Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Slaying of Rāvaṇa
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
రాముడు
వానర
యోధులను,
వానరులను
దగ్గరకు
పిలిచి,
"ఓ
యోధులారా!
వానరులారా!
మీరింతకాలము
యుద్ధముచేసి
అలసిపోతిరి.
మీరిక
విశ్రాంతి
తీసికొనుడు.
ఇక
రామరావణయుద్ధమును
చూడుడు"
అని
గంభీర
వాక్యములాడెను.
రావణుడు
గర్జించి
'ఢీ!'
మని
రాముని
యెదుర్కొనెను.
అంత
రాముడు
"ఓ
మూర్ఖుడా!
మొదలు
నే
చెప్పబోవు
నీతివాక్యములు
ఆలకింపుము.
లోకమున
మూడు
విధముల
మనుజులు
కలరు.
ఒకరు
పాటలీవృక్షము
వంటివారు.
అది
పుష్పించును.
కానీ
దానికి
ఫలములుండవు.
మాటలు
చెప్పువారీవృక్షము
లాంటి
వారు.
మాటలేకాని
కార్యము
శూన్యము.
రెండవ
తరగతివారు
రసాలముతో
సమానులు.
అది
పుష్పించి
ఫలించును.
అటులనే
వారు
మాటలు
చెప్పి
కార్యమును
చేయుదురు.
ఇక
మూడవ
తరగతివారు
పనసచెట్టుతో
సమానము.
దానికి
పుష్పములుండవుకానీ
అది
ఫలించును.
అటులనే
వారు
మాటలు
చెప్పక
కార్యములు
చేయుచుందురు.
నీవు
వట్టి
మాటలు
ప్రగల్భములాడుచున్నావు.
కాని
నీ
నీతిలేని
పరిపాలన
నీ
జాతికే
కీడు
చేసెను”
అని
పలికెను.
అంత
రావణుడు
"ఓయీ!
నీవు
నాకు
బోధించెదవా?”
అని
అనేక
దుర్వాక్యములాడి
పిడుగువంటి
బాణములను
ప్రయోగించెను.
రావణుడు
ఆగ్నేయాస్త్రము
విడచెను.
అది
రాముని
బాణములను
నాశము
గావించెను.
కోట్లకొలది
చక్రములు,
త్రిశూలములు
రావణుడు
రామునిపై
విసరెను.
కాని
ఆ
దుష్టుని
మనోరథము
వ్యర్ధమయ్యెను.
రాముడు
ధనుస్సులాగి
బాణములను
ప్రయోగించెను.
సర్పములవలె
ఆ
బాణములు
మహావేగముగా
వెళ్ళెను.
రాముడు
ఖండించుకొలది
వానికి
శిరస్సులు
పుట్టుచుండట
గమనించెను.
రావణుడు
తన
మరణ
సంగతి
మరచి
గర్వించి
గర్జించెను.
క్రింద
పడిన
రావణుని
శిరస్సులు,
“రాముడేడి,
లక్ష్మణుడేడి,
సుగ్రీవుడేడి"
అంటూ
నేల
పడి
దొర్లుచుండెను;
2
▾
Meaning
Keep
ఉన్న
శిరస్సులు
విభీషణుని
దూషించమొదలుపెట్టెను.
"ఓరి
తమ్ముడా!
రాజ్యమును
కోరి
రాముని
శరణుజొచ్చి
సోదరుని
మరణవార్తకై
వేచి
యుంటివా?"
అని
నానావిధముల
తూలనాడెను.
"ఓరీ!
నీవు
విరాగివి
కానీ
వీరుడవు
కాదు.
ఛీ,
పొమ్ము
నీ
ముఖము
చూడరాదు"
అని
కేకలు
వేసెను.
ఇట్లు
అనేక
పర్యాయములు
నేలపడిలేచి
వీరుడై
భయంకర
యుద్ధము
గావించెను.
అతని
వీరత్వమును
లక్ష్మణ,
సుగ్రీవ,
అంగదాదులు
మెచ్చుకొనిరి;
ఆశ్చర్యపడిరి.
కడకు
రాముడు
కాలహరణము
చేయరాదని
తలంచి
పాపాత్ముని
పాపకర్మలు
దినదిన
ప్రవర్ధమానమగుచున్నవని
భావించెను.
నల
నీలాది
వానరయోధులు
పాషాణములు
వానిపై
విసిరిరి.
ఇంతలో
చీకటి
క్రమ్ముకొనెను.
అందరూ
యుద్ధము
చాలించిరి.
ఆ
రాత్రి
త్రిజట
జానకి
వద్దకు
వచ్చి
రామరావణయుద్ధమున
గురించి
వివరించెను.
