Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sandeha Nivāriṇī · Prabodha 3
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
3
భక్తుడు:
నమస్కారము స్వామి!
2
▾
Meaning
Keep
స్వామి:
సంతోషము
నాయనా!
చాలా
అలసిపోయినట్లున్నదే!
అందులో
ఎండకాలము.
ప్రయాణములు
మరింత
శ్రమగా
ఉండును.
కొంతసేపు
విశ్రాంతి
తీసికో.
తరువాత
సంభాషించవచ్చును.
3
▾
Meaning
Keep
భక్తుడు:
శాంతియే
లేనపుడు
విశ్రాంతి
ఎక్కడ
చిక్కును?
4
▾
Meaning
Keep
స్వామి:
పిచ్చివాడా?
శాంతికొరకే
విశ్రాంతికాని
శాంతి
చేకూరిన
తరువాత
విశ్రాంతి
ఎందుకు?
పుండు
మానువరకు
బ్యాండేజి
అవసరమే
కాని
తరువాత
అట్టి
కట్లతో
పనియేమి?
5
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
ప్రస్తుతము
నా
మనసు
తికమకగా
ఉన్నది.
ఏమిచేయనూ
మనస్కరించుటలేదు.
ఏమి
కారణమో
తెలియుట
లేదు.
ఏమి
చేయుమందురు.
6
▾
Meaning
Keep
స్వామి:
నాయనా?
కారణము
లేక
ఏ
కార్యమును
జరుగదు.
ఇప్పటి
నీ
పరిస్థితికి
కారణము
తప్పక
నీకు
తెలియును.
చేయున
దేమియులేదు.
ఇట్టి
మనోవేదన
సమయమందు
ఏకాంతముగా
కూర్చొని
కొంతసేపు
నామస్మరణ
చేయి.
లేకున్న
గట్టిగా
గొంతెత్తి
భజన
కీర్తనలు
పాడు.
అదియూ
కాకున్న
పరుపు
వేసికొని
కొంతసేపు
నిద్రించు.
తదుపరి
యోచించవచ్చును.
7
▾
Meaning
Keep
భక్తుడు:
లోకమున
ఒక్కొక్కరికి
ఒక్కొక్క
ఇష్టవస్తువుండుననియు
అట్టి
ఇష్టవస్తువునకు
ఎట్టి
కష్టము
కల్గిననూ
మనము
అశాంతి
పొందుననియు
తమరే
సెలవిచ్చియుండిరి
కదా.
అట్టి
నా
యిష్టవస్తువును
ఇంకొకరు
తిరస్కరించుటో,
తూలనాడుటో,
ఏదో
ఒకటి
ఇట్టివి
సంభవించినపుడు
మాకు
శాంతి
ఎట్లు
వచ్చును?
అపుడు
మేమేమి
చేయవలెను?
8
▾
Meaning
Keep
స్వామి:
నాయనా!
ఆత్మవిచారణ
తెలిసికొన్న
గుణశాలి
పరుల
ఇష్టములను
తూలనాడడు.
అట్టి
సంబంధమునే
కోరడు.
ఎట్లన
తన
ఇష్టవస్తువులను
ఇతరులు
అనిష్టపడి
దూషించిన
తన
కెంతకష్టమో,
అట్లే
ఇతరుల
ఇష్టములకు
మనము
అడ్డు
దూరిన
వారునూ
అట్లు
కష్టపడుదురని
తానాలోచించును.
కనుక,
ఇట్లు
తూలనాడువారు
ఆత్మవిచారణ
తెలియనివారు
కదా.
అని
నీలో
నీవు
శాంతిపడు.
అట్టి
ఆత్మవిచారణ
తెలియని
అమాయకులతో
ఆత్మవిచారణ
పరిశీలించుచున్న
నీకు
అనవసరము,
పోనీ
ఇంతకు
ఏమి
జరిగినది?
లోనిది
బైటికి
క్రక్కిన
తల్లట
తీరును.
9
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
తమరు
ఆధ్యాత్మికముగ
అయితేనేమి,
శారీరకముగ,
మానసికముగా
నైతేనేమి
ఎన్నియో
మార్గముల
ప్రజలకు
తోడు
నీడగా
ధైర్య,
సాహస,
సదుపాయములు
కలిగించుచున్నారు.
విద్యా
వైద్యాది
సదుపాయములు
చేయుచున్నది
లోకమునకు
బాగుగా
తెలియును.
