Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Triumphal Return to Ayodhyā
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
అయోధ్యా
విజయము
ఉత్తర
దిక్కునకు
విమానము
తిరిగెను.
విమానము
పైకి
ఎగిరినప్పుడు
పెద్ద
కోలాహలము
పుట్టెను.
"శ్రీరామచంద్రునికి
జై,
సీతారామలక్ష్మణులకు
జై"
అని
వానరులు
ఘోషించిరి.
ఆ
విమానములో
మహోన్నతమగు
చక్కని
సింహాసనమొకటి
కలదు.
దానిపై
శ్రీ
జానకీ
శ్రీరాములు
కూర్చుండిరి.
సుమేరు
పర్వతశృంగముపై
మేఘముల
మెరుపువలె
వారు
దేదీప్యమానంగా
మెరసిరి.
అంత
పుష్పకము
వేగముగా
నెగిరెను.
శ్రీరాముడు
సీతను
చూచి,
"ఓ
జానకీ!
ఇదిగో
రణస్థలము.
ఇచ్చటనే
లక్ష్మణుడు
మేఘనాథుని
సంహరించెను"
అని
యుద్ధభూమి
యొక్క
గుర్తులన్నియూ
పైనుండి
చూపుచూ
వచ్చెను.
వానరులు
కట్టిన
సేతువును
కూడా
చూపుచూ
వానరుల
ప్రతాపమును,
భక్తిశ్రద్ధలను
అనేక
విధముల
వర్ణించెను.
అతివేగమున
విమానము
దండకారణ్యమునకు
వచ్చెను.
అంత
విమానమును
దింపి
అగస్త్యాది
మహామునుల
ఆశ్రమముల
వద్ద
దిగి
శ్రీరాముడు
సీతాలక్ష్మణ
వానరయోధుల
సహితము
అగస్త్యుల
వారిని
దర్శించి
అతనికి
నమస్కరించి
సెలవు
తీసుకొని
విమానము
అధిష్టించి,
చిత్రకూటపర్వతమునకు
వచ్చెను.
అచ్చట
నివసించుచున్న
మునులను
దర్శించి,
సీతకు
కిష్కింధానగరమును
పై
నుండియే
చూపించి,
వేగముగా
పోవుచున్న
విమానము
నుండి
పావన
యమునా
నదిని,
గంగానదిని
చూపించెను.
వాటిని
చూచి
సీత,
మనస్సులో
నమస్కరించెను.
అంత
వారు
తీర్థరాజమగు
ప్రయాగను
దర్శించిరి.
అక్కడనుండియే
శోభాయమానముగా
వెలుగుచున్న
అయోధ్యను
కూడా
దూరము
నుండి
చూచిరి.
రాముని
ఆగమనమును
చూచి
నిషాదపతి
క్రిందనుండి
నమస్కరించెను.
విమానము
నదీతీరమున
దిగెను.
పరుగెత్తుకొనివచ్చి
రాముని
పాదములపైబడి
నిషాదుడు
కంటిధారలతో
ఆనందమును
భరించుకొనలేక
కౌగిలించుకొనెను.
సీతారామలక్ష్మణులు
నిషాదుని
ఆశీర్వదించి
గంగలో
స్నానమాచరించి
నావను
తెమ్మని
నావనెక్కి
ఆవల
దాటిరి.
పుష్పకమును
కుబేరుని
దగ్గరకు
వెనుకకు
పంపెను.
2
▾
Meaning
Keep
ఇంకను
నగరమును
ప్రవేశించుటకొక
దినమవశేషముండెను.
అప్పుడు
శ్రీరాముడు
హనుమంతునితో
"ఓ
మహావీరా!
నీవు
బ్రాహ్మణ
రూపమును
ధరించి
అయోధ్యా
నగరమునకు
శీఘ్రముగా
వెళ్ళుము,
మా
క్షేమమును
భరతునకు
తెలుపుము.
అతని
క్షేమ
సమాచారములు
తీసుకొని
రమ్ము"
అనెను.
ఆ
మాటలను
విని
హనుమంతుడు
వెంటనే
వెడలెను.