రాముడు
ఎన్నిసారులు
శిరస్సులు,
భుజములు
త్రుంచినను
తిరిగి
పుట్టుచూ
వచ్చుచున్నవి.
ఎన్ని
శిరస్సులు
వూడినననూ
మరల
అన్ని
శిరస్సులు
పుట్టుచున్నవని
తెలుపగనే
సీత
ముఖము
వెలవెలబోయెను,
సీత
చింతతో
దుఃఖించెను.
ఈ
విచిత్రమును
చూచి
త్రిజట
"తల్లీ!
మీరు
విచారించకుడు,
రాముడు
త్రుంచిననూ
వాని
శిరస్సులు
తిరిగి
వచ్చుటకు
కారణము
వాని
హృదయములో
జానకి
రూపము
కలదు"
అని
చెప్పుట
చేత
జానకికి
హర్షవిషాదములు
కలిగెను.
త్రిజట,
“ఓ
రాజకుమారీ!
నీ
సంశయమును
విడిచిపెట్టుము.
వానికి
చావు
త్వరలోనే
కలదు.
రామునకు
జయము
కలదు.
రాముడు
బాణము
విడుచునపుడంతయూ
రావణుడు
నిన్ను
స్మరించుచున్నాడు.
అందువలన
రాముని
బాణము
వానిని
యేమియూ
చేయజాలకున్నది.
కానీ
నీవు
విచారించకుము.
నిన్ను
మరిపించు
గడియలు
రానున్నవి.
ఎపుడు
నిన్ను
రావణుడు
మరచునో
అపుడు
వాని
చావు
తథ్యము.
అదియూ
సమీపించుచున్నది”
అని
తెలిపెను.
రెండవ
దినము
రావణుని
మాయ
ప్రభావము
వలన
వికృతరూపములుగల
ప్రేత
పిశాచ
గణంబులు
ధనుర్బాణాలు
ధరించి
ప్రత్యక్షమయ్యెను.
యోగిను
లొకహస్తముతో
కత్తిపట్టుకొని,
రెండవ
హస్తముతో
మనుజుల
తల
పుఱ్ఱెలు
పట్టుకొని
రక్తము
పానము
చేయుచు
నాట్యమాడుచు,
గానము
చేయుచు,
కొట్టుపట్టు
అను
శబ్దములు
చేయుచుండిరి.
వానరులెటువైపున
పరుగెత్త
అటువైపున
మండుచుండిన
3
▾
Meaning
Keep
మంటలు
వారియెదుట
నిలుచుండినట్లు
గోచరమయ్యెను.
ఈ
ప్రకారము
వానర
భల్లూకములు
వ్యాకులపడిరి.
అంతటితో
విడువక
వానరులపై
ఇసుక
వర్షమును
కురిపించెను.
వానరులు
పడుచున్న
వ్యాకులమును
చూచి
రావణుడు
సింహనాదము
చేసెను.
లక్ష్మణ,
సుగ్రీవాది
వానర
యోధులు
నిశ్చేష్టులయిరి.
"హా
రామా!
హా
రామా!"
అని
యోధులు
మొరపెట్టిరి.
మాయా
ప్రభావముచే
అనేక
హనుమంతులు
పర్వతము
పట్టుకొని
ప్రత్యక్షమై,
శ్రీరాముని
నలువైపులా
ముట్టడించిరి.
ఆ
మాయా
హనుమంతులు
వాలమును
పైకెత్తి
రామునిపట్ట
ప్రయత్నించిరి.
దశదిశలా
వారి
వాలములు
కనుపించెను.
కాని
శ్రీరాముడు
శ్యామల
శరీరుడై
దేదీప్యమానముగా
ప్రకాశించుచుండెను.
ఇది
రావణుని
మాయాజాలమని
రామునికి
తెలుసు.
అందుచే
రాముడు
రావణుని
పిచ్చిచేష్టలను
చూచి
తనలోతాను
నవ్వుకొనుచు
వాడు
చేయువాటిని
యే
మాత్రమును
లక్ష్యము
చేయక
ఒక్క
బాణమును
ప్రయోగించి
వాని
మాయాజాలమును
రూపుమాపెను.
ఆ
మాయ
రూపుమాసిన
తత్క్షణమే
వానర
భల్లూకములు
చాలా
సంతసించిరి.
సూర్యోదయమైన
వెంటనే
మబ్బులు
మాయమయినటుల
రామబాణము
ప్రయోగించగనే
రావణమాయలనే
మబ్బులు
అంతర్ధానమయ్యెను.
