ్రీరామలక్ష్మణుల
విషయము
తెలుసుకొనెను.
ఈనాడు
ప్రొద్దుగుంకులోపల
రామలక్ష్మణులను
దేవికి
బలియిచ్చుటకు
అన్నియు
సిద్ధము
చేసెనని
మకరధ్వజుడు
చెప్పెను.
హనుమంతుడు
"ఓయీ,
వారు
నివసించు
స్థలమేది"
అని
అడుగగా,
మకరధ్వజుడు
అన్ని
విధముల
వివరములు
తెలిపెను.
కానీ
"నేను
ప్రభువు
కార్యమున
నీమించబడితిని
కనుక
నాకే
బాధలు
సంభవించిననూ
నిన్ను
మాత్రము
లోపల
విడువను.
మన
జాతి
అభిమానము
చూపి
నిన్ను
మాత్రము
లోవల
విడువను.
నిన్ను
లోనవిడిచిన
నేను
మనజాతికే
అప్రతిష్ఠ
5
▾
Meaning
Keep
కలిగించినవాడనగుదును.
నీకు
నీ
రామప్రభువెంత
ప్రధానమో
నాకు
నా
ప్రభువైన
అహిరావణుడు
అంత
ప్రధానము
కాన
మన
యిద్దరికి
ఎంత
సన్నిహిత
సంబంధమున్ననూ,
ప్రభువాజ్ఞ
మీరను
కాన
నీవు
నన్ను
జయించి
లోపలకు
వెళ్ళవచ్చు"నని
మకరధ్వజుడు
నీతివాక్యములాడెను.
అందులకు
హనుమంతుడు
సంతసించి,
యుద్ధమునకు
సిద్ధమై
అనేక
విధముల
వానితో
పోరాడెను.
కడకు
కాలహరణము
చేయుట
మంచిదికాదని
తలంచి
హనుమంతుడు
మకరధ్వజుని
తన
వాలముతో
చుట్టి
దూరముగా
విసిరి,
లోన
ప్రవేశించెను.
ఆ
సమయమున
ఒక
మాలాకారుడు
పుష్పమాల
తీసుకొని
లోనకు
వెళ్ళుచుండెను.
ఇది
మంచి
సమయమని
హనుమంతుడు
అణురూపమును
ధరించి,
ఆ
మాలలో
కించిత్భారమైననూ
లేక
అతి
తేలికగా
ఎవరికి
కనుపించక,
అనుమానమునకు
అవకాశము
లేక
రాక
వుండునట్టు
చేరెను.
పూలమాలను,
అహిరావణుడు
దేవిని
పూజించి
మెడలో
వేసెను.
అనేక
విధముల
పదార్థములతో
దేవికి
నైవేద్యము
జేసెను.
చేసిన
నైవేద్యము
లన్నింటినీ
హనుమంతుడు
నోరుతెరచి
భుజించెను.
దీనిని
చూచి
చుట్టు
చేరిన
రాక్షసులందరూ
నేడు
దేవి
మహారాజునకు
ప్రత్యక్షమయినదని
సంతసించిరి.
మహారాజు
సహితము
ఈనాడు
నా
భాగ్యము
పండెనని
ఆనందించెను.
ఇంతలో
శ్రీరామలక్ష్మణులను
బలిపశువులకు
అలంకారములు
చేసినట్లు
అలంకరించి,
అటుఇటు
రాక్షసులు
పట్టుకొని
బలిపీఠమునకు
తీసుకొని
వచ్చుచుండ
మహావీరుడు
చూచెను.
రాముడే
చింతించుచూ
లోలోన
నమస్కరించెను.
అహిరావణుడు
రామలక్ష్మణులను
దేవిముందు
నిలబెట్టి
వారి
కుత్తుకల
మీద
కత్తులు
పెట్టించి
మహాబలవంతులైన
రాక్షసులను
సిద్ధపరచెను.
"దేవికి
మంగళహారతి
యిచ్చిన
తత్క్షణమే
ఆజ్ఞాపింతును.
మీరు
బలి
యిచ్చుటకు
సర్వవిధములా
సిద్ధముగా
వుండు"దని
ఆ
రాక్షసులకు
అహిరావణుడు
ఆజ్ఞాపించెను.
