Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Coronation of Śrī Rāma
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
14
శ్రీ
రామ
పట్టాభిషేకము
అందరును
రాజభవనము
చేరిరి.
అంతఃపుర
స్త్రీలు,
పరిచారకులు
మహదానందముతో
పాదములు
కడిగి
స్వాగతము
చెప్పిరి.
వసిష్ఠులవారు
బ్రాహ్మణులను
పిలిచి
ఈ
శుభదినమున,
ఈ
శుభనక్షత్రమున,
శుభయోగమున,
శుభకరణ
శుభలగ్నమున
శ్రీరామచంద్రుడు
పట్టాభిషిక్తుడగును.
కనుక
మీరందరూ
దయచేయుడని
ఆజ్ఞాపించెను.
అంత
బ్రాహ్మణులు
"శ్రీరామ
పట్టాభిషేకము
జగన్మంగళదాయకము.
విలంబనము
చేయక
రాముని
లలాటమునకు
పట్టము
కట్టుడు"
అని
చెప్పిరి.
అప్పుడు
వసిష్ఠులవారు
సుమంతుని
పిలిచి,
"మంత్రివర్యా!
రాముని
పట్టాభిషేకమహోత్సవము
కనుక,
శీఘ్రముగ
చతురంగబలముల
నాయత్తము
చేయ"మని
యాజ్ఞాపించెను.
ఆ
మాటలు
వినిన
సుమంతుడు
ఆనందముతో
పొంగిపొరలి
కొన్ని
క్షణములలోనే
అందుకు
తగిన
ఏర్పాటు
చేసెను.
గజములను,
అశ్వములను,
రథములను
అలంకరించిరి.
సింహద్వారము
వద్ద
అన్నింటిని
తెచ్చి
నిలబెట్టిరి.
పదాతులును,
రౌతులును
సింగారించుకొని
విచ్చు
కత్తులను
ధరించి
పంక్తిదీర్చి
బరాబరులు
చెప్పుచుండిరి.
మంగళద్రవ్యములు
తీసికొని
వచ్చుటకు
సేనలను
నలువైపుల
పంపి
సుమంతుడు
వచ్చి
గురుచరణములకు
మ్రొక్కి
అన్నియు
సిద్ధముగా
నున్నవని
మనవి
చేసెను.
అయోధ్యానగరముయొక్క
మహోత్సవ
శృంగారము
చూచుటకు
రెండు
కన్నులు
చాలవు.
రామచంద్రుడు
సేవకులను
పిలిచి,
వచ్చిన
సుగ్రీవ,
విభీషణ,
అంగద,
నీల,
నలులకు
స్నానాదులకు
తగిన
ఏర్పాట్లు
గావించుమని
ఆజ్ఞాపించెను.
అతని
ఆజ్ఞని
శిరసావహించి
సేనలు
నలువైపుల
పరుగెత్తి
వారలకు
సర్వసౌకర్యములతో
అన్ని
అనుకూలములు
చేసిరి.
అంత
రాముడు
భరతుని
చేరదీసి
స్వహస్తములతో
అతని
జడలను
విడదీసెను.
దగ్గర
నిలువబడి
మువ్వురన్నదమ్ములగు
భరత,
లక్ష్మణ,
శత్రుఘ్నులచే
రాముడు
2
▾
Meaning
Keep
మంగళస్నానముల
జేయించెను.
పిమ్మట
రామచంద్రుడు
గురువుగారి
ఆజ్ఞగైకొని,
జటలను
విప్పుకొని
మంగళస్నానము
చేసెను.
వీరిట్లు
మంగళస్నానము
లాచరించుచుండ,
కౌసల్యాది
తల్లులు
మువ్వురు
సీతాదేవికి
మజ్జన
మాచరించిరి.
ఆమె
శిరస్సున
కట్టిన
జటలను
మూవురు
అత్తలు
నెమ్మదిగా
విడదీసి
పీతాంబరములు
కట్టించి,
సర్వాలంకారములతో
అలంకరించిరి.
శ్రీమహాలక్ష్మివలె
సీతాదేవి
వచ్చి
శ్రీరాముల
వారి
పార్శ్వము
నలంకరించెను.
కోడలిని
కొమారుని
జూచి
తల్లులు
మువ్వురు
బ్రహ్మానందమును
పొందిరి.
"నేటికి
కదా
మా
జన్మము
ధన్యమైనది.
మా
అభీష్టము
సఫలమయ్యెను.
మా
కన్నులు
పండెను"
అని
తలచుకొంటూ
లక్ష్మీనారాయణులవలె
బ్రహ్మతేజముతో
వెలుగుచున్న
ఆ
సీతారాములను
చూచి
మైమరచిరి.
ఆనందమును
ఆపుకోలేకపోయిరి.
వసిష్ఠులవారు
శ్రీరామచంద్రుని
దివ్యమంగళ
విగ్రహమును
చూచి
భ్రమించెను,
ఆనందించెను.
"ఈ
మహాద్భాగ్యము
నాకు
ఏనాడు
లభించునా
అని
కాలమునకై
వేచియుండిన
గురువుగారి
మనోభీష్టము
కూడా
నేటికి
ఫలించె"
నని
వసిష్ఠులవారు
లోలోన
పట్టలేని
ఆనందమును
పొందెను.
సేనలను
పిలిచి
"రత్నస్తగితమయిన
సింహాసనమును
తెచ్చి
హజారములో
నుంచుడ"ని
ఆజ్ఞాపించెను.
ఆ
సింహాసనము
యొక్క
సొగసు
వర్ణనాతీతము.
దాని
కాంతులు
సూర్యకాంతులవలె
నుండెను.
చూచువారల
కన్నులు
మిరుమిట్లు
కొలిపెను.
వసిష్ఠాది
మహాఋషులకు
బ్రాహ్మణులకు
శ్రీరాముడు
నమస్కరించి,
తల్లులకు
నమస్కరించి,
పురజనులకు,
పెద్దలకు,
సభకు
ఒక్కపరి
నమస్కరించి
సింహాసనము
నధిష్ఠించెను.
సీతారాములు
గద్దియ
నెక్కిరి.
ఆ
యుభయుల
జూచి
ఋషులు,
మునులు,
మహానుభావులు
సంతసించిరి.
బ్రాహ్మణులు
వేదమంత్రములు
పఠించిరి.
ప్రజలు
మిన్నుముట్టునట్లు
జయజయశబ్దములు
పలికిరి.
వైశాఖ
బహుళసప్తమినాడు
శ్రీరామచంద్రుడు
పట్టభద్రుడయ్యెను.
బ్రాహ్మణుల
సెలవును
గైకొని
శ్రీరాముని
లలాటమునకు
వసిష్ఠులవారు
పట్టము
గట్టిరి.
మాటిమాటికి
కుమారునిజూచి
కౌసల్య
పరమానందము
నందెను.
ఇక
సోదరులైన
లక్ష్మణ
భరత
శత్రుఘ్నుల
ఆనందమునకు
అంతులేదు.
వారు
చామరములు
పట్టి,
ఛత్రమును
పట్టి
సీతారాములకు
సేవకులుగా
నిలిచిరి.
"ఇట్టి
భాగ్యము
మాకెప్పుడు
ప్రాప్తించునా?"