అంత
వానరులు
శైలపాషాణములు
పట్టుకొని
రావణునిపై
విసరుటకు
కుప్పించి
యెగసిరి.
అంతలో
రాముడు
ఒక
సూటియైన
బాణమును
విడిచెను.
అది
కాంతులు
గ్రమ్ముతూ
వెళ్ళి
రావణుని
శిరస్సులు
ఖండించెను.
మరలా
ఆ
శిరస్సులు
మొలుచుచుండెను.
ఈ
రీతిగా
రాముడు
ఖండించడం
తిరిగి
మొలవడం
-
ఇది
రామునకు
ఒక
వినోదముగా
ఆటవలె
కనుపించెను.
లాభము
వచ్చిన
కొలది
లోభ
మధికమగును.
ఈ
విధమున
వాని
శిరస్సులు
ఖండింపబడుచుండెను.
రామరావణయుద్ధమునకు
మరొకటి
సాటిలేకపోయెను.
“గగనం,
గగనాకారం,
సాగర
స్సాగరోపమః”,
ఆకాశమునకు
ఆకాశవే
ఉపమానము,
సాగరమునకు
సాగరవే
ఉపమానము.
రామరావణయుద్ధమునకు
రామరావణ
యుద్ధమే
ఉపమానము.
రామరావణయుద్ధము
పదునెనిమిది
దినములు
జరిగెను.
రామునకు
ఇది
శ్రమగా
కనుపించలేదు.
ఒక
కళావినోదముగా
నుండెను.
కారణం?
పదునాలుగు
సంవత్సరములు
పూర్తి
అగుటకు
కాలము
ఉండినందున
ఇది
యొక
ఆటగా
రాముడు
4
▾
Meaning
Keep
రావణునితో
ఆడెను.
రాముడు
సంకల్పించిన
రావణుడు
ఏపాటివాడు?
పదునెనిమిది
దినములు
గడువగనే
రాముడు
తీక్షణమగు
బాణమును
సంధించెను.
ఆ
సమయమున
అన్నియూ
రావణునకు
అశుభములే
కనుపించెను.
నక్కలు,
గాడిదలు
మొదలగునవి
మొరపెట్టెను.
ఖగ
మృగములు
ఆర్తనాదము
చేసెను.
అంతరిక్షము
నుండి
ఉల్కలు
పడెను.
దశదిశలా
అగ్నిమంటలు
ప్రజ్వరిల్లెను.
మండోదరి
హృదయము
కంపించెను.
లంకలోని
అన్ని
దేవాలయములలోని
విగ్రహములు
కన్నీరు
పెట్టెను.
ప్రచండ
వాయువులు
భయంకరముగా
వీచెను.
ఈ
ఉత్పాదితములను
జూచి
అంతరిక్షముననున్న
దేవతలు
జయ
జయ
శబ్దములు
చేసిరి.
అంత
రాముడు
ఆకర్ణాంతము
నారిని
లాగి
యేక
కాలమున
ముప్పదియొక్క
బాణములను
విడిచెను.
కాలసర్పములవలె
ఆ
బాణములు
వెడలెను.
ఒక
బాణము
వాని
నాభిప్రదేశమున
నుండిన
అమృత
కలశమును
శోషింపజేసెను.
మిగిలిన
ముప్పది
బాణములు
వాని
శిరస్సులను,
బాహువులను
ఖండించెను.
క్రిందపడిన
మొండెము,
శిరస్సులు,
బాహువులు
నాట్యమాడ
మొదలిడెను.
కొంతకాలమట్లు
చలించి
చైత్రశుద్ధ
చతుర్ధశి
నాడు
రావణుడు
స్వర్గస్తుడాయెను.
అంత
దేవదుందుభులు
మ్రోగెను.
రావణుని
తేజస్సు
రామునిలో
లీనమయ్యెను.
ఆ
చిత్రమును
చూచి
వానరయోధులు
ఆశ్చర్యపడిరి.
పదునెనిమిది
దినములు
రాముడు
చూపిన
బలపరాక్రమములను
వానరులు
చూచి
ఆశ్చర్యపడి,
జయ
జయ
ధ్వనులు
చేసిరి.
రావణుని
మరణవార్తను
విని
మండోదరి
నేలకూలెను.
ఆమె
దాసీలతో
కళేబరము
దగ్గరకు
వచ్చి
ఆ
శిరస్సులను
చేర్చి
ప్రాణేశ్వరునకు
సంభవించిన
దుర్గతికి
చాలా
విలపించెను.
రావణుని
ప్రతాపములను
అనేక
విధములుగా
వర్ణించెను.
“ఓ
నాథా!