శ్రీరాముడు
సీతాలక్ష్మణయోధుల
సమేతుడై
భరద్వాజాశ్రమమును
చేరెను.
శ్రీరాముని
ఆ
మునిరాజు
స్తుతించెను,
సత్కరించెను.
అయోధ్యలో
రాముని
వియోగముచేత
ఆబాలవృద్ధులు
స్త్రీ
పురుషులు
నిద్రాహారములు
మాని
కృశించి
నీరసించియుండిరి.
నగరమంతటను
వారి
దీనాలాపములు
వినపడెను.
ఎచట
నుండిన
వారచటనే
యుండిరి.
ఒకరివద్దకు
ఒకరు
వెళ్ళుటకు
శక్తి
లేకను,
ఇష్టములేకను
నగరములో
ఎచ్చట
చూచిననూ
విషాదము
కనుపించెను.
ఇంతలో
శ్రీరాముడు
నగరములో
ప్రవేశించనున్నారన్న
వార్త
నగరమంతటా
వ్యాపించెను.
భరతుని
దక్షిణహస్తమును,
నేత్రమును
అదరెను.
భరతుడు
శుభవార్త
రానున్నదని
సంతసించెను.
భరతుడు
ఒక్క
దినము
మాత్రము
కలదని
తలంచుచూ,
దుఃఖించుచూ,
ఎందుచేత
ఇంతవరకు
ఒక్క
వార్తనైననూ
శ్రీరాముడు
పంపకున్నాడని
చింతించి
లక్ష్మణుడెంత
ధన్యుడు?
ఎంత
పుణ్యాత్ముడు?
శ్రీరాముని
చరణకమలములను
అతడు
సేవించుచుండును
కదా?
నేను
కపటిననియు,
కుటిలుడననియు
స్వామి
తెలుసుకొని
నన్ను
నగరములో
విడచి
వెళ్ళెను.
స్వామి
మనసు
మృదుమధురము.
అతడు
దీనబంధువు,
కృపాళుడు,
తప్పక
రేపటిలో
వచ్చునని
తలచుచుండగనే
మహావీరుడు
హనుమంతుడు
బ్రాహ్మణ
వేషమును
ధరించి
భరతునకు
కనుపించెను.
భరతుని
చూచిన
మహావీరుడు
ఆశ్చర్యపడెను.
అతని
శరీరము
కృశించి
నీరసించెను.
అతని
శిరోజములు
జటలల్లుకొనెను.
అతని
నేత్రములు
వెంబడి
నీరు
కారుచుండెను.
భరతుడు
నిరంతరము
రామనామమును
స్మరించుచుండెను.
ఈ
విధముగా
నుండిన
భరతుని
జూచి
హనుమంతుడు
పరమానందభరితుడయ్యెను.
హనుమంతుని
శరీరము
పులకరించెను.
అనేక
విధముల
అతడు
చింతించి,
అమృతోపమాన
వాక్యములను
భరతుని
చెవిలో
చెప్పెను.
"ఓ
భరతుడా!
ఎవని
వియోగమును
సహింపలేక
అహోరాత్రములు
నీవు
దుఃఖించుచుంటివో
ఎవని
గుణగణములను
3
▾
Meaning
Keep
అహర్నిశము
నీవు
జపించుచుంటివో
ఎవరు
దేవతలను,
మునులను
రక్షించెనో,
ఎవరు
సర్వధర్మ
పరిపాలకుడో
అట్టి
శ్రీరామమూర్తి
సురక్షితముగా
సీతాలక్ష్మణులతో
కూడి
విజయము
చేసెను.
అతడు
శత్రువులను
హతమార్చెను.
అతని
ప్రతాపమును
దేవతలు
కొనియాడిరి"
అని
ఆనందభాష్పములతో
హనుమంతుడు
చెప్పెను.
దాహముచే
దప్పిన
మనుజుడు
జలమును
చూచి
సంతసించిన
విధమున
హనుమంతుని
అమృతవాక్కులను
విని
భరతుడు
ఆనందించి!
"ఇది
నా
భ్రమయా!