లీలామానుషవిగ్రహులైన
రామలక్ష్మణులు
దేవి
నైవేద్యమును
భుజించినవాడు
హనుమంతుడని
తెలిసికొని
లోలోన
సంతసించుచుండిరి.
చిరునవ్వులు
చిందులు
త్రొక్కుచున్న
ఆ
రామలక్ష్మణులను
చూచి
అహిరావణుడు
రౌద్రుడై,
క్షణకాలం
జీవితమునకు
ఇంతటి
ఆనందమా?
పదుడు,
కొన్ని
నిమిషములలో
యమరాజ్యమున
ఆనందింతురు
అని
కఠినమైన
వాక్కులు
ఆడుచూ,
వారలను
లక్ష్యము
చేయక
6
▾
Meaning
Keep
చులకనగా
పలుకుచుండెను.
రాక్షస
పురోహితుడు
లేచి,
రాజనీతి
ననుసరించి
శ్రీరామలక్ష్మణులకు
వారి
రక్షితులను
తలంచుటకు
అవకాశము
ఇవ్వవలెనని
అహిరావణునితో
తెలిపెను.
ఆ
రాక్షసుడు
లేచి,
ఓ
రాజకుమారులారా!
మీ
హితమును
కోరువారుండిన
వారిని
చింతించుడు.
కాలము
సమీపించినది
అని
గర్జించెను.
అప్పుడు
రామలక్ష్మణులు
ఒకరి
ముఖము
నొకరు
చూచుకొని
చిరునవ్వులు
నవ్విరి.
ఆ
సమయమున
మహావీరుడైన
ఆంజనేయుడు
గర్జించెను.
అతని
మేఘగర్జనను
రాక్షసులు
విని,
దేవి
ప్రత్యక్షమైనదని
హడలిపోయిరి.
పెద్ద
నోరు
తెరచి,
ఓరి
అహిరావణా!
నీవుచేయు
పని
ఏ
మాత్రమూ
సరియైనది
కాదు.
కపటవేషమును
ధరించి
ఈ
దేవదేవుని
తెచ్చితివి.
ఇట్టి
దుర్మార్గపు
పని
దేవి
మాత్రము
అంగీకరించునా?
యనెను.
వాయువు
వీచినపుడు
జలము
అల్లకల్లోలమగునట్లు
దురభిమానులగు
రాక్షసులు
భయముచే
చలించిరి.
ఒక్కక్షణములో
భయంకర
రూపమును
ధరించి
మహావీరుడైన
హనుమంతుడు
ఆ
దేవి
చేతియందుంచిన
పదునైన
ఖడ్గమును
చేతపట్టి
అహిరావణుని
ముక్కలు
ముక్కలు
జేసెను.
కానీ
వాని
దేహము
వజ్రదేహము.
ఎన్ని
పర్యాయములు
కొట్టిననూ
ముక్కలవలె
విరుగును
కానీ
తిరిగి
అతుకుకొనుచుండెను.
కడకు
రాముని
మదిలో
తలంచి
జైరామా
అని
శిరస్సును
ఒకచేతియందుంచుకొని
మరొక
చేతితో
గొంతును
కోసి
హోమగుండములో
వేసెను.
ఇంతలో
మకరధ్వజుడు
ఎదురయ్యెను.
తత్క్షణము
ఆ
అహిరావణుని
శిరస్సున
నున్న
కిరీటమును
మకరధ్వజుని
తలపై
పెట్టి
అతనికి
రాజ్యాభిషేకము
చేసి,
నిరంతరం
రామలక్ష్మణులను
చింతించుచుండుమని
మకరధ్వజునకు
ఉపదేశించి,
శ్రీరామలక్ష్మణులను
తన
రెండు
భుజముల
మీద
కూర్చొనబెట్టుకొని
ఒక్క
యెగురులో
లంకను
జేరెను.
వేయికన్నులతో
ఎదురు
చూచుచుండిన
వానర
యోధులు,
వానరులు,
విభీషణాదులు
రామలక్ష్మణులను
చూచి
పట్టలేని
ఆనందమొందిరి.
సుగ్రీవుడు
వచ్చి
రామలక్ష్మణులకు
నమస్కరించి,
హనుమంతుని
కౌగిలించుకొని
మా
ప్రాణముల
కాపాడిన
మహావీరుడవు,
నీ
ఋణమును
ఏ
రీతిగానూ
తీర్చుకొనలేమని
వర్ణించిరి.
