Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sandeha Nivāriṇī · Prabodha 4
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
4
స్వామి:
ఏమి నాయనా! ఎప్పుడు వస్తివి? వెలుపల యెక్కడా కనుపించలేదే. సౌఖ్యమా?
2
▾
Meaning
Keep
భక్తుడు:
నే
రెండుదినము
లాయెను
వచ్చి,
బయట
యెక్కడ
చూచిననూ
గుంపులు,
గజిబిజిలు,
తప్పించుకొని
ఇక్కడకు
రాగా
ఇక్కడసైతము
ఎక్కడ
చూచినా
గుంపులు;
అందుకని
లోపల
రాగానే
హాయిగా,
ఆనందముగా
ప్రశాంతిగా
ఉన్నది.
అందుకే
లోపల
హాలునందుంటిని.
బైట
యెంత
అశాంతో
లోపల
అంత
ప్రశాంతిగా
నున్నది.
3
▾
Meaning
Keep
స్వామి:
విశేషమేమున్నది?
ఇది
సహజమే,
బెల్లమున్న
చోటనే
చీమలు
చేరుట,
వెలుపలకు,
లోపలకు
ఇదియే
తేడా,
అదియే
ధర్మము,
ఉన్నది
అంతే.
4
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
మీరన్నదేమో
నాకు
బోధపడుట
లేదు.
వివరములు
తెలిసిన
విని
ఆనందింతును.
5
▾
Meaning
Keep
స్వామి:
నాయనా!
నీవే
అంటివి
కదా,
వెలుపలా
లోపలా
రెండు
ఉన్నట్లు.
వాటిని
మేము
బాహ్యంతర
ప్రపంచములందుము.
అందులో
ఏది
వెలుపలి
ప్రపంచమో,
ఏది
లోపలి
ప్రపంచమో
నీ
అభిప్రాయము
తెలుపుము.
6
▾
Meaning
Keep
భక్తుడు:
నానోటినుండియే
చెప్పించెదరా?
తమరే
సెలవిచ్చిన
బాగు.
7
▾
Meaning
Keep
స్వామి:
నాయనా!
ప్రశ్న
అడిగిన
వాని
చేతనే
సమాధానము
చెప్పించుట
సనాతన
బోధనా
పద్ధతి.
అట్లు
అడిగిన
వారే
సమాధానము
చెప్పిన
నిజముగా
వానికి
బోధపడును.
ఇందులో
బోధనా
పద్ధతి
వేరు;
ఉపన్యాస
ధోరణి
వేరు.
పూర్వపు
ఋషులందరూ
వేదాంతములను
ఈ
ధోరణిలోనే
శిష్యులకు
అర్థమగునట్లు
చేయుచుండెడివారు.
తెలుపు
మరి
చూతము.
8
▾
Meaning
Keep
భక్తుడు:
కండ్లతో
చూచిన
విషయములు
చెప్పుమనెదరా?
9
▾
Meaning
Keep
స్వామి:
ఒక్కకంటితోనే
కాదు.
జ్ఞానేంద్రియములైన
కన్ను,
ముక్కు,
చెవి
మొదలగు
వాటన్నింటితో
నీ
వనుభవించిన
దానినంతయు
చెప్పుము.
10
▾
Meaning
Keep
భక్తుడు:
భూమి,
ఆకాశము,
నీరు,
సూర్యుడు,
చంద్రుడు,
గాలి,
నిప్పు,
నక్షత్రములు,
మబ్బులు,
కొండలు,
గుట్టలు,
చెట్లు,
నదులు,
స్త్రీలు,
పురుషులు,
బాలురు,
వృద్ధులు,
మృగములు,
పక్షులు,
చల్లదనము,
వేడి,
సుఖవంతులు,
దుఃఖవంతులు,
చావులు,
పుట్టుకలు,
వ్యాధులు
మొదలగునవి
యెన్నియో
చూచితిని.
11
▾
Meaning
Keep
స్వామి:
అబ్బా!
చాలు
చాలు.
ఇదియే
ప్రపంచము.
దీనిని
నేడే
చూచితివా!
నిన్న
యుండెనా?
రేపు
ఉండునా!
12
▾
Meaning
Keep
భక్తుడు:
ఏమి
స్వామి!
ఇట్లడుగుదురు?
ఇదే
రీతిగా
ఎన్నో
సంవత్సరములు
ఉండును
కదా?
