Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sandeha Nivāriṇī · Prabodha 6
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
6
స్వామి:
ఏమి నాయనా! వచ్చినావా? సంతోషము. ముందు తెలిపిన జబాబులు చక్కగా మననముచేసి నిస్సందేహుడవై ఆచరించి ఆనందాన్ని పొందుచున్నావా?
2
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
అందుకొరకే
ఆరాటపడుచున్న
మాబోటి
భక్తులకు
చిక్కిన
ఈ
అమృత
వాక్కులను
వృథా
పోనిత్తుమా?
“పాలికందిన
పరమాన్నము”ను
పారబోసుకొనువారెవరైనా
ఉందురా?
నిజమైన
ఆనందమును
పొందగోరువారు
ఎవ్వరూ
తమ
వాక్కులను
వృథాగా
పోనీయరు.
మిగిలిన
వారి
సంగతి
నాకు
తెలియదు.
రాత్రింబగళ్ళు
తమ
జవాబులనే
తలంచుచూ
ఆచరించుచున్నాను
స్వామి!
ఆ
అమృతపానమాహాత్మ్యముచేతనే
ఏనాడు
16వ
తేదీ
వచ్చునను
అతురత
నాలో
భరించలేకపోవుచున్నాను.
దినములు
లెక్క
వేయుచూ
వేచియున్నాను.
3
▾
Meaning
Keep
స్వామి:
ఇట్టి
ఆరాటమునే
భక్తుడు
కల్గియుండవలెను.
లోకమున
నిస్సారమైన,
నిరుపయోగమైన
నిత్యముకాని,
సత్యముకాని,
భ్రాంతులకై
సర్వము
త్యాగముచేసి,
ప్రేమించి,
అలమటించడము
సహజము.
అట్టి
దానిని
అవిద్యామాయ
అందురు.
అట్లుకాక
నీవు
భగవచ్చింతనకొరకు,
వాక్కులకొరకు,
సారమును
గ్రోలుటకొరకు
దినములు
లెక్కవేయుట
ఇవి
విద్యామాయ.
ఏనాటికైన
భక్తుడు
ఈ
మాయలో
పడిన
తప్పక
ధన్యుడు
కాగలడు.
ఈ
విద్యామాయలో
నీవు
ప్రవేశించితివి
కాన
నీవు
ధన్యుడవు.
దీనిని
(అనగా
ఇట్టి
పవిత్ర
భగవత్
విషయచింతనను)
ఏ
మాత్రమూ
ఏ
కారణము
వల్లనైననూ
సరే
వదలక,
తగ్గనీయక
అభివృద్ధి
చేసికో;
తప్పక
పవిత్రుడవు
కాగలవు.
సార్థకతను
సాధించి,
గమ్యమును
చేరగలవు.
4
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
పోయిన
నెల
“నేను
ఎవరు”
అనునది
సెలవిచ్చెదమని
తెలిపితిరి.
దానినికూడా
తెలిసికొన్న,
ఉన్నకొంత
వ్యామోహము
వదలి
నిస్సందేహముగ
మీ
స్మరణ
చేయుచు
ఆనందముగా
ఉందును.
అంతకంటే
మహాభాగ్యమున్నదా?
5
▾
Meaning
Keep
స్వామి:
నాయనా!
“నేను”
అనునది
యథార్థము
తెలిసికొనవలెనన్న
చెప్పుటకు
చాలా
సులభమైన
అది
అనుభవమునకు
రానిది.
అంత
తృప్తినీయనిది.
నీకు
తృప్తితీరా
తెలుపుటకు,
నీకు
అర్థమగుటకు
కొంతకాలము
కావలెను.
ఈ
మాసమున
నాకు
నియమించిన
కాలము
చాలకపోవుచున్నది.
ఈ
రీతిగానైనను
ఏ
రీతిగానైనను
ఉన్నకాలమును
భక్తుల
ఆనందమునకే
ధారవోయుచున్నానే
కాని,
వేరు
నాకే
స్వార్థము
లేదు.
నా
కాలము
భక్తులకు
వినియోగించుటే
నా
స్వార్థము.
పోయిన
మాసమంతయు
నెల్లూరు,
గూడూరు,
వెంకటగిరి
చుట్టుపల్లెలు
తిరిగి
వస్తిని.
