Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sandeha Nivāriṇī · Prabodha 9
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
9
స్వామి:
వస్తివా? సంతోషము! ఏమి సమాచారము?
2
▾
Meaning
Keep
భక్తుడు:
తమ
సమాచారము
తప్ప,
మాకు
వేరేమున్నది,
స్వామి?
తమ
కేరళ
సంచారము
అత్యంత
ఆనందముగాను
అద్భుతముగాను
ఉండెనని
వింటిని!
అయితే
ప్రాప్తి
లేకపోయెనను
చింత
తప్ప
మరేమీ
లేదు.
3
▾
Meaning
Keep
స్వామి:
దానికి
చింత
ఎందుకు?
విని
సంతోషపడవచ్చును
గదా!
తిరిగి
అట్టి
అవకాశము
కల్గినప్పుడు,
నేను
గూడ
పొందవలెనను
దృఢత్వము
ఉత్సాహము
ఉండవలెను
కాని
గడచిన
దానికి
చింతించరాదు.
4
▾
Meaning
Keep
భక్తుడు:
ప్రాప్తి
లేకున్న,
యెంత
దృఢత్వము
ఉత్సాహము
ఉండియు
ప్రయోజనమేమి?
అట్టి
ఆశ
మరింత
నిరాశ
కలిగించును
కదా?
5
▾
Meaning
Keep
స్వామి:
ప్రాప్తికి
ఒక
రూపమున్నదా
ముందే
తెలియుటకు?
కేవలము
ప్రాప్తి,
ప్రాప్తి
అని
ప్రాప్తికై
కాచుకొనగూడదు.
ఇచ్ఛ,
ప్రయత్నములు
కర్మరూపమున
ఆచరించకున్న,
ప్రాప్తియుండియు
ఎట్లు
సిద్ధించును?
ఎంతటి
ప్రాప్తికయినను
కర్మ
నాచరించుట
అవసరము,
కర్మ
సహాయము
లేక
ప్రాప్తి
సిద్ధించదు
కదా?
6
▾
Meaning
Keep
భక్తుడు:
ప్రాప్తియుండిన
అన్నియు
వాటంతటవే
చేకూరును
కదా?
7
▾
Meaning
Keep
స్వామి:
అదే
పెద్ద
పొరపాటు.
పండు
చేతియందుంచుకొని
ప్రాప్తియే
యుండిన
దాని
గుజ్జును
బొజ్జన
చేరునని
ఊరకుండిన,
ఎట్లు
చేరును?
తిని
మ్రింగునటువంటి
కర్మను
నీవు
ఆచరించక,
గుజ్జు
నాకు
ప్రాప్తించలేదని
యేడ్చుట
ఎంత
వెఱ్ఱితనము?
ప్రాప్తి
వలననే
కాయ
నీ
చేతికి
చిక్కినది.
కర్మవలన
దానిని
అనుభవించుకొనవచ్చును.
కర్మలేక
ఎట్టి
దానిని
సహితము
అనుభవింప
వీలులేదు.
కర్మ
కర్తవ్యము,
ప్రాప్తి
కర్మఫలము
కర్మ
లేక
ఫలము
లేదు.
8
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
అయితే
ప్రాప్తి
ప్రాప్తి
అని
దానిపై
భారము
వేసి
ఊరకుండకూడదా?
9
▾
Meaning
Keep
స్వామి:
నీ
శక్తిలోపము
లేక,
దానికి
తగిన
కర్మ
నాచరించుచు
ప్రాప్తిపై
భారము
వేసి
మెలంగుట
ఉత్తమముకాని,
తగిన
కర్మ
నాచరించక
ప్రాప్తి
ప్రాప్తి
అని
ఊరక
కూర్చున్న,
అది
పెద్ద
తప్పు,
ఫలము
చేజిక్కిన.
ప్రాప్తియు
సిద్ధించదు.
కర్మను
ఎట్టివారయినను
అచరించియే
తీరవలెను.