బ్రహ్మసృష్టి
అంతయూ
మీకు
వశమయి
ఉండెనే!
అష్టదిక్పాలకులు
మీకు
నమస్కరించుచుండిరి
కదా!
కాని
ఎన్ని
శక్తులుండియేమి
ప్రయోజనము?
ఎన్ని
తపస్సులు
చేసి
యేమి
ఫలము?
ఎంత
బలపరాక్రములుండి
ప్రయోజనమేమి?
రామవిముఖులయితిరి
కనుక
మీకీపాట్లు
తగినట్లు
వచ్చెను.
కామమును
వశమునందుంచుకొనని
కాలుడైననూ
కడకు
ఈ
రీతిగా
బాధపడక
తప్పదు.
కామాంధునకు
ఈ
కఠినశిక్ష
తప్పినది
కాదు.
కాముడు
మాత్రమే
రాముని
విస్మరించును.
ఓ
రావణా,
శ్రీరాముడు
రాక్షసవనమును
దహించుటకే
అవతరించెను.
అతడు
5
▾
Meaning
Keep
సాధారణ
మానవమాత్రుడు
కాదని
నేనెన్నియో
పర్యాయములు
చెప్పితిని,
కాని
నీ
ప్రారబ్దము
నిన్ను
విడువక
వెంటాడెను.
నీ
దేహబలముపై,
బుద్ధిబలముపై,
ధనజనబలముపై
నీవు
ఆధారపడి
భ్రమించితివి.
మీరా
కరుణాసముద్రుని
శరణుజొచ్చి
రాక్షసవంశమును
కాపాడుమని
పాదములంటి
ప్రార్ధించితిని.
నా
మాట
వినరైతిరి.
మీరు
నిరంతరము
పరులకు
ద్రోహము
చేయుటకే
చింతించిరి.
కాని,
పరుల
ఉపకారమునకు
ఏనాడునూ
ప్రయత్నించలేదు.
కాయుమా-నిరంతరము
పాపములలో
మునిగిపోయెను.
అట్టి
నీకు
రాముడు
సాకేత
లోకము
నిచ్చెను.
అదియూ
నీ
భాగ్యమే.
లేకున్న
రామహస్తములో
ప్రాణములు
వీడుట
అందరికీ
సులభము
కాదు
కదా!
అందరికీ
ప్రాప్తిరాదు
కదా!
ఆ
శ్రీరాముడు
మీ
సంహారార్థమే
అవతరించెను.
రాక్షసవంశనాశమునకు
రాక్షస
రాజే
రాజబాట
తీసుకొనను.
వార్త
శాశ్వతముగా
నిలిచిపోయెను
కదా!
ఇదీ
నీవు
సాధించినది.
ఇదీ
నీ
పరిపాలనా
చాతుర్యము.
"నీ
తపఃఫలము
ఇంతేనా?
రామాచంద్రా,
కర్మఫలము
తప్పునది
కాదను
వాక్యమును
నిరూపించితిరా?
ఇంతకన్ననూ
వేరు
నిదర్శనము
మరొకటేమి
కలదు?
ఇది
ప్రత్యక్షనిదర్శనము"
అని
మండోదరి
విలపించుచున్ననూ
జ్ఞానముచే
శ్రీరాముడు
పరబ్రహ్మయని
తెలుసుకొనెను.
ఈమె
జ్ఞానమునకు
సురులు,
మునులు
సంతోషించిరి.
మండోదరి
విలపించుచున్న
దృశ్యమును
చూచి
విభీషణుడు
కూడా
దుఃఖించెను.
మండోదరి
చెప్పినవన్నియూ
వాస్తవములని
యొప్పుకొనెను.
అంత
రామలక్ష్మణులు
విభీషణుని
దగ్గరకు
వచ్చి
వోదార్చి,
విభీషణా,
రావణునకు
తగిన
పరలోక
క్రియలాచరింపుము
అని
ఆజ్ఞాపించిరి.
శ్రీరాముని
ఆజ్ఞప్రకారము
దేశకాలపాత్రల
ననుసరించి
విధిపూర్వకముగా
విభీషణుడు
రావణునకు
పరలోక
క్రియలు
చేసెను.
మండోదరి,
తదితర
సతులు
వచ్చి
తిలోదకములిచ్చిరి.
శ్రీరాముడు
విభీషణుని
చెంత
చేర్చుకొని
పలు
విధముల
వోదార్చి,
జరగవలసినది
జరిగెను.
కాని,
విరుద్ధమైనదేదియూ
జరగలేదు.
అతని
పాపము,
శాపము
పండి
పరిపక్వమయ్యెను.