ఇంకా
ఎంతకాలముండునో,
యెపుడు
మొదలయినదో
యెవరి
కెఱుక?
13
▾
Meaning
Keep
స్వామి:
ఎప్పుడు
మొదలయినదో
అని
నీవే
అంటివి
కదా,
దానినే
మేము
“ఆనాది”
అని
పలుకుదుము.
ఈ
బాహ్య
ప్రపంచమే
ఆనాది.
బాహ్యముండిన
అంతరముండియే
తీరునుకదా?
అబ్బాయి!
నీవెపుడైనా
సినిమా
చూచితివా?
14
▾
Meaning
Keep
భక్తుడు:
చూడకేమి?
అదీ
ప్రపంచములోనిదే
కదా!
ఎన్నో
చూచితిని.
15
▾
Meaning
Keep
స్వామి:
ఏమి
చూచితివి
తెలుపుము?
16
▾
Meaning
Keep
భక్తుడు:
తెరమీద
ఎన్నియో
చిత్రవిచిత్రములను
చూచితిని;
ఎన్నో
శబ్దములు
వింటిని;
ఎన్నియో
ఆనందదుఃఖములు
అనుభవించునట్లు
గాంచితిని.
17
▾
Meaning
Keep
స్వామి:
చూచితినంటివే,
తెరయొక్కటి
బొమ్మలు
వేరొక్కటి,
రెంటిని
చూచితివా?
18
▾
Meaning
Keep
భక్తుడు:
అవును.
19
▾
Meaning
Keep
స్వామి:
తెరను,
బొమ్మలను
రెంటిని
ఒకేసారి
చూచితివా?
20
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి
అదెట్లు
సాధ్యమగును?
బొమ్మలు
కనబడునపుడు
తెర
కనబడదు.
తెర
కనబడునపుడు
బొమ్మలు
కనుపించవు.
21
▾
Meaning
Keep
స్వామి:
సరి;
తెర,
బొమ్మలు
ఎప్పుడూ
ఉండునా?
22
▾
Meaning
Keep
భక్తుడు:
ఉండవు.
తెర
నిలకడగా
ఉండును.
బొమ్మలు
అట్లు
కాక
వచ్చుచూ
పోవుచుండును.
23
▾
Meaning
Keep
స్వామి:
నీ
మాట
ప్రకారమే
తెర
నిలకడగా
ఉండుననియు,
బొమ్మలు
వచ్చుచూ
పోవుచుండుననియు
తేలినది.
ఈ
నిలకడ,
నిలకడలేని
అను
పదములకే
మేము
స్థిరము
అస్థిరము,
నిత్యము
అనిత్యము
క్షరము
అక్షరము
అను
పదములను
వాటికి
బదులుగా
ఉపయోగింతుము.
ఇంకొక
విషయమడిగెదను.
తెరపై
బొమ్మలు
పడునా,
బొమ్మలపై
తెర
పడునా?
దేనికి
ఏది
ఆధారము?
24
▾
Meaning
Keep
భక్తుడు:
తెరపై
బొమ్మలు
పడును.
కనుక
అట్టి
బొమ్మలకు
తెరయే
ఆధారము.
25
▾
Meaning
Keep
స్వామి:
అట్లే
బొమ్మలవంటి
బాహ్యప్రపంచము
నిలకడ
లేనిది,
మార్పు
చెందునది.
అంతః
ప్రపంచము
నిలకడ
కల్గినది,
మార్పుచెందనిది.
బాహ్యము
అంతరముపై
ఆధారపడియున్నది.
26
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
స్వామి
వీనినేనా
మీరు
క్షరము
అక్షరము,
నిత్యము
అనిత్యమనునది?
27
▾
Meaning
Keep
స్వామి:
అవును
నాయనా!
ఇంతకు
మునుపు
బొమ్మలంటివే
ఆ
బొమ్మలకు
నామములు,
రూపములున్నవా?
28
▾
Meaning
Keep
భక్తుడు:
లేకేమి?
బొమ్మకు
రూపనామములు
ఉండుటవల్లనే
కథ
అర్థమవును.
అప్పుడే
రామాయణ
భారతములు
జ్ఞాపకమునకు
వచ్చును.
రూపము
లేని
పేరు,
పేరు
లేని
రూపము
లేదు.
29
▾
Meaning
Keep
స్వామి:
భేష్!