అని
తపస్సు
చేయుచుండిరి.
వారి
తపస్సు
నేటికి
ఫలించెనని
పరమానందమొందిరి.
ఆకాశమున
దుందుభులను
మ్రోగించిరి.
గంధర్వులు
పాటలు
పాడిరి.
అప్సరసలు
3
▾
Meaning
Keep
నాట్యమాడిరి.
విభీషణుడు,
సుగ్రీవుడు,
అంగదుడు,
హనుమంతుడు,
జాంబవంతుడు,
నలుడు,
నీలుడు,
దధిముఖుడు,
ద్వివిదుడు,
మైందుడు
మొదలగు
వానర
ప్రముఖులందరూ
ధనుర్బాణములను,
డాల్కత్తులను,
శక్తితోమరములను
ధరించి,
ఇరువైపుల
పంక్తి
దీర్చి
వినయవిధేయతలతో
ఆనందమును
అనుభవించిరి.
నాడు
పార్శ్వమున
సీతతోకూడి
శ్రీరాముడు
సింహాసనము
నధిష్ఠించి
కోటి
మన్మథుల
లావణ్యము
నపహరించెను.
ఆ
రఘుకుల
తిలకమును
చూచి
దేవతలు
మోహించిరి.
రాముడు
కనకాంబరకేయూరములను,
మకరకుండలములను
ధరించి
త్రిజగన్మోహనాకారముతో
ప్రకాశించెను.
ఆ
దర్శనమును
చూచినవారు
ధన్యులు.
వారే
పుణ్యులు.
పూర్వము
సముద్రుడు
రావణునకు
ఒక
రత్నమాల
బహుమతి
చేసియుండెను.
ఆ
మాలను
పట్టుకొని
విభీషణుడు
లేచి
శిరస్సువంచి
సీతాదేవికి
అందించెను.
ఆమె
చేతియందు
అందుకొనెను.
ఆ
మాలయొక్క
కాంతిజ్యోతులు
సభామందిరమునంతయూ
మిరుమిట్లు
కొలిపెను.
అంత
సీత
శ్రీరాముని
ముఖమును
చూచెను.
ఆమె
అంతరంగమును
గ్రహించి
శ్రీరాముడు
"సీతా!
ఈ
సభ్యులలో
నెవరియందు
నీకు
దయకలదో
వారికి
దానిని
బహుమతి
చేయు"మని
చెప్పెను.
అంత
సీత
క్షణము
యోచించి
హనుమంతుని
వైపు
చూచెను.
ఆమె
కృపాదృష్టి
జూచి
హనుమంతుడు
జోహారులనుచు
వచ్చి
సీతయెదుట
శిరస్సు
వంచి
నిలచెను.
ఆ
హారము
సీత
స్వహస్తముతో
హనుమంతుని
కందించెను.
దాని
ప్రకాశమును
అన్ని
వైపులా
త్రిప్పి
త్రిప్పి
చూచుచూ
హనుమంతుడు
అపరిమితానందముతో
"ఇందులో
ఏమి
విశేషమున్నదో"
అని
చూడగోరెను.
మాలను
త్రెంపి
ఒక్కొక్క
రత్నమునే
తీసి
నోటిలో
పెట్టుకొని
కొరికి
చెవిదగ్గర
పెట్టుకొని
చూచి
మరుక్షణమునే
ఆ
ముక్కలను
పారవేయుచుండెను.
ఈ
విచిత్రమును
జూచి
సభికులు
నిశ్చేష్టితులయిరి.
అంత
మిగిలిన
రత్నములయందు
కూడా
ఏమీ
లేదని
క్రింద
పారవేసెను.
ఆ
సభలో
అతనిని
మందలించు
వారెవ్వరునూ
లేకపోయిరి.
అందరూ
తమలో
తాము
గుసగుసలాడిరి.
"ప్రేమతో
దయతో
సీతాదేవి
అందించిన
విలువగల
వజ్రాలహారమును
ఈరీతిగా
చేసిన
ఈ
కోతి
యెవరా"
అని
తమలో
తాము
హనుమంతుని
నిందించిరి.
4
▾
Meaning
Keep
కానీ
బైట
చెప్పలేకపోయిరి.
"ఎంతో
విలువైన
వజ్రాలమాలను
ఈ
రీతిగా
అవమానపరచెగదా
-
నా
మాల
కింతటి
దురవస్థ
వచ్చెనా?"
అని
విభీషణుడు
కూడ
లోలోన
చాలా
విచారించెను.
ఈ
విధముగా
సభలోని
వారందరూ
ఒక్కొక్కరు
ఒక్కొక్క
రీతిగా
నూహలు
పెంచుకొనుటచే
కొంత
అసంతృప్తి
కలిగెను.
అందులో
ఒక
రాజు
ధైర్యముచేసి
లేచి,
"ఓ
మహావీరా!
ఆ
రత్నముల
నెందులకు
త్రుంచితివి?
ఇది
నీకు
సరియా?
ఇందులో
అంతరార్థమేమియో
మాకు
తెలిపి
మమ్ముల
శాంతపరచుము"
అని
అడిగెను.
హనుమంతుడు
అతని
వచనములు
విని,
"ఓరాజా!
ఈ
నీలమాణిక్యములో
పవిత్రమైన
రామనామమున్నదా
లేదా
అని
చూడగోరితిని.
కానీ
అందులో
రామనామము
కానరాలేదు.
రామనామము
లేనిమాల
రాళ్ళతో
సమానము
అని
దానిని
నేలవేసితిని"
అని
ప్రత్యుత్తరమిచ్చెను.
"అయ్యా,
హనుమంతా!
ప్రతి
పదార్థమునందునూ
రామ
నామముండవలెననియా
నీ
అభిప్రాయము?
ఇది
అసాధ్యము
కదా?"
అని
రాజు
తర్కించెను.
అందులకు
హనుమంతుడు
"రామనామములేని
పదార్థములవల్ల
లాభమేమిటి?
అట్టి
పదార్థము
నాకక్కరలేదు"
అని
రాజు
వచనములను
ఖండించెను.
రాజు
తిరిగీ
"హనుమంతా!
మంచిదే,
రామనామము
లేనిదానిని
నీవు
ధరించవు.
సహించవుకదా?
అట్లయిన
నీ
శరీరములో
రామనామమున్నదా?
దానిని
నీవు
నిరూపించగలవా?"
అని
గట్టిగా
నిలదీసి
అడుగగా,
హనుమంతుడు
ఫక్కున
నవ్వి
"చూడుము"
అని
తన
దేహము
నుండి
ఒక
వెంట్రుకను
తీసి
రాజు
చెవిదగ్గర
పెట్టెను.
అది
"రామారామా"
అను
శబ్దమును
ఉచ్చరించుట
చూచి
ఆ
రాజు
పరమాశ్చర్యముతో
హనుమంతునికి
నమస్కరించి
తనను
క్షమించుమని
కోరెను.
అంత
రామమూర్తి
హనుమంతుని
కౌగిలించుకొని
"హనుమంతా!
నేను
నా
పట్టాభిషేకము
సమయమున
నీకేమి
బహుమతి
నివ్వగలను?