తదుపరి
బెంగుళూరు
పోయి
వస్తిని.
ఉన్న
కొంతకాలమును
ప్రేమవాహినికి
వినియోగించితిని.
ఈమాసమున
హైద్రాబాద్,
రాజమండ్రి,
సామర్లకోట,
చేబ్రోలు,
నూజివీడు
వెళ్ళుచున్నాను.
కాన,
వ్యవధి
లేదు.
వచ్చే
మాసమున
తృప్తితీరా
“నేను”
అన
ఎవరో
తెలుపుదును.
ఈనాటికి
ఈ
క్రింద
వ్రాసిన
“బుఱ్ఱకథ”
అర్థము
చేసికో,
చాలావరకు
నీవు
అనునది
ఎవరో
బోధ
పడగలదు.
దాని
మూలమున
కూడా
చాలా
వరకు
వైరాగ్యము
రాగలదు.
ఆపై
నేను
చెప్పెడి
విషయము
“నీవు”
అనునది
సులభముగా
తెలియును.
“బుఱ్ఱకథ”
కేవలము
చదువుటయేకాక
పదపదమునకూ
అర్థము
తెలిసికొని
ఆలోచించుము.
గిఱ్ఱున
నీ
బుఱ్ఱ
తిరుగును.
6
▾
Meaning
Keep
భక్తుడు:
ఆదైనా
సెలవిప్పించండి.
నా
ఆశను
పూర్తిచేసికొందును.
అమృతమును
ఆరగింతును.
7
▾
Meaning
Keep
స్వామి:
విను
చక్కగ.
8
▾
Meaning
Keep
తై
తై
తై
తై
తై
బొమ్మా
దీని
తమాష
జూడర
మాయబొమ్మా
ఖ్యాతిగ
దీనికి
ముందు
వెన్కగల
కథ
వివరింతును
విను
జీవా!
॥
తై
॥
9
▾
Meaning
Keep
మాతృగర్భమున
మలమూత్రముల
రోతల
నీవు
రోదింప
ప్రీతిగ
వీరలు
పేరంటమ్ములు
చేతు
రిదెంతటి
చిత్రమురా!
॥
తై
॥
10
▾
Meaning
Keep
పుట్టితి,
మది
గోల్పోయితి
దుర్గతి
పట్టితి
నని
నీ
వేడువగా
అట్టే
నవ్వుచు
నానందించెద
రిట్టివీరు
నీకెవరయ్యా!
॥
తై
॥
11
▾
Meaning
Keep
మసిలో
మట్టిన
మలమూత్రములన్
మసలుచు
సిగ్గను
మాటయె
లేక
పసిపాపడవై
పడుచు
లేచుచు
దిన
మొక
నాటక
మాడవొకో!
॥
తై
॥
12
▾
Meaning
Keep
తోడివారలతో
కూడియాడుచు
వేడుకతో
పలువిద్దెలు
నేర్పుచు
చూడచూడగ
చోద్యపుకళతో
ఏడేడునకు
ఎదిగే
బొమ్మా
॥
తై
॥
13
▾
Meaning
Keep
పతి
యని
సతి
యని
సరసభావమున
జతజేరుచు
సంసార
రంగమున
అతికౌతుకమున
నంతకన్న
నిక
అన్యము
లేదని
అడితిరే
॥
తై
॥
14
▾
Meaning
Keep
బొమ్మను
బొమ్మను
పొందుపఱచి
పలు
బొమ్మలు
సేయుర
బ్రహ్మయ్య
నమ్ముట
వన్నియు
నావే
యని
ధిం
ధిమ్మని
వానితో
నాడుదుగా
॥
తై
॥
15
▾
Meaning
Keep
ధనము
గూర్చునెడ
దాచి
పెట్టునెడ
దాని
బెంచ
నది
చనినపుడున్
తనువుతోడ
నీ
మనసుతోడ
నీ
తాండవ
మెన్నగ
తరమౌనా
॥
తై
॥
16
▾
Meaning
Keep
కామము
క్రోధము
గట్టికోలగా
తామసంబు
ముకు
దాడులు
గాగన్
కామినియున్