వానరులందరూ
హనుమంతుని
వేయివిధముల
పొగిడిరి.
అతనిని
ఎత్తుకొని
ముద్దాడిరి.
కౌగిలించుకొనిరి.
వారల
ఆనందమునకు
అంతులేకపోయెను.
అంత
విభీషణుడు
ఆనందభాష్పములు
విడుచుచూ
"శ్రీరామా,
నీ
లీల
లనంతములు.
నీ
7
▾
Meaning
Keep
కార్యము
నీకు
తప్ప
అన్యుల
కర్థము
కాదు.
పాతాళలోకముననున్న
రాక్షసులను
కూడా
హతమార్చ
సంకల్పించి
ఇంత
నాటకమాడుచున్నావు"
అని
వర్ణించుచూ
నమస్కరించెను.
రామలక్ష్మణులను
హనుమంతుడు
తెచ్చుకొన్నాడన్న
వార్త
రావణునికి
తెలిసెను.
తన
కుమారుడైన
అహిరావణుడు
కూడా
హతుడయ్యెనని
తలంచి
విలపించెను.
నేలకూలెను.
వాని
నేత్రముల
నుండి
నీరు
కాలువలై
ప్రవహించెను.
అపుడు
మండోదరి
రావణుని
వద్దకు
వచ్చి
పలు
విధముల
అతనిని
వోదార్చెను.
కానీ
వాడు
…మాత్రమును
ఆమె
మాటలను
లెక్కచేయక
రౌద్రుడై
ధైర్యము
తెచ్చుకొని
దిగ్గున
….
ఆ
సమయమున
ఒక
మంత్రి
అతని
దగ్గరకు
వచ్చెను.
అతని
పేరు
…రనాథుడు.
వయోవృద్ధుడు,
మహాజ్ఞాని.
అతను
దీనికి
పూర్వము
యెల్లప్పుడు
…షణుని
వద్ద
వుండెడివాడు.
అతను
అనేక
విధముల
నీతి
వాక్యముల
…నారంభించెను.
అతని
జ్ఞానోపదేశములు
ఆ
రావణుని
చెవిలోబడలేదు.
అంతటితోపోక
అతనికి
ఆ
వాక్యములు
పరమఅసహ్యముగా
తోచెను.
ఇంపుగా
లేకపోయెను.
అతని
చేష్టలకు
మంత్రి
విచారించి,
వినాశకాలే
విపరీత
బుద్ధిః
ఇతనికి
వినాశకాల
మాసన్నమయినది
కనుక,
హిత
వాక్యములను
యిష్టపడకున్నాడని
తనలోతాను
తలంచి,
రావణుని
ప్రాపంచరీతుల
వోదార్చెను.
అంత
రావణుడు
ఇక
నా
వంశమే
నాశనమయ్యెకదా.
హతశేషుడెవ్వరూ
లేకపోయెను
అని
విచారించెను.
ఇంతలో
వృద్ధమంత్రి,
మహారాజా!
ఎందుకట్లనుచున్నారు?
నరాంతకుడని
ఒక
కుమారుడున్నాడు
కదా!
అతడు
డెబ్బదిరెండుకోట్ల
రాక్షసులకు
ప్రభువు.
దూతను
పంపి
వానిని
పిలిపించుడు.
నీ
శత్రువులను
నిశ్చయముగా
సంహరించును,
అని
చెప్పిన
మాటలను
విని
రావణుడు
సంతసించెను.
అంత
ధూమకేతుడను
దూతను
రప్పించి
నీవు
మహాచతురుడుగా
నా
కుమారుని
తీసుకొని
రమ్ము
అని
వాని
ఊరు
పేరులు
వివరముగా
చెప్పి
పంపెను.
రావణుని
ఆజ్ఞప్రకారము
దూతవెళ్ళి
జరిగిన
వృత్తాంతమంతయు
నరాంతకునకు
చెప్ప,
వాడు
మండిపడి
తత్క్షణమే
బయలుదేరి
వచ్చెను.
8
▾
Meaning
Keep
వచ్చీరావడముతోనే
వానర
సైన్యముపై
బడెను.
హనుమంతుని
నరాంతకుడు
చూచెను.