బాగా
చెప్పినావు.
రూపముంటే
నామము,
నామముంటే
రూపము
ఉండియే
తీరును.
ఇవి
రెండునూ
ఒకదానికొకటి
సంబంధించియుండును.
ఈ
సంబంధమునే
మేము
“అవినాభావ
సంబంధ”మని
పిలుతుము.
ఇప్పుడు
ప్రపంచమంటే
అర్థమయినదా?
30
▾
Meaning
Keep
భక్తుడు:
నామరూపములతో
కూడినదని
గ్రహించితిని.
కాని
స్వామి!
ప్రపంచమెట్లు
పుట్టినదో
వివరించిన
విందును.
31
▾
Meaning
Keep
స్వామి:
ఇప్పుడా
గొడవలో
పడవద్దు.
ఆ
విషయమును
వివరించుచూ
కూర్చొనిన,
మామిడి
తోటలోనికి
పోయి
మంచి
మామిడికాయ
ఒకటి
ఇప్పించుకొని
కమ్మగతినక,
ఆ
తోటలో
చెట్లెన్ని,
దానికెన్ని
కొమ్మలు,
ఎన్ని
రెమ్మలు,
రెమ్మ
రెమ్మకెన్ని
కాయలు,
అని
కాయలు
లెక్కించుచూ,
ఒకకాయకింత
విలువ
అయిన
ఇన్ని
కాయలు
ఎంత
విలువయని
లెక్కలేయుచు,
కాలమును
వృధా
గడుపు
వెఱ్ఱివానివలె
కాక,
అమూల్యమైన
ఈ
కాలమును
అవకాశమును
ముఖ్య
విషయములను
గ్రహించి
పండును
తిన్నవానివలె
తృప్తి,
ఆనందము
పొందుము.
అదట్లుంచి,
ముందు
ఈ
ప్రపంచ
మెట్టిదని
అంటివి?
ఈ
ప్రపంచమునకు
ఇంకొక
పేరున్నది
నీకు
తెలియునా?
32
▾
Meaning
Keep
భక్తుడు:
ప్రపంచము
నామరూపములతో
కూడినదంటిని,
దీనికే
“జగత్తు”
అను
మరొక
పేరుకూడా
కలదని
వినియుంటిని.
33
▾
Meaning
Keep
స్వామి:
నామరూప
ప్రపంచము
(జగత్తు)
ఇంద్రజాలమువంటిది.
నీవు
చూచుచున్నంతవరకు
ఆ
ఇంద్రజాల
మెట్లు
నిజముగా
నుండునో,
అట్లే
సర్వేంద్రియములతో
ఈ
జగత్తును
అనుభవించుచుండు
వరకూ
సత్యముగనే
యుండును.
అనగా,
జాగ్రదవస్థలో
నీకనుభవము
లేనట్లుండును.
అట్టి
సందర్భముననే
మేము
ఉన్నది
అనుదానికి
సత్
అనియు,
లేనిదానికి
అసత్
అనియు
పేర్లనుపయోగించు
కొందుము.
కాబట్టి
ఈ
ప్రపంచమును
సత్
అందువా
అసత్
అందువా?
34
▾
Meaning
Keep
భక్తుడు:
జాగ్రదవస్థలో
(అనుభవములో)
ఉన్నది.
కనుక
సత్
అనియు,
నిద్రావస్థలో
లేదు
కనుక
అసత్
అనియు
అందును.
35
▾
Meaning
Keep
స్వామి:
ఓహో!
సత్
అసత్
అనెదవా?
రెండు
పదములను
చేర్చిన
సదాసత్
అగును
కదా,
దీనినే
మేము
మాయ
అనెదము,
తెలుసునా?
36
▾
Meaning
Keep
భక్తుడు:
ఈ
మాయ
గారడివంటిదేనా?
37
▾
Meaning
Keep
స్వామి:
కదా
మరి,
“ఇంద్రజాల
మిదం
సర్వం”
అనగా
ఈ
ప్రపంచమంతయు
మాయయేయని
పూర్వపు
ఋషులు
సైతము
చెప్పెడివారు.
38
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
ఈ
ఇంద్రజాలమునకు
కర్త
ఒకడుండవలెను
కదా?
39
▾
Meaning
Keep
స్వామి:
తప్పక
ఉన్నాడు.
ఆ
ఇంద్రజాలికుడే
భగవంతుడు.
