Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sandeha Nivāriṇī · Prabodha 7
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
7
భక్తుడు:
వందనము, స్వామి!
2
▾
Meaning
Keep
స్వామి:
వచ్చితివా
నాయనా!
దసరాకు
రాలేదే?
3
▾
Meaning
Keep
భక్తుడు:
అప్పటిలో
భక్తులగుంపులెక్కువ
ఉండుననియు,
తమతో
మనసుతీరా
సంభాషించుటకు
వీలుండదనియు,
తమ
జన్మదినమునకు
మునుపువచ్చి,
తమ
జన్మదినోత్సవము
దర్శించుటతోపాటు
మాకు
కూడా
భక్తి
జ్ఞానములు
మా
హృదయమున
జననమగునట్లు
తమ
ఆశీర్వాదములను
పొందగోరి
ఇప్పుడు
వచ్చితిని.
4
▾
Meaning
Keep
స్వామి:
మంచిది!
చాలా
మంచి
ఉద్ధేశము.
అట్టి
భక్తి
జ్ఞానములు
నా
జన్మదినమందు
తప్ప,
మరే
ఇతర
సమయములందు
జనన
మందవనియా
నీ
ఉద్ధేశము?
5
▾
Meaning
Keep
భక్తుడు:
అట్లుకాదు.
ఈ
లోకమునకు
తమరు
పవిత్రరూపముతో,
పవిత్రకాలమున
పవిత్రమైన
దినములలోనే
వత్తురు
కదా!
అట్టి
సమయమునందైన
మాకూ
ఆ
పవిత్రదినమున
మీ
పవిత్ర
వాక్కులు
మా
హృదయమును
పవిత్రముచేసి
ప్రతిష్ఠ
అగునని
నాయుద్దేశము.
6
▾
Meaning
Keep
స్వామి:
బంగారు!
మంచిది
నాయనా!
ఈనాడు
నీకున్న
సందేహము
ఏమి?
7
▾
Meaning
Keep
భక్తుడు:
ఈనాడు
పవిత్రమైన
తమ
అమృతవాక్కులు
ఏవైననూ
వినగోరి,
వాటిని
చేయగోరివస్తిని.
కాని,
కాశికిపోతూ
శనేశ్వరుడు
వెంటవున్నట్లు,
సందేహములను
దయ్యములను
వెంట
తేలేదు;
అవి
రాలేదు.
అది
తమ
అపారకృపయే.
8
▾
Meaning
Keep
స్వామి:
మంచిది.
అట్టి
సందేహములను
నీవు
తేక,
అవి
రాకుండిన
అదే
నిర్మలత్వమని
తలంచవలెను.
అట్లు
రెండూ
ఒక
సమయమున
కలుగుట
ఏకాగ్రత
అందురు.
పోనీ,
నీకు
లేనపుడు
తిరిగి
నేనెందుకు
అవి
జ్ఞాపకము
చేయుట?
ఏమి
చెప్పమందువు?
మరి
తెలుపు.
9
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
మేము
సర్వసామాన్యముగా
ఎట్లు
నడచుకొనవలెను?
ఎట్టి
భావములతో
ఉండవలెను?
ఎట్టి
విషయములను
తలంచవలెను?
ఏయే
కార్యములు
చేసిన
భగవదనుగ్రహమునకు
పాత్రులమగుదుము?
తమ
సన్నిధిని
ఏ
రీతిగా
పొందుదుము?
వాటి
విషయమై
కొన్ని
రత్నములవంటి
ముఖ్యమైన
విషయములు
మాత్రమే
ప్రధానముగా
ఎత్తి,
తెలుపుదురని
కోరుచున్నాను.
10
▾
Meaning
Keep
స్వామి:
ఓహో!
ఒకానొక
సమయమున
పార్వతి
ఈశ్వరుని
అడిగినదట.
సహస్రనామములు
చెప్పుట,
వాటిన
జ్ఞాపకము
నందుంచుకొనుట,
వాటిని
నేర్చుకొనుటకు
వేరేకాలమును
వృధాపరచుట,
ఇవి
అన్నియూ
చాలా
కష్టము,
సహస్ర
నామముల
సారము
ఒక్కటి
చెప్పుమని
అట్లే
ఇన్ని
వ్రాస్తూ
తెలుపుతున్నవన్నియూ
నీకు
కష్టమయి
ముఖ్యమైనవేవో
తెలుపుమంటివా?
అయితే
నామములన్నింటికి
ఒకే
సారముండును.
కానీ,
ఈ
విషయములకు
అట్లుకాదు.