10
▾
Meaning
Keep
భక్తుడు:
ఔనౌను.
స్వామి!
గీతయందు
కూడ
కృష్ణపరమాత్మ
ఒకాకొన
సమయమున
అర్జునునకు,
పిచ్చివాడా!
నేనే
కర్మ
ఆచరించకుండిన
లోకమే
జరుగదు;
ఇక
నీవు
కర్మ
ఆచరించకుండిన
కర్మ
పురుషఫలమెట్లు
సిద్ధించునని
సెలవిచ్చెను.
కర్మ
పురుషలక్షణమన్నమాట!
11
▾
Meaning
Keep
స్వామి:
అయితే,
స్త్రీ
లక్షణము
వేరేయున్నదా,
పిచ్చివాడా!
కర్మ
ఒక
పురుషలక్షణమే
కాదు;
ప్రకృతి
లక్షణము.
పురుషులైనను,
స్త్రీలైనను
క్రిమికీటకాదులైనను,
వృక్షజంతువులైనను,
లోకమునందుండు
సమస్తము
కర్మను
ఆచరించక
తప్పదు.
తత్ఫలితమే
ప్రాప్తి
అప్రాప్తి,
కాన,
కర్మ
ప్రకృతి
లక్షణమని
తెలిసికో.
పురుషలక్షణమని
ప్రయోగింపకుము.
పురుషుడు
పరమాత్ము
డొక్కడే.
ప్రకృతి
అంతయు
శక్తి,
స్త్రీ
మీరందరూ
పురుషులు
కారు,
జాగ్రత్త.
12
▾
Meaning
Keep
భక్తుడు:
అట్లయిన
స్త్రీ
పురుషులని,
ప్రకృతి
సంబంధమునందు
కూడను
ఒక
మార్పు
కనుపించుటే
గాక,
ఆచరించుచు
అనుభవించుచు
ఉన్నామే.
అట్లుండియు
అందరు
స్త్రీలనుట
ఎట్లు
సాధ్యమగును
స్వామి!
అనవలెనన్ననూ
వీలుకాదే?
13
▾
Meaning
Keep
స్వామి:
బాబు!
ప్రకృతి
సంబంధమునకు
మీరట్లు
భావించవచ్చునే
కాని
యథార్థమునకు
అట్లుకాదు.
ఇవన్నియు
లోకానుభవము
కొరకు
లోకపు
వాడుకయొక్క
అర్థ
నామములు
కాని,
యథార్థనామములు
కావు.
ఇవి
వేషములు!
పురుషుడు
కొన్ని
కొన్ని
నాటకములందు
స్త్రీ
వేషము
వేయును.
అంతమాత్రమున
వాడు
స్త్రీ
యగునా?
కొన్ని
కొన్ని
సమయములందు
స్త్రీ
పురుష
వేషము
ధరించును.
అంతమాత్రమున
స్త్రీ
పురుషుడగునా?
ఇవి
ఈ
ప్రకృతి
నాటకముల
కొరకు
ధరించిన
వేషములు,
పెట్టిన
పేరులే.
కాని
ప్రకృతి
అంతయు
శక్తిమయమయినపుడు.
ఎన్ని
వేషములు
వేసినా,
శక్తియే
కాని,
పురుషుడు
కాడు?
అసలు
పురుషుడు
ఒక్కడే,
అతడే
శివుడు.
అతడే
ఆత్మ.
అట్టి
ఆత్మ
అందరియందు
చేరియుండుట
తప్ప
చేరినంత
మాత్రాన
అందరూ
పురుషత్వమును
పొందరు.
ఇది
అంతయు
ఒక
నాటకరంగము,
అందులో
వేషములు,
కథలు
వేరువేరు.
చూడు
బాలికల
పాఠశాలలో
ఆడ,
మగ
వేషములు
రెండును
బాలికలే
వేసినట్లుగా
ప్రకృతి
రంగములో
శక్తి
ఇన్ని
వేషములు
వేసి
నటించి
అనుభవించుచున్నదే
కాని,
యథార్థమిది
కాదు
బాబూ!