దానిని
విచారించి
ప్రయోజనము
లేదు
అని
చెప్పి,
తమ్ముడైన
లక్ష్మణుని
జాంబవంతుని
అంగదుని
పిలిచి,
నీలానలాదులను
కూడ
తోడుచేసి,
మీరందరూ
లంకలోనికి
వెళ్ళి
విభీషణునికి
పట్టము
కట్టిరండని
ఆజ్ఞయొసగెను.
తండ్రిగారి
ఆజ్ఞానుసారము
రేపటికి
పదునాలుగు
వర్షములు
నిండును
6
▾
Meaning
Keep
కాన
త్వరగా
వెళ్ళుడని
చెప్పెను.
అంత
విభీషణుడు
రాముని
పాదములు
పట్టుకొని,
“రామా!
ఈ
రాజ్యము
నాకెందుకు?
తమ
పాదారవింద
సామ్రాజ్యము
నందుంచుకొనుము.
నేటినుండి
లంక
తమది,
అయోధ్యలో
లంకనొక
అంగముగా
భావించుడు"
అని
ప్రార్థించెను.
అందులకు
రాముడు
అంగీకరించక
అనేక
విధముల
రాజనీతిని
బోధించి
రామాజ్ఞ
తప్పదని
చెప్పగ,
అటులనే
తమ
హస్తములచే
నాకు
రాజ్యమును
అప్పగించుడు
అని
విభీషణుడు
ప్రార్థించగా,
తండ్రి
ఆజ్ఞను
పదమూడు
సంవత్సరముల,
పదకొండు
నెలలు
ఇరువది
తొమ్మిది
దినములు
నెరవేర్చి,
ఒక్క
దినములో
నా
వ్రతమును
భంగము
చేసుకొనుట
పాడికాదు.
మా
తండ్రి
ఆజ్ఞానుసారము
నేను
పట్టణమున
ప్రవేశించరాదన్న
విషయము
నీకు
తెలియును
కదా!
కాన,
నా
ఆశీర్వాదములు
అందుకొని
నీవు
లంకలో
పట్టాభిషేకము
గావించుకొమ్మని
దీవించి
పంపెను.
రామాజ్ఞను
శిరసావహించి
లక్ష్మణ,
సుగ్రీవ,
అంగద,
నలనీలాదులు
బయలుదేరి
లంకను
చేరి
విభీషణునకు
రాజ్యతిలకమును
బెట్టిరి.
విభీషణుడు
చేరిన
వానర
వీరులకు
నమస్కరించి
మీ
సహాయముననే
నా
జీవితమంతయూ
సార్థకము
గావించుకొందును.
ఇది
అంతయు
శ్రీరాముని
ప్రసాదము.
అతని
యేజంటుగనే
నేనీ
రాజ్యమును
పాలింతును.
కానీ,
ఇది
నాది
కాదు.
నేను
రామార్పితమైతిని
అని
రావణుడు,
రావణుని
పుత్రులు,
యోధులు
గావించిన
క్రూర
సంగ్రామమునకు
చింతించి,
అంతా
రామలీలగా
భావించెను.
అందరూ
చేరి
రాముని
చెంతకు
వచ్చి
నమస్కరించిరి.
అనంతరం
శ్రీరాముడు
హనుమంతునితో
ఓ
మహావీరా!
నా
కార్యనిమిత్తము
నీవు
లంకలోనికి
వెళ్ళినా
సమాచారమును
జానకికి
విన్నవించి,
ఆమె
యోగక్షేమములు
తెలుసుకొని
రమ్ము
అన్నాడు.
మహావీరుడు
లంకలోనికి
ప్రవేశించి
జానకిని
దర్శించి
ఆమెకు
నమస్కరించెను.
ఆమె
ఈ
మహావీరుని
చూచి
అతనిని
రాముని
దూతగా
తలంచి,
ఓ
వీరుడా!
శ్రీరామలక్ష్మణులు,
వానరసేనలు
క్షేమమేనా?
కృపాసాగరుడైన
నా
రాముడు
కుశలమేనా?
అని
అడిగెను.
మహావీరుడు
ఆ
మాటకు
నమస్కరించి,
తల్లీ!
అన్ని
విధములా
శ్రీరామచంద్రుడు
క్షేమమే.
వారు
రావణుని
సంహరించి
విభీషణునికి
శాశ్వతమగు
రాజ్యము
నిచ్చిరనెను.
జానకి
రామవిజయమును
రావణ
7
▾
Meaning
Keep
పరాజయమును
విని
సంతసించి,
ప్రసన్నురాలై
దేహము
పులకరించి
ఆనందభాష్పముల
రాల్చుచూ,
ఓ
కపీశ్వరా!