కనకంబు
చేతిలో
గంగిరెద్దులై
గంతులు
వేసె
॥
తై
॥
17
▾
Meaning
Keep
సాగుచున్నదని
లోగిన
వారిని
సంకటపెట్టుటె
సంతసమా
ఈగకాలియంతే
వికటించిన
నీ
గతి
తైతకలే
గదా
॥
తై
॥
18
▾
Meaning
Keep
ఉరిమి
చూచుచును
కరము
లూచుచును
ఒడ
నెరుగని
సివమెందుచును
అరచుచు
నెగురుచు
నందరు
నవ్వగ
ఆగ్రహ
మను
దయ్యము
పట్టిన
॥
తై
॥
19
▾
Meaning
Keep
చదువెందుల
కను
సంగతి
మఱచి
ఉదరపూర్తి
కై
ఉఱుకులెత్తుచు
ఎదుటి
గొప్ప
సహియింప
కేడ్చుచు
సతమతమయ్యే
చదువులబొమ్మా
॥
తై
॥
20
▾
Meaning
Keep
గుట్టుగ
నీ
చెడుకోర్కె
చెల్లెనని
లొట్టలు
గొట్టకు
రోరన్నా
చిట్టా
వ్రాస్తే
చిత్రగుప్తు
కం
డ్లెట్టుల
గంతలు
గట్టుదురా
॥
తై
॥
21
▾
Meaning
Keep
అందము
ప్రాయము
ఇంద్రియశక్తియు
ఉందని
నిక్కకు
రోరన్నా
ముందున్నదిరా
తొందరలోనే
ముసలితనమ్మను
ముసళ్ళపండువు
॥
తై
॥
22
▾
Meaning
Keep
మసలలేవు
కనుమసకలు
మోమున
మడతలుబడె
తల
నెరిసెనుగా
ముసలికోతి
యని
పనివారలు
నిన్
ముసిముసి
నవ్వగ
కసరుకొనునే
ఓ
॥
తై
॥
23
▾
Meaning
Keep
చచ్చుదాక
సంసార
చింతలో
పుచ్చిన
లాభము
వచ్చేనా
అచ్చట
నీ
యమయాతన
కడ్డము
వచ్చే
దేదిర
పిచ్చయ్యా!
॥
తై
॥
24
▾
Meaning
Keep
బుఱ్ఱు
మనుచు
జీవుండను
పిట్ట
బుట్ట
బొమ్మను
విడిపోగా
బిఱ్ఱుగ
నీల్గిన
కఱ్ఱబొమ్మ
యిది
బఱ్ఱున
బైటికి
పట్టి
లాగే
॥
తై
॥
25
▾
Meaning
Keep
పంచభూత
సంభవమౌ
మేనికి
పంచత్వము
ప్రాప్తించు
గదా
వంచితుడై
నా
దంచు
దీనికై
వాంఛ
గొంచు
దుఃఖించే
జీవా!
॥
తై
॥
26
▾
Meaning
Keep
బంధువులందరు
వాకిటిదాకను
వల్లకాటికిని
వత్తురుగా
బంధమణచి
నిన్
బాయని
ఆప
ద్భంధువు
భగవన్నామమెరా
॥
తై
॥
27
▾
Meaning
Keep
నమ్ముకొనకు
నిత్యమ్మని
దేహము
పుట్టి
ముంచు
నది
నట్టేటన్
తుమ్మునంతలో
తూలిపోవు
నీ
తొమ్మిది
తొఱ్ఱల
తోలుబొమ్మ
॥
తై
॥
28
▾
Meaning
Keep
ఆపదలన్
సౌఖ్యంబులందున
ఏపుమీరగా
ఏడ్చుచు
నవ్వుచు
ఆ
పరమేశ్వరు
నానతి
మేఱకు
ఆడే
భోగము
తాపాబొమ్మ
॥
తై
॥
29
▾
Meaning
Keep
ధర్మకర్మ
సూత్రంబుల
గొని
నిన్
తా
నాడింపగ
దైవంబు
మర్మ
మెఱుంగక
మాయేటందువు
మాధవుచేతి
కీలుబొమ్మా
॥
తై
॥
30
▾
Meaning
Keep
తర
తరమును
సుస్థిర
మనిపించుచు
పరమావస్థల
పాలు