14
▾
Meaning
Keep
భక్తుడు:
ఏమో
స్వామి!
ఇవన్నియు
వింటుటే
ప్రపంచము
అర్థమే
కాదు.
ఒకవైపు
చూసిన
సత్యమనియు,
మరొకవైపున
అసత్యమనియు
ఏదీ
దృఢముగా
లేక
ఉన్నది.
15
▾
Meaning
Keep
స్వామి:
అందుకనే
ఏదియు
సత్యము
కాదని,
అసత్యము
కాదనియే
ఈ
జగత్తును
మిథ్యయని
పిలుచుట.
ఆ
మిథ్యా
లోకములో
జనించిన
వాడవు
కనుక,
నీ
మనసు
కూడను
దానిని
నమ్మక,
దీనిని
నమ్మక,
మిథ్యారుణములతోనే
ప్రవర్తించుచున్నది.
16
▾
Meaning
Keep
భక్తుడు:
అట్లయిన
ఈ
మిథ్యా
విషయముల
సమాచారము
మాని
సత్య
విషయమై
ఆ
పురుషుడెవరో
అదైనా
కొంత
తెలుపండి
స్వామి!
17
▾
Meaning
Keep
స్వామి:
నిజముగా
పురుషునకు
చావు
పుట్టుకలు
లేవు;
రూపాంతరము
గాని
లేదు.
అతడు
చిత్
స్వరూపుడు.
అతని
స్వరూపమే
జ్ఞానము.
జ్ఞానమే
అతని
స్వరూపము
కాని
ధర్మము
కాదు.
ఈ
జ్ఞానము
సహితము
కొన్ని
సమయములందుండి
కొన్ని
సమయములందు
పోవునది
కాదు.
వెలుగు
దేనికి
స్వభావమో,
దానిలో
చీకటి
సుంతైనను
ఉండదు,
ప్రపంచమువలన
సూర్యునికి
ప్రకాశము
కలుగలేదు.
ప్రపంచముండినను,
లేకుండినను
సూర్యుడు
ప్రకాశించుచునే
ఉండును.
దేనికి
ఏది
స్వభావమో
అది
ఏనాటికి
పోదు!
పురుషుడు
స్వప్రకాశకుడు.
అతడు
సదా
జ్ఞాత
విషయుండు,
చిత్తమున
ఏ
వృత్తి
కలిగినను
అతనికే
తెలియును.
చిత్తమునకు
ఒకప్పుడు
తెలియుట
మరొకప్పుడు
తెలియకుండుట
కలదు.
కాని,
పురుషున
కట్లుకాదు.
అతడు
అపరిణామి!
పరిణామికి
మారుట
స్వభావము
కాన,
చిత్తము
పరిణామి.
పురుషుడు
జ్ఞాన
స్వరూపుడు
కాన,
అతని
జ్ఞానమున
కెన్నడును
మార్పురాదు.
పురుషునిలో
వ్యాపారము
సంచరింపదు.
క్రియ
లేక
పోయియు
ప్రకాశరూపతయే
పురుషుని
స్వరూపము,
నేలలో
పాతిన
విత్తు
చెట్టుగా
పరిణమించును.
చెట్టు
విత్తుయొక్క
స్ఫుటమగు
రూపము.
విత్తు
చెట్టుయొక్క
అస్ఫుట
రూపము.
ఈ
పరిణామములయిన
బీజ
శక్తియు,
శక్తి
వ్యాపారమును
కలవు.
విత్తురూపు
చెట్టుగా
మారును,
ఇది
పరిణామము.
పురుషుడు
వికారము
పొందని
ద్రష్ట.
ఇతని
స్వబోధకు
కరణముల
ఆపేక్ష
లేనివాడు.
ప్రకృతి
సంబంధముకంటే
పూర్తిగా
వేరైనవాడు
పురుషుడు.