ఈ
శుభవార్త
నందించినందులకు
నేను
నీకేమియ్యగలను?
నీ
వాక్కునకు
సమాధానమైన
వస్తువులు
లేవు
అనెను.
అందులకు
హనుమంతుడు,
తల్లీ!
మీ
ఆనందమునకు,
మీ
ప్రసన్నతకు
నాకీ
దినమున
మూడులోకముల
రాజ్యము
లభించినంత
ఆనందమాయెను.
నేడు
శత్రువును
జయించి
తమ్మునితో
కూడిన
నిరామయుడగు
రామప్రభువును
చూచుటకంటే
భాగ్యమేమి
కలదు?
అని
నమస్కరించెను.
అంత
జానకి
“వానరోత్తమా,
నేను
ఈ
పదినెలలు
రామచంద్రుని
వియోగదుఃఖమున
మునిగినందున
బైట
ప్రపంచమూ
ఏమియూ
కనుపించలేదు.
నేడు
ఏమి
వారమో
ఏమి
తిథియో
తెలియదు.
యేమైన
నేడు
మంగళకరమైన
వార్తను
తెలిపితివి.
కనుక
ఈనాడు
మంగళవారమనే
పిలుతును.
నీవీ
వార్త
నందించినందుకు
ఈ
దినము
నిన్ను
పూజించు
దినముగా
ఆశీర్వదింతును"
అని
సీత
పలికెను.
హనుమంతుడు
ఇది
మహాప్రసాదమని
చేతులు
జోడించి
సీతకు
నమస్కరించెను.
కాని
సీత
కంటిధారలు
కార్చుచూ,
హనుమంతా!
ఆ
కోమల
శ్యామల
శరీరుని
శ్రీరాముని
దర్శనము
నాకు
శీఘ్రముగా
లభించునట్లు
ప్రయత్నము
చేయుము.
జరిగిన
యుద్ధమంతయూ
నా
నిమిత్తమే
కదా!
నన్ను
చేరే
నిమిత్తమే
కదా!
నన్ను
శీఘ్రముగా
శ్రీరాముని
చరణముల
వద్ద
చేర్చుమని
దీనముగా
తెలుపుకొనెను.
ఆమె
బాధను
సహించలేక
హనుమంతుడు
రివ్వున
యెగిరి
శ్రీరాముని
పాదముల
చెంత
వ్రాలి,
జరిగిన
వృత్తాంతమంతయూ
శ్రీరామునకు
విన్నవించెను.
శ్రీరాముడు
హనుమంతుని
మాటలు
విని
అంగద
విభీషణాదులను
పిలిచి
హనుమంతునితో
వెళ్లి
సీతను
ఆదరించి
పిలుచుకొని
రమ్మని
అజ్ఞాపించెను.
ఆ
క్షణమే
వానరయోధులు
హనుమంతునితో
అశోకవనమునకు
వెళ్ళి
విభీషణుని
ఆజ్ఞానుసారము
సీతను
స్నానాదులు
చేయించి
పీతాంబరములు
కట్టించి
అనేక
ఆభరణములతో
అలంకరించ
ప్రయత్నించిరి.
కాని,
సీత
వాటినన్నింటినీ
తిరస్కరించి
నా
శ్రీరామచంద్రుడే
నా
భూషణములు,
అతని
దర్శనమే
నా
స్నానము.
అతని
నమస్కారమే
నా
పీతాంబరము.
నాకు
రావణుని
వస్తువాహనాదులు
అక్కరలేదని
చెప్పెను.
ఆమె
ఇష్టప్రకారము
8
▾
Meaning
Keep
గావించుడని
తిరిగి
విభీషణుడు
తెలుపగా
సీత
రామసందర్శన
నిమిత్తము
తహతహలాడుచున్నదని
దాసీలు
తెలిపిరి.
వెంటనే
పల్లకీని
తెప్పించి
ఆమెను
అందులో
కూర్చుండబెట్టి
వానరులు
తీసుకొని
వచ్చిరి.
సీతను
సందర్శించుటకై,
లంకలో
మిగిలిన
రాక్షసస్త్రీలు,
వానరులు
అనేక
విధముల
దారిలో
బంతులుదీర్చిరి.
ఒకరిపై
నొకరు
యెక్కి
అమ్మను
చూచుటకు
ప్రయత్నించిరి.
పల్లకీలో
కూర్చుండిన
జానకి
ఇటు
అటు
చూడక
రాముని
స్మరించుచూ
తల
క్రిందికి
వంచుకొని,
రామదర్శనమునకు
ఆతురతపడుచూ
వెళ్ళెను.