నీకు
ఇవ్వదగిన
బహుమతి
నా
దగ్గర
వేరేమియూ
లేదు.
నన్ను
నేను
యిచ్చుకొందును;
కైకొనుము"
అని
తన
దేహమును
హనుమంతుని
బాహువులకు
అప్పజెప్పెను.
ఈ
దృశ్యమును
చూచి
సభికులు
జయ
జయధ్వనులు
చేసిరి.
"హనుమంతుని
వంటి
వ్యక్తి
లోకమున
లేడ"ని
కొనియాడిరి.
హనుమంతుని
భక్తి
ప్రపత్తులను
వర్ణించిరి.
రాముడు
లేచివచ్చి
బైట
క్రిక్కిరిసి
తన
దర్శనమునకై
వేచియుండిన
ప్రజలకు
తన
మంగళస్వరూపమును
5
▾
Meaning
Keep
దర్శింపజేసెను.
ప్రజలు
ఆ
సుందర
స్వరూపుని
చూచి
బ్రహ్మానందమొందిరి.
వచ్చిన
వారలందరికీ
భోజనాదులు
ఏర్పాట్లు
చేయించెను.
విరివిగా
ధనకనకవస్తువాహనాదులు,
గృహములు,
బట్టలు
దానము
చేసెను.
ఈ
వైభవమును
చూచి
వానరులు
విభీషణుడు
పరమానంద
మగ్నులైరి.
అహోరాత్రములు
గమనిక
లేక
రాముని
వానరులు,
విభీషణుడు
ఆరుమాసములు
సేవించిరి.
ఆరుమాసములు
వారిదృష్టిలో
ఒక
దినముగా
గడిచిపోయెను.
వారు
గృహములను,
వారి
కుటుంబములను,
రాజ్యములను
మరచిపోయిరి.
తుదకు
రాముడు
ఒకనాడు
సఖులనందరినీ
హజారములో
సమావేశము
చేసి
వారినందరినీ
ఉచితాసనములపై
ఆసీనులగావించి
మృదుమధుర
వచనములతో
"ఓ
సఖులారా!
మీరు
నా
విషయములో
విశేషముగా
శ్రమపడితిరి.
మీ
యెదుట
మిమ్ములను
స్తుతించుట
సంభావితము
కాదు.
మీ
గృహములను
విడిచి,
మీ
ఆలుబిడ్డలను
విడిచి,
ఆస్తిపాస్తులను
త్యజించి,
నా
నిమిత్తమై
పాటుపడితిరి.
మీకంటే
నాకు
వేరు
మిత్రులు
లేరు.
అందుచేత
మీయందు
నాకు
విశేషమైన
దయ,
ప్రేమ
కలవు.
నా
తల్లిదండ్రులకంటే,
నాసోదరులకంటే,
నా
రాజ్యము
కంటే,
నా
ప్రజలకంటే
-
కడకు
జానకి
కంటే
మీరే
నాకు
ప్రియులు.
ఇది
నా
నిశ్చయము.
కాన
మీరు
మీమీ
గృహములకు
పొండు.
నన్ను
మీ
హృదయములందు
ప్రతిష్ఠించుకొని
భక్తి
శ్రద్ధలతో
సేవించుడు.
మీ
వెంటనే,
జంటనే,
యింటనే,
కంటనే
యుండి
కనుపించుచుందును.
కరుణించుచుందును"
అని
దయా
ప్రేమవచనములు
పలికెను.
రామచంద్రుని
చూచి
వానరులు,
విభీషణుడు
తమ
దేహములను
మరచిరి.
తామెచ్చటనున్నామా
అన్నది
వారికి
తోచదు.
నిలువు
గ్రుడ్లు
పెట్టుకొని
కంటిధారలు
కార్చుచూ
నిలుచుండిరి.
ఒక్క
మాటైననూ
చెప్పలేకపోయిరి.
నోరులు
ఆడుచుండెను.
అంత,
రామాజ్ఞ
ప్రకారము
దివ్యాభరణములు,
వస్త్రములు
సేవకులు
తీసుకొని
వచ్చిరి.
వాటిని
లక్ష్మణభరతశత్రుఘ్నులకు
అందించి,
వారినే
"ఈ
వానరులకు
స్వయముగా
అలంకరింపు"దని
ఆజ్ఞాపించెను.
లక్ష్మణ,
భరత
శత్రుఘ్నులు
రామాజ్ఞ
ప్రకారము
వానరవీరులకు
విభీషణునకు
చక్కగ
పీతాంబరములతో
అలంకరించి
ఆభరణములు
కంఠములందు
వేసిరి.
కాని
వానరులు
ఏమి
చేసినను
కదలక
మెదలక
స్తంభించి
నిలచి
కంటిధారలు
కార్చుచూ
తమ
దృష్టి
శ్రీరాముని
పాదములపై
6
▾
Meaning
Keep
కేంద్రీకరించి
యుండిరి.
చేయునది
లేక
అందరూ
శిరస్సులు
వంచి
నమస్కరించిరి.
అంత
రాముడు
వారలను
లేవదీసి
కౌగిలించుకొనెను.
"ఓ
వానరులారా!
మిత్రులారా!
మీకు
నా
సారూప్యముక్తి
నిచ్చితిని.
కొంతకాలము
మీరు
మీమీ
కర్తవ్యములను
నిర్వర్తింపుడు.
మీ
మీ
బాధ్యతలను
మీరు
ఆచరించుడు.
రాజ్యపాలన
చేయుడు.
రాజసుఖముల
ననుభవింపుడు"
అని
అనేక
ప్రకారముల
వారికి
బోధించి,
పొమ్మని
శలవిచ్చెను.
భరతశత్రుఘ్నులు
వానరుల
భక్తిని
మెచ్చుకొనిరి.
రామాజ్ఞ
ప్రకారము
కొంత
దూరము
లక్ష్మణ
భరత
శత్రుఘ్నులు
కూడా
వానరుల
వెంట
వెళ్ళి
సాగనంపుటకై
బయలుదేరిరి.
వారందరు
రథములలో
వెనుక
దృష్టిని
పెట్టుకొని
అయోధ్యనే
చూచుచూ,
కంటిధారలు
కార్చుచూ
పోవుచుండుట
చూచి
లక్ష్మణ
భరత
శత్రుఘ్నులు
వారి
బాధను
చూడలేకపోయిరి.
వారి
భావములలోని
అంతరార్థమును
గుర్తించి
వారి
వేయివిధముల
పొగడిరి.
నదిని
దాటించి
లక్ష్మణ
భరత
శత్రుఘ్నులు
తిరిగి
అయోధ్య
చేరిరి.
వారితో
హనుమంతుడు
వెనుకకు
వచ్చెను.
అనేక
విధముల
ప్రార్థించి
సుగ్రీవుని
సెలవు
తీసుకొని
ఒక
పది
దినములు
శ్రీరాముని
సేవించి
వత్తునని
భరించలేని
వియోగముతో,
ఎంత
వలదన్ననూ,
లక్ష్మణుని
వెంట
అయోధ్యకు
చేరెను.
ఒక
దినము
శ్రీరాముడు
సోదరులతోను
ప్రియుడగు
హనుమంతునితోను
కలిసి
యొక
ఉద్యానవనమును
చూచుటకు
వెడలెను.