ఫలము
ఒక్కటైనా
వాటి
ఆచరణలు,
మార్గములు
అన్నియూ,
ఒక్కటి
కావు.
ఒక్కమాటలో
చెప్పుటకు
వీలుపడదు.
అయితే,
కొన్ని
అవసరమైన
రత్నములను
మాత్రము
ఏరి,
ఏరి
ఇస్తాను.
భద్రము
చేసుకో.
బాగా
వాటిని
అనుభవించి,
ఆచరించి,
ఆనందించుకో,
అలంకరించుకో.
11
▾
Meaning
Keep
భక్తుడు:
అవే
నే
కోరునవి.
నేనెంతయో
అదృష్టవంతుడను.
సెలవియ్యండి.
12
▾
Meaning
Keep
స్వామి:
అయితే
సావకాశముగా
వినుము.
చెప్పుదును.
13
▾
Meaning
Keep
1.
ప్రేమయే
మానవుని
ప్రాణముగా
భావించవలెను.
14
▾
Meaning
Keep
2.
అన్నిటియందూ
సమముగా
వేరు
వేరు
రూపముల
ప్రవర్తించు
ప్రేమయే,
పరమాత్మ
అని
విశ్వసించవలెను.
15
▾
Meaning
Keep
3.
అందరియందూ
ప్రేమస్వరూపుడై,
ఒక్క
పరమాత్ముడే
యున్నాడని
నిశ్చయించుకొనవలెను.
16
▾
Meaning
Keep
4.
అన్ని
విధముల
ప్రేమకంటెను
భగవంతుని
ఎక్కువగా
ప్రేమించుట
మానవుని
ప్రథమ
ప్రయత్నము.
17
▾
Meaning
Keep
5.
అట్టి
భగవత్ప్రేమయే
భక్తియగును;
అదియే
జీవితముయొక్క
కర్తవ్యము.
18
▾
Meaning
Keep
6.
అత్మసుఖమును
అనుభవించగోరువారు
విషయసుఖముల
కోరకూడదు.
19
▾
Meaning
Keep
7.
సత్యమే
మానవుని
శ్వాసయని
భావించండి.
20
▾
Meaning
Keep
8.
శ్వాసలేని
దేహమెట్లు
నిష్ప్రయోజనమై
కొన్ని
నిమిషములలోనే
ఎట్లు
దుర్వాసన
కొట్టునో,
అట్లే
సత్యములేని
జీవితము
నిష్ప్రయోజనమై
అశాంతి,
దుఃఖములతో
అలమటించును.
21
▾
Meaning
Keep
9.
సత్యముకంటే
ఘనమైనది,
విలువైనది,
మధురమైనది.
స్థిరమైనది
వేరు
లేదని
దృఢముగా
నమ్ముము.
22
▾
Meaning
Keep
10.
సత్యమే
సర్వుల
రక్షించు
సర్వేశ్వరుడు.
దానికంటే
రక్షణ
వేరు
లేదు.
23
▾
Meaning
Keep
11.
సత్యస్వరూపుడైన
సర్వేశ్వరుడు,
సత్యవాక్య
ప్రేమ
హృదయ
సంపన్నులకే
కన్పించును.
24
▾
Meaning
Keep
12.
పరిపూర్ణమైన
భూతదయ,
స్వార్థపరిత్యాగము
కల్గియుండుడు.
25
▾
Meaning
Keep
13.
ఇంద్రియ
నిగ్రహము,
శాంతిస్వభావము,
వైరాగ్యము
కల్గియుండవలెను.
26
▾
Meaning
Keep
14.
నాలుకతో
చేయు
నాలుగు
పాపముల
విషయమై
జాగ్రత్తగా
మెలగుచుండుడు
:
1.
అసత్యము
2.
పరదూషణము
3.
చాడీలు
చెప్పుట
4.
అమితముగా
మాట్లాడుట.
ఇవి
సాధ్యమైనంతవరకు
మించిపోనీక
అదుపులో
పెట్టప్రయత్నించుట
ఉత్తమమార్గము.
27
▾
Meaning
Keep
15.
దేహము
చేయు
అయిదు
పాపములను
అదుపులో
పెట్టుకొనవలెను.
అవియే
హత్య,
వ్యభిచారము,
దొంగతనము,
త్రాగుడు,
మాంసభక్షణము.
ఇవికూడా
సాధ్యమైనంతవరకూ
దూరము
చేసుకొనుట
ఉత్తమ
జన్మముయొక్క
పరమార్థము.