కొంత
దూరము
ఉండగనే
సీత
పల్లకిని
దిగి
తన
నాథుని
చెంతకు
నడిచి
వెళ్ళుట
ధర్మమని,
ఆమె
పల్లకిని
నిలిపించి
అందునుండి
దిగి,
నెమ్మదిగా
నడచి
రాముని
దర్శనమునకు
బయలుదేరెను.
ఆమెను
చూచి
వానరులు
నమస్కరించి
సీతారామచంద్రులకు
జైజై
అని
జయధ్వనులు
చేసిరి.
తీరా
రాముని
చెంతకు
రాగానే
శ్రీరాముడు
ఆజ్ఞాపించెను.
ఆమెను
ఇప్పుడే
తన
చెంతకు
తెచ్చుటకు
వీలు
లేదనియూ,
ఆమెను
అగ్నిపరీక్ష
గావించవలసియున్నదనియు
తెలిపెను.
ఈ
మాటతో
వానరులు
క్రుంగిపోయిరి.
రామాజ్ఞ
ప్రకారము
యెండిన
పుల్లలను
తెచ్చుటకు
బయలుదేరిరి.
పూర్వము
రావణయుద్ధసమయమున
పెద్ద
పెద్ద
పర్వతములను
సహితము
అవలీలగా
నెత్తిన
వానరులకు
ఎండిన
చిన్న
చిన్న
పుల్లలే
మహాభారముగా
నుండెను.
కారణము
సీతాదేవికి
ఇట్టి
పరీక్షయా
అని
వారిలోవారు
విచారించిరి.
లోకరీతిగా
సీత
సుశీల
అని
రామునకు
తెలుసును.
కానీ
లోకమును
తృప్తిగావించు
నిమిత్తము
రాముడు
ఈ
లీలానాటకమాడదొడగెనని
విభీషణ,
అంగద,
సుగ్రీవాదులకు
తెలుసు.
మరొకరీతిగా
చూడ,
అరణ్యములో
నుండినపుడు
జానకి
శక్తిని
అగ్నిహోత్రుని
దగ్గర
దాచెను.
లంకలో
నింతవరకు
నివసించిన
సీత
మాయసీత,
శక్తిరహితమైన
దేహము
మాత్రమే.
సీత
నిజస్వరూపము
అగ్నియందుండుటచేత
తన
నిజశక్తిని
చేర్చుకొని
వచ్చుటకై
సీతను
అగ్నిలో
ప్రవేశింపజేసెను.
ఆమె
అంతఃకరణ
నిర్మలమైనదని
లోకులకు
తెలియుట
కామె
అగ్నిలో
ప్రవేశించెను.
9
▾
Meaning
Keep
దీనిని
చూచి
సీత
ఆనందించెను.
లక్ష్మణుడు
బాధపడెను.
కానీ,
లక్ష్మణుని
శాంతపరచుటకై
సీత
"ఓ
లక్ష్మణా!
వివాహ
కాలమున
బ్రాహ్మణులు
అగ్ని
హోత్రమును
వెలిగించి
వివాహము
చేయించిరి.
ఇప్పుడు
నా
కగ్నిలో
నుండి
పునర్జన్మము
కలుగును.
పిమ్మట
నేను
ప్రభువును
వరింతును.
నీవు
ధర్మము
నాలోచించి
అగ్నిహోత్రము
వెలిగింపుము"
అని
చెప్పెను.
విరహమును,
వియోగమును,
ధర్మమును,
న్యాయమును,
చాతుర్యములను
సూచించు
జానకి
వచనముల
నతడు
విని
కన్నీటిని
కార్చి
చేతులను
జోడించుకొని
నిలువబడెను.
కాని
ఒక
మాటయినను
చెప్పలేకపోయెను.
అతడు
శ్రీరామునకు
భయపడి
యూరకుండెను.
అతడు
రామముఖలక్షణమును
చూచి
కాష్ఠమును
పేర్చి
నిప్పంటించెను.
ప్రబలముగా
మండుచున్న
నిప్పును
చూచి
జానకి
సంతోషించెను.
ఆమెకు
లేశమయినను
భయము
లేకపోయెను.
"ఓ
హుతాశనుడా!
మనోవచన
కర్మలచే
నేను
శ్రీరామచంద్రులను
తప్ప
మరెవరిని
నా
మనస్సులో
ధ్యానించి
యుండలేదు.
ఓ
పావకుడా!
నీవు
సకలజీవుల
హృదయములలో
నివసించియుందువు.
శ్రీఖండచందనమువలె
నీవు
నాకు
శీతలుడవగుము"
అని
శ్రీరామ
ప్రభువును
స్మరించి
అగ్నిలో
ప్రవేశించెను.