ఆ
వనము
పుష్పములతోను,
ఫలములతోను
నిండియుండెను.
అక్కడ
శ్రీరాముడు
ఒక
ఉన్నతాసనముపై
కూర్చొనెను.
సోదరులు
ప్రక్కప్రక్కన
కూర్చొనిరి.
అప్పుడు
సోదరులు
శ్రీరాముని
ఏవో
కొన్ని
ప్రశ్నలు
అడగ
సంకోచించిరి.
వారు
హనుమంతుని
చూచి
వారల
మనోభావములను
అతనికి
తెలిపిరి.
హనుమంతుడు
ప్రశ్నవేసిన
యెడల
శ్రీరాముడు
స్వయముగా
ప్రత్యుత్తరము
నిచ్చునని
వారు
తలంచిరి.
సర్వాంతర్యామి
అయిన
రాముడు
గుర్తెరిగి
"ఓ
హనుమంతుడా!
ఏమి
నీవు
తెలుసుకొనగోరుచుంటివి,
అడుగుము"
అని
పలికెను.
"ఓ
దీన
రక్షకా,
తమ్ముడు
భరతుడు
మిమ్ముల
నొక
ప్రశ్న
అడగతలచెను.
కానీ
అతడు
సంశయపడుచుండెను.
మీ
యెదుట
అతడు
సిగ్గుపడుచున్నాడు"
అని
హనుమంతుడు
చేతులు
జోడించి
నమస్కరించి
విన్నవించెను.
"ఓ
వాయుపుత్రా!
నా
స్వభావము
నీకు
తెలియును
కదా?
నాకు
భరతునకు
యే
విధమైన
భేదము
లేదు
7
▾
Meaning
Keep
కదా?"
అని
శ్రీవారు
చెప్పిరి.
శ్రీరాముని
వచనములను
భరతుడు
విని
వారి
పాదములకు
మ్రొక్కి
"ఓ
ప్రణతార్తిహరా,
ఆలకింపుము.
నా
తప్పులు
క్షమించి
నన్ను
రక్షింపుము.
ఏ
సందేహములు
నాకు
లేవు,
స్వప్నమందైననూ
శోకమోహములు
లేవు.
ఇదంతయూ
నీ
కరుణాకటాక్షము.
ఓ
స్వామీ!
నీవు
సకల
గుణసంపన్నుడవు.
సత్పురుషులకు
దుర్మార్గులకు
గల
తారతమ్యమును
వివరించి
చెప్పుము"
అని
ప్రార్థించెను.
"ఓ
తమ్ముడా!
వేదపురాణములలో
చెప్పిన
విధమున
సత్పురుషుల
గుణములు
అనంతములు.
చందన
తరువునకును
గొడ్డలికిని
యెట్టి
సంబంధము
కలదో
సత్పురుషులకు
దుర్మార్గులకు
అట్టి
సంబంధము
కలదు.
చూడుము.
గొడ్డలి
చందనతరువును
నరికినను
దాని
సుగంధమును
గొడ్డలికిచ్చును
కదా!
ప్రాణము
దీసుకొన
వచ్చిన
దానికి
సహితము
అది
సుగంధము
నిచ్చును.
అందుచేత
శ్రీగంధము
సర్వజనసమ్మతము.
దేవతలు
దానిని
శిరస్సుపై
ధరింతురు.
హితవు
చేసిన
వృక్షమున
కపకారము
చేయుటవలన
గొడ్డలికి
వచ్చినపాట్లు
చూడుము.
దానిని
నిప్పులో
కాల్చి
సుత్తితో
కొట్టుచుందురు
కదా!
ఈ
ప్రకారమే
ఖలులు
సత్పురుషులకు
దుఃఖము
నిచ్చెదరు.
అయినను
సజ్జనులెప్పుడును
వారికి
ఉపకారమే
చేయుచుందురు.
దీని
ఫలమేమి?
సజ్జనులు
స్వర్గమునకు
పోదురు.
అనగా
నిరంతర
మానందముగా
నుందురు.
దుర్జనులు
నిరంతరము
అసంతృప్తితో,
దుఃఖములతో
కుములుచుందురు.
వారలు
నరకయాతనల
ననుభవించుచుందురు.
నిందలు
నిష్ఠురములతో
పైకి
ఉల్లాసముగా
కనుపించినను
లోలోన
కృశించుచుందురు."
"సత్పురుషుల
గుణములను
చెప్పెదను
వినుము.
వారు
విషయాసక్తులు
కారు.
సకలగుణశీలసంపన్నులు.
ఇతరుల
సుఖమును
చూచి
సంతసించి,
వారల
దుఃఖములను
చూచి
దుఃఖింతురు.
వారు
సమదర్శనులు.
వారికి
శత్రువులు
లేరు.
వారికి
శత్రుబాధలే
లేవు.
వారు
జ్ఞానవిజ్ఞాన
వైరాగ్య
సంపన్నులు.
వారల
చిత్తములు
కోమలములు,
దీనులయందు
వారికి
దయ
ఉండును.
త్రికరణశుద్ధిగా
వారు
నా
పాదములను
సేవింతురు.
వారికి
మానాభిమానములన్నవి
ఉండవు.
వారు
నిరంతరము
పరోపకారమును
చేతురేకాని
స్వార్థమును
కలయందైనను
కోరరు.
వారల
ప్రవర్తన
స్పటికము.
వారల
హృదయములు
శీతలములు.
వారు
త్యాగశీలులు.
ఎల్లప్పుడు
వారు
సంతోషముగనే
యుందురు.
తమ్ముడా,
యీ
లక్షణముల
నెవ్వడు
కలిగియుండునో
8
▾
Meaning
Keep
అతడు
ఆత్మస్వరూపుడు
అని
తెలిసికొనుము.
ఆత్మస్వరూపుడేమిటి,
నేనే
వారు
-
వారే
నేను
అని
గ్రహింపుము,
వారలకు
దూషణభూషణములు
సమానము.
"ఇక
దుర్జనుల
లక్షణాలను
చెప్పెదను
వినుము.
వారల
సాంగత్యమును
అన్ని
విధములా
విడిచిపెట్టవలెను.
వారల
సహవాసము
వలన
దుఃఖము
ప్రాప్తించును.
పరుల
సంపదలను
చూచి
వారి
హృదయము
లెప్పుడును
పరితపించును.
పరదూషణ
విని
వారు
సంపద
వచ్చినట్లు
తలంచి
సంతసించుదురు.
అరిషడ్వర్గములు
వారిని
ఆశ్రయించి
యుండును.
ఆశ్రితులు
చెప్పినట్లు
వారు
సంచరింతురు.
వారికి
దయాదాక్షిణ్యములు
శూన్యము.
కుటిలులు.
కారణము
లేకయే
పరులతో
కలహింతురు.
ఉపకారము
చేసిన
వారితో
సహా
వారు
విరోధించెదరు.
వారి
మాటలు,
వారి
కార్యములు,
వారి
బోధనములు,
యిచ్చిపుచ్చుకొనుటయు
సర్వమూ
అసత్యములు.
వారి
హృదయములు
కఠోరములు.
నెమలి
పైకిచూచుటకు
చక్కగా
నుండును.