అతడు
అనంతకళ్యాణ
గుణగణసంపన్నుడు.
ఒక్కొక్క
గుణమునుబట్టి
ఒక్కొక్క
పేరును,
ఆ
పేరునుబట్టి
రూపమును
మహాఋషులు
కల్పించి,
ధ్యానించి,
సాక్షాత్కారము
కూడా
పొంది,
భగవంతుడు
నిర్గుణుడును,
సగుణుడును,
నిరాకారుడే
కాక
సాకారుడు
గూడా
అగుననిరి
కదా!
వారి
అనుభవమునే
కదా
లోకము
వేనోళ్ల
చాటుచున్నది!
దానినే
కదా
శాస్త్ర,
వేద,
ఉపనిషత్తుల
మూలమున
ఆయా
ఉపాసకుల
భావనల
ననుసరించి
ధ్యాన
సమాధులలో
భగవానుని
సాక్షాత్కరించుకొని,
సాయుజ్య
పదవిని
పొందుదురని
వారు
చాటిరి.
40
▾
Meaning
Keep
భక్తుడు:
ఆహా!
బోధపడినది.
స్వామి!
గుణములనుబట్టి
నామరూపములంటిరే,
దయచేసి
సెలవీయండి.
41
▾
Meaning
Keep
స్వామి:
ఓహో,
ఇట్టి
ముఖ్య
విషయముల
మాత్రము
మేము
సూచించవలసినదే.
ఎందుకన?
అది
మీ
యూహకు
అసాధ్యమే.
శ్రద్ధతో
వినుము.
భగవంతుడు
రమించు
గుణము
కలవాడు
కనుక
రాముడు.
అదే
విధముగ
ప్రేమ
స్వరూపుడను,
భక్తవత్సలుండును,
కృపాసాగరుడునూ
అగు
భగవానుడు
ఆయా
నామరూపములతో
భక్తులకు
సాక్షాత్కారమిచ్చి,
సాయుజ్య
పదవి
నిచ్చెను.
ఇట్లే
సర్వ
నామరూపములు
భక్తానుగ్రహార్థము
ఆ
నిరాకారభగవానునికి
కలుగుచున్నవి.
42
▾
Meaning
Keep
భక్తుడు:
ఆనందము
పరమానందము
స్వామి!
మీ
కృపవలన
చక్కగా
అవబోధముగుచున్నది.
ఒక్క
సందేహము.
నిరాకార
పరమాత్మకు
అనంత
నామములని
సెలవిచ్చితిరి.
అన్ని
నామరూపములు
సమానములేనా?
హెచ్చుతక్కువలేమైనా
ఉన్నవా?
43
▾
Meaning
Keep
స్వామి:
పిచ్చి
అబ్బాయి!
అన్ని
నామములు,
రూపములు
సమానమే.
ఏ
నామరూపములతో
ఆరాధించినను
ఆ
ఏకైక
సత్యస్వరూప
భగవానుడు
ఆ
నామరూపములతోనే
సాక్షాత్కరించును.
అయితే
ఒక్క
విషయమును
భక్తుడు
గమనించవలెను.
ఏ
రూపమున
భగవంతుని
ధ్యానించినను,
కోరిక
మాత్రము
(సంకల్పము)
ఒక్కటియే
యుండవలెను.
44
▾
Meaning
Keep
భక్తుడు:
దేనియొక్క
సంకల్పము
స్వామి?
45
▾
Meaning
Keep
స్వామి:
ముముక్షుత్వము.
భగవంతుని
తప్ప
వేరెట్టి
దానినైనను
ప్రేమించకూడదు.
దానినే
ప్రేమించి,
దానినే
ధ్యానించి,
దానినే
సాక్షాత్కరించుకొనవలెను;
కట్టకడపట
భగవంతునిలోనే
లీనముకావలెను.
సంకల్పము,
అట్టి
తీవ్రేచ్ఛ
మాత్రమే
ఉండవలెను.
46
▾
Meaning
Keep
భక్తుడు:
నిజము
స్వామి!
బాగా
అర్థమయినది.
మీరు
సెలవిచ్చినట్లు
ఇతరములగు
ఏవేవో
కోర్కెలు
భగవానుని
కోరి
అధోగతి
పాలయినవారి
చరిత్రములెన్నియో
భాగవత
రామాయణాది
గ్రంథములలో
వినియున్నాము.