శ్రీఖండచందనమువలె
అగ్నిహోత్రుడు
శీతలుడయ్యెను.
అగ్నిదేవుడు
బ్రాహ్మణ
రూపమును
ధరించి
వేదవిదితమగు
జానకిని
-
నిజమగు
సీతను
వెంట
తీసుకొనివచ్చి
క్షీరసముద్రుడు
మహాలక్ష్మిని
విష్ణుమూర్తికి
సమర్పించిన
విధమున
ఆమెను
శ్రీరామునకు
సమర్పించెను.
నూతనముగా
వికసించిన
నీలనీరజము
ప్రక్కను
బంగారు
పద్మపు
మొగ్గవలె
సీత
రాముని
ఎడమప్రక్కన
శోభించెను.
దేవతలు
సంతోషించిరి.
దేవదుందుభులు
మ్రోగెను.
అంత
విభీషణుడు
నగరములోనికి
వెళ్ళి
దివ్యవస్త్రములు,
నవరత్నములు,
పుష్పకవిమానమున
బెట్టి
వానిని
తీసుకొనివచ్చి
శ్రీరాముని
యెదుట
పెట్టెను.
అప్పుడు
శ్రీరాముడు,
ఓ
సఖుడా!
ఈ
విమానముపై
బెట్టిన
వస్త్రాధ్యలంకారములను
పట్టుకొని
అంతరిక్షమునకు
కుప్పించి
నీవు
వానిని
వర్షింపుము
అనెను.
విభీషణుడు
ఆ
ప్రకారము
గావించెను.
వానరులు
వారి
వారి
మనసుకు
తోచినటుల
దానిని
గ్రహించిరి.
ఆ
మణులను
చూచి
వానరులు
ఫలములని
భ్రమించిరి.
వానిని
నోటితో
పట్టుకొని
రాళ్లని
తెలుసుకొని
విసర్జించిరి.
వానరుల
చేష్టలకు
సీతారామలక్ష్మణులు
నవ్విరి.
10
▾
Meaning
Keep
వానర
భల్లూకములు
వస్త్రాలంకారమును
ధరించి
రామునివద్దకు
వచ్చిరి.
అనేక
రంగు
రంగుల
వానరభల్లూకములను
చూచి
రాముడు
పరమానందభరితుడయ్యెను.
వారిని
ఆదరించి
ఇట్లు
సంభాషించెను:
ఓ
వానరులారా!
మీ
బలముచేతనే
నేను
రావణుని
సంహరించితిని.
విభీషణునికి
రాజ్యము
నిచ్చితిని.
ఇక
మీరు
మీమీ
స్వగృహముకు
నిష్క్రమింపుడు.
సదా
మీ
వెంటనే
ఉందును.
భయపడవలదు
అని
అందరినీ
అభయహస్తముచే
ఓదార్చెను.
శ్రీరాముని
వచనములు
విని
ప్రేమాతిశయముచే
వ్యాకులులై
చేతులను
జోడించుకొని,
ఓ
నాథా!
మీ
మాటలు
మీకే
వర్తించును.
మీ
మాటలవలన
మా
మనసులు
భ్రమించుచున్నవి.
మేము
దీనులము.
మాకు
నాథులు
మీరే.
మీరు
త్రిలోకాధిపతులు.
ఎన్నడైననూ
మశకము
గరుత్మంతునకు
సహాయము
చేయగలదా?
సూర్యుని
చిన్న
ప్రమిద
దీపమును
చూపగలదా?
అని
రామునికి
నమస్కరించి
కంటిధారలను
కార్చిరి.
రామాజ్ఞ
ప్రకారము
వానరభల్లూకములు
రామరూపమును
మనస్సులో
ధ్యానించుచు,
హర్ష
విషాదములతో
కూడినవారై
అనేక
విధముల
విన్నపములు
చేయుచు
వెడలిరి.
జాంబవంతుడు,
నలుడు,
నీలుడు,
సుగ్రీవుడు,
హనుమంతుడు,
విభీషణుడు
మొదలగు
మహావీరులు,
యోధులు
ప్రేమచే
కన్నీరు
కార్చుచుండిరి.
రెప్పవేయక
వారు
శ్రీరాముని
ముఖమును
చూచుచూ
నిలువబడిరి.
వారి
ప్రేమాతిశయములను
శ్రీరాముడు
చూచి
వారిని
విమానముపై
కూర్చుండ
బెట్టుకొనెను.
Previous
←
Ahirāvaṇa
Next
The Triumphal Return to Ayodhyā
→