దాని
కేక
వినసొంపుగా
నుండును.
అయిన
అది
పాములను
భక్షించును
కదా!
అటులనే
దుర్జనులని
తెలిసికొనుము.
పరహింసాపరాయణులు,
పరదారాసక్తులు,
పరనిందారతులు,
పాపకర్ములు,
పాపాత్ములు,
మనుజాధములు.
వారికి
యముని
భయము
లేదు.
ఇతరులు
అభివృద్ధి
నొందుట
చూచి,
విని,
పసివట్టినట్లు
వారు
తలనొప్పిచే
బాధపడుచుందురు.
ఇతరుల
విపత్తుల
జూచి
వారు
సంతసింతురు.
పరుల
కష్టములను
చూచి
దేశమునకు
రాజయినట్లు
వారు
సంతోషింతురు.
వారలకు
స్వార్థము
తప్ప
పరోపకారమన్నది
స్వప్నమందైననూ
వుండదు.
వారి
హృదయము
కామక్రోధాదులకు
పుట్టినిల్లు.
వీరికి
తల్లిదండ్రులని,
గురువులని,
పెద్దలని
లక్ష్యము
లేదు.
సత్పురుషులన్నను,
భగవంతుడన్నను
వారలకు
తలనొప్పి
వచ్చును.
వారు
మందమతులు,
అవగుణధాములు,
కామాంధులు.
వీరిని
అధికముగా
కలియుగములో
చూడవచ్చును.
ఓ
తమ్ముడా!
పరోపకారముకంటే
ధర్మము
మరొకటి
లేదు.
పరహింసలకంటే
అధికమగు
పాపము
లేదు.
ఇదియే
వేదపురాణముల
సారము.
ఇదియే
సత్పురుషుల
మతము.
మనుజులై
పుట్టి
పరమహింస
చేయువారు
నీచయోనులయందు
పుట్టి
చచ్చుచుందురు.
మనుజులు
అజ్ఞానాంధకారమునబడి
అనేక
పాపములను
చేయుచుందురు.
ఇట్టివారికి
నేను
ప్రారబ్ధ
కర్మస్వరూపుడనై
కాలాంతరమున
ప్రత్యక్షముగుచుందును.
అట్టి
వారిని
సంసారములో
పడత్రోసి
-
వారిని
శుభ,
అశుభకర్మల
ననుభవింప
చేయుదును."
9
▾
Meaning
Keep
"ఓ
భరతా!
దేవతలును
మునులును
మహాత్ములును
శుభాశుభముల
నిచ్చునట్టి
కర్మలను
విడిచిపెట్టి
సదా
వారు
నన్ను
భక్తితో
భజించెదరు.
వారు
నిష్కామముగా
కర్మల
నాచరించెదరు.
కామ్య
తపస్సులను,
కామ్యకర్మలను
చేసినయెడల
వాటి
శుభాశుభఫలముల
ననుభవించుటకు
దేహమును
ధరించ
జీవులు
సంసారములోనికి
రావలెను.
ఏ
కర్మలు
చేసినను
వాటి
ఫలము
నపేక్షింపక
వాటి
నొనరించినయెడల
మనుజునకు
జ్ఞానము
కలుగును.
భక్తిప్రపత్తులు
అభివృద్ధి
గాంచును.
వాటి
మూలమున
వాడు
ముక్తిని
సామీప్యమున
అనుభవించును.
ఈ
విధముగా
సజ్జన
దుర్జన
లక్షణములను
మీకు
విశదపరచితిని.
ఈ
లక్షణములను
తెలుసుకొనినవాడు
సంసారసాగరములో
బడి
మునిగియుండడు."
"తమ్ముడా!
అనేక
విధములగు
సుగుణ
దుర్గుణములన్నియూ
మాయా
సంకల్పితములని
తెలిసికొనుము.
ఈ
రెండు
గుణములను
లక్ష్యము
చేయనివాడు
సజ్జనుడు.
మహాత్ముడు.
అతనే
ఆత్మస్వరూపుడు.
ఈ
గుణముల
రెండింటికి
వశుడగువాడు
మూర్ఖుడు.
అదియే
అజ్ఞాన"మని
ఈ
ప్రకారము
రాముడు
తమ్ములకు
వివరించెను.
శ్రీరాముని
యుపదేశములు
వారు
విని
స్వాస్థ్యము
పొందిరి.
వారి
హృదయములు
ప్రేమతో
ఉప్పొంగెను.
మాటిమాటికి
వారు
రామునకు
శిరస్సులు
వంచి
నమస్కరించిరి.
అందరికంటే
అధికముగా
హనుమంతుడు
బ్రహ్మానందమొందెను.
అనంతరము
తమ్ములతో
కూడి
హనుమంతునితో
సహా
శ్రీరాముడు
రాజమందిరమునకు
పోయెను.
ఈ
విధముగా
శ్రీరాముని
దినచర్య
నడచుచుండెను.
మరొక
దినమున
పురజనులకు,
గురు,
బ్రాహ్మణులకు
వర్తమానము
పంపెను.
వారలందరు
కొలువుకూటములో
సమావేశమైరి.
వారు
సుఖాసనముల
నధిష్ఠించిరి.
వారిని
చూచి
శ్రీవారీ
విధముగా
ప్రసంగించిరి:
"ఓ
పురజనులారా!
ఓ
గురుబ్రాహ్మణులారా!
నమస్కారము.
నా
మాటలను
శాంతముతో
సాంతముగా
వినుడు.
స్వార్థపరుడనై
దురభిమానముతో
ప్రసంగించుట
కాదు.
నేను
మీ
రాజననని
చెప్పుటయు
కాదు.
మిమ్ముల
చెడుమార్గముల
సంచరింపుడని
బోధించుటయు
కాదు.
నా
మాటలు
మంచివని
మీకు
తోచినయెడల
ఆ
ప్రకారము
సంచరింపుడు.
నా
మాటలు
విని
ఆ
ప్రకారము
నడుచుకొనువాడే
నా
10
▾
Meaning
Keep
స్నేహితుడు.
వాడే
నా
తమ్ముడు.
నేనొక
తప్పుమాట
చెప్పినను,
మీరు
వెనుదీయక,
నా
తప్పును
నాకు
చూపుడు.
అన్ని
జన్మలకంటే
నరజన్మము
దుర్లభము
అని
వేదపురాణములును,
మహనీయులును
చెప్పిరి.
చెప్పుచున్నారు.
ఎంతో
పుణ్యము
చేసియుండినకాని
నరుడై
పుట్టడు.
అది
దేవతలకు
సహితము
దుర్లభము.
నరజన్మము
మోక్షమునకు
ద్వారము.
సకల
సాధనములకు
రాజమార్గము."
"తమ్ములారా!
ఈ
శరీరము
విషయభోగముల
ననుభవించుటకు
కాదు.
సర్వభోగముల
ననుభవించుటకు
కాదు.
ఇవి
అన్నియు
క్షణభంగురములు.
వీని
మూలమున
జనుడు
మరల
సంసారములోనికి
వచ్చును.
అందుచేత
యీ
భోగములన్నియును
దుఃఖములకు
కారణములు.
ఈ
విషయభోగములందాసక్తి
కలవాడు
మూర్ఖుడు.