ఎవ్వరికి
ఏ
రీతిగానైనను
కీడు
చేయుటలేదు,
చేయించరు.
ఇట్టి
తమపై
లేనిపోని
కథలు
కట్టి
ప్రచురించువారిని
అరికట్టుట
ఎట్లు?
వారికి
ఇట్లు
చేయుటలో
నేమైన
లాభమున్నదా?
10
▾
Meaning
Keep
స్వామి:
ఓహో!
ఇదియా
కథ!
మంచిచెడ్డలు
లోకసహజమని
తెలియదా?
అందరూ
వ్యాపారమే
చేయువారుండిన,
కొనువారెవరు?
భగవద్విషయములో
దూషణలు
ఆదికాలమునుండి
వచ్చినవే.
క్రొత్తవి
కావు.
ఐతే
ఇప్పటివారు
ఇంకను
నవీన
కథలు
కల్పించవచ్చును.
పోనీ,
అది
దూషణమని
నీవెందుకు
తలంచవలెను?
ఆ
రీతినైనను
స్వామిని
తలంచుచున్నారని
భావించు,
ప్రేమస్మరణ,
ద్వేషస్మరణ
అని
రెండు
విధములు.
అందులో
ఆ
ద్వేషస్మరణ
అవిద్యామాయ.
అది
రజోగుణ
సంబంధమైనది.
అవిద్యామాయవలన
దుఃఖప్రాప్తి.
విద్యాప్రాప్తి
వలన
ఆనంద
ప్రాప్తి.
వీటి
ప్రాప్తులు
ఇందులోనే
ఉన్నవి.
ఇంక
నీవు
అరికట్టుట
ఎందుకు?
అందులో
లాభమా?
వారికి
లాభమనవసరము.
వారికి
ఇట్టి
పరదూషణలు
కర్తవ్యముగా
ఆచరించుచుండుట
అలవాటు.
11
▾
Meaning
Keep
“చీరలు
నూరుటంకములు
చేసెడివైనను
పెట్టెనుండగా
చేరి
చినింగి
పోగొరుకు
చిమ్మటకేమి
ఫలంబు?”
అన్నట్లు
చిమ్మటకు
నూరు
రూపాయల
చీరలను
కొట్టివేయుటలోగాని,
పనికిరాని
మసిగుడ్డను
కొట్టివేయుటలో
గాని
దానికేమి
లాభము?
దానికి
విలువ
తెలియునా?
దాని
పని
అట్టిది.
ఇట్టి
పనిలేని,
పరదూషణ
చేయువారి
పని
అట్టిదేయని
తలంచి
శాంతించు.
12
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
తమరు
చెప్పినది
సత్యమే.
అజ్ఞానులు
అట్టి
చిమ్మట
సంతతివారైన
అట్లు
భావించవచ్చును.
మంచి
విద్యావంతులు
గొప్ప
గొప్ప
తెలిసినవారు
కూడా
ఇట్టి
కథలకు
కంకణము
కట్టుకొనుచుండిన
ఎట్లు
సహించుట.
13
▾
Meaning
Keep
స్వామి:
విద్య
అనగా
ఆత్మజ్ఞానము
కాని
ప్రపంచ
సంబంధమైన
ఇప్పటి
విద్యలు
కావు.
జీవితపు
తరిఫీదులు,
పోషణాధారముగ
పనికి
వచ్చునవి.
ఇట్టి
విద్యలతో
ఆత్మజ్ఞానమును
పోల్చుకొనుట
చాలా
పొరపాటు.
పరదూషణము
లేక,
సద్గుణములు
కల్గి
యథార్థమును
వెదకువారు
గొప్పవారు
కాని,
వివేకశూన్యులై,
అహంకారముతో
చెలాయించు
అధికారులకు
కాని,
ఆత్మజ్ఞానము
తెలియని
అమాయకులకు
కాని
ఆధ్యాత్మిక
విషయములు
తెలియవు.
కాని
నీవు
ఎవరినైతే
గొప్పగొప్పవారనియు,
విద్యావంతులనియు
తలంచుచుంటివో,
వారు
పైచెప్పిన
సంతతివారని
భావించి
ఇట్టి
ఆలోచనకు,
అశాంతికి
చోటివ్వక
నీ
భావమును
నీవు
దృఢము
చేసుకో.
14
▾
Meaning
Keep
భక్తుడు:
ఇట్టివారి
మూలముననే
లోకమున
చాలమంది
ఆస్తికులు
నాస్తికులుగా
మారుచుందురు
కదా!