సేయుచు
మఱు
నిముసంబిది
మఱుగు
పడునురా
పరమాత్ముడు
సల్పిన
మాయబొమ్మా
॥
తై
॥
31
▾
Meaning
Keep
చెట్టై
పుట్టై
చీమై
దోమై
చిలుకై
కొండచిలువయునై
పుట్టుచు
గిట్టుచు
కొట్టుకొనుచును
గట్టే
వెదుకని
కర్మజీవా
॥
తై
॥
32
▾
Meaning
Keep
అరుదుగ
దొరికెను
నరజన్మం
బిది
అర
నిముసము
వృథా
పరుపకురా
తెరువు
నెరిగి
చని
పరమాత్ముని
గని
చిరసుఖ
మొందర
చింతాజీవా
॥
తై
॥
33
▾
Meaning
Keep
నీ
యదృష్టమున
సాయికృష్ణుడై
ఆ
యఖిలేశుం
డగుపడురా
హాయిగ
సత్యసాయి
నాత్మలో
అరయుచు
నిను
నీవే
ఎఱుగుమురా
॥
తై
॥
34
▾
Meaning
Keep
నీటుగ
మాటలు
కోటి
పల్కిన
నీ
కడుపింతయు
నిండదురా
సూటిగ
నాత్మజ్యోతిని
కన్న
నె
ఆటవిడుపు
నీకగు
నయ్యా!
॥
తై
॥
35
▾
Meaning
Keep
వ్యర్థంబగు
నీ
వెఱ్ఱి
బుఱ్ఱకథ
విని
యజ్ఞానము
వీడుము
జీవా
సార్థక
సత్యసాయి
బుఱ్ఱకథా
కని
ప్రజ్ఞానములో
కొనరన్నా!
॥
తై
॥
36
▾
Meaning
Keep
భక్తుడు:
ఆహా
తెలిసెను!
దేహము,
బుద్ధి,
మనసు,
చిత్తము
ఇవి
ఏవియు
నేను
కాదని
స్పష్టముగా
తెలిసినది.
ఇవి
ఏవియు
నేను
కానప్పుడు
ఆత్మయే
“నేను”
అనునది
అర్థమయినది.
ఆత్మయే
నేనన్న
ఆత్మ
“పరమాత్మ”
యే
కాన
అంతా
పరమాత్మయే.
నేను
అనునది
దేహ,
బుద్ధులను
నమ్ముకొని
అజ్ఞానమున
అవే
నేను
అను
భ్రాంతివల్ల
ఇన్ని
కష్ట,
నష్ట,
దుఃఖములకు
గురియగుచున్నాము.
నిజము,
నిజము,
తమరు
చెప్పినవన్నియు
పూసగ్రుచ్చినట్లు
అనుభవించుచునే
యున్నాము.
అబ్బా!
ఎంత
సత్యము,
ఎంత
సత్యము,
ఈ
ఒక్క
బుఱ్ఱకథ
విన్నను
చాలు.
బుఱ్ఱలు
గిఱ్ఱున
వైరాగ్యము
వంకకు
తిరుగును.
స్వామి!
మొదట
మీరు
వ్యవధి
లేదని
తెలుపగనే
కష్టపడితిని.
ఐతే
అది
పూర్తి
అజ్ఞానము.
మా
స్వామి
ఏనాటికి
ఎవ్వరికి
నిరాశకానీ,
కష్టముకానీ
కలిగించడని
తెలిసియూ
అట్లు
తలంచుకొందుము.
అనుకొన్న
దానికంటే
అధిక
ఆనందమునే
ఆందించితిరి.
మీ
దయ
యేమని
వర్ణింతును?
మా
బాధలు
మీరు
ఏనాటికీ
సహించలేరని
“కార్చుకన్నీటిబొట్టుకు
కరుగు
సాయి”
అను
యథార్థమునకు
ఇదియే
సాక్షి.
సెలవు.
37
▾
Meaning
Keep
స్వామి:
మంచిది
వెళ్ళిరా;
నాకు
కూడా
వ్యవధిలేదు.
ఊళ్ళకు
వెళ్ళువారందరిని
చూచి
పంపవలెను.
Previous
←
Prabodha 5
Next
Prabodha 7
→