పురుషుని
ఏ
క్రియయు
దరియజాలదు,
నాయనా!
18
▾
Meaning
Keep
భక్తుడు:
అట్లయిన
ఇందులో
ప్రకృతి
ఏది,
పురుషుడు
ఎవరు
స్వామి?
19
▾
Meaning
Keep
స్వామి:
ప్రకృతి
పురుషులు
మూలతత్త్వములు,
దృశ్యభావమునకెల్ల
మూలము
ప్రకృతి,
ద్రష్టృభావమున
కెల్ల
మూలము
పురుషుడు
“అమూలమ్
మూలమ్”
అను
న్యాయముచే
వీనికి
కారణాంతరములు
లేవు.
కారణము
లేనిది
అనాది
కాన
ప్రకృతి
అనాది.
పురుషుడు
అనాది.
20
▾
Meaning
Keep
భక్తుడు:
ప్రకృతి
అనాది.
పురుషుడు
అనాది
అయిన
ప్రకృతి
పురుషుల
సంయోగమువలన
కలుగు
సంసారము
ఎందుకు
అనాది
కాదు?
21
▾
Meaning
Keep
స్వామి:
సంసారమున
సహేతుకముకాని,
ఆహేతుకముకాదు.
సంయోగము
అవివేక
హేతుకము,
అవివేక
ప్రత్యయమువలన
సంయోగము,
సంయోగము
వలన
తిరిగి
అవివేకము.
ఇట్లు
సంయోగము
అవివేకముల
అనాదిత్వ
బీజవృక్షముల
చందము.
22
▾
Meaning
Keep
భక్తుడు:
సంయోగమనగా
ఏమి?
దాని
స్థితి
ఎట్టిది?
23
▾
Meaning
Keep
స్వామి:
ప్రకృతి
పరిణామమగు
గుణములందు
పురుషుని
ప్రతిబింబము
చూడు.
ఒక
ఉపమానము.
సూర్యుడు
నీరు
కాదు.
నీరు
సూర్యుడు
కాదు.
ఇటులయ్యు
ఈ
రెండింటికి
సంయోగమున్నచో
ప్రతిబింబమేర్పడును.
ఈ
ప్రతిబింబమునకు
జలస్వభావము
లేదు.
సూర్య
ప్రభావము
లేదు.
మరి,
లేకనూపోలేదు.
నీరు
కదలినచో
ప్రతిబింబము
కదలును
కదా.
మరి
ప్రతిబింబమున
ప్రకాశము
కలదు.
ఈ
ప్రతిబింబము
సూర్యునకు
స్వరూపము
కాదు.
విరూపము
కాదు.
సూదంటురాయి
ఇనుము
కంటె
వేరు.
ఇనుము
సూదంటురాయి
కంటె
వేరు.
ఇటులయ్యు
ఈ
రెండింటికి
సామీప్యమున్నచో,
సూదంటురాయి
ధర్మము
ఇనుమునందు
ప్రవేశము
పొంది
ఆ
రాయి
ఇనుమును
తనవంటి
దానిగ
చేసికొనుచున్నది
గదా?
ఈ
రెండింటికి
సంబంధమే
సంయోగము.
24
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
ఇందులో
నిజమైన
పురుషుడెవరు?
వ్యావహారిక
పురుషుడెవరు?
వారివారి
ప్రవర్తనలు
ఎట్టివో
సెలవియ్యండి.
25
▾
Meaning
Keep
స్వామి:
సూర్యుడు
ప్రతిబింబమని
చెప్పితిని
కదా?
ఆ
ప్రతిబింబపురుషుడు
పురుషునకు
స్వరూపుడు
కాడు.
విరూపుడుకాడు.
విషయములకును
బింబమునకును
నడుమ
ఈ
ప్రతిబింబపురుషుడు
కానిచో,
ప్రపంచ
వ్యవహారమే
లేదు.