28
▾
Meaning
Keep
16.
మనసు
చేయు
ఎనిమిది
పాపములను
చేయకుండుటకు
ఎల్లప్పుడు
ఏమరక
గమనించవలెను.
కామము,
క్రోధము,
లోభము,
మోహము,
మదము,
ఓర్వలేమి,
ద్వేషము,
గర్వము
ఈ
విషయములను
దూరముచేయు
ప్రయత్నము
మానవుని
మొదటి
పని.
29
▾
Meaning
Keep
17.
చెడుకార్యములు
చేయుటలో
మానవమనస్సు
అతి
వేగముగా
సాగిపోవుచుండును.
అట్లు
పోనీయక,
ఆ
సమయమున
భగవన్నామము
తలంచుచూ,
సత్కార్యములు
చేయ
ప్రయత్నించుము.
అట్లు
చేయువాడు,
భగవదనుగ్రహమునకు
పాత్రుడు
కాగలడు.
30
▾
Meaning
Keep
18.
ఉన్నవారిని
చూచి
ఓర్వలేక,
వారిని
చెరుపు
ప్రయత్నములు
మొదట
మానవలెను.
ఉన్నవారిని
చూచి
ఆనందించుచు,
లేనివారిని
చూచి
పరితాపపడి,
వారి
మంచిని
కోరుము.
అదియే
భగవత్ప్రేమకు
గురి.
31
▾
Meaning
Keep
19.
మానవునకు
ఓర్పే
సర్వబలము.
32
▾
Meaning
Keep
20.
సంతోషమును
కోరువాడు
మంచి
చేయుచుండవలెను.
33
▾
Meaning
Keep
21.
ప్రేమతో
కోపమును,
విచారణచేత
మోహమును,
సత్యముచేత
అసత్యమును,
మంచిచేత
చెడ్డను,
ధర్మముచేత
లోభమును,
జయించుట
సులభము.
34
▾
Meaning
Keep
22.
దుష్టుల
మాటలకు
జవాబు
వద్దు;
దూరమయి
మెలంగుట
మంచిది.
అట్టివానితో
సంబంధమును
మానుము.
35
▾
Meaning
Keep
23.
మంచివారి
సహవాసమును
మానప్రాణములైనను
ధారపోసి
పొందగోరుము.
అయితే,
మంచిచెడ్డలు
విచారణ
చేయు
వివేకమును
ప్రసాదించుమని
పరమాత్ముని
కోరు.
ఇచ్చిన
బుద్ధిబలముతో
నీవునూ
ప్రయత్నించు.
36
▾
Meaning
Keep
24.
లోకమున
రాజ్యములు,
కీర్తులు
జయించినవారు
వీరులు.
కాని,
తన
ఇంద్రియములను
జయించినవాడు
బ్రహ్మాండమునే
జయించినవాడగును,
చూడు.
37
▾
Meaning
Keep
25.
మానవుడు
మంచిచెడ్డలు
ఏమి
చేసిననూ,
వాటి
ఫలములు
వెంటనే
వెంటాడును.
38
▾
Meaning
Keep
26.
దురాశ
దుఃఖమును
కలిగించును.
సంతృప్తి
సర్వోత్తమము.
దానికి
మించిన
సుఖము
లేదు.
39
▾
Meaning
Keep
27.
కుట్రబుద్ధిని
కూకటివేళ్ళవరకూ
నరికి
పారవేయవలెను.
లేకున్న
అది
జీవితమునే
నిర్మూలనము
చేయును.
40
▾
Meaning
Keep
28.
కష్టములకూ,
నష్టములకూ,
ఓపికపట్టి,
సుఖ
లాభములకు
ప్రయత్నించు
ఊహలను
వెతుకవలెను.
41
▾
Meaning
Keep
29.
కోపము
వచ్చినపుడు
మౌనము
దాల్చుము,
లేదా,
భగవన్నామమును
స్మరించుము.
అంతేకాని,
వీనిని
బలపరచు
భావములను
వెతుకకుము.
అది
అమితహాని
చేయును.
42
▾
Meaning
Keep
30.
చెడ్డ
అలవాట్లను
ఈ
క్షణమునుండే
వదలుటకు
పూనుకో,
నిదానము
కూడనూ
చేయకు.
అందులో
సుఖసంతోషములు
ఏమాత్రమూ
లేవు.
43
▾
Meaning
Keep
31.
శక్తికొలది,
దరిద్రనారాయణుని
బిడ్డలగు
బీదవారిని
తృప్తిపెట్ట
ప్రయత్నించు.
