Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sandeha Nivāriṇī · Prabodha 8
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
8
స్వామి:
ఓహో! ఏమి ఈ పర్యాయము చాలా ముందుగానే వచ్చినావే?
2
▾
Meaning
Keep
భక్తుడు:
తమరు
రప్పించుకొంటిరి.
వస్తిని
స్వామి!
నాదేమున్నది?
3
▾
Meaning
Keep
స్వామి:
అది
నిజమే
కాని,
ఏదో
కారణము
లేక
కాగితము
సయితము
కదలునా?
అట్లనే,
ఇంత
మునుపు
రావటానికి
కూడా
కారణమున్నది.
4
▾
Meaning
Keep
భక్తుడు:
మరేమియూ
లేదు
స్వామి!
కేరళ
గవర్నరుగారైన
రామకృష్ణరావుగారి
ఆహ్వానముపై,
తాము
తిరువనంతపురము
16వ
తేదీన
బయలుదేరి
పోవుచున్నారను
వార్త
విని,
ఆ
సమయమున
పోయిన,
సంభాషించు
నంతటి
అవకాశముండునో
ఉండదో
అని
ఇంత
మునుపే
వస్తిని,
క్షమించండి.
5
▾
Meaning
Keep
స్వామి:
మంచిదే
చేసితివి;
దానిని
క్షమించమని
కోరుటెందుకు?
అసలు
చెడ్డ
చేసిననే
క్షమించమని
కోరకూడదు.
అట్టిచో
మంచినికూడను
క్షమించమని
కోరుటెందుకు?
6
▾
Meaning
Keep
భక్తుడు:
చెడ్డను
మాత్రము
ఎందుకు
క్షమించుమని
కోరకూడదు
స్వామి!
7
▾
Meaning
Keep
స్వామి:
చెడ్డను
క్షమించుమనియు,
మంచికి
ఫలమివ్వుమనియు
రెండును
కోరకూడదు.
మంచిని
చేయుట
మానవ
కర్తవ్యము,
కాన
దానికి
అదే
ఫలము
ఇంక
వేరు
ఫలమెక్కడున్నది?
అందులో
ఆనందమే
నీకు
ఫలము.
ఇంక,
చెడ్డను
చేయుట
మానవ
కర్తవ్యమునకు
వ్యతిరేకము.
అట్టిదానిని
చేయనీయక,
చేసిన
దానిని
తెలిసికొని
పశ్చాత్తాపపడి,
మరొకతూరి
అట్టివి
చేయక
మెలంగునట్టి
తెలివిని
ఇవ్వుమనియు,
తెలివితోపాటు
వివేకమును
ప్రసాదించుమనియు
కోరవలెను,
దానిపై
శిక్షించి
రక్షించుట,
క్షమించుట
సరిచేయుట
అతని
అనుగ్రహమున
ఉన్నది.
8
▾
Meaning
Keep
భక్తుడు:
భలేగా
వుంది
ఈ
విషయము.
ఇంకపై
అట్లే
చేతును
స్వామి.
9
▾
Meaning
Keep
స్వామి:
పోనీ
పుట్టినపండుగకు
ఇచ్చిన
రత్నములను
భద్రపరచి,
వినియోగించుచున్నావా?
10
▾
Meaning
Keep
భక్తుడు:
సాధ్యమైనంతవరకు,
శక్తిలోపములేకుండ,
తమరిచ్చిన
బుద్ధి
మేరకు
నడచుకొనుచున్నాను.
11
▾
Meaning
Keep
స్వామి:
సాధ్యమైనంతవరకు
అనునదేమి?
మీబోటి
భక్తులకు
అంతకంటే
వేరు
పనేమి?
సాధ్యము
కాకేమి?
శ్రద్ధ,
ఇచ్ఛ
ఉండవలెను
కాని,
కర్తవ్యమున
నడచుకొనుట
కష్టము
కాదు.
12
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి,
ఇచ్ఛ,
శ్రద్ధ
ఉండియు
అనుకూలత
లేక
అర్థముకాకున్న
ఆచరించుట
కష్టమని
తమరే
తెలిపితిరి
గదా?
13
▾
Meaning
Keep
స్వామి:
అట్లయిన
అనుకూలత
లేక,
అర్థము
కాక
ఈ
రెండునూ
నీలో
ఉన్నవన్నమాట!
