Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sandeha Nivāriṇī · Prabodha 5
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
5
స్వామి:
వచ్చావూ! అదే ఇంతవరకూ చూస్తిని; ఇంకనూ రాలేదేమి సమయానికి సరిగా వచ్చేటటువంటివాడు అని తలంచితిని, సంతోషము.
2
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి
తమ
ఆజ్ఞ
తప్పుదునా?
తమ
ఆజ్ఞ
ప్రకారము
ప్రతినెల
16వ
తేది
ఎప్పుడు
వచ్చునా
అని
ఎదురు
చూచుచుందును.
అంతకంటే
నాకు
వేరు
ఆనందము,
ఆహారము
ఏమున్నది?
3
▾
Meaning
Keep
స్వామి:
మంచిది
నాయనా.
అట్టి
శ్రద్ధాభక్తులే
మానవునకు
సార్థక
మార్గమునకుపాయములు.
అస్థిరమైన
లౌకిక
విషయములకై
పరువులెత్తి,
నిద్రాహారములు
మాని,
నిష్ఫలులగుటకన్న
సత్యమైన
సార్థకమైన
పవిత్ర
ప్రాప్తికి
ప్రాకులాడుటలో
ఎంత
ఆనందము!
పోనీ,
ఇప్పుడు
అన్నియూ
తెచ్చిపెట్టుకొన్న
నడవవలసిన
కార్యమునకు
అడ్డుగా
ఉండును.
ఏమి
కావలెనో
అడుగు
చూతము.
4
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
పోయిన
నెలలో
ఏదో
“చిత్”
అని
సెలవిచ్చి
దాని
వివరములు
వచ్చేనెల
తెలుపుదుమని
అంటిరి.
ఆ
విషయము
తెలిసికొనుటకై
రాత్రంబవళ్ళు
దినములు
గడువలేదే
అని
లెక్కించుచుంటిని.
నేటికి
ప్రాప్తించినది.
దయచేసి
సెలవిండు.
5
▾
Meaning
Keep
స్వామి:
అంతవరకు
చెప్పినవన్నియు
తెలిసికొంటివా?
తెలిసికొనుట
యనగా
కేవలము
కంఠస్థము
చేయుట
కాదు:
అనుష్ఠానమున,
అనుభవ
రూపమున,
లోకమిట్టిదని
మనోవాక్కాయ
కర్మలరీతిగా
సమాన
భావముతో
జగత్తు
సత్యము
కాదని
గ్రహించితివా?
6
▾
Meaning
Keep
భక్తుడు:
అది
గ్రహించేకద
స్వామి,
సర్వ
ధర్మములు,
సర్వ
కార్యములు
వదలి,
సర్వ
చింతలకు
స్వస్తిచెప్పి,
సాయి
చింతనలో
సాగిలిపడుట?
ఆ
విషయమునే
నేను
గ్రహించుకొనలేకుండిన,
నేనుకూడా
ఆ
ప్రపంచబాధలలో
బానిసనై
వానికొరకే
ఈ
పవిత్రకాలమును
పాడుచేసియుందును.
అట్లు
గ్రహించుకొనుట
కూడా
తమ
అనుగ్రహమే
కాని
ప్రయత్నమేమీ
లేదు.
7
▾
Meaning
Keep
స్వామి:
మంచిది,
బంగారు!
వేసిన
విత్తనములు
మొలకలు
రాక
పంట
కాకుండిన
రైతుకెంత
కష్టము?
అట్లే
నేనునూ
చల్లిన
సత్యవాక్
బీజములు,
చక్కగా
అంకురములై
ఆనందపు
పంట
పండకున్న
నాకునూ
అట్టి
బాధయేయుండును.
అట్లుకాక
మంచి
అంకురములై
ఆనందపు
పంటను
ఆరగించుచుండిన,
నాకు
ఎంత
ఆనందము!
ఇదే
నా
ఆహారము.
మీరు
నాకు
చేయవలసిన
సేవ
ఇదియే.
దీనికి
మించినది
లోకమునందే
లేదు.
మీ
కొరకై
చెప్పిన
మంచివాక్యములు,
సత్యవాక్యములు
వృధాగా
పారవేయక
వినియోగించుకొని
ఆనందించిన
ఆ
ఆనందసారమే
నాకు
ఆహార
సారమగును.
ఇట్లు
చెప్పినవి
నడచుకొంటూ,
ఆచరించుచూ,
ఇంక
ఇంక
ఎన్ని
ఎన్ని
అడుగుచుండిననూ
ఉత్సాహముగా
తెలుపుదును.