వారుండు
పదవులకైన,
చదివిన
ప్రపంచ
చదువులకైనా
మర్యాద
సహితము
ఇవ్వక,
యథార్థము
తెలిసికొనక
మహాపురుషులను
దూషించువారిని
అణగద్రొక్కు
ఆయుధమే
లేదా?
15
▾
Meaning
Keep
స్వామి:
లేకేమి,
ఉన్నది.
“గంతకు
తగిన
బొంత”
అన్నట్లు
అట్టివారి
మాటలు
అట్టివారే
విందురు
కాని
నిజమైన
ఆస్తికులెవ్వరు
వినరు.
వినినను
వారి
కల్పనా
కథలు
తెలియగనే
వారికి
దూరమౌదురు.
ఇంక
అట్టివారిని
ఆణచునట్టి
ఆయుధములు
వారి
చేతియందే
ఉండును.
భస్మాసురుడు
కథ
వింటివా?
తెలియునా?
అందినవారి
తలపైనంతయు
హస్తము
నిడి
భస్మము
చేయుచు
కడకు
ఆహస్తమును
తన
తలపై
ఇడుకొని
తనను
తానే
భస్మము
చేసికొనెను.
అట్లే
ఇతరులను
నిందించుచుపోయి
కడకు
తన
వాక్కులే
తనను
నిందించును.
అవియే
సూటిగా
నాటును.
16
▾
Meaning
Keep
లోకమున
భగవద్దూషణ
చేయువారు
నాలుగు
రకములు:
17
▾
Meaning
Keep
1.
అసలు
భగవద్విషయమే
గిట్టనివారు.
18
▾
Meaning
Keep
2.
వ్యక్తి
సంబంధమైన
ద్వేషముతో
ఎదుటివారి
గొప్పను
ఓర్వలేని
భావముతో
ఉండువారు.
19
▾
Meaning
Keep
3.
స్వానుభవము
లేక,
చెంతకే
రాక,
యథార్థ
విషయము
తెలిసికొనక,
వినికిడి
మాటలకు
బానిసలై
వింతకథలు
కల్పించువారు.
20
▾
Meaning
Keep
4.
ఏవో
లౌకికవాంఛలకు
వచ్చి
అవి
వారివారి
కర్మానుసారము
ఫలింపకుండిన,
భగవంతుని
నెపముగా
పెట్టి
దూషించువారు.
21
▾
Meaning
Keep
ఈ
నాలుగు
లక్షణములవారే
ఊరక
వాగుదురు.
కాని,
ఇతరులు
వాగరు.
ఇష్టము
లేకున్నను,
నమ్మకము
లేకున్నను
వారిలో
వారు
విమర్శించుకొని,
వారి
తృప్తిప్రకారము
పోదురేకాని,
ఇట్టి
కీలుబొమ్మల
ఆటలు
ఆడరు.
ఇతరులను
దూషించరు.
ఎవరి
మనసును
వారు
నమ్మక
ఎదుటివారి
మాటలకు
చోటిచ్చి
వారి
గుణములు
యథార్థపు
మార్గములు
కావు.
యథార్థము
తెలియని
వారిచెంత
వాదించిన
ప్రయోజనముండదు.
యథార్థమునకు
వాదనే
లేదు.
రెండును
తెలియకయున్న
మధ్యవారితో
తర్కించుట
మొండెమును
పట్టి
స్వరూపమిట్టిదే
అని
తలంచునట్టిది.
గ్రుడ్డివారు,
ఏనుగు
కథవంటిది.
నాయనా!
ముఖ్యముగా
ఇట్టి
సంభాషణలతో
కాలమును
గడుపుటకూడా
మంచిదికాదు.
ఇట్టి
దూషణ
ఆక్షేపణలు
సహజము;
అవి
తెలిసియు
నిజమైన
భక్తులు
కాగోరువారు
వారి
ఆనందమును
అభివృద్ధి
చేసికొను
ఆధారములకై
వెతుకవలెను.
చిక్కిన
కాలమును
పవిత్రము
చేసికొనవలెకాని,
పాడుచేసికొనరాదు.
ఇతరుల
మంచిచెడ్డలతో
నీకు
సంబంధములేదు.
నీ
చెడ్డను
నీవు
వదలుటకు,
నీ
మంచిని
నీవు
అభివృద్ధి
పరచుకొనుటకు
కాలముకాని,
వృధాపరచుటకు
కాదు.