"ఓయీ!
ఇట్లు
పరుగెత్తి
వచ్చిన
వాడెవడు?
అతని
శరీరమంత
భయంకరముగా
నున్నదేమిటి?"
అని
నరాంతకుడు
అడిగెను.
ధూమకేతువు
"స్వామీ,
అతడే
హనుమంతుడు.
మహావీరుడు,
బలవంతుడు.
మీ
సోదరుల
నందరినీ
హతము
చేసినవాడు,
లంకను
భస్మమొనరించినవాడును
అతడే"
అని
తెలిపెను.
అంత
నరాంతకుడు
మండిపడి,
ధనువుకు
బాణము
సంధించెను.
హనుమంతుడు
వాటిని
బట్టుకొని
రెండు
ముక్కలుగా
ఖండించెను.
వాని
గుండెను
ముష్టితో
పొడిచెను.
వానిని
గిరిగిరత్రిప్పి
రసాతలమునకు
విసిరివేసెను.
తరువాత
కోట్లకొలది
వాని
సైన్యమును
కొట్టి
సముద్రమున
త్రోసెను.
రథములు,
సారథులు,
చూర్ణములైరి.
ఈ
ఘోరమైన
వార్త
రావణునకు
తెలిసి
నిలువునా
కూలిపోయెను.
ఇంతటి
ఘోరయుద్ధము
జరుగుననని
కలనైనా
తలచలేదు.
నరాంతకుని
నేల
కూల్చిరన్న
వార్త
లంక
కంతటికి
భీకరమైన
వార్తగా
చెలరేగెను.
మహాపండితులు
వచ్చిరి.
రావణుని
అనేక
విధముల
ఓదార్చిరి.
హితోపదేశములు
చేసిరి.
వారు
చెప్పిన
మాటలు
ఏవియూ
రావణుని
తలకు
చేరలేదు.
రావణుడు
మూర్ఛనుండి
లేచెను.
కోడలు,
నరాంతకుని
భార్యయయిన
బిందుమతిని
చూచి
ఆమె
రోదన
విని
భరించలేని
దుఃఖముతో
మండిపోవుచున్న
కోపముతో
దేహమునే
మరచెను.
ఈ
విధముగా
విలపించుచుండగనే
తెల్లవారెను.
నాలుగు
సింహద్వారముల
వద్ద
వానరులు
వచ్చి
యుద్ధమునకు
సిద్ధముగా
నున్నారన్న
వార్త
వినెను.
రావణుడు
రాక్షసయోధులను
పిలిచి
వారితో
ఇట్లు
ప్రసంగించెను.
"ఓ
యోధులారా!
యుద్ధము
చేయుటకు
మీ
గుండెలు
జారిన
యెడల
మీరిప్పుడే
యుద్ధము
నుండి
మరలుట
యుచితము.
యుద్ధము
చేయుచూ
నగరమునకు
పారిపోయిన
మంచిది
కాదు.
అట్లు
చేసితిరేని
నేనోర్వను.
నా
చేతులతో
మీ
ప్రాణములు
తీయుదును"
అని
ఈ
ప్రకారముగా
చెప్పి
వాయువేగము
వంటి
రథమును
సిద్ధము
చేసెను.
రణభేరులు
మ్రోగుచుండెను.
చీకట్లను
వ్యాపింపజేయుచుండెను.
కాటుకకొండలో
యనునట్లు
అతులిత
బలవంతులగు
రాక్షసవీరులు
వెడలిరి.
అప్పుడు
దుశ్శకునములు
కనబడెను.
భుజబలముచే
గర్వించిన
రావణుడు
వానిని
లెక్క
చేయలేదు.
9
▾
Meaning
Keep
చేతులలో
నున్న
ఆయుధములు
విరిగి
క్రిందబడెను.
రథముపై
నుండి
రథికులు
నేలపడిరి.
గజాశ్వములు
రోదన
చేసెను.
నక్కలు,
కుక్కలు
శోకరాగములు
తీసెను.
లంకలోని
వారందరూ
రావణుని
మృత్యువు
సమీపించెనని
ఎరిగిరి.
కాలుని
దూతవలె
గ్రుడ్లగూబ
అరచెను.