హిరణ్యాక్షుడు,
రావణుడు,
భస్మాసురుడు
మొదలగు
వారు
నాటి
నుండి
నేటి
వరకు
జ్ఞాపకమునకు
వచ్చుచున్నారు.
బాగా
సెలవిచ్చినారు.
అది
నిజముగా
భక్తులు
గమనించవలసినదియే.
47
▾
Meaning
Keep
స్వామి:
నాయనా,
ఊరక
అన్నింటికీ
తలలూపుచూ
సత్యము
సత్యమని
ఆనందపడి
ప్రయోజనము
లేదు.
ఇది
సత్యమనియు
అట్లు
పోవుటే
మంచిదనియు
నీ
హృదయమున
దృఢపడి
తదుపరి
వానిని
అనుష్ఠానమున
పెట్టి
పాటించవలెను.
కాని
చెప్పినంతవరకు
నిజమని
ఆవలకు
పోయిన
తరువాత
మరచిన,
వినియూ
ప్రయోజనముండదు.
తిన్న
అన్నము
ఆకలి
తీరుటకు
కాని,
నోటిలో
పెట్టుకొని
జఠరమునకు
పంపకున్న
తినియూ
ప్రయోజనము
లేక
ఆకలి
తిరిగి
ప్రారంభమైనట్లు,
వినియు
నడచుకొనకున్న
నిష్ప్రయోజనము.
48
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
ఇంతవరకు
మూడు
ముఖ్య
విషయములు
చెప్పితిరి
:
1.
బాహ్య
ప్రపంచము.
2.
అంతఃప్రపంచము.
3.
భగవానుడు
అనగా,
పైరెంటికి
భగవానుడు
కర్తయు,
కారణమును
అని.
ఈ
మూడునూ
మూడు
వేరు
వేరే
పదార్థములా,
ఒకదాని
కొక్కటి
సంబంధించి
యుండునా?
49
▾
Meaning
Keep
స్వామి:
నీవే
ఆలోచించుకో,
నేను
దీనికి
ముందుగనే
ప్రేమ
వాహినిలో
జవాబులు
పంపినాను.
ఆనాడే
చేరియుండును.
చూడు.
సేవ,
సేవ్యసేవాపరికర
సంబంధమును
గూర్చి
చక్కగ
చూడు.
అర్థమగును.
50
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
క్షరము,
అక్షరము,
నిత్యము,
అనిత్యము
అనికూడ
సెలవిచ్చినారు.
ఇంకేమైనా
పేర్లుకూడా
ఉన్నవా!
51
▾
Meaning
Keep
స్వామి:
ఈ
రెంటికి
పురుషులని
పేరుకూడా
ఉన్నది.
చేతనము,
అచేతనము
అనికూడా
చెప్పుదురు.
జీవ,
జడములనికూడ
అందురు.
క్షర,
అక్షర,
పురుషులకే
వేరొక
చోట
అపరపరా
ప్రకృతులను
పేర్లు
వాడబడియున్నవి.
నిర్మలబుద్ధితో
యోచించిన
యెడల
పేర్ల
మార్పేకాని
వస్తువు
మార్పేమియు
లేదు.
52
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
స్వామి!
క్షర
అక్షరములకు
పురుషులను
పర్యాయ
నామములు
కలిగినట్లు
భగవంతునికి
కూడా
ఇట్టి
పర్యాయ
నామమేదైనా
కలదా?
53
▾
Meaning
Keep
స్వామి:
లేకేమి:
పురుషులకంటే
శ్రేష్ఠుడు
కనుక
భగవానునికి
పురుషోత్తముడను
సార్థకనామము
ప్రసిద్ధమై
ఉన్నది.
54
▾
Meaning
Keep
భక్తుడు:
ఆహా!
ఎంత
మధురము,
ఎంత
మధురము!
పురుషోత్తముని
నుండి
పురుషులు
పుట్టిరా!
55
▾
Meaning
Keep
స్వామి:
ఇచ్చటనే
పెద్ద
చిక్కు.
ఇంతకు
మునుపు
కూడా
పుట్టినవా
అని
ప్రశ్నించితివి.
సరియైన
పదములు
వాడవలెను.
లేనిచో
అపార్థమునకు
దారితీయును.
పురుషోత్తమునియందు
పుట్టినవని
అనకూడదు.
ఆయనయందు
ప్రకాశించుచున్నవి.