ఏవైనా
మీ
భక్తిని
అభివృద్ధి
చేయు
విషయములు,
మీకు
కావలసిన
సాధన
సందేశములు
అడిగి,
సార్థకమార్గమును
వెదకండి.
ఇంకపై
ఇట్టి
ఇతరుల
ఆక్షేపణలు,
దూషణ
విషయములు
నా
చెంతకు
తీసికొని
రావద్దు
నీవునూ
తీసికొనవద్దు.
22
▾
Meaning
Keep
భక్తుడు:
మేము
కూడా
సహజ
మానవులము
కనుక,
ఇట్టి
సమాధానము
తాము
తెలపుచుండిన,
విషయము
తెలియుటేకాక,
ధైర్యమూ,
ఆనందమూ
మాలో
ప్రవేశించి,
సందేహ
దుఃఖములు
దూరమైపోవును.
లోకమున
ఇట్టివారి
మాటలతోనే,
ఉన్న
కొంత
విశ్వాస
భక్తి
శ్రద్ధలనూ
కోల్పోవుచున్నారు.
దాని
మూలముననే
ఇట్టి
ప్రశ్నలు
మిమ్ము
అడిగితేకాని
లేకున్న
నాకు
కూడను
ఇట్టి
వాటితో
అవసరము
లేదు.
అడిగినందుకు
క్షమించండి.
ఇకపై
నేనిట్టివి
తమతో
సంభాషించను.
23
▾
Meaning
Keep
స్వామి:
చాలా
మంచిది
నాయనా!
చిక్కిన
కొంతకాలమూ
ఏదో
సద్విషయముల
చింతించక,
ఇతరుల
అజ్ఞానపు
మాటలనే
స్మరించుచుండిన
మనము
కూడా
వారిని
దూషించుచుండినట్లగును.
అది
భక్తులకు
చాలా
హానికరము.
ఎవరేమన్నను
మన
యథార్థమును
వీడక
దానిపై
ఆధారపడి
ఉండిన
మన
కేనాటికీ
లోటు
లేదు,
రాదు.
మాటపై
మాట
వచ్చుట
వల్ల
క్రోధావేదనలు
బయలుదేరును.
అట్టి
గుణములను
అణచుటయే
భక్తిమార్గము
కాని
ఉప్పొంగించుకొనుట
ఉత్తమము
కాదు.
అట్టివారి
మాటలు
విని
ఉన్న
భక్తి
కోల్పోవువారు
ఎంతోకాలమట్లుండరు.
యథార్థము
తెలియగనే,
తిరిగి
వారిని
నమ్ముదురా?
వారి
మాటలను
పాటింతురా?
అట్టి
తూలనాడువారి
మాటలు
కంచుశబ్దమువంటివి.
విలువలేని
లోహమున
శబ్దము
ప్రధానము.
శబ్దములేని
బంగారులో
విలువ
ప్రధానము.
నిజమైన
భక్తులు
శబ్దరహితులై
మౌనమూర్తులై
భగవత్సారమును
నోటినిండుగా
ఉచ్చరించుచు,
అన్యమైన
మాటలకు
వ్యవధినీయక
ఉండుట
ఉత్తమము.
ఇట్టి
కంచుశబ్దసహితులైన
వారి
మాటలను
కర్ణద్వారములయందు
చేరనివ్వక,
ప్రణవనాదమైన
పరమాత్మ
నామమును
నింపుచుండుడు.
వచ్చే
నెల
సాధన
అనుష్ఠాన
మార్గములు,
ఇట్టి
ఉపయోగకరమైన
వాటియందు
సందేహము
లేవైనా
వచ్చిన
ఇచ్చటికి
వచ్చి
తెలిసికొనిపో.
వృథా
అనుమానపు
కట్టలు
బుట్టలు
తీసికొని
రావద్దు.
24
▾
Meaning
Keep
భక్తుడు:
ధన్యుడను
స్వామి!
నేడు
వారి
మూలమున
నాకు
జ్ఞానోదయమును
కల్గించినారు.
దీనిని
బట్టి
చూడ
అంతా
మన
మేలుకొరకే
అను
శాస్త్రము
సత్యముగా
తోచుచున్నది.
ఇంకపై
ఎవరేమన్నను,
అంతా
నా
మేలుకనే
ఓపికతో
మెలంగుదును.
నమస్కారము,
సెలవు.
Previous
←
Prabodha 2
Next
Prabodha 4
→