నీకున్న
తిండిలో
వారిని
ఆ
పూట
సంతోషపెట్టు.
44
▾
Meaning
Keep
32.
ఇతరులు
నీకు
ఏమి
చేయుట
ఇష్టముకాదో,
వాటిని
నీవు
ఇతరులకు
చేయకుండా
ఉండవలెను.
45
▾
Meaning
Keep
33.
తెలియకచేసిన
తప్పులకు
పాపములకు
మనఃపూర్వకముగ
పరితపించుచు,
మరల
అట్టివి
చేయకుండుటకు
ప్రయత్నించుచూ,
దానికి
బలము
ధైర్యములను
ప్రసాదించుమని
పరమాత్ముని
ప్రార్థించుము.
46
▾
Meaning
Keep
34.
భగద్విషయమున
ఉత్సాహమును
చంపే
విషయము
లేవైనా
వచ్చిన
వాటిని
చెంత
చేర్చకు.
నిరుత్సాహము
మానవుని
బలమును
నిర్మూలము
చేయును.
47
▾
Meaning
Keep
35.
ఆధైర్యమునకు
చోటివ్వకుము.
ఆనందమును
చేవిడువకుము.
48
▾
Meaning
Keep
36.
నిన్ను
పొగడువారిని
చూచి
పొంగకుము.
దూషించు
వారిని
చూచి
క్రుంగకుము.
49
▾
Meaning
Keep
37.
ఎవరైననూ
నీ
మిత్రులలో
ఒకరితో
నొకరు
ద్వేషమును
పూని
కలహించుచుండిన,
వారిని
మరింత
రెచ్చగొట్టక,
కలుపుటకు
అన్యోన్యమయిన
ప్రేమలతో
పెరుగుటకు
ప్రయత్నించుము.
50
▾
Meaning
Keep
38.
మరొకరి
తప్పులు
వెతుకక,
నీలో
నీవు
నీ
దోషములను
వెతికి
తీసి
పారవేయి.
పరుల
తప్పులు
పదిమార్లు
వెతుకుటకన్న
నీ
తప్పును
నీవు
ఒకటి
వెతకుకొని
తెలిసికొన్ననూ
చాలు.
51
▾
Meaning
Keep
39.
పుణ్యకార్యములు
చేయ
వీలులేకున్ననూ,
ఇష్టము
లేకున్ననూ,
పాపములు
మాత్రం
తలంచకు,
చేయకు,
ఇది
ఎంతో
ఉత్తమము.
52
▾
Meaning
Keep
40.
నీలో
లేని
తప్పులకు
ఎవరేమన్ననూ
బాధపడకుము.
నీలో
ఉన్న
తప్పులకు
ఇతరులచే
అనిపించుకొనక
మునుపే,
వానిని
సరిచేసుకొనుటకు
నీలో
నీవు
ప్రయత్నించు.
నీ
తప్పులు
నీకు
తెలుపువారిపై
నీవు
కోపము
కాని,
ద్వేషముకాని
పూనక,
“నా
తప్పులు
తెలిపిరే”
అని,
తెలిపిన
వారిలోనున్న
తప్పులను
వెతుకక
తెలిపిన
వారికి
కృతజ్ఞత
చూపు.
అట్లుకాక,
వారి
తప్పులను
వెదకి
తెలుపుటలో,
మరింత
నీదే
తప్పగును.
నీ
తప్పును
నీవు
తెలిసికొనుటలో
మంచియున్నదికాని,
నీ
తప్పు
చెప్పినవారి
తప్పులు
వెదకుటలో,
ఏ
మంచియు
లేదు.
దానివలన
ఏ
ఫలమూ
ఉండదు.
53
▾
Meaning
Keep
41.
ఏ
కొంతకాలము
విరామము
నీకు
దొరికినూ
వేరు
విషయములపై
సంభాషించక,
పరమాత్మ
చింతన
చేయి.
లేదా
పరోపకారమైన
పనులు
చేయుట
మంచిది.
54
▾
Meaning
Keep
42.
భగవంతుని
విషయము
భక్తునకు,
భక్తుని
విషయము
భగవంతునికి
మాత్రము
తెలియునుకాని,
అన్యులకు
తెలియదు.
కాన
భక్తిలేని
వారి
చెంత
భగవద్విషయములు
తర్కించకుము.
దానినుంచి
భక్తిభావములు
బలహీనమగును.
55
▾
Meaning
Keep
43.