విషయములు
విషము
వంటివి.
అమృతమును
విడిచి
విషమును
గోరుట
తగునా?
అటుల
విషమును
గోరువాడు
మంచివాడు
కాదు.
చింతామణిని
విడిచి
గాజు
పెంకును
అభిలషించినట్లుందును.
నరశరీరమును
ధరించి
మానవుడు
సంసారసాగరమును
దాటలేకపోయినయెడల
వానివంటి
దౌర్భాగ్యుడును,
మందమతియు
లేడు.
వానివంటి
ఆత్మఘాతకుడు
ఉండడు.
అందుచే
మనుజులై
పుట్టినవారు
సర్వులయందు
దైవము
ఆత్మస్వరూపుడై
ఉన్నాడన్న
సత్యమును
గ్రహించి
జనసేవచేయుచూ
అదియే
దైవసేవగా
భావించి
దైవాజ్ఞలను
శిరసావహించి,
దైవార్పిత
భావముతో
సర్వకర్మలు
గావింతురు.
ఆచరింతురు."
"ప్రజలారా!
ఇహ
పరలోక
సుఖముల
ననుభవింపగోరువారు
నా
మాటలను
లక్ష్యములో
నిడుకొని
వానిని
మరువక
సంచరించుదురు.
అన్ని
మార్గములకంటే
సంసారమును
దాటుటకు
భక్తి
మార్గమే
సులభము.
మనోహరమైనది.
సంసారమును
దాటుటకు
జ్ఞానమార్గము
కష్టము.
ఆ
మార్గమున
అనేక
విఘ్నములు
కలుగును.
మనో
నిగ్రహము
దుర్లభము.
జ్ఞానమార్గమున
నడిచినవానికి
భక్తి
లేనియెడల
నాకు
ప్రియుడు
కాదు.
భక్తివంటిది
మరొకటి
లేదు.
దానికి
స్వతంత్రము
కలదు.
దాని
వలన
సకల
సుఖములు
కలుగును.
సత్సాంగత్యము
లేనియెడల
భక్తి
కలుగదు."
"ఓ
జనులారా!
మీకు
మరొక
రహస్యమును
చెప్పుచున్నాను.
వినుడు.
శివకేశవుల
కేవిధమగు
భేదములు
లేవు.
భగవంతుడు
ఒక్కడే
అని
విశ్వసింపుడు.
రూపనామములు
వేరు
వేరుగాని
దివ్యాత్మ
ఒక్కటే.
అది
అందరియందునూ
సమముగనే
11
▾
Meaning
Keep
యున్నది"
అనిన
రాముని
అమృతోపమానమగు
వచనములను
విని
పురజనులు
శ్రీరామచంద్రునకు
శిరస్సులు
వంచుకొని
నమస్కరించిరి.
"ఓ
స్వామీ!
మా
ప్రాణములకంటే
నీ
మీదనే
ఆశమెండు.
నీ
మూలమున
మా
శరీరములు
దృఢముగ
నుండెను.
మా
గృహములలో
నిత్యమంగళములు
జరుగుచుండెను.
ఇది
అంతయు
నీ
ప్రభావము.
అన్ని
విధముల
మా
దుఃఖముల
పోగొట్టి
మమ్ముల
దరి
జేర్పించితివి.
ఓ
మహారాజా!
నీవు
తప్ప
మాకు
నీవలే
బోధించువారెవరు?
మా
తల్లిదండ్రులు
స్వార్థపరులే
కానీ
మరొకరు
కారు.
మావలన
నీకు
ప్రయోజనము
లేదు.
పరలోకమునకు
పోదగినట్లు
మమ్ములను
శిక్షించితివి.
అదియే
మాకు
జాలును.
ఓ
రాక్షసాంతకా!
నీవునూ
నీ
సేవకులూ
లోకమునకు
ఉపకారులు.
స్వప్నమందైననూ
ఇట్టి
మిత్రుని,
ప్రభువును,
తల్లిని,
తండ్రిని
చూడలేము"
అని
ప్రజలు
వేయి
విధముల
విన్నవించిరి.
వారి
విన్నపములు
విని
శ్రీరాముడు
ప్రసన్నుడయ్యెను.
శ్రీవారి
సెలవు
గైకొని
ప్రజలు
వారి
వారి
గృహములకు
బోయిరి.
ప్రజలు
నిరంతరము
శ్రీవారి
ప్రసంగమును
స్మరించుచూ
కాలము
గడిపిరి.
అయోధ్యలో
ప్రతి
గృహస్థునకు
ఒక్క
పువ్వులతోట
కలదు.
అతడు
దానిని
జాగ్రత్తగా
కాపాడును.
యెల్లప్పుడూ
అచట
వసంతఋతువులో
వలె
అన్ని
కాలములలో
ఆ
చెట్లు
పుష్పించి
ఫలించును.
సదా
భ్రమరములు
ఝుంకారము
చేయుచుండును.
మందసుగంధశీతల
వాయువులు
వీచుచుండును.
అనేక
విధములగు
పక్షులను
బాలురు
పెంచిరి.
అవి
చక్కని
ధ్వనులు
చేయుచుండును.
రాముని
రాజ్యకాలములో
వివిధ
పురజనులు
సిరిసంపదలను
సహస్ర
శేషులైనను
వర్ణింపలేరు.
అంత
ధర్మముగ
రాముడు
రాజ్యమును
పాలించెను.
శ్రీరాముడు
అనేకాశ్వమేధ
యాగముల
నొనరించెను.
కోట్లకొలది
బ్రాహ్మణులకు
దానములనిచ్చి,
వారిని
తృప్తిబొందించెను.
వేదమార్గ
ప్రవర్తనుడును,
ధర్మరక్షకుడు,
గుణాతీతుడనగు
శ్రీరాముడను
సకలగుణ
సంపన్నురాలగు
సీతాదేవియు
ధర్మమార్గము
నవలంబించి
మెలగుచుండిరి.
తాపత్రయములు
రాముని
కాలములో
నశించెను.
జనులు
పరస్పరానురాగము
కలవారై
యుండిరి.
వేదములలో
చెప్పబడిన
ప్రకారము
వారి
వారి
కులధర్మముల
ననుసరించి
ప్రవర్తించిరి.
తపములు,
దానములు,
యజ్ఞములు,
జ్ఞానమును-ఈ
నాల్గు
ధర్మములు
యథావిధిగా
లోకములో
జరుగుచుండెను.
స్వప్నమందైననూ
ప్రజలు
పాపచింతలు
చేసెడివారు
కారు.
స్త్రీ
12
▾
Meaning
Keep
పురుషులు,
వృద్ధులు,
బాలురు-సర్వులూ
శ్రీరామచింతను
నిరంతరము
చేయుచుండెడివారు.
ఏ
విధమగు
పీడలునూ
కానరావు.
దరిద్రులును,
దుఃఖితులును,
దీనులును,
మూర్ఖులును,
కురూపులును-ఇట్టి
మనుజులు
రాముని
కాలమున
కానరాలేదు.
అందరును
సర్వలక్షణ
సంపన్నులు.
ఒకరికి
దాంబికము
లేదు.
మఱొకరికి
అసూయ
లేదు.