చెప్పినవి
ఒకప్రక్క
ఏ
పని
లేక
పాసిపోవుచుండగా
ఇంకా
చెప్పండి
చెప్పండి
అని
వచ్చిన
చెప్పుట
ఏమి
చెప్పుట?
నీవలె
అందరూ
నడచుకొనుచుండిన
లోకమునకు
బాధే
లేదు.
అసత్యమే
రాదు.
8
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
అట్లు
చెప్పిన
భగవద్వాక్యముల
నాచరించుటకు
సైతము,
అన్నిటికీ
ఆధారమైన
భగవదనుగ్రహశక్తే
ఆధారముగ
నుండవలెను
కదా!
అది
లేక
ఏదియు
జరుగదు.
తమరు
చెప్పినట్లే
అనుగ్రహము
ఎల్లప్పుడూ
ఉన్నది.
ప్రకాశించు
సూర్యునికి
మబ్బులు
అడ్డము
వచ్చినట్లు,
అనుగ్రహప్రకాశమునకు
అహంకార
మమకారములను
ఆంధకారపు
మబ్బులు
అడ్డము
వచ్చును.
అవియు
సాధన
అనుష్ఠానమూలమున
పారిపోవును.
అందుకనే
వినిన
విషయములను
చక్కగ
అర్థముచేసికొని
ఆచరించిన
తప్పక
అది
సులభమగును.
అది
నా
స్వానుభవము.
ఇతరుల
సంగతి
నాకు
తెలియదు.
9
▾
Meaning
Keep
స్వామి:
సత్యము
సత్యము.
నీవు
చెప్పెడిది
యథార్థము.
బాగా
గ్రహించినావు.
అర్థము
చేసికొనుటలో
నానార్థములు
చేసికొన్ననూ,
యథార్థము
చెడిపోవును.
కాన,
అర్థము
చేసికొనుటలో
చక్కగా
మెలంగిన,
అనుష్ఠానమున
సులభమవును.
కాని,
నాయనా!
అందరూ
ఒకతూరి
పుట్టిరా?
అందరూ
ఒకతూరి
గిట్టుదురా?
అట్లే
ఒక్కొక్కరికి
ఒక్కొక్కతూరి
పరమజ్ఞానము
పుట్టును.
ఒక్కొక్కరికి
ఒక్కొక్క
సమయమున
అజ్ఞానము
గిట్టును.
పాడుతూ
పాడుతూ
ఉండిన
పాట
వచ్చును.
అట్లే
చెపుతూ
చెప్పించుచుండిన
అందరూ
అట్టి
యథార్థమును
తెలిసికొందురు.
తెలిసికొనలేదే
అని
నేనూరకుండుట
నా
ధర్మము
కాదు.
తెలియని
వారికే
ఒకటికి
రెండు
పర్యాయములు
తెలుపవలెను.
10
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
మేము
ఇనుపముద్దవంటి
వారము.
భగవంతుని
చేతిలో
పనిముట్టు
మాదిరి
తయారు
కావలెనన్న,
ఎన్ని
చింతలను
అగ్నిలో
కాల్చవలెనో,
ఎన్ని
బాధలను
సుత్తి
దెబ్బలు
తినవలెనో,
అప్పుడేకదా
అది
చెప్పినమాట
వినును.
కాన,
మాబోటి
ఇనుపముద్దలను
వస్తురూపముగా
తయారు
చేయుటకు
తమరెంతగానో
శ్రమపడవలసి
యుండును.
అది
తమకు
కర్తవ్యమని
సెలవిచ్చినారు.
స్వామి!
ఇవి
అట్లుంచి
తమరు
పోయిన
నెల
సెలవిచ్చిన
“చిత్”ను
గురించి
సెలవీయండి.
11
▾
Meaning
Keep
స్వామి:
నాయనా!
“చిత్”కు
“శుద్ధసత్త్వము”
అని
కూడా
మరొక
పేరు
కలదు.
విద్యకు
అవిద్య
ఎట్లు
వ్యతిరేక
పదమో,
శుద్ధసత్త్వమునకు
మలినసత్త్వము
అట్లు
వ్యతిరేకము,
వెలుతురులో
చీకటి
ఎట్లు
అంతర్భూతమో
అట్లే
శుద్ధసత్త్వములో
మలినసత్త్వము
అంతర్భూతము.
పదములు
ఎక్కువగా
చెప్పుటవల్ల
కంగారుపడకు
నాయనా,
విద్య
అవిద్య
అన్నను,
జ్ఞాన
అజ్ఞానమన్నను,
శుద్ధసత్త్వము
మలినసత్త్వమన్నను,
అన్నియూ
ఒకే
భావముతో
ఉపయోగింపబడినవే.
వేరువేరు
కావు.