లేక
నిజముగా
జాగ్రత్తతో
వినుచున్నానా?
అయ్యో,
ఇది
భ్రమయెట్లగును?
ఈ
శుభవర్తమానము
తెచ్చిన
మీరెవరు?
మీరు
ఎక్కడనుండి
వచ్చితిరి?"
అని
ఆ
హనుమంతుని
కౌగిలించుకొని
ఆతురతతో
అడిగెను.
అంత
హనుమంతుడు
"ఓ
భరతా!
నేను
వాయుపుత్రుడను.
నా
పేరు
హనుమంతుడు,
నీవు
మరచితివి
కాబోలు.
ఆనాడు
సంజీవిపర్వతమును
గొనిపోతూ
నేలకూలిన
వానరుడను.
శ్రీరాముల
పాదసేవకుడను"
అని
జవాబిచ్చినతోడనే
ఆ
మాటలు
వినిన
భరతుడు
అత్యాదరముతో
లేచి
సంతోషమును
పట్టలేకపోయెను.
నేత్రముల
నుండి
ఆనందబాష్పములు
జలజల
కారెను,
శరీరమునే
మరచెను.
"ఓ
కపివర్యా!
నా
దుఃఖమును
మటుమాయము
చేసితివి.
నిన్ను
చూచుట
తోడనే
నా
మది
శాంతించెను.
ఏమి
నా
భాగ్యము!
ఈనాడు
రామదూతను
చూచితిని"
అని
మాటిమాటికి
"నా
రామచంద్రుడు
క్షేమమేనా?
నా
తల్లి
జానకి
ఎట్లున్నది?
ఓ
వానరా!
నీకేమి
ప్రత్యుపకారము
చేయగలను.
నీవు
చెప్పిన
శుభవర్తమానమునకు
తగిన
ప్రత్యుపకారము
లోకములో
మరొకటి
నా
బుద్ధికి
తోచుటలేదు.
అందుచేత
నేను
నీ
ఋణమును
దీర్చలేను.
రాముడు
ఏడి
ఎచ్చటనున్నాడు?
అతడు
చేసిన
ఘనకార్యములను
నాకు
వినిపింపుము"
అని
అత్యంత
ఆతురతతో
అడుగుచున్న
భరతుని
చూచి,
హనుమంతుడు
భరతుని
భక్తిప్రపత్తులకు
ఆశ్చర్యపడి
అతని
పాదములకు
నమస్కరించి,
"భరతా!
రాముడు
అయోధ్యకు
సమీపముననే
యున్నాడు.
కొన్ని
నిముషములలో
నీవు
చూడగలవు.
అతని
కార్యములు
వర్ణనాతీతములు,
నీకు
తెలియనివి
కావు.
శ్రీరాముడు
నిన్ను
నిరంతరమూ
తలంచుచూనే
యుండెడివాడు.
నీబోటి
పుణ్యాత్ముడును
నీబోటి
బుద్ధిమంతుడును,
సకల
గుణసంపన్నుడునునగు
4
▾
Meaning
Keep
తమ్ముడు
లోకములో
మరియొకడు
లేడని
జగన్నాథుడు
శ్రీరాముడు
శ్రీముఖముతో
చెప్పెను.
అందుకు
వ్యతిరిక్తము
కలుగునా?"
అనెను.
భరతుడు
ఆ
మాటలు
విని
పట్టలేనంత
సంతోషముతో
"శ్రీరాముడు
నన్నిట్లు
వర్ణించెనా?
నేనెంత
అదృష్టవంతుడను!"
అని
హనుమంతుని
గాఢంగా
ఆలింగనము
చేసుకొనెను.
ఇక
కాలహరణము
చేయకూడదని
భరతుని
దగ్గర
సెలవు
తీసుకొని
హనుమంతుడు
రాముని
వద్దకు
బయలుదేరెను.
భరతుని
సర్వవృత్తాంతమునూ
రామునకు
వినిపించెను.
భరతుని
రెండు
కాళ్ళు
ఒకచోట
నిలువలేదు.