ఎవరైన,
ఏవిషయమందైన,
తప్పుగా
తలచి
తెలిపిన
దానికి
తోడయిన
తప్పుభావములు
నీవు
యోచింపకు.
అందులోని
మంచి
భావమును,
ఆనందభావమును
తెలిపే
నిజమైన
అర్థము
మంచిదికాని,
అనర్థము,
నానార్థము
అర్థహీనమగును;
ఆనందభంగమగును.
56
▾
Meaning
Keep
44.
నీవు
ఏకాగ్రతను
పొందగోరుము.
కాని
గుంపులందునూ,
బజారులందునూ,
దృష్టిని
నలుమూలల
పోనీక
నీవు
నడచునట్టి
మార్గమును
మాత్రము
చూచుచు,
పొమ్ము.
అట్టి
తరుణమున,
కొంత
దేహముపై
సయితము
దృష్టిపెట్టి,
అపాయమునకు
గురికాకుండా
చూచుకొమ్ము.
దారి
తప్పక
అపాయమునకు
గురికాక,
అన్యరూపములపై
దృష్టిని
పోనీక
మెలంగుట
ఏకాగ్రతకు
ఎంతయో
బలము.
57
▾
Meaning
Keep
45.
గురువునందునను,
భగవద్విషయమునకు
సందేహములు
మానుము.
లోకసంబంధమైన
వాంఛలు
నెరవేరకున్న
భక్తిభావములకు
జతచేర్చకు,
అట్టివాంఛలకూ,
భగవద్భక్తికీ
సంబంధమేమాత్రమూ
ఉండదు.
“లోకవాంఛ
లేనాటికైనా
వదలవలసినవే.
భక్తిభావములు
ఎప్పటికీ
కలుగవలసినవే”
అను
నిశ్చయమును
దృఢపరచుకో.
58
▾
Meaning
Keep
46.
ధ్యాన,
జప
సాధనలందు
మనసు
కుదరక,
తలంచిన
వాంఛ
నెరవేరకున్న
విసుగును
భగవంతునిపై
చూపకుము.
అది
మరింత
విసుగు
పుట్టించి
కోద్దో
గొప్పో
పొందిన
శాంతిని
కూడా
జారవిడుచుకొందువు.
ధ్యాన
జప
సమయమున
అట్టి
విసుగు,
విరక్తి,
నిరుత్సాహమే
పడకూడదు.
నీ
సాధన
లోపమని
భావించి,
సరిగా
సాధించుటకు
ప్రయత్నించు.
59
▾
Meaning
Keep
లోకమున
సర్వసాధారణ
విషయములందు
ఇట్టి
సహజ
ప్రవర్తనలు
పరిశీలనలూ
జరిపిననే,
పరమాత్మ
తత్వము
అవలీలగా
సాధింపవచ్చును.
కాన,
ఈ
సుబోధనలను
జాగ్రత్తపరచుకో.
ఇవి
నీ
స్వామి
పుట్టిన
పండుగకు
పంచిన
పలుకుమిఠాయి
అని
అరగించు,
ఆనందించు,
బోధపడినదా?
60
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి,
మీవి
అమృతవాక్కులు!
అమృతవాక్కులు!
ఇట్టి
సాధారణ
విషయములందు,
ప్రతి
మానవుడు
మార్గము
తెలియక,
తప్పుడు
మార్గమున
పడుచూ,
ఇట్టి
వాటికి
తరణోపాయము
తెలుపునట్టి
గ్రంథములు
సయితము
చూడక,
అల్లాడునట్టి
ఈలాంటివారికి,
ఇవి
దర్పణములు.
ధన్యులము.
ఈ
వాక్కులు
హృదయమున
నాటుకొని,
ఆచరణలో
నిత్యము
అనుభవించునట్లు
అనుగ్రహించండి.
కేవలము
విన్నంత,
చదివినంత
మాత్రమున
ప్రయోజనముండదు.
మీ
దయ
తోడైననే
వీటికి
బలము.
పోయి
వస్తాను.
స్వామి!
61
▾
Meaning
Keep
స్వామి:
మంచిది
నాయనా!
వెళ్ళిరా,
తరువాత,
పుట్టిన
పండుగకు
కూడా
రా.
ఇంక
7
దినములున్నది
కదా!
నేడు
16వ
తేది;
పుట్టిన
పండుగ
23వ
నవంబరు.
కాన
7
దినములు,
అప్పటివరకు
ఈ
మాధుర్యము
నీ
హృదయమున
తొణుకుచుండుగాక!
Previous
←
Prabodha 6
Next
Prabodha 8
→