ఈ
పురుషులకే
పరఆపర
ప్రకృతులని,
జీవ
జడములని
పదములున్నవని
ఇంతకు
మునుపే
చెప్పితిని.
ఈ
ప్రకృతి
పదమునకు
స్వభావము,
శక్తి
అని
అర్థము
స్ఫురించుట
లేదా?
56
▾
Meaning
Keep
భక్తుడు:
స్ఫురించినది.
ఒకటి
పురుషోత్తముడనీ
రెండవది
అతని
ప్రకృతి
అనీ
అర్థమైనది.
57
▾
Meaning
Keep
స్వామి:
కాదు;
పొరబడితివి.
తిరిగి
యోచింపుము.
వస్తువునకు
దాని
ప్రకృతికి
(స్వభావమునకు)
భేదమున్నదా?
వస్తువు
నుండి
దాని
స్వభావమును
వేరుచేసి
చూపగలవా?
రెండు
అంటివే.
58
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి,
తప్పుతప్పు.
పొరపడినది
నిజమే.
వేరుచేయుటకెవ్వరికీ
సాధ్యము
కాదు,
రెండూ
ఒక్కటే.
59
▾
Meaning
Keep
స్వామి:
వ్యవహారమునకు,
చక్కెరలో
తీపి,
సూర్యుడు
ప్రకాశము
ఉష్ణము
అని
అందుమే.
తీపి
స్వభావము
చక్కెరలోనున్నది.
ప్రకాశస్వభావము
సూర్యునిలోనున్నది.
వేరువేరు
కాదు
కదా.
ఒక్కటియే,
చక్కెర
నోటిలో
వేసికొనగానే
తీపి
తెలియును.
సూర్యుడు
కనపడగానే
ప్రకాశము,
వేడి
తెలియును.
ఇట్లే
భగవంతునియందు
రెండు
విధములైన
ప్రకృతులు
కలవు.
చెప్పుకొనునప్పుడు
రెండుగా
చెప్పుకొందుము.
వానిని
పురుషుడు,
ప్రకృతి
అని
వ్యవహరింతురు.
కాని,
అవి
నిజమునకు
ఒక్కటే.
ఆ
భగవంతునిలో
ప్రకృతి
(దీనికే
మహామాయాశక్తి
అని
మరొకపేరు.)
చక్కెరలో
తీపివలె
వేరుచేయుటకు
వీలుకాక
అవ్యక్తమైయున్నది.
ఈ
సంబంధమునే
అవినాభావ
సంబంధమని
అందురు.
ఆ
భగవానుని
సంకల్పమాత్రమున
ఈ
మాయ
విజృంభించి
బ్రహ్మాండరూపమై
వ్యక్తమగును.
దీనిని
సమిష్టి
విశ్వరూపమనెదరు.
ఈ
సమిష్టియే
భగవానుని
సంకల్పముచేత,
అవిద్యాప్రభావము
చేత
జగత్తను
నామరూపములతో
భాసిల్లుచున్నది.
60
▾
Meaning
Keep
భక్తుడు:
ఇదేమిటి
స్వామి?
ఇంతవరకూ
చక్కగా
అర్థమై
అవిద్య
అను
పదము
క్రొత్తగా
చెప్పగనే
బుద్ధి
చలించుచున్నది.
ఏమియు
అర్థము
కాలేదు.
దయతో
విచారించండి.
61
▾
Meaning
Keep
స్వామి:
తొందరపడకు,
విద్య
అనే
పదము
వినియున్నావా?
దాని
అర్థము
తెలియునా?
62
▾
Meaning
Keep
భక్తుడు:
వినకేమి?
విద్య
అంటే
చదువు.
63
▾
Meaning
Keep
స్వామి:
విద్య
అనగా
జ్ఞానము
(తెలివి).
జ్ఞానమునకు,
‘ఆ’
చేర్చిన
ఆజ్ఞానమగును,
ఈ
అజ్ఞానమే
అవిద్య,
ఒక్కటిగానున్నది.
నానావిధ
చిత్ర
విచిత్ర
రూపములతో
వేరువేరుగా
ప్రకాశించుట
అజ్ఞాన
మూలముననే
కదా!
64
▾
Meaning
Keep
భక్తుడు:
అవును
స్వామి.
అవిద్య
ఎట్లు
కల్గినది?
ఎక్కడినుండి
వచ్చినది?