నందిగ్రామము
నుండి
సరాసరి
అయోధ్య
నగరమునకు
వచ్చి
వసిష్ఠుల
వారికి
నమస్కరించి
శ్రీరాముని
వృత్తాంతము
తెలిపి
అనంతరము
అంతఃపురములో
ప్రవేశించి
శ్రీరాముడు
సీతాలక్ష్మణులతో
కూడి
సురక్షితంగా
నగరములో
ప్రవేశించబోవుచున్నాడని
మువ్వురు
తల్లులతో
చెప్పి
ఆనందభాష్పములు
కార్చుచూ
పట్టలేని
ఆనందముతో
గంతులు
వేసెను.
ఆ
మాటలు
విన్న
తల్లులు
త్రుళ్ళిపడి
దిగ్గునలేచిరి.
తత్క్షణము
భరతుడు
"ఈ
శుభవార్తను
నగరమంతయూ
చాటు"మని
ఆజ్ఞాపించెను.
కొన్ని
క్షణములలో
ఈ
వార్త
నగరమంతయూ
వ్యాపించెను.
ప్రజలు,
స్త్రీలు,
పురుషులు,
పిల్లలు,
వృద్ధులు
నలువైపులా
పరువులు
తీసిరి.
వీధులన్నియూ
అలంకరింప
మొదలు
పెట్టిరి.
స్త్రీలు
రకరకముల
పుష్పముల
ప్రోగుచేయ
మొదలుపెట్టిరి.
భరతుడు
సుమంత్రాది
మంత్రులను,
కులగురువులైన
వసిష్ఠాది
గురువులను,
మువ్వురు
తల్లులను,
పండితులను,
పురజనులను,
చతురంగ
బలమును
వెంటబెట్టుకొని
తమ్ముడు
శత్రుఘ్నునితో
కూడి
సంతోషముతో
శ్రీరాముని
దర్శించుటకు
వెడలెను.
అనేక
పురస్త్రీలు
శ్రీరాముని
దర్శించుటకు
మేడలనెక్కిరి.
శ్రీరాముడు
అయోధ్యానగరముయొక్క
శోభను
గూర్చి
వానరులకు
చెప్పుచుండెను.
"ఓ
సుగ్రీవా!
ఓ
అంగదా!
ఓ
విభీషణా!
అయోధ్య
పరమపవిత్రమైనది;
సుందరమైనది"
అని
అనేక
విధముల
అయోధ్యను
వర్ణించుచుండగా
భరతుడు
చతురంగబలసమేతుడై
వ్రాలెను.
ప్రజలు,
పండితులు,
తల్లులు,
శరత్కాల
రాకాచంద్రుని
చూచి
సముద్రము
పొంగిన
విధమున
శ్రీరామచంద్రుని
చూచి
సంతోషించిరి.
వారి
కోలాహలము
మిన్నుముట్టెను.
తల్లులు
భరించలేని
ఆనందముతో
కొమారుని
కౌగిలించుకొని
మైమరచిరి.
5
▾
Meaning
Keep
సీతారామలక్ష్మణులు
తల్లులకు
నమస్కరించిరి.
ఉభయుల
ఆనందమునకు
అంతులేకపోయెను.
రాముని
వియోగదుఃఖముతో
కృశించి
నీరసించియుండిన
భరతుని
చూచి
శ్రీరాముడు
ప్రేమతో
దగ్గర
తీసుకొని
అనేక
విధముల
భరతుని
వర్ణించెను.
వసిష్ఠ
జాబాలి
వామదేవాది
మహర్షులను
చూచి
పాదములకు
సీతారామలక్ష్మణులు
నమస్కరించిరి.
మహాఋషులు
సహితము
శ్రీరాముని
దర్శించి
ఆనందబాష్పములను
నిలుపుకోలేకపోయిరి.
పండితులు
"శతమానం
భవతి,
శతమనంతం
భవతి,
శతమైశ్వర్యం
భవతి,
శతం
దీర్ఘమాయుః"
అని
మిన్నుముట్ట
దీవించిరి.