ఇంకొక్కటి
అడిగెదను.
ప్రకృతి
అను
పదమునకు
వ్యతిరేక
పదము
విని
యున్నావా?
12
▾
Meaning
Keep
భక్తుడు:
విని
యున్నాను
స్వామి,
వ్యాకరణము
చదువునప్పుడు
ప్రకృతి;
వికృతి
అని
చదివితిని.
13
▾
Meaning
Keep
స్వామి
:వికృతి
అంటే
అర్థమేమి?
14
▾
Meaning
Keep
భక్తుడు:
వికృతి
అంటే
వికారము.
అగ్నికి
“అగ్గి”
వికృతి.
ఇటులనే
యముడు
-
జముడు,
యజ్ఞము
-
జన్నము,
మొదలగునవి.
15
▾
Meaning
Keep
స్వామి:
ఇట్లే
భగవానుని
ప్రకృతి
విద్యయనియు,
ఆ
ప్రకృతికి
వికృతి
రూపము
అవిద్య
అనియు
అందుము.
విద్య
లేదా
శుద్ధసత్త్వమునకు,
అవిద్య
లేదా
మలినసత్త్వము
వికృతి
రూపములు.
16
▾
Meaning
Keep
భక్తుడు:
ఎట్లు
స్వామి?
భగవంతునియందే
విద్య
ప్రకాశించినది.
విద్యయందే
అవిద్య
తోచినది.
అనగా
భగవంతుని
యందును
సమిష్టి
విశ్వతత్త్వము,
ఆ
సమిష్టిచే
వ్యష్టి
వ్యష్టిగా
తోచునట్లుచేయు
(బాహ్య
నామ
రూపాత్మక
ప్రపంచముగా
అగుపడునట్లు
చేయు)
అవిద్య
శక్తియు
అవినాభావముతో
ప్రకాశించుచున్నవి.
ఇంతకు
ఆ
భగవంతుడే
సత్తామాత్రుడు.
అనగా,
ఆ
ఒక్క
సత్యమే
పై
సమిష్టి
తత్వమునకు,
బాహ్య
ప్రపంచమునకు
అధిష్ఠానముగా
(ఆధారముగా)
నున్నదనియే
కదా
మీ
భావము?
17
▾
Meaning
Keep
స్వామి:
అంతే,
ఈ
భగవంతునినే
సత్యమనియు,
బ్రహ్మమనియు
అందుము.
ఈ
సత్యమే
అఖండము,
అద్వితీయము,
ఆనందము.
ఉపనిషత్తులలో
ఈ
అఖండ
సత్యమునే,
అవ్యక్తమాయా
సహితమైన
దానిని
“అదః”
శబ్దముచే
వ్యవహరించి
పూర్ణమనిరి.
వ్యక్తమాయను
కూడిన
ఈ
అఖండసత్యమునే
“ఇదం”
శబ్దలక్ష్యమైన
పూర్ణమని
వ్యవహరించిరి.
(పూర్ణమదః
పూర్ణమిదం
అనుమంత్ర
రహస్యము)
18
▾
Meaning
Keep
భక్తుడు:
ఆహా!
ఎంత
సుబోధకము!
పండును
ఒలిచి
చేతిలో
పెట్టినట్లున్నదే!
అవ్యక్తమాయాసహిత
అఖండసత్యము
అను
పూర్ణమునందే
వ్యక్త
సమిష్టి
విశ్వతత్త్వమను
పూర్ణము
తోచుచున్నదని
సెలవిచ్చుచున్నారు
కదా?
19
▾
Meaning
Keep
స్వామి:
అంతే.
ఈ
విషయమునే
మేము
“వాసుదేవస్సర్వమిదం”
“సర్వం
ఖలు
ఇదం
బ్రహ్మ”
అని
వ్యవహరింతుము.
“వాసుదేవ”
“బ్రహ్మ”
పదములకు
భాషా
భేదమే
కాని
భావభేదములేదు.
గ్రహించితివా?
20
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
ఇదంతయు
అమృతతుల్యముగనున్నది.
ఇంతకూ
నేనెవరైనది
చెప్పకపోతిరి.
21
▾
Meaning
Keep
స్వామి:
ఇప్పటికి
ఈ
విషయము
చాలును.
వచ్చేనెలలో
ఉన్న
సందేహములకు
ఉపమానములతో
సమాధానమిత్తును.
తెలిసిన
వానిని
చక్కగ
తెలిసికొని
పాటించు.
మరువకు.
చెప్పినవి
మరుగుపరచకు,
మననము
చెయ్యి;
వెళ్ళిరా!
Previous
←
Prabodha 4
Next
Prabodha 6
→