రాక్షసుల
రథ,
గజ,
తురగ,
పదాతులతో
కూడిన
చతురంగ
బలములు
యుద్ధమునకు
నడచెను.
ఆ
సైన్యము
నడచుచుండ
భూమి
అదిరిపడెను.
వర్ణనాతీతముగ
నుండెను.
నానావిధ
ధ్వజపతాకములు
శోభించెను.
మదగజయోధులు
కోట్లకొలది
యుద్ధమునకు
వెడలిరి.
వీరవసంతుడు
తన
సేనలను
వ్యూహము
పన్ని
యుద్ధమునకు
నడిపించునట్లు
రాక్షస
సైన్యములు
శోభించెను.
భేరీ,
నఫేరి,
సహనాయి
మొదలగు
వాద్యములు
చెలరేగెను.
వీరులు
సింహనాదము
చేసిరి.
ఇది
ఇట్లుండ,
బాణములతో
నెగురగొట్టబడిన
ఱెక్కలుగల
పర్వతముల
వలె
మహాక్రూరులగు
వానర
భల్లూకములు
కాలుని
వలె
యుద్ధమునకు
వెడలిరి.
నఖములను,
దంతములను,
పర్వతములను
వృక్షములను
వానరులు
తమ
ఆయుధములుగా
చేసికొనిరి.
మదగజము
వంటి
రావణుని
సంహరించుటకు
"రామచంద్ర
మహారాజునకు
జయమగుగాక"
అని
వానరులు
సింహనాదము
చేసిరి.
రాక్షసులు
ద్వంద్వ
యుద్ధము
నారంభించిరి.
సరిసమానులయిన
యోధులు
పోరాడిరి.
రావణునికి
జై
అని
రాక్షసులు,
రామునికి
జై
అని
వానరులు
ఘోషించిరి.
ఉభయ
సైన్యములు
ఎదుర్కొనెను.
రాక్షసులు
కాలునివలే
రౌద్రాకారులై
వానరుల
నెదుర్కొనిరి.
వానరుల
శరీరమునుండి
రక్తము
ప్రవహించెను.
వానరులు
రాక్షస
సైన్యములను
మర్దించి
మేఘముల
వలె
గర్జించిరి.
రాక్షసులను
పండ్లతో
కొరికి
కాళ్ళతో
తన్నిరి.
రాక్షసులను
గట్టిగా
పట్టుకొని
దవడలను
చీల్చిరి.
రాక్షసుల
ప్రేగులను
తీసి
వానరులు
హారములుగా
ధరించిరి.
రాక్షస
సైన్యములు
విరిగిపడుట
రావణుడు
చూచి
చేతులలో
ధనుస్సులను
బాణములను
పట్టుకొని,
పరుగులెత్తుచున్న
రాక్షస
సైన్యముల
మరలించెను.
రౌద్రాకారుడై
వచ్చుచున్న
రావణుని
వానరులు
చూచి
హాహాకారములు
చేసి
ఎదుర్కొనిరి.
పర్వతములు,
వృక్షములను
తెచ్చి
వానిపై
ప్రయోగించిరి.
అవి
వజ్రమువంటి
వాని
శరీరమును
తగిలి
చూర్ణమయ్యెను.
రావణుడు
నలువైపుల
10
▾
Meaning
Keep
గిరగిర
తిరిగి
వానరులను
మర్దించెను.
వానరులు
భయపడి
నలుదిక్కులకు
పరువులెత్తిరి.
ఓ
రామా!
ఓ
సుగ్రీవా!
త్రాహి
త్రాహి
అని
మొరలు
పెట్టిరి.
ఓ
రఘువీరా!
రక్షింపుము,
రక్షింపుము
అని
అరచిరి.
భూనభోంతరాళములు
బాణములతో
నిండెను.
దశదిక్కులకు
వానరులు
పరుగెత్తిరి.
కోలాహలము
నలువైపులా
వ్యాపించెను.
వానరసైన్యముల
వ్యాకులమును
లక్ష్మణుడు
చూచి
కోపముతో
తరకసమును
నడుమునకు
బంధించి,
ధనుర్బాణములను
ధరించి
శ్రీరాముని
చరణములకు
నమస్కరించి
యుద్ధమునకు
వెళ్ళెను.
లక్ష్మణుడు
రావణునిచూచి,
"ఓరీ,
దుర్మార్గుడా!