ఈ
ప్రతిబింబపురుషుడే
భోక్త,
కర్త,
అనుభవిత,
బింబపురుషుడు
శుద్ధపురుషుడు.
ఇతడు
అభోక్త,
అకర్త,
అననుభవిత,
ప్రతిబింబితుడగు
ఈ
పురుషునకు
వ్యవహారికపురుషుడనియు,
గ్రహీత
అనియు
పేర్లు.
బింబపురుషనకే
సత్యమైన
నిత్యమైన
ఆత్మస్వరూపుడగు
యథార్థపురుషుడని
పేరు.
గ్రహీత
వికారియగు
జ్ఞాత
అని
తెలిసికొనవలెను.
26
▾
Meaning
Keep
భక్తుడు:
సరి!
బాగున్నది,
స్వామి,
చక్కని
బోధ!
ఇట్టి
యథార్థమును
తెలిసికొన్నవలెనన్న
ఎన్ని
పుస్తకములు
త్రిప్పియుండవలెనో,
త్రిప్పినంతమాత్రమునను,
అర్థమగుట,
మరింత
కష్టమైయుండును.
పురుషుడు
లోకమున
లేడు
అనియు,
ఇదంతయు
లోకానుభవార్థమై
ఆచరించు
నాటకమనియు
తేలినది.
నిజమైన
పురుషుడు
పరమాత్ముడొక్కడే.
అట్టి
పరమాత్మను
చేరుటకు
ప్రకృతిలోని
ప్రతి
ఒక్కటియు
ప్రాకులాడుచున్నది.
దానినే
శివశక్తి
ఐక్యత
అందురేమో,
భలే,
భలే.
27
▾
Meaning
Keep
స్వామి
:
అవును
అదే
జీవబ్రహ్మ
ఐక్యత
అనబడును.
ఎట్టి
వారైనను
ఆశించియే
తీరవలెను.
లేకున్న,
జీవుడెంత
కాలమైనా
ఏకముగ
ఉండలేడు.
సాధ్యము
కాదు.
అట్టి
ఐక్యతను
ఆశించి
సాధనవలనే
పరమార్థసాధన,
మోక్షసాధన
అని
పిలుతురు.
28
▾
Meaning
Keep
భక్తుడు:
మోక్షమనగానేమి,
ముక్తి
అనగానేమి
స్వామి?
29
▾
Meaning
Keep
స్వామి:
రెండూ
ఒక
అర్థము.
జీవికి
కుక్తాయమునే
ముక్తి
అందురు.
అనగా,
మనసుతో
ఉండునది
జీవి.
ఆ
మనోరూప
నామగుణములు
క్షీణించినప్పుడే
మోక్షమందురు.
అవి
క్షీణించి
మనోనాశన
మేర్పడగానే
జీవి
బ్రహ్మలో
ఐక్యమగును.
దానినే
మోక్షమందురు.
గోదావరి,
గంగ
వానివాని
హద్దులు
పెట్టుకొన్న
రూపములు,
రుచులు,
నామములు
ఎంతవరకు?
సముద్రమున
చేరకుండునంతవరకే,
సముద్రమునకు
దగ్గర
దగ్గరగా
పోను
రూపనామరుచులు
మారును.
ఎప్పుడు
ఈ
మూడును
పూర్తిగా
మారిపోవునో,
అప్పుడే
సముద్రునియందు
ఐక్యత.
అపుడు
సముద్రుని
రూపనామరుచులే
వచ్చును
కదా
ఈ
నదులకు
కూడా!
కాన
ఈ
జీవులను
నదులు
మనోగుణరాగములను
పొందునంతవరకు
వ్యామోహమమకార
అహంకారములగు
రుచిరూపనామములను
ధరించియుండును.
ఇవి
పరమాత్మ
అనుగ్రహసాగరమునకు
దగ్గర
దగ్గరగా
పోను
పోను
ఈ
వ్యామోహమమకార
అహంకారములు
మారుతూ,
మారుతూ,
వచ్చును.