65
▾
Meaning
Keep
స్వామి:
వెలుతురు,
చీకటియుండుట
నీకు
తెలియును
కదా!
ఆ
రెండు
ఒకే
పర్యాయముండునా,
ఆలోచించు.
66
▾
Meaning
Keep
భక్తుడు:
వెలుతురున్నప్పుడు
చీకటి,
చీకటియున్నప్పుడు
వెలుతురు
ఉండదు.
67
▾
Meaning
Keep
స్వామి:
వెలుతురుండినపుడు
చీకటి
ఎక్కడున్నది?
చీకటి
యుండినప్పుడు
వెలుతురు
ఎక్కడున్నది?
బాగుగా
ఆలోచించు.
68
▾
Meaning
Keep
భక్తుడు:
ఇది
చాలా
కష్టమైన
విషయము.
అయిననూ
నాకు
తోచినంత
వరకూ
చెప్పెదను.
తప్పైన
యెడల
మీరే
సవరించుడు.
వెలుతురులోనే
చీకటి,
చీకటిలోనే
వెలుతురు
ఉండియుండవలెను.
అట్లు
కానిచో
ఇంకెట్లు
సంభవించును?
69
▾
Meaning
Keep
స్వామి:
ఇంకొక్క
చిన్న
ప్రశ్న
వేసెదను.
చెప్పుము
జవాబు.
ఈ
వెలుతురు,
చీకటి
స్వతంత్రమైనవా
లేక
ఎవరిపైనయిన
ఆధారపడినవా?
70
▾
Meaning
Keep
భక్తుడు:
సూర్యునిపై
ఆధారపడినవి.
సూర్యుడు
రాగానే
వెలుతురు,
సూర్యుడస్తమించగనే
చీకటియగుచున్నది.
71
▾
Meaning
Keep
స్వామి:
ఇట్లే
బాబూ,
విద్యా
అవిద్యా
భగవంతునే
ఆశ్రయించియున్నవి.
ఇందులోనున్న
విద్యకు
“చిత్”
అని
పర్యాయ
పదము
కూడా
కలదు.
అవన్నియూ
వచ్చేనెలలో
వివరించి
వినిపింతును.
నేటికి
చాలు,
వెళ్ళిరా,
అన్నీ
ఒకతూరి
తినిన
జీర్ణించుకొన
వీలుకాదు.
మరీ
అజీర్ణమైన
ఆరోగ్యమే
చెడిపోవును.
విన్నవానిని,
తిన్నవానిని
జీర్ణించుకొనుటకు,
మననము
చేసికొనుటకు
కూడా
వ్యవధి
కావలెను.
అందుకనే
ఒక
నెల
గడువిచ్చితిని.
అప్పటికి
ఇవి
పూర్తిగా
అరిగి
ఆనందముగా
అనుష్ఠానములోనుండిన
మిగిలినవి
తెలుపుదును.
లేకున్న
ఆనాడు
ఎట్లుండునో
ఊహించుకో.
వెళ్ళిరా
నాయనా!
72
▾
Meaning
Keep
భక్తుడు:
నమస్కారము.
ధన్యుడను.
విన్నవానిని
తిన్నవానిని
జీర్ణించుకొను
శక్తిని
తమరే
ప్రసాదించవలెను.
అంతా
భగవంతునిదైనప్పుడు
అది
మాత్రము
మాదెట్లవును?
అయినా
తమరు
ఇచ్చిన
శక్తిని,
తెలివిని
వృథా
పోనివ్వక
సాధ్యమైనంతవరకు
అనుష్ఠింతును.
ఆపై
నా
ప్రాప్తి,
మీ
దయ,
వెళ్ళి
వస్తా
సెలవు.
73
▾
Meaning
Keep
స్వామి:
నాయనా,
ప్రాప్తిపై
భారము
వేసి
ఊరకుండుటలో
యత్నలోపమున్నది.
ప్రయత్నించి,
ప్రార్థించి,
ప్రాప్తిని
పొందవలెను.
ప్రయత్న,
ప్రార్థనలు
లేక
ప్రాప్తి,
దయా
రెండునూ
లభించునవి
కావు.
నేటినుంచీ
ప్రయత్నించేపని
ప్రారంభించు,
వెళ్ళిరా
నాయనా,
ఆనందముగా.
Previous
←
Prabodha 3
Next
Prabodha 5
→