వానర
భల్లూకములు
చంపిన
నీకేమి
ప్రయోజనము?
కాలునివంటి
నన్ను
చూడుము"
అని
గర్జించెను.
అంత
రావణుడు
"ఓరీ!
నీవు
నా
పుత్రఘాతకుడవు.
అనేక
దినములనుండి
నిన్ను
వెతుకుచున్నాను.
ఈ
దినము
నిన్ను
చంపిన
తరువాత
నా
గుండెలు
చల్లబడును"
అని
రావణుడు
హుంకరించి
తీక్షణములగు
బాణములను
ప్రయోగించెను.
లక్ష్మణుడు
వానిని
వేయి
ముక్కలుగా
ఖండించెను.
లక్ష్మణుడు
సూటియైన
బాణములు
విసరి
రావణుని
రథమును,
రథసారథిని
చూరుచూరు
చేసెను.
నూరునూరు
బాణముల
నొక్కపరి
లక్ష్మణుడు
విసరుచూ
వచ్చెను.
అవి
రావణుని
ముఖమునకు
హృదయమునను
గుచ్చుకొని,
ఆ
దెబ్బలతో
నేలకూలెను.
స్పృహతప్పెను.
కానీ
వాడు
మూర్ఛనుండి
దిగ్గనలేచి
రౌద్రాకారుడై
బ్రహ్మదత్తమగు
ప్రచండశక్తిని
లక్ష్మణునిపై
ప్రయోగించెను.
లక్ష్మణుడు
నేలకూలెను.
ఇంతలో
హనుమంతుడు
చూచి
పరుగెత్తి
వెళ్ళి
దుర్వాక్యములను
బలికెను.
లక్ష్మణుని
చెంతకు
వచ్చెను.
వచ్చిన
హనుమంతుని
రావణుడు
ఒక్క
గ్రుద్దు
గ్రుద్దెను.
దానితో
మహావీరుడు
చతికిలబడెను.
కాని,
నేలపడలేదు.
దిగ్గన
లేచి
రావణుని
ముష్టితో
పొడిచెను.
అంత
రావణుడు
తన
బలమును
దూషించుకొంటూ,
"నా
పౌరుషము
కాల్చనా?
వానరుని
పిడిగ్రుద్దు
యింత
బలమైనదా?"
అని
తనలో
తాను
హనుమంతుని
బలమును
వర్ధించెను.
అంత
లక్ష్మణుడు
దిగ్గన
లేచి
యెదుర్కొనెను.
రావణుడు
స్పృహతప్పి
పడిపోగానే
సారథి
రెండవ
రథముపై
వేసుకొని
లంకకు
తీసుకొనిపోయెను.
11
▾
Meaning
Keep
లంకలో
చేరగానే
మూర్ఛనుండి
లేచి
పాతాళ
హోమము
చేయనారంభించెను.
రావణుడెంత
మూర్ఖుడు!
రామునితో
విరోధించి
జయమును
సాధించగలడా?
వాడు
తలపెట్టిన
పాతాళహోమము
గూఢచారులవల్ల
విభీషణునికి
తెలిసెను.
తత్క్షణమే
విభీషణుడు
శ్రీరాముని
చెంతకు
వెళ్ళి
పాదములపైబడి,
"ప్రభూ!
వెంటనే
వానరులను
పంపి,
పూర్వము
మేఘనాధుడు
చేయుచుండినటుల
రావణుడు
చేయుచున్న
పాతాళయజ్ఞమును
భంగము
గావింపు"దని
ప్రార్థించెను.
ఆ
యజ్ఞమే
సాంతమయిన
యెడల
వానిని
జయించుట
దుష్కరము.
అంత
ప్రాతఃకాల
మయ్యెను.
శ్రీరాముని
ఆజ్ఞప్రకారము
అంగద,
హనుమంతులు
యజ్ఞవాటికకు
నడిచిరి.
కౌతుకము
చేయుచు
గంతులు
వేయుచు
వానరులు
లంకలో
ప్రవేశించిరి.
రావణుని
గృహమున
జొచ్చిరి.
యజ్ఞదీక్షలో
నున్న
రావణుని
చూచి,
"ఓరీ
లజ్జాహీనుడా!