అందరూ
ఆత్మజ్ఞానులు,
ధర్మరతులు,
దయా
దాక్షిణ్యములు
కలవారే.
ఒకరి
సుగుణములను
మరొకరు
మెచ్చుకొనుచుండిరే
కాని
అసూయకు
చోటిచ్చెడివారు
కారు.
లేదా
అహంకారమునకు
తావిచ్చెడి
వారుకారు.
సప్త
ద్వీపములతో
కూడిన
భూమండలము
యావత్తును
సముద్రమువరకును
రాముని
యేకచ్ఛత్రాధిపత్యము
క్రిందనుండెను.
ఈ
సామ్రాజ్యమునకు
శ్రీరాముడే
స్వరాట్టు.
రామరాజ్యములో
సామదానములు
పూర్తించి
యుండెను.
బేధదండనములు
కనరావు.
దండము
యతీశ్వరుల
చేతిలో
మాత్రమే
కనబడును.
దము
రాగములోను
నృత్యములోను
కనుపించును.
నిగ్రహము
ఆత్మనిగ్రహములో
కనుపించును.
శత్రువులే
లేని
సమయమున
వారిని
నిగ్రహించుటయెట్లు?
నిరుపమానమగు
వాపీకూపతటాకములు
అనేకములు
ఆ
నగరమున
కలవు.
దాని
నిర్మల
జలములేమి,
వాని
చక్కని
రూపు
లేమి,
వాని
సొగసు
చూచి
మునులు,
ఋషులు
ఆనందించెడివారు.
సిగ్గుపడెడివారు.
నానా
రంగులు
కల
కమలములు,
ఆ
సరోవరములలో
వికసించియుండెను.
దానియొద్దల
అనేక
పక్షులు
ధ్వనులు
చేయుచుండెడివి.
శుక
పిక
పారావతములు
మధురస్వరముతో
గానము
చేయుచుండెడివి.
ఆ
నగరము
స్వర్గమునకంటే
అధికముగ
నుండుటచే
అందరూ
దానిని
చూచి
భ్రమించిరి.
ఒక
దినమున
సకల
సుఖదాయుడగు
శ్రీరాముని
దర్శించుటకు
వశిష్ఠుడు
రాజమందిరమునకు
వచ్చెను.
అర్ఘ్యపాద్యములనిచ్చి
శ్రీరాముడతనిని
సత్కరించెను.
ఆ
మునిరాజు
చేతులు
జోడించి,
"హే
కృపాసింధూ!
నా
మనవి
ఒకటి
కలదు.
మీ
లీలామానుషచర్యలు
కన్నులారా
కాంచుచుంటిని.
నా
మనసున
గొప్ప
సందేహము
పుట్టెను.
నీ
ప్రభావము
అపారము.
వేదములకు
సహితము
నీ
సంగతి
బాగుగా
తెలియదు.
ఓ
స్వామీ!
నేను
నిన్నెటుల
వర్ణించగలను?
పురోహితకర్మ
నీచమైనది.
వేదపురాణశాస్త్రములు
పురోహితవృత్తిని
దూషించుచున్నవి.
యజమానుని
13
▾
Meaning
Keep
శుభాశుభకర్మలలో
సగము
పురోహితుని
వంతుకు
వచ్చును.
కనుక
అది
ద్రోహము.
మొదట
ఈ
పురోహితకర్మ
స్వీకరించుటకు
నేను
సమాధానపడలేదు.
అప్పుడు
బ్రహ్మ
నన్ను
చూచి
'నాయనా!
నీకు
రాబోవు
సంగతి
తెలియదు.
తప్పక
నీవా
పనిని
చేయుము.
అందువలన
మున్ముందు
నీకు
లాభము
కలుగును.
పరబ్రహ్మము
రఘుకులము
నందవతరించును'
అని
నొక్కి
చెప్పి
నన్నాపనికి
మెడలు
వంచెను.
అందుచేత
దానికి
నేనొడంబడితిని.
యే
సత్పదార్థమును
వానిని
చేయకయే
సులభముగా
బొందగలిగితిని.
ఈ
సత్కర్మలకు
పరమార్థమే
లక్ష్యము.
ఇంతకంటే
మంచిమార్గమును
నే
ననుసరింతును.
ఓ
దేవ
దేవా!
జపములు
తపములు
యజ్ఞములు
నియమాలు
వ్రతములు-ఇవి
అన్నియు
వేదవిదిత
కర్మములు.
జ్ఞానము,
భూతదయ,
దమము,
శిష్టాచార
ప్రవర్తన
వీటివలననే
నీ
సన్నిధి
లభించును.
ఓ
నాథా!
నేనొక
వరము
గోరుకొందును.
తమరు
కటాక్షించి
దయచేయుడు.
యెన్ని
జన్మలెత్తినను
నీ
పాదారవిందములయందు
భక్తి
తక్కువ
కాకుండా
నుండుగాక!"
అని
వసిష్ఠుడు
శ్రీవారిని
ప్రార్థించెను.
పిమ్మట
రాముని
అనుజ్ఞ
గైకొని
వసిష్ఠుడు
స్వగృహమునకు
బోయెను.
పరమపవిత్రమైన
శ్రీరాముని
మనోహరమగు
చరిత్రను
ప్రజలు
గానము
చేయుచుండిరి.
వ్రతములు,
యాగములు
చేసినను
జ్ఞానవైరాగ్యములు
కలిగియుండినను
ప్రేమలేని
యెడల
రాముని
దర్శనము
దొరకదు.
జ్ఞాని,
తపస్వి,
శూరుడు,
కవి,
పండితుడు,
సకల
గుణరాశి-వీరిలో
నెవరిని?
లోభము
బాధించలేదు.
ధనమదముచే
నెవరు
తప్పు
మార్గములు
తొక్కలేదు.
అధికార
బలముచే
నెవడు
చెవిటివాడు
కాలేదు?
యవ్వనజ్వరముచే
బాధపడని
వాడేడీ?
మమకారముచే
కీర్తి
బోగొట్టుకొనని
వాడేడీ?
మత్సరమను
మచ్చలేని
వాడేడీ?
శోకమనునట్టి
వాయువుచే
కంపము
నొందని
వాడేడీ?
చింతయనునట్టి
సర్పముచే
కరువబడని
వాడేడీ?
అతను
శ్రీరాముడే!
వేనికి
కట్టుబడక,
అన్నింటికీ
మించి,
అతీతుడై,
ఆత్మరూపుడై
నిలచినవాడు
భగవంతుడొక్కడే!
ఈ
లోకములో
మాయయొక్క
ప్రచండసైన్యములు
తిరుగుచుండును.
కామాదులు
యోధులగు
భటులు,
దంభము,
పాషండము
మొదలగునవి
సేనాపతులు.
ఆ
మాయ
రఘునాథుని
దాసి.
ఆమె
మిథ్య.
అయిననూ
రఘునాథుని
కటాక్షము
14
▾
Meaning
Keep
లేనియెడల
దాని
బంధములు
వీడవు.
తజ్జాయమైన
కటాక్షమే
దానిని
విడిగొట్టును.