ఎప్పుడు
ఈ
గుణవికారములు,
మనోభావములు
పూర్తిగా
నశించునో
అప్పుడే
బ్రహ్మలో
ఐక్యమయినట్లు
తేలును.
ఇట్టి
రుచులు,
నామములు
ఉన్నంతవరకు
ఐక్యత
చేకూరదు.
సముద్రమునచేరిన
గంగకు,
తీపి
ఎట్లుండును?
ఆ
రుచియేయుండిన
నిండు
సముద్రమున
చేరలేదనే
అర్థము.
అట్లే
బ్రహ్మలో
ఐక్యము
అయినారన్నచో,
ఆ
గుణమనోరుచులు
ఉండకూడదే?
అట్లుండిన
యింకా
సంపూర్ణముగ
ఐక్యము
కాలేదనే
రుజువు
పరచును.
తెలిసినదా?
అట్టి
సంపూర్ణ
ఐక్యతనే
సాయుజ్య
ముక్తి
అందురు.
బాబూ!
30
▾
Meaning
Keep
భక్తుడు:
సరి.
బాగున్నది
స్వామి.
అట్టి
పవిత్ర
ఐక్యతను
ప్రతి
ఒక్కరికీ
అనుగ్రహించండి!
లోకము
చల్లబడుతుంది.
31
▾
Meaning
Keep
స్వామి:
అనుగ్రహించుట
స్వతంత్రము
కాదే.
అనుగ్రహమును
సంపాదించునట్టి
సాధనలు
చేసిన
అనుగ్రహము
దానిపాటికదే
లభించును.
ఇచ్చునట్టి
వస్తువు
కాదు
అది.
ప్రకాశించు
సూర్యుని
కిరణములను
ఇవ్వుమని
తనపై
పడుమని
కోరవలసిన
అవసరము
లేదు.
ప్రకాశశక్తి
తన
ప్రభావమే!
దానికి
అడ్డులు
పెట్టుకొనక,
ఉన్న
అడ్డులను
తీసివేసి
సూర్యుని
కిరణములకు
సూటిగా
నిలుచున్న
అవే
పడును.
ప్రకాశించే
అనుగ్రహకిరణములకు
వ్యామోహమమకార
అహంకారములను
అడ్డుపెట్టుకొని
వాని
కిరణములు
మాపై
పడలేదన్న
ఎవరి
తప్పు?
కిరణములు
ఏమి
చేయును?
32
▾
Meaning
Keep
భక్తుడు:
ఇప్పుడు
మేము
ఈ
మమకార
అహంకార
వాసనలనుండి
దూరము
కావలెనన్నమాట!
33
▾
Meaning
Keep
స్వామి:
అన్నమాట
యేమి?
అక్షరాలా
కావలెను.
ముమ్మాటికి
కావలెను.
అట్టి
అనుగ్రహకిరణములను
ఆశింతువా?
తప్పక
ప్రయత్నించు
లేక
ఈ
మురికిగుంటయందే
ఈతలాడుదువా?
అనుగ్రహించుట
అనవసరము.
ఇప్పుడవసరమైనను
ఇక
కొంత
కాలమునకో,
ఇంకా
కొన్ని
జన్మలకైన,
వానిని
ఆశించక
తప్పదు.
ఎన్నటికో
ఆ
పనులు
జరుపుట
యెందులకు?
అంతవరకు
ఈ
బాధలు
పొందుటెందులకు!
సాధ్యమయినంత
త్వరలోనే
పవిత్రతను
పొందుము.
ముముక్షువు
ఎందుకు
కాకూడదు?
నేటినుండియే
కాదు.
ఈ
నిమిషమునుండియే
క్రమక్రమముగ
ప్రయత్నించు.
వెళ్ళిరా,
ప్రయత్నము
మాత్రము
తీవ్రముగా
వద్దు;
శాంతముగ
ప్రయత్నించు.
Previous
←
Prabodha 8
Next
Prabodha 10
→