అర్థము
కాకున్న
అడుగు,
అనుకూలత
లేకుండుటకు
నీకున్న
అడ్డేమి?
14
▾
Meaning
Keep
భక్తుడు:
సందేహమే
పెద్ద
అడ్డు.
దానికి
మించిన
అడ్డు
వేరేమున్నది?
ఇన్ని
వినియు,
అప్పుడప్పుడు
మాకాగ్రహము
కలుగుచునేయున్నది.
అది
ఏమి
కారణమో
ఏమో?
15
▾
Meaning
Keep
స్వామి:
అది
ఎందుకన,
మేము
నిజముగా
ఆత్మస్వరూపులము
అనునటు
వంటి
నమ్మకము
మీపై
మీకు
లేకుండుట,
మొదటి
కారణము.
రెండవది
మానవత్వముతో
ఉన్న
దైవత్వమును
మానవునిగా
భ్రమించి,
విషయవాంఛలతో
తికమకలు
పొందుట.
ఈ
రెండు
కారణములవల్లనే
ఇట్టి
పిశాచము
మీపై
పూనుచున్నది.
అట్లు
కాకుండా,
మానవత్వముతోనున్న
పరమాత్మను,
పరమాత్మగా
భావించి,
పరమాత్మ
తత్త్వమును
ప్రతిష్టించుకొన్న
ఈ
సందేహపిశాచి
మీలో
చేరదు.
ఒకదానిలో
ఒకటి
చేర్చి,
నిరూపించునట్టి
అధ్యాసను
మానుకొనుము.
16
▾
Meaning
Keep
భక్తుడు:
అదుగో!
అర్థముకాని
పదములు
తమరు
అప్పుడప్పుడు
సెలవిచ్చుచుందురు.
వానితో
మరింత
తికమక
కలుగుచుండును.
స్వామి!
17
▾
Meaning
Keep
స్వామి:
అర్థము
కానివి
నేనెన్నటికి
మీకు
చెప్పను.
మీకు
అర్థము
చేసికొను
శక్తిలేక,
అట్లు
బాధపడుదురు.
అసలు
అట్టి
పదముల
అర్థములు
మీరు
తెలిసికొనవలెననియే
నేనా
పదములను
చేర్చుచుందును.
ఇప్పుడు
నేచెప్పిన
విషయములలో
అర్థముకాని
పదమేది?
18
▾
Meaning
Keep
భక్తుడు:
ఏదో
అధ్యాస
అని
అంటిరి.
అంటే
ఏమి
స్వామి?
19
▾
Meaning
Keep
స్వామి:
పిచ్చివాడా!
అది
తెలియదా?
ఒక
రూపము
చూచి,
మరొక
రూపమని
భ్రమించుట.
ఒక
వస్తువులో
మరొక
వస్తువును
నిరూపించుట.
20
▾
Meaning
Keep
భక్తుడు:
అంటే
యెట్లు?
ఏ
వస్తువునందు
మరొక
వస్తువును
నిరూపింతురు!
సెలవియ్యండి.
21
▾
Meaning
Keep
స్వామి:
చూడు:
త్రాడును
చూచి
పామనియు.
ఎండమావులను
చూచి
ఏవో
గుఱ్ఱములనియు
ఎండలో
మెరయు
అద్దము
చూచి
దీపమనియు
ఇట్లే
ఎన్నో
ఉన్నవి.
22
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
నేను
దేనిని
చూచి
ఏమని
భ్రమించుచున్నాను?
23
▾
Meaning
Keep
స్వామి:
ప్రకృతి
స్వరూపములోనున్న
పరమాత్మను
చూచి,
కేవలము
ఇది
ప్రపంచమని
భావించుచూ
భయపడుచున్నావు.
ఆ
భ్రమచేతనే
నీవన్ని
విధములగు
బలహీనతలకు
చోటిచ్చుచు,
భ్రాంతులతో,
సందేహములతో
సమసి
పోవుచున్నావు.
దానిని
యథార్థముగా
కనుగొన్న
భ్రాంతులుపోయి,
భయము
వీడి,
ధైర్యముతో
పరమాత్మ
అను
దృఢత్వము
ప్రతిష్ట
అగును.
అట్టి
దృఢత్వమును
పొందుటకే
వివేకమను
లైటు
అవసరము.