భరతుడు
శత్రుఘ్నుడు
శ్రీరామచరణారవిందములకు
సాష్టాంగ
దండప్రణామము
లాచరించిరి.
శ్రీరాముడు
ఎంత
లేవమన్ననూ
పాదములపై
పడిన
సోదరులు
లేవలేకపోయిరి.
అంత
లక్ష్మణశ్రీరాములు
ఇరువురినీ
లేపి
సోదరులను
కౌగలించుకొని
ఒకరినొకరు
చూచుకొని
ఆనందభాష్పములు
విడుచుకొనిరి.
ఆనందములో
వారల
సౌందర్యతేజోఃపుంజములు
దేదీప్యమానముగా
వెలసెను.
అన్నదమ్ములు
నలువురూ
ఒకే
విధముగా
కనుపించిరి.
మూర్తీభవించిన
సౌందర్యరాసులుగా
తోచిరి.
వియోగదుఃఖమును
మరచి
సంయోగానంద
సాగరమున
మునిగిరి.
విభీషణ,
సుగ్రీవ,
నల,
నీల,
అంగద,
హనుమంతాదులు
సుందరములగు
శరీరములను
ధరించిరి.
వారిని
చూచి
పురజనులు
చాలా
ఆనందించిరి.
భరతుని
వ్రతమును
సుశీలతను
పురజనులు
వేనోళ్ళ
కొనియాడిరి.
పురజనుల
భక్తి
ప్రపత్తులను
చూసి
శ్రీరాముడు
మెచ్చుకొనెను.
వానరులను,
విభీషణుని
పిలిచి
వారలకు
సోదరులను
గురువులను
పరిచయము
చేసెను.
మువ్వురు
తల్లులను
చూపి
వీరు
మా
తల్లులని
పరిచయము
చేసిన
తోడనే
అందరూ
నేలవ్రాలి
నమస్కరించి,
మహాధన్యులు,
సాక్షాత్తు
పరమాత్ముణ్నే
కన్నతల్లులెంత
పూజనీయులని
వారల
ఆశీర్వాదములు
ఆశించిరి.
కౌసల్యాదేవి
"వానరులారా!
మీరు
నా
బిడ్డ
శ్రీరామునితో
సమానులు.
మిమ్ముల
శ్రీరాముడు
ఎప్పుడు
మరువకుండ
కాపాడును
గాక!"
అని
దీవించెను.
అంత
అందరూ
ఆయారీతిగా
నిర్ణయించిన
రథములలో
కూర్చొని
నగరమున
ప్రవేశించిరి.
బంగారు
పాత్రలను
వసంతముతో
నింపి
పురజనులు
తమతమ
6
▾
Meaning
Keep
ద్వారములవద్ద
నిడిరి.
గృహములకు
జెండాలు
కట్టిరి.
రాజవీధుల
పన్నీరు
చల్లిరి.
రాముని
వియోగముతో
వాడిన
పురజనుల
ముఖములు
రామచంద్రుని
చూచిన
తత్క్షణమే
సూర్యోదయమును
చూచిన
కమలమువలె
వికసించెను.
వారి
ముఖములు
కళకళలాడెను.
జయజయధ్వనులు
మిన్నుముట్టెను.
పురవీధులలో
రాముని
రథము
ప్రవేశించెను.
వీధులు
కిటకిటలాడెను.
మంగళహారతులాకాశమున
చుక్కలవలె
నెటు
చూచినా
కనుపించెను.
పన్నీరులు
చల్లిరి.
పుష్పవర్షములు
కురిపించిరి.
ప్రజలయొక్క
ఆనందము
హద్దులు
తెగెను.
ఆ
విధముగా
నలుగురు
సోదరులతో
మువ్వురు
తల్లులతో
జానకీదేవిని
కూడి
శ్రీరాముడు
పురవీధులలో
వెళ్ళుతూ
ఉండుట
చూచినవారి
కన్నులెంత
ధన్యములో
వారెంత
పుణ్యులో
అని
వేనోళ్ళ
వారిలోవారు
పొగడుకొనిరి.
Previous
←
The Slaying of Rāvaṇa
Next
The Coronation of Śrī Rāma
→