రణమును
వదలి
గృహమునకు
పారిపోయి
ధ్యానము
చేయుచూ
కూర్చుంటివా?"
అని
హేళన
చేయుచు,
అంగదుడు
వానిని
కాలితో
తన్నెను.
రావణుడు
స్వార్థపరుడై
యుండినందున
వారిని
చూడలేదు.
అంత
అంగద
హనుమదాదులు
వానిని
పండ్లతో
కొరికిరి.
జుట్టు
పట్టుకొని
లాగిరి.
అంత
రావణుడు
కాలాగ్ని
రుద్రుడై
మండిపడి
దిగ్గనలేచి
వానరుల
పాదములు
పట్టుకొని
గిరగిరత్రిప్పి
నేలగొట్ట
ప్రయత్నించెను.
కాని
పాదములను
కదలించలేకపోయెను.
మరింత
అవమానముతో,
క్రోధముతో
వానరులు,
రావణుడు
పోరాటము
జరుపుటతో
యజ్ఞము
ధ్వంసమయ్యెను.
రావణుడు
చింతించెను.
వానరులు
రాముని
చెంతకు
చేరి
జరిగిన
వృత్తాంతము
నెరిగించిరి.
విభీషణుడు
సంతసించెను.
రావణుడు
"యజ్ఞమును
సాధించలేకపోతిని
కదా"
అని
నిరాశ
చేసుకొని,
మండిపడి
యుద్ధమునకు
వెడలెను.
వాడు
యుద్ధమునకు
బయలుదేరిన
క్షణముననే
అనేక
దుశ్శకునములు
యెదురయ్యెను.
గ్రద్దలు
వాని
శిరస్సుపై
వాలెను.
వాని
కిరీటమును
తన్నివేసెను.
అయిననూ
లక్ష్యము
చేయక
వాడు
రణభేరీలను
మ్రోగింప
ఆజ్ఞాపించెను.
రాక్షసులు
క్షణములో
లక్షలకు
గుమిగూడిరి.
రామునితో
యుద్ధము
చేయుటకు
బయలుదేరిరి.
అంత
రాముడు
కూడ
నడుమునకు
తూణీరములను,
హస్తమున
ధనుస్సును
ధరించెను.
ఆజానుబాహువులు,
విశాలవక్షమును
గల
శ్రీరాముడు
యుద్ధమునకు
12
▾
Meaning
Keep
నడచెను.
దేదీప్యమానముగా
రణరంగమున
వెలుగుచున్న
శ్రీరాముని
దివ్యమంగళ
విగ్రహమును
దేవతలుచూచి
తమలో
తాము
వర్ణించుచు
నమస్కరించిరి.
వానరులు
అతి
జాగ్రత్తతో
రాముని
అనుసరించిరి.
ప్రళయకాలమున
పిడుగులను
రువ్వుచూ
వెడలు
సంవర్తక
మేఘముల
వలె
రాక్షసుల
నాశము
నిమిత్తము
వానరసైన్యము
వారిని
యెదుర్కొనెను.
ఉభయపక్షముల
వారు
విసరుచుండిన
పర్వతములు
పిడుగులవలె
ధ్వని
చేయుచూ
పడుచుండెను.
క్షణములో
రాక్షసుల
రథ,
గజ,
తురగములు
నేలకూలెను.
వేనకువేల
రాక్షసులు
నేలకూలిరి.
రక్తము
నదులై
పారెను.
అంత
రావణుడు
"రాక్షసులందరూ
హతమారిరి.
నే
నేకాకిని,
వానర
భల్లూకము
లనేకులు.
కనుక,
నేను
రాక్షస
మాయను
విస్తరించెదను"
అని
తనలో
తాను
విచారించెను.
ఆ
రాక్షస
మాయ
రాముని
విడిచిపెట్టి
తదితరులపై
ప్రసరించెను.
అంత
రాముడు
సంకల్పింప
యెక్కడ
చూచిననూ
రామలక్ష్మణులు,
అనేక
కోట్ల
వానరులు
గోచరించిరి.
ఈ
దృశ్యమును
రావణుడు
చూచి
తన
మాయశక్తి
యేమాత్రమూ
ఉపయోగము
లేదని
లోలోన
తర్కించెను.
Previous
←
The Sañjīvinī Mountain
Next
The Slaying of Rāvaṇa
→