త్రాడు
పామను
సంశయ
మున్నంతవరకు
ఎంత
బాధ?
ఎంత
భయము?
ఎంత
భ్రాంతి?
దానిని
వెలుతురులో
చూచిన
తక్షణము
ఆ
భయ
భ్రాంతులు
ఎట్లు
పోవునో
ఏమైన
అర్థమగునా?
అట్లే
ఈ
భ్రాంతులు
కూడా
ప్రకృతిని
పరమాత్మ
అని
తెలిసికొనిన
తక్షణమే
తెలియకనే
అదృశ్యమైపోవును.
ఇట్టి
భ్రాంతులలో,
భ్రాంతులను
కల్పించి,
వస్తువులో
మరొక
వస్తువును
నిరూపించునట్టి
విచారమునే
“అధ్యాస”
అందురు
బాబూ!
24
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
ప్రకృతిని
పరమాత్మ
అని
అనవలెనన్న
ఎట్లు
సాధ్యమగును?
సహజ
మానవుల
దృష్టిలో
ప్రపంచముగా
గోచరించుచున్న
ఈ
ప్రపంచమును
పరమాత్మ
అని
తలంచవలెనన్న
సందేహము
రాక
తప్పదే?
25
▾
Meaning
Keep
స్వామి:
అది
నిజమే
నాయనా,
అయితే
విచారణతో
యథార్థమును
చూచిన,
ఈ
దృశ్యము
కూడా
పరమాత్మవలనే
కాన్పించును.
నూలు
లేక
బట్ట
అయినదా?
అయితే,
ఆ
గుడ్డకు
సయితము
నూలే
కదా
ప్రధానము?
అయితే
బట్టను
నూలనరు.
నూలును
బట్ట
అనరు.
ఇట్టి
సంబంధమే
ఈ
ప్రకృతికిని
పరమాత్మకును
కూడ.
పరమాత్మ
అను
నూలువల్లనే
ప్రకృతి
అను
బట్ట
ఏర్పడుచున్నది.
అట్లున్నప్పుడు,
నూలు
వేరే,
బట్ట
వేరే
అయినదా?
లేదే?
నూలును
ఒకరీతిగా
వినియోగింతురు.
బట్టను
మరొకరీతిగా
వినియోగింతురు.
అంతమాత్రమున
నూలువేరు,
బట్టవేరని
భావించరాదు.
26
▾
Meaning
Keep
భక్తుడు:
సరి,
స్వామి!
పరమాత్మవల్ల
ప్రకృతి
అని
తెలిసికొనిన
పరమాత్మ
వేరు,
ప్రకృతి
వేరు
కాదని
తెలిసినది.
ఈ
రెండును
ఒకటే
అయిన,
ఇంక
జీవుడు
అనునదేది
ఇందులో?
27
▾
Meaning
Keep
స్వామి:
అదే
మీకు
కలిగించు
సందేహము,
బాబూ.
నేను
అను
ఎరుకకు
స్థలమిచ్చినవారు
జీవుడు.
ఇతను
దేహేంద్రియాదులను
ఉపాధులతో
కూడుకొని
ఉండును.
అయితే
ఆత్మ,
జీవాత్మ,
ప్రత్యగాత్మ,
చిదాత్మ,
కర్త,
భోక్త
అన్నియూ
ఇతడే.
28
▾
Meaning
Keep
భక్తుడు:
ఇంక
జడమని
ఒక
పదము
వేరే
ఉపయోగింతురే?
అది
యేది
జడము
ఎట్లు
ప్రవర్తించును?
సెలవియ్యండి.
29
▾
Meaning
Keep
స్వామి:
బుద్ధి
మొదలు
శరీరమువరకు
అయిన
ప్రకృతి
పరిణామ
మెల్లను
జడమే.
ఇదే
అసత్తు,
అచేతనము.
సచ్చిత్
స్వరూపునికంటే
వేరయినదంతయూ
జడమనియే
భావించుము.
అసలు
నిజమునకు
జడము
లేక
ప్రపంచము
విడిగా
లేదు.
చైతన్యసంయోగము
లేక
జడము
దొరుకదు.
ఆకాశ
సంయోగము
లేక
గాలి
ఎట్లు
విడిగా
దొరకదో
అట్లే
ఇదియును
కూడా.