యే
మాయ
చరాచర
జంతుజాలము
నాడించుచున్నదో,
యే
మాయయొక్క
ప్రభావమును
గుర్తెరిగినవారు
లేరో,
అట్టి
మాయ
యొక
నటివలె
దాని
అనుచరులైన
కామాదులతో
కూడి
భగవంతుని
భ్రూవిలాసము
ననుసరించి
నాట్యము
చేయును.
శ్రీరఘురాముడు
సచ్చిదానందమూర్తి,
ఘనశ్యాముడు,
పుట్టుక
లేనివాడు.
అట్టి
పరమాత్మయందు
మాయ
లేశమైనను
యుండదు.
అయోధ్యానగరములో
నిత్యోత్సవములును,
నూతన
వినోదములును
జరుగుచుండెను.
అనుదినము
శ్రీరాముడు
దానములకింద
ధనమును
వినియోగించును.
ఒకరినొకరు
నిందించుకొనకూడదు.
దుర్భాష
లాడరాదు.
ప్రతి
గృహమునందు
దినమూ
వేదపారాయణము,
పురాణశ్రవణము
జరుగుచుండెను.
ఎవరి
కులధర్మముల
ననుసరించి
వారు
సంచరించిరి.
కానీ,
పరకులములను
తిరస్కరించువారు
కానీ,
చిన్నబరచుట
కాని
రామపరిపాలనలో
ఎక్కడనూ
కానరాదు.
రామునకు
ప్రజలయందు
దయానురాగములు
పెరిగెను.
రాముని
కాలములో
భక్తిశ్రద్ధలతో
భర్తలకు
స్త్రీలు
శుశ్రూష
చేయుట
చూచి
దేవతా
స్త్రీలు
సహితము
సిగ్గుపడెడివారు.
ఆనాటి
భర్తలు
కూడ
వారికి
తగినవారై
యుండిరి.
భార్యలకు
కంటినీరు
తెప్పించెడివారు
కారు.
సతీపతులు
ఇరువురు
అర్ధదేహములుగా
భావించి
ఒకరినొకరు
అనుసరించి,
అన్యోన్యానుకూలముగా
మెలగెడివారు.
అసత్యములు
రామ
కాలమున
యెట్టి
సమయమునందైననూ
ఆడుటకు
పూనుకొనెడివారు
కారు.
తల్లిదండ్రుల
ఆజ్ఞలు,
గురువుల
ఆజ్ఞలు
బాలబాలికలు
మన్నించుచుండిరి.
అందరూ
దేవేంద్ర
భోగముల
ననుభవించిరి.
కుబేరునితో
సమానముగా
ధనధాన్యములు
సమృద్ధిగా
నుండెను.
శరత్కాల
చంద్రబింబమును
చూచి,
చకోరములు
సంతసించునటుల
అంతఃపుర
స్త్రీలు
రాముని
చూచి
ఆనందించెడి
వారు.
శ్రీరాముని
దివ్యమంగళ
విగ్రహమును
కన్నులార
చూచి
భరత
లక్ష్మణ
శత్రుఘ్నుల
మనసున
కాప్యాయము
కలిగెడిది.
రాముని
ప్రభుత్వములో
లోకమంతయు
సంపూర్ణ
కళలతో
నిండియుండెను.
పాపమను
మాటలేదు.
మునీశ్వరులు
నిర్భయముగా
వనములలో
సంచరించుచుండిరి.
రాజునకు
ప్రజలకు
అన్యోన్యానురాగము
పెరిగెను.
భూమి
15
▾
Meaning
Keep
అంతయు
శోభాకరముగా
నుండెను.
వనములు
కళకళలాడెను.
పక్షులు,
మృగములు
స్వాభావిక
విరోధమును
విడిచి
పరస్పరమైత్రితో
మెలగెను.
రామరాజ్యములో
వైరమను
మాటలేదు.
అందరూ
పరమసఖ్యముగా
నుండిరి.
ప్రతి
వ్యక్తి
శ్రీవారి
ప్రభావమును
వర్ణించుటలో
యెంతయో
ఉల్లాసపడుచుండెడివారు.
ఒకనాడు
హజారములో
శ్రీరాముడు
తమ్ములతో
సింహాసనము
నధిష్ఠించి
యుండెను.
ఆ
సమయము
ఒక
బ్రాహ్మణుడు
దుఃఖించుచు
రాజసభకు
వచ్చెను.
అనేక
నిష్ఠురవాక్యములను
అతడు
పలికెను.
మొరపెట్టుకొనెను.
"అయ్యో!
లోకములో
సూర్యవంశపు
రాజుల
కీర్తి
ప్రతిష్టలు
నేటితో
అంతరించెను.
శిబి,
రఘు,
దిలీప,
సగర
మహారాజుల
ప్రతాపమును,
వారి
కీర్తి
నెవరెరుంగరూ?
వీరి
కాలములో
ఇట్టి
విపరీతములు
జరిగి
యుండెనా?
యెన్నడైనా
తండ్రి
బ్రతికియుండ
కుమారుడు
చనిపోవునా?
ఇది
యెన్నడైనా
కలదా?
ఈనాడు
ఈ
విపరీతముల
జూచితిని?"
అని
బ్రాహ్మణుడు
విలపించెను.
అతని
దుఃఖమునకు
కారణము
సర్వాంతర్యామియైన
రాముడు
గమనించి,
బ్రాహ్మణుని
వచనమును
విని
కొంత
విచారించెను.
ఏ
కారణము
చేత
అతని
కుమారుడు
మరణించెనో
దానిని
తెలుసుకొనుటకు
చింతించెను.
అది
రాజ్యపరిపాలనా
విధానములోని
దోషము
కాదనియును,
దుశ్చింత
ప్రభావమే
ఈ
విధమగు
దుర్మరణమునకు
హేతువని
తలంచిరి.
అట్టి
దుశ్చింతలు
రానీయక
ప్రజలలో
చేరనీయకుండుటకు
తగిన
కట్టుదిట్టములు
కావించెను.
ఇట్టి
చిన్న
చిన్న
విషయములు
కూడా
అతిజాగ్రత్తగా
గమనించి,
స్వార్థమును
ప్రక్కకు
నెట్టి
ప్రజాక్షేమమే
తన
క్షేమముగను,
ప్రజలే
తన
దేహముగను,
ప్రజలు
రామచంద్రుడే
తమ
గుండెలుగను
భావించిరి.
ప్రజా
ప్రభువులయొక్క
సన్నిహిత
సంబంధము
దేహములు-గుండెలుగా
భావించి
జీవించెడివారు.
పాలించెడివారు.
ప్రజల
అభీష్టముల
కేనాడును
విరుద్ధముగ
చింతించడు
శ్రీరాముడు.
ప్రజలు
కూడ
ప్రభువు
యొక్క
ఆజ్ఞను
స్వప్నమునందైనను
జవదాటరు.
అట్టి
ఆనాటి
రామరాజ్యము
కొన్ని
సంవత్సరములు
ప్రశాంతముగ
జరిగెను.
రాముడు
సాక్షాత్
నారాయణుడు.
అతని
పరిపాలనమే
ప్రపంచశోభ.
లోక
కళ్యాణమునకు
సత్యధర్మములే
సరియైన
పాలకులు.
Previous
←
The Triumphal Return to Ayodhyā
Next
The Abandonment of Sītā
→