పుట్టునటువంటి
స్థావరజంగ
మాత్మకమగునది
అంతయూ
ప్రకృతి
పురుష
సంయోగము
వలన
పుట్టుననియే
కదా
గీతలో
ఆనాడును
చెప్పినది!
30
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
ఈ
బుద్ధికి,
మనసునకు
ఆత్మతో
సంబంధమేమి?
ఎట్లుండును.
31
▾
Meaning
Keep
స్వామి:
అబ్బాయి?
ఆత్మకు,
బుద్ధికీ
పేరు
ప్రత్యేక
సంబంధము
లేనప్పటికినీ,
ఆత్మపరిశుద్ధము,
నిర్మలము;
బుద్ధి
పరిశుభ్రము,
నిర్మలమే.
అద్దముపై
సూర్యుడు
ప్రతిబింబించినటుల
బుద్ధియందు
ఆత్మచైతన్యాభాస
కలుగును.
అపుడు
బుద్ధ్యాభాస
మనసునందును
మనో
ఆభాస
ఇంద్రియములందును,
ఇంద్రియాభాస
దేహమునందును
కలుగును.
ఇందేది
అన్నింటికి
సంబంధము?
ఆత్మప్రకాశమే
కదా?
అయితే,
ఆ
ప్రకాశమును
ఆకర్షించు
అద్దమువంటి
బుద్ధి
ఉండుటవలనకదా?
ఇప్పుడు
బుద్ధి
సంయోగము,
ఇటువైపు
ఇంద్రియములకు
అటువైపు
ఆత్మకును
కలదు
చూడు!
32
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే,
ఆ
“నేను”
అను
జీవునకు,
ఇంద్రియములకును
దేహమునకును
ఎట్టి
సంబంధము
కలదు?
33
▾
Meaning
Keep
స్వామి:
వానికి
సంబంధమే
లేదు.
ఇంద్రియములు,
దేహము,
మనసుకంటెను
కూడా
“నేను”
అనునది
వేరుగానే
ఉన్నది.
దేహ
ధర్మములును,
ఇంద్రియ
ధర్మములును,
అంతఃకరణ
ధర్మములును
ఈ
జీవియందు
(నేను)
ఆరోపించుచున్నవి.
చూడు:
నేను
ఎఱ్ఱగా
నున్నాను,
అని
దేహ
ధర్మమును
ఆరోపించుకొనుచున్నాడే
కాని
జీవికి
సంబంధము
లేదు.
నేను
మూగవాడను,
అని
ఇంద్రియ
ధర్మమును
ఆరోపించును.
ఆశ
(కామము)
చేత
అంతఃకరణ
ధర్మమును
ఆరోపించుచున్నాడు.
తెలిసినదా?
ఒక్కడే.
ఆ
పరంజ్యోతి
ఒక్కటే!
ఆ
నిత్యము,
సత్యము
ఒక్కటే,
బాగా
తెలిసికో.
34
▾
Meaning
Keep
భక్తుడు:
ఆహా!
ఎంత
సుబోధ!
చిన్నపిల్లలకు
సయితము
ఆత్మతత్త్వమును
అర్థముచేసికొన
వీలగునట్టి
ఈ
విషయములు
లోకమున
కంతయు
చాటినచో
లోకము
చీకటి
బాసి
ప్రకాశించును,
స్వామి!
35
▾
Meaning
Keep
స్వామి:
అందుకనే,
నీతో
సంభాషించు
ప్రతి
ఒక్కటి
అందరికీ
అంది,
అందరు
ఇట్టి
యథార్థమును
తెలిసికొనవలెననియే
సూర్యుని
కిరణములు
అద్దముపై,
అద్దము
ప్రకాశము
మిద్దెపై,
మిద్దె
ప్రకాశము
నేత్రముపై
పడినట్లు
నా
సుబోధ
ప్రకాశము
భక్తుడను
నెపముపై
వాని
సంభాషణ
“సనాతన
సారథి”
అను
మిద్దెపై,
దాని
కాంతి
లోకముయొక్క
శాంతిపై
పడవలెననియే
ఈ
“సందేహ
నివారిణి”
అను
సంకల్పమును
నేను
సంకల్పించినది.
Previous
←
Prabodha 7
Next